రైతు: సాగు చేసేవారు

వ్యవసాయం చేసి, ఆహారాన్ని, ముడిసరుకును పండించే వ్యక్తిని రైతు అంటారు.

వ్యవసాయదారుడు అని కూడా అంటారు. ఆహార పంటలు పండించేవారినే కాక, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం మొదలైన వాటిని చేపట్టిన వారిని కూడా రైతులనే అంటారు. సాధారణంగా రైతులు తమ సొంత భూమిలోనే సాగు చేస్తూంటారు. ఇతరుల భూమిని అద్దెకు తీసుకుని కూడా చేస్తూంటారు. దాన్ని కౌలు అని, వారిని కౌలు రైతులనీ అంటారు. పొలం పనుల్లో భాగంగా రైతు పనిలో పెట్టుకునే వారిని రైతుకూలీలు అంటారు.

రైతు
రైతు: చరిత్ర, భారతదేశంలో రైతు, ఆరోగ్యం పై ప్రభావం
పొలంలో ఎరువు చల్లుతున్న రైతు
వృత్తి
వృత్తి రకం
ఉపాధి
కార్యాచరణ రంగములు
వ్యవసాయం
వివరణ
ఉపాధి రంగములు
వ్యవసాయం

చరిత్ర

కంచుయుగం నాటికి, సా.శ.పూ. 5000-4000 నాటికే సుమేరియన్లకు వ్యవసాయ కూలీలు ఉన్నారు. వ్యవసాయంలో వాడుకునేందుకు గాను, పశుపోషణ చెయ్యడం వేల సంవత్సరాలుగా జరుగుతోంది. తూర్పు ఆసియాలో 15,000 ఏళ్ళ కిందటే కుక్కలను పెంచారు. సా.శ.పూ. 7,000 నాటికి ఆసియాలో మేకలు, గొర్రెలను పెంచారు. సా.పూ. 7,000 నాటికి మధ్య ప్రాచ్యం, చైనాల్లో పందులను పెంచారు. సా.పూ. 4,000 నాటికి గుర్రాలను పెంచారు. సింధు లోయ నాగరికత నాటికే భారతదేశంలో వ్యవసాయం ఉంది. దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల అంతకు ముందు నుండే ఉంది.

భారతదేశంలో రైతు

భారతదేశంలోని మొత్తం కార్మికుల సంఖ్యలో అత్యధిక శాతం రైతులు, రైతు కూలీలే. 2020 నాటికి దేశంలో మొత్తం రంగాల్లో ఉన్న ఉపాధిలో 41.49% భాగాన్ని వ్యవసాయ రంగమే కల్పిస్తోంది. దీనితో పోలిస్తే దేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగపు శాతం చాలా తక్కువ. 2016 లో జిడిపిలో వ్యవసాయం వాటా 17.5% మాత్రమే ఉంది. ఇది క్రమేణా క్షీణిస్తోంది.

ఆరోగ్యం పై ప్రభావం

ట్రాక్టర్లు, హార్వెస్టర్లూ వంటి యంత్రాలతో పని చెయ్యడంలో వాటితో ప్రమాదాలకు లోనౌతూంటారు. దీర్ఘ కాలంలో రైతులు కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులకు గురవడం కూడా జరుగును.

మూలాలు

Tags:

రైతు చరిత్రరైతు భారతదేశంలో రైతు ఆరోగ్యం పై ప్రభావంరైతు మూలాలురైతుకౌలు రైతు

🔥 Trending searches on Wiki తెలుగు:

ధూర్జటిమధుమేహంనవధాన్యాలుగ్రామ పంచాయతీచెట్టుడిస్నీ+ హాట్‌స్టార్గేమ్ ఛేంజర్వాట్స్‌యాప్భారత జాతీయగీతంనరసాపురం లోక్‌సభ నియోజకవర్గంవిశాఖ నక్షత్రముశాతవాహనులుఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుఉత్పలమాలసింధు లోయ నాగరికతహార్దిక్ పాండ్యాకస్తూరి రంగ రంగా (పాట)యోనివేమిరెడ్డి ప్రభాకరరెడ్డిశ్రీనాథుడుశ్రీదేవి (నటి)ఇండియన్ ప్రీమియర్ లీగ్ఉపాధిరామోజీరావుభారత పార్లమెంట్గూగుల్కయ్యలుఎమ్.ఎ. చిదంబరం స్టేడియంజ్యోతీరావ్ ఫులేకృత్తిక నక్షత్రముగోత్రాలుజాషువావరుణ్ గాంధీజమదగ్నిగంజాయి మొక్కఓటుమహాకాళేశ్వర జ్యోతిర్లింగంఎయిడ్స్నవగ్రహాలునందమూరి తారక రామారావుబాజిరెడ్డి గోవర్దన్అవకాడోభారత ప్రణాళికా సంఘంసూర్యుడు (జ్యోతిషం)సాక్షి (దినపత్రిక)భారత రాజ్యాంగ పరిషత్తెలంగాణా సాయుధ పోరాటంబలగంశుభ్‌మ‌న్ గిల్పి.వెంక‌ట్రామి రెడ్డిసౌర కుటుంబంరోహిత్ శర్మరష్మికా మందన్నస్వాతి నక్షత్రముభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుసామెతలుచిరంజీవి నటించిన సినిమాల జాబితాత్రిష కృష్ణన్దేశాల జాబితా – వైశాల్యం క్రమంలోనమాజ్ఉత్తర ఫల్గుణి నక్షత్రముభారతదేశ చరిత్రవై.యస్. రాజశేఖరరెడ్డిశోభన్ బాబుమకరరాశిధర్మవరం శాసనసభ నియోజకవర్గంచతుర్యుగాలురజినీకాంత్అనుపమ పరమేశ్వరన్మాల్దీవులురవీంద్రనాథ్ ఠాగూర్గంగా నదితెలుగు సినిమాలు డ, ఢచరవాణి (సెల్ ఫోన్)భారత జాతీయ కాంగ్రెస్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుతెలంగాణ చరిత్ర🡆 More