పాకిస్తాన్: దక్షిణాసియా లోని దేశం

ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతం పురాతన సంస్కృతులకు పుట్టిల్లు.

పలు సంస్కృతులు

మేహర్గర్ నియోలిథిక్, కాంశ్య యుగం సింధు నాగరికత, తరువాత పలు మతాలు, సంస్కృతులకు రాజుల పాలన కొనసాగింది. వీరులో హిందువులు, ఇండో – గ్రీక్, ముస్లిములు, తింరిద్ (టర్కో మొఘలు,ఉ), ఆఫ్ఘన్లు, సిక్కులు ఉన్నారు. ఈ ప్రాంతాన్ని పలు రాజవంశాలు పాలించాయి. ఇది పలు సామ్రాజ్యాలలో భాగంగా ఉండేది. ఇది మయూర సామ్రాజ్యం, ఆచ – ఎమెనిద్ (పర్షియా), అలెగ్జాండర్ పాలనలో ఉంది. ముహమ్మద్ అలీ జిన్నాభారతద్వీపకల్పం సాగించిన స్వతంత్ర సమరం తరువాత 1947 లో పాకిస్థాన్ ముస్లిం రాజ్యంగా అవతరించింది. ముందు భారతదేశ తూర్పు – పశ్చిమం లలో ముస్లిములు అధికంగా ఉన్న ప్రాంతాలు పాకిస్థాన్‌గా ఉండేది.

1956 లో పాకిస్తాన్ "కాంస్టిట్యూట్ ఆఫ్ పాకిస్తాన్" పేరుతో ఇస్లామిక్ రిపబ్లిక్ విధానం స్వీకరించింది. 1971 బంగ్లాదేశ్ స్వతంత్ర సమరం తరువాత తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశంగా అవతరించింది.Apply Here For Nadra Birth Certificate Pakistan And Apply Here For Degree Attestation From Pakistan Online Attestation Pakistan

పాలన

పాకిస్థాన్ అడ్మినిస్ట్రేషన్ యూనిట్లు కలిగిన ఫెడరేషన్ పార్లమెంటరీ రిపబ్లిక్ పాలనా విధానం కలిగి ఉంది. పాకిస్థాన్ సప్రదాయ , భాషాపరమైన వైవిధ్యం కలిగిన దేశం. అలాగే పాకిస్థాన్ భౌగోళికంగా , భాషాపరంగా వైవిధ్యం కలిగి ఉంది. అలాగే కేంద్రీకృత అధికారవిధానం కలిగి ఉంది.

పాకిస్థాన్ "స్టాండింగ్ ఆర్మీ ఫోర్స్" కలిగిన జాబితాలో 7వ స్థానంలో ఉంది. అలాగే పాకిస్థాన్‌కు న్యూక్లియర్ పవర్ అలాగే న్యూక్లియర్ ఆయుధసంపత్తి కలిగిన దేశాలలో చోటు కల్పించబడింది.

న్యూక్లియర్ ఆయుధాలు కలిగిన ఒకేఒక ముస్లిం దేశంగా గుర్తించబడుంది. న్యూక్లియర్ ఆయిధాలు కలిగిన దక్షిణాసియా దేశాలలో రెండవస్థానంలో ఉంది. పాకిస్థాన్ అర్ధపారిశ్రాకరణ చేయబడిన ఆర్ధికవ్యవస్థ కలిగి ఉంది. అలాగే చక్కగా ఏకీకృతం చేయబడిన వ్యవసాయరగం కలిగినదేశంగానూ, ఆర్ధికపరంగా జి.డి.పి అభివృద్ధిలో అంతర్జాతీయంగా 26వ దేశంగానూ, కొనుగోలు శక్తిలో జి.డి.పి అభివృద్ధిలో అంతర్జాతీయంగా 45వ స్థానంలోనూ, ఆర్ధికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగానూ పాకిస్థాన్ గుర్తించబడుతుంది.

స్వాతంత్ర్యం తరువాత

స్వాతంత్రం తరువాత పాకిస్తాన్ అధికంగా సైనిక పాలిత దేశాలలో ఒకటిగా గుర్తించబడుతోంది. ఇండో- పాక్ యుద్ధాలు, రాజకీయ అస్థిరత కలిగిన దేశంగా గుర్తించబడుతోంది. పాకిస్థాన్ అధిక జనసంఖ్య, తీవ్రవాదం, పేదరికం, నిరక్షరాస్యత,లంచగొండితనం మొదలైన సవాళ్ళను ఎదుర్కొంటోంది. అయినప్పటికీ 2012 లో హ్యాపీ ప్లానెట్ జాబితాలో 16వ స్థానంలో ఉంది. పాకిస్తాన్‌కు ఐక్యరాజ్యసమితి సభ్యత్వం, కామన్‌వెల్త్ దేశం, నెక్స్ట్ లెవెన్ ఎకనమీ, ఎకనమిక్ కోపరేషన్, యునైట్జింగ్ ఫర్ కాంసెన్సస్, కలిగిన దేశాలలో ఒకటిగా ఉంది. డెవలపింగ్ 8, కైర్ంస్ గ్రూప్, క్యోటో ప్రొటొకోల్, ఇంటర్నేషనల్ కొవనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, రీజియనల్ కోఆపరేషన్ ఫర్ డెవలప్‌మెంటు, యు.ఎన్.సి.హెచ్,ఆర్, ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్ వెస్టుమెంటు బ్యాంక్, గ్రూప్ ఆఫ్ లెవెన్, చైనా- పాకిస్తాన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు, గ్రూప్ 24, జి 20 డెవలపింగ్ నేషన్స్, ఇ.సి.ఒ.ఎస్.ఒ.సి, ఫండింగ్ మెంబర్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్, సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజియనల్ కార్పొరేషన్, సి.ఇ.ఆర్, ఎన్ సభ్యత్వం కలిగి ఉంది.

కొత్త రాజధాని

పాకిస్థాన్‌లో త్వరలో జంట రాజధాని నగరాలు ఏర్పడనున్నాయి. అందమైన మార్గల్లా పర్వత శ్రేణుల్లో కొత్తగా రాజధాని నగర నిర్మాణానికి చకచకా చర్యలు ప్రారంభమయ్యాయి. దీన్ని ప్రస్తుత రాజధాని ఇస్లామాబాద్‌కు సొరంగ మార్గం ద్వారా అనుసంధానం చేయనున్నారు. దీంతోపాటు సుమా రు రూ.77 వేల కోట్ల వ్యయంతో చేపట్టే ఈ భారీ ప్రాజెక్టులో పలు నిర్మాణ, అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టనున్నారు. సాధ్యమైనంత త్వరగా ఇది అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించడంతో రాజధాని అభివృద్ధి అథారిటీ (సీడీఏ) ఈ దిశగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది.రావల్పిండి-ఇస్లామాబాద్ మధ్య రెండు రింగు రోడ్డులు, రావల్పిండిలోని రావత్ వద్ద ఒక కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణం కూడా ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. బ్లూ ఏరియా నుంచి రావత్ వరకూ ఉన్న ఇస్లామాబాద్ హైవేను 8 నుంచి పది లైన్లకు విస్తరించడంతోపాటు రోడ్డుకు ఇరువైపులా దుబాయ్‌లోని షేక్ జాయెద్ రోడ్డు తరహాలో బహుళ అంతస్తుల వాణిజ్య భవనాలను కూడా నిర్మించనున్నారు. ఇస్లామాబాద్ హైవేకు ఇరువైపుల ఉన్న ప్లాట్లను వాణిజ్య అవసరాలకు ఇవ్వడం ద్వారా భారీ మొత్తంలో డాలర్లను రాబట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మెగా ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా విదేశీ పెట్టుబడిదారులను, ముఖ్యంగా ప్రవాస పాకిస్థానీయులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.

పాక్‌ అధ్యక్షుడి అధికారాలకు కత్తెర

పాక్‌లో త్వరలో తీసుకురానున్న 232వ రాజ్యాంగ సవరణ ద్వారా "అత్యవసర పరిస్థితి విధింపు", "న్యాయమూర్తుల, ముఖ్య ఎన్నికల అధికారి నియామకం" వంటి అధ్యక్షుడి అసాధారణ అధికారాలకు కత్తెర వేయనున్నారు. రాష్ట్ర శాసనసభలను సంప్రదించకుండా అధ్యక్షుడు తనంత తానుగా దేశంలో అత్యవసర పరిస్థితిని విధించలేరు. అలాకాకుండా అధ్యక్షుడు స్వతంత్రంగా వ్యవహరించి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే దానికి పార్లమెంటు ఉభయసభలు 10రోజుల వ్యవధిలో ఆమోదముద్ర వేస్తేనే అమల్లోకి వచ్చే విధంగా ముసాయిదాలో పొందుపరిచారు. Maxbet

ఆరోపణలు

పాకిస్తాన్ నుంచి ఉత్తరకొరియా, లిబియా వంటి దేశాలకు అణుపరిజ్ఞానం అక్రమముగా తరలించిదని ఆరోపణలు ఉన్నాయి.

వివాదాలు

భారతదేశముతో 1947 నుంచి కాశ్మీరు గురించి వివాదము నడుస్తోంది. కషిమిర్ వివాదం purthiayyindhe Kashmir eka India de భారత్, పాకిస్తాన్, చైనా దేశాలమధ్య కాశ్మీరు వివాదం చాలా తీవ్రమైనది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మూడు యుద్ధాలకు (1947, 1965, 1999 (కార్గిల్)) అలాగే భారత్, చైనా దేశాల మధ్య 1962 (బ్రిటిష్ వలస పాలన కాలములో భారత చైనాలను విదదీసే మెక్ మెహాన్ రేఖను చైనా గుర్తించనందుకు) యుద్ధానికి కాశ్మీరు వివాదమే కారణం. జమ్ము-కాశ్మీరు సంపూర్ణ రాష్ట్రం భారతదేశపు అంతర్గత భూభాగమని భారతదేశం వాదన. కాని మొత్తం రాష్ట్రంలో సగభాగం మాత్రమే ఇప్పుడు భారతదేశం ఆధీనంలో ఉన్నది. కాశ్మీరు లోయలో కొంత భాగం పాకిస్తాన్ అధీనంలో ఉన్నది. ఆక్సాయ్‌చిన్ ప్రాంతం చైనా అధీనంలో ఉన్నది.

కాశ్మీరులో భాగమైన గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ను స్థానిక గిరిజనుల సాయంతో పాకిస్థాన్‌ 1947లో ఆక్రమించింది. ఇప్పటి వరకూ ఈ భూభాగం ఎలాంటి ప్రజాస్వామ్యం లేకుండా పాకిస్థాన్‌ అధ్యక్షుడి ప్రత్యక్ష పాలనలో ఉంది. ఇప్పుడు ఈ భూభాగంపై వాస్తవ నియంత్రణాధికారాన్ని పాకిస్థాన్‌ చైనాకు అప్పగించింది. అరబ్బు దేశాలకు, చైనాకు మధ్య సిల్క్‌ రవాణా మార్గంలో గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ భూభాగం ఉంది.

భారత్‌-పాక్‌ను సన్నిహితం చేద్దాం

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఇరుదేశాలకు చెందిన ఏడుగురు మాజీ మంత్రులు ప్రయత్నాలు ప్రారంభించారు. భారత్‌కు చెందిన జశ్వంత్‌సింగ్‌, నట్వర్‌సింగ్‌, మణిశంకర్ అయ్యర్ పాకిస్థాన్‌ నుంచి ఖుర్షీద్‌ ఎం.కసూరీ, సర్తాజ్‌ అజీజ్‌, అబ్దుల్‌ సత్తార్‌, గొహర్‌ అయూబ్‌ఖాన్‌ ఇరుదేశాల మధ్య నలుగుతున్న కాశ్మీర్‌ వ్యవహారం, జలాల పంపిణీ, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై వారు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. ఇకపై ప్రతిఏటా సమావేశం కావాలని నిర్ణయించారు.

పేరువెనుక చరిత్ర

పాకిస్థాన్ పేరులోని పాక్ అంటే ఉర్దూ, పాష్తొ , పర్షియాలలో స్వచ్చత అని అర్ధం. స్థాన్ అంటే ప్రదేశం అని అర్ధం. పాకిస్థాన్ అంటే స్వచ్చమైన ప్రదేశం అని అర్ధం. స్థాన్ అనే పర్షియన్ పదానికి మూలం సంస్కృత స్థాన్ (సంస్కృతం (దేవనాగర్): स्थान) అని భావిస్తున్నారు.1933 లో మొదటిసారిగా పాకిస్థాన్ స్వాతంత్ర సమర యోధుడు చౌద్రీ రహ్మత్ అలి ఒక కరపత్రంలో "పాకిస్థాన్ డిక్లెరేషన్" పేరును పేర్కొన్నాడు., పాక్స్థాన్‌లో 3 కోట్లమంది ముస్లిములు నివసిస్తున్నారని పేర్కొన్నాడు. ఇందులో సౌత్ ఆసియా బ్రిటిష్ రాజ్ లోని పంజాబు, ఖైబర్, పఖ్తుంఖ్వల్, కాశ్మీరి, సింధీ, బలూచిస్థాన్ ప్రాంతాలు పేర్కొనబడ్డాయి. పాక్(pak) అనే పదానికి సులువుగా పలకడానికి ,అర్ధవంతం చేయడానికి పేరులో ఐ "i" చేర్చబడింది.

చరిత్ర

ఆరంభ , మద్యయుగం

పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
Standing Buddha from Gandhara

దక్షిణాసియాలోని పురాతన మానవ సంస్కృతులలో పాకిస్థాన్ సంస్కృతి ఒకటి. పాకిస్థాన్‌లో నివసించిన వారిలో ఆరంభకాల పాలియోలిథిక్ కాలానికి చెందిన సొయానియన్లు ప్రధములని విశ్వసిస్తున్నారు. పంజాబు లోని సొయాన్ లోయలో వారు ఉపయోగించిన రాతి పనిముట్లు లభించాయి. పాకిస్థాన్‌లోని అధికభూభాగంలో ప్రవహిస్తున్న సింధూనది ప్రవాహిత ప్రాంతంలో పలు సంస్కృతులు విలసిల్లాయి. నియోలిథిక్ మెహర్గర్ వీటిలో ఒకటి. కాంశ్య యుగంలో మెహంజుదార్, హరప్పాలోని సింధూనాగరికత (క్రీ.పూ 2800–1800) కూడా వీటిలో మరొకటి.

వేదకాలం

వేదకాలం (క్రీ.పూ 1500–500) ఇండో - ఆర్యన్ సంస్కృతిగా వర్గీకరించబడింది. ఇది హిందూయిజం నుండి జనించింది. హిందూయిజం ఈ ప్రాంతంలో చక్కగా విలసిల్లింది. ముల్తాన్ ప్రముఖ్య హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి.

వేద సంస్కృతి పంజాబుకు చెందిన తక్షశిలలోని (ప్రస్తుతం పంజాబు లోని తక్షిల) గాంధారం వద్ద వికసించింది. క్రీ.పూ 519 లో ఈ ప్రాంతాన్ని పర్షియన్ సామ్రాజ్యం, క్రీ.పూ 326లో అలెగ్జాండర్ పాలించారు. చంద్రగుప్తుడు స్థాపించిన మౌర్యసామ్రాజ్యం తరువాత క్రీ.పూ 185 లోఅశోకుడు ఈప్రాంతాన్ని పాలించారు.

బాక్ట్రియాకు చెందిన డెమెట్రియస్ క్రీ.పూ 180-165 లో స్థాపించిన ఇండో- గ్రీక్ రాజ్యంలో పంజాబ్, గాంధార భాగం అయ్యాయి. క్రీ.పూ 165-150 నాటికి మెనందర్ దీనిని విస్తరించాడు. తరువాత ఈ ప్రాంతంలో గ్రేకో – బుద్ధిజం సంస్కృతి వికసించింది. తక్షశిల పురాతనమైన విద్యాసంస్థగా ,అత్యున్నత విద్యను అందించిన విద్యాసంస్థగా అంతర్జాతీయ ఖ్యాతి గడించింది.

మద్య యుగం

మద్యయుగం (సా.శ. 642–1219) ఈ ప్రాంతంలో ఇస్లాం వ్యాపించింది. ఈ సమయంలో సూఫీ మిషనరీలు అధికసంఖ్యలో బౌద్ధులను , హిందువులను ఇస్లాం మతానికి మార్చడంలో కీలకపాత్ర వహించారు. సింధు ప్రాంతంలో రాయ్ రాజవంశం (సా.శ. 489–632) ఈ ప్రాంతాన్ని పరిసర ప్రాంతాలతో చేర్చిపాలించింది. ధర్మపాలా, దేవపాలా ఈప్రాంతాన్ని పాలించిన చివరి బౌద్ధపాలకులుగా గుర్తించబడుతున్నారు. పాలా సామ్రాజ్యంలో బంగ్లాదేశ్ ఉత్తరభారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ భాగంగా ఉంది.

ముహమ్మద్ బీన్ కాశిం

సా.శ. 711 ముహమ్మద్ బీన్ కాశిం విజేత సింధూలోయలోని పాకిస్థాన్‌ పంజాబు, ముల్తాన్ ప్రాంతాలను జయించాడు. పాకిస్థాన్ ప్రభుత్వ చారిత్రక ఆధారాలు పాకిస్థాన్ తకెత్తడానికి ఇది పునాదిగా ఉందని తెలియజేస్తున్నాయి. ఈ విజయం తరువాత భారత ద్వీపకల్పంలో పాలన సాగించిన ముస్లింల విజయానికి వేదిక తయారుచేసింది. తరువాత (సా.శ. 975–1187) లో ఘజ్నావిద్ సామ్రాజ్యం, ఘోరిద్ రాజ్యం, (సా.శ. 1206–1526) ఢిల్లీ సుల్తానేట్ ఈ ప్రాంతాన్ని కూడా పాలించాయి. తరువాత సుల్తానేట్ స్థానంలో (సా.శ. 1526–1857) నుండి ఈ ప్రాంతం మొఘల్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది.

మొఘల్ పాలకులు ఈ ప్రాంతంలో పర్షియన్ సంప్రదాయం,ఉన్నతస్థాయి ఇండో- పర్షియన్ సంస్కృతి ప్రవేశపెట్టాయి.

16వ శతాబ్దం ఆరంభంలో ఈ ప్రాంతం భారతీయ మొఘల్ పాలకుల పాలనలో ఉంది. 18వ శతాబ్దం నాటికి యురేపియన్ ప్రభావం అధికరించి మొఘల్ పాలన వాణిజ్యపరంగా, రాజకీయ పరంగా క్షీణించింది.

ఈస్టిండియా కపెనీ

పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
Edwin Lord Weeks illustration of an open-air restaurant near Wazir Khan Mosque, Lahore.

ఈ సమయంలోనే ఈస్టిండియా కంపెనీ సముద్రతీర స్థావరాలు ఏర్పరచుకున్నది.

సముద్రం మీద ఆధిపత్యం, గొప్ప వనరులు, సాంకేతికత ఈస్టిండియా కంపెనీ సమీకరించిన సైనికశక్తి రక్షణ బ్రిటిష్ ప్రభుత్వం భారతద్వీపకల్పంలో కంపెనీ పాలనకు అనుమతించేలా చేసింది. 1765 నాటికి భారతద్వీపకల్పం మీద యురేపియన్ల ఆధిపత్యం అధికరించింది.

1820 నాటికి బ్రిటిష్ శక్తి బెంగాల్ వరకు విస్తరించడంతో సైనిక శక్తిని పెంచుకోవడానికి అనుకూలమైన భూభాగాన్ని తమభూభాగంతో విలీనం చేసుకోవడానికి అనుకూలించింది. చరిత్రకారులు ఇది కాలనీ పాలనకు ఆరభబిందువని వర్ణిస్తున్నారు. ఈ సమయానికి బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఈస్టిండియా కంపెనీకి లభించిన మద్దతుతో ఈస్టిండియా కంపెనీకి మరింత విశ్వాసంతో విద్య, సాంఘిక సంస్కరణలు , సంస్కృతికరంగం మొదలైన ఆర్ధికేతర రంగాలలో శక్తివంతగా ప్రవేశించడానికి అవకాశం లభించింది. 1835 లో "ఇంగ్లీష్ ఎజ్యుకేషన్ యాక్ట్" (1845) , ఇండియన్ సివిల్ సర్వీస్ వంటి సంస్కరణ అమలుచేయబడింది. భారతీయ ద్వీపకల్పంలోని భారతీయ ముస్లిములు విద్యను అభ్యసించడానికి సంప్రదాయకమైన మదరసాలకు ఆగ్లేయులు మద్దతు ఇవ్వలేదు.

తరువాత దాదాపు మదరసాలు అన్ని నిధులు సహాయం కోల్పోయాయి.

కాలనీ పాలన

Sir Syed Ahmad Khan (1817-98) whose vision formed the basis of Pakistan
Muhammad Ali Jinnah (1876–1948) served as Pakistan's first Governor-General and the leader of the Pakistan Movement

18వ శతాబ్దం ఆరంభంలోనే మొఘల్ సామ్రాజ్యం క్రమంగా పతనం చెందడం ప్రారంభం అయింది. తరువాత బ్రిటిష్ ప్రభుత్వం భారతద్వీపకల్పం అంతటి మీద ఆధిపత్యం సాగించే వరకు సిక్కుల ప్రాభవం అధికం అయింది.1857 లో భారతీయ తిరుగుబాటు 1857 (సిపాయీల తిరుగుబాటూ) ఈ ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వం , క్వీన్ విక్టోరియాలకు వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద సైనికచర్యగా గుర్తించబడుతుంది. హిందూయిజం , ఇస్లాం అనుయాయుల మద్య మతకహాలు అధికమై హిదూ ఇస్లామిక్ సంబంధాలు క్షీణించడం వలన బ్రిటిష్ పాలనకు ప్రధాన సమస్యగా పరిణమించింది. హిందీ- ఉర్దూ వివాదాలు హిందువులు , ముస్లిముల మద్య సంఘర్షణలను మరింత అధికం చేసింది.

బెంగాలి పునరుజ్జీవనం సంప్రదాయ హిందూయిజ ఙానం జాగరూకమైంది. అలాగే అది బ్రిటిష్ ఇండియన్ సామారాజ్య సాంఘిక , రాజకీయాల మీద కూడా గొప్పగా ప్రభావం చూపింది.

బెంగాలీ పునరుజ్జీవనం ఎదుర్కోవడానికి సయ్యద్ అహ్మద్ ఖాన్ నాయకత్వంలో అలిఘర్ ఉద్యమం నిర్వహించబడింది. ఫలితంగా 1901 లో "ఇండియన్ ముస్లిం లీగ్" స్థాపించబడింది.

తరువాత రెండుదేశాల విధానాన్ని ముస్లిం లీగ్ ఆదరించింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బ్రిటిష్ వ్యతిరేక విధానం, బ్రిటిష్ విలువలను స్వీకరించిన ఆల్ ఇండియా ముస్లిం లీగ్ భవిష్యత్తు పాకిస్థాన్ సాంఘిక విధానం రూపొందించాయి. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ వ్యతిరేక విధానం హిందూ జర్మన్ కుట్ర మొదలైన వివాదాలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ , జర్మన్ దేశాలమద్య సయోధ్య కలేగేలా చేసాయి. జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో అహింసా విధానంలో స్వరంత్ర పోరాటం దేశావ్యాప్తంగా వ్యాపించింది. ఈ విధానంలో మూకుమ్మడి పోరాటాలలో లక్షలాది ప్రజలు పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1920 లో క్విట్ ఇండియా ఉద్యమం , 1930 లో సహాయనిరాకరణోద్యమాలలో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు.

ముస్లిం లీగ్

1930 నాటికి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ క్రమంగా పెద్ద ఎత్తున ప్రజాదరణ సంపాదించింది. 1930 డిసెంబరు 29న ముహమ్మద్ ఇక్బాల్ ముస్లిములు అధికంగా ఉన్న వాయవ్యభారతంలో ఉన్న పంజాబు (పాకిస్థాన్), వాయవ్య భూభాగం (1901–55), సింధు , బలూచీ స్థాన్ వీలీనం కావాలని పిలుపు ఇచ్చాడు. పాకిస్థాన్ స్థాపకుడు ముహమ్మద్ ఆలి జిన్నా ప్రధానంగా రెండు దేశాల విధానాన్ని బలపరిచాడు. తరువాత ముస్లిం లీగ్‌ను 1940 లాహోర్ నిర్ణయం (పాకుస్థాన్ నిర్ణయం) వైపు నడిపించాడు. రెండవ ప్రపంచం యుద్ధం, ముహమ్మద్ ఆలి జిన్నా , ఆల్ ఇండియా ముస్లిం లీగ్ యునైటెడ్ కింగ్డంకు మద్దతు ఇచ్చింది.

క్యాబినెట్ మిషన్

1946 లో భారత్‌లో క్యాబినెట్ మిషన్ విఫలం అయింది. తరువాత యునైటెడ్ కిండం భారత్‌లో 1946 - 47 లలో " బ్రిటిష్ రాజ్ " ముగింపుకు వస్తుందని సూచనలు అందజేసింది. . బ్రిటిష్ ఇండియాలో జాతీయ కాంగ్రెస్ లోని నెహ్రూ, అబుల్ కలాం ఆజాద్, ఆల్ ఇండియ ముస్లిం లీగ్ లోని ముహమ్మద్ ఆలి జిన్నా , సిక్కులకు నాయకత్వం వహించిన తారాసింగ్ మొదలైన భారతీయ జాతీయవాదులు 1947 జూన్ మాసంలో స్వతంత్రం , అధికార పరివర్తన షరతుల గురించి సంప్రదింపులు జరిపారు.1947 లో యునైటెడ్ కింగ్డం భారత్ విభజనకు అంగీకారం తెలిపింది. ఆగస్ట్ 14 న వాయవ్య భారతం , తూర్పు భారతంలోని అధికసంఖ్యాకులైన ముస్లిం ప్రజలను కలుపుకుంటూ పాకిస్థాన్ అవతరించింది. బలూచీస్థాన్, తూర్పు బెంగాల్, వాయవ్య సరిహద్దు భూభాగం (1901–55), పంజాబు (పాకిస్థాన్) , సింధ్ భూభాగాలు పాకిస్థాన్‌లో భాగం అయింది. భారత్ విభజన కారణంగా పంజాబ్ , బెంగాల్ లలో తీవ్రమైన మతకలహాలు చెలరేగాయి. లక్షలమంది ముస్లిములు పాకిస్థాన్‌కు తరలి వెళ్ళారు లక్షలాది హిందువులు , సిక్కులు భారత్‌కు తరలి వచ్చారు. రాజస్థానం జమ్ము కాశ్మీర్ వివాదం " మొదటి కాశ్మీర్ యుద్ధం (1948) కి దారితీసింది.

స్వతంత్రం ఆధునిక పాకిస్థాన్

The American CIA film on Pakistan made in 1950 examines the history and geography of Pakistan.

1947 లో భారత్ నుండి విభజించిన పాకిస్థాన్ రూపుదిద్దుకున్న తరువాత ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అద్యక్షుడు ముహమ్మద్ ఆలి జిన్నా "పాకిస్థాన్ గవర్నర్ జనరల్ " అయ్యాడు. అలాగే పాకిస్థాన్ పార్లమెంటుకు మొదటి స్పీకర్ అయ్యాడు. ఫండింగ్ ఫాదర్స్ ఆఫ్ పాకిస్థాన్ లైక్వత్ ఆలీ ఖాన్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ జనరల్ సెక్రెటరీ కావడానికి అంగీకరించారు. అలాగే లైక్వత్ ఆలీ ఖాన్ పాకిస్థాన్ ప్రధమ ప్రధానమత్రి స్థానం కూడా అలంకరించాడు. 1947 లో ఆరవ జార్జ్ భారత చక్రవర్తి పదవిని త్యజించిన తరువాత పాకిస్థాన్ కామంవెల్త్ దేశాలలో ఒక రాజ్యంగా మారింది.

1952 ఫిబ్రవరి 2న ఆరవ జార్జ్ మరణం తరువాత రెండవ ఎలిజబెత్ పాకిస్థాన్ రాణి అయింది. 1956 లో పాకిస్థాన్ కాంస్టిట్యూషన్ అంతస్థు పొందే వరకు పాకిస్థాన్ కామంవెల్త్ దేశాలలో ఒకటిగా ఉంది. పాకిస్థాన్ అధ్యక్షుడు ఇస్కందర్ మిర్జా " టూ మాన్ రూల్ " స్థానంలో ఆర్మీ చీఫ్ పాలన అమలైన తరువాత పాకిస్థాన్ స్వతంత్రం ప్రశ్నార్ధకంగా మారింది. తరువాత అధ్యక్షుడు ఇస్కందర్ పాలన తొలగించి మిర్జా ఆర్మీ చీఫ్ జనరల్ అయూబ్ ఖాన్ పాకిస్థాన్ పాలన స్వాధీనం చేసుకున్నాడు. 1962 లో అధ్యక్షపాలన అమలైన తరువాత పాకిస్థాన్ ఆర్ధికరంగం గుర్తించతగినంగా అభివృద్ధి చెందింది. 1965 లో రెండవ ఇండో – పాక్ యుద్ధం తరువాత పాకిస్థాన్ ఆర్ధికవ్యవస్థలో పతనం మొదలైంది.

1969 లో పాక్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్ నుండి యాహ్యాఖాన్ పాలన చేపట్టిన తరువాత 1970 లో సంభవించిన పాకిస్థాన్‌లో సంభవించిన తుఫాన్ తూర్పు పాకుస్థాన్‌లో 50,000 మంది ప్రాణాలను బలుగొన్నది.

పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
Signing of Tashkent Declaration to end hostilities with India in 1965 in Tashkent, USSR, by President Ayub alongside with Bhutto (center) and Aziz Ahmed (left).

జాతీయ ఎన్నికలు

1970 లో పాకిస్థాన్ మొదటిసారికా డెమొక్రటిక్ ఎన్నికలు (1970) నిర్వహించింది. ఇది మిలటరీ పాలన నుండి స్వతంత్రపాలన ఆరంభానికి నాంది అయింది. తూర్పు పాకిస్థాన్‌లోని అవామీలీగ్ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ మీద విజయం సాధించింది. యాహ్యాఖాన్ మిలటరీ పాలనను ప్రజలు తిరస్కరించారు.

1971 మార్చ్ 25న బంగ్లాదేశ్ స్వతంత్ర సమరం సమయంలో పరిస్థితి చక్కదిద్దడానికి పాకిస్థాన్ సైన్యం బంగ్లాదేశ్ చేరుకుంది."1971 బంగ్లాదేశ్ మారణహోమం" బంగ్లాదేశ్ స్వతంత్రం ప్రకటించడానికి దారితీసింది. తరువాత బెంగాల్ ముక్తి బహిని భారత్ సహాయంతో ప్రత్యేక బంగ్లాదేశ్ స్వతంత్ర సమరానికి సేనలను సమీకరించాడు. అయినప్పటికీ పశ్చిమ పాకిస్థాన్ ఈ యుద్ధాన్ని అంతరుద్ధం అని అభివర్ణించింది.

అల్లర్లు

స్వతంత్ర సమరంలో దాదాపు 3 - 30 లక్షలమంది పౌరులు అసువులు కోల్పోయారని అంచనా. స్వతంత్రసమరానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ భారత్ - బంగ్లాదేశ్ మీద త్రివిధదళాల దాడి చేసింది.

లొంగుబాటు

1971 లో పాకిస్థాన్ లొంగుబాటుతో యుద్ధంలో ఎదురైన అపజయం కారణంగా యాహ్యాఖాన్ స్థానంలో జుఫిల్ అలి భుట్టో పాకిస్థాన్ అధ్యక్షుడిగా అధికారపీఠం అధిష్టించాడు.తరువాత పాకిస్థాన్ కాంసిట్యూషన్ అఫ్ పాకిస్థాన్‌గా డెమాక్రసీ మార్గంలో పయనించింది. 1972–1977 మద్య పాకిస్థా డెమొక్రసీ పునరుద్ధరించబడింది. స్వీయ చైతన్యం, సోషలిజం, పాకిస్థానీ జాతీయత దేశవ్యాప్తంగా పునరుద్ధరణ కార్యక్రమాలు చురుకుగా సాగాయి. తరువాత 1972 లో పాకిస్థాన్ అభివృద్ధి పధాకాలు చేపట్టింది. అలాగే న్యూక్లియర్ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టింది. విదేశీజోక్యం అడ్డుకోవడానికి విధ్వంశకర మార్గాన్ని వదిలి మొదటి న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించింది.

1974 లో మొదటిసారిగా భారత్ మొదటి సారిగా న్యూక్లియర్ పరొశోధ జరపడం పాకిస్థాన్‌కు ప్రేరణ కలిగించడం వలన 1979 లో పాకిస్థాన్ న్యూక్లియర్ వెపన్ పరిశోధన పూర్తిచేసింది. 1977 సైనిక చర్యతో పాకిస్థాన్ డెమొక్రసీ ముగింపుకు వచ్చింది. 1978లో జనరల్ జియా - ఉల్-హాక్ పాకిస్థాన్ అధ్యక్షపదవి చేపట్టాడు. అధ్యక్షుడు జనరల్ జియా చేపట్టిన కార్పొరేట్ సెక్టర్ ఆఫ్ పాకిస్థాన్ , ఇస్లామైజేషన్ ఆఫ్ ఎకనమి పధకాలు దక్షిణాసియాలో వేగవంతమైన దేశాలజాబితాలో ఒకటిగా చేసింది.

న్యూక్లియర్ నియంత్రణ, ఇస్లామైజేషన్ అభివృద్ధి సంప్రదాయవాద తత్వం అభివృద్ధి కొనసాగింది. తరువాత పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్‌లో రష్యా కార్యకలాపాకు వ్యతిరేకంగా యు.ఎస్ కార్యకలాపాలకు సహకారం అందించింది.

జియా మరణం

1988 విమానప్రమాదంలో ముహమ్మద్ జియా- ఉల్- కాక్ మరణం తరువాత జుల్ఫికర్ ఆలి భుట్టో కుమార్తె బెనజిర్ భుట్టో పాకిస్థాన్ మొదటి మహిళా ప్రధాన మంత్రిగా ఎన్నిక చేయబడింది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరువాత సంప్రదాయవాద పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) అధికారం చేపట్టింది. తరువాత దశాబ్ధంలో ఈ రెండు పార్టీలు మార్చిమార్చి అధికారం చేపట్టాయి. 1980 తో పోల్చితే తరువాత దశాబ్ధంలో దేశఆర్ధిక వ్యవస్థ క్షీణించింది. తరువాత పాకిస్థాన్ దీర్ఘకాలం ద్రవ్యోల్భణం, అస్థిరత, లంచగొండితనం, పాకిస్థాన్ జాతీయవాదం, భౌగోళిక రాజకీయం, భారత్‌తో శతృత్వం, సోషలిజం పతనం, సంప్రదాయవాదం, మొదలైన అంశాలమధ్య చిక్కుకుపోయింది. 1997 లో పాకిస్థాన్ జాతీయ ఎన్నికలలో పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) అత్యధిక ఆధిఖ్యత సాధించింది. 1988 లో భారత్ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పాయ్ నేతృత్వంలో నిర్వహించబడిన పొక్రాన్ అణ్వాయుధ పరిశోధనకు సమాధానంగా ముషారఫ్ నేతృత్వంలో రెండవ పాకిస్థాన్ అణ్వాయుధ పరిశోధన నిర్వహించబడింది.

కార్గిల్ యుద్ధం

పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
President Bush meets with President Musharraf in Islamabad during his 2006 visit to Pakistan.

1999 లో పాకిస్థాన్ , భారత్ మద్య సౌనిక ఘర్షణలు అధికరించి కార్గిల్ యుద్ధానికి దారితీసాయి. సివిల్- మిలటరీ సంఘర్షణలు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ పాకిస్థాన్ అధికారాన్ని చేపట్టడానికి అనుమతించాయి. 1999 నుండి 2001 వరకు ముషారఫ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్‌గా పాకిస్థాన్‌ను పాలించాడు. తరువాత 2001 నుండి 2008 వరకు పాకిస్థాన్ అధ్యక్షునిగా పాలించాడు. ముషారఫ్ పాలనలో ఆధునికీకరణ, సాంఘిక స్వాతంత్రం, ఆర్ధిక సంస్కరణల పొడిగింపు మొదలైన చర్యలు చేపట్టబడ్డాయి. తరువాత పాకిస్థాన్ యు.ఎస్ తో కలిసి తీవ్రవాదంతో చేసిన యుద్ధంలో పాల్గిన్నది. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ విజయవంతంగా 5 సంవత్సరాల పాలన ముగించిన తరువాత 2007-నవంబరు 15న పాకుస్థాన్ జాతీయ ఎన్నికలకు పాకిస్థాన్ ఎన్నికల కమిటీ పిలుపును ఇచ్చింది.2007 లో బెనాజిర్ భుట్టో కాల్చివేతకు గురైన తరువాత 2008 లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సురక్షిత ఆధిఖ్యతతో విజయం సాధించింది. తరువాత యూసఫ్ రాజా గిలాని ప్రధాని పదవిని చేపట్టాడు. ముషారఫ్ మీద ఆరోపించబడిన నేరారోపణా ఉద్యమానికి వెరచి ముషారఫ్ 2008 ఆగస్ట్ 18న అధ్యక్షపదవికి రాజీనామా చేసిన తరువాత ఆసిఫ్ ఆలి జర్దారీ అధ్యక్షపదవి చేపట్టాడు. . పాకిస్థాన్ న్యాయవ్యవస్థతో ఏర్పడిన ఘర్షణల తరువాత యూసఫ్ రాజా గిలానీ 2012 జూన్ లో ప్రధానపదవికి అనర్హుడని నిర్ణయించబడింది. తీవ్రవాదంతో యుద్ధంలో పాకిస్థాన్ పాత్ర, తీవ్రవాదం మీద యుద్ధం ఖరీదు 67.93 అమెరికన్ డాలర్లు. అంతే కాక తీవ్రవాదం కారణంగా దాదాపు 30 లక్షల మంది ప్రజలు స్వస్థలం నుండి తరలించబడ్డారు. . 2013 లో నిర్వహించబడిన పాకిస్థాన్ జాతీయ ఎన్నికలు (2013)లో పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) అమోఘమైన ఆధిఖ్యత సాధించింది. తరువాత నవాబు షరీఫ్ ప్రధానమంత్రి పదవి అలంకరించాడు. 14 సంవత్సరాల తరువాత పాకిస్థాన్‌లో తిరిగి డెమొక్రసీ స్థాపించబడింది.

ప్రభుత్వవిధానాలు

పాకిస్థాన్ ఇస్లాం మతప్రాతిపదిక కలిగిన ప్రజాస్వామ్య దేశం. పాకిస్థాన్ ఫెడరల్ పార్లమెంటరీ విధానం కలిగి ఉంది. 1956 లో మొదటిసారిగా పాకిస్థాన్ కాంస్స్టిట్యూషన్ నిర్మితమైనది. అయినప్పటికీ 1958 లో నిలిపివేయబడి 1962 లో పునర్నిర్మించబడింది. సమగ్రమైన పాకిస్థాన్ కంస్టిట్యూషన్ 1973 నుండి అమలై 1977 లో జియా-ఉల్-హక్ చేత రద్దుచేయబడి 1985 లో తిరిగి అమలుచేయబడింది. పాకిస్థాన్ మిలటరీ పాకిస్థాన్ రాజకీయచరిత్ర లలో కీలకపాత్ర వహిస్తుంది. సైనిక పాలన కాలంలో అధ్యక్షుని మిలటరీ నిర్ణయిస్తుంది. ప్రజాస్వామ్యకాలంలో అధ్యక్షుని ఎన్నిక ప్రజాస్వామ్యవిధానంలో నిర్ణయించబడుతుంది. పాకిస్థాన్‌లో బహుళపార్టీ విధానం కలిగిఉంది. 2013 మే మాసంలో పాకిస్థాన్‌లో జనరల్ ఎలెక్షన్లు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

విదేశీవ్యవహారాలు

పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
Indian Prime Minister Narendra Modi hand shakes with Prime Minister Nawaz Sharif.

జసంఖ్యాపరంగా రెండవస్థానంలో ఉన్న ముస్లిందేశంగా (మొదటిస్థానంలో ఇండోనేషియా ఉంది) , అణ్వాయుధాలు కలిగిన ఏకైక ముస్లిందేశంగా పాకిస్థాన్ గుర్తించబడుతూ ప్రపంచరాజకీయాలలో కీలకపాత్ర వహిస్తుంది. సగం వ్యవసాయం , సగం పారిశ్రామిక దేశం అయిన పాకిస్థాన్ ఆర్ధికరం విదేశీవ్యవహారలతో అధికంగా ముడిపడి ఉంది. పాకిస్థాన్ సేవాసంస్థలు, కార్పొరేషన్ , పౌరవ్యవస్థ కూడా విదేశీ వ్యవహారలతో ముడివడిఉంది. స్థిరమైన విదేశీవిధానాలతో పాకిస్థాన్ విదేశాలతో సుముఖమైన సంబంధాలను కలిగి ఉంది. భారత్ నిర్వహించిన పొక్రాన్ అణ్వాయుధ పరిశోధన తరువాత పాకిస్థాన్ అణ్వాయుధ పరిశోధన జరపడానికి దారితీసింది.

అంతర్జాతీయ ప్రాముఖ్యత

పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
U.S President Barack Obama in conversation with Prime Minister Nawaz Sharif, 2014.

ప్రపంచం చమురుసరఫరా మార్గంలో ఉండడం , చమురూత్పత్తి చేస్తున్న మధ్యఆసియాదేశాలకు సమీపంలో ఉండడం పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిస్తుంది.

2004 లో పాకిస్థాన్ " ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ , ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ వార్ అగెయినిస్ట్ టెర్రరిజంలో (మేజర్ నాటో అల్లే) సహకారం పాకిస్థాన్ ప్రాముఖ్యత అంతర్జాతీయంగా అధికం అయింది. పాకిస్థాన్ విదేశీవిధానం , పాకిస్థాన్ భౌగోళిక వ్యూహం ఆర్ధికరంగం , పాకిస్థాన్ జాతీయతరక్షణ, ప్రాంతీయసమైఖ్యత, సహముస్లిం దేశాలతో సత్సంభంధాల మీద కేంద్రీకరించి ఉంది. పాకిస్థాన్ ఐఖ్యరాజ్యసమితి శాశ్వత సభ్యత్వం , శాస్వత ప్రాతినిధ్యం కలిగి ఉంది. పాకిస్థాన్ ముస్లిం ప్రపంచంలో ఆధినికతకు ఆదరణ ఇస్తున్న దేశంగా గుర్తించబడుతుంది పాకిస్థాన్ కామంవెల్త్ దేశాల సభ్యత్వం కలిగి ఉంది. సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కాత్పొరేషన్, ఎకనమిక్ కార్పొరేషన్, జి 20 డెవలిపింగ్ దేశాల సభ్యత్వం కూడా కలిగి ఉంది. పాకిస్థాన్ ఇజ్రాయేలు మధ్య దౌత్యసంబంధాలు లేవు. అయినప్పటికీ ఇజ్రాయేలు ప్రజలు పర్యటన నిమిత్తం పాకిస్థాన్‌కు వచ్చి పోతుంటారు. ఆర్మేనియాతో సంబంధాలు లేని ఒకేఒక దేశం పాకిస్థాన్ మాత్రమే. అయినప్పటికీ ఆర్మేనియన్లు ఇప్పటికీ పాకిస్థన్‌లో నివసిస్తున్నారు.

దస్త్రం:Pak-China Friendship Centre.JPG
Pak-China Friendship Centre was constructed by China as a gift for Pakistan. Pakistan also hosts China's largest overseas embassy.

పాకిస్థాన్ మిడిల్ ఈస్ట్ దేశాలు , ఇతర ముస్లిం దేశాలతో రాజకీయ, సాంఘిక , ఆర్ధిక సంబంధాలు కలిగి ముస్లిం దేశాలలో ప్రాముఖ్యత ఉంది. పాకిస్థాన్ చైనాతో దౌత్యసంబంధాలు ఏర్పరుచుకున్న మొదటి దేశం పాకిస్థాన్. అలాగే 1962 ఇండో-చైనా యుద్ధం తరువాత పాకిస్థాన్ , చైనాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి.

1960–1989 చైనా రిపబ్లిక్ ప్రపంచ ప్రధాన దేశం కావడానికి పాకిస్థాన్ ఎంతగానో సహకరించింది. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు చైనా పర్యటనకు పాకిస్థాన్ సహకరించింది. 1972లో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ చైనాలో పర్యటించాడు. పాకిస్థాన్‌లో ప్రాంతీయ , అంతర్జాతీయ పరిస్తితులు చైనా , పాకిస్థాన్ మద్య సంబంధాలను బలపరుస్తూ ఉన్నాయి. బదులుగా పాకిస్థాన్ , చైనాల మద్య పరస్పర ఆర్ధిక సహకారం శిఖరాగ్రానికి చేరుకుంది. చైనా పాకిస్థాన్‌లో మైళిక సదుపాయాల నిర్మాణాల మీద పెట్టుబడులు పెడుతుంది. గ్వాడర్ వద్ద డీప్‌వాటర్ పోర్ట్ నిర్మాణం ఒకటి. 2000 లో చైనా పాకిస్థాన్ మద్య జరిగిన "చైనా-పాకిస్థాన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్" ఇప్పటికీ కొనసాగుతూ ఉంది.అలాగే పాకిస్థాన్ చైనా-, ముస్లిం దేశాల మద్య వారధిలా సహకారం అందిస్తుంది. భారత్‌తో భౌగోళిక శతృత్వం ఉన్నప్పటికీ పాకిస్థాన్ టర్కీ , ఇరాన్ లతో రాజకీయ సంబంధాలను కొనసాగిస్తుంది. సౌదీ అరేబియా కూడా పాకుస్థాన్‌తో గౌరవనీయ సంబంధలు కలిగి ఉంది. . కాశ్మీర్ సంగర్షణతో భారత్ పాక్ మద్య పెద్ద అఘాతం ఏర్పడింది. కాశ్మీర్ కారణంతో ఇరుదేశాల మద్య 4 మార్లు యుద్ధం సంభవించింది.1950 , 1980 సోవియట్-ఆఫ్ఘ యుద్ధం వంటి రాజకీయ కారణాల వలన సోవియట్ యూనియన్‌తో విబేధాలు తలెత్తాయి. పాకిస్థాన్ యునైటెడ్ స్టేట్స్ సన్నిహితసంబంధిత దేశాలలో ఒకటి. 1999 నుండి పాకిస్థాన్ రష్యాల మద్య పలురంగాలలో పరస్పర సంబంధాలు మెరుగుపడ్డాయి. పాకిస్థాన్ యునైటెడ్ స్టేట్స్ మద్య బలమైన అంతరంగిక సంబంధాలు ఉన్నాయి. కోల్డ్ వార్ పాకిస్థాన్ యునైటెడ్ స్టేట్స్‌తో కలిసి పనిచేసింది. 1990 పాకిస్థాన్ రహస్యంగా అణాయుధాలు తాయారుచేసిన విషయం బహిర్గతం అయిన తరువాత అమెరికా పాకిస్థాన్ సంబంధాలు బలహీనపడ్డాయి. యునైటెడ్ స్టేట్స్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిపిన పోరు అమెరికా పాకిస్థాన్‌లు సన్నిహితం అయినప్పటికీ ఆఫ్ఘన్ యుద్ధం (2001) తరువాత సంబంధాలలో తీవ్రవాదం కారణంగా సమస్యలు ఎదురైయ్యాయి. 1948 నుండి ప్రత్యేక బలూచీస్థాన్ వాదులు నైరుతీ బలూచీస్థాన్‌లో తరచుగా ఆదోళన చేస్తున్నారు.

నిర్వహణావిభాగాలు

Administrative Division Capital Population
పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత  Balochistan Quetta 7,914,000
పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత  Punjab Lahore 101,000,000
పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత  Sindh Karachi 42,400,000
పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత  Khyber Pakhtunkhwa Peshawar 28,000,000
Gilgit–Baltistan Gilgit 1,800,000
పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత  FATA 3,176,331
పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత  Azad Kashmir Muzaffarabad 4,567,982
Islamabad Capital Territory Islamabad 1,151,868

ఫెడరల్ పాత్లమెంటరీ రిపబ్లిక్ రాజ్యంగా పాకిస్థాన్ ఫెడరేషన్‌లో (పంజాబు, ఖైబర్, సింధి , బలూచీస్థాన్) నాలుగు విభాగాలు ఉన్నాయి. . ట్రైబల్ బెల్ట్,గిల్జిట్- బలూచీస్థాన్, ఇస్లామాబాద్ కాపిటల్ టెర్రిటరీ , అజాద్ కాశ్మీర్ పేరిట నాలుగు నిర్వహణా విభాగాలు ఉన్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం డీ ఫేక్టో స్టాండర్డ్ " విధానం అనుసరిస్తుంది. పాకిస్థాన్ పాలన త్రీటైర్ (పాకిస్థాన్ జిల్లాలు, తాలూకాలు , యూనియన్ కౌన్సిల్స్ ఆఫ్ పాకిస్థాన్) సిస్టం అనుసరించి నిర్వహించబడుతుంది. ఒక్కొక్క విధానానికి ఎన్నిక విధానంలో సభ్యులను ఎన్నికచేస్తారు. ట్రైబల్ ఏరియాలో ఏడు గిరిజనప్రాంతాలు , ఆరు చిన్న సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి. పాకిస్థాన్ న్యాయవ్యవస్థ , పాకిస్థాన్ ఇంటెలిజంస్ కమ్యూనిటీ పాకిస్థాన్ చట్టపరిధిలో పనిచేస్తాయి. దీని క్రింద నేషనల్ ఇంటెలిజంస్ డైక్టరేట్‌ పరిధిలో ఫెడరల్ , ప్రివింషియల్ స్థాయిలో పనిచేస్తుంది. ఫెడరల్ ఇంచెస్టిగేషన్ ఏజన్సీ, ఇంటెలిజంస్ బ్యూరో, నేషనల్ హైవేస్, మోటర్ వేస్ ఆఫ్ పాకిస్థాన్ , పాకిస్థాన్ రేంజర్స్ , ఫ్రాంటియర్ కార్ప్స్ వంటి పారామిలటరీ దళాలు పనిచేస్తుంటాయి.

పాకిస్థాన్ కోర్ట్ సిస్టంలో పాకిస్థాన్ సుప్రీం కోర్ట్ అగ్రస్థానంలో ఉంటుంది. హైకోర్ట్ ఆఫ్ పాకిస్థాన్, ఫెడరల్ షరియట్ కోర్టులు (ఒక్కొక భూభాగానికి ఒకటి , ఫెడరల్ కాపిటల్‌లో ఒకటి), జిల్లా కోర్టులు (ఒక్కొక జిల్లాకు ఒకటి), జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు (ఒక్కొక నగరం , ఒక్కొక పట్టాణానికి ఒకటి), ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు , సివిల్ కోర్టులు ఉన్నాయి. పాకిస్థాన్ పీన్ల్ కోడ్ గిరిజనప్రాంతాలలో పరిమితికి లోబడి ఉంటుంది. గిరిజన ప్రాంతాలకు గిరిజన సంప్రదాయాలను అనుసరించి చట్టం అమలు చేయబడుతుంది.

సైనికదళం

పాకిస్థాన్ సైనికబలంలో ప్రంపంచం 8వ స్థానంలో ఉంది. 2001 గణాంకాలను అనుసరించి పూర్తిసమయం పనిచేసేవారి సంఖ్య 6,17,000. రిజర్వ్ దళం 5,13,000 పాకిస్థాన్ మిలటిరీ 1947 లో రూపొందించబడింది. పాకిస్థాన్ రాజాకీయాలలో మిలటరీ కీలకపాత్రవహించింది. జాయింట్ చీఫ్స్ ఆఫ్ కమిటీ ఆధ్వర్యంలో చైన్ ఆఫ్ కమాండ్ విధులు నిర్వహించబడుతుంటాయి. జాయింట్ స్టాఫ్ హెడ్క్వారటర్స్ రావల్పుండి మిలటరీ జిల్లాలో ఉంది. చైరమన్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ సైనికదళానికి ఉంత్తాధికారిగా , ప్రభుత్వానికి ప్రధాన సైనిక సలహాదారుగా ఉంటాడు. జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఉన్నతాధికారి సైనికదళాన్ని నియంత్రిస్తుంటాడు. అలాగే సైనికదళం , ప్రభుత్వం మధ్య వ్యూహాత్మక అనుసంధానకర్తగా ఉంటాడు.

పాకిస్థాన్ ఆర్మీ ప్రధాన శాఖలు వాయుదళం, నౌకాదళం, పాకిస్థాన్ మారిన్. వీటికి పాకిస్థాన్ పార్లలమెంటరీ ఫోర్స్ సహకారం అందిస్తుంది అణ్వాయుధపరిశోధనా నియంత్రణ, ఉద్యూగనియామకం, కమాండ్, కంట్రోల్, సమాచారం, కంప్యూటర్లు, ఇంటెలిజంస్, సర్వైలెంస్, న్యూక్లియర్ కామాండ్ కంట్రోల్ సైనికదళం బాధ్యతలో భాగంగా ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్, టర్కీ, చైనా దేశాలు పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటూ పాకిస్థాన్‌కు అవసరమైన ఆయిధాలను సరఫరాచేస్తూ ఉన్నాయి. తరచుగా చైనా, టర్కీ దేశాలతో కలిసి సైనిక శిక్షణ నిర్వహించబడుతుంది. 1947 నుండి జమ్ము కాశ్మీర్‌లో నాలుగుమార్లు ఇండో- పాక్ యుద్ధాలు జరిగాయి. 1947లో పాకిస్థాన్ పశ్చిమ కాశ్మీర్ భూభాగాన్ని (అజాద్ కాశ్మీర్), గిల్హిత్, బలూచీస్థాన్ స్వంతం చేసుకుంది. ఇండియా తూర్పు పాకిస్థాన్‌ను స్వంతం చేసుకుంది. 1963లో జరిగిన యుద్ధంలో తూర్పు బెంగాలీ శరణార్ధుల సమస్య తలెత్తింది. ఈ కారణంగా 1971 ఇండో- పాక్ యుద్ధం జరిగింది. కార్గిల్ వద్ద సంభవించిన సంఘర్షణ ఫలితంగా 1999లో మరొక మారు ఇండో- పాక్ యుద్ధం సంభవించింది. 1947 నుండి ఆఫ్ఘన్ పాక్ సరిహద్దు సమస్యలు సైక తురుగుబాటుకు కారణం అయింది. 1961లో ఆఫ్ఘన్ సరిహద్దులో బజౌర్ ఏజెంసీ వద్ద ఉన్న పాకిస్థాన్ సైనికదళం తిరుగుబాటు చేసింది.

ఐఖ్యరాజ్యసమితి శాంతిదళం

పాకిస్థాన్ ఐఖ్యరాజ్యసమితి శాంతిపరిరక్షణ దళంలో (యునైటెడ్ నేషంస్ పీస్ కీపింగ్ మిషంస్) భాగస్వామ్యం వహిస్తుంది. 1993 లో సోమాలియా మొగదిష్ వద్ద చిక్కుకుపోయిన అమెరికన్ సైనికులను విడిపించడానికి పాకిస్థాన్ ప్రధానపాత్ర వహించింది. యునైటెడ్ నేషంస్ నివేదికలో " యు.ఎన్ పీస్ కీపింగ్ మిషన్‌లో పాకిస్థాన్ సైనికులు అధికసంఖ్యలో ఉన్నారని తెలిపింది. పాకిస్థాన్ కొన్ని అరబ్ దేశాల రక్షణ బాధ్యత వహిస్తూ సైనికులను నియమించింది. అలాగే సౌనిక శిక్షణ , సలహాసంప్రదింపుల బాధ్యత వహిస్తుంది. 1967 లో పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ , పాకిస్థాన్ నౌకాదళ ఫైటర్ పైలట్లు మిడిల్ ఈస్ట్ సైనిక దళంగా నిలిచి సారెల్‌కు వ్యతిరేకంగా ఆరు రోజుల యుద్ధం , యోం కిప్పూర్ యుద్ధంలో పోరాడారు. 1973 లో పాకిస్థాన్ ఫైటర్ పైలట్లు ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రేల్ విమానాలను కూల్చారు.

అరబ్ దేశాలతో సైనిక సంబంధాలు

1979 లో సౌదీ అరేబియా ప్రభుత్వ అభ్యర్ధన మీద అరేబియా సైనికుల సహాయార్ధం అరేబియాలోని మక్కలోని గ్రాండు మసీదుకు (మసీద్-అల్- హారం) పాకిస్థాన్ స్పెషల్ సర్వీస్ బృందాలు పంపబడ్డాయి. 1991 లో జరిగిన గల్ఫ్ యుద్ధంలో యు.ఎస్.నాయకత్వం వహించిన సైనికులతో చేరి పాకిస్థాన్ 5,000 సైనికులతో పాల్గొన్నది.2004 నుండి పాకిస్థాన్ వాయవ్య భూభాగంలో తెహ్రిక్- తాలిబన్ పాకిస్థాన్‌తో తలపడింది. పాకిస్థాన్ సైనిక దళం ఆపరేష బ్లాక్ తండర్ స్ట్రోం , ఆపరేషన్ రాహ్ ఈ నిజాత్ వంటి మేజర్ ఆపరేషన్‌లను నిర్వహించింది.

కాశ్మీర్ సమస్య

పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
The Pir Chinasi in Azad Kashmir, which is part of Pakistan's controlled Kashmir.

దక్షిణాసియా నైరుతిలో ఉన్న కాశ్మీర్ భూభాగం విషయంలో భారత్ పాక్ మద్య నిరంతర వివాదాలు కొనసాగుతున్నాయి. భారత్ – పాక్ కాశ్మీర్ వివాదం కొరకు భారత్ – పాక్ బృహత్తర ప్రణాళికతో మూడుమార్లు (1947, 1965, 1971) యుద్ధం జరిగింది. 1971 యుద్ధం పాకిస్థాన్ షరతులు లేని లొంగుబాటుకు సాక్ష్యంగా నిలిచింది. అలాగే ఆసమయంలో జరిగిన సిమ్లా ఒప్పందం కారణంగా బంగ్లాదేశ్కు పూర్తి స్వాతంత్ర్యం లభించింది. ఇతర తీవ్రమైన సైనిక సంఘర్షణలలో 1984 జరిగిన సైచెన్ సంఘర్షణ , 1999 లో జరిగిన కార్గిల్ యుద్ధం గుర్తించతగినవి. రాజాస్థానంగా ఉన్న లడక్ , సైచెన్‌తో చేరిన జామ్మూ – కాశ్మీర్ భూభాగంలో షుమారు 45.1% కాశ్మీర్ భూభాగం భారత్ ఆధీనంలో ఉంది. యుద్ధంలో పాకిస్థాన్ ఆక్రమిత ప్రదేశం కాశ్మీర్‌లో(అజాద్ కాశ్మీర్ , గిల్జిత్-బలూచీస్థాన్) 38% ఉంది. కాశ్మీర్ వివాదానికి 1947లో భారత్ పాక్‌లను విభజించిన సమయంలో బ్రిటిష్ ఆధిపత్యం తీసుకున్న నిర్ణయం మూలంగా ఉంది. విభజన సమయంలో కాశ్మీర్ భూభాగం పాక్‌తో విలీనం చేయాలా లేక భారత్‌తో విలీనం చేయాలా లేక స్వతంత్రదేశంగా ఉండాలా అన్న విషయం రాజాస్థానం అయిన కాశ్మీర్‌కు ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయానికి భారత్ - పాక్‌లు అంగీకరించాయి. కాశ్మీర్ మహారాజు తనరాజ్యాన్ని హరిసింగ్ భారత్‌తో విలీనం చేయడానికి అంగీకరించాడు. పాకిస్థాన్ ముస్లిం ప్రజల ఆధిఖ్యత , భౌగోళికం ఆధారంగా కాశ్మీర్ భూభాగాన్ని కోరుకున్నారు. అదే కారణాలతో రెండు స్వతంత్ర రాజ్యాలు కావాలని కోరుకున్నారు.

భారత్ వివాదాన్ని 1948 లో ఐఖ్యరాజ్యసమితి వరకు తీసుకువెళ్ళారు.

1948 లో యునైటెడ్ నేషంస్ సెక్యూరిటీ కైంసిల్ రిసొల్యూషన్ వెలువడింది. ఐఖ్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పాకిస్థాన్ సైనికబృందాలను వివాదిత కాశ్మీర్ భూభాగాన్ని వదిలివెళ్ళాలని ఆదేశించింది. అయినప్పటికీ పాకిస్థాన్ కాశ్మీర్ భూభాగాన్ని విడిచిపెట్టక ముందే 1949 లో సరిహద్దులు నిర్ణయిస్తూ ఒప్పందం కుదిరింది. కాశ్మీర్ భూభాగాన్ని భారత్ , పాకిస్థాన్‌లకు విభజించబడింది. పాకిస్థాన్ కాశ్మీర్ ప్రజలకు ఎన్నిక నిర్వహించి ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ నిర్ణయం తీసుకోలని ఐఖ్యరాజ్యసమితిని కోరుకున్నారు. భారత్ మాత్రం సిమ్లా ఒప్పందం (1972) ఆధారంగా కాశ్మీర్ అఖండ భారతంలో భాగమని వాదించింది. సమీపకాలంలో స్వతంత్ర కాశ్మీర్ ఉద్యమం ఫలితంగా కాశ్మీర్ భారత్-పాక్ నుండి విడివడి స్వతంత్రంగా ఉండగలదని భావిస్తున్నారు.

చట్టం అమలు

దస్త్రం:SpecialCombatUnitWomenCommandos.jpg
Women Commandos of counter-terrorism Special Combat Unit.

ఫెడరల్ ప్రభుత్వం , పాకిస్థాన్ పోలీస్ వ్యసస్థ పాకిస్థాన్ చట్టం అమలు బాధ్యత వహిస్తుంది. పాకిస్థాన్‌లోని నాలుగు ప్రాంతాలు , రాజధాని ఇస్లామాబాద్ ప్రాంతాలకు విడివిడిగా పోలీస్ దళం ఉంటుంది. ఫెడరల్ స్థాయిలో పాకిస్థాన్‌లో పలు ఇంటెలిజంస్ బృందాలు పనిచేస్తుంటాయి. వీటిలో ఫెడరల్ ఇంవెస్టిగేషన్ ఏజెంసీ, ఇంటెలిజంస్ బ్యూరో, , నేషనల్ హైవేస్ , మోటర్వే భాగంగా ఉన్నాయి. అలాగే పలు పాకిస్థాన్ పార్లమెంటరీ బలగాలలో నేషనల్ గార్డ్ ఆఫ్ పాకిస్థాన్, పాకిస్థాన్ ఉత్తరభూభాగాలు, పాకిస్థాన్ రేంజర్లు (పంజాబు పాకిస్థాన్) , సరిహద్దు దళాలు ఖైబర్ పంఖుత్వా , బలూచీస్థాన్ భాగంగా ఉన్నాయి.

సివిల్ పోలీస్

సివిలియన్ పోలిస్ అధికారులలో అధికం పాకిస్థాన్ పోలీస్ వ్యవస్థలో భాగంగా ఉన్నారు. అవి నాలుగు ప్రాంతాలకు చెందిన అడిమినిస్ట్రేట్ యూనిట్లుగా ఉన్నాయి. ఇవి వరుసగా పంజాబు (పోలీస్), సింధు (పోలిస్), ఖైబర్ పంక్తువా (పోలీస్) , బలూచీస్థాన్ (పోలీస్) ఉన్నాయి. వీటికి ఇంస్పెక్టర్ జనరల్స్ ఆధిపత్యం వహిస్తారు. రాజధాని ఇస్లామాబద్ భూభాగానికి వేరుగా పోలీస్ వ్యవస్థ (కాపిటల్ టెర్రిటరీ పోలీస్), ఉంది. ది క్రైం ఇన్వెస్టిగేట్ డిపార్ట్మెంటు అఫ్ పాకిస్థాన్ నేరవిభాగానికి బాధ్యత వహిస్తూ ప్రాంతీయ పోలీస్ వ్యవస్థలో ప్రధానపాత్ర వహిస్తారు.

జాతీయరహదారి

పాకిస్థాన్ చట్టం అమలు విభాగంలో జాతీయరహదార్లు , మోటర్వేలు పోలీస్ భాగంగా ఉంది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక పోలీస్ విభాగం ఉంది. నేషనల్ కౌంటర్ టెర్రరిజం అథారిటీ కూడా అందులో భాగంగా ఉంది. ప్రముఖుల రక్షణ కొరకు ఒక కౌంటర్ టెర్రరిజం విభాగం పనిచేస్తుంది. పంజాబు పాకిస్థాన్ , సింధు, పాకిస్థాన్ రేంజర్లు యుద్ధభూమిలో సేవలు అందిస్తారు. వారు పోలీస్ విభాగానికి సుఇచనలు ఇస్తూ చట్టం అమలుకు సహకారం అనిఫిస్తుంటారు. ఫ్రాంటియర్ క్రాప్స్ ఖైబర్ , బలూచూస్థాన్ ప్రాంతాలలో సేవలు అందిస్తున్నారు.

భౌగోళికం

పాకిస్థాన్ భౌగోళికం , పాకుస్థాన్ వాతావరణం అత్యంత వైవిద్యం కలిగి ఉటుంది. పాకిస్థాన్‌లో పలు వైవిధ్యమైన జంతుజాలం ఉంది. పాకిస్థాన్ వైశాల్యం 7,96,095 చ.కి.మీ. ఇది దాదాపు ఫ్రాంస్ , యునైటెడ్ కింగ్డంల మొత్తం వైశాల్యానికి సమానం.

వైశాల్యపరంగా పాకిస్థాన్ అంతర్జాతీయంగా 36వ స్థానంలో ఉంది. వివాదాంశమైన కాశ్మీర్ వైశాల్యం చేర్చడం తేడాలలో వర్గీకరణలో వ్యత్యాసాలు ఉండవచ్చు. పాకిస్థాన్ అరేబియన్ సముద్రతీరం , గల్ఫ్ ఆఫ్ ఓమన్ సముద్రతీరం మొత్తం పొడవు 1046 కి.మీ. పాకిస్థాన్ భూభాగం సరిహద్దు మొత్తం పొడవు 6774కి.మీ ఇందులో ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ సరిహద్దు పొడవు 2430 కి.మీ., పాకిస్థాన్- చైనా సరిహద్దు పొడవు 523 కి.మీ., భారత్ – పాకిస్థాన్ 2912 కి.మీ , పాకిస్థాన్ – ఇరాన్ సరిహద్దు పొడవు 909 కి.మీ. పాకిస్థాన్ సముద్రతీరాన్ని ఓమన్‌తో పంచుకొంటూ ఉంది. , పాకిస్థాన్ ఓమన్ లను తజకిస్థాన్ కోల్డ్, నేరో వాఖన్ కారిడార్ వేరుచేస్తుంది. భౌగోళికంగా పాకిస్థాన్ దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్ , మద్య ఆసియా లలో ప్రాధాన్యత కలిగిన భూభాగంలో ఉంది.

భౌగోళికంగా పాకిస్థాన్‌లోని సింధ్ , పంజాబు భూభాగాలు ఇండియన్ టెక్టానిక్ ప్లేట్‌లో ఉంది. పాకిస్థాన్‌లోని బలూచీస్థాన్ , కైబర్ పఖ్తుంఖ్య లోని అధిక భాగం యురేషియన్ ప్లేట్‌లో (ప్రధానంగా ఇరానియన్ ప్లేట్) ఉంది. గిల్జిత్ – బలూచీ స్థాన్ , కాశ్మీర్ ఇండియన్ ప్లేట్ అంచున అధికంగా భూంపాలు సంభవించడానికి ప్రాంతంలో ఉంది. దక్షిణ పాకిస్థాన్‌లో సముద్రతీరంలో గ్లాసియేటెడ్ పర్వతాలు ఉన్నాయి. ఉత్తర పాకిస్థాన్‌లో మైదానాలు, ఎడారులు , పీఠభూములు ఉన్నాయి.

భౌగోళిక విభజన

పాకిస్థాన్ భౌగోళికంగా ఉత్తర ఎగువ భూములు, సింధూనదీ మైదానం , బలూచీస్థాన్ పీఠభూమి మూడు ప్రధాన భాగాలుగా విభజించబడింది.

ఉత్తర ఎగువభూములలో కరకొరం, హిందూ కుష్ , పామిర్ పర్వతం మొదలైన పర్వతశ్రేణులు ఉంటాయి. ఇక్కడ ఎత్తైన శిఖరాలు కూడా ఉన్నాయి. వీటిలో 14 " ఎయిట్ తౌజండర్స్" పర్వతశిఖరాలలో 5 పాకిస్థాన్‌లో ఉన్నాయి. ఇవి అంతర్జాతీయ పర్వతారోహకులను పాకిస్థాన్‌ వైపు ఆకర్షిస్తున్నాయి. పర్వతారోహకులను ఆకర్షించే శిఖరాలలో కె-2 ఎత్తు 8611మీ , నంగా ప్రభాత్ ఎత్తు 8126 మీ శిఖరాలు ప్రధానమైనవి.

బలూచిస్థాన్ పీఠభూమి థార్ ఎడారి తూర్పున ఉంది. దేశంలో 1609 కి.మీ పొడవున సింధూనది దాని ఉపనదులు కాశ్మీర్ నుండి అరేబియన్ సముద్రం వైపు ప్రవహిస్తున్నాయి. పంజాబుకు సింధూనది విస్తారమైన సారవంతమైన మట్టిని చేరుస్తూ ఉంటుంది.

వాతావరణం

పాకిస్థాన్ వాతావరణం ఉష్ణమడల వాతావరణానికి అతీతంగా కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. సముద్రతీర ప్రాంతంలో పొడి వాతావరణం నెలకొని ఉంటుంది. వర్షాకాలంలో అధిక వర్షపాతం కారణంగా తరచుగా వరదలు సంభవిస్తుంటాయి. అలాగే పొడి సీజన్లో తక్కువ వర్షం లేక అసలు వర్షాలు పడకుండా ఉంటుంది. పాకిస్థాన్ వాతావరణాన్ని నాలుగుగా విభజించవచ్చు. పొడిగా ఉండే శీతల వాతావరణం (డిసెంబరు – ఫిబ్రవరి), వేడిగా పొడిగా ఉండే వసంతకాలం (మార్చ్ – మే), వేసవి , వర్షాకాలం (జూన్ – సెప్టెంబర్), వర్షాకాలాంతర సీజన్ అక్టోబరు –నవంబర్.

వృక్షజాలం , జంతుజాలం

పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
Deodar, Pakistan's national tree.

భౌగోళిక , వాతావరణ వ్యత్యాసాలు అత్యధిక జాతుల చెట్లు , మొక్కలు పుష్కలంగా పెరగడానికి దోహదం చేస్తుంది. పాకిస్థాన్‌లో కోనిఫెరస్, ఆల్పైన్ , సుబల్‌పైన్ మొదలైన వైవిద్యమైన అరణ్యాలు ఉన్నాయి. ఉత్తర భూభాగంలోని పర్వతాలలో అరణ్యాలలో స్రౌస్, పైన్ , దేవదారు చెట్లు అధికంగా కనిపిస్తుంటాయి. సులైమాన్ పర్వతాలలో మల్బరీ మొదలైన డెసిడ్యుయస్ చెట్లు అధికంగా ఉంటాయి. దక్షిణ భూభాగంలోని బలూచిస్థాన్, సింధ్ , పంజాబు ప్రాంతాలలో కొబ్బరి , ఫోనిక్స్ చెట్లు అధికంగా ఉంటాయి. పశ్చిమ పర్వతాలలో యూనిపర్, టమరిస్క్, పదునుగా ఉండే గడ్డి , పొదలు ఉంటాయి. దక్షిణంలో ఉన్న సముద్రతీర తడిభూములలో మాంగ్రోవ్ అరణ్యాలు ఉంటాయి. .

కొనిఫెరౌస్ అరణ్యాలు సముద్రమట్టానికి 1000-4000 మీటర్ల ఎత్తున ఉత్తరం , వాయవ్య భూభాగంలో ఉంటాయి. పొడారిన బలూచీస్థాన్ భూభాగంలో తాటి, ఈత వంటి ఏకదళబీజ చెట్లు, ఎఫెద్ర చెట్లు కనిపిస్తుంటాయి. పంజాబు , సింధ్ మొదలైన ట్రాపికల్ , సబ్ ట్రాపికల్ డ్రై అండ్ మాయిస్ట్ అరణ్యాలు ఉంటాయి. ఈ అరణ్యాలలో మల్బరీ, అకాసియా , యూకలిఫ్టస్ చెట్లు ఉంటాయి.2010 గణాంకాలను అనుసరించి పాకిస్థాన్‌లోని అరణ్యాల వైశాల్యం 2.2%.

పాకిస్థాన్‌ వాతావరణ వైవిధ్యం కలిగి ఉంది. పాకిస్థాన్‌లో దాదాపు 668 పక్షిజాతులు కనిపిస్తుంటాయి. సాధారణంగా కాకులు, ఉడుతలు, మైనాలు, హాక్, ఫాల్కన్ , గద్దలు కనిపిస్తుంటాయి. పాలాస్ (కొహిస్థాన్)లో గుర్తించతగినంగా వెస్టర్న్ ట్రాగోపన్ ఉన్నాయి. పాకిస్థాన్‌లో యూరప్, మద్య ఆసియా , భారత్ నుండి వలస వస్తున్న పలు వలస పక్షులు కనిపిస్తుంటాయి.

దక్షిణ భూభాగంలోని మైదానాలలో ముంగిసలు, పునుగు పిల్లి, కుందేళ్ళు, ఆసియాటిక్ నక్క, భారత పంగోలిన్, ఎడారి పిల్లి , అడవి పిల్లి ఉన్నాయి. సింధూ ప్రాంతంలో ముగ్గర్ మొసళ్ళు ఉన్నాయి. పరిసర ప్రాంతాలలో అడవి పంది, జింక , ముళ్ళపంది , ఎలుకలు కనిపించడం సాధారణం. మద్య పాకిస్థాన్‌లో ఉన్న దిగువన ఉన్న ఇసుక భూములలో ఆసియాటిక్ నక్కలు, చారల హైనా, అడవి పిల్లులు , చిరుతలు ఉన్నాయి. అనకూల వాతావరణ కారణంగా చెట్లు తాక్కువగా ఉండడం, జింకలు మేయడం వలన వన్యమృగాలు ఎడారిభూములలో జంతువులు భద్రతలేని స్థితిలో ఉన్నాయి. చోలిస్థాన్‌లో స్వల్పంగా చింకారాలు కనిపిస్తుంటాయి. పాకిస్థాన్- భారత్ సరిహద్దులో చోలిస్థాన్‌లో కొన్ని ప్రాంతాలలో స్వల్పసంఖ్యలో నీల్ గాయ్ కనిపిస్తుంటుంది. ఉత్తర భూభాగంలోని పర్వతాలలో మార్కోపోలో గొర్రె, ఉరియల్, మార్ఖొర్ , ఐబెక్స్ మేకలు, ఆసియన్ బ్లాక్ బియర్ , హిమాలయన్ బ్రౌన్ బియర్ మొదలైన పలు జాతుల జంతువులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అరుదుగా మంచు చిరుతలు, , ఆసియన్ చిరుతలు. సింధ్ ప్రాంతంలో సంరక్షితప్రాంతంలో బ్లైండ్ ఇండస్ రివర్ డాల్ఫిన్ ఉన్నాయి. అంతరించి పోతున్న దశలో ఇవి 1,100 మాత్రమే మిగిలి ఉన్నాయని భావిస్తున్నారు. . పాకిస్థాన్ ప్రాంతంలో 174 క్షీరదాలు, 177 సరీసృపాలు, 22 ఆఫిబియన్లు, 198 మంచినీటి చేపలు, 5,000 అకశేరుకాలు నమోదు చేయబడ్డాయి.

పాకిస్థాన్ వృక్షజాలం , జంతుజాలం పలు సమస్యలు ఎదుర్కొంటున్నాది. అరణ్యాల నరికివేతలో పాకిస్థాన్ అంతర్జాతీయంగా రెండవ స్థానంలో ఉంది. వేట , వాతావరణ కాలుష్యం పర్యావరణం మీద తీవ్రప్రభావం చూపుతున్నాయి.

జాతీయ పార్కులు , అభయారణ్యాలు

పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
Plain of Deosai National Park.

ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఐ.యు.సి.ఎన్ గుర్తింపు పొందిన 157 సంరక్షిత ప్రాంతాలు ఉన్నాయి. ఆధునిక సరక్షిత ప్రాంతాల చట్టం అనుసరించి పాకిస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ పార్క్‌లో వన్యమృగాలు తమ సహజసిద్ధ వాతావరణంలో తిరుగాడుతూ ఉన్నాయి. బహవల్పూర్ వద్ద ఉన్న "లాల్ సుహంరా నేషనల్ పార్క్" 1972 లో స్థాపించబడింది. ఇది పాకిస్థాన్‌లోని ఒకేఒక "బయోస్ఫేర్ రిజర్వ్" గా గుర్తించబడుతుంది. గిల్జిత్ బల్తిస్థాన్ వద్ద ఉన్న" సెంట్రల్ కరకొరం నేషనల్ పార్క్ "దేశంలోని అతిపెద్ద నేషనల్ పార్క్‌గా గుర్తించబడుతుంది. దీని వైశాల్యం 13,90,100 చ.హె. పాకిస్థాన్‌లోని అతి చిన్న నేషనల్ పార్క్" అయూబ్ నేషనల్ పార్క్ " వైశాల్యం 931 చ.హె.

మౌళిక సదుపాయాల నిర్మాణము

ఆర్ధికం

దస్త్రం:Islamabadmall (cropped).jpg
View of Pakistan's capital, Islamabad. The city is home to several of country's largest companies.
దస్త్రం:Karachiskyline (cropped).jpg
Karachi is the second largest city in the world by population.

పాకిస్థాన్ వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశం. అలాగే తరువాతి 11 దేశాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. ప్రపంచపు బృహత్తర ఆర్ధికశక్తి కలిగిన 21 దేశాలలో ఒక దేశంగా మారడానికి అవకాశం ఉన్న దేశాలలో పాకిస్థాన్ ఒకటి అని భావిస్తున్నారు.

దశాబ్ధాలుగా దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా 2013 నాటికి పాకిస్థాన్ తీవ్రమైన ఆర్ధికలోటును ఎదుర్కొన్నది. తత్కారణంగా తీవ్రమైన నిర్వహణా లోపం , క్రమపరచడానికి వీలుకాని ఆర్ధిక సమస్యలను ఎదుర్కొన్నది. అలాగే కనీసావసారాలైన రైల్వే సేవలను , విద్యుత్తు ఉత్పత్తిని అందించడానికి అవసరమైన పునరుద్ధరణ , అభివృద్ధిచేయడానికి వీలుకాని పరిస్థితితులు ఎదుర్కొన్నది. పాకిస్థాన్ ఆర్ధికరంగం సెమీ ఇండస్ట్రిలైజ్‌గా భావిస్తున్నారు. సింధునదీ పరివాహక ప్రాంతాలు అభివృద్ధి చెంది ఉంది. పాకిస్థాన్ ఆర్ధికరంగం కారాచీ ఆర్ధికం , పంజాబు నగరప్రాంత ఆర్ధికంగా విభజించబడింది. ఇతరప్రాంతాలలో అభివృద్ధి తక్కువగా ఉంది. పాకిస్థాన్ 2011 జి. డి.పి202 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉండవచ్చని అంచనావేయబడింది. జి.డి.పి కొనుగోలు శక్తి 838.164 మిలియన్లు అమెరికన్ డాలర్లు.

తలసరి ఆదాయం జి.డి.పి. 1,197 అమెరికన్ డాలర్లు, కాపిటల్ జి.డి.పి 4,602 అమెరికన్ డాలర్లు , జి.డి.పి. ఋణశాతం 55.5%.

ప్రపంచ బ్యాంక్ ఆర్ధికాభివృద్ధి కొరకు పాకిస్థాన్ వ్యూహాత్మకంగా కృషిచేస్తుందని భావిస్తుంది. సంఖ్యాపరంగా అభివృద్ధి చెందుతున్న పాకిస్థాన్ యువత దేశాభివృద్ధికి సరిపడినంత మానవవనరుల శక్తిని అందించగలదని భావిస్తున్నారు. అలాగే దేశానికి అధికంగా సేవారంగ అభివృద్ధి , ఉపాధికల్పన వంటి సవాళ్ళను ఎదుర్కొనవలసిన అవసరం కూడా ఉంది.

Pakistan would become the 18th largest economy in the world by 2050 with a GDP of US$ 3.33 trillion.

—Goldman Sachs, 

2013 లో ప్రపంచబ్యాంక్ వెలువరించిన నివేదిక ప్రపంచ ఆర్ధికశక్తిలో పాకిస్థాన్ 24వ స్థానంలో ఉందని అలాగే కొనుగోలు శక్తిలో 45వ స్థానంలో ఉందని తెలుస్తుంది.

దక్షిణాసియా దేశాలలో ఆర్ధికశక్తిలో పాకిస్థాన్ రెండవ స్థానంలో ఉంది. దక్షిణాసియా ఆర్ధికంలో పాకిస్థాన్ ఆర్ధికరంగ జి.డి.పి 15% ఉంది. పాకిస్థాన్ ఆరంభం నుండి ఆర్ధికాభివృద్ధి వైవిధ్యం కలిగి ఉంది. డెమాక్రసీ సమయంలో ఆర్ధికాభివృద్ధి వేగం తక్కువగా ఉన్నప్పటికీ మార్షల్ లా అమలులో ఉన్న మూడు కాలాలో అద్భుతంగా ఉంది. అయినప్పటికీ సమానమైన , స్థిరమైన దేశాభివృద్ధికి సరైన పూనాదులు నిర్మించబడలేదు. .

2000 లలో ఆర్ధిక సంస్కరణలు చేపట్టి అభివృద్ధి పనులు చేపట్టిన తరువాత పేదరికం 10% తగ్గింది. జి.డి.పి 3% అభివృద్ధి చెందింది. 2007 లో ఆర్ధికరంగం కొంత పతనావస్థకు చేరుకుంది.2008 లో ఇంఫ్లేషన్ 25.0%.

పాకిస్థాన్ ఫిజికల్ పాలసీకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సహకరిస్తుంది. తరువాత సంవత్సరం ఆసియన్ డెవెలెప్మెంటు బ్యాంక్ నివేదిక పాకిస్థాన్ ఆర్ధిక సంక్షోభం తగ్గిందని తెలియజేసింది. . 2010-11 ఫిజికల్ ఇంఫ్లేషన్ శాతం 14.1%.

జనవరి 2014 ట్రేడ్ ఆర్గనైజేషన్ సర్వే జపాన్ కంపెనీలతో వాణిజ్య సంబంధాలు అధికంగా ఉన్న దేశాలలో తైవాన్ తరువాత స్థానంలో పాకిస్థాన్ ఉందని వెల్లడించింది. 27 జపాన్ కంపెనీలకు పాకిస్థాన్‌తో వ్యాపారసంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు.

పాకిస్థానీ టెక్స్‌టైల్ మార్కెట్. ఆసియాలో స్పిన్నింగ్ శక్తిలో పాకిస్థాన్‌ది 3 స్థానం. .
కరాచీ స్టక్ ఎక్స్చేంజ్. ప్రపంచంలో అత్యున్నత చైతన్యవంతమైన మార్కెట్లలో ఒకటి. ( 2014).

కమ్మోడిటీ

ముడిసరుకు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్న దేశాలలో పాకిస్థాన్ ఒకటి. పాకిస్థాన్ శ్రామికశక్తి ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది. పాకిస్థాన్ నుండి 11 మిలియన్ల ఉద్యోగులు యునైటెడ్ స్టేట్స్‌లో పనిచేస్తూ 11.2 బిలియన్ల అమెరికండాలర్లు పాకిస్థాన్‌కు పంపి పాకిస్థాన్ ఆర్ధికంగా 2011-12 ఫిజికల్ ఇయర్‌కు సహకరిస్తున్నారు.. పాకిస్థాన్ ప్రజలు ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియా, అరబ్ స్టేట్స్ ఆఫ్ ది పర్షియన్ గల్ఫ్, బహరియన్, కువైత్, కతార్ , ఓమన్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, యునైటెడ్ కిండం, నార్వే , స్విడ్జర్లాండ్ దేశాలలో పనిచేస్తున్నారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నివేదిక అనుసరించి అంతర్జాతీయంగా పాకిస్థాన్ ఎగుమతులు తగ్గాయని ప్రపంచస్థాయిలో 2007 లో పాకిస్థాన్ ఎగుమతులు 0.128% ఉందని పేర్కొన్నది. 2010-11 ట్రేడ్ లోటు 11.217 అమెరికన్ డాలర్లు.

పాకిస్థానీ ఆర్ధికరంగ నిర్మాణం

పాకిస్థానీ ఆర్ధికనిర్మాణం వ్యవసాయం నుండి సేవల వైపు మార్చబడింది. 2010 వ్యవసాయం జి.డి.పి లో 21.2%. ఐఖ్యరాజ్యసమితి " ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ " నివేదిక అనుసరించి 2005 పాకిస్థాన్ 21,591,400 మెట్రిక్ టన్నుల గోధుమ ఉత్పత్తి చేసిందని ఇది ఆఫ్రికా గోధుమ ఉత్పత్తికంటే (20,304,585 మెట్రిక్ టన్నులు) అధికమని , దక్షిణ అమెరికా గోధుమ ఉత్పత్తికి (ఇది 20,304,585 మెట్రిక్ టన్నులు) సమీపంలో ఉందని తెలియజేస్తుంది.

2002–2007 పాకిస్థాన్ బ్యాంకింగ్ , విద్యుత్తు రంగాలలో తగినంత విదేశీ పెట్టుబడి పెట్టబడింది. పాకిస్థాన్‌లోని పరిశ్రమలలో దుస్తులు , టెక్స్‌టైల్ (దాదాపు 60% ఎగుమతులు) ఆహారతయారీ, రసాయన ఉత్పత్తులు, ఇనుము , స్టీల్ ప్రధానమైనవి. పాకిస్థాన్‌లో పర్యాటకరంగం అభివృద్ధికి పుష్కలమైన అవకాశం ఉన్నప్పటికీ రాజకీయ అస్థిరత అందుకు ఆడ్డుగా నిలుస్తుంది.

పాకిస్థాన్ నిర్మాణ రంగం , ఆఫ్ఘనిస్థాన్ అవసరాల కారణంగ పాకిస్థాన్ సిమెంటు కంపెనీలూ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. 2013 లోపాకిస్థాన్ 7,708,557 మెట్రిక్ టన్నుల సిమెంటు ఎగుమతి చేసింది. . 2012-2013 పాకిస్థాన్ సిమెంటు ఉత్పత్తి 44,768,250 , క్లింకర్ ఉత్పత్తి 42,636,428. పాకిస్థాన్ ఆర్ధిక రంగంలో సిమెంట్ పరిశ్రమ ప్రధానపాత్ర వహిస్తుంది.

విదేశీ పెట్టుబడులు

2006 ఫిజికల్ ఇయర్ మొదటి 9 మాసాలలో విదేశీ పెట్టుబడి 2.22 బిలియన్ల అమెరికన్ డాలర్లు , పోర్ట్పోలియో పెట్టుబడి 407.4 మిలియన్ల అమెరికన్ డాలర్లు. పాకిస్థాన్ స్టేట్ బ్యాంక్ 2005- 06 విదేశీ పెట్టుబడి 792.6 మిలియన్ల అమెరికన్ డాలర్ల నుండి 2.224 బిలియన్లకు చేరుకుంది. పాకిస్థాన్ స్టేట్ బ్యాంక్ సమీపకాల నివేదికను అనుసరించి పోర్ట్ పోలియా 108.1 మిలియన్ల అమెరికన్ డాలర్ల నుండి 407.4% అమెరికన్ డాలర్లకు చేరుకుంది. 2006–2007 ఆర్ధిక సంవత్సరంలో పాకిస్థాన్ యునైటెడ్ స్టేట్స్ నుండి 8.4 బిలియన్ల పెడ్డుబడి (ప్రభుత్వ లక్ష్యం 4 బిలియన్లు) సాధించింది. పాకిస్థాన్ స్టేట్ బ్యాంక్ నివేదిక అనుసరించి 2010 లో పాకిస్థాన్ రాజకీయ అస్థిరత కారణంగా విదేశీ పెట్టుబడి గుర్తించతగినంత 54.6% తగ్గింది.

టెక్స్‌టైల్ పరిశ్రమ

పాకిస్థాన్ టెక్స్‌టైల్ పరిశ్రమ పాకిస్థాన్ ఎగుమతులలో కీలకపాత్ర వహిస్తుంది. పాకిస్థాన్ టెక్స్‌టైల్ ఉతపత్తుల ఎగుమతిలో పాకిస్థాన్ ఆసియాలో 8 వ స్థానంలో ఉంది. పాకిస్థాన్ జి.డి.పి టెక్స్‌టైల్ రంగం లో 9.5% భాగస్వామ్యం వహిస్తుంది. టెక్స్‌టైల్ రంగం పాకిస్థాన్‌లో 1.5 కోట్లమందికి ఉపాధి కల్పిస్తుంది. 30% శ్రామికశక్తి టెక్స్‌టైల్ రంగంలో పనిచేస్తుంది. దేశంలో పనిచేస్తున్న శ్రామికుల సంఖ్య 4.9 కోట్లు. పాకిస్థాన్ పత్తి ఉతపత్తిలో ఆసియాలో 4 వ స్థానంలో ఉంది. స్పిన్నింగ్ శక్తిలో 3వ స్థానంలో ఉంది (మొదటి రెండు స్థానాలలో చైనా , భారత్ ఉన్నాయి). పాకిస్థాన్ అంతర్జాతీయ స్పిన్నింగ్ శక్తిలో 5% భాగస్వామ్యం వహిస్తుంది. పాకిస్థాన్ టెక్స్‌టైల్స్ అధికంగా కొనుగోలు చేస్తున్న దేశాలలో చైనా ద్వితీయ స్థానంలో ఉంది. చైనా పాకిస్థాన్ నుండి పత్తి, పత్తి నూలు , పత్తి వస్త్రాలు దిగుమతి చేసుకుంటుంది. యునైటెడ్ కింగ్డం మొత్త టెక్స్‌టైల్ దిగుమతులలో పాకిస్థాన్ 3.3% (1.07 బిలియన్ల అమెరికన్ డాలర్లు) , చైనా 12.4% (4.61 బిలియన్ల అమెరికన్ డాలర్లు), యునైటెడ్ స్టేట్స్ 2.98% (2.98 బిలియన్ల అమెరికన్ డాలర్లు), జర్మన్ 1.6% (0.88 బిలియన్ల అమెరికన్ డాలర్లు), భారత్ 0.8% (0.888 బిలియన్ అమెరికన్ డాలర్లు) భాగస్వామ్యం వహిస్తుంది. .

బ్యాంకింగ్

పాకిస్థాన్ బ్యాంకింగ్ రంగం క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంది. బ్యాంకింగ్ రంగానికి విదేశీ , స్వదేశీ మదుపుదార్లు భాగస్వామ్యం వహిస్తున్నారు.[ఆధారం చూపాలి] బ్యాంకుల మద్య పోటీ అధికరిస్తూ ఉంది. దీర్ఘకాల ప్రయోజనాలు వంటి ఆకర్షణీయమైన పధకాలతో వాడుకరులను ఆకర్షించడంలో బ్యాంకులు పోటీ పడుతున్నాయి. పాకిస్థాన్‌లో 6 ఫుల్ ప్లెడ్జ్డ్ ఇస్లామిక్ బ్యాంకులు , 13 కాన్వెన్షనల్ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. ఇస్లామిక్ బ్యాంకింగ్ , ఇస్లామిక్ ప్రభావిత కాన్వెన్షనల్ బ్యాంకులు పాకిస్థాన్ బ్యాంకు వ్యవస్థలో 9.7%. భగస్వామ్యం వహిస్తున్నాయి.

2012 లో రెవెన్యూ అనుసరించి పాకిస్థాన్‌లోని బృహత్తర పరిశ్రమల జాబితా:

పాకిస్థాన్ కీలక ఆర్ధికవ్యూహాలు
పాకిస్థాన్ జి.డి.పి.
వ్యవసాయం 25.3%
పరిశ్రమలు 21.6%
సేవలు 53.1%
ఉపాధి
శ్రామిక శక్తి 59.7 మిలియన్లు
ఉద్యోగులు 56.0 మిలియన్లు
సహజ వనరులు
రాగి 12.3 మిలియన్ టన్నులు
Gold 20.9 మిలియన్ టన్నులు
బొగ్గు 175 బిలియన్ టన్నులు
షేల్ గ్యాస్ 105 ట్రిలియన్ టన్నులు
షేల్ ఆయిల్ 9 బిలియన్ బ్యాతెల్స్
గ్యాస్ ఉత్పత్తి 4.2 బిలియన్ క్యూబిక్ అడుగులు/రోజుకు
ఆయిల్ ఉత్పత్తి 70,000 బ్యారెల్స్/రోజుకు
ఇనుప గనులు 500 మిలియన్లు

కార్పొరేషన్లు

Corporations Headquarters 2012 revenue
(Mil. $)
Services
పాకిస్థాన్ స్టేట్ ఆయిల్ కరాచి 11.570 పెట్రోలియం , సహజ వాయువు
పాక్-అరబ్ రిఫైనరీ క్వాస్బా గుజరాత్ 3,000 ఆయిల్ , శుద్ధి కర్మాగారాలు
సుయి ఉత్తర గ్యాస్ పైప్లైన్స్ లాహోర్ 2,520 సహజ వాయువు
షెల్ పాకిస్తాన్ కరాచి 2,380 పెట్రోలియం
ఆయిల్ , గ్యాస్ డెవలప్మెంట్ కంపెనీ ఇస్లామాబాద్ 2,230 పెట్రోలియం , సహజ వాయువు
నేషనల్ రిఫైనరీ కరాచి 1,970 ఆయిల్ రిఫైనరీ
హబ్ పవర్ కంపెనీ హబ్(బలూచిస్తాన్) 1,970 పాకిస్తాన్ లో ఎనర్జీ
కె-ఎలెక్ట్రిక్ కరాచి 1,840 పాకిస్తాన్ లో ఎనర్జీ
ఎటాక్ రిఫైనరీ రావల్పిండి 1,740 ఆయిల్ రిఫైనరీ
ఎటాక్ పెట్రోలియం రావల్పిండి 1,740 పెట్రోలియం
లాహోర్ ఎలెక్ట్రిక్ సప్లై కో లాహోర్ 1,490 పాకిస్తాన్ లో ఎనర్జీ
పాకిస్తాన్ రిఫైనరీ కరాచి 1,440 పెట్రోలియం , సహజ వాయువు
సుయి దక్షిణ గ్యాస్ పైప్లైన్స్ కరాచి 1,380 సహజ వాయువు
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్ వర్క్ కరాచి 1,360 పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ
ఎంగ్రో కార్పొరేషన్ కరాచి 1,290 ఆహార పరిశ్రమ , టోకు

అణువిద్యుత్తు

2012 డేటా అనుసరించి పాకిస్థాన్‌లో మూడు లైసెంస్ - కమర్షియల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అణువిద్యుత్తును అందిస్తున్నాయి. న్యూక్లియర్ పవర్ ప్లాంటులను నిర్మించి పాకిస్థాన్ ముస్లిం దేశాలలో ఆణుశక్తిని ఉపయోగించిన మొదటి దేశంగా గుర్తింపు పొందింది. ఈ ప్లాంటుల నిర్వహణ బాధ్యతను పాకిస్థాన్ అటామిక్ ఎనర్జీ కమీషన్, ది సైంటిఫికండ్ న్యూక్లియర్ గవర్నమెంటల్ అథారిటీ వహిస్తున్నాయి. పాకిస్థాన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ అథారిటీ న్యూక్లియ ఉపయోగాన్ని నియంత్రిస్తుంది.

పాకిస్థాన్‌లో ఉత్పత్తి చేయబడుతున్న విద్యుత్తులో అణుశక్తి ప్లాంటులనుండి 5.8% లభిస్తుంది. ఫాసిల్ ఫ్యూయల్(పెట్రోలియం) శక్తి 62% లభిస్తుంది, జలవిద్యుత్తు 29.9% లభిస్తుంది , కోయల్ పవర్ ప్లాంటు నుండి 0.3% విద్యుత్తు లభిస్తుంది. పాకిస్థాన్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో లేని నాలుగు దేశాలలో పాకిస్థాన్ (మిగిలిన దేశాలు ఇండియా, ఇజ్రేల్ , నార్త్ కొరియా) ఒకటి. అయినప్పటికీ పాకిస్థాన్ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెంసీ గుడ్ స్టాండిగ్‌లో సభ్యత్వం కలిగి ఉంది.

వాణిజ్య అవసరాలకు ఉపకరిస్తున్న న్యూక్లియర్ పవర్ ప్లాంటుకు చైనా రిపబ్లిక్ ఆసక్తిగా సహకరిస్తుంది. ఆరంభకాలంలో న్యూక్లియర్ విద్యుత్తు అధారాల నుండి చష్మా రియాక్టర్ తయారుచేయబడింది.1971 లో చందా ద్వారా మొదటిసారిగా పాకిస్థాన్ మొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయిన " ది కరాచీ న్యూక్లియర్ పవర్ ప్లాంటు " స్థాపించబడింది. తరువాత చైనా రిపబ్లిక్ పాకిస్థాన్ పారిశ్రామిక అభివృద్ధి కొరకు న్యూక్లియర్ పవర్ ప్లాంటును పాకిస్థాన్‌కు విక్రయించింది. 2005 లో చైనా- పాకిస్థాన్‌లు జాయింట్ ఎనర్జీ సెక్యూరిటీ ప్లాన్ కొరకు సమఖ్యంగా పనిచేసాయి.

2008 లో పాకిస్థాన్ లోని చస్మా వద్ద "న్యూక్లియర్ పవర్ కాంప్లెక్స్ (చష్మా 3) , చష్మా న్యూక్లియర్ పవర్ కాంప్లెక్స్ (చస్మా 4) స్థాపించబడ్డాయి. ఒక్కొకటి 320-340 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. వీటి విలువ 129 వందల కోట్లు, చైనా వంటి అంతర్జాతీయ దేశాల నుండి 80 వందలకోట్ల రూపాయలు వ్యయం చేయబడ్డాయి.

2008 లో ఇండియా యునైటెడ్ స్టేట్స్ సివిల్ " ఒప్పదం ప్రభావానికి బదులుగా పాకిస్థాన్ చైనా సహాయంతో మరొక అగ్రిమెంటు మీద సంతకం చేయబడింది. ఈప్లాంటు విలువ 1.7 బిలియన్ల అమెరికన్ డాలర్లు. దీని కొరకు 1.07 బిలియన్ల విదేశీఋణం లభించింది. 2013 లో కరాచీలో రెండవ న్యూక్లియర్ పవర్ కాంప్లెక్స్ అదనపు రియాక్టర్ల నిర్మాణంతో విస్తరణ పనులు ప్రారంభించబడ్డాయి.

పాకిస్థాన్ విద్యుత్తు ఉత్పత్తి పలు పరిశ్రమలకు విద్యుత్తును అందిస్తుంది. అలాగే పాకిస్థాన్ లోని నాలుగు విభాగాలకు సమానంగా విద్యుత్తును అందిస్తుంది. కారాచీ లోని " కె.ఎలెక్ట్రిక్ "

, వాటర్ , పవర్ డెవలెప్మెంటు అథారిటీ అత్యధికంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి దేశానికి ఆదాయం అందిస్తుంది. 2014 లో పలు ప్రాజెక్ట్‌ల ద్వారా 22,797 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయబడింది.

పాకిస్థాన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ అథారిటీ నుండి అనుమతి పొందిన పాకిస్థాన్ అటామిక్ ఎనర్జీ కమీషన్ మూడు వాణిజ్య అణువిద్యుత్తు కేంద్రాల నుండి అణువిద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది. న్యూక్లియర్ పవర్ ప్రోగ్రాం కలిగిన ఒకేఒక ముస్లిం దేశం పాకిస్థాన్ పాకిస్థాన్ విద్యుత్తు ఉత్పత్తిలో 5.8% అణువిద్యుత్తు నుండి ఉత్పత్తి చేయబడుతుంది. ధర్మల్ పవర్ స్టేషన్ నుండి 64% విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుంది. హైడ్రాలిక్ పవర్ నుండి 29.9% విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుంది.కోయల్ ఎలెక్ట్రిసిటీ నుండి 0.3% విద్యుత్తు చేయబడుతుంది.

పర్యాటకం

పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
Badshahi Mosque was commissioned by the Mughals in 1671. It is listed as a World Heritage Site.

2012 లో పాకిస్థాన్ వైవిద్యమైన సంస్కృతిక ప్రజలు , ప్రకృతిదృశ్యాలు పాకిస్థాన్‌కు ఒక మిలియన్ పర్యాటకులను ఆకర్షించాయి.1970 లో పాకిస్థాన్ నిర్వహించడానికి వీలుకానంతమంది పర్యాటకులను ఆకర్షించింది. పర్యాటకులు అధికంగా ఖైబర్ పాస్, పెషావర్, కరాచి, స్వాత్ (పకిస్థాన్) , రావల్పిండి నగరాలకు అధికంగా వస్తుంటారు. హిమాలయ పర్వతంలో ఉన్న మొహంజుదారో, హరప్పా , తక్షిశిల శిధిలాలు పర్యాటకులను అధికంగా ఆకర్షిస్తున్నాయి. పాకిస్థాన్‌లో 700మీ కంటే అధికమైన ఎత్తైన పలు పర్వతశిఖరాలు ఉన్నాయి.

పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
Daman-e-Koh is a garden overlooking the city of Islamabad.

పాకిస్థాన్ ఉత్తర ప్రాంతంలో అనేక పురాతన కోటలు ఉన్నాయి. పురాతన నిర్మాణాలు, హంజాలోయ, చిత్రల్ లోయ ప్రాంతాలలో ఇస్లామిక్ పూర్వ నాస్తిక కలాషా ప్రజలు గ్రీక్ వీరుడు అలెగ్జాండర్ సంతతి వారని భావిస్తున్నారు. పాకిస్థాన్ సంస్కృతిక రాజధాని లాహోర్‌లో మొఘల్ నిర్మాణాలకు ఉదాహరణగా ఉన్నాయి. వీటిలో బాద్షాహీ మసీదు, షాలిమార్ గార్డెంస్ (లాహోర్), జహంగీర్ సమాధి , లాహోర్ కోట ప్రధానమైనవి. ఇవి పర్యాటకులను ఆకర్షించడంలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. .[ఆధారం చూపాలి] 2015 అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభానికి ముందు పాకిస్థాన్‌ను వార్షికంగా 5 లక్షల మంది పర్యాటకులు సందర్శించారు. 2008 నుండి అస్థిరత కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గింది.[ఆధారం చూపాలి]

2005 కాశ్మీర్ భూకంపం తరువాత 2006 అక్టోబరు ది గార్డియన్ " పాకిస్థాన్ లోని 5 అత్యుత్తమ పర్యాటక ప్రాంతాలు" పాకిస్థాన్ పర్యాటకరంగానికి సహకరిస్తున్నయని వర్ణించింది. 5 ప్రాంతాలలో తక్షశిల, లాహోర్, కరకోం హైవే, కరీమాబాద్ (హుంజ) , సైఫుల్ ములక్ సరసు ఉన్నాయి. ఇవి అసమానమైన పాకిస్థాన్ సంస్కృతిక వారస్వత్వానికి వైవిధ్యానికి ఉదాహరణగా నిలిచాయి.2009 లో " ది వరల్డ్ ఎకనమిక్ ఫోరంస్ ట్రావెల్ & టూరిజం కాంపిటీటివ్నెస్ రిపోర్ట్ " ప్రపమంచ వారసత్వ సంపదలలో 25% పాకిస్థాన్‌లో ఉన్నాయి. సింధూ లోయలలో సింధూ నాగరిక చిహ్నాలు అధికంగా ఉన్న హరప్పా , మొహంజుదారోలు , 5,000 సంవత్సరాల మాంగ్రోవ్ వృక్షాలు ఉన్నాయి.

ప్రయాణసౌకర్యాలు

పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
Jinnah International Airport in Karachi handles 16 million passengers annually.

పాకిస్థాన్ ట్రాంస్‌పోర్ట్ జి.డి.పి.లో 10.5% భాగస్వామ్యం వహిస్తింది. పాకిస్థాన్ రహదారి రవాణా వ్యవస్థ భారత్, బంగ్లాదేశ్ , ఇండోనేషియా కంటే మెరుగ్గా ఉంటుంది. అయినప్పటికీ పాకిస్థాన్ రైల్వే వ్యవస్థ చైనా , భారత్ కంటే వెనుకబడి ఉంటుంది. అలాగే విమానవ్యవస్థ కూడా అభివృద్ధిచేయవలసిన అవసరం ఉంది. పాకుస్థాన్ జలమార్గవ్యవస్థ చాలా స్వల్పంగా ఉంటుంది. సముద్రతీర నౌకావ్యవస్థ ప్రాతీయప్రజల అవసరాలను కొంతవరకు తీర్చుతూఉంది.

పాకిస్థాన్ ట్రాంస్‌పోర్ట్ వ్యవస్థకు వెన్నెముక వంటి పాకిస్థాన్ జాతీయరహదారి పొడవు 2,59,618కి.మీ. 91% ప్రయాణీకులు , 96% సరుకు రవాణాకు రహదారి ఆధారంగా ఉంది. రోడ్డు ట్రాంస్పోర్ట్ వ్యవస్థ అత్యధికంగా ప్రైవేట్ రంగం ఆధీనంలో ఉంది. సరుకు రవాణా వ్యవస్థ 95% ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. నేషనల్ హైవే అథారిటీ జాతీయరహదారి , మోటర్‌వేల నిర్వహణ బాధ్యత వహిస్తుంది. జాతీయరహదారి , మోటర్‌వే ఉత్తర- దక్షిణాలను కలుపుతూ దక్షిణ తీరంలో ఉన్న నౌకాశ్రయాన్ని పంజాబు , ఖైబర్ ప్రాంతాలతో అనుసంధానం చేస్తుంది. మొత్తం దేశరహదారి మార్గంలో 4.2% ఉన్న ఈ మార్గం 85% ట్రాఫిక్ ఆధారంగా ఉంది..

రైలు మార్గం

పాకిస్థాన్ రైల్వే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే (పాకిస్థాన్) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 1947–1970 లో తరువాత దేశవ్యాప్తంగా రహదారుల నిర్మాణం , ఆర్ధికాభివృద్ధి కారణంగా పాకిస్థాన్ ఆటోమోటివ్ పరిశ్రమ అభివృద్ధి జరిగేవరకు పాకిస్థాన్ ప్రజల ప్రయాణాలకు రైలుమార్గం ప్రధానంగా ఉంది. 1990 నుండి ప్రయాణీకులు రైల్వే నుండి అధికస్థాయిలో రహదారి మార్గాల ప్రయాణాలు ఎంచుకోవడం ఆరంభం అయింది. పాకిస్థాన్‌లో ఆటోమోటివ్ పరిశ్రమ ప్రారంభించిన తరువాత ప్రజలు రహదారి మీద ఆధారపడ అధికరించింది. ప్రస్తుతం 10% పాకిస్థాన్ ప్రజలు రైప్రయాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 4% సరికురవాణా రైళ్ళద్వారా జరుగుతుంది. వ్యక్తిగత ప్రయాణాలకు అధికంగా ఆటోమొబైల్ మీద ఆధాఅడుతున్నారు. 1990–2011 మద్య రైలు మార్గం పొడవు 8,775 నుండి 7,791 కుదించబడింది. పాకిస్థాన్ చైనా, ఇరాన్ , టర్కీ దేశాలతో వాణిజ్యం కొరకు రైల్వే సేవలలు వాడుకోవాలని ఎదురుచూస్తుంది.

వాయుమార్గం

పాకిస్థాన్‌లో దాదాపు మిలటరీ , సివిల్ ఉపయోగాలకు 139 విమానాశ్రయాలు ఉన్నాయి. "జిన్నా ఇంటర్నేషనల్ విమానాశ్రయం" పాకిస్థాన్ అంతర్జాతీయ ముఖద్వారంగా భావించబడుతుంది. అదనంగా పాకిస్థాన్‌లో ప్రధానంగా ఆలమా ఇంటర్నేషనల్ విమానాశ్రయం, బెనాజిర్ బుట్టో ఇంటర్నేషనల్ విమానాశ్రయం, పెషావర్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం, క్వెట్టా ఇంటర్నేషనల్ విమానాశ్రయం, ఫైసలాబాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం, సైలకోట్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం , ముల్తాన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం మొదలైన విమానాశ్రయాలు ఉన్నాయి. పాకిస్థాన్ ఏవియేషన్ పరిశ్రమలు, జాతీయ , ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. రాష్ట్రాలకు స్వంతమైన సంస్థలు దాదాపు 73% దేశీయ ప్రయాణాలు , సరుకురవాణా చేస్తున్నాయి. ఎయిర్ బ్లూ, షాహీన్ ఎయిర్ ఇంటర్నేషనల్ , ఎయిర్ ఇండస్ మొదలైన ప్రైవేట్ సంస్థలు తక్కువ ఖర్చుతో విమానసేవలు అందిస్తున్నాయి.

సముద్రమార్గం

పాకుస్థాన్‌లో ప్రధానంగా కరాచీ (పోర్ట్ ఆఫ్ కరాచీ), సింధ్ (పోర్ట్ ఆఫ్ క్వాసిం) మొదలైన నౌకాశ్రయాలు ఉన్నాయి. 1990 గ్వాడర్ పోర్ట్ , గడానీ షిప్ – బ్రేకింగ్ యార్డ్ నిర్మించున తరువాత నౌకాశ్రయ కార్యక్రమాలు బలూచీ స్థాన్‌కు మార్చబడ్డాయి. .

సాంకేతికం

Abdus Salam won the 1979 Nobel Prize in Physics for his contribution to electroweak interaction. He was the first Muslim to win a Nobel prize in science.
Atta-ur-Rahman won the UNESCO Science Prize for pioneering contributions in chemistry in 1999, the first Muslim to win it.

పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాకిస్థాన్ మౌళికసదుపాయాల అభివృద్ధి , పాకిస్థాన్ ఆధునికీకరణలో ప్రభావవంతమైన పాత్రపోషిస్తుంది. పాకిస్థాన్ అకాడమీ ఆఫ్ సైంస్ , ఇంటర్నేషనల్ నథియాగలి సమ్మర్ కాలేజ్ కార్యక్రమాలలో పాల్గొనడానికి ప్రతిసంవత్సరం ప్రపంచం అంతటి నుండి నిపుణులను ఆహ్వానిస్తుంటారు.2005లో పాకిస్థాన్ అభివృద్ధి చెందుతున్న దేశాలలో భౌతికశాస్త్రం (ఫిజిక్స్ ఇన్ డెవెలెపింగ్ కంట్రీ) సెమినార్‌కు ఆతిథ్యం ఇచ్చింది.

ప్రముఖ సాంకేతిక సంస్థలు

పాకిస్థాన్ థియరిటికల్ ఫిజిస్ట్ అబ్దుస్ సలాం తన "ఎలెక్ట్రో వీక్ ఇంటరాక్షన్" కొరకు నోబుల్ బహుమతి అందుకున్నాడు. పాకిస్థానీ శాస్త్రఙలు ఇంఫ్లుయంషియల్ పబ్లికేషన్స్ , క్రిటికల్ సైంటిఫిక్ వర్క్స్ ఇన్ ది అడ్వాంస్డ్ మాథమెటిక్స్, బయాలజీ, ఎకనమిక్స్, కంప్యూటర్ సైంస్ , జెనెటిక్స్ లలో దేశీయ , అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలని యోచిస్తున్నారు.

ప్రముఖ శాస్త్రవేత్తలు , సాధనలు

రసాయన శాస్త్రవేత్త సలీముజ్జామన్ సిద్దిక్వి వేపచెట్టు ఔషధీయ గుణాలను రసాయన ఉత్పత్తిదారుల దృష్టికి తీసుకువచ్చిన మొదటి పాకిస్థానీ శాస్త్రవేత్తగా గురింపు పొందాడు. . పాకిస్థానీ న్యూరోసర్జన్ అయూబ్ కె. ఒమ్మయ " ఒమ్మయ రిజర్వాయర్ " , బ్రైన్ ట్యూమర్ , మెదడు సమస్యలకుపరిష్కార విధానాలుఆవిష్కరించాడు.

సాంకేతికాభివృద్ధి సంస్థలు

సైంటిఫిక్ రీసెర్చ్ , అభివృద్ధి పాకిస్థాన్ విశ్వవిద్యాలయాల్లో కీలకపాత్ర వహిస్తుంది. విశ్వవిద్యాలయాలు ప్రభుత్వసహకారంతో నేషనల్ పార్క్ , లాబరేటరీలు నిర్వహించబడుతున్నాయి. అలాగే సైంటిఫిక్ రీసెర్చ్ పాకిస్థాన్ పరిశ్రమలకు సహకారం అందిస్తుంది. 2010 లో పాకిస్థాన్ సైంటిఫిక్ పేపర్లు ప్రచురిస్తున్న దేశాలలో పాకిస్థాన్ 43 వ స్థానంలో ఉంది. పాకిస్థాన్‌లోని శక్తివంతమైన శాస్త్రీయ సమూహానికి చెందిన " పాకిస్థాన్ అకాడమీ ఆఫ్ సైన్స్ పాకిస్థాన్ ప్రభుత్వ సైంస్ విధానాలు రూపొందించడంలో సిఫార్సులు చేయడంలో కీలకపాత్ర వహిస్తుంది.1960 లో అభివృద్ధిచెందిన ఆసియన్ అంతరిక్షప్రయోగాలలో భాగంగా "స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్పియర్ రీసెర్చ్ కమీషన్" నాయకత్వంలో అత్యాధునిక రాకెటరీ, ఎలెక్ట్రానిక్స్ , ఎయిరోనొమి ఉత్పత్తులు చేయబడ్డాయి.

అంతరిక్ష పరిశోధన

పాకిస్థాన్‌లోని స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్పియర్ రీసెర్చ్ కమీషన్ ప్రొగ్రాం పాకిస్థాన్ చేసిన గుర్తించతగిన విన్యాసాలు , సాధనలు నమోదు చేసింది. ఈ ప్రయోగం పాకిస్థాన్ అంతరిక్ష ప్రయోగం చేసిన మొదటి దక్షిణాసియా దేశంగా చేసింది.1990 లో బాదర్ ఫస్ట్ శాటిలైట్ తాయారు చేసి విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ ప్రయోగం పాకిస్థాన్‌కు అంతరిక్షంలో శాటిలైట్ నిలబెట్టిన మొదటి ముస్లిం దేశం , రెండవ దక్షిణాసియా దేశంగా గుర్తింపు తీసుకువచ్చింది. 1971 ఇండో పాక్ యుద్ధం తరువాత " పాకిస్థాన్ అండ్ వెపంస్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ " విదేశీ దండయాత్రలను అడ్డుకోవడానికి అణుబాంబును తయారుచేసింది.

అణుపరిశోధన

భారత్‌తో పోటీ పాకిస్థాన్ అణుబాంబు పరిశోధన చేపట్టిన దేశాలజాబితాలో స్థానం పొందేలా చేసింది. 1988 లో చాగై న్యూక్లియర్ పరిశోధన తరువాత పాకిస్థాన్ అణుబాంబు తయారుచేసిన ఏడవదేశంగా గుర్తించబడింది.

అంటార్కిటికా

పాకిస్థాన్ అంటార్కిటికా ప్రొగ్రాం స్థాపించిన తరువాత ఆటార్కిటికా పరిశోధన క్రియాశీలకంగా చేస్తున్న స్వల్పసంఖ్యలో ఉన్న దేశాలలో పాకిస్థాన్ ఒకటిగా గుర్తించబడుతుంది. "పాకిస్థాన్ అంటార్కిటికా ప్రొగ్రాం" పర్యవేక్షణలో అంటార్కిటాకాలో ఖండంలో రెండు రీసెర్చ్ స్టేషన్లు నిర్వహించబడుతున్నాయి. అలాగే సంవత్సరం అంతా పనిచేసేలా అదనపు బేస్ ఏర్పాటు చేయాలని భావిస్తుంది.

కంప్యూటర్లు , అంతర్జాలం

1990 నుండి పర్సనల్ కంప్యూటర్ పరిచయం చేసిన తరువాత కంప్యూటర్ల కొరకు విద్యుత్తు వాడకం అధికం అయింది. పాకిస్థాన్‌లో 2 కోట్లమంది అంతర్జాలం (ఇంటర్నెట్) ఉపయోగిస్తున్నారు. 2011 గణాంకాలను అనుసరించి అంతర్జాలం అధికంగా ఉపయోగిస్తున్న ఉత్తమశ్రేణి దేశాలలో పాకిస్థాన్ ఒకటిగా గుర్తించబడుతుంది. పాకిస్థాన్ కీలకమైన సాంకేతిక పబ్లికేషన్లను విడుదల చేస్తుంది. దేశీయంగా పాకిస్థాన్ సాధించిన సాఫ్ట్‌వేర్ అభివృద్ధి అంతర్జాతీయ ప్రశంశలు అందుకుంటుంది. అధికసంఖ్యలో అంతర్జాలం వాడుకుంటున్న 27 ప్రపంచ దేశాలలో పాకిస్థాన్ ఒకటి. 2000 నుండి " పాకిస్థాన్ సూపర్ కంప్యూటింగ్ " లో పాకిస్థాన్ గుర్తించతగినంగా అభివృద్ధి సాధించింది. అలాగే పలు సంస్థలు "పారలెల్ కంప్యూటింగ్ " పరిశోధనలకు అవకాశం కల్పిస్తుంది. పాకిస్థాన్ ప్రభుత్వం ఇంఫర్మేషన్ టెక్నాలజీ ప్రాజెక్టుల కొరకు 4.6 బిలియన్లు వ్యయం చేస్తుంది. పాకిస్థాన్‌లో అధికంగా కంప్యూటర్ సాంకేతికతను మానవ వనరులు, మౌళిక వసతుల అభివృద్ధి, ఎ- గవర్నమెంటు వాడుకుంటున్నారు..

ప్రముఖ పాకిస్థానీ ఆవిష్కరణలు వివరణ
ఒమ్మయ రిజర్వాయర్ మెదడు కణితులు తో రోగులకు చికిత్స కోసం మస్తిష్కమేరుద్రవమ ఔషధాల డెలివరీ సిస్టమ్.
(సి)బ్రైన్ చరిత్రలో మొదటి కంప్యూటర్ వైరస్‌లలో ఒకటి
ఎలెక్ట్రో వీక్ ఇంటరాక్షన్ ముస్లిం ప్రపంచం నాయకత్వం వహించిన మొదటి నోబుల్ బహుమతి పొందిన ఆవిష్కరణ
ఫ్లాస్టిక్ మేగ్నెట్ సాధారణ ఉష్ణోగ్రతతో పనిచేసే మొదటి ఫ్లాస్టిక్ మేగ్నెట్ ఆవిష్కరణ .
లెథల్ రహిత ఎరువు (నాన్- లెథల్ ఫర్టిలైజర్) బంబు తయారీ పదార్ధంగా మార్చలేని ఎరువుల తయారీ సూత్రం .
నాన్- కింక్ - కాథటర్ మౌంట్ ( అనెస్థాలజీకి ఉపకరించే సాధనం)
హ్యూమన్ డెవెలెప్మెంటు ఇండేక్స్ పాకిస్థాన్ మాజీ ఆర్థిక మంత్రి , మహబూబ్నగర్లో ఉల్ హక్ ఆవిష్కరణ
ప్రామాణిక నమూనా పాకిస్థానీ శాస్త్రవేత్త అబ్దుస్ సలాం ఆవిష్కరించిన ప్రాక్టికల్ ఫిజిక్స్ సూత్రం

విద్య

పాకిస్థాన్ ప్రజలకు ప్రాధమిక, సెంకండరీ స్థాయి విద్యను ఉచితంగా అందిస్తుంది.

పాకిస్థాన్ ప్రత్యేకదేశం అయిన తరువాత పాకిస్థాన్‌లో యూనివర్శిటీ ఆఫ్ పంజాబు విశ్వవిద్యాలయం ఒక్కటే ఉంది.

తరువాత పాకిస్థాన్ ప్రభుత్వం దేశంలో నాలుగు భూభాగాలలో వేగవంతంగా విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. అవి వరుసగా 1949లో సింధ్ యూనివర్శిటీ, 1950 లో పెషావర్ యూనివర్శీటీ, 1953 లో కరాచీ యూనివర్శిటీ , 1970 యూనివర్శిటీ ఆఫ్ బలూచీస్థాన్. As of సెప్టెంబరు 2011[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]] పాకిస్థాన్‌లో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ యూనివర్శిటీలు , పబ్లిక్ , ప్రైవేట్ యూనివర్శిటీలు ఉన్నాయి. పాకిస్థాన్ యూనివర్శిటీలు పరిశోధనలు , ఉన్నతవిద్యను అందిస్తున్నాయి. పాకిస్థాన్‌లో 3193 ఒకేషనల్ విద్యాసంస్థలు ఉన్నాయి. పాకుస్థాన్‌లో మదరసాలు కూడా ఉన్నాయి. మదరసాలు ఉచిత ఇస్లాం విద్య, ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తుంది. మదరసాలలో అధికంగా బీదవర్గం ప్రజలు విద్యను అభ్యసిస్తుంటారు.

ప్రజలవత్తిడి , పాకిస్థాన్ తాలిబన్‌లు మదరసాలను కొత్తగా తీవ్రవాదులను చేసుకోవడానికి వాడుకుంటున్నారని విమర్శలు తలెత్తడం వలన పాకుస్థానీ ప్రభుత్వం మదరసాల విద్యాస్థాయిలో విద్యాసంస్కరణలు చేపట్టింది.

విద్యా విధానం

పాకిస్థాన్ విద్యావిధానంలో నర్సరీ విద్య (ప్రిపరేటరీ తరగతులు), ఎలిమెంటరీ విద్య(ఒకటి నుండి ఐదు వరకు), మాధ్యమిక విద్య (ఆరు నుండి ఎనుమిది) ఉన్నత పాఠశాల (తొమ్మిది,పది) (సెకండరిక్ సర్టిఫికేట్ పొందవచ్చు) కమ్యూనిటీ కాలేజీలు (11 గ్రేడ్ , 12 గ్రేడ్) (హైయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ పొందవచ్చు). తరువాత యూనివర్శిటీ ప్రోగ్రాం ద్వారా గ్రాజ్యుయేట్ , పోస్ట్ గ్రాజ్యుయేట్ విద్య. పాకిస్థానీ స్కూల్స్ సెకండరీ ఎజ్యుకేషన్ విధానం యునైటెడ్ కింగ్డం లోని కేంబ్రిడ్జి విద్యాప్రణాళికను అనుసరించి ఉంటుంది. కొంతమంది విద్యార్దులు బ్రిటిష్ కౌంసిల్ నిర్వహించే సాధారణ స్థాయి , ఉన్నతస్థాయి పరీక్షలకు హాజరు ఔతుంటారు.

నూతనవిద్యా విధానం

పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
Islamia College University in Peshawar was founded in October 1913.

2007 నుండి పాకిస్థాన్‌లోని అన్ని పాఠశాలలలో నిర్భంధ ఇంగ్లీష్ మీడియం ఎజ్యుకేషన్ ప్రవేశపెట్టింది.2013 లో అదనపు సంస్కరణలు చేపట్టబడ్డాయి. సింధు విద్యాసంస్థలు అన్నింటిలో చైనీస్ భాషాతరగతులు అదనంగా చేర్చబడ్డాయి. చైనా సూపర్ పవర్‌గా రూపొందడం , చైనా – పాకిస్థాన్ సంబంధాలు మెరుగుపడడం, పాకిస్థాన్ మీద చైనా ప్రభావం అధికం కావడం అందుకు కారణం. ప్రాంతాలవారీగా అక్షరాశ్యత స్థాయి వేరుపడుతూ ఉంటుంది. గిరిజన ప్రాంతాలలో స్త్రీల అక్షరాశ్యత 3% మాత్రమే ఉంది.

1995 లో కంప్యూటర్ విద్యాప్రవేశం తరువాత 1998 లో ప్రభుత్వం అక్షరాశ్యతకు నిర్మూలన కొరకు పిల్లలందరికి ఆరభవిద్యవిధానం ప్రవేశపెట్టింది. 2015 లో పలు విద్యాసంస్కరణల ద్వారా100% అక్షరాశ్యత సాధించడానికి ప్రయత్నిస్తుంది. ప్రాధమిక పాఠశాలలలో విద్యార్ధుల (10 సంవత్సరాలు దాటిన) ప్రవేశం 86 % చేరుకుంది.

ఉన్నత విద్య

హైయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ పొందిన తరువాత విద్యార్ధులు ప్రొఫెషనల్ కాలేజీలలో లేక బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను ఉన్నత విద్య కొరకు ఎంచుకుంటారు. విద్యార్ధులు సాధారణంగా ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బి.ఎస్) / బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బి.ఎస్.సి), బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్), బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (ఎం.బి.బి.ఎస్), ఎండీ), దంతవైద్య డిగ్రీ (డెంటిస్ట్రీ) (బి.డి.ఎస్), పశువైద్యం (వెటరినరీ మెడిసిన్ (డి.వి.ఎం)), బ్యాచులర్ ఆఫ్ లా (ఎల్.ఎల్.బి), ఎల్ఎల్ఎం, జ్యూరిస్ డాక్టర్ (జెడి), బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (ఆర్కిటెక్చర్ బ్యాచిలర్ (బి.ఎ. ఆర్క్)), డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (ఫార్మసి డాక్టరేట్) , బాటు (నర్సింగ్ బ్యాచిలర్ (బి.నర్స్) విద్యను ఎంచుకుంటారు.

విద్యార్ధులు కొంతమంది బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, లిటరేచర్ , మేనేజ్మెంటు సైంస్, బ్యావిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బి.ఎ), బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బి.కాం), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎం.బి.ఎ) విద్యలను కూడా ఎంచుకుంటారు. పాకిస్థాన్ ఉన్నత విద్యలను సాధారణంగా హైయ్యర్ ఎజ్యుకేషన్ కమీషన్ (హెచ్.ఎస్.సి) పర్యవేక్షిస్తుంటారు. హైయ్యర్ ఎజ్యుకేషన్ కమీషన్ (హెచ్.ఎస్.సి) విద్యా విధానాల రూపకల్పన , దేశం అంతటా ఉన్న విశ్వవిద్యాలయాల వర్గీకరణ చేస్తుంది. 2014 అక్టోబర్‌లో పాకిస్థాన్ ఎజ్యుకేషన్ ఉద్యమకారుడు యూసఫ్‌జై నోబుల్ బహుమతి అందుకున్నాడు. అంతేకాక యూసఫ్‌జై అతిపిన్నవయస్కుడైన నోబుల్ బహుమతి గ్రహీతగా గుర్తించబడ్డాడు.

గణాంకాలు

పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
Kalash people maintain a unique identity within Pakistan.

పాకిస్థాన్ గణాంకాలను అనుసరించి 2017 లో పాకిస్థాన్ జనసంఖ్య 21,32,22,917. which is equivalent to 2.57% of the world population.

అత్యంత జనసంఖ్య కలిగిన దేశాలలో 6వ స్థానంలో ఉంది.
జనసంఖ్యాభివృద్ధి దక్షిణాసియాలో ప్రధమస్థానం (2.03% )
వార్షిక జనసంఖ్యాభివృద్ధి 3.6 మిలియన్లు
2020 నాటికి జనసంఖ్య అంచనా 210.13 మిలియన్లు
2045 నాటికి జనసంఖ్య అంచనా 420.6 మిలియన్లు
1947 పాకిస్థాన్ జనసంఖ్య 32.5 మిలియన్లు
1900 - 2009 జనసంఖ్యాభివృద్ధి 57.2%

2030 నాటికి పాకిస్థాన్ ప్రస్తుత ప్రపంచంలో అత్యంత అధిక జనసంఖ్య కలిగిన ముస్లిం దేశంగా గుర్తించబడుతున్న ఇండోనేషియాను అధిగమిస్తుందని అంచనా. 2010 గణాంకాలను అనుసరించి పాకిస్థాన్ జనసంఖ్య 104 మిలియన్ల. పాకిస్థాన్‌లో 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన ప్రజల శాతం 35%. అధికమైన ప్రజలు దక్షిణ పాకిస్థాన్‌ లోని సింధూనది తీరంలో నివసిస్తున్నారు. కరాచీ అత్యంత జనసాధ్రత కలిగిన వాణిజ్య ప్రాధాన్యత కలిగిన నగరంగా గుర్తించబడుతుంది. తూర్పు పాకిస్థాన్‌లో కైబర్ , ఉత్తర పాకిస్థాన్‌లో లాహోర్, ఫైసలాబాద్, రావల్పిండి, సర్గోధా, ఇస్లామాబాద్, గుజ్రంవాలా, సైల్కోట్, గుజరాత్ నగరం, ఝెలం, షైఖ్పురా, నౌషెరా, మర్దన్ , పెషావర్ నగరాలలో ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. 1990-2008 గణాంకాలను అనుసరించి నగరాలలో నివసిస్తున్నవారి శాతం 36%. దక్షిణాసియాలో అధికంగా నగరీకరణ చేయబడిన దేశాలలో పాకిస్థాన్ ప్రధమ స్థానంలో ఉంది.

2009–2010 పాకిస్థాన్ ఆర్ధికప్రణాలికలో ఆరోగ్యపరిరక్షణ కొరకు జిడిపి నుండి 2.6% వ్యయం చేసింది. 2010 గణాంకాలను అనుసరించి పాకిస్థాన్ ప్రజల స్త్రీల సరాసరి ఆయుర్ధాయం 65.4%, స్త్రీల ఆయుర్ధాయం 63.6%. పాకిస్థాన్‌లో 80% ప్రజలు ఆరోగ్యసంరక్షణ కొరకు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటారు. మొత్తం ప్రజలలో 19% , 30% పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 2009 గణాంకాలను అనుసరించి జన్మించిన ప్రతి వెయ్యిమంది శిశువులలో 87 మంది మరణిణిస్తున్నారని తెలుస్తుంది.

భాషలు

పాకిస్థాన్‌లో పలుప్రాంతాలు వాడుకలో ఉన్నాయి. దక్షిణాసియా దేశాలలో ముస్లిం జాతీయతకు చిహ్నంగా పాకిస్థాన్‌లో ఉర్దు భాషవాడుకలో ఉంది. ఉర్దూ భాష జాతీయ సమైఖ్యతకు గుర్తుగా 75% ప్రజలకు వాడుకభాషగా ఉంది. ఉర్దూ ప్రజలకు ప్రధాన అనుసంధాన భాషగా ఉంది.. అధికారభాషగా ఉన్న ఆగ్లం ప్రభుత్వకార్యాలయాలు, వ్యాపారం , న్యాయవ్యవస్థలో వాడుకలో ఉంది. ప్రజలలో ఆంగ్లభాష ప్రధానంగా పాకిస్థానీ యాసలో వాడుకలో ఉంది. పంజాబు ప్రాంతంలో పంజాబీ భాష వాడుకలో ఉంది. దక్షిణ పంజాబీలో సరైకి భాష వాడుకలో ఉంది. ఖైబర్‌లో పాష్తో భాష (ఇది ప్రాంతీయ భాష) వాడుకలో ఉంది. పాష్తో భాషను సింధు , బలూచీస్థాన్ ప్రజలు చక్కగా అర్ధం చేసుకుంటున్నారు. సింధూ ప్రాంతంలో సింధీ భాష, బలూచీ స్థాన్‌లో బలూచీ భాష వాడుకలో ఉన్నాయి.

వలసప్రజలు

పాకిస్థాన్ ప్రజలలో వలసప్రజలు కూడా ఉన్నారు. పాకిస్థాన్‌లో 1.7 మిలియన్ల ఆఫ్ఘన్ ప్రజలు తమను ఆఫ్ఘన్ పాకిస్థానీయులుగా నమోదుచేసుకున్నారు. వీరు కైబర్ ప్రాంతంలో ఉన్నారు.

వీరు గిరిజన ప్రాంతానికి చెందిన ప్రజలు. వీరి స్వల్పంగా కారచీ , క్వెట్టాలలో ఉన్నారు. 1995 గణాంకాలను అనుసరించి పాకిస్థాన్‌లో బంగ్లాదేశీయులు 1.6 మిలియన్లు ఉన్నారు.6,50,000 అఫ్ఘన్లు ఉన్నారు. 2,00,000 మంది బర్మాదేశీయులు ఉన్నారు. 2,320 మంది ఇరానియన్లు ఉన్నారు. అంతేకాక ఫిలిప్పైనీయులు, నేపాలీయులు కూడా ఉన్నారు. భారతీయ ముస్లిములు అధికంగా కరాచీలో నివసిస్తున్నారు. పాకిస్థాన్ ఇతర దేశాలకంటే అత్యధికంగా శరణార్ధులకు ఆశ్రయం ఇచ్చింది.

జనంఖ్య వివరణ

పాకిస్థాన్ ప్రజలు అధుకంగా నాలుగు ప్రాంతాలలో కేంద్రీకరించి ఉన్నారు. వీరు వరుసగా పంజాబీ ప్రజలు, పష్టన్ ప్రజలు, సింధీ ప్రజలు , బలూచీస్థాన్ ప్రజలు. 2009 గణాంకాలు అనుసరించి పంజాబీ ప్రజలు 76 మిలియన్లు (44.15%), పష్టన్ ప్రజలు 29 మిలియన్లు (15.42%) ఉన్నారు. . సింధీ ప్రజలు 24 మిలియన్లు(14.1%), సరైకి ప్రజలు 14.8 మిలియన్లు (10.53%)ఉన్నారు.

ఉర్దూ మాట్లాడే ముహ్జర్ ప్రజలు (భారతీయ ముస్లిములు) 13.3 మిలియన్లు (7.5%), బలూచీ ప్రజలు 6.3 మిలియన్లు (3.5%) ఉన్నారు. మిగిలిన 11.1 మిలియన్ (4.66%) ప్రజలు హజారా , కలాష్ సంప్రదాయాలకు చెందిన ప్రజలు ఉన్నారు. ప్రవాస పాకిస్థానీ ప్రజలు 7 మిలియన్లు ఉన్నారు.

మతం

Religions in Pakistan
Religions Percent
Islam
  
96.4%
Others
  
3.6%
పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
Faisal Mosque, built in 1986 by Turkish architect Vedat Dalokay on behalf of King Faisal bin Abdul-Aziz of Saudi Arabia.

పాకిస్థాన్ జనసంఖ్యాపరంగా ప్రపంచంలోని ముస్లిం దేశాలలో రెండవ స్థానంలో ఉంది. అలాగే షియాముస్లిముల సంఖ్యలో పాకిస్థాన్ ప్రంపంచంలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఇరాన్ ఉంది. పాకిస్థాన్‌ ప్రజలలోలో 97% ముస్లిములు ఉన్నారు. పాకిస్థాలో అహమ్మదీయులు తరువాత స్థానంలో ఉన్నారు. స్వల్పసంఖ్యలో ఉన్న అల్బియట్లు అధికారికంగా ముస్లిమేతరులుగా భావించబడుతున్నారు. అదనంగా క్యురేనియన్ సమూహానికి చెందిన ప్రజలు కూడా ఉన్నారు. సెప్టెంబరు 11 యునైటెడ్ స్టేట్స్ దాడి, పాకిస్థాన్ సెక్టేరియన్ వయలెంస్ తరువాత సున్నీ , షియాలను కేంద్రీకరిస్తూ దాడులు అధికరించాయి.

2013 లో షియాలు , సున్నీలు సెక్టేరియన్ హింస అడ్డగించాలని, చట్టాలని కఠినతరం చేయాలని , సున్నీ , షియా సంబంధాలు పరిరక్షించాలని దేశవ్యాప్తంగా పోరాటంసాగించారు.1974 నుండి రెండవ చట్టసవరణ జరిగిన తరువాత అహమ్మదీయులు తమనుతాము ముస్లిములమని చెప్పుకుంటున్నారు. 1984 నుండి అమదీయ ప్రార్ధనా మందిరాలు మసీదులుగా భావించడం రద్దు చేయబడింది.

2012 గణాంకాలను అనుసరించి 12% పాకిస్థానీయులు తమను ముస్లిమేతరులు సూచించారు..

ఇస్లాం ప్రభావం

ఇస్లాం ప్రభావనికి ముందు అరబ్ ప్రంపంచ ముస్లిముల సంప్రదాయాలతో పాకిస్థానీ ముస్లిములు సమఖ్యం చేయబడ్డారు. లాహోర్ లోని అలీ హవారి (12వ శతాబ్దం) వంటి సుఫీ ముస్లిముల ప్రార్ధనా మందిరాలకు జాతీయ గుర్తింపు ఉండేది. సింధు ప్రాంతం షెహ్వాన్‌లో ఉన్న సుఫీయిజానికి చెందిన షహ్బాజ్ క్వాలాండర్ (12వ శతాబ్దం) కూడా వీటిలో ఒకటి. [ఆధారం చూపాలి] సుఫీయిజానికి దేశంలో దీర్ఘకాల చరిత్ర ఉంది. సుఫీయజంలో ప్రజలు గురువారాలలో ప్రార్ధనామందిరాలలో సమైఖ్యంగా ఆరాధనలు నిర్వహిస్తుంటారు. సుఫీ వార్షిక ఉత్సవాలలో సుఫీ సంగీతం , నృత్యం చోటుచేసుకుంటాయి.సమకాలీన ముస్లింవాదులు సుఫీ సంప్రదాయాన్ని విమర్శిస్తుంటారు.

హిందూయిజం

పాకిస్థాన్‌లో ఇస్లాం తరువాత హిందూయిజం (1.6%) , క్రైస్తవం (1.6%) ఉన్నాయి.1998 గణాంకాలను అనుసరించి బహా అనుయాయులు 30,000, సిక్కులు, బౌద్ధులు , జొరొయాస్ట్రియనిజం, ఒక్కో మతానికి 20,000 ఉన్నారు. పాకిస్థాన్‌లో స్వల్పంగా జైనిజం ఉంది.బ్రిటిష్ పాలనలో మొదటి ప్రపంచయుద్ధం , రెండవ ప్రపంచయుద్ధం కాలంలో యునైటెడ్ కింగ్డం కరాచీ మౌళిక వసతులు అభివృద్ధి చేసిన తరువాత రోమన్ కాథలిక్ అనుయాయులైన గోవా , తమిళ ప్రజలు కరాచీలో స్థిరపడ్డారు. 2005 గణాంకాలను అనుసరించి పాకిస్థాన్‌లో నాస్థికులు 1% మాత్రమే ఉన్నారు. 2012 నాటికి నాస్థికుల శాతం 2% చేరుకుంది.

సంస్కృతి

పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
Truck art in Pakistan is a unique feature of Pakistani culture.

పాకిస్థాన్ సాంఘిక జీవితం క్రమానుగతమైన ఆచారవ్యవహారాలను అనుసరించి ఉంటుంది. సంప్రదాయ ఇస్లామిక విలువలు సాఘికజీవితం , రాజకీయజీవితం మీద ప్రభావం చూపుతుంటుంది. సాధారణంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అధికంగా కనిపిస్తుంది. అయినప్పటికీ సాంఘిక , ఆర్ధిక కారణాల వలన ప్రజలు న్యూక్లియర్ కుటుంబాల వైపు (విడి విడిగా చిన్న కుటుంబాలు) అంటే మక్కువ చూపుతున్నారు. . స్త్రీ పురుషులకు సల్వార్ కమీజ్ సంప్రదాయ దుస్తులుగా ఉన్నాయి. ఆధునిక కాలంలో జీంస్ , టీ షర్ట్లు కూడా మక్కువ అధికం ఔతుంది.. పాకిస్థాన్‌లో 3.5 కోట్లమంది మద్యతరగతి ప్రజలు, 1.7 కోట్లమంది ఎగువ మద్యతరగతి ప్రజలు ఉన్నారని భావిస్తున్నారు. సమీపకాలంగా ఆర్ధికంగా గ్రామీణ భూస్వాములను నగరప్రముఖులు అధిగమిస్తున్నారు.

పండుగలు

ఈద్ -ఉల్- ఫిర్ట్, ఈద్ - అల్- అధా, రంజాన్, క్రిస్మస్, ఈస్టర్ , దీపావళి మొదలైన పాకిస్థాని పండుగలను పాకిస్థాన్ ప్రజలు అధికంగా ఆచరించబడుతున్నాయి. . గ్లోబలైజేషన్ అధికరించడం వలన ఎ.టి. కీర్నీ గ్లోబలైజేషన్ జాబితాలో పాకిస్థాన్ 56వ స్థానంలో ఉన్న్నట్లు తెలుస్తుంది..

దుస్తులు, కళలు , ఫ్యాషన్

పాకిస్థాన్ జాతీయ దుస్తులుగా సల్వార్ , కమీజ్ గుర్తించబడుతుంది. దీనిని పాకిస్థాన్ లోని పంజాబు, సింధు, బలూచీస్థాన్ , ఖైబర్ ప్రాతాలలోని స్త్రీపురుషులు ధరిస్తుంటారు. అలాగే అజాద్ కాశ్మీర , గిరిజన ప్రజలు కూడా ధరిస్తుంటారు. ఒక్కో భూభాగంలో ఒక్కో తరహా శైలిలో సల్వార్ కమీజ్ ధరిస్తుంటారు. పాకిస్థాన్ ప్రజలు సూనితమైన వర్ణాలు , డిజైన్లతో రూపొందించబడిన సిల్క్, షిఫాన్, కాటన్ వస్త్రాలను ధరిస్తుంటారు. . సంప్రదాయ దుస్తులతో పురుషులు టైలరింగ్ చేయబడిన సూట్ , టై ధరిస్తుంటారు. వీటిని కార్యాలయాలు, పాఠశాలలు , ఇతర ప్రదేశాలలో ధరిస్తుంటారు. .

ఫ్యాషన్ పరిశ్రమ

ఫ్యాషన్ ప్రపంచంలో మార్పులు సంభవించిన తరువాత పాకిస్థాన్ ఫ్యాషన్ పరిశ్రమ వికసించింది. పాకిస్థాన్ ఫ్యాషన్ చారిత్రాత్మకంగా పలుదశలు దాటింది. పాకిస్థాన్ ఫ్యాషన్ భారతదేశ ఫ్యాషన్ , సంస్కృతి కంటే విలక్షణంగా ఉండి తన ప్రత్యేకత చాటుకుంటుంది. పాకిస్థాన్ ఫ్యాషన్ సంప్రదాయ , ఆధునిక మేలుకలయికగా ఉండి పాకిస్థాన్ ప్రత్యేకత గుర్తుచేస్తూ ఉంటుంది. ఆధునిక శైలికి భిన్నంగా ప్రజలు ధరించే దుస్తులు సంప్రదాయ , ప్రాంతీయ సహజత్వానికి ప్రతీకగా ఉంటాయి. ప్రాంతీయ తరహా దుస్తులు అధిక నూతనంగా , స్వచ్చమైన రూపంతో విలక్షణంగా ఉంటాయి. లాహోర్‌లో ఉన్న "పాకిస్థాన్ ఫ్యాషన్ డిజైన్ కౌంసిల్ " , కరాచీలో ఉన్న" ఫ్యాషన్ వీక్ " పాకిస్థాన్‌లో ఫ్యాషన్ షో నిర్వహిస్తుంటాయి. 2009 లో మొదటిసారిగా పాకిస్థాన్ ఫ్యాషన్ వీక్ నిర్వహించబడింది.

స్త్రీవాదం

Benazir Bhutto was the first woman elected to lead a Muslim state, and only to be elected twice
Malala Yousafzai is the youngest-ever Nobel Prize laureate.

పాకిస్థానీ స్త్రీల సాంఘిక అంతస్థు వ్యత్యాసంగా ఉంటుంది. స్త్రీల స్థితి సాంఘిక స్థితి, పుట్టిపెరిగిన వాతావరణం , ప్రాంతీయత మీద ఆధారపడి ఉంటుంది. అసమానంగా ఉండే ఆర్ధికసాంఘిక స్థితి , స్త్రీ విద్య పాకిస్థాన్ స్త్రీల జీవనవిధానం మీద కూడా ప్రభావం చూపుతుంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేకంగా స్త్రీలపట్ల వివక్ష అధికంగా ఉంది. .[ఆధారం చూపాలి] పాకిస్థాన్ ఆవిర్భావం నుండి స్త్రీవాదం ఉచ్చస్థాయిలో వినిపిస్తుంది.. 1947 నుండి ఆల్ పాకిస్థాన్ వుమంస్ అసోసియేషన్ , ఔరత్ ఫౌండేషన్, అంతర్జాతీయ స్త్రీవాద సంస్థలు పాకిస్థాన్‌లో స్త్రీ హక్కుల రక్షణార్ధం కృషిచేస్తున్నాయి. షీలా ఇరెనె పంత్, బెనాజిర్ బుట్టో మలాల, కల్సూం నవాజ్ షరీఫ్ , బుష్రా అంసారి పాకిస్థాన్‌లోని ప్రముఖ మహిళావాదులుగా గుర్తించబడుతున్నారు. మతపరమైన ఙానం , విద్యాభివృద్ధి కారణంగా పాకిస్థాన్ లోని స్త్రీల స్థితి మెరుగైంది. అంతర్జాతీయంగా సరాసరితో పోల్చిచూస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 2014 లో "వరల్డ్ ఎకనమిక్ ఫోరం" వర్గీకరణలో లింగవివక్షలో పాకిస్థాన్ అంతర్జాతీయంగా రెండవ స్థానంలో ఉందని తెలుస్తుంది.

స్త్రీ పురుష వివక్ష

సంప్రదాయకంగా స్త్రీలు అణిచివేతకు గురౌతున్నారు. సాధారణంగా స్త్రీలకు ఇంటిపనులు పురుషులకు ఇంటి పోషణ బాధ్యతలు వహిస్తారు. పురుషులు ధనసంపాదన బాధ్యతవహిస్తారు. అయినప్పటికీ నగరప్రాంతాలలో స్త్రీలు వృత్తిఉద్యోగాలు చేస్తూ ఇంటిఖర్చులకు ఆర్ధికంగా సహకరిస్తుంటారు. అయినప్పటికీ ఆర్ధికస్వాతంత్రం అనుభవిస్తున్న వారి శాతం తక్కువగా ఉంటుంది.

స్త్రీలు అధికంగా టీచింగ్ ఉద్యోగాలు ఎంచుముంటారు. ప్రజలలో చైతన్యం అభివృద్ధి కారణంగా స్త్రీలకు విద్యావకాశాలు అధికరిస్తున్నాయి.. మతాధికారులు కూడా ప్రస్తుతం స్త్రీవాద పోరాటాలకు , కార్యాలయాలు , గృహాలలో సమానత్వం కొరకు సహకారం అందిస్తున్నారు. .

మాధ్యమం

Fawad Khan is a popular Pakistani actor who won a Filmfare Award for Best Male Debut
Nazia Hassan, was a Pakistani pop singer went on to sell over 60 million records worldwide.

పాకిస్థాన్ ప్రైవేట్ వార్తాపత్రికలు , రాష్ట్రానికి చెందిన పాకిస్థాన్ టెలివిషన్ కార్పొరేషన్ (పి.టి.వి) , పాకిస్థాన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (పి.బి.సి),21వ శతాబ్దంలో పాకిస్థాన్ రేడియో పాకిస్థాన్ మాధ్యమం మీద ఆధిపత్యం వహిస్తున్నాయి. 2000 నుండి మాధ్యమం ప్రైవేటీకరణ చేయబడిన తరువాత అధికంగా 24 గంటల వార్తాప్రసారాలు, పాకిస్థాన్ న్యూస్ చానెల్స్ , టెలివిషన్ చానెల్స్ మాధ్యమం మీద ఆధిపత్యం వహిస్తున్నాయి. అదనంగా జాతీయ ఎంటర్టైన్మెంటు , న్యూస్ చానెల్స్, వీదేశీ టెలివిషన్ ప్రసారాలు కూడా అందుబాటులో ఉన్నాయి..

చిత్ర పరిశ్రమ

లాలీ వుడ్ (ఉర్దూ చిత్రసీమ) కు కారాచీ, లాహోర్ , పెషావర్ ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. పాకిస్థాన్ ప్రజల సంస్కృతిలో ప్రధాన భాగంగా ఉన్న బాలివుడ్ చిత్రాలు 1965–2008 వరకు ప్రజలకు నిషేధించబడ్డాయి. పాకిస్థాన్ చిత్రపరిశ్రమ బలహీనంగా ఉన్నా పాకిస్థానీ ఉర్దూ నాటకాలు, నాటకరంగ ప్రదర్శనలకు ప్రజాదరణ అధికంగా ఉంది.పలు పాకిస్థానీ టెలివిషన్ ప్రసారాలు దినసరి వరుసకార్యక్రమాలను అందిస్తూ ఉన్నాయి.

పాకిస్థానీ నాటకాలు టెలివిషన్ ప్రసారాలను అధిగమిస్తున్నాయి.

పాప్ సంగీతం

1960–1970 లో పాప్ మ్యూజిక్ డిస్కో ప్రాబల్యం సంపాదించుకుని పాకిస్థాన్ సంగీతప్రపంచం మీద ఆధిఖ్యత సాధించాయి. 1980-1990 లో బ్రిటిష్ హెవీ మెటల్ సంగీతం, పాకిస్థానీ రాక్ సంగీతాలు పాకిస్థానీ ప్రజలను ఆకర్షించాయి.

2000 లో హెవీ మెటల్ సంగీతం పాకిస్థాన్ సంగీతప్రపంచానికి పరిచయం చేయబడింది. ఇది ప్రజాదరణ సాధించడమేగాక విమర్శకుల ప్రశంశలు కూడా అందుకుంది.

జానపద సంగీతం

పాకిస్థానీ జానపద సంగీతంలో ప్రాంతీయ జానపద సంగీతం , క్వవ్వాల్, ఘజల్ మొదలైన సంప్రదాయ శైలి భాగస్వామ్యం వహిస్తున్నాయి. అఫనంగా ఆధునికమైన పాశ్చాత్య సంగీతం కూడా ప్రజాదరణ కలిగి ఉంది.. పాకుస్థాన్‌లో అనేకమంది జానపదగాయకులు ఉన్నారు. పశ్చిమభూభాగం నుండి ఆఫ్ఘన్ శరణార్ధిల ప్రవేశించిన తరువాత పాష్తో సంగీతానికి ఆదరణ అధికం అయింది. అయినప్పటికీ పాష్తో సంగీతానికి కొన్ని ప్రాంతాలలో వ్యతిరేకత కనిపిస్తుంది. పాకిస్థాన్‌లో కొంత అత్యాధునికమైన , పారదర్శకమైన మాధ్యమం పనిచేస్తుంది. పాకిస్థాన్ మాధ్యమం లంచగొండితనం వెలుగులోకి తీసుకురావడంలో ప్రధానపాత్ర వహిస్తుంది.

నగరీకరణ

పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
Long exposure of Empress Market in Karachi.

పాకిస్థాన్‌కు స్వతంత్రం వచ్చిన తరువాత పాకిస్థాన్ నగరీకరణ వేగవంతం అయింది. అందుకు పలు వైవిద్యమైన కారణాలు ఉన్నాయి.

దక్షిణ పాకిస్థానీయులు అధికంగా సింధూనదీతీరంలో నివసిస్తుంటారు. అధిక జనసంఖ్య కలిగిన నగరంగా కరాచీ ప్రత్యేకత కలిగి ఉంది.

తూర్పుప్రాంత పాకిస్థాన్ ప్రజలు ఖైబర్ పఖ్తుంవా , ఉత్తర పాకిస్థాన్ లాహోర్, ఫైసాలాబాద్, రావల్పిండి, ఇస్లామాబాద్, సర్గోధా, గుజరంవాలా, సైకోట్, గుజరత్ నగరం, ఝెలం, షైయిఖ్పురా, నౌషెరా, మార్దన్ , పెషావర్ నగరాలు ఉన్నాయి. 1990–2008 మద్య కాలంలో నగరాలో నివసిస్తున్న ప్రజల శాతం 36%. ఇది పాకిస్థాన్‌ను ఆసియాలో అధికంగా నగరీకరణ దేశంగా నిలబెట్టింది. అదనంగా 50% ప్ర్జలు 5,000 మంది కంటే అధిక జనసంఖ్య కలుగిన పట్టణాలలో నివసిస్తున్నారు. . పాకిస్థాన్ ప్రజలు అధికంగా దేశీయంగానూ , విదేశాలకు వలసపోతుంటారు. అందువలన పాకిస్థాన్ ప్రజలు అధికంగా నగరాలకు వలసపోవడానికి సహకరిస్తుంది. 1998 లో ఒక విశ్లేషకుడు 1940 నుండి పాకిస్థాన్ నగరీకరణ గురించి వివరణ అందించాడు..

స్వాతంత్రం తరువాత

ఇతరదేశాల నుండి పాకిస్థాన్‌కు వలస రావడం (ప్రత్యేకంగా పొరుగుదేశాల నుండి) వలన పాకిస్థానీ నగరీకరణను మరింత అధికం చేసింది. 1971 లో బంగ్లాదేశ్ ప్రత్యేకదేశంగా అవతరించిన తరువాత పాకిస్థాన్ నగరీకరణ మరింత అధికం అయింది. సంప్రదాయానికి ముఖ్యత్వం ఇచ్చే బీహారీ పాకిస్థానీలు అధికసంఖ్యలో , స్వల్పసంఖ్యలో బెంగాలీలు పాకిస్థాన్‌కు వలసపోయారు. తరువాత బర్మీయులు పాకిస్థాన్‌కు వలసపోయారు. ఆఫ్ఘనీస్థాన్‌లో సోవియట్ యుద్ధం కూడా మిలియన్ల ఆఫ్ఘనీయులను పాకిస్థాన్‌కు తరలివెళ్ళేలా చేసింది. ఆఫ్ఘన్లు ప్రత్యేకంగా వాయవ్య పాకిస్థాన్‌కు శరణార్ధులుగా తరలివెళ్ళారు. ఆఫ్ఘన్‌ల వలస కారణంగా పాకిస్థాన్ నగరీకరణ వేగవంతం చేయవలసిన అవసరం అధికమైంది. ఆఫ్ఘన్ల రాక సాంఘిక- రాజకీయ- ఆర్ధిక సమస్యలను అధికం చేసింది. అదనంగా జనసంఖ్య అధికమవడం కారణంగా హరిత విప్లవం , రాజకీయాల అభివృద్ధికి కారణం అయింది. .

ప్రవాస పాకిస్థానీలు

దాదాపు 7 మిలియన్ల పాకిస్థాన్ ప్రజలు విదేశాలలో నివసిస్తున్నారని అంచనా. అత్యధికంగా మద్య ఆసియా, యూరప్ , నార్త్ అమెరికాలో నివసిస్తున్నారు. 13బిలియన్ల అమెరికన్ డాలర్లు ప్రవాస పాకిస్థాన్ విదేశీ మారకాన్ని స్వదేశానికి పంపుతున్నట్లు అంచనా. విదేశీ మారక ఆదాయంలో పాకిస్థాన్ ప్రంపంచంలో 10వ స్థావనంలో ఉంది.

విదేశీ ఉపాధి

ప్రవాస పాకిస్థాన్ ప్రజలను పాకిస్థాన్ ఓవర్సీస్ పాకిస్థానుకుగా గుర్తిస్తుంది. 2008 లో మినిస్ట్రీ ఆఫ్ ఓవర్సీస్ పాకిస్థానీస్ స్థాపించబడింది. ప్రవాస పాకిస్థానీయుల సంస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి ఇది పనిచేస్తూ ఉంది. ప్రవాస పాకిస్థాన్ ప్రజల విదేశీమారకం దేశం విదేశీమారక నిల్వలను పెంచడంలో రెండవస్థానంలో ఉంది. మొదటిస్థానంలో ఎగుమతులు ఉన్నాయి. పాకిస్థాన్ విదేశీమారకం వార్షికంగా క్రమక్రమాభివృద్ధి చెందుతూ ఉంది. 2007-2008 లలో 4 మిలియన్ల అభివృద్ధి సాధించగా 2008-2009 లో 8 మిలియన్ల అభివృద్ధికి (21.8%) చేరుకుంది.

విదేశీమారకం

2009–2010 లో పాకిస్థాన్ ప్రజలు పాకిస్థాన్‌కు 9.4 బిలియన్ల అమెరికన్ డాలర్లు విదేశీమారకం పంపారు. పాకిస్థాన్ ప్రజల విదేశీమారక ఆదాయం ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది. 2012 లో పాకిస్థాన్ పాకిస్థాన్ ప్రజలు పాకిస్థాన్‌కు పంపిన విదేశీమారకం పాకిస్థాన్‌ను ప్రపంచం లో 10 వ స్థానంలో (13 బిలియన్లు) నిలిపింది.

పాకిస్థాన్ ప్రవాసపాజిస్థాన్ ప్రజల విదేశీమారకం పాకిస్థాన్ ఆర్ధికరంగలో ముఖ్యత్వవహిస్తుందని గ్రహించిన పాకిస్థాన్ ప్రభుత్వం 2004 లో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఆధ్వర్యంలో ది ఓవర్సీస్ పాకిస్థాన్ డివిషన్ స్థాపించబడింది. అదనంగా సాంఘిక సంక్షేమ పథకాలు, ఓవర్సీస్ పాకిస్థాన్ ఫౌండేషన్ ప్రవాస పాకిస్థాన్ ప్రజలకు సహకరిస్తూ ఉంది. విమానాశ్రయ సౌకర్యాలు అధికరించడం, నివాసగృహాల అభివృద్ధి, విద్య , ఆరోగ్యసంక్షేమ పథకాల అభివృద్ధి చేస్తూ ప్రవాస పాకిస్థానీయులకు సహకారం అందిస్తుంది. వీటిలో అతిముఖ్యమైనది తిరుగి స్వదేశం చేరుకున్న ప్రవాసపాకిస్థానీయులకు పునరావాసం ఏర్పరచడం ప్రధానమైనది.

సాహిత్యం

పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
Muhammad Iqbal, Pakistan’s national poet who conceived the idea of Pakistan.

పాకిస్థాన్‌లో ఉర్ధూసాహిత్యం, సింధూ సాహిత్యం, పంజాబీసాహిత్యం, పషో సాహిత్యం , కవిత్వం, బలోచీ అకాడమీ, పర్షియన్ సాహిత్యం, పాకిస్థానీ ఆగ్లసాహిత్యం , ఇతరసాహిత్యప్రక్రియలు ఉన్నాయి. అతిపెద్ద సాహిత్య సముదాయం అయిన "ది పాకిస్థానీ అకాడమీ ఆఫ్ లెటర్స్" అంతర్జాతీయ స్థాయిలో సాహిత్యం , కవిత్వం అందిస్తుంది." ది నేషనల్ లైబ్రరీ ఆఫ్ పాకిస్థాన్" అత్యధికంగా సాహిత్యాన్ని ప్రచురణ , పోషణ బాధ్యతవహిస్తుంది. అలాగే సాహిత్యాన్ని ప్రజలకు అందజేయడానికి తగినంతగా సహకరిస్తుంది. 19వ శతాబ్ధానికి ముందు పాకిస్థాన్‌లో సాహిత్యం అధికంగా కవిత్వం, సూఫీ కవిత్వం, వివిధ సంగీత ప్రక్రియలు , పాప్ సంప్రదాయం రూపంలో ఉండేది. కాలనీ పాలనాకాలంలో దేశీయసాహిత్యకాతులు ఆగ్లసాహిత్యంతో ప్రభావితులు అయ్యారు. వారు వివిధ రచనావిధానాలను స్వీకరించారు. వీటిలో ప్రోజ్ విధానం అధికంగా ఆదరించబడింది.

కవిత్వం

పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
Tomb of Shah Rukn-e-Alam is part of Pakistan's sufi heritage.

పాకిస్థాన్‌ సాహిత్యకారుల జాబితా:-

  • ముహమ్మద్ ఇక్బాల్: ఉర్దూ , పర్షియన్ కవిత్వం. ఆయన ఇస్లామిక్ సాంస్కృతిక ప్రజల ఆధ్యాత్మిక , రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టాడు. ఆయన అంతర్జాతీయ ముస్లిముల ఐఖ్యత కొరకు పాటుబడ్డాడు.
  • ఫియాజ్ అహ్మద్: ఆయయన అందమైన దస్తూరి , చిత్రలేఖనానికి ప్రఖ్యాతిచెందాడు.
  • సుఫీ కవులు: షాహ్ అబ్దుల్ లతీఫ్, బులెహ్ షాహ్, మైన్ ముహమ్మద్ భక్ష్ , ఖవాజ ఫరిద్ మొదలైనవారు చాలా ప్రజాదరణ పొందారు.
  • మిర్జా కాలిచ్ బెగ్: ఆధునిక సింధూసాహిత్యానికి మూలస్థంభంగా ఉన్నాడు.

తాత్వికం

ముహమ్మద్ ఇక్బాల్, సయ్యద్ అహమ్మద్ ఖాన్, ముహమ్మద్ ఆసాద్, అబు, ఆలా మౌదుబి , ముహమ్మద్ అలి జౌహరిలు పాకిస్థాన్ తాత్వికచిందన అభివృద్ధికి మార్గదర్శకం వహించారు.

తరువాత బ్రిటిష్ తాత్వికచింతన ఆతరువాత ఆమెరికన్ తాత్వికచింతన పాకిస్థాన్ తత్వచింతన అభివృద్ధికి సహకరించాయి. తాత్విక వాదులు ఎం.ఎం. షరీఫ్ , సయ్యద్ జఫ్రుల్ హాసన్ 1947 లో మొదటి పాకిస్థాన్ తాత్వికఉద్యమానికి తెరతీసారు. 1971 ఇండో – పాకిస్థాన్ యుద్ధం తరువాత పాకిస్థాన్‌ తాత్విక ప్రపంచంలోమార్కిజం చింతన అభివృద్ధికి జలాలుద్దీన్ అబ్దుర్ రహీం, సొభొ గియాన్‌చందని , మాలిక్ మెరాజ్ ఖలిద్ మొదలైన ప్రముఖులు సహకరించారు.. మంజూర్ అహ్మద్, జాన్ ఎలియా, హాసన్ అస్కారి రిజ్వి చితనలు పాకిస్థాన్ తత్వచింతన మీద ప్రభావం చూపారు. అంతర్జాతీయ ఖ్యతిచెందిన తాత్వికుడు నొయాం చోకీ చింతనలు పాకిస్థాన్ తత్వచింతన, రాజకీయ , సాంఘిక చింతన మీద ప్రభావంచూపింది.

నిర్మాణశైలి

పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
The Lahore Fort, a landmark built during the Mughal era, is a UNESCO World Heritage Site.

పాకిస్థాన్ చరిత్రలో నాలుగు గుర్తించతగిన కాలాలు ఉన్నాయి. ఇస్లామిక్ కాలానికి ముందు, ముస్లిం కాలం, కాలనీ కాలం , సిధూనాగరికత ఆరంభకాలం( క్రీ.పూ 3000). ఆరభకాల ఉన్నతస్థాయి నగరసంస్కృతికి చెందిన భవనాలలో కొన్ని ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఇస్లామిక్ కాలానికి ముందు కాలానికి చెందున మొహంజొ- దారో, హరప్పా , కోట్ దిజి వంటి మానవస్థావర ప్రాంతాలు ప్రస్తుత పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి.. మొదటి శతాబ్దం ఆరంభంలో బుద్ధిజం , గ్రీక్ ప్రభావం కారణంగా గ్రీకో- బుద్ధిజం శైలి అభివృద్ధికి కారణం అయింది. ఈ శకానికి శిఖారాగ్రంగా గాంధారశిల్పం శైలి రూపుదిద్దుకుంది. బుద్ధిజానికి ఉదాహరణగా ఖైబర్ పఖ్తుంక్వాలోని తాకత్- ఇ- భై బౌద్ధ ఆరామం ఒకటి.

ఇస్లాం ప్రవేశం

ప్రస్తుత పాకిస్థాన్‌లో ఇస్లాం ప్రవేశించగానే పాకిస్థాన్‌లో బుద్ధిజం ముగింపుకువచ్చింది. తరువాత క్రమంగా ఈ ప్రాంతంలో ఇస్లామిక్ నిర్మాణాలు అధికరించాయి. అతి ప్రాముఖ్యత సంతరించుకున్న ఇండో- ఇస్లామిక్ నిర్మాణాలకు ఉదాహరణగా ముల్తాన్‌లో "రుక్న్- ఇ- ఆలం" (షహ్ రుక్న్- ఇ- ఆలం సమాధి) ఇప్పటికీ నిలిచిఉంది. మొఘల్ కాలానికి చెందిన "పర్షియన్- ఇస్లామిక్" శైలి నిర్మాణాలలో హిందూస్థానీ కళలు చోటుచేసుకున్నాయి. మొఘల్ పాలకులకు సందర్భానుసార నివాసంగా ఉన్న లాహోర్‌లో మొఘల్ కాలానికి చెందిన పలు నిర్మాణాలు ఉన్నాయి. వాటిలో " బాద్షాహీ మసీదు" , లాహోర్ కోట, ఆలంగిరీ ద్వారం, వర్ణరజితమైన మొఘల్ నిర్మాణశైలిలో నిర్మించబడిన "వజీర్ ఖాన్ మసీదు" అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న నిర్మాణాలు గుర్తించబడుతున్నాయి., మొఘల్ కాలానికి చెందిన మరొకొన్ని నిర్మాణాలలో లాహోరు లోని షాలీమర్ గార్డెన్లు, తట్టలోని షాజహాన్ మసీదు ఉన్నాయి. కాలనీ పాలనకు ముందు ఇండో- యురేపియన్ " శైలి కార్యాలయాలు ఇండియన్- ఇస్లామిక్ మిశ్రిత శైలిలో అభివృద్ధి చేయబడ్డాయి. కాలనీ పాలన తరువాత ఫైజల్ మసీదు, మినార్- ఇ- పాకిస్థాన్ , మజర్-ఇ- ఖ్వైద్ మొదలైన ఆధునిక నిర్మాణాలు పాకిస్థానీ జాతీయత ప్రతిబింబించేలా నిర్మిచబడ్డాయి. మౌళిక వసతులకు చెందిన నిర్మాణాలలో యునైటెడ్ కింగ్డం నిర్మాణశైలి ప్రతిబింబిస్తుంది. అలాంటి నిర్మాణాలు లాహోరు, పెషావర్ , కరాచీలలో ఉన్నాయి.

ఆహారం

పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
A Pakistani dish cooked using the tandoori method.

పాకిస్థాన్ ఆహారసంస్కృతిలో దక్షిణాసియా దేశాలప్రభావం అధికంగా ఉంది. 16వ శతాబ్దంలో మొఘల్ రాజుల వంటగది నుండి వెలువడిన పలు ఆహారాలు ఇప్పటికీ పాకిస్థాన్ ఆహార అలవాట్ల మీద ప్రభావం చూపుతూ ఉంది. మిగిలిన ద్వీపకల్పంలో కంటే పాకిస్థాన్‌లో అత్యధికమైన మాంసాహారాలు వాడుకలో ఉన్నాయి. ఈ మాంసాహారాలకు బ్రిటిష్, మద్య ఆసియా, మిడిల్ ఇస్ట్ దేశాల మాంసాహారాల ప్రభావం మూలంగా ఉంది. పాకిస్థానీ ఆహారాలలో మసాలా దినుసులు, మూలికలు, సీసనింగ్స్ అధికంగా వాడబడుతుంది. అల్లం, వెల్లుల్లి, పసుపు, ఎండుమిరపకాయలు , గరం మసాలా అధికమైన ఆహారల తయారీకి వాడుతుంటారు. సాధారణంగా పాకిస్థానీ ఆహారంలో చపాతీలతో కూరలు, మాంసం, కూరగాయలు, పప్పుకూరలు ఉంటాయి. అన్నంకూడా పాకిస్థాన్ ప్రధానాహారాలలో ఒకటి. వట్టి అన్నం (ప్లెయిన్ రైస్) లేక సుఘంధ ద్రవ్యాలను చేర్చి వేపిన అన్నం కూరలతో వడ్డించబడుతుంది. ఆహారంలో తీపిపదార్ధాలు కూడా ఉంటాయి.

పానీయాలు

పాకిస్థాన్‌లోని పంజాబీప్రాంతవాసులకు సంప్రదాయపానీయం లస్సీ. దక్షిణ భూభాగంలో చాలాప్రాబల్యం పొందిన స్వీటుగా సోహన్ హల్వాకు ప్రత్యేకత ఉంది. ఇది పాకిస్థాన్ అంతటా ఆదరణ కలిగి ఉంది. .

క్రీడలు

బ్రిటిష్ పాలనా కాలం నుండి పాకిస్థాన్ క్రిడారంగం అభివృద్ధిచెందింది. పాకిస్థాన్ జాతీయక్రీడ హాకీ. పాకిస్థాన్ క్రీడాకారులు 3 మార్లు (1960-1968-1984) ఓలింపిక్ స్వర్ణపతకాలను సాధించారు. పాకిస్థాన్ 4 మార్లు పురుషుల ప్రపంచ హాకీకప్ (1971-1978-1982-1994) గెలుచుకుంది.

క్రికెట్

పాకిస్థాన్ ప్రజలకు అత్యంత అభిమానపాత్రమైన క్రీడ క్రికెట్. పాకిస్థాన్ నేషనల్ క్రికెట్ క్రీం (షాహీన్) 1992 ప్రపంచ క్రికెట్ సాధించింది. 2007 ఐ.సి.సి. వరల్డ్ ట్వంటీ పోటీలలో రన్నర్‌ స్థానం దక్కించుకున్నది. 2009లో తీవ్రవాదులు శ్రీలంక క్రికెట్ క్రీడాకారుల మీద మిలిటెంట్లు దాడి చేసారు. ఫలితంగా పాకిస్థాన్ క్రికెట్ క్రీడకు కొంత అవరోధం ఏర్పడింది..[ఆధారం చూపాలి] అయినప్పటికీ 2015 మే ఇంటర్నేషనల్ క్రికెట్ తిరిగి పాకిస్థాన్ చేరుకుంది. జింబావే టీం పాకిస్థాన్‌ పర్యటనలో మొత్తం పోటీలు గట్టి బందీబస్తు మద్య లాహోరులో నిర్వహించబడ్డాయి. అన్ని పోటీలు హౌస్ ఫుల్ సాధించి సరికొత్త చరిత్రను సృషిటించాయి. .[ఆధారం చూపాలి] తరువాత పలుపోటీలకు ద్వారాలు తెరచుకున్నాయి.[ఆధారం చూపాలి]

పాకిస్తాన్: పలు సంస్కృతులు, పాలన, స్వాతంత్ర్యం తరువాత 
The A1 car of A1 Team Pakistan driven by the motorsport driver, Adam Khan.

అథ్లెట్లు

1954 -1958 లలో ఆసియన్ అథ్లెట్ క్రీడలో అబ్దుల్ ఖలిక్ పాల్గొన్నాడు. ఆయన పాకిస్థాన్ తరఫున 34 అంర్జాతీయ స్వర్ణపతకాలను 14 రజిత పతకాలను , 12 కాంశ్యపతకాలను సాధించాడు. .

క్రీడాకారులు

స్క్వాష్ లో అంతర్జాతీయస్థాయి క్రీడాకారుడు జహంగీర్ ఖాన్ , జంసర్ ఖాన్‌లు పలుమార్లు చాంపియన్ షిప్ సాధించి చరిత్ర సృష్టించారు. జంసర్ ఖాన్ బ్రిటిష్ ఓపెన్ స్క్వాష్ చాంపియన్‌షిప్ కూడా 10 మార్లు సాధించి విజయం సాధించాడు.

ఒలింపిక్స్

పాకిస్థాన్ క్రీడాకారులు పలుమార్లు ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్నారు. పాకిస్థాన్ క్రీడాకారులు ఒలింపిక్ క్రీడలలో హాకీ, బక్సింగ్, అథ్లెట్లు,ఈత , షూటింగ్ మొదలైన క్రీడలలో పాల్గొన్నారు. పాకిస్థాన్ సాధించిన 10 ఒలింపిక్ స్వర్ణపతకాలలో 8 హాకీ క్రీడాకారులు సాధించినవే. పాకిస్థాన్ క్రీడాకారులు కామంవెల్త్ క్రీడలు , ఆసియన్ క్రీడలలో 65 -160 పతకాలు సాధించారు.

పోలో

పాకిస్థాన్‌లో జాతీయస్థాయి పోలో ప్రబలంగా ఉంది. దేశంలో పలుప్రాంతాలలో పోలో క్రీడలు నిర్వహించబడుతున్నాయి. బాకిసింగ్, బిలియర్డ్స్, రోయింగ్, కయకింగ్, కేవింగ్, టెన్నిస్, కాంట్రాక్ట్ బ్రిడ్జ్, గోల్ఫ్ , వాలీబల్ మొదలైన క్రీడాలలో కూడా పాకిస్థాన్ క్రీడాకారులు చురుకుగా పాల్గొంటూ వీటిని అంతర్జాతీయ , జాతీయ స్థాయిలో పాల్గొంటున్నారు. లాహోర్ , కారాచీలలో బాస్కెట్ బాల్‌ ప్రాబల్యం కలిగిఉంది.

రాజకీయ నాయకులు

ఇవి కూడా చూడండి

భారత్ పాక్ యుద్దం 1965
భారత్ పాక్ యుద్దం 1971

గమనికలు

మూలాలు

This article uses material from the Wikipedia తెలుగు article పాకిస్తాన్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.

Tags:

పాకిస్తాన్ పలు సంస్కృతులుపాకిస్తాన్ పాలనపాకిస్తాన్ స్వాతంత్ర్యం తరువాతపాకిస్తాన్ కొత్త రాజధానిపాకిస్తాన్ పాక్‌ అధ్యక్షుడి అధికారాలకు కత్తెరపాకిస్తాన్ ఆరోపణలుపాకిస్తాన్ వివాదాలుపాకిస్తాన్ భారత్‌-పాక్‌ను సన్నిహితం చేద్దాంపాకిస్తాన్ పేరువెనుక చరిత్రపాకిస్తాన్ చరిత్రపాకిస్తాన్ ప్రభుత్వవిధానాలుపాకిస్తాన్ భౌగోళికంపాకిస్తాన్ వాతావరణంపాకిస్తాన్ వృక్షజాలం , జంతుజాలంపాకిస్తాన్ మౌళిక సదుపాయాల నిర్మాణముపాకిస్తాన్ కార్పొరేషన్లుపాకిస్తాన్ అణువిద్యుత్తుపాకిస్తాన్ పర్యాటకంపాకిస్తాన్ ప్రయాణసౌకర్యాలుపాకిస్తాన్ సాంకేతికంపాకిస్తాన్ విద్యపాకిస్తాన్ గణాంకాలుపాకిస్తాన్ సంస్కృతిపాకిస్తాన్ స్త్రీవాదంపాకిస్తాన్ మాధ్యమంపాకిస్తాన్ నగరీకరణపాకిస్తాన్ ప్రవాస పాకిస్థానీలుపాకిస్తాన్ సాహిత్యంపాకిస్తాన్ నిర్మాణశైలిపాకిస్తాన్ ఆహారంపాకిస్తాన్ క్రీడలుపాకిస్తాన్ రాజకీయ నాయకులుపాకిస్తాన్ ఇవి కూడా చూడండిపాకిస్తాన్ గమనికలుపాకిస్తాన్ మూలాలుపాకిస్తాన్1947అలెగ్జాండర్ముహమ్మద్ అలీ జిన్నాసింధు నాగరికత

🔥 Trending searches on Wiki తెలుగు:

వ్యతిరేక పదాల జాబితారామాయణంలోని పాత్రల జాబితాయోగాసనాలుప్రజాస్వామ్యంపసుపు గణపతి పూజకొణతాల రామకృష్ణప్రకృతి - వికృతినన్నయ్యభరతుడు (కురువంశం)పి.సుశీలస్వాతి నక్షత్రముఇక్ష్వాకు వంశంరోహిణి నక్షత్రందాశరథి కృష్ణమాచార్యమహాత్మా గాంధీమానవ శరీరముఋతువులు (భారతీయ కాలం)భారత ఎన్నికల కమిషనుసౌర కుటుంబంమృణాల్ ఠాకూర్భారత రాజ్యాంగ పరిషత్షడ్రుచులుసునయనశుక్రుడుపాగల్ధనూరాశిసప్తర్షులురావి చెట్టుగౌతమ బుద్ధుడుద్వాదశ జ్యోతిర్లింగాలుజవాహర్ లాల్ నెహ్రూనవీన్ పట్నాయక్సంపూర్ణ రామాయణం (1959 సినిమా)నవగ్రహాలు జ్యోతిషంఅభిరామివామనావతారమురవితేజయాత్ర 2కందుకూరి వీరేశలింగం పంతులుగుంటకలగరఅమ్మవినాయకుడుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలువిభక్తిభారతీయ శిక్షాస్మృతి – సెక్షన్లు 299 - 377విభీషణుడుహనుమజ్జయంతిప్రశ్న (జ్యోతిష శాస్త్రము)విష్ణుకుండినులుపెళ్ళి చూపులు (2016 సినిమా)మదర్ థెరీసాభారతదేశంలో విద్యకోదండ రామాలయం, ఒంటిమిట్టశత్రుఘ్నుడుశ్రీనాథుడుహిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులుకానుగనవమిశ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి2024 భారతదేశ ఎన్నికలుయానిమల్ (2023 సినిమా)శాంతికుమారితాజ్ మహల్హృదయం (2022 సినిమా)తెలంగాణ శాసనసభ స్పీకర్ల జాబితాభారతీయ జనతా పార్టీమచిలీపట్నం శాసనసభ నియోజకవర్గంభరణి నక్షత్రములోక్‌సభ నియోజకవర్గాల జాబితానర్మదా నదిశుభ్‌మ‌న్ గిల్లవకుశసూర్య (నటుడు)కృష్ణ జననంభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుఅమెజాన్ ప్రైమ్ వీడియోసలేశ్వరం🡆 More