ఆయుధం

ఆయుధాలు (ఆంగ్లం: Weapons) ఇతరుల్ని గాయపరచడానికి లేదా చంపడానికి పనికొచ్చే సాధనాలు.

ఇవే ఆయుధాలు మనల్ని, ఇతరుల్ని రక్షించడానికి కూడా ఉపయోగపడతాయి. ఇవి చిన్న కత్తి నుండి క్లిష్టమైన రాకెట్ వరకు వివిధ రకాలుగా ఉన్నాయి.

ఆయుధం
కంచు యుగపు ఆయుధాలు.

పురాణకాలము నుండి భారతీయ గాథలలో అనేక ఆయుధముల ఉపయోగము జరిగింది. దేవతలు, రాజులు మొదలుకొని ఇప్పట్కికీ అడవులలో నివసించే ఆదిమ జాతులు అలనాటి ఆయుధాల వినియోగం జరుపుతున్నారు.

ఆయుధాలలో రకాలు

  • వ్యక్తిగత ఆయుధాలు: ఇవి ఎక్కువగా ఒక్కరు మాత్రమే ఉపయోగించగలిగేవి. సుత్తి, కత్తి, తుపాకీ మొ.
  • వాహనాలపై ఆయుధాలు: వివిధ రకాల వాహనాలు ఈ రకమైన ఆయుధాలు ఉపయోగించడానికి సహాయపడతాయి. ఉదా: కారు, విమానం, ఓడ, టాంకరు, మొ.
  • జీవసంబంధ ఆయుధాలు: వివిధ రకాల వ్యాధికారక జీవులను ఆయుధాలుగా ఉపయోగించడం.
  • రసాయన ఆయుధాలు: వివిధ రకాల రసాయన పదార్ధాలను విషప్రయోగం లేదా జీవక్రియల ద్వారా చంపడానికి ఉపయోగించడం.
  • అణు ఆయుధాలు: రేడియో ధార్మిక పదార్ధాలను ఆయుధాలుగా ఉపయోగించడం.

ఆయుధపూజ

దసరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఆంధ్రుల కనకదుర్గ...తెలంగాణ ‘బతుకమ్మ’...కన్నడిగుల చాముండి... ఇలా ప్రాంతాలు వేరయినా..విశ్వవ్యాప్తంగా ఎవరు ఏ పేరున పిలచినా...కొలిచినా విజయదశమి పర్వదినాలలో దేవి తన భక్తులను అనుగ్రహించి... ఎవరైతే త్రికరణశుద్థిగా, సత్సంకల్పసిద్ధితో కార్యక్రమాన్ని తలపెడతారో వారి మనోసంకల్పాన్ని జయప్రదంచేసి అష్టైశ్వర్యములు ప్రసాదించే భాగ్యప్రధాయని. అందుకే అంబిక, దుర్గ, భవాని... ఇత్యాది ఏ పేరున పిలచినా పలికే అమ్మలగన్న అమ్మగా...ముజ్జగాలకే మూలపుటమ్మగా విరాజిల్లుతోంది. విజయానికి ప్రతీకగా..చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా సదా ఈ పర్వదినాన్ని ప్రజలంతా జరుపుకుంటారు.

మహాభారతంలో అరణ్యవాసం పూర్తిచేసుకుని అజ్ఞాతవాసం చేసే సమయం ఆసన్నమైనప్పుడు పాండవులు తమ ఆయుధాలను పరుల కంటపడకుండా శ్రీకృష్ణుని సలహా మేరకు జమ్మి చెట్టు మీద భద్రపరిచారు. అజ్ఞాతవాస ముగింపులో విజయ దశమి నాడు పాడవ మధ్యముడు విజయుడు ఆయుధాలను బయటికి తీసి పూజచేసి ఉత్తర గోగ్రహణ యుద్ధాన్ని చేసి దిగ్విజయుడైనాడు. కనుక ఆశ్వీయుజ శుద్ధ దశమి విజయదశమి అయింది. ఆరోజున దుర్గాదేవి, అర్జునుడు విజయం సాధించారు కనుక ప్రజలు తమకు జీవనాధారమైన వస్తువులకు కృతజ్ఞతా పూర్వకముగా పూజలు చేసి తమ జీవితం విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకుంటారు. ఇదే ఆయుధపూజ. విద్యార్థులు పాఠ్య పుస్తకాలను, ఇతరులు తమ వృత్తికి సంబంధించిన పుస్తకాలను పూలలో పెట్టడం ఆనవాయితీ. ఈ రోజు నూతనంగా విద్యార్థులు పాఠశాలలో ప్రవేశింప చేయడం, అక్షరాభ్యాసం చేయడం ఆచారాలలో ఒకటి. వ్యాపారులు కొత్త లెక్కలు ఈ రోజు నుండి ప్రారంభించడం కొన్ని ప్రదేశాలలో ఆచారం.

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

ఆయుధం ఆయుధాలలో రకాలుఆయుధం ఆయుధపూజఆయుధం ఇవి కూడా చూడండిఆయుధం మూలాలుఆయుధం బయటి లింకులుఆయుధంఆంగ్లంఆయుధాలుకత్తిరాకెట్

🔥 Trending searches on Wiki తెలుగు:

శివ కార్తీకేయన్వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యతారక రాముడుఇంద్రుడునారా బ్రహ్మణిజై శ్రీరామ్ (2013 సినిమా)జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గంశ్రీ కృష్ణుడుఅయోధ్యమ్యాడ్ (2023 తెలుగు సినిమా)పరిటాల రవిసన్నాఫ్ సత్యమూర్తిమేషరాశిపన్ను (ఆర్థిక వ్యవస్థ)భారతదేశ సరిహద్దులుశ్రీముఖిరష్మి గౌతమ్ఉదగమండలంలలితా సహస్ర నామములు- 1-100శుక్రుడుటిల్లు స్క్వేర్బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంశోభితా ధూళిపాళ్లH (అక్షరం)ఫేస్‌బుక్శోభన్ బాబుయువరాజ్ సింగ్పాండవులుసమాచార హక్కుగురువు (జ్యోతిషం)నానార్థాలుట్రావిస్ హెడ్రామ్ చ​రణ్ తేజఅల్లూరి సీతారామరాజుతెలంగాణతీన్మార్ మల్లన్నరేవతి నక్షత్రంఅక్కినేని నాగార్జునసాలార్ ‌జంగ్ మ్యూజియంగూగుల్ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాభారత రాజ్యాంగ పీఠికనన్నయ్యతీన్మార్ సావిత్రి (జ్యోతి)పెళ్ళిస్టాక్ మార్కెట్చే గువేరాకస్తూరి రంగ రంగా (పాట)ఉమ్మెత్తఅక్బర్చంపకమాలరైతుబంధు పథకంచతుర్యుగాలుచార్మినార్ఢిల్లీ డేర్ డెవిల్స్స్వామి రంగనాథానందతెలుగు వ్యాకరణంవాతావరణంకేతువు జ్యోతిషంక్లోమముకొమురం భీమ్రాజంపేట శాసనసభ నియోజకవర్గంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిసుడిగాలి సుధీర్బలి చక్రవర్తిపాట్ కమ్మిన్స్యనమల రామకృష్ణుడుభారతరత్నయూట్యూబ్శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)దేవికహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాపిఠాపురం శాసనసభ నియోజకవర్గంఅండాశయముపక్షవాతంరాయప్రోలు సుబ్బారావుతెలంగాణ రాష్ట్ర సమితిభారత జాతీయ చిహ్నం🡆 More