చిరంజీవి: తెలుగు సినీ నటుడు, రాజకీయ నాయకుడు

చిరంజీవి (జ.

1955 ఆగస్టు 22) తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. కేంద్ర ప్రభుత్వంలో 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 దాకా పర్యాటక శాఖా మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్)గా పనిచేశాడు. తన బ్రేక్ డ్యాన్స్ కు పేరు పొందిన చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువభాగం తెలుగు చిత్రాలు. మిగతావి తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు. 39 ఏళ్ళకు పైబడ్డ నట ప్రస్థానంలో మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నాడు. 2006 లో చిరంజీవికి చలన చిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ బహుమతి, 2024లో పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ఇచ్చింది. మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా.

చిరంజీవి
చిరంజీవి

2011 లో చిరంజీవి


రాజ్యసభ ఎం.పి
పదవీ కాలం
2012 ఏప్రిల్ 3 – 2018 ఏప్రిల్ 2
ముందు రషీద్ ఆల్వి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ
తరువాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్

పర్యాటక శాఖా మంత్రి (ఇండిపెండెంట్ చార్జి)
పదవీ కాలం
2012 అక్టోబరు 27 – 2014 మే 26
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు సుబోధ్ కాంత్ సహాయ్
తరువాత శ్రీపద్ యస్సో నాయక్

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే, తిరుపతి నియోజకవర్గం
పదవీ కాలం
2009 – 2012
ముందు ఎం. వెంకటరమణ
తరువాత భూమన కరుణాకర్ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం (1955-08-22) 1955 ఆగస్టు 22 (వయసు 68)
మొగల్తూరు, ఆంధ్రప్రధేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ (2011—ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు ప్రజా రాజ్యం పార్టీ (2008–2011) వ్యవస్థాపకుడు
తల్లిదండ్రులు అంజనాదేవి, వెంకట్ రావు
జీవిత భాగస్వామి
సురేఖ కొణిదెల
(m. 1980)
బంధువులు నాగబాబు, పవన్ కళ్యాణ్ (తమ్ముళ్లు)
సంతానం సుస్మిత, రాం చరణ్ తేజ, శ్రీజ
నివాసం జూబ్లీ హిల్స్, హైదరాబాద్, తెలంగాణా (శాశ్వత నివాసం),
న్యూఢిల్లీ, (అధికారిక నివాసం)
పూర్వ విద్యార్థి
  • మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్
  • ఆంధ్ర విశ్వవిద్యాలయం
  • శ్రీ వై. ఎన్ కళాశాల
వృత్తి
  • సినీ నటుడు
  • రాజకీయ నాయకుడు
  • టివి వ్యాఖ్యాత
పురస్కారాలు పద్మభూషణ్ (2006)
పద్మ విభూషణ్ (2024)

1978లో వచ్చిన పునాదిరాళ్ళు చిత్రంతో చిరంజీవి నటజీవితం ప్రారంభమైంది. కానీ అంతకుముందే ప్రాణం ఖరీదు విడుదలైంది. 1987లో చిరంజీవి నటించిన స్వయంకృషి చిత్రం రష్యన్ భాషలోకి అనువాదమై మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడింది. ఈ చిత్రానికి గాను చిరంజీవి 1988 ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది బహుమతి అందుకున్నాడు. అదే సంవత్సరంలో 59 వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవానికి భారత ప్రతినిధుల్లో ఒకడిగా వెళ్ళాడు. 1988 లో చిరంజీవి సహ-నిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ చిత్రం జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి అందుకుంది.

1992 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఘరానా మొగుడు చిత్రం 10 కోట్ల రూపాయలకు పైగా స్థూల వసూళ్ళు సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం 1993 లో జరిగిన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెయిన్ స్ట్రీం విభాగంలో ప్రదర్శింపబడింది. ఈ సినిమాతో చిరంజీవి భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా జాతీయ వారపత్రికల ముఖచిత్రంపై ఎక్కాడు. ఫిల్మ్ ఫేర్, ఇండియా టుడే పత్రికలు చిరంజీవిని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్తో పోలుస్తూ బిగ్గర్ దాన్ బచ్చన్ అని శీర్షికలు వెలువరించాయి. ది వీక్ పత్రిక చిరంజీవిని ది న్యూ మనీ మెషీన్గా అభివర్ణించింది. 1992లో వచ్చిన ఆపద్బాంధవుడు సినిమాకు 1.25 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నాడు. అప్పటికి అది భారతదేశంలో ఏ నటుడూ తీసుకోనంత ,పారితోషికం. 2002లో భారత కేంద్రప్రభుత్వ ఆర్థిక శాఖ 1999-2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుగా సమ్మాన్ పురస్కారాన్ని ప్రకటించింది. 2006 లో సి.ఎన్.ఎన్. ఐబిఎన్ నిర్వహించిన సర్వేలో తెలుగు చిత్రపరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా గుర్తించింది.

2013 లో చిరంజీవి పర్యాటక శాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఇన్‌క్రెడిబుల్ఇండియా ప్రచారాన్ని 66 వ కేన్స్ చలనచిత్రోత్సవ వేదిక మీద ప్రారంభించాడు. మకావులో జరిగిన 14 వ అంతర్జాతీయ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో చిరంజీవి ఇన్‌క్రెడిబుల్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. 2013లో ఐ.బి.ఎన్ లైవ్ చిరంజీవి భారతీయ సినిమాను ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకడిగా పేర్కొనింది..

చిన్నారి పాటకి ఫిదా అయిన మెగాస్టార్ చిరంజీవి Archived 2023-05-25 at the Wayback Machine

బాల్యం, విద్యాభ్యాసం

చిరంజీవి 1955 ఆగష్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఆయనకు ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేది. చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉన్నాడు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. విద్యార్థి దశలో చిరంజీవి ఎన్.సి.సిలో చేరి 1970వ దశకంలో న్యూఢిల్లీలో జరిగిన పెరేడ్ లో పాల్గొన్నాడు. చిన్నతనం నుంచి నటనమీద ఆసక్తి ఏర్పడింది. ఒంగోలు లోని సి.ఎస్.ఆర్ శర్మ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. నరసాపురంలోని శ్రీ వై.ఎన్. కళాశాల నుంచి వాణిజ్య శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న తర్వాత 1976లో చెన్నై వెళ్ళి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేరాడు.

కుటుంబం

1980 ఫిబ్రవరి 20 న చిరంజీవి వివాహం హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు సుస్మిత, శ్రీజ, ఒక కుమారుడు రాంచరణ్ తేజ. రాంచరణ్ కూడా సినీ నటుడు, నిర్మాత.

చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు సినిమా నిర్మాత, నటుడు. మరో సోదరుడు పవన్ కళ్యాణ్ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు. చిరంజీవి బావ అల్లు అరవింద్ సినిమా నిర్మాత. అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్, అల్లు శిరీష్ సినిమా నటులు. నాగేంద్రబాబు కొడుకు వరుణ్ తేజ్, కుమార్తె నీహారిక, ఇంకా చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వారి సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా నటన వృత్తిలో ఉన్నవారే.

చలనచిత్ర ప్రస్థానం

1978-1981 తొలి అడుగులు

చెన్నై లోని మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978లో పునాది రాళ్లు చిత్రం చిరంజీవి నటించిన మొదటి చిత్రం. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం 1,116 రూపాయలు. బాపు దర్శకత్వంలో వచ్చిన మనవూరి పాండవులు చిత్రం చిరంజీవికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునిచ్చింది. తాయారమ్మ బంగారయ్య చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించాడు. ఐ లవ్ యు (1979)లో ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించాడు. కె. బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన ఇది కథ కాదు చిత్రంలో ప్రతినాయకుడిగా నటించాడు. ఇంకా మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, 47 రోజులు, న్యాయం కావాలి, రాణువ వీరన్ వంటి చిత్రాలలో చిన్న పాత్రలు, ప్రతినాయక పాత్రలు పోషించాడు.

తమిళ చిత్రం అవర్ గళ్ తెలుగు రీమేక్ లో తమిళంలో రజనీకాంత్ పోషించిన పాత్ర పోషించాడు. 1979లో చిరంజీవి నటించిన 8 చిత్రాలు విడుదలవగా తర్వాతి సంవత్సరంలో 14 చిత్రాలు విడుదలయ్యాయి.

1982 - 1986 కథానాయక పాత్రల వైపు

1982 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాంటి చిత్రాలతో చిరంజీవి ప్రధాన కథానాయకుడిగా నటించడం ప్రారంభమైంది. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచింది. తర్వాత కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వరకట్న దురాచారం మీద వచ్చిన శుభలేఖ అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో నటనకు గాను చిరంజీవికి ఉత్తమ నటుడిగా తెలుగు ఫిల్మ్ ఫేర్ బహుమతి అందుకోగా, కె. విశ్వనాథ్ కి ఉత్తమ దర్శకుడిగా తెలుగు ఫిల్మ్ ఫేర్ బహుమతి దక్కింది. 1983లో ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధించి చిరంజీవికి స్టార్ డం (పేరు) సాధించి పెట్టింది. తర్వాత ఇది పెళ్ళంటారా, సీతాదేవి, టింగురంగడు, బంధాలు అనుబంధాలు, మొండిఘటం మొదలైన చిత్రాల్లో నటించాడు. తర్వాత పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లా రంగా, మంచు పల్లకీ లాంటి చిత్రాల్లో నటించాడు.

1984 లో మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, ఛాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, అడవిదొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు, లాంటి విజయవంతమైన యాక్షన్ సినిమాల్లో నటించాడు. 1985 లో చిరంజీవికి విజేత చిత్రంలో నటనకు రెండవసారి ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1986లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి చిత్రంలో హాస్యప్రధానమైన నాయకుడి పాత్ర పోషించాడు చిరంజీవి.

1987 - 2007 వ్యాపారాత్మక విజయాలు

1987 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వయంకృషి చిత్రంతో చిరంజీవి మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది బహుమతి అందుకున్నాడు. పసివాడి ప్రాణం (1987), యముడికి మొగుడు (1988), మంచిదొంగ (1988) బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. పసివాడి ప్రాణం ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు మొదటిసారిగా బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేశాడు. 1988లో చిరంజీవి సహ నిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవీణ జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి, నంది స్పెషల్ జ్యూరీ బహుమతి అందుకుంది. 1990లో అశ్వనీదత్ నిర్మాణ సారథ్యంలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగదేకవీరుడు అతిలోకసుందరి అనే ప్రయోగాత్మక సోషియో ఫాంటసీ చిత్రంలో నటించాడు. ఇళయరాజా సంగీత దర్శకత్వం, జంధ్యాల మాటలు అందించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా నిలిచింది. అదే సంవత్సరంలో విడుదలైన కొండవీటి దొంగ 70mm, 6-ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ లో విడుదలైన మొట్టమొదటి తెలుగు చిత్రం. 1991 లో సామాజిక సమస్యల నేపథ్యంలో వచ్చిన కొదమ సింహం, గ్యాంగ్ లీడర్ సినిమాలు చిరంజీవికి తెలుగు చిత్రపరిశ్రమలో సుస్థిరమైన స్థానాన్ని సాధించిపెట్టాయి. కొదమ సింహం చిత్రం ఆంగ్లంలో తీఫ్ ఆఫ్ బాగ్దాద్గా అనువాదం గావించబడి నార్త్ అమెరికా, మెక్సికో, ఇరాన్, ఇతర దేశాలలో విజయవంతంగా ప్రదర్శింపబడింది. ఇది ఆంగ్లంలోకి అనువదించబడిన మొట్టమొదటి దక్షిణ భారత చలనచిత్రం.

చిరంజీవి బాలీవుడ్ లో నటించిన ప్రతిబంధ్ (1990), ఆజ్ కా గూండా రాజ్ చిత్రాలకు మంచి సమీక్షలు వచ్చాయి. 1992 లో చిరంజీవి నటించిన ఆపద్బాంధవుడు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా రెండో సారి నంది బహుమతి, ఫిల్మ్ ఫేర్ తెలుగు బహుమతి అందుకున్నాడు. 1996 లో సిపాయి అనే కన్నడ సినిమాలో అతిథి పాత్ర పోషించాడు చిరంజీవి. 1989 లో వచ్చిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రం తమిళంలో మాప్పిళైగా పునర్నిర్మితమైంది. ఇందులో రజనీకాంత్ కథానాయకుడిగా కనిపిస్తే, చిరంజీవి అతిథి పాత్రలో నటించాడు. 1990 దశకం మధ్య కాలంలో మెకానిక్ అల్లుడు, ఎస్.పి.పరశురాం, బిగ్ బాస్, రిక్షావోడు చిత్రాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ సమయంలో కూడా చిరంజీవికి నాలుగోసారి ఫిల్మ్ ఫేర్ సాధించి పెట్టిన ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్ళు, అల్లుడా మజాకా చిత్రాలు ఒక మోస్తరు విజయాలు సాధించాయి. కొంతకాలం తర్వాత హిట్లర్ (1997), మాస్టర్ (1997), బావగారూ బాగున్నారా?, చూడాలని వుంది (1998), స్నేహం కోసం (1999) లాంటి చిత్రాలతో మళ్ళీ విజయాలబాట పట్టాడు. స్నేహం కోసం చిత్రంలో నటనకు గాను ఐదోసారి ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు.

1999 లో చిరంజీవి దుషాన్ గార్సీ దర్శకత్వంలో రమేష్ కృష్ణమూర్తి నిర్మాతగా ఒక హాలీవుడ్ చిత్రంలో నటించవలసి ఉంది. దీని తెలుగు మూల చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ది రిటర్న్ ఆఫ్ ది తీఫ్ ఆఫ్ బాగ్ధాద్ అని పేరు పెట్టిన ఈ చిత్రం తెలియని కారణాలతో ఆగిపోయింది.

దస్త్రం:Chiranjeevi politics poster.JPG
2007-2008 సంవత్సరాలలో చిరంజీవి రాజకీయాలలోకి రావాలని రాష్ట్రమంతటా ప్రదర్శనలు జరిగాయి. పోస్టర్లు వెలిశాయి.

కొత్త సహస్రాబ్దంలో చిరంజీవి కెరీర్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో అన్నయ్య (2000) చిత్రంతో ప్రారంభమైంది. 2001లో కన్నడ, తెలుగులో విడుదలైన ద్విభాషా ఆధ్యాత్మిక చిత్రం శ్రీ మంజునాథలో శివుడిగా నటించాడు. మంజునాథుడిగా అర్జున్ నటించాడు. ఇది కర్ణాటకలోని ధర్మస్థల మంజునాథేశ్వర స్వామి భక్తుడి నేపథ్యంలో తీసిన చిత్రం. కొంచెం వ్యవధి తర్వాత 2002లో వచ్చిన ఇంద్ర అప్పటి వరకు ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులు తిరగరాసింది. చిరంజీవికి ఉత్తమ నటుడిగా మూడోసారి నంది పురస్కారం, ఆరోసారి ఫిల్మ్ ఫేర్ బహుమతి దక్కింది. ఠాగూర్ సినిమా చిరంజీవిని తారాపథాన్ని అత్యుత్తమ స్థానానికి తీసుకువెళ్ళింది. దీని తర్వాత హిందీ చిత్రం మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్ రీమేక్ అయిన శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. చిత్రంలో నటించాడు. ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఏడోసారి ఫిల్మ్ ఫేర్ బహుమతి అందుకున్నాడు. 2006 లో మురుగ దాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ చిత్రంలో నటించాడు. ఈ మూడు చిత్రాలు ఏదో ఒక సామాజిక ఇతివృత్తం ఉన్నవే. 2006 లో ఈయనకు ఫిల్మ్ ఫేర్ సౌత్ ప్రత్యేక బహుమతి అందజేసింది. ఇదే సమయంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు విస్తృతంగా చర్చనీయాంశాలయ్యాయి.

2008 - 2016 విరామం

2007లో చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ తర్వాత సుమారు పదేళ్ల పాటు మరే సినిమాలో కథానాయకుడిగా నటించలేదు. ఈ సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఈ పదేళ్ళలో అడపా దడపా అతిథి పాత్రల్లో కనిపించాడు. 2009 లో కొడుకు రాం చరణ్ కథానాయకుడిగా వచ్చిన మగధీర, 2015లో వచ్చిన బ్రూస్ లీ చిత్రాల్లో తన నిజ జీవిత పాత్రల్లో కనిపించాడు. 2010 లో వచ్చిన వరుడు, 2015లో వచ్చిన రుద్రమదేవి చిత్రాల్లో నేపథ్య సంభాషణకు తన గాత్రం అందించాడు. 2001 లో వచ్చిన శ్రీమంజునాథ చిత్రంలో శివుడి పాత్రలాగానే 2013 లో వచ్చిన శ్రీ జగద్గురు ఆదిశంకర చిత్రంలో శివుడిగా అతిథి పాత్రలో కనిపించాడు.

2017 - ప్రస్తుతం, పునరాగమనం

2013 నుంచే చిరంజీవి తిరిగి నటనారంగంలోకి ప్రవేశించడానికి సరైన కథ కోసం అన్వేషణ ప్రారంభించాడు. అది యాధృచ్చికంగా తన 150వ చిత్రం కావటం విశేషం. దాదాపు పది సంవత్సరాల తర్వాత చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నెం.150, 2017 జనవరి 11 న విడుదల అయ్యింది. ఇది 2014 లో తమిళంలో విడుదలై మంచి విజయం సాధించిన కత్తి అనే చిత్రానికి పునర్నిర్మాణం. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2017 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మంచి సమీక్షలనందుకుంది.

తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్-డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చును. అంతకు ముందు ఉన్న కథానాయకుల చిత్రాలలో ఈ అంశాలున్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు.

2019 లో చిరంజీవి తన మొదటి పీరియాడిక్ చిత్రం సైరా నరసింహారెడ్డిలో నటించారు. స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  జీవిత కథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. 200 కోట్ల పైచిలుకు వ్యయంతో నిర్మించిన సైరా 240 కోట్లకు పైగా వసూలు చేసింది. 2022 లో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య  చిత్రంతో తన కుమారుడు రామ్ చరణ్ తో కూడా నటించారు. 2022 లో మోహన రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5వ తేదీన విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది చిరంజీవి ప్రస్తుతం బింబిసార దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం లో ప్రస్తుతం సినిమా చేస్తున్నారు ఈ సినిమా కి విశ్వంభర అనే టైటిల్ ని పరీశీలిస్తున్నారు. చిరంజీవి

ఇతర భాషలు

  • గ్యాంగ్ లీడర్ హిందీ పునర్నిర్మాణం ఆజ్ కా గూండారాజ్ లో, అంకుశం హిందీ పునర్నిర్మాణం ప్రతిబంధ్ లో, దక్షిణాదిన విజయవంతమయిన జెంటిల్ మేన్ హిందీ పునర్నిర్మాణం ది జెంటిల్ మేన్లో కూడా కథానాయకుడుగా నటించాడు. ఘరానా మొగుడు మలయాళంలోకి హేయ్ హీరోగా అనువదించబడింది.
  • పశ్చిమ ఐరోపా ఖండం, ల్యాటిన్ అమెరికా లలో సైతం చిరు పేరొందాడు. దొంగ చిత్రంలో గోలి మార్ పాటకి మైఖేల్ జాక్సన్ రూపొందంచిన థ్రిల్లర్ ఆల్బం మూలం. ఈ పాటల్లో చిరు, జాక్సన్ నాట్య భంగిమలు, వేషధారణలలో చాలా సామ్యం కనబడుతుంది. అందుకే ఈ దేశాలలో చిరుని ఇండియన్ జాక్సన్గా వ్యవహరిస్తారు.

సేవా కార్యక్రమాలు

చిరంజీవి: బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబం, చలనచిత్ర ప్రస్థానం 
హైదరాబాదు‌లో చిరంజీవి రక్త, నేత్రనిధి ప్రధాన కార్యాలయం

చిరంజీవి అక్టోబర్ 2, 1998లో 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' స్థాపించాడు. 'చిరంజీవి బ్లడ్ బాంక్', 'చిరంజీవి ఐ బాంక్' ఈ ట్రస్టు నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా ఇవి గుర్తింపు పొందాయి. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పథాన్ని పెద్దయెత్తున సమాజసేవా కార్యక్రమాలకు మళ్ళించడం ఈ ట్రస్టులు సాధించిన ఘనవిజయం. వీరి రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మంది, నేత్రదానం వలన 1000 మంది సేవలనందుకొన్నారని అంచనా . ఇప్పటికి ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. నాలుగు సంవత్సరాలు ఈ సంస్థలు 'అత్యుత్తమ సేవా సంస్థలు'గా రాష్ట్ర ప్రభుత్వ బహుమతిని అందుకొన్నాయి.

సత్కారాలు

పురస్కారం పేరు బహుకరించింది సంవత్సరం ఇతర వివరాలు
చిరంజీవి: బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబం, చలనచిత్ర ప్రస్థానం 
పద్మ విభూషణ్‌ 2024
చిరంజీవి: బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబం, చలనచిత్ర ప్రస్థానం 
పద్మభూషణ్ 2006 జనవరి,2006లో భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలామ్ నుండి పద్మభూషణ్ పురస్కారం స్వీకరణ
డాక్టరేట్ 2006 2006 నవంబరులో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేటు ఆంధ్ర విశ్వవిద్యాలయం తరపున అప్పటి ఆంధ్ర గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ నుండి

రాజకీయ చరిత్ర

చిరంజీవి రాజకీయ రంగప్రవేశంపై 2007 నుంచీ అనేక వార్తలు వచ్చాయి. 2008 ఆగస్టు 17 తన రాజకీయ ప్రవేశ విషయం పై పత్రికా ముఖంగా ప్రకటన విడుదల చేసారు. పేదలకు అనుకూలమైన విధానాలు, సామాజిక న్యాయం తమ పార్టీ ముఖ్య ఆశయాలని పేర్కొన్నాడు. 2008 ఆగస్టు 26 న (మదర్ థెరిసా జన్మదినం) తిరుపతి ఆవిలాల చెరువు మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజారాజ్యం అనే పార్టీని, పతాకాన్ని ఆవిష్కరించాడు. ఆయన రాజకీయ ప్రవేశంతో చేసే విధి విధానాలు ప్రకటించాడు. ప్రస్తుతానికి చిత్రాల్లో నటించే ఆలోచనలు ప్రక్కన పెట్టినట్లు ప్రకటించాడు. 2009 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 295 స్థానాలకు పోటీ చేయగా 18 స్థానాలను గెలుచుకుంది. చిరంజీవి పాలకొల్లు, తిరుపతి శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా, తిరుపతి నుంచి గెలిచి పాలకొల్లులో ఓడిపోయాడు. తన పార్టీ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభ సభ్యత్వాన్ని పొంది...కేంద్ర పర్యాటక మంత్రి గా శ్వంతంత్ర హోదా లో విధులు నిర్వర్తించారు..

ref>"Chiranjeevi starts a new role as Andhra MLA". CNN-IBN. 3 June 2009. Archived from the original on 7 జూన్ 2009. Retrieved 15 October 2010.

2011, ఫిబ్రవరి 6 వ తేదీన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు. అయితే సమకాలిక రాజకీయాలతో ఇమడలేక రాజాకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పి తిరిగి సినిమాలలో నటిస్తున్నాడు. 2021లో చిరంజీవి సినిమాలు కనీసం రెండు విడుదల కాబోతున్నాయి.

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు


Tags:

చిరంజీవి బాల్యం, విద్యాభ్యాసంచిరంజీవి కుటుంబంచిరంజీవి చలనచిత్ర ప్రస్థానంచిరంజీవి ఇతర భాషలుచిరంజీవి సేవా కార్యక్రమాలుచిరంజీవి సత్కారాలుచిరంజీవి రాజకీయ చరిత్రచిరంజీవి ఇవీ చూడండిచిరంజీవి మూలాలుచిరంజీవి బయటి లింకులుచిరంజీవిఆంధ్ర విశ్వవిద్యాలయంపద్మ విభూషణ్ పురస్కారంపద్మభూషణ్ పురస్కారం

🔥 Trending searches on Wiki తెలుగు:

గురజాడ అప్పారావురేవతి నక్షత్రంవేంకటేశ్వరుడుఘట్టమనేని కృష్ణమెదక్ లోక్‌సభ నియోజకవర్గంజీలకర్రరజినీకాంత్కొణతాల రామకృష్ణరామోజీరావుపాకిస్తాన్తెలుగు సినిమాల జాబితాసప్త చిరంజీవులుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసింగిరెడ్డి నారాయణరెడ్డివ్యాసుడుపంచకర్ల రమేష్ బాబుశ్రేయాస్ అయ్యర్దర్శి శాసనసభ నియోజకవర్గంఆపిల్జూనియర్ ఎన్.టి.ఆర్పెళ్ళిఆది (నటుడు)జెర్రి కాటుచార్మినార్పురాణాలుబుధుడు (జ్యోతిషం)హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గందుబాయ్తిరుపతిరైతుపమేలా సత్పతిజవహర్ నవోదయ విద్యాలయంరామావతారంటమాటోమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిగోల్కొండఫేస్‌బుక్ముఖేష్ అంబానీభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంయేసు శిష్యులుమంతెన సత్యనారాయణ రాజుసప్తర్షులుహను మాన్భీమా (2024 సినిమా)శ్రీశ్రీపర్యాయపదంకడియం శ్రీహరికాజల్ అగర్వాల్వై.ఎస్.వివేకానందరెడ్డిఆర్యవైశ్య కుల జాబితాచిత్త నక్షత్రముచిరుధాన్యంసయ్యద్ నసీర్ అహ్మద్మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిపరిటాల రవిరాశిజోర్దార్ సుజాతమూలా నక్షత్రంతోట త్రిమూర్తులుభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఐక్యరాజ్య సమితిఓం భీమ్ బుష్కనకదుర్గ ఆలయంకన్యారాశిపరీక్షరాజ్యసభఇంద్రజగూగుల్వారాహికామసూత్రవిశ్వనాథ సత్యనారాయణరోహిత్ శర్మముక్కుముఖ్యమంత్రిసంగీత వాయిద్యంసాహిత్యంలెనిన్🡆 More