అన్నప్రాశన

అన్నప్రాశన లేదా అన్నప్రాశనం పుట్టిన బిడ్డకు తొలిసారిగా అన్నం తినిపించే ఒక కార్యక్రమం.

ఇది తెలుగువారి లోగిళ్ళలో కనిపించే ఒక కార్యక్రమం. ఈ సంస్కారం వలన శిశువుకు ఆయువు, ఆరోగ్యం, తేజస్సు వృద్ధి చెందుతాయని ప్రజలు విశ్వసిస్తారు.

అన్నప్రాశన
అన్నప్రాశన జరిపిస్తున్న దంపతులు.


విధానం

పిల్లలకు ఆరు లేక ఎనిమిది లేక పది నెలలు నిండిన తర్వాత గానీ, సంవత్సరం నిండిన తర్వాత గానీ శుక్లపక్షమునందు శుక్రుడు ఆకాశమందు పరిశుద్ధుడై ప్రకాశించుచున్నపుడు అన్నప్రాశనము చేయవలెనని ఋషులచే చెప్పబడినది (ముహూర్త దర్పణం). అన్నప్రాశన మగపిల్లలకు సరినెలలలోను, ఆడపిల్లలకు బేసి నెలలలోను చేయుట లోకాచారముగానున్నది. అన్నప్రాశన పూర్వాహ్ణమందు మాత్రమే చేయవలెను. బిడ్డ తల్లిదండ్రులు తూర్పుముఖంగా చాప మీద కూర్చుని బిడ్డను తల్లి ఒడిలో కూర్చోబెట్టుకోవాలి. ముందు విఘ్నేశ్వర పూజ చేయాలి. బంగారు గిన్నెలోగానీ, వెండి గిన్నె లేదా కంచంలోగానీ పాయసం, తేనె, పెరుగుల మిశ్రమాన్ని కలిపి, తండ్రి బంగారు ఉంగరాన్ని పాయసంలో ముంచి దాన్ని బిడ్డకు తినిపించాలి. ఉంగరంతో మూడుసార్లు తినిపించాక చేత్తో పెట్టాలి. ఈ విధంగా అన్నప్రాశన కార్యక్రమం జరపాలి.

జీవికా పరీక్ష

అన్నప్రాశన సమయంలో దైవ సన్నిధిలో నగలు, డబ్బు, పుస్తకము, కలము, ఆయుధము, పూలు మొదలైన వస్తువులు ఉంచి శిశువును వాటి దగ్గర వదులుతారు. శిశువు మొదటిసారిగా ఏ వస్తువు తాకునో ఆ వస్తువుతో సంబంధమైన జీవనోపాధి ఆ శిశువుకు ఉంటుందని భావన. అన్నప్రాశన దైవ సన్నిధిలో చేయాలి. ముందుగా సత్యనారాయణ స్వామి వ్రతం జరిపి ఆ స్వామి సన్నిధిలో అన్నప్రాశన చేయాలి. భార్యా భార్తలు తూర్పు ముఖంగా కూర్చుని, బిడ్డను తల్లి ఒడిలో కూర్చుండబెట్టాలి. వెండితో కానీ, కంచుతో కానీ చేసిన పాత్రలో పాయసముంచి, అందులో కొద్దిగా నెయ్యి, తేనె వేసి ముందుగా తండ్రి మూడు సార్లు బంగారపు ఉంగరంతో పాయసం తీసి శిశువుకు పెట్టాలి. తరువాత తల్లి కూడా అదేవిధంగా పెట్టాలి. తరువాత మేనమామ తదితరులు పెట్టాలి.

శుభ ఘడియలు

ఈ కార్యక్రమం జరపడానికి సాధారణంగా క్రింది పేర్కొన్న నియమాలు పాటిస్తారు.

తిధులు: విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి, చతుర్దశి.

వారములు: సోమ, బుధ, గురు, శుక్ర

నక్షత్రములు: అశ్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ఠం, శతభిషం, ఉత్తరాబాధ్ర, రేవతి.

లగ్నములు: వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనుస్సు, మీన లగ్నాలు. దశమ స్థానంలో ఏ గ్రహాలూ ఉండకూడదు. ముహూర్త సమయాన బుధ, కుజ, శుక్ర గ్రహాలు ఒక వరసలో ఉండకూడదు.

గ్రహదోషములు: లగ్నంలో రవి ఉండకూడదు. అలా ఉంటే ఆ బిడ్డకు కుష్టు రోగము వచ్చే అవకాశం ఉంది. క్షీణ చంద్రుడుంటే దరిద్రుడు అవుతాడు. కుజుడుంటే పైత్య రోగి, శని ఉన్నచో వాత రోగి, రాహుకేతువులున్నచో మిక్కిలి దరిద్రుడు అవుతాడు.

శుభ గ్రహములు: లగ్నంలో పూర్ణచంద్రుడుంటే అన్నదాత అవుతాడు. బుధుడుంటే విశేష జ్ఞానవంతుడు, గురుడుంటే భోగి, శుక్రుడుంటే దీర్ఘాయువు కలవాడు అవుతాడు.

అన్నప్రాశన కాలం: శిశువు వయసు 6 నుంచి 12 నెలలలోపు ఉండగా ఎప్పుడైననూ చేయవచ్చు. అయితే శుక్లపక్షంలో శుక్రుడు ఆకాశంలో పరిశుద్ధుడై ప్రకాశిస్తున్నప్పుడు అన్నప్రాశన చేయాలి. మగపిల్లలకు సరి నెలలలోనూ, ఆడ పిల్లలకు బేసి నెలలలోనూ చేయాలి. దీనిని పూర్ణాహ్వమందు మాత్రమే చేయాలి.

ఇవి కూడా చూడండి

Tags:

అన్నప్రాశన విధానంఅన్నప్రాశన జీవికా పరీక్షఅన్నప్రాశన శుభ ఘడియలుఅన్నప్రాశన ఇవి కూడా చూడండిఅన్నప్రాశనఅన్నంఆరోగ్యముప్రజలుశిశువు

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత సైనిక దళంహస్తప్రయోగంఆంధ్రప్రదేశ్ శాసనమండలిపరశురాముడుజీవన నైపుణ్యంభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితామర్రినాగార్జునసాగర్ఎస్.వి. రంగారావుసమ్మక్క సారక్క జాతరవిద్యభారత జాతీయ కాంగ్రెస్దావీదుఆంధ్రజ్యోతిమీనాతెలుగు భాష చరిత్రతెలంగాణ చరిత్రరక్త పింజరిపడమటి కనుమలుమూర్ఛలు (ఫిట్స్)పురుష లైంగికతదొడ్డి కొమరయ్యసత్యనారాయణ వ్రతంమేషరాశికేంద్రపాలిత ప్రాంతంజయలలిత (నటి)గ్లోబల్ వార్మింగ్అయోధ్యబ్రహ్మంగారి కాలజ్ఞానంచంపకమాలత్రిఫల చూర్ణంప్రకటనఈనాడుమంచు విష్ణుమూలా నక్షత్రంబొల్లివయ్యారిభామ (కలుపుమొక్క)విజయనగర సామ్రాజ్యంవిల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్చదరంగం (ఆట)బుధుడు (జ్యోతిషం)తెలుగు కవులు - బిరుదులురష్మికా మందన్నఆయుష్మాన్ భారత్దశరథుడురోహిణి నక్షత్రంఆవర్తన పట్టికవ్యవసాయంఆరుద్ర నక్షత్రమువడ్రంగిఎయిడ్స్బి.ఆర్. అంబేడ్కర్కాకతీయుల శాసనాలుగైనకాలజీదాశరథి కృష్ణమాచార్యహోళీపద్మశాలీలుయూరీ గగారిన్ఆతుకూరి మొల్లపంచారామాలుతెలంగాణా సాయుధ పోరాటంకాన్సర్పవన్ కళ్యాణ్ఖలిస్తాన్ ఉద్యమంశ్రీ చక్రంఅల్లూరి సీతారామరాజురామేశ్వరంతెలంగాణ పల్లె ప్రగతి పథకంఅల్ప ఉమ్మనీరుసంయుక్త మీనన్శ్రీనాథుడుజాతీయ ఆదాయంఆరుగురు పతివ్రతలుసరస్వతికౌరవులుతమలపాకుకావ్య ప్రయోజనాలుఅచ్చులు🡆 More