చంద్ర గ్రహణం

చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై నున్నవారికి చంద్రుడు కనిపించడు.

దీన్ని చంద్ర గ్రహణం (Lunar Eclipse) అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు జరుగుతుంది. చంద్ర గ్రహణం చాలాసేపు (కొన్ని గంటలు) మొత్తం అర్థగోళం అంతా కనిపిస్తుంది.

చంద్ర గ్రహణం
మార్చి 3, 2007 నాటి చంద్ర గ్రహణం.
చంద్ర గ్రహణం
సంపూర్ణ చంద్ర గ్రహణం

చంద్రగ్రహణానికి కావలసిన పరిస్థితులు p. sankar naik

చంద్రగ్రహణానికి క్రింది పరిస్థితులు కావలెను.

  • చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళరేఖలో వుండాలి.
  • చంద్రుడికీ సూర్యుడికీ మధ్య భూమి వుండాలి.
  • నిండు పౌర్ణమి రాత్రి వుండాలి.
  • చంద్రగ్రహణ కాలము చంద్రుడి స్థాన కక్ష్యాబిందువులపై ఆధారపడి వుంటుంది.

చంద్రగ్రహణం ఏర్పడిన తేదీలు

  • 2008 ఫిబ్రవరి 21 న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది.
  • 2008 ఆగస్టు 16న పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడవచ్చు.
  • సంపూర్ణ చంద్రగ్రహణం, 2010 డిసెంబరు 21 వ తేదీన చూడవచ్చని శాస్త్రవేత్తల అంచనా.
  • 2011 డిసెంబరు 10 న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది
  • 2015 ఏప్రిల్ 4 న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది
  • 2018 జులై 27 న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది అతి ధీర్ఘ సంపూర్ణ చంద్ర గ్రహణం భారతదేశంలో శుక్రవారం (27వ తేదీ) రాత్రి 10:45 గంటలకు ప్రారంభమై శనివారం(28వ తేదీ) తెల్లవారుజామున 4:59 గంటలకు ముగుస్తుంది. రాత్రి ఒంటి గంట నుంచి 2:43 గంటల మధ్య గ్రహణం ఉచ్ఛదశలో ఉంటుంది.

కొన్ని విశేషాలు

చంద్రగ్రహణమేర్పడే పరిస్థితిలో భూమిపైనున్నవారికి చంద్రగ్రహణం కనబడితే, అదే సమయంలో చంద్రుడిపైనుండి వీక్షిస్తే? సూర్యగ్రహణం కనబడుతుంది.సూర్యగ్రహణానికి చంద్ర గ్రహణానికి ఉన్న తేడా ఏమిటంటే, చంద్ర గ్రహణం నాడు చంద్రుడు కనపడనట్లే సూర్య గ్రహణం నాడు, సూర్యుడు కనపడడు. ఇది చంద్రుడు, సూర్యుడు, భూమి మధ్యలోనుంచి ప్రయాణిస్తున్నపుడు ఏర్పడుతుంది.సూర్యగ్రహణం వలే కాకుండా చంద్ర గ్రహణాన్ని వీక్షించడం వలన కళ్ళకు ఎటువంటి హానీ జరగదు.రక్షణ కోసం ఎటువంటి కళ్ళజోడు అవసరం లేదు. టెలిస్కోప్ కూడా అవసరం లేదు. కేవలం రెండు కళ్ళతో కూడా వీక్షించవచ్చు. కాకపోతే దూరదృశ్యాలను చూడడానికి ఉపయోగించే బైనాక్యులర్స్ను వాడితే చంద్ర గ్రహణాన్ని మరింత స్పష్టంగా వీక్షించవచ్చు. సాధారణంగా సంవత్సరమునకు 7 గ్రహణాలు ఏర్పడుతాయి. వీటిలో 5 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలు (లేదా ) 4 సూర్య గ్రహణాలు , 3 చంద్ర గ్రహణాలు ఉండవచ్చు.

చంద్ర గ్రహణం 
చంద్ర గ్రహణం రేఖాచిత్రం

ప్రతి10 సంవత్సరాల క్రితం గ్రహణాలు ఏ వరుస క్రమంలో ఏర్పడ్డాయో అదే వరుస క్రమంలో తిరిగి పునరావృతం అవుతుంది.

చంద్ర గ్రహణం పౌర్ణమి రోజులలో రాత్రి వేళల్లో సంభవిస్తుంది. అయితే అన్ని పౌర్ణమి రోజులలో సంభవించడు. కారణం చంద్రుని కక్ష్య, భూ కక్ష్య మధ్య 5.9° కోణీయ దూరం వ్యత్యాసం ఉండటమే చంద్ర గ్రహణం సమయంలో గర్భవతులు బయట తిరిగితే కడుపులో శిశువుకు హాని జరుగుతుందని, ఏమీ తినకూడదని, గోళ్ళు గిల్లుకోకూడదని, ఏమీ తినకూడదని పూర్వం నుండి భారతదేశంలో నమ్మకం ఉంది.

సూపర్ మూన్

భూమి చంద్రుల మద్య సరాసరి దూరం 384440 కి మీ. చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్య లో తిరుగుతుండటం వలన కొన్ని సందర్భాలలో దగ్గరగా రావడం జరుగుతుంది , ఆ పరిస్థితి ని "పెరిగి" అంటారు. ఆ సమయంలో దూరం 356509 కిమీ ఉంటుంది. భూమి చంద్రుల మద్య దూరం పెరిగినప్పుడు దూరం 406662 కిమీ ఉంటుంది. ఆ స్తితి ని "అపోగి" అంటారు. అలా చంద్రుడు, భూమికి దగ్గరగా వచ్చినప్పుడు, ఏర్పడే పౌర్ణమి నాటి చంద్రున్ని "సూపర్ మూన్" అంటారు..

'సూపర్ మూన్' సందర్భంగా చంద్రుడు, మామూలు కంటే 14 రెట్లు పెద్దగా, 30 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా, కొత్త, కొత్త రంగుల్లో కనిపిస్తాడు..

బ్లూ మూన్

ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే., అలా నెల చివర్లో వచ్చే రెండవ పౌర్ణమి నాటి చంద్రున్ని "బ్లూ మూన్" అంటారు. ఇది రెండున్నర సంవత్సరాలకోసారి వస్తుంది..

బ్లడ్ మూన్

సూపర్ మూన్ సందర్భంగా చంద్ర గ్రహణం ఏర్పడితే., అపుడు (ఎర్రగా) కనపడే పౌర్ణమి నాటి చంద్రున్ని "బ్లడ్ మూన్" అని పిలుస్తారు..

సూర్య రశ్మి భూవాతావరణంలోకి ప్రవేశించిన తరువాత రంగులు దేనికవి విడిపోతాయి. వాటిలో అధిక తరంగదైర్ఘ్యం ఉండే ఎరుపు, నారింజ రంగులు మాత్రం ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. చంద్రగ్రహణం రోజున

భూ ఛాయలోకి ప్రవేశిస్తున్నప్పుడు, దాన్నుంచి బయటపడుతున్నప్పుడు.. ఆ తరువాత చంద్రుడిపైకి ఈ రెండు రంగులే ఎక్కువగా ప్రసరిస్తాయి. అందుకే ఆ రోజు చందమామ సాధారణ రోజుల కంటే ఎర్రగా కనిపిస్తుంది. అందుకే దీన్ని బ్లడ్ మూన్ అంటారు.

గ్రహణ సమయంలో చంద్రుడు, భూమి నీడలోకి వెళ్ళడం వళ్ళ, సూర్యుడి నుండి వచ్చే కాంతి భూమికి చేరి, తర్వాత చంద్రుని మీద ప్రతిఫలిస్తుంది. దాంతో చంద్రుడు ఎరుపు రంగులో (రక్త వర్ణంలో) కనిపిస్తాడు. అందుకే దాన్ని 'బ్లడ్ మూన్' అంటారు.

చంద్రుడు, భూమి చుట్టూ తిరిగే క్రమంలో, ప్రతీ పౌర్ణమినాడు తాను వెళ్ళే దారిలోనే ఈ పౌర్ణమినాడు కూడా ప్రయాణిస్తాడు, కాకపోతే గ్రహణం రోజు, భూమి నీడ గుండా వెళ్తాడు.

రకాలు

భూమి యొక్క నీడను ఛాయ, ప్రచ్ఛాయ అని రెండు రకాలుగా విభజించవచ్చు. ఛాయ అనగా సూర్యుకాంతి భూమి మీద పడినప్పుడు సూర్యకాంతి పూర్తిగా కనిపించని భాగము. దీనివలన సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. ప్రచ్ఛాయ అంటే సూర్యకాంతిలో కొద్ది భాగం మాత్రమే భూమిచే అడ్డగించబడిన ప్రాంతం. దీనివలన గ్రహణం పాక్షికంగా ఏర్పడుతుంది. చంద్రుడు కొద్ది భాగం మాత్రమే భూమి యొక్క ఛాయలోకి ప్రవేశించినపుడు దానిని పాక్షిక చంద్రగ్రహణం అనీ పూర్తిగా భూమి ఛాయలోకి ప్రవేశించినపుడు దానిని సంపూర్ణ చంద్రగ్రహణం అనీ వ్యవహరిస్తారు.

ఇవీ చూడండి

చిత్రమాలిక

Tags:

చంద్ర గ్రహణం చంద్రగ్రహణానికి కావలసిన పరిస్థితులు p. sankar naikచంద్ర గ్రహణం చంద్రగ్రహణం ఏర్పడిన తేదీలుచంద్ర గ్రహణం కొన్ని విశేషాలుచంద్ర గ్రహణం సూపర్ మూన్చంద్ర గ్రహణం బ్లూ మూన్చంద్ర గ్రహణం బ్లడ్ మూన్చంద్ర గ్రహణం రకాలుచంద్ర గ్రహణం ఇవీ చూడండిచంద్ర గ్రహణం చిత్రమాలికచంద్ర గ్రహణంచంద్రుడుపౌర్ణమిభూమి

🔥 Trending searches on Wiki తెలుగు:

యోనికలమట వెంకటరమణ మూర్తిక్రికెట్ఆవేశం (1994 సినిమా)నవధాన్యాలుసుందర కాండఆంధ్రప్రదేశ్ మండలాలురేవతి నక్షత్రంపిఠాపురంవిశ్వబ్రాహ్మణవికీపీడియాహనుమంతుడునవరత్నాలునాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గందెందులూరు శాసనసభ నియోజకవర్గంఛందస్సుపల్లెల్లో కులవృత్తులుగరుడ పురాణంవిశ్వామిత్రుడుపెళ్ళి చూపులు (2016 సినిమా)వంగా గీతఆర్టికల్ 370 రద్దువేమనకె.బాపయ్యభారత రాష్ట్రపతుల జాబితాప్రదీప్ మాచిరాజురాజ్‌కుమార్భారత జాతీయగీతంపంచతంత్రంఅనంత బాబునర్మదా నదిఆల్ఫోన్సో మామిడివంగవీటి రాధాకృష్ణతేలుజానకి వెడ్స్ శ్రీరామ్ఖండంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిసైబర్ సెక్స్ఇంటర్మీడియట్ విద్యవై.యస్. రాజశేఖరరెడ్డిబంగారు బుల్లోడుకాపు, తెలగ, బలిజకె. అన్నామలైకర్ణాటకపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలునామినేషన్వంగవీటి రంగాతెలుగు కథవృషణంవిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితాశ్రీ చక్రంభారత రాష్ట్రపతిదశదిశలురౌద్రం రణం రుధిరంఅష్ట దిక్కులువ్యవసాయంజయలలిత (నటి)గోవిందుడు అందరివాడేలేఊరు పేరు భైరవకోనమీనరాశిఅష్టదిగ్గజములుశాసనసభశక్తిపీఠాలుసౌందర్యతెలంగాణ జనాభా గణాంకాలుభారత కేంద్ర మంత్రిమండలిఎస్. ఎస్. రాజమౌళిసిద్ధు జొన్నలగడ్డసరస్వతితాటి ముంజలుభారతదేశ పంచవర్ష ప్రణాళికలువల్లభనేని బాలశౌరిమానవ శరీరమునరసింహ శతకముభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుసూర్యుడునితిన్కోదండ రామాలయం, ఒంటిమిట్ట🡆 More