హీమోగ్లోబిన్

హీమోగ్లోబిన్ లేదా హిమోగ్లోబిన్ లేదా రక్తచందురం అనేది అన్ని సకశేరుకాల (చేప కుటుంబం చన్నిచ్త్యిడే మినహా) యొక్క ఎర్ర రక్త కణాలలో ఇనుమును కలిగి ఆక్సిజన్ రవాణా చేసే మెటల్లొప్రోటీన్ (లోహ ప్రోటీన్), అలాగే కొన్ని అకశేరుకాల యొక్క కణజాలం.

రక్తంలో హీమోగ్లోబిన్ శ్వాసకోశ అవయవాల (ఊపిరితిత్తులు లేదా మొప్పలు) నుండి మిగిలిన శరీరానికి (ఉదా: కణజాలం) ఆక్సిజన్‌ చేరవేస్తుంది. అక్కడ ఇది ఆక్సిజన్‌ను జీవక్రియ అనే ప్రక్రియలో జీవి యొక్క విధులకవసరమైన శక్తి కొరకు శక్తిని అందించడానికి వాయుసహిత శ్వాసక్రియను అనుమతించడానికి విడుదల చేస్తుంది. హీమోగ్లోబిన్ అనే ఈ పదార్థము కారణంగానే మానవ శరీరంలోని రక్తం ఎర్రగా ఉంటుంది. శరీరంలో రక్తం ప్రయాణిస్తున్న సమయంలో ఊపిరితిత్తులవద్ద హీమోగ్లోబిన్ ప్రాణవాయువును పీల్చుకొని శరీరం మొత్తానికి ప్రాణవాయువును సరఫరా చేస్తూ ఉంటుంది. అలా హీమోగ్లోబిన్ ద్వారా శరీర అవయవాలలోని విడిపోయిన కణజాలాలకు ప్రాణవాయువు వెళుతుంది. శరీరంలో హీమోగ్లోబిన్ శాతం తగినంత లేకపోతే వారు రక్తహీనతతో బాధపడుతున్నట్లు లెక్క. అందువలన రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకొనుటకు ఐరన్ శాతం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. మాంసం, చేపలు, గ్రుడ్లు వంటి జంతు సంబంధమైన ఆహారపదార్థాలను శరీరం త్వరగా జీర్ణించుకొని ఐరన్ ను స్వీకరించగలుగుతుంది. శాకాహార సంబంధమైన ఆకుకూరలు, ఎండుఫలాలు, పండ్లు, కాయగూరలలో ఐరన్ (ఇనుము) తగినంత ఉన్నప్పటికి శరీరం వాటిని పూర్తిగా జీర్ణించుకోలేకపోవటంతో వాటి నుండి శరీరం తగినంత ఐరన్ ను స్వీకరించలేకపోతుంది. అయితే శాఖాహారాన్ని అధికంగా తీసుకోవటం ద్వారా శరీరానికి కావలసినంత ఐరన్ పొందవచ్చు, తద్వారా రక్తంలో తగినంత హీమోగ్లోబిన్ శాతం ఏర్పడి రక్తహీనత బారి నుండి తప్పించుకోవచ్చు. ఒక వ్యక్తి తన సాధారణ ఆరోగ్య పరిస్థితికి భిన్నంగా మార్పు సంభవించిందని భావించినప్పుడు, ముఖ్యంగా రక్తహీనతకు గురవుతున్నానని భావించినప్పుడు ఎర్రరక్తకణాలు తగినన్ని ఉన్నాయా, వాటిలో హీమోగ్లోబిన్ శాతం తగినంత ఉన్నదా, లేదా అని క్లినికల్ పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నట్లయితే హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుటకు అవసరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి.

హీమోగ్లోబిన్
(హెటెరోటెట్రామెర్, (αβ)2)
హీమోగ్లోబిన్
మానవ హీమోగ్లోబిన్ యొక్క నిర్మాణం.

ఈ ప్రోటీన్లు α, β ఉపభాగాలు ఎరుపు, నీలం లోను, ఇనుము కలిగిన హీమ్ సమూహాలు ఆకుపచ్చలోను ఉంటాయి. PDB 1GZX Proteopedia Hemoglobin నుండి

-
Protein type మెటల్లొప్రోటీన్, గ్లోబులిన్
Function ఆక్సిజన్-రవాణా
Cofactor(s) హీమ్ (4)
-
Subunit
name
Gene Chromosomal
locus
Hb-α1 HBA1 Chr. 16 p13.3
Hb-α2 HBA2 Chr. 16 p13.3
Hb-β HBB Chr. 11 p15.5

హీమోగ్లోబిన్ సాధారణ స్థాయిలు

    1 లీటరులో పదో వంతుని డెసీలీటరు అంటారు. 1 డెసీలీటరుని 1dL అని రాస్తారు.
  • పురుషులు: 13.8 నుంచి 18.0 గ్రాములు/డెసీలీటరు (138 నుంచి 180 గ్రాములు/లీటరు, or 8.56 to 11.17 mmol/L)
  • మహిళలు: 12.1 నుంచి 15.1 గ్రాములు/డెసీలీటరు (121 నుంచి 151 గ్రాములు/లీటరు, or 7.51 to 9.37 mmol/L)
  • పిల్లలు: 11 నుంచి 16 గ్రాములు/డెసీలీటరు (111 నుంచి 160 గ్రాములు/లీటరు, or 6.83 to 9.93 mmol/L)
  • గర్భిణీ స్త్రీలు: 11 నుంచి 14 గ్రాములు/డెసీలీటరు (110 నుంచి 140 గ్రాములు/లీటరు, or 6.83 to 8.69 mmol/L)

మూలాలు

Tags:

అకశేరుకాలుఆక్సిజన్ఎర్ర రక్త కణంరక్తంరక్తహీనతసకశేరుకాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఇస్లాం మత సెలవులురాశి (నటి)భారత కేంద్ర మంత్రిమండలికందుకూరి వీరేశలింగం పంతులుయనమల రామకృష్ణుడు20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలగ్నంవిశాఖ నక్షత్రముదశరథుడుభారత పార్లమెంట్కొణతాల రామకృష్ణతొలిప్రేమదత్తాత్రేయతామర పువ్వుఅక్కినేని నాగేశ్వరరావువేంకటేశ్వరుడువిశ్వామిత్రుడురమ్య పసుపులేటిఈనాడుమహామృత్యుంజయ మంత్రంపోకిరిఅమెరికా సంయుక్త రాష్ట్రాలుతెలుగు నెలలుఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థశోభన్ బాబుసిద్ధు జొన్నలగడ్డఉదగమండలంకమ్యూనిజంఇండియన్ ప్రీమియర్ లీగ్గాయత్రీ మంత్రంఉష్ణోగ్రతవేమనసోడియం బైకార్బొనేట్ఆరుద్ర నక్షత్రముశివ కార్తీకేయన్పాములపర్తి వెంకట నరసింహారావుఅనుపమ పరమేశ్వరన్హైదరాబాదుఅల్లు అరవింద్వందేమాతరంమీనరాశిసోరియాసిస్శతభిష నక్షత్రముఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుమత్తేభ విక్రీడితముఘట్టమనేని మహేశ్ ‌బాబుకింజరాపు రామ్మోహన నాయుడుశ్రీముఖిప్రియురాలు పిలిచిందిశ్రీకాంత్ (నటుడు)పరశురామ్ (దర్శకుడు)ఆల్ఫోన్సో మామిడిఅక్షయ తృతీయరావణుడుయాపిల్ ఇన్‌కార్పొరేషన్భారతదేశంలో సెక్యులరిజంఉత్తరాభాద్ర నక్షత్రముపునర్వసు నక్షత్రముహార్దిక్ పాండ్యాతత్పురుష సమాసముసంధ్యావందనంచిరంజీవిబర్రెలక్కహనుమంతుడుజార్ఖండ్మానవ శరీరముగర్భాశయముకరక్కాయఫరియా అబ్దుల్లాశుక్రుడు జ్యోతిషంఅర్జునుడుఅనుష్క శెట్టి🡆 More