భూమన కరుణాకర్ రెడ్డి

భూమన కరుణాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.

ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచాడు.

భూమన కరుణాకరరెడ్డి
భూమన కరుణాకర్ రెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం తిరుపతి నియోజకవర్గం
నియోజకవర్గం Thirupathi

వ్యక్తిగత వివరాలు

జననం 05 ఏప్రిల్ 1958
ఈదరపల్లె, నందలూరు మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు జయరాం రెడ్డి
జీవిత భాగస్వామి రేవతి
సంతానం ఇద్దరు - భూమ‌న అభిన‌య్‌రెడ్డి
నివాసం పద్మావతీపురం, రేణిగుంట, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

జననం, విద్యాభాస్యం

భూమన కరుణాకరరెడ్డి 05 ఏప్రిల్ 1958లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా,నందలూరు మండలం, ఈదరపల్లె లో జన్మించాడు. ఆయన ఎస్.వి. యూనివర్సిటీ నుండి బీఏ., ఎం.ఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

భూమన కరుణాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన చిన్నతనం నుంచి అభ్యుధయ భావాలతో పెరిగి ఎన్నో ప్రజాఉద్యమాలు చేసి జైలుకు వెళ్ళాడు, అక్కడ వైఎస్ రాజారెడ్డికి జైల్లో పరిచయమై అప్పటినుంచి వైఎస్ కుటుంబానికి నమ్మినబంటుగా ఉంటూ వై.యస్. రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగాడు. వై.యస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు చేపట్టిన పాదయాత్రను ఆయనే దగ్గరుండి పర్యవేక్షించాడు. భూమన కరుణాకరరెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి చిరంజీవి చేతిలో ఓడిపోయాడు. వై.యస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినా తరువాత 2004 నుండి 2006 వరకు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ (తుడా) చైర్మన్‌గా నియమితుడై, 2006 నుండి 2008 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా పని చేశాడు.

ఆయన వై.యస్. రాజశేఖరరెడ్డి మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తిరుపతి నియోజకవర్గం నుండి 2012లో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఎం. వెంకటరమణ చేతిలో ఓడిపోయాడు. భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీ బలోపేతానికి కృషి చేసి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మన్నూరు సుగుణ పై 708 ఓట్లతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2021లో టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితుడయ్యాడు.

భూమన కరుణాకర్‌రెడ్డిని 2023 ఆగష్టు 05న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మూలాలు

Tags:

తిరుపతి శాసనసభ నియోజకవర్గం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంధ్రప్రదేశ్ మండలాలుతిరుపతిసజ్జా తేజవంగా గీతఅనుష్క శెట్టిచైనాహిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాభారతీయ సంస్కృతిసురేఖా వాణిదీపావళిజయలలిత (నటి)వందే భారత్ ఎక్స్‌ప్రెస్మొఘల్ సామ్రాజ్యంAభగత్ సింగ్నామనక్షత్రముజొన్నఆరూరి రమేష్వై.ఎస్.వివేకానందరెడ్డిశ్రీరామనవమికారాగారంసావిత్రి (నటి)భూమన కరుణాకర్ రెడ్డిహైదరాబాద్ రేస్ క్లబ్చిరంజీవిమహేంద్రసింగ్ ధోనిడీజే టిల్లువృషభరాశిఆప్రికాట్జోల పాటలుకల్వకుంట్ల తారక రామారావువందేమాతరంరామోజీరావుసందీప్ కిషన్ఇజ్రాయిల్తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాగాంధీఐడెన్ మార్క్‌రమ్అమ్మకోసంలిబియారావి చెట్టుచే గువేరావింధ్య విశాఖ మేడపాటిసుమతీ శతకముట్రావిస్ హెడ్బరాక్ ఒబామాప్రజాస్వామ్యంమృగశిర నక్షత్రముభారత రాజ్యాంగ సవరణల జాబితాకల్వకుంట్ల కవితఆటలమ్మపరిపూర్ణానంద స్వామిభాషా భాగాలురాజమండ్రినవధాన్యాలుఆలివ్ నూనెపన్నుసికిల్ సెల్ వ్యాధినల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిఊర్వశి (నటి)చాకలి ఐలమ్మఅధిక ఉమ్మనీరుబ్రాహ్మణ గోత్రాల జాబితాఎస్. శంకర్సుహాసినిఫేస్‌బుక్అయోధ్య రామమందిరంసామెతల జాబితాబుర్రకథఫిదాభారత రాజ్యాంగ ఆధికరణలుశ్రీకాంత్ (నటుడు)భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుజైన మతంయేసు శిష్యులుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా🡆 More