ట్వంటీ20

ట్వంటీ 20 (T20) అనేది క్రికెట్ ఆటలో ఒక సంక్షిప్త ఆట పద్ధతి.

వృత్తిపరమైన స్థాయిలో దీన్ని, ఇంగ్లాండులో కౌంటీల మధ్య జరిగే పోటీల్లో 2003 లో ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ప్రవేశపెట్టింది. ఒక ట్వంటీ20 గేమ్‌లో, రెండు జట్లూ ఒక్కో ఇన్నింగ్స్‌ ఆడతాయి. ఇన్నింగ్సుకు గరిష్ఠంగా 20 ఓవర్లుంటాయి. ఫస్ట్-క్లాస్, లిస్ట్ A క్రికెట్‌తో కలిపి, ట్వంటీ 20 అనేది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అత్యున్నత అంతర్జాతీయ లేదా దేశీయ స్థాయిలో గుర్తింపు పొందిన మూడు క్రికెట్‌ రూపాల్లో ఒకటి.

ట్వంటీ20
లండన్‌లోని లార్డ్స్‌లో జరిగిన 2009 T20 ప్రపంచకప్ ఫైనల్‌లో షాహిద్ అఫ్రిదికి లసిత్ మలింగ బౌలింగ్ చేశాడు.

ఒక సాధారణ ట్వంటీ20 గేమ్ దాదాపు రెండున్నర గంటల్లో పూర్తవుతుంది. ఒక్కో ఇన్నింగ్స్ దాదాపు 70 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఇన్నింగ్స్ మధ్య అధికారికంగా 10 నిమిషాల విరామం ఉంటుంది. ఇది ఆట యొక్క మునుపటి రూపాల కంటే చాలా చిన్నది, ఫుట్‌బాల్ వంటి జనాదరణ పొందిన ఇతర జట్టు క్రీడల సమయ వ్యవధికి దగ్గరగా ఉంటుంది. గ్రౌండ్‌లోని ప్రేక్షకులకు, టెలివిజన్‌లోని వీక్షకులకూ ఆకర్షణీయంగా ఉండే వేగవంతమైన గేమ్‌ను రూపొందించడానికి దీన్ని ప్రవేశపెట్టారు.

క్రికెట్ ఆట ప్రపంచమంతటా విస్తరింపజేయడంలో ఈ గేమ్ విజయవంతమైంది. చాలా అంతర్జాతీయ పర్యటనలలో కనీసం ఒక ట్వంటీ20 మ్యాచ్ అయినా ఉంటోంది. టెస్ట్ ఆడే దేశాలన్నిటి లోనూ దేశీయంగా ఒక టీట్వంటీ పోటీ ఉంది.

చరిత్ర

మూలాలు

ట్వంటీ20 
సర్రేపై మిడిల్‌సెక్స్ తరపున బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మెన్ ఆండ్రూ స్ట్రాస్

2002లో బెన్సన్ అండ్ హెడ్జెస్ కప్ ముగిసినప్పుడు, దాని స్థానంలో మరొక వన్డే పోటీని నిర్వహించాల్సిన అవసరం ECB కి ఏర్పడింది. తగ్గిపోతున్న ప్రేక్షకులు, తగ్గిన స్పాన్సర్‌షిప్‌కు ప్రతిస్పందనగా యువతరంలో క్రికెట్ ఆటకు ప్రజాదరణను పెంచాలని అది భావించింది. గతం లోని సుదీర్ఘమైన ఆట రూపాలతో విసుగు చెంది ఆటకు దూరమైన వేలాది మంది అభిమానులకు వేగవంతమైన, ఉత్తేజకరమైన క్రికెట్‌ను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో టీ20ని ప్రవేశపెట్టారు. ECB మార్కెటింగ్ మేనేజర్ స్టూవర్ట్ రాబర్ట్‌సన్, 2001లో కౌంటీ ఛైర్మన్‌లకు 20-ఓవర్-ఇన్నింగ్స్ గేమ్‌ను ప్రతిపాదించాడు. వారు కొత్త ఫార్మాట్‌ను స్వీకరించడానికి అనుకూలంగా 11–7తో ఓటు వేశారు.

ట్వంటీ 20 కప్‌లో ఇంగ్లీష్ కౌంటీల మధ్య 2003 జూన్ 13 న మొదటి అధికారిక ట్వంటీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇంగ్లాండ్‌లో జరిగిన ట్వంటీ20 మొదటి సీజన్ సాపేక్షంగా విజయవంతమైంది. ఫైనల్‌లో సర్రే లయన్స్ వార్విక్‌షైర్ బేర్స్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. లార్డ్స్‌లో 2004 జూలై 15 న మిడిల్‌సెక్స్, సర్రేల మధ్య జరిగిన మొదటి ట్వంటీ20 మ్యాచ్‌కు 27,509 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. 1953 తరువాత ఒక వన్డే ఫైనల్ కాకుండా ఆ మైదానంలో జరిగిన ఏ కౌంటీ క్రికెట్ మ్యాచికి కూడా ఇంతమంది ప్రేక్షకులు రాలేదు.

ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది

2004లో పాకిస్తాన్ ప్రారంభ పోటీలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 13 జట్లు పాల్గొన్నాయి. ఫైసలాబాద్ వుల్వ్స్ మొదటి విజేతలుగా నిలిచింది. 2005 జనవరి 12 న ఆస్ట్రేలియాలో మొదటి ట్వంటీ20 ఆట WACA గ్రౌండ్‌లో వెస్ట్రన్ వారియర్స్, విక్టోరియన్ బుష్రేంజర్స్ మధ్య జరిగింది. ఇది 20,000 మందిని ఆకర్షించింది. ఇంతమంది ఆటను చూడడం, దాదాపు 25 సంవత్సరాల తరువాత ఇదే మొదటిసారి.

2006 జూలై 11 నుండి, 19 వెస్టిండీస్ ప్రాంతీయ జట్లు స్టాన్‌ఫోర్డ్ 20/20 టోర్నమెంట్‌లో పోటీ పడ్డాయి. ఈ ఈవెంట్‌కు బిలియనీర్ అలెన్ స్టాన్‌ఫోర్డ్ ఆర్థికంగా మద్దతు ఇచ్చాడు. అతను కనీసం 2.8 కోట్ల డాలర్ల నిధులను అందించాడు. టోర్నమెంట్‌ను వార్షిక ఈవెంట్‌గా నిర్వహించాలని భావించారు. ప్రారంభ ఈవెంట్‌లో గయానా, ట్రినిడాడ్ టొబాగోను ఐదు వికెట్ల తేడాతో ఓడించి US$ 10 లక్షల ప్రైజ్ మనీని పొందింది.

T20 లీగ్‌లు

ట్వంటీ20 
భారతదేశంలోని హైదరాబాద్‌లో 2015 IPL సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో ప్రేక్షకులు

2007 ICC వరల్డ్ ట్వంటీ20 ప్రజాదరణ పొందిన తర్వాత అనేక T20 లీగ్‌లు ప్రారంభమయ్యాయి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ని ప్రారంభించింది. ఇప్పుడది అతిపెద్ద క్రికెట్ లీగ్‌. ప్రధాన భారతీయ నగరాల్లో పది జట్లతో ఇది ఇది నార్త్ అమెరికన్ స్పోర్ట్స్ ఫ్రాంచైజ్ సిస్టమ్‌ను ఉపయోగించుకుంటుంది. 2017 సెప్టెంబరులో, తదుపరి ఐదు సంవత్సరాల (2018–2022) IPL ప్రసార, డిజిటల్ హక్కులను US$2.55 బిలియన్లకు స్టార్ ఇండియాకు విక్రయించారు. ఆ విధంగా, ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన స్పోర్ట్స్ లీగ్‌లో ఒకటిగా IPL నిలిచింది. గ్లోబల్ వాల్యుయేషన్, కార్పొరేట్ ఫైనాన్స్ అడ్వైజర్ డఫ్ & ఫెల్ప్స్ ప్రకారం, 10వ ఎడిషన్ తర్వాత IPL బ్రాండ్ విలువ US$5.3 బిలియన్లకు పెరిగింది.

ఆ తర్వాత ఇదే విధమైన సూత్రాలను అనుసరించి బిగ్ బాష్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ లు ప్రారంభమై, అభిమానుల ఆదరణ పొందాయి. 2015లో క్రికెట్ ఆస్ట్రేలియా మహిళల బిగ్ బాష్ లీగ్‌ను ప్రారంభించగా, 2016లో ఇంగ్లాండ్, వేల్స్‌లో కియా సూపర్ లీగ్ ప్రారంభమైంది. 2018లో దక్షిణాఫ్రికాలో మజాన్సి సూపర్ లీగ్ ప్రారంభమైంది.

అనేక T20 లీగ్‌లు గ్రూప్ స్టేజ్‌ని కలిగి ఉండే సాధారణ ఆకృతిని అనుసరిస్తాయి, తర్వాత మొదటి నాలుగు జట్లలో పేజ్ ప్లేఆఫ్ సిస్టమ్ ఉంటుంది:

  • గ్రూప్ దశలో మొదటి, రెండవ స్థానాల్లో ఉన్న జట్లు తలపడతాయి, విజేతలు ఫైనల్‌కు వెళతారు.
  • మూడవ, నాల్గవ స్థానంలో ఉన్న జట్లు తలపడతాయి, ఓడిపోయిన వారు తొలగించబడతారు.
  • పై రెండు మ్యాచ్‌లు ముగిశాక ఇంకా ఫైనల్‌కు చేరుకోని రెండు జట్లు ఫైనల్‌లో రెండో బెర్త్‌ను భర్తీ చేసేందుకు తలపడతాయి.

బిగ్ బాష్ లీగ్‌లో, నాల్గవ లేదా ఐదవ స్థానంలో ఉన్న జట్లలో ఏది టాప్ ఫోర్‌లో ఉండటానికి అర్హత సాధిస్తుందో నిర్ణయించడానికి అదనంగా ఒక మ్యాచ్ ఉంటుంది.

ట్వంటీ20 ఇంటర్నేషనల్స్

మొదటి ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచ్ 2004 ఆగస్టు 5 న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌ను న్యూజిలాండ్ తొమ్మిది పరుగుల తేడాతో గెలిచింది.

2005 ఫిబ్రవరి 17 న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరిగిన మొదటి పురుషుల అంతర్జాతీయ ట్వంటీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ పోటీని సరదాగా ఆడారు - రెండు జట్లూ 1980లలో ధరించిన కిట్‌ను ధరించారు. న్యూజిలాండ్ జట్టు, బీజ్ బ్రిగేడ్ ధరించిన దాన్ని కాపీ చేసింది. కొంతమంది ఆటగాళ్ళు 1980లలో మీసాలు, గడ్డాలు లాంటి కేశాలంకరణకు ప్రసిద్ధి చెందారు, బీజ్ బ్రిగేడ్ అభ్యర్థన మేరకు "బెస్ట్ రెట్రో లుక్" కోసం తమలో తాము ఒక పోటీలో పాల్గొన్నారు. ఆస్ట్రేలియా గేమ్‌ను గెలుచుకుంది. న్యూజీల్యాండ్‌ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఫలితం స్పష్టంగా కనిపించడంతో, ఆటగాళ్ళు, అంపైర్లు మిగతా ఆటను పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు: గ్లెన్ మెక్‌గ్రాత్ 1981 ODI నుండి ట్రెవర్ చాపెల్, బిల్లీ బౌడెన్ మధ్య జరిగిన ఒక అండర్ ఆర్మ్ సంఘటనను సరదాగా రీప్లే చేశాడు. ప్రతిస్పందనగా అతనికి మాక్ రెడ్ కార్డ్ (క్రికెట్‌లో రెడ్ కార్డ్‌లు సాధారణంగా ఉపయోగించబడవు) చూపించాడు.

ఇంగ్లాండ్‌లో మొదటి ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచ్ 2005 జూన్ 13 న హాంప్‌షైర్‌లోని రోజ్ బౌల్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మధ్య జరిగింది. ఇందులో ఇంగ్లండ్ 100 పరుగుల తేడాతో గెలిచింది. 2007 వరకు కొనసాగిన రికార్డు విజయం ఇది.

2006 జనవరి 9 న ఆస్ట్రేలియాలో జరిగిన మొదటి అంతర్జాతీయ ట్వంటీ20 ఆటలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు తలపడ్డాయి. మొదటగా, ప్రతి క్రీడాకారుడి ఇంటిపేరు కాకుండా అతని మారుపేరును అతని యూనిఫాం వెనుక వేసారు. గబ్బాలో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌కు 38,894 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.

2006 ఫిబ్రవరి 16 న న్యూజిలాండ్ టై బ్రేకింగ్ బౌల్ అవుట్‌లో 3-0తో వెస్టిండీస్‌ను ఓడించింది; ఆటలో మొదట రెండు జట్లూ చెరొక 126 పరుగులు సాధించాయి. ఈ గేమ్ క్రిస్ కెయిర్న్స్ ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్.

ICC T20ని ఆటను ప్రపంచీకరించడానికి సరైన ఫార్మాట్‌గా ప్రకటించింది. 2018లో, దాని సభ్య దేశాల మధ్య జరిగే అన్ని T20 క్రికెట్ మ్యాచ్‌లకు అంతర్జాతీయ హోదాను ఇస్తామని ప్రకటించింది. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఆడిన T20 మ్యాచ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ట్వంటీ20 ప్రపంచ కప్

ప్రతి రెండు సంవత్సరాలకు ఒక ICC వరల్డ్ ట్వంటీ 20 టోర్నమెంట్ జరగాలి, అదే సంవత్సరంలో ICC క్రికెట్ ప్రపంచ కప్ షెడ్యూల్ చేసి ఉంటే తప్ప. అలాంటి సందర్భంలో దాని ముందు సంవత్సరం నిర్వహిస్తారు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టోర్నీలో ఫైనల్‌లో భారత్ పాకిస్థాన్‌ను ఓడించింది. మొదటి టోర్నమెంట్‌లో రెండు అసోసియేట్ జట్లు ఆడాయి. 2007 ICC వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ వన్ 50 ఓవర్ల పోటీ ద్వారా ఎంపిక చేయబడింది. 2007 డిసెంబరులో జట్లను మెరుగ్గా సన్నద్ధం చేసేందుకు 20 ఓవర్ల ఫార్మాట్‌తో క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయించారు. పాల్గొనే ఆరుగురిలో, ఇద్దరు 2009 వరల్డ్ ట్వంటీ20 కి అర్హత సాధిస్తారు. ఒక్కొక్కరు $250,000 ప్రైజ్ మనీని అందుకుంటారు. 2009 జూన్ 21 న ఇంగ్లాండ్‌లో శ్రీలంకను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన పాకిస్థాన్, రెండో టోర్నమెంట్‌ను గెలుచుకుంది. 2010 ICC వరల్డ్ ట్వంటీ 20 టోర్నమెంట్ 2010 మేలో వెస్టిండీస్‌లో జరిగింది. ఇక్కడ ఇంగ్లాండ్ ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. 2012 ICC వరల్డ్ ట్వంటీ20 ఫైనల్స్‌లో శ్రీలంకను ఓడించి వెస్టిండీస్ గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆసియా దేశంలో జరగడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. 2014 ICC వరల్డ్ ట్వంటీ 20 బంగ్లాదేశ్‌లో జరిగిన టోర్నమెంట్ ఫైనల్స్‌లో భారత్‌ను ఓడించి శ్రీలంక గెలుచుకుంది. 2016 ICC వరల్డ్ ట్వంటీ 20 ని వెస్టిండీస్ గెలుచుకుంది. 2020 జూలైలో, COVID-19 మహమ్మారి కారణంగా 2020, 2021 ఎడిషన్‌లను ఒక సంవత్సరం వాయిదా వేసినట్లు ICC ప్రకటించింది.

2021 జూన్‌లో ICC, 2024 ఎడిషన్ ట్వంటీ 20 ప్రపంచ కప్‌ను 16 నుండి 20 జట్లకు విస్తరించింది.

ట్వంటీ20 
ట్వంటీ 20 మ్యాచ్‌లలో కొన్ని ఉత్తేజకరమైన ప్రదర్శనలు ఉంటాయి - ఉదా: బ్యాట్స్‌మెన్ రనౌట్ అయిన సందర్భాల్లో

ట్వంటీ20 వలన క్రికెట్ ఆట మరింత అథ్లెటిక్ రూపానికి, విస్ఫోటక క్రికెట్ రూపానికీ దారితీసిందని పేర్కొన్నారు. భారత ఫిట్‌నెస్ కోచ్ రామ్‌జీ శ్రీనివాసన్ భారతీయ ఫిట్‌నెస్ వెబ్‌సైట్ Takath.comకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్వంటీ 20 ఆటగాళ్లందరికీ ఫిట్‌నెస్ స్థాయిల పరంగా "ప్రమాణాలను పెంచింది" అని ప్రకటించాడు. ఆటగాళ్లందరూ, జట్టులో పాత్ర ఏమిటి అనేదానితో సంబంధం లేకుండా అధిక స్థాయి బలం, వేగం, చురుకుదనం, ప్రతిచర్య సమయం చూపించాల్సి వచ్చింది. మాథ్యూ హేడెన్, ఆటలో తన ప్రదర్శనతో పాటు, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అవసరమైన ఫిట్‌నెస్‌ లేనందున తాను అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నానని ప్రకటించాడు.

మరోవైపు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ట్వంటీ 20 టెస్టు క్రికెట్‌కు హానికరమని, బ్యాట్స్‌మెన్ స్కోరింగ్ నైపుణ్యాలు, ఏకాగ్రతను దెబ్బతీస్తుందని విమర్శించాడు. ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ కూడా ఇలాంటి ఫిర్యాదులే చేసాడు. యువ ఆటగాళ్ళు చాలా T20 ఆడుతారని, వారి బ్యాటింగ్ నైపుణ్యాలను పూర్తిగా అభివృద్ధి చేసుకోలేరని అతను భయపడ్డాడు. మాజీ ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ ట్యూడర్ బౌలర్లకు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందని భయపడ్డాడు.

వెస్టిండీస్ మాజీ కెప్టెన్లు క్లైవ్ లాయిడ్, మైఖేల్ హోల్డింగ్, గార్ఫీల్డ్ సోబర్స్లు ట్వంటీ 20 వలన ఆటగాళ్ళు తమ జాతీయ టెస్ట్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించకుండా ఆటగాళ్లను నిరుత్సాహపరుస్తోందని విమర్శించారు. క్రిస్ గేల్, సునీల్ నరైన్, డ్వేన్ బ్రావో వంటి చాలా మంది వెస్టిండీస్ ఆటగాళ్లు ఏ ఇతర ఫార్మాటు కన్నా చాలా ఎక్కువ డబ్బు సంపాదించగలిగే ట్వంటీ 20 ఫ్రాంచైజీలో ఆడటానికే ఇష్టపడుతున్నారు.

ఆట పద్ధతి, నియమాలు

పద్ధతి

ట్వంటీ20 మ్యాచ్ అనేది పరిమిత ఓవర్ల క్రికెట్ యొక్క ఒక రూపం. దీనిలోనూ రెండు జట్లు ఉంటాయి, ఒక్కొక్కటి ఒకే ఇన్నింగ్స్‌ ఆడతాయి. ప్రధాన లక్షణం ఏమిటంటే, ప్రతి జట్టు గరిష్ఠంగా 20 ఓవర్లు (120 లీగల్ బంతులు) బ్యాటింగ్ చేస్తుంది. బ్యాటింగ్ జట్టు సభ్యులు సాంప్రదాయిక డ్రెస్సింగ్ రూమ్‌ల నుండి రావడం అక్కడికే పోవడం ఉండదు. ఫుట్‌బాల్ అసోసియేషన్ యొక్క సాంకేతిక ప్రాంతం లేదా బేస్ బాల్ డగౌట్‌తో సమానంగా ఉండే ప్లేయింగ్ అరేనాలో కనిపించే బెంచి పైన (సాధారణంగా కుర్చీల వరుస) కూర్చుంటారు. అక్కడి నుంచే వస్తారు, అక్కడికే తిరిగి వెళ్తారు.

ట్వంటీ20 
28,000 మంది ప్రేక్షకుల సమక్షంలో మిడిల్‌సెక్స్ లార్డ్స్‌లో సర్రేతో ఆడుతోంది.

సాధారణ నియమాలు

సాధారణ క్రికెట్ నియమాలన్నీ ట్వంటీ20కి వర్తిస్తాయి. కొన్ని ముఖ్యమైన మినహాయింపులున్నాయి. అవి:

  • ఒక్కో బౌలర్ ఒక్కో ఇన్నింగ్స్‌లో గరిష్ఠంగా ఐదవ వంతు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయవచ్చు. పూర్తి, అంతరాయం లేని మ్యాచిలో ఇది నాలుగు ఓవర్లు.
  • ఒక బౌలర్ క్రీజును అధిగమించి నో-బాల్‌ను వేస్తే, దానికి ఒకటి లేదా రెండు పరుగులు (పోటీని బట్టి) జరిమానా విధిస్తారు. అతని తదుపరి డెలివరీని "ఫ్రీ-హిట్" అంటారు. ఈ బంతికి బ్యాటర్ కేవలం రన్ అవుట్ ద్వారా, బంతిని రెండుసార్లు కొట్టడం లేదా ఫీల్డ్‌ను అడ్డుకోవడం ద్వారా మాత్రమే ఔట్ అవుతాడు.
  • కింది ఫీల్డింగ్ పరిమితులు వర్తిస్తాయి:
    • ఏ సమయంలోనైనా ఐదుగురు కంటే ఎక్కువ ఫీల్డర్లు లెగ్ సైడ్‌లో ఉండకూడదు.
    • మొదటి ఆరు ఓవర్లలో, గరిష్ఠంగా ఇద్దరు ఫీల్డర్లు 30-గజాల సర్కిల్ వెలుపల ఉండవచ్చు (దీనినే పవర్‌ప్లే అంటారు).
    • మొదటి ఆరు ఓవర్ల తర్వాత, ఫీల్డింగ్ సర్కిల్ వెలుపల గరిష్ఠంగా ఐదుగురు ఫీల్డర్లు ఉండవచ్చు.
  • ఫీల్డింగ్ జట్టు తమ 20వ ఓవర్‌ను 75 నిమిషాలలోపు వేయడం ప్రారంభించకపోతే, 75 నిమిషాల తర్వాత వేసిన ప్రతి ఓవర్‌కు అదనంగా ఆరు పరుగులు బ్యాటింగ్ చేసే జట్టుకు ఇస్తారు. బ్యాటింగ్ చేసే జట్టు సమయాన్ని వృధా చేస్తోందని అంపైర్ విశ్వసిస్తే, ఈ జరిమానా సమయాన్ని పెంచవచ్చు.

అంతర్జాతీయ

మహిళల, పురుషుల ట్వంటీ20 ఇంటర్నేషనల్‌లు వరుసగా 2004, 2005 లలో మొదలయ్యాయి. ఈ రోజు వరకు, అన్ని టెస్టులు ఆడే దేశాలతో సహా 76 దేశాలు ఈ ఫార్మాట్‌ను ఆడాయి.

దేశం పురుషుల T20I మొదలు స్త్రీల T20I మొదలు
ట్వంటీ20  ఆస్ట్రేలియా 2005 ఫిబ్రవరి 17 2005 సెప్టెంబరు 2
ట్వంటీ20  న్యూజీలాండ్ 2005 ఫిబ్రవరి 17 2004 ఆగస్టు 5
ట్వంటీ20  ఇంగ్లాండు 2005 జూన్ 13 2004 ఆగస్టు 5
ట్వంటీ20  దక్షిణాఫ్రికా 2005 అక్టోబరు 21 2007 ఆగస్టు 10
ట్వంటీ20  వెస్ట్ ఇండీస్ 2006 ఫిబ్రవరి 16 2008 జూన్ 27
ట్వంటీ20  శ్రీలంక 2006 జూన్ 15 2009 జూన్ 12
ట్వంటీ20  పాకిస్తాన్ 2006 ఆగస్టు 28 2009 మే 25
ట్వంటీ20  బంగ్లాదేశ్ 2006 నవంబరు 28 2012 ఆగస్టు 27
ట్వంటీ20  జింబాబ్వే 2006 నవంబరు 28 2019 జనవరి 5
ట్వంటీ20  భారతదేశం 2006 డిసెంబరు 1 2006 ఆగస్టు 5
ట్వంటీ20  కెన్యా 2007 సెప్టెంబరు 1 2019 ఏప్రిల్ 6
ట్వంటీ20  స్కాట్‌లాండ్ 2007 సెప్టెంబరు 12 2018 జూలై 7
ట్వంటీ20  నెదర్లాండ్స్ 2008 ఆగస్టు 2 2008 జూన్ 27
ట్వంటీ20  ఐర్లాండ్ 2008 ఆగస్టు 2 2008 జూన్ 27
ట్వంటీ20  కెనడా 2008 ఆగస్టు 2 2019 మే 17
ట్వంటీ20  బెర్ముడా 2008 ఆగస్టు 3
ట్వంటీ20  ఆఫ్ఘనిస్తాన్ 2010 ఫిబ్రవరి 2
ట్వంటీ20  నేపాల్ 2014 మార్చి 16 2019 జనవరి 12
ట్వంటీ20  హాంగ్‌కాంగ్ 2014 మార్చి 16 2019 జనవరి 12
ట్వంటీ20  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2014 మార్చి 17 2018 జూలై 7
ట్వంటీ20  పపువా న్యూగినియా 2015 జూలై 15 2018 జూలై 7
ట్వంటీ20  ఒమన్ 2015 జూలై 25 2020 జనవరి 17
ట్వంటీ20  సియెర్రా లియోన్ 2021 అక్టోబరు 19 2018 ఆగస్టు 20
ట్వంటీ20  లెసోతో 2021 అక్టోబరు 16 2018 ఆగస్టు 20
ట్వంటీ20  దక్షిణ కొరియా 2022 అక్టోబరు 9 2018 నవంబరు 3
ట్వంటీ20  చైనా 2018 నవంబరు 3
ట్వంటీ20  ఇండోనేషియా 2022 అక్టోబరు 9 2019 జనవరి 12
ట్వంటీ20  మయన్మార్ 2019 జనవరి 12
ట్వంటీ20  భూటాన్ 2019 డిసెంబరు 5 2019 జనవరి 13
ట్వంటీ20  బహ్రెయిన్ 2019 జనవరి 20 2022 మార్చి 20
ట్వంటీ20  సౌదీ అరేబియా 2019 జనవరి 20 2022 మార్చి 20
ట్వంటీ20  కువైట్ 2019 జనవరి 20 2019 ఫిబ్రవరి 18
ట్వంటీ20  మాల్దీవులు 2019 జనవరి 20 2019 డిసెంబరు 2
ట్వంటీ20  ఖతార్ 2019 జనవరి 21 2020 జనవరి 17
ట్వంటీ20  రువాండా 2021 ఆగస్టు 18 2019 జనవరి 26
ట్వంటీ20  United States 2019 మార్చి 15 2019 మే 17
ట్వంటీ20  ఫిలిప్పీన్స్ 2019 మార్చి 22 2019 డిసెంబరు 21
ట్వంటీ20  Vanuatu 2019 మార్చి 22 2019 మే 6
ట్వంటీ20  స్పెయిన్ 2019 మార్చి 29 2022 మే 5
ట్వంటీ20  మాల్టా 2019 మార్చి 29 2022 ఆగస్టు 27
ట్వంటీ20  మెక్సికో 2019 ఏప్రిల్ 25 2018 ఆగస్టు 23
ట్వంటీ20  బెలిజ్ 2019 ఏప్రిల్ 25 2019 డిసెంబరు 13
ట్వంటీ20  కోస్టారికా 2019 ఏప్రిల్ 25 2019 ఏప్రిల్ 26
ట్వంటీ20  పనామా 2019 ఏప్రిల్ 25
ట్వంటీ20  జపాన్ 2022 అక్టోబరు 9 2019 మే 6
ట్వంటీ20  ఫిజీ 2022 సెప్టెంబరు 9 2019 మే 6
ట్వంటీ20  Tanzania 2021 నవంబరు 2 2019 మే 6
ట్వంటీ20  బెల్జియం 2019 మే 11 2021 సెప్టెంబరు 25
ట్వంటీ20  జర్మనీ 2019 మే 11 2019 జూన్ 26
ట్వంటీ20  ఉగాండా 2019 మే 20 2018 జూలై 7
ట్వంటీ20  నైజీరియా 2019 మే 20 2019 జనవరి 26
ట్వంటీ20  ఘనా 2019 మే 20 2022 మార్చి 28
ట్వంటీ20  నమీబియా 2019 మే 20 2018 ఆగస్టు 20
ట్వంటీ20  Botswana 2019 మే 20 2018 ఆగస్టు 20
ట్వంటీ20  ఇటలీ 2019 మే 25 2021 ఆగస్టు 9
ట్వంటీ20  గ్వెర్న్సీ 2019 మే 31 2019 మే 31
ట్వంటీ20  జెర్సీ 2019 మే 31 2019 మే 31
ట్వంటీ20  నార్వే 2019 జూన్ 15 2019 జూలై 31
ట్వంటీ20  డెన్మార్క్ 2019 జూన్ 16 2022 మే 28
ట్వంటీ20  మాలి (దేశం) 2019 జూన్ 18
ట్వంటీ20  మలేషియా 2019 జూన్ 24 2018 జూన్ 3
ట్వంటీ20  థాయిలాండ్ 2019 జూన్ 24 2018 జూన్ 3
ట్వంటీ20  సమోవా 2019 జూలై 8 2019 మే 6
ట్వంటీ20  ఫిన్లాండ్ 2019 జూలై 13
ట్వంటీ20  సింగపూర్ 2019 జూలై 22 2018 ఆగస్టు 9
ట్వంటీ20  ఫ్రాన్స్ 2021 ఆగస్టు 5 2019 జూలై 31
ట్వంటీ20  కేమన్ ఐలాండ్స్ 2019 ఆగస్టు 18
ట్వంటీ20  ఆస్ట్రియా 2019 ఆగస్టు 29 2019 జూలై 31
ట్వంటీ20  రొమేనియా 2019 ఆగస్టు 29 2022 ఆగస్టు 27
ట్వంటీ20  లక్సెంబర్గ్ 2019 ఆగస్టు 29
ట్వంటీ20  టర్కీ 2019 ఆగస్టు 29
ట్వంటీ20  చెక్ రిపబ్లిక్ 2019 ఆగస్టు 30
ట్వంటీ20  అర్జెంటీనా 2019 అక్టోబరు 3 2019 అక్టోబరు 3
ట్వంటీ20  బ్రెజిల్ 2019 అక్టోబరు 3 2018 ఆగస్టు 23
ట్వంటీ20  చిలీ 2019 అక్టోబరు 3 2018 ఆగస్టు 23
ట్వంటీ20  పెరూ 2019 అక్టోబరు 3 2019 అక్టోబరు 3
ట్వంటీ20  బల్గేరియా 2019 అక్టోబరు 14
ట్వంటీ20  సెర్బియా 2019 అక్టోబరు 14 2022 సెప్టెంబరు 10
ట్వంటీ20  గ్రీస్ 2019 అక్టోబరు 15 2022 సెప్టెంబరు 9
ట్వంటీ20  పోర్చుగల్ 2019 అక్టోబరు 25
ట్వంటీ20  జిబ్రాల్టర్ 2019 అక్టోబరు 26
ట్వంటీ20  మలావి 2019 నవంబరు 6 2018 ఆగస్టు 20
ట్వంటీ20  మొజాంబిక్ 2019 నవంబరు 6 2018 ఆగస్టు 20

T20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్

2011 నవంబరులో, టెస్ట్, ODI ర్యాంకింగ్‌ల మాదిరిగానే అదే విధానం ఆధారంగా పురుషుల ఆట కోసం ICC మొదటి ట్వంటీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. ర్యాంకింగ్‌లు రెండు నుండి మూడు సంవత్సరాల వ్యవధిని కవర్ చేస్తాయి, ఇటీవలి ఆగస్టు 1 నుండి జరిగిన మ్యాచ్‌లకు వెయిటేజీ పూర్తిగా ఇవ్వగా, అంతకు ముందరి 12 నెలల్లో జరిగిన మ్యాచ్‌లకు మూడింట రెండు వంతుల వెయిటేజి ఇచ్చారు. దానికి ముందరి 12 నెలల్లో ఆడిన మ్యాచ్‌లకు మూడింట ఒక వంతు వెయిటేజీ ఉంటుంది. ర్యాంకింగ్స్‌కు అర్హత సాధించాలంటే, ర్యాంకింగ్ వ్యవధిలో జట్లు కనీసం ఎనిమిది ట్వంటీ20 ఇంటర్నేషనల్‌లు ఆడి ఉండాలి.

ICC Men's T20I Team Rankings
Rank Team Matches Points Rating
1 ట్వంటీ20  భారతదేశం 60 16,112 269
2 ట్వంటీ20  ఇంగ్లాండు 47 12,402 264
3 ట్వంటీ20  పాకిస్తాన్ 53 13,649 258
4 ట్వంటీ20  దక్షిణాఫ్రికా 41 10,510 256
5 ట్వంటీ20  న్యూజీలాండ్ 47 11,927 254
6 ట్వంటీ20  ఆస్ట్రేలియా 47 11,784 251
7 ట్వంటీ20  వెస్ట్ ఇండీస్ 51 12,039 236
8 ట్వంటీ20  శ్రీలంక 50 11,732 235
9 ట్వంటీ20  బంగ్లాదేశ్ 51 11,328 222
10 ట్వంటీ20  ఆఫ్ఘనిస్తాన్ 30 6,512 217
11 ట్వంటీ20  జింబాబ్వే 46 8,976 195
12 ట్వంటీ20  ఐర్లాండ్ 54 10,282 190
13 ట్వంటీ20  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 29 5,298 183
14 ట్వంటీ20  నమీబియా 32 5,846 183
15 ట్వంటీ20  స్కాట్‌లాండ్ 24 4,373 182
16 ట్వంటీ20  నేపాల్ 30 5,387 180
17 ట్వంటీ20  నెదర్లాండ్స్ 32 5,668 177
18 ట్వంటీ20  ఒమన్ 19 3,238 170
19 ట్వంటీ20  పపువా న్యూగినియా 24 3,495 146
20 ట్వంటీ20  కెనడా 17 2,176 128
21 ట్వంటీ20  హాంగ్‌కాంగ్ 20 2,555 128
22 ట్వంటీ20  జెర్సీ 23 2,924 127
23 ట్వంటీ20  ఖతార్ 13 1,643 126
24 ట్వంటీ20  ఉగాండా 36 4,359 121
25 ట్వంటీ20  కువైట్ 18 2,153 120
26 ట్వంటీ20  United States 16 1,908 119
27 ట్వంటీ20  సింగపూర్ 21 2,416 115
28 ట్వంటీ20  మలేషియా 28 2,979 106
29 ట్వంటీ20  కెన్యా 26 2,699 104
30 ట్వంటీ20  Tanzania 19 1,874 99
31 ట్వంటీ20  బహ్రెయిన్ 16 1,533 96
32 ట్వంటీ20  సౌదీ అరేబియా 6 562 94
33 ట్వంటీ20  ఇటలీ 18 1,685 94
34 ట్వంటీ20  జర్మనీ 34 2,996 88
35 ట్వంటీ20  బెర్ముడా 12 1,053 88
36 ట్వంటీ20  స్పెయిన్ 20 1,661 83
37 ట్వంటీ20  డెన్మార్క్ 21 1,518 72
38 ట్వంటీ20  గ్వెర్న్సీ 17 1,194 70
39 ట్వంటీ20  ఐల్ ఆఫ్ మ్యాన్ 10 678 68
40 ట్వంటీ20  బెల్జియం 20 1,349 67
41 ట్వంటీ20  కేమన్ ఐలాండ్స్ 8 529 66
42 ట్వంటీ20  ఆస్ట్రియా 26 1,686 65
43 ట్వంటీ20  నైజీరియా 23 1,482 64
44 ట్వంటీ20  Botswana 12 771 64
45 ట్వంటీ20  Vanuatu 11 645 59
46 ట్వంటీ20  పోర్చుగల్ 11 644 59
47 ట్వంటీ20  రొమేనియా 24 1,359 57
48 ట్వంటీ20  నార్వే 17 897 53
49 ట్వంటీ20  ఫిన్లాండ్ 17 891 52
50 ట్వంటీ20  ఫ్రాన్స్ 9 470 52
51 ట్వంటీ20  అర్జెంటీనా 9 435 48
52 ట్వంటీ20  మలావి 12 534 45
53 ట్వంటీ20  Sweden 16 690 43
54 ట్వంటీ20  ఘనా 16 661 41
55 ట్వంటీ20  కుక్ ఐలాండ్స్ 6 245 41
56 ట్వంటీ20  చెక్ రిపబ్లిక్ 28 1,137 41
57 ట్వంటీ20   స్విట్జర్లాండ్ 11 396 41
58 ట్వంటీ20  ఇండోనేషియా 7 265 38
59 ట్వంటీ20  మాల్టా 33 1,179 36
60 ట్వంటీ20  జపాన్ 7 236 34
61 ట్వంటీ20  లక్సెంబర్గ్ 23 774 34
62 ట్వంటీ20  సియెర్రా లియోన్ 10 331 33
63 ట్వంటీ20  భూటాన్ 8 239 30
64 ట్వంటీ20  ఫిజీ 6 177 30
65 ట్వంటీ20  సైప్రస్ 11 283 26
66 ట్వంటీ20  బహామాస్ 11 260 24
67 ట్వంటీ20  హంగరీ 16 358 22
68 ట్వంటీ20  మొజాంబిక్ 16 357 22
69 ట్వంటీ20  బెలిజ్ 6 132 22
70 ట్వంటీ20  పనామా 6 125 21
71 ట్వంటీ20  రువాండా 15 236 16
72 ట్వంటీ20  సెర్బియా 17 184 11
73 ట్వంటీ20  Seychelles 6 54 9
74 ట్వంటీ20  బల్గేరియా 34 296 9
75 ట్వంటీ20  మాల్దీవులు 15 81 5
76 ట్వంటీ20  సమోవా 8 42 5
77 ట్వంటీ20  జిబ్రాల్టర్ 21 68 3
78 ట్వంటీ20  గ్రీస్ 9 27 3
79 ట్వంటీ20  థాయిలాండ్ 10 0 0
80 ట్వంటీ20  ఈశ్వతిని 12 0 0
81 ట్వంటీ20  టర్కీ 6 0 0
82 ట్వంటీ20  లెసోతో 6 0 0
83 ట్వంటీ20  ఎస్టోనియా 12 0 0
84 ట్వంటీ20  కామెరూన్ 7 0 0
References: ICC T20I rankings, ESPNcricinfo, As of 6 November 2022
"Matches" is the number of matches played in the 12–24 months since the May before last, plus half the number in the 24 months before that.

మూలాలు

Tags:

ట్వంటీ20 చరిత్రట్వంటీ20 ఆట పద్ధతి, నియమాలుట్వంటీ20 అంతర్జాతీయట్వంటీ20 మూలాలుట్వంటీ20క్రికెట్

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతదేశ పంచవర్ష ప్రణాళికలుభాషా భాగాలుతెలుగు సినిమాలు 2024ఆరూరి రమేష్నానాజాతి సమితితెలుగుషణ్ముఖుడుగొట్టిపాటి రవి కుమార్శాసనసభఆర్యవైశ్య కుల జాబితాకాళోజీ నారాయణరావుకిలారి ఆనంద్ పాల్దేవికధనిష్ఠ నక్షత్రముఇంగువనందిగం సురేష్ బాబురాకేష్ మాస్టర్దగ్గుబాటి వెంకటేష్ఓం భీమ్ బుష్నువ్వు వస్తావనిఝాన్సీ లక్ష్మీబాయిగైనకాలజీనెమలిమహాసముద్రంప్రకటనబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికింజరాపు అచ్చెన్నాయుడుఆల్ఫోన్సో మామిడిభారత జాతీయ చిహ్నంతామర వ్యాధిడేటింగ్ఎయిడ్స్బొడ్రాయితొలిప్రేమహల్లులుతెలుగు భాష చరిత్రప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాసుందర కాండతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుసింధు లోయ నాగరికతసమ్మక్క సారక్క జాతరజయలలిత (నటి)తాన్యా రవిచంద్రన్గంగా నదిరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంతాజ్ మహల్మాచెర్ల శాసనసభ నియోజకవర్గంఅక్కినేని నాగార్జునఉదయకిరణ్ (నటుడు)హైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితావ్యతిరేక పదాల జాబితాకొంపెల్ల మాధవీలతగరుడ పురాణంబైండ్లవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)సోరియాసిస్గొట్టిపాటి నరసయ్యఅంగచూషణకస్తూరి రంగ రంగా (పాట)ఉలవలుబుర్రకథసంధ్యావందనంతిక్కనకొబ్బరిశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుఎనుముల రేవంత్ రెడ్డిఅల్లూరి సీతారామరాజురెడ్డి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుముదిరాజ్ (కులం)కాలుష్యంహైపర్ ఆదిఘిల్లిదేవుడుమానవ శరీరమునానార్థాలుశతభిష నక్షత్రము🡆 More