గోదావరి: దక్షిణ భారత దేశంలో ప్రవహించే నది

గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది.

ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి, నిజామాబాదు జిల్లా రేంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాదు,కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్ లోనికి ప్రవేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతం లో సంగమిస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. ఈ నది ఒడ్డున భద్రాచలము, రాజమహేంద్రవరం వంటి పుణ్యక్షేత్రములు, పట్టణములు ఉన్నాయి. ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి (గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప. ఇందులో గౌతమి, వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహినులు. ఆ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి.

గోదావరి
గోదారి
గోదావరి: గోదావరి నది ఇతిహాసం, పుష్కరాలు, గోదావరి నదిపై ప్రాజెక్టులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి నదిపై
దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం
గోదావరి: గోదావరి నది ఇతిహాసం, పుష్కరాలు, గోదావరి నదిపై ప్రాజెక్టులు
దక్షిణ భారతదేశంలో గోదావరి నది [1]
స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర,తెలంగాణ
ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్
పుదుచ్చేరి (యానాం) ఒడిశా
ప్రాంతందక్షిణ , పశ్చిమ భారతదేశం
భౌతిక లక్షణాలు
మూలం 
 • స్థానంత్రయంబకేశ్వర్, నాసిక్ జిల్లా, మహారాష్ట్ర
 • అక్షాంశరేఖాంశాలు19°55′48″N 73°31′39″E / 19.93000°N 73.52750°E / 19.93000; 73.52750
 • ఎత్తు920 m (3,020 ft)
సముద్రాన్ని చేరే ప్రదేశంబంగాళాఖాతం
 • స్థానం
అంతర్వేది వద్ద బంగాళాఖాతం
తూర్పు గోదావరి,ఆంధ్రప్రదేశ్
 • అక్షాంశరేఖాంశాలు
17°0′N 81°48′E / 17.000°N 81.800°E / 17.000; 81.800
పొడవు1,465 km (910 mi)
పరీవాహక ప్రాంతం312,812 km2 (120,777 sq mi)
ప్రవాహం 
 • సగటు3,505 m3/s (123,800 cu ft/s)
ప్రవాహం 
 • స్థానంపోలవరం ప్రాజెక్టు (1901–1979)
 • సగటు3,061.18 m3/s (108,105 cu ft/s)
 • కనిష్టం7 m3/s (250 cu ft/s)
 • గరిష్టం34,606 m3/s (1,222,100 cu ft/s)
పరీవాహక ప్రాంత లక్షణాలు
ఉపనదులు 
 • ఎడమపూర్ణా నది
ప్రాణహిత
ఇంద్రావతి
తాలిపేరు
శబరి
వెయిన్ గంగా
పెంగంగా
వర్ధ
దుధన
 • కుడిప్రవర
మంజీరా
పెద్దవాగు
మన్నేరు
కిన్నెరసాని

గోదావరి నది ఇతిహాసం

పూర్వం బలి చక్రవర్తిని శిక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తి మూడడుగుల స్థలం కావాలని అడుగగా బలి చక్రవర్తి మూడడుగులు ధారపోసాడు. మహావిష్ణువు ఒక అడుగు భూమి పైన, రెండో అడుగు ఆకాశం పైన, మూడో అడుగు బలి తలపై పెట్టి పాతాళం లోకి త్రొక్కి వేస్తాడు. భూమండలం కనిపించకుండా ఒక పాదం మాత్రమే కనిపించడంతో చతుర్ముఖ బ్రహ్మ కమండలం లోని నీటిలో సమస్త తీర్థాలను ఆవాహన చేసి ఆ ఉదకంతో శ్రీ మహావిష్ణువు పాదాలను అభిషేకించి, మహావిష్ణువును శాంతింపజేస్తాడు. అందువల్లనే గంగను విష్ణుపాదోద్భవి గంగా అని పిలుస్తారు. అలా పడిన గంగ పరవళ్ళు త్రొక్కుతుంటే శివుడు తన జటాజూటంలో బంధిస్తాడు. పరమశివుడిని మెప్పించి భగీరథుడు తన పితామహులకు సద్గతులను కలగజేయడానికి గంగను, గోహత్యాపాతకనివృత్తి కోసం గౌతమ మహర్షి గోదావరిని భూమికి తీసుకొని వస్తారు.

ఒకానొకప్పుడు దేశంలో క్షామం ఏర్పడి కరువుతో తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు, వారి శిష్యులకు కరువు నుండి విముక్తి కలిగించి అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆ ఋషులు తమకు లేని తపోశక్తులు గౌతమునికి ఉన్నాయని ఈర్ష్యతో ఒక మాయ గోవును పంపి గౌతముడి పాడిపంటలు నాశనం చేయించారు. గౌతముడు ఒక దర్భతో ఆ గోవును అదలించగా అది మరణించింది. గౌతముడు తాను చేసిన గోహత్యాపాతకం నివృత్తి కోసం శివుడిని మెప్పించి గంగను భూమి మీదకు తెప్పించాడు ఆ గంగయే గోదావరి లేదా గౌతమీ నది. ఈ నదిని ఆ చనిపోయిన గోవు మీద నుండి ప్రవహింపజేసి తన గోహత్యాపాతకాన్ని విముక్తి చేసుకొన్నాడు. ఆ గోవుకి స్వర్గప్రాప్తి కలిగింది. ఆ స్థలమే గోష్పాద క్షేత్రం. ఈ క్షేత్రమే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పట్టణం.

పుష్కరాలు

దేశంలో ప్రతీ జీవ నదికీ పుష్కరం ఉన్నట్లే, గోదావరికి కూడా పుష్కరం ఉంది. పంచాంగం ప్రకారం గురుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరికి పుష్కరం వస్తుంది. 2015, జూలై నెలలో గోదావరికి మహాపుష్కరం వచ్చింది.

గోదావరి నదిపై ప్రాజెక్టులు

ఉప నదులు

గోదావరి: గోదావరి నది ఇతిహాసం, పుష్కరాలు, గోదావరి నదిపై ప్రాజెక్టులు 
రాజమండ్రి వద్ద గోదావరి నదిపై రైల్వే వంతెన

గోదావరి నది పరీవాహక ప్రాంతం 3,13,000 చదరపు కిలోమీటర్ల మేర మహారాష్ట్ర, తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, ఒడిషా రాష్ట్రాలలో వ్యాపించి ఉంది. ఈ నది ప్రధాన ఉపనదులు:

గోదావరి ఒడ్డున వెలసిన పుణ్య క్షేత్రాలు

గోదావరి: గోదావరి నది ఇతిహాసం, పుష్కరాలు, గోదావరి నదిపై ప్రాజెక్టులు 
రాజమహేంద్రవరం వద్ద గోదారమ్మ విగ్రహం

గోదావరి ప్రాంతపు కవులు

తెలుగులో తొలి కావ్యరచన కాలం నుండి గోదావరి ప్రాంతంలో అనేకమంది కవులు చాలా కావ్యాలను రచించారు. వీరిలో ఎక్కువమంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు. ప్రాచీనకాలం నుండి 1980 ప్రాంతం వరకు గోదావరి ప్రాంతంలో వెలసిన కవులలో కొందరు.

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

గోదావరి నది ఇతిహాసంగోదావరి పుష్కరాలుగోదావరి నదిపై ప్రాజెక్టులుగోదావరి ఉప నదులుగోదావరి ఒడ్డున వెలసిన పుణ్య క్షేత్రాలుగోదావరి ప్రాంతపు కవులుగోదావరి చిత్రమాలికగోదావరి ఇవి కూడా చూడండిగోదావరి మూలాలుగోదావరి వెలుపలి లంకెలుగోదావరిఅరేబియా సముద్రముఅల్లూరి సీతారామరాజు జిల్లాఆంధ్రప్రదేశ్ఆత్రేయఆదిలాబాదుఏలూరు జిల్లాకందకుర్తికరీంనగర్కోనసీమ జిల్లాఖమ్మంగంగగౌతమి (నది)తుల్యభాగతూర్పు గోదావరి జిల్లాతెలంగాణధవళేశ్వరంనాసిక్నిజామాబాదుపశ్చిమ గోదావరి జిల్లాబంగాళాఖాతంభద్రాచలముభరద్వాజభారత దేశంమహారాష్ట్రరాజమహేంద్రవరంరేంజల్ మండలంసప్తర్షులుసింధు

🔥 Trending searches on Wiki తెలుగు:

వృషభరాశిగేమ్ ఛేంజర్అయలాన్దీపావళితెలుగు వికీపీడియామంగ్లీ (సత్యవతి)రాజ్యసభతెలుగు పద్యముభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుఉగాదిఈస్టర్నామనక్షత్రముమండల ప్రజాపరిషత్యూట్యూబ్సావిత్రిబాయి ఫూలేతీన్మార్ మల్లన్నపన్ను (ఆర్థిక వ్యవస్థ)ఫేస్‌బుక్సింగిరెడ్డి నారాయణరెడ్డిశాంతికుమారిLభరణి నక్షత్రముప్రజాస్వామ్యంమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిద్విగు సమాసముస్త్రీజైన మతంషడ్రుచులుస్మృతి మందానప్రీతీ జింటాజాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష2019 పుల్వామా దాడికేతువు జ్యోతిషంబాలకాండఅరుణాచలంరావుల శ్రీధర్ రెడ్డిగ్రామ సచివాలయంఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుగ్లోబల్ వార్మింగ్సరోజినీ నాయుడుదానిమ్మశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంయునైటెడ్ కింగ్‌డమ్తెనాలి రామకృష్ణుడుఉస్మానియా విశ్వవిద్యాలయంఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాభారత రాష్ట్రపతికుక్కకాటసాని రామిరెడ్డిమరణానంతర కర్మలునల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితెలుగు నెలలుసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుమెక్సికోఇస్లాం మతంసంఖ్యగోత్రాలు జాబితాబంగారంH (అక్షరం)యేసు శిష్యులుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుతెలుగు పదాలుసుబ్రహ్మణ్యపురం (2018 సినిమా)తెలుగు కులాలునల్ల మిరియాలుజయలలితPHఆర్యవైశ్య కుల జాబితాఅనపర్తి శాసనసభ నియోజకవర్గంనన్నయ్యహైదరాబాదుఅవకాడోభారత ఆర్ధిక వ్యవస్థవిష్ణువు వేయి నామములు- 1-1000ఆరుద్ర నక్షత్రముచేతబడి🡆 More