ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలను కలిగి ఉంది.

ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. రాయలసీమలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ జిల్లాలు
ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పటం
రకంజిల్లాలు
స్థానంఆంధ్రప్రదేశ్
సంఖ్య26 జిల్లాలు
జనాభా వ్యాప్తిపార్వతీపురం మన్యం – 9,25,340 (అత్యల్ప); నెల్లూరు – 24,69,712 (అత్యధిక)
విస్తీర్ణాల వ్యాప్తివిశాఖపట్నం – 1,048 చ.కి.మీ. (చిన్నది); ప్రకాశం – 14,322 చ.కి.మీ. (అతిపెద్ద)
ప్రభుత్వంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఉప విభజనఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు

విశాఖపట్నం జిల్లా విస్తీర్ణంలో అతి చిన్న జిల్లా కాగా, ప్రకాశం జిల్లా పెద్దది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అత్యధికజనాభా కలిగిన జిల్లా అయితే, పార్వతీపురం మన్యం జిల్లా అత్యల్పజనాభా కలిగిన జిల్లాగా గుర్తించబడ్డాయి. ప్రతి జిల్లాను రెండు లేదా అంతకంటే తక్కువ రెవెన్యూ డివిజన్‌లుగా విభజించబడ్డాయి. రెవెన్యూ డివిజన్లును పరిపాలనా ప్రయోజనాల కోసం మండలాలుగా ఉపవిభజన చేయబడ్డాయి.

చరిత్ర

స్వాతంత్ర్యం వచ్చేనాటికినేటి ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రంలో భాగంగాఉండేది. తెలుగు మాట్లాడే ఆధిపత్య ప్రాంతాలైన కోస్తాాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు 1953లో మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి ఆంధ్రరాష్ట్రంగా ఏర్పడింది.

ఆంధ్రరాష్ట్రంగా ఇది అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి అనే 11 జిల్లాలను కలిగి ఉంది.

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956 ఫలితంగా రాష్ట్ర సరిహద్దులు భాషాపరమైన మార్గాలను అనుసరించి పునర్వ్యవస్థీకరించబడ్డాయి.1956 నవంబరు 1న ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. దీనిని పునరాలోచనలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్‌గా సూచిస్తారు.

ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలతో కలిపి ఆంధ్రరాష్ట్రం లోని 11 జిల్లాల కలిపి మొత్తం 21 జిల్లాలతో ఏర్పడింది. 1959 సంవత్సరంలో, గోదావరి నదికి అవతలి వైపున ఉన్న తూర్పు గోదావరి జిల్లా లోని భద్రాచలం, నూగూరు వెంకటాపురం తాలూకాలు భౌగోళిక సామీప్యత, పరిపాలనా సాధ్యత దృష్ట్యా ఖమ్మం జిల్లాలో విలీనం చేయబడ్డాయి. అదే సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లా లోని అశ్వారావుపేట కొంత భాగాన్ని ఖమ్మం జిల్లాకు, కృష్ణా జిల్లాకు చెందిన మునగాల తాలూకాను నల్గొండ జిల్లా లోకి చేర్చారు. 1970లో గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి ప్రకాశం జిల్లా, 1979లో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి విజయనగరం జిల్లా ఏర్పడడంతో జిల్లాల సంఖ్య 21 నుండి 23కు పెరిగింది.

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా విభజించబడిన తర్వాత, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌గా పిలవబడే ఆంధ్రప్రాంతం 13 జిల్లాలతో మిగిలిపోయింది. అయితే పోలవరం ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుండి అనేక గిరిజన ప్రాబల్య మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనమయ్యాయి. ఈ మండలాలు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో చేర్చబడ్డాయి.

2022 జనవరి 26న, ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం, 1974, సెక్షన్ 3 (5) ప్రకారం ప్రాథమిక ప్రకటన జారీ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 కొత్త జిల్లాలను పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి ఆధారంగా ప్రతిపాదించింది. దీనికి మినహాయింపు విశాలంగా వున్న అరకు లోకసభ నియోజక వర్గాన్ని రెండు జిల్లాలుగా మార్చటం. ప్రజల అభ్యర్ధనల మేరకు, మిగతా చోట్ల 12 అసెంబ్లీ నియోజకవర్గాలను లోక్‌సభనియోజకవర్గం ప్రధానంగా గల జిల్లాలో కాక, ఇతర జిల్లాలలో వుంచారు. ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తరువాత, ప్రభుత్వం 2022 ఏప్రిల్ 3న 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్‌ను ప్రచురించింది. దాని ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులోని షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా కొత్తగా ఏర్పడిన జిల్లాలు 2022 ఏప్రిల్ 4 నుండి అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ 3 సాంస్కృతిక ప్రాంతాలలో 26 జిల్లాలు ఉన్నాయి


కాలక్రమ స్థితి పటాలు

పునర్య్వస్థీకరణ వివరాలు

2022 పునర్య్వస్థీకరణ, తదనంతర సవరణల ప్రకారం రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు గణాంకాలు.

  • జిల్లాల సంఖ్య: 26 (మరిన్ని వివరాలకు దిగువ గణాంకాలతో జిల్లాల జాబితా చూడండి.)
  • మొత్తం మండలాలు: 679

2022 పునర్య్వస్థీకరణలో గతంలో ఉన్న మండలాలకు జరిగిన మార్పులు

వివరణ:2022 పునర్య్వస్థీకరణలో గతంలో ఉన్న 670 మండలాలలో విశాఖపట్నం పట్టణ మండలం, విజయవాడ పట్టణ మండలం, గుంటూరు మండలం, నెల్లూరు మండలం, కర్నూలు మండలం ఈ 5 మండలాలు రద్దై, వాటిస్థానంలో పైన వివరించిన ప్రకారం 14 మండలాలు కొత్తగా ఏర్పడ్డాయి. వాటితో రాష్ట్రం లోని మండలాల సంఖ్య 679కి చేరుకుంది.

2023 లో జరిగిన మార్పులు

గణపవరం మండలం 16 ఫిభ్రవరి 2023 తేదీన, తిరిగి పశ్చిమ గోదావరి జిల్లాలో చేర్చబడింది.

జిల్లాల గణాంకాలు

వ.సంఖ్య కోడ్ అధికారిక పేరు ప్రధాన కార్యాలయం రెవెన్యూ డివిజన్లు మండలాలు సంఖ్య జనాభా విస్తీర్ణం చ.కి.మీ. జనసాంద్రత చ.కి.మీ.1కి
స్థితిని తెలిపే పటం
1 SR శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం 3 30 21,91,471 4,591 477.34 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
2 PM పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం 2 15 9,25,340 3,659 252.89 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
3 VZ విజయనగరం జిల్లా విజయనగరం 3 27 19,30,811 4,122 468.42 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
4 VS విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం 2 11 19,59,544 1,048 1869.79 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
5 AS అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు 2 22 9,53,960 12,251 77.87 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
6 AK అనకాపల్లి జిల్లా అనకాపల్లి 2 24 17,26,998 4,292 402.38 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
7 KK కాకినాడ జిల్లా కాకినాడ 2 21 20,92,374 3,019 693.07 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
8 EG తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం 2 19 18,32,332 2,561 715.48 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
9 KN డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం 3 22 17,19,093 2,083 825.30 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
10 EL ఏలూరు జిల్లా ఏలూరు 3 27 20,06,737 6,579 305.02
11 WG పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 20 18,44,898 2,278 809.88
12 NT ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 3 20 22,18,591 3,316 669.06 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
13 KR కృష్ణా జిల్లా మచిలీపట్నం 3 25 17,35,079 3,775 459.62 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
14 PL పల్నాడు జిల్లా నరసరావుపేట 3 28 20,41,723 7,298 279.76 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
15 GU గుంటూరు జిల్లా గుంటూరు 2 18 20,91,075 2,443 855.95 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
16 BP బాపట్ల జిల్లా బాపట్ల 2 25 15,86,918 3,829 414.45 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
17 PR ప్రకాశం జిల్లా ఒంగోలు 3 38 22,88,026 14,322 159.76 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
18 NE శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు 4 38 24,69,712 10,441 236.54 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
19 KU కర్నూలు జిల్లా కర్నూలు 3 26 22,71,686 7,980 284.67 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
20 NN నంద్యాల జిల్లా నంద్యాల 3 29 17,81,777 9,682 184.03 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
21 AN అనంతపురం జిల్లా అనంతపురం 3 31 22,41,105 10,205 219.61 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
22 SS శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి 4 32 18,40,043 8,925 206.17 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
23 CU వైఎస్ఆర్ జిల్లా కడప 4 36 20,60,654 11,228 183.53 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
24 AM అన్నమయ్య జిల్లా రాయచోటి 3 30 16,97,308 7,954 213.39 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
25 TR తిరుపతి జిల్లా తిరుపతి 4 34 21,96,984 8,231 266.92 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 
26 CH చిత్తూరు జిల్లా చిత్తూరు 4 31 18,72,951 6,855 273.22 ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 

జిల్లాల విశేషాలు

వ్యక్తుల పేరుతో ఉన్న జిల్లాలు

రాష్ట్రంలో 2022 పునర్య్వస్థీకరణ తరువాత ఈ దిగివ వివరించిన 7 జిల్లాలు వ్యక్తుల పేరుతో ఉన్నాయి.

ఆరు జోన్లు

1.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి

2.పాడేరు, రాజమండ్రి, కాకినాడ, కోనసీమ,

3. ఏలూరు, విజయవాడ, బందరు

4.గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు

5.తిరుపతి, చిత్తూరు, రాయచోటి, కడప

6.నంద్యాల, అనంతపురం, పుట్టపర్తి, కర్నూలు

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా చరిత్రఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా కాలక్రమ స్థితి పటాలుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా పునర్య్వస్థీకరణ వివరాలుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా 2023 లో జరిగిన మార్పులుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా జిల్లాల గణాంకాలుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా జిల్లాల విశేషాలుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా ఆరు జోన్లుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా ఇవి కూడా చూడండిఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా మూలాలుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా వెలుపలి లంకెలుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాఅనంతపురం జిల్లాఅనకాపల్లి జిల్లాఅన్నమయ్య జిల్లాఅల్లూరి సీతారామరాజు జిల్లాఆంధ్రప్రదేశ్ఉత్తరాంధ్రఎన్టీఆర్ జిల్లాఏలూరు జిల్లాకర్నూలు జిల్లాకాకినాడ జిల్లాకృష్ణా జిల్లాకోనసీమ జిల్లాకోస్తాగుంటూరు జిల్లాచిత్తూరు జిల్లాతిరుపతి జిల్లాతూర్పు గోదావరి జిల్లానంద్యాల జిల్లాపల్నాడు జిల్లాపశ్చిమ గోదావరి జిల్లాపార్వతీపురం మన్యం జిల్లాప్రకాశం జిల్లాబాపట్ల జిల్లాభారతదేశ జిల్లాల జాబితాభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలురాయలసీమవిజయనగరంవిశాఖపట్నం జిల్లావైఎస్‌ఆర్ జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాశ్రీ సత్యసాయి జిల్లాశ్రీకాకుళం జిల్లా

🔥 Trending searches on Wiki తెలుగు:

మోహిత్ శర్మఅరుణాచలంగుణింతంపొట్టి శ్రీరాములుపంచకర్ల రమేష్ బాబుతెలంగాణ శాసనసభఆవర్తన పట్టికరాజనీతి శాస్త్రముశ్రీరామనవమిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘందానం నాగేందర్జ్ఞానపీఠ పురస్కారంకాప్చాప్లీహముయోగాఆవేశం (1994 సినిమా)చే గువేరాహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాఏప్రిల్ 25బంగారంజీలకర్రరష్మి గౌతమ్గైనకాలజీశోభన్ బాబుమృగశిర నక్షత్రముమియా ఖలీఫాపంచతంత్రంఅమిత్ షాభారతదేశంలో బ్రిటిషు పాలనపెరిక క్షత్రియులుఏడిద నాగేశ్వరరావుతోటపల్లి మధుతెనాలి రామకృష్ణుడుఅక్షయ తృతీయఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంఅతిసారంఉగాదిశ్రీశైల క్షేత్రంనువ్వు నాకు నచ్చావ్ప్రపంచ మలేరియా దినోత్సవంఅనుష్క శెట్టిభారతీయ రిజర్వ్ బ్యాంక్అమర్ సింగ్ చంకీలాగీతాంజలి (1989 సినిమా)శక్తిపీఠాలురమ్య పసుపులేటిహను మాన్మంగళవారం (2023 సినిమా)ఆర్టికల్ 370నవలా సాహిత్యముసచిన్ టెండుల్కర్కాలేయంహస్తప్రయోగంవెలిచాల జగపతి రావుదంత విన్యాసంపొడుపు కథలునయన తారకృష్ణా నదిభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుకలియుగంరాధ (నటి)సౌర కుటుంబంహస్త నక్షత్రముకేతువు జ్యోతిషంపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్కింజరాపు రామ్మోహన నాయుడుఈశాన్యంఅర్జునుడుమిథాలి రాజ్సాయిపల్లవిభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుకొడాలి శ్రీ వెంకటేశ్వరరావుమృణాల్ ఠాకూర్విశాఖపట్నంజయలలిత (నటి)సత్య సాయి బాబాశ్రీశ్రీటంగుటూరి ప్రకాశంమెరుపు🡆 More