కనకదుర్గ ఆలయం

కనకదుర్గ గుడి, ఒక ప్రసిద్ధమైన దేవస్థానం.

ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది.

కనకదుర్గ గుడి
KANAKADURGA TEMPLE
విజయవాడలోని కనకదుర్గ ఆలయం
విజయవాడలోని కనకదుర్గ ఆలయం
కనకదుర్గ గుడి KANAKADURGA TEMPLE is located in Andhra Pradesh
కనకదుర్గ గుడి KANAKADURGA TEMPLE
కనకదుర్గ గుడి
KANAKADURGA TEMPLE
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం
భౌగోళికాంశాలు :16°30′58″N 80°36′58″E / 16.516°N 80.616°E / 16.516; 80.616
పేరు
ప్రధాన పేరు :కనక దుర్గ అమ్మవారి ఆలయం
దేవనాగరి :कनकदुर्ग अम्मवारि आलय
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:కృష్ణా జిల్లా
ప్రదేశం:విజయవాడ
ఆలయ వివరాలు
ప్రధాన దేవత:కనక దుర్గా దేవి
ఇతిహాసం
నిర్మాణ తేదీ:సమాచారం లేదు
సృష్టికర్త:సమాచారం లేదు
కనకదుర్గ ఆలయం
దుర్గ ఆలయం

పేరువెనుక చరిత్ర

కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది.

కనకదుర్గ ఆలయం 
గుడి క్రింది భాగం

క్షేత్ర పురాణం

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.

రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు.

నవరాత్రి ఉత్సవాలు

ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము దసర నవరోత్సవాలు జరుగుతాయి. ఈ దసర నవరోత్సవల లో ప్రతి దినము ఒక అవతారముతో దర్శనము ఇస్తారు. ఈ తొమ్మిది దినములు తొమ్మిది అవతారాలతో దర్శనము ఇస్తారు.

  • మొదటి దినము స్వర్ణ కవచాలంకార దుర్గ దేవి
  • రెండవ దినము బాల త్రిపురసుందరి దేవి
  • మూడవ దినము గాయత్రి దేవి
  • నాలుగవ దినము అన్నపూర్ణా దేవి.
  • ఐదవ దినము లలితా త్రిపురసుందరి దేవి
  • ఆరవ దినము సరస్వతి దేవి
  • ఏడవ దినము దుర్గాదేవి
  • ఎనిమిదవ దినము మహాలక్ష్మిదేవి
  • తొమ్మిదవ దినము మహిషాసురమర్దిని
  • పదవ దినము రాజరాజేశ్వరి దేవి

ఈ ఐదవ దినమున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ దినము అమ్మవరి జన్మనక్షత్రంగా అనగా మూలానక్షత్రం గా భావిస్తారు. ఆ దినమున వేలాది మంది భక్తులు, విద్యార్థులు తరలివస్తారు. ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు, శ్రీ రాము ల వారు కొలువుతీరి ఉన్నారు. ఈ దేవాలయాన్ని దర్సించుటకు అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుండి వస్తారు.

బయటి లింకులు

మూలాలు

Tags:

కనకదుర్గ ఆలయం పేరువెనుక చరిత్రకనకదుర్గ ఆలయం క్షేత్ర పురాణంకనకదుర్గ ఆలయం నవరాత్రి ఉత్సవాలుకనకదుర్గ ఆలయం బయటి లింకులుకనకదుర్గ ఆలయం మూలాలుకనకదుర్గ ఆలయంఆభరణాలుఆయుధంఇంద్రకీలాద్రి పర్వతంకృష్ణా నదిగుండెత్రిశూలందేవస్థానంపూలతోటమహిషాసురుడువిజయవాడ

🔥 Trending searches on Wiki తెలుగు:

జూనియర్ ఎన్.టి.ఆర్రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్హైదరాబాదుతెలంగాణ ఉద్యమంమేషరాశిఅమ్మదెందులూరు శాసనసభ నియోజకవర్గంమంగళసూత్రంకేతిరెడ్డి వెంకటరామిరెడ్డివర్షం (సినిమా)నాయుడుదేవినేని అవినాష్తెలంగాణా సాయుధ పోరాటంఅల్లూరి సీతారామరాజురైతుభారతదేశంలో బ్రిటిషు పాలనతెలంగాణ ప్రభుత్వ పథకాలుకాకినాడ లోక్‌సభ నియోజకవర్గంచిరంజీవి నటించిన సినిమాల జాబితాభారతదేశంలో కోడి పందాలుభారత రాష్ట్రపతుల జాబితాఎస్. ఎస్. రాజమౌళిహను మాన్తెలుగు కులాలుగ్రామ పంచాయతీఇందిరా గాంధీసన్నిపాత జ్వరంగ్యాస్ ట్రబుల్యమధీరకలమట వెంకటరమణ మూర్తిభారత రాజ్యాంగ ఆధికరణలుకాకినాడశాసనసభ సభ్యుడుత్రిష కృష్ణన్రిషబ్ పంత్విభక్తికృత్తిక నక్షత్రముదగ్గుబాటి పురంధేశ్వరికలియుగంఋగ్వేదంరాశిప్రశాంతి నిలయంఏప్రిల్పరశురాముడుగూగుల్మఖ నక్షత్రమువెల్లలచెరువు రజినీకాంత్పాఠశాలసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్హీమోగ్లోబిన్సింగిరెడ్డి నారాయణరెడ్డిచేతబడిపిత్తాశయముఝాన్సీ లక్ష్మీబాయిఆవుఅయ్యప్పధర్మవరం శాసనసభ నియోజకవర్గంగురజాడ అప్పారావుఆర్టికల్ 370 రద్దుభూమిఅపర్ణా దాస్జాతీయ ప్రజాస్వామ్య కూటమియాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం1వ లోక్‌సభ సభ్యుల జాబితాపామురవితేజగోవిందుడు అందరివాడేలేచోళ సామ్రాజ్యంశ్రీరామనవమిచాకలిసావిత్రి (నటి)తిక్కనజీలకర్రచతుర్యుగాలుఊరు పేరు భైరవకోనగుజరాత్ టైటాన్స్రౌద్రం రణం రుధిరంజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్విశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితా🡆 More