గార్‌ఫీల్డ్ సోబర్స్

గార్‌ఫీల్డ్ సోబర్స్ (Garfield St Auburn Sobers) వెస్ట్‌ఇండీస్కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు.

టెస్ట్ క్రికెట్‌లో 57.78 సగటుతో 8032 పరుగులు చేయడమే కాకుండా, బౌలింగ్‌లోనూ 34.03 సగటుతో 235 వికెట్లు పడగొట్టాడు. 1936, జూలై 28న బార్బడస్ లోని బ్రిడ్జిటౌన్లో జన్మించిన సోబర్స్ 1953లో తన 17 వ ఏటనే టెస్ట్ క్రికెట్లో ప్రవేశించాడు. ఆ తర్వాత ఐదేళ్ళకే టెస్ట్ ఇన్నింగ్సులో 365 పరుగులు చేసి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. (ప్రస్తుతం ఈ రికార్డు 400* పరుగులు సాధించిన వెస్ట్‌ఇండీస్‌కే చెందిన బ్రియాన్ లారా పేరిట ఉంది) . ఈ మహా ఇన్నింగ్సు అతనికి తొలి సెంచరీ కావడం విశేషం. 614 నిమిషాల పాటు ఆడి 38 బౌండరీల ద్వారా పాకిస్తాన్ పై సాధించిన ఈ స్కోరులో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం అతని జాగ్రత్తను సూచిస్తుంది. ఈ రికార్డు 36 సంవత్సరాల పాటు కొనసాగింది. బ్రియాన్ లారా దీనిని అధిగమించిననూ తొలి సెంచరీలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ గా ఇతని రికార్డు ఇంకనూ కొనసాగుతోంది. 1968లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సోబర్స్ ఒకే ఓవర్‌లో వరుసగా 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు . నాటింగ్‌హామ్‌షైర్ కెప్టెన్‌గా సోబర్స్ గ్లామోర్గన్ పై ఆడుతూ మాల్కం నాష్ బౌలింగ్‌లో ఈ ఘనతను సాధించాడు. 1974లో ఇంగ్లాండుపై ట్రినిడాడ్లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడినాడు. 1975లో రెండో ఎలిజబెత్ రాణి సోబర్స్ కు నైట్‌హుడ్ బిరుదంతో సత్కరించింది. 1980లో తన వివాహంతో సోబర్స్ బార్బడోస్ - ఆస్ట్రేలియాల ద్వంద్వ పౌరసత్వాన్ని పొందాడు.

గార్‌ఫీల్డ్ సోబర్స్
సర్ గారీ సోబర్స్ , 2012

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

19361953196819741975ఇంగ్లాండుక్రికెట్జూలై 28ట్రినిడాడ్పాకిస్తాన్బ్రియాన్ లారా

🔥 Trending searches on Wiki తెలుగు:

సప్తర్షులుసునాముఖిజాతిరత్నాలు (2021 సినిమా)పొడుపు కథలుబర్రెలక్కతిరుమలఆర్యవైశ్య కుల జాబితాలలితా సహస్రనామ స్తోత్రంవిరాట్ కోహ్లివృశ్చిక రాశిమంతెన సత్యనారాయణ రాజుపరిపూర్ణానంద స్వామిమొదటి పేజీపార్వతివృషభరాశిరక్త పింజరికులంమీనరాశివేయి స్తంభాల గుడివాట్స్‌యాప్నల్లారి కిరణ్ కుమార్ రెడ్డివంగా గీతచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంగురజాడ అప్పారావుకడియం కావ్యగుణింతంకూచిపూడి నృత్యంవై.యస్.రాజారెడ్డిసిద్ధార్థ్సజ్జల రామకృష్ణా రెడ్డివిశాల్ కృష్ణతాజ్ మహల్ప్రకృతి - వికృతిదొంగ మొగుడుపేరుభారతదేశంటంగుటూరి సూర్యకుమారిజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్రజాకార్మమితా బైజురతన్ టాటాకనకదుర్గ ఆలయంయేసు శిష్యులుమహర్షి రాఘవరాకేష్ మాస్టర్మహాభాగవతంసరోజినీ నాయుడుభారత రాజ్యాంగ ఆధికరణలుఆరోగ్యంశుక్రుడు జ్యోతిషంశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)అన్నమయ్యదేవులపల్లి కృష్ణశాస్త్రిశ్రేయా ధన్వంతరిభూమన కరుణాకర్ రెడ్డివర్షంవెలిచాల జగపతి రావువై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకడప లోక్‌సభ నియోజకవర్గంమంగళవారం (2023 సినిమా)భరణి నక్షత్రముబ్రహ్మంగారి కాలజ్ఞానంబొడ్రాయిభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాబాలకాండకుంభరాశిభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుఆత్రం సక్కుజాతీయ ప్రజాస్వామ్య కూటమిరాజంపేట లోక్‌సభ నియోజకవర్గంబోయపాటి శ్రీనుసిద్ధు జొన్నలగడ్డవికలాంగులురైలుపూజా హెగ్డేతెలుగు భాష చరిత్రనిర్వహణ🡆 More