తెలుగు పదాలు

ఉపదేశం

పదాలలో రకాలు

వ్యుత్పత్తి పరంగా తెలుగు భాషలో పదాలు నాలుగు రకాలు. అవి:

  1. తత్సమము: ప్రాకృత (సంస్కృత) పదము, తెలుగు ప్రత్యయములతో కూడి వ్యవహరింపబడినచో తత్సమము అంటారు. సంస్కృత ప్రాతిపదికపై తెలుగు విభక్తి ప్రత్యయమును చేర్చుట వలన తత్సమము ఏర్పడును. వీనినే ప్రకృతి అనికూడా అంటారు. ఉదాహరణ: బాలః - బాలురు; పుస్తకమ్ - పుస్తకము
  2. తద్భవము: సంస్కృత, ప్రాకృత పదముల నుండి కొద్ది మార్పులు చెంది ఏర్పడిన పదములను తద్భవములు అంటారు. వీటినే వికృతి అనికూడా అంటారు. ఉదాహరణ: యజ్ఞము - జన్నము; పంక్తి - బంతి
  3. దేశ్యము: తత్సమము, తత్భవములు కాక, తెలుగు దేశమున వాడుకలో ఉన్న పదములు దేశ్యములు అంటారు. ఉదాహరణ: పీట, చెట్టు
  4. అన్యదేశ్యము: ఇతర భాషలకు చెందియుండి తెలుగులో వాడబడుచున్న పదములను అన్యదేశ్యములు అంటారు. ఉదాహరణ: స్టేషను, రోడ్డు మొదలైనవి.

భాషాభాగాలు

తెలుగు భాషలోని పదములను ఐదు భాగములుగా విభజించవచ్చును. అవి -

సర్వులకు (అందరికీ) వర్తించే నామము సర్వనామము.ఉదా: నీవు, ఆమె, అతడు.

  • విశేషణములు: నామవాచకము, సర్వనామముల గుణములను తెలియజేయునది. ఉదా: పొడవైన, ఎరుపు, తీపి.
  • అవ్యయములు: లింగ, వచన, విభక్తుల చేత మార్పులు లేని పదములు అవ్యయములు. ఉదా: ఆహా! ఓహో! ఔరా! అకటా!
  • క్రియలు: పనులను తెలిపే వానిని క్రియలు అంటారు. ఉదా: చదువుట, తినుట, ఆడుట.
    • సకర్మక క్రియలు: కర్మను ఆధారముగా చేసికొనియున్న క్రియలను సకర్మక క్రియలు అంటారు. ఉదా: మధు బడికి వెళ్ళెను.
    • అకర్మక క్రియలు: కర్మ లేకపోయినను వాక్యము అర్థవంతమైనచో అవి అకర్మక క్రియలు. ఉదా: సోముడు పరుగెత్తెను.
    • సమాపక క్రియలు: పూర్తి అయిన పనిని తెలియజేయు క్రియలు సమాపక క్రియలు. ఉదా: తినెను, నడచెను.
    • అసమాపక క్రియలు: పూర్తికాని పనిని తెలియజేయు క్రియలు అసమపక క్రియలు. ఉదా: వ్రాసి, తిని.

sandu

ఒకే అర్థాన్ని ఇచ్చే అనేక పదాలను పర్యాయ పదాలంటారు. అర్థం ఒకటే, కానీ ఆ అర్థాన్నిచ్చే పదాలు మాత్రం అనేకం. ఇలాంటి వాటిని పర్యాయ పదాలు అంటారు.

  • తనయుడు = కొడుకు, పుత్రుడు, సుతుడు
  • తరువు = చెట్టు, వృక్షము, మహీరుహము
  • జలధి = కడలి, అర్ణవము
  • పర్వం = పబ్బం, పండుగ, వేడుక
  • శత్రువు = వైరి, రిపు, విరోధి
  • ఆంజనేయుడు = పవనసుతుడు, మారుతి, హనుమంతుడు
  • నిజము = సత్యము, నిక్కము
  • తల = శిరస్సు, మస్తకము, మూర్ధము
  • స్త్రీ = వనిత, మహిళ, పడతి
  • జైలు = బందీఖాన, కారాగారము

మాత్ర

పదం ఒకటే ఉండి అనేక అర్థాలు ఉండేదాన్ని నానార్థాలు అని అంటారు. పదం ఒకటే - అర్థాలు మాత్రం విడివిడిగా అనేకం ఉంటాయి.

  • క్రియ: పని, చేష్ట, శ్రాద్ధము, ప్రాయశ్చిత్తము, చికిత్స
  • లావు: బలము, సమర్థత, గొప్పతనము
  • పృథ్వి: భూమి, విరియునది, ఇంగువచెట్టు, సముద్రతీరము
  • బంధం: ముడి, కలయిక, కట్టివేత

ఇవి కూడా చూడండి

మూలాలు

ఉపయుక్త గ్రంథాలు

  • తెలుగు వ్యాకరణము: వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.

Tags:

తెలుగు పదాలు పదాలలో రకాలుతెలుగు పదాలు భాషాభాగాలుతెలుగు పదాలు sanduతెలుగు పదాలు మాత్రతెలుగు పదాలు ఇవి కూడా చూడండితెలుగు పదాలు మూలాలుతెలుగు పదాలు ఉపయుక్త గ్రంథాలుతెలుగు పదాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

పులివెందుల శాసనసభ నియోజకవర్గంపిఠాపురం శాసనసభ నియోజకవర్గంనాస్తికత్వంతామర వ్యాధితెలుగు సినిమాలు డ, ఢకర్ణాటకఆంధ్రప్రదేశ్ శాసనమండలిదాశరథి కృష్ణమాచార్యబ్రాహ్మణ గోత్రాల జాబితాసమాసంమోత్కుపల్లి నర్సింహులుభాగ్యశ్రీ బోర్సేమీనామూలా నక్షత్రంపరకాల ప్రభాకర్శత్రుఘ్నుడుపద్మశాలీలుఫ్లిప్‌కార్ట్బీమాకాట ఆమ్రపాలివృశ్చిక రాశిశ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండిఅల్లరి ప్రేమికుడుచిరంజీవిసెక్స్ (అయోమయ నివృత్తి)మియా ఖలీఫావిశ్వబ్రాహ్మణవినుకొండవిజయవాడశేఖర్ మాస్టర్ఆది పర్వముఅన్నవరంఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాకులంరాజస్తాన్ రాయల్స్శ్రీ కృష్ణ జన్మభూమిఆటలమ్మస్వాతి నక్షత్రముసివిల్ సర్వీస్రామసేతుఇజ్రాయిల్భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంపాలపిట్టలారీ డ్రైవర్దానం నాగేందర్కేతిరెడ్డి పెద్దారెడ్డిఅనుష్క శర్మతిరుమల చరిత్రఅనసూయ భరధ్వాజ్పిబరే రామరసంవ్యవసాయంసన్ రైజర్స్ హైదరాబాద్లోక్‌సభ నియోజకవర్గాల జాబితామంగ్లీ (సత్యవతి)మొదటి ప్రపంచ యుద్ధంసూర్యుడుగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలువేంకటేశ్వరుడుదిల్ రాజుక్రిక్‌బజ్ఉత్తరాషాఢ నక్షత్రముహృదయం (2022 సినిమా)ప్రజా రాజ్యం పార్టీదివ్యభారతిసుభాష్ చంద్రబోస్గురువు (జ్యోతిషం)తెలుగు సినిమాఅనూరాధ నక్షత్రంఎస్. శంకర్చదరంగం (ఆట)భారత రాజ్యాంగంఉత్పలమాలశ్రవణ నక్షత్రముఇత్తడిభారత జాతీయగీతంసౌర కుటుంబంజయలలితఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుతెలుగు సంవత్సరాలు🡆 More