యెమన్

యెమన్ (/ˈjɛmən/ ( listen); అరబ్బీ: اليَمَن‎ al-Yaman),అధికారికంగా యెమన్ గణతంత్రం అని పిలవబడుతుంది.

(الجمهورية اليمنية al-Jumhūrīyah al-Yamanīyah), పశ్చిమాసియా లోని అరబ్ దేశాలలో ఇది ఒకటి. అరేబియా ద్వీపకల్పంలో దక్షిణతీరంలో ఉంది. 203,850 చ.కి.మీ వైశాల్యం కలిగిన యెమన్ అరేబియా ద్వీపకల్పంలో వైశాల్యపరంగా ద్వితీయస్థానంలో ఉంది.సముద్రతీరం పొడవు 2,000 కి.మీ. యేమన్ ఉత్తర సరిహద్దులో సౌదీ అరేబియా, పశ్చిమ సరిహద్దులో ఎర్రసముద్రం, దక్షిణ సరిహద్దులో గల్ఫ్ ఆఫ్ ఆడెన్, అరేబియన్ సముద్రం, తూర్పు, ఈశాన్య సరిహద్దులో ఒమన్ దేశం ఉన్నాయి.యెమన్ రాజ్యాంగ బద్ధంగా సనా నగరాన్ని రాజధానిగా నిర్ణయించినప్పటికీ 2015 ఫిబ్రవరి వరకు యెమన్ రాజధాని నగరం సనా తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది. అందువలన యెమన్ రాజధాని తాత్కాలికంగా దక్షిణ తీరంలో ఉన్న" ఆడెన్ " నగరానికి మార్చబడింది. యెమన్ భూభాగంలో 200 ద్వీపాలు ఉన్నాయి. వీటిలో అత్యంత విశాలమైనది " సొకోటా " ద్వీపం.యెమన్ సబయాన్లకు నిలయంగా ఉంది (బైబుల్ పేరు షెబా) వాణిజ్యపరంగా వేయి సంవత్సరాలకు పైగా ప్రాధాన్యత కలిగిన యెమన్ దేశంలో ఆధునిక కాలానికి చెందిన ఎథియోపియా , ఎరిత్రియా దేశాలు భాగంగా ఉన్నాయని భావిస్తున్నారు. సా.శ. 275లో ఈ ప్రాంతం యెమనీ యూదుల పాలనలో తరువాత " హిమియారితే రాజ్యంలో " భాగంగా మారింది. యెమన్ ప్రాంతంలో 4వ శతాబ్ధంలో క్రైస్తవమతం ప్రవేశించింది. ముందుగా ఇక్కడ యూదిజం , ప్రాంతీయంగా ఉన్న పాగనిజం ఉండేవి. 7వ శతాబ్ధం నాటికి ఈ ప్రాంతంలో ఇస్లాం వేగవంతంగా వ్యాపించింది. ఆరంభకాల ఇస్లాం యుద్ధాలలో యెమన్ బృందాలు ప్రధాన పాత్ర వహించాయి. యెమన్ రాజ్యాంగ వ్యవస్థ అత్యంత కాఠిన్యత కలిగినదిగా భావించబడుతుంది.

الجمهورِيّة اليَمَنيّة
Al-Jumhūriyyah al-Yamaniyyah
యెమన్ గణతంత్రం
Flag of Yemen Yemen యొక్క చిహ్నం
నినాదం
"Allah, al-Watan, at-Thawra, al-Wehda"
"God, the Nation, the Revolution, Unity"
జాతీయగీతం
United Republic

Yemen యొక్క స్థానం
Yemen యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
Sanaa
15°48′N 47°54′E / 15.8°N 47.9°E / 15.8; 47.9
అధికార భాషలు Arabic
ప్రభుత్వం Republic
 -  President Ali Abdullah Saleh
 -  Prime Minister Ali Mohammed Mojawar
Establishment
 -  Unification May 22 1990 
విస్తీర్ణం
 -  మొత్తం 527,968 కి.మీ² (49th)
203,849 చ.మై 
 -  జలాలు (%) negligible
జనాభా
 -  July 2005 అంచనా 20,975,000 (51st)
 -  జన సాంద్రత 40 /కి.మీ² (160th)
104 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $19.480 billion (110th)
 -  తలసరి $900 (175th)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.492 (low) (150th)
కరెన్సీ Yemeni rial $1 = 198.13 Rials (YER)
కాలాంశం (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ye
కాలింగ్ కోడ్ +967

యెమన్ ప్రాంతంలో 16వ శతాబ్ధం నుండి పలు రాజవంశాలు ఉద్భవించాయి. వీటిలో రసులిద్ రాజవంశం అత్యంత శక్తివంతమైనది , అత్యంత సుసంపన్నమైనదిగా భావించబడుతుంది. 20వ శతాబ్ధం ఆరంభంలో ఈ దేశం ఓట్టమన్ , బ్రిటిష్ సాంరాజ్యాలచేత విభజితమై ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత , 1962 లో " యెమన్ అరబ్ రిపబ్లిక్ " స్థాపించబడడానికి ముందుగా ఉత్తర యెమన్ ప్రాంతంలో " ది జైదీ ముతవాక్కీలితే కింగ్డం ఆఫ్ యెమన్ " స్థాపించబడింది. 1967లో దక్షిణ యేమన్ ప్రాంతం బ్రిటిష్ రక్షిత ప్రాంతంగా (ఆడెన్ ప్రొటెక్టరేట్) ప్రాంతంగా ఉండేది. 1990లో రెండు యేమన్ ప్రాంపాలు సమైఖ్యం చేయబడి ఆధునిక " రిపబ్లిక్ ఆఫ్ యేమన్ " గా స్థాపించబడింది. యేమన్ అభివృద్ధిచెందుతున్న దేశం. అలాగే మిడిల్ ఈస్ట్ దేశాలలో యేమన్ అత్యంత పేదదేశం. అలీ అబ్దుల్లా సాలేహ్ పాలనలో యేమన్ దేశం " దోపిడీదారుల దేశం " గా వర్ణించబడుతుంది. 2009 అంతర్జాతీయ లంచం అవగాహన ఇండెక్స్ " ట్రాంస్పరెంసీ ఇంటర్నేషనల్ " జాబితా అనుసరించి 182 దేశాలలో యేమన్ 164వ స్థానంలో ఉంది. రాజ్యాంగ వ్యవస్థ బలహీనంగా ఉండడం , నాణ్యమైన రాజకియవ్యవస్థ లేమి కారణంగా యేమన్‌లో కూటమి ఆధిపత్యం కొనసాగింది. అనధికారికంగా రాజకీయాధికారం ముగ్గురిమద్య విభజించబడింది: అఫ్హ్యక్షుడు అలీ అబ్దుల్లా షాహ్(దేశ నియత్రణ కలిగిన వ్యక్తి); మేజర్ జనరల్ " అలీ - మొహ్సెన్ అల్- అహ్మర్ (రిపబ్లిక్ ఆఫ్ యెమన్ ఆర్మీ నియంత్రణ కలిగినవ్యక్తి);, అబ్దుల్లా ఇబ్న్ హుసాయ్న్ ఆల్- అహ్మర్ (అల్ ఇస్లా పార్టీ) ఇస్లామిస్ట్. ట్రైల్ షేక్స్‌తో కూడినది. స్థానిక తెగల స్వయంప్రతిపత్తి కొరకు సౌదీ నుండి నిధులు సమకూరేవి. యెమన్‌లో 2011లో పేదరికం, నిరుద్యోగం, లంచం, రాజ్యాంగ సవరణ కోరుతూ వీధి నిరసనలు మొదలైయ్యాయి. అధ్యక్షుడు సాలేహ్ పదవి నుండి తప్పుకుని అధికారం ఉపాధ్యక్షుడు " అబ్ద్ రబ్దుహ్ హాది "కి బదిలీ చేయబడింది. తరువాత ఆయన 2012 ఫిబ్రవరి 21న అధ్యక్షుడుగా ఎన్నిక చేయబడ్డాడు. అధికార బదిలీ కార్యక్రమాన్ని హౌతీస్ , అల్- ఇస్లాహు ఎదుర్కొన్నారు. అల్ కొయిదా కూడా యెమన్‌లో కొంత ప్రభావం చూపింది. 2014 సెప్టెంబరులో హౌతీసు సనాను స్వాధీనం చేసుకుంది. తరువాత వారివారు ప్రభుత్వప్రకటన చేసుకున్నారు. తరువాత సౌదీ అరేబియా జోక్యం చేసుకున్నప్పటికీ యెమన్ అంతర్యుద్ధాన్ని నిలువరించడానికి వీలుకాలేదు.

చరిత్ర

పురాతన చరిత్ర

యెమన్ సుదీర్ఘ సముద్రతీరం మద్య తూర్పు , పశ్చిమ నాగరికతలు విలసిల్లాయి. యెమన్ వ్యూహాత్మకమైన ఉపస్థితి పలు నాగరికతలకు కేంద్రంగా ఉండాడానికి అలాగే వాణిజ్య కూడలిగా ఉండడానికి అనుకూలించింది. యెమన్ ఉత్తర ప్రాంతంలోని పర్వతప్రాంతాలలో క్రీ.పూ 5,000 సంవత్సరాలకు పూర్వం నుండి బృహత్తర మానవ ఆవాసాలు ఏర్పడ్డాయి. పురాతన యెమన్ కాంశ్యయుగం నుండి బిడారు వర్తక రాజ్యాలుగా మారేవరకు యెమన్ గురించిన చరిత్ర స్వల్పంగానే వెలుగులోకి వచ్చింది.ఇది అరేబియాలో ఇస్లామిక్ పూర్వ చరిత్ర గురించి తెలుసుకోవడానికి పరిశోధకులను నిరుత్సాహానికి గురిచేసింది.

యెమన్ 
A Sabaean gravestone of a woman holding a stylized sheaf of wheat, a symbol of fertility in ancient Yemen

క్రీ.పూ. 11వ శతాబ్ధం నుండి యెమన్ ప్రాంతంలో సబీయన్ రాజ్యం ఉనికిలోకి వచ్చింది. దక్షిణ అరేబియాలో విలసిల్లిన స్థానిక కూటమితో ఏర్పడిన రాజ్యాలలో సబీనా, హద్రామౌట్, క్వతాబన్ మినాయన్లు రాజ్యాలు ప్రధానమైనవి. సబా అనేపదానికి బైబిలికల్ పదం షెబా మూలమని భావిస్తున్నారు. వీటిలో సబా రాజ్యం మరింత ప్రాముఖ్యత సంతరించుకున్న సమాఖ్యగా భావించబడుతుంది. సబీయన్ పాలకులు " ముకర్రిబ్ " (సమైఖ్యతా వాదులు) బిరుదును స్వీకరించారు. లేక " ప్రీస్ట్ - కింగ్ " (పురోహిత రాజులు) అనే అర్ధం ఉంది. వీరు దక్షిణ అరేబియా రాజ్యాల సమాఖ్య నాయకులుగా " కింగ్స్ ఆఫ్ కింగ్స్ " గా గౌరవించబడ్డారు. ముకర్రిబ్ రాజ్యంలో పలు స్థానికజాతుల నుండి ఎన్నిక చేయబడ్డారు. వీరు రాజ్యరాజకీయాల మీద ఆధిఖ్యత కలిగి ఉండేవారు.

సబియన్లు

సబీయన్లు క్రీ.పూ. 940లో " గ్రేట్ మారిబ్ ఆఫ్ మారిబ్ " ఆనకట్ట నిర్మించారు. ఈ ఆనకట్ట లోయల నుండి దూసుకువస్తున్న జలప్రవాహాన్ని తట్టుకుని నిలబడింది. క్రీ.పూ. 700 , 800 అవ్సన్ రాజ్యం ఆడెన్ రాజ్యం , దక్షిణ అరేబియాలో ఆధిఖ్యతతలో ఉన్న రాజ్యాల మీద ఆధిఖ్యత సాధించింది. సబీన్ ముకర్రిబ్ "మొదటి కరిబ్ వాతార్ " అవ్సన్ పాలకులందరి మీద విజయం సాధించారు. తరువాత ఆయన సబీయన్ పాలనను దక్షిణ అరేబియాలోని పలుప్రాంతాలకు విస్తరించారు. ద్వీపకల్పాన్ని సంఘటితం చేయడం ద్వారా సబీయన్లు అరేబియా ద్వీపకల్పంలో నీటికొరతను పరిష్కరించారు. వ్యాపారమార్గాల నియంత్రణ కొరకు సబీన్లు వివిధ కాలనీలు స్థాపించారు. సబీయన్ల ప్రభావానికి నిదర్శనగా ఉత్తర ఎథియోపియాలో ఎథియోపియాలో అరేబియన్ లిపి, మతం, మందిరాలు, దక్షిణ అరేబియా నిర్మాణశైలి, కళా కనిపిస్తూ ఉంది. సబీయన్ వారి మతం ద్వారా వారికి ప్రత్యేక గుర్తింపును తయారుచేసుకున్నారు. వారు " అల్మక్వా (ఎల్-మక్వాహ్) "ను ఆరాధించారు. వారు ఆయన పిల్లలు అని వారు విశ్వసించారు. సబియన్లు కొన్ని శతాబ్ధాల కాలం బాబ్- ఎల్- మాండెబ్ జసంధిలో (అరేబియన్ ద్వీపకల్పం, ఆఫ్రికా , ఎర్రసముద్రాలను హిందూ మహాసముద్రం నుండి వేరుచేస్తుంది) వ్యాపారంపై నియంత్రణ కలిగి ఉన్నారు. క్రీ.పూ. మూడవ శతాబ్దం నాటికి క్వతాబన్, హద్రామౌట్ , మినయన్లు సబా నుండి స్వతంత్రం పొంది వారి స్వంత యెమని వేదిక స్థాపించుకున్నారు. తరువాత మినయన్ పాలన డెబన్ వరకు విస్తరించింది. వారు " బారాక్విష్ "ను రాజధానిగా చేసుకున్నారు. క్రీ.పూ. 50 లో క్వతాబన్ పతనం తరువాత సబయన్లు మినయన్ల రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. క్రీ.పూ. 25లో రోమన్లు అలియస్ గల్లస్ నాయకత్వంలో అరేబియా మీద దాడి చేసేవరకు సయన్ల ఆధిపత్యం కొనసాగింది.

రోమన్ల దాడి

సబయన్ల మీద ఆధిపత్యం సాధించడానికి అనువుగా సైనికసమీకరణచేసి యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు. అరేబియన్ లేక యెమన్ భూభాగం మీద సరైన భౌగోళిక అవగాహన రోమన్ల 10,000 సైన్యం మారిబ్ చేరే ముందుగా ఓటమి పాలైంది. స్ట్రాబోకు అలియస్ గల్లస్‌తో ఉన్న సన్నిహిత సంబంధం కారణంగా ఆయన స్నేహితుడి ఓటమిని ఆయన వ్రాతలలో పొందుపరిచేలా చేసింది. రోమంస్ మారిబ్ చేరడానికి ఆరు మాసాలు , మారిబ్ నుండి ఈజిప్ట్ చేరడానికి మరో ఆరుమాసాలు పట్టాయి. రోమన్లు నబటయన్ మార్గదర్శిని నిందించి ఆయన మోసానికి ఆయనకు మరణశిక్ష విధించింది. సయన్ వ్రాతలలో రోమన్ దాడి గురించి పేర్కొనబడలేదు.

రోమన్ల దాడి తరువాత

యెమన్ 
A funerary stela featuring a musical scene, first century AD
యెమన్ 
Himyarite King Dhamar Ali Yahbur II

రోమన్ దాడి తరువాత దేశంలో గందరగోళం నెలకొన్నది. తరువాత బాను హందాన్ , హియార్ వంశాలు రాజ్యాధికారం చేజిక్కించుకున్నారు. వీరు రాజా షెబా , రాజా హిమయార్ బిరుదులతో పాలన సాగించారు. సబయన్లకు వ్యతిరేకంగా ధు రేదాన్లు , హిమయరిటీలు కూటమిగా చేరారు. ప్రతినిధి బకిల్, రాజా సబా , ధు రేదాన్, ఎల్ షరీహ్ యహ్ధిబ్ హిమయరిటీలు , హబషత్‌లతో విజయవంతంగా యుద్ధాలు చేసారు. ఎల్ షరిహ్ యుద్ధాలలో చేసిన యుద్ధాలు అధికంగా గుర్తింపును పొదాయి. ఆయనకు యహ్దిప్ (అణిచివేతదారుడు) అనే బిరుదు ఇవ్వబడింది. ఆయన తన శత్రువులను ముక్కలు ముక్కలు చేసేవాడు. ఆయన కాలంలో సనా ప్రాముఖ్యత సంతరించుకుంది. సా.శ. 100లో హిమయరితె సనాను బను హందాన్‌తో విలీనం చేసాడు. హషిద్ ఆదిమతెగ తిరుగుబాటు తరువాత క్రీ.పూ. 180లో సనా తిరిగి ఆధుఖ్యత చేజిక్కించుకుంది. క్రీ.పూ. 275వరకు షమ్మర్ యహ్రిష్ హద్రత్,నజ్రన్ , తిహమాల మీద విజయం సాధించలేదు.

హిమయరితెస్

హిమయరితెస్ బహుళదేవతారాధనను వ్యతిరేకించి సమైక్యంగా ఏకీశ్వరోపాసనను ఆచరించారు. క్రీ.పూ. 354 రోమన్ చక్రవర్తి "రెండవ కాన్‌స్టాంటిస్" హిమయరిటీస్‌ను క్రైస్తవులుగా మార్చడానికి " థియో ది ఇండియన్ " నాయకత్వంలో దౌత్యబృందాన్ని పంపాడు. ఫిలోస్టోర్జియస్ వ్రాతలను అనుసరించి ఈ మిషన్‌ను యూదులు తిరస్కరించారని భావిస్తున్నారు. ఇజ్రేలీ ప్రజలను, యూదుల సహాయగుణాన్ని ప్రశంశిస్తూ హెర్బ్యూ, సబయన్ శాసనాలు లభించాయి. ఇస్లామిక్ సంప్రదాయం అనుసరించి " రాజా తుబా అబు కరిబా అసద్ " సైనికసమీకరణచేసి యూదుల నాయకుడు యాత్రిబ్‌కు మద్దతుగా దాడిచేసాడు. శాసనాల ఆధారంగా అబు కరిబా అసద్ కిండాహ్ రాజ్యానికి మద్దతుగా లఖ్మిదులకు వ్యతిరేకంగా సైన్యాలను నడిపించాడని భావిస్తున్నారు. అయినప్పటికీ ఆయన దీర్ఘకాల పాలనలో యూదులు లేక యథ్రిబ్ గురించిన ప్రత్యక్ష ఆధారాలు లభించలేదు. 50 సంవత్సరాల తరువాత క్రీ.పూ 445లో అబు కరిబా మరణించాడు.

జాతివైరం

క్రీ.పూ. 515 హిమయర్ మతపరంగా విభజించబడింది.విభిన్నజాతుల మద్య జాతివైరాలు అధికంగా సంభవించాయి. ఇది " అక్సమిటీల " దాడికి దారితీసింది. చివరి హిమయరితే రాజుకు మద్దతుగా యూదులకు వ్యతిరేకంగా అక్సాలు సహకరించారు. క్రైస్తవమతారాధకుడు మాదికరిబ్ అరబ్ తెగకు చెందిన బైజాంటియం మద్దతుతో దక్షిణ ఇరాక్‌లోని " లఖ్‌మిదులకు " వ్యతిరేకంగా యుద్ధం చేసాడు. పర్షియా సంప్రదాయం అనుసరించే లఖ్‌మిదులు అన్యమతానుయాయులైన క్రైస్తవులను సహించలేరు. " 521 "లో మా అధికరిబ్ యా ఫర్ " మరణించిన తరువాత " హిమ్యరితె - యూద యుద్ధవీరుడు " ధూ నువాస్ " (యూసఫ్ అసర్ యాథర్) అధికారం హస్తగతం చేసుకున్నాడు. ఆయన గౌరవనామం " యాథర్ " (ప్రతీకారం కొరకు). అక్సం , బైజాంటియం నుండి సహాయసహకారాలు అందుకుంటున్న యెమనీ క్రైస్తవులు యూదులను హింసిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న వారి ఆరధనా ప్రాంతాలను తగులబెట్టారు . యూసెఫ్ ప్రతీకారంతో ఆయన ప్రజలను తీవ్రహింసలకు గురిచేసారు. యూసఫ్ సైన్యంతో మొచా (యెమన్) చేరుకుని 14,000 మందిని చంపి 11,000 మందిని ఖైదుచేసాడు. తరువాత అక్సం నుండి సహాయసహకారం అందకుండాచేయడానికి " బాబ్-ఎల్-మాండెబ్ " కేంపు స్థాపించాడు.తరువాత యూసఫ్ యూదుయుద్ధవీరుడు " షరాహిల్ యాక్యుబుల్ " నాయకత్వంలో " నజ్రన్ "కు సైన్యాలను పంపించాడు. తరువాత షరాహిల్ సైన్యాలకు కిండాహ్ , మధాహి నుండి అదనపు బలగాలు వచ్చి చేరాయి. చివరికి యూసఫ్ నజ్రన్ నుండి క్రైస్తవులను దాదాపు పూర్తిగా తుడిచిపెట్టాడు. ఇస్లామిక్ సంప్రదాయకులు యూసఫ్ 20,000 క్రైస్తవులను గుటలలలో వేసి మండే ఆయిల్‌తో నింపారని భావిస్తున్నారు. ఈ చరిత్ర పురాణాలలో చోటుచేసుకుంది. ధూ నువాస్ వదిలి వెళ్ళిన రెండు శాసనాలు ఈ భయంకరమైన గుంటల గురించిన వివరాలు వివరించలేదు.బైజాంటియం తూర్పుప్రాంత క్రైస్తవులకు రక్షకులుగా భావిస్తున్నారు. బైజాంటియం చక్రవర్తి అక్సుమైట్ రాజా కాలెబ్‌కు హేయమైన హెబ్ర్యూల మీద దాడి చేయమని వత్తిడి చేస్తూ ఒక లేఖ పంపాడు. బైజాంటైన్, అక్సుమైట్ , అరబ్ క్రైస్తవులు కూటమిచేరి సా.శ. 525-527 నాటికి యూసఫ్‌ను ఓడించారు. తరువాత క్రైస్తవ రాజు హిమయరితె సిహాసనం అధిష్టించాడు.

క్రైస్తవం

యెమన్ 
The ruins of The Great Dam of Marib

ప్రాంతీయ క్రైస్తవ ప్రభువు ఎసిమిఫైయోస్ ఒక శాసనంలో మారిబ్‌లో ఉన్న సబయన్ రాజమందిరాన్ని కూలగొట్టి ఆశిథిలాలలో చర్చిని నిర్మించి ఉత్సవం చేసుకున్నట్లు పేర్కొనబడింది. తరువాత నజ్రన్‌లో మాత్రమే మూడు చర్చీలు నిర్మించబడ్డాయి. ఎసిమిఫైయోస్ అధికారాన్ని పలు గిరిజన తెగలు గుర్తించలేదు.531లో అబ్రహా అనే వీరుడు ఎసిమిఫైయోస్‌ను పదవి నుండి తొలగించాడు. తరువాత అబ్రహా యెమన్ విడిచిపోవడానికి నిరాకరించి తనకుతానుగా హిమయార్ రాజుగా ప్రకటించుకున్నాడు. మొదటి జస్టినియన్ చక్రవర్తి యెమన్‌కు దూతను పంపాడు. ఆయన క్రైస్తవ హిమిరితెలు వారి అరేబియా అంతర్భాగంలో ఉన్న గిరిజనతెగ ప్రజలలో వారికి ఉన్న పలుకుబడిని ఉపయోగించి పర్షియన్ల మీద సైనికచర్య తీసుకోవాలని సూచించాడు. మొదటి జస్టినియన్‌కు మద్య , ఉత్తర అరేబియాలో ఉన్న కిండాఫ్ , ఘస్సనిదులు షేకుల " డిగ్నిటీ ఆఫ్ కింగ్ " బిరుదు ఇవ్వబడింది. ఆరంభకాల రోమన్ , బైజాంటిన్ విధానం ఎర్రసముద్రతీర రాజులతో సన్నిహిత సంబంధాలు అభివృద్ధి చేసుకున్నారు. వారు అక్సుం సంస్కృతి ప్రభావితులై వారి జీవనవిధానం అలవరచుకున్నారు. కిండాహ్ (కెండితె) రాకుమారుడు యజిద్ బిన్ కబ్షత్ అబ్రహాకు , అరబ్ క్రైస్తవుల కూటములకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసాడు. అబ్రహా 555 - 565 మద్యకాలంలో మరణించాడు. ఆయన మరణం గురించిన ఖచ్ఛితమైన వివరణలు లభ్యం కాలేదు.క్రీ.పూ 570 నాటికి ఆడెన్ ప్రాంతాన్ని సస్సనిద్ సామ్రాజ్యం విలీనం చేసుకుంది. వారి పాలనలో గ్రేటర్ యెమన్ స్వయంప్రతిపత్తిని (ఆడెన్ , సనా మినహా) అనుభవించారు. ఈశకంలో పురాతన అరేబియన్ సంస్కృతి పతనం అయింది. అప్పటి నుండి క్రీ.పూ 630 ఇస్లాం ఈప్రాంతంలో ప్రవేశించే వరకు ఈ ప్రాంతంలో పలు వంశాలు స్వతంత్రంగా వ్యవహరించారు.

మద్యయుగం

ఇస్లాం ప్రవేశం , మూడు రాజవంశాలు

యెమన్ 
The interior of the Great Mosque of Sana'a, the oldest mosque in Yemen

క్రీ.పూ. 630లో ముహమ్మద్ తన కజిన్ సోదరుడు అలిని సనా , పరిసరప్రాంతాలకు పంపాడు. ఆసమయంలో యెమన్ అరేబియా దేశాలలో అధికమైన అభివృద్ధి దశలో ఉంది. మొదటిసారిగా " బాను హందాన్ " సమాఖ్య ఇస్లాంను అంగీకరించింది. ముహమ్మద్ " మౌధ్ ఇబ్న్ జబల్ " గిరిజన తెగల నాయకులకు వ్రాసిన లేఖలతో అల్- జనాద్ (ప్రస్తుత తైజ్ )కు పంపాడు. బలమైన కేంద్రీకేత అధికారం లేని యెమన్‌లో ఉన్న గిరిజనతెగల మద్య విభేదాలు తీసుకురావడానికి ఇలాంటి చర్యలు చేపట్టబడ్డాయి. ప్రధాన తెగలైన హిమ్యార్ క్రీ.పూ. 630-631 లో మెదీనాకు దూతలను పంపాడు. క్రీ.పూ. 630కు ముందుగా అమ్మర్ ఇబ్న్ యాసిర్, అల్-అలా అల్- హద్రామి, మిక్బాద్ ఇబ్న్ అస్వద్, అబు ముసా అషారి , షర్హబీల్ ఇబ్న్ హస్సానా మొదలైన వారు ఇస్లాంను స్వీకరించారు. అస్వద్ అంసిల్ అభల ఇబ్న్ క ఆబ్ అల్ - అంసి అనే వ్యక్తి మిగిలిన పర్షియన్లను బహిష్కరణకు గురిచేసి తనకుతాను ప్రవక్త రహమాన్‌గా ప్రకటించుకున్నాడు. తరువాత యెమని పర్షియన్ " ఫేరుజ్ అల్- డేలమీ " అనే పర్షియన్ చేతిలో అస్వద్ అంసిల్ అభల ఇబ్న్ క ఆబ్ అల్ - అంసి హత్యచేయబడ్డాడు. నజ్రన్‌లో నివసిస్తున్న క్రైస్తవులు యూదులతో కలిసి జిజ్యా చెల్లించడానికి అంగీకరించారు.వహ్బ్ ఇబ్న్ మునాబ్బిహ్ , కాబ్ అల్-అహ్బర్ వంటి కొంతమంది యూదులు ఇస్లాం మతానికి మార్పిడి చెందారు. రషిదున్ కాలిఫేట్ కాలంలో యెమన్ స్థిరంగా ఉంది. ఈజిప్ట్,ఇరాక్,పర్షియా, ది లెవంత్, అనటోలియా, ఉత్తర ఆఫ్రికా, సిసిలీ , అండలూసియా దేశాలపై ఇస్లాం సాగించిన దండయాత్రలో యెమన్ ప్రధానపాత్ర వహించింది. సిరియాలో స్థిరపడిన యెమనీ గిరిజనులు మొదటి మర్వన్ పాలనలో ఉమయ్యద్ చట్టానికి గణనీయంగా బాసటగా నిలిచారు. శక్తివంతులైన కిండాహ్ లోని యెమన్ గిరిజనులు " మర్జ్ రాహిత్ (684)లో మొదటి మర్విన్‌కు మద్దతుగా నిలిచారు. ఉమయ్యద్ కాలిఫేట్ యెమని అంతటినీ నియంత్రణలోకి తీసుకురావడంలో విఫలమయ్యాడు.క్రీ.పూ. 745లో హద్రామత్, ఓమన్ ప్రాంతాలలో " ఇబాదితె ఇబాది ఉద్యమం " నాయకత్వం వహించడానికి " ఇమాం అబ్దుల్లా ఇబ్న్ యహ్యా అల్- కిండి " ఎన్నిక చేయబడ్డాడు.ఆయన ఉమయ్యద్ గవర్నరును సనా నుండి బహిష్కరించి క్రీ.పూ. 746లో మక్కా, మదీనాను స్వాధీనం చేసుకున్నాడు. అల్-కిండి " టలిబ్ అల్- హాక్వి " (యథార్థవాది) అనే అభిమాననామంతో ప్రసిద్ధి చెందాడు. ఆయన ఇస్లాం చరిత్రలో మొదటి " ఇబాది " దేశాన్ని స్థాపించాడు.అయినప్పటికీ క్రీ.పూ. 749లో తైఫ్‌లో మరణించాడు. క్రీ.పూ. 818లో " ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్లాహ్ ఇబ్న్ జియాద్ " తిహమా ప్రాంతంలో జియాదిద్ రాజవంశం స్థాపించాడు. వారు అబ్బసిద్ కాలిఫేట్‌ను గుర్తించినప్పటికీ వారి రాజధాని " జబిద్. " నుండి స్వతంత్ర పాలన చేసారు. జబిద్ చరిత్ర ప్రద్తుతం స్పష్టంగా లభించ లేదు. వారు హద్రమవ్త్, కొండప్రాంతాల కొరకు ప్రయత్నించలేదు. వారు ఎర్రసముద్ర తీరప్రాంతంలో ఉన్న తిహమా ప్రాంతానికి అతీతంగా నియంత్రణను విస్తరించడంలో విఫలం అయ్యారు. హిమయరితే వంశాన్ని " యుఫ్రిదులు " అంటారు. వారు సాదా నుండి తైజ్ వరకు కొండప్రాంతాలలో పాలన స్థిరపరుచుకున్నారు. వారు బాగ్ధాదు లోని అబ్బాసిదుల కూటమిని నిరాకరించారు. జియాదిద్ రాజవంశానికి చెందిన జబిద్ భౌగోళికస్థితి కారణంగా " ఎథియోపియా " (అబిస్సినియా) లతో ప్రత్యేక అనుబంధం అభివృద్ధి చేసుకుంది. దహ్లక్ ద్వీపాల రాజప్రతినిధి బానిసలను, అంబర్, చిరుత చర్మాలను అప్పటి యెమన్ పాలకునికి ఎగుమతి చేసాడు. మొదటి జైదీ ఇమాం " అల్- హది ఇలాల్ - హాక్ యహ్యా " క్రీ.పూ 893 యెమన్ చేరుకున్నారు. 897 లో ఆయన " రస్సిద్స్ " (జైదీ ఇమామతె) స్థాపించాడు. మతగురువు, న్యాయవ్యాధి అయిన ఆయన గిరిజన వివాదాలను పరిష్కరించడానికి సదా నుండి మదీనాకు ఆహ్వానించబడ్డాడు. ఇమాం యహ్యా ప్రాంతీయ గిరిజన ప్రజలను ఆయన బోధనలను అనుసరించమని బోధించాడు.మతవిధానం క్రమంగా కొండప్రాంతాలలో విస్తరించింది. హషిద్, బకిల్ గిరిజనజాతులు (ఇమాతే రెండు రెక్కలు) ఆయన అధికారాన్ని అంగీకరించాయి." అల్-హది ఇలాల్ - హక్ " సాదా, నజ్రన్ ప్రాంతాలలో తన ప్రభావం స్థాపించుకున్నాడు. సా.శ. 901లో సనాను స్వాధీనం చేసుకోవాలన్న ఆయన ప్రయత్నం విఫలం అయింది. సా.శ. 904 లో క్వర్మంటియన్లు సనా మీద దాడిచేసారు. యుఫిరిద్ ఎమీర్ అసద్ ఇబ్న్ ఇబ్రహీం అల్ జవ్ఫ్ చేరాడు. సా.శ. 904-913 మద్య కాలంలో క్వర్మంటియన్లు, యుఫిరిదులు 20 కంటే అధికంగా సనా మీద దాడిచేసి విజయం సాధించారు. సా.శ. 915లో అసద్ ఇబ్న్ ఇబ్రహీం తిరిగి సనాను స్వాధీనం చేసుకున్నాడు. సనా మూడు రాజవంశాల యుద్ధభూమిగా మారడం యెమన్‌లో (అలాగే స్వతంత్ర గిరిజన తెగలలో) సంక్షోభం సృష్టించింది. యుఫిరిద్ ఎమీర్ అబ్దుల్లా ఇబ్న్ క్వహ్తాన్ సా.శ. 989 లో జబీద్‌ మీద దాడిచేసి కాల్చివేసాడు. ఫలితంగా జియాదిద్ రాజవంశం బలహీనపడింది. తరివాత క్రీ.పూ. 989 లో జియాదిద్ చక్రవర్తులు పూర్వంలో కంటే శక్తిహీనులయ్యారు. తరువాత జబిద్‌లో బానిసలు వారి యజమానుల పేరుతో ఆధికారం చేపట్టారు. వైద్యమైన పరిశీలన ఆధారంగా బానిసలు సా.శ.1022 లేక 1050 లో " నజహిద్ రాజవంశ స్థాపనచేసారు. వారిని బాగ్దాదు లోని " అబ్బాసిద్ కాలిఫేట్ " ప్రభుత్వం గుర్తించినప్పటికీ వారి పాలన జబిద్ , నాలుగు జిల్లల వరకు పరిమితమైంది. యెమని కొండప్రాంతాలలో ఇస్మాయిల్ షియా సులేహిద్ రాజవంశం తలెత్తిన తరువాత యెమనీ చరిత్రలో వరుస కుట్రలు తగ్గుముఖం పట్టాయి.

సులేహిద్ రాజవంశం (1047-1138)

యెమన్ 
Jibla became the capital of the Sulayhid dynasty.

క్రీ.పూ. 1040 లో ఉత్తరదిశలో ఉన్న కొండప్రాంతాలలో " సులేహిద్ రాజవంశం " స్థాపించబడింది. ఆసమయంలో యెమన్ వైవిధ్యమైన ప్రాంతీయ రాజవంశాల పాలనలో ఉంది. సా.శ. 1060లో అలి అల్ సులైహిద్ " జబిద్ ప్రాంతాన్ని స్వాధీనపరచుకుని జబిద్ పాలకుడు అల్- నజాహ్‌ను (నజహిద్ రాజవంశం స్థాపకుడు) హతమార్చాడు. ఆయన కుమారులు దహ్లక్ ఆర్చిపిలాగోకు పారిపోయారు. సా.శ. 1162లో ఆడెన్ స్వాధీనపరచుకున్న తరువాత హద్రమవ్త్ కూడా సులేహిద్ వశం అయింది. సా.శ. 1063 నాటికి అలీ గ్రేటర్ యెమన్ రూపొందించాడు. తరువాత అలీ హెజాజ్ వైపుసైన్యాలను తరలించి మక్కాను స్వాధీనం చేసుకున్నాడు. అలీ " అస్మా బింట్ షిహాబ్ "ను వివాహం చేసుకున్నాడు. ఆమె తన భర్తతో కలిసి యెమన్ పాలనాబాధ్యత వహించింది. ఇస్లాం స్థాపించబడిన తరువాత ఇటువంటి గౌరవం మరే మహిళకు ఇవ్వబడలేదు. సా.శ. 1084లో నజాహ్ కుమారులు " అలి అల్ - సులేహి "ని (ఆయన మక్కకు పోతున్న సమయంలో మార్గమద్యంలో) హత్యచేసారు. ఆయన కుమారుడు అహ్మద్ అల్- ముకర్రం సైన్యాలను జబిద్‌కు నడిపించి 8,000 మంది పురవాసులను చంపారు. తరువాత అలీ ఆడెన్ నిర్వహణ కొరకు జురాయిడ్స్‌ను నియమించాడు.యుద్ధంలో ఏర్పడిన గాయాల కారణంగా అలీ ముఖం పక్షవాతానికి గురై 1087లో పదవీబాధ్యత నుండి విరమించి భార్యకు అధికార బాధ్యత అప్పగించాడు. రాణి ఆర్వా " సులేహిద్ రాజవంశం " స్థానాన్ని సనా నుండి మద్య యెమని నుండి ఇబ్బ్ సమీపంలోని జిబ్లా (యెమని) అనే చిన్నపట్టణానికి మార్చింది.సులేహిద్ రాజవంశానికి జిబ్లా, కొండప్రాంతంలోని వ్యవసాయభూములు సమీపంలో ఉండడం అక్కడ రాజకుటుంబం సంపద కేంద్రీకృతం కావడానికి కారణం అయింది. దక్షిణప్రాంతానికి (ప్రత్యేకంగా ఆడెన్ చేరుకోవడానికి) చేరుకోవడానికి ఇది సులువైన మార్గంగా ఉండేది. ఆమె భారతదేశానికి ఇస్మాయిల్ మిషనరీలను పంపింది. భరతదేశంలో రూపొందిన ఇస్మాయిల్ సమూహం ప్రస్తుతం వరకు ఉనికిలో ఉంది. రాణి అర్వా మరణించే వరకు (సా.శ.1138) సురక్షితంగా రాజ్యపాలన చేసింది.

యెమన్ 
Queen Arwa al-Sulaihi Palace

" అర్వా అల్- సులేహి " గొప్పమహిళగా, మంచి పాలకురాలిగా యెమనీచరిత్ర, సాహిత్యం , విశ్వసాలలో నిలిచింది. ప్రజలు ఆమెను " బాల్క్విస్ అల్- సుఘ్రా, " ది జూనియర్ క్వీన్ ఆఫ్ షెబా "గా గుర్తించి గౌరవించబడింది. సులేహిదులు ఇస్మాయిల్ సంప్రదాయాన్ని అనుసరించినప్పటికీ వారు వారి నమ్మకాలను ప్రజలమీద బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించలేదు. రాణి అర్వా మరణించిన స్వల్పకాలం తరువాత దేశం మతపరంగా ఐదుభాగాలుగా విడిపోయింది.ఈజిప్ట్లో ఫతిమిద్ కాలిఫేట్‌ను అయ్యుబిద్ రాజవంశం పడగొట్టింది. వారు అధికారం చేపట్టిన కొన్ని సంవత్సరాల తరువాత క్రీ.పూ. 1174లో యెమన్ మీద దాడిచేయడానికి తన సోదరుడు " తరుణ్ షాహ్ "ను పంపాడు.

అయ్యుబిద్ విజయం (1171–1260)

1174 మే మాసంలో " తరుణ్ షాహ్ " మహ్దిద్స్‌ను ఓడించి జబిద్‌ను స్వాధీనం చేసుకుని జూన్ మాసంలో ఆడెన్ వైపు సైన్యాలను నడిపించి జురాయిదుల నుండి దానిని స్వాధీనం చేసుకున్నాడు.1175లో సనాను పాలించిన హందనిద్ సుల్తానులు అయ్యుబిదులను అడ్డగించారు. దక్షిణ , మద్య యెమన్ ప్రాంతంలో అయ్యుబిదుల పాలన స్థిరపడింది. వారు ఈప్రాంతంలో ఉన్న చిన్నరాజ్యాలను తొలగించి పాలనకొనసాగించడంలో సఫలం అయ్యారు. ఇస్మాయిల్ , జైది గిరిజనప్రజలు పలు కోటలను దక్కించుకుంటూ కొనసాగారు. ఉత్తర యెమన్‌లో శక్తివంతులుగా ఉన్న జేదీలను జయించడంలో అయ్యుబిదులు సఫలం కాలేదు. 1191లో జేదీస్ షీబం కాకాబన్ (షిబాం కాకాబన్) తిరుగుబాటు చేసి 700 అయ్యుబిద్ సైనికులను చంపాడు.1197లో ఇమాం " అల్-మంసూర్ అబ్దల్లాహ్ " ఇమామతె ప్రకటించి అయ్యుబిద్ సుల్తాన్ (యెమన్) " అల్- ముయిజ్ ఇమాయిల్ "తో యుద్ధం చేసాడు. ముందుగా యుద్ధంలో ఇమాం అబ్దుల్లా ఓడిపోయాడు. అయినా ఇమాం అబ్దుల్లా 1198లో సనా , ధామర్ (యెమన్)లను జయించాడు. 1202లో అల్-ముయిజ్ ఇస్మాయిల్ హత్యచేయబడ్డాడు." అల్- మంసూర్ అబ్దుల్లా బిన్ హంజా " తాను మరణించే (1217) వరకు అయ్యిబిద్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. ఆయన పోరాటం తరువాత జైదీ కమ్యూనిటీ ఇరువురు శతృత్వ ఇమాముల మద్య విభజించబడ్డారు. 1219లో జెదీలు మరియి అయ్యిబిదుల మద్య సంధి ఒప్పందం మీద సంతకాలు చేయబడ్డాయి. 1226లో ధామర్ వద్ద అయ్యుబిదులు ఓటమి పొందారు. అయ్యుబిద్ సుల్తాన్ మసూద్ యూసఫ్ 1228లో మక్కాకు వెళ్ళి అక్కడే ఉండిపోయాడు. ఇతర వనరుల ఆధారంగా ఆయన బలవంతంగా ఈజిప్ట్కు పంపబడ్డాడు అని భావిస్తున్నారు.

రసులిద్ రాజవంశం (1229-1454)

యెమన్ 
Al-Qahyra (Cairo) Castle's Garden in Taiz, the capital of Yemen during the Rasulid's era

1229లో చివరి అయ్యూబిద్ రాజు యెమన్ వదిలి వెళ్ళిన తరువాత 1223లో అయ్యుబిద్ చేత డెఫ్యూటీ గవర్నరుగా నియమించబడిన " ఉమర్ ఇబ్న్ రసూల్ " రసులిద్ రాజవంశం స్థాపించాడు. రసూలిద్ తనకుతానుగా స్వతంత్ర రాజుగా ప్రకటించుజుని " అల్- మాలిక్- అల్- మంసూర్ " బిరుదును ప్రకటించుకున్నాడు. ఉమర్ రసూలిద్ రాజవంశం స్థాపించి రాజ్యాన్ని ధోఫార్ నుండి మక్కా వరకు విస్తరించాడు. ఉమర్ ముందుగా జబిద్ రాజ్యం స్థాపించి తరువాత పర్వతలోతట్టు ప్రాంతాల వరకు విస్తరించాడు. రసూలిద్ జబిద్ , తైజ్‌లను రాజధానులుగా చేసుకుని పాలించాడు. 1249లో రసూలిద్ హత్యచేయబడ్డాడు. ఉమర్ కుమారుడు యూసెఫ్ తన తండ్రిని హత్య చేసిన తిరుగుబాటుదారులను అణిచివేసాడు. శతృవులను విజయమంతంగా అణిచివేసి " అల్- ముజాఫర్ " (విజేత) బిరుదును పొందాడు.1258లో మంగోలులు బాగ్దాదును స్వాధీనం చేసుకున్న తరువాత " అల్- ముజాఫర్ యూసఫ్ "కు కలీఫ్ బిరుదు ఇవ్వబడింది. ఆడెన్‌కు సమీపంలో ఉండడం , వ్యూహాత్మకమైన ఉపస్థితి కారణంగా అల్- ముజాఫర్ తైజ్ నగరాన్ని రాజధానిగా చేసుకున్నాడు. మొదటి అల్- ముజఫర్ యూసఫ్ 47 సంవత్సరాల పాలన తరువాత 1296లో మరణించాడు.

రసూలిద్ అభివృద్ధి పనులు
యెమన్ 
A 13th-century slave market in Yemen

రసూలిద్ దేశం యెమన్ వాణిజ్య సంబంధాలను భారతదేశం , సుదీర్ఘ తూర్పుదేశాల వరకు విస్తరించారు. వారు ఎర్రసముద్రంలో ఆడెన్ , జబిద్‌ల మీదుగా నౌకామార్గ వాణిజ్యరవాణా ద్వారా ప్రయోజనం పొందారు. రాజులు ప్రారంభించిన వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆర్థికరగం శరవేగంగా బలపడింది. రసూలిద్ రాజులను తైమా , దక్షిణ యెమన్ మద్దతుతో ఉత్తర యెమన్‌లోని గిరిజన ప్రజల విశ్వాసం పొందడానికి ప్రయత్నించారు. రసూలిద్ సుల్తానులు అనేక " మద్రసాలు " నిర్మించారు. వారి పాలనలో తైజ్ , జబిద్ ఇస్లామిక్ పాఠశాలలకు అంతర్జాతీయ కేంద్రాలుగా మారాయి. రాజులు స్వయంగా పాఠశాలలలో శిక్షణ పొందారు. రాజులు గ్రంథాలయం ఏర్పాటుచేసుకుని అలాగే జ్యోతిషం, వైద్యం , జెనియాలజీ గురించిన పుస్తకాల రచనావ్యాసంగం కూడా చేసారు. ఇస్లాం కాలానికి ముందు కాలానికి చెందిన హిమయరితె రాజ్యం పతనం చెందిన తరువాత సామ్రాజ్యం గ్రేట్ నేటివ్ యెమని స్టేట్‌గా గౌరవించబడింది.

రసూలిద్ పూర్వీకం

రసూలిద్ వంశస్థుల పూర్వీకం టర్కీ. అయినప్పటికీ వారు తమ పరిపాలనను న్యాయపరచుకోవడానికి యెమనీ స్థానికులుగా నిరూపించుకోవడానికి ప్రయత్నించారు. రాజకీయ ప్రయోజనాల కొరకు ఇలా భ్రమకులోను చేయడానికి ప్రయత్నించిన రాజవశాలలో రసూలిద్ రాజవంశం మొదటిది కాదు. రసూలిదులు తాము యెమనీ గిరిజనులకు చెందిన వారమని స్థిరంగా నిరూపించడం ద్వారా వారు యెమన్ ప్రాంతాన్ని సమైక్యపరిచారు. వారికి ఈజిప్ట్‌కు చెందిన మమ్లక్ వంశానికి మద్య సంబంధాలలో చిక్కులు ఏర్పడ్డాయి. వారు హెజాజ్ , మక్కాలలో తమ హక్కుల విషయంలో రసూలిదులతో పోటీపడ్డారు. రసూలిద్ రాజవంశంలో మొదలైన వారసత్వ కలహాల కారణంగా అసంతృప్తికి గురైన రాజకుటుంబసభ్యులు , వరుసగా తలెత్తిన గిరిజనుల తిరుగుబాటు రసూలిద్ వమ్శాన్ని బలహీనపరచింది. చివరి 12 సంవత్సరాల రసూలిద్ పాలనలో దేశం పలు రాజ్యాలుగా విడిపోయింది. బలహీన పడిన రసూలిద్ రాజవంశం తహిరిద్ (యెమన్) (బాను తాహర్) వంశానికి అవకాశం ఇచ్చారు.క్రీ.పూ. 1454లో తహిరిదీలు యెమన్ పాలనను చేపట్టి తహిరిద్ వంశపాలన చేసారు.

తహిరైడ్ రాజవంశం (1454-1517)

తహిరిదీలు రడా ప్రాంతానికి చెందిన స్థానిక సంతతికి చెందిన వారు. వారు వారి పూర్వులాగా ప్రభావితం చేయనప్పటికీ వారు నిర్మాణకళలో నిపుణులు. వారు పాఠశాలలు, మసీదులు, పంటకాలువలు , వంతెనలు (జబీద్, ఆడెన్, రాడా , జుబాన్) నిర్మించారు. వారు నిర్మించిన వాటిలో 1504లో రాడా జిల్లాలో నిర్మించిన " అమితియా మద్రాసా అత్యధికంగా గుర్తింపును పొందింది. జియాది ఇమాంలను సంరక్షించుకోవడానికి కాని విదేశీ దాడి నుండి తప్పించుకోవడానికి కాని తగినంత శక్తి తహిరిదీలకు లేదు.

మమ్లకుల దాడి

1530లో మమ్లక్ (ఈజిప్ట్) " అఫొంసో డీ అల్బుక్యూక్యూ " యెమన్ నుండి ఈజిప్ట్, పోర్చుగీసు మీద దాడి చేయడానికి ప్రయత్నించి " సొకొత్రా "ను ఆక్రమించుకుని ఆడేన్ మీద చేసిన దాడి విఫలం అయ్యారు. పోర్చుగీసు వారు హిందూమహాసముద్రం వ్యాపారంలో బెదిరింపులు ఆరంభించారు. మమ్లకులు (ఈజిప్ట్) " అమీర్ హుస్సేన్ అల్- కుర్దీ " నాయకత్వంలో సైన్యాలను చొరబాటుదార్లతో యుద్ధం చేయడానికి పంపారు. పోర్చుగీసులకు వ్యతిరేకంగా యుద్ధంచేయడానికి (జీహాద్) అవసరమైన ధనంసేకరించడానికి మమ్లక్ సుల్తాన్ నౌకామార్గంలో " జబీద్ " చేరుకుని తహిరిదే సుల్తాన్ " అమీర్ బిన్ అబ్దుల్వహాద్ "ను కలుసుకున్నాడు. యెమన్ సముద్రతీరంలో మకాం వేసిన మమ్లక్ సైన్యం ఆహారం , ఇతర అవసరాల కొరకు తిహామా గ్రామస్థులను ఆందోళనకు గురిచేసారు. తహిరిదే ప్రాతీయుల సంపదగురించిన వివరాలు గ్రహించిన మమ్లకులు తహిరిదే ప్రాంతం మీద దాడిచేసారు. 1517లో మమ్లక్ సైన్యం జేదీ ఇమాం " అల్- ముతవాక్కీ యాహ్యా షరాఫ్ అడ్ - దిన్ " సైన్యం మద్దతుతో తహిరిదే ప్రాంతం అంతటినీ స్వాధీనం చేసుకున్నప్పటికీ ఆడెన్‌ను స్వాధీనం చేసుకోవడంలో విఫలం అయింది. మమ్లక్ విజయం స్వల్పకాలంతో ముగింపుకు వచ్చింది. ఓట్టమన్ సామ్రాజ్యం ఈజిప్ట్ మీద దాడిచేసి కైరోలో చివరి మమ్లక్ సుల్తాన్‌ను ఉరితీసింది. ఓట్టమన్ 1548 వరకు యెమన్ మీద దాడి చేయాలని నిర్ణయించుకోలేదు. ఓట్టమన్ సాంరాజ్యానికి ఎదురునిలిచి తీవ్రంగా ప్రతిఘటించిన జియాదీ కొండప్రాంతంలోని గిరిజనప్రజలు ప్రాబల్యత సంతరించుకున్నారు.

ఆధునిక చరిత్ర

జెదీలు , ఓట్టమన్లు

యెమన్ 
Al Bakiriyya Ottoman Mosque in Sana'a, was built in 1597

ఓట్టమన్ల నుండి యెమన్లను రక్షించడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఇస్లామిక్ పవిత్రనగారాలు మక్కా, మసీదు నగరాలు , వస్త్రాలు , సుగంధద్రవ్యాలు భారతదేశ వాణిజ్యమార్గంలో యెమన్ భాగస్వామ్యం వహించడం అందుకు ప్రధాన కారణాలు. 16వ శతాబ్దంలో పోర్చుగీసులు హిందూమహాసముద్రం , ఎర్రసముద్రంలో చొరబడడం ఈ రెండింటికి బెదిరింపుగా మారింది. " హదీం సులేమాన్ పాషా " ఓట్టమన్‌కి చెందిన ఈజిప్ట్ గవర్నర్ యెమన్‌ను జయించడానికి 90 నావలను పంపమని ఆదేశం జారీచేసాడు. దేశంలో హదీం సులేమాన్ పాషా పట్ల అసమ్మతి , రాజకీయ అస్థిరత చోటుచేసుకుని ఉంది. సనాతో చేర్చిన ఉత్తర యెమన్ లోని కొండప్రాంతం " ఇమాం అల్- ముతవక్కి యహ్యా అద్- దిన్ " పాలనలోకి మారింది. మరొకవైపు ఆడెన్ ప్రాంతం చివరి తహిర్దె సుల్తాన్ " అమీర్ ఇబ్న్ దావూద్ " పాలనలో ఉంది. హదీం సులేమాన్ పాషా 1538లో ఆడెన్ మీద దాడి చేసి దాని పాలకుని చంపి 1539 నాటికి జబీదు వరకు ఓట్టమన్ సాంరాజ్యవిస్తరణ చేసాడు. జబీద్ యెమన్ ఇయాలెట్ పాలనా నిర్వహణాకేంద్రంగా మారింది. ఓట్టమన్ సాంరాజ్య ఆధిక్యత కొండప్రాంతం వరకు విస్తరించలేదు. ఓట్టమన్ సంరాజ్య ఆధిక్యత ప్రత్యేకంగా జబిదు, మోచా (యెమన్) , ఆడెన్‌లలో కొనసాగింది. 1539 , 1547లో ఈజిప్ట్ యెమన్‌కు పంపబడిన 80,000 మంది సైనికులలో 7,000 మంది మాత్రమే బ్రతికరు. కొండ ప్రాంతంలో ఇమాం " అల్- ముతవక్కిల్ యహ్యా షరాఫ్ అద్- దిన్ " స్వతంత్రంగా పాలనజరుపుతున్న సమయంలో 1547లో జబీదు మీద ఓట్టమన్ మరొక సైకదళాన్ని దాడికొరకు పంపింది. అల్- ముతవక్కిల్ యహ్యా షరాఫ్ అద్- దిన్ తన కుమారుడైన అలీని వారసునిగా ఎంచుకున్నాడు. ఇందుకు ఆయన మరొక కుమారుడు " అల్- ముతహ్హర్ " ఆగ్రహించాడు. అల్- ముతహర్ ఇమామతె కొరకు అర్హత పొందలేదు. ఆయన జబీదులోని ఓట్టమన్ గవర్నర్ " ఒయాస్ పాషా " ఆశ్రయించి తన తండ్రి మీద దాడిచేయమని వత్తిడి చేసాడు. 1547లో ఆగస్టు మాసంలో " ఇమాం అల్- ముతహర్ " విశ్వాసపాత్రులైన గిరిజనప్రజల మద్దతుతో ఓట్టమన్ సైనిక దళాలు తైజును ఆక్రమించుకుని సనా వైపు తరలి వెళ్ళారు.టర్కీలు " ఇమాం అల్- ముతహర్ "ను అమరన్ అధికారిని చేసారు. ఇమాం అల్- ముతహర్ ఓట్టమన్ గవర్నర్‌ను హత్యచేసి సనాను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఓట్టమన్లు " ఒజెద్మీర్ పాషా " నాయకత్వంలో తులాలో ఉన్న అల్- ముతహర్ మీద దాడిచేసారు. ఒజ్దెమిర్ పాషా 1552-1560 వరకు యెమన్ మీద ఓట్టమన్ ఆధిక్యత కొనసాగడానికి మార్గం సుగమం చేసాడు.

అహ్మద్ పాషా

1561లో ఒజెదిమిర్ మరణించిన తరువాత మహమ్మద్ పాషా అధికారం చేపట్టాడు.ఓట్టమన్ అధికారులు " మహమ్మద్ పాషా "ను అవినీతిపరుడు , మనసాక్షి రహిత అసమర్ధునిగా అభివర్ణించారు.ఆయన తన అధికారాన్ని పలు కోటలను స్వాధీనం చేసుకొనడానికి దుర్వినియోగం చేసాడు. వాటిలో కొన్ని మునుపటి రసూలిద్ రాజులకు స్వంతం అయినవి. మహ్మద్ పాషా సున్నీ పండితుని హత్య చేసాడు. ఈ సంఘటనను కొండప్రాంతంలో ఉన్న జేదీ షియా సమూహం కొనియాడిందని ఓట్టమన్ చరిత్రకారుడు అభివర్ణన చేసాడు. యెమన్ ప్రాంతంలో అధికారసమతూకాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఆయన విభిన్న సమూహాలకు చెందిన ప్రజలను యెమన్‌లోకి చేర్చాడు. ఇది యెమన్‌లో టర్కీలకు వ్యతిరేకత అధికరించడానికి దారితీసింది. 1564లో మహ్మద్ పాషాను తొలగించి ఆస్థానంలో రిద్వన్ పాషాను నియమించారు. యెమన్ రెండు భాగాలుగా విభజించబడింది. కొండప్రాంతం రిద్వన్ పాషా ఆధీనంలో ఉండగా తిహ్మా ప్రాంతం మురద్ పాషా అధీనంలోకి మారింది.

ఇమాం అల్- ముతహర్

ఇమాం అల్- ముతహర్ " మొహమ్మద్ ప్రవక్త " కలలో కనిపించు ఓట్టమన్ మీద " జీహాద్ " (పవిత్ర యుద్ధం) చేయమని ఆదేశించాడని ప్రచారయుద్ధం ప్రారంభించాడు. 1567లో అల్- ముతహర్ నాయకత్వంలో గిరిజనప్రజలు రిద్వన్ పాషా నుండి సనాను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత జరిగిన 80 యుద్ధాలలో చివరి యుద్ధం 1568లో ధామర్ ప్రాతంలో జరిగింది. ఈ యుద్ధంలో మురద్ పాషా తల నరికించి సనాలో ఉన్న ముతహర్ వద్దకు పంపబడింది. 1568 నాటికి జబీదు టర్కీ ఆధుపత్యంలోకి మారింది.

యెమన్ 
Ruins of Thula fortress in 'Amran, where al-Mutahhar ibn Yahya barricaded himself against Ottoman attacks

లాల్ కరా ముస్తాఫా పాషా

రెండవ సెలిం ఓట్టమన్‌కు చెందిన సిరియా గవర్నర్ " లాల్ కరా ముస్తాఫా పాషా "కు యెమనీ తిరుగుబాటుదారులను అణిచివేయమని ఆదేశించాడు. అయినప్పటికీ ఈజిప్టు లోని టర్కీ సైన్యం యెమన్ వెళ్ళడానికి నిరాకరించింది. ముస్తాఫా ఇద్దరు టర్కిష్ సార్జంట్లతో ఒక లేఖను పంపి అల్-ముతాహర్‌కు క్షమాపణ చెపుతూ అలాగే ముస్తాఫా ఓట్టమన్ సాంరాజ్యానికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని టర్కీలు స్వతంత్రంగా వ్యవహరించారని తెలియజేసాడు. ఇమాం అల్-ముతహర్ ఓట్టమన్ వారి సందేశాన్ని నిరాకరించాడు.ఉథమన్ పాషా నాయకత్వంలో ముస్తాఫా సైన్యం విజయం సాధించింది.

సినాన్ పాషా

ముస్తాఫా యెమన్ వెళ్ళడానికి జాప్యం చేయడం రెండవ సుల్తాన్ సెలింను ఆగ్రహానికి గురిచేసింది. ఆయన ఈజిప్టులోని పలువురు " సంజక్ - బేలను " హతమార్చి ఈజిప్టులో ఉన్న టర్కీ సైన్యమంతటికీ నాయకత్వం వహించమని అలాగే యెమన్‌ను తిరిగి జయించమని సినాన్ పాషాను ఆదేశించాడు. అల్బానియన్ సంతతికి చెందిన ఓట్టమన్ సైనికాధికారులలో సినాన్ పాషా ప్రాధాన్యత వహించాడు. సినాన్ పాషా ఆడెన్, తైజ్ , ఇబ్బ్ లను తిరిగి జయించాడు. అలాగే 1570లో షిబం కాకాబన్‌ను (7 మాసాల కాలం) స్వాధీనంలో ఉంచుకున్నాడు. తరువాత కుదిరిన సంధి ద్వారా కాకాబన్ విడిపించబడింది.

టర్కీ ఆధిఖ్యత

1572లో అల్ ముతహర్ మరణించిన తరువాత జేదీ సమూహాన్ని ఇమాం ఆధీనంలో సమైక్య పరచడం సాధ్యం కాలేదు. వారి విభేదాలను అనుకూలంగా మార్చుకున్న టర్కీలు 1583లో సదాహ్, నజ్రన్ , సనాపై విజయం సాధించారు. 1585లో " ఇమాం అన్- నసిర్ అల్-హాసన్ బిన్ అలిలాల్- నసీర్ హాసన్ " ఖైదు చేయబడి కాంస్టాంటినోపుల్‌కు పంపబడ్డాడు. అంతటితో యెమనీ తిరుగుబాటుకు ముగిసిపోయింది. ఓట్టమన్ వారి యెమన్ ఆధిక్యత ఇస్లాం విజయంగా భావించారు. వారు జేదీప్రజలను నాస్థుకులని ఆరోపించారు.

హాసన్ పాషా

హాసన్ పాషా యెమన్ గవర్నరుగా నియమించబడ్డాడు. తరువాత 1585 నుండి 1597 వరకు యెమన్ ప్రాంతంలో ప్రశాంతత నెలకొన్నది. " అల్-మంసూర్ అల్ - క్వాసిం " ప్రజలు ఆయనను ఇమ్మామతెను స్వీకరించి టర్కీలతో యుద్ధం చేయమని సలహా గవర్నరుకు ఇచ్చారు. ఆయన మొదట నిరాకరించినప్పటికీ జేదీ ప్రజలు హనాఫీ స్కూలును స్త్యాపించిన తరువాత అల్- మంసూర్‌ను ఆగ్రహానికి గురిచేసింది. 1597 సెప్టెమబర్‌లో అల్- మంసూర్‌ ఇమామతె ప్రకటించాడు. అదే సంవత్సరం ఓట్టమన్లు " అల్- బకిరియ్యా మసీదు "ను నిర్మించారు.

ఇమాం అల్- మంసూర్

1608 నాటికి ఇమాం అల్- మంసూర్ హైలాండ్స్ మీద తిరిగి విజయం సాధించి ఓట్టమన్ లతో 10 సంవత్సరాల కాలం సంధి ఒప్పదం మీద సంతకం చేసారు. 1620లో ఇమాం అల్-మంసూర్ అల్-క్వాసిం మరణించాడు. ఆయన కుమారుడు అల్- ముయ్యద్ ముహమ్మద్ అధికారానికి వచ్చి ఓట్టమన్ల ఒప్పందం ఖరారు చేసాడు. 1627లో ఓట్టమన్లు ఆడెన్ , లాహేలను నష్టపోయారు. అబ్దిన్ పాషా తిరుగుబాటుదారులను అణచడానికి ప్రయత్నించి విఫలమై మోచాకు వెనుతిరిగాడు.

అల్ - ముయ్యద్ ముహమ్మద్

1628లో " అల్-ముయ్యద్ ముహమ్మద్ " సనా నుండి ఓట్టమన్లను వెళ్ళగొట్టాడు. ఓట్టమన్ స్వాధీనంలో జబీద్ , మోచా మాత్రమే మిగిలిపోయాయి. అల్-ముయ్యద్ ముహమ్మద్ జబీదును స్వాధీనం చేసుకుని ఓట్టమన్ ప్రజలను ప్రశాంతంగా మోచాకు వెళ్ళడానికి అనుమతించాడు. గిరిజన ప్రజలు సమైక్యంతా మద్దతు ఇవ్వడమే అల్- ముయ్యద్ ముహమ్మద్ విజయానికి ప్రధాన కారణం అయింది.

యెమన్ 
Mocha was Yemen's busiest port in the 17th and 18th centuries.

1632లో " అల్- ముయ్యద్ ముహమ్మద్ " మక్కాను జయించడానికి 1000 మంది సైనికులను పంపాడు. సైన్యం విజయవంతంగా నగరంలో ప్రవేశించి గవర్నరును హతమార్చింది.

ఓట్టమన్ల దాడి

ఓట్టమన్లు మక్కను వదలడానికి సిద్ధంగా లేరు. వారు యెమనీ ప్రజలతో యుద్ధం చేయడానికి సైన్యాలను పంపారు. ఓట్టమన్లు బావులలో దాక్కుని యెమనీల మీద దాడి చేసారు. ఈప్రణాళిక విజయవంతంమై యెమనీ సైన్యాలను దాహార్తితో అలమటించేలా చేసింది. గిరిజనులు చివరకు లొంగిపోయి యెమన్‌కు వెనుతిరిగారు. 1644లో అల్-ముయ్యద్ ముహమ్మద్ మరణించాడు. తరువాత ఆయన కుమారుడు అల్-ముతవక్కీ అధికారం స్వీకరించాడు. ఆయన రెండవ కుమారుడు అల్- మంసూర్ అల్- క్వాసిం ఉత్తరప్రాంతం లోని అసిర్ నుండి తూర్పు ప్రాంతంలో ఉన్న దోఫార్ వరకు స్వాధీనం చేసుకున్నాడు.

అల్- మహ్ది అహ్మద్

ఆయన పాలనలో , ఆయన వారసుడు " అల్- మహ్ది అహ్మద్ " (1676-1681) పాలనలో యెమన్ యూదులకు వ్యతిరేకంగా ఇమామతే విధించిన వివక్షాపూరిత కఠినమైన చట్టాలు యూదులు మాజా నుండి తహమా సముద్రతీరంలో ఉన్న వేడి, పొడి భూములకు పంపబడ్డారు. ఈ సమయంలో యెమన్ మాత్రమే ప్రపంచంలో కాఫీ ఉత్పత్తి చేస్తున్న ఏకైక దేశంగా గుర్తింపు పొందింది. తరువాత యెమన్ చెందిన సఫావిద్ రాజవంశం (పర్షియాకు), ఓట్టమన్ (హెజాజ్‌), మొఘల్ సామ్రాజ్యం, ఎథియోపియాలతో దౌత్యసంబంధాలను అభివృద్ధి చేసుకుంది. ఫసిలిడెస్ (ఎథియోపియా) యెమన్‌కు మూడు దౌత్యబృందాలను పంపింది.అయినప్పటికీ ఇరువురి మద్య రాజకీయ కూటమి ఏర్పడలేదు. 18వ శతాబ్దం అర్ధభాగంలో యురేపియన్లు కాఫీ ఉత్పత్తిలో యెమన్ల ఏకాధిపత్యాన్ని విచ్ఛిన్నం చేసారు. యురేపియన్లు యెమన్ నుండి కాఫీ మొక్కలను అక్రమంగా సేకరించి వాటిని ఈస్టిండీస్, ఈస్ట్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్, లాటిన్ అమెరికా మొదలైన తమ కాలనీలలో పండించారు. కుటుంబ కలహాలు, గిరిజనప్రజల తిరుగుబాటు కారణంగా 18వ శతాబ్దం నాటికి కాసిం రాజవంశం పతనావస్థకు చేరుకుంది.

క్వాసిమిద్ రాజవంశం

1728 లేక 1731 మద్య కాలంలో లాహే ప్రతినిధులు తనకు తాను స్వంతంత్రంగా కాసిం రాజవంశ సుల్తానుగా ప్రకటించుకుని ఆడెన్‌ను జయించి లాహే సుల్తానేట్ స్థాపించాడు. అరేబియన్ ద్వీపకల్పంలో ఇస్లామీ వహాబీ ఉద్యమం ఉదృతమై 1803 నాటికి సముద్రతీరం లోని జేదీ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.1818లో ఈ ప్రాంతాన్ని స్వల్పకాలం తిరిగి స్వాధీనం చేసుకున్నారు.1833లో ఓట్టమన్ వైశ్రాయి (ఈజిప్ట్) సనా పాలకుని నుండి సముద్రతీర ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.1835 తరువాత త్వరితగతిలో ఇమామతే అధికారం చేతులు మారుతూ వచ్చింది.కొతమంది ఇమాంలు హత్యచేయబడ్డారు. 1849లో జైదీ రాజకీయాలు విషమస్థితికి చేరుకుని పరిస్థితి దశాబ్ధాల కాలం కొనసాగింది.

గ్రేట్ బ్రిటన్ , 9 ప్రాంతాలు

యెమన్ 
Saint Joseph church in Aden was built by the British in 1850 and is currently abandoned.

బ్రిటిష్ వారి స్టిమర్లు భారతదేశానికి పయనించేమార్గంలో బొగ్గునిల్వలకోసం అణ్వేషిస్తూ ఉంది. సూయజ్ నుండి బొంబాయి పోయి తిరిగి రావడానికి 700 టన్నుల బొగ్గు అవసరమౌతుంది. అందుకొరకు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఆడెన్ మీద దృష్టిసారించింది. బ్రిటిష్ సామ్రాజ్యం జేదీ ఇమామ్ (సనా)తో ఒక ఒప్పందం చేయడానికి ప్రయత్నించింది.ఒప్పందం వారిని మొచాలో ప్రవేశించడానికి అనుమతించింది. వారు లాహే సుల్తాన్ నుండి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఒప్పదం వారిని ఆడెన్‌లో ఉండడానికి అనుమతించింది. బ్రిటిష్ నౌక వాణిజ్యం నిమిత్తం ఆడెన్ దాటుతున్న సమయంలో సముద్రంలో మునిగిపోయింది. అరబ్ గిరిజనప్రజలు దానిని ఒడ్డుకు చేర్చి దానిలో ఉన్న వస్తువులను దోచుకున్నారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం " స్టాఫోర్డ్ బెట్స్‌వర్త్ హైనెస్ " నాయకత్వంలో నష్టపరిహారాన్ని కోరుతూ యుద్ధనౌకను పంపింది.1839 జనవరిలో ఆడెన్ మీద హైనెస్ బాంబులు వేసాడు. ఆసమయంలో ఆదెన్‌లో ఉన్న లాహెజ్ నౌకాశ్రయరక్షణ చేయమని అదేశించాడు. బ్రిటిష్ సైన్యం, నౌకాశక్తితో పోరాడలేక వారు ఓటమిని పొందారు.వారు ఆడెన్‌ను స్వాధీనం చేసుకుని సుల్తానేట్ నుండి వార్షికంగా 6,000 యెమనీ రియాల్ పొదడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. బ్రిటిష్ లాహేజ్ సుల్తాన్‌ను ఆడెన్ నుండి తొలగించి వారికి రక్షణ కలిగించమని సుల్తాన్‌మీద వత్తిడిచేసారు. 1839 నవంబరులో 5,000 మంది గిరిజనులు నగరాన్ని స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దాడిలో 200 మంది చనిపోయారు. బ్రిటిష్ ఆడెన్‌లో స్థిరంగా కాలూనడానికి స్థానికజాతులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం అవసరమని భావించింది. బ్రిటిష్ ఆడెన్ పరిసరాలలో ఉన్న 9 స్త్యానిక జాతులతో " రక్షణ , స్నేహ ఒప్పందాలు " చేయడానికి నిర్ణయించుకుంది.అయినప్పటికీ స్థానికజాతులు బ్రిటిష్ నుండి స్వతంత్రంగా నిలిచాయి. 1850 నుండి ఆడెన్ " ఫ్రీ ఎకనమిక్ జోన్ "గా ప్రకటించబడింది. భారతదేశం, ఈస్టిండియా ఆఫ్రికా , ఆగ్నేయ ఆసియా వలసప్రజలతో ఆడెన్ అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందింది. 1850లో నగరపౌరులుగా 980 అరేబియన్లు మాత్రమే నమోదుచేయబడ్డారు. ఆడెన్ నగరంలో ఆంగ్లేయుల ఉనికి ఓట్టమన్ల మద్య విభేదాలకు దారితీసింది. టర్కీలు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యెమన్‌తో కూడిన అరేబియామీద పూర్తి సార్వభౌమత్వాన్ని ప్రకటించింది.

ఓట్టమన్ పునరాగమనం

యెమన్ 
The Ottoman Grand Vizier and Wāli of Yemen Ahmed Muhtar Pasha

బ్రిటిష్‌రాజ్ భారతదేశం నుండి ఎర్రసముద్రం, అరేబియా వరకు విస్తరించడం ఓట్టమన్లను కలవరపరిచింది. రెండుదశాబ్ధాల తరువాత 1849లో ఓట్టమన్లు తిహామాకు వచ్చిచేరారు. ఉలేమా, స్థానికనాయకులు, వారు అనుసరిస్తున్న మతవిధానాలు జేదీ ఇమాంలు , వారి ప్రతినిధుల మద్య విభేదాలు తలెత్తాయి. యెమన్‌లో చట్టం అమలులో విచ్ఛిన్నత కారణంగా సనా పౌరులు అసంతృప్తికి గురై తిహామాలోని ఓట్టమన్ పాషాను యెమన్‌లో శాంతిని నెలకొల్పమని కోరుకున్నారు. యెమనీ వ్యాపారులు ఓట్టమన్ల తిరిగిరాక తమవ్యాపారాభివృద్ధికి సహకరిస్తుందని ఓట్టమన్లు వారికి వాడుకర్లుగా మారతారని గ్రహించారు. ఓట్టమన్ సైన్యం సనాను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమై హైలాండ్స్‌ను ఖాళీచేసి వెళ్ళారు. 1869లో సూయజ్ కాలువ ప్రారంభించడం యెమన్‌లో ఓట్టమన్ల నిర్ణయానికి బలంచేకూర్చింది.1872లో సైన్యం కాంస్టాంటినోపుల్ వదిలి ఓట్టమన్లు బలంగా ఉన్న దిగువభూములకు (తిహామా)కు సనాను జయించడానికి వెళ్ళారు. 1873లో ఓట్టమన్లు ఉత్తర కొండప్రాంతాలు జయించడానికి ఆయత్తమైయ్యారు.యెమన్ విలయెత్‌కు సనా రాజధాని అయింది. ఓట్టమన్లు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ ప్రభువుల అధికారం నిర్మూలించడానికి పూనుకున్నారు. వారు యెమని సంఘాన్ని మతాతీతంగా (లౌకిక) మార్చడానికి ప్రయత్నించారు. యెమనీ యూదులు యెమన్‌లో మారుతున్న పరిస్థితులు అవగతం చేసుకున్నారు. స్థానిక నాయకుల తిరుగుబాటు నేరాలను మన్నించి వారిని పాలనానిర్వహణా పదవులలో నియమించి ఓట్టమన్లు స్థానిక ప్రజలను శాంతింపజేసింది. స్వల్పకాలం ఓట్టమన్లు కొండప్రాంతం మీద నియంత్రణ సాధించారు.

1876లో జెదీ స్థానిక ప్రజలు " తంజిమత్ " సంస్కరణలు ప్రవేశపెట్టారు. హషిద్ , బకిల్ స్థానికులు ఓట్టమన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు. టర్కీలు వారికి బహుమతులిచ్చి శాంతపరిచారు. స్థానిక నాయకులను శాంతపరచడం ఓట్టమన్లకు కష్టతరంగా మారింది. అహ్మద్ ఇజ్జెత్ పాషా ఓట్టమన్లను కొండప్రాంతం వదిలి వెళ్ళమని ప్రతిపాదన చేసాడు. తిహామా ప్రాంతాలలో ఉండమని సైనిక నిర్వహణ భారాన్ని జేదీలకు తొలగించమని ఆయన ప్రతిపాదన చేసాడు.

ఉత్తరప్రాంత స్థానికతెగలు " హమిదద్దిన్ " నాయకత్వంలో సమైక్యం అయ్యారు. " ఇమాం యాహ్యా ముహమ్మద్ హమిద్ ఎద్- దిన్ " నాయకత్వంలో స్థానికులు 1904లో టర్కీలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు. 1904-1911 మద్యకాలంలో సంభవించిన తిరుగుబాటు చర్యలు 10,000 మంది ఓట్టమన్ సైనికుల మరణానికి 5,00,000 పౌండ్ల నష్టానికి కారణం అయింది. ఇమాం యాహ్యా ముహమ్మద్ హమిద్ ఎద్- దిన్‌తో ఓట్టమన్లు ఒప్పందం మీద సంతకం చేసారు. ఒప్పదం ఆధారంగా ఇమాం యాహ్యా ఉత్తర కొండప్రాంతంలో జేదీల స్వయంప్రతిపత్తికి అవకాశం లభించింది.1918 లలో వదిలి వెళ్ళేవరకు షఫీ ప్రాంతం ఓట్టమన్ పాలనలో ఉంది.

ముతవక్కిలితె రాజ్యం (యెమన్)

యెమన్ 
Imam Yahya hamid ed-Din's house in Sana'a

1911 నుండి ఉత్తర కొండప్రాంతాలను " ఇమాం యాహ్యా హమిద్ ఎద్-దిన్ అల్ ముతక్కుల్ " పాలించాడు. 1918లో ఓట్టమన్లు ఈప్రాంతాన్ని వదిలి వెళ్ళిన తరువాత ఆయన తన పూర్వీకులైన కాసిమిద్ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆయన అసిర్ నుండి ధోఫర్ వరకు విస్తరించిన గ్రేటర్ యెమన్ స్థాపించాలని కలలు కన్నాడు. ఈ ప్రణాళికలు ఇద్రిసిద్, ఇబ్న్ సౌద్ , ఆడెన్ లోని బ్రిటిష్ ప్రభుత్వం మొదలైన " డి ఫాక్టో " పాలకులతో కలహాలకు దారితీసాయి. జేదీలు 1905లో ఒప్పందం చేసుకున్న ఓట్టమన్ - ఆగ్లో సరిహద్దులను గౌరవించలేదు.వారు ఈ సరిహద్దు రెండు విదేశీశక్తుల ఒప్పదం అన్న భావన ఉండేది. సరిహద్దు ఒప్పందం యెమన్‌ను ఉత్తర , దక్షిణ ప్రాంతాలుగా విడదీసింది. 1915లో బ్రిటిష్ ఇద్రిసిదులతో వారు టర్కీలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తే వారికి బ్రిటిష్ ప్రభుత్వం నుండి రక్షణ కలిగించి వారి స్వరతంత్రం కాపడతామని ఒప్పందం కుదుర్చుకుంది. 1919లో ఇమాం యాహ్యా హమిద్ ఎద్-దిన్ బ్రిటిష్ 9 ప్రొటక్టరేటులలో ఒకటైన లిబరతెకు తరలి వెళ్ళాడు. బ్రిటిష్ ప్రతిస్పందించి " అల్ హుదేదాహ్ "ను ఆక్రమించుకున్నారు. తరువాత వారు దానిని ఇద్రిసీ కూటమికి స్వాధీనం చేసారు.1922లో యాహ్యా ముహమ్మద్ ఎద్ దిన్ " సదరన్ ప్రొటెక్టరేట్ మీద దాడి చేసాడు. బ్రిటిష్ యుద్ధవిమానాలను ప్రయోగించి యాహ్యా తెగల సైన్యం మీద బాంబు దాడి చేసింది.1925 నాటికి ఇమాం యాహ్యా అల్- హుదేదాహ్‌ను ఆక్రమించుకున్నాడు. ఆయన అసిర్ తన నియంత్రణకు వచ్చేవరకు ఇద్రిసిదుల మీద దాడి కొనసాగించాడు. తరువాత ఆయన ఈప్రాంతం ఇమాం పేరుతో పాలననిర్వహించేలా ఇద్రిసిదులను వత్తిడిచేసి ఒప్పందానికి అంగీకరింపజేసాడు. ఇమాం యాహ్యా ఇద్రిసిదులను మొరొకన్ సంతతికి చెందినవారుగా అంగీకరించడానికి నిరాకరించాడు. వారు కేవలం బ్రిటిష్ వారిలా చొరబాటుదారులే అని వారిని శాశ్వతంగా యెమన్ నుండి తరిమికొట్టాలని ఆయన అభిప్రాయం వెలిబుచ్చాడు. 1927లో ఇమాం యాహ్యా సైన్యాలు తైజ్, ఆడెన్, ఇబ్బ్‌లను దాటి 50కి.మీ ముందుకు సాగిన తరువాత బ్రిటిష్ సైన్యం వారి మీద 5 రోజులపాటు బాంబుదాడి చేసింది. బెడుయిన్ సైన్యాలు స్వల్పసంఖ్యలో మధాహి సమాఖ్య (మారిబ్) నుండి షబ్వాహ్ మీద జరిపిన దాడిని బ్రిటిష్ బాంబులదాడి విఫలం చేసింది.

ఇద్రిసిదులు

యెమన్ 
British colony of Aden: Queen Elizabeth II stamp, 1953

1926లో మొదటిసారిగా ఇటలీ ఆడెన్ ప్రొటెక్టరేట్, అసిర్‌తో కూడిన యెమన్ ఇమాంగా యాహ్యాను గుర్తించడం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసింది. యాహ్యా ముహమ్మద్ హమిద్ ఎద్-దిన్ నుండి రక్షణ కోరుతూ ఇద్రిసిదులు ఇబ్న్ సౌద్‌ను ఆశ్రయించారు. అయినప్పటికీ ఇబ్న్ సౌద్ ఈప్రాంతాన్ని సౌదీ సామ్రాజ్యంతో విలీనం చేసుకోవడానికి ప్రయత్నిచిన కారణంగా 1926లో ఇద్రిసిదీలు ఇబ్న్ సౌద్ కూటమిని వదిలి రక్షణ కోరుతూ తిరిగి యాహ్యాను ఆశ్రయించారు. ఇమాం యాహ్యా ఇద్రిసిదుల రాజ్యాన్ని తమ సామ్రాజ్యలో విలీనం చేయాలని షరతు విధించాడు.

సౌదీలో కలవరం

అదే సంవత్సరం హెజాజి లిబరల్స్ బృందం యెమన్‌కు పారిపోయి వచ్చి ఇబ్న్ సౌదును మునుపటి హెజాజ్ రాజ్యం నుండి వెలుపలికి తరమడానికి ప్రణాళిక వేసింది. హెజాజ్ రాజ్యాన్ని ఇబ్న్ సౌదు 7సంవత్సరాలకు పూర్వం తన సామ్రాజ్యంతో విలీనం చేసుకున్నాడు. ఇబ్న్ సౌద్ సహాయం కొరకు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు. బ్రిటిష్ ప్రభుత్వం సహాయంగా సైన్యం, విమానాలను పంపింది. ఇబ్న్ సౌద్‌ను ఎదుర్కొంటున్న ఆర్థిక చిక్కుల నుండి ఇటాలీ విడుదల చేయగలదని బ్రిటిష్ ప్రభుత్వం ఆందోళనపడింది. 1933లో ఇబ్న్ సౌద్ అసిర్ తిరుగుబాటును అణిచివేసిన తరువాత ఇద్రిసిదులు సనాకు పారిపోయారు. ఇమాం యాహ్యా హమిద్ ఎద్ - దిన్, ఇబ్న్ సౌద్ మద్య రాజీప్రయత్నాలు ఫలవంతం కాలేదు. సైనికచర్య తరువాత 1934 మే మాసంలో ఇబ్న్ సౌద్ యుద్ధవిరమణ ప్రకటించాడు. ఇమాం యాహ్యా సౌదీ యుద్ధఖైదీలను విడుదల చేయడానికి అంగీకరించాడు. ఇమాం యాహ్యా నజ్రన్, అసిర్, జిజాన్ ప్రాంతాలను 20 సంవత్సరాలకాలం ఇబ్న్ సౌద్‌కు అప్పగించాడు. 1934లో బ్రిటిష్ ప్రభుత్వంతో మరొక ఒప్పదం మీద సంతకం చేసాడు.ఒప్పందం ఆధారంగా ఇమాం యాహ్యా 40 సంవత్సరాలకాలం ఆడెన్ మీద బ్రిటిష్ ఆధిపత్యానికి అంగీకారం తెలిపాడు. అల్ హుదయ్దాహ్ పట్ల భయం కారణంగా యాహ్యా ఈ షరతులకు అంగీకరించాడు.

కాలనియల్ ఆడెన్

యెమన్ 
Queen Elizabeth II holding a sword prepared to knight subjects in Aden in 1954

1980 నుండి ఆడెన్ నగరంలోని నౌకాశ్రయంలో పనిచేయడానికి హజ్, అల్-బీతా, తైజ్ నుండి శ్రామికుల రాక అధికరించింది. అందువలన అభివృద్ధి చెందిన నగర జనసంఖ్యలో అత్యధికులు విదేశీయులు ఉన్నారు. తరువాత ఆడెన్ ఫ్రీ జోన్ ప్రకటించిన కారణంగా అరేబియన్లు నివసించడానికి ప్రత్యేకప్రాంతం లభించింది. రెండవ ప్రపంచయుద్ధం సమయంలో ఆడెన్ ఆర్థికరంగం బలపడింది. తరువాతి కాలంలో ఆడెన్ నౌకాశ్రయం చురుకుకైన నౌకాశ్రయాలలో రెండవదిగా (మొదటి స్థానం న్యూయార్క్ నౌకాశ్రయం) ప్రసిద్ధి చెందింది. వర్కర్ల యూనియన్ అభివృద్ధి చెందిన తరువాత శ్రామికుల మద్య వర్గవిబేధాలు తలెత్తాయి. 1943 ఆక్రమణకు మొదటి ఆటకం మొదలైంది. " ముహమ్మద్ అలి లుక్మన్ " ఆడెన్‌లో మొదటి అరబిక్ క్లబ్, మొదటి అరబిక్ స్కూల్ స్థాపించబడింది. ఆడెన్ కాలనీ తూర్పు కాలనీ, పశ్చిమ కాలనీగా విభజించబడింది. అదనంగా 23 సుల్తానేట్లు, ఎమిరేట్లు, సుల్తానేటుతో సంబంధం లేని స్వతంత్ర స్థానిక తెగలుగా విభజించబడ్డాయి.సుల్తానేటులు, బ్రిటిష్ మద్య కుదిరిన అవగాహన కారణంగా విదేశీసంబంధాలు మొత్తం బ్రిటిష్ నియంత్రణలోకి వచ్చాయి. బ్రిటిష్ ప్రభుత్వం అరబ్ పాలకులకు అధిక స్వతంత్రం ఇస్తూ " ఫ్రీడం ఆఫ్ సౌత్ అరేబియా " స్థాపించింది. బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ మొదలైన " నార్త్ యెమన్ సివిల్ వార్ " అత్యధికులలో ప్రేరణకలిగించింది. క్వతాన్ " ముహమ్మద్ అల్- షాబి " నేతృత్వంలో యెమన్‌లో " నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (ఎన్.ఎల్.ఒ) " స్థాపించబడింది. ఎన్.ఎల్.ఒ. సుల్తానేటులను అన్నింటినీ ధ్వంసం చేసి సమైక్య " యెమన్ అరబిక్ రిపబ్లిక్ " ఏర్పాటుచేయగలదని విశ్వసించబడింది.రాడ్‌ఫాన్, యాఫా నుండి ఎన్.ఎల్.ఒ.కు మద్దతు అధికంగా లభించింది. 1964 జనవరిలో బ్రిటిష్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన అణ్వాయుధదాడి రాడ్‌ఫాన్ నగరాన్ని పూర్తిగా దహించింది.

రెండు రాజ్యాలు

యెమన్ 
Egyptian military intervention in North Yemen in 1962

ముతవక్కిలితే రాచరికవ్యవస్థ ఆధునికీకరణ స్తంభనను వ్యతిరేకిస్తున్న ప్రాంతంలో అరబ్ జాతీయత ప్రభావం చూపింది. 1962లో అహ్మద్ బిన్ యాహ్యా మరణించిన సమయంలో ఇది స్పష్టంగా కనిపించింది. తరువాత ఆయన కుమారుడు అధికారబాధ్యత చేపట్టారు.అయినప్పటికీ సైనికాధికారులు అధికారం చేపట్టడానికి ప్రయత్నించారు. ఇది నార్త్ యెమన్ అంతర్యుద్ధానికి దారితీసింది. హమిదద్దీన్ రాజకుటుంబానికి సౌత్ అరేబియా, బ్రిటన్, జోరడానులు ఆయుధాలు, ఆర్థికసహాయంచేసి (స్వల్పసంఖ్యలో సైనిక సాయం) మద్దతు ఇచ్చాయి. సైనిక తిరుగుబాటుకు ఈజిప్ట్ బాసటగా నిలిచింది. తిరుగుబాటుదారులకు ఈజిప్ట్ ఆయుధాలు, ఆర్థికసాయం అందించింది. ఈజిప్ట్ యుద్ధంలో పాల్గొనడానికి అత్యధిక సంఖ్యలో సైనికులను పంపింది.ఈజిప్ట్ సైన్యాలను యెమన్‌లో బిజీగా ఉంచడానికి రాజకుటుంబానికి ఇజ్రాయిల్ ఆయుధాలు సరఫరా చేసింది. ఆరు సంవత్సరాల 1968 ఫిబ్రవరిలో సైనికతిరుగుబాటుదారులు విజయం సాధించి " యెమన్ అరబ్ రిపబ్లిక్ " స్త్యాపించబడింది.. ఉత్తర ప్రాంతంలో తిరుగుబాటు, ఆడెన్ అత్యవసర పరిస్థితి దక్షిణప్రాంతంలో బ్రిటిష్ పాలన ముగియసే ప్రక్రియను వేగవంతం చేసింది. 1967 నవంబరు 30న ఆడెన్, మునుపటి అరబ్ ప్రొటెక్టరేట్లను కలుపుకుని దక్షిణ యెమన్ దేశం అవతరించింది. ఈ సోషలిస్ట్ దేశం తరువాత " పీపుల్స్ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ యెమన్ "గా అవతరించింది. తరువాత నేషనలిజం ప్రణాళికలు ఆరంభం అయ్యాయి.

యెమన్ 
British Army's counter-insurgency campaign in the British controlled territories of South Arabia, 1967

రెండు యెమన్ దేశాల శాంతి , శతృత్వం మారిమారి సంభవించాయి. దక్షిణ ప్రాంతానికి ఈస్టర్న్ బ్లాక్ మద్దతు తెలిపింది. ఉత్తరప్రాంతానికి ఎవరితో సంబంధబాంధవ్యాలు ఏర్పడలేదు. 1972లో ఇరుదేశాల నడుమ యుద్ధం జరిగింది. యుద్ధవిరమణతో యుద్ధం ముగింపుకు వచ్చింది. అరబ్ లీగ్ మద్యవర్తిత్వంతో చివరకు సమైక్యత సాధ్యపడింది.1978లో " అలీ అబ్దలాహ్ సలేహ్ " యెమన్ అధ్యక్షుడుగా నియమితుడయ్యాడు. యుద్ధం తరువాత ఉత్తరప్రాంతం దక్షిణప్రాంతానికి అందుతున్న విదేశీసహాయం (ఇందులో సౌదీ అరేబియా కూడా ఉంది) గురించి ఫిర్యాదు చేసింది.1979లో తిరిగి రెండు దేశాల నడుమ యుద్ధం సంభవించింది. అలాగే రెండు దేశాల సమైక్యతకు ప్రయత్నాలు పునరుద్ధరించబడ్డాయి.

యెమన్ 
North Yemen (in orange) and Marxist South Yemen (in blue) before 1990

1986లో జరిగిన " సౌత్ యెమన్ సివిల్ వార్ " సమయంలో వేలాదిమంది మరణించారు. అధ్యక్షుడు " అలీ నాసర్ ముహమ్మద్ " ఉత్తర ప్రాంతానికి పారిపోయాడు. తరువాత రాజద్రోహానికి అధ్యక్షునికి మరణశిక్ష విధించబడింది. తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది.


సమైఖ్యం , అంతర్యుద్ధం

1990లో రెండు ప్రభుత్వాలు ఏకమై సమైక్య యెమన్ స్థాపనకు అంగీకరించాయి. 1990 మే 22న రెండుదేశాలు విలీనం అయ్యాయి. సలేహ్ అధ్యక్షునిగా నియమితుడయ్యాడు. దక్షిణ యెమన్ అధ్యక్షుడు " అలీ సలీం అల్-బెయిద్ " ఉపాధ్యక్షునిగా నియమించబడ్డాడు. " యెమన్ పార్లమెంటు " , రాజ్యాంగం రూపొందించబడింది. 1933లో యెమన్ పార్లమెంటు ఎన్నికలు నిర్వహించబడ్డాయి.ఎన్నికలలో " జనరల్ పీపుల్స్ కాంగ్రెస్ " 301 స్థానాలలో 122 స్థానాలు సాధించి విజయం సాధించింది.: 309 1990 గల్ఫ్ యుద్ధం తరువాత యెమన్ అధ్యక్షుడు అరబ్ మినహాయింపుగా విదేశాలజోక్యాన్ని వ్యతిరేకించాడు. " యునైటెడ్ నేషంస్ సెక్యూరిటీ కౌంసిల్ " సభ్యదేశంగా (1990-1991) యెమన్ ఇరాన్ , ఇరాక్ సంబంధిత నిర్ణయాలలో భాగస్వామ్యం వహించకుండా తప్పుకుంది. అలాగే " యూస్ ఆఫ్ ఫోర్స్ రిసొల్యూషన్ "ను వ్యతిరేకంగా ఓటు వేయడం యు.ఎస్.ను ఆగ్రహానికి గురిచేసింది. యుద్ధానికి వ్యతిరేకత ప్రదర్శించినదానికి ప్రతిస్పందనగా సౌదీ అరేబియా 1990-1991 లో 8,00,000 మంది యెమనీ ప్రజలను దేశం నుండి వెలుపలకు పంపింది. 1992లో ప్రధాన నగరాలలో సంభవించిన " ఫుడ్ రాయిట్స్ " (ఆహారం కొరకు అల్లర్లు) తరువాత 1983లో కొత్త కూటమి ప్రభుత్వం రెండు దేశాల నుండి రూలింగ్ పార్టీలను రూపొందించింది. 1983 ఆగస్టులో ఉపాధ్యక్షుడు అల్-బెయిద్ ఆడెన్‌కు వెళ్ళాడు. రాజకీయ అస్థిరతకు ముగింపు పలకడానికి రాజీప్రయత్నాలు చేయబడ్డాయి. రాజకీయ అంతర్యుద్ధంలో ప్రధానమంత్రి " హైదర్ అబు బకర్ అల్- అతాస్ " అశక్తుడయ్యాడు. ఉత్తరప్రాంత , దక్షిణప్రాంత నాయకుల మద్య 1994 ఫిబ్రవరి 20న అమ్మాన్ జోర్డాన్ వద్ద ఒప్పందం మీద సంతకం చేయబడింది. అయినప్పటికీ అంర్యుద్ధం నివారించలేక పోయారు. 1994 మే-జూలై మద్య యెమన్ అతర్యుద్ధంలో దక్షిణప్రాంత సైన్యం ఓటమి పొందింది. యెమనీ సోషలిస్ట్ పార్టీ సభ్యులు దేశం నుండి వెలుపలకు పంపబడ్డారు. 1994లో అంతర్యుద్ధంలో సౌదీ అరేబియా యాక్టివిటీ సహాయం అందించింది.

సమకాలీన యెమన్

యెమన్ 
Prayers during Ramadan in Sana'a

1999లో యెమనీ ప్రథమ ఎన్నికచేయబడిన అధ్యక్షుడుగా " సలేహ్ "96.2% ఓట్లతో విజయం సాధించాడు.: 310  2000 అక్టోబర్ 17న ఆడెన్‌లో యు.ఎస్. నావల్ వెసెల్ మీద జరిగిన ఆత్మాహుతి బాంబుదాడి ఫలితంగా అల్- కొయిదా నిందించబడింది. సెప్టెంబర్ 11 దాడి తరువాత యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు జార్జ్ డబల్యూ బుష్ తీవ్రవాదుల దాడిలో యెమన్ భాగస్వామ్యం వహించిందని ఆరోపించాడు. యెమనీ కాంస్టిట్యూషనల్ రిఫరెండం (2001) లో సలేహ్ పాలనను సమర్ధిస్తూ హింసాత్మక చర్యలు చోటుచేసుకున్నాయి.

2004 జూన్‌లో యెమన్‌లో షియా విప్లవం ఆరంభం అయింది. జేదీ షియా సిద్ధాంతానికి " హుస్సేన్ బద్రెద్దిన్ అల్-హౌతీ " నాయకుడు యెమనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటును లేవనెత్తాడు.

యెమన్ 
"Sana'a risks becoming the first capital in the world to run out of a viable water supply as Yemen's streams and natural aquifers run dry", according to The Guardian.

2005లో ఆయిల్ ధరల విషయంలో పోలీసులు, నిరసనదారుల మద్య జరిగిన అల్లర్లలో దేశం మొత్తంలో కనీసం 36 మంది మరణించారు. యెమనీ అధ్యక్ష ఎన్నికలు (2006) సెప్టెంబరు 20 న నిర్వహించబడ్డాయి. ఎన్నికలలో సలేహ్ 77.2% ఓట్లతో విజయం సాధించాడు. ప్రత్యర్థి ఫైసల్ బిన్ షమ్లన్ 21.8% ఓట్లను సాధించాడు. రెండవ మారుగా సలేహ్ సెప్టెంబరు 27న అధ్యక్షునిగా పదవీబాధ్యత వహించాడు.2007 జూలైలో మారిబ్ సమీపంలో ఒక ఆత్మాహుతి దళసభ్యుని దాడిలో 8 మంది స్పానిష్ పౌరులు, ఇద్దరు యెమనీయులు చంపబడ్డారు. 2008లో పోలీస్, అధికారులు, డిప్లొమాటిక్, విదేశీ వ్యాపారం, పర్యాటక గమ్యాల మీద వరుస బాంబుదాడులు సంభవించాయి.యు.ఎస్. ఏంబసీ వెలుపల కారు బాంబింగులో 18 మంది మరణించారు.సనాలో ఎన్నికల సంస్కరణ కోరుతూ నిర్వహించబడిన ప్రదర్శనలో పోలీసు కాల్పులు జరిగాయి.

అల్ కొయిదా

2009 జనవరిలో సౌదీ అరేబియన్, యమనీ అల్- కొయిదా శాఖలు విలీనమై యమన్‌లో " అల్- కొయిదా ఇన్ అరేబియన్ పెనింసులా " రూపొందించాయి.వీరిలో గుయాంతనమో బేలో విడుదలైన సౌదీ అరేబియన్లు అధిక సంఖ్యలో ఉన్నారు. మంచినడత కారణంగా సలేహ్ 176 మందిని విడుదల చేసాడు. అయినప్పటికీ తీవ్రవాద చర్యలు మాత్రం కొనసాగాయి. 2009 షియా తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా సౌదీ సైనిక సాయంతో యెమనీ సైనికచర్యను ప్రారంభించింది. యుద్ధంలో వేలాది మంది స్థలమార్పిడి చేయబడ్డారు. 2010 ఫిబ్రవరిలో యుద్ధవిరమణ అంగీకారం కుదిరింది. అయినప్పటికీ యుద్ధంలో 3,000 మంది మరణించారు. యెమన్‌లో జైదిజం అణిచివేయడానికి సలాఫిజం బృందాలకు సౌదీ అరేబియా సాయం అందించిందని షియా తిరుగుబాటుదారులు ఆరోపించారు.

తీవ్రవాదుల మీద యు.ఎస్. దాడి

యు.ఎస్. అధ్యక్షుడు " బారక్ ఒబామా " ఆదేశాలతో యు.ఎస్.యుద్ధ విమానాలు క్రూసీ మిస్సైల్ ప్రయోగం చేసారని పత్రికావిలేఖరులు పేర్కొన్నారు. వాషింగ్టన్ అధికారులు సనా, అబ్యన్ (2009 డిసెంబరు 17) ప్రాంతంలో ఉన్న అల్-కొయిదా కేంపులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని పేర్కొన్నారు. అల్- కొయిదా లక్ష్యాలు కాక గ్రామాలలో జరిగిన దాడిలో 55 మంది పౌరులుమరణించారు. దాడులలో 60 మంది పౌరులు, 28 మంది పిల్లలు మరణించారని యెమన్ అధికారులు చెప్పారు. డిసెంబరు 24న మరొక వాయుమార్గ దాడి జరిగింది. రాజకీయ అనిశ్చిత పరిస్థితి కారణంగా యెమన్‌లో అధికరించిన తీవ్రవాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి యు.ఎస్. యెమన్‌లో డ్రోన్ దాడి చేసింది. 2009 నుండి సి.ఐ.ఎ. మద్దతుతో యు.ఎస్. సైన్యం యెమన్‌లో దాడులు నిర్వహించింది. అమెరికాకు బెదిరింపుగా ఉన్న లక్ష్యాల మీద సి.ఐ.ఎ. మద్దతుతో యు.ఎస్. సైన్యం జరిపిన డ్రోన్ దాడుల లక్ష్యాలలో మానవనివాసాలు కూడా ఉన్నందున యు.ఎస్. డ్రోన్ దాడులలో అమాయకప్రజలు మరణించారని మానవహక్కుల సంరక్షణ సంస్థలు విమర్శించాయి. 2011 సెప్టెంబరులో యు.ఎస్. యెమన్‌లో జరిపిన డ్రోన్ దాడులలో " అంవర్ అల్ -అవ్లకీ ", " సమీర్ ఖాన్ " మరణించడం పలు వివాదాలకు దారితీసింది. యు.ఎస్.పౌరులు కూడా దీనిని విమర్శించారు. 2011 అక్టోబరు మాసంలో జరిగిన డ్రోన్ దాడిలో అంవర్ టీనేజ్ కుమారుడు " అద్బుల్‌రహ్మాన్ అల్ - అవ్లకి " మరణించాడు. అధ్యక్షుడు సలేహ్ పదవీచ్యుతుడయ్యే వరకు యు.ఎస్. డ్రోన్ దాడి కొనసాగింది. జైదియా (షియా) యెమన్ రివల్యూషనరీ కమిటీ (యెమన్) ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, లెవంత్‌కు అల్ కొయిదా , సౌదీ అరేబియాలకు వ్యతిరేకంగా పోరాడింది. యు.ఎస్. హౌతీలకు వ్యతిరేకంగా సౌదీ అరేబియన్ జోక్యం చేసుకోవడానికి మద్దతు ఇచ్చింది. 2016 ఫిబ్రవరిలో అల్- కొయిదా సైన్యం, సౌదీ నాయకత్వంలో సైనికదళం హౌతీ తురుగుబాటుదార్లకు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్నది.

తిరుగుబాటు , తరువాత

యెమన్ 
Protest in Sana'a, 3 February 2011
యెమన్ 
  Controlled by Houthis and Saleh loyalists
  Controlled by Hadi loyalists
  Controlled by al-Qaeda and Islamic State-affiliated Ansar al-Sharia

2011లో యెమనీ రివల్యూషన్ ఇతర అరబ్ తిరుగుబాటుదార్ల నిరసనలలో భాగస్వామ్యం వహించింది. తిరుగుబాటు నిరుద్యోగం, ఆర్థిక పరిస్థితులు, లంచగొండితనానికి వ్యతిరేకంగా ప్రారంభం అయింది. 2011 మార్చిలో పోలీస్ ప్రొడెమాక్రసీ కేంపు మీద సాగించిన కాల్పులలో 50 మంది మరణించారు. మే మాసంలో సనాలో జరిగిన ట్రూపస్, స్థానిక తెగల జాతిసంఘర్షణలో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. ఈ సంఘటన తరువాత సలేహ్‌కు అతర్జాతీయ మద్దతు సన్నగిల్లింది. 2011 అక్టోబరులో మానవహక్కుల సంరక్షణ ఉద్యమకారుడు " తవకుల్ కర్మన్ " నోబుల్ బహుమతిని అందుకున్నాడు. యు.ఎన్. సెస్రటరీ కౌంసిల్ హింసా కాండను విమర్శిస్తూ అధికారం బదిలీ చేయాలని పిలుపునిచ్చింది. 2011 నవంబరు 23న సలేహ్ పొరుగున ఉన్న సౌదీ అరేబియాలో ఉన్న రియాదుకు పారిపోయి " గల్ఫ్ కో-ఆపరేషన్ కౌంసిల్ " ఒప్పందం మీద సంతకం చేసి అధ్యక్షపీఠం ఉపాధ్యక్షుడు " అద్బ్ రబ్బుహ్ మంసూర్ హదీ "కి బదిలీ చేసాడు. ప్రతిపక్షాల నుండి ప్రధానమంత్రితో కూడిన ప్రభుత్వం ఏర్పాటుచేయబడింది. కొత్త రాజ్యాంగ నిర్మాణానికి అల్- హదీ పర్యవేక్షకునిగా వ్యవహరించాడు. 2014లో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. 2012 ఫిబ్రవరిలో సలేహ్ తిరిగి వచ్చాడు. వేలాది మంది ఆయనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.ఆయన కుమారుడు జనరల్ అహమ్మద్ అలీ అబ్దుల్లా సలేహ్ " మిలటరీ, సెక్యూరిటీ ఫోర్సులో పనిచేయడం కొనసాగించాడు.

ఎ.క్యూ.ఎ.పి

2012లో అధ్యక్షుని నివాసం మీద జరిగిన ఆత్మాహుతి దాడికి ఎ.క్యూ.ఎ.పి బాధ్యత వహించింది. అధ్యక్షుడు హదీ పదవీ ప్రమాణం చేస్తున్న సమయంలో జదిగిన ఈ దాడిలో 26 మంది రిపబ్లిక గార్డులు మరణించారు. తరువాత ఎ.క్యూ.ఎ.పి జరిపిన దాడిలో 96 మంది సైనికులు మరణించారు. 2012 సెప్టెంబరున సనాలో జరిగిన కారుబాంబు దాడిలో 11 మంది పౌరులు మరణించారు. తరువాత దినం దక్షిణ ప్రాంతంలో ఉన్న అల్- కొయిదా నాయకుడు " సైద్ అల్-షిహ్రీ " మరణించాడని వార్తలు వివరించాయి.ఎ.క్యూ.ఎ.పి యెమనీ పౌరుల మీద సాగించిన హింసాత్మక దాడులకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో యు.ఎస్. మిలటరీ ప్రమేయం ఉందని భావించబడింది. తరువాత నిర్వహించిన ఎన్నికలలో అబ్ద్ రబ్బుహ్ మంసూర్ హదీ " అధ్యక్షపీఠం అధిష్ఠించాడు. యెమనీ సైన్యం అంసర్ అల్-సరియాను తొలగించి షబ్వా గవర్నరేటును తిరిగి స్వాధీనం చేసుకుంది.

యెమన్ 
Saudi-led air strike on Sana'a, 12 June 2015: Saudi Arabia is operating without a UN mandate.

హౌతీ తిరుగుబాటు

దక్షిణప్రాంత వేర్పాటు వాదులు, హౌతీస్ (షియా తిరుగుబాటుదారులు) , ఎ.క్యూ.ఎ.పి సవాళ్ళను ఎదుర్కొనడంలో విఫలమైన కారణంగా సనాలోని కేంద్రప్రభుత్వం బలహీనపడింది.హదీ అధికారం చేపట్టిన తరువాత షియా విప్లవం తీవ్రమైంది. 2014 సెప్టెంబరున ప్రభుత్వ వ్యతిరేక శక్తులు " అబ్దుల్- మాలిక్ అల్- హౌతీ " నాయకత్వంలో " జరిపిన పోరాటం సమైక్య ప్రభుత్వ ఏర్పాటుకు దారితీసింది. ప్రభుత్వంలో భాగస్వామ్యం వహించడానికి హౌతీలు నిరాకరించారు. అయినప్పటికీ వారు హదీ ప్రభుత్వం, మంత్రివర్గం మీద వత్తిడి అధికం చేసి అధ్యక్షనివాసంలో ప్రవేశించి అధ్యక్షుని గృహనిర్భంధంలో ఉంచారు. 2015 జనవరిలో ప్రభుత్వం రాజీనామా చేసింది. తరువాత మాసంలో హౌతీస్ పార్లమెంటును రద్దు చేసాడు. 2014-15 మొహమ్మద్ అలీ అల్-హౌతీ నాయకత్వంలో రివల్యూషనరీ కమిటీ రూపొందించబడి అధికారం బదిలీ చేయబడింది. కొత్త తాత్కాలిక ప్రభుత్వానికి అధ్యక్షుని కజిన్ సోదరుడు అబ్దుల్ మాలిక్ అల్- హౌతీ తిరుగుబాటుకు పిలుపునిచ్చాడు. 2015 ఫిబ్రవరి 6న ప్రకటించిన " కాంస్టిట్యూషనల్ డిక్లరేషన్ " రాజకీయ నాయకులు, విదేశీప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి చేత నిరాకరించబడింది.

హదీ

ఫిబ్రవరి 21న హదీ సనా నుండి తన స్వంత ఊరైన ఆడెన్‌కు పారిపోయాడు. తరువాత మాసం ఆయన ఆడెన్ నగరాన్ని యెమన్ రాజధానిగా ప్రకటించాడు. గల్ఫ్ కోపరేషన్ ప్రోత్సాహంతో హౌతీలు వెనుకకు వచ్చి ఆడెన్ వైపు కదిలారు. యు.ఎస్. చెందిన వారిని అందరినీ దేశం నుండి వెలుపలికి పంపి అధ్యక్షుడు హదీని సౌదీ అరేబియాకు పారిపోయేలా చేసారు. మార్చి 26 న సౌదీ అరేబియా " అల్- హజ్మ్‌ స్టోం " ప్రకటించి వాయుమార్గ దాడులను చేసింది. తరువాత హౌతీలకు వ్యతిరేకంగా సైనిక కూటమిలో చేరడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కూటమిలో కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కతర్, బహ్రయిన్,జోర్డాన్,మొరాకో,సుడాన్,ఈజిప్ట్, పాకిస్తాన్ దేశాలు భాగస్వామ్యం వహించాయి. యునైటెడ్ స్టేట్స్ ఇంటెలిజెంస్, టార్గెటింగ్, లాజిస్టిక్స్ మార్గదర్శకం చేస్తామని ప్రకటించింది.హదీ బృందాలు ఆడెన్‌ను హౌతీల నుండి స్వాధీనం చేసుకున్నది.

ఆర్ధికం

యెమన్ 
A proportional representation of Yemen's exports.

యెమన్ జి.డి.పి. 61.63 బిలియన్ల అమెరికన్ డాలర్లు. తలసరి ఆదాయం 2.500 అమెరికన్ డాలర్లు. ఇందులో సేవారంగం 61.4%, పారిశ్రామిక రంగం 30.9%, వ్యవసాయం 7.7% భాగస్వామ్యం వహిస్తున్నాయి. పెట్రోలియం జి.డి.పి.లో 25%, ప్రభుత్వ ఆదాయంలో 63% భాగస్వామ్యం వహిస్తుంది. గతంలో వ్యవసాయం జి.డి.పి.లో 18-27%, భాగస్వామ్యం వహిస్తుండగా ప్రస్తుతం గ్రామీణప్రజలు వలసలు, ఇతర కారణాలతో వ్యవసాయరంగంలో మార్పులు సంభవించాయి. దేశం ధాన్యాలు, పండ్లు, పప్పులు, ఖాట్, కాఫీ, పాలౌత్పత్తులు, చేపలు, పెంపుడు జంతువులు (గొర్రెలు, పశువులు,మేకలు, ఒంటేలు), కోళ్ళ పరిశ్రమ ప్రధానమైనవి.

యెమన్ 
A coffee plantation in North Yemen.

వ్యవసాయం

యెమనీలు అధికంగా వ్యవసాయరంగంలో ఉపాధి పొందుతూ ఉన్నారు. ప్రధానంగా జొన్నలు పండించబడుతున్నాయి. పత్తి, పండ్లు తోటలు కూడా ఉన్నాయి. మామిడి పంట అత్యంత విలువైనదిగా భావించబడుతుంది. యెమన్‌లో పండించబడుతున్న ఖాట్ అనే మాదకద్రవ్యం పంట కొరకు సనానదీమైదానంలో 40% నీరు ఉపయోగించబడుతుంది. ఇది ఇంకా అధికరించవచ్చని భావిస్తున్నారు. సనా నదీమైదానంలో ప్రధాన వ్యవసాయ పంటలు ఎండి పోతున్న కారణంగా వాటి వాటి స్థానంలో వేరు పంటలు పండించబడుతున్నాయి. ఫలితంగా ఆహారధాన్యాల ధరలు అధికరిస్తున్నాయి. 2008లో ఆహారపంటల ధరలు అధికరించిన కారణంగా అదనంగా 6% పేదరికం అధికరించిందని భావిస్తున్నారు. ప్రభుత్వం, దావూద్ బొహ్రా కమ్యూనిటీ కలిసి ఖాట్ బదులుగా కాఫీ తోటలు అభివృద్ధి చేయాలని ప్రయత్నం ఆరంభం అయ్యాయి.

పారిశ్రామిక రంగం

యమనీ పారిశ్రామిక రంగానికి క్రూడాయిల్, పెట్రోలియం రిఫైనింగ్ కేంద్రంగా ఉంది. హస్థకళలు, స్మాల్ - స్కేల్ ప్రొడక్షన్ ద్వారా పత్తి -, వస్త్రాల తయారీ ఉత్పత్తి, తోలు వస్తువులు, అల్యూమినియం ఉత్పత్తులు, కమర్షియల్ షిప్ రిపేర్, సిమెంట్, సహజవాయువు ఉత్పత్తి చేయబడుతున్నాయి. 2013 గణాంకాల ఆధారంగా యెమన్ పారిశ్రామిక రంగం 4.8% అభివృద్ధి చెందిందని భావిస్తున్నారు. యెమన్‌లో పెద్ద మొత్తంలో సహజవాయువు నిల్వలు ఉన్నాయని కనుగొనబడింది. యెమన్ మొదటి " లిక్విడ్ నేచురల్ గ్యాస్ ప్లాంట్ " 2009 అక్టోబరు నుండి ఉత్పత్తిని ప్రారంభించింది.

యెమన్ 
A Souq in Old Sana'a.

2013 గణాంకాల ఆధారంగా యెమన్‌లో 7 మిలియన్ల మంది శ్రామికులు ఉన్నారని భావిస్తున్నారు. సేవారంగం, పరిశ్రమలు, నిర్మాణరంగం, కామర్స్ కలిసి 25% కంటే తక్కువగా భాగస్వామ్యం వహిస్తున్నాయి. 2003 గణాంలా ఆధారంగా నిరుద్యోగం 35% ఉందని భావిస్తున్నారు.

ఎగుమతులు

యెమన్ మొత్తం ఎగుమతులు 694 బిలియన్ల అమెరికన్ డాలర్లు. ఎగుమతులలో క్రూడాయిల్, కాఫీ, ఎండిన ఉప్పు చేపలు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ప్రధాన్యత కలిగి ఉన్నాయి. యెమన్ నుండి చైనా (41%),థాయిలాండ్ (19.2%, భారతదేశం (11%), దక్షిణ కొరియా (4.4%) దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. యెమన్ దిగుమతులు 10.97% బిలియన్లు.యెమన్ ప్రధానంగా మెషినరీ అండ్ ఎక్విప్మెంటు, ఫుడ్ స్టఫ్, పెంపుడు జంతువులు రసాయనాలను దిగుమతి చేసుకుంటున్నది. యెమన్ ఇ.యు. (48.8%, యు.ఎ.ఇ. 9.8%, స్విడ్జర్లాండ్ (8.8%),చైనా (7.4%), భారతదేశం (5.8%) నుండి ప్రధానంగా దిగుమతి చేసుకుంటున్నది.

యెమన్ 
Drilling for oil in Yemen using a land rig.

ఆర్ధిక ప్రణాళిక

2013 గణాంకాలను అనుసరించి యెమనీ ప్రభుత్వ ఆర్థికప్రణాళికలో 7.769 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఆదాయం, 12.31 అమెరికన్ డాలర్ల వ్యయం భాగంగా ఉన్నాయి. దేశ జి.డి.పి.లో పన్నులద్వారా, ఇతర ఆదాయం 17.7% లభిస్తుంది. లోటు బడ్జెట్ 10.3%. పబ్లిక్ ౠణం 47.1% జి.డి.పి.లో భాగస్వామ్యం వహిస్తున్నాయి.2013లో యెమన్ విదేశీద్రవ్యం, బంగారం నిల్వల విలువ 5.538 బిలియన్ల అమెరికన్ డాలర్లు. ద్రవ్యోల్భణం 11.8%. యెమన్ ఎక్ష్టర్నల్ ౠణం 7.806 బిలియన్ల అమెరికన్ డాలర్లు. 1950 మద్యకాలంలో సోవియట్ యూనియన్, చైనా యెమన్‌కు బృహత్తర సహాయం అందించింది. ఉదాహరణగా చైనా, యునైటెడ్ స్టేట్స్ " సనా విమానాశ్రయం " విస్తరణలో పాల్గొన్నాయి. దక్షిణప్రాంతంలో నౌకాశ్రయనగరం ఆడేన్ ఆర్థికాభివృద్ధికి అత్యుత్సాహంగా దృష్టిని కేంద్రీకరించాయి. 1967లో ఆడెన్ నగరం నుండి బ్రిటన్ వెళ్ళగానే సూయజ్ కాలువమూతపడిన తరువాత నౌకాశ్రయంతో సంబంధించిన సముద్ర ఆధారిత వాణిజ్యం పతనం అయింది.యుద్ధం నిర్ణయించబడిన తరువాత ప్రభుత్వం " ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ " స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంటు అమలుకు అంగీకరించింది. మొదటివిడత ప్రోగ్రాంలో ఫైనాషియల్ అండ్ మానిటరీ సంస్కరణలు, కరెంసీ, బడ్జెట్ లోటును తగ్గించడం, రాయితీలను తగ్గించడం మొదలైన కార్యక్రమాలు చోటుచేసుకున్నాయి. రెండవ విడత ప్రోగ్రాంలో సివిల్ సర్వీస్ సంస్కరణలు చోటుచేసుకున్నాయి.

1995లో ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్, ఐ.ఎం.ఎఫ్. అలాగే ఇంటర్నేషనల్ డోనర్ల మద్దతుతో ఎకనమిక్, ఫైనాంషియల్, అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణలు చేపట్టింది. ఈ సంస్కరణలు అనికూలస్పందన కలిగించి బడ్జెట్ లోటు 3% తగ్గింది. మైక్రో ఫైనాంస్ అసమతుల్యత సరిదిద్దబడింది. 1995-1997 మద్య కాలం నాన్- ఆయిల్ రంగంలో 5.6% అభివృద్ధి సాధ్యపడింది.

నీటిసరఫరా

యెమన్ ప్రధాన సమస్యలలో నీటి కొరత (ప్రధానంగా కొండప్రాంతాలలో) ఒకటి. రెండవ ప్రధాన సమస్య అత్యంత అధికమైన పేదరికం. అరబ్ ప్రపంచంలో పేదరికం, అత్యంత నీటికొరత సమస్యను ఎదుర్కొంటున్న ఏకైకదేశం యెమన్. మూడవ సమస్య పరిమితంగా ఉన్న ఇంఫ్రాస్ట్రక్చర్. సరాసరిగా దినసరి నీటిసరఫరా 140 క్యూబిక్ మీటర్లు (101 దినసరి గ్యాలెన్లు). మిడిల్ ఈస్ట్ సరాసరి 1000 క్యూబిక్ మీటర్లు. యెమన్ భూగర్భజలాలు నీటి అవసరాలకు ప్రధాన నీటివనరుగా ఉంది. అయినప్పటికీ భూగర్భజలాలు క్రమంగా అంతరించిపోతూ యమన్‌ను జలరహిత దేశంగా మార్చుతూఉన్నాయి. 1970లో సనా నగరంలో భూగర్భజలాలు 30 మీటర్ల లోతున ఉండేవి. 2012 నాటికి అవి 1200 మీటర్ల లోతుకు చేరుకున్నాయి. యెమన్ ప్రభుత్వం భూగర్భజలాల రెగ్యులేటరీ బాధ్యత వహించడం లేదు. తిరుగుబాటుకు ముందుగానే నిపుణులు యెమన్ " ఫస్ట్ కంట్రీ రన్ ఔట్ ఆఫ్ వాటర్ "గా మారుతుందని హెచ్చరించారు. యెమన్ వ్యవసాయరగం 90% జలాలను వినియోగం చేస్తుంది. వ్యవసాయం జి.డి.పి.లో 6% మాత్రమే భాగస్వామ్యం వహిస్తుంది. యెమనీ ప్రజలు అధికంగా చిన్నతరహా వ్యవసాయం మీద ఆధారపడుతుంటారు. వ్యవసాయంలో సగభాగం జలం ఖాట్ పండించడానికి ఉపయోగించబడుతుంది. దీనిని అత్యధికమైన యెమనీ ప్రజలు వాడుతుంటారు. సగంమంది ప్రజలు ఆహారలోపంతో బాధపడుతుంటారు. ఎవరికీ ఆహారం అందించలేని పంట అభివృద్ధికి 45% జలం ఉపయోగించబడుతుంది. 2015 యెమన్ అంతర్యుద్ధం 80% యెమనీ ప్రజలు త్రాగడానికీ , స్నానం చేయడానికి తగిన నీరు లభించక బాధపడుతున్నారు. బాంబుదాడి కారణంగా చాలామంది యెమనీలు తమతమ నివాసాలను వదలి ఇతర ప్రాంతాలకు వెళ్ళారు. అందుకని ఆప్రదేశాలలో బావుల మీద అధికవత్తిడి చేరింది.

గణాంకాలు

యెమన్ 
Yemen's population (1961-2008). Yemen has a growth rate of 3.46% (2008 est.)

2014 గణాంకాలను అనుసరించి యెమన్ జనసంఖ్య 24 మిలియన్లు. వీరిలో 15 సంవత్సరాల లోపు వారు 46%, 65 సంవత్సరాలకు పైబడిన వారు 2.7% ఉన్నారు. 1950 లో యెమన్ జనసంఖ్య 4.3%. 2050 నాటికి జనసంఖ్య 60 మిలియన్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. యెమన్ ఫర్టిలిటీ రేట్ అత్యధికంగా ఉంటుంది. ఇది ప్రపంచంలో 30 వ స్త్యానంలో ఉంది. సనా జనసంఖ్య 1978 నుండి 55,000 నుండి వేగవంతంగా అభివృద్ధి చెందింది. 21 శతాబ్ధానికి ఈ సంఖ్య 2 మిలియన్లకు చేరుకుంది.

సంప్రదాయ సమూహాలు

యెమన్ 
Yemen's tribal areas and Shia/Sunni regions. Shia Muslims predominant in the green area of Yemen's West, with the rest of Yemen being Sunni Muslims.

సంప్రదాయపరంగా యెమనీ ప్రజలలో అరేబియన్లు ప్రధస్థానంలో ఉండగా ద్వీతీయ స్థానంలో అఫ్రో-అరబ్బులు, తరువాత స్థానాలలో దక్షిణాసియన్లు , యురేపియన్లు ఉన్నారు. యెమన్ దక్షిణ , ఉత్తర ప్రాంతాలను స్థాపించిన తరువాత అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా యెమన్ వదిలి వెళ్ళారు. యెమన్‌లో స్థానిక ప్రజలు అధికంగా ఉన్నారు. ఉత్తరంలో ఉన్న పర్వతప్రాంతాలలో 400 జేదీతెగలకు చెందిన ప్రజలు ఉన్నారు. నగరప్రాంతాలలో " అల్- అఖ్డం " వంటి వారసత్వ జాతి సమూహాలు ఉన్నాయి. దేశంలో యెమనీ పర్షియన్లు కూడా నివసిస్తున్నారు. 10 వ శతాబ్ధం నుండి పర్షియన్లు ఆడెన్ నగరంలో అధికంగా నివసిస్తున్నారని భావిస్తున్నారు. ప్రంపంచంలోని ఇతర యూదులకు వ్యత్యాసమైన సంప్రదాయంతో గణినీయమైన యూదులు ఒకప్పుడు యెమన్‌లో నివసించే వారు. వీరిలో చాలామంది " జూయిష్ ఎక్షోడస్, ఆపరేష మాజిక్ కార్పొరేట్ " తరువాత 20వ శతాబ్ధంలో ఇజ్రాయిల్ కు వలసవెళ్ళారు. ఆడెన్, ములక్కా, షిహ్ర్, లహాజ్, మొఖ , హొడేడాహ్ పరిసరాలలో 1,00,000 మంది భారతీయ సంతతికి చెందిన వారు నివసిస్తున్నారని భావిస్తున్నారు.ఇండోనేషియా, సింగపూర్,మలేషియా దేశాలలో నివసిస్తున్న అరబ్ సంతతికి చెందిన హధ్రామీ ప్రజలకు మూలం యెమన్‌లోని హద్రామవ్త్ అని భావిస్తున్నారు. ప్రస్తుతం సింగపూర్‌లో 10,000 మంది హద్రామీలు నివసిస్తున్నారు. హద్రామీలు ఆగ్నేయ ఆసియా, తూర్పు ఆఫ్రికా , భారతీయ ఉపఖండానికి వలసవెళ్ళారు. యెమన్‌లో నివసిస్తున్న అరబ్ బెడూయిన్ తెగలకు చెందిన మాక్విల్ ప్రజలు ఈజిప్ట్ మీదుగా పశ్చిమప్రాంతానికి తరలివెళ్ళారు. యెమనీ అరేబియన్లు దక్షిణప్రాంతాల ద్వారా మౌరిటానియాకు వెళ్ళారు. 17వ శతాబ్ధంలో వీరు దేశంలో ఆధిఖ్యత కలిగి ఉండేవారు. వారు మొరాకో , అల్జీరియా మొదలైన ఉత్తర ఆఫ్రికా దేశాలను స్థాపించారు. అరేబియన్ ద్వీపకల్పంలో 1951 , 1967 మద్యకాలంలో శరణార్ధులకు ఆశ్రయం ఇచ్చిన ఏకైక దేశంగా యెమన్ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. 2007 లో యెమన్ 1,24,000 మంది శరణార్ధులకు ఆశ్రయం ఇచ్చింది. శరణార్ధులలో అధికంగా సోమాలియాకు చెందిన 1,10,600, ఇరాక్కు చెందిన 11,000, ఎథియోపియాకు చెందిన 2,000, సిరియాకు చెందిన మంది ప్రజలు ఉన్నారు. కలహాల కారణంగా 3,34,000 మంది యెమనీ ప్రజలు దేశీయంగా స్థానచలనం అయ్యారు. విదేశాలలో ఉద్యోగం చేస్తున్న యెమన్ ప్రజలు అధికంగా సౌదీ అరేబియాలో నివసిస్తున్నారు. ఇక్కడ 8,00,000 నుండి ఒక మిలియన్ ప్రజలు నివసిస్తున్నారు. యునైటెడ్ కింగ్డంలో 70,000 నుండి 80,000 వరకు యెమనీ ప్రజలు నివసిస్తున్నారని అంచనా.

భాషలు

ఆధునిక స్థాయి అరబిక్ యెమన్ అధికారభాషగా ఉంది. యెమనీ అరబిక్. అరబిక్ బలోచి భాష పలు ప్రాంతీయ యాసలతో కలగలిపి వాడుకలో ఉంది. అల్ మహ్రాహ్ గవర్నరేట్‌, సొకోత్రా ద్వీపం, ఆధునిక సౌత్ అరేబియన్ భాషలు వాడుకలో ఉన్నాయి. బధిరులకు " యెమినీ సైన్ భాష " వాడుకలో ఉంది. సౌత్ సెమిటిక్ భాషలకు యెమన్ జన్మస్థానంగా ఉంది. వీటిలో అత్యధికంగా (70,000 మంది సంభాషణదారులు) వాడుకలో ఉన్న భాష మెహ్రీ. మెహ్రా పేరుతో స్థానిక జాతి ప్రజలు కూడా యెమన్‌లో నివసిస్తున్నారు.సొకోత్రా ద్వీపంలో సొక్వోత్రి భాష (57,000 మంది వాడుకరులు) వాడుకలో ఉంది. " ఓల్డ్ సౌత్ అరేబియన్ " భాషలకు యెమన్ జన్మస్థానం. వీటిలో రజిహీ భాష మాత్రమే ప్రస్తుతం ఉనికిలో ఉంది. అత్యంత ప్రాధాన్యం కలిగిన విదేశీభాషలలో ఆంగ్లభాష ప్రధమస్థానంలో ఉంది. దేశంలో గణనీయమైన సంఖ్యలో రష్యాభాష వాడుకలో ఉంది. 1970-1980 మద్య యెమనీ రష్యనుల వర్ణాంతర వివాహాలు సంభవించాయి.రాజధాని సనా నగరంలో కొంతమందిలో(చిన్న సమూహం) చాం భాష వాడుకలో ఉంది.1970 లో వియత్నాం నుండి వలస వచ్చిన ప్రజలతో ఇది దేశంలో ప్రవేశించిందని భావిస్తున్నారు.

మతం

Yemen Religions
Islam
  
99%
other/unknown
  
1%

" ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం రిపోర్ట్ " ఆధారంగా యమన్‌లో రెండు శాఖలకు చెందిన ముస్లిములు ఉన్నారు.వీరిలో 60%-65% సున్నీ ముస్లిములు.షియా ముస్లిములు 35%-40% ఉన్నారు. ఆరంభకాలంలో సున్నీలను షఫీ అనేవారు. తరువాత కాలంలో మాలిక్ , హంబలీలతో కలిసి సున్నీ ముస్లిములుగా వ్యవహరించబడుతున్నారు.ఆరంభంలో షియాలు జైదీల నుండి మొదలైనా క్రమంగా ఈ మతంలో అల్పసంఖ్యాక ట్వెల్వర్ ప్రజలు, , ఇస్మాయిలీ ప్రజలు ఉన్నారు. సున్నీలు దక్షిణ , ఆగ్నేయ భూభాగంలో అధికంగా ఉన్నారు. జైదీలు ఉత్తరం , ఈశాన్య ప్రాంతంలో ఉన్నారు. సనా , మారిబ్ వంటి ప్రధాన కేంద్రాలలో ఇస్మాయిల్ ప్రజలు ఉన్నారు. పెద్ద నగరాలలో మిశ్రిత జాతుల ప్రజలు నివసిస్తున్నారు. యెమనీ ప్రజలలో ముస్లిమేతర ప్రజలు 1% మాత్రమే ఉన్నారు. వీరిలో క్రైస్తవులు, యూదులు, హిందువులు, నాస్తికులు ఉన్నారు. ఎమిరేట్‌కు చెందిన క్రైస్తవుల సంఖ్య 25,000- 41,000 ఉన్నారు. 2015 నుండి ముస్లిం పూర్వీకతతో క్రైవంలో విశ్వాసం కలిగిన ప్రజలు ఉన్నారని భావిస్తున్నారు. యెమన్‌లో 50 మంది యూదులు నివసిస్తున్నారు.సమీపకాలంలో " జ్యూస్ ఏజెంసీ " సంస్థ 200 మంది యూదులను యమన్ నుండి ఇజ్రాయిల్కు తీసుకువచ్చారని భావిస్తున్నారు.

వెలుపలి లింకులు

మూలాలు

Tags:

యెమన్ చరిత్రయెమన్ ఆర్ధికంయెమన్ నీటిసరఫరాయెమన్ గణాంకాలుయెమన్ వెలుపలి లింకులుయెమన్ మూలాలుయెమన్2015En-us-Yemen.oggఅరబ్బీ భాషఅరేబియా ద్వీపకల్పంఎరిత్రియాఒమన్దస్త్రం:En-us-Yemen.oggసౌదీ అరేబియా

🔥 Trending searches on Wiki తెలుగు:

కోణార్క సూర్య దేవాలయంమిథాలి రాజ్తెలుగు సినిమాలు 2022శోభితా ధూళిపాళ్లభారతదేశ పంచవర్ష ప్రణాళికలునవగ్రహాలు జ్యోతిషంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాఅశ్వత్థామవసంత ఋతువునయన తారభారత రాజ్యాంగ పీఠికవెల్లలచెరువు రజినీకాంత్కాకినాడతీన్మార్ మల్లన్నరోహిణి నక్షత్రంపచ్చకామెర్లుస్వామియే శరణం అయ్యప్పబొత్స సత్యనారాయణసామెతలుగోదావరికాప్చాభారత సైనిక దళంతెలుగు కులాలుదత్తాత్రేయఉమ్మెత్తకాకినాడ లోక్‌సభ నియోజకవర్గంమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిఖమ్మంపసుపు గణపతి పూజమెదడు వాపుతెలుగు అక్షరాలులలితా సహస్రనామ స్తోత్రంకాలేయంసంగీత వాద్యపరికరాల జాబితాదేవికతెలంగాణ శాసనసభవిడదల రజినిపూజా హెగ్డేలక్ష్మీనారాయణ వి విరాజ్‌కుమార్ఆంధ్రప్రదేశ్ మండలాలుపరిటాల రవిపక్షవాతంజగ్జీవన్ రాంశ్రవణ నక్షత్రముచతుర్యుగాలువిటమిన్ బీ12మంగళగిరి శాసనసభ నియోజకవర్గంప్రపంచ మలేరియా దినోత్సవంనన్నయ్యరౌద్రం రణం రుధిరంతెలుగు సంవత్సరాలుతెనాలి రామకృష్ణుడుషరియాటంగుటూరి ప్రకాశంపిత్తాశయముఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్వంగవీటి రంగానువ్వు వస్తావనిస్వామి వివేకానందసామజవరగమనమంగళవారం (2023 సినిమా)నల్లమిల్లి రామకృష్ణా రెడ్డికొణతాల రామకృష్ణవందేమాతరంఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిలోక్‌సభ నియోజకవర్గాల జాబితాతెలంగాణా సాయుధ పోరాటంమాదిగలక్ష్మిమహాభాగవతంశ్రీ కృష్ణుడుయానిమల్ (2023 సినిమా)నితీశ్ కుమార్ రెడ్డిభారతీయుడు (సినిమా)ఆశ్లేష నక్షత్రముఆది శంకరాచార్యులుపంబన్ వంతెన🡆 More