కృష్ణా నది: భారతదేశంలో మూడవ పెద్ద నది.

కృష్ణా నది భారతదేశంలోని అత్యంత పొడవైన నదుల్లో మూడవది.

దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది. కృష్ణలో నీటి ప్రవాహం సెకనుకు 2213 మీ3 . నీటి ప్రవాహం పరంగా ఇది దేశంలో కెల్లా నాలుగవ పెద్ద నది. తెలుగు వారు ఆప్యాయంగా కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. పడమటి కనులలో మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్‌కు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణిలో, సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా కృష్ణానది జన్మిస్తుంది. ఆపై అనేక ఉపనదులను కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1, 400 కి. మీ. ప్రయాణించి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

కృష్ణానది
కృష్ణా నది: ప్రయాణం, కృష్ణా నదీ తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు, ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలం వద్ద కృష్ణానదీ లోయ
కృష్ణా నది: ప్రయాణం, కృష్ణా నదీ తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు, ప్రాజెక్టులు
దక్షిణ భారత ద్వీపకల్పంలో కృష్ణానది మార్గం ([1])
స్థానం
Countryభారత దేశం
Stateమహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
Regionదక్షిణ భారతదేశం
భౌతిక లక్షణాలు
మూలంమహాబలేశ్వర్ వద్ద నున్న జోర్ గ్రామం
 • స్థానంసతారా జిల్లా, మహారాష్ట్ర
 • అక్షాంశరేఖాంశాలు17°59′18.8″N 73°38′16.7″E / 17.988556°N 73.637972°E / 17.988556; 73.637972
 • ఎత్తు914 m (2,999 ft)Geographic headwaters
సముద్రాన్ని చేరే ప్రదేశంబంగాళాఖాతం
 • స్థానం
హంసలదీవి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
 • అక్షాంశరేఖాంశాలు
15°44′10.8″N 80°55′12.1″E / 15.736333°N 80.920028°E / 15.736333; 80.920028
 • ఎత్తు
0 m (0 ft)
పొడవు1,400 km (870 mi)approx.
పరీవాహక ప్రాంతం258,948 km2 (99,980 sq mi)
ప్రవాహం 
 • సగటు2,213 m3/s (78,200 cu ft/s)
ప్రవాహం 
 • స్థానంవిజయవాడ (1901–1979 సగటు),
గరిష్ఠం (2009), కనిష్ఠం (1997)
 • సగటు1,641.74 m3/s (57,978 cu ft/s)
 • కనిష్టం13.52 m3/s (477 cu ft/s)
 • గరిష్టం31,148.53 m3/s (1,100,000 cu ft/s)
పరీవాహక ప్రాంత లక్షణాలు
ఉపనదులు 
 • ఎడమభీమ, దిండి, పెద్దవాగు, మూసీ, పాలేరు, మున్నేరు
 • కుడికుడాలి (నిరంజన) వెన్నానది, కొయినా, పంచ్‌గంగ, దూధ్‌గంగ, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర

ప్రయాణం

కృష్ణా నది: ప్రయాణం, కృష్ణా నదీ తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు, ప్రాజెక్టులు 
కృష్ణానది సముద్రంలో కలిసే స్థలం - ఉపగ్రహ చిత్రం

ద్వీపకల్పం పడమర చివరి నుండి తూర్పు చివరికి సాగే తన ప్రస్థానంలో కృష్ణ 29 ఉపనదులను తనలో కలుపుకుంటోంది. పుట్టిన మహాబలేశ్వర్ నుండి 135 కి.మీ.ల దూరంలో కొయినా నదిని తనలో కలుపుకుంటుంది. తరువాత వర్ణ, పంచగంగ, దూధ్‌గంగ లు కలుస్తాయి. మహారాష్ట్రలో నది 306 కిలోమీటర్లు ప్రవహించాక బెల్గాం జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. పడమటి కనుమలు దాటాక, జన్మస్థానం నుండి దాదాపు 500 కి.మీ దూరంలో కర్ణాటకలో ఘటప్రభ, మలప్రభ నదులు కృష్ణలో కలుస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు, భీమా నది కలుస్తుంది. కర్ణాటకలో 482 కిలోమీటర్ల దూరం ప్రవహించి రాయచూర్ జిల్లా దేవర్‌సూగూర్ గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడ్కోలు పలుకి, మహబూబ్‌నగర్ జిల్లా తంగడి వద్ద తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తరువాత ఆలంపూర్కు దగ్గరలో కృష్ణ యొక్క అతిపెద్ద ఉపనది తుంగభద్ర కలుస్తుంది. ఇదే ప్రాంతంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తరువాత కొద్ది దూరంలోనే నది నల్లమల కొండల శ్రేణి లోని లోతైన లోయల లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే శ్రీశైలం, నాగార్జున సాగర్ ల వద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించబడ్డాయి. ఇక్కడి నుండి చిన్న చిన్న ఉపనదులైన దిండి, మూసి, పాలేరు, మున్నేరు వంటివి కలుస్తాయి. విజయవాడ వద్ద బ్రిటిషు వారి కాలంలో నిర్మించబడ్డ ప్రకాశం బ్యారేజిని దాటి డెల్టా ప్రాంతంలో ప్రవేశిస్తుంది. విజయవాడ వద్ద ఈ నది 1188 మీటర్ల వెడల్పుతో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. ఆ తరువాత దివిసీమ లోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

ఉపనదులు అన్నిటితో కలిపిన కృష్ణా నదీ వ్యవస్థ యొక్క మొత్తం పరీవాహక ప్రాంతం 2,56,000 చ.కి.మీ. ఇందులో మూడు పరీవాహక రాష్ట్రాల వాటా ఇలా ఉంది:

కృష్ణా నదీ తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు

కృష్ణా నది: ప్రయాణం, కృష్ణా నదీ తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు, ప్రాజెక్టులు 
ప్రకాశం బ్యారేజి పనోరమ

కృష్ణా నదికి భారతదేశంలోని ఇతర నదుల వలెనే పౌరాణిక ప్రశస్తి ఉంది. ఎన్నో పుణ్య క్షేత్రాలు నది పొడుగునా వెలిసాయి. వీటిలో ప్రముఖమైనవి:

సీతానగరం నుంచి ఉండవల్లి కరకట్ట మీదుగా వైకుంఠపురం వరకు కరకట్ట వెంబడి కృష్ణాతీరాన్ని ఆనుకుంటూ ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రకృతి ఆశ్రమాన్ని కూడా నెలకొల్పారు.సీతానగరంలో శ్రీ మద్వీరాంజనేయ సమేత కోదండరామస్వామి ఆలయం, 1982లో అయిదెకరాల విస్తీర్ణంలో శ్రీ జీయరుస్వామివారు ఆశ్రమాన్ని నెలకొల్పారు. 2001 ఫిబ్రవరి 6వ తేదీన రామకృష్ణమిషన్‌ను ఇక్కడే ఏర్పాటు చేశారు. శ్రీ జయదుర్గా తీర్థాన్ని 1986లో దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ స్థాపించారు.ఇస్కాన్ మందిరంలో విదేశీ భక్తులు సైతం కృష్ణ భజనల్లో మునిగి తేలుతుంటారు. డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యశాలను ఏర్పాటు చేశారు.తాళ్లాయపాలెం లోశ్రీ కోటిలింగ మహాశైవక్షేత్రాన్ని ఏడెకరాల విస్తీర్ణంలో విజయవాడకు చెందిన శ్రీ బ్రహ్మచారి శివస్వామి 2004లో నెలకొల్పారు. ఈ క్షేత్రంలో అనేక ఆలయాలు దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో పాదరస స్పటిక లింగాలు వుండడం ఓ విశేషం.

ప్రాజెక్టులు

కృష్ణా నది పరీవాహక రాష్ట్రాలు మూడూ కూడా విస్తృతంగా సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించుకున్నాయి. వీటిలో ముఖ్యమైనవి:

కర్ణాటక

పై రెంటినీ కలిపి అప్పర్ కృష్ణా ప్రాజెక్టు అని అంటారు.

తెలంగాణ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి

ఆంధ్రప్రదేశ్

వరదలు

2009 అక్టోబరులో కృష్ణానదికి వచ్చిన వరదల్లో 350 గ్రామాలు మునిగిపోయి లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దీన్ని వెయ్యేళ్ళ వరదగా భావిస్తున్నారు. కర్నూలు, మహబూబ్ నగర్, గుంటూరు, కృష్ణా, నల్గొండ జిల్లాల్లో ఈ వరద బీభత్సం సృష్టించింది. కర్నూలు నగరం మొత్తం దాదాపు 3 రోజుల పాటు 3 మీటర్ల వరద నీటిలో మునిగిపోయి ఉంది. కృష్ణా నది శ్రీశైలం ఆనకట్ట పైగా ప్రవహించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద 11,10,000 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. 1903 లో నమోదైన 10,80,000 క్యూసెక్కుల ప్రవాహ రికార్డును ఇది మించిపోయింది.

ఇవి కూడా చూడండి

బయటి లంకెలు

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

కృష్ణా నది ప్రయాణంకృష్ణా నది కృష్ణా నదీ తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలుకృష్ణా నది ప్రాజెక్టులుకృష్ణా నది వరదలుకృష్ణా నది ఇవి కూడా చూడండికృష్ణా నది బయటి లంకెలుకృష్ణా నది మూలాలుకృష్ణా నది వెలుపలి లంకెలుకృష్ణా నదిఆంధ్రప్రదేశ్ఉత్తరంకర్ణాటకతెలంగాణతెలుగుబంగాళా ఖాతముభారత దేశంమహారాష్ట్రహంసల దీవి

🔥 Trending searches on Wiki తెలుగు:

యోనితెలంగాణ చరిత్రరాయప్రోలు సుబ్బారావుగేమ్ ఛేంజర్డోర్నకల్మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డివిశ్వబ్రాహ్మణడాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ACA–VDCA క్రికెట్ స్టేడియంరామప్ప దేవాలయంశ్రీవిష్ణు (నటుడు)కాశీపసుపు గణపతి పూజజాతీయములుశ్రవణ నక్షత్రముసిద్ధార్థ్రోహిణి నక్షత్రంఅక్కినేని నాగ చైతన్యవన్ ఇండియారాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్తెలుగు అక్షరాలుఐశ్వర్య రాయ్రూప మాగంటిధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంసన్ రైజర్స్ హైదరాబాద్హస్తప్రయోగంఆంధ్ర విశ్వవిద్యాలయంఅటల్ బిహారీ వాజపేయిమృగశిర నక్షత్రమురాధనిజాంసౌందర్యనందమూరి తారక రామారావుమహాత్మా గాంధీ2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువృషభరాశిభగవద్గీతభారత క్రికెట్ జట్టుకారాగారంట్విట్టర్సంపన్న శ్రేణిమలబద్దకంరామాఫలంచతుర్యుగాలునువ్వొస్తానంటే నేనొద్దంటానాచార్లెస్ శోభరాజ్భారత జాతీయ కాంగ్రెస్అవకాడోచంద్ర గ్రహణంసత్యనారాయణ వ్రతంయాగంటిశోభన్ బాబుబోడె ప్రసాద్చిన్న ప్రేగుఓం నమో వేంకటేశాయకామాక్షి భాస్కర్లమియా ఖలీఫావై. ఎస్. విజయమ్మసింహరాశిజొన్నమౌర్య సామ్రాజ్యం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుచిరంజీవి నటించిన సినిమాల జాబితాపెరిక క్షత్రియులువరంగల్ లోక్‌సభ నియోజకవర్గంకల్లుఅన్నయ్య (సినిమా)యునైటెడ్ కింగ్‌డమ్పిఠాపురంఅంజలి (నటి)కాలుష్యంమురళీమోహన్ (నటుడు)మహాభాగవతంవేయి స్తంభాల గుడిసూర్యకుమార్ యాదవ్సుఖేశ్ చంద్రశేఖర్కర్ణాటకతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితా🡆 More