నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.

అయన కోవూరు నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం కోవూరు నియోజవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 12 డిసెంబర్ 1961
కోవూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, శ్రీలక్ష్మమ్మ
జీవిత భాగస్వామి నల్లపరెడ్డి గీత
సంతానం నల్లపరెడ్డి రజత్‌ కుమార్‌ రెడ్డి
నివాసం సుజాతమ్మ కాలనీ, దర్గామిట్ట, నెల్లూరు

జననం, విద్యాభాస్యం

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 12 డిసెంబర్ 1961లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, దర్గామిట్టలో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, శ్రీలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. అయన 1984లో ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్, హైదరాబాద్‌ నుండి బీఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 1993లో తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చి 1994లో జరిగిన ఎన్నికల్లో కోవూరు పశ్చిమ నియోజవర్గం నుండి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో చక్కెర కర్మాగారాల శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 1999లో గెలిచి 2004లో ఓడిపోయాడు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 2009లో జరిగిన ఎన్నికల్లో కోవూరు పశ్చిమ నియోజవర్గం నుండి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. వై.యస్. రాజశేఖరరెడ్డి మరణాంతరం 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పై 23,494 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో కోవూరు పశ్చిమ నియోజవర్గం నుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ 2019లో జరిగిన ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచాడు.

మూలాలు

Tags:

కోవూరు శాసనసభ నియోజకవర్గం

🔥 Trending searches on Wiki తెలుగు:

హైపోథైరాయిడిజంవేమనఏనుగుపంచభూతలింగ క్షేత్రాలుభాషా భాగాలుఇంగువమాచెర్ల శాసనసభ నియోజకవర్గంకుమ్మరి (కులం)భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలురౌద్రం రణం రుధిరంఅమర్ సింగ్ చంకీలాశ్రీ కృష్ణదేవ రాయలుజోర్దార్ సుజాతషరియాపార్వతిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుఆవర్తన పట్టికవై.యస్.అవినాష్‌రెడ్డిరాజమహల్మహాభారతంతెనాలి రామకృష్ణుడునరసింహ శతకముచిరంజీవులుఇండియన్ ప్రీమియర్ లీగ్స్వామియే శరణం అయ్యప్పనువ్వు లేక నేను లేనురైతుబంధు పథకంతమన్నా భాటియాచార్మినార్కార్తెమలబద్దకంమహాభాగవతంభారత ఎన్నికల కమిషనుభారత ప్రభుత్వంపిత్తాశయమురకుల్ ప్రీత్ సింగ్శుక్రాచార్యుడుఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిఋగ్వేదంసమ్మక్క సారక్క జాతరతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకేంద్రపాలిత ప్రాంతంబంగారంబతుకమ్మవిష్ణువుహార్సిలీ హిల్స్తెలుగు సినిమాలు 2024డామన్వై. ఎస్. విజయమ్మగంగా నదిమార్కస్ స్టోయినిస్ఇందిరా గాంధీకూలీ నెం 1దశరథుడునామినేషన్శార్దూల విక్రీడితముఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థఢిల్లీ డేర్ డెవిల్స్విశ్వామిత్రుడుతెలుగు భాష చరిత్రఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీబ్లూ బెర్రీశతభిష నక్షత్రముతెలుగు సాహిత్యంజ్యోతీరావ్ ఫులేవేయి స్తంభాల గుడిజ్ఞానపీఠ పురస్కారంతెలుగు పత్రికలుజాతీయ ప్రజాస్వామ్య కూటమితెలుగు నెలలుపెళ్ళిచిరంజీవిజగ్జీవన్ రాంసంగీత వాద్యపరికరాల జాబితాక్షయమిథునరాశిభారతీయ సంస్కృతిహనుమజ్జయంతి🡆 More