నితీశ్ కుమార్ రెడ్డి

కాకి నితీశ్ కుమార్ రెడ్డి (జననం 2003 మే 26) ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు.

ఆయన దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రా క్రికెట్ జట్టు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడతాడు. ఆయన 2019-20 రంజీ ట్రోఫీలో ఆంధ్ర తరపున 2020 జనవరి 27న ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసాడు. ఆయన 2020-21 విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్రా క్రికెట్ జట్టు తరపున 2021 ఫిబ్రవరి 20న తన లిస్ట్ ఎ క్రికెట్ అరంగేట్రం చేసాడు. ఆయన 2021-22 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర తరపున 2021 నవంబరు 4న తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు. 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో అతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.

నితీశ్ కుమార్ రెడ్డి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కాకి నితీశ్ కుమార్ రెడ్డి
పుట్టిన తేదీ (2003-05-26) 2003 మే 26 (వయసు 20)
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మారుపేరునితీష్,
ఎన్కేఆర్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి చేయి మీడియం ఫాస్ట్
పాత్రబ్యాటింగ్ ఆల్ రౌండర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2020–ప్రస్తుతంఆంధ్రప్రదేశ్
2023–ప్రస్తుతంసన్‌రైజర్స్ హైదరాబాద్
తొలి FCజనవరి 27 2020 ఆంధ్రప్రదేశ్ - కేరళ
తొలి LAఫిబ్రవరి 20 2021 ఆంధ్రప్రదేశ్ - విదర్భ
కెరీర్ గణాంకాలు
పోటీ FC ListA T20
మ్యాచ్‌లు 10 14 5
చేసిన పరుగులు 200 293 92
బ్యాటింగు సగటు 11.76 32.55 23.00
100s/50s 0/1 0/3 0/0
అత్యధిక స్కోరు 66 59 41
వేసిన బంతులు 1280 367 12
వికెట్లు 27 10 0
బౌలింగు సగటు 26.85 36.70
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 8/119 3/23
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 9/– 3/–
మూలం: ESPNcricinfo, 2023 ఏప్రిల్ 19

ఆల్‌రౌండర్ ఎన్కేఆర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో 2024 ఏప్రిల్ 9న మొహాలిలోని ముల్లన్‌పూర్‌లో మహరాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు సాధించి బ్యాటింగ్‌లో సత్తాచాటాడు.

బాల్యం

నితీశ్ కుమార్ రెడ్డి 2003 మే 26న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించాడు. ఆయన తండ్రి హిందూస్థాన్ జింక్ (Hindustan Zinc Limited) మాజీ ఉద్యోగి ముత్యాల రెడ్డి. నితీష్ 5 సంవత్సరాల వయస్సులో ప్లాస్టిక్ బ్యాట్‌తో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. సీనియర్లు క్రికెట్ ఆడటం చూడటానికి ఆయన క్రమం తప్పకుండా హిందూస్తాన్ జింక్ లిమిటెడ్ గ్రౌండ్ కు వెళ్లేవాడు. ఈ క్రమంలో, ఆయన తండ్రికి ఉదయపూర్‌ బదిలీ అయింది. అయితే, కొడుకు క్రికెట్ కెరీర్‌ను కొనసాగించడం కోసం తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు నితీష్ వయసు కేవలం 12 ఏళ్లే.

అతని తండ్రి సహకారంతో కోచ్‌లు కుమార స్వామి, కృష్ణారావు, వాటేకర్‌ల వద్ద నితీష్ శిక్షణ పొందాడు.

కెరీర్

అండర్-12, అండర్-14 ఏజ్ గ్రూప్ మ్యాచ్‌ల సమయంలో నితీష్‌ని భారత మాజీ క్రికెటర్ అండ్ సెలెక్టర్ ఎం.ఎస్.కె. ప్రసాద్ గుర్తించాడు. మధుసూధన రెడ్డి, శ్రీనివాసరావుల కోచింగ్‌లో కడపలోని ఎసిఎ అకాడమీలో శిక్షణ పొందాడు.

ఆయన నాగాలాండ్ క్రికెట్ జట్టుపై 441 పరుగులతో వెనుకంజలో ఉన్న సీజన్‌ను అనుసరించాడు, కేవలం 345 బంతుల్లోనే క్వాడ్రపుల్ టన్ను సాధించి, 2017-18 విజయ్ మర్చంట్ ట్రోఫీలో 26 వికెట్లతో పాటు టోర్నమెంట్ రికార్డు 176.41 సగటుతో 1237 పరుగులతో ముగించాడు. ఇది అతనికి 2017-2018 సీజన్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) 'అండర్ -16లో ఉత్తమ క్రికెటర్' జగ్మోహన్ దాల్మియా అవార్డును తెచ్చిపెట్టింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో బీసీసీఐ అవార్డు పొందిన తొలి ఆటగాడుగా నితీశ్ కుమార్ రెడ్డి గుర్తింపు పొందాడు.

మూలాలు

Tags:

en:2020–21 Vijay Hazare Trophyen:2021–22 Syed Mushtaq Ali Trophyఆంధ్రా క్రికెట్ జట్టుఇండియన్ ప్రీమియర్ లీగ్ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023క్రికెట్ట్వంటీ20ఫస్ట్ క్లాస్ క్రికెట్రంజీ ట్రోఫీలిస్ట్ ఎ క్రికెట్సన్ రైజర్స్ హైదరాబాద్

🔥 Trending searches on Wiki తెలుగు:

పుష్పంవిరాట్ కోహ్లికాకి మాధవరావుపర్యావరణంసి.హెచ్. మల్లారెడ్డితెలుగు వ్యాకరణంభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలురామాయణంమేషరాశికులంఅలెగ్జాండర్దేవుడుకపిల్ సిబల్తెలుగు పదాలుఅమరావతి స్తూపంరాపాక వరప్రసాద రావుఆనందరాజ్దశావతారములుమెంతులువేంకటేశ్వరుడురావణుడునిఖత్ జరీన్తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్విన్నకోట పెద్దనబుజ్జీ ఇలారామహాభాగవతంలోక్‌సభ స్పీకర్గాజుల కిష్టయ్యలలితా సహస్ర నామములు- 1-100ఆంధ్రప్రదేశ్పిట్ట కథలుభగవద్గీతచాకలిఉప్పు సత్యాగ్రహంమండల ప్రజాపరిషత్లోక్‌సభఆవుకమల్ హాసన్ నటించిన సినిమాలుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంతెలంగాణ ప్రభుత్వ పథకాలుకావ్య ప్రయోజనాలుశ్రీరామనవమితులారాశియూట్యూబ్గోపరాజు సమరంత్రిఫల చూర్ణంఅయ్యప్పరాధిక శరత్‌కుమార్దాస్‌ కా ధమ్కీజూనియర్ ఎన్.టి.ఆర్లలితా సహస్రనామ స్తోత్రంకుంభరాశిమంచు మోహన్ బాబుఊపిరితిత్తులుశ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)అధిక ఉమ్మనీరుఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంలక్ష్మీనారాయణ వి విరాజ్యాంగంచదరంగం (ఆట)20వ శతాబ్దం పూర్వభాగంలో పల్లెల్లో తెలుగు ప్రజల జీవనవిధానంమంద కృష్ణ మాదిగరోహిణి నక్షత్రందొడ్డి కొమరయ్యప్రకటనమీనరాశిఅశ్వగంధవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఆంధ్రప్రదేశ్ మండలాలుగోధుమనువ్వు లేక నేను లేనుతెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు జాబితాప్రియదర్శి పులికొండదాశరథి కృష్ణమాచార్యఆరెంజ్ (సినిమా)తోట చంద్రశేఖర్కావ్యముమశూచి🡆 More