ఇజ్రాయిల్

ఇస్రాయీల్ (ఆంగ్లం : Israel ( (హిబ్రూ భాష :יִשְרָאֵל, యిస్రా-యెల్), (అరబ్బీ భాష : إسرائيل), అధికారికనామం ఇస్రాయీల్ రాజ్యం, హిబ్రూ భాష :מְדִינַת יִשְרָאֵל, (మదీనత్ ఇస్రాయీల్), అరబ్బీ భాష: دَوْلَةْ إِسْرَائِيل (దౌలత్ ఇస్రాయీల్).

ఈ దేశం నైఋతి-ఆసియా లేదా పశ్చిమ-ఆసియాలో గలదు. దీనికి ఉత్తరాన లెబనాన్, ఈశాన్యంలో సిరియా, తూర్పున జోర్డాన్, నైఋతి దిశన ఈజిప్టు దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్, గాజా పట్టీలు కూడా ప్రక్కనే ఉన్నాయి. టెల్ అవివ్ ఇజ్రాయిల్ ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా ఉంది. జెరుసలేం ఇజ్రాయిల్ స్వయంనిర్ణిత రాజధానిగా ఉంది. దీనిని ఐక్యరాజ్యసమితి అంగీకరించలేదు.)Rabinovich, Itamar; Reinharz, Jehuda (2007). Israel in the Middle East: Documents and Readings on Society, Politics, and Foreign Relations, Pre-1948 to the Present. Brandeis. p. 74. ISBN 978-0-87451-962-4. అంతేకాక జెరుసలేం నగరం ఇజ్రాయల్ దేశంలో అత్యంత జనసాంధ్రత కలిగిన నగరంగా స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. జెరుసలేం మీద ఇజ్రాయేల్ స్వాధికారత అంతర్జాతీయంగా వివాదాస్పదంగా ఉంది.

State of Israel

మూస:Script/Hebrew (Hebrew)
మూస:Script/Arabic (Arabic)
Star of David centred between two horizontal stripes of a Jewish prayer shawl
జండా
Menorah surrounded by an olive branch on either side
Emblem
గీతం: మూస:Script/Hebrew (Hatīkvāh; "The Hope")మూస:Parabr
ఇజ్రాయిల్
ఇజ్రాయిల్
Israel within internationally recognized borders shown in dark green; Israeli-occupied territories shown in light green
రాజధానిJerusalem
(limited recognition)
31°47′N 35°13′E / 31.783°N 35.217°E / 31.783; 35.217
Official languageHebrew
Recognized languageArabic
జాతులు
(2022)
  • 73.6% Jews
  • 21.1% Arabs
  • 5.3% others
మతం
(2022)
  • 73.6% Judaism
  • 18.1% Islam
  • 1.9% Christianity
  • 1.6% Druze
  • 4.8% others
పిలుచువిధంIsraeli
ప్రభుత్వంUnitary parliamentary republic
• President
Isaac Herzog
• Prime Minister
Benjamin Netanyahu
• Knesset Speaker
Amir Ohana
• Chief Justice
Esther Hayut
శాసనవ్యవస్థKnesset
Independence out of British Palestine
• Declaration
14 May 1948
• Admission to the United Nations
11 May 1949
• Basic Laws
1958–2018
విస్తీర్ణం
• మొత్తం
20,770–22,072 km2 (8,019–8,522 sq mi)[a] (149th)
• నీరు (%)
2.71 (as of 2015)
జనాభా
• 2024 estimate
మూస:Data Israel (91st)
• 2008 census
7,412,200
• జనసాంద్రత
[convert: invalid number] (29th)
GDP (PPP)2023 estimate
• Total
Increase $533.9 billion (48th)
• Per capita
Increase $55,540 (29th)
GDP (nominal)2023 estimate
• Total
Increase $539.2 billion (29th)
• Per capita
Increase $55,535 (13rd)
జినీ (2018)34.8
medium
హెచ్‌డిఐ (2021)Increase 0.919
very high · 22nd
ద్రవ్యంNew shekel () (ILS)
కాల విభాగంUTC+2:00 (IST)
• Summer (DST)
UTC+3:00 (IDT)
తేదీ తీరు
  • יי-חח-שששש (AM)
  • dd-mm-yyyy (CE)
వాహనాలు నడుపు వైపుright
ఫోన్ కోడ్+972
ISO 3166 codeIL
Internet TLD.il
  1. ^ 20,770 km2 is Israel within the Green Line. 22,072 km2 includes the occupied Golan Heights (c. 1,200 km2 (460 sq mi)) and East Jerusalem (c. 64 km2 (25 sq mi))

దీని జనాభా దాదాపు 72.8 లక్షలు, మెజారిటీలు యూదులు. యూదులకు ప్రపంచంలో ఒకే ప్రదేశం, దేశం గలదు, అది ఇస్రాయీల్. మైనారిటీ మతస్తులు సమారిటన్‌లు, అరబ్బులు, ఉదా: ముస్లింలు, క్రైస్తవులు, డ్రూజ్‌లు.గాజాపై చేస్తున్న కాల్పులను విరమించుకోవాలని ప్రపంచమంతా ఒత్తిడి తెస్తున్నా ఇజ్రాయెల్ తన ధోరణి మార్చుకోనందున ఇజ్రాయెల్ తో వెనిజులా, బొలీవియా దేశాలు సంబంధాలను రద్దు చేసుకున్నాయి. కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్యసమితి ఇచ్చిన పిలుపును కూడా కాలదన్ని ఇజ్రాయెల్ ప్రవర్తిస్తున్న తీరు పాలస్తీనా ప్రజల పాలిట శాపమని ఆ దేశాలు అభిప్రాయపడ్డాయి.

1947 నవంబరు 29న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యునైటెడ్ నేషన్స్ పార్టీషన్ ప్లాన్ స్వీకరించి అమలుచేయాలని ఇజ్రాయీలుకు సిఫారసు చేసింది. యునైటెడ్ నేషన్స్ ప్లాన్ అరబ్, ఇజ్రాయిల్ సరిహద్దులను సవరిస్తూ జెరుసలేం, పరిసరాలను ఐక్యారాజ్యసమితి పాలనలో ఉండాలని సూచించింది. బ్రిటిష్ మాండేట్ ఫర్ పాలస్తీనా 1948 మే 14 అర్ధరాత్రిలో నిర్ణయించబడింది. వరల్డ్ జియోనిస్ట్ ఎగ్జిక్యూటివ్ హెడ్, పాలస్తీనా ఇజ్రాయిల్ జూవిష్ ఏజెన్సీ అధ్యక్షుడు ఇజ్రాయిల్ స్వతంత్రం ప్రకటించిన రోజు జూయిష్ రాజ్యస్థాపన సంభవించింది. The borders of the new state were not specified in the declaration. తరువాత పొరుగున ఉన్న అరేబియన్లు దాడి చేసి ఇజ్రాయీల్ సైనికులతో పోరాడరు (1948 అరబ్- ఇజ్రాయిల్ యుద్ధం ). తరువాత ఇజ్రాయిల్ పొరుగున ఉన్న అరబ్ దేశాలతో యుద్ధాలు కొనసాగిస్తూ ఉంది (ఇజ్రాయిల్ యుద్ధాలు). ఫలితంగా ఇజ్రాయిల్ ది వెస్ట్ బ్యాంక్, సినై పెనిన్సులా (1956-57-82), దక్షిణ లెబనాన్ కొంతభాగం (1982-2000), గాజా పట్టీ, గోలన్ హైట్స్ భూభాగాలను ఆక్రమిచింది. ఇజ్రాయిల్ పాలస్తీనా కలహాలు పరిష్కరించడానికి చేసిన శాంతి ప్రయత్నాలు ఇరుదేశాల మద్య శాంతిని స్థాపించలేకపొయ్యాయి. అయినప్పటికీ ఇజ్రాయిల్- ఈజిప్ట్, ఇజ్రాయిల్- జోర్డాన్ శాంతి ప్రయత్నాలు ఫలించి విజయవంతంగా సంతకాలు జరిగాయి. గజా, వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరుసలేం ఆక్రమణలు ఆధునిక కాలంలో దీర్ఘకాల సైనికచర్యగా నమోదుచేయబడ్డాయి.

ఇజ్రాయిల్ సెంట్రల్ బ్యూరో చేత సేకరించబడిన ఇజ్రాయిల్ గణాంకాలు అనుసరించి 2014 ఇజ్రాయేల్ జనసంఖ్య 8,146,300. ఇజ్రాయిల్ ప్రజలలో 6,212,000 (74.9%) మంది యూదులు. ప్రపంచంలో యూదుల సంఖ్య ఆధిక్యత వహిస్తున్న ఏకైక దేశం ఇజ్రాయిల్ మాత్రమే. దేశంలో జనసంఖ్యాపరంగా 1,718,400 సంఖ్యతో అరేబియన్లు రెండవ స్థానంలో ఉన్నారు (డ్రూజ్, తూర్పు జ్రుసలేం ప్రాంతాలు) . ఇజ్రాయిల్ అరేబియన్లలో అత్యధికులు ముస్లిములు. వీరిలో గుర్తించతగినంతగా నెగెవ్ బెదోయిన్లు ఉన్నారు. మిగిలినవారిలో ఇజ్రేల్ క్రైస్తవులు, ఇజ్రేయిల్ డ్రుజ్ ప్రజలు ఉన్నారు. ఇతర అల్పసంఖ్యాకులలో మెరోనిటీలు, సమరిటియన్లు, డోం ప్రజలు, రోమన్ ఉద్యోగులు, ఆఫ్రికన్ హెబ్ర్యూ ఇజ్రేలీలు, ఇతర సబ్ - సహరన్ ఆఫ్రికన్లు ఉన్నారు. అమెరికన్లు, సికాసియన్లు, వియత్నామీ నావికులు, ఇతరులు ఉన్నారు. ఇజ్రాయిల్‌లో కూడా గణనీయంగా ఇజ్రాయిలేతర విదేశీ ఉద్యోగులు, ఆసియా, ఆఫ్రికా శరణార్ధులూ ఉన్నారు. బేసిక్ లా ఆధారంగా ఇజ్రాయిల్ తనకుతాను ప్రజాతంత్ర యూదుదేశంగా ప్రపంచానికి తెలియజేస్తుంది. ఇజ్రాయేల్ ప్రజాప్రతినిధులు ప్రాతినిథ్యం వహిస్తున్న ఒక ప్రజాతంత్రదేశం. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తాడు. ఇజ్రాయిల్ అభివృద్ధి చెందిన దేశం. ఇజ్రాయిల్ ఎకనమిక్ కో- ఆపరేషన్, డెవెలెప్మెంట్ సభ్యత్వం కలిగిన దేశాలలో ఒకటి. జి.డి.పి పరంగా ఇజ్రాయిల్ అంతర్జాతీయంగా 37వ స్థానంలో ఉంది. విద్యాపరంగా ఇజ్రాయిల్ అధికసంఖ్యలో పట్టభద్రలు కలిగిన దేశంగా గుర్తించబడుతుంది. మానవాభివృద్ధి, నాణ్యమైన జీవనశైలి, అత్యధిక ఆయుఃప్రమాణం కలిగిన దేశాలలో ఇజ్రాయిల్ ఒకటి.

పేరు వెనుక చరిత్ర

ఇజ్రాయిల్ 
The Merneptah Stele. While alternative translations exist, the majority of biblical archeologists translate a set of hieroglyphs as "Israel," representing the first instance of the name Israel in the historical record.

1948లో స్వతంత్రం లభించిన తరుణంలో దేశం ఇజ్రాయిల్ పేరును స్వీకరించింది. ఇతరులు ప్రతిపాదించిన మతప్రాధాన్యత కలిగిన, చరిత్ర ప్రాధాన్యత కలిగిన పేర్లు ఎర్తెజ్ ఇజ్రాయిల్ (ఇజ్రాయిల్ భూమి), జియాన్, జ్యుడియా నిరాకరించబడ్డాయి. లాండ్ ఆఫ్ ఇజ్రాయిల్, చిల్డ్రంస్ ఆఫ్ ఇజ్రాయిల్ చారిత్రకంగా ఉపయోగించబడుతుండగా బైబిల్, యూదులు అందరూ " కింగ్డం ఆఫ్ ఇజ్రాయిల్ " అనే పేరును ఉపయోగిస్తుంటారు. ది ఇజ్రాయిల్ జాకబ్ 12 మంది కుమారులు ఇజ్రాయిల్ పూర్వీకులుగా " 12 ఇజ్రాయిల్ తెగలు " లేక " చిల్డ్రెంస్ ఆఫ్ ఇజ్రాయిల్ "గా గుర్తించబడుతున్నారు. జాకబ్ , ఆయన కుమారులు కెన్నన్‌లో నివసించారు. అయినప్పటికీ కరువు కారణంగా ఈజిప్ట్‌కు వలస పోవలసిన నిర్బంధం ఏర్పడింది. ఈజిప్ట్‌లో 430 సంవత్సరాలు గడిచాయి. జాకెబ్ సంతతికి చెందిన మోసెస్ నాయకత్వంలో ఇజ్రాయిల్ ప్రజలు ఎక్సోడస్ కాలంలో కెనాన్‌కు తిరిగి వెళ్ళారు. అబ్రహం మతాలోని జ్యూడిజం, క్రైస్తవం, ఇస్లాం , బహై మతద్థులకు ఈ ప్రాంతం పవిత్రభూమిగా గుర్తించబడింది. 1920 నుండి 1948లో ఇజ్రాయిల్ దేశం గురించిన ప్రకటన వెలువడే వరకు బ్రిటిష్ మేండేటరీ ఆధ్వర్యంలో ఈ మొత్తం ప్రాంతం " పాలస్తీనా మేండేటరీ "గా గుర్తించబడింది. శతాబ్ధాల కాలంగా ఈ ప్రాంతం జ్యుడియా, సమరియా, సదరన్ జుడీషియా, సిరియా పాలస్తీనియా, కింగ్డం ఆఫ్ జెరుసలేం, జ్యుడియా భూభాగం, కొయిలే- సిరియా, రెత్జ్‌జెనుయా, కెనన్ మొదలైన పేర్లతో పిలువబడింది.

చరిత్ర

పూర్వీకత

ఇజ్రాయిల్ 
Kingdom of Israel, 1020 BCE–930 BCE[ఆధారం చూపాలి]

ఇజ్రాయిల్ యూదులకు బైబిల్ కాలం నుండి చాలా పవిత్రప్రాంతం. టోరా ఆధారంగా ఇది దేవుడు ముగ్గురు యూదు పూర్వీకులకు (పేట్రియార్క్స్) వాగ్ధానంగా ఇచ్చిన భూమి అని యూదులు విశ్వసిస్తున్నారు. గ్రంథాల ఆధారంగా పూర్వీకులు ఆరంభంలో మరొక ప్రాంతంలో ఉండేవారని భావిస్తున్నారు. క్రీ.పూ 11 వ శతాబ్దంలో ఇజ్రాయిల్ సామ్రాజ్యం స్థాపించబడింది అని భావిస్తున్నారు. వివిధ బైబిల్స్ ఆధారంగా ఇజ్రాయిల్ రాజ్యాలు తరువాత 400 సంవత్సరాల కాలం స్థిరంగా నిలిచి ఉన్నాయని భావిస్తున్నారు. క్రీ.పూ 1209 లో ఈజిప్షియన్ ఫరోయాహ్ మర్నెప్తాహ్ కొరకు స్థాపించబడింది. మద్యపర్వత ప్రాంతం (సెంట్రల్ హైలాండ్) లో ఇజ్రాయిల్ సాంస్కృతిక, రాజకీయ ప్రాధాన్యత కలిగి ఉంది. చక్కగా స్థాపించబడిన ప్రాంతాన్ని ఈజిప్షియన్లు అనుకూల ప్రాంతంగా మార్చుకున్నారు. ఇజ్రాయిల్ పూర్వీకులైన సెమిటీలు కానాన్, సీ పీపుల్ సంతతివారని భావిస్తున్నారు. ఇక్కడ ఇనుపయుగంలో నివసించిన ప్రజలను ఇజ్రాయిలీయులుగా భావించవచ్చని వీరికి కానానిటీలకు వ్యత్యాసం ఉందనీ మక్నట్ భావన. వీరి సంతతికి చెందిన వారు గ్రామీణ ప్రాంతంలో 300-400 వరకు ఉన్నారని భావిస్తున్నారు. వారు వ్యవసాయం, పశువుల పెంపకం చేస్తూ స్వయంప్రతిపత్తి కలిగి ఉన్నారు. పురాతత్వ ఆధారాలు గ్రామీణ కేంద్రాలలో పరిమితమైన వనరులు జసంఖ్యతో నివసించారని తెలియజేస్తున్నాయి. ఇజ్రాలీయులు కానాన్ పర్వతప్రాంతాలలో ప్రశాంత జీవితం సాగించారని ఆధునిక పరిశోధకులు భావిస్తున్నారు.

ఇజ్రాయిల్ 
The Iron Age kingdom of Israel and kingdom of Judah[ఆధారం చూపాలి] (8th century BCE)

క్రీ.పూ 930 లో సామ్రాజ్యంలోని దక్షిణప్రాంతం జుదాహ్ సామ్రాజ్యం, ఉత్తర ప్రాంతం ఇజ్రాయిల్‌గా విభజించబడింది. క్రీ.పూ 8వ శతాబ్దం మద్యలో ఇజ్రాయిల్, నియో- అస్సిరియన్ సామ్రాజ్యాలమద్య ఘర్షణలు అధికం అయ్యాయి. మూడవ టిగ్లాత్ - పిలేసర్ నాయకత్వంలో ఇజ్రాయిల్ భూభాగం పలు చిన్న భూభాగాలుగా విభజించబడ్డాయి. తరువాత క్రీ.పూ 722లో ఇజ్రాయిల్ రాజధాని సమారియా విధ్వంసం చేయబడింది. క్రీ.పూ 724-722లో ఇజ్రాయిల్ తిరుగుబాటును అణిచివేసి అస్సిరియన్ రాజు రెండవ సర్గాన్ సమరియాను స్వాధీనం చేసుకున్నాడు. సర్గాన్ కుమారుడు కుమారుడు జుడాహ్ ఆక్రమించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. అస్సిరియన్ రికార్డుల ఆధారంగా 46 ప్రాకారిత నగరాలు సమంచేసి జెరుసలేంను స్వాధీనపరచుకుని కప్పం ఏర్పాటు చేసుకున్న తరువాత విడిచి వెళ్ళాడు. క్రీ.పూ 586 లో బాబిలోన్‌కు చెందిన రాజా రెండవ నెబుచద్నేజర్ జూడిష్ - బాబిలోనియన్ యుద్ధం ద్వారా జుడాహ్‌ను స్వాధీనపరచుకున్నాడు. హెబ్ర్యూ బైబిల్ ఆధారంగా రెండవ నెబుచద్నేజర్ సొలోమాన్ ఆలయం ధ్వంసం చేసాడు. దీనిని బాబిలోనియన్ రికార్డులు కూడా నమోదు చేసాయి. క్రీ.పూ 538లో పర్షియాకు చెందిన సైరస్ బాబిలోనియాను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత సైరస్ రాజ్యాంగ ప్రకటన ద్వారా ప్రజల మతస్వంత్రాన్ని అణిచివేసాడు. హెబ్ర్యూ బైబిల్ ఆధారంగా 50,000 యూదులు జెరూబబెల్ నాయకత్వంలో జుడాహ్ చేరుకున్నాని తిరిగి ఆలయనిర్మాణం చేసారు. రెండవ బృదం 5,000 మందితో ఎజ్రా, నెహెమియా నాయకత్వంలో క్రీ.పూ 456లో జుడాహ్ చేరుకున్నారు. యూదులకు చెందని వ్రాతల ఆధారంగా వారిని సైరస్ అడ్డగించడానికి ప్రయత్నించాడని భావిస్తున్నారు.

సంప్రదాయ కాలం

ఇజ్రాయిల్ 
Hasmonean Kingdom
ఇజ్రాయిల్ 
Treasures, including the Menorah, carried in a Roman triumph after the 70 CE Siege of Jerusalem (original relief from the Arch of Titus, Rome).

విజయవంతమైన అచమెనిద్ సామ్రాజ్యపాలనలో ఈ భూభాగం సిరియా - కొలే భూభాగాలుగా విభజించబడింది. తరువాత ఇది యూదుల ఆధిక్యత కలిగిన నగరప్రాంతంగా అభివృద్ధి చేయబడింది. తరువాత గ్రీకులు ఈ ప్రాంతం మీద ఆధిక్యత వహించారు. క్రమంగా ఈ ప్రాంతం ప్టోలెమయిక్ - సెల్యూసిడ్ సామ్రాజ్యాలలో భాగం అయింది. గ్రీకులు- యూదులమద్య ఘర్షణలు తలెత్తాయి. ఘర్షణలు క్రీ.పూ 167లో మక్కాబీన్ తిరుగుబాటుకు దారితీసాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో స్వతంత్రం స్థాపించబడింది. అది తరువాత ఆధునిక ఇజ్రాయిల్‌గా విస్తరించింది. క్రమంగా సెల్యూసిడ్లు ఈ ప్రాంతం మీద ఆధిక్యత కోల్పోయారు.

క్రీ.పూ 63లో ఈ ప్రాంతం మీద రోమన్లు దాడిచేసి ముందుగా సిరియాను స్వాధీనం చేసుకున్నారు. తరువాత హస్మోనియన్ అంతర్యుద్ధం సంభవించింది. జుడియాలో సంభవించిన ప్రొ రోమ- ప్రొ పార్థియన్ ఘర్షణలు హెరాడ్ సామ్రాజ్యస్థాపనకు దారితీసాయి. సమైక్య హెరాడ్ సామ్రాజ్యంలో జుడీన్ రాజ్యం రోం సామంతరాజ్యంగా మారింది.

ఇజ్రాయిల్ 
Herodian kingdom
ఇజ్రాయిల్ 
Kfar Bar'am, an ancient Jewish village, abandoned some time between the 7th–13th centuries AD.

హెరాడ్ సామ్రాజ్యం పతనం జుడియా గ్రీకో- రోమన్‌కు వ్యతిరేకంగా ఉద్రేకపూరితమైన యూదకేంద్రంగా మారింది. యూద- రోమన్ యుద్ధాలు తీవ్రమైన విధ్వంసం, బహిష్కరణ, మూకుమ్మడి హత్యలతో ముగింపుకు వచ్చాయి. క్రీ.పూ 132 లో రోమన్‌కు వ్యతిరేకంగా సాగించిన బార్ కొఖబా తిరుగుబాటు విఫలం తరువాత ఈ ప్రాంతంలో యూదుల సంఖ్య తగ్గుముఖంపట్టింది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో మిగిలిన యూదులు గలిలీని మతకేంద్రంగా మార్చుకున్నారు. మిష్నాహ్, జెరుసలేంలో కొంత భాగం, మద్య యూద రచనలు సా.శ. 2-4 శతాబ్ధాలలో టిబెరియా, జెరుసలేంలలో రూపొందించబడ్డాయి. ఈ భుభాగంలోని సముద్రతీరంలో గ్రీకో- రోమన్లు, పర్వతప్రాంతాలలో సమరిటన్లు అధికంగా నివసించారు. బైజాంటిన్ పాలనా కాలంలో రోమన్ పగానిజం మీద క్రమంగా క్రైస్తవం ఆధిక్యత వహించింది. 5-6 శతాబ్ధాలలో సమరిటన్ తిరుగుబాటు తలెత్తింది. బైజాంటిన్ క్రైస్తవులు, సమరిటన్ సంఘాల సంఘర్షణల కారణంగా ఈ ప్రాంతం విధ్వంసానికి గురైంది. ఫలితంగా ఈ ప్రాంతంలో జనసాంధ్రత క్షీణించింది. బైజాంటిన్ - సస్సానియన్ యుద్ధం (602-628) లో పర్షియన్లు విజయం సాధించిన తరువాత కొంతకాలం జూయిష్ కామంవెల్త్ (సా.శ. 614) తరువాత 628 లో బైజాంటిన్ సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది.

ఆరంభకాల ఇస్లాం పాలన, క్రుసేడర్లు , మమ్లక్స్

ఇజ్రాయిల్ 
The 15th-century Abuhav synagogue from Safed

సా.శ. 635-641 లో జెరుసలేంతో కూడిన ప్రాంతం సమీపకాలంలో ముస్లిం మతాన్ని స్వీకరించిన అరబ్బుల వశం అయింది. తరువాత 1300 సంవత్సరాల కాలం ఈ ప్రాంతం వైవిధ్యమైన సంరాజ్యల పాలనలో ముస్లిముల ఆధీనంలో ఉంది. తరువాత 6శతాబ్ధాల కాలం ఈ ప్రాంతం మీద ఆధిపత్యం ఉమయదులు, అబ్బాసిదులుమద్య, ఫతిమిదులు, క్రుసేడర్లు, అయ్యుబిదుల మద్య మారుతూ వచ్చింది. తరువాత 1260లో ఈ ప్రాంతాన్ని మమ్లక్ సుల్తానేట్ వశపరచుకుంది.

ఇజ్రాయిల్ 
Siege and Capture of Jerusalem in 1099, where the Jews had participated in its defense

1099 లో ఈ ప్రాంతంలో నివసిస్తున్న యూదులు ఫతిమిద్ సైన్యాలు, ముస్లిం ప్రజలు పరస్పరం పోరాటం కొనసాగింది. పోరాటంలో క్రుసేడర్లు విజయం సాధించారు. ఈ సంఘటనలో 60,000 మంది వధించబడ్డారు. 6,000 మంది యూదులు సినగోగ్యూలో ఆశ్రయం పొందారు. పోరాటం ఫలితంగా యూదరాజ్యం పతనం అయిన 1,000 సంవత్సరాల తరువాత తిరిగి దేశమంతటా యూదసమూహాలు విస్తరించాయి. వీరిలో 50 సమూహాలు కొంతమంది జెరుసలేం, టిబరియాస్, రమ్లేహ్, అష్కెలాన్, సియాసరియా, గాజా నగరాలలో కేంద్రీకృతమయ్యారు. 1165 లో మైమొనిడీలు జెరుసలేం సందర్శించి గ్రేట్ హోలీ హౌస్‌లోని మౌంటు ఆలయంలో ప్రార్థనలు నిర్వహించారు. 1141 లో స్పానిష్- జ్యూవిష్ కవి యెహూదా హలెవి ఇజ్రాయిల్‌కు వలసపోదామని పిలుపు ఇచ్చాడు. 1187 లో అయ్యూబిద్ సంరాజ్య స్థాపకుడు సుల్తాన్ సలాదిన్ క్రుసేడర్లను (హతిన్ యుద్ధం) ఓడించి జెరుసలేం, పాలస్తీనాలను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత సలాదిన్ యూదులను జెరుసలేంకు వచ్చి స్థిరపడమని ప్రకటన జారీచేసాడు. 1211లో యూదసమూహలను ఫ్రాన్స్, ఇంగ్లండు నుండి వచ్చిన 300 మంది రబ్బీల నాయకత్వంలో బలం పుంజుకున్నాయి. వారిలో రబ్బీ సాలమన్ బెన్ అబ్రహాం ఉన్నాడు. 1260 లో ఈజిప్టుకు చెందిన మమ్లక్ సుల్తానేట్ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం సధించింది. తరువాత ఈ ప్రాంతం మమ్లక్ అధికారకేంద్రాలైన కైరో, డమాస్కస్‌లలో విలీనం చేయబడింది. అలాగే రెండునగరాలను కలిపే పోస్టల్ రోడ్డు వెంట కొంత అభివృద్ధి జరిగింది. 1266 లో మమ్లక్ సుల్తాన్ బేబార్స్ " పేట్రియార్చ్ గుహలను " ఇస్లామిక్ శాక్చ్యురీగా మార్చి క్రైస్తవులకు, యూదులకు అందులో ప్రవేశం నిషేధించాడు. 1967లో ఇజ్రాయిల్ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే వరకు నిషేధం కొనసాగింది. 1470 లో ఇసాక్ బి.మేయర్ లతీఫ్ అంకోనా నుండి ఇక్కడికి వచ్చి జెరుసలేంలో 150 యూదకుటుంబాలు ఉన్నాయని గణించాడు. 15వ శతాబ్దంలో జోసెఫ్ సరగొస్ ఇక్కడకు వచ్చిన తరువాత సఫెద్ పరిసరాలలో యూదులు అధికసంఖ్యలో ఇక్కడ కేంద్రీకృతం అయ్యారు. స్పెయిన్ నుండి యూదులు ఇక్కడకు వలస వచ్చిన తరువాత 16వ శతాబ్దం ఆరంభకాలానికి ఈ ప్రాంతంలో యూదుల సంఖ్య 10,000 కు చేరుకుంది.

Ottoman Empire

1516లో ఓట్టోమన్ సామ్రాజ్యం ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. మొదటి ప్రపంచయుద్ధం ముగిసే వరకు ఇది ఓట్టోమన్ సామ్రాజ్యం ఈ ప్రాంతం మీద ఆధిపత్యం కొనసాగించింది.బ్రిటన్ ఓట్టోమన్ సామ్రాజ్యాన్ని జయించి ఓట్టోమన్ సిరియాలో సైనికఆధిపత్యాన్ని ఏర్పాటు చేసింది. 1920లో ఈ ప్రాంతం బ్రిటిష్, ఫ్రాన్స్ మద్య విభజించబడింది.

జియోనిజం

ఇజ్రాయిల్ 
Theodor Herzl, visionary of the Jewish State

వలస సమయంలో యూదులు అధికంగా జియాన్, ఇజ్రాయిల్‌కు రావడానికి ఆసక్తి చూపారు. 1492లో యూదులు స్పెయిన్ నుండి బహిష్కరించబడిన తరువాత కొన్ని యూదకుటుంబాలు పాలస్తీనాలో స్థిరపడ్డాయి. 16వ శతాబ్దంలో జూయిష్ కమ్యూనిటీలు జెరుసలేం, టిబరియా, హెబ్రాన్, సఫెద్ (1692లో) నగరాలకు వెళ్ళాడానికి ఉత్సుకుత చూపారు. రబ్బీ యెహూదా హచసిద్ నాయకత్వంలో 1,500 మంది యూదులు జెరుసలేం చేరుకున్నారు. 18వ శతాబ్దం ద్వితీయార్ధంలో పెరుషిం పాలస్తీనాలో స్థిరపడ్డాడు. ఆధునికంగా ఓట్టోమన్ పాలనలో ఉన్న పాలస్తీనాకు యూదుల వలస " ఫస్ట్ అలియా"గా వర్ణించబడింది. ఇది 1881 లో మొదలైంది. జియోనిస్ట్ ఉద్యమం చేతనంగా ఉన్నసమయంలో ఆస్ట్రో- హంగేరియన్ జర్నలిస్ట్ థియోడర్ హెర్జిల్ జియోనిజానికి నిధులు సమకూర్చాడు. 1896లో హెర్జిల్ " డెర్ జుడెంస్టాట్ " (యూదుల రాజ్యం) ప్రచురించాడు. ఇందులో హెర్జిల్ భవిష్యత్ యూదసాంరాజ్యం గురించి ఊహించి వర్ణించాడు. తరువాత సంవత్సరం ఆయన ప్రపంచ జియోనిస్ట్ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించాడు. రెండవ అలియా (1904-14) కిషినేవ్ పొగ్రొం తరువాత ఆరంభం అయింది. తరువాత 40,000 మంది యూదులు పాలస్తీనాలో స్థిరపడ్డారు. అయినప్పటికీ వారిలో సగం మంది పాలస్తీనాను వదిలివెళ్ళారు. మొదటి రెండవ వలసలలో ప్రధానంగా ఆర్థడాక్స్ యూదులు మాత్రం వలసపోయారు. అయినప్పటికీ రెండవ అలియాహ్‌లో జియీనిజం శ్రామిక బృందాలు (వీరు కిబత్జ్ ఉద్యమం స్థాపించారు) కూడా ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ విదేశీ కార్యదర్శి ఆర్థర్ బాల్ఫర్ వాల్టర్ బరాన్ రోత్చిల్డ్‌కు " బాల్ఫర్ డిక్లరేషన్ పంపాడు 1917) " పంపాడు.

ఇజ్రాయిల్ 
Kibbutznikiyot (female Kibbutz members), during the 1948 Arab-Israeli war. The Kibbutzim, or collective farming communities, played a pivotal role in establishing the new state.
ఇజ్రాయిల్ 
SS Exodus carying Jewish immigrants during Aliyah to Mandatory Palestine in 1947.

బ్రిటిష్ 1918లో పాలస్తీనాపై విజయం సాధించిన సమయంలో జియోనిస్ట్ వాలంటీర్లు సహకరించారు. బ్రిటిష్ మీద అరేబియన్ల వ్యతిరేకత , యూదుల వలసలు " 1920 పాలస్తీనా తిరుగుబాటు " , యూదసైన్యం (హగనాహ్) రూపొందడానికి దారితీసింది. (హగనాహ్ అంటే రక్షణ అని అర్ధం). మూడవ అలియా (1919-23) , నాలుగవ అలియా (1924-29) లలో 1,00,000 మంది యూదులు పాలస్తీనా చేరుకున్నారు. చివరికి హిట్లర్ అధికారానికి చేరుకుని నాజీయిజం శక్తివంతమై 1930లో యూదులను హిసించడం ఆరంభం కావడం ఐదవ అలియా ఆరంభానికి దారితీసింది. దాదాపు 2,50,000 యూదులు పాలస్తీనా చేరుకున్నారు. ఫలితంగా పాలస్తీనాలో 1936-39 అరబ్ తిరుగుబాటు తీవ్రరూపం దాల్చింది. బ్రిటిష్ మేండేట్ సమయంలో హగనాహ్‌కు చెందిన జియోనిస్ట్ తీవ్రవాదులు , ఇర్గున్ తీవ్రవాదులు 5,032 అరేబియన్లను వధించి 14,760 మందిని గాయపరిచారు. ఫలితంగా 10% మంది పాలస్తీనా పురుషులు వధించబడం, గాయపడడం లేక బహిస్కరణకు గురైయ్యారు. బ్రిటిష్ " వైట్ పేపర్ ఆఫ్ 1939 " ద్వారా యూదులు పాలస్తీనాకు వలసరావడం మీద కట్టుబాటు ప్రవేశపెట్టింది. . రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి పాలస్తీనా లోని యూదుల సంఖ్య 33% అధికం అయింది. 1946 ఇర్గున్ బాంబింగ్ అటాక్ కారణంగా వివిధ దేశాలకు చెందిన 91 మంది మరణించగా 46 మంది గాయపడ్డారు.

స్వతంత్రం

యు.ఎన్. విభజన నిర్ణయం

ఇజ్రాయిల్ 
UN Map, "Palestine plan of partition with economic union"

రెండవ ప్రపంచయుద్ధం తరువాత బ్రిటన్ తీవ్రంగా యూదుల వలసలను అదుపుచేస్తూ అరబ్బులతో యుద్ధాన్ని కొనసాగించింది. హగనాహ్ ఇర్గున్‌, లెహితో కలిసి బ్రిటిష్‌ పాలనను వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది. అదే సమయంలో లక్షలాది మంది యూదు హోలోకాస్ట్ బాధితులు, ఆశ్రితులు విధ్వంసానికి గురైన ఐరోపా సమూహాలకు పునరుజ్జీవనం కావాలని కోరిక వెలిబుచ్చారు. యుషివ్ ఆశ్రితులను పాలస్తీనాకు తీసుకురావడానికి ప్రయత్నించాడు. అయినా వీరిలో అధికమైన వారు బ్రిటిష్ పాలకులచేత అడ్డగించబడి " అత్లిత్ డిటెంషన్ కేంపు , సైప్రస్ ఇంటర్న్మెంటు కేంపులలో చేర్చబడ్డారు. హింసాత్మక చర్యలు చివరకు " 1946 కింగ్ డేవిడ్ హోటెల్ " మీద బాంబింగ్ సంఘటనకు దారితీసాయి. 20వ శతాబ్ధపు తీవ్రమైన తీవ్రవాద దాడిగా ఈ సంఘటన అభివర్ణించబడింది. 1947లో బ్రిటిష్ ప్రభుత్వం " మేండేటరీ పాలస్తీనా " నుండి వెనుకకు మరలుతున్నట్లు తాము యూదులు, పాలస్తీనా మద్య సఖ్యత ఏర్పరచడంలో అశక్తులైనామని ప్రకటించింది. 1947 మే 15న సరికొత్తగా రూపొందించబడిన ఆఇఖ్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పాలస్తీనా సమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. 1947 సెప్టెంబరు 3న యు.ఎన్ జనరల్ అసెంబ్లీలో కమిటీ నివేదికను ప్రవేశపెట్టింది. కమిటీలో అత్యధికులు స్వతంత్ర అరబ్, స్వతంత్ర యూదుదేశం అలాగే జెరుసలేం అంతర్జాతీయ ట్రస్టీ ఆధ్వర్యంలో ఉండాలని ప్రతిపాదించారు. 1947 నవంబరు 29న యునైటెడ్ నేషంస్ జనరల్ అసెంబ్లీ యునైటెడ్ నేషంస్ విభజన ప్రణాళికను స్వీకరించింది. యూదుల ఏజంసీ యూదుల ప్రతినిధిగా ఈ ప్రణాళికకు అంగీకారం తెలిపింది. అరబ్ లీగ్, పాలస్తీనా అరబ్ హైయ్యర్ కమిటీ ప్రణాళికను తిరస్కరించింది.

స్వతంత్ర ప్రకటన , 1948 యుద్ధం

A Butterfly improvised Armored car brings supply to an isolated Negev Kibutz. After the Egyptian invasion, those cars evacuated the children
Palestinian irregulars near a burnt armored Haganah supply truck, the road to Jerusalem, 1948
A briefing of Palmach Negev brigade soldiers
David Ben-Gurion announcing the creation of the State of Israel on 14 May 1948, below a portrait of Theodor Herzl
Avraham Adan raising the Ink Flag on the bank of the Red Sea, marking the end of the 1948 Arab–Israeli War

1947 డిసెంబరు 1న అరబ్ హైయ్యర్ కమిటీ మూడురోజుల స్ట్రైక్ ప్రకటించింది. తరువాత అరబ్ బృందాలు యూదులను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగించారు. 1947-48 మద్యకాలంలో పాలస్తీనా అంతర్యుద్ధం కొనసాగింది. పాలస్తీనా అరబ్బులు ఆర్థికంగా పతనం అయ్యారు. 2,50,000 మంది పాలస్తీనా అరేబియన్లు దేశం విడిచి పారిపోవడం లేక బహిస్కరించబడడం సంభవించింది. 1948 మే 14న బ్రిటిష్ మేండేటరీ గడువు ఇంకా ఒకరోజు ముందుగా యూదుల ఏజెంసీ నాయకుడు డేవిడ్- బెన్- గురియన్ ఎరెత్జ్- ఇజ్రాయిల్‌లో స్వతంత్ర యూదురాజ్యం ఏర్పాటు గురించి ప్రకటించాడు. యూదురాజ్య సరిహద్దు నిర్ణయం కొరకు ఎరెత్జ్- ఇజ్రాయిల్ అన్న పదం ఉపయోగించబడింది. కిబ్బుత్జిం (సంఘటిత వ్యవసాయం) కొత్తరాజ్యాల స్థాపనలో ప్రధానపాత్ర వహించింది. తరువాత రోజు నాలుగు అరబ్ దేశాల సైన్యం (ఈజిప్ట్, సిరియా,ట్రాంస్జోర్డాన్), ఇరాక్) ప్రవేశంతో 1948 అరబ్ - ఇజ్రాయిల్ యుద్ధం సంభవించింది. యేమన్, మొరొకొ, సౌదీ అరేబియా, సుడాన్ సైన్యాలు కూడా యుద్ధంలో పాల్గొన్నాయి. యూదురాజ్యస్థాపనకు వ్యతిరేకంగా అరబ్ దేశాలు సమైక్యతగా పోరాడడమే ఇందుకు ప్రధాన కారణం. కొతమంది అరేబియన్ నాయకులు యూదులను సముద్రం వరకు తరిమివేయాలని అభిప్రాయం వెలిబుచ్చారు. యూదుడైన బెన్నీ మోరిస్ అభిప్రాయం అనుసరించి దాడిచేసిన అరేబియన్ల లక్ష్యం యూదులను వధించడమే భావించబడింది. అరబ్ లీగ్ దాడి ద్వారా లా అండ్ ఆర్డర్ పునరుద్ధరించబడుతుందని అదనపు రక్తపాతం నివారించబడుతుందని అభిప్రాయపడింది. ఒక సంవత్సరం కొనసాగిన యుద్ధం తరువాత 1949లో కాల్పుల విరమణ (గ్రీన్ లైన్) ప్రకటించబడింది. ఐక్యరాజ్యసమితి అంచనా అనుసరించి 7,00,000 కంటే అధికమైన అరేబియన్లు యుద్ధకాలంలో పారిపోయారని భావించారు.

సూయజ్ సంక్షోభం

ఇజ్రాయిల్ 
An example of Israel's first visas from 1948

1949 మే 11 ఐక్యరాజ్యసమితి మెజారిటీ ఓట్లతో ఇజ్రాయిల్ అంగీకరించబడింది. 1949లో ఇజ్రాయిల్, జోర్డాన్లు శాంతి ఒప్పందంపట్ల ఆసక్తి చూపాయి. ఈజిప్ట్ పట్ల బ్రిటిష్ ఆసక్తికి అడ్డుకట్ట వేస్తుందన్న కారణంతో బ్రిటిష్ జోర్డాన్ శాంతి ప్రయత్నాలను అడ్డుకున్నది. ఇజ్రాయిల్ స్థాపన ఆరంభకాలంలో ప్రధానమంత్రి డేవిడ్ బెన్- గురియన్ నాయకత్వంలో జియోనిస్ట్ లేబర్ ఉద్యమం మొదలై ఇజ్రాయిల్ రాజకీయాలను ప్రభావితం చేసింది. 1940 ఆరంభం, 1950 ఇజ్రాయిల్ వలసలకు ఇజ్రాయిల్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంటు, ప్రభుత్వేతర సంస్థ అయిన మొస్సద్ లీలియా బెట్ సహకరించాయి.). రెండు సంస్థలు వలసదారుల రవాణావసతుల ఏర్పాటుకు సహకరించాయి. తరువాత ప్రత్యేకంగా మిడిల్ ఈస్ట్, తూర్పు ఐరోపా‌లలో రహస్యకార్యకలాపాలను ఇవి ప్రోత్సహించాయి. యూదులజీవితాలు ఈ ప్రాంతాలలో ఆపత్కర పరిస్థితిలో ఉన్నాయని భావించడం, అక్కడ నుండి వెలుపలికి అసాధ్యమని భావించడం ఇందుకు కారణం. మొస్సద్ లీలియా బెట్ 1953 వరకు వలసదారుల సహాయంలో భాగస్వామ్యం వహించాడు. 3 సంవత్సరాల కాలం కొనసాగిన వలసలు, అరబ్ - ముస్లిం దేశాల నుండి వచ్చి చేరిన యూదుల కారణంగా ఇజ్రాయేల్ జనసంఖ్య 7,00,000 నుండి 14,00,000కు చేరుకుంది.వీరిలో అత్యధికులు స్వతదేశాలలో హింసకు గురైనవారే.ఫలితంగా 1948-1958 మద్య కాలంలో ఇజ్రాయిల్ జనసఖ్య 8,00,000 నుండి రెండు మిలియన్లకు చేరుకుంది.1948-1970 మద్య కాలంలో దాదాపు 11,50,000 మంది యూదులకు ఇజ్రాయిల్‌లో పునరావాసం కల్పించబడింది.ఇజ్రాయిల్‌కు యూదులు పలు వైవిధ్యమైన కారణాలు ఉన్నాయి. జియోనిస్ట్ భావాలను కొందరు విశ్వసించారు. కొత్తగా మరికొందరు ఆశ్రితులు నిరాధారంగా ఇజ్రాయిల్ వచ్చుచేరారు. వారికి తాత్కాలిక కేంపులలో నివాసం (మాబరాత్) ఏర్పాటుచేసారు. 1952 నాటికి 2,00,000 మంది ఈ గుడారాల నగరాలలో నివసించారు. ఈ సమయంలో ఆహారం, దుస్తులు, ఫర్నీచర్ రేషన్ ద్వారా పంపిణీ చేయబడ్డాయి. పరిస్థితులను చక్కదిద్దడానికి బెన్- గురియన్ నాయకత్వంలో ఇజ్రాయిల్- పశ్చిమ జర్మనీల మద్య రిపేరేషన్ అగ్రిమెంటు జరిగింది. ఇందుకు యూదలు ఆగ్రహం వెలిబుచ్చారు. 1950 లో ఈజిప్ట్ సూయజ్ కెనాల్‌ను ఇజ్రాయిల్ నావలు ప్రవేశించకుండా మూసివేసింది. ఉద్రిక్తతలు అధికమై ఇజ్రాయేల్ సరిహద్దులో కాల్పులవంటి సంఘర్షణలు సంభవించాయి. 1950 నాటికి ఇజ్రాయిల్ పౌరుల మీద పాలస్తీనా సైన్యం పలుమార్లు దాడిచేసారు. ప్రధానంగా ఈజిప్ట్ ఆక్రమిత గాజాపట్టీ ప్రాంతంలో కాల్పులు అధికంగా జరిగాయి. 1956లో బ్రిటన్, ఫ్రాన్స్ సూయజ్ కాలువ మీద ఆధిపత్యం తిరిగి సాధించడం లక్ష్యంగా చేసుకున్నాయి. సూయజ్ కాలువ మూసివేత, ఇజ్రాయిల్ దక్షిణ ప్రాంతం మీద ఫెడయీన్ దాడులు, అరబ్ బెదిరింపులు ఇజ్రాయీల్ ఈజిప్ట్ మీద దాడిచేయడానికి పురికొల్పింది.

యుద్ధం ఫలితంగా ఇజ్రాయీల్ సరిహద్దులలో గణనీయమైన మార్పులు సంభవించాయి.

1960s

టాం సెగోవ్ అభిప్రాయం అనుసరించి ఆశ్రితులు వారు వచ్చిన ప్రదేశాల ఆధారంగా ఆదరించబడ్డారని భావిస్తున్నారు. మిడి ఈస్ట్ నుండి వచ్చిన యూదులు, దక్షిణాఫ్రికన్ యూదులు, ఇజ్రాయిల్‌లో కేంపులలో దీర్ఘకాలంగా మిగిలి ఉన్న యూదుల కంటే యురేపియన్ సంతతికి చెందిన యూదులు పట్ల అధికంగా ఆదరాభిమానాలు చూపారు. ఇరు వర్గాల మద్య ఈ కారణంగా ఉద్రిక్తతలు అధికం అయ్యాయి. ప్రస్తుతరోజులలో కూడా వివక్ష కొనసాగుతూ ఉంది. 1960 ఆరంభంలో అర్జెంటీనాలో ఇజ్రాయిల్ నాజీ యుద్ధఖైదీ అడాల్ఫ్ ఎచ్మన్‌ను నిర్బంధించి విచారణ కొరకు తీసుకున్నారు. విచారణ హోలోకాస్ట్ మీద ప్రధానప్రభావం చూపింది. ఇజ్రాయిల్ కోర్ట్ తీర్పుద్వారా ఎచ్మన్ ఉరితీతకు గురైయ్యాడు.

1967 ఆరు రోజుల యుద్ధం , 1973 యోం కిప్పూర్ యుద్ధం

ఇజ్రాయిల్ 
Territory held by Israel:
  before the Six-Day War
  after the war
The Sinai Peninsula was returned to Egypt in 1982.

1964 లో ఇజ్రాయిల్ జోర్డాన్ నదీజలాలను సముద్రతీర మైదానాలకు మళ్ళింపు ప్రణాళిక గురించి అరబ్ దేశాలు ఆందోళన చెందాయి. తరువాత జోర్డాన్ నదీజలాల కొరకు ఇజ్రాయిల్ ఒకవైపు మరొక వైపు సిరియా, లెబనాన్‌ల ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.ఈజిప్ట్ అధ్యక్షుడు నాయకత్వంలో అరబ్ దేశాలు ఇజ్రాయిల్ గుర్తించడానికి నిరాకరిస్తూ దానిని విధ్వంసం చేయాలని పిలుపు నిచ్చారు. 1966 నాటికి అరబ్ - ఇజ్రాయిల్ యుద్ధాల విషయంలో అరబ్ దేశాలమద్య విభేదాలు తలెత్తాయి. 1967 లో ఈజిప్ట్ సైన్యాలు ఇజ్రాయిల్ సరిహద్దులో కేంద్రీకృతం చేయబడ్డాయి. 1957 నుండి సినై ద్వీపకల్పంలో ఉన్న ఐక్యరాజ్యసమితి ఎమర్జెంసీ సైన్యం పంపివేయబడింది. ఇజ్రాయిల్ ఎర్రసముద్ర ప్రవేశం దిగ్బంధం చేయబడింది. ఇతర అరబ్ దేశాలు సైన్యాలను తరలించాయి. పరిస్థితి గ్రహించిన ఇజ్రాయిల్ ఈజిప్ట్ మీద యుద్ధం ప్రకటించింది. జోర్డాన్, సిరియా, ఇరాక్ ఈజిప్టుతో కలిసి ఇజ్రాయిల్‌ను ఎదుర్కొన్నాయి. ఇజ్రాయిల్ జోర్డాన్‌ను ఓడించి వెస్ట్ బ్యాకును స్వాధీనం చేసుకుని, ఈజిప్టును ఓడించి గాజాపట్టీ, సినై ద్వీపకల్పాన్ని స్వాధీనపరచుకుని, సిరియాను ఓడించి గొలాన్ హైట్స్‌ను స్వాధీనపరచుకుంది. జెరుసలేం సరిహద్దు విస్తరించింది. 1967 యుద్ధం, అరబ్ లీగ్ నిర్ణయం తరువాత ఇజ్రాయిల్ ఆక్రమిత సినై మీద ఈజిప్షియన్ దాడులు జరిగాయి. " పాలస్తీనియన్ లిబరేష ఆర్గనైజేషన్ " (1964లో స్థాపించబడింది) ఆక్రమిత ఇజ్రాయిల్ భూభాగం మీద దాడులు చేసారు. పి.ఎల్.ఒ మాతృభూమిని విడిపించడానికి సైనికదాడులు మాత్రమే మార్గమని అభిప్రాయం వెల్లడించింది. 1960, 1970 లో పాలస్తీనియన్ ఫెడయీన్ బృందాలు రాజకీయ హింసాత్మకచర్యలు ఆరంభించాయి. ఇందులో భాగంగా యూదులను, పాలస్తీనియన్లను లక్ష్యంగా చేసుకుని ప్రంపంచం అంతటా దాడులు జరిగాయి. 1972లో మ్యూనిచ్‌లో జరిగిన సమ్మర్ ప్లింపిక్స్‌లో ఇజ్రాయిల్ అథ్లెట్ల మూకుమ్మడి హత్యలు వాటిలో ఒకటి. ఇజ్రాయిల్ ప్రభుత్వం ప్రతిస్పందించి " ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ " పేరిట మూకుమ్మడి హత్యల నిర్వాహకుల మీద ప్రతీకారచర్య తీసుకుంది. ఫలితంగా 1972 సిరియా మీద ఇజ్రాయిల్ వాయుమార్గ దాడి, 1973 లో లెబనాన్ లోని పి.ఎల్.ఒ ప్రధానకార్యాలయం మీద ఇజ్రాయిల్ చేసిన వాయుమార్గ దాడి ఇజ్రాయిల్ ప్రతిచర్యలలో భాగంగా ఉన్నాయి.

ఇజ్రాయిల్ 
Operation Gazelle, Israel's ground maneuver, encircles the Egyptian Third Army, October 1973

1973 అక్టోబరు 6 న ఈజిప్షియన్, సిరియన్ సైనికులను కేంద్రీకరించిన యోం కిప్పుర్ మీద దృష్టి కేంద్రీకరించింది. ఈజిప్షియన్, సిరియన్ సైన్యాలు అకస్మాత్తుగా సినై ద్వీపకల్పం, గోలన్ హైట్స్‌లో ఉన్న ఇజ్రాయిల్ సైన్యం మీద దాడి చేయాయి. ఇది యోం కిప్పుర్ యుద్ధానికి ఆరంభంగా మారింది. అక్టోబరు 26న ఇజ్రాయిల్ విజయవంతంగా ఈజిప్ట్, సిరియన్ సైనికుల మీద ప్రతీకారం తీర్చుకున్న తరువాత యుద్ధం ముగింపుకు వచ్చింది. అయినప్పటికీ 2,500 మంది ఇజ్రాయిల్ సైనికులు మరణించారు. యుద్ధం జరిగిన 20 రోజులలో మొత్తంగా 10-35,000 మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధఫలితాలపై ప్రజలు కోపోద్రిక్తత ప్రధాని రాజీనామాకు దారితీసింది.

2021 ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం

ఇజ్రాయెలీ-పాలస్తీనా వివాదం 2021 మే 10న ప్రారంభమైంది.మే 21న కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చే వరకు కొనసాగింది

అదనపు యుద్ధాలు , శాంతి ఒప్పందాలు

1976 జూలైలో టెల్ అవివ్‌కు పయనం చేస్తున్న ఒక ఎయిర్ లైనర్ హైజాక్ చేయబడి ఉగాండాలోని ఎంటెబ్బా ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో లాండ్ చేయబడింది. ఇజ్రాయిల్ కమాండోలు 106 మంది ఇజ్రాయేల్ బంధీలలో 102 మందిని విజయవంతంగా విడిపించారు. 1977 లో ఇజ్రాయిల్‌లో జరిగిన ఎన్నికలు ఇజ్రాయిల్ రాజకీయాలలో మలుపుగా మారింది. ఎన్నికల తరువాత లేబర్ పార్టీ నుండి లికుద్ పార్టీ అధికారాన్ని కైవశం చేసుకుంది. అదే సంవత్సరం ఈజిప్ట్ అధ్యక్షుడు " అంవర్ ఇ.ఎల్ సాదత్ " ఇజ్రాయిల్‌కు సందర్శన నిమిత్తం వెళ్ళాడు. తరువాత రెండు సంవత్సరాలకు సాదత్, బెగిన్ ఇజ్రాయి- ఈజిప్ట్ శాతి ఒప్పందం మీద సంతకం చేసారు. బదులుగా ఇజ్రాయిల్ సినై ద్వీపకల్పాన్ని (దీనిని ఇజ్రాయిల్ 1967 ఆరవ రోజు యుద్ధంలో స్వాధీనం చేసుకుంది) ఈజిప్ట్‌కు అందజేసింది. అలాగే వెస్ట్ బ్యాంక్, గాజా పట్టీల మీద పాలస్తినా స్వయంప్రతిపత్తి కొరకు రాజీప్రయత్నాలకు ఇజ్రాయిల్ అంగీకారం తెలిపింది. 1978 మార్చి 11న పి.ఎల్.ఒ లెబనాన్ నుండి సాగించిన గొరిల్లా దాడి కోస్టల్ రోడ్డు మూకుమ్మడి హత్యలకు దారితీసింది. ప్రతిస్పందనగా ఇజ్రాయిల్ 1978 లో దక్షిణ లెబనాన్ మీద దాడి చేసి లితాని నదీ ప్రాంతంలో ఉన్న పి.ఎల్.ఒ బేసెస్‌మీద దడి చేసింది. పి.ఎల్.ఒ సైనికులు యుద్ధం నుండి వైతొలిగారు. యు.ఎన్ సైనికులు, లెబనాన్ సైనికులు స్వాధీనం చేసుకునే వరకు దక్షిణలెబనాన్ ప్రాంతం ఇజ్రాయిల్ స్వాధీనంలో ఉంది. పి.ఎల్.ఒ తిరిగి శక్తివంతమై ఇజ్రాయిల్ మీద దాడులు కొనసాగించింది. తరువాత సంవత్సరం పి.ఎల్.ఒ దక్షిణప్రాంతంలో చేరి సరిహద్దులలో తన బృందాలను నిలిపింది. ఇజ్రాయిల్ ప్రతీకారంగా పలు వాయుమార్గ, భూమార్గ దాడులు చేసింది. మరొకవైపు బెగిన్ ప్రభుత్వం ఇజ్రాయిల్ ప్రజలు ఇజ్రాయిల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో స్థిరప్డడాన్ని ప్రోత్సహించింది. ఫలితంగా ఈ ప్రాంతంలో పాలస్తీనీయులు, ఇజ్రాయిల్ ప్రజలమద్య ఘర్షణలు అధికం అయ్యాయి. 1980లో జెరుసలేం బేసిక్ లా రూపొందించబడింది. 1981 లో ఇజ్రాయిల్ గోలన్ హైట్స్‌ను విలీనం చేసుకుంది. అయినప్పటికీ విలీనం అంతర్జాతీయంగా గుర్తించబడలేదు. 1981 జూన్ 7న ఇరాక్ అణుబాంబు తయారీని నిలిపివేసేక్రమంలో ఇజ్రాయిల్ వాయుసేన ఇరాక్ సోల్ న్యూక్లియర్ రియాక్టర్‌ను ధ్వంసం చేసింది. న్యూక్లియర్ రియాక్టర్ బాగ్దాద్‌కు వెలుపల నిర్మాణదశలో ఉంది. 1982 లో పి.ఎల్.ఒ ఇజ్రాయిల్ మీద వరుసదాడులు చేసింది. అదే సంవత్సరం పి.ఎల్.ఒ బేసెస్ (ఇక్కడి నుండి పి.ఎల్.ఒ ఉత్తర ఇజ్రాయిల్ మీద మిస్సైల్ దాడి చేసింది) లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ లెబనాన్ మీద దాడిచేసింది. మొదటి ఆరురోజుల యుద్ధంలో ఇజ్రాయిల్ పి.ఎల్.ఒ సైనిక దళాన్ని ధ్వంసం చేసి సిరియన్లను ఓడించింది. ఇజ్రాయిల్ మీద పాలస్తీనియన్ తీవ్రవాద దాడులకు ప్రతిస్పందనగా తుయిన్ లోని పి.ఎల్.ఒ ప్రధానకార్యాలయం మీద దాడిచేసింది. 1986లో ఇజ్రాయిల్ లెబనాన్ లోని అధికభాగం నుండి వైదొలగింది. అయినప్పటికీ 2000 వరకు ఇజ్రాయిల్ ఆక్రమిత దక్షిణ లెబనాన్ ఇజ్రాయిల్ స్వాధీనంలోనే ఉంది. ఇజ్రాయిల్ సంప్రదాయ వైవిధ్యం 1980, 1990 మద్య జరిగిన వలసల కాలంలో విస్తరించింది. 1980-1990 మద్య కాలంలో యూదులు ప్రవాహంలా ఇజ్రాయిల్‌కు వచ్చిచేరారు. 1990, 1994 రష్యన్లు ఇజ్రాయిల్‌కు వలసగా వచ్చారు. తరువాత ఇజ్రాయిల్ జనసంఖ్య 12% అధికరించింది. పాలస్తీనియన్ తిరుగుబాటు కారణంగా 1987లో ఇజ్రాయిల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, గాజాపట్టీలలో విధ్వంసం, హింస చెలరేగాయి. తరువాత ఆరు సంవత్సరాలు ఇంతిఫదా మరింత ప్రణాళికాబద్ధంగా మారడమే కాక ఆర్థికం సంసంస్కృతి పరంగా శక్తివంతమై ఇజ్రాయిల్ ఆక్రమణను అడ్డుకునేప్రయత్నం చేసింది. హింసాత్మకచర్యల కారణంగా 1000 మందికంటే అధికంగా ప్రాణాలు కోల్పోయారు. 1991 గల్ఫ్ యుద్ధం సమయంలో సదాం హుస్సేన్ మద్దతుతో పి.ఎల్.ఒ ఇజ్రాయిల్, సౌదీ అరేబియా మీద మిస్సైల్ ప్రయోగం చేసింది. ఇజ్రాయిల్ తిరుదాడి చేసినప్పటికీ యుద్ధంలో భాగస్వామ్యం వహించలేదు.

ఇజ్రాయిల్ 
Bill Clinton watches Jordan's King Hussein (left) and Israeli Prime Minister Yitzhak Rabin (right) sign the Israel–Jordan peace treaty

1992 లో ఇజ్రాయిల్ ఎన్నిక తరువాత ఇత్ఝక్ రాబిన్ ప్రధానమంత్రి అయ్యాడు. ఇత్ఝక్ రాబిన్ పార్టీ పొరుగుదేశాలతో రాజీపడతామని పిలుపు ఇచ్చింది. తరువాత సంవత్సరం ఇజ్రాయిల్ తరఫున షిమాన్ పెరెస్, పి.ఎల్.ఒ తరఫున ముహమ్మద్ అబ్బాస్ ఓస్లో అకార్డ్స్ ఒప్పందం మీద సంతకం చేసారు. ఇది పాలస్తీనియన్లకు వెస్ట్ బ్యాంక్, గాజాపట్టిల ఆధీనతను ఇచ్చింది. పి.ఎల్.ఒ కూడా తీవ్రవాదానికి ముగింపు పలికింది. 1994 లో ఇజ్రాయిల్- జోర్డాన్ ఒప్పందం మీద సంతకం చేయబడింది. ఈ కారణంగా ఇజ్రాయిల్ సంబంధాలను చక్కదిద్దిన రెండవ అరబ్ దేశంగా జోర్డాన్ గుర్తించబ డింది. ఇజ్రాయిల్ సెటిల్మెంట్, ఇజ్రాయిల్ చెక్ పాయింట్స్, ఆర్థిక పరిస్థితుల కారణంగా అకార్డ్‌కు అరబ్ ప్రజలు ఇచ్చిన మద్దతు దెబ్బతిన్నది. ఇజ్రాయిల్ ప్రజలు అకార్డ్‌కు మద్దతివ్వడం సన్నగిల్లిన తరువాత పాలస్తీనియన్ సూసైడ్ అటాక్స్ అధికరించాయి. చివరిగా 1995 లో శాంతి ప్రదర్శన జరిగే సమయంలో అకార్డ్‌ను వ్యతిరేకించిన " ఫార్ రైట్ - వింగ్ జూ " యత్ఝక్ రాబిన్‌ను కాల్చివేంది. 1990 చివరినాటికి బెంజిమిన్ నెతన్యహు నాయకత్వంలో హెబ్రాన్ నుండి వెనుకకు మరలింది. అలాగే వే రివర్ మెమొరాండం మీద సంతకం చేసింది.

తరువాత ఇజ్రాయిల్ ప్రధానమంత్రి ఎన్నికలు (1999) తరువాత ఇజ్రాయిల్ దక్షిణ లెబనాన్ నుండి సైన్యాలను వెనుకకు తీసుకుంది. తరువాత కేంప్ డేవిడ్ సమ్మిట్‌ (2000) సమయంలో ఇజ్రాయిల్ పాలస్తీనియన్ అథారిటీ చైర్మన్ యాసర్ అరాఫత్‌, బిల్ క్లింటన్‌తో రాజీ ప్రయత్నాలు నిర్వహించింది. సమ్మిట్ సమయంలో పాలస్తీనియన్ దేశం గురించిన ప్రతిపాదన వెలువడింది. గాజా పట్టీ, 90% వెస్ట్ బ్యాంక్ కలిపి పాలస్తీన ఏర్పాటు చేసి ఇజ్రాయిల్, పాలస్తీనాలకు జెరుసలేం ఉమ్మడి రాజధానిగా ఉండేలా చేయాలని ప్రదిపాదించబడింది. డేవిడ్ కేంప్ సమ్మి ట్ ఇరువర్గాల నిందలను ఎదుర్కొన్నది. చర్చలు విఫలం తరువాత రెండవ ఇంతిఫా ప్రారంభించబడింది. 2001లో షరాన్ ఇజ్రాయిల్ ప్రధానమంత్రి అయ్యాడు. షరాన్ చేసిన ప్ర ణాళిక విఫలం కావడంతో ఇంతిఫా ముగింపుకు వచ్చింది. ఈ సందర్భంలో 1,100 ఇజ్రాయిలీలు సూసైడ్ బాంబింగ్ కారణ ంగా మరణించారు 2008 ఏప్రిల్ 30 దుర్ఘటనలో ఇజ్రాయిల్ సెక్యూరిటీలో 4,745 మరణించారు. వీటిలో 44 మరణలు ఇజ్రాయిల్ పౌరుల కారణం జరిగాయి. పాలస్తీనా పౌరుల కారణంగా 577 మరణాలు సంభవించాయి. 2006 జూలైలో ఉత్తర ఇజ్రాయిల్ సరిహద్దులో హెజ్బుల్లా ఫిరంగిదాడి, సరిహద్దు అతిక్రమణ జరిగింది. ఇజ్రాయిల్ సైనికుల నిర్భందం కారణంగా ఒక మాసంపాటు రెండవ లెబనాన్ యుద్ధం జరిందింది. 2007 సెప్టెంబరు 6న ఇజ్రాయిల్ వాయుసేన సిరియా లోని న్యూక్లియర్ రియాక్టర్‌ను ధ్వంసం చేసింది. 2008 మే మాసంలో టర్కీ మద్యవర్తిత్వంతో సిరియాతో చర్చలు జరపడానికి ఇజ్రాయిల్ అంగీకారం తెలిపింది. అయినప్పటికీ ఇజ్రాయిల్, హమాస్ మద్య కాల్పుల విరమణ ముగింపుకు రావడంతో ఇజ్రాయిల్ మరొక యుద్ధం ఎదుర్కొన్నది. హమాస్ తన తరఫున స్వయంగా కాల్పులవిరమణ ప్రకటన చేసింది. 2012 నవంబరున గాజాలో ఇజ్రాయిల్ నిర్వహించిన ఆపరేషన్ 8 రోజులలో ముగింపుకు వచ్చింది. 2014లో గాజా మీద హామాస్ చేసిన రాకెట్ దాడి కారణంగా ఇజ్రాయిల్ మరొక ఆపరేషన్ ప్రారంభించింది.

భౌగోళికం

ఇజ్రాయిల్ 
A satellite image of Israel and surrounding territories

మధ్యధరా తూర్పు తీరంలో ఇజ్రాయిల్ ఉంది. దేశం ఉత్తర సరిహద్దులో లెబనాన్, వాయవ్య సరిహద్దులో సిరియా, తూర్పు సరిహద్దులో జోర్డాన్, వెస్ట్ బ్యాంక్, ఆగ్నేయ సరిహద్దులో ఈజిప్ట్, గాజా పట్టీ ఉన్నాయి. ఇజ్రాయిల్ 29° & 34° ఉత్తర అక్షాంశం, 34° & 36° తూర్పు రేఖాంశంలో ఉన్నాయి. ఆరురోజుల యుద్ధం సమయంలో ఆక్రమించినప్రాంతంతో కలిసిన ఇజ్రాయిల్ వైశాల్యం 20770 చదరపు కి.మీ. జెరుసలేం, గోలన్ హైట్స్ ప్రాంతాలతో చేరిన మొత్తం ప్రాంతం ఇజ్రాయిల్ న్యాయపరిధిలో ఉంది. ఇజ్రాయిల్ ఆధీనంలో మిలటరీ ఆధీనప్రాంతం, పాలస్తీనియన్ ప్రాంతం వెస్ట్ బ్యాంక్ ప్రాంతంతో చేరిన మొత్తం (27799చ.కి.మీ) ఉంది. ఇజ్రాయిల్ వైవిధ్యమైన భౌగోళికస్థితి కలిగి ఉంటుంది. దక్షిణంలో నెగెవ్ ఎడారి, జెజ్రీల్ లోయ, ఉత్తరంలో గలిలీ పర్వతశ్రేణి, కార్మెల్ పర్వతం, గోలన్ హైట్ ప్రాంతాలు ఉన్నాయి. మధ్యధరా సముద్రతీర మైదానంలో 57% ప్రజలు నివసిస్తున్నారు. సెంట్రల్ హైలాండ్ తూర్పు దిశలో జోర్డాన్ రిఫ్ట్ లోయ ఉంది.

ఇజ్రాయిల్ 
Ramon Crater, a unique type of crater that can be found only in Israel and the Sinai peninsula
ఇజ్రాయిల్ 
The Sea of Galilee and Tiberias.
ఇజ్రాయిల్ 
Gulf of Eilat, Red Sea
ఇజ్రాయిల్ 
Mount Tabor in Lower Galilee

జోర్డాన్ రిఫ్ట్ లోయ వెంట జోర్డాన్ నది ప్రవహిస్తుంది. జోర్డాన్ నది హెర్మన్ పర్వతం నుండి హులాహ్ లోయగుండా ప్రవహించి డెడ్ సీని చేరుకుంటుంది. నెగెవ్‌లో రామన్ క్రేటర్ ఉంది. మధ్యధరా బేసిన్ ప్రాంతంలో అనేక జాతుల చెట్లు ఉన్నాయి.

భౌగోళికం

టెక్టానిక్ మూవ్మెంటుకు సాక్ష్యంలో జోర్డాన్ రిఫ్ట్ లోయ నిలిచిఉంది. ఈ ప్రాంతంలో పలు భూకంపాలు సంభవించాయి.

  • క్రీ.పూ 92 – సముద్రతీరంలో సునామీసంభవించింది.
  • క్రీ.పూ 140 – టైరే, ప్టోలెమసిస్
  • క్రీ .పూ 31 – జోర్డాన్ లోయలోని ఎపిక్ సెంటర్ 7 రిక్టఋ మాగ్నిట్యూడ్ పరిమాణంలో సంభవించింది. (2000 సంవత్సరాలలో సంభవించిన అతి పెద్ద భూకంపం).

ఈ భూకంపంలో 30,000 మంది మరణించారని జోసెఫస్ వ్రాసాడు. Damages Emmaus and Caesarea.

  • క్రీ.పూ 115 –సునామీలో యవ్నే, సీసరియా ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
  • 130 – బలమైన భూకంపం సీసరియా ప్రాంతాలలో సంభవించింది. Different sources give varying dates: 129, 131
  • 306 –లెవెంత్ లైన్ తీరంలో సునామీ సంభవించింది. Affects or is felt in Caesarea, Tiberias, Jerusalem.
  • 363 –గలిలీ భూకంపం. (క్రీ.పూ 365 ) భూకంపం.
  • 419 –భూకంపం అంతిపత్రిస్ ప్రాంతాన్ని నిర్మూలం చేసింది.
  • 502 –ప్టోలెమాసిస్‌లో విధ్వంసం సృష్టించింది.),సునామీ ఉత్తరతీరాన్ని తాకింది. Safed, Latrun (Nicopolis) affected
  • 551 –మిడి ఈస్ట్ ప్రాంతంలో విధ్వంసం సృష్టించింది. లెవెంత్ సీ ప్రాంతంలో అతి పెద్ద విపత్తులలో ఇది ఒకటి. గుష్ హలవ్ విధ్వంసం అయింది. సీసరియా నుండి లెబనాన్‌లోని త్రిపోలి వరకు విధ్వంసం సృష్టించింది.
  • 633 –యార్మౌక్ నది లోయ ప్రాంతంలోని అల్- హమ్మా విధ్వంసానికి గురైంది.
  • 658 – సిరియా, పాలస్తీనా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వార్తాపత్రికల కథానాలు ఆధారంగా జెరుసలేం తీవ్రంగా దెబ్బతిన్నదని భావిస్తున్నారు.
  • 672 – శక్తివంతమైన భూకంపానికి అస్క్లాన్, గాజా నగరం, రమ్లా ప్రాంతాలు విధ్వంసానికి గురైయ్యాయి.
  • 746–749 – వరుస భూకంపాలు తరచుగా సంభవించాయి (749 గలిలీ భూకంపాలు). తిబరియాస్, బేసన్, బెయిట్ షెయాన్, హిప్పోస్ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జోర్డాన్ లోయలో భూకంపం 7.6గా నమోదు అయింది.
  • 808 – భూకంపం జెరుసలేంను విధ్వంసం చేసింది.
  • 881 – లెవెంత్ లైన్ తీరంలో సునామీ ఆరంభమై అక్రే ప్రాంతాన్ని ధ్వంసం చేసింది.
  • 1016 – Jerusalem, Jaffa and the region around are affected
  • 1033–34 – 40 రోజులపాటు ప్రకంపనలు సృష్టించిన భూకంపం రమ్లా, జెర్కొ, నబ్లస్ ప్రాంతాలను ధ్వంసం చేసింది.
  • 1063 –లెవెంత్ లైన్ లిటోరియల్ ప్రాంతాన్ని భూకంపం ధ్వంసం చేసింది.
  • 1068 – భూవిధ్వంసం (గ్రౌండ్ - రప్టింగ్) రమ్లాను సంపూర్ణంగా ధ్వంసం చేసింది. 15,000-25,000 నివాసాలను ధ్వంసం చేసిన తరువాత 4 సంవత్సరాలకాలం విసర్జించబడింది.

.

  • 1070 –బెగ్గా లోయలో సంభవించిన భూకంపం పాలస్తీనాలో విధ్వంసం సృష్టించింది.
  • 1091 – సముద్రతీర పట్టణాలు, నగరంలోని గోపురాలు ధ్వంసం అయ్యాయి.
  • 1170 – ట్రిమోర్ సీసరియా ప్రాంతాన్ని దెబ్బతీసింది.
  • 1202 –1202 సిరియా భూకంపం.
  • 1261 – అక్కో, ట్రిపోలి ద్వీపాలు అదృశ్యం అయ్యాయి.
  • 1752 –భూకంపం సిరియా, పాలస్తీనాలో విధ్వంసం సృష్టించింది.
  • 1837 – గలిలీ భూకంపాన్ని సఫేద్ భూకంపంగా వర్ణించారు.
  • 1898 - హైఫా ధ్వంసం అయింది.
  • 1927 – జెరిచో భూకంపం. ఉత్తర సరిహద్దులోని డెడ్ సీ ప్రాంతంలో సంభవించింది. జెరుసలేం, జెరికో, రమ్లె, టిబెరియాస్, నబ్లస్ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంప ప్రభావానికి దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయారు. . జెరుసలేంలో 130 మది మరణించారు 450 మంది గాయపడ్డారు. 300 నివాసాలు ధ్వంసం అయ్యాయి. చర్చ్ ఆఫ్ హోలీ సెపుల్చరే, అల్- అక్వసా మసీదు గోపురాలు పడిపోయాయి. నబ్లస్ ప్రాంతంలో 300 భవనాలు ధ్వంసం అయ్యాయి. వీటిలో అన్- నాస్ర్ మసీదు గ్రేట్ మసీద్ ఆఫ్ నబ్లస్‌లు ఉన్నాయి. నబ్లస్‌లో 150 మంది మరణించారు 250 గాయపడ్డారు. అలెంబీ వంతెన పడిపోయింది. మార్ క్లిఫ్ట్ పడిన కారణంగా 21 గంటలకాలం జోర్డాన్ ప్రవాహం ఆగింది.

రమ్లా, టిబరియాస్ తీవ్రంగా విధ్వంసం అయ్యాయి.

గణాంకాలు

ఇజ్రాయిల్ 
Percentage changes of the main religious groups in the years 1949–2008

2015 సెప్టెంబరులో ఇజ్రాయిల్ జనసంఖ్య 8.412 మిలియన్లు. వీరిలో 6.3 మిలియన్లు ఇజ్రాయిల్ యూదులుగా ప్రభుత్వంచేత నమోదుచేయబడ్డారు. ప్రజలలో 17,46,000 అరబ్బులు (20.7%), 3,36,000 ఇతర అరేబియన్ క్రైస్తవులు, ఏమతానికి చెందనివారు 4.4% ఉన్నారు. గతశతాబ్దంలో రొమానియా, తాయ్‌లాండ్, చైనా, ఆఫ్రికా, దక్షిణ దక్షిణ అమెరికా చెందిన వలసప్రజలు ఇజ్రాయిల్‌లో స్థిరపడ్డారు. వీరి సంఖ్య గురించిన కచ్చితమైన గణాంకాలు లేవు. వీరిలో అత్యధికులు చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారు. అయినప్పటికీ అంచనాలను అనుసరించి 20,3000. 2012 జూన్ నాటికి దాదాపు 60,000 వలసప్రజలు చట్టవిరుద్ధంగా ఇజ్రాయిల్‌లో ప్రవేశించారు. ఇజ్రాయిల్‌లో 92% ప్రజలు నగరప్రాంతంలో నివసిస్తున్నారు. ఇజ్రాయిల్ నుండి అమెరికా, కెనడాలకు అధికంగా వలసవెళ్ళారు. ఇజ్రాయిల్ భవిష్యత్తుకు వలస బాధిస్తుందని ఇజ్రాయిల్ మంత్రులు తరచుగా ఆందోళన వెలిబుచ్చారు. వెస్ట్ బ్యాంకు సెటిల్మెంట్లలో 3,00,000 కంటే అధికమైన ప్రజలు నివసిస్తున్నారు. మాలే అడుమిం, ఏరియల్ నగరం ఇజ్రాయిల్ ఏర్పాటుకు ముందే స్థాపించబడ్డాయి. హెబ్రాన్, గుష్ ఎత్జియన్ 6 రోజుల యుద్ధం తరువాత తిరిగి స్థాపించబడ్డాయి. 2011 గణాంకాలు అనుసరించి 2,50,000 యూదులు తూర్పు ఇజ్రాయిల్‌లో నివసిస్తున్నారని అంచనా. 20,000 ఇజ్రాయిల్ పౌరులు గోలాన్ హైట్స్‌లో నివసిస్తున్నారు. ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న మొత్తం ఇజ్రాయిల్ వలస ప్రజల సంఖ్య 5,00,000 (6.5%). గాజాస్ట్రిప్ సెటిల్మెంట్లలో 7,800 ఇజ్రాయిల్ పౌరులు నివసిస్తున్నారు. ఇజ్రాయిల్ డిస్ ఎంగేజ్మెంటు ప్రణాళికలో ఇజ్రాయిల్ ప్రజలు 2005 నుండి గాజాస్ట్రిప్ నుండి వెలుపలికి పంపబడ్డారు.

ఇజ్రాయిల్ 
Immigration to Israel in the years 1948–2008. The two peaks, of at least 200,000 each, were in 1949 and 1990.

ఇజ్రాయిల్ యూదులకు నివాస ప్రాంతంగా స్థాపించబడింది. ఇది తరచుగా యూదులరాజ్యంగా భావించబడుతుంది. ఇజ్రాయిల్ చట్టం యూదసంతతికి చెందిన ప్రజలకు ఇజ్రాయిల్ పౌరసత్వ హక్కు కలిగిస్తుంది. ప్రజలలో 75.5% ప్రజలు యూదులు. ఇతరసంప్రదాయాలకు చెందిన ప్రజలు 4% (3,00,000) ఉన్నారు. రష్యన్ వలసప్రజలలోని యూదులకు రాబింషియల్ చట్టం అనుసరించి యూదుకుగా పరిగణొంచనప్పటికీ " లా ఆఫ్ రిటర్న్ " అనుసరించి ఇజ్రాయిల్ పౌరసత్వం లభిస్తుంది. దాదాపు 73% ఇజ్రాయిల్ యూదులు ఇజ్రాయిల్‌లో జన్మించిన ప్రజలు. 18.4% ఐరోపా నుండి వలసవచ్చిన ప్రజలు. 8.6% ప్రజలు ఆసియా, ఆఫ్రికా నుండి వలస వచ్చినవారున్నారు. ఐరోపా, మునుపటి సోవియట్ యూనియన్ నుండి వలసవచ్చిన ఇజ్రాయిల్ సంతతికి చెందిన యూదులు 50% ఉన్నారు. అరేబియన్ దేశాల నుండి పారిపోయి వచ్చిన యూదులు (మిజ్రాహి, సెఫర్దీ యూదులు) ఇజ్రాయిల్‌లో నివసిస్తూ ఉన్నారు. వీరుకాక ఇతరప్రాంతాలకు చెందిన యూదులు ఉన్నారు. మతాంతర వివాహాలు చేసుకున్న యూదులు 35% ఉన్నారు. సెఫర్దీ, అష్కెనాజీ యూదులు వార్షికంగా 0.5% అధికరిస్తున్నారు. ఈ రెండు సమాజాలకు చెందిన విద్యార్థుల శాతం 25%.

రాజకీయాలు

ఇజ్రాయిల్ 
The Knesset chamber, home to the Israeli parliament

ఇజ్రాయిల్ పార్లమెంటు విధానం, సార్వత్రిక ఓటుహక్కు కలిగిన ఒక ప్రజాతంత్ర రాజ్యం. పార్లమెంటు సభ్యుల ఓట్ల ఆధిక్యతతో ప్రధానమంత్రి ఎన్నిక చేయబడతాడు. సాధారణంగా ఆధిక్యత కలిగిన పార్టీ సభ్యుడు ప్రధానమంత్రిగా ఎన్నిక చేయబడతాడు. . ఇజ్రాయిల్ పార్లమెంటు 120 సభ్యులను (నెస్సెట్స్) కలిగి ఉంటుంది. ఇజ్రాయిల్‌ను సంకీర్ణ ప్రభుత్వాలు పాలించాయి. ప్రతి నాలుగు సంవత్సరాలకు పాత్కమెంటు ఎన్నికలు జరిగుతుంటాయి. అస్థిరమైన సంకీర్ణ ప్రభుత్వాలు అవిశ్వాస తీర్మానాలతో త్వరితగతిలో పతనం చెందుతుంటాయి. అధ్యక్షుడు రాజ్యాధిపతిగా పరిమితమైన అధికారంతో రాజ్యాంగ ఉత్సవాల బాధ్యతలను నిర్వహిస్తుంటాడు.

చట్టం

ఇజ్రాయిల్ 
Supreme Court of Israel, Givat Ram, Jerusalem

ఇజ్రాయిల్ " త్రీటైర్ జ్యుడీషియల్ - సిస్టం " (మూడంచల న్యాయవ్యవస్థ) విధానం కలిగి ఉంది. దిగువస్థాయిలో మెజిస్ట్రేట్ కోర్టులు దేశంలోని అన్ని ప్రధాననగరాలలో ఏర్పాటుచేయబడి ఉంటాయి. వీటికి పైస్థాయిలో డిస్ట్రిక్ కోర్టులు (జిల్లా న్యాయస్త్యానాలు) ఉంటాయి. ఇందులో అప్పీల్ సేవలు, ట్రై కోర్టులు ఉంటాయి. ఇజ్రాయిల్ లోని ఆరు జిల్లాలలో ఐదింటిలో ఈ కోర్టులు ఏర్పాటుచేయబడి ఉంటాయి. మూడవ స్థాయిది హైయ్యర్ టైర్ కోర్టుగా సుప్రీం కోర్టు సేవలు అందిస్తుంది. ఇది జెరుసలేం నగరంలో ఉపస్థితమై ఉంటుంది. ఇది హైకోర్ట్, అప్పీల్ కోర్టుగా సేవలు అందిస్తుంది. అంతేకాక సుప్రీం కోర్టు మొదటి స్థాయి వ్యక్తిగత ఫిర్యాదులను స్వీకరిస్తుంది. ఇక్కడ పౌరులు, ఇజ్రాయిల్ పౌరసత్వం లేనివారు కూడా న్యాయసేవలు పొందడానికి అవకాశం లభిస్తుంది. ఇజ్రాయిల్ న్యాయవ్యవస్థ మూడు న్యాయవ్యవస్థల మిశ్రితమై ఉంటుంది: ఇంగ్లీష్ లా, కామన్ లా, సివిల్ లా, జ్యూయిష్ లా. ఇది స్టేట్ డిసిసిస్ ఆధారితంగా పనిచేస్తుంది. కోర్టు కేసుల తుది నిర్ణయాన్ని జ్యూరీకి బదులుగా జడ్జి నిర్ణయిస్తాడు. వివాహం, విడాకులు మతపరమైన న్యాయవ్యవస్థ న్యాయపరిధిలో ఉంటాయి: జ్యూయిష్, ముస్లిం, క్రైస్తవ. పార్లమెంటు సభ్యుల కమిటీ, సుప్రీకోర్టు జడ్జీలు, ఇజ్రాయిల్ బార్ సభ్యులు జడ్జీలను ఎన్నుకుంటారు. ఇజ్రాయిల్ జనరల్, లేబర్ కోర్టుల నిర్వహణ జెరుసలేంలో ఉన్న " అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కోర్టు " ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. జనరల్, లేబర్ కోర్టులు పేపర్ లెస్ గా పనిచ్ ఏస్తాయి: కోర్టు ఫైల్స్ ఎలెక్ట్రానిక్ రూపంలో బధ్రపరచబడి ఉంటాయి. ఇజ్రాయిల్ బేసిక్ లా (హ్యూమన్ డిగ్నిటీ, లిబర్టీ) ఇజ్రాయిల్ పౌరుల మానహక్కులు, స్వాతంత్ర్యం కోరుతుంది.

మతం

ఇజ్రాయిల్‌కు అధికార మతం లేదు. అయితే ఇజ్రాయిల్ యూదుల స్వతంత్రదేశం. ఇది యూదులతో శక్తివంతమైన సంబంధాలు కలిగి ఉంది. అలాగే రాజ్యాంగ చట్టం, మత చట్టాలు యూదులతో సంబంధం కలిగి ఉంటాయి. రాజకీయ పార్టీలు రాజ్యాంగం, మతం మద్య సమతుల్యం పాటిస్తూ పనిచేస్తుంటాయి.

నిర్వహణా విభాగాలు

ఇజ్రాయిల్ Golan HeightsNorthern District (Israel)Haifa DistrictHaifa DistrictCentral District (Israel)Central District (Israel)Tel Aviv DistrictSouthern District (Israel)Jerusalem DistrictJudea and Samaria AreaWest Bank
A clickable map of Israel.

ఇజేఅయిల్ దేశం 6 ప్రధాన నిర్వహణావిభాగాలుగా (మెహొజాత్ ఏకవచనంలో మెహోజ్) విభజించబడింది. సెంట్రల్ డిస్ట్రిక్, హైఫా డిస్ట్రిక్, జెరుసలేం డిస్ట్రిక్, నార్త్ డిస్ట్రిక్ (ఇజ్రాయిల్), సదరన్ డిస్ట్రిక్, టెల్ అవివ్ డిస్ట్రిక్. అలాగే వెస్ట్ బ్యాంకులోని జుడియా, సమరియాలు కూడా ఇజ్రాయిల్‌లో భాగంగా ఉన్నాయి. జుడియా, సమరియా మొత్తం భాగం, జెరుసలేంలో కొంతభాగం, నార్త్ డిస్ట్రికులను అంతర్జాతీయంగా ఇజ్రాయిల్ భూభాగాలుగా గుర్తించబడలేదు. డిస్ట్రికులు అదనంగా సబ్- డిస్ట్రిక్కులుగా (నఫాత్ ఏకవచనంలో నఫా) విభజించబడ్డాయి. నఫాలు వాటికవి 50 సహజభూభాలుగా విభజించబడ్డాయి.

డిస్ట్రిక్ ప్రధాన జిల్లా సబ్- డిస్ట్రిక్ జనసంఖ్య
నార్తెన్ డిస్ట్రిక్ నజరెహ్ ఏక్రె, కార్మీ, కిర్యత్, నజరేత్ ఇల్లిత్, క్వాట్స్రిన్, సఫేద్, టిబెరియాస్. 1,242,100
హఫియా డిస్ట్రిక్ హఫియా హఫియా, హదెర 880,000
సెంట్రల్ డొస్ట్రిక్ రమ్లా హెర్జ్లియా, క్ఫర్ సబా, మొడి ఇన్ - మక్కాబిమ్- రియుట్, నెతన్యా, పెతాహ్ టిక్వ, రాననా, రమ్లా, రెహివోట్, రిషన్ లెజియన్. 1,770,200
టెల్ అవివ్ డిస్ట్రిక్ టెల్ అవివ్ బాత్ యాం, బ్నెయీ బ్రాక్, గివతయిం, హోలోన్, రమాత్ గాన్, టెల్ అవివ్. 1,227,000
జెరుసలేం డిస్ట్రిక్ జెరుసలేం జెరుసలేం, మెవసెరెట్ జియాన్. 910,300 ( 200,000 ఇజ్రాయిల్ సెటిలర్స్‌, 208,000 పాలస్తీనియన్లు.)
సదరన్ డిస్ట్రిక్ బీర్షెబా అష్బాద్, అష్కెలాన్,ంబీర్షెబా, ఎయిలాత్, కిర్యాత్ గాట్, స్డెరాట్. 1,053,600
జుడియా, సమరియా ఏరియా (వెస్ట్ బ్యాంక్) ఏరియల్ సిటీ ఏరియల్, బెయొతర్ ఇల్లిత్, మాలే అదుమిం, మొదీన్ ఇల్లిట్. 375,000 ఇజ్రేలీ నగరాలు
~ 2.5 మిలియన్ పాలస్తీనియన్లు

గణాంకపరంగా దేశం మూడు మెట్రోపాలిటన్ మహానగర ప్రాంతాలుగా వుభజించబడింది: టెల్ అవివ్ మెట్రోపాలిటన్ ఏరియా జనసంఖ్య 32,06,400, హైఫా మెట్రోపాలిటన్ ఏరియా జనసంఖ్య 10,21,000, బీర్షెబా మెట్రోపాలిటన్ ఏరియా జనసంఖ్య 5,59,700. ఇజ్రాయిల్‌లో జనసంఖ్యా, వైశాల్య పరంగా 773,800 జసంఖ్య, 126 చ.కి.మీ వైశాల్యం కలిగిన జెరుసలేం అతిపెద్ద మునిసిపాలిటీగా ప్రాధాన్యత కలిగి ఉంది. తూర్పు జెరుసలేం వైశాల్యం, జనసంఖ్య కూడా జెరుసలేం మెట్రోపాలిటన్ ప్రాంతగణాంకాలలో చేర్చబడుతుంది. టెల్ అవివ్ (393,900), హైఫా (265,600), రిషన్ లెజియాన్ ( 227,600) ఇజ్రాయిల్ తరువాత స్థాయి అధికజనసంఖ్య కలిగిన ప్రాంతాలుగా గుర్తించబడుతున్నాయి.

ఇజ్రాయిల్ ఆక్రమిత భూభాగాలు

ఇజ్రాయిల్ 
Map of Israel showing the West Bank, the Gaza Strip, and the Golan Heights

1967లో ఆరురోజుల యుద్ధం ఫలితంగా ఇజ్రాయిల్, వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరుసలేం, గాజా పట్టీ, గోలన్ హైట్స్ ప్రాంతాలను ఆక్రమించింది. ఇజ్రాయిల్ సినై ద్వీపకల్పాన్ని కూడా ఆక్రమించింది. అయినప్పటికీ ఇజ్రాయిల్- ఈజిప్ట్ ఒప్పందం తరువాత ఈజిప్టుకు ఇజ్రాయిల్- ఈజిప్ట్ భూభాగాన్ని స్వాధీనం చేసింది. 1982 - 2000 మద్య ఇజ్రాయిల్ సదరన్ లెబనాన్‌లో కొంతభాగాన్ని (సదరన్ లెబనాన్ సెక్యూరిటీ బెల్ట్) ఆక్రమించింది. ఇజ్రాయిల్ ఆక్రమించిన ప్రాంతాలు అన్నింటిలో ఇజ్రాయిల్ సెటిల్మెంట్లను, సైనిక స్థావరాలను నిర్మించింది. ఇజ్రాయిల్ గోలన్ హైట్స్‌లో గోలన్ హైట్స్ లా, తూర్పు జెరుసలేంలో జెరుసలేం లా అమలుచేస్తూ ఉంది. అలాగే అక్కడి నివాసితులకు శాశ్వత నివాసహక్కు ఇస్తూ ఇజ్రాయిల్ పౌరసత్వం కొరకు అభ్యర్థించడానికి అనుమతి ఇస్తూ ఉంది. వెస్ట్ బ్యాంక్, ఇజ్రాయిల్ వెలుపలి సెటిల్మెంట్లలో మిలటరీ రూల్ అమలు చేయబడుతుంది. అలాగే ఈ ప్రాంతాలలో నివసిస్తున్న పాలస్తీనియన్లకు ఇజ్రాయిల్ పౌరసత్వం పొందడానికి అనుమతి లేదు. " డిస్మేనేజ్మెంట్ ఫ్రం గాజా "లో భాగంగా ఇజ్రాయిల్ గాజాపట్టీ నుండి తన సైన్యాలను , సెటిల్మెంట్లను తొలగించింది. అయినప్పటికీ ఇజ్రాయిల్ ఇక్కడ ఉన్న ఎయిర్ బేస్ , జలభాగం తన నియంత్రణలో ఉంచింది. యు.ఎన్ సెక్యూరిటీ గోలెన్ హైట్స్ , తూర్పు జెరుసలేంస్వాధీనత రద్దుచేయబడుతుందని ప్రకటించింది. ఇవి ఆక్రమిత ప్రాంతాలుగానే భావించబడతాయని కూడా ప్రకటించింది. " ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ లా ", ప్రింసిపల్ జ్యుడీషియల్ ఆర్గాన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయిల్ వెస్ట్ బ్యాంక్ సరిహద్దు నిర్మాణం అంతర్జాతీయంగా చట్టవిరుద్ధమని దృఢంగా చెప్పాయి. ఆరు రోజుల యుద్ధంలో ఆక్రమిచిన తూర్పు జెరుసలేం భూభాగం ఆక్రమిత ప్రాంతాలుగానే పరిగణించబడతాయని కూడా నొక్కి చెప్పాయి.

ఇజ్రాయిల్ 
East Jerusalem was occupied and later annexed by Israel in 1967

ఇజ్రాయిల్ ప్రభుత్వం , పాలస్తీనా ప్రతినిధుల మద్య జరగబోయే భవిష్యత్తు శాంతి ఒప్పందాలకు , రాజీ ప్రయత్నాలకు తూర్పు జెరుసలేం తీర్చలేని కఠిన సమస్యగా పరిణమించింది. రాజధానిగా తూర్పు జెరుసలేం భూభాగం మీద పూర్తి ఆధికారం ఉందని ఇజ్రాయిల్ భావిస్తుంది. ఈ ప్రాంతాల గురించి యు.ఎన్. సెక్యూరిటీ కౌంసిల్ చేసిన పలు రాజీప్రయత్నాలు చేసింది. ఇజ్రాయిల్ ఆక్రమిత ప్రాంతల నుండి వైదొలగి అరబ్ దేశాలతో అనుకూల వాతావరణం ఏర్పరుచుకోవాలని యు.ఎన్ సెక్యూరిటీ కౌంసిల్ పులుపు ఇచ్చింది.

ఇజ్రాయిల్ 
Israeli West Bank barrier separating Israel and the West Bank

1950లో జోర్డాన్ వెస్ట్ బ్యాంకును విలీనం చేదుకుంది. తరువాత పాలస్తీనాలో రెండు ప్రభుత్వాల ఏర్పాటుకు అరబ్ అభ్యంతరం తెలియజేసింది. బ్రిటన్ మాత్రమే ఈ విలీనాన్ని గుర్తించింది. ఇజ్రాయిల్- జోర్డాన్ శాంతి ఒప్పందం ఫలితంగా ఇజ్రాయిల్ " పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌కు " ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసింది. 1967లో ఆరు రోజుల యుద్ధం తరువాత వెస్ట్ బ్యాంక్‌ను ఇజ్రాయిల్ స్వాధీనం చేసుకుంది. ఇక్కడ అధికంగా పాలస్తీనియన్లు నివసిస్తుంటారు. వీరిలో " 1948 అరబ్ - ఇజ్రాయిల్ యుద్ధం " కారణంగా వచ్చి చేరిన ఆశ్రితులు కూడా ఉన్నారు. ఆక్రమణ తరువాత 1967 నుండి 1993లో ఈ ప్రాంతంలో నివసిస్తున్న పాలస్తీనియన్లు మిలటరీ చట్టం అనుసరించి జీవిస్తున్నారు. పాలస్తీనియన్ జనసంఖ్య, పాలస్తీనియన్ నగరాలు పాలస్తీనియన్ జ్యూరిడిక్షన్ న్యాయపరిధిలో ఉన్నాయి. పలుమార్లు ఇజ్రాయిల్ సైనికదళాలను వెనుకకు తీసుకుని తిరిగి అశాంతి నెలకొన్నసమయాలలో తిరిగి సైనిక స్థావరాలను ఏర్పాటుచేసింది. రెండవ ఇంతిఫాదా సమయంలో దాడులు అధికరించిన ఇజ్రాయిల్ ప్రభుత్వం వెస్ట్ బ్యాంక్ సరిహద్దును నిర్మించింది. సరిహద్దు నిర్మాణం 13% గ్రీన్ లైన్ మీద 87% వెస్ట్ బ్యాంక్ లోపల నిర్మించబడింది. ఇజ్రాయిల్ 1967 గాజా పట్టీని ఆక్రమించింది. 2005 ఇజ్రాయిల్ డిస్ ఎంగేజ్మెంట్‌లో భాగంగా ఇజ్రాయిల్ ఈ ప్రాంతంలో సే టిల్మెంట్లను, సైనికదళాలను వెనుకకు తీసుకుంది. గాజాప ట్టీని ఇజ్రాయిల్ ఆక్రమిత ప్రాంతంగా భావించలేదు. దీనిని పలు అంతర్జాతీయ, మానవీయ ఆర్గనైజేషన్లు విమర్శిస్తూ ఉన్నాయి. 2007 జూన్ తరువాత హమాస్ గాజాపట్టీ స్వాధీనపరచుకోవాలని ప్రయత్నించడం కారణంగా ఇజ్రాయిల్ భద్రత పఠిష్టం చేసింది. వాయు, జలమార్గాల ద్వారా చొరబాటును అడ్డగించింది. ఈజిప్ట్ 2011 వరకు గాజా సరిహద్దు చొరబాటును అడ్డగించింది. తరువాత గాజా సరిహద్దును తెరచి ఉంచుతామని ప్రకటించింది. .

విదేశీ సంబంధాలు

ఇజ్రాయిల్ 
  Diplomatic relations
  Diplomatic relations suspended
  Former diplomatic relations
  No diplomatic relations, but former trade relations
  No diplomatic relations
ఇజ్రాయిల్ 
The Israeli Foreign Ministry in Jerusalem

ఇజ్రాయిల్ 157 దేశాలతో దౌత్యసంబంధాలను, 100 దేశాలలో దౌత్యకార్యాలయాలు కలిగి ఉంది. పాకిస్తాన్,బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలతో ఇజ్రాయిల్‌కు దౌత్యసంబంధాలు లేవు. అరబ్ లీగ్‌లోని ముగ్గురు సభ్యదేశాలు మాత్రం ఇజ్రాయిల్ సంబంధాలను పునరుద్ధరించాయి. 1979లో ఈజిప్ట్- జోర్డాన్ దేశాలు ఇజ్రాయిల్‌తో శాంతి ఒప్పందం మీద సంతకం చేసాయి. 1979లో ఈజిప్ట్ - ఇజ్రాయిల్ ఒప్పందం, 1994లో ఇజ్రాయిల్- జోర్డాన్ ఒప్పందం చేయబడ్డాయి. 1999 లో మౌరిటానియా ఇజ్రాయిల్‌తో పూర్తిస్థాయి దౌత్యసంబంధాలు ఏర్పరచుకుంది. ఇజ్రాయిల్ - ఈజిప్ట్ మద్య ఒప్పందం తరువాత కూడా ఈజిప్ట్ ప్రజలు ఇజ్రాయిల్‌ను శత్రుదేశంగానే భావిస్తున్నారు. ఇజ్రాయిల్ చట్టం అనుసరించి లెబనాన్,సిరియా,సౌదీ అరేబియా,ఇరాన్,ఇరాక్,సుడాన్, యేమన్ దేశాలు శతృదేశాలుగా పరిగణించబడుతున్నాయి. ఇజ్రాయిల్ ఇంటీరియర్ మినిస్టరీ అనుమతి లేకుండా ఇజ్రాయిల్ ప్రజలు ఈ దేశాలలో ప్రవేశించలేరు. సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ దాదాపు ఏకకాలంలో ఇజ్రాయిల్ దేశాన్ని గుర్తించాయి. యునైటెడ్ స్టేట్స్ మిడిల్ ఈస్ట్ దేశాలలో ఇజ్రాయిల్ అత్యంత విశ్వసనీయ దేశంగా భావిస్తుంది. ప్రజాతంత్ర విలువలు, మతసంబంధమైన సామీప్యత, రక్షణ గురించిన ఆశక్తులు ఇరుదేశాల మద్య పఠిష్ఠమైన సంబంధం ఏర్పరుస్తున్నాయి. 1967 నుండి యునైటెడ్ స్టేట్స్ " ఫారిన్ అసిస్టెంస్ ఏక్ట్ " ద్వారా సైనిక సహాయంగా 68 బిలియన్ డాలర్లను ఇజ్రాయిల్‌కు అందించింది. 2003 వరకు మరే దేశం ఇజ్రాయిల్‌కు ఇంతకంటే అధికంగా సహకరించలేదు. ఇరుదేశాలమద్య సంబంధాలు వైవిధ్యమైన పలు రూపాలలో ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయిల్- పాలస్తీనా శాంతి ప్రయత్నాలను ప్రతిపాదించిన దేశాలలో ప్రధాన్యత వహిస్తుంది. గోల హైట్స్, జెరులేం, సెటిల్మెంట్ విషయంలో ఇజ్రాయిల్, యునైటెడ్ దేశాల అభిప్రాయాలు విభేదిస్తూ ఉన్నాయి. 1992లో ఇజ్రాయిల్‌తో భారతదేశం పూర్తిస్థాయి దౌత్యసంబంధాలు ఏర్పరచుకుంది. అప్పటి నుండి శక్తివంతమైన సైనిక, సాంకేతిక, సాంస్కృతిక భాగస్వామ్యం వహిస్తుంది. ఇహ్రాయిల్ సైనిక ఉపకరణాల వాడుకలో భారతదేశం మొదటి స్థానం వహిస్తుండాగా భారతదేశంతో సైనిక భాగస్వామ్యం కలిగిన దేశాలలో ఇజ్రాయిల్ రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో రష్యా ఉంది. భారతదేశం ఇజ్రాయిల్ ఆర్థిక భాగస్వామ్యంలో ఆసియాదేశాలలో మూడవస్థానంలో ఉంది. ఇరుదేశాలు సైనిక, అంతరిక్షం సంబంధాలు ఏర్పరచుకున్నాయి. 2010లో 41,000 మంది భారతీయ పర్యాటకులు ఇజ్రాయేల్‌ను సందర్శించారు. జర్మనీ ఇజ్రాయిల్‌తో బలమైన సంబంధాలను కలిగి ఉంది. ఇరుదేశాలు పరస్పరం సైన్సు, విద్యాసంబంధిత సహకారం చేసుకుంటున్నాయి. అంతే కాక ఇరుదేశాలమద్య శక్తివంతమైన సైనిక, ఆర్థిక భాగస్వామ్యం ఉంది. రిపేరెషంస్ ఒప్పందం కొరకు జర్మనీ ఇజ్రాయిల్‌కు 25 బిలియన్ల యూరోలను చెల్లించింది. ఇది ఇజ్రేలీ పునరుద్ధరణ పనులకు, హోలోకాస్ట్ సర్వైవర్ల కొరకు వినియోగాలకు ఇవ్వబడింది. ఇజ్రాయిల్ స్థాపించబడినప్పటి నుండి యు.కె ఇజ్రాయిల్‌తో పూర్తిస్థాయి దౌత్యసంబంధాలు కలిగి ఉంది. గత ప్రధానమంత్రి టోనీబ్లెయర్ ప్రయత్నాలతో ఇరుదేశాల నడుమ సంబంధాలు బలపడ్డాయి. ఫలవి సామ్రాజ్య పాలనలో ఇరాన్ ఇజ్రాయిల్‌తో దౌత్యసంబంధాలు ఉన్నాయి. ఇస్లామిక్ విప్లవం సమయంలో ఇజ్రాయిల్ ఇరాన్తో దౌత్యసంబంధాలను రద్దుచేసుకుంది.

ఇజ్రాయిల్ 
The Indian Air Force's A-50EI, equipped with the Israeli EL/W-2090 airborne radar. India is Israel's largest Asian economic partner.

1991 వరకు టర్కీ, ఇజ్రాయిల్ దేశాల మద్య దౌత్యసంబంధాలు లేవు.1949 ఇజ్రాయిల్ స్థాపించబడినప్పటి నుండి టర్కీ ఇజ్రాయిల్ దేశాలమద్య సహకార సంబంధాలు ఉన్నాయి. టర్కీ దేశానికి ఇతర ముస్లిం ఆధిక్యత కలిగిన దేశాలతో ఉన్న సంబంధాల కారణంగా అరబ్, ముస్లిం దేశాల వత్తిడి ఇరుదేశాల సంబంధాలలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 2008 -2009 గాజా యుద్ధం, ఇజ్రాయిల్ దాడి (గాజా ఫ్లోటిలా దాడి) తరువాత టర్కీ, ఇజ్రాయిల్ సంబంధాలు క్షీణించాయి. ఇజ్రాయిల్, గ్రీకు సంబంధాలు 1995 నుండి అభివృద్ధిచెందాయి. ఇరుదేశాల మద్య రక్షణ సహకార ఒప్పందం చేయబడింది. 2010లో ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ గ్రీకులోని హెలెనిక్ ఎయిర్ ఫోర్స్‌ కలిసి ఉవ్డా ఎయిర్‌పోర్ట్ వద్ద జాయింట్ ట్రైనింగ్ తీసుకున్నది . మిడిల్ ఈస్ట్ దేశాలలో గ్రీకు ఉత్పత్తులను అధికస్థాయిలో దిగుమతి చేసుకుంటున్న దేశాలలో ఇజ్రాయిల్ రెండవ స్థానంలో ఉంది. 2010లో గ్రీకు ప్రధానమంత్రి జార్జ్ పరండ్ర్యూ (జూనియర్) అధికారపర్యటన నిమిత్తం చాలా సంవత్సరాల తరువాత ఇజ్రాయిల్‌ను సందర్శించాడు. ఈ పర్యటన ఇరుదేశాల మద్య సంబంధాలను మెరుగుపరచింది. ఇజ్రాయిల్, సైప్రస్ దేశాలమద్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల మద్య అనేక అధికార పర్యటనలు జరిగాయి. ఇరుదేశాలు విద్యుత్తు, వ్యవసాయం, సైనిక, పర్యాటక సంబంధాలు ఉన్నాయి. ఇరుదేశాలు కలిసి సైప్రస్ లోని ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్క్ష్ప్లొరేషన్ పనులలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఇరు దేశాలు సహకారంతో ప్రంపంచంలో పొడవైనదిగా భావించబడుతున్న " సబ్ సీ ఎలెక్ట్రిక్ పవర్ కేబుల్ " ప్రాజెక్టు ఇరుదేశాల సంబంధాలను మరింత మెరుగుపరుస్తుంది. ముస్లిముల ఆధిక్యత కలిగిన దేశాలలో ఒక టైన అజర్‌బైజాన్ ఇజ్రాయిల్‌తో వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను ఏర్పరచుకుంది. ఇరుదేశాల మద్య వాణిజ్య, రక్షణ, సాంస్కృతిక, విద్యాసంబంధాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయిల్‌కు అవసరమైన ఆయిల్ అజర్‌బైజాన్ నుండి దిగుమతి ఔతుంది. ఇజ్రాయిల్ అజర్‌బైజాన్ సైన్యాల ఆధునికీకరణకు సహకరిస్తుంది. 2005లో ఇజ్రాయిల్ వ్యాపార భాగస్వామ్యంలో అజర్‌బైజాన్ ఐదవ స్థానంలో ఉంది. ఆఫ్రికాలోని ఎథియోపియా ఇజ్రాయిల్‌తో రాజకీయ, మతపరమైన, రక్షణ సంబంధిత సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. ఇజ్రాయిల్ ఎథియోపియా ఇరిగేషన్ పనులకు సాంకేతికంగా సహకరిస్తుంది. వేలాది ఎథియోపియా యూదులు (బేటా ఇజ్రాయిల్) ఇజ్రాయిల్‌లో నివసిస్తున్నారు. గాజా యుద్ధం (2008-2009) ఫలితంగా మౌరిటానియా, కతార్, బొలివియా, వెనెజులా దేశాలు ఇజ్రాయిల్‌తో రాజకీయ, ఆర్థిక సంబంధాలను నిలిపివేసాయి. ఇజ్రాయిల్ యురేపియన్ యూనియన్ నైబర్‌హుడ్ పాలసీలో చేర్చబడింది.

మానవహక్కులు

ఒ.ఇ.సి.డి దేశాలలో ఇజ్రాయిల్‌ విదేశీసాయం చాలా తక్కువ స్థాయిలో ఉంది. విదేశీసాయం కొరకు ఇజ్రాయిల్ 0.1% మాత్రమే వ్యయం చేస్తుంది (సిఫారసు చేసినది 0.7%). వ్యక్తిగతమైన అంతర్జాతీయ ఆర్థికసహాయం కూడా తక్కువస్థాయిలో ఉంది. విదేశీకారణాలకు ఇస్తున్న ఆర్థికసహాయం 0.1%. అయినప్పటికీ ఇజ్రాయిల్ మానవీయ ప్రతిస్పందన అత్యవసర సాయం కొరకు సహాయక బృందాలను ప్రంపంచవ్యాప్తంగా పంపుతూ ఉంటుంది. 1958లో మాషవ్ (ఎం.ఎ.ఎస్.ఎ.వి) ఇజ్రాయిల్ మనవీయ ప్రయత్నాలు ఆరంభం అయ్యాయి. 1985, 2015 ఇజ్రాయిల్ 25 ప్రతినిధులను (హోం ఫ్రంట్ కమాండ్) 22 దేశాలకు పంపింది. 2010 హైతీ భూకంపం సంభవించిన సమయంలో ఇజ్రాయిల్ శస్త్రచికిత్సలు నిర్వహించే వసతులు కలిగిన ఫీల్డ్ హాస్పిటల్ పంపి ప్రపంచదేశాలలో ప్రథమస్థానంలో నిలిచింది. ఇజ్రాయిల్ నుండి 200 మంది వైద్యులు హైతియన్ బాధితులకు చికిత్స చేసారు. 11రోజుల చికిత్స తరువాత ముగింపుకు వచ్చింది. ఇజ్రాయిల్ ప్రతినిధి బృందాలు 1,110 పేషెంట్లకు చికిత్స చేసి 319 మందికి శస్త్రచికిత్సలు, 16 ప్రసవాలు, 4 విపత్తు నుండి విడిపించడం చేసింది. జపాన్‌లో సునామీ, భూకంపం సంభవించిన సమయంలో రేడియేషంస్ ఆందోళన పడుతున్న సమయంలో జపాన్కు వైద్యబృందాలను పంపిన మొదటిదేశం ఇజ్రాయిల్.2011లో సునామీ చేత బాధించబడిన కురిహరా నగరానికి ఇజ్రాయిల్ వైద్యబృందాలను పంపింది. 50 మంది సభ్యులు కలిగిన వైద్యబృందంలో చిన్నారుల చికిత్స, శస్త్రచికిత్స, ప్రసూతి & మూత్ర, చెవి, ముక్కు, గొంతు వైద్య విభాగము, ఆప్టోమెట్రీ శాఖ, ఒక ప్రయోగశాల, ఒక ఫార్మసీ, ఒక ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లతో హాస్పిటల్ ఏర్పాటుచేసి రెండువారాలలో 200 మందికి చికిత్సచేయబడింది. ఎమర్జెంసీ బృందం తిరిగివెళ్ళే సమయంలో వైద్య ఉపకరణాలు జపానీయులకు దానంగా ఇవ్వబడ్డాయి. 14 ఇజ్రాయిల్ సేవాసంస్థలచే నిర్వహించబడుతున్న ఇస్రా ఎయిడ్, నార్తెన్ అమెరికన్ యూదుల బృందాలు కలిసి ఆపత్కర సమయాలలో సేవలు అందిస్తూ ఉంది. " ది ఫస్ట్ ఇజ్రాయిల్ రెస్క్యూ టీం " ఇజ్రాయిల్ ఫ్లైంగ్ టీం Save a Child's Heart (SACH), ఎల్.ఎ.టి.ఇ

సైన్యం

ఇజ్రాయిల్ 
Israeli soldiers during Operation Brothers' Keeper (2014).
ఇజ్రాయిల్ 
Female soldiers of the Israel Defense Forces

అభివృద్ధి చెందిన దేశాలలో రక్షణవ్యవస్థ కొరకు జి.డి.పి.లో అత్యధికశాతం వ్యయంచేస్తున్న దేశాలలో ఇజ్రాయిల్ ఒకటి. రక్షణ కొరకు అధికశాతం వ్యయం చేస్తున్న దేశాలలో మొదటి స్థానాలలో ఓమన్, సౌదీ అరేబియా మాత్రమే ఉన్నాయి.

ఇజ్రాయిల్ స్వల్పకాల చరిత్రలో ఇజ్రాయిల్ రక్షణదళం పలు యుద్ధాలు, సరిహద్దు యుద్ధాలలో పాల్గొన్నది. ఇది ఇజ్రాయిల్‌ను ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైనికవ్యవస్థకలిగిన దేశంగా మార్చింది. ఇజ్రాయిల్ ప్రజలలో అత్యధికులు 18 సంవత్సరాల వయసులో సైనికదళంలో చేర్చుకొనబడుతుంటారు. మేండేటరీ సర్వీస్ తరువాత ఇజ్రాయిల్ పురుషులు రిజర్వ్ దళంలో చేరుతుంటారు. తరువాత ప్రతిసంవత్సరం కొన్ని వారాలకాలం పనిచేస్తుంటారు. స్త్రీలకు రిజర్వ్ బాధ్యతల నుండి మినహాయింపు ఉంటుంది. ఇజ్రాయిల్‌లోని అరబ్ పౌరులకు (డ్రడ్జ్ ప్రజలు కాక) పూర్తికాల మత అధ్యయనం చేయడానికి ప్రోత్సాహం లభిస్తుంది. వీరికి సైనిక బాధ్యతల నుండి మినహాయింపు ఉంటుంది. సైనిక బాధ్యతల నుండి మినహాయింపు పొందినవారికి హాస్పిటల్స్, స్కూల్స్, ఇతర సోషల్ వెల్ఫేర్ సంస్థలలో బాధ్యలు ఉంటాయి. నిర్భంధ సైనికశిక్షణ ఫలితంగా ఐ.డి.ఎఫ్‌లో 1,76,500 క్రియాశీలక సైనికులు, 4,45,000 మంది రిజర్విస్టులు ఉన్నారు.

ఇజ్రాయిల్ 
IAI Lavi, military technology demonstrator

ఇజ్రాయిల్ సైనికదళం ఉన్నతసాంకేతిక ఆయుధాలను కలిగి ఉంది. ఇవి అధికంగా ఇజ్రాయిల్‌లో రూపొందించి తయారుచేయబడుతున్నాయి. కొన్నింటిని విదేశాలనుండి దిగుమతి చేసుకుంటున్నారు. 1967 నుండి యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయిల్‌తో సైనిక సంబంధాలను ఏర్పరచుకుని ఇజ్రాయిల్‌కు సైనిక సహాయం చేస్తుంది. 2013 నుండి 2018 వరకూ యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయిల్‌కు సాలీనా 3.15 బిలియండాలర్లను సహాయంగా అందిస్తుంది. ఇజ్రాయిల్ లోని ఏరో మిస్సైల్స్ ప్రపంచంలోని కొన్ని అత్యాధునిక మిస్సైల్స్లో ఒకటిగా భావిస్తున్నారు. ఇజ్రాయిల్ ఐరన్ డోం ఏంటీ - మిస్సైల్ ప్రంపంచవ్యాప్తంగా ప్రశంశించబడుతుంది.

యోంకిప్పూర్ యుద్ధం నుండి ఇజ్రాయిల్ నిఘావర్గాన్ని అభివృద్ధి చేసింది. ఓఫెగ్ ఉపగ్రహస్థాపన విజయవంతం తరువాత ఉపగ్రహాన్ని స్థాపించిన 7 దేశాలలో ఇజ్రాయిల్ ఒకటిగా ప్రత్యేకత సంతరించుకుంది. ఇజ్రాయిల్ స్థాపించిన తరువాత నుండి ఇజ్రాయిల్ రక్షణవ్యవస్థ కొరకు దేశీయ ఆదాయంలో గణానీయమైన భాగం వ్యయం చేసింది. 1984లో ఇజ్రాయిల్ దేశీయ ఆదాయం 24% వ్యయం చేసింది. of its GDP on defense. By 2006, that figure had dropped to 7.3%. ఇజ్రాయిల్ అణ్వాయుధాలను కలిగి ఉందని గాఢంగా విశ్వసించబడుతుంది. అలాగే ఇజ్రాయిల్ " మాస్ డిస్ట్రక్షన్ ఆయుధాలను " కూడా కలిగి ఉందని విశ్వసించబడుతుంది. ఇజ్రాయిల్ " నాన్ - ప్రొలిఫరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వీపంస్ " ఒప్పందం మీద సంతకం చేయలేదు. అలాగే ఇజ్రాయిల్ అణ్వాయుధాల గురించి సందిగ్ధ విధానం అనుసరిస్తుంది. 1991 గల్ఫ్ యుద్ధం తరువాత ఇరాక్ ఇజ్రాయిల్‌ మీద దాడి చేసింది. ఇరాక్ స్కడ్ మిస్సైల్ దాడి ఫలితంగా ఇజ్రాయిల్ లోని నివాసగృహాలు అన్నింటికి రక్షణ గదులు (సెక్యూరిటీ రూంస్) నిర్మించాలని శాసించబడింది. రక్షణ గదులు (మెర్ఖవ్ ముగన్) కెమికల్, బయోలాజికల్ పదార్ధాలు చొరబడకుండా నిర్మించబడ్డాయి. ఇజ్రాయిల్ " గ్లోబల్ పీస్ ఇండెక్స్"లో అతి దిగువ స్థానంలో ఉంది. 2011 గణాంకాలు అనుసరించి 153 దేశాలలో 145వ స్థానంలో ఉంది. ఇజ్రాయిల్ ప్రపంచంలో ఆయిధాలు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. 2007 గణాంకాలను అనుసరించి ఇజ్రాయిల్ ఆయిధ ఎగుమతులు ప్రపంచంలో 4వ స్థానంలో ఉందని భావిస్తున్నారు. రక్షణసమస్యల కారణంగా ఇజ్రాయిల్ ఆయుధ ఎగుమతుల నివేదికలు వెల్లడించబడడం లేదు.

ఆర్ధికం

ఇజ్రాయిల్ 
Israeli new shekel banknotes and coins
ఇజ్రాయిల్ 
Graphical depiction of Israel's product exports in 28 color-coded categories.

ఆగ్నేయ , మద్య ఆసియా దేశాలలో ఆర్ధికరగం పారిశ్రామిక అభివృద్ధి రంగాలలో ఇజ్రాయిల్ అత్యంత ఆధునిక దేశంగా భావించబడుతుంది. ఇజ్రాయిల్ లోని అత్యున్నత ప్రమాణాలు కలిగిన విశ్వవిద్యాలయాలు ఉన్నతప్రమాణాలు లక్ష్యంగా విద్యార్ధులను ప్రేరేపించిన కారణంగా ప్రజలలో విద్యావంతుల సంఖ్య అధికమై సాంకేతిక , ఆర్ధికాభివృద్ధి జరగడానికి సహకరించింది. 2010లో ఇజ్రాయిల్ ఒ.ఇ.సి.డిలో జాయిన్ అయింది. ప్రపంచబ్యాంక్ " ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ "లో అలాగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం, గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ రిపోర్టులలో ఇజ్రాయిల్ 3వ స్థానంలో ఉంది. పరిశ్రమలను అధికంగా స్థాపించిన దేశాలలో ఇజ్రాయిల్ అంతర్జాతీయంగా ద్వితీయ స్థానంలో ఉంది. ప్రథమ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఉంది. ఉత్తర అమెరికాకు వెలుపల అధికసంఖ్యలో " ఎన్.ఎస్.డి.ఎ.క్యు (నాస్ డాక్)" సంస్థలు ఇజ్రాయిల్‌లో ఉన్నాయి.2010లో " ఇంటర్నేషనల్ ఇంస్టిట్యూట్ ఫర్ డెవెలెప్మెంట్ " అంచనా అనుసరించి ప్రంపంచదేశాలలో అధికంగా ఆర్ధికాభివృద్ధి చెందిన దేశాలలో ఇజ్రాయిల్ 17వ స్థానంలో ఉంది. " ఫేస్ ఆఫ్ క్రైసిస్ " నివేదిక ఇజ్రాయిల్ ఆర్థికరంగం ప్రంపంచదేశాల ఆర్థికరంగంగాలలో స్థిరమైనది, దీర్ఘకాలం కొనసాగగలిగినదిగా పేర్కొన్నది. అలాగే పరిశోధన, అభివృద్ధి కేంద్రాలలో ఇజ్రాయిల్ ప్రథమ స్థానంలో ఉందని భావించబడుతుంది. 2009 కేంద్రీయ బ్యాంకులలో శక్తివంతంగా పనిచేయడంలో ఇజ్రాయిల్ బ్యాంక్ ప్రధ్మస్థానంలో ఉంది. నైపుణ్యత కలిగిన మానవవనరులను అందించే దేశాలవరుసలో ఇజ్రాయిల్ చోటుచేసుకుంది. బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయిల్ 78 బిలియన్ల విదేశీధన నిల్వలు కలిగి ఉంది. పరిమితమైన సహజవనరులు కలిగిన ఇజ్రాయిల్ గత దశాబ్ధంలో వ్యవసాయాన్ని, పరిశ్రమలను విస్తారంగా అభివృద్ధి చేసింది. ఇది ఇజ్రాయిల్‌ను స్వయంసమృద్ధి (ధాన్యం, బీఫ్ మినహా) కలిగిన దేశాలలో ఒకటిగా చేసింది. 2012లో ఇజ్రాయిల్ ముడిసరుకు, సైనిక ఉపకరణాలు, వస్తువులు, ముడి వజ్రాలు, ఫ్యూయల్, ధాన్యం, కంస్యూమర్ వస్తువుల దిగుమతి 77.59 బిలియన్ అ.డా చేరుకుంది. ఇజ్రాయిల్ నుండి ఎలెక్ట్రానిక్స్, సాఫ్ట్ వేర్, కంప్యూటరైజ్డ్ సిశ్టంస్, కమ్యూనికేషంస్, మెడికల్ ఎక్విప్మెంట్స్, ఫార్మా స్యూటికల్స్, మిలటరీ టెక్నాలజీ, మెరుగుపెట్టిన వజ్రాలు మొదలైనవి ఎగుమతి చేయబడితున్నాయి. 2012లో ఇజ్రాయిల్ ఎగుమతులు 64.74 బిలియన్ల అమెరికన్ డాలర్లు.

ఇజ్రాయిల్ 
Tel Aviv is a technological and economic hub.[ఆధారం యివ్వలేదు]

సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేయడంలో ఇజ్రాయిల్ దేశం ఆధిక్యత కలిగి ఉంది. ఇజ్రాయిల్ జలపరిరక్షణ, జియోథర్మల్ పవర్ ఉత్పత్తిలో అంతర్జాతీయ గుర్తింపు కలిగి ఉంది. ఒ.ఇ.సి.డి నివేదిక అనుసరించి దేశ జి.డి.పిలో అధికశాతం పరిశోధన, అభివృద్ధి కొరకు వ్యయంచేస్తున్న ప్రపంచదేశాలలో ఇజ్రాయిల్ ప్రథమశాతంలో ఉందని భావిస్తున్నారు. ఇంటెల్, మైక్రొసాఫ్ట్ సంస్థలు వారి మొదటి విదేశీ పరిశీధన, అభివృద్ధి శాఖలను ఇజ్రాయిల్‌లో స్థాపించాయి. అలాగే ఐ.బి.ఎం, గూగుల్, యాపిల్, హ్యూలెట్- ప్యాకర్డ్, సిస్కొ సిస్టంస్, మొటోరోలా మొదలైన హైటెక్ బహుళజాతి సంస్థలు ఇజ్రాయిల్‌లో పరిశోధన, అభివృద్ధి (ఆర్&డి) వసతులు ఏర్పాటు చేసాయి.

ఇజ్రాయిల్ 
Jerusalem Venture Partners (JVP) in Jerusalem, one of Israel's largest Venture Capital firms.

2007లో అమెరికన్ బిజినెస్ మేగ్నేట్, ఇంవెస్టర్ వారెన్ బఫ్ఫెట్స్‌కు స్వంతమైన బెర్క్‌షైర్ హాతవే ఇజ్రాయిల్ కంపెనీని ఇస్కార్‌ను 4 బిలియన్ అమెరికన్ డాలర్లకు కొనుగోలు చేసాడు. 1970 నుండి ఇజ్రాయిల్ యునైటెడ్ స్టేట్స్ నుండి మిలటరీ సహాయం అందుకుంటుంది. విదేశీఋణాలు తక్కువగా ఉన్న దేశాలలో ఇజ్రాయిల్ ఒకటి. ఇజ్రాయిల్ పని దినాలు ఆదివారం నుండి గురువారం (ఐదు రోజుల పని) లేక ఆదివారం నుండి శుక్రవారం (ఆరు రోజుల పని) వరకు ఉంటాయి. యూదులు అధికంగా ఉన్న ప్రాంతాలలో శుక్రవారం పనిదినాలు కుదించబడి శీకాలంలో మద్యాహ్నం 2 గంటల వరకు లేక వేసవి కాలంలో సాయంకాలం 4 గంటల వరకు ఉంటాయి. మిగిలిన ప్రంపంచదేశాల పనిదినాలులా ఆదివారం శలవు దినంగా చేయాలని పలువురు ప్రతిపాదిస్తున్నారు.

శాస్త్రీయం , సాంకేతికం

ఇజ్రాయిల్ 
The particle accelerator at the Weizmann Institute of Science, Rehovot

ఇజ్రాయిల్‌లో 9 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. . ది హెబ్ర్యూ యూనివర్శిటీ ఇజ్రాయిల్ లోని పురాతన విశ్వవిద్యాలయాలో రెండవదిగా గుర్తించబడుతుంది. టెక్నియన్ విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ " నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇజ్రాయిల్ " ఉంది. ఇది జ్యూడికా, హెబ్రికా గ్రంథాలు అత్యధికంగా భధ్రపరచబడి ఉన్నాయి. దిటెక్నియన్ - ఇజ్రాయిల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ " ది హెబ్ర్యూ యూనివర్శిటీ , వెయిజ్మన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు స్థిరంగా " అకాడమిక్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్శిటీస్ " ర్యాకింగ్‌లో మొదటి 100 విశ్వవిద్యాలయాలలో ఉంటున్నాయి. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలలో టెల్ అవివ్ యూనివర్శిటీ, బార్- లియాన్ యూనివర్శిటీ, ది యూనివర్శిటీ ఆఫ్ హైఫా, ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ ఇజ్రాయిల్, బెన్- గురియన్ యూనివర్శిటీ ఆఫ్ నెగెవ్ ప్రధానమైనవి. ఏరియల్ యూనివర్శిటీ వెస్ట్ బ్యాంక్‌లో సరికొత్త యూనివర్శిటీగా స్థాపించబడింది. ఇది కాలేజ్ స్థాయి నుండి విశ్వవిద్యాలయ అంతస్తుకు చేరుకుంది. 30 సంవత్సరాల దేశచరిత్రలో ఇది మొదటి సంఘటనగా గుర్తింపు పొందింది. ఓపెన్ యూనివర్శిటీతో చేర్చి ఇజ్రాయిల్‌లో ఏడు రీసెర్చ్ యూనివర్శిటీలు ఉన్నాయి. ఇవి ప్రంపంచంలోని 500 ఉన్నత ప్రమాణాలు కలిగిన విశ్వవిద్యాలయాల శ్రేణిలో ఉన్నాయి. . ఇజ్రాయిల్ 2002 నుండి 6 గురు నోబుల్ పురద్కార గ్రహీతలను తయారుచేసింది. అలాగే పరిశోధనా పత్రాలను అత్యధికంగా సమర్పిస్తున్న దేశాలలో ఒకటిగా ఇజ్రాయిల్ గుర్తించబడుతుంది.

ఇజ్రాయిల్ 
The world's largest solar parabolic dish at the Ben-Gurion National Solar Energy Center.

ఇజ్రాయిల్ సోలార్ ఎనర్జీ ప్రణాళికలను ప్రతిష్ఠాత్మకంగా స్వీకరించింది. ఇజ్రాయిల్‌లోని ఇంజనీర్లు అత్యాధునిక సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేయడంలో నైపుణ్యత కలిగి ఉన్నారు. ఇజ్రాయిల్ కంపెనీలు ప్రంపంచం అంతటా ఉన్న సోలార్ ప్రణాళికల కొరకు పనిచేస్తున్నాయి. ఇజ్రాయిల్ కుటుంబాలలో 90% కంటే అధికంగా వేడినీటి కొరకు సోలార్ ఎనర్జీని ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ అంచనాలను అనుసరించి దేశం ఉపయోగిస్తున్న విద్యుత్తులో 8% శాతం సోలార్ ఎనర్జీ నుండి లభిస్తుందని భావిస్తున్నారు. ఇజ్రాయిల్ భౌగోళిక స్థితి సోలార్ ఎనర్జీ ఉత్పత్తిచేయడానికి అనుకూలంగా ఉండడం ఇందుకు సహకరిస్తుంది. నెగెవ్ ఎడారిలో ఉన్న రీసెర్చ్, డెవెలెప్మెంట్ పరిశ్రమ అంతర్జాతీయ ఖ్యాతిగాంచింది.

వాటర్ టెక్నాలజీలో ఇజ్రాయిల్ అంతర్జాతీయ గుర్తింపు కలిగి ఉంది. 2011లో ఇజ్రాయిల్ వాటర్ టెక్నాలజీ పరిశ్రమ 2 బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడులతో ఉత్పత్తుల ఎగుమతిలో అగ్రగామిగా ఉంది. వాటర్ కంసర్వేషన్ టెక్నిక్ రూపొందించడం ద్వారా వాటర్ షార్టేజ్ సమస్యను అధిగమిస్తుంది. వ్యవసాయంలో బిందుసేద్యం వంటి ఆధికపద్ధతులను అనుసరించడం ద్వారా నీటికొరతను అధిగమిస్తుంది. వాటర్ శుద్ధీకరణ, రీసైక్లింగ్ పద్ధతులను అనుసరించడంలో ఇజ్రాయిల్ మార్గదర్శక విధానాలను అనుసరిస్తుంది. ప్రంపంచంలో అతిపెద్ద ప్లాంటుగా గుర్తించబడిన ఇజ్రాయిల్‌కు చెందిన " అష్కెలాన్ సీ వాటర్ డిసాలినేషన్ ప్లాంటు " 2016లో " డిసాలినేషన్ నేషన్ ప్లాంట్ ఆఫ్ ఇయర్ " అవార్డ్ అందుకున్నది. ఇజ్రాయిల్ ఆతిథ్యం ఇచ్చిన " వాటర్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ , కాంఫరెంస్ " ప్రపంచవ్యాప్తంగా వేలాది మదిని ఆకర్షించింది. 2013లో ఇజ్రాయిల్ నీటి వాడకంలో 85% " రివర్స్ ఒస్మొసిస్ " ద్వారా లభించింది. " రివర్స్ ఒస్మొసిస్ "లో సరికొత్త్త పద్ధతులు రూపొందించిన ఫలితంగా భవిష్యత్తులో ఇజ్రాయిల్ నీటిని ఎగుమతి చేయగలదని విశ్వసిస్తున్నారు. 2000 నుండి ఇజ్రాయిల్ " స్టెం సెల్ " పరిశోధనలో ప్రంపంచానికి మార్గదర్శకం వహిస్తుంది. ప్రపంచంలోని 100 ఉన్నతశ్రేణి విశ్వవిద్యాలయాలలో ఇజ్రాయిల్ యూనివర్శిటీలు గణితంలో హెర్బ్యూ యూనివర్శిటీ ఆఫ్ జెరుసలేం, టెల్ అవివ్ యూనివర్శిటీ , టెక్నియన్ యూనివర్శిటీలు, భౌతికశాస్త్రంలో టెల్ అవివ్ యూనివర్శిటీ, హెర్బ్యూ యూనివర్శిటీ , వైజ్మన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ సైంస్, రసాయన శాస్త్రంలో టెక్నియన్ యూనివర్శిటీ, కంప్యూటర్ సైంస్‌లో వైజ్మన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ సైంస్, టెక్నియన్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ హెర్బ్యూ , టెల్ అవివ్ యూనివర్శిటీ , ఆర్ధికశాస్త్రంలో యూనివర్శిటీ ఆఫ్ హెర్బ్యూ , టెల్ అవివ్ యూనివర్శిటీలు చోటుచేసుకుని ఉన్నాయి.

ఇజ్రాయిల్ 
Shavit space launch vehicle, which carry Israel's Ofeq satellites into space.

ఇజ్రాయిల్‌ దేశమంతటినీ అనుసంధానం చేస్తున్న " ఎలెక్ట్రిక్ కార్ ఇంఫ్రాస్టక్చర్ " కలిగి ఉంది. ఇందులో భాగంగా కారు రీచార్జి , కారు బ్యాటరీ మార్పిడి చేయడానికి కార్ రీచార్జ్ స్టేషన్లు ఉన్నాయి. ఇది ఇజ్రాయిల్ ఆయిల్ వాడకాన్ని అదుపుచేస్తూ ఆయిల్ ధరలను అదుపుచేస్తూ ఉందని భావించబడుతుంది. పలువురు ఇజ్రాయిల్ మోటరిస్టులు ఎలెక్ట్రిక్ కార్లను మాత్రమే ఉపయోగుస్తున్నారు. ఇజ్రాయిల్ కార్ మోడెల్ అనేకమందిచేత అధ్యనం చేయబడుతుంది. దీనిని డెన్మార్క్ , ఆస్ట్రేలియా దేశాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ 2013లో ఇజ్రాయిల్ ట్రైబ్లేజింగ్ ఎలెక్ట్రిక్ కార్ కపెనీ బెటర్ ప్లేస్ మూతపడింది. ఇజ్రాయిల్ అంతరిక్ష పరిశోధనలను " ఇజ్రాయిల్ స్పేస్ ఏజెంసీ " ద్వారా నిర్వహించబడుతున్నాయి. ఇది శాత్రీయపరమైన , వాణిజ్యపరమైన లక్ష్యసాధన కొరకు పనిచేస్తుంది. 2012లో " స్పేస్ కాంపిటీటివ్ ఇండెక్స్ " నివేదికలను అనుసరించి స్పేస్ పరిశోధనలో ఇజ్రాయిల్ అంతర్జాతీయంగా 9 వ స్థానంలో ఉందని భావించబడుతుంది. ఉపగ్రహ నిర్మించి అంతరిక్షంలో ప్రవేశపెట్టిన ప్రపంచంలోని 7 దేశాలలో ఇజ్రాయిల్ ఒకటిగా ఉంది. ఇజ్రాయిల్ ఔటర్ స్పేస్ లాంచర్ వెహికిల్ " షవిత్ "ను తయారుచేసి దిగువ భూకక్ష్యలో చిన్నసైజు ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. 1988 లో ఇజ్రాయిల్ స్పేస్ లాంచ్ (అతరిక్షంలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే) శక్తిని సంతరించుకుంది. పాల్మాచిం ఎయిర్ బేస్‌లో ఉన్న స్పేస్‌పోర్ట్ " నుండి షవిత్ రాకెట్లు అంతరిక్షంలో ప్రయోగించబడ్డాయి. 1988 నుండి ఇజ్రాయిల్ ఎయిర్ స్పేస్ పరి శ్రమలు 13 వాణిజ్య, పరిశోధన ఉపగ్రహాలను నిర్మించింది. ఇజ్రాయిల్ ఉపగ్రహాలు ప్రపంచశ్రేణి అత్యాధునిక ఉపగ్రహాలుగా వర్గీకరించబడ్డాయి. 2003లో ఇలాన్ రామన్ ఇజ్రాయిల్ మొదటి వ్యోమగామిగా అయ్యాడు.

రవాణా

ఇజ్రాయిల్ 
Duty Free at Ben Gurion Airport, Tel Aviv

ఇజ్రాయిల్ పేవ్డ్ రోడ్ల పొడవు 18,096 కి.మీ. అలాగే దేశంలో 2.4 మిలియన్ మోటర్ వాహనాలు ఉన్నాయి. దేశంలో ప్రతి వెయ్యి మనికి 324 మోటర్ వాహనాలు ఉన్నాయి. అభివృద్ధిచెందిన దేశాలలో ఇది తక్కువ సంఖ్యగా భావిస్తున్నారు. ఇజ్రాయిల్‌లో 5,715 బసులు ఉన్నాయి. ఎగ్డ్ కంపెనీ అధికమొత్తంలో బసు సేవలనను అదిస్తుంది. దేశంలోని రైలుమార్గాల పొడవు 949 కి.మీ. రైల్వేశాఖ ఇజ్రాయిల్ పేభుత్వ ఆధ్వర్యంలో (ఇజ్రాయిల్ రైల్వేస్) పనిచేస్తూ ఉంది. 1990 నుండి రైల్వేశాఖ అభివృద్ధిచేయబడింది. 1990 లో 2.5 మిలియన్లుగా ఉన్న పాసెంజర్ల సంఖ్య 2008 నాటికి 35 మిలియన్లకు చేరుకుంది. ఇజ్రాయిల్ రైల్వే వార్షికంగా 6.8 టన్నుల కార్గో రవాణా చేస్తుంది. ఇజ్రాయిల్‌లో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. దేశంలో విదేశీప్రయాణాలు " టెల్ అవివ్ యాఫో " ఒవ్డా ఎయిర్ పోర్ట్ " నుండి నిర్వహించబడుతున్నాయి. అంతే కాల కొన్ని దేశీయ విమానాశ్రయాలు విమానసేవలు అందిస్తున్నాయి. 2010 లో ఇజ్రాయిల్ అతిపెద్ద విమానాశ్రయం బెన్‌గురియన్ నుండి 12.1 మిలియన్ల ప్రయాణీకులు పయనించారు. మధ్యధరా సముద్రతీరంలో ఉన్న పోర్ట్ ఆఫ్ హైఫా దేశంలోని అతిపెద్ద , అతిపురాతన నౌకాశ్రయంగా గుర్తించబడుతుంది. అష్దాద్ పోర్ట్ ఇజ్రాయిల్ డీప్ వాటర్ పోర్ట్‌లలో ఒకటిగా గుర్తించబడుతుంది. అంతేకాక ఎర్రసముద్ర తీరంలో " పోర్ట్ ఆఫ్ ఎలియాట్ " ఉంది. ఇక్కడ నుండి దూరప్రాంత తూర్పుదేశాలతో వ్యాపారాలు కొనసాగుతున్నాయి.

పర్యాటకం

ఇజ్రాయిల్‌లో మతపరమైన పర్యాటకం ప్రాధాన్యత కలిగిన పరిశ్రమగా ఉంది. ఉష్ణమండల ఉష్ణోగ్రత కలిగిన ఇజ్రాయిల్, సముద్రతీరాలు, ఆర్కియాలజీ, ఇతర చరిత్రాత్మక , బైబిల్ సంబంధిత ప్రాంతాలు , అసమానమైన భౌగోళిక సౌందర్యం అంతర్జాతీయ సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇజ్రాయిల్ రక్షణ సమస్యలు ఆందోళన కలిగించేలా ఉన్నప్పటికీ పర్యాటకుల సంఖ్యమాత్రం అలాగేఉంది. 2013 లో 3.54 మిలియన్ల పర్యాటకులు ఇజ్రాయిల్‌ను సందర్శించారు. పర్యాటక ఆకర్షణలలో ప్రధానమైనది " వెస్టర్న్ వాల్ ". దీనిని 68% పర్యాటకులు సందర్శిస్తున్నారు. ఇజ్రాయిల్ అత్యధిక సంఖ్యలో మ్యూజియంలను కలిగి ఉంది.

విద్యుత్తు

2009లో ఇజ్రాయిల్ తీరప్రాంతంలో రెండు నేచురల్ గ్యాస్ రిజర్వులను కనుగొన్నారు: తమర్ గ్యాస్ ఫీల్డ్, లెవియాథన్ గ్యాస్ ఫీల్డ్. 2015లో వివాదాస్పదమైన గోలన్ హైట్స్ ప్రాంతంలో బృహత్తర ఆయిల్ రిజర్వ్‌ను స్థాపించబడింది.

సంస్కృతి

ఇజ్రాయిల్ వైవిధ్యమైన సంస్కృతి కలిగి ఉంది : ఉద్యోగరీత్యా ప్రపంచం అంతటావ్యాపించి ఉన్న యూదులు తిరిగి వస్తూ వైవిధ్యమైన సంస్కృతి, మతసంప్రదాయాలు వారితో మాతృదేశానికి తీసుకువస్తుంటారు. అది వైవిధ్యమైన సరికొత్త యూదుసంస్కృతి రూపొందించింది. ఇజ్రాయిల్ మాత్రమే హెర్బ్యూ సంప్రదాయ కేలండర్‌ను అనుసరిస్తూ ఉంది. ఇజ్రాయిల్ ప్రభుత్వ శలవు దినాలు యూదుల శలవుదినాలు అనుసరించి నిర్ణయించబడుతుంటాయి. ఇజ్రాయిల్‌లో ఉన్న గణనీయమైన అరబ్ మైనారిటీ ప్రజలు కూడా తమవంతుకు కొంత సంప్రదాయాన్ని ఇజ్రాయిల్‌కు చేర్చారు. అరబ్ సంస్కృతి ఇజ్రాయిల్‌లోని భవనిర్మాణాలలో ప్రస్పుటంగా కనిపిస్తుంది. సంగీతం, ఆహార అలవాట్లు కూడా అరబ్ సంప్రదాయం కనిపిస్తుంటుంది.

భాష

ఇజ్రాయిల్ 
Road sign in Hebrew, Arabic, and English.

ఇజ్రాయిల్‌లో హెర్బ్యూ, అరబిక్ భాషలు అధికారభాషలుగా ఉన్నాయి. హెర్బ్యూ భాష ప్రభుత్వ ప్రధానభాషగా ఉండగా అరబిక్ భాష అరబిక్ ప్రజల వాడుకభాషగా ఉంది. హెర్బ్యూ భాష అరబిక్ పాఠశాలలలో బోధించబడుతుంది. బ్రిటిష్ మేండేటరీ కాలంలో ఆగ్లభాష ఇజ్రాయిల్ అధికార భాషగా ఉంది. ఇజ్రాయిల్ రూపొందిన తరువాత ఆగ్లభాషకు అధికారస్థాయి రద్దు చేసినప్పటికీ ఆగ్లభాషకు వాస్తవంగా ఆదరణ స్థిరంగా ఉంది. రహదారి చిహ్నాలు, అధికారపత్రాలు ఆగ్లభాషలో ఉంటాయి. ఇజ్రాయిల్ సమూహాలు ఆగ్లంలో చక్కని ప్రతిభకలిగి ఉన్నారు. పలు టెలివిజన్ ప్రసారాలు కూడా ఆగ్లభాషలో ప్రసారం చేయబడుతుంటాయి. ఆగ్లభాష ప్రాథమిక స్థాయి నుండి బోధించబడుతుంది. ఇజ్రాయిల్ విశ్వవిద్యాలయాలు వివిధ సబ్జెక్టులను ఆగ్లభాషలో అధ్యయనం చేయడానికి అనుమతిస్తుంటాయి. ఇజ్రాయిల్ వీధులలో పలు భాషలు వినిపిస్తుంటాయి. సోవియట్ యూనియన్, అలియా (ఎతియోఫియా) వలసప్రజలు దాదాపు 1,30,000 మంది ఇజ్రాయిల్‌లో నివసిస్తున్నారు. రష్యన్, అంహారిక్ భాషలు కూడా ఇజ్రాయిల్‌లో అధికంగా వ్యాప్తిలో ఉన్నాయి. 1990, 2004 మద్య కాలంలో గతసోవియట్ యూనియన్ దేశాల నుండి దాదాపు ఒక మిలియన్ ప్రజలు ఇజ్రాయిల్ చేరుకున్నారు. ఇజ్రాయిల్‌లో ఫ్రెంచ్ భాషను మాట్లాడే ప్రజలు దాదాపు 7,00,00 మంది ఉన్నారు . యూదులు స్థానికంగా ఫ్రెంచ్, ఉత్తర ఆఫ్రికాకు (మెఘ్రెబి యూదులు) చెందిన వారని భావిస్తున్నారు.

మతం

ఇజ్రాయిల్ 
The Dome of the Rock and the Western Wall, Jerusalem.
ఇజ్రాయిల్ 
Hurva Synagogue, Jerusalem.
ఇజ్రాయిల్ 
The Church of the Holy Sepulchre, venerated by Christians as the site of the Burial of Jesus.
ఇజ్రాయిల్ 
Bahá'í gardens, Haifa.

ఇజ్రాయిల్, పాలస్తీనియన్ భూభాగాలు కలిసి పవిత్రప్రాంతాలుగా భావించబడుతున్నాయి. అబ్రహామిక్, యూదులు, క్రైస్తవులు, ముస్లిములు, డ్రుడ్జ్, బహై మతాల అనుయాయులకు ఇది ప్రధానభూమి. ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న యూదులు పలు జాతులకు చెంది ఉన్నారు : 20 సంవత్సరాలకు పైబడిన వారిలో నిర్వహించిన సర్వేలు 55% యూదులు సంప్రదాయానికి మద్దతు ఇస్తుండగా, 20% యూదులు లైకిక వాదానికి మద్దతు తెలియజేసారు, 17% జియోనిజానికి మద్దతు తెలియజేస్తున్నారు, 8% హరేడీ జ్యూడిషానికి మద్దతు తెలియజేస్తున్నారు. హరేడీ యూదులు 2028 నాటికి 20% చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. ఇజ్రాయిల్‌లో ముస్లిములు 16% ఉన్నారు. ముస్లిములు ఇజ్రాయిల్ మైనారిటీ పేజలలో ఆధిక్యతకలిగి ప్రధస్థానంలో ఉన్నారు. క్రైస్తవులు ప్రధానంగా పాలస్తీనియన్ క్రైస్తవులు ఉన్నారు. సోవియట్ వలసప్రజలలో కూడా క్రైస్తవులు అధికంగా ఉన్నారు. వివిధదేశాల పూర్వీకత కలిగిన ప్రజలు మెస్సయ్య జ్యూడిజాన్ని అనుసరిస్తున్నారు. క్రైస్తవులు, యూదులు అధికంగా క్రస్తవానికి చెందిన వారని భావించబడుతుంది. పలు ఇతర మతాలకు చెందిన ప్రజలలో బుద్ధిజం, హిందువులు ఉన్నారు. స్వల్పసంఖ్యలో అల్బియన్లు కూడా ఇజ్రాయిల్‌లో నివసిస్తున్నారు. ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న రష్యా నుండి వలసవచ్చిన ఒక మిలియన్ ప్రజలలో 3,00,000 మంది యూదులు కారని ఆర్థడాక్స్ రబ్బినేట్ భావిస్తుంది. జెరుసలేం నగరం యూదులు, ముస్లిములు, క్రైస్తవులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది. పాత జెరుసలేం నగరంలో వెస్టర్న్ వాల్, టెంపుల్ మౌంట్, అల్- అక్వస మసీదు, చర్ చి ఆఫ్ ది హోలీ సెపుల్చ్రే ఉన్నాయి. ఇజ్రాయిల్‌లో ఉన్న బేత్లెహేము (యేసు క్రీస్తు పుట్టిన పట్టణము) ,నజరేతు (యేసు క్రీస్తు పెరిగిన పట్టణము),యెరూషలేము (యేసు క్రీస్తు సిలువ వేయబడి, పునరుత్థానమైన పట్టణము), యే సఫేద్, ది వైట్ మసీదు (రమ్లా) (ఇది ప్రవక్త సలెహ్ సమాధి ఉన్న ముస్లిముల పవితేప్రాంతం), సెయింట్ జార్జి చర్చి (లాడ్) ఉన్నాయి. వెస్ట్ బ్యాంకు సమీపంలో పలు మతప్రాధాన్యత కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో జోసెఫ్ సమాధి (నబ్లస్), ఏసుక్రీస్తు జన్మభూమి, రాచెల్ సమాధి, బెత్లెహాం, పాట్రియార్చ్ (హెబ్రన్) ఉన్నాయి.

బహై విశ్వాసం నిర్వహణా కేంద్రం, బాబ్ సమాధి బహై వరల్డ్ సెంట్రల్‌లో (హైఫా) ఉన్నాయి. బహై మతస్థాపకుని సమాధి ఇజ్రాయిల్‌లోని ఆక్రెలో ఉంది. నిర్వహణా సిబ్బంధి కాక బహై అనుయాయులు ఇజ్రాయిల్‌లో మరెక్కడా లేనప్పటికీ ప్రపంచం అంతటి నుండి బహై అనుయాయులు ఇజ్రాయిల్‌కు యాత్రగా వస్తుంటారు. కఠిన నిబంధనలు అమలౌతున్న కారణంగా బహై అనుయాయులు ఇజ్రాయిల్‌లో మతప్రచారం చేయడానికి వీలు ఉండదు. బహై వరల్డ్ సెంటరుకు కొద్ది కి.మీ దక్షిణంలో అహమ్మదీయ ఉద్యమ సంస్కర్తల మిడిల్ ఈస్ట్ సెంటర్ ఉంది. ఇక్కడ అహమ్మదీయులు, యూదులు, అరబ్బులు ఉంటారు. దేశంలో ఇలాంటి కేంద్రం ఇది ఒక్కటే ఉంది.

సాహిత్యం

ఇజ్రాయిల్ 
Amos Oz's works have been translated into 36 languages, more than any other Israeli writer.

19వ శతాబ్దం మద్యభాగం నుండి హెర్బ్యూ భాష వాడుక భాషగా పునరుజీవనంలో భాగంగా ఇజ్రాయిల్ సాహిత్యం కవిత్వం, గద్యం హెర్బ్యూ భాషలో వ్రాయబడింది. అయినప్పటికీ ఇజ్రాయిల్ సాహిత్యంలో కొంతభాగం ఆగ్లంలో కూడా ప్రచురించబడింది. ఇజ్రాయిల్ చట్టం అనుసరించి ఇజ్రాయిల్‌లో ప్రచురించిన వుషయాల ప్రతులు " నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇజ్రాయిల్‌ "లో భద్రపరచాలన్న నిబంధన అమలులో ఉంది. 2001 నుండి ఇజ్రాయిల్ చట్టం ఆడియో , వీడియో , ఇతర ముద్రిత మాధ్యమరూపంలో భద్రపరచబడి ఉంది. 2011లో లైబ్రరీకి బదిలీ చేయబడిన 6,302 పుస్తకాలలో 86% హెర్బ్యూ భాషలో ఉన్నాయి. " హెర్బ్యూ బుక్ వీక్ " ప్రతి సంవత్సరం జూన్ మాసంలో నిర్వహించబడుతుంది. ఇందులో పుస్తక ప్రదర్శన నిర్వహించబడుతుంటుంది. ఈ సందర్భంలో ఇక్కడకు దేశం అంతటి నుండి ఇజ్రాయిల్ రచయితల విజయం చేస్తుంటారు. ఈ వారంలో ఇజ్రాయిల్ అత్యున్నత బిరుదు " సపిర్ ప్రైజ్ " బహూకరించబడుతుంది. 1996లో షముల్ యోసెఫ్ అజ్ఞాన్ నోబెల్ బహుమతిని జర్మన్ రచయిత నెల్లీ సాచెస్‌తో పంచుకున్నాడు. ఇజ్రాయిల్ రచయితలలో యెహూదా అమిచై, నాదన్ ఆల్టమెన్ , రాచెల్ బ్లూవిస్టియన్ ప్రధాన్యత వహిస్తున్నారు. అతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన సమకాలీన రచయితలలో అమోశ్ ఒజ్, ఎత్గర్ కెరెత్ , డేవిడ్ గ్రాస్మన్ ప్రధానులు. ఇజ్రాయిల్ అరబ్ వ్యంగ్య రచయిత సయేద్ కషుయా (హెర్బ్యూ రచయిత) కూడా అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. ప్రఖ్యాత పాలస్తీనియన్ రచయిత ఎమిలెహబ్బీ " ది సీక్రెయ్ లైఫ్ ఆఫ్ సయ్యిద్ పెస్సాప్టిమిస్ట్స్ " రచన , ఇతర రచనలు చేసాడు. ఆయన అరబిక్ సాహిత్యం ఆయనకు ఇజ్రాయిల్ పురస్కారవిజేతను అందేలా చేసింది. ఇజ్రాయిల్ రచయిత మొహ్మూద్ డార్విష్‌ను పలువురు పాలస్తీనియన్ జాతీయ రచయిత అనుకుంటారు. డార్విష్ ఉత్తర ఇజ్రాయిల్‌లో పుట్టిపెరిగాడు. అయినప్పటికీ ఆయన " పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ "లో చేరిన తరువాత ఆయన తన జీవితం విదేశాలలో కొనసాగించాడు.

సంగీతం , నృత్యం

ఇజ్రాయిల్ సంగీతం ప్రంపంచం అంతటా ఉన్న సంగీతపరికరాలు ఉపయోగించబడుతున్నాయి. సెఫర్డిక్, హసిడిక్ జ్యూడిజం (హసిడిక్ మెలోడీస్), బెల్లీ నృత్యం, గ్రీకు సంగీతం, జాజ్ , పాప్ రాక్ ఇజ్రాయిల్ సంగీతంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి.

ఇజ్రాయిల్ 
Celebrated Israeli ballet dancers, Valery and Galina Panov, who founded the Ballet Panov, in Ashdod.

ఇజ్రాయిల్ కేనోనియన్ ఫోల్క్ మ్యూజిక్ (జానపద గీతాలు) ఇజ్రాయిల్ భూమి పాటలుగా గుర్తించబడుతున్నాయి. ఇజ్రాయిల్‌లో స్థిరపడిన ఆరంభకాల యూదప్రజలు ది హోరా నృత్యం సర్కిల్ నృత్యాన్ని ఇజ్రాయిల్‌కు తీసుకువచ్చారు. ఇది ఆరంభంలో కిబ్బుత్జిం , పరిసర ప్రాంతాలలో ప్రాబల్యత కలిగి ఉండేది. ఇది జియోనిస్ట్ పునర్నిర్మాణానికి గుర్తుగా ఉంది. ఇది కాఠిన్యం మద్య సంతోష అనుభవాన్ని కలిగించే శక్తిని కలిగి ఉంటుంది. ఇది ఆధునిక ఇజ్రాయిల్ ఫోల్క్ నృత్యంలో ప్రధానపాత్ర వహిస్తుంది. ఇది వివాహం , ఇతర వేడుకలలో భాగస్వామ్యం వహిస్తుంది. ఇది ఇజ్రేల్ అంతటా బృందనృత్యాలుగా ప్రదర్శించబడుతుంటుంది.

ఇజ్రాయిల్ ఆధునిక నృత్యం అభివృద్ధి దశలో ఉంది. ఇజ్రాయిల్ నృత్యదర్శకులలో ఒహద్ నహరిన్, రమీ బీర్, బారక్ మార్షల్ మారల్ ఇతరులు అంతర్జాతీయ క్రీయాశీలక నృత్యదర్శకులుగా పనిచేస్తున్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డాంస్ కపెనీలలో ఇజ్రాయిల్‌లోని బత్షేవా డాంస్ కంపెనీ , కిత్బజ్ కాంటెపరరీ డాంస్ కంపెనీ ప్రధాన్యత కలిగి ఉన్నాయి.

ఇజ్రాయిల్ 
Israel Philharmonic Orchestra conducted by Zubin Mehta

ఇజ్రాయిల్‌లో హర్మోనిక్ ఆర్కెస్ట్రా 70 సంవత్సరాల నుండి నిర్వహించబడుతుంది. ఇది వార్షికంగా 200 కంటే అధికమైన ప్రదర్శనలు నిర్వహిస్తుంది. ఇజ్రాయిల్ పలు సంగీత స్వర పుస్తకాలను తయారుచేసింది. ఇవి అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. ఇత్ఝక్ పర్, పించస్ జుకర్మన్ , ఒఫ్ర హజా మొదలైన అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన సంగీతకారులు ఇజ్రాయిల్‌లో జన్మించారు. 1979 నుండి ప్రతిసంవత్సరం ఇజ్రాయిల్ " యూరోవిషన్ సాంగ్ కాంటెస్ట్ " పాల్గొంటున్నది. ఈ పోటీలలో ఇజ్రాయిల్ 3 మార్లు విజయం సాధించింది. ఒక సారి ఆతిథ్యం ఇచ్చింది. 1987లో ప్రతిసంవత్సరం ఈలాత్ తస్వంత సంగీత ఉత్సవం " రెడ్ సీ జాజ్ ఫెస్టివల్ " నిర్వహిస్తూ ఉంది. ఇజ్రాయిల్ పలు సంగీతకారులకు నిలయంగా ఉంది. వీరిలో అతర్జాతీయ గుర్తింపు పొందిన ఓద్ , వయోలిన్ కళాకారులు తైసీర్ ఎలియాస్, అమల్ ముర్కుస్ , సోదరులు సమీర్ , విస్సం జౌబ్రన్ ప్రధానులు. ఇజ్రాయిల్ అరబ్ సంగీతకారులు ఇజ్రాయిల్ సరిహద్దులు దాటి ప్రాబల్యత సాధించారు. ఎలియాస్ , ముర్కుర్ యూరప్‌ , అమెరికాలలో తరచూ ప్రదర్శనలు ఇస్తుంటారు. ఓద్ కళాకారుడు డర్విష్ (ప్రొఫెసర్ ఎలియాస్ శిష్యుడు) 2003 ఆల్- అరబ్ ఓద్ పోటీలో ప్రథమస్థానం సాధించాడు. జెరూసలేం " అకాడమీ అఫ్ మ్యూజిక్ అండ్ డాంస్ " తైసీర్ ఎలియాస్ నాయకత్వంలో అరబిక్ సంగీత పట్టా అధ్యయన కార్యక్రమం చేపట్టింది.

సినిమా , రంగస్థలం

ఇజ్రాయిల్ 
Habima Theatre, in Tel Aviv

ఇజ్రాయిల్ స్థాపించబడినప్పటి నుండి 10 ఇజ్రాయిల్ చలన చిత్రాలు " అకాడమీ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫారిన్ లాంగ్యుయేజ్ ఫిల్ం " చివరి ప్రతిపాదన స్థాయికి చేరుకుంటూనే ఉన్నాయి. 2009లో అజమి చిత్రం పోటీలో మూడవశ్రేణికి చేరుకుంది. తూర్పు యూరప్ థియేటర్ సంప్రదాయాన్ని యిద్దిష్ థియేటర్ బలపరుస్తూ ఉంది. ఇజ్రాయిల్ థియేటర్ ప్రదర్శనలను ఉత్సాహపూర్వకంగా కొనసాగిస్తుంది. 1918లో స్థాపించబడిన హబిమా థియేటర్ (టెల్ అవివ్) ఇజ్రాయిల్ పురాతన నాటక ప్రదర్శన థియేటర్‌గా గుర్తించబడుతుంది. పాలస్తీనియన్ ఇజ్రాయిల్ చలనచిత్ర నిర్మాతలు " అరబ్- ఇజ్రాయిల్" యుద్ధం, ఇజ్రాయిల్‌లో పాలస్తీనియన్ల స్థితి గురించిన పలు చిత్రాలను నిర్మించారు. మొహమ్మద్ బక్రి చిత్రాలు " జెనిన్ జెనిన్ ", ది సిరియన్ బ్రైడ్ " లను ఉదాహరణగా చెప్పవచ్చు.

మాధ్యమం

2014లో " రిపోర్టర్స్ వితౌట్ బార్డస్ " నివేదిక అనుసరించి మాధ్యమ స్వేచ్ఛ జాబితాకు చెందిన 180 దేశాలజాబితాలో ఇజ్రాయిల్ 96వ స్థానంలో ఉందని అంచనా వేయబడింది. 2013లో " ఫ్రీడం ఇన్ ది వరల్డ్ " వార్షిక నివేదిక , యు.ఎస్ బేస్డ్ ఫ్రీడం హౌస్ ఉత్తర ఆఫ్రికా , మిడిల్ ఈస్టులోని ఒకేఒక స్వతంత్రదేశం ఇజ్రాయిల్ అని వర్గీకరించాయి. యు.ఎస్ బేస్డ్ ఫ్రీడం హౌస్ పపంచదేశాల స్వతంత్ర పరిమాణం , రాజకీయ స్వేచ్ఛ గురించిన పరిశోధనకు ప్రాధాన్యత ఇస్తుంది.

మ్యూజియం

ఇజ్రాయిల్ 
Shrine of the Book, repository of the Dead Sea Scrolls in Jerusalem

జెరుసలేంలో ఉన్న ఇజ్రాయిల్ మ్యూజియం ఇజ్రాయిల్ ప్రధాన సాంస్కృతిక సంస్థలలో ఒకటి. ఇక్కడ ఎర్రసముద్రం గురించిన వివరణలు తెలియజేసే వస్తువులు, జ్యుడేషియా , యురేపియన్ కళాఖండాలు అనేకం సేకరించి భద్రపరచబడి ఉన్నాయి. ఇజ్రాయిల్ లోని " నేషనల్ హోలోకాస్ట్ మ్యూజియం, యాద్‌వషెం " హోలోకాస్ట్ సమాచారం లభించే ప్రధాన కేంద్రం అంతర్జాతీయగుర్తింపు కలిగి ఉంది. " బెత్ హతెఫుత్సొత్ (ది డయాస్పోరా మ్యూజియం) " ఇది టెల్ అవివ్‌లో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదసంస్కృతిని తెలియజేసే మ్యూజియం. పెద్ద నగరాలలో ఉన్న ప్రధాన మ్యూజియాలు కాక చిన్నపట్టణాలలో కూడా పలు మ్యూజియాలు ఉన్నాయి. మిష్కెన్ లీ ఒమానత్ (ఈన్ హరాడ్ మౌహద్) మ్యూజియం ఉత్తర ఇజ్రాయిల్‌లోని అతిపెద్ద కళావస్తు ప్రదర్శనశాలగా గుర్తించబడుతుంది. పలు ఇజ్రాయిల్ మ్యూజియాలు ఇస్లామిక్ సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. వీటిలో " రాకెఫెల్లర్ మ్యూజియం, ఎల్.ఎ. మేయర్ ఇంస్టిట్యూట్ ఫర్ ఇస్లామిక్ ఆర్ట్ "లు రెండూ జెరుసలేంలో ఉన్నాయి. రాకెఫెల్లర్ మ్యూజియం ఓట్టోమన్ , ఇతర మిడిల్ ఈస్ట్ చరిత్ర సంబంధిత ఆర్కియోలాజికల్ అవశేషాలకు ప్రత్యేకంగా ప్రధాన్యత ఇస్తుంది. ఇక్కడ మొదటి హోమీనిడ్ పుర్రె శిలాజాలు బధ్రపరచబడి ఉన్నాయి. పశ్చిమ ఆసియాలో లభించిన దీనిని " గలిలీ మన్ " అంటారు. ఈ పుర్రె మ్యూజియంలో ప్రదర్శించబడుతుంది.

ఆహారసంస్కృతి

ఇజ్రాయిల్ 
A meal including falafel, hummus, French fries and Israeli salad

ఇజ్రాయిల్ ఆహారంలో విదేశీఉద్యోగులైన యూదులు తమతో తీసుకువచ్చిన ఆహారాలు కూడా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. 1948లో దేశం స్థాపించబడిన నాటి నుండి ప్రత్యేకంగా 1970 నుండి ఇజ్రాయిల్‌లో సరికొత్తగా రూపకల్పన చేయబడిన ఆహారాలు అభివృద్ధి చెందాయి. . ఇజ్రాయిల్- జ్యూయిష్ ప్రజలసంఖ్యలో సగం వారి గృహాలలో కోషర్ చట్టాలను అనుసరిస్తారు. 1960లో కోషర్ రెస్టారెంట్లు అరుదుగా ఉండేవి. 2015 నాటికి అవి 25% చేరుకున్నాయి. హోటల్ , రెస్టారెంట్లలో అత్యధికంగా కోషర్ ఆహారం అందించబడుతుంది. కోషర్ కాని చిల్లర దుకాణాలు అక్కడక్కడా అరుదుగా ఉంటాయి. 1990 లో సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ , రష్యా ప్రజల రాకతో అవి అభివృద్ధి చెందాయి. నాన్ - కోషర్ చేప, కుందేలు, నిప్పుకోడి , పోర్క్ సాధారణంగా " వైట్ మీట్ " అంటారు.— వీటిని యూదులు , ఇస్లామీయులు నిషేదిస్తారు. ఇజ్రాయిల్ స్వీకరించిన ఆహారాలలో జ్యూయిష్ ఆహారం (ప్రత్యేకంగా మిజరాహి), సెఫర్దిక్, ఎథియోపియన్, అషెకెనాజి ఆహారశైలి, మొరాకో జ్యూయిష్, ఇరాకి జ్యూయిష్, ఇండియన్ జ్యూయిష్, ఇరానియన్ జ్యూయిష్ , యెమనిష్ జ్యూయిష్ ఆహారాలు ప్రధానమైనవి. ఇజ్రాయిల్ అరబిక్ సప్రదాయ ఆహారం, మిడిల్ ఈస్టర్న్ ఆహారం , మధ్యధరా ఆహారం (ఫలాఫె, హుమ్ముస్, షక్క్షౌక, కౌస్కస్ , జాతర్) విధానాలను విలీనం చేసుకుంది. స్చింత్జెల్, పిజా, హాంబర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, రైస్ , సలాడ్ ఇజ్రాయిల్‌లో సాధారణం.

క్రీడలు

ఇజ్రాయిల్ 
Sammy Ofer Stadium of Haifa. Israel's newest stadium

1930లో జూయిష్ అథెట్లు , ఇజ్రాయిల్ అథ్లెట్లు పాల్గొనే ఒలింపిక్ తరహా క్రీడలు ది మక్కాబియా గేంస్ ఆరంభించబడ్డాయి. ఇవి ప్రతి 4 సంవత్సరాలకు ఒకమారు నిర్వహించబడుతున్నాయి. 1964 లో ఇజ్రాయిల్ నేషనల్ ఫుట్‌బాల్ టీం ఎ.ఎఫ్.సి ఆసియన్ కప్ గెలుచుకుంది. 1970 లో ది ఉజ్రాయిల్ నేషనల్ ఫుట్‌బాల్ టీం ఎఫ్.ఐ.ఎఫ్.ఎ. వరల్డ్ కప్ క్రీడలలో పాల్గొనడానికి అర్హత సాధించింది. ఇది ఇజ్రాయిల్ ఫుట్‌బాల్ టీం సాధించిన అతిపెద్ద విజయంగా భావించబడుతుంది. 1974 ఆసియన్ గేంస్ టెహ్రాన్‌లో నిర్వహించబడ్డాయి. 1978 ఆసియన్ గేంస్ నుండి రక్షణ సమస్య కారణంగా తొలగించబడింది. 1994లో యు.ఎఫ్.ఎఫ్.ఎ ఇజ్రాయిల్ క్రీడాకారులందరినీ యూరప్ పోటీలలో పాల్గొనడానికి అనుమతించింది. ఇజ్రాయిల్ క్రీడలలో అసోసియేషన్ ఫుట్ బాల్ , బాస్కెట్ బాల్ క్రీడలు అత్యంత ఆదరణ కలిగి ఉన్నాయి. ఇజ్రాయిల్‌లో ప్రీమియర్ ఫుట్‌బాల్ లీగ్ కొరకు " ది ఇజ్రాయిల్ ప్రీమియర్ లీగ్ " , ప్రీమియర్ బాస్కెట్ బాల్ లీగ్ కొరకు " ది ఇజ్రాయిల్ బాస్కెట్ బాల్ ప్రీమియర్ లీగ్" పనిచేస్తున్నాయి. మక్కాబి హైఫా, మెక్కాబి టెల్ అవివ్, బెయితర్ జెరుసలేం ఇజ్రాయిల్ లోని అతిపెద్ద స్పోర్ట్ క్లబ్బులుగా గుర్తించబడుతున్నాయి. మెక్కాబి టెల్ అవివ్, మెక్కాబి హైఫా, హపొయెల్ టెల్ అవివ్ " యు.ఎఫ్.ఎఫ్.ఎ. చాంపియంస్ లీగ్ "లో పోటీ చేసాయి. హోపెల్ టెల్ అవివ్ యు.ఎఫ్.ఎఫ్.ఎ. కప్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకుంది. మెక్కాబి టేల్ అవివ్ బి.సి. " ఎఫ్.ఐ.బి.ఎ. యురేపియన్ చామొఇయంస్ కప్, యూరోలీగ్ చాంపియంషిప్ "లో ఆరు మార్లు విజయం సాధించింది. 2011 జనవరి 31న ఇజ్రాయిల్ టెన్నిస్ చాంపియన్ " షహర్ పీర్ " అంతర్జాతీయంగా 11వ ర్యాంక్ సాధించాడు.

ఇజ్రాయిల్ 
Boris Gelfand, chess Grandmaster

ఇజ్రాయిల్‌లో చదరంగక్రీడ ప్రధాన్యత కలిగి ఉంది. దీనిని అన్ని వయసుల ప్రజలు చూసి ఆనందిస్తుంటారు. ఇజ్రాయిల్‌లో పలువురు గ్రాండ్ మాస్టర్లు , చదరంగ క్రీడాకారులు ఉన్నారు. ఇజ్రాయిల్ చదరంగ క్రీడాకారులు పలు చాంపియంషిప్ విజయాలు సాధించారు.

ఇజ్రాయిల్ వార్షికంగా అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొంటున్న " ఇజ్రాయిల్ చెస్ చాంపియంషిప్ " నిర్వహిస్తుంది. 2005లో " వరల్డ్ టీం చెస్ చాంపియంషిప్ "కు ఆతిథ్యం ఇచ్చింది. ది మినిస్టరిక్ ఆఫ్ ఎజ్యుకేషన్ మరొయు వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఇజ్రాయిల్ పాఠశాలలలో చదరంగ క్రీడలో శిక్షణ ఇవ్వడానికి అంగీకరించాయి. కొన్ని పాఠశాలలు పాఠ్యప్రణాళికలో చదరంగక్రీడను పాఠ్యాంశంగా చేర్చాయి. బీర్షెబా నగరం జాతీయ చదరంగ కేంద్రంగా మారింది. నగరంలో కిండర్‌గార్డెన్ నుండి చదరంగక్రీడలో శిక్షణ ఇవ్వబడుతుంది. దేశంలో సోవియట్ వలసప్రజలు గణనీయమైన సంఖ్యలో ఉన్నందున ఇక్కడ ప్రంపంచంలోని ఇతరనగరాల కంటే గ్రాండు మాస్టర్ల సంఖ్య అధికంగా ఉంది. 2008లో 38వ చెస్ ఒలింపియాడ్ పోటీలో ఇజ్రాయిల్ రజితపతకం సాధించింది. 2010లో 39వ చెస్ ఒలింపియాడ్ పోటీలో ఇజ్రాయిల్ 148 దేశాల మద్య జరిగిన పోటీలో కామ్శ్యపథకం సాధించింది. ఇజ్రాయిల్ గ్రాండ్ మాస్టర్ బోరిస్ గెల్ఫాండ్ 2009 చెస్ వరల్డ్ కప్ సాధించాడు. బోరిస్ గెల్ఫాండ్ 2012 వరల్డ్ చెస్ చాంపియంషిప్ పోటీలో గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌తో ఆడి " స్పీడ్ చెస్ టైబేకర్ "లో వరల్డ్ కప్‌ను వదులుకున్నాడు.

క్రవ్ మగా

యూరప్‌కు వ్యతిరేకంగా ఫాసిజంతో పోరాటం చేసిన సమయంలో జ్యూసిష్ ఘెట్టో డిఫెండర్లు " క్రవ్ మగా " అనే మార్షల్ ఆర్టును డెవెలప్ చేసారు. దీనిని ఇజ్రాయిల్ సెక్యూరిటీ ఫోర్స్, పోలిస్ ఉపయోగించుకున్నారు. దీని శక్తి, స్వీయ రక్షణ కారణంగా ఇది ప్రంపంచం అంతటి నుండి ఆదరణ, ఆరాధన అందుకుంది.

ఒలింపిక్

ఇజ్రాయిల్ ఇప్పటి వరకు 7 ఒలింపిక్ పథకాలను అందుకున్నది. 1992లో సమ్మర్ ఒలింపిక్స్ పోటీలో మొదటి పతకం సాధించింది. 2004 సమ్మర్ ఒలింపిక్స్‌లో సెయిలింగ్ క్రీడలో బంగారుపతకం సాధించింది. ఇజ్రాయిల్ పారా ఒలింపిక్ గేంస్‌లో 100 బంగారు పతకాలు సాధించింది. ఇజ్రాయిల్ ఆల్ - టైం పారా ఒలింపిక్ క్రీడలలో 15వ స్థానంలో ఉంది. 1998 సమ్మర్ ఒలింపిక్స్‌కు ఇజ్రాయిల్ ఆతిథ్యం ఇచ్చింది.

విద్య

ఇజ్రాయిల్ 
Brain Research Center at Bar-Ilan University

ఇజ్రాయిల్‌లో విద్య అత్యంత విలువ ఉంది. ఇజ్రాయిల్ సంస్కృతిలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పురాతన ఇజ్రాయిల్ జీవితంలో కూడా బిద్యకు ప్రాధాన్యత ఉంది. ఇజ్రాయిల్ సంస్కృతి ఉన్నత విద్య ప్రజల సాంఘిక ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని విశ్వసిస్తుంది. ఇజ్రాయిల్ విద్యాతృష్ణ యూదుల ఉపాధివలసల కారణంగా గల్ఫ్ దేశలకు వ్యాపించింది. జ్యూయిష్ సమాజం మొదటిసారిగా నిర్భంద విద్యావిధానం ప్రవేశపెట్టింది. సమకాలీన జూయిష్ సంస్కృతి విద్యాభివృద్ధికి ఇస్తున్న ప్రాముఖ్యతకు విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను పూర్తిచేసిన అత్యధిక ఇజ్రాయిల్ ప్రజలసంఖ్య నిదర్శనంగా ఉంది. ఇజ్రాయిల్ విద్యావిధానం పలు కారణాలకు ప్రశంశించబడుతుంది. నాణ్యమైన ఇజ్రాయిల్ విద్యావిధానం ఇజ్రాయిల్సాంకేతిక, ఆర్థికాభివృద్ధిలో ప్రధానపాత్ర వహించింది. మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్ వంటి పలు అంతర్జాతీయ వ్యాపారవేత్తలు, ఆర్గనైజేషన్లు ఇజ్రాయిల్ నాణ్యమైన విద్యావిధానాన్ని ప్రశంశించారు. ఇజ్రాయిల్ ప్రజలలోచక్కని విద్యావంతులు అధికంగా ఉన్నారు. 2012 లో ఒ.ఇ.సి.డి దేశాలలో ఇజ్రాయిల్ ద్వితీయస్థానం సాధించింది. ఇజ్రాయిల్ ప్రజలు స్కూల్ జీవితం 15.5 సంవత్సరాలు. ఇజ్రాయిల్ అక్షరాస్యత 97.1%. 1953లో దేశ విద్యాచట్టం 5 విధాలైన పాఠశాలలు స్థాపించాలని చట్టం జారీ చేసింది. ఇవి స్టేట్ సెక్యులర్, అల్ట్రా ఆర్థడాక్స్, కమ్యూనల్ సెట్టిల్మెంట్ స్కూల్స్, అరబ్ స్కూల్. పబ్లిక్ స్కూల్స్‌లో యూదులు, అరబ్‌కు చెందని విద్యార్థులు అధికంగా ఉన్నారు. అరబ్ ప్రజలు వారి పిల్లలను అరబ్ మాధ్యమ పాఠశాలలకు పంపుతుంటారు. 3-18 సంవత్సరాల వయసు వరకు ఇజ్రాయిల్‌లో నిర్భంధ విద్య అమలులో ఉంది. పాఠశాలవిద్య మూడు స్థాయిలలో ఉంటుంది. మొదటి స్థాయిలో 1-6 తరగతులు, మద్యస్థాయిలో 7-9 తరగతులు, మూడవ స్థాయిలో 10-12 తరగతులు ఉంటాయి. బగ్రుత్ (మెట్రిక్యులేషన్ పరీక్షలు) లతో పాఠశాల విద్య పూర్తి చేయబడుతుంది. బగ్రుత్ సర్టిఫికేట్ సాధించడానికి గణితం, హెర్బ్యూ భాష, హెర్బ్యూ, ఆగ్ల లిటరేచర్, చరిత్ర, బైబిల్ వ్రాతలు, సివిక్స్ అధ్యయనం చేయడం తప్పనిసరి. అరబ్, క్రైస్తవ, డ్రుజ్ పాఠశాలలలో బిబిల్ పరీక్ష స్థానంలో ముస్లిం లేక క్రైస్తవం లేక డ్రుడ్జ్) మతసంబంధిత పరీక్ష ఉంటుంది. క్రైస్తవ అరేనియన్లు ఇజ్రాయిల్ విద్యావంతుల బృదాలలో ఒకరుగా గుర్తించబడుతున్నారు. క్రైస్తవ అరబ్ సమూహాలు అత్యంత విజయవంతమైన విద్యావిధానం కలిగి ఉందని భావిస్తున్నారు. క్రైస్తవ అరేబియన్లు ఇజ్రాయిల్ లోని ఇతర సమాజాల కంటే అత్యధిక విద్యావంతులుగా గుర్తించబడుతున్నారు. ఇజ్రాయిల్ లోని రష్యన్ కుటుంబాలకు చెందిన పిల్లలు బర్గూత్ సర్టిఫికేట్ పొందిన విద్యార్థులలో అధికశాతం ఉన్నారు. రష్యాలోని ఉక్రెయిన్, మొల్డోవా, బెలారస్ దేశాల నుండి వచ్చిన పిల్లలు బగ్రూత్ సర్టిఫికేట్ పొందిన వారిలో అధికశాతం (62.6%) ఉన్నారు. బగ్రూత్ సర్టిఫికేట్ పొందినవారిలో కౌకాసియన్, మద్య ఆసియా పిల్లలు దిగువన ఉన్నారు. 2003లో ఇజ్రాయిల్‌లోని ట్వెల్త్ గ్రేడ్ విద్యార్థులలో సగం మంది మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ పొందుతూ ఉన్నారు. 2012 ఇజ్రాయిల్‌లో 20% మంది అకాడమీ డిగ్రీ పొందారు. దేశ జనసంఖ్యను అనుసరించి సరాసరి డిగ్రీ పొందిన వారి సంఖ్యలో ఇజ్రాయిల్ ప్రంపంచంలో మూడవ స్థానంలో ఉంది. ఇజ్రాయిల్ విశ్వవిద్యాలయ విద్యా అత్యున్నత స్థాయిలో శక్తివంతమై ప్రతిష్ఠాత్మకంగా ఉంటుంది. ఇజ్రాయిల్ అనేకరంగాలలో అత్యున్నత స్థాయి అందిస్తూ ఉంది. ఇజ్రాయిల్ విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించడం ఖరీదైనది. దేశంలో 9 అత్యున్నత ప్రతిష్ఠాత్మకమైన రీసెర్చి యూనివర్శిటీలు, 49 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. విద్యాపరంగా ఇజ్రాయిల్ పలువసతులు కల్పిస్తున్నప్పటికీ ఇజ్రాయిల్ విద్యార్థులు విదేశాలలో విద్యను అభ్యసించడానికి ఆసక్తి చూపుతున్నారు. యునైటెడ్ నేషంస్‌లో ఉన్న ఐ.వి.లీగ్ ఇంస్టిట్యూట్‌లో విద్యను అభ్యసించడానికి పలువురు ఆసక్తి వెలిబుచ్చుతున్నారు. మరికొంతమంది కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డం, ఈస్టర్న్ ఐరోపా‌లో విద్యను అభ్యసించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రంపంచంలోని 100 అత్య్త్తమ విశ్వవిద్యాలయాలలో జెరుసలేం లోని హెర్బ్యూ యూనివర్శిటీ ఆఫ్ టెల్ అవివ్ యూనివర్శిటీ ఉన్నాయి.

గమనికలు

మూలాలు


Tags:

ఇజ్రాయిల్ పేరు వెనుక చరిత్రఇజ్రాయిల్ చరిత్రఇజ్రాయిల్ 2021 ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంఇజ్రాయిల్ భౌగోళికంఇజ్రాయిల్ భౌగోళికంఇజ్రాయిల్ గణాంకాలుఇజ్రాయిల్ రాజకీయాలుఇజ్రాయిల్ నిర్వహణా విభాగాలుఇజ్రాయిల్ ఆక్రమిత భూభాగాలుఇజ్రాయిల్ విదేశీ సంబంధాలుఇజ్రాయిల్ మానవహక్కులుఇజ్రాయిల్ సైన్యంఇజ్రాయిల్ ఆర్ధికంఇజ్రాయిల్ శాస్త్రీయం , సాంకేతికంఇజ్రాయిల్ రవాణాఇజ్రాయిల్ పర్యాటకంఇజ్రాయిల్ విద్యుత్తుఇజ్రాయిల్ సంస్కృతిఇజ్రాయిల్ విద్యఇజ్రాయిల్ గమనికలుఇజ్రాయిల్ మూలాలుఇజ్రాయిల్ISBN (identifier)en:West Bankఅరబ్బీ భాషఆంగ్లంఈజిప్టుజోర్డాన్ప్రత్యేక:పుస్తకమూలాలు/978-0-87451-962-4లెబనాన్సిరియా

🔥 Trending searches on Wiki తెలుగు:

కేంద్రపాలిత ప్రాంతంభారతీయుడు (సినిమా)జూనియర్ ఎన్.టి.ఆర్ఉత్తరాషాఢ నక్షత్రముఉండిమనుస్మృతిఘట్టమనేని కృష్ణబాలకాండకృష్ణా నదిసమ్మక్క సారక్క జాతరవై.యస్.భారతిపర్యాయపదంతంతిరంద్రోణాచార్యుడువిజయ నరేష్జాతీయ ప్రజాస్వామ్య కూటమిఆరూరి రమేష్చార్మినార్మేడిగీతాంజలి (1989 సినిమా)పాడేరు శాసనసభ నియోజకవర్గంవ్యవసాయంశ్రీదేవి (నటి)పి.సుశీలనారా చంద్రబాబునాయుడుకూచిపూడి నృత్యంపాల కూరపిత్తాశయముమర్రిమామిడిఝాన్సీ లక్ష్మీబాయిఅధిక ఉమ్మనీరునాగ్ అశ్విన్వర్షం (సినిమా)గృహ ప్రవేశంభారత జాతీయ ఎస్సీ కమిషన్దినేష్ కార్తీక్ఇక్ష్వాకులుపులివెందుల శాసనసభ నియోజకవర్గంఇజ్రాయిల్లలితా సహస్రనామ స్తోత్రంకమ్మలలితా సహస్ర నామములు- 301-400రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్తెలుగు అక్షరాలుగోదావరిరౌద్రం రణం రుధిరంవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)నందమూరి తారకరత్నన్యుమోనియాఇత్తడిఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుఆరుద్ర నక్షత్రముభారత ప్రధానమంత్రుల జాబితానందమూరి తారక రామారావురక్తండీజే టిల్లుపంజాబ్ కింగ్స్కాజల్ అగర్వాల్మాదిగమంచి మనసులు (1962 సినిమా)ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్ట్రావిస్ హెడ్సింహరాశిరమ్య పసుపులేటిబారసాలగోత్రాలుమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డికుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంవేమిరెడ్డి ప్రభాకరరెడ్డిద్వాదశ జ్యోతిర్లింగాలుఓటుఅచ్చులుభారత జాతీయపతాకంరవితేజపాట్ కమ్మిన్స్తెలంగాణ శాసనసభ🡆 More