రాకేష్ మాస్టర్

రాకేష్ మాస్టర్ (1968 - 2023 జూన్ 18) భారతీయ సినిమా కొరియోగ్రాఫర్.

దాదాపు 300 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ఆయన అసలు పేరు ఎస్. రామారావు.

రాకేష్ మాస్టర్
జననం
సీనూరి రామారావు

1968
మరణం2023 జూన్ 18
వృత్తితెలుగు సినిమా కొరియోగ్రాఫర్
జీవిత భాగస్వామిసీనూరి లక్ష్మి
పిల్లలుచరణ్ తేజ, రిషిక

2020 సంవత్సరంలో గ్లోబల్ హ్యమన్ పీస్ యూనివర్సిటీ వారు సేవా రంగంలో రాకేష్ మాస్టర్‌కు డాక్టరేట్ ప్రకటించారు.

జీవిత విషయాలు

ఎస్. రామారావు 1968వ సంవత్సరంలో తిరుపతి ప్రాంతంలో జన్మించాడు. ఈయనకు నలుగురు అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. హైదరాబాద్‌లో ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం పనిచేశాడు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి వారికి శిక్షణ ఇచ్చాడు. వేణు, మణిచందన, ప్రభాస్, ప్రత్యూష మొదలైన సినీ నటులు రాకేష్ మాస్టర్ వద్ద శిక్షణను పొందారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు మొదలైన సినిమాలలోని పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఈటీవీ వేదికగా ప్రారంభమైన డ్యాన్స్ షో ఢీ లో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్‌గా వ్యవహరించాడు అదే విధంగా జబర్దస్త్ కామెడీ షోకి సంబంధించి పలు ఎపిసోడ్లలో పార్టిసిపెంట్‌గా కూడా పాల్గొన్నాడు ఆయన చాలామందికి సహాయం చేశారు

వివాదాలు

యూట్యూబ్ వేదికగా రాకేష్ మాస్టర్ అనేక వివాదాస్పద ఇంటర్వ్యూలు ఇచ్చాడు. రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి, ఎన్టీఆర్, బాలకృష్ణ, మోహన్ బాబు, చిరంజీవి, మంచు లక్ష్మి‌లను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. అలాగే పుల్లయ్య అనే పల్లెటూరి కుర్రాడికి రాకేష్ మాస్టర్ డ్యాన్స్‌లో కొన్నాళ్లు శిక్షణ ఇచ్చాడు. కానీ ఆ కుర్రాడు ఆ శిక్షణను మధ్యలోనే ముగించి, తన మాస్టర్ పైనే వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వార్త సోషల్ మీడియాలో సంచలనాన్ని రేకెత్తించింది. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ శ్రీకృష్ణుడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని చెబుతూ యాదవ సంఘ నాయకులు రాకేష్ మాస్టర్ పై మే 2021 నెలలో హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరణం

రాకేశ్‌ మాస్టర్‌ విశాఖలో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొని హైదరాబాద్‌ తిరిగొచ్చిన తరువాత అస్వస్థతకు గురై 2023 జూన్ 18న మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో అడ్మిట్‌ అవ్వగా, డయాబెటిస్‌ పేషెంట్‌ కావడంతో పాటు సివియర్‌ మెటాబాలిక్‌ ఎసిడోసిస్‌ కావడంతో మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ జరగడంతో పరిస్థితి విషమించి సాయంత్రం 5 గంటలకు మరణించాడు.

మూలాలు

Tags:

రాకేష్ మాస్టర్ జీవిత విషయాలురాకేష్ మాస్టర్ వివాదాలురాకేష్ మాస్టర్ మరణంరాకేష్ మాస్టర్ మూలాలురాకేష్ మాస్టర్కొరియోగ్రాఫర్భారతీయ సినిమా

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.పూర్వాషాఢ నక్షత్రముప్లీహముఅగ్నికులక్షత్రియులుమంగళవారం (2023 సినిమా)తెలుగుపిఠాపురంబంగారంరఘురామ కృష్ణంరాజుకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంసర్పిసమాసంవాతావరణందక్షిణామూర్తితెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంహస్త నక్షత్రముక్వినోవాజూనియర్ ఎన్.టి.ఆర్రామరాజభూషణుడుఘట్టమనేని కృష్ణరేవతి నక్షత్రంపూర్వాభాద్ర నక్షత్రముఛత్రపతి శివాజీఘిల్లిశ్రీ గౌరి ప్రియప్రియురాలు పిలిచిందిభీమసేనుడురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కృష్ణా నదిధనిష్ఠ నక్షత్రమువిశాఖ నక్షత్రమువడదెబ్బతొట్టెంపూడి గోపీచంద్మమితా బైజుప్రపంచ మలేరియా దినోత్సవంప్రేమలుగరుడ పురాణంతెలుగు భాష చరిత్రబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిసమంతరాప్తాడు శాసనసభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాస్టాక్ మార్కెట్భరణి నక్షత్రముప్రభాస్కర్కాటకరాశికుటుంబంహార్దిక్ పాండ్యాఇందిరా గాంధీబ్రాహ్మణ గోత్రాల జాబితాటెట్రాడెకేన్భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుభారతీయ సంస్కృతిప్రకృతి - వికృతిఉదయకిరణ్ (నటుడు)సంభోగంపాట్ కమ్మిన్స్శ్రవణ నక్షత్రముఐడెన్ మార్క్‌రమ్ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాతెలుగు సినిమావై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలుగు సినిమాల జాబితారుక్మిణీ కళ్యాణంతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాపాండవులుట్విట్టర్హనుమాన్ చాలీసాకాజల్ అగర్వాల్ఆల్ఫోన్సో మామిడిదాశరథి కృష్ణమాచార్య2019 భారత సార్వత్రిక ఎన్నికలుసురవరం ప్రతాపరెడ్డిటంగుటూరి సూర్యకుమారి20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిఅన్నమయ్యరాకేష్ మాస్టర్రష్మికా మందన్న🡆 More