భారత పార్లమెంట్: గణతంత్ర భారత రాజకీయ సభ

భారత పార్లమెంట్ (Parliament of India) (లేదా సంసద్) భారతదేశ అత్యున్నత శాసనమండలి.

ఇందులో రాష్ట్రపతి, రెండు సభలు ఉన్నాయి, ఒకటి లోక్‌సభ, రెండవది రాజ్యసభ. ఇది భారత రాజధాని ఢిల్లీ లోని సంసద్ మార్గ్లో గలదు. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. కొత్త రాజ్యాంగం ప్రకారం మొదటి సాధారణ ఎన్నికలు 1951-52 సంవత్సరంలో జరిగాయి, మొదటి ఎన్నికైన పార్లమెంటు 1952 ఏప్రిల్లో ఉనికిలోకి వచ్చింది. రాష్ట్రపతి, ఉభయ సభలతో కూడిన ఉభయసభలను రాష్ట్రాల మండలి (రాజ్యసభ), హౌస్ ఆఫ్ పీపుల్ (లోక్‌సభ) అని పిలుస్తారు.

భారత పార్లమెంటు
Coat of arms or logo
రకం
రకం
ద్వి సభ
సభలురాజ్యసభ
లోక్ సభ
నాయకత్వం
ద్రౌపది ముర్ము
2022 జూలై 25 నుండి
జగదీప్ ధన్కర్, స్వతంత్ర అభ్యర్థి
2022 ఆగస్టు 11 నుండి
మెజారిటీ నాయకుడు (లోక్ సభ)
మెజారిటీ నాయకుడు (రాజ్యసభ)
పీయూష్ గోయెల్ (భాజపా)
2014 మే 16 నుండి
నిర్మాణం
సీట్లు788 (245 రాజ్యసభ +
      543 లోక్ సభ)
భారత పార్లమెంట్: పేరు, పుట్టు పూర్వోత్తరాలు, పార్లమెంట్ భవనం (సంసద్ భవన్), రాష్ట్రపతి
లోక్ సభ రాజకీయ వర్గాలు
అధికారిక: ఎన్ డి ఎ ప్రతిపక్షాలు: యూపీఎ, మూడవ ఫ్రంట్, ఇతరులు
భారత పార్లమెంట్: పేరు, పుట్టు పూర్వోత్తరాలు, పార్లమెంట్ భవనం (సంసద్ భవన్), రాష్ట్రపతి
రాజ్య సభ రాజకీయ వర్గాలు
యూపీఎ (మెజారిటీ), ఎన్ డి ఎ (రెండవ), ఇతరులు : మూడవ ఫ్రంట్
ఎన్నికలు
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
లోక్ సభ చివరి ఎన్నికలు
16 జనవరి, 23 మార్చి, 21 జూన్ 2018
రాజ్య సభ చివరి ఎన్నికలు
11 ఏప్రిల్ – 19 మే 2019
లోక్ సభ తదుపరి ఎన్నికలు
మే, జూన్ 2019
రాజ్య సభ తదుపరి ఎన్నికలు
May 2024
సమావేశ స్థలం
భారత పార్లమెంట్: పేరు, పుట్టు పూర్వోత్తరాలు, పార్లమెంట్ భవనం (సంసద్ భవన్), రాష్ట్రపతి
సంసద్ భవన్
వెబ్‌సైటు
parliamentofindia.nic.in

పేరు, పుట్టు పూర్వోత్తరాలు

సంసద్ అనే పదము సంస్కృతానికి చెందింది, దీని అర్థం ల్లు లేక భవనం.

పార్లమెంట్ భవనం (సంసద్ భవన్)

భారత పార్లమెంట్: పేరు, పుట్టు పూర్వోత్తరాలు, పార్లమెంట్ భవనం (సంసద్ భవన్), రాష్ట్రపతి 
భారత పార్లమెంటు, సంసద్ భవన్.

పార్లమెంటు భవనం (సంసద్ భవన్), ఈ భవనాన్ని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ "హెర్బర్ట్ బేకర్" 1912-13 లో డిజైన్ చేశాడు. 1921 నుండి ఆరేళ్ళ పాటు దీని నిర్మాణం కొనసాగింది. ఈ వృత్తాకార భవనానికి 83 లక్షల ఖర్చు అయింది. దీని పైకప్పుకు 257 గ్రానైట్ స్తంభాలు సపోర్టుగా నిలబెట్టారు. 1927 జనవరి 18న గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం దీన్ని మ్యూజియంగా మార్చనున్నారు.

రాష్ట్రపతి

రిపబ్లిక్ అధ్యక్షుడిని పార్లమెంటు ఉభయ సభలలో ఎన్నుకోబడిన, రాష్ట్రాల శాసనసభల (ప్రసిద్ధ సభలు) ఎన్నుకోబడిన సభ్యులతో కూడిన ఎలక్టోరల్  ద్వారా ఎన్నుకోబడతాడు. భారత రాష్ట్రపతి పార్లమెంటులో ఒక భాగమైనప్పటికీ, రాష్ట్రపతి  ఉభయ సభలలో దేనిలోనూ కూర్చోడు లేదా చర్చలలో పాల్గొనడు. పార్లమెంటుకు సంబంధించి రాష్ట్రపతి నిర్వర్తించాల్సిన కొన్ని రాజ్యాంగ విధులు ఉన్నాయి.

  • రాష్ట్రపతి ఎప్పటికప్పుడు పార్లమెంట్ ఉభయ సభలను పిలిపించి ప్రోరోగ్ చేస్తాడు.
  • రాజ్యసభ కొనసాగే సంస్థ అయితే, లోక్‌సభను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన బిల్లుకు అతని/ఆమె ఆమోదం తప్పనిసరి.
  • పార్లమెంటు సెషన్‌లో లేనప్పుడు, అతను తక్షణ చర్య తీసుకోవడానికి అవసరమైన పరిస్థితులు ఉన్నాయని అతను సంతృప్తి చెందినప్పుడు, పార్లమెంటు ఆమోదించిన చట్టాల వలె రాష్ట్రపతి ఆర్డినెన్స్‌లను ప్రకటించవచ్చు.

లోక్ సభ

లోక్ సభ ను, ప్రజాసభ లేదా దిగువసభ అని అంటారు. దీనిలోని సభ్యులంతా దాదాపు ప్రజలచేత ఎన్నుకోబడినవారే. ఇది అత్యంత శక్తివంతమైన సభ. ఈ సభలో భారత రాజ్యాంగం ఆర్టికల్ 81 ప్రకారం 552 సభ్యులుండవచ్చును. దీని కాలపరిమితి 5 సంవత్సరాలు. దీనిని, దీని కాలపరిమితి తీరకముందే రద్దు పరచవచ్చును. ఈ నిర్ణయం భారత రాష్ట్రపతి తీసుకుంటారు. ఈ సభలో ప్రవేశమునకొరకు అభ్యర్థి, భారత పౌరుడై, 25 యేండ్లు నిండి, ప్రజలచే ఎన్నుకోబడి ఉండాలి. ప్రస్తుతం లోక్ సభలో 543 మంది సభ్యులున్నారు. 530 మంది రాష్ట్రాలనుండి, 13 మంది కేంద్ర పాలిత ప్రాంతాల నుండి కలరు.

భారత పార్లమెంట్: పేరు, పుట్టు పూర్వోత్తరాలు, పార్లమెంట్ భవనం (సంసద్ భవన్), రాష్ట్రపతి 
సంసద్ భవన్, భారత పార్లమెంటు.

రాజ్యసభ

రాజ్యసభను "రాజ్యాంగ పరిషత్తు" అని లేదా "ఎగువ సభ" అని కూడా అంటారు. దీని సభ్యులు భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలచే ఎన్నుకోబడతారు. అనగా పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాల శాసన సభ్యులు వీరిని ఎన్నుకుంటారు. రాజ్యసభలో 250 మంది సభ్యులు గలరు. ఈ సభ ఎన్నటికీ రద్దు గాదు. ప్రతి సభ్యుడు 6 సంవత్సరాల కాలపరిమితి కొరకు ఎన్నుకోబడతాడు. ఈ సభలో రెండేండ్లకొకసారి, మూడవవంతు సభ్యులు ఎన్నుకోబడతారు. ఈ విషయం భారత రాజ్యాంగం ఆర్టికల్ 80 లో వివరింపబడింది.

  • 12 మంది సభ్యులు భారత రాష్ట్రపతి చే నామినేట్ చేయబడతారు. వీరు సాహిత్య, శాస్త్రీయ, కళా, సాహిత్య రంగాల నుండి ప్రతిపాదించబడతారు.
  • రాష్ట్రాలలోని శాసనసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు వీరిని ఎన్నుకుంటారు.
  • కేంద్రపాలిత ప్రాంతాల సభ్యులు, ఎలెక్టోరల్ కాలేజి ద్వారా ఎన్నుకోబడుతారు.

రాష్ట్రాలనుండి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల జనాభాపై ఆధారపడి వుంటుంది. ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్ నుండి 31 సభ్యులుంటే, నాగాలాండ్ నుండి కేవలం ఒక్కరే. ఈ సభలో సభ్యత్వం పొందడానికి కనీస వయస్సు 30 సంవత్సరాలు.

పార్లమెంట్ లీడర్

పార్లమెంటులోని ప్రతి సభకు ఒక నాయకుడు ఉంటాడు. లోక్‌సభలో మెజారిటీ పార్టీ నాయకుడిగా ఉన్న ప్రధానమంత్రి, లోక్‌సభ సభ్యుడు కానప్పుడు తప్ప లోక్‌సభలో సభా నాయకుడిగా వ్యవహరిస్తారు. ఒక సందర్భంలో, ప్రధానమంత్రి లోక్‌సభ సభ్యుడు కానప్పుడు, లోక్‌సభలో సభా నాయకుడిగా లోక్‌సభ సభ్యుడైన మంత్రిని నియమిస్తాడు/నామినేట్ చేస్తాడు. రాజ్యసభ సభ్యుడైన అత్యంత సీనియర్ మంత్రిని ప్రధానమంత్రి రాజ్యసభలో సభా నాయకుడిగా నియమిస్తారు.

ప్రతిపక్ష నాయకుడు

పార్లమెంటులోని ప్రతి సభకు ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుల జీతాలు, భత్యాల చట్టం, 1977 'ప్రతిపక్ష నాయకుడు' అనే పదాన్ని రాజ్యసభ లేదా లోక్‌సభ సభ్యునిగా నిర్వచించింది, ప్రస్తుతానికి ఆ పార్టీ సభకు నాయకుడు. అత్యధిక సంఖ్యా బలం ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకత, రాజ్యసభ ఛైర్మన్ లేదా లోక్‌సభ స్పీకర్ ద్వారా గుర్తింపు పొందడం.

పార్లమెంటు సమావేశాలు

సాధారణంగా, ఒక సంవత్సరంలో మూడు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి: (i) బడ్జెట్ సెషన్ (ఫిబ్రవరి-మే); (ii) వర్షాకాల సమావేశాలు (జూలై-ఆగస్టు), (iii) శీతాకాల సమావేశాలు (నవంబరు-డిసెంబరు).

నూతన భవనం

భారత పార్లమెంట్: పేరు, పుట్టు పూర్వోత్తరాలు, పార్లమెంట్ భవనం (సంసద్ భవన్), రాష్ట్రపతి 
కొత్త పార్లమెంట్ భవనం

పాత పార్లమెంట్ భవనంలో మీటింగ్ హాల్స్ కొరత, భవనంలో మార్పులు చేరిస్తే భవన నిర్మాణం దెబ్బతినడం, భూకంపాన్ని తట్టుకునే సామర్థ్యం లేకపోవడం, అగ్ని ప్రమాదాలను ఎదుర్కునే ఆధునిక సౌకర్యాలు లేకపోవడం వలన కొత్త భవనాన్ని నిర్మించారు. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ 28-05-2023 న ప్రారంభించాడు. అలాగే సెంగోల్ను లోక్‌సభ స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ కుర్చీకి కుడివైపున ప్రతిష్ఠించాడు.. అంతేకాకుండా భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చి 75 సంవత్సరములు పూర్తీ చేసుకున్న సందర్భముగా రూ. 75 స్మారక నాణేన్ని కూడా విడుదల చేసాడు. త్రిభుజాకారంలో ఉన్న కొత్తభవనం ముద్రించి ఉన్న స్టాంపు, కవర్ ని విడుదల చేసాడు.

త్రిభుజాకారంలో ఉన్న ఈ భవనాన్ని సెంట్రల్ విస్టా డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రెండున్నర సంవత్సరాలలో నిర్మించింది. దీనిని ఆర్కిటెక్ బిమల్ పటేల్ నేతృత్వంలో నిర్మించారు. ప్రస్తుత పార్లమెంట్ భవనం పక్కనే నిర్మించిన ఈ కొత్త భవనంలో అతి పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ సదుపాయాలు ఉన్నాయి.

నిర్మాణ వివరాలు

  • రూ.20 వేల కోట్లతో కూడిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రూ.970 కోట్లతో పార్లమెంటు భవనాన్ని నిర్మించారు.
  • లోక్ సభ హాలును జాతీయ పక్షి నెమలి థీమ్ తో నిర్మించారు. ఇందులో 888 మంది సభ్యులు కూర్చోవచ్చు.
  • పార్లమెంటు భవన మూడు ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మ ద్వారాలని పేర్లు పెట్టారు. వీఐపీలు, ఎంపీలు, సందర్శకులకు మరో మూడు ప్రవేశ ద్వారాలున్నాయి.
  • అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో 150 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా భవన డిజైన్ ను అహ్మదాబాద్ కు చెందిన హెచ్సీపీ డిజైన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ రూపొందించింది. ఇది భూకంపాల్ని కూడా తట్టుకుంటుంది. రాజస్తాన్ కు చెందిన ధోల్పూర్ రాళ్లను భవనానికి వాడారు.
  • పార్లమెంటు భవనంలోని ఇంటీరియర్స్ భారత సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా, భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తుకు తెచ్చేలా పలు ప్రాంతీయ కళా రూపాలతో రూపొందించారు.
  • భవనంలో గ్రీన్ ఎనర్జీ వాడారు. దీనితో 30% దాకా విద్యుత్ ఆదా అవు తుంది. అత్యాధునిక టెక్నాలజీ వాడటంతో భవన నిర్వహణ ఖర్చులో ఏడాదికి రూ.1,000 కోట్లకు పైగా ఆదా అవుతుంది.
  • పార్లమెంటు భవనం పైకప్పు మీద కాంస్యంతో తయారు చేసిన మన జాతీయ చిహ్నం నాలుగు సింహాలను ఏర్పాటు చేశారు. ఇది 9,500 కిలోల బరువుతో 6.5 మీటర్ల ఎత్తుంది.
  • భవన నిర్మాణంలో ప్రత్యక్షంగా 2 వేల మంది కార్మికులు, పరోక్షంగా 9 వేల మంది, వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది కళాకారులు పాలుపంచుకున్నారు.
  • పార్లమెంటు ఆవరణలో రెండు మర్రి చెట్లు నాటారు.
  • దివ్యాంగులకు అనుకూలంగా, వారు స్వేచ్ఛగా తిరిగేలా నిర్మాణం ఉంది. భవనం గోడలపై శ్లోకాలను కూడా రాశారు.
  • 19-09-2023వ తేదీన కొత్త పార్లమెంట్​లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా పార్లమెంట్ సిద్దమైయింది.

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

భారత పార్లమెంట్ పేరు, పుట్టు పూర్వోత్తరాలుభారత పార్లమెంట్ పార్లమెంట్ భవనం (సంసద్ భవన్)భారత పార్లమెంట్ రాష్ట్రపతిభారత పార్లమెంట్ లోక్ సభభారత పార్లమెంట్ రాజ్యసభభారత పార్లమెంట్ పార్లమెంట్ లీడర్భారత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడుభారత పార్లమెంట్ పార్లమెంటు సమావేశాలుభారత పార్లమెంట్ నూతన భవనంభారత పార్లమెంట్ నిర్మాణ వివరాలుభారత పార్లమెంట్ ఇవీ చూడండిభారత పార్లమెంట్ మూలాలుభారత పార్లమెంట్ బయటి లింకులుభారత పార్లమెంట్ఢిల్లీరాజ్యసభలోక్‌సభసంసద్ మార్గ్

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత ప్రధానమంత్రుల జాబితావై.ఎస్. జగన్మోహన్ రెడ్డిలలిత కళలునవలా సాహిత్యమువిశాఖపట్నంతెలుగు సంవత్సరాలుదాశరథి కృష్ణమాచార్యఅభిమన్యుడుయేసు శిష్యులుపటికసముద్రఖనిఅక్కినేని నాగార్జునఅన్నప్రాశనబోడె రామచంద్ర యాదవ్సామజవరగమనభారత జాతీయ కాంగ్రెస్సింగిరెడ్డి నారాయణరెడ్డిజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థనామినేషన్ఇజ్రాయిల్కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంమూర్ఛలు (ఫిట్స్)కాళోజీ నారాయణరావుప్రకాష్ రాజ్కొమురం భీమ్వాల్మీకిచరవాణి (సెల్ ఫోన్)బుధుడుభారతదేశ జిల్లాల జాబితాభారత పార్లమెంట్దూదేకులబద్దెనపాట్ కమ్మిన్స్శార్దూల విక్రీడితమువరల్డ్ ఫేమస్ లవర్రాజంపేటవినాయక చవితిఘిల్లియూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్పరమాణు సంఖ్య ప్రకారం మూలకాలులోక్‌సభ నియోజకవర్గాల జాబితారతన్ టాటారోనాల్డ్ రాస్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్సంఖ్యగోల్కొండఉస్మానియా విశ్వవిద్యాలయంమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంవిద్యుత్తుమాయదారి మోసగాడుభారత జాతీయ మానవ హక్కుల కమిషన్భారతదేశంలో కోడి పందాలుతెలంగాణ చరిత్రకీర్తి రెడ్డిమంజుమ్మెల్ బాయ్స్ఇందిరా గాంధీఉప్పు సత్యాగ్రహంరోహిణి నక్షత్రంచిరంజీవిథామస్ జెఫర్సన్ఆత్రం సక్కునారా బ్రహ్మణిపరిపూర్ణానంద స్వామిహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గందేవికఆది శంకరాచార్యులుకన్యారాశిసాహిత్యంఉష్ణోగ్రతసమంతయేసుకృతి శెట్టిమమితా బైజుతాజ్ మహల్ఉప రాష్ట్రపతిఅల్లూరి సీతారామరాజుతూర్పు చాళుక్యులు🡆 More