సమంత: తెలుగు నటి

సమంత (జ.

28 ఏప్రిల్, 1987) తెలుగు, తమిళ్ భాషల్లో నటించిన భారతీయ నటి. కెరియర్ తొలినాళ్ళలో మోడలింగ్ చేసిన సమంత 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆపై తను నటించిన బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013) చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.

సమంత
సమంత: పెళ్ళి - విడాకులు, నటించిన చిత్రాలు, పురస్కారాలు
జన్మ నామంసమంత రుతు ప్రభు
జననం (1987-04-28) 1987 ఏప్రిల్ 28 (వయసు 36)
భారతదేశం
క్రియాశీలక సంవత్సరాలు 2007 - ఇప్పటివరకు
భార్య/భర్త అక్కినేని నాగ చైతన్య (2017-2021)

మరోపక్క ఈగ ఏకకాల తమిళ నిర్మాణం నాన్ ఈ, ఎటో వెళ్ళిపోయింది మనుసు ఏకకాల తమిళ నిర్మాణం నీదానే ఎన్ పొన్వసంతం సినిమాలతో తమిళంలో గుర్తింపు సాధించిన సమంత ఆపై అంజాన్ (2014), కత్తి (2014) సినిమాలతో తమిళనాట కూడా ప్రముఖ కథానాయికగా ఎదిగింది. 2013లో రేవతి తర్వాత ఒకేసారి అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకేసారి ఒకే ఏడాదిలో అందుకున్న నటిగా కూడా సమంత ప్రసిద్ధి గాంచింది. సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ యొక్క రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది.

పెళ్ళి - విడాకులు

అక్టోబర్‌ 2017, 6, 7 తేదీలలో సమంత, నాగ చైతన్యల పెళ్లి గోవాలో హిందూ, క్రిస్టియన్‌ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. వీరు టాలీవుడ్ స్టార్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే వారిరువురు 2 అక్టోబరు, 2021న వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ విషయాన్ని నాగ చైతన్య  ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు. మరోవైపు సమంత సైతం నాగచైతన్యతో విడిపోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

నటించిన చిత్రాలు

తెలుగు

సంవత్సరం చిత్రం పాత్ర వివరాలు
2010 ఏ మాయ చేశావే జెస్సీ 'విజేత', ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన నటి,
'విజేత', సినీ"మా" అవార్డ్ - ఉత్తమ నూతన నటి,
'విజేత', నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్,
'విజేత', టీ.ఎస్.ఆర్ - టీవీ 9 అవార్డ్ 2011 - ఉత్తమ నటి,
పేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి
2010 బృందావనం ఇందు
2011 దూకుడు ప్రశాంతి పేర్కొనబడింది, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి,
పేర్కొనబడింది, దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డ్ SIIMA - ఉత్తమ నటి
2012 ఈగ బిందు తమిళంలో "నాన్ ఈ" పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది,
'విజేత', ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి,
'విజేత', టీ.ఎస్.ఆర్ - టీవీ 9 అవార్డ్ 2012 - ఉత్తమ నటి,
'విజేత', సినీ"మా" అవార్డ్ - ఉత్తమ నటి
2012 ఎటో వెళ్ళిపోయింది మనసు నిత్య
2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గీత
2013 జబర్‌దస్త్ శ్రేయ
2013 సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ అతిథి పాత్ర
2013 అత్తారింటికి దారేది శశి
2013 రామయ్యా వస్తావయ్యా ఆకర్ష
2014 ఆటోనగర్ సూర్య శిరీష
2014 మనం ప్రియ/కృష్ణవేణి
2014 రభస
2017 అ ఆ అనసూయ విజేత, ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి,
పేర్కొనబడింది, దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డ్ SIIMA - ఉత్తమ నటి
2017 24
2018 మహానటి మధురవాణి మహానటి సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమలో ప్రజావాణి పత్రిక విలేఖరి.
2018 యూ టర్న్ రచన మిస్టరీ - థ్రిల్లర్ చిత్రం
2018 సీమరాజా
2019 ఓ బేబీ
2020 జాను జానకి దేవి/ జాను సమంత చేసిన జాను పాత్రను తమిళంలో నటి త్రిష చేయబడింది.
2022 యశోద యశోద
2022 శాకుంతలం శకుంతల

తమిళం

సంవత్సరం చిత్రం పాత్ర వివరాలు
2010 విన్నైతాండి వరువాయా నందిని అతిథి పాత్ర
2010 బాణ కాథడి ప్రియ పేర్కొనబడింది, విజయ్ అవార్డ్ - ఉత్తమ నూతన నటి
2011 మాస్కోవిన్ కావేరి కావేరి
2012 నడునిశి నాయగల్ అతిథి పాత్ర
2012 నాన్ ఈ బిందు తెలుగులో "ఈగ" పేరుతో ఏకకాలంలో నిర్మించబడింది
2013 నీదానే ఎన్ పొన్వసంతం నిత్య ఎటో వెళ్ళిపోయింది మనసు యొక్క ఏకకాల నిర్మాణం,
ఇందులో నానీ పోషించిన వరుణ్ పాత్రను తమిళ నటుడు జీవా పోషించాడు
'విజేత', ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటి,
'విజేత', వికటన్ అవార్డ్ - ఉత్తమ నటి,
'విజేత', విజయ్ అవార్డ్ - ఉత్తమ నటి
2014 అంజాన్ జీవా చిత్రీకరణ జరుగుతున్నది
2014 కత్తి వేణి చిత్రీకరణ జరుగుతున్నది

పురస్కారాలు

సైమా అవార్డులు

మూలాలు

బయటి లింకులు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సమంత పేజీ

Tags:

సమంత పెళ్ళి - విడాకులుసమంత నటించిన చిత్రాలుసమంత పురస్కారాలుసమంత మూలాలుసమంత బయటి లింకులుసమంత198728 ఏప్రిల్అత్తారింటికి దారేదిఈగ (సినిమా)ఎటో వెళ్ళిపోయింది మనసుఏ మాయ చేశావేతమిళ్తెలుగుదూకుడు (సినిమా)బృందావనం (2010 సినిమా)సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

🔥 Trending searches on Wiki తెలుగు:

ధర్మవరం శాసనసభ నియోజకవర్గంశ్రీకాళహస్తిఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంఆత్రం సక్కుదేవుడునువ్వు నేనుతెలుగు భాష చరిత్రతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)నరసింహావతారంచిరంజీవులుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుదేవులపల్లి కృష్ణశాస్త్రిశ్రీదేవి (నటి)దివ్యభారతిశుభాకాంక్షలు (సినిమా)షిర్డీ సాయిబాబాఅన్నప్రాశనగ్రామ పంచాయతీసమ్మక్క సారక్క జాతరనానాజాతి సమితిశ్రీనాథుడుహరిశ్చంద్రుడురాజంపేట శాసనసభ నియోజకవర్గంభారత రాజ్యాంగ ఆధికరణలుసర్వే సత్యనారాయణవికలాంగులు2024 భారత సార్వత్రిక ఎన్నికలుసూర్య (నటుడు)నువ్వు లేక నేను లేనుతెలుగు విద్యార్థి2024 భారతదేశ ఎన్నికలుభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాశాసనసభ సభ్యుడుఆర్యవైశ్య కుల జాబితాఅక్బర్తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిఅమిత్ షాప్రధాన సంఖ్యఫిరోజ్ గాంధీకన్యారాశిజ్యేష్ట నక్షత్రంభారతదేశ చరిత్రహార్దిక్ పాండ్యాభారత ప్రధానమంత్రుల జాబితాభద్రాచలంమలేరియాసౌందర్యభారత సైనిక దళంసంస్కృతంభూమన కరుణాకర్ రెడ్డినాగ్ అశ్విన్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంశోభన్ బాబునారా చంద్రబాబునాయుడుగొట్టిపాటి రవి కుమార్దూదేకులగోత్రాలుయాదవవిష్ణు సహస్రనామ స్తోత్రముభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుPHగజము (పొడవు)పెంటాడెకేన్వాతావరణంఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుగర్భాశయమువై.యస్. రాజశేఖరరెడ్డిజాషువాసత్య సాయి బాబాపురుష లైంగికతమండల ప్రజాపరిషత్పిత్తాశయముడీజే టిల్లుజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్అల్లూరి సీతారామరాజుఇత్తడి🡆 More