ఏలూరు

ఏలూరు (ఎల్లొర్ ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఏలూరు జిల్లా నగరం, జిల్లా కేంద్రం.

సమీపంలో గల కొల్లేరు సరస్సు ప్రముఖ పర్యాటక ఆకర్షణ.

ఏలూరు
హేలాపురి
నగరం
ఏలూరు
ఏలూరుఏలూరు
ఏలూరు
పైన: జిల్లా కలెక్టరు కార్యాలయం; మధ్య: పోలీసు నివాసాలు, గౌతమబుద్ధ పార్క్ క్రింద: ఏలూరు రైలు నిలయం
ఏలూరు is located in Andhra Pradesh
ఏలూరు
ఏలూరు
Coordinates: 16°42′42″N 81°06′11″E / 16.71167°N 81.10306°E / 16.71167; 81.10306
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు
స్థాపితంసా.శ. 2 వశతాబ్దం
పట్టణంగా గుర్తింపు1866
నగరంగా గుర్తింపు2005 ఏప్రిల్ 9
Government
 • Typeపట్టణ స్థానిక సంస్థ
 • Bodyఏలూరు నగరపాలక సంస్థ
 • పార్లమెంట్ సభ్యుడుకోటగిరి శ్రీధర్ (YSRCP)
 • శాసనసభ సభ్యుడుఆళ్ల నాని (YSRCP)
Area
 • నగరం11.52 km2 (4.45 sq mi)
 • Urban
154 km2 (59 sq mi)
 • Metro
3,328.99 km2 (1,285.33 sq mi)
Elevation
22 మీ (72 అ.)
Population
 (2011)
 • నగరం2,14,414
 • Metro
27,60,160
Demonymఏలూరివారు
అక్షరాస్యత వివరాలు
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+05:30 (IST)
పిన్
534***
ప్రాంతీయ ఫోన్ కోడ్8812
Vehicle registrationAP–39 NEW

పేరు వ్యుత్పత్తి

ఏల అన్న చిన్న ఏరు ఈ పట్టణ పరిసరాల్లో ప్రవహించడంతో ఏలూరు అన్న పేరు ఏర్పడివుంటుందని బూదరాజు రాధాకృష్ణ భావించాడు.

చరిత్ర

తూర్పు చాళుక్యులు, వేంగి రాజధానిగా 1200 వరకు తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినపుడు ఏలూరు వారి రాజ్యంలో భాగం. తరువాత కళింగ రాజ్యం, గజపతుల పరిపాలనలోకొచ్చింది. 1515లో శ్రీ కృష్ణదేవరాయలు గజపతుల నుండి దీనిని చేజిక్కించుకొన్నాడు. ఆ తరువాత గోల్కొండ నవాబు మహమ్మద్ కులీ కుతుబ్ షా వశమైంది. ఏలూరుకు సమీపములో ఉన్న పెదవేగి, గుంటుపల్లె (జీలకర్ర గూడెం) గ్రామాలలో ఇందుకు సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి.[ఆధారం చూపాలి]

బ్రిటిష్ వారి కాలంలో ఉత్తర సర్కారు ప్రాంతాలను జిల్లాలుగా విభజించినప్పుడు ఏలూరును మచిలీపట్నం జిల్లాలో చేర్చారు. తరువాత 1859లో గోదావరి జిల్లాలో భాగమైంది. తరువాత కృష్ణా జిల్లాకు కేంద్రంగా ఉంది. 1925లో పశ్చిమ గోదావరి జిల్లాలను ఏర్పరచినపుడు ఆ జిల్లాకు కేంద్రంగా ఏలూరు అయ్యింది.

కృష్ణానది నుండి వచ్చే ఏలూరు కాలువ, గోదావరి నుండి వచ్చే ఏలూరు కాలువ, తమ్మిలేరు - ఇవి మూడూ పాలగూడెం (మల్కాపురం) వద్ద కొల్లేరులో కలుస్తాయి. అందువలన హేలాపురి అనే పేరు సాహిత్యపరంగా వాడుకలోకి వుచ్చింది . తూర్పు లాకుల దాకా గోదావరి నీళ్ళు, పడమటి లాకుల దాకా కృష్ణ నీళ్ళూ. కృష్ణ ఎత్తు, గోదావరి పల్లం కావున నదులు కాలవలో సమతలంగా కలపడానికి తూర్పు లాకులు, పడమటి లాకులు ఉండేవి. ఆ లాకులు ముయ్యడం, తియ్యడం, పడవలని జాగ్రత్తగా కాలవలోకి పంపించడం చూడటానికి ఎంతో ముచ్చటగా ఉండేది. చైత్ర వైశాఖ మాసాల్లో లాకులు కట్టేసి కాలవ మూసేసే వాళ్ళు. అప్పుడు కాలవ ఎండి పోయేది. మళ్ళీ మృగశిర కార్తెలో, కాలవ వదిలే వాళ్ళు. ఆ కాలవ నీళ్ళే పంపుల చెరువుల్లోకి పట్టి ఉంచేవాళ్ళు. కాలక్రమేణా కాలవలో సమృద్ధిగా నీళ్ళు వుండకపోవడంతో, పడవలు తిరగడం ఆగిపోయింది. పంపుల చెరువులు పూడిపొయ్యాయి.

పట్టణం ఎదుగుదల ఫలితంగా 2005 ఏప్రిల్‌లో ఏలూరు మునిసిపాలిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునిసిపల్ కార్పొరేషన్‌గా మార్చింది. ఆ సమయంలో చుట్టుప్రక్కల కొన్ని గ్రామాలు ఏలూరు నగరంలో కలుపబడ్డాయి. ఆ విధంగా నగర జనాభా 3, 50, 000కు చేరుకొంది.[ఆధారం చూపాలి] 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధితో ఏలూరు జిల్లా కేంద్రంగా మారింది.

భౌగోళికం

భౌగోళికంగా ఏలూరు అక్షాంశ రేఖాంశాలు 16°42′N 81°06′E / 16.7°N 81.1°E / 16.7; 81.1. సముద్ర తలం నుండి ఎత్తు 22మీటర్లు. (72అడుగులు) . బంగాళాఖాతం తీరం నుండి ఏలూరు 40 మైళ్ళ దూరంలో ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతి నుండి ఈశాన్యంగా 78 కి.మీ దూరంలో ఉంది. విజయవాడ నుండి 63 కి.మీ. రాజమండ్రి నుండి 98 కి.మీ. దూరంలో ఈ రెండు నగరాల మధ్య ఉంది.

ఇది ప్రధానంగా ఉష్ణమండల వాతావరణం కలిగిన ప్రాంతం. ఏప్రిల్, మే, జూన్ నెలలు బాగా వేడిగా ఉంటాయి. ఏలూరులో రికార్డయిన అత్యధిక ఉష్ణోగ్రత 51.7 డిగ్రీలు సెంటీగ్రేడ్, అత్యల్ప ఉష్ణోగ్రత 12.9 0 డిగ్రీలు సెంటీగ్రేడ్.

పట్టణం స్వరూపం

ఏలూరు 
తమ్మిలేరుపై నిర్మించిన తూర్పు లాకులు (విహంగ వీక్షణం)
ఏలూరు 
ఓవర్ బ్రిడ్జి పైనుండి దృశ్యం
దస్త్రం:APtown Eluru FireStationCentre.JPG
ఫైర్ స్టేషను సెంటర్
ఏలూరు 
రమామహల్ సెంటర్
ఏలూరు 
ఏలూరు పెద్దబజారు

నగరానికి ఒక ప్రక్క పల్లపు ప్రాంతాలు (కొల్లేరు, కైకలూరు), మరొక ప్రక్క మెరక ప్రాంతాలు (చింతలపూడి, జంగారెడ్డిగూడెం) ఉన్నందున ఇక్కడి నిత్య జీవనంలో రెండు ప్రాంతాల ప్రభావం కనిపిస్తుంది. మెరక ప్రాంతమైన చింతలపూడి వైపు నుండి వచ్చే తమ్మిలేరు వాగు ఏలూరి చివర అశోక్ నగర్ వద్ద రెండుగా చీలుతుంది . ఎడమవైపు చీలిన వాగు తంగెళ్లమూడి మీదుగా ప్రవహిస్తూ నగరానికి ఒక వైపు సరిహద్దుగా ఉంటుంది. రెండవ చీలిక ఆశోక్ నగర్, అమీనా పేట మీదుగా ప్రవహిస్తూ బస్‌స్టాండు, సి.ఆర్.రెడ్డి కాలేజీ పక్కగా ప్రవహిస్తూ, నగరానికి వేరే సరిహద్దుగా కనిపిస్తుంది. ఈ రెండు చీలికలమధ్య డెల్టాలా ఏలూరు ప్రధాన నగరం వుంటుంది. ఈ కారణం వల్లే నాగిరెడ్డి గూడెం ప్రాజెక్ట్ కట్టక మునుపు ఏలూరు ముంపుకు గురి అయ్యేది.[ఆధారం చూపాలి]

కృష్ణానదినుండి వచ్చే ఏలూరు కాలువ పట్టణం మధ్యలో నైఋతి నుండి ఈశాన్యం దిశగా ప్రవహిస్తుంది. తమ్మిలేరు అనే యేరు ఖమ్మం జిల్లా పాల్వంచలో మొదలవుతుంది. ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరి జల్లాలలో సుమారు 120 మైళ్ళు ప్రయాణించి కొల్లేరులో కలుస్తుంది. ఏలూరులో ఎఫ్.సి.ఐ. గోడౌనుల దగ్గర రెండుగా చీలుతుంది. ఆ చీలికలు మొండికోడు, పెదయడ్లగాడి అనే రెండు స్థలాల వద్ద కొల్లేరులో కలుస్తాయి.[ఆధారం చూపాలి]

ముఖ్య ప్రాంతాలు

నగరం ప్రధానంగా జాతీయ రహదారి వెంట విస్తరించి ఉంది. పట్టణం మధ్యగా తమ్మిలేరు కాలువ ప్రవహిస్తుంది. స్థూలంగా పట్టణాన్ని I టౌన్ (తమ్మిలేరు కాలువకి ఆవల వున్న ప్రాంతం), II టౌన్ (తమ్మిలేరు కాలువకి ఇవతల వున్న ప్రాంతం) గా విభజించవచ్చు. అయితే పోస్టల్ వారి ప్రకారం ఏలూరు-1 (తమ్మిలేరు కాలువ నుండి తూర్పు వైపు వున్న ప్రాంతం), ఏలూరు-2 ( పవర్ పేట, ఆర్ ఆర్ పేట తదితర ప్రాంతాలు), ఏలూరు-3 (శనివారపు పేట), ఏలూరు-3 (చాటపర్రు ప్రాంతం), ఏలూరు-5 (రైల్వే స్టేషన్, ఆదివారపు పేట ప్రాంతాలు, తంగెళ్ళమూడి, ఏలూరు-6 (నరసింహారావు పేట, అమీనా పేట, అశోక్ నగర్ ప్రాంతాలు), ఏలూరు-7 (వట్లూరు, విద్యా నగర్, శాంతినగర్, సత్రంపాడు ప్రాంతాలు) లుగా విభజించబడింది. ప్రధాన విభాగాలు[ఆధారం చూపాలి]

  • వ్యాపార కేంద్రాలు: మెయిన్ బజారు, ఆర్.ఆర్. పేట, బిర్లా భవన్ సెంటర్, చాటపర్రు రోడ్ సెంటర్, ఘడియారపు స్తంభం, నరసింహా రావు పేట, పత్తేబాద, జి యన్ టి రోడ్.
  • ప్రయాణ కేంద్రాలు: పెద్ద రైల్వే స్టేషను, పవర్ పేట రైల్వే స్టేషను, వట్లూరు రైల్వే స్టేషన్, క్రొత్త బస్ స్టాండు, పాత బస్ స్టాండు, ఆశ్రం హాస్పిటల్.
  • వైద్య కేంద్రాలు: ఆర్ ఆర్ పేట, రామ చంద్రరావు పేట, వెంకట్రావు పేట, పెద్దాసుపత్రి, ఆశ్రం హాస్పిటల్, మెడికల్ కాలేజీ
  • కూడళ్ళు: I టౌన్: గడియారపు స్తంభం సెంటర్, పెద్ద వంతెన సెంటర్, కర్ర వంతెన సెంటర్, వసంత మహల్ సెంటరు, బిర్లా భవన్ సెంటర్, కొత్త రోడ్డూ, వంగాయగూడెం సెంటర్ చౌరాస్తా, జ్యూట్ మిల్ జంక్షన్
  • II టౌన్ కూడళ్ళు: పాత బస్ స్టాండు సెంటర్, పవర్ పేట సెంటర్, ప్రెస్ గేటు సెంటర్, రమామహల్ సెంటరు, మధులత సెంటర్, విజయవిహర్ సెంటర్, ఫైర్ స్టేషన్ సెంటరు
  • ప్రధాన నివాస కేంద్రాలు: పవర్ పేట, గాంధీ నగరం, కొత్త పేట, నరసింహారావు పేట, రామచంద్రరావు పేట, విద్యా నగర్, శాంతినగర్, సత్రంపాడు, ఖాదర్ జండా, ఖతీబ్ వీధి, ఆదివారపు పేట, పెన్షన్ మొహాల్ల, అమీన పేట, అశోక్ నగర్, ఇస్రేల్ పేత, పత్తేబాద, గవరవరం, తంగెళ్ళమూడి.
  • విద్యా కేంద్రాలు: సత్రంపాడు (డిగ్రీ, పి.జి., బి.యిడి, పాలిటెక్నిక్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ తదితర సి.ఆర్.ఆర్ కాలేజీలు, రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ) ఆర్ ఆర్ పేట, విద్యానగర్, గవరవరం (సెయింట్ దెరిసాస్ కాలేజీలు, సెయింట్ జేవియర్ స్కూల్స్) దుగ్గిరాల (డెంటల్ కాలేజీ), మల్కాపురం (ఆశ్రం హాస్పిటల్, మెడికల్ కాలేజీ)
  • నగరంలో కలిసిపోయిన పరిసర గ్రామాలు: తంగెళ్ళమూడి, సత్రంపాడు, గవరవరం, శనివారపుపేట, చోదిమెళ్ళ, చాటపర్రు.
  • మెహర్ బాబా సెంటర్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు

జనగణన గణాంకాలు

2011 జనాభా ప్రకారం, ఈ నగర జనాభా 217, 876. 1901లో పట్ణ జనాభా 33, 521 మాత్రమే ఉండేది. 1991 నాటికి ఇది 2, 12, 866 కు చేరుకొంది. 1991 లెక్కల ప్రకారం అక్షరాస్యత 72%. 1981-91 మధ్యకాలంలో 26.63% అక్షరాస్యతా వృద్ధి నమోదయ్యింది. 2001లో జనాభా 2, 15, 642.

పరిపాలన

1866 లో మునిసిపాలిటిగా ఏర్పడింది. (దేశంలో రెండవ మోడల్ మునిసిపాలిటి) 2005 లో మునిసిపల్ కార్పొరేషన్ గా గుర్తించబడింది. ఏలూరు ప్రస్తుతం ఒక స్పెషల్ గ్రేడ్ మునిసిపల్ కార్పొరేషన్. ఏలూరు నగరపాలక సంస్థ నగర పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యాలు

ఏలూరు 
ఏలూరు కొత్త బస్టాండ్

ఏలూరు నగరం, రోడ్డు, రైలు, జలమార్గాల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ నగరాలు, పట్టణాలు చాలా బాగా అనుసంధానించబడి ఉంది.

రోడ్డు మార్గాలు

జాతీయ రహదారి 16 పై ఈ నగరం ఉంది. ఏలూరు పాత బస్సు స్టేషన్, ఏలూరు కొత్త బస్సు స్టేషన్ల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ బస్సు నడుపుతోంది.

రైలు మార్గాలు

ఏలూరు 
ఏలూరు రైల్వే స్టేషన్

ఏలూరు రైల్వే స్టేషను విజయవాడ రైల్వే డివిజన్లో దక్షిణ మధ్య రైల్వే జోన్కు చెందిన ఒక రైల్వే స్టేషను. పవర్‌పేట రైల్వే స్టేషను, వట్లూరు రైల్వే స్టేషను నగరానికి చెందిన శాటిలైట్ స్టేషన్లు. ఈ స్టేషన్లు హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము పై ఉన్నాయి.

వాయు మార్గం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏలూరుకు సమీపంలో ఉన్న విమానాశ్రయం (35 కి.మీ).

జలమార్గం

జాతీయ జలమార్గం 4 గా ప్రకటించబడిన జలమార్గం తీర ప్రాంతం వెంబడి కాకినాడ కాలువ, ఏలూరు కాలువ, కొమ్మమూరు కాలువ, బకింగ్‌హాం కాలువ ద్వారా వెళ్తుంది.

రక్షణ వ్యవస్థ

ఏలూరులో శాంతిభద్రతల కొరకు ఎనిమిది పోలీసు స్టేషన్లు నిర్వహించబడుతున్నవి. వీటిలో, ఒక మహిళా పోలీసు స్టేషను, ఒక ట్రాఫిక్ పోలీసు స్టేషనూ ఉన్నాయి. ఇవి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పరిధిలోకే ఉన్నాయి.

విద్యా సదుపాయాలు

ఏలూరు 
తంగెళ్ళమూడిలోని సిద్ధార్థ పాఠశాల ఏరియల్ వ్యూ
ఏలూరు 
ఇండియన్ ఇంస్టిట్యుట్ అఫ్ అయిల్ పాం రీసర్చ్
ఏలూరు 
నగర సమీపంలోని ఒక కళాశాల
ఏలూరు 
సర్ సి.ఆర్.రెడ్డి ఇంజినీరింగ్ కాలేజి, వట్లూరు, ఏలూరు వద్ద

వాటిలో కొన్ని:

  • ఈదర సుబ్బమ్మ దేవి మునిసిపల్ ఉన్నత పాఠశాల" చాలా కాలంనుండి నడుస్తున్న ఉన్నత పాఠశాల.
  • "శ్రీ గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయం ఉన్నత పాఠశాల" కూడా చాలా కాలంనుండి నడుస్తున్న ఉన్నత పాఠశాల.
  • "సర్ సి.ఆర్.రెడ్డి విద్యాసంస్థలు" -ఇవి సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారి పేరు మేద నిర్మించబడ్డాయి. 1945లో ప్రాంభమైనవి. ఈ సంస్థలచే నిర్వహింపబడుతున్న విద్యాలయాలు: పబ్లిక్ స్కూలు, మోడల్ ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజి, డిగ్రీకాలేజి, పి.జి. కాలేజి, లా కాలేజి, బి.ఎడ్. కాలేజి. వీరి మహిళల కాలేజి, పాలిటెక్నిక్ కాలేజి, ఇంజినీరింగ్ కాలేజి ఏలూరు పరిసర గ్రామమైన వట్లూరులో ఉన్నాయి.[ఆధారం చూపాలి]
  • "సెయింట్ థెరిసా విద్యా సంస్థలు" - సెయంట్ థెరిసా విద్యా సంస్థలు పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళా విద్యాభివృద్ధికి ఎంతో చేయూతనిచ్చాయి. వీటిలో బాలికల పాఠశాల, ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజి, డిగ్రీ కాలేజి, పి.జి. కాలేజి ఉన్నాయి.
  • "ఆశ్రం మెడికల్ కాలేజి" - (మల్కా పురమ్ వద్ద) దీనికి దగ్గరలో ఆటో నగర్ వద్ద నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్ లో పెద్ద మెడికల్ కళాశాలల్లో ఇది ఒకటి.

వైద్య సదుపాయాలు

  • ప్రభుత్వ ఆసుపత్రి - జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి (పెద్దాసుపత్రి) 350 పడకల
  • ఆశ్రం వైద్య కళాశాల ఆసుపత్రి - మెడికల్ కాలీజికి అనుబంధంగా ఉంది. 780 పడకలతో ముఖ్యమైన అన్ని సదుపాయాలతో నిర్మింపబడింది.
  • డీ పాల్ దంత వైద్య శాల/ దంత వైద్య కలాశాల - ఇది దుగ్గిరాల సమీపంలో వుంది, ఇది రాష్ట్రం లోనే పెద్ద దంత వైద్య కలాశాల.
  • పెదవేగి చర్మ వైద్య శాల - ఇక్కడ అన్ని రకాల చర్మ వ్యాధులు నివారించ బడతాయి, కుష్టు వ్యాధికి మందు కూడా ఉచితముగా ఇస్తారు.

పరిశ్రమలు

  • అంబికా గ్రూప్ - 60 యేళ్ళపైగా ఈ వ్యాపార సంస్థ ఉత్పత్తి చేసే "అంబికా దర్బార్ బత్తి", మరి కొన్ని అగర్‌బత్తిలు దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగి ఉన్నాయి. ఈ గ్రూప్ అధిపతులు ఇంకా సినిమా నిర్మాణం, విద్యుత్తు, హోటళ్ళు వంటి మరికొన్ని వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు.
  • జూట్ మిల్లు - ఈస్టిండియా కమర్షియల్ కార్పొరేషన్ వారి జనపనార పరిశ్రమ పట్టణం నడిబొడ్డున ఉన్న పెద్ద పరిశ్రమ. గోనె సంచులు, ఇతర జనపనార ఉత్పత్తులు వీరి ఉత్పాదనలు.
  • చేపలు, రొయ్యలు పరిశ్రమలు: దీనికి కారణం కొల్లేరు, దాని చుట్టుతా ఉన్న చేపల చెరువులు, రొయ్యల చెరువులు.
  • వస్త్రాలు: పత్తేబాదలో ముఖ్యంగా చీరలు నేస్తారు.
  • తివాచీ, చేనేత పరిశ్రమలు - ఏలూరులో తివాచీలు అధికంగా మహమ్మదీయులచే నేయబడుతున్నాయి. ఎక్కువగా ఎగుమతి చేయబడుతున్నాయి.
  • రిలయన్స్: సోమవరపుపాడు వద్ద ఉంది.
  • ఆటో నగర్: ఆశ్రం ఆసుపత్రికి వెళ్లేదారిలో పెద్ద రైల్వే స్టేషనుకి చేరువలో ఉంది.

సంస్కృతి

ఉత్సవాలు

పర్యాటక ఆకర్షణలు

వెయ్యి సంవత్సరాలకు పైబడి చరిత్రవున్న ఆలయాల్లో రామలింగేశ్వరస్వామి ఆలయం, జ్వాలాపహరేశ్వరస్వామి ఆలయం, కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం, జనార్దన కన్యకాపరమేశ్వరీదేవి గుడి, మార్కండేయాలయం, ఓంకారేశ్వరస్వామి ఆలయం ఉన్నాయి.

  • జ్వలాపహరేశ్వర స్వామి వారి ఆలయం, దక్షిణపు వీధి (ఇది అత్యంత ప్రాఛీన ఆలయం)
  • శ్రీ మార్కండేయ స్వామి గుడి, దక్షిణపు వీధి
  • శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, పడమరవీధి (ప్రాచీన ఆలయం స్థాపితం: సా.శ.1104) .
  • హజ్రత్‌ సయ్యద్‌ బాయజీద్‌ మహాత్ముల వారి దర్గా, అగ్రహారం, కోటదిబ్బ.
  • నూకాలమ్మ గుడి, ఆదివారపు పేట.
  • చెన్నకేశవ స్వామి దేవస్టానం
  • ఏలూరు సి.యస్.ఐ చర్చి,, స్థాపితం 1864
  • ఏలూరు రొమన్ కాతలిక్ చర్చి, గ్జేవియర్ నగర్ (ఇది పురాతన మైనది) .
  • అవతార్ మెహెర్ బాబా సెంటర్, కట్టా సుబ్బారావు తోట

చిత్రమాలిక

ప్రముఖులు

ఇవి కూడా చూడండి

వనరులు, మూలాలు

బయటి లింకులు

Tags:

ఏలూరు పేరు వ్యుత్పత్తిఏలూరు చరిత్రఏలూరు భౌగోళికంఏలూరు పట్టణం స్వరూపంఏలూరు జనగణన గణాంకాలుఏలూరు పరిపాలనఏలూరు రవాణా సౌకర్యాలుఏలూరు రక్షణ వ్యవస్థఏలూరు విద్యా సదుపాయాలుఏలూరు వైద్య సదుపాయాలుఏలూరు పరిశ్రమలుఏలూరు సంస్కృతిఏలూరు పర్యాటక ఆకర్షణలుఏలూరు చిత్రమాలికఏలూరు ప్రముఖులుఏలూరు ఇవి కూడా చూడండిఏలూరు వనరులు, మూలాలుఏలూరు బయటి లింకులుఏలూరుఆంధ్రప్రదేశ్ఏలూరు జిల్లాకొల్లేరు సరస్సు

🔥 Trending searches on Wiki తెలుగు:

గిలక (హెర్నియా)బరాక్ ఒబామాకన్యారాశిభారతదేశ ప్రధానమంత్రిపది ఆజ్ఞలుప్రజాస్వామ్యంనవరసాలుతెలుగు నెలలుపరిటాల రవిభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుమర్రిబలి చక్రవర్తిఖోరాన్వాల్మీకిశ్రవణ నక్షత్రమునవగ్రహాలుత్రిఫల చూర్ణంఅరిస్టాటిల్పూజా హెగ్డేమశూచిరాపాక వరప్రసాద రావుమీనరాశితెలుగు కులాలుఆయాసంనారా చంద్రబాబునాయుడుచంద్రశేఖర వేంకట రామన్మంద కృష్ణ మాదిగబలగంశ్రీకాళహస్తిబోదకాలుమలబద్దకంయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీనందమూరి తారక రామారావుభారత రాజ్యాంగ పీఠికరామసేతువిద్యనడుము నొప్పిభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుత్రినాథ వ్రతకల్పంతెలంగాణ దళితబంధు పథకంనిఖత్ జరీన్రమణ మహర్షిఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుఅభిజ్ఞాన శాకుంతలముకావ్య కళ్యాణ్ రామ్విజయవాడగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుఈనాడుపసుపు గణపతి పూజగర్భంమూలా నక్షత్రంపల్నాటి యుద్ధంఆంధ్రజ్యోతిఇందుకూరి సునీల్ వర్మఇత్తడిరాహుల్ గాంధీహరికథకృష్ణవంశీచిత్త నక్షత్రముమహారాష్ట్రగ్రామంసంధిఉపాధ్యాయుడుహనుమాన్ చాలీసాజొన్నకాకి మాధవరావుసర్వేపల్లి రాధాకృష్ణన్సంభోగంఏ.పి.జె. అబ్దుల్ కలామ్కాలుష్యంకన్యాశుల్కం (నాటకం)ఘట్టమనేని కృష్ణదురదమహేంద్రసింగ్ ధోనిఅంగుళంవిన్నకోట పెద్దనతెలంగాణకు హరితహారంరావణుడు🡆 More