స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ (లేదా ఈక్విటీ మార్కెట్, షేర్ మార్కెట్) అనేది కంపెనీ వాటా (స్టాక్/షేర్) లు కొనుగోలు, అమ్మకాలు జరిపే విక్రేతల, కొనుగోలుదారుల సముదాయము.

ఈ వాటాలు వ్యాపారంలో భాగస్వామ్యాన్ని సూచిస్తాయి. వీటిలో పబ్లిక్ స్టాక్ ఎక్స్చేంజిలో నమోదయ్యే సెక్యూరిటీలు, అలాగే ప్రైవేట్‌గా మాత్రమే ట్రేడ్ చేయబడే షేర్ల వంటివి ఉండవచ్చు. స్టాక్ ఎక్స్చేంజిలు స్టాక్ మార్కెట్లో ఒక ముఖ్యమైన భాగం. వ్యక్తిగత మదుపరులు, సంస్థాగత మదుపర్లు, హెడ్జ్ ఫండ్లు మొదలైనవారంతా స్టాక్ మార్కెట్ లో భాగస్వాములు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు చాలా తరచుగా స్టాక్ బ్రోకరేజ్‌లు, ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ మాధ్యమాల ద్వారా జరుగుతాయి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతాయి.

స్టాక్ మార్కెట్
లండన్ స్టాక్ ఎక్సేంజీ

ఐరోపాలో 13 వ శతాబ్దం నుంచే ఈ స్టాక్ మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి. 1980లో ప్రపంచ బహిరంగ మార్కెట్లో ఉన్న షేర్ల మార్కెట్ విలువ 2.5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు ఉండగా 2020 చివరి నాటికి వాటి విలువ 93.7 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. అతిపెద్ద స్టాక్ మార్కెట్ అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని న్యూయార్క్ నగరంలోని ఎన్.వై.ఎస్.ఈ (NYSE). ప్రపంచంలో ముఖ్యమైన స్టాక్ మార్కెట్లు, లండన్, ఆమ్‌స్టర్‌డామ్, ప్యారిస్, ఫ్రాంక్‌ఫర్ట్, హాంగ్ కాంగ్, సింగపూర్, టోక్యోల్లో ఉన్నాయి. ఇంకా ప్రతి అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటిలో ఈ స్టాక్ మార్కెట్లు ఉన్నాయి. భారత దేశపు స్టాక్ మార్కెట్ లో రెండు ముఖ్యమైన స్టాక్ ఎక్ఛేంజీలు రెండు ఉన్నాయి. అవి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ (NSE). వీటి సూచీలను సెన్సెక్స్, నిఫ్టీ అని అంటారు.

స్టాక్ మార్కెట్
1875 లో స్థాపించబడిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆసియాలోని పురాతన స్టాక్ ఎక్స్ఛేంజ్.

మార్కెట్ల పరిమాణం

ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల మొత్తం మార్కెట్ విలువ 1980 లో 2.5 ట్రిలియన్ యూఎస్ డాలర్ల నుండి 2019 చివరి నాటికి 83.53 ట్రిలియన్ యూఎస్ డాలర్లకు పెరిగింది. 2020 డిసెంబరు 31 నాటికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని స్టాక్ల మార్కెట్ విలువ సుమారు 93.7 ట్రిలియన్ యూఎస్ డాలర్లు. As of 2016, ప్రపంచంలో 60 స్టాక్ ఎక్స్ఛేంజీలు ఉన్నాయి. వీటిలో, 1 ట్రిలియన్ యూఎస్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ మార్కెట్ విలువగల ఎక్స్ఛేంజీలు 16 ఉన్నాయి, ప్రపంచ మార్కెట్ విలువలో వీటి వాటా 87%. ఆస్ట్రేలియన్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కాకుండా, ఈ 16 ఎక్స్ఛేంజీలు అన్నీ ఉత్తర అమెరికా, ఐరోపా లేదా ఆసియాలో ఉన్నాయి. దేశాల వారిగా, 2020 జనవరి నాటికి అతిపెద్ద స్టాక్ మార్కెట్లు అమెరికా సంయుక్త రాష్ట్రాలు (యూఎస్ఏ) (సుమారు 54.5%), తరువాత జపాన్ (సుమారు 7.7%), తరువాత యునైటెడ్ కింగ్‌డంలో (సుమారు 5.1%) ఉన్నాయి.

స్టాక్ మార్కెట్ 
మలేషియా జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్, బుర్సా మలేషియా కార్యాలయాలు.

స్టాక్ ఎక్స్ఛేంజ్

స్టాక్ ఎక్స్చేంజ్ అనేది స్టాక్ బ్రోకర్లు, వ్యాపారులు షేర్లు (ఈక్విటీ స్టాక్లు), బాండ్లు, ఇతర సెక్యూరిటీలను అమ్మడం, కొనడం చేసే చోటు. చాలా పెద్ద కంపెనీలు తమ స్టాక్‌లను స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదు చేస్తాయి. ఇది స్టాక్‌ను మరింత ద్రవంగా (మార్చుకోవడం సులువు) చేస్తుంది, ఎక్కువ మంది పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి కొన్ని పెద్ద కంపెనీలు తమ షేర్లను ఒకటే ఎక్స్ఛేంజ్ లో కాకుండా వివిధ దేశాల ఎక్స్ఛేంజీలలో నమోదు చేస్తాయి.

స్టాక్ మార్కెట్లలో ట్రేడ్ అంటే విక్రేత నుండి కొనుగోలుదారుకి (డబ్బుకు బదులుగా) స్టాక్ లేదా సెక్యూరిటీని బదిలీ చేయడం. దీనికి ఈ రెండు పార్టీలు ధరపై అంగీకరించాలి. ఈక్విటీలు (స్టాక్స్ లేదా షేర్లు) ఒక నిర్దిష్ట కంపెనీలో యాజమాన్య వడ్డీని అందిస్తాయి. స్టాక్ మార్కెట్లో పాల్గొనేవారు చిన్న వ్యక్తిగత స్టాక్ పెట్టుబడిదారుల నుండి పెద్ద పెట్టుబడిదారుల వరకు ఉంటారు. వీరు ప్రపంచంలో ఎక్కడివారైనా అయ్యుండవచ్చు; బ్యాంకులు, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్‌లు, హెడ్జ్ ఫండ్‌లు కూడా ఉండవచ్చు. ఒక స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడర్ వారి తరపున వారి అమ్మకాల, కొనుగోళ్ల ఆర్డర్లను అమలు చేయవచ్చు.

స్టాక్ మార్కెట్ 
భారతదేశ జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్

ఓ సంభావ్య కొనుగోలుదారు షేర్ కోసం నిర్దిష్ట ధరను వేలం (బిడ్) వేస్తాడు, ఓ సంభావ్య విక్రేత అదే షేర్ కోసం నిర్దిష్ట ధరను అడుగుతాడు. మార్కెట్‌లో కొనడం లేదా అమ్మడం అంటే మీరు షేర్ కోసం ఏదైనా అడిగే ధర లేదా బిడ్ ధరను అంగీకరిస్తారు. బిడ్, అడిగిన ధరలు సరిపోలినప్పుడు, ఆ ధరకు పలువురు బిడ్డర్లు ఉంటే ముందు వచ్చిన వారికి ముందు అందించే ప్రాతిపదికన అమ్మకం జరుగుతుంది.

న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NYSE) లో భౌతిక సదుపాయంతో పాటు హైబ్రిడ్ మార్కెట్‌తో ఎలక్ట్రానిక్‌గా ఏదైనా ప్రదేశం నుండి ఆర్డర్‌ చేసే అవకాశం ఉంది. నాస్‌డాక్ అనేది ఎలక్ట్రానిక్ ఎక్స్ఛేంజ్. ఇక్కడ ట్రేడింగ్ అంతా కంప్యూటర్ నెట్‌వర్క్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ ప్రక్రియ న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాదిరిగానే ఉంటుంది. ఒకరు లేదా కొందరు నాస్‌డాక్ మార్కెట్ మేకర్లు ఎల్లప్పుడూ బిడ్‌ను అందిస్తూ 'వారి' షేర్ ను కొనే లేదా అమ్మే ధరను అడుగుతారు.

షేర్ల వాణిజ్యం చేసే వ్యక్తులు అత్యంత ప్రజాదరణ పొందిన ఎక్స్ఛేంజ్‌లో ట్రేడ్ చేయడానికి ఇష్టపడతారు, ఎందుకంటే అలాంటి చోటు ఎక్కువ మంది సంభావ్య కౌంటర్ పార్టీలను (అమ్మేవాళ్ల కోసం కొనేవాళ్లను, కొనేవాళ్ల కోసం అమ్మేవాళ్లను), ఉత్తమ ధరను అందిస్తుంది. ఏదేమైనా, దీనికి ప్రత్యామ్నాయాలు ఎల్లప్పుడూ ఉన్నాయి. ఉదాహరణకు బ్రోకర్లు ఎక్స్ఛేంజ్‌ వెలుపల వర్తకానికి పార్టీలను ఒకచోట చేర్చడానికి ప్రయత్నిస్తుంటారు.

భాగస్వాములు

మార్కెట్ భాగస్వాములనగా వ్యక్తిగత రిటైల్ పెట్టుబడిదారులు, సంస్థాగత పెట్టుబడిదారులు (ఉదా., పెన్షన్ ఫండ్‌లు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్లు, ఇండెక్స్ ఫండ్లు, ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్లు, హెడ్జ్ ఫండ్లు, ఇన్వెస్టర్ గ్రూపులు, బ్యాంకులు, వివిధ ఇతర ఆర్థిక సంస్థలు),, వారి స్వంత వాటాలను బహిరంగంగా వర్తకం చేసే కార్పొరేషన్లు. వ్యక్తుల కోసం పెట్టుబడిని ఆటోమేట్ చేసే రోబో-సలహాదారులు కూడా ప్రధాన భాగస్వాములే.

ప్రత్యక్ష/పరోక్ష పెట్టుబడులు

పరోక్ష పెట్టుబడి అనగా మ్యూచువల్ ఫండ్ లేదా ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ ద్వారా పరోక్షంగా షేర్లను కలిగి ఉంటారు. ప్రత్యక్ష పెట్టుబడి అనగా తానే స్వయంగా షేర్లకు యజమాని అవుతాడు.

స్టాక్ మార్కెట్ 
1929 మార్కెట్ కుదేలు తర్వాత వాల్ స్ట్రీట్ (న్యూయార్క్ సిటీ) లో గుమికూడిన జనం

చరిత్ర

ఐరోపాలో 13వ శతాబ్దంలో షేర్ మార్కెట్లను సముదాయాల ఉన్నట్టు ఆధారలున్నాయి. అయితే ఆధునిక ఆర్థిక వ్యవస్థ యొక్క పునాదులకు సంబంధించిన అనేక ఆర్థిక ఆవిష్కరణలకు 17, 18 వ శతాబ్దాలలో డచ్ దేశస్తులు మార్గదర్శకత్వం వహించారు. ఇటాలియన్ నగర-రాష్ట్రాలు మొట్టమొదటిగా బదిలీ చేయగల ప్రభుత్వ బాండ్లను ఉత్పత్తి చేసినప్పటికీ, వారు పూర్తిగా మూలధన మార్కెట్‌కు అవసరమైన ఇతర సౌకర్యాలు, స్టాక్ మార్కెట్ ను అభివృద్ధి చేయలేదు. 1600 ల ప్రారంభంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ (వీఓసి) బాండ్లును, స్టాక్ల షేర్లను సాధారణ ప్రజలకు జారీ చేసిన మొదటి కంపెనీగా చరిత్రలో నిలిచింది. 1602 లో స్థాపించబడిన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటి జాయింట్-స్టాక్ కంపెనీ, ఆమ్‌స్టర్‌డామ్

స్టాక్ మార్కెట్ 
ఆమ్‌స్టర్‌డాం స్టాక్ ఎక్స్ఛేంజీని (ఆమ్‌స్టర్‌డామ్ యొక్క పాత బౌర్స్) వర్ణించే 17 వ శతాబ్దపు చెక్కడం, దీనిని హెండ్రిక్ డి కీసర్ నిర్మించాడు (c. 1612). ఆమ్స్టర్‌డ్యామ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రపంచంలోని మొట్టమొదటి అధికారిక (అధికారిక) స్టాక్ ఎక్స్ఛేంజ్, ఇక్కడ వీఓసీ యొక్క బాండ్లు, స్టాక్ల షేర్లతో సహా ఉచితంగా బదిలీ చేయగల సెక్యూరిటీల వర్తకం జరికింది.

ఎక్స్ఛేంజీలో కంపెనీ షేర్ల వాణిజ్యం నిరంతర జరుగుతూ ఉంటుంది. ఆమ్‌స్టర్‌డామ్‌కి చెందిన వ్యాపారవేత్త జోసెఫ్ డి లా వేగా యొక్క కన్ఫ్యూజన్ డి కన్ఫ్యూషన్స్ (1688) స్టాక్ల వాణిజ్యం, స్టాక్ మార్కెట్ లోపలి పనితీరు గురించి తెలిపే మొదటి పుస్తకం.

ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, జపాన్, ఇండియా, చైనా, కెనడా, జర్మనీ (ఫ్రాంక్‌ఫర్ట్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ), ఫ్రాన్స్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్‌లో ఉన్నాయు. ఇప్పుడు దాదాపు అన్ని అభివృద్ధి చెందిన, అత్యంత అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో స్టాక్ మార్కెట్లు ఉన్నాయి.

ప్రాముఖ్యత

ఒకసారి నేను సోషలిజం ఆర్థిక శాస్త్ర నిపుణుడైన వాన్ మైసెస్ ని ఒక దేశం సోషలిస్టు దేశమా, కాదా అని దేని ఆధారంగా చెబుతారు అని అడిగాను. అప్పటికి అలా నిర్ణయించే ఖచ్చితమైన విధి విధానాలు ఏమి లేవు. కానీ మైసెస్ మాత్రం స్టాక్ మార్కెట్ ఉనికి ఆధారంగా అని స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. స్టాక్ మార్కెట్ ఉన్నంతవరకు క్యాపిటలిజం, వ్యక్తిగత ఆస్తి అనేవి ఉంటాయి, అలాంటి మార్కెట్ ఉంటే అది సోషలిస్టు దేశం కానేరదు.

—ముర్రే రోత్‌బార్డ్, "మేకింగ్ ఎకనామిక్ సెన్స్" (2006) లోనుంచి

అవసరం, ప్రయోజనం

బహిరంగంగా వ్యాపారం చేయని అప్పు (debt) మార్కెట్‌లతో పాటు, కంపెనీలు డబ్బును సమీకరించే అత్యంత ముఖ్యమైన మార్గాలలో స్టాక్ మార్కెట్ ఒకటి కంపెనీ యాజమాన్య షేర్లను పబ్లిక్ మార్కెట్‌లో విక్రయించడం ద్వారా వ్యాపారులు బహిరంగంగా వర్తకం చేయడానికి, కంపెనీ విస్తరణ కోసం అదనపు ఆర్థిక మూలధనాన్ని సంపాదించడానికి కుదురుతుంది. పెట్టుబడిదారులకు ఎక్స్ఛేంజి అందించే ద్రవ్యత (liquidity), యజమానులు సెక్యూరిటీలను త్వరగా, సులభంగా విక్రయించడానికి అనుమతిస్తుంది. స్థలాలు లేదా ఇతర స్థిరమైన ఆస్తుల వంటి తక్కువ ద్రవ్యతగల పెట్టుబడులతో పోలిస్తే ఇది షేర్ల పెట్టుబడి యొక్క ఆకర్షణీయమైన లక్షణం.

స్టాక్లు, ఇతర ఆస్తుల ధరలు ఆర్థిక కార్యకలాపాల గమనంలో ఒక కీలకమైన భాగం అని చరిత్ర సూచిస్తుంది. ఈ ధరలు సామాజిక మానసిక స్థితిని ప్రభావితం చేయవచ్చు లేదా ఆ స్థితికి ఒక సూచికగా నిలువవచ్చు. పెరుగుతున్న స్టాక్ మార్కెట్ ఉన్న ఆర్థిక వ్యవస్థను సామర్థ్యంగల ఆర్థిక వ్యవస్థగా పరిగణిస్తారు. తరచుగా దేశ ఆర్థిక బలానికి, అభివృద్ధికి స్టాక్ మార్కెట్ ప్రాథమిక సూచికగా పరిగణించబడుతుంది. ఉదాహరణకు, పెరుగుతున్న షేర్ ధరలను పెరిగిన వ్యాపార పెట్టుబడికి సంబంధించిందిగా భావిస్తారు, అలాగే వ్యాపారంలో పెట్టుబడి పెరిగితే ఆ కంపెనీ షేర్ ధరలు కూడా పెరుగొచ్చు. ఇలాంటీ అనేక కారణాల వల్ల, స్టాక్ మార్కెట్ నియంత్రణ, ప్రవర్తనపై, ఆర్థిక వ్యవస్థల విధినిర్వహణపై కేంద్ర బ్యాంకులు ఒక కన్నేసి ఉంచుతాయి. ఆర్థిక స్థిరత్వం అనేది కేంద్ర బ్యాంకుల ఉనికికి కారణం..

ఎక్స్ఛేంజీలు లావాదేవీల క్లియరింగ్‌హౌస్ పాత్ర కూడా పోషిస్తాయి, అంటే అవి షేర్లను సేకరించి పంపిణీ చేస్తాయి,, సెక్యూరిటీ విక్రేతకు అందాల్సిన డబ్బుకు హామీ ఇస్తాయి. తద్వారా లావాదేవీలో కొనుగోలుదారు లేదా విక్రేతకు కౌంటర్ పార్టీ తప్పించుకుపోయే రిస్కును తొలగిస్తుంది. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధికి దోహదపడుతుందని భావిస్తారు, బ్యాంక్-ఆధారిత, మార్కెట్-ఆధారిత వ్యవస్థలలో ఏది సరైన ఆర్థిక వ్యవస్థ అనే విషయంలో కొంత వివాదం ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం వంటి ఇటీవలి సంఘటనలు, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, నష్టం యొక్క ప్రసారం మీద స్టాక్ మార్కెట్ల నిర్మాణం యొక్క ప్రభావాన్ని లోతుగా పరిశీలించేలా ప్రేరేపించాయి.

స్టాక్స్ మార్కెట్లు అదనపు నిధులున్న (పొదుపు) యూనిట్ల నుండి నిధుల లోటుతో (రుణాలు) బాధపడుతున్న వారికి బదిలీ చేసి (పాధి, నాయక్, 2012), వృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి తద్వారా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. మరో మాటలో చెప్పాలంటే, క్యాపిటల్ మార్కెట్లు పైన పేర్కొన్న యూనిట్ల మధ్య నిధుల కదలికను సులభతరం చేస్తాయి. ఈ ప్రక్రియ అందుబాటులో ఉన్న ఆర్థిక వనరుల మెరుగుదలకు దారితీస్తుంది, ఇది ఆర్థిక వృద్ధిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.

స్టాక్ మార్కెట్ సూచీ

స్టాక్ మార్కెట్ 
సెక్టార్ల వారిగా యూ.ఎస్ స్టాక్ మార్కెట్ విలువ

ప్రపంచ, ప్రాంతీయ లేదా స్థానిక మార్కెట్లలో ధరల కదలికలు స్టాక్ మార్కెట్ సూచీలలో (indices) సంగ్రహించబడ్డాయి, వీటికి ఉదాహరణలు ఎస్&పి, బీఎస్‌సీ 30 షేర్ల సూచీ, యూరోనెక్స్ట్ మొదలైనవి. ఇటువంటి సూచీలు సాధారణంగా మార్కెట్ విలువను, ముఖ్యమైన సెక్టార్ల ఆర్థిక బరువులను ప్రతిబింబించే స్టాకుల ఆధారంగా లెక్కించబడతాయి. మారుతున్న వ్యాపార వాతావరణాన్ని ప్రతిబింబించేలా స్టాక్‌లను చేర్చడానికి/మినహాయించడానికి సూచీలలోని భాగాలు తరచుగా సమీక్షించబడతాయి.

పరపతి వ్యూహాలు

ఒక వ్యాపారికి నిజంగా స్వంతం కాని స్టాకులను షార్ట్ అమ్మకం (short selling), మార్జిన్ కొనుగోలు (margin buying) పద్ధతులను ఉపయోగించి అరువు నిధులతో వ్యాపారం చేయవచ్చు; లేదా, పూర్తిగా కొనడానికి లేదా అమ్మడానికి కావల్సిన దానికంటే చాలా తక్కువ డబ్బుతో పెద్ద మొత్తంలో స్టాకులను నియంత్రించడానికి డెరివేటివ్‌లను ఉపయోగించవచ్చు.

షార్ట్ అమ్మకం

షార్ట్ అమ్మకంలో, వ్యాపారి షేర్ ను (సాధారణంగా తన బ్రోకరేజ్ నుంచి) అప్పుగా తీసుకుంటాడు (బ్రోకరేజ్లు ఖాతాదారుల షేర్లను లేదా తమ స్వంత షేర్లను ఇలాంటివారికి రుణంగా ఇస్తాయి), తర్వాత, ధర తగ్గుతుందన్న బెట్టింగ్ మీద, దాన్ని మార్కెట్‌లో అమ్ముతాడు. వ్యాపారి చివరికి షేర్ ను తిరిగి కొనుగోలు చేస్తాడు, ఈ సమయంలో ధర పడిపోతే డబ్బు సంపాదిస్తాడు, ధర పెరిగితే డబ్బును కోల్పోతాడు. షేర్ ను తిరిగి కొనుగోలు చేయడం ద్వారా షార్ట్ ప్రక్రియ నుండి నిష్క్రమించడాన్ని "కవర్" అంటారు. కపట వర్తకులు నిరర్ధక మార్కెట్లలో షేర్ల ధరను కృత్రిమంగా తగ్గించడానికి కూడా ఈ వ్యూహాన్ని ఉపయోగించవచ్చు. అందుకని చాలా మార్కెట్లు షార్ట్ అమ్మడాన్ని నిరోధిస్తాయి లేదా షార్ట్ అమ్మకం ఎప్పుడు, ఎలా జరుగుతుందనే దానిపై ఆంక్షలు విధించాయి.

మార్జిన్ కొనుగోలు

మార్జిన్ కొనుగోలులో, వ్యాపారి షేర్ కొనడానికి డబ్బును (వడ్డీకి) అప్పుగా తీసుకుంటాడు, కొన్న షేర్ ధర పెరగాలని ఆశిస్తాడు. ఉదాహరణకు మార్జిన్ 50% అనుకోండి, వ్యాపారి ₹1000 విలువైన షేర్లు కొనడానికి కనీసం అతని/ఆమె ఖాతా విలువ (సాధారణంగా డబ్బు రూపంలో) ₹500 అయ్యుండాలి. అప్పుడు మిగిలిన ₹500 అప్పుగా బ్రోకరేజ్ దగ్గరి పొందవచ్చు. చాలా పారిశ్రామిక దేశాలు యిలా అప్పు తేసుకోవడం మీద నిబంధనలు విధించాయి. అప్పుకు తాకట్టుగా (collateral) వ్యాపారి యిదివరకే తనవైన షేర్లను పెడితే, వాటి విలువమీద గరిష్ఠంగా కొంత శాతం మాత్రమే అప్పు లభిస్తుంది. పెట్టుబడిదారుడి ఖాతా మొత్తం విలువ ట్రేడ్ నష్టానికి మద్దతు ఇవ్వలేకపోతే మార్జిన్ పిలుపు ఇవ్వబడుతుంది, అంటే అప్పుతో కొన్న షేర్లు నష్టంతోనే అమ్మబడతాయి.

ఆర్థిక మార్కెట్ల రకాలు

ఆర్థిక మార్కెట్లను వివిధ ఉప రకాలుగా విభజించవచ్చు:

బదిలీ చేసిన ఆస్తుల ప్రకారం

  • మనీ మార్కెట్ : వీటిలో స్వల్పకాలిక మెచ్యూరిటీ, అధిక ద్రవ్యతతో డబ్బు లేదా ఆర్థిక ఆస్తులతో వర్తకం జరుగుతుంది, సాధారణంగా ఆస్తుల మెచ్యూరిటీ వ్యవధి ఒక సంవత్సరం కన్నా తక్కువుంటుంది.
  • క్యాపిటల్ మార్కెట్ : వీటిలో మధ్యస్థ, దీర్ఘకాలిక మెచ్యూరిటీ కలిగిన ఆర్థిక ఆస్తుల వర్తకం జరుగుతుంది.

భౌగోళిక దృక్పథం ప్రకారం

  • జాతీయ మార్కెట్లు. ఆర్థిక లావాదేవీలు ఆ జాతి కరెన్సీలో జరుగుతాయి, ఆస్తుల వివరాలు కూడా అదే కరెన్సీలో నమోదై ఉంటాయి. అలాగే ఆ జాతివాసులు మాత్రమే భాగస్వాములవుతారు.
  • అంతర్జాతీయ మార్కెట్లు. మార్కెట్లు దేశ భౌగోళిక ప్రాంతం వెలుపల ఉంటాయి.

వర్తకం చేయబడే ఆస్తి రకం ప్రకారం

  • సాంప్రదాయ మార్కెట్. డిమాండ్ డిపాజిట్లు, షేర్లు లేదా బాండ్ల వంటి ఆర్థిక ఆస్తులు వర్తకం చేయబడతాయి.
  • ప్రత్యామ్నాయ మార్కెట్. దీనిలో ప్రత్యామ్నాయ ఆర్థిక ఆస్తులు వర్తకం చేయబడతాయి ఉదా: పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు, ప్రామిసరీ నోట్లు, ఫ్యాక్టరింగ్, రియల్ ఎస్టేట్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్, పెట్టుబడి ప్రాజెక్టులు (ఉదా. మౌలిక సదుపాయాలు, సినిమాలు మొదలైనవి).

ఇతర మార్కెట్లు

  • వస్తువుల వ్యాపారాన్ని అనుమతించే వస్తువుల మార్కెట్లు
  • ఆర్థిక రిస్కును నిభాయించటానికి సాధనాలను అందించే డెరివేటివ్ మార్కెట్లు
  • భవిష్యత్తులో ఉత్పత్తులను వర్తకం చేయడానికి ముందస్తు ఒప్పందాలను అందించే ముందస్తు మార్కెట్లు.
  • విభిన్న నష్టాల పునఃపంపిణీని అనుమతించే బీమా మార్కెట్లు
  • విదేశీ కరెన్సీల మార్పిడి జరిగే విదేశీ మారక మార్కెట్

పెట్టుబడి వ్యూహాలు

అనేక వ్యూహాలను ప్రాథమిక విశ్లేషణ లేదా సాంకేతిక విశ్లేషణగా వర్గీకరించవచ్చు. ప్రాథమిక విశ్లేషణ అంటే ప్రభుత్వానికి సమర్పించే ఆర్థిక స్టేట్‌మెంట్లను, వ్యాపార పోకడలను, సాధారణ ఆర్థిక పరిస్థితులను అనుసరించి కంపెనీలను విశ్లేషించడం. సాంకేతిక విశ్లేషణ అంటే కంపెనీ ఆర్థిక అవకాశాలతో సంబంధం లేకుండా చారిత్రక పనితీరు ఆధారంగా చార్ట్‌లు, పరిమాణాత్మక పద్ధతుల ద్వారా మార్కెట్లలో ధరల ధోరణులను అధ్యయనం చేయడం. సాంకేతిక వ్యూహానికి ఒక ఉదాహరణ ట్రెండ్ ఫాలోయింగ్ పద్ధతి, దీనిని జాన్ డబ్ల్యూ హెన్రీ, ఎడ్ సెకోటా ఉపయోగించారు.

అదనంగా, చాలామంది నిష్క్రియాత్మక ఇండెక్స్ ఫండ్ల ద్వారా పెట్టుబడి పెట్టడాన్ని ఎంచుకుంటారు. ఈ పద్ధతిలో, ఒకరు మొత్తం స్టాక్ మార్కెట్ యొక్క పోర్ట్‌ఫోలియోలో లేదా స్టాక్ మార్కెట్‌లోని కొంత భాగంలో పెట్టుబడి పెట్టుంటారు (S&P 500 ఇండెక్స్ లేదా నిఫ్టీ 50 వంటివి). ఈ వ్యూహం యొక్క ప్రధాన లక్ష్యం వైవిధ్యతను పెంచడం, పన్నులను తగ్గించి లాభాలను గ్రహించడం, సాధారణ స్టాక్ మార్కెట్ పెరిగే ధోరణిని ఎక్కడం.

కేవలం ప్రాథమిక విశ్లేషణ ఆధారంగా దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి పెట్టడం బాధ్యతాయుతమైన పెట్టుబడి వ్యూహం. సామాజిక బాధ్యతతో పెట్టుబడి పెట్టడం మరొక వ్యూహం.

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

స్టాక్ మార్కెట్ మార్కెట్ల పరిమాణంస్టాక్ మార్కెట్ స్టాక్ ఎక్స్ఛేంజ్స్టాక్ మార్కెట్ భాగస్వాములుస్టాక్ మార్కెట్ చరిత్రస్టాక్ మార్కెట్ ప్రాముఖ్యతస్టాక్ మార్కెట్ సూచీస్టాక్ మార్కెట్ పరపతి వ్యూహాలుస్టాక్ మార్కెట్ ఆర్థిక మార్కెట్ల రకాలుస్టాక్ మార్కెట్ పెట్టుబడి వ్యూహాలుస్టాక్ మార్కెట్ ఇవి కూడా చూడండిస్టాక్ మార్కెట్ మూలాలుస్టాక్ మార్కెట్స్టాక్ ఎక్స్చేంజ్

🔥 Trending searches on Wiki తెలుగు:

కర్ర పెండలంకుక్కఅమ్మపాలకొల్లు శాసనసభ నియోజకవర్గంఛత్రపతి శివాజీజాషువాక్లోమముకందుకూరి వీరేశలింగం పంతులుఏనుగుపొంగూరు నారాయణసంధిఆవేశం (1994 సినిమా)ఏ.పి.జె. అబ్దుల్ కలామ్శ్రవణ నక్షత్రములోక్‌సభమెదడు వాపురైతుకొణతాల రామకృష్ణతొట్టెంపూడి గోపీచంద్నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికొండా విశ్వేశ్వర్ రెడ్డిరోహిత్ శర్మతెలుగు భాష చరిత్రసన్ రైజర్స్ హైదరాబాద్ఆర్టికల్ 370 రద్దురాశి (నటి)కమల్ హాసన్తొలిప్రేమచిరంజీవి నటించిన సినిమాల జాబితాసజ్జల రామకృష్ణా రెడ్డితెలుగురామసహాయం సురేందర్ రెడ్డిమేషరాశిసూర్య నమస్కారాలుభారతీయ రైల్వేలునారా లోకేశ్భారత కేంద్ర మంత్రిమండలిఎన్నికలుటిల్లు స్క్వేర్విశాఖ నక్షత్రముకస్తూరి రంగ రంగా (పాట)శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముమహాసముద్రంద్వంద్వ సమాసమునోటారోజా సెల్వమణిఉస్మానియా విశ్వవిద్యాలయంయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీరాజశేఖర్ (నటుడు)ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాహరే కృష్ణ (మంత్రం)భారతదేశ జిల్లాల జాబితాశ్రీరామనవమిబతుకమ్మమహేంద్రసింగ్ ధోనిభారత రాష్ట్రపతుల జాబితాఖండంఉడుమువృషణంగ్రామ పంచాయతీహైపోథైరాయిడిజంమొదటి ప్రపంచ యుద్ధంమంగళసూత్రంఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్పెళ్ళిమిథునరాశికె.బాపయ్యకడియం కావ్యతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాముదిరాజ్ (కులం)గోదావరిప్రశాంత్ నీల్గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుకౌరవులుకాకినాడ లోక్‌సభ నియోజకవర్గంనారా బ్రహ్మణి🡆 More