కొల్లేరు సరస్సు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలలోలో ఉన్న సహజ సిద్ధమైన మంచి నీటి సరస్సు - కొల్లేరు.

లక్షకుపైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు, ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలం. సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. ఇక్కడకు వలస వచ్చే పక్షులలో ముఖ్యమైనవి - పరజ, పురాజము, నులుగు పిట్ట. సైబీరియా నుండి సైతం ఇక్కడకు పక్షులు వలసవస్తూ ఉంటాయి. గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతంలో సహజసిద్ధమైన లోతట్టు ప్రాంతంలో ఈ సరస్సు ఏర్పడింది. ఈ సరస్సుకు బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు నుండే కాక డెల్టా ప్రాంతం నుండి వచ్చే అనేక కాలువలు నీటిని చేరుస్తున్నాయి. కోల్లేరు నుండి నీరు ఉప్పుటేరు అనే 62 కిలోమీటర్ల పొడవున్న ఒకే ఒక వాగు ద్వారా బయటికి వెలుతుంది. సరస్సుకు ఆగ్నేయాన ఉన్న ఈ వాగు ద్వారా నీరు బంగాళాఖాతం చేరుతుంది. కొల్లేటి సరస్సు 250 నుండి 340 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సరాసరి లోతు 0.5 నుండి 2 మీటర్ల దాకా ఉంది. ఇక్కడ కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది.

కొల్లేరు సరస్సు
కొల్లేరుపై వంతెన
కొల్లేరుపై వంతెన
ఆంధ్రప్రదేశ్ లో కొల్లేరు స్థానం
ఆంధ్రప్రదేశ్ లో కొల్లేరు స్థానం
కొల్లేరు సరస్సు
ప్రదేశంఆంధ్రప్రదేశ్
అక్షాంశ,రేఖాంశాలు16°39′N 81°13′E / 16.650°N 81.217°E / 16.650; 81.217
సరస్సులోకి ప్రవాహంరామిలేరు, తమ్మిలేరు, బుడమేరు, పోలరాజ కాలువ
వెలుపలికి ప్రవాహంఉప్పుటేరు
ప్రవహించే దేశాలుభారత దేశం
ఉపరితల వైశాల్యం90,100 hectares (222,600 acres) (245 sq km lake area)
సరాసరి లోతు1.0 metre (3 ft 3 in)
గరిష్ట లోతు2.0 metres (6 ft 7 in)
ద్వీపములుకొల్లేరు కోట(Heart of Kolleru Lake), Gudivakalanka
ప్రాంతాలుఏలూరు
Ramsar Wetland
గుర్తించిన తేదీ19 August 2002
రిఫరెన్సు సంఖ్య.1209
కొల్లేరు సరస్సు
పెద్దింటి అమ్మవారి దేవస్థానం
కొల్లేరు సరస్సు
కొల్లేరు సరస్సు
కొల్లేరు సరస్సు
కొల్లేరు పెద్దింట్లమ్మవారి ఉత్సవం కొల్లేరు.
కొల్లేరు సరస్సు
కొల్లేరులో పడవప్రయాం.

చరిత్ర

center

రామాయణం అరణ్యకాండలో వర్ణింపబడిన పెద్ద సరస్సు కొల్లేరే నని ఆంధ్ర దేశపు చరిత్ర అధ్యయనం చేసినవారిలో ఆద్యుడయిన చిలుకూరి వీరభద్రరావు భావించాడు. ఈ విషయమై "ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము"లో ఇలా వ్రాశాడు -

    ఈ దండకారణ్య మధ్యమున యోజనాయుతమైన (100 చతురపు మైళ్ళ వైశాల్యము గల) మహా సరస్సొకటి గలదనియు, అది జల విహంగములతో నత్యంత రమణీయమై యొప్పుచున్నదనియు .... ఆప్రదేశమంత నిర్జంతుకముగా నున్నదనియు నగస్త్యుడు శ్రీరామ చంద్రునితో జెప్పినట్లు రామాయణమున చెప్పబడినది.... ఈ సరస్సెక్కడనున్నదని విచారింపగా నయ్యది యాంధ్ర దేశములోనిదిగా జూపట్టుచున్నది. ఏమన గొప్పదై దండకారణ్య మధ్యగతమై కొంగలకాకరమై యుండు తియ్యని కొలను మన యాంధ్ర దేశముననే గాని మఱియెచ్చటను గానరాదు.
    మఱియు దండియను మహాకవి తన దశకుమార చరిత్రములో నీ యాంధ్రదేశము నభివర్ణించుచు నిందొక మహా సరస్సు గలదనియు నది సారస నిలయమనియు నది యాంధ్రనగరికి ననతి దూరముగా నున్నదనియు బేర్కొని యుండుటచేత నట్లభివర్ణింపబడిన కొలను కొల్లేరు గాక మఱియొక్కటి కానేరదు. (ఆంధ్ర నగరి యనగా వేంగి కావచ్చునని చిలుకూరి వీరభద్రరావు అభిప్రాయం). "కొల్లేటికొంగ" యను లోకోక్తియె కొల్లేరు కొంగలకు ప్రసిద్ధమను విషయమును వేనోళ్ళ జాటుచున్నది. దక్షిణ హిందూస్థానమున నెన్నందగిన పెద్ద తియ్య నీటికొలను "కొల్లేరు" మాత్రమేయై దండి చెప్పినట్లుగా జలరాశి.

రవాణా సౌకర్యాలు

సమీపాన కల ఆకివీడు నుండి లాంచీ ల ద్వారా, లేదా ఆలపాడు నుండి చిన్న రవాణా సాధనాలతో కర్రల వంతెన ద్వారా, ఏలూరు నుండి కైకలూరు మీదుగా బస్సు ద్వారా ఇక్కడికి చేరవచ్చు.

పెద్దింట్లమ్మ దేవాలయము

కొల్లేరు సరస్సు నడిబొడ్డున ఉన్న కొల్లేటికోట ప్రాంతమున ఉన్న ప్రసిద్ధ ఆలయం పెద్దింట్లమ్మ వారి ఆలయము ఉంది. శతాబ్ధాల చరిత్ర కలగిన ఈ అమ్మవారి ఆలయంలో తొమ్మిది అడుగులపైబడి, విశాల నేత్రాలతో పద్మాసన భంగిమతో అత్యద్భుతంగా దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించేందుకు ఇతర రాష్ట్రాలైన ఒడిషా, అస్సాం, తమిళనాడు ల నుండి సైతం భక్తులు వస్తుంటారు. ఏటా పాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకూ జరిగే ఉత్సవాలలో పాల్గుణ శుద్ధ ద్వాదశి రోజున పెద్దింట్లమ్మ సమేత జలదుర్గకు కొల్లేటి కోట సమీపాన కల గోకర్ణేశ్వరస్వామి వారికి కళ్యాణము జరిపిస్తారు.

మూలాలు, వనరులు

Tags:

కొల్లేరు సరస్సు చరిత్రకొల్లేరు సరస్సు రవాణా సౌకర్యాలుకొల్లేరు సరస్సు పెద్దింట్లమ్మ దేవాలయముకొల్లేరు సరస్సు మూలాలు, వనరులుకొల్లేరు సరస్సుఆంధ్రప్రదేశ్ఏలూరు జిల్లాకృష్ణా నదికొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రంగోదావరితమ్మిలేరు(వాగు)పశ్చిమ గోదావరి జిల్లాబంగాళాఖాతం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఐక్యరాజ్య సమితిద్వంద్వ సమాసముయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంఇన్‌స్పెక్టర్ రిషిభారత రాజ్యాంగ పీఠికనర్మదా నదికాలుష్యంప్రదీప్ మాచిరాజుగుంటూరు కారంసమ్మక్క సారక్క జాతరసూర్యుడుభారతదేశ పంచవర్ష ప్రణాళికలుతంగేడుకొంపెల్ల మాధవీలతమహేశ్వరి (నటి)ఉలవలుభారత జాతీయ కాంగ్రెస్శాసనసభ సభ్యుడుభారత రాజ్యాంగ ఆధికరణలుఅర్జునుడురష్మి గౌతమ్గోత్రాలు జాబితాగాయత్రీ మంత్రంరాజంపేట లోక్‌సభ నియోజకవర్గంకిలారి ఆనంద్ పాల్రాశిబొత్స సత్యనారాయణహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితావృశ్చిక రాశిఅనాసప్రజా రాజ్యం పార్టీరాజనీతి శాస్త్రముఅన్నప్రాశనమృగశిర నక్షత్రముసౌందర్యఘట్టమనేని కృష్ణరాహుల్ గాంధీశ్రీదేవి (నటి)చంద్రయాన్-3ఎయిడ్స్వ్యాసుడుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగురజాడ అప్పారావుకేతువు జ్యోతిషంకాజల్ అగర్వాల్ఏప్రిల్ 25ఖండంవేమనవడదెబ్బమెదడు వాపుతాటి ముంజలుజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితామిథాలి రాజ్రాజీవ్ గాంధీరక్త పింజరినారా లోకేశ్శుక్రుడు జ్యోతిషంపది ఆజ్ఞలుఅయోధ్యటంగుటూరి ప్రకాశంసౌరవ్ గంగూలీఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంకమ్మకడియం శ్రీహరిభారత సైనిక దళంనీతి ఆయోగ్వరిబీజంవై.యస్. రాజశేఖరరెడ్డిఊరు పేరు భైరవకోనపక్షవాతంషిర్డీ సాయిబాబాతొలిప్రేమనవరత్నాలుసత్యనారాయణ వ్రతంక్రికెట్ఫేస్‌బుక్🡆 More