నిజాం కళాశాల

నిజాం కళాశాల హైదరాబాదు నగరంలో పేరొందిన ఉన్నత విద్యా సంస్థ, ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో స్వయంప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయం.

నిజాం కళాశాల 1887లో ఆరవ అసఫ్‌జాహీ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పాలనలో స్థాపించబడింది. ఇది హైదరాబాదులోని బషీర్‌బాగ్ ప్రాంతంలో ఉంది. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

నిజాం కళాశాల
నిమ్స్
నిజాం కళాశాల
రకంసార్వత్రిక
స్థాపితం1887
స్థానంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
కాంపస్పట్టణ ప్రాంతం
అనుబంధాలుఉస్మానియా విశ్వవిద్యాలయం
జాలగూడుఅధికారిక జాలగూడు

నిజాం కళాశాల ప్రస్తుతం 120 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉత్సవాలు జరిగాయి. సంవత్సరం పొడుగునా జరిగిన ఈ సంబరాలకు 2008 ఫిబ్రవరి 20న కళాశాల పూర్వవిద్యార్థి అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కేతిరెడ్డి సురేష్‌రెడ్డి జండా ఊపి ఉద్ఘాటన చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఆరంభోత్సవాలలో అనేకమంది పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.

చరిత్ర

ప్రస్తుతం ఉన్న ప్రధాన కళాశాల భవనం హైదరాబాదు నగర ప్రముఖులలో ఒకడైన ఫక్రుల్ ముల్క్ II మహలు. హైదరాబాదు పాఠశాల (నోబుల్ పాఠశాల), మద్రసా-ఏ-ఆలియాలను కలిపి నిజాం కళాశాలను స్థాపించాడు. కళాశాల స్థాపకుడు, విద్యావేత్త అయిన నవాబ్ ఇమాదుల్ ముల్క్ సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ, సరోజినీ నాయుడు తండ్రి అయిన డా. అఘోరనాథ్ ఛటోపాధ్యాయను ఏరికోరి కళాశాల తొలి ప్రిన్సిపాలుగా నియమించాడు.

అనుబంధాలు

ప్రారంభంలో ఇది మద్రాస్ విశ్వవిద్యాలయానికి 60 సంవత్సరాలు అనుబంధంగా ఉంది. 1947 ఫిబ్రవరి 19 న, ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంద కళాశాలగా మార్చబడింది. ఈ కళాశాల నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో, దేశంలోని ఇతర ప్రాంతాలలో నేటి రాజకీయ నాయకులు, వైద్యులు చాలా మంది ఈ చారిత్రక కళాశాల నుండి వెళ్ళారు.

కొత్త భవనాలు

కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు వసతి కల్పించకపోవడంపై 2022 అక్టోబరు- నవంబరులో నిజాం కళాశాల విద్యార్థులు కళాశాలలో ఆందోళన చేపట్టారు. దాంతో రాష్ట్ర ఐటీ-మున్సిపల్‌-పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించి సమస్యను పరిష్కరిస్తామని మాట ఇచ్చాడు. వసతి నిర్మాణం కోసం ప్రభుత్వం తరపున 5 కోట్ల రూపాయలు మంజూరు చేశాడు.

ఇచ్చిన మాట ప్రకారం, కళాశాలలో వసతి, కొత్త భవనాలకు 2023, ఆగస్టు 12న మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పశుసంవర్ధక శాఖామంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ఎల్‌.రమణ, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, విశ్వవిద్యాలయ వీసీ డి.రవీందర్ యాదవ్ పాల్గొన్నారు.

ప్రముఖ పూర్వవిద్యార్ధులు

మూలాలు

బయటి లింకులు

Tags:

నిజాం కళాశాల చరిత్రనిజాం కళాశాల అనుబంధాలునిజాం కళాశాల కొత్త భవనాలునిజాం కళాశాల ప్రముఖ పూర్వవిద్యార్ధులునిజాం కళాశాల మూలాలునిజాం కళాశాల బయటి లింకులునిజాం కళాశాల1887ఉస్మానియా విశ్వవిద్యాలయంబషీర్‌బాగ్మహబూబ్ అలీ ఖాన్హైదరాబాదుహైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థహైదరాబాద్‌లోని వారసత్వ కట్టడాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

పంచ లింగాలుLకుండలేశ్వరస్వామి దేవాలయంభారతదేశ ఎన్నికలుపిన్నెల్లి రామకృష్ణారెడ్డిఅమ్మకడుపు చల్లగావర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గంచిరుధాన్యంకేతిరెడ్డి వెంకటరామిరెడ్డితాటితూర్పు చాళుక్యులునరేంద్ర మోదీవిజయనగర సామ్రాజ్యంపురుష లైంగికతతిరుమలగృహ హింసఆ ఒక్కటీ అడక్కుఎల్. లలిత కుమారిచెమటకాయలురైతుకల్వకుంట్ల కవితసీ.ఎం.రమేష్భారత స్వాతంత్ర్యోద్యమంఉదగమండలంపవన్ కళ్యాణ్డొక్కా సీతమ్మపూర్వాషాఢ నక్షత్రముగీతాంజలి (1989 సినిమా)లావు శ్రీకృష్ణ దేవరాయలువ్యతిరేక పదాల జాబితాగుంటూరుఅమ్మాయిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుతెలంగాణ ఉద్యమంభరణి నక్షత్రముసప్తస్వరాలులైంగిక విద్యసూర్యుడుఖండంఓటునయన తారవంగా గీతకన్యారాశిఆత్రేయధూర్జటిభారతీయ తపాలా వ్యవస్థచిరంజీవిపటికమాధవీ లతవై.ఎస్.వివేకానందరెడ్డివిష్ణువుసాహిత్యంఅమిత్ షాశిఖండిసంక్రాంతిభారత జాతీయపతాకంప్రేమలురామ్ చ​రణ్ తేజమియా ఖలీఫాఅతిథిబీమానీటి కాలుష్యంరాజ్యసభసప్తర్షులుకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంఅమలాపురం లోక్‌సభ నియోజకవర్గంసన్ రైజర్స్ హైదరాబాద్ప్రేమ చదరంగంఆశ్లేష నక్షత్రమురెడ్డిశాంతికుమారిభారతీయ సంస్కృతిశ్రీకాంత్ (నటుడు)అలెగ్జాండర్గోత్రాలు జాబితాకామసూత్రకామశాస్త్రంసునీతా విలియమ్స్🡆 More