ద్రౌపది ముర్ము

ద్రౌపది ముర్ము (జననం 20 జూన్ 1958) ఒక భారతీయ రాజకీయవేత్త, జార్ఖండ్ తొమ్మిదవ గవర్నర్, భారతీయ జనతా పార్టీ సభ్యురాలు.

జార్ఖండ్ 2000 సంవత్సరంలో ఏర్పడినప్పటి నుండి ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని (2015-2021) పూర్తి చేసిన జార్ఖండ్ మొదటి గవర్నర్. ఆమెను 2022లో NDA ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది.

ద్రౌపది ముర్ము
ద్రౌపది ముర్ము


భారతదేశ రాష్ట్రపతి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2022 జూలై 25

9వ జార్ఘండ్ గవర్నర్
పదవీ కాలం
18 మే 2015 – 12 జూలై 2021
ముందు సయ్యద్ అహ్మద్
తరువాత రమేష్ బయిస్

రాష్ట్ర మంత్రి (స్వతంత్ర భాద్యత) ,
ఒడిశా గవర్నర్
పదవీ కాలం
6 మార్చి 2000 - 16మే 2004

ఒడిశా శాసనసభ
పదవీ కాలం
2000 – 2009
ముందు లక్ష్మణ్ మఝీ
తరువాత శ్యాం చరణ్ హంస్దా
నియోజకవర్గం రాయ్‌రంగపూర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1958-06-20) 1958 జూన్ 20 (వయసు 65)
ఊపర్‌బేడా గ్రామం, మయూర్‌భంజ్ జిల్లా, ఒడిశా రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి శ్యాం చరణ్ ముర్ము (మరణించారు)
సంతానం 2 కుమారులు (మరణించారు), 1 కుమార్తె
పూర్వ విద్యార్థి రమాదేవి మహిళా విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకురాలు

ద్రౌపది ముర్ము 2022 జులై 25న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ లోని పార్లమెంట్ సెంట్రల్ హాలులో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 60 ప్రకారం భారత 15వ రాష్ట్రపతిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణం చేయించాడు.

ప్రారంభ జీవితం

ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన ఊపర్‌బేడా గ్రామంలో గిరిజన జాతికి చెందిన సంతాల్ కుటుంబంలో 1958 జూన్ 20 న జన్మించింది. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు. ఆమె తండ్రి, తాత లు పంజాయితీరాజ్ వ్యవస్థలోని గ్రామాధికార్లుగా ఉండేవారు.

వ్యక్తిగత జీవితం

ద్రౌపది ముర్ము గ్రాడ్యుయేషన్ తర్వాత,ఒడిశా ప్రభుత్వంలో భువనేశ్వర్‌లోని సచివాలయంలో క్లరికల్ పోస్ట్‌లో చేరింది. ఆసమయం లో ఆమె రాయంగ్‌పూర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో పనిచేసిన శ్యామ్ చరణ్ ముర్ము ని వివాహం చేసుకుంది. దంపతులకు ఇద్దరు కుమారులు, ఇతిశ్రీ అనే కూతురు ఉంది. తన ఇద్దరు కుమారులలో ఒకరు 2009, ఇంకొకరు 2013 సంవత్సరంలో మరణించారు. ఆమె భర్త శ్యామ్ చరణ్ ముర్ము 2014లో మరణించారు, .

జీవితం

ద్రౌపది ముర్ము భువనేశ్వర్ లోని రమాదేవి మహిళా కాలేజీ నుంచి బీఏ పూర్తి చేసి ఆ తర్వాత ఉపాధ్యాయురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి, 1977-83 మధ్య ఒడిశాలోని నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా, 1994 నుంచి 97 వరకూ శ్రీ అరబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో గౌరవ సహాయ ఉపాధ్యాయురాలిగా కూడా పనిచేసింది.

రాష్ట్ర రాజకీయాలు

ద్రౌపది ముర్ము 1997లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రాయ్‌రంగపూర్ నగర పంచాయితీ కౌన్సిలర్‌‌గా ఎన్నికైంది. ఆమె భారతీయ జనతా పార్టీ కి చెందిన గిరిజన తెగల మోర్చా కు ఉపాధ్యక్షురాలిగా కూడా సేవలను అందించింది. ఆ తర్వాత 2000వ జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో రాయరంగపూర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వంలో 2000 మార్చి 6 నుండి 2002 ఆగస్టు 6 వరకు వాణిజ్యం, రవాణాకు స్వతంత్ర బాధ్యతతో, 2002 ఆగష్టు 6 నుండి మే 2002 వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధికి శాఖ మంత్రిగా పని చేసింది.


ద్రౌపది ముర్ము 2004 లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో రాయరంగ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 2002 నుంచి 2009 వరకు మయూర్ భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా,2006 నుంచి 2009 వరకు ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలిగా, 2010లో మయూర్ భంజ్ జిల్లా అధ్యక్షురాలిగా, 2013 నుంచి 2015 వరకు మయూర్ భంజ్ జిల్లా అధ్యక్షురాలిగా, బీజేపీ ఒడిస్సా ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షురాలిగా, బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా వివిధ హోదాల్లో పని చేసింది. ద్రౌపది ముర్ముకు 2007లో ఒడిశా శాసనసభ ఉత్తమ శాసనసభ్యురాలిగా నికంఠ పురస్కారాన్ని అందించింది.

గవర్నర్‌గా

ద్రౌపది ముర్ము జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్ ఒడిశా నుండి భారతదేశంలోని ఒక రాష్ట్రంలో గవర్నర్‌గా నియమితులైన మొదటి మహిళ, గిరిజన నాయకురాలు.

రాష్ట్రపతి అభ్యర్థిగా

ద్రౌపది ముర్ము 2022లో జరగిన భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి మొట్టమొదటి గిరిజన మహిళ రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించింది.

రాష్ట్రపతి ఎన్నిక

2022 జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగగా, ఓట్ల లెక్కింపు జూలై 21న జరగగా రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే కావాల్సిన కోటా 5,28,491, ద్రౌపది ముర్ముకు 2,824 మొదటి ప్రాధాన్యత ఓట్లు (వాటి విలువ 6,76,803), ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 1,877 తొలి ప్రాధాన్యత ఓట్లు (వాటి విలువ 3,80,177) వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్లు కోటా కంటే ఎక్కువగా ఓట్లు రావడంతో ముర్ము గెలిచినట్టు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించాడు.

మూలాలు

బాహ్య లంకెలు

అంతకు ముందువారు
సయ్యద్ అహ్మద్
జార్ఘండ్ గవర్నర్
May 2015 – July 2021
తరువాత వారు
రమేష్ బాయిస్

Tags:

ద్రౌపది ముర్ము ప్రారంభ జీవితంద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితంద్రౌపది ముర్ము జీవితంద్రౌపది ముర్ము మూలాలుద్రౌపది ముర్ము బాహ్య లంకెలుద్రౌపది ముర్ముజార్ఖండ్భారత రాష్ట్రపతిభారతీయ జనతా పార్టీ

🔥 Trending searches on Wiki తెలుగు:

పులివెందుల శాసనసభ నియోజకవర్గంపెళ్ళి చూపులు (2016 సినిమా)నారా లోకేశ్మిథునరాశిబోడె రామచంద్ర యాదవ్సముద్రఖనిఅశ్వని నక్షత్రముడేటింగ్అనుష్క శర్మలక్ష్మిలగ్నంనవలా సాహిత్యమువిజయశాంతికొణతాల రామకృష్ణనర్మదా నదియాదవఅన్నమయ్యనందమూరి తారక రామారావుపి.సుశీలచతుర్యుగాలుఎనుముల రేవంత్ రెడ్డివిశాఖపట్నంచంపకమాలకల్వకుంట్ల కవితపెద్దమనుషుల ఒప్పందంపూజా హెగ్డేశోభితా ధూళిపాళ్లప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాశ్రీవిష్ణు (నటుడు)తెలంగాణ ప్రభుత్వ పథకాలుతోట త్రిమూర్తులుచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంభారత ఆర్ధిక వ్యవస్థవందే భారత్ ఎక్స్‌ప్రెస్జై శ్రీరామ్ (2013 సినిమా)అక్కినేని నాగ చైతన్యతాజ్ మహల్ఆవుతెలుగునాట జానపద కళలుభగత్ సింగ్ఐడెన్ మార్క్‌రమ్కోడూరు శాసనసభ నియోజకవర్గంకొల్లేరు సరస్సుబలి చక్రవర్తిగౌడవై. ఎస్. విజయమ్మనన్నయ్యపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిబ్రహ్మంగారి కాలజ్ఞానంమృణాల్ ఠాకూర్విజయసాయి రెడ్డిఎయిడ్స్ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ఇందిరా గాంధీపెళ్ళి (సినిమా)రాష్ట్రపతి పాలనవృత్తులుతీన్మార్ మల్లన్నఅశోకుడుఆహారంతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిట్విట్టర్నయన తారదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోభాషా భాగాలుజోల పాటలుకిలారి ఆనంద్ పాల్వడ్డీకె. అన్నామలైభారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితాఅగ్నికులక్షత్రియులుసత్యమేవ జయతే (సినిమా)రెండవ ప్రపంచ యుద్ధంధర్మవరం శాసనసభ నియోజకవర్గంహైదరాబాదుదసరాజ్యోతీరావ్ ఫులేఉపనయనము🡆 More