జోర్డాన్

జోర్డాన్ నైఋతి ఆసియాలో సిరియా ఎడారి దక్షిణ భాగము నుంచి అకాబా అఖాతము వరకూ వ్యాపించి ఉన్న ఒక అరబ్ దేశము.

సరిహద్దులుగా ఉత్తరాన సిరియా, ఈశాన్యాన ఇరాక్, తూర్పు దక్షిణాలలో సౌదీ అరేబియా, పడమరాన ఇజ్రాయేల్, పాలస్తీనా ప్రాంతాలు ఉన్నాయి. అరబిక్‌ భాషలో జోర్డాన్ అంటే అలోర్దన్ అంటారు. (అల్ ఓర్దన్). పూర్తి పేరు "ముమల్కతు అల్ హాషిమీయత్ అల్ ఓర్దనీయ" (Hashimite Kingdom of Jordan). హాషిమయిట్ వంశస్థులు పాలిస్తున్నరు కనుక ఇది హాషిమైట్ రాజ్యమయింది.

المملكة الأردنية الهاشمية
అల్-మమ్‌లకా అల్-ఉర్దూనియ్యా అల్-హాషిమియ్యా
హాషిమియా సామ్రాజ్యం, జోర్దాన్
Flag of జోర్డాన్ జోర్డాన్ యొక్క చిహ్నం
జాతీయగీతం
عاش المليك
జోర్డాన్ జాతీయగీతం
  ("అస్-సలామ్ అల్-మలకి అల్-ఉర్దోని")1
చిరకాలం రాజు జీవించుగాక

జోర్డాన్ యొక్క స్థానం
జోర్డాన్ యొక్క స్థానం
రాజధానిఅమ్మాన్
31°57′N 35°56′E / 31.950°N 35.933°E / 31.950; 35.933
అతి పెద్ద నగరం రాజధాని
అధికార భాషలు అరబ్బీ భాష
ప్రభుత్వం రాజ్యాంగపర రాజరికం
 -  రాజు అబ్దుల్లా II
 -  ప్రధానమంత్రి మారూఫ్ అల్ బాకిత్
స్వాతంత్ర్యం
 -  బ్రిటిష్ పాలన అంతం లీగ్ ఆఫ్ నేషన్స్ మాండేట్
మే 25 1946 
విస్తీర్ణం
 -  మొత్తం 89,342 కి.మీ² (112వది)
45,495 చ.మై 
 -  జలాలు (%) negligible
జనాభా
 -  జూలై 2007 అంచనా 5,924,000 (110వది)
 -  2004 జన గణన 5,100,981 
 -  జన సాంద్రత 64 /కి.మీ² (131వది)
166 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $27.96 బిలియన్లు (97వది)
 -  తలసరి $4,900 (103వది)
జినీ? (2002–03) 38.8 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.760 (medium) (86th)
కరెన్సీ జోర్డానియన్ దీనార్ (JOD)
కాలాంశం UTC+2 (UTC+2)
 -  వేసవి (DST) UTC+3 (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .jo
కాలింగ్ కోడ్ +962
1 ఇంకనూ రాజరికపు జాతీయగీతం.

మృతసముద్రాన్ని ఇజ్రాయేల్ తో, అకాబా తీర ప్రాంతాన్ని ఇజ్రాయేల్, ఈజిప్టు, సౌదీ దేశాలతో పంచుకుంటోంది. జోర్డాన్ లో చాలా భాగం ఎడారితో నిండి ఉంటుంది. ముఖ్యంగా అరేబియా ఎడారి. కాక పోతే వాయవ్యాన పవిత్రమయిన జోర్డాన్ నది ఉండటంతో ఆ ప్రాంతాన్ని "సారవంతమయిన నెలవంక"గా అభివర్ణిస్తూ ఉంటారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్ కూడా ఈ వాయవ్య దిశనే ఉంటుంది.

జోర్డాన్ తన చరిత్రలో సుమేరియన్, అక్కాడియన్, బాబిలోనియన్, మెసొపొటేమియన్, అస్సిరియన్, పర్షియన్ వంటి ఎన్నో నాగరికతలను చూసింది. ఇవే కాక కొంతకాలం ఫారోల నాటి ఈజిప్టు సామ్రాజ్యంలో భాగంగా ఉండటమే కాక నెబేటియన్ అనే ఒక స్థానిక నాగరికతకు ఆలవాలమయింది. ఈ నెబేటియన్ నాగరికతకు సంబంధించి ఎన్నో పురావస్తు విశేషాలు పెత్రాలో నేటికీ చూడవచ్చు. ఇవే కాక పాశ్చాత్య నాగరికతలయిన మాసిడోనియా, రోం, బైజాన్‌ట‍యిన్, ఆట్టోమన్ సామ్రాజ్యాల ప్రభావం కూడా జోర్డాన్ పై ప్రభవించింది. బ్రిటీష్ వారి పాలనలో ఉన్న కొద్ది కాలం తప్పితే, ఏడవ శతాబ్ది నుండి ఇస్లాం, అరబ్ నాగరికతలను స్వంతం చేసుకుంది. జోర్డాన్ లో ఉన్నది రాజ్యాంగబద్దమయిన పార్లమెంటరీ రాచరిక ప్రభుత్వము. ఇక్కడ రాజు దేశాధినేతగా సర్వసైన్యాధ్యక్షునిగా వ్యవహరిస్తారు. రాజు తన ప్రభుత్వము, మంత్రివర్గ సభ్యుల సహకారంతో పరిపాలన సాగిస్తారు. ఈ మంత్రివర్గము ప్రజలు ఎన్నుకున్న లెజిస్లేచరుకు జవాబుదారుగా ఉంటారు. హౌస్ ఆఫ్ డెప్యూటీస్, హౌస్ ఆఫ్ నోటబుల్స్ అనే రెండు విభాగాలు కలిగి ఉన్న ఈ లెజిస్లేచరు ప్రభుత్వపు లెజిస్లేటివ్ విభాగంగా పనిచేస్తుంది. జ్యూడేషియల్ విభాగము మరిక స్వతంత్ర విభాగము.

జోర్డాన్ ఈ ప్రాంతంలో ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది. ప్రత్యేకంగా ప్రవాస పాశ్చాత్యులు జోర్డాన్ రాజధానిలో నివసించడానికి, విద్యను అభ్యసించడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. మిడిల్ ఈస్ట్‌లో జోర్డాన్ సురక్షితమైనదని భావించడమేకాక అరబ్ దేశాలలో అత్యంత సురక్షిత దేశంగా జోర్డాన్ గుర్తించబడుతుంది. పొరుగున ఉన్న సంక్షోభం మద్యలో గొప్ప ఆదరణీయంగా, శరణార్ధులకు ఆశ్రయం ఇవ్వడం (పొరుగు దేశాల నుండి 1948 నుండి శరణార్ధుల రాక ప్రారంభం అయింది).జోర్డానులో పాలస్తీనా శరణార్ధులు 2 మిలియన్లు, సిరియా శరణార్ధులు 1.2 మిలియన్లు నివసిస్తున్నారు. సిరియన్ శరణార్ధుల వలన సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ జోర్డాన్ నిరంతరంగా ఆదరణీయత చూపిస్తూ ఉంది. ఇస్లామిక్ దేశం అయిన ఇరాక్ నుండి పారిపోయి వస్తున్న వేలాది ఇరాకీ క్రైస్తవులకు జోర్డాన్ ఆశ్రయం కల్పిస్తుంది. 2009లో జోర్డాన్ సందర్శించిన పోప్ బెనెడిక్ట్ ఈ పవిత్రప్రదేశం క్రైస్తవ - ముస్లిముల సమైక్యతకు చిహ్నంగా ఉందని వర్ణించాడు. 1950లో ప్రజలలో 30% క్రైస్తవులు ఉన్నారు. అయునప్పటికీ అత్యధికసంఖ్యలో ముస్లిములు శరణార్ధులుగా వచ్చిచేరినందున ప్రస్తుతం 2015 లో క్రైస్తవులు 6% నికి తగ్గింది.

పేరువెనుక చరిత్ర

జోర్డాన్ నదీ ప్రాంతంలో స్థాపించబడిన దేశం కనుక దీనికి జోర్డాన్ అనే పేరు వచ్చింది. జోర్డాన్ అనే పేరుకు అరబిక్ భాష, ఇతర సెమిటిక్ భాషలు మూలం. దీనిని పలు అర్ధాలు ఉన్నాయి. అరబిక్ భాషలో నిటారు లేక ఏటవాలు అని అర్ధం. అరామిక్ యార్డెన్ అర్ధం దిగువ- ప్రవాహం లేక సంతతి లేక వంశపారంపర్యం అని అర్ధం. ఆరంభంలో దేశం ట్రాంస్ జోర్డాన్‌గా (రెండవ అబ్దుల్లా (జోర్డాన్) చేత) స్థాపించబడింది. ట్రాంస్ జోర్డాన్ అంటే జోర్డాన్ నదీ ప్రాంతం అని అర్ధం.

చరిత్ర

చరిత్రకు పూర్వం

జోర్డాన్ 
One of the oldest human statues ever made by human civilization from 'Ain Ghazal on display at the Jordan Archaeological Museum.

జోర్డాన్‌లో పాలియో లిథిక్ కాలానికి చెందిన ఉపకరణాలు, వస్తువులు కనుగొనబడ్డాయి. దేసమంతటా జరిపిన త్రవ్వకాలలో ప్రధాన ఆర్జియాలజీ వస్తువులు బయటపడ్డాయి. జెరిష్ లోని ఖిర్బెట్ అల్- సవాన్, రాజధాని అమ్మాన్ లోని నియోలిథిక్ గ్రామం అయిన అయిన్ ఘజల్ ప్రాంతాలలో లభించిన వస్తువులు నియోలిథిక్ కాలానికి చెందినవని (క్రీ.పూ 7250 కాలంనాటివని) గుర్తించబడ్డాయి. తూర్పు ప్రాంతంలో అతిపెద్ద పాలియోలిథిక్ నివాసిత ప్రాంతాలలో అయిన్ ఘజల్ ఒకటి. ఇక్కడ 3,000 మంది నివసించారని భావిస్తున్నారు. అయిన్ ఘజల్ సాధారణ అసెరామిక్, నియోలిథిక్ గ్రామంగా ప్రారంభం అయింది. ఇది లోయప్రాంతంలోని ఎత్తైన ప్రాంతంలో స్థాపించబడింది. మట్టి ఇటుకలతో నిర్మించబడిన చతురమైన గదులు కలిగిన దీర్ఘచతురస్రాకార నివాసాలతో గ్రామం నిర్మితమైంది. గోడల వెలుపలి భాగం మట్టిపూత పూయబడింది. లోపలి వైపు సున్నపు పూత పూయబడింది. గృహాలు కొన్ని సంవత్సరాలకు ఒకసారి పునర్నిర్మిచబడతాయి. ఈ ప్రాంతంలో రహదారి నిర్మిస్తున్న సమయంలో 1974 లో ఈ అవశేషాలు బయటపడ్డాయి. ఇక్కడ 1982లో త్రవ్వకాలు ఆరంభం అయ్యాయి. అయినప్పటికీ త్రవ్వకాలు ఆరంభం అయ్యే సమయానికి ఈ ప్రాంతంలో 600 మీ రహదారి నిర్మించబడింది. నగరవిస్తరణ కారణంగా కొంత నష్టం జరిగినప్పటికీ అయిన్ ఘజల్‌లో విస్తారమైన సమాచారం లభించింది. ఈ త్రవ్వకాలలో మొదటి విడతగా 1983లో మొదటి విడత ఆర్కియాలజీ పరిశోధనలు వెలుగులోకి వచ్చాయి. బుల్డోజర్‌తో దారి చేస్తున్న సమయంలో 2.5 మీ లోతైన గుంటలో ఆర్కియాలజిస్టులు ప్లాస్టర్ శిల్పాలను కనుగొన్నారు. జోర్డాన్ లోయ లోని తులైలత్ గ్రామాలలో, బాబ్- అల్- ధ్రా, అక్వాబా లోని తాల్ హుజయ్రత్ అల్- ఘుజ్లాన్ చాకోలిథిక్ కాలం నాటి అవశేషాలు బయల్పడ్డాయి. యూనివర్శిటీ ఆఫ్ జోర్డాన్ ఆర్కియాలజిస్టులు తరుత ప్రదేశాన్ని కనిపెట్టారు. ఈ ప్రాంతంలో గోడల మీద మానవులు, జంతువులు చెక్కబడి ఉన్నాయి. ఇది ప్రార్థనా మందిరం అని భావిస్తున్నారు. ఇక్కడ నివసించిన ప్రజలు తమపంటలను పండించడానికి నీటిపారుదల సౌకర్యాన్ని అభివృద్ధి చేసారు. వీరు ద్రాక్ష, గోధుమలు పండించారు. వివిధ పరిమాణాలు కలిగిన మట్టిపాత్రలను ఉపయోగించారు. ఈ ప్రాంతంలో రాగి ఉత్పత్తి ప్రధాన పరిశ్రమగా ఉండేది. రాగిని కరిగించడానికి తిరిగి వేరు రూపం ఇవ్వడానికి కుండలను ఉపయోగించారు. ఇక్కడ నిర్వహించిన పరిశోధనద్వారా ఇక్కడ రెండు భూకంపాలు సంభవించాయని భావిస్తున్నారు. రెండవ భూకంపం ఈ ప్రాంతాన్ని సమూలంగా నాశనం చేసింది.

కాంశ్యయుగం, ఇనుపయుగం

జోర్డాన్ 
పూర్వకాలంలో జోర్డాన్ రాజ్యాలు
జోర్డాన్ 
Al-Khazneh in the Arab Nabatean city of Petra, one of the New7Wonders of the World.

ప్రస్తుతకాల జోర్డాన్ పలు పురాతన రాజ్యాలకు నిలయంగా ఉంది. వీరికి కన్నానైట్ భాషా కుటుంబాసికి చెందిన సెమెటిక్ భాష వాడుక భాషగా ఉండేది. ఈ ప్రాంతాన్ని ఎడోం, మొయాబ్, అమ్మాన్, అమలేకిటెస్ రాజ్యాలు పాలించాయి. ఈ ప్రాంత చరిత్రకాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజ్యాలు విదేశీ సామ్రాజ్యాల ఆధీనంలో పాలించాయి. వీటిలో అకాడియన్ సామ్రాజ్యం (క్రీ.పూ 2335-2193), పురాతన ఈజిప్ట్ (క్రీ.పూ.15-13 శతాబ్దాలు),హిట్టితె సామ్రాజ్యం (క్రీ.పూ.14-13 శతాబ్దాలు), మద్య అస్సిరియన్ సామ్రాజ్యం (క్రీ.పూ. 1365-1020), నియో అస్సిరియన్ సామ్రాజ్యం (క్రీ.పూ 911-605), నియో బాబిలోనియన్ సామ్రాజ్యం (క్రీ.పూ 604-539), అచమనిద్ సామ్రాజ్యం (క్రీ.పూ 539-332) సామ్రాజ్యాలు ప్రధానమైనవి. మోయాబ్, అమ్మాన్ రాజ్యాలు పురాతన మ్యాప్‌, తూర్పు ప్రాంత దస్తావేజులు, పురాతన గ్రీకో రోమన్ ప్రపంచపు కళాఖండాలు, యూదుల, క్రైస్తవుల మతగ్రంధాలలో సూచించబడ్డాయి. క్రీ.పూ 312 కాలంలో నబటీన్లు దక్షిణ జోర్డాన్‌లో పెత్రా నగరాన్ని నిర్మించి రాజధానిని చేసుకున్నారు. ఇది ప్రస్తుతం జోర్డాన్ చిహ్నంగా ఉంటూ ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉంది.

సంస్కృతిక కాలం

జోర్డాన్ 
The Roman Oval Piazza in the ancient city of Jerash
జోర్డాన్ 
Ottoman Hejaz railway bridge in Amman

మహావీరుడు అలెగ్జాండర్ ఈ ప్రాంతాన్ని జయించి మధ్యతూర్పు ప్రాంతంలో హెలెనిస్టిక్ సంస్కృతిని పరిచయం చేసాడు. అలెగ్జాండర్ మరణం తరువాత గ్రీకు సామ్రాజ్యాన్ని వ్యతిరేకించిన రెండు సామంత రాజ్యాలు (ఈజిప్ట్కు చెందిన ప్టోల్మాయిక్ రాజవంశం, సిరియాకు చెందిన సెల్యూసిడ్స్ రాజవంశం) ప్రస్తుత జోర్డాన్ భూభాగం మీద ఆధిక్యత వహించాయి. గ్రీకులు జోర్డాన్‌లో ఫిలడెఫియా (అమ్మాన్), జెరస (జెరాష్), జెడరా (ఉం క్వయాస్), పెల్లా (తబక్వత్ ఫా), ఇర్బిద్ (అర్బిలా) నగరాలను నిర్మించారు. తరువాత రోమన్ పాలనలో ఇవి పాలస్తీనా, సిరియా లతో కలిసి " డేకాపోలిస్ లీగ్ "గా అవతరించాయి. సంస్కృతిక, ఆర్థిక సారూప్యంతో సమైక్యమైన ఈ సమాఖ్యలో బెట్ షియాన్ (ష్కితోపోలిస్), హిప్పోస్, కాపిటోలియాస్, కెనతా, డమాస్కస్ ప్రజలు సభ్యులుగా ఉన్నారు. జోర్డాన్‌లోని అతంత సుందరమైన హెలెనిస్టిక్ ప్రాంతాలలో " ఇరాక్- అల్ - అమీర్ " ఒకటి. ఇది ప్రస్తుత అమ్మాన్ నగరానికి పశ్చిమంలో ఉంది. క్వాసర్- అల్- అబ్ద్ (బానిస కోట)ను అతిపెద్ద రాళ్ళను ఉపయోగించి నిర్మించారు. ఈ కోట ప్రఖ్యాత టాబియాడ్ కుటుంబానికి చెందిన హైర్కానస్‌కు (ప్రస్తుత అమ్మాన్ గవర్నర్) స్వంతమై ఉంది. ఇది క్రీ.పూ 2వ శతాబ్దం చివరిలో నిర్మించబడింది. హెలెనిస్టిక్ రాజ్యాలు చివరికి రోమన్ సాంరాజ్యానికి (క్రీ.పూ. 63-సా.శ. 324) దారి ఇచ్చాయి. తరువాత ఇది క్రైస్తవమతాన్ని స్వీకరించి బైజాంటిన్ సాంరాజ్యంలో (సా.శ. 324-636) విలీనం చేయబడింది.

క్రీ.పూ 63లో రోమన్లు లెవంత్ లోని అధికభూభాగాన్ని జయించారు. తరువాత ఆరంభం అయిన రోమన్ పాలన 4 శతాబ్ధాల తరువాత ముగింపుకు వచ్చింది. సా.శ. 106లో అక్వాబా (అలయా) నుండి డమాస్కస్ వరకు ట్రాజన్ చక్రవర్తి నిర్మించిన రహదారి మార్గంలో ఆధునిక జోర్డాన్ ఉత్తర ప్రాంతం లోని అమ్మాన్ ఒక మజిలీగా ఉంది. రహదారి నిర్మాణం ఈప్రాంత ఆర్థికాభివృద్ధికి కారణం అయింది. రోమన్ పాలన జోర్డాన్‌ అంతటా పలు అవశేషాలను వదిలి వెళ్ళింది. వీటిలో అమ్మాన్ సిటాడెల్‌లో ఉన్న హెర్క్యులస్ ఆలయం (అమ్మాన్), రోమన్ థియేటర్ (అమ్మాన్), ఓడియాన్ థియేటర్ (జోర్డాన్), నింఫాయుం (జోర్డాన్) ప్రధానమైనవి. జెరిష్‌లో చక్కాగా సంరక్షించబడుతున్న పలు రోమన్ అవశేషాలు ఉన్నాయి.

ముస్లిం కాలం

రషిదున్ (సా.శ. 634-636 ) ఈ ప్రాంతాన్ని జయించిన తరువాత ఈ ప్రాంతంలో ముస్లిముల పాలన ఆరంభం అయింది. రషిదున్ కాలిఫేట్ తరువాత ఈ ప్రాంతాన్ని ఉమ్మయద్ కాలిఫేట్ సా.శ (661-750), అబ్బాసిద్ కాలిఫేట్ రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. అబ్బాసిద్ కాలిఫేట్ పతనం తరువాత ఈ ప్రాంతాన్ని ఫతిమిద్స్ పాలించారు. తరువాత క్రుసేడర్లు (జెరుసలేం కింగ్డం) (సా.శ1115-1189) తరువాత ఈ ప్రాంతం అయ్యుబిద్ రాజవంశం (సా.శ 1189-1260), స్వల్పకాలం మంగోల్ పాలన, మమ్లక్ సుల్తానేట్ (సా.శ1260-1516) ల ఆధీనంలో ఉంది. తరువాత 1516లో ఈ ప్రాంతం ఒట్టోమన్ సాంరాజ్యంలో భాగం అయింది. ఒట్టోమన్ టర్కీలు ఈ ప్రాంతాన్ని 1516 నుండి 1918 వరకు పాలించారు. ఉమయ్యద్ కాలిఫ్ క్వాసర్ మషట్టా, క్వాసర్ అల్ - హల్లాబత్, క్వాసర్ ఖరనా, క్వాసర్ తుబా, క్వాసర్ అంరా, ఉమయ్యద్ ప్యాలెస్ (అమ్మాన్) మొదలైన " డిసర్ట్ కాస్టిల్ " (రూరల్ ఎస్టేట్స్)నిర్మించాడు.

12వ శతాబ్దంలో ట్రాంస్ జోర్డాన్ ప్రాంతం క్రుసేడర్ల యుద్ధభూమిగా మారింది. క్రుసేడర్లు అయ్యుబిదుల చేతిలో ఓటమి పొందడంతో యుద్ధం ముగింపుకు వచ్చింది. తరువాత శతాబ్దంలో ట్రాంస్ జోర్డాన్ మీద మంగోల్ దాడులు కొనసాగాయి. 1260లో మమ్లక్లు మంగోలియన్లను ఈ ప్రాంతం నుండి తరిమి కొట్టారు. ఈ కాలంలో 9 క్రుసేడర్ కోటలు నిర్మించబడ్డాయి. వీటిలో మాంట్రియల్ క్రుసేడర్ కాస్టిల్, అల్ కరక్, పెత్రా కోటలు ప్రధానమైనవి. అయ్యూబిద్లు " న్యూ అజ్లున్ కాస్టిల్ " నిర్మాణం చేసి మునుపటి క్వాసర్ అజ్రగ్ రోమన్ కోటను పునర్నిర్మిచారు. ఈ కోటలలో కొన్ని విస్తరించబడ్డాయి. తరువాత వీటిని మమ్లక్స్ వాడుకున్నారు.

మొదటి ప్రపంచ యుద్ధం

జోర్డాన్ 
Arab Revolt Tribal Cavalry – Tribes of Jordan and Arabia, c. 1918.
జోర్డాన్ 
T.E. Lawrence (Lawrence of Arabia) on a camel in Aqaba, 1917

నాలుగు శతాబ్ధాల తరువాత ఓట్టామన్ పాలన (1516-1918), మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ట్రాంస్ జోర్డాన్ మీద టర్కిష్ ఆధిపత్యం ముగింపుకు వచ్చింది. యునైటెడ్ కింగ్డంతో కూటమి చేరి హషెమైట్స్ జోర్డాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తరువాత ప్రాంతీయ గిరిజనుల సాయంతో ఈ ప్రాంతం మూద ఆధిపత్యం కాపాడుకున్నారు. ఓట్టమన్ సాంరాజ్యానికి వ్యతిరేకంగా సాగిన తిరుగుబాటులో హషెమైట్లకు షెరీఫ్ హుస్సేన్ నాయకత్వం వహించాడు. తిరుగుబాటుకు " అలైస్ ఆఫ్ వరల్డ్ వార్ " మద్దతు ఇచ్చింది.

జోర్డాన్ నది తూర్పు భూభాగంతో చేరిన హెజా, లెవంత్ భూభాగాల స్వంత్రం లభించడంతో గ్రేట్ అరబ్ రివోల్ట్ ముగింపుకు వచ్చింది. అయినప్పటికీ దీనికి స్వతంత్రదేశంగా అంతర్జాతీయ గుర్తింపు లభించలేదు.

బ్రిటిష్ మేండేట్ కాలం

జోర్డాన్ 
Arar (1897–1949), poet of Jordan

1922 సెప్టెంబరులో " లీగ్ ఆఫ్ నేషంస్ " కౌంసిల్ ఎమిరేట్ ఆఫ్ ట్రాంస్ జోర్డాన్‌కు బ్రిటిష్ మండేట్ ఫర్ పాలస్తీనా లోని ఒక దేశంగా గుర్తింపు ఇచ్చింది. ట్రాంస్ జోర్డాన్1946 వరకు బ్రిటిష్ పర్యవేక్షణలో ఉంది. హషెమైట్ నాయకత్వం ఈ ప్రాంతం మీద ఆధిపత్యం నిలుపుకోవడానికి అనేక సమస్యలను ఎదుర్కొన్నది. ట్రాన్ జోర్డాన్ మీద దాడులను బ్రిటిష్, బెడూయిన్ గిరిజనుల సాహాయం లేకుండా ఎమీర్ ఎదుర్కొనలేక పోయాడు.

స్వతంత్రం తరువాత

జోర్డాన్ 
Jordanian Bedouin forces officer in Petra 2004.
జోర్డాన్ 
Symbols of Jordanian Nationalism; Field marshal Habis Al-Majali and former prime minister Wasfi Al-Tal at the Amman International Stadium in 1967.
జోర్డాన్ 
Jordan and its neighbors during 2013 Middle East cold snap in December 2013.

1947 జనవరి 17న బ్రిటిష్ ఫారెన్ సెక్రెటరీ " ఎర్నెస్ట్ బెవిన్ " అఖ్యరాజ్యసమితిలో జోర్డాన్‌కు పూర్తిస్థాయి స్వతంత్రం ఇవ్వాలని యోచిస్తున్నట్లు ప్రకటించాడు. 1946 మార్చ్ 22న బ్రిటిష్ ప్రభుత్వం, ట్రాంస్ జోర్డాన్ ఎమీర్ " ట్రీటీ ఆఫ్ లండన్ (1946) " మీద సంతకం చేసారు. ట్రాంస్ జోర్డాన్ స్వతత్రం రెండు పార్లమెంట్లలో ఆమోదం పొందింది. 1946 ఏప్రెల్ 18 న ట్రాన్ జోర్డాన్ స్వతంత్రం " లీగ్ ఆఫ్ నేషంస్ " గుర్తింపు పొందింది. 1946 మే 25న ట్రాంస్ జోర్డాన్ " హషెమైట్ కింగ్డం ఆఫ్ ట్రాంస్జోర్డాన్ " అయింది. మే 25 జోర్డాన్ స్వతంత్రదినంగా నిర్ణయించబడినప్పటికీ వాస్తవానికి ట్రాంస్ జోర్డాన్ మేండేట్ 1946 జూన్ 17 న ముగిసింది. రాజా అబ్దుల్లా అఖ్యరాజ్య సమితి సభ్యత్వం కొరకు అభ్యర్ధనపత్రం సమర్పించాడు. ఆయన అభ్యర్ధన విషయంలో సందేహం వెలువడింది. కొన్ని సభ్యదేశాలు జోర్డాన్ పూర్తిగా బ్రిటన్ ఆధిపత్యం నుండి వెలుపలికి రాలేదని అభిప్రాయపడ్డాయి. వివాదాల ఫలితంగా 1948 మార్చి మాసంలో మరొక ఒప్పందం జరిగింది. ఒప్పందం తరువాత జోర్డాన్ సార్వభౌమధధికారం మీద నిషేధాలు తొలగించబడ్డాయి. వివాదాలు ముసిసిన నేపథ్యంలో 1955 డిసెంబర్ 14 న జోర్డాన్‌కు ఐఖ్యరాజ్యసమితి సభ్యత్వం ఇవ్వబడింది. 1948 మే 15 న " అరబ్- ఇజ్రాయిల్ యుద్ధం (1948) " అరబ్ దేశాలతో కలిసి జోర్డాన్ పాలస్తీనా మీద దాడిచేసింది. యుద్ధసమయంలో జోర్డాన్ జెరుసలేంను స్వాధీనం చేసుకుంది. తరువాత జోర్డాన్ వెస్ట్ బ్యాంకును స్వాధీనం చేసుకుని ఆక్రమిత ప్రాంతాలను జోర్డాన్‌లో విలీనం చేసింది. 1948 డిసెంబర్ 24న " జెరికో కాంఫరెంస్ "లో 2000 మంది పాలస్తీనియన్లు " ది యూనిఫికేషన్ ఆఫ్ పాలస్తీన్, ట్రాంస్జోర్డాన్ " పిలుపుకు మద్దతు తెలిపాయి. జోర్డాన్ విస్తరణ ప్రయత్నానికి ప్రతిస్పందనగా సౌదీ అరేబియా, లెబనాన్, సిరియా దేశాలు ఈజిప్ట్‌తో కలిసి జోర్డాన్ అరబ్ లీగ్ నుండి తొలగించాలని పట్టుబడ్డాయి. జోర్డాన్ అరబ్ లీగ్ నుండి బహిష్కరణను యెమన్, ఇరాక్ దేశాల వ్యతిరేక ఓట్లతో అడ్డగించబడింది. 1950 జూన్ 12 న అరబ్ లీగ్ విలీనం తాత్కాలికమైనదని ప్రకటించింది. 1951 జూలై 20న " హోలీ వార్ ఆర్మీ "కి చెందిన తీవ్రవాది ముస్తాఫా అసు మొదటి అబ్దుల్లాను కాల్చివేసాడు. 1957 లో జోర్డాన్ " ఆంగ్లో - జోర్డానియన్ " ఒప్పందానికి ముగింపు పలికింది. 1967 మే మాసంలో జోర్డాన్ ఈజిప్ట్తో సైనిక ఒప్పందం మీద సంతకం చేసింది. ఇజ్రాయిల్ ఈజిప్ట్ మీద యుద్ధం ప్రకటించగానే జోర్డాన్, సిరియాలు ఇజ్రాయిల్తో చేతులు కలిపాయి. వెస్ట్ బ్యాంక్ స్వాధీనం, ఇజ్రాయిల్ విజయంతో యుద్ధం ముగింపుకు వచ్చింది. యుద్ధం తరువాత పాలస్తీనాకు మద్దతుగా జోర్డాన్‌లో పారామిలటరీ దళం రూపొందింది. 1970లో రాజ్యాంగానికి బెదిరింపుగా మారిన " పాలస్తీనా ఫెడయీన్ " దళాలను లక్ష్యంగా చేసుకుని యుద్ధం చేసింది. యుద్ధం తరువాత పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ జోర్డాన్ నుండి లెబనాన్కు తరిమి వేయబడింది. 1973 లో " యాం కిప్పూర్ యుద్ధం " సమయ్ంలో అరబ్ లీగ్ సైన్యం ఇజ్రాయిల్ మీద దాడి చేసింది. యుద్ధం 1967లో జోర్డాన్ నది " సీస్- ఫైర్ లైన్ " సమీపంలో జరిగింది. జోర్డాన్ ఇజ్రాయిల్ మీద దాడి చేయడానికి ఒక బ్రిగేడియర్‌ను సిరియాకు పంపింది. జోర్డాన్ దళం ఇజ్రాయిల్ సైన్యాన్ని జోర్డాన్ భూభాగంలో ప్రవేశించకుండా నిలిపివేసింది. 1974 " రబాత్ సమ్మిట్ కాంఫరెంస్ " మిగిలిన అరబ్ లీగ్‌తో కలిసి పాలస్తీనా మీద " పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ " అధికారానికి అంగీకారం తెలిపింది. 1991 లో " మారిబిడ్ కాంఫరెంస్ " వద్ద జోర్డాన్ " యు.ఎస్. సోవియట్ యూనియన్ " శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించడానికి అంగీకరించింది. 1994 అక్టోబర్ 26న " ఇజ్రాయిల్ - జోర్డాన్ ట్రీటీ ఆఫ్ పీస్ " ఒప్పందం నెరవేరిన తరువాత ఇజ్రాయిల్- జోర్డాన్ విరోధం ముగింపుకు వచ్చింది. ఒప్పందం తరువాత యునై టెడ్ స్టేట్స్ జోర్డాన్‌కు వందలాది మిలియన్ల డాలర్ల సహాయం అందించడం కాక ఫ్రీ ట్రేడ్ జోన్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఇందువలన జోర్డాన్‌లో ఉత్పత్తి చేసిన వస్తువులు దిగుమతి సుంకం చెల్లించకుండా అమెరికాలోకి ప్రవేశించడానికి వీలుకలిగింది. 1997 లో ఇజ్రాయిల్ ప్రతినిధులు కెనడియన్ పాస్ పోర్ట్ ఉపయోగించి జోర్డాన్‌లో ప్రవేశించి సీనియర్ హమాస్ నాయకుడు ఖలెడ్ మెషల్‌కు విషమిచ్చారు. ఇజ్రాయిల్ విషానికి విరుగుడు ఇచ్చిన తరువాత జోర్డాన్ డజన్లకొద్దీ ఖైదీలను విడుదల చేసింది. 1999 ఫిబ్రవరి 7 న అబ్దుల్లా రాజయ్యాడు. అబ్దుల్లా సింహాసనం అధిష్టించిన తరువాత జోర్డాన్ ఆర్థికరంగం గణనీయంగా అభివృద్ధి చేయబడింది. అబుల్లాకు అందుతున్న విదేశీధన సాయం, పబ్లిక్ - ప్రైవేట్ భాగస్వామ్యం, అక్వాబా ఫ్రీ జోన్ ఏర్పాటు కూడా అభివృద్ధి చెందాయి. అబ్దుల్లా 5 ఇతర ఎకనమిక్ జోంస్ ఏర్పాటు చేసా డు: ఇర్బిద్, అజ్లౌన్, మఫ్రాగ్, మా' ఆన్, డెడ్ సీ. ఈ సంస్కరణల ఫలితంగా ఆర్థికరంగంలో రెండితల అభివృద్ధి సాధ్యం అయింది. గల్ఫ్ దేశాలు, పశ్చిమదేశాల నుండి పెట్టుబడులు క్రమంగా అధికరిస్తూనే ఉన్నాయి. అబ్దుల్లా యు.ఎస్.తో మరొక ఫ్రీ జోన్ ఏర్పాటుకు మద్యవర్తిత్వం వహించాడు. ఇది యు.ఎస్. మూడవ ఫ్రీ జోన్ ఏర్పాటు అలాగే అరబ్ దేశాలలో మొదటిదిగా గుర్తించబడింది. అబ్దుల్లా ప్రయత్నాలు జోర్డాన్‌ను అవరోధరహిత ఆర్థికశక్తిగా చేసాయి. " ఫ్రెడ్రిచ్ నౌమాన్ ఫౌండేషన్ ఫర్ లిబర్టీ " అంచనా ఆధారంగా 2015 లో అవరోధరహిత ఆర్థికశక్తిగా జోర్డాన్ 9వ స్థానంలో ఉందని భావిస్తున్నారు. 2011 ఫిబ్రవరిలో దేశం లోపలి, ప్రాంతీయ అశాంతి రెండవ అబ్దుల్లా ప్రధానమంత్రిని తొలగించి సంస్కరణల పేరుతో " నేషనల్ డైలాగ్ కమిషన్ " ఏర్పాటు చేసాడు. తరువాత రాజకీయాలు, ప్రజల స్వతంత్రానికి సంబంధించిన చట్టాల సవరణకు రాజా అబ్దుల్లా పిలుపు ఇచ్చాడు.

  1. జేన్ అల్-షరాఫ్ తలాల్: జోర్డాన్ రాణి, రాజా తలాల్ భార్య, రాజా హుస్సేన్ కి కూడా తల్లి.

భౌగోళికం

జోర్డాన్ 
Wadi Rum is Jordan's highly praised tourist attraction, its resemblance to the surface of Mars has made it a common filming location, most notably the scenes in; The Martian, Lawrence of Arabia and Theeb
జోర్డాన్ 
The Dead Sea is the lowest point on Earth. Its waters are very salty, which enables swimmers to float effortlessly, while providing many therapeutic health benefits

జోర్డాన్ ఆసియా ఖండంలో 29 నుండి 34 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో, 35-40 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. దేశం తూర్పు భాగంలో పొడిగా ఉండే పీఠభూమి ఉంటుంది. దీనికి ఒయాసిస్, సీజనల్ సెలయేరుల నుండి నీరు లభిస్తుంది. పశ్చిమ భూభాగంలో సముద్రతీర సతతహరితారణ్యాలు ఉన్నాయి. జోర్డాన్ రిఫ్ట్ లోయ జోర్డాన్‌ను ఇజ్రాయిల్, పాలస్తీనా భూభాగాల నుండి వేరుచేస్తూ ఉంది. జోర్డాన్‌లోని " జబల్ ఉమ్ అల్ దామి " దేశంలోని అత్యంత ఎత్తైన ప్రాంతంగా భావించబడుతుంది. ఇది సముద్రమట్టానికి 1,854 m (6,083 ft) ఎగువన ఉంది. డేడ్ సీ −420 m (−1,378 ft) దిగువన ఉటుంది. " ది క్రాడిల్ ఆఫ్ చివిలైజేషన్ ", ది లెవంత్ ప్రాంతంలోని భుభాగాలలో జోర్డాన్ ఒకటి. దేశంలోని ప్రధాన నగరాలలో పశ్చిమంలో అమ్మాన్, అల్- సాల్ట్, వాయవ్యంలో ఇర్బిద్, జెరష్, జర్క్వా, ఆగ్నేయంలో మదబా, అల్ కరక్, అక్వాబా ఉన్నాయి. తూర్పు భాగంలో ఒయాసిస్ పట్టణాలైన అజ్రాక్, రువైషెద్ ఉన్నాయి. జోర్డాన్ అధికంగా భూఅంతర్గతంగా ఉంటుంది. దక్షిణ సరిహద్దున 26 కి.మీ పొడవైన ఎర్ర సముద్రతీరం తీరప్రాంతం ఉంది.

వాతావరణం

జోర్డాన్ వాతావరణం వేసవిలో సెమీ- డ్రై ఉంటుంది. ఉష్ణోగ్రత 30 °C (86 °F) ఉంటుంది. శీతాకాలం ఉష్ణోగ్రత 13 °C (55 °F). దేశం పశ్చిమ ప్రాంతంలో శితాకాలంలో (నవంబరు- మార్చి) వర్షపాతం, హిమపాతం ఉంటుంది. అమ్మాన్‌లో ఎత్తు (756 m (2,480 ft) ~ 1,280 m (4,199 ft) సముద్రమట్టానికి ఎగువన) ఉంటుంది. పశ్చిమంలోని ఎగువభూములలో ఎత్తు సముద్రమట్టానికి 500 m (1,640 ft) ఎగువన ఉంటుంది. రిఫ్ట్ లోయ, మిగిలిన ప్రాంతంలో ఎత్తు సముద్రమట్టానికి 300 m (984 ft) (SL) ఎగువన ఉంటుంది. వాతావరణం నవంబరు నుండి మార్చి వరకు తేమగా ఉంటుంది.సంవత్సరంలో మిగిలిన కాలం సెమీ డ్రైగా ఉంటుంది. వేడైన, పొడైన వేసవి ఉంటుంది. శితాకాలంలో వర్షపాతం ఉంటుంది. దేశంలో సముద్రతీర వాతావరణం ఉంటుంది.

రాజకీయాలు, ప్రభుత్వం

జోర్డాన్ రాజరికవ్యవస్థ కలిగి ఉంది. రాజుకు పాలనా, చట్టనిర్వహణ అధికారాలు ఉన్నాయి. రాజు దేశానికి నాయకత్వం, కమాండర్ - ఇన్ - చీఫ్ బాధ్యత వహిస్తున్నాడు. రాజుకు ప్రధానమత్రి నియామకం, మంత్రివర్గ నియామకం, గవర్నరేట్ నియామకాధికారాలు ఉంటాయి. ప్రస్తుతం జోర్డాన్ రెండవ అబ్దుల్లా పాలనలో ఉంది.

జోర్డాన్ పార్లిమెంటులో రెండు సభలు ఉంటాయి: హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటువ్స్ ఆఫ్ జోర్డాన్ (మజిల్లిస్ అల్- నువాబ్), ది సెనేట్ ఆఫ్ జోర్డాన్ (మజిల్లీస్ అల్-అయాన్). పార్లమెంటు కొరకు 12 నియోజకవర్గాల నుండి 150 మంది సభ్యులను ఎన్నుకొంటారు. 75 మంది సెనేట్ సభ్యులు నేరుగా రాజుచేత నియమించబడతారు. పార్లమెంటు హౌస్‌లో స్త్రీలకు 12 స్థానాలు కేటాయించబడతాయి. 108 సభ్యులను నియోజకవర్గాల నుండి ఎన్నుకుంటారు. 9 స్థానాలు జోర్డాన్ క్రైస్తవులకు కేటాయించబడతాయి. 1999 ఫిబ్రవరిలో జోర్డాన్ రాజు రెండవ అబ్దుల్లా తనతండ్రి హుస్సేన్ (జోర్డాన్) మరణం తరువాత రాజ్యాధికారం చేపట్టాడు. అబ్దుల్లా ఆధ్వర్యంలో ఇజ్రాయిల్- జోర్డాన్ శాంతి ఒప్పందం జరిగింది. ఇది జోర్డాన్- ఇజ్రాయిల్- యునైటెడ్ స్టేట్స్ సంబంధాలను మెరుగుపరిచింది. అబ్దుల్లా పాలన మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వ విధానాలు, ఆర్థిక సంస్కరణలు చేపట్టబడ్డాయి. జోర్డాన్‌లో పలు రాజకీయ పార్టీలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు కొన్ని స్థానాలకు మాత్రమే పోటీ చేస్తుంటాయి. మిగిలిన స్థానాలకు స్వతంత్రంగా పోటీ చేస్తుంటారు. 2012 జూలై ఇంటీరియర్ మినిస్టరీ మత ఆధారిత పార్టీస్థాపన చేయకూడదని చట్టం రూపొందించింది.

చట్టం

జోర్డాన్ 
A Female police officer in Amman
జోర్డాన్ 
An Amman City Centre Police Vehicle

1952 జనవరి 11న జోర్డాన్ రాజ్యాంగం రూపొందించబడింది. తరువాత దీనికి పలుమార్లు దిద్దుబాట్లు జరిగాయి. సమిపకాలంలో 2014 లో దిద్దుబాటు జరిగింది. జోర్డాన్ రాజ్యాంగం 97వ ఆర్టికల్ న్యాయవ్యవస్థ స్వతంత్రాన్ని ధ్రువీకరిస్తుంది. న్యాయాధికారులు రాజు అంగీకారంతో నియమించబడతారు. న్యాయవ్యవస్థ " హయ్యర్ జ్యుడీషియల్ కౌంసిల్ " ఆధ్వయంలో నిర్వహించబడుతుంది. రాజ్యాంగంలోని 99వ ఆర్టికల్ కోర్టులను మూడు వర్గాలుగా విభజిస్తుంది. అవి వరుసగా సివిల్, రిలీజియస్, స్పెషల్. సివిల్ కోర్టులు సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరిస్తాయి. సివిల్ కోర్టులలో మెజిస్ట్రేట్ కోర్టులు, కోర్ట్స్ ఆఫ్ ఇంస్టెంస్, కోర్ట్స్ ఆఫ్ అప్పీల్ భాగంగా ఉంటాయి. హై అడ్మినిస్ట్రేటివ్ కోర్టులు పాలనా సంబంధిత కేసులను పరిష్కరిస్తాయి. కాన్స్టిట్యూషనల్ కోర్టులు 2012 లో ఏర్పాటు చేయబడింది. ఇవి నియోజవర్గ సమస్యలను పరిష్కరిస్తాయి. మతపరమైన కోర్టులు విడాకులు, వారసత్వ కేసులను పరిష్కరిస్తాయి. 1976 లో కుటుంబ చట్టం రూపొందించబడింది. జోర్డాన్ చట్టం అమలు ప్రపంచంలో 24వ స్థానంలో, మిడిల్ ఈస్ట్‌లో 4వ స్థానంలో ఉంది. పోలిస్ విశ్వసనీయత ప్రపంచంలో 13వ స్థానంలో, మిడిల్ ఈస్ట్‌లో 3వ స్థానంలో ఉంది. నేరం నిరోధించడంలో విశేషకృషిచేస్తున్న జోర్డాన్ ప్రంపంచంలోని సురక్షితమైన దేశాలలో ఒకటిగా ఉంది. జోర్డాన్ పోలీస్ వ్యవస్థలో మహిళలను అధికసంఖ్యలో నియమించబడుతున్నారు. 1970 లో పోలీస్ శాఖలో స్త్రీలను నియమించిన మొదటి అరబ్ దేశంగా జోర్డాన్ ప్రత్యేక గుర్తింపు పొదింది.

విదేశీ సంబంధాలు

జోర్డాన్ 
A handshake between King Hussein and Yitzhak Rabin, accompanied by Bill Clinton, after signing the Israel-Jordan Treaty of Peace, 26 October 1994.
జోర్డాన్ 
King Abdullah II shows his son, Crown Prince Hussein, a photo given to them by U.S. Secretary of State John Kerry

జోర్డాన్ " ప్రొ- వెస్టర్న్ - ఫారిన్ పాలిసీ "ని అనుసరిస్తుంది. జోర్డాన్ యునైటెడ్ స్టేట్స్, ది యునైటెడ్ కింగ్డంలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. జోర్డాన్ తటస్థ వైఖరి, గల్ఫ్ యుద్ధం సమయంలో జోర్డాన్ - ఇరాక్ మద్య ఉన్న సుముఖమైన సంబంధం పశ్చిమదేశాల సంబంధాల మీద ప్రభావం చూపింది. గల్ఫ్ యుద్ధం తరువాత జోర్డాన్ పశ్చిమ దేశాల సంబధాలను తిరిగి పునరుద్ధరించింది. తరువాత సౌత్ ఈస్ట్ ఆసియా పీస్ ఒప్పందంలో పాల్గొనడం, ఇరాక్‌కు వ్యతిరేకంగా యు.ఎన్. విధించిన నిషేధాలకు మద్దతు ఇచ్చింది. జోర్డాన్- గల్ఫ్ దేశాల మద్య సంబంధాలు 1999 లో రాజా హుస్సేన్ మరణం తరువాత గణనీయంగా అభివృద్ధి చేయబడ్డాయి. జోర్డాన్ యు.ఎస్.ఎ. యు.కె. లతో ఈజిప్ట్ ఇజ్రాయిల్ పీస్ ఒప్పందం మీద సంతకం చేసాయి. 2009 లో ఇజ్రాయిల్లో పలు లికుద్ చట్టరూపకర్తలు పాలస్తీనియన్ రాజ్యస్థాపన కొరకు ప్రతిపాదించాయి. జోర్డాన్ యురేపియన్ యూనియన్‌లో చేర్చబడింది.2015లో " సౌదీ అరేబియా - లెడ్- ఇంటర్వెంషన్ ఇన్ యేమన్ "లో జోర్డాన్ పాల్గొన్నది. ఇది షియా ముస్లిములు, హౌతీలు, మునుపటి అధ్యక్షుడు అలి అబ్దుల్లా సలే (2011లో తిరుబాటు తరువాత పదవీచ్యుతుడు అయ్యడు " విశ్వసనీయ సైనిక దళాలకు వ్యతిరేకంగా రూపొందించబడింది.

సైన్యం

జోర్డాన్ 
Jordanian soldier during a military exercise

జోర్డానియన్ సైన్యం యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డం, ఫ్రాన్స్ మద్దతు, సహాయం అందుకుంటూ ఉంది. ఇజ్రాయిల్,సిరియా, వెస్ట్ బ్యాంక్, ఇరాక్, సౌదీ అరేబియా ల మద్య ఉంటూ లెబనాన్, ఈజిప్ట్ లకు సమీపంలో ఉండడం కారణాన జోర్డాన్ పలు క్లిష్టపరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటుంది. " రాయల్ స్పెషల్ ఫోర్స్ " అభివృద్ధి గణనీయంగా ఉంది. దేశరక్షణ కొరకు సైనికదళం శక్తిని వేగవంతంగా మెరుగుపచవలసిన అవసరం ఉంది. అలాగే స్పెషల్ ఫోర్సెస్‌కు మెరుగైన శిక్షణ అవసరం ఉంటూ ఉంది. ఐక్యరాజ్యసమితి శాంతిరక్షణ సైనికదళంలో 50,000 మంది జోర్డానియన్ సైనికులు ప్రంపంచం అంతటా పనిచేస్తూ ఉన్నారు. ఈ సైనికులు మిలటరీ రక్షణ కొరకు అన్ని విధాలైన సేవలను అందిస్తూ స్థానిక పోలీస్‌కు శిక్షణ కూడా ఇస్తుంటారు. ఐక్యరాజ్యసమితి శాంతిరక్షణ సైనికదళంలో జోర్డాన్ అంతర్జాతీయంగా మూడవ స్థానంలో ఉంది. ఐక్యరాజ్యసమితి శాంతిరక్షణ సైనికదళంలో ఉన్నత స్థాయిలో ఉన్నదేశాలలో ఒకటైన జోర్డాన్ దళాలు ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలన్నింటిలో పనిచేసాయి.

యుద్ధ భూమి, ప్రకృతి బీభత్సిత ప్రాంతాలలో ఆసుపత్రుల ఏర్పాటులో జోర్డాన్ ప్రత్యేకత కలిగి ఉంది. ఇరాక్, వెస్ట్ బ్యాంక్, లెబనాన్,ఆఫ్ఘనిస్తాన్,హైతి,ఇండోనేషియా,కాంగో రిపబ్లిక్,లిబియా,ఇథియోపియా,ఎరిత్రియా,సిరియా లియోనె, పాకిస్తాన్ దేశాలలో ఆపత్కాలంలో జోర్డాన్ సైనిక దళాలు ఆసుపత్రులను ఏర్పాటు చేసాయి. కింగ్డం సీల్డ్ హాస్పిటల్స్ సేవలు దేశ సరిహద్దులను దాటి విస్తరించబడ్డాయి. ఒక మిలియన్ కంటే అధికమైన ఇరాక్ ప్రజలకు, ఒక మిలియన్ వెస్ట్ బ్యాంక్ ప్రజలకు, 55,000 లెబనాన్ ప్రజలకు వైద్య సేవలను అందించాయి. జోర్డానియన్ శాంతిరక్షణ సైనికదళాలు ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, లాటిన్ అమెరికాకు సేవలు అందించాయి. జోర్డానియన్ ఆర్ంఫోర్స్డ్ ఫీల్డ్ హాస్పిటల్స్ 2002 నుండి ఆఫ్ఘనిస్తాన్లో పనిచేస్తూ 7,50,000 మందికి వైద్యసేవలు అందిస్తున్నాయి. ఇరాక్ లోని రక్షణ దళాలకు పాలస్తీనియన్ భూభాగాలలో , " కోపరేషన్ కౌంసిల్ ఫర్ ది అరబ్ స్టేట్స్ ఆఫ్ ది గల్ఫ్ " జోర్డాన్ దళాలు విస్తారంగా శిక్షణ ఇస్తున్నాయి.

నిర్వహణా విభాగాలు

జోర్డాన్ 
Muath al-Kasasbeh's memorial at the University of Jordan.

జోర్డాన్ 12 ప్రాంతాలుగా విభజించబడింది. వీటిని జోర్డాన్ గవర్నరేట్లు అంటారు. వీటిని తిరిగి 54 జిల్లాలుగా (జోర్డాన్ నవాహీలు) విభజించారు. ఒక్కొక గవర్నరేట్ జిల్లాలుగా, నైబర్ హుడ్స్‌గా (పట్టణాలు, పల్లెలు) వివ్హజించబడ్డాయి. .

సంఖ్య. గవర్నరేట్ రాజధాని
జోర్డాన్ 
1 ఇర్బిడ్ ఇర్బిడ్
2 అజ్లౌన్ అజ్లౌన్
3 జెరాష్ జెరాష్
4 మఫ్రాగ్ ] మఫ్రాగ్
5 సాల్ట్ (జోర్డాన్) సాల్ట్ (జోర్డాన్)
6 అమ్మాన్ అమ్మాన్
7 జర్క్వా జర్క్వా
8 మదాబా మదాబా
9 కరక్ అల్ కరక్
10 తఫిలాహ్ తఫిలాహ్
11 మా' అన్ మా' అన్
12 అక్వాబా అక్వాబా

మానవహక్కులు

2010 " అరబ్ రిఫార్ం ఇంషియేటివ్ " అరబ్ డెమాక్రసీ ఇండెక్స్ వర్గీకరణలో ప్రజాస్వామ్య సంస్కరణలలో 15 అరబ్ దేశాలలో జోర్డాన్ మొదటి స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. 2015లో " ఇండెక్స్ ఆఫ్ ఫ్రీడం ఇన్ ది వరక్డ్ " జాబితాలో అరబ్ దేశాలలో జోర్డాన్ మొదటి స్థానంలో ఉంది. అలాగే ప్రపంచదేశాలలో 78వ స్థానంలో ఉంది. 2014 లో " కరప్షన్ పర్సిప్షన్ ఇండెక్స్ "లో 175 దేశాలలో జోర్డాన్ 55వ స్థానంలో ఉంది. అలాగే 2014 లో అత్యధికంగా లంచగొండి తనం కలిగిన దేశాల జాబితాలో 175 వ స్థానంలో ఉంది.

ఆర్ధికం

జోర్డాన్ 
Graphical depiction of Jordan's product exports in 28 color-coded categories.
జోర్డాన్ 
Abdali Project, which is a central business district located in the capital Amman in December 2015
జోర్డాన్ 
Amman

వరల్డ్ బ్యాంక్ జోర్డాన్‌ను " అప్పర్- మిడిల్ ఇంకం " దేశంగా వర్గీకరించింది. 2005 నుండి ఆర్థికరంగం వార్షికంగా 4.3% అభివృద్ధి చెందుతూ ఉంది. దాదాపు 1.99% ప్రజల దినసరి ఆదాయం ఒక రోజుకు 3 అమెరికన్ డాలర్లు ఉంటుంది. 1970 నుండి తలసరి ఆదాయం 351% అభివృద్ధి చెందింది. 1980లో తలసరి ఆదాయం 30% క్షీణించింది. 1960 నాటికి తలసరి ఆదాయం 36% అధికరించింది. జోర్డాన్ టర్కీ, యురేపియన్ యూనియన్ " ఫ్రీ ట్రేడ్ " ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే యునైటెడ్ స్టేట్స్‌తో " ఫ్రీ ట్రేడ్ " ఒప్పందం కుదుర్చుకున్న మొదటి అరబ్ దేశంగా జోర్డాన్ గుర్తించబడుతుంది. జోర్డాన్‌కు ఇ.యుతో విశేష అంతస్తును అందిస్తుంది. నెమ్మదిగా సాగుతున్న ఆర్థికాభివృద్ధి, విద్యుత్తు, ఆహారం కొరకు పెద్ద మొత్తంలో ఇస్తున్న రాయితీలు, పబ్లిక్ రంగంలో నెలకొన్న మందకొడితనం కారణంలో జోర్డాన్ బడ్జెట్‌లో లోటు కొనసాగుతూ ఉంది. అంతర్జాతీంగా అందుతున్న సహాయంతో బడ్జెట్ లోటు కొంతవరకు సరిచేయబడుతూ ఉంది. జోర్డాన్ ఆర్థికరగం వైవిధ్యం కలిగి ఉంది. వ్యాపారం, ఫైనాంస్ దేశ జి.డి.పి.లో మూడవవంతుకు బాధ్యతవహిస్తున్నాయి. రావాణా, సమాచారరంగం, పబ్లిక్ యుటిలిటీస్, నిర్మాణరంగం జి.డి.పి.లో ఐదవ వంతుకు బాధ్యత వహిస్తున్నాయి. మైనింగ్, పారిశ్రామిక రంగం మిగిలిన వంతు జి.డి.పి.కి బాధ్యత వహిస్తున్నాయి. ప్రైవేట్ రంగం అభివృద్ధి కొరకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ జోర్డాన్‌లో ప్రభుత్వరంగం ఆధిక్యత కొనసాగుతూ ఉంది. మొత్తం ఉద్యోగులలో ప్రభుత్వోద్యోగులు దాదాపు రెండువంతులు ఉన్నారు. 2000లో జోర్డాన్ " వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ "లో చేర్చబడింది. అలాగే జోర్డాన్ - యునైటెడ్ స్టేట్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు " కొరకు సంతకం చేసింది. 2001లో జోర్డాన్ యురోపియన్ యూనియన్ అసోసియేషన్ అగ్రిమెంట్ కొరకు సంతకం చేసింది.2009 జోర్డాన్ " నెట్ అఫీషియల్ డెవెలెప్మెంట్ అసిస్టెంస్ " 261 మిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరింది. ఒప్పందం అనుసరించి ఇందులో మూడింట రెండు వంతులు గ్రాంటుల రూపంలో లభిస్తుంది. అరబ్ తిరుగుబాటు " గ్రేట్ రిసెషన్ ", సంక్షోభం జోర్డాన్ జి.డి.పి మీద (నిర్మాణరంగం, ఎగుమతులు, పర్యాటకరంగం) తీవ్రమైన ప్రభావం చూపింది. 2011 నుండి జోర్డాన్‌కు పర్యాటకుల రాక తగ్గుముఖం పట్టింది. ఇది ప్రభుత్వాదాయం, ఉపాధి అవకాశాల మీద ప్రభావం చూపుతూ ఉంది. ప్రజలలో నెలకొన్న అశాంతిని తొలగించడానికి విద్యుత్తు, ఆహారం ధరలను కృత్రిమంగా తగ్గిస్తూ ఉంది. మరొక వైపు జీతాలు, విశ్రాంతి వేతనం అధికం అధికం చేసింది. ఇజిప్ట్ గ్యాస్ లైన్ దాడులు జోర్డాన్ ఆర్థికరంగం మీద తీవ్రమైన ప్రభావం చూపింది. ఫలితంగా ఆయిల్, విద్యుదుత్పత్తి వ్యయం అధికం అయింది. ఆయిల్ షార్టేజ్ భారం సరిచేయడానికి 500 మిలియన్ల అమెరికన్ డాలర్లు అవసరం ఔతున్నాయి. 2012 ఆగస్టులో " ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ " జోర్డాన్‌కు మూడు సంవత్సరాల కాలం సంవత్సరానికి 2 మిలియన్ల అమెరికన్ డాలర్లు ఋణం సహాయంగా అందించ డానికి అంగీకారం తెలిపింది. ఒప్పందంలో భాగంగా జోర్డాన్ వ్యయం తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. 2012 నవంబరులో ప్రభుత్వం ఆయిల్ రాయితీలను రద్దుచేసింది. ధరలు అధికం కావడం కారణంగా పెద్ద ఎత్తున నిరసనలు తలెత్తాయి. జోర్డాన్ మొత్తం విదేశీఋణం 22 బిలియన్ల అమెరికన్ డాలర్లు. జి.డి.పి.లో 72% (80% సురక్షితమైనదని భావిస్తున్నారు). 2012 నవంబరు బడ్జెట్ లోటు 3 బిలియన్ అమెరికండాలర్లు (జి.డి.పి.లో 11 %). 2012 అభివృద్ధి 3%. ఐ.ఎం.ఎఫ్. అంచనా అనుసరించి జి.డి.పి. 3.5% ఉంటుందని అంచనా. 2017 నాటికి 4.5 % చేరుకుంkటుందని అంచనా. 2012 ద్రవ్యోల్భణం 4.5%. జోర్డాన్ అధికారిక కరెంసీ " జోర్డాన్ దీనార్ ". జోర్డాన్ శ్రామికులు ఈ ప్రాంతంలో నైపుణ్యం కలవారుగా భావించబడుతున్నారు. 1950లో జోర్డాన్‌ జి.ఎన్.పి.లో 40% వ్యవసాయం నుండి లభించింది. 1967 " సిక్స్ డే వార్ " సందర్భంలో ఇది 17% నికి క్షీణించింది. 1980 మద్య కాలానికి వ్యవసాయం జోర్డాన్ జి.ఎన్.పి.లో 6% మాత్రమే భాగస్వామ్యం వహించింది. " వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆన్ ది మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా "కు 6 మార్లు ఆతిథ్యం ఇచ్చింది. ఏడవసారి ఇది 2013 న డెడ్ సీ సమీపంలో నిర్వహించబడింది.

2014 లో ఆదాయ ఆధారిత జోర్డానియన్ పరిశ్రమల జాబితా:

ర్యాంక్ పేరు ప్రధాన కార్యాలయం ఆదాయం
(mil. $)
లాభం
(mil. $)
ఉద్యోగులు
(ప్రపంచం)
01. అరాబక్ బ్యాంక్ అమ్మాన్ 1,877.3 577.2 6,387
02. హిక్మ ఫార్మాస్యూటికల్స్ అమ్మాన్ 1,489 282 6,000
03. అరామెక్స్ అమ్మాన్ 993.62 94.46 14,000
04. నుక్వుల్ గ్రూప్ అమ్మాన్ 688 N/A 4,404
05. మనాసీర్ గ్రూప్ అమ్మాన్ N/A N/A 7,000

పరిశ్రమలు

జోర్డాన్ చక్కగా అభివృద్ధి చేయబడిన పరిశ్రమలను కలిగి ఉంది. మైనింగ్, వస్తుతయారీ, నిర్మాణరంగం, విద్యుత్తు రంగాలు 2014 లో దేశ జి.డి.పి.లో 26% నికి భాగస్వామ్యం వహిస్తుంది. ఇందులో 16.2% వస్తుతయారీ, 4.6% నిర్మాణరంగం, 3.1% మైనింగ్ భాగస్వామ్యం వహిస్తున్నాయి. 2002 గణాంకాలను అనుసరించి దేశశ్రామిక శక్తిలో 21% పారిశ్రామిక రంగంలో పనిచేస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తిలో పొటాష్, ఫాస్ఫేట్, ఔషధాలు, సిమెంటు, వస్త్రాలు, ఎరువుల తయారీ ప్రాధాన్యత వహిస్తున్నాయి. పారిశ్రామిక రంగాన్ని నిర్మాణరంగం ఆధిక్యత వహిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా నివసగృహాలు, కార్యాలయాలు అవసరం వేగవంతంగా అభివృద్ధి చెందింది. 2014 డిసెంబరులో " మిడిల్ ఈస్ట్ కమర్షియల్ సెంటర్ లీడర్ షిప్ దైనర్, యు.ఎస్ సెక్రటరీ జాన్ కెర్రీ " పెత్రా ఇంజనీరింగ్ కంపెనీని " అభినందించాడు. ఇది జోర్డాన్ పారిశ్రామిక రంగానికి చెందిన మూల స్థంభాలలో పెత్రా ఇంజనీరింగ్ కంపెనీ ఒకటి అని ప్రశంశించాడు. పెత్రా ఎయిర్ కండిషన్ యూనిట్లు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, నాసాలలో ఉపయోగించబడ్డాయని వివరించాడు. అంతే కాక యునైటెడ్ స్టేట్స్ అంతటా ఇవి ఉపయోగిమచబడుతున్నాయని వివరించబడింది.

సైనిక పరిశ్రమ

1999 ఆగస్ట్‌లో జోర్డాన్ సైనిక పరిశ్రమ రాజు ఆదేశం అనుసరించి " కింగ్ అబ్దుల్లా డిజైన్ అండ్ డెవెలెప్మెంట్ బ్యూరో " స్థాపించబడింది. ఇది జోర్డానియన్ సైనికదళానికి శాస్త్రీయమైన, సాంకేతికమైన సేవలు అందిస్తుంది. ఇది రక్షణ వ్యవస్థకు అవసరమైన ఆయుధాలను అందించడమేకాక మిడిల్ ఈస్ట్ అవసరాలకు ఆయుధాలను సైనిక ఉపకరణాలను అందిస్తూ దేశానికి వాణిజ్యపరంగా సహకరిస్తుంది. ఇది పలు రకాల సైనిక ఉపకరణాలను, హెవీ ఆర్ండ్ వెహికల్స్‌ను, బాడీ ఆర్ంస్‌ను తయారుచేస్తుంది. ఇది చిన్నతరహా విమానాలు, మానవరహిత విమానాలను తయారు చేస్తుంది. పలు ఉత్పత్తులను వార్షికంగా ఇంటర్నేషనల్ మిల్టరీ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించబడుతున్నాయి. ఈ సంస్థ నుండి 72 అమెరికన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు పలు దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి.

ఔషధ తయారీ

జోర్డాన్ ప్రస్తుతం ఔషధ తయారీలో అగ్రగామిగా ఉంది. జోర్డాన్ దేశంలో హిక్మా ఔషధ తయారీ కంపెనీ ఔషధ తయారీలో ఆధిఖ్యత కలిగి ఉంది.

పర్యాటకం

Dana Biosphere Reserve in south-central Jordan which is a popular tourist attraction
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
Al-Maghtas
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
జోర్డాన్ 
Al-Maghtas ruins on the Jordanian side of the Jordan River are the location for the Baptism of Jesus and the ministry of John the Baptist.

ప్రదేశంBalqa Governorate
Jordan
రకంCultural
ఎంపిక ప్రమాణంiii, vi
మూలం1446
యునెస్కో ప్రాంతంArab States
శిలాశాసన చరిత్ర
శాసనాలు2015 (39th సమావేశం)

2006 గణాంకాలను అనుసరించి పర్యాటకం జోర్డాన్ జి.ఎన్.పి.లో 10-12% భాస్వామ్యం వహిస్తుంది. 2010 లో జోర్డాన్‌ను 8 మిలియన్ల పర్యాటకులు సందర్శించారని అంచనా. ఫలితంగా పర్యాటకం ద్వారా 3.4 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఆదాయం, మెడికల్ టూరిజం ద్వారా 4.4 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఆదాయం లభించింది. పర్యాటకులకు జోర్డాన్ అంతర్జాతీయ స్థాయిలో చారిత్రక, సంస్కృతిక ప్రదేశాల సందర్శనకు అవకాశం కల్పిస్తుంది. పెత్రా, జెరాష్ మొదలైన సాంస్కృతిక ప్రాంతాలు అలాగే నగరాలలో అందుబాటులో ఉన్న ఆధునిక వినోదాలు పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి. అక్వాబా, డెడ్ సీ ప్రాంతాలలో అనేక అంతర్జాతీయ రిసార్ట్లు ఉన్నాయి. ఎకో- టూరిజం కొరకు పలు సహజ వనరులు దానా నేచురల్ రిజర్వ్ నుండి ఎంచుకొనడానికి అవకాశం ఉంది. మతపరమైన పర్యాటకులు ఎం.టి. నిబో, ది బాప్టిస్ట్ సైట్, ది మొజాయిక్ సిటీ ఆఫ్ మదాబా ఉన్నాయి.

వినోదం

జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌, ఇర్బిడ్, అక్వాబా, పలు 4 స్టార్, 5 స్టార్ హోటళ్ళలో నైట్ క్లబ్బులు, డిస్కో, బార్లు ఉన్నాయి. అదనంగా అక్వాబా, డెడ్ సీ ప్రాంతాలలో బీచ్ క్లబ్బులు కూడా ఉన్నాయి. 2007లో " పెత్రా ప్రానా ఫెస్టివల్ " కు జోర్డాన్ ఆతిథ్యం ఇచ్చింది. రెస్ టారెంట్లు, లిక్కర్ స్టోర్లు, సూపర్ మార్కెట్లలో ఆల్కహాల్ విస్తారంగా లభిస్తుంది.

సహజ వనరులు

జోర్డాన్ సహజ వనరులలో దానా బయోస్ఫేర్ రిజర్వ్, అజ్రగ్ వెట్లాండ్ రిజర్వ్, షౌమరి విల్డ్‌లైఫ్ రిజర్వ్, వాడి ముజిబ్ నేచుర్ రిజర్వ్ ప్రధానమైనవి. పర్యాటకం అభివృద్ధిచేసే కృషిలో భాగంగా 2015 నవంబర్ 22 " గూగుల్ స్ట్రీట్ వ్యూ ఇన్ జోర్డాన్ " లో జోర్డాన్‌లోని 40 ఆర్కియాలజీ లోకేషన్లను లైవ్ ప్రదర్శనలో చూసేఅవకాశం కల్పించింది.

మెడికల్ టూరిజం

1970 నుండి జోర్డాన్ మెడికల్ టూరిజం ప్రాబల్యత సంతరించుకుంది. " ప్రైవేట్ హాస్పిటల్ అసీసియేషన్ (జోర్డాన్) " నిర్వహించిన అధ్యయనం 102 దేశాల నుండి 2,50,000 మంది రోగగ్రస్తులు 2010 లో వైద్యచికిత్స కొరకు జోర్డాన్‌కు వస్తున్నారని తెలియజేస్తుంది. 2007 లో ఇది 1,90,000 ఉంది. మెడికల్ పర్యాటకం మూలంగా దేశానికి 1 బిలియన్ అమెరికన్ డాలర్లు ఆదాయం లభిస్తుంది. వరల్డ్ బ్యాంక్ వర్గీకరణలో ఈ ప్రాంతంలో మెడికల్ పర్యాటకంలో జోర్డాన్ మొదటి స్థానంలో ఉంది. అలాగే అంతర్జాతీయంగా 5 వ స్థానంలో ఉంది. వరల్డ్ బ్యాంక్ అధ్యయనాలు ఆధారంగా 2012 మొదటి ఆరుమాసాలలో లిబియా నుండి 55,000 మంది పేషంట్లు, సిరియా నుండి 80,000 మంది పేషంట్లు జోర్డాన్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందారని అంచనా. 2015 అక్టోబరు నాటికి 55,000 లిబియన్లు చికిత్స కొరకు 140 మిలియన్ల జోర్డాన్ దీనార్లు వ్యయం చేయగా 800 మంది యెమెనీలు 15 మిలియన్ల జోర్డాన్ దీనార్లు వ్యయం చేసారని అంచనా. జోర్డానియన్ డాక్టర్లు, మెడికల్ స్టాఫ్ వార్ పేషంట్లకు చికిత్స చేయడం ద్వారా చక్కని అనుభవం గడించారు. ఈ ప్రాంతంలోని పలు వైవిధ్యమైన యుద్ధభూముల నుండి సంవత్సరం అంతా పేషంట్లు జోర్డాన్‌కు చేరుకుంటూ ఉంటారు. జోర్డాన్ మార్కెటింగ్ ప్రయత్నాలలో భాగంగా ప్రత్యేకంగా మునుపటి సోవియట్ యూనియన్ దేశాలు, ఐరోపా, అమెరికా దేశాల మీద దృష్టికేంద్రీకరిస్తుంది. అరబ్, విదేశీ పేషంట్లు అవయవమార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ, ఇంఫర్టిలిటీ ట్రీట్మెంటు, లేజర్ విషన్ కరెక్షన్లు, బోన్ ఆపరేషన్లు, కేంసర్ చికిత్స కొరకు జోర్డాన్ రావడం సాధారణం. జోర్డాన్ సహజ చికిత్స విధానాలకు కూడా కేంద్రంగా ఉంది. జోర్డాన్‌లో ఉన్న వేడినీటి ఊట, డెడ్ సీ సహజ ఆకర్షణలుగా ఉన్నాయి. ఇందులో సాధారణ సముద్రాలలో ఉండే ఉప్పు శాతం కంటే 10 రెట్లు అధికంగా ఉప్పుశాతం ఉంది. అందువలన సముద్రం మునగడానికి వీలుకానిదిగా ఉంటుంది. డెడ్ సీలో ఉన్న అధికమైన ఉప్పు శాతం పలు చర్మవ్యాధులకు చికిత్సగా ఉపకరిస్తుంది. వైద్యపరంగా ఇది మరింత మంది పేషంట్లను జోర్డాన్‌ వైపు ఆకర్షిస్తుంది.

సహజ వనరులు

జోర్డాన్ 
A phosphate train at Ram station

జోర్డాన్‌ దక్షిణప్రాంతంలో రాక్ ఫాస్ఫేట్ గనులు ఉన్నాయి. ప్రపంచంలో ఫాస్ఫేట్ మినరల్‌ను అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశాలలో జోర్డాన్ ఒకటి. జోర్డాన్‌లో అత్యంత అధికమైన యురేనియం నిల్వలు ఉన్నాయి. జోర్డాన్‌లో మూడు న్యూక్లియర్ ప్లాంటులు ఉన్నాయి. మొదటి ప్లాంటు " జోర్డాన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ రియాక్టర్ " నుండి 5 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంది. ఇది " జోర్డాన్ యూనివర్శిటీ ఆఫ్ సైంస్ అండ్ టెక్నాలజీ "లో స్థాపించబడి ఉంది. యూనివర్శిటీలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాం విద్యార్థులకు ఇక్కడ శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇతర రెండు న్యూక్లియర్ రియాక్టర్లు ప్రణాళికాదశలో ఉన్నాయి. 1987లో జోర్డాన్‌లో నేచురల్ గ్యాస్ కనుగొనబడింది. ఇక్కడ 230 బిలియన్ల క్యూబిక్ అడుగుల గ్యాస్ నిల్వలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇరాకీ సరిహద్దులో ఉన్న రిషా ఫీల్డ్ నుండి దినసరి 30 మిలియన్ల క్యూబిక్ అడుగుల గ్యాస్ ఉత్పత్తి చేయబడుతుంది. ఇది జోర్డాన్ విద్యుత్తు అవసరాలలో 10% పూర్తిచేస్తుంది. జోర్డాన్ వార్షికంగా 330 రోజుల సూర్యరశ్మిని అందుకుంటుంది.పర్వతప్రాంతాలలో గాలి వేగం 7 కి.మీ. ఈ కారణంగా 2020 నాటికి కొత్త విధానం ద్వారా 10% విద్యుత్తు తయారు చేయాలని యోచిస్తుంది. జోర్డాన్ హరిత ప్రాంతం 2% మాత్రమే ఉంది. అరణ్యప్రాంతం అతి తక్కువగా ఉన్న దేశాలలో జోర్డాన్ ఒకటి. అంతర్జాతీయ సరాసరి అరణ్యప్రాంతం15%.

రవాణా

జోర్డాన్ 
New Queen Alia International Airport near Amman

పాలస్తీనా ప్రాంతాలు, ఇరాక్ ప్రాంతాలకు సరుకు రవాణా, సేవలు అందిస్తున్న జోర్డాన్ అభివృద్ధి చెందిన రవాణా, ఇంఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలను కలిగి ఉంది. ఇంఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో జోర్డాన్ ప్రపంచంలో 35వ స్థానంలో ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలజాబితాలో జోర్డాన్ ఉన్నతశ్రేణి దేశాలలో ఒకటిగా ఉంది. 2006లో పోర్ట్ ఆఫ్ అక్వాబా " బెస్ట్ కంటెయినర్ టెర్మినల్‌గా " గుర్తింపును పొదింది.

విమానాశ్రయాలు

జోర్డాన్‌లో మూడు విమానశ్రయాలు ఉన్నాయి. ఇవన్ని దేశీయ అంతర్జాతీయ విమానసేవలు అందిస్తున్నాయి. ఇవి రెండు అమ్మాన్‌లో ఉన్నాయి. మూడవది అక్వాబాలో ఉంది. అక్వాబా లోని " కింగ్ హుస్సేన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ " నుండి అమ్మాన్, పలు దేశీయ అంతర్జాతీయ నగరాలకు విమానసేవలు లభిస్తున్నాయి. అమ్మాన్ సివిల్ ఎయిర్ పోర్ట్ దేశంలోని ప్రధాన విమానాశ్రయంగా సేవలు అందిస్తుంది. ఇది క్వీన్ అలియా ఎయిర్ పోర్ట్‌కు తరలిమచబడినప్పటికీ ఇక్కడ నుండి ప్రాంతాలకు విమానసేవలు లభిస్తున్నాయి. క్వీన్ అలియా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ జోర్డాన్ ప్రధాన విమానాశ్రయంగా గుర్తించబడుతుంది. ఇది రాయల్ జోర్డానియన్, ది ఫ్లాగ్ కారియర్ విమానాలకు ప్రధాన కేంద్రస్థానంగా ఉంది. సమీపకాలంలో ఇది ఆధునికీకరణ, విస్తరణ చేయబడింది. పాత టెర్మినల్స్‌ను తొలగించి కొత్త టెర్మినల్స్‌ను నిర్మించి వార్షికంగా 16 మిలియన్ల ప్రయాణీకులు ప్రయాణించడానికి వసతి కల్పించబడింది.

సైంస్, సాంకేతికం

జోర్డాన్ 
A solar charging station in King Hussein Business Park.

సైన్సు, టెక్నాలజీ దేశంలో శీఘ్రగతిలో అభివృద్ధిచెందుతూ ఉంది. ఈ అభివృద్ధి ఇంఫర్మేషన్, కమ్యూనికేషన్ వంటి వివిధ కంపెనీలు, న్యూక్లియర్ టెక్నాలజీల కారణంగా సాధ్యం అయింది. 75% అరబిక్ ఇంటర్నెట్ కాంటెంటుకు జోర్డాన్ భాగస్వామ్యం వహిస్తుంది. ఇంఫర్మేషన్, కమ్యూనికేషన్లు టెక్నాలజీ రంగం వేగవంతంగా అభివృద్ధి చెందుతూ జోర్డాన్ ఆర్థికాభివృద్ధిలో 25% నికి సహకరిస్తుంది. టెక్నాలజీ రగం 84,000 మందికి ఉపాధి కల్పిస్తూ దేశ జి.డి.పి.లో 14% నికి భాగస్వామ్యం వహిస్తుంది. జోర్డాన్‌లో 400 కంపెనీలు ఉన్నాయి. ఐ.టి. ఆన్ లైన్, మొబైల్ కాంటెంట్, ఔట్ సౌర్సింగ్ బిజినెస్, వీడియో గేంస్ రంగం అభివృద్ధి చేయబడింది. 2015-2020 నాటికి ఇంఫర్మేషన్, టెక్నాలజీ ఉపవిభాలలో 18,000 మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. న్యూక్లియర్ సైన్సు, టెక్నాలజీ కూడా విస్తరించబడుతూ ఉంది. 2020 నాటికి క్వాసర్ ఆంరా సమీపంలో దేశం రెండు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు నిర్మించడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం అర్- రంతా నగరంలో ఉన్న జోర్డాన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ కేంపస్‌లో " జోర్డాన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ రియాక్టర్ " నిర్మాణదశలో ఉంది. న్యూక్లియర్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలన్నది ఇది స్థాపించడానికి ప్రధాన కారణంగా ఉంది. జోర్డాన్ " సింక్రోట్రాన్- లైట్ ఫర్ ఎక్స్పరిమెంటల్ సైన్సు అప్లికేషన్ ఇన్ ది మిడిల్ ఈస్ట్ " లోకేషన్‌గా జోర్డాన్ ఎన్నిక చేయబడింది. ఈ ప్రాజెక్టు మిడిల్ ఈస్ట్ పరిశోధకులను రాజకీయసంఘర్షణలకు అతీతంగా సమైక్యం చేయగలదని భావిస్తున్నారు.

శ్రామికులు, ఉపశమనం

1970 - 1980 మద్య కాలంలో జోర్డాన్ అత్యంత నైపుణ్యం కలిగిన శ్రామికులను పర్షియన్, గల్ఫ్ రాజ్యాలకు పంపిస్తూ ఉంది. విదేశాలలో పనిచేస్తున్న ఉద్యోగులు పంపిస్తున్న ధనం, మిగిలిన చెల్లింపులు జోర్డాన్ విదేశీమారక నిల్వలను నియంత్రిస్తూ ఉంది. ప్రపంచబ్యాంక్ నివేదిక ఆధారంగా చెల్లింపులు 2010లో 3 బిలియన్ల అమెరికన్ డాలర్లు ఉన్నాయని అంచనా. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది జోర్డాన్‌ను 10 వ స్థానంలో నిలుపుతూ ఉంది. చెల్లింపులు అధికంగా అందుకుంటున్న 20 దేశాలలో జోర్డాన్ వరుసగా స్థానం పొందుతూ ఉంది. అదనంగా " ది అరబ్ మానిటరీ ఫండ్ " గణాంకాల ఆధారంగా 2010 లో చెల్లింపులు అధికంగా అందుకుంటున్న అరబ్ దేశాలు, లెబనాన్, ఈజిప్ట్‌లలో జోర్డాన్ మూడవ స్థానంలో ఉందని భావిస్తున్నారు. వరల్డ్ బ్యాంక్ నివేదికలు 2015 జోర్డాన్ చెల్లింపులు 3.8 బిలియన్లు చేరుకుంటుందని భావిస్తున్నారు.

గణాంకాలు

జోర్డాన్ 
Graph showing the population of Jordan, 1960–2005

2015 గణాంకాలను అనుసరించి జోర్డాన్ జనసంఖ్య 9,531,712. 2014 జూలై జనసంఖ్య 7,930,491. 2004 గణాంకాలను అనుసరించి 946,000 కుటుంబాలు ఉన్నాయి. సరాసరి కుటుంబసభ్యుల సంఖ్య 5.3. (1994 లో 6) ఉంది. జోర్డాన్ జనసంఖ్య గతశతాబ్దం నుండి అధికరిస్తూనే ఉంది. 1920 లో జోర్డాన్ జనసంఖ్య 2,00,000. 1922 నాటికి అది 2,25,000 కు చేరింది. 1948 నాటికి 4.00,000 కు చేరింది. 1922 లో జోర్డాన్ ప్రజలలో సగం మంది (1,03,000) నోమాడ్స్ ఉన్నారు. 1946లో జోర్డాన్‌లో 10,000 జమంఖ్య కంటే అధికంగా కలిగిన రెండు నగరాలు ఉన్నాయి; అమ్మాన్ (65,754), సాల్ట్ (14,479). తరువాత పాలస్తీనా నుండి ప్రజలు శరణార్ధులుగా వరదలా వచ్చి చేరారు. 1952 నాటికి అమ్మాన్ నగర జనాభా 108,412 అయింది. అలాగే ఇర్బిద్, జర్బా నగరాల జనాభా రెండింతలు అయింది. 10,000 కంటే తక్కువ జనసంఖ్య కలిగిన నగరాల జనసంఖ్య వరుసగా 23,000, 28,000. పరిశోధకులు జోరాడియన్లు అస్సిరియన్ సంతతికి సమీపంగా ఉంటారని భావిస్తున్నారు.

శరణార్ధులు, వలసప్రజలు

జోర్డాన్ 
Aerial view of a portion of the Zaatari refugee camp which only contains a population of 80,000 Syrian refugees.

2007లో జోర్డాన్‌లో 7,00,000 - 10,00,000 మంది ఉండేవారు. ఇరాక్ యుద్ధం తరువాత పలువురు అస్సిరియన్ క్రైస్తవులు ఇరాక్ నుండి జోర్డాన్ చేరారు. వీరిలో కొందరు తాత్కాలికంగా మరి కొందరు శాస్వతంగా జోర్డాన్‌లో స్థిరపడ్డారు. వారు దాదాపు 5,00,000 మంది ఉన్నారు. 2006 ఇజ్రాయిల్ - లెబనాన్ యుద్ధం తరువాత లెబనాన్ ప్రజలు 15,000 మంది జోర్డాన్ చేరుకున్నారు. 2012 సిరియన్ అంతర్యుద్ధం కారణంగా హింస నుండి తప్పించుకోవడానికి 5,00,000 మంది శరణార్ధులు జోర్డాన్‌కు చేరుకున్నారు. జోర్డాన్ ప్రజలలో అరేబియన్లు 95-97% ఉన్నారు. అస్సిరియన్ క్రైస్తవులు 1,50,000 మంది ఉన్నారు. కుర్దులు 30,000, అస్సిరియన్ల మాదిరిగా పలువురు శరణార్ధులు ఇరాక్, ఇరాన్, టర్కీ నుండి వస్తున్నారు. ఆర్మేనియన్లు సుమారుగా 5,000 మంది ఉన్నారు. వీరు ప్రధానంగా అమ్మాన్ నగరంలో నివసిస్తున్నారు. జోర్డాన్‌లో 1.2 మిలియన్ల మంది చట్టవిరోధంగా జోర్డాన్‌లో శ్రామికులుగా ఉన్నారు. 5,00,000 చట్టపరంగా అనుమతి పొంది జోర్డాన్‌లో పనిచేస్తున్నారు. అదనంగా వేలాది మంది విదేశీ మహిళలు దేశం అంతటా ఉన్న నైట్ క్లబ్బులు, హోటెల్స్, బార్లలో పనిచస్తున్నారు. వీరిలో అధికంగా మిడిల్ ఈస్ట్, ఈస్టర్న్ ఐరోపా ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.

జోర్డాన్ 
Jordan in its surroundings

అమెరికన్, యురేపియన్ బహిస్కృత ప్రజలు పెద్ద సంఖ్యలో జోర్డాన్‌లో కేంద్రీకృతమై ఉన్నారు. వీరు అధికంగా రాజధానిలో నివసిస్తూ ఉన్నారు. పలు అంతర్జాతీయ ఆర్గనైజేషన్లు, డిప్లొమేటిక్ మిషన్ల కార్యాలయ శాఖలు అమ్మాన్ నగరంలో ఉన్నాయి. 2008 గణాంకాల ఆధారంగా జోర్డాన్‌లో 19,51,603 పాలస్తీనియన్లు ఉన్నారని అంచనా. వీరిలో అత్యధికులు పాలస్తీనియన్ జోర్డాన్ పౌరులుగా గుర్తించబడుతున్నారు. వీరిలో 3,38,000 మంది ఉనర్వాలో శరణార్ధుల కేంపులలో నివసిస్తున్నారు. జోర్డాన్ వేలాది పాలస్తీన్ పౌరసత్వాన్ని రద్దు చేసింది. వెస్ట్ బ్యాంక్ పాలస్తీనియన్ కుటుంబాలకు యెల్లో కార్డులద్వారా గుర్తింపు కార్డులు ఇస్తారు. వీటికి జోర్డాన్ పౌరులతో సమానమైన హక్కులు ఉంటాయి. జోర్డాన్ లోని పాలస్తీనియన్లు అందరూ ఇలాంటి అనుమతి పత్రాలను కోరుకుంటారు.

సిరియన్ రెఫ్యూజీ క్రైసిస్ వ్యయంలో 63% జోర్డాన్ భరిస్తుంది. 2015 జోర్డానియన్ గణాంకాలు ఆధారంగా 12,65,000 మంది సిరియన్లు, 6,36,270 ఈజిప్షియన్లు, 1,30,911 మంది ఇరాకీలు 31,163 యెమనీలి, 22,700 మంది లిబియన్లు, 1,97, 385 ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు.

భాషలు

అధికారభాష అయిన " మోడర్న్ స్టాండర్డ్ అరాబిక్ " పాఠశాలలలో బోధనాభాషగా ఉంది. జోర్డానియన్ అరాబిక్ మాండలికాలు అత్యధికమైన జోర్డానియన్లకు వాడుక భాషగా ఉంది. నాన్ స్టాండర్డ్ అరబిక్ భాష మీద ఆంగ్లం, ఫ్రెంచ్, టర్కిష్ భాషల ప్రభావం ఉంది. జోర్డానియన్ సంకేతభాష చెవిటివారి భాషగా ఉంది. ఆంగ్లభాష అధికార హోదా లేకున్నా దేశమంతటా వాడుకలో ఉంటూ వ్యాపారం, బ్యాంకింగ్ రంగంలో వాడుకలో ఉంది. విద్యారంగంలో ఆంగ్లం ముఖ్యత్వం కలిగి ఉంది. విశ్వవిద్యాలయ స్థాయి తరగతులన్నింటిలో ఆంగ్లం బోధనా భాషగా ఉంది. చెన్‌చెన్, సికాదియన్, అత్మేనియన్, తగలగ్, రస్యన్ భాషలు వారివారి కమ్యూనిటీలలో వాడుకభాషలుగా ఉన్నాయి. పలు ప్రభుత్వ పాఠశాలలలో ఆంగ్లభాష, అరబిక్ బోధనా భాషగా ఉంటుంది.పలు ప్రైవేట్ పాఠశాలలలో ఫ్రెంచ్ భాష కూడా బోధించబడుతుంది.రాజధాని నగరంలో ఎళ్'ఎకోల్ ఫ్రాంచియాస్ డీ'అమ్మాన్, లిసీ ఫ్రాంచియాస్ డీ'అమ్మాన్ పాఠశాలలు ప్రాబల్యత కలిగి ఉన్నాయి. పురాతన కాలంలో ఫ్రెంచ్ భాషకు ప్రాధాన్యత లేకున్నా ప్రస్తుతం జోర్డాన్‌లో ఫ్రెంచ్ భాషకు ప్రజాదరణ ఉంది. విద్యారంగంలో, ప్రజాదరణ కలిగిన భాషలలో జర్మన్ కూడా ఒకటి. జర్మన్ జోర్డాన్ విశ్వవిద్యాలయంలో జర్మన్ ప్రధానభషగా ఉంది. అమ్మాన్‌లోని జర్మన్ ప్రొటెస్టెంట్ల దైనందిక జీవితం, ఉత్సవాలలో జర్మన్ భాష వాడుకలో ఉంది.

మాధ్యమం

జోర్డాన్ మాద్యమంలో ఆంగ్లభాషకు ప్రాధాన్యత అధికంగా ఉంది. ప్రాంతీయ టి.వి. ప్రదర్శనలో బ్రిటిష్, అమెరికన్ కార్యక్రమాలు, చలన చిత్రాలు ప్రదర్శ్ంచబడుతూ ఉంటాయి. ఈజిప్షియన్ అరబిక్ చాలాప్రాధాన్యత కలిగి ఉంది. దేశమంతటా పలు ఈజిప్షియన్ చలనచిత్రాలు ప్రదర్శించబడుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి స్వంతమైన " జోర్డానియన్ టి.వి." ప్రదర్శనలు, వార్తలు అరబిక్, ఆంగ్లం, ఫ్రెంచ్ భాషలో ప్రదర్శించబడుతుంటాయి. జోర్డాన్ రేడియో రేడియో సర్వీసెస్ అరబిక్, జోర్డానియన్ మాండలికాలు, ఆంగ్లం, ఫ్రెంచ్ భాషలలో ప్రసరించబడుతూ ఉంటాయి. ఆగ్లభాష ప్రదర్శించబడే సమయంలో అరబిక్, ఫ్రెంచ్ భాషలలో సబ్ టైటిల్స్ ప్రదర్శించబడుతూ ఉంటాయి.

మతం

Religion in Jordan (CIA World Factbook)
Religion Percent
Muslim
  
92%
Christian
  
6%
Other
  
2%
జోర్డాన్ 
An Orthodox church seen with snow in Amman.
జోర్డాన్ 
Marsa Zayed mosque in Aqaba

జోర్డాన్‌లో సున్నీ ముస్లిములు అధికంగా ఉన్నారు. దేశజనసంఖ్యలో ముస్లిములు 92% ఉన్నారు. వీరిలో 93% తమను సున్నీముస్లిములుగా చెప్పుకుంటున్నారు. " ప్యూ రీసెర్చి సెంటర్ " పరిశోధన ఆధారంగా ప్రపాంచంలో ఇది అత్యధికశాతం అని భావిస్తున్నారు. దేశంలో స్వల్పసంఖ్యలో అహమ్మదీయ ముస్లిములు ఉన్నారు. దేశం కొన్నిమార్లు అల్పసంఖ్యాకులకు రక్షణ కల్పించడంలో విఫలమౌతూ ఉంటుంది. ముస్లిములు ఇతర మతాలకు మారుతూ ఉన్నారు. మిషనరీలు తరచుగా వివక్షకు గురౌతూ ఉన్నారు. జోర్డాన్‌లో 6% క్రైస్తవులు ఉన్నారు. 1950లో 30% ఉన్న క్రైస్తవుల శాతం ప్రస్తుతం 6% నికి పతనం అయింది. ముస్లిములు అధిక సంఖ్యలో జోర్డాన్‌కు వలస రావడం, క్రైస్తవులు అత్యధిక సంఖ్యలో పశ్చిమ దేశాలకు తరలిపోవడం, ముస్లిములలో హననాల సంఖ్య అధికంగా ఉండడం ఇదుకు ప్రధానకారణంగా ఉంది. క్రైస్తవులు సంప్ర్దాయంగా జోర్డాన్‌లో రెండుక్యాబినెట్ పదవులను కలిగిఉన్నారు. అలాగే 150 పార్లమెంటు స్థానాలలో 9 స్థానాలు ముస్లిముల ఆధీనంలో ఉన్నాయి. క్రైస్తవులు అత్యధిక స్థానమైన ప్రధానమంత్రి పదవీ బాధ్యత వహిస్తున్నారు. 2005 నుండి ఉపప్రధాని పదవిని " మర్వన్ అల్ - మౌషర్ " వహిస్తున్నాడు. క్రైస్తవులు మాధ్యమంలో ఆధిక్యత వహిస్తున్నారు. ప్రముఖ జోర్డాన్ టి.వి. చానల్స్‌లో క్రైస్తవులకు స్వంతమైన " రాయల్ టి.వి " ఒకటి. అరబేయన్ క్రైస్తవులకు " వెస్టర్న్ - ఓరియంటెడ్ ఎజ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఫారెన్ లాంగ్యుయేజ్ " సహకరిస్తుంది. క్రైస్తవులు వ్యాపారంలో కూడా ఆధిక్యత కలిగి ఉన్నారు. " 1987 వెస్టర్న్ ఏంబసీ " అభిప్రాయం అనుసరించి దేశంలోని సగం కంటే అధికమైన వాణిజ్యం క్రైస్తవుల ఆధీనంలో ఉందని భావిస్తున్నారు. అక్వాబాలో ప్రపంచపు మొదటి " పర్పస్- బుల్ట్ చర్చి " నిర్మించబడింది. అమ్మాన్ లోని 16 చర్చీలు ప్రపంచవారసత్వ సంపదగా (ఉమ్మ అర్ - రసాస్) గుర్తించబడుతున్నాయి. ఇతర అల్పసంఖ్యాక మతాలలో డ్రుజ్, బహై మతాలు ప్రధానమైనవి. జోర్డానియన్ డ్రుజ్ మతస్థులు అధికంగా అజ్రగ్‌, సిరియన్ సరిహద్దులోని కొన్ని గ్రామాలు, జర్క్వా నగరంలో ఉన్నారు. జోర్డానియన్ బహై మతస్థులు అడస్సియా గ్రామంలో (జోర్డానియన్ రిఫ్ట్ లోయాప్రాంతం) లో నివసిస్తున్నారు.

సంస్కృతి

జోర్డాన్ 
Jordanian military marching band playing at Jerash

ఆధునిక కాలంలో జోర్డాన్‌ సొసైటీలో మతం, సంప్రదాయం ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అంతర్జాతీయకరణ కారణంగా జోర్డాన్ సంప్రదాయం ఊగిసలాడుతూ ఉంది. అరేబియన్ దేశాలలలో అత్యంత నాగరికమైన, స్వతంత్రదేశంగా జోర్డాన్ గుర్తించబడుతుంది.

కళలు

జోర్డాన్ లోని కళాసంస్థలు నాటకాలు, విషయుయల్ ఆర్ట్స్ రూపంలో ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉన్నాయి. జోర్డాన్ కళావైభం చిత్రలేఖనము, వీడియో, ఛాయాచిత్రాలు, శిల్పకళ, గ్రాఫిక్ కళ, సెరామిక్స్ మొదలైన పలురూపాలలో ప్రదర్శితమౌతూ ఉంది. సమకాలీన ప్రధాన ఆర్ట్ మ్యూజియం జోర్డాన్ నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ జోర్డాన్ రాజధాని అమ్మన్ నగరంలో ఉంది. 2016 జనవరి మొదటి సారిగా " థీబ్" అనే జోర్డాన్ చిత్రం " 88వ అకాడమీ అవార్డ్స్ ఫర్ బెస్ట్ ఫారిన్ లాంగ్యుయేజ్ ఫిం "గా ప్రతిపాదించబడింది.

మ్యూజియంలు

జోర్డాన్‌లోని " జోర్డాన్ ఆర్కియాలజికల్ మ్యూజియం " దేశంలో అతి పెద్ద మ్యూజియంగా గుర్తించబడుతుంది. ఇందులో దేశంలో లభించిన విలువైన పురాతత్వ వస్తువులు బధ్రపరచబడి ఉన్నాయి. వీటిలో " డెడ్ సీ స్క్రోల్స్ ", నియోలిథిక్ లైం స్టోన్ స్టాచ్యూస్ (అయిన్ గజల్), చిల్డ్రన్ మ్యూజియం; జోర్డాన్, మార్టిస్ మెమోరియల్ ఎండ్ మ్యూజియం, రాయల్ ఆటోమొబైల్ మ్యూజియం, ప్రొఫెట్ మొహమ్మద్ మ్యూజియం, మ్యూజియం ఆఫ్ పార్లిమెంటరీ లైఫ్, జోర్డాన్ ఫోల్క్లోర్ మ్యూజియం, యూనివర్శిటీ ఆఫ్ జోర్డాన్ వద్ద ఉన్న మ్యూజియం మొదలైనవి ఉన్నాయి. అమ్మన్ నగరానికి వెలుపల అక్వాబా ఆర్కియాలాజికల్ మ్యూజియం, జెరాష్ ఆర్కియాలాజికల్ మ్యూజియం, మడబ ఆర్కియాలాజికల్ మ్యూజియం, లా స్టోరియా మ్యూజియం, పెత్రా ఆర్కియాలాజికల్ మ్యూజియం, అల్- సాల్ట్ ఫీల్క్లోర్ మ్యూజియం, న్యూమిస్మాటిక్స్ మ్యూజియం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ జోర్డాన్ అండ్ మ్యూజియం ఆఫ్ జోర్డాన్ హెరిటేజ్ మొదలైనవి ఉన్నాయి.

సంగీతం

జోర్డాన్ 
Bedouin man playing the Rebab in Jordan 1940

ప్రస్తుతం జోర్డాన్‌లో సంగీతం అభివృద్ధి దశలో ఉంది. కొత్తగా సంగీతకారులు, కళాకారులు ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో కూడా ప్రాబల్యత కలిగి ఉన్నారు. సంగీతకారుడు, దర్శకుడు టోని క్వాట్టన్, సంగీతకారుడు హని మెత్వసి (ఈయన దీర్ఘకాలంగా జోర్డాన్‌లో ప్రజాదరణ కలిగిన సంగీతంలో సరికొత్త మార్పులు తీసుకువచ్చాడు) ఉన్నారు. జోర్డానుకు చెందిన జె.ఎ.డి.ఎ.ఎల్, ఎ.ఐ. మొరబ్బ3, ఆటోస్టార్డ్, అయ్లౌల్, ఇతర బృందాలు అరబ్ ప్రంపంచంలో గుర్తింపును కలిగి ఉన్నాయి. జోర్డానియన్ పియానిస్ట్, సంగీతదర్శకుడు " జాడే దిరాని " అంతర్జాతీయ గుర్తింపును కలిగి ఉన్నాడు. జోర్డాన్ సంప్రదాయ సంగీతపరికరాలలో రెబాబ్ ప్రధానమైనది.

  1. రానియా కుర్ది: జోర్డాన్ కు చెందిన గాయకురాలు, నటి, టెలివిజన్ వ్యాఖ్యాత.

మాధ్యమం

జోర్డాన్ మాధ్యమం స్వతంత్రంగా పనిచేయగలిగిన మాధ్యమాలు కలిగిన 19 మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికన్ దేశాలలో 5వ స్థానంలో ఉంది. పరిమితులు లేని స్వేచ్ఛతో పనిచేస్తున్న పాత్రికేయులను కలిగిన 178 దేశాలలో జోర్డాన్ 120 వ స్థానంలో ఉంది. అలాగే 20 మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికన్ దేశాలలో జోర్డాన్ 5వ స్థానంలో ఉంది. అత్యధిక స్వేచ్ఛకలిగిన మాధ్యమాలలో జోర్డాన్ 37 వ స్థానంలోను అత్యల్ప స్వేచ్ఛకలిగిన మాధ్యమాలలో 105వ స్థానంలోనూ ఉంది. ప్రబల జోర్డాన్ వార్తాపత్రికలలో అమ్మాన్ న్యూస్, ఎ.డి- డస్టర్ (జోర్డాన్), జోర్డాన్ టైంస్ ప్రధానమైనవి. ప్రబల టి.వి. స్టేషన్లలో రో'య టి.వి, జోర్డాన్ రేడియో, జోర్డాన్ రేడియో, టెలివిషన్ కార్పొరేషన్ ప్రధానమైనవి.

ఆహారం

జోర్డాన్ 
Jordanian Meze (Appetizers)

ప్రపంచంలో ఆలివ్ అత్యధికంగా పండిస్తున్న దేశాలలో జోర్డాన్ ఒకటి. ఆలివ్ ఆయిల్‌ను జోర్డాన్ ప్రజలు ప్రధాన వంటనూనెగా వాడుతుంటారు. మూలికలు, తెల్లగడ్డ, మసాలా దినుసులు, ఎర్రగడ్డ సాస్,టమేటా, నిమ్మ జోర్డాన్ ఆహారతయారీలో ఉపయోగించబడుతుంటాయి. జోర్డానియన్ ఆహారం అధిక కారం, స్వల్పంగా మసాలాలు కలిపి తయారుచేయబడుతుంది. ఆకలిని అధికంచేసే ఆహారాలలో హుమ్మూస్ ప్రధానమైనది. శనగల పేస్టును తహిని (నువ్వుల పొడి), తెల్లగడ్డ, నిమ్మ కలి తయారు చేయబడే ఆహారాన్ని హుమ్ముస్ అంటారు. జోర్డాన్‌లో ప్రధాన ఆహారాలలో ఫుల్ మెడాంస్ మరొకటి. శ్రామికుల ఆహారాలలో మెజ్జె, కెబ్బా, లభనెష్, బాబా ఘనౌష్, టబ్బౌలెహ్, ఆలివ్స్, దోస ఊరగాయ ప్రధానమైనవి. జోర్డానియన్ నేషన్ల్ డిష్ " మాంసాఫ్ " దాతృత్వం జోర్డానియన్ సంప్రదాయ చిహ్నంగా ఉంటుంది. జోర్డానియన్ ఆహారం అందించిన తరువాత తాజా పండును అందివ్వడం జోర్డాన్ సంప్రదాయాలలో ఒకటి. బక్లవా, హరీసెహ్, క్నాఫె, హల్వా, క్వాటయె (రంజాన్ సందర్భంలో చేసే ప్రత్యేమైన ఆహారం) మొదలైనవి జోర్డాన్ భోజనాంతర ఆహారాలలో ప్రధానమైనవి. అతిథి అభ్యాగతులకు పుదీనా మొదలైన రుచులతోబ్చేర్చిన కాఫీ, టీ అందివ్వడం జోర్డాన్ సంప్రదాయాలలో ఒకటి. మెజె (జోర్డానియన్ భోజనం)తో మధ్యధరాసముద్ర ప్రాంతీయ " అరక్" అనే మత్తుపానీయం అందించబడుతుంది. అరక్ అంటే సోంపు వాసనతో తయారు చేయబడే ద్రాక్షారసం. మెజెలో అందించే ఆహారాలను మత్తుపానీయం లేకుండా విడివిడిగా అందిస్తారు. వీటిని " ముకాబిలత్" అంటారు.

క్రీడలు

జోర్డాన్‌లో ప్రజాదరణ కలిగిన క్రీడలలో అసోసియేషన్ ఫుట్‌బాల్ ప్రధానమైనది. ఖల్డా నుండి అల్ హిషిమి జనూబియాల్ వరకు ఉన్న అన్ని ప్రాంతాలలో ప్రతివీధిలో ప్రజలు ఫుట్‌బాల్ ఆడుతూ ఉంటారు. జోర్డాన్‌లో ఫుట్‌బాల్ క్రీడ పట్ల ఆదరణ అధికం ఔతూనే ఉంది. సమీపకాలంలో జోర్డాన్ నేషనల్ ఫుట్‌బాల్ టీం అభివృద్ధి చేయబడుతూ ఉంది. 2004 సెంప్టెంబర్ " ఎఫ్.ఎఫ్.ఎ. " వర్గీకరణలో జోర్డాన్ నేషనల్ ఫుట్‌బాల్ టీం 37వ స్థానంలో ఉంది. లిటిల్ లీగ్స్, యూత్ క్లబ్బులు ఫుట్‌బాల్ సంబంధితమై ఉన్నాయి. వీటిలో కొన్ని " జోర్డాన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ " పర్యవేక్షణలో ఉన్నాయి.

జోర్డాన్‌లో ప్రజాదరణలో అభివృద్ధి చెందుతున్న క్రీడలలో రగ్బీ ఒకటి. దీనిని అనేమంది ప్రజలు వీటిలో పాల్గొనడం, సందర్శించడం చేస్తూ ఉంటారు. జోర్డాన్‌లో నేషనల్ రగ్బీ టీంలు ఉన్నాయి. అమ్మన్‌లోని రెండు టీంలు (రగ్బీ క్లబ్ అమ్మన్ సిటాడెల్, నోమాడ్స్) పెత్రా యూనివర్శిటీలో ఆడుతూ ఉన్నాయి. అక్వాబాలో " అక్వాబా షార్క్స్ " రగ్బీ క్లబ్ ఉంది. సైక్లింగ్ జోర్డాన్‌లో ప్రజాదరణ లేనప్పటికీ జోర్డాన్ ప్రజాజీవితంలో సైక్లింగ్ ఒక భాగంగా మారుతూ ఉంది. యూత్ సైక్లింగ్ ద్వారా దేశంలో పర్యటించడం పట్ల ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. 2014లో జర్మని నాన్- ప్రాఫిట్ ఆర్గనైజేషన్ " మేక్ లైఫ్ సేక్ లైఫ్ " సెవెన్ హిల్స్ స్కేట్ పార్క్ నిర్మాణం పూర్తిచేసింది. 650 చ.మీ. వైశాల్యంలో కాంక్రీటుతో నిర్మించబడిన స్కేట్ పార్క్ అమ్మన్ డౌన్‌టౌన్ లోని సమీర్ రిఫై పార్క్‌లో ఉంది. జోర్డాన్ బాస్కెట్ బాల్ కూడా అభివృద్ధి చేయబడుతూ ఉంది. జోర్డాన్ నేషనల్ బాస్కెట్ బాల్ టీంకు జైన్ గ్రూప్ సహాయం అందిస్తూ ఉంది. ఇది పలు అరబ్, మిడిల్ ఈస్ట్ బాస్కెట్ బాల్ పోటీలలో పాల్గొంటూ ఉంది. జోర్డాన్ ప్రాంతీయ బాస్కెట్ బాల్ క్రీడా బృందాలలో అల్- ఆర్థడాక్సీ క్లబ్, అల్- రియాదీ, జైన్, అల్- హుస్సైన్, అల్- జజీరా టీంలు మొదలైనవి ప్రధానమైనవి.

ఆరోగ్యం

జోర్డాన్ ఆరోగ్య సంరక్షణా విధానం ఈ ప్రాంతంలోని ఉత్తమమైన ఆరోగ్యసంరక్షణా విధానాలలో ఒకటిగా భావిస్తున్నారు. 2002 గణాంకాలు ప్రభుత్వం జి.డి.పి.లో 7.5% ఆరోగ్యసంరక్షణ కొరకు వ్యయం చేస్తూ ఉంది. ఇంటర్నేషనల్ హెల్ట్ ఆర్గనైజేషంస్ నివేదికలు 9.3% వ్యయంచేస్తున్నట్లు భావిస్తుంది. వరల్డ్ ఫాక్ట్ బుక్ అంచనా అనుసరించి జోర్డాన్ పౌరుల ఆయుఃప్రమాణం 80:18. ఇది ఈ ప్రాంతంలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఇజ్రాయిల్లో ఉంది. 2011 లో " ది హూ " అంచనా అనుసరించి జోర్డాన్ ఆప్రమాణం 73.0 అని తెలిపింది. 2000-2004 గణాంకాల ఆధారంగా 100,000 మందికి 203 వైద్యులు ఉన్నారని భావిస్తున్నారు. జోర్డాన్ ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు బాధ్యత వహిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో హెల్త్ మినిస్టరీ 1,245 ఆరోగ్యసంరక్షణా కేంద్రాలను, 27 ఆసుపత్రులను (37% ఆసుపత్రి పడకలు) నిర్వహిస్తుంది. మిలటరీ రాయల్ మెడికల్ సర్వీసెస్ 11 ఆసుపత్రులను (24% ఆసుపత్రి పడకలు) నిర్వహిస్తుంది. ప్రజలకు వైద్యసేవలను అందించడంలో జోర్డాన్ యూనివర్శిటీ హాస్పిటల్ (3% ఆసుపత్రి పడకలు) తనవంతు పాత్ర వహిస్తుంది. ప్రైవేట్ రంగంలో 56 ఆసుపత్రులు (36% ఆసుపత్రి పడుకలు) ఉన్నాయి. 2007 జూన్ 1న " కింగ్ హుస్సేన్ కేంసర్ సెంటర్ " కేంసర్ వ్యాధిగ్రస్తులకు గణనీయంగా వైద్య సేవలు అందిస్తుంది. 70% ప్రజలకు మెడికల్ ఇంసూరెంస్ సౌకర్యం ఉంది. 15 సంవత్సరాలుగా బాలల రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతూ ఉంది. 2002 నాటికి రోగనిరోధక వ్యాక్సిన్ 95% పిల్లలను (5 సంవత్సరాల లోపు పిల్లలు) చేరింది. ప్రభుత్వ గణాంకాల ఆధారంగా 1950 నుండి సంరక్షిత త్రాగునీరు 10% ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం అది 99% నికి చేరింది.

విద్య

జోర్డాన్ 
Medical halls of Jordan University of Science and Technology as seen with the university hospital in the background.

2013 గణాంకాల ఆధారంగా అక్షరాస్యత శాతం 97%. జోర్డానియన్ విద్యావిధానంలో 2 సంవత్సరాల ప్రీ పాఠశాల విద్య, 10 సంవత్సరాల నిర్భంధ విద్య, రెండు సంవత్సరాల సెకండరీ విద్య లేక ఒకేషనల్ విద్య భాగంగా ఉన్నాయి. లింగ వివక్షరహిత విద్యావిధానం కలిగిన 94 దేశాలలో జోర్డాన్ 18వ స్థానంలో ఉంది. 20.5% జోర్డాంస్ ప్రభుత్వ మొత్తం వ్యయంలో 20.5% విద్య కొరకు వ్యయం చేయబడుతుంది. టర్కీ 2.5%, సిరియా 3.86% వ్యయంచేస్తుంది. సెకండరీ పాఠశాల ప్రవేశాలు 63% నుండి 97% చేరుకుంది. ఉన్నత విద్యాలయాల ప్రవేశం 79% నుండి 85% నికి చేరింది. మిలియన్ ప్రజలలో 2,000 రీసెర్చర్లు ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఒక మిలియన్ ప్రజలలో 5,000 పరిశోధకులు ఉన్నారు. 2011 గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్ లో జోర్డాన్ 3 వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో కతర్, యునైటెడ్ అరబ్ దేశాలు ఉన్నాయి. జోర్డాన్‌లో 10 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, 16 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, 54 కమ్యూనిటీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 14 ప్రభుత్వానికి చెందినవి 24 ప్రైవేట్ రంగానికి చెందినవి ఉన్నాయి. మిగిలినవి జోర్డానియన్ ఆర్ండ్ ఫోర్సెస్, ది సివిల్ డిఫెంస్ డిపార్ట్మెంట్, ది మినిస్టరీ ఆఫ్ హెల్త్, యు.ఎన్.ఆర్.డబల్యూ.ఎకి చెందినవి. 2,00,000 మంది జోర్డానియన్ విద్యార్థులు వార్షికంగా విశ్వవిద్యాలయాలలో ప్రవేశిస్తున్నారు. అదనంగా 20,000 మంది జోర్డానియన్ విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్, యు.కె లలో ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారు. జోర్డాన్ పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు నిలయంగా ఉంది. వీటిలో జర్మన్ - జోర్డానియన్ యూనివర్శిటీ, కొలంబియా యూనివర్శిటీ, డెల్ పౌల్ యూనివర్శిటీ, అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ మదబ ఉన్నాయి. వెంబ్ మెట్రిక్స్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్శిటీస్ జోర్డాన్ లోని యూనివర్శిటీ ఆఫ్ జోర్డాన్ (అంతర్జాతీయంగా 1,507 వ స్థానం), యార్మౌక్ యూనివర్శిటీ (2,165వ స్థానం), ది జోర్డాన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్సు & టెక్నాలజీ (2,335) ఉన్నాయి. 2014 లో ఉత్తమ అరేబియన్ విశ్వవిద్యాలయాలుగా ఎన్నికైన 10 విశ్వఫ్యాలయాలలో రెండు జోర్డాన్‌లో ఉన్నాయి. వీటిలో యూనివర్శిటీ ఆఫ్ జోర్డాన్ (8వ స్థానంలో ), జోర్డాన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ (10వ స్థానంలో ఉంది) ఉన్నాయి. ఇంటర్నెట్ - వైస్ జోర్డాన్ ఇతర అరబ్ దేశాలలో 75% భాగస్వామ్యం వహిస్తుంది.

పర్యావరణ విద్య

సహస్రాబ్ధికి ముందు పర్యావరణ విద్య పాఠశాల విధానంలో ప్రవేశపెట్టడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. 2000 చివరిలో జోర్డాన్ పాఠశాలలలో పలు పర్యావరణ విద్యా కార్యక్రమాలను ఆరంభించింది. " ది రాయల్ మేరిన్ కంసర్వేషన్ సొసైటీ ఆఫ్ జోర్డాన్ " పర్యావరణ విద్యా ఫౌండేషన్ కొరకు నిధులు సమకూర్చింది. వీటితో ఎకో పాఠశాలలు ఇంటర్నేషనల్ ప్రోగ్రాం, క్లైమేటివ్ ఇంషియేటివ్ ప్రోగ్రాం ఆరంభించారు. జె.ఆర్.డి.ఎస్. క్లైమేటివ్ ఇంషియేటివ్ ప్రోగ్రాం అన్ని పాఠశాలలు‌కు విస్తరించారు.

  • అమ్మన్‌లో విద్యార్థులు గ్రీన్ జనరేషన్ వర్క్ షాపులకు పంపబడ్డారు.
  • ఐక్యరాజ్యసమితి కూడా ఇందులో భాగస్వామ్యం వహించింది. 15 గంటల ఈ కార్యక్రమంలో మూడు భాగాలు ఉంటాయి: కల్చర్ ఆఫ్ కేర్, వాటర్ ఫర్ లైఫ్ అండ్ రెడ్యూస్, రెస్క్యూ, రిసైకిల్.
  • 2009 లో ది రాయల్ సొసైటీ ఫర్ ది కంసర్వేటివ్ ఆఫ్ నేషన్ " ఒక ప్రాజెక్టును తయారు చేసింది. ఇందులో విద్యార్థులకు మూలికలు, ఔషధ మొక్కలు ముఖ్యత్వం పెంపకం గురించి వివరిస్తారు.

ఆర్.ఎస్.సి.ఎన్. మెడిసినల్ అండ్ హెర్బల్ ప్లాంట్ ప్రాజెక్ట్‌లో రెండు భాగాలు ఉన్నాయి.

ఇవీ చూడండి

మూలాలు/ఆధారాలు

Tags:

జోర్డాన్ పేరువెనుక చరిత్రజోర్డాన్ చరిత్రజోర్డాన్ భౌగోళికంజోర్డాన్ రాజకీయాలు, ప్రభుత్వంజోర్డాన్ చట్టంజోర్డాన్ విదేశీ సంబంధాలుజోర్డాన్ సైన్యంజోర్డాన్ నిర్వహణా విభాగాలుజోర్డాన్ మానవహక్కులుజోర్డాన్ ఆర్ధికంజోర్డాన్ పర్యాటకంజోర్డాన్ సహజ వనరులుజోర్డాన్ రవాణాజోర్డాన్ సైంస్, సాంకేతికంజోర్డాన్ శ్రామికులు, ఉపశమనంజోర్డాన్ గణాంకాలుజోర్డాన్ సంస్కృతిజోర్డాన్ ఆరోగ్యంజోర్డాన్ విద్యజోర్డాన్ ఇవీ చూడండిజోర్డాన్ మూలాలుఆధారాలుజోర్డాన్ఇజ్రాయేల్ఇరాక్పాలస్తీనాసిరియాసౌదీ అరేబియా

🔥 Trending searches on Wiki తెలుగు:

కె.బాపయ్యఏనుగువిద్యబంగారు బుల్లోడుజాతీయ ప్రజాస్వామ్య కూటమిపొంగులేటి శ్రీనివాస్ రెడ్డితెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాశ్రీ కృష్ణదేవ రాయలుభారతదేశ జిల్లాల జాబితాఉత్తరాషాఢ నక్షత్రముయేసునవగ్రహాలు జ్యోతిషంసప్త చిరంజీవులుకూన రవికుమార్నారా చంద్రబాబునాయుడుఇన్‌స్టాగ్రామ్సమాసంజనసేన పార్టీకల్వకుంట్ల చంద్రశేఖరరావుతెలుగుఅమెజాన్ (కంపెనీ)అమెరికా సంయుక్త రాష్ట్రాలుగోదావరిఛత్రపతి శివాజీప్లీహముఅంగచూషణమదర్ థెరీసాస్వామి వివేకానందపెమ్మసాని నాయకులుసుధ (నటి)2019 భారత సార్వత్రిక ఎన్నికలువందేమాతరంగూగుల్వృశ్చిక రాశితమిళ అక్షరమాలమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంగుంటూరు కారంభారతదేశంలో సెక్యులరిజంతెలుగు నెలలునర్మదా నదిలావు రత్తయ్యమొఘల్ సామ్రాజ్యంకేంద్రపాలిత ప్రాంతంమమితా బైజుఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిఘట్టమనేని కృష్ణదత్తాత్రేయకుటుంబంఇందిరా గాంధీఫజల్‌హక్ ఫారూఖీగర్భాశయముఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుసచిన్ టెండుల్కర్మౌర్య సామ్రాజ్యంశ్రీనాథుడుఆంధ్రప్రదేశ్ చరిత్రరామాయణంవేపపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్అయోధ్యషరియాతహశీల్దార్తాటి ముంజలుమాగుంట శ్రీనివాసులురెడ్డిభీమా (2024 సినిమా)సాక్షి (దినపత్రిక)గన్నేరు చెట్టుశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముపూర్వాభాద్ర నక్షత్రముభారత జాతీయగీతంభారత జాతీయపతాకంకేతిరెడ్డి పెద్దారెడ్డితాటిరోహిణి నక్షత్రంనువ్వులుఏప్రిల్ 25సంధ్యావందనంలగ్నం🡆 More