తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు (అప్పు) తెచ్చుకున్నది.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది.
ఉదాహరణ:
Happy ('హ్యాపీ') ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాం.
గ్రామ్య పదం ( అచ్చ తెలుగు పదం) - " అలరాటం "
ప్రాకృత పదం ( సంస్కృతం ) - " సంతోషం"
వికృత పదం - " సంతసం "
అరువు పదం - " ఖుషి "
ఈ మాదిరిగా మన తెలుగు భాష లో పదాలను విభజన చెందాయి.
ఈ ప్రకృతి - వికృతి అంశం లో మనం కేవలం ప్రాకృత, వికృత శబ్దములను గూర్చి మాత్రమే మాట్లాడతాం.
చెప్పు-సెప్పు|
సంతోషం. | ప్రకృతి | వికృతి |
---|---|---|
1. | అంబ | అమ్మ |
అక్షరము | అక్కరము | |
అగ్ని | అగ్గి | |
అద్భుతము, అపూర్వము | అబ్బురము | |
అనాథ | అనద | |
అమావాస్య | అమవస | |
ఆకాశము | ఆకసము | |
ఆధారము | ఆదరువు | |
ఆశ | ఆస | |
ఆశ్చర్యము | అచ్చెరువు | |
ఆహారము | ఓగిరము | |
ఆజ్ఞ | ఆన | |
కథ | కత | |
కన్య | కన్నె | |
కవి | కయి | |
కార్యము | కర్జము | |
కుంతి | గొంతి | |
కుమారుడు | కొమరుడు | |
కుఠారము | గొడ్డలి | |
కులము | కొలము | |
కృష్ణుడు | కన్నడు | |
ఖడ్గము | కగ్గము | |
గ్రహము | గాము | |
గృహము | గీము | |
గుణము | గొనము | |
గౌరవము | గారవము | |
ఘోరము | గోరము | |
చంద్రుడు | చందురుడు | |
చోద్యం | సోదెము | |
జ్యోతి | జోతి | |
జ్యోతిషము | జోస్యము | |
తంత్రము | తంతు | |
తరంగము | తరంగ | |
తర్కారి | తక్కెడ | |
త్యాగం | చాగం | |
తీరము | దరి | |
దిశ | దెస | |
దీపము | దివ్వె | |
ద్వీపము | దీవి | |
దుఃఖము | దూకవి | |
దైవం | దయ్యము | |
దృఢము | దిటము | |
ధర్మము | దమ్మము | |
ధాత | తార | |
నిత్యము | నిచ్చలు | |
నిద్ర | నిదుర | |
నిమిషము | నిముసం | |
నిశా | నిసి | |
నీరము | నీరు | |
న్యాయము | నాయము | |
పక్షి | పక్కి | |
పద్యము | పద్దెము | |
పరుషం | పరుసం | |
పర్వం | పబ్బం | |
పశువు | పసరము | |
ప్రజ | పజ | |
ప్రతిజ్ఞ | ప్రతిన | |
ప్రశ్నము | పన్నము | |
ప్రాకారము | ప్రహరి | |
ప్రాణము | పానము | |
పుత్రుడు | బొట్టి | |
పుణ్యము | పున్నెము | |
పురి | ప్రోలు | |
పుస్తకము | పొత్తము | |
పుష్పము | పూవు | |
ప్రే | ప్రేముడి | |
బంధువు | బందుగు | |
బలము | బలుపు | |
బహువు | పెక్కు | |
బ్రహ్మ | బమ్మ, బొమ్మ | |
బిలము | బెలము | |
భక్తి | బత్తి | |
భగ్నము | బన్నము | |
భద్రము | పదిలము | |
భాగ్యము | బాగెము | |
భారము | బరువు | |
భాష | బాస | |
భీతి | బీతు | |
భుజము | భుజము | |
భూమి | బువి | |
భేదము | బద్ద | |
మంత్రము | మంతరము | |
మతి | మది | |
మర్యాద | మరియాద | |
మల్లి, మల్లిక | మల్లి, మల్లిక | |
ముకుళము | మొగ్గ | |
ముక్తి | ముత్తి | |
ముఖము | మొగము | |
ముగ్ధ | ముగుద | |
మూలిక | మొక్క | |
మేఘుడు | మొగులు, మొయిలు | |
మృగము | మెకము | |
యంత్రము | జంత్రము | |
యత్నం | జతనం | |
యాత్ర | జాతర | |
యువతి | ఉవిద | |
రాత్రి | రాతిరి | |
రిక్తము | రిత్త | |
రూపము | రూపు | |
లక్ష్మి | లచ్చి | |
వశము | వసము | |
వర్ణము | వన్నె | |
విద్య | విద్దె | |
విధము | వితము | |
విజ్ఞానము | విన్నాణము | |
వేగము | వేగిరము | |
వేషము | వేసము | |
వైద్యుడు | వెజ్జ | |
వృద్ధ | పెద్ద | |
వృద్ధి | వద్ది | |
శక్తి | సత్తి | |
శయ్య | సెజ్జ | |
శాస్త్రము | చట్టము | |
శిఖా | సిగ | |
శిరము | సిరము | |
శీతము | సీతువు | |
శ్రీ | సిరి | |
శుచి | చిచ్చు | |
సంతోషము | సంతసము | |
సందేశము | సందియము | |
సత్యము | సత్తెము | |
సముద్రము | సంద్రము | |
సాక్షి | సాకిరి | |
సింహము | సింగము | |
సంధ్య | సంజ, సందె | |
స్తంభము | కంబము | |
స్త్రీ | ఇంతి | |
స్థలము | తలము | |
హృదయము | ఎద |
This article uses material from the Wikipedia తెలుగు article ప్రకృతి - వికృతి, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.