ఇరాన్: పశ్చిమాసియా లోని సార్వభౌమిక దేశం

ఇరాన్ (పురాతన నామం = పర్షియా) (పర్షియన్: ایران) నైఋతి ఆసియాలోని ఒక మధ్యప్రాచ్య దేశము.

1935 దాకా ఈ దేశము పాశ్చాత్య ప్రపంచములో పర్షియా అని పిలవబడేది. 1959లో మహమ్మద్ రెజా షా పహ్లవి ఉభయ పదములు ఉపయోగించవచ్చని ప్రకటించారు.కానీ ప్రస్తుత ఇరాన్ ను ఉద్దేశించి "పర్షియా" పదము వాడుక చాలా అరుదు. ఇరాన్ అను పేరు స్థలి "ఆర్యన్" అర్థం "ఆర్య భూమి".

جمهوری اسلامی ايران
జమ్‌హూరియె ఇస్లామీయె ఇరాన్
ఇరాన్ ఇస్లామియా గణతంత్రం
Flag of ఇరాన్ ఇరాన్ యొక్క చిహ్నం
నినాదం
పర్షియన్: ఇస్తెఖ్‌లాల్, ఆజాది, జమ్హూరియ-ఎ- ఇస్లామీ
(తెలుగు: "స్వతంత్రం, స్వేచ్ఛ, ఇస్లామీయ గణతంత్రం")
జాతీయగీతం

ఇరాన్ యొక్క స్థానం
ఇరాన్ యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
టెహరాన్
35°40′N 44°26′E / 35.667°N 44.433°E / 35.667; 44.433
అధికార భాషలు పర్షియన్
ప్రభుత్వం ఇస్లామిక్ రిపబ్లిక్
 -  ప్రధాన లీడరు అలీ ఖుమైనీ
 -  అధ్యక్షుడు మహ్‌మూద్ అహ్మద్ నెజాద్
ఇరానియన్ విప్లవం రాజరికం పరిసమాప్తి 
 -  ప్రకటితం ఫిబ్రవరి 11, 1979 
విస్తీర్ణం
 -  మొత్తం 1,648,195 కి.మీ² (17వ)
636,372 చ.మై 
 -  జలాలు (%) 0.7%
జనాభా
 -  2005 అంచనా 68,467,413  (18వ)
 -  1996 జన గణన 60,055,488  
 -  జన సాంద్రత 41 /కి.మీ² (128వది)
106 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $561,600,000,000 (19వది)
 -  తలసరి $8,065 (74వది)
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) 0.736 (medium) (99వది)
కరెన్సీ ఇరానియన్ రియాల్ (ريال) (IRR)
కాలాంశం (UTC+3.30)
 -  వేసవి (DST) గుర్తించలేదు (UTC+3.30)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ir
కాలింగ్ కోడ్ +98

ఇరాన్ కు వాయవ్యాన అజర్‌బైజాన్ (500 కి.మీ), ఆర్మేనియా (35 కి.మీ), ఉత్తరాన కాస్పియన్ సముద్రము, ఈశాన్యాన తుర్కమేనిస్తాన్ (1000 కి.మీ), తూర్పున పాకిస్తాన్ (909 కి.మీ), ఆఫ్ఘనిస్తాన్ (936 కి.మీ), పశ్చిమాన టర్కీ (500 కి.మీ), ఇరాక్ (1458 కి.మీ), దక్షిణాన పర్షియన్ గల్ఫ్, ఒమాన్ గల్ఫ్ లతో సరిహద్దు ఉంది. 1979లో, అయాతొల్లా ఖొమేని ఆధ్వర్యములో జరిగిన ఇస్లామిక్ విప్లవం పర్యవసానముగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ (جمهوری اسلامی ایران) గా అవతరించింది.

ఇరాన్లో, పెర్షియన్, అజర్బైజాన్, కుర్దిష్ (కుర్దిస్తాన్), లూర్ అత్యంత ముఖ్యమైన జాతి సమూహాలు.

చరిత్ర

ఇరాన్ యొక్క జాతీయత పర్షియా నుండి ఉద్భవించింది. పర్షియా అన్నపదము నేటి ఇరాన్, తజికిస్తాన్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్, కాకసస్ ప్రాంతాలకు ఉన్న ప్రాచీన గ్రీకు పేరు పర్సిస్ నుండి వచ్చింది. క్రీ.పూ 6వ శతాబ్దములో ఈ ప్రాంతాలన్నీ ఆకెమెనిడ్ వంశము యొక్క పాలనలో గ్రీస్ నుండి వాయవ్య భారతదేశము వరకు విస్తరించిన మహాసామ్రాజ్యములో భాగముగా ఉన్నాయి. అలెగ్జాండర్ మూడు ప్రయత్నాల తర్వాత ఈ సామ్రాజ్యాన్ని జయించగలిగాడు. అయితే పర్షియా వెనువెంటనే పార్థియన్, సస్సనిద్ సామ్రాజ్యాల రూపములో స్వతంత్రమైనది. అయితే ఈ మహా సామ్రాజ్యాలను 7వ శతాబ్దములో ఇస్లాం అరబ్బీ సేనల చేత చిక్కినది. ఆ తరువాత సెల్జుక్ తుర్కులు, మంగోలులు, తైమర్‌లేను ఈ ప్రాంతాన్ని జయించారు.

16వ శతాబ్దములో సఫవిదులు పాలనలో తిరిగి స్వాతంత్ర్యమును పొందినది. ఆ తరువాత కాలములో ఇరాన్ను షాహ్ లు పరిపాలించారు. 19వ శతాబ్దంలో పర్షియా, రష్యా, యునైటెడ్ కింగ్ డం నుండి వత్తిడి ఎదుర్కొన్నది. ఈ దశలో దేశ ఆధునీకరణ ప్రారంభమై 20వ శతాబ్దములోకి కొనసాగినది. మార్పు కోసము పరితపించిన ఇరాన్ ప్రజల భావాల అనుగుణంగా 1905/1911 పర్షియన్ రాజ్యాంగ విప్లవం జరిగింది.

చరిత్రకు ముందు

ఇరాన్ లోని కషఫ్రద్, గంజ్ పార్ ప్రాంతాలలో లభించిన కళా అవెశేషాలు ఆరంభకాల ఇరాన్ చరిత్రను వివరిస్తున్న మొదటి ఆధారాలుగా భావిస్తున్నారు. ఇవి దిగువ పాలియో లిథిక్ శకానికి (క్రీ.పూ 8,00,000 - 2,00,000) సంబంధించినవని భావిస్తున్నారు. ఇవి నీన్దేర్తల్ మద్య పాలియో లిథిక్ శకానికి (క్రీ.పూ 2,00,000- 80,000) సంబంధించినవని భావిస్తున్నారు. ఇవి జాగ్రోస్ లోని వార్వాసి, యఫ్తెష్ గుహ ప్రాంతాలలో లభించాయి. క్రీ.పూ 10,000- 8,000 సంవత్సరాలకు పూర్వం ఇరాన్ ప్రాంతాలలో చోగా గోలన్, చొఘా బొనట్ వ్యవసాయ సమూహాలు వర్ధిల్లాయి. అలాగే జాగ్రోస్ ప్రాంతంలోసుసా, చొఘా మిష్ వ్యవసాయ సమూహాలు వర్ధిల్లాయి. [page needed] సుసా నగరం స్థాపన రేడియో కార్బన్ (క్రీ.పూ 4,395) జరిగిందని భావిస్తున్నారు. ఇరాన్ పీఠభూమి అంతటా పలు పాలియోలిథిక్ శకానికి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. ఇవి దాదాపు క్రీ.పూ 4,000 ప్రాంతానికి చెందినవని భావిస్తున్నారు. కాంస్య యుగ కాలంలో ఇరాన్ ప్రాంతంలో ఈళం, జిరోఫ్ట్, జయందేష్ సంస్కృతి మొదలైన సంస్కృతులు వర్ధిల్లాయి. వీటిలో ప్రధానంగా ఈళం సంస్కృతి ఇరాన్ వాయవ్యప్రాంతంలో వర్ధిల్లింది. ఈళం సంస్కృతి సుమేరియన్ భాష, ఎలమైట్ సంఙాలిపి జనించిన కాలానికి సమకాలీనమని (క్రీ.పూ 3,000) భావిస్తున్నారు. ఎలమైట్ రాజ్యం మెడియన్, అచమెనిడ్ సామ్రాజ్యాలు అవతరించే వరకు కొనసాగింది. క్రీ.పూ 3,400 - 2,000 మద్యకాలంలో వాయవ్య ఇరాన్ కురా- అరాక్సెస్ సంస్కతి ప్రజల నివాసిత ప్రాంతంగా ఉంది. కురా- అరాక్సెస్ కౌకాసస్, అనటోనియా ప్రాంతాలలో కూడా విస్తరించింది. క్రీ.పూ 2000 సంవత్సరాల నుండి పశ్చిమ ఇరాన్ స్వాత్ ప్రాంతంలో నివసించిన అస్యరియాలు సమీప ప్రాంతాలను వారి భూభాగంలో కలుపుకుని పాలించార.

సాంప్రదాయిక పురాతనత్వం

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
A depiction of the united Medes and Persians in Apadana, Persepolis

క్రీ.పూ 2000 యురేషియన్ స్టెప్పీల నుండి పురాతన ఇరానియన్ ప్రజలు (ప్రొటో ఇరానియన్) ఇరాన్ ప్రాంతానికి వచ్చి చేరిన ప్రజలు ఇరాన్ స్థానిక ప్రజలకు సమానంగా భావించారు. తరువాత ఇరానియన్ ప్రజలు మహా ఇరాన్ ప్రాంతానికి తరిమివేయబడ్డారు. తరువాత ప్రస్తుత ఇరాన్ భూభాగం మీద పర్షియన్, మెడియన్ మరియన్ పార్థియన్ గిరిజనులు ఆధిక్యత సాధించారు. క్రీ.పూ 10-7 వ శతాబ్దంలో " ప్రి - ఇరానియన్- కింగ్డంస్ " ద్వారా సంఘీభావంగా జీవించిన ఇరానియన్ ప్రజలు ఉత్తర మెసొపటేనియాకు చెందిన అసిరియన్ ఎంపైర్ ఆధిక్యతకు లోనయ్యారు. రాజా సయాక్సెరెస్ పాలనలో మెడేస్, పర్షియన్లు బాబిలోన్‌కు చెందిన నబొపొలస్సార్‌, స్కిథియన్లు, చిమ్మెరియన్లతో కూటమి ఏర్పరుచుకుని అస్సిరియన్ సామ్రాజ్యాన్ని ఎదొర్కొన్నారు. అస్సిరియన్ సామ్రాజ్యంలో క్రీ.పూ 616-615. మద్యలో అంతర్యుద్ధం సాగింది. తరువాత శతాబ్ధాల కాలం సాగిన అస్సిరియన్ పాలన నుండి ఇరాన్ ప్రజలు విడిపించబడ్డారు. . క్రీ.పూ డియోసెల్సా పాలనలో సంఖైఖ్యపరచబడిన మెడియన్ ప్రజలు క్రీ.పూ 612 నాటికి మెడియన్ సామ్రాజ్యస్థాపన చేసారు. వారు సంపూర్ణ ఇరాన్, అనటోలియా మీద ఆధిక్యత సాగించారు. ఇది ఉరార్తు రాజ్యానికి ముగింపుకు రావడానికి కారణం అయింది.

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Ruins of the Gate of All Nations, Persepolis
ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Modern impression of Achaemenid cylinder seal, 5th century BC. A winged solar disc legitimises the conquering Persian king who subdues two rampant Mesopotamian lamassu figures.
ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Tomb of Cyrus the Great, founder of the Achaemenid Empire, Pasargadae

క్రీ.పూ 550 లో మందానే, మొదటి కంబైసెస్ సైరస్ ది గ్రేట్ మేడియన్ సామ్రాజ్యాన్ని స్వాధీనపరచుకుని పరిసర నగరాలను రాజ్యాలను సమ్మిళితం చేస్తూ అచమెనింద్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మెడియా మీద విజయం " పర్షియన్ తిరుగుబాటుగా "గా వర్ణించబడింది. అస్సిరియన్ పాలకుని చర్యలకారణంగా ఉత్తేజితులైన బురౌహా తరువాత వేగంగా ఇతర ప్రాంతాలకు విస్తరించి పర్షియన్లతో కూటమి ఏర్పరుచుకున్నారు. తరువాత సైరస్ నాయకత్వంలో విజాయాలు సాధించి సాంరాజ్యాన్ని లిబియా,బాబిలోన్ పురాతన ఈజిప్ట్ , బాల్కన్‌లోని కొన్ని భాగాలు , యూరప్ వరకు విస్తరించారు. అలాగే ఇది సింధు , అక్సస్ నదుల పశ్చిమ తీరం వరకు విస్తరించింది.

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Achaemenid Empire around the time of Darius I and Xerxes I

అచమెనింద్ సామ్రాజ్యం నల్ల సముద్రం తీర ప్రాంతాలు ఈశాన్య గ్రీస్ , దక్షిణ బల్గేరియా (థారెస్ను) లో చాలావరకు ఇరాన్, అజర్బైజాన్, అర్మేనియా, జార్జియా, టర్కీ యొక్క మోడర్న్ భూభాగాలు చేర్చారు, మేసిడోనియా (Paeonia), ఇరాక్ యొక్క అత్యంత, సిరియా, లెబనాన్, జోర్డాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, సుదూర పశ్చిమ లిబియా, కువైట్, ఉత్తర సౌదీ అరేబియా, UAE , ఒమన్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ యొక్క భాగాలు, మధ్య ఆసియా, పురాతన ఈజిప్ట్ యొక్క అన్ని కేంద్రాలు కలిపిన ప్రాచీన జనాభాతో మొదటి ప్రపంచ అతిబృహత్తర ప్రభుత్వం , అతిపెద్ద సామ్రాజ్యం స్థాపించబడింది. క్రీ.పూ 480 లో స్థాపించబడిన అచమెనిద్ సాంరాజ్యంలో 50 మిలియన్ల ప్రజలు నివసించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనుసరించి ఆసమయంలో అచమెనింద్ పాలనలో ప్రంపంచంలోని 44% ప్రజలు పాలించబడ్డారని భావిస్తున్నారు. ఆకాలంలో జనసంఖ్యా పరంగా అచమెనింద్ సాంరాజ్యం ప్రథమస్థానంలో ఉందని భావిస్తున్నారు. గ్రీక్ చరిత్రలో ఇది శత్రురాజ్యంగా భావించబడి బానిసలుగా పట్టుబడి రాజభవనాలు, రహదారులు , గోపురాల నిర్మాణపుపనులకు నియోగించబడిన యూదులు, బాబిలోనియన్లను విడిపించడానికి ప్రయత్నించారు. చక్రవర్తి ఆధీనంలో అధికారం కేంద్రీకరించబడింది. పౌరసేవ, బృహత్తరసైన్యం మొదలైన పాలనా అభివృద్ధి విధానాలు తరువాత వెలసిన సాంరాజ్యాలకు ప్రేరణకలిగించింది. అచమెనింద్ సాంరాజ్యంలో క్రీ.పూ 352-350 మద్య పురాతన ప్రపంచ 7 అద్భుతాలలో ఒకటైన " హలికర్నాసస్ మౌసోలియం" నిర్మించబడింది. లోనియన్ తిరుగుబాటు ఆరంభమై అది గ్రీకో- పర్షియన్- యుద్ధాలుగా పరిణమించి క్రీ.పూ 5వ శతాబ్దం అర్ధభాగం వరకు కొనసాగాయి. పర్షియన్లు బాల్కన్, తూర్పు యురేపియన్ యురేపియన్ భూభాలనుండి వైదొలగడంతో యుద్ధం ముగింపుకు వచ్చింది.

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
A bas-relief at Naqsh-e Rostam, depicting the victory of Shapur I over Valerian, following the Battle of Edessa

క్రీ.పూ 334 లో మహావీరుడు అలెగ్జాండర్ అచమెనింద్ సామ్రాజ్యం మీద దండెత్తి ఇస్సస్ యుద్ధంలో చివరి అచమెనింద్ చక్రవర్తి మూడవ డారియస్ మీద విజయం సాధించాడు. అలెగ్జాండర్ చిన్న వయసులోనే మరణించడంతో ఇరాన్ సెలెయుసిడ్ సామ్రాజ్యానికి చక్రవర్తి హెలెనిస్టిక్ చక్రవర్తి వశపరచుకున్నాడు. 2వ శతాబ్దం అర్ధభాగంలో తలెత్తిన పార్ధియన్ సామ్రాజ్యం ఇరాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. తరువాత పర్షియన్-రోమన్ల మద్య శతాబ్ధకాల విరోధం కొనసాగింది. విరోధం కారణంగా పలు రోమన్- పార్ధియన్ యుద్ధాలు కొనసాగాయి. తరువాత 5 శతాబ్ధాలకాలం భూస్వామ్య ప్రభుత్వం కొనసాగింది. సా.శ. 224 లో ఇరాన్ సస్సనిద్ సామ్రాజ్యం వశం అయింది. బైజంటైన్ సామ్రాజ్యం తనపొరుగున ఉన్న శత్రుసామ్రాజ్యంతో అవి రెండు శక్తివంతమైన రెండు రాజ్యాంగశక్తులుగా 4 శతాబ్ధాలకాలం నిలిచాయి.

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Sassanid reliefs at Taq Bostan

అచమెనింద్ మద్య సరిహద్దులను ఏర్పరుస్తూ సస్సనిడ్లు స్టెసిఫోన్ రాజధానిగా చేసుకుని సామ్రాజ్యస్థాపన చేసారు. సస్సనిద్ సామ్రాజ్యం ఉనికిలో ఉన్న కాలం ఇరాన్ ప్రభావంతమైన కాలంగా భావిస్తున్నారు. పురాతన రోం సంస్కృతి ఆఫ్రికా సంస్కృతి చైనా సంస్కృతి, భారతీయ సంస్కృతి ఇరాన్‌ను ప్రభావితం అధికంగా ఉంది. ఇవి ప్రాముఖ్యత సంతరించుకున్న మెడీవల్ కళ తూర్పు ఆసియా కళా రూపుదిద్దుకోవడంలో ప్రధానపాత్ర వహించాయి. పర్షియన్, సస్సనిద్ సామ్రాజ్యాలలో అత్యధికప్రాంతాలలో రోమన్ - పర్షియన్ యుద్ధపర్యవసనాల నీడ ప్రసరించింది. రోమన్లు పశ్చిమతీరంలో అనటోలియా, పశ్చిమ కౌకాసస్, మెసపటోమియా, లెవంత్ 700 సంవత్సరాలు నిలిచిఉన్నారు. ఈ యుద్ధాలు రోమన్లు, సస్సనింద్ సామ్రాజ్యాలు అరబ్బుల చేతిలో అపజయం పొందడానికి కారణం అయిమ్యాయి.

అచమెనింద్ సంతతి ప్రజలు పర్షియన్లు, సస్సనిదులు స్థాపించిన రాజ్యాలు శాఖలు అనటోలియా, కౌకాసస్, పొంటస్,మిహ్రందీలు, అరససిద్ సామ్రాజ్యాలు, డాగెస్తాన్ ప్రాంతాలలో ఏర్పాటుచేయబ డ్డాయి.

మద్యయుగం

దీర్ఘకాలం బైజాంటైన్ - సస్సనిద్ యుద్ధాలు కొనసాగాయి. వీటిలో బైజాంటైన్- సస్సనిద్ యుద్ధం 602-628 వరకు కొనసాగింది. సస్సనిద్ సామ్రాజ్యం అంతర్యుద్ధాలు ముగింపుకు వచ్చిన తరువాత 7వ శతాబ్దంలో ఇరాన్ మీద అరబ్ దాడికి దారితీసింది. ఆరంభంలో అరబ్ రషిదున్ కాలిఫేట్ చేతిలో ఓటమి పొందిన తరువాత ఇరాన్ అరబ్ కాలిఫేట్ ఆధీనం అయింది. ఇరాన్‌లో ఉమ్మయద్ కాలిఫేట్, అబ్బాసిద్ కాలిఫేట్‌లు పాలించారు.అరబ్ దండయాత్ర తరువాత దీర్ఘకాలం ఇరాన్ ఇస్లాం మతరాజ్యంగా మార్చబడింది. రషిదున్ కాలిఫేట్, ఇమయత్ కాలిఫేట్ మవాలి, నాన్ కనవర్టెడ్ (దిమ్మీ) ఇరానీయుల పట్ల వివక్ష చూపబడింది. వారిని ప్రభుత్వోద్యాగాలకు, సైనిక ఉద్యోగాలకు దూరం చేస్తూ అదనంగా వారికి జిజ్యా సుంకం విధించబడింది. గుండే షపూర్‌లో " అకాడమీ ఆఫ్ గుండే షపూర్ " స్థాపించబడింది. ఆసమయంలో ఇది ప్రపంచ వైద్యకేంద్రంగా విలసిల్లింది. దండయాత్ర తరువాత సజీవంగా నిలిచిన అకాడమీ ఇస్లామిక్ సంస్థ " గా నిలిచింది.

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Tomb of Hafez, the popular Iranian poet whose works are regarded as a pinnacle in Persian literature, and have left a considerable mark on later Western writers, most notably Goethe, Thoreau, and Emerson

750లో అబ్బాసిదులు ఉమ్మయాదులను త్రోసి మవాలీ ఇరానియన్లకు మద్దతుగా నిలిచారు. మవాలి తిరుగుబాటు సైన్యాలను సమీకరించారు. సైన్యానికి అబు ముస్లిం నాయకత్వం వహించారు. అబ్బాసిద్ కాలిఫాల రాక తరువాత ఇరానియన్ సంస్కృతి , ప్రభావం తిరిగి వికసించింది. తరువాత అరబ్ సంప్రదాయాలు తొలగించబడ్డాయి. అరబ్ కులీనవిధానం స్థానంలో క్రమంగా ఇరానియన్ రాజ్యాంగ విధానం పునరుద్ధరించబడింది.

2శతాబ్ధాల అరబ్ పాలన తరువాత అబ్బాసిద్ కలిఫేట్ క్షీణదశ తరువాత తహ్రిదీ, సఫరిద్, సమనిద్ , బుయిద్ అర్ధస్వతంత్ర , పూర్ణస్వతంత్ర రాజ్యాలు వెలిసాయి. 9-10 శతాబ్ధాలలో సమనిద్ శకం ఆరంభమైన తరువాత ఇరానియన్లు తమ స్వాతంత్రం తిరిగి స్థిరపరచుకున్నారు. ఇరానియన్ సాహిత్యం, ఇరానియన్ తాత్వికవాదం, వైద్యపరమైన శాస్త్రీయ , సాంకేతికత , ఇరానియన్ కళలు అభివృద్ధి సరికొత్త ఇరానియన్ సంస్కృతి అభివృద్ధి రూపొందింది. ఈ కాలాన్ని " ఇస్లామిక్ స్వర్ణయుగం " గా వర్ణించబడింది.

ఇస్లామిక్ స్వర్ణయుగం

ఇస్లామిక్ స్వర్ణయుగం 10-11 శతాబ్ధాల నాటికి శిఖరాగ్రం చేరుకుంది. శాస్త్రీయదృక్పథాలకు ఇరాన్ ప్రధానప్రాంతం అయింది. 10శతాబ్దం తరువాత పర్షియన్ భాషతో అరబిక్ భాషలు శాస్త్రీయ, తాత్విక, చారిత్రక, సంగీత , వైద్యశాస్త్రాలకు ఉపయోగించబడ్డాయి. నాసిర్ అల్-దిన్ అల్- తుసి, అవిసెన్నా, కొతుబ్ అల్-దిన్ షిరాజ్, బిరున్ మొదలైన ఇరానియన్ రచయితలు శస్త్రీయ రచనలు చేయడంలో ప్రధానపాత్ర వహించారు. అబ్బాసిద్ శకంలో సంభవించిన సంస్కృతి పునరుజ్జీవనం ఇరాజియన్ జాతీయతను గుర్తించేలా చేసింది. గతంలో ఇరాన్‌లో చేసిన అరబినీయత తిరిగి పునరావృతం కాలేదు. ఇరానియన్ షూబియా ఉద్యమం అరబ్ ప్రభావం నుండి ఇరానీయులు స్వతంత్రం పొందేలా చేసింది. ఉద్యమఫలితంగా పర్షియన్ భాషా కావ్య రచయిత " ఫెర్డోస్ " ను వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఫెర్డోస్‌కు ఇరానియన్ సాహిత్యంలో శాశ్వతస్థానం ఉంది. 10వ శతాబ్దంలో టర్కీ నుండి గిరిజనులు మద్య ఆసియా నుండి ఇరాన్ పీఠభూమికి మూకుమ్మడిగా వలసవచ్చి స్థిరపడ్డారు. ఆరంభంలో అబ్బాసిద్ సైన్యంలో. ఇరానియన్ , అరబ్ స్థానంలో టర్కిక్ గిరిజనయువకులు బానిస సైన్యం (మమ్లుల్క్స్) గా నియమించబడ్డారు. ఫలితంగా బానిససైన్యం రాజకీయాధికారం సంపాదించారు.

ఘజ్నవిద్

999 లో ఇరాన్‌లో అధికభాగం ఘజ్నవిద్ వశం అయింది. ఘజ్నవిద్ పాలకుడు మమ్లక్ టర్కీ సంతతికి చెందినవాడు. తరువాత సెల్జుక్ చక్రవర్తి , ఖ్వరేజ్మైన్ చక్రవర్తి ఇరాన్‌ను పాలించారు. ఈ టర్కీ పాలకులు పర్షియన్లుగా , పర్షియన్ నిర్వహణ , పాలనను అనుసరించారు. తరువాత సెల్జుక్లు ఒకవైపు సంపూఋణ పర్షియన్ గుర్తింపుతో అనటోలియాలో రుం సుల్తానేట్ అభివృద్ధి చెందడానికి అవకాశం ఇచ్చారు. పర్షియన్ సంస్కృతి దత్తు తీసుకుని టర్కీ పాలకులు సరికొత్త టర్కీ- పర్షియన్ సంస్కృతి జనించడానికి అభివృద్ధిచెందడానికి అవకాశం ఇచ్చారు. 1291-21 మద్య ఖ్వరెజ్మైన్ సాంరాజ్యం చంఘిస్ఖాన్ నాయకత్వంలో సాగిన మంగోల్ దండయాత్రతో ధ్వంశం చేయబడింది. స్టీవెన్ ఆర్.వర్డ్ అభిప్రాయంలో " మంగోలియన్ దండయాత్రలో జరిగిన హింసలో ఇరానియన్ పీఠభూమిలో నివసిస్తున్న ప్రజలలో మూడు వంతుల ప్రజలు (10-15 మిలియన్ ప్రజలు) వధించబడ్డారు " అని వర్ణించబడింది. మరికొంతమంది చరిత్రకారులు 20వ శతాబ్దం వరకు ఇరాన్ ప్రజల సంఖ్య మంగోలియన్ దండయాత్రకు ముందున్న స్థాయికి చేరుకోలేదని భావిస్తున్నారు. మంగోల్ సాంరాజ్యం విభజితం అయిన తరువాత 1256లో చంగిస్ఖాన్ మనుమడు హులగుఖాన్ ఇరాన్‌లో ఇల్ఖనేట్ సాంరాజ్యం స్థాపించాడు. 1370 లో తైమూర్ ఇరాన్‌ను వశపరచుకుని తైమూర్ సాంరాజ్యస్థాపన చేసాడు. తరువాత 156 సంవత్సరాల కాలం తైమూర్ సాంరాజ్యపాలన కొనసాగింది. 1387 లో తైమూర్ ఇస్ఫాహన్ మూకుమ్మడి హత్యలకు ఆదేశాలుజారీ చేయడంతో 70,000 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇల్ఖాన్లు , తైమూరులు వేగంగా ఇరానీయుల జీవబమార్గాన్ని ఎంచుకుని జీవించారు. ఫలితంగా ఇరాన్ సంస్కృతికి భిన్నంగా ఇరాన్‌లో మరొక సంస్కృతి రూపుదిద్దుకున్నది.

ఆరంభకాల ఆధునిక యుగం

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
A Venetian portrait of Ismail I, founder of the Safavid Dynasty – the Uffizi Gallery

1500 నాటికి అర్దాబిల్ నుండి ఇస్మాయిల్ తబ్రిజ్ రాజధానిగా చేసుకుని సఫావిద్ సాంరాజ్యస్థాపన చేసాడు. . ఆరంభంలో అజర్బైజన్‌తో ఇరానియన్ భూభాగమంతా అధికారాన్ని విస్తరించాడు. తరువాత సమీపప్రాంతాలను కూడా అధికారపరిధిలోకి తీసుకువచ్చి మహా ఇరాన్ (గ్రేటర్ ఇరాన్) అంతటా ఇరానీ గుర్తింపు కలుగజేసాడు. ఇస్మాయిల్ సఫావిద్ సాంరాజ్యంలో సున్నీ , షియా స్థానంలో ఇరానీ సున్నియిజం వచ్చేలా చేసాడు. షియా ఇస్లాం విస్తరించి ఉన్న కౌకాసస్, ఇరాన్,అనటోనియా , మెసపటోనియా ఇరానీ సున్నీయిజం విస్తరించింది. ఫలితంగా ఆధునిక ఇరాన్ , రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజన్ మాత్రమే అధికారిక షియా ముస్లిం దేశాలుగా గుర్తించబడుతున్నాయి. రెండు దేశాలలో షియా ముస్లిముల ఆధిఖ్యత ఉంది. అలాగే రెండు దేశాలు షియా ముస్లిం సఖ్యలో ప్రధమ , ద్వితీయ స్థానాలలో ఉన్నాయి. సఫావిద్ , ఆటమిన్ సాంరాజ్యాల మద్య నెలకొన్న శతాబ్ధాల భౌగోళిక , సిద్ధాంతాల శతృత్వం పలు " ఆటమిన్ - పర్షియన్" యుద్ధాలకు దారితీసింది. అబ్బాస్ ది గ్రేట్ కాలంలో (1587-1629) లలో సఫావిద్ శకం శిఖరాగ్రం చేరింది. చుట్టూ ఉన్న ఆటమిన్ శత్రువులను ఆణిచివేసి సామ్రాజ్యాన్ని పశ్చిమ యురేషియాలో శాస్త్రీయ, కళాకేంద్రంగా మార్చబడింది. సఫావిద్ కాలంలో కౌకాసస్ ప్రజలు అధికంగా ఇరాన్ ప్రజలతో సమ్మిళితం కావడం తరువాత పలు శతాబ్ధాలకాలం ఇరాన్ చరిత్ర మీద ప్రభావం చూపింది. ఆటమిన్‌తో నిరంతర యుద్ధాలు, అంతర్యుద్ధాల, విదేశీ జోక్యం (ప్రధానంగా రష్యా జోక్యం) కారణంగా 1600 చివర - 1700 ఆరంభకాలం నాటికి సామ్రాజ్యం క్షీణదశకు చేరుకుంది. పష్టన్ 1722లో తిరుగుబాటుదారులు ఇస్ఫాహన్ స్వాధీనపరుచుకుని సుల్తాన్ హుస్సైన్‌ను ఓడించి హొతకి సామ్రాజ్యస్థాపన చేసారు.

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Statue of Nader Shah, founder of the Afsharid Dynasty – the Naderi Museum

నాదిర్షా

1729లో ఖొరసన్ నుండి సైనికాధికారి, సైనికవ్యూహ నిపుణుడు నాదిర్షా విజయవంతంగా పష్టన్ ఆక్రమణదారులను తరిమివేసాడు. తరువాత నాదిర్షా తిరిగి స్వాధీనం చేసుకున్న కౌకాసిన్ భూభాగాలు కాంస్టాంటినోపుల్ (1724) ఒప్పందం ద్వారా ఆటమిన్, రష్యాలకు విభజించబడి ఇవ్వబడ్డాయి. స్సనిద్ పాలన తరువాత నాదిర్షా పాలనలో ఇరాన్ అత్యున్నత స్థానం చేరుకుంది. కౌకాసస్, పశ్చిమ ఆసియా ప్రధాన భూభాగాలు, మద్య ఆసియాలో ఇరానియన్ ఆధిపత్యం తిరిగి స్థాపించబడింది. ఆసమయంలో ఇరాన్ అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా మారింది. 1730లో నాదిర్షా భారతదేశం మీద దండేత్తి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. నాదిర్షా భూభాగ విస్తరణ, సైనిక విజయాలు ఉత్తర కౌకాసస్‌లో డాగేస్థాన్ యుద్ధంతో ముగింపుకు వచ్చాయి.

జంద్ సాంరాజ్యం

నాదిర్షా హత్య తరువాత ఇరాన్‌లో స్వల్పకాలం అల్లర్లు, అంతర్యుద్ధాలు కొనసాగాయి. 1750లో కరీం ఖాన్ జంద్ సామ్రాజ్యస్థాపన చేసిన తరువాత ఇరాన్‌లో శాతి, సుసంప్పన్నత నెలకొన్నది. భౌగోళికంగా మునుపటి ఇరాన్ సామ్రాజ్యాలతో పోల్చితే జంద్ సామ్రాజ్యం పరిమితమైనది.కౌకాసస్ ప్రాంతంలోని పలు ప్రాంతాలు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. అలాగే ప్రాంతీయంగా పలు కౌకాసస్ ఖనాటేలు పలనాధికారం చేపట్టారు. అయినప్పటికీ స్వయంపాలనకు బదులుగా రాజులంతా జంద్ చక్రవర్తికి సామంతులుగా నిలిచారు. కనాటేలు మద్య ఆసియాలోని వ్యాపార మార్గాల మద్య విదేశీ వాణిజ్యాధికారం దక్కించుకున్నారు.

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
A map showing the northwestern borders of Iran in the 19th century, with the modern-day Eastern Georgia, Dagestan, Armenia, and Azerbaijan, before being ceded to the Imperial Russia by the Russo-Persian Wars

ఆఘా మొహమ్మద్ ఖాన్

1779లో కరీం ఖాన్ తరువాత మరొక అంతర్యుద్ధం చెలరేగింది. అంతర్యుద్ధం ఫలితంగా 1794లో " ఆఘా మొహమ్మద్ ఖాన్ " తలెత్తి క్వాజర్ సామ్రాజ్యస్థాపన చేసాడు. జార్జియన్ అవిధేయత, జార్జ్విస్క్ ఒప్పందంతో గార్జియన్ రష్యా కూటమి ఏర్పాటు, క్రత్సనిస్ యుద్ధంలో క్వజార్లు త్బ్లిసిని వశపరచుకోవడం మొదలైన విషయాలు రష్యన్లను కౌకాసస్‌ను విడిచిపోయేలా చేసింది. తరువాత కొంతకాలం తిరిగి ఇరానియన్ పాలన పునరుద్ధరించబడింది. 1804-1813 మద్య సంభవించిన రుస్సో-పర్షియన్ యుద్ధాలు, 1826-1828 మద్య సంభవించిన రుస్సో పర్షియన్ యుద్ధం ఫలితంగా ఇరాన్ త్రాంస్కౌకాసియా, డాగేస్థాన్ ప్రాంతాలను కోల్పోయింది. మూడు శతాబ్దాలుగా ఇరాన్‌లో భాగంగా ఉన్న ప్రాంతాలను కోల్పోవడం ఇరాన్‌ను కోలుకోలేనంతగా బాధించింది. ఇది పొరుగున ఉన్న రష్యా సామ్రాజ్యానికి తగినంత లాభం చేకూర్చింది. 19వ శతాబ్ధపు రుస్సో- పర్షియన్ యుద్ధాల ఫలితంగా రష్యన్లు కాకసస్ భూభాగం అంతటినీ స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్ అంతర్భాగంగా ఉన్న డాగెస్థాన్, జార్జియా, అర్మేనియా, అజర్బైజన్ భూభాగాలను శాశ్వతంగా కోల్పోయింది. అరాస్ నది ఉత్తరభాగంలో ప్రస్తుత అజర్బైజన్, జార్జియా, డాగెస్థాన్, అర్మేనియా 19వ శతాబ్దంలో రష్యన్లు ఆక్రమించేవరకు ఇరాన్ ఆధీనంలో ఉన్నాయి. ఇరాన్ లోని ట్రాంస్కౌకాసస్, నార్త్ కౌకాసస్ భూభాగాలను రష్యా ఆక్రమించిన తరువాత ఈ ప్రాంతాలలోని ముస్లిములు ఇరాన్ వైపు తరలి వెళ్ళారు. ఆర్మేనియన్లు కొత్తగా రూపొందించబడిన రష్యా భూభాలలో నివసించడానికి మొగ్గుచూపారు. .

సమీపకాల ఆధునిక యుగం

1870-1871 మద్యకాలంలో సంభవించిన కరువులో దాదాపు 1.5 మిలియన్ల ప్రజలు (మొత్తం జనసంఖ్యలో 20-25%)మరణించారని అంచనా.

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
The first national parliament of Iran, established in 1906

1872, 1905 మధ్య క్వాజర్కు చెందిన నాజర్ ఉద్దిన్ షా, మొజాఫర్ క్వాజర్ ఉద్దిన్ షా, విదేశీయుల అమ్మకానికి రాయితీలు ఇచ్చినందుకు ప్రతిస్పందనగా వరుస నిరసనలు ఎదురైయ్యాయి. ఈ సంఘటనలు మొదటి ఇరానియన్ రాజ్యాంగవిప్లవానికి దారితీసాయి. కొనసాగుతున్న విప్లవం ద్వారా, 1906 లో ఇరాన్ మొదటి రాజ్యాంగం ఇరాన్, మొదటి జాతీయ పార్లమెంట్ స్థాపించబడ్డాయి.. ఇరాన్ రాజ్యాంగసవరణలలో మూడు మతపరమైన అల్పసంఖ్యాకులకు (క్రైస్తవులు, జొరాస్ట్రియన్లు, యూదులు) అధికారిక గుర్తింపు ఇవ్వబడింది. అప్పటి నుండి ఇరాన్ చట్టానికి ఇవి ఆధారభూతంగా ఉన్నాయి. 1911లో మొహమ్మద్ అలీ షా ఓడించబడి పదవీచ్యుతుడు అయ్యేవరకు రాజ్యాంగ కలహాలు కొనసాగాయి. పరిస్థితి చక్కదిద్దే నెపంతో రష్యా 1911లో ఉత్తర ఇరాన్‌ను ఆక్రమించి ఆక్రమిత ప్రాంతంలో సంవత్సరాల కాలం సైన్యాలను నిలిపిఉంచింది. ప్రపంచయుద్ధం సమయంలో బ్రిటన్ ఇరాన్ లోని అధిక భూభాగం ఆక్రమించి 1921 నాటికి పూర్తిగా వెనక్కు తీసుకుంది.ప్రపంచయుద్ధం మిడిల్ ఇష్టర్న్ థియేటర్‌లో భాగంగా మొదటి ప్రపంచయుద్ధం సమయంలో ఆటమిన్ దంయాత్ర కారణంగా పర్షియన్ యుద్ధం ఆరంభం అయింది. ఆటమిన్ ప్రతీకారాఫలితంగా ఇరాన్ సరిహద్దుప్రాంతాలలోని ఉర్మియా లోపల, పరిసరాలలో ఉన్న అస్సిరియన్ ప్రజలను ఆటమిన్ సైన్యం మూకుమ్మడిగా సంహరించింది. అక్వా మొహమ్మద్ ఖాన్ పాలనలో క్వాజర్ పాలన ఒకశతాబ్ధకాలం అసంబద్ధ పాలనగా గుర్తించబడింది. 1921లో క్వాజర్ సామ్రాజ్యం పహలవి సామ్రాజ్యానికి చెందిన రేజా ఖాన్ చేత పడగొట్టబడింది. తరువాత రేజా ఖాన్ ఇరాన్ సరికొత్త షా అయ్యాడు.

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Mohammad Reza Pahlavi and the Imperial Family in the Coronation of the Shah of Iran, 1967

1941లో షాను ఆయన కుమారుడు మొహమ్మద్ రేజా పహలవి చేత పదవీచ్యుతుని చేసాడు. తరువాత మొహమ్మద్ రేజా పహలవి పర్షియన్ కారిడార్ స్థాపన చేసాడు. బృహత్తర సరఫరా మార్గం అయిన పర్షియన్ కారిడార్ తరువాత సంభవించిన యుద్ధం వరకు ఉనికిలో ఉంది. ఇరాన్‌లోని పలు విదేశీబృందాలు సోవియట్ యూనియన్‌తో చేరి ఇరాన్‌లో రెండు పప్పెట్ (కీలు బొమ్మ) రాజ్యాలను (అజర్బైజన్ పీపుల్స్ గవర్నమెంటు, రిపబ్లిక్ ఆఫ్ మొహబద్) స్థాపించాయి. సోవియట్ యూనియన్ ఆక్రమిత ఇరాన్ భూభాగాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది. 1946 ఇరాన్ క్రైసిస్ ఫలితంగా రెండు పప్పెట్ రాజ్యాలు, సోవియట్ ఆక్రమిత ప్రాంతాల విడుదల సాధ్యం అయింది.

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Mohammad Mosaddegh, democracy advocate and deposed Prime Minister of Iran

1951లో మొహమ్మద్ మొసడెగ్ ప్రధానమంత్రిగా ఎన్నిక చేయబడ్డాడు. పెట్రోలియం పరిశ్రమ, ఆయిల్ నిలువలు జాతీయం చేసిన తరువాత మొహమ్మద్ మొసడెగ్ ఇరాన్‌లో ప్రాంఖ్యత సంతరించుకున్నాడు. 1953లో మొహమ్మద్ మొసడెగ్ పదవి నుండి తొలగించబడ్డాడు. ఆగ్లో- అమెరికన్ కూటమితో నిర్వహించబడిన ఈ సంఘటన కోల్డ్ వార్ సమయంలో మొదటిసారిగా యు.ఎస్ విదేశీప్రభుత్వాన్ని పడగొట్టడంగా గుర్తించబడింది. ఈ సంఘటన తరువాత షా సుల్తాన్ అయ్యాడు. తరువాత ఇరాన్ ఏకచత్రాధిత్యం, సుల్తానిజం పునరుద్ధరించబడ్డాయి. తరువాత కొన్ని దశాబ్ధాలకాలం ఇరాన్- యునైటెడ్ స్టేట్స్ మరి కొన్ని విదేశీ సత్సంబంధాలు కొనసాగాయి. షా ఇరాన్‌ను మతాతీత రాజ్యంగా, ఆధునికీకరణ చేయడంలో సఫలీకృతం అయినప్పటికీ మరొకవైపు ఇరాన్‌లో రహస్యపోలీస్ చర్యలతో ఏకపక్ష ఖైదులు, హింస అధికం అయ్యాయి. ది సవక్ (ఎస్.ఎ.వి.ఎ.కె) మొత్తం రాజకీయ వ్యతిరేకతను అణిచివేసింది.

అయతుల్లాహ్ రుహొల్లాహ్ ఖోమేని షా " వైట్ రివల్యూషన్ "కు క్రియాశీలక విమర్శకుడు అవడమే కాక బహిరంగంగా ప్రభుత్వాన్ని విమర్శించాడు. ఖోమేని 18 సంవత్సరాలకాలం ఖైదు చేయబడ్డాడు. 1964లో ఖోమేని విడుదల చేయబడిన తరువాత ఖోమేని బహిరంగంగా యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వాన్ని విమర్శించాడు. షా ఖోమేనిని దేశబహిషృతుని చేసాడు. ఖోమేని మొదటిసారిగా టిబెట్ చేరి ఆతరువాత ఇరాక్ ఆతరువాత ఫ్రాంస్ చేరాడు.

1973లో ఆయిల్ ధరలు అధికరించిన సమయంలో ఇరాన్ విదేశీమారకం నిలువలు వరదలా అధికరించాయి. అందువలన ఇరాన్ ద్రవ్యోల్భణ సమస్యను ఎదుర్కొన్నది. 1974లో ఇరాన్ ఆర్ధికం రెండంకెల ద్రవ్యోల్భణం సమస్యను ఎదుర్కొన్నది. దేశంలో బృహత్తర పరిశ్రమలు ఆధునికీకరణ చేయబడ్డాయి. దేశంలో లంచగొండితనం అధికరించింది. 1970-1975 ఇరానియన్ విప్లవానికి దారితీసింది. 1975-1976 ఎకనమిక్ రీసెషన్ నిరోద్యగదమస్య అధికరించడానికి దారితీసింది. 1970 ఆర్ధికాభివృద్ధి సమయంలో మిలియన్ల కొద్దీ యువకులు ఇరాన్ నగరాలకు తరలి నిర్మాణరంగంలో పనిచేయడానికి వెళ్ళారు. 1977 లో వీరిలో అత్యధికులు షా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బహిరంగంగా విమర్శిమే వారి జాబితాలో చేరుకున్నారు.

1979 రివల్యూషన్ తరువాత

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Ruhollah Khomeini returning to Iran after 14 years exile, on February 1, 1979

1979 విప్లవం తరువాత " ఇస్లామిక్ విప్లవం "గా వర్ణించబడింది. విప్లవం 1978 లో షాకు వ్యతిరేకంగా ప్రధాన వివరణలు తరువాత మొదలైంది. ఇరానియన్ విప్లవం , ఇరానియన్ డిమాంస్ట్రేషన్లు ఆరంభం అయిన ఒక సంవత్సరం తరువాత షా దేశబహిష్కరణ , ఖోమేని ప్రవేశం జరిగాయి. షా టెహ్రాన్‌కు పారిపోగా ఖోమేని ఇరాన్‌లో ప్రవేశించాడు. 1979లో ఇరాన్‌లో కొత్త ప్రభుత్వం రూపొందించబడింది. ఇరానియన్ రిపబ్లిక్ రెఫరెండం తరువాత 1979 ఏప్రెల్ మాసంలో ఇరాన్ అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్ అయింది. 1979 లో రెండవ ఇరానియన్ రిఫరెండం ద్వారా " ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ " అంగీకారం పొందింది. అతి త్వరలో దేశవ్యాప్తంగా కొత్తప్రభుత్వానికి వ్యతిరేకత తలెత్తింది. 1979 కుర్దేష్ రిబెల్లియన్, 1979 ఖుజెస్థాన్ తిరుగుబాటు, సిస్తాన్ , బలూచీస్థాన్ తిరుగుబాటు , ఇతర ప్రాంతాలలో తిరుగుబాటు మొదలైనవి తలెత్తాయి. తరువాత కొన్ని సంవత్సరాలకాలం తిరుగుబాట్లు కొనసాగాయి. కొత్త ప్రభుత్వం ఇస్లామేతర రాజకీయ ప్రత్యర్ధులను అణిచివేతకు గురిచేసింది. నేషనలిస్టులు , మార్కిస్టులు ఆరంభంలో ఇస్లాం ప్రజలతో కలిసి షాను పడగొట్టారు. తరువాత ఇస్లాం ప్రభుత్వం లక్షలాది మందిని వధించింది. 1979 నవంబర్ 4న ముస్లిం స్టూడెంట్ ఫాలోవర్స్ ఆఫ్ ది ఇమాం లైన్ " యు.ఎస్ దౌత్యకార్యాలయం మీద దాడిచేసింది. మొహమ్మద్ రేజ్ పహలవి ఇరాన్ రావడానికి మరణశిక్షను ఎదుర్కొనడానికి యు.ఎస్ నిరాకరించడంతో జిమ్మీ కార్టర్ ఇరాన్ నిర్బంధంలో ఉన్న అమెరికన్లను విడిపించడానికి చేసిన రాజీ ప్రయత్నాలు, ఆపరేషన్ ఇగల్ క్లా విఫలం కావడం రోనాల్డ్ రీగన్ అమెరికా అద్యక్షపదవికి రావడానికి కారణం అయింది. జిమ్మీ కార్టర్ చివరి అధికార దినం రోజున చివరి నిర్బంధితుడు విడుదల చేయబడ్డాడు.

1980 సెప్టెంబరు 22న ఇరాకి సైన్యం ఇరాన్ లోని ఖుజెస్థాన్ మీద దాడి చేసింది. తరువాత ఇరాన్- ఇరాక్ యుద్ధం ఆరంభం అయింది. సదాం హుస్సేన్ సైన్యాలు ఆరంభంలో ముందుకు చొచ్చుకు పోయినప్పటికీ 1982 మద్య కాలానికి ఇరాన్ సైన్యాలు విజయవంతంగా ఇరాకీ సైన్యాలను తిప్పికొట్టాయి. 1982 జూలై నాటికి ఇరాక్ స్వీయరక్షణ చేసుకొనవలసిన పరిష్తితికి చేరుకుంది. ఇరాన్ ఇరాక్ మీద దాడిచేయసంకల్పించి అనేక ప్రయత్నాల తరువాత బస్రా మొదలైన ఇరాకీ నగరాలను వశపరచుకుంది. 1988 వరకు యుద్ధం కొనసాగింది. తరువాత ఇరాకీ సైన్యం ఇరాక్ లో ఉన్న ఇరాన్ సైన్యాలను ఓడించి సరిహద్దు వరకు తిప్పికొట్టింది. తరువాత ఖోమేని ఐక్యరాజ్యసమితి నిర్ణయానికి తల ఒగ్గాడు. యుద్ధంలో 123,220–160,000 సైనికులు మరణించారు. 60,711 మంది తప్పి పోయారు. 11,000-16,000 పౌరులు మరణించారు..

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Silent Demonstration – the 2009–10 Iranian election protests

ఇరాన్- ఇరాక్ యుద్ధం తరువాత 1989 లో అక్బర్ హషెమి రఫ్స్తంజాని, ఆయన ప్రభుత్వం వ్యాపార అనుకూల కార్యసాధక విధానం స్థాపన చేయడానికి దృష్టికేంద్రీకరించారు. 1997లో రఫ్స్తంజానిని వెన్నంటి మొహమ్మద్ ఖటామీ ఇరాన్ సంస్కరణ ఆరద్శంతో పదవిని అలంకరించాడు. ఆయన ప్రభుత్వం దేశాన్ని అత్యంత స్వతంత్రం చేయడంలో సఫలత సాధించడంలో విఫలం అయింది.

2005 ఇరానియన్ అధ్యక్ష ఎన్నికలు పాపులిస్ట్ కంసర్వేటివ్ అభ్యర్థి మొహమ్మద్ అహ్మదెనెజాదీని అధికారపీఠం అధింష్టించేలా చేసాయి. . 2009 ఇరానియన్ అధ్యక్ష ఎన్నికలలో అహ్మదెనెజాదీ 62.63% ఓట్లను స్వంతంచేసుకోగా ప్రత్యర్థి మీర్- హుస్సేన్- మౌసవి 33.75% ఓట్ల్లతో రెండవ స్థానంలో నిలిచాడు. . 2009లో అత్యధికంగా అక్రమాలు జరిగాయని అభియోగాలు తలెత్తాయి. 2013 జూన్ 15 లో మొహమ్మద్ బఘేర్ ఘలిబాఫ్‌ను ఓడించి హాసన్ రౌహానీ అధ్యక్షుడుగా ఎన్నుకొనబడ్డాడు. కొత్త అధ్యక్షుడు హాసన్ రౌహానీ ఇతరదేశాలతో ఇరాన్ సంబంధలను అభివృద్ధి చేసాడు.

భౌగోళికం

ఇరాన్ 1648195 చ.కి.మీ వైశాల్యంతో ప్రపంచ 18 అతిపెద్ద దేశాల జాబితాలో ఒకటిగా ఉంది. 1,648,195 km2 (636,372 sq mi) . వైశాల్యపరంగా ఇరాన్ దాదాపు యునైటెడ్ కింగ్డం, ఫ్రాంస్, జర్మనీలకు సమానం. అలాగే యు.ఎస్ స్టేట్ అలాస్కా కంటే కొంచం అధికం. ఇరాన్ 24°-40° డిగ్రీల ఉత్తర అక్షాంశం, 44°-64° డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. వాయవ్య సరిహద్దు దేశాలుగా అజర్బైజన్ (179 km (111 mi), ఆర్మేనియా, ఉత్తర సరిహద్దులో కాస్పియన్ సముద్రం, ఈశాన్య సరిహద్దులో తుర్క్మేనిస్థాన్, తూర్పు సరిహద్దులో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, పశ్చిమ సరిహద్దులో టర్కీ, ఇరాక్ఉన్నాయి. దక్షిణంలో పర్షియాగల్ఫ్, ఓమన్ ఉన్నాయి.

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Mount Damavand, Iran's highest point, is located in Amol County, Mazanderan.

ఇరాన్ లోని ఇరాన్ పీఠభూమి కాస్పియన్ సముద్రం నుండి ఖుజెస్థాన్ వరకు విస్తరించి ఉంది. ఇరాన్ ప్రపంచంలోని అత్యధిక పర్వతప్రాంతం కలిగిన దేశాలలో ఒకటిగా ప్రత్యేకత కలిగి ఉంది. ఇరాన్ భూభాంలో కఠినమైన పర్వతభాగం ఆధిక్యత కలిగి ఉంది. పర్వభూభాగం పలు నదీప్రవాహాలను, పీఠభూములను ఒకదానితో ఒకటి వేరుచేస్తూ ఉంటుంది. జనషాంధ్రత అధికంగా కలిగిన పశ్చిమభూభాగంలో కౌకాసస్ పర్వతాలు, జాగ్రోస్ పర్వతాలు, అల్బోర్జ్ పర్వతాలు (ఇది ఇరాన్‌లో అత్యధిక ఎత్తైన పర్వతశిఖరం) వంటి పర్వతభాగం అధికంగా ఉంది. హిందూఖుష్ పశ్చిమ భాగంలో ఉన్న దామావంద్ పర్వతం యురేషియాలో ఎత్తౌనభూభాగంగా గుర్తించబడుతుంది.

ఇరన్ ఉత్తరభాగంలో జంగిల్స్ ఆఫ్ ఇరాన్ అని పిలువబడుతున్న దట్టమైన వర్షాఫ్హారారణ్యాలు ఉన్నాయి. [ఆధారం చూపాలి] తూర్పుభూభగంలో దష్త్ ఇ కవిర్ (ఇరాన్ లోని అతివిశాలమైన ఎడారి), దష్త్ ఇ లట్ వంటి ఎడారి భూభాగం ఉంది. అలాగే ఉప్పునీటి సరసులు కూడా ఉన్నాయి. అత్యంత ఎత్తుగా ఉన్న పర్వతభూగాలు ఈ భూభాలకు నీరు లభ్యం కావడానికి అడ్డుగా ఉన్నందున ఇవి ఎడారులుగా మారాయి. కాస్పియన్ సముద్రతీరంలో మాత్రమే మైదానభూభాగం ఉంది. పర్షియన్ సముద్రతీరంలో చిన్న చిన్న మైదానాలు ఉన్నాయి.

వాతావరణం

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Climate map of Iran (Köppen-Geiger)
  Hot desert climate
  Cold desert climate
  Hot semi-arid climate
  Cold semi-arid climate
  Hot-summer Mediterranean climate
  Continental Mediterranean climate

ఇరాన్ కాస్పియన్ సముద్రతీరం జంగిల్స్ ఆఫ్ ఇరాన్ వెంట వాతావరణం ఎడారి వాతావరణం లేక సెమీ అరిడ్ నుండి ఉప ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. ఉత్తరతీరంలో అరుదుగా ఉష్ణోగ్రత ఫ్రీజింగ్ స్థాయికంటే తక్కువగా ఉంటుంది అలాగే మిగిలిన సమయాలలో తడివాతావరణం ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రత అరుదుగా 29° డిగ్రీల సెల్షియస్ దాటుతుంది.

వర్షపాతం

వార్షిక వర్షపాతం తూర్పు మైదానంలో 680 అంగుళాలు, పశ్చిమ భాగంలో 700 అంగుళాలు ఉంటుంది. జాగ్రోస్ ప్రాంతంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇక్కడ శీతాకాలంలో 0 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత, అధికమైన హిమపాతం ఉంటుంది. మద్య, తూర్పు భాగాలలో పొడివాతావరణం ఉంటుంది. ఇక్కడ వర్షపాతం 200 అంగుళాలకంటే తక్కువగా ఉంటుంది.

వేసవి

వేసవి ఉష్ణోగ్రత 38° డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. పర్షియన్ సముద్రతీరం, గఫ్ ఆఫ్ ఓమన్ భాగాలలో స్వల్పమైన శీతాకాలం,అత్యంత వేడి, తేమ కలిగిన వాతావరణం ఉంటుంది. వార్షిక వర్షపాతం 135 అంగుళాలు ఉంటుంది.

వృక్షజాలం , జంతుజాలం

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Persian Leopard, an endangered species living primarily in Iran

ఇరాన్‌లో తోడేలు, హరిణాల, అడవి పంది, ఎలుగుబంట్లు సహా నక్కలు, చిరుతపులి, యురేషియా లినక్స్, నక్కలు మొదలైన జంతుజాలం ఉంది.

ఇరాన్‌లో గొర్రెలు, పశువులు, గుర్రాలు నీటిగేదెలు, గాడిదలు, ఒంటేలు పెంపుడుజంతువులుగా పోషించబడుతున్నాయి. నెమలి, వేపక్షులు, కొంగ, గ్రద్ద, ఫాల్కన్స్ కూడా ఇరాన్ స్థానిక వన్యప్రాణులుగా ఉంటాయి.

ఇరాన్ లోని జంతువులలో అంతరించిపోతున్న ఆసియన్ చిరుతపులి ఒకటి. దీనిని ఇరాన్ చిరుత అని కూడా అంటారు. వీటి సంఖ్య 1979 నుండి తగ్గుముఖం పడుతూ ఉంది. ఇరాన్ లోని ఆసియన్ సింహాలన్ని అంతరించిపోయాయి. 20వ శతాబ్ధపు ఆరంభకాలంలో కాస్పియన్ పులి జీవించి ఉంది. ఇరన్‌లో " ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కంసర్వేషన్ ఆఫ్ నేచుర్" రెండ్ లిస్ట్ లోని 20 జాతుల జంతువులు ఉన్నాయి. ఇది ఇరాన్ పర్యావరణానికి రహస్య బెదిరిపు అని భావిస్తున్నారు. ఇరానియన్ పార్లమెంటు పర్యావరణాన్ని అలక్ష్యం చేస్తూ అపరిమితంగా గనులు త్రవ్వకానికి, అభివృద్ధి పనులకు అనుమతి ఇస్తుంది.

ప్రాంతాలు,భూభాగాలు , నగరాలు

ఇరాన్ ఇరాన్ ప్రాంతాలుగా విభజించబడింది. ఇరాన్ 31 ప్రంతాలుగా (ఓస్టన్) విభజించబడింది. ఒక్కొక ప్రాంతానికి ఒక్కొక గవర్నర్ (ఒస్తాందార్) నియమించబడతాడు. ప్రాంతాలను కౌటీలుగా విభజిస్తారు. కౌంటీలను జిల్లాలు (బక్ష్), సబ్ జిల్లాలు (దేహెస్తాన్) గా విభజిస్తారు. ప్రపంచంలో నగరప్రాంతం అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇరాన్ ఒకటి. 1950-2002 ఇరాన్ నగరప్రాంత జనసంఖ్య 27% నుండి 60% నికి చేరుకుంది. ఐక్యరాజ్యసమితి ఇరాన్‌లో 2030 నాటికి 80% ప్రజలు నగరప్రాంతనివాసితులు ఔతారని అంచనా వేస్తుంది.[ఆధారం యివ్వలేదు] 2006-2007 ఇరాన్ గణాంకాలను అనుసరించి దేశీయ వలసప్రజలు తెహ్రాన్, ఇస్ఫహన్, అహ్వజ్, క్వాం నగరాల సమీపాలలో నివసిస్తున్నారని అంచనా.[ఆధారం యివ్వలేదు]ఇరాన్ లోని అతిపెద్ద నగరం, ఇరాన్ రాజధాని తెహ్రాన్ జనసంఖ్య 7,705,036. మిగిలిన పెద్ద నగరాల మాదిరిగా తెహ్రాన్ కూడా జసంఖ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నది.

ముస్సద్ జనసంఖ్య 2,410,800. ఇది ఇరాన్ పెద్ద నగరాలలో ద్వీతీయస్థానంలో ఉంది. ఇది రెజవి ఖొరసన్ రాజధాని. ఇది ప్రంపంచంలోని షియాల పవిత్రనగరాలలో ఒకటి. ఇక్కడ " ఇమాం రెజా మందిరం " ఉంది. ప్రతి సంవత్సరం ఇమాం రెజా మందిరం సందర్శించడానికి 15-20 మిలియన్ల యాత్రికులు వస్తుంటారు. ఇది ఇరాన్ పర్యాటకకేంద్రాలలో ఒకటి.

ఇరాన్ ప్రధాన నగరాలలో 1,583,609 జనసంఖ్య కలిగిన ఇస్ఫహాన్ ఒకటి. ఇది ఇస్ఫహాన్ ప్రాంతంలో " నక్వష్-ఇ-జహన్ స్క్వేర్ " ఉంది. నక్వష్-ఇ-జహన్ స్క్వేర్ ప్రపంచవారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. నగరంలో 11-19వ శతాబ్ధానికి చెందిన విస్తారమైన ఇస్లామీయ భవనాలు ఉన్నాయి. నగరం చుట్టూ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్న కారణాంగా ఇస్ఫహాన్ ఇరాన్ ప్రధాన నగరాలలో జనసంఖ్యాపరంగా మూడవ స్థానానికి చేరింది. ఇస్ఫహాన్ మహానగర వైశాల్యం 1,430,353 చ.కి.మీ.

ఇరాన్ ప్రధాన నగరాలలో 1,378,935 జనసంఖ్య కలిగిన తబ్రిజ్ నగరం నాలుగవ స్థానంలో ఉంది. ఇది తూర్పు అజర్బైజన్ ప్రాంతానికి రాజధానిగా ఉంది. ఇది ఇరాన్ రెండవ పారిశ్రామిక నగరంగా ఉంది. మొదటిస్థానంలో తెహ్రాన్ ఉంది. 1960 వరకు తబ్రిజ్ ఇరాన్ ప్రధాన నగరాలలో రెండవ స్థానంలో ఉండేది. ఇది మునుపటి ఇరాన్ రాజధానులలో ఒకటి. క్వాజర్ రాజకుటుంబం నివాసిత నగరం ఇదే. ఇరాన్ సమీపకాల చరిత్రలో ఈ నగరం ప్రాధాన్యత వహించింది.

ఇరాన్ ప్రధాన నగరాలలో 1,377,450 జనసంఖ్య కలిగిన కరాజ్ నగరం ఐదవ స్థానంలో ఉంది. ఇది అల్బోర్జ్ ప్రాంతంలో ఉంది. ఇది తెహ్రాన్‌కు 20కి.మీ దూరంలో అల్బోర్ఝ్ పర్వతపాదాల వద్ద ఉంది. అయినప్పటికీ ఈ నగరం తెహ్రాన్ పొడిగింపుగా ఉంటుంది.

ఇరాన్ ప్రధాన నగరాలలో 1,214,808 జనసంఖ్య కలిగిన షిరాజ్ నగరం ఆరవ స్థానంలో ఉంది. ఇది ఫార్స్ ప్రాంతంలో ఉంది. మొదటి బాబిలోన్ సంస్కృతికి ఈ ప్రాంతాన్ని గొప్పగా ప్రభావితం చేసింది. క్రీ.పూ 9వ శతాబ్దం పురాతనకాల పర్షియన్లు ఇక్కడ నివసిస్తున్నారు. క్రీ.పూ 6వ శతాబ్దంలో వీరు అచమెనింద్ సామ్రాజ్యంలో పెద్ద రాజ్యాలకు పాలకులుగా ఉన్నారు. అచమెనింద్ సామ్రాజ్యానికి చెందిన నాలుగు రాజధానులలో రెండు (పెర్సిపోలీస్, పాసర్గాడే) షిరాజ్ సమీపంలో ఉన్నాయి. అచమెనింద్ సామ్రాజ్యానికి పెర్సిపోలీస్ ఉత్సవకేంద్రంగా ఉండేది. ఇది ఆధునిక షిరాజ్ నగరానికి సమీపంలో ఉంది. 1979లో " సిటాడెల్ ఆఫ్ పెర్సిపోలీస్ "ను యునస్కో ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించింది.

ఆర్ధికం

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Provinces of Iran by contribution to national GDP in 2014.
ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Provinces of Iran by GDP per capita in 2012.

ఇరాన్ ప్రభుత్వం ఆధీనంలో ఆయిల్ , బృహత్తర పరిశ్రమలు ఉంటాయి. గ్రామీణ వ్యవసాయం , చిన్న తరహా పరిశ్రమలు , ఇతర సేవాసంస్థలు ప్రజల పైవేట్ యాజమాన్యంలో ఉంటాయి. 2014లో ఇరాన్ జి.డి.పి. 404.1 బిలియన్ల అమెరికన్ డాలర్లు. తలసరి కొనుగోలు శక్తి 17,000 అమెరికన్ డాలర్లు. ప్రపంచ బ్యాంక్ ఇరాన్‌ను ఎగువ- మధ్యతరగతి ఆర్ధికశక్తిగా వర్గీకరించింది. 21వ శతాబ్దంలో సేవారంగం జి.డి.పి.లో అధికభాగానికి భాగస్వామ్యం వహించింది. తరువాత స్థానాలలో గనుల పరిశ్రమ , వ్యవసాయం ఉన్నాయి. " ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ " ఇరాన్ అభివృద్ధి పనులకు బాధ్యత వహిస్తుంది. ఇరాన్ కరెంసీకి కూడా బాధ్యత వహిస్తుంది. ట్రేడ్ యూనియన్లను గుర్తించడం లేదు. ఉద్యోగుల నియామసం , రక్షణ బాధ్యత వహిస్తున్న " ఇస్లామిక్ లేబర్ కౌంసిల్ "కు మాత్రం ప్రభుత్వ గుర్తింపు ఉంది. 2013 గణాంకాలను అనుసరించి 487 మిలియన్ల రియాల్స్ (134 అమెరికన్ డాలర్లు) 1997 గణాంకాలను అనుసరించి ఇరాన్‌లో నిరుద్యోగం 10% ఉండేది. స్త్రీల నిరుద్యోగం పురుషుల నిరుద్యోగం రెట్టింపు ఉండేది.2006లో 41% ప్రభుత్వ ఆర్ధిక ప్రణాళిక వ్యయం ఆయిల్ , సహవాయువు ఉత్పత్తి నుండి లభించగా 31% పన్నువిధింపు ద్వారా లభిస్తుంది. 2007 గణాంకాలను అనుసరించి ఇరాన్ 70 మిలియన్ల విదేశీమారకం సంపాదించింది. ఇందులో 80% క్రూడాయిల్ అమ్మకం ద్వారా లభించింది. . ఇరానియన్ లోటు బడ్జెట్ ఒక చారిత్రాత్మక సమస్య. 2010లో " ఇరానియన్ ఎకనమిక్ రిఫార్ం ప్లాన్ "కు పార్లమెంటు అనుమతి లభించింది. 5-సంవత్సరాల ఫ్రీ మార్కెట్ ప్రైసెస్ , ఉత్పత్తి అధికరించడం , సోషల్ జస్టిస్‌కు ప్రభుత్వం అడ్డుచెప్తుంది.

ప్రభుత్వం ఆర్ధిక సంస్కరణలను కొనసాగిస్తూనే ఉంది. ఇది అయిల్ సంబంధిత ఆదాయం వైవిధ్యమైన రంగాలకు తరలించబడుతుందని సూచిస్తుంది. ఇరాన్ బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ , ఔషధతయారీ రంగాలమీద దృష్టిసారించింది. అయినప్పటికీ జాతీయం చేయబడిన బాన్యాద్ సంస్థ నిర్వహణ బలహీనంగా ఉండడం దానిని అశక్తతకు గురిచేయడమే కాక సంవత్సరాల తరబడి పోటీ ఎదుర్కొనడంలో అసఫలం ఔతుంది. ప్రభుత్వం పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుంది. విజయాలతో ఇరాన్ లంచగొండితనం , పోటీకి నిలవలేక పోవడం మొదలైన సమస్యలను ఎదుర్కొంటున్నది. ప్రపంచ పోటీలో ఇరాన్ 139 దేశాలలో 69వ స్థానంలో ఉందని అంచనా. కార్ తయారీ , ట్రాంపోర్టేషన్, నిర్మాణం సంబంధిత వస్తూత్పత్తి, గృహోపకరణాలు, ఆహారం , వ్యవసాయ ఉత్పత్తులు, ఆయుధాలు, ఔషధాలు, సమాచారం సాంకేతికత, విద్యుత్తు పెట్రో కెమికల్స్ ఉత్పత్తిలో మిడిల్ ఈస్ట్ దేశాలలో ఇరాన్ ఆధిక్యత సాధించింది. . 2012లో " ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ " నివేదికలు అనుసరించి చెర్రీ, సౌ చెర్రీ, కుకుంబర్ , ఘెర్క్న్, ఖర్జూరం, వంకాయ మొక్కలు, కామన్ ఫిగ్, పిస్టాచియోస్, క్వింస్, వాల్నట్ , పుచ్చకాయలు మొదలైన ఉత్పత్తులలో ప్రపంచదేశాలలో మొదటి ఐదు దేశాలలో ఇరాన్ఒకటిగా ఉందని గుర్తించింది. ఇరాన్ వ్యతిరేకంగా " ఎకనమిక్ శాంక్షన్లు " (ప్రధానంగా క్రూడ్ ఆయిల్ మీద అంక్షలు) ఇరాన్ ఆర్ధికరంగాన్ని దెబ్బతీస్తున్నాయి. అంక్షలు కారణంగా 2013లో అమెరికన్ డాలర్‌కు బదులుగా రియాల్ విలువ పతనం కావడానికి కారణం అయింది. 2013 కు ముందు ఒక అమెరికన్ డాలర్ విలువ 16,000 రియాన్లు ఉండగా అంక్షలు తరువాత 36,000 రియాన్లకు పతనం అయింది.

పర్యాటకం

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Over 1 million tourists visit Kish Island each year.

ఇరాక్తో యుద్ధం కారణంగా ఇరాన్ పర్యాటకరం క్షీణించినప్పటికీ తరువాత తగినంత కోలుకున్నది. 2004లో 1,659,000 పర్యాటకులు ఇరాన్‌ను సందర్శించారు. 2009లో 2.3 మిలియన్ పర్యాటకులు ఇరాన్‌ను సందర్శించారు. మద్య ఆసియా రిపబ్లిక్కుల నుండి పర్యాటకులు అధికంగా వస్తున్నారు. యురేపియన్ యూనియన్ , ఉత్తర అమెరికా నుండి 10% పర్యాటకులు వస్తున్నారు. ఇరాన్ లోని ఇస్ఫహన్, మస్సద్ , షిరాజ్ నగరాలు పర్యాటకులను అధికంగా ఆకర్షిస్తున్నాయి. 2000 లో నిర్మాణరంగం, కమ్యూనికేషన్, ఇండస్ట్రీ స్టాండర్స్ , వ్యక్తిగత శిక్షణ తీవ్రమైన పరిమితులను ఎదుర్కొన్నది. 2003లో 3,00,000 ఆసియన్ ముస్లిములకు మస్షద్ , క్వాం (పవిత్ర యాత్రకు) సందర్శించడానికి టూరిస్ట్ వీసాలు మంజూరు చేయబడ్డాయి. జర్మనీ, ఫ్రాంస్ , ఇతర యురేపియన్ దేశాల నుండి వార్షికంగా ఆర్కియాలజీ ప్రాంతాలు , స్మారకచిహ్నాల సందర్శనకు ఆర్గనైజ్డ్ టూర్స్ ద్వారా పర్యాటకులు వస్తుంటారు. 2003లో అంతర్జాతీయ గణాంకాలను అనుసరించి పర్యాట ఆదాయంలో ఇరాన్ 68వ స్థానంలో ఉంది. యునెస్కో గణాంకను అనుసరించి " 10 మోస్ట్ టూరిస్ట్ కంట్రీస్ "లో ఇరాన్ ఒకటి అని తెలియజేస్తున్నాయి. దేశీయ పర్యాటకంలో ఇరాన్ ప్రపంచంలో మొదటిస్థానంలో ఉంది. ప్రచారంలో బలహీనత రాజకీయ అస్థిరత ప్రంపంచంలోని కొన్ని ప్రాంతాలలో ప్రజలలో అపోహ, పర్యాటకరంగంలో ప్రణాళికల బలహీనత ఇరాన్ పర్యాటకరంగాన్ని బలహీనపరుస్తుంది.

విద్యుత్తు

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Iran holds 10% of the world's proven oil reserves and 15% of its gas. It is OPEC's second largest exporter and the world's fourth oil producer.

ఇరాన్ సహజ వాయు వనరులలో ప్రపంచంలో ద్వితీయ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో రష్యా ఉంది. ఇరాన్ సహజవాయు ప్రమాణం 33.6 ట్రిలియన్ క్యూబిక్ మీటర్లు. సహజ వాయు ఉతపత్తిలో ఇరాన్ మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో రష్యా, ఇండోనేషియా ఉన్నాయి. ఆయిల్ నిలువలో ఇరాన్ 4 వ స్థానంలో ఉంది. 153,600,000,000 బ్యారెల్ ఆయిల్ నిలువ ఉంటుందని అంచనా. ఇరాన్, చమురు ఎగుమతులలో ఓ.పి.ఇ.సి. దేశాల్లో కెల్లా ద్వితీయ స్థానంలో ఉంది. 2005లో ఇరాన్ 4 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఫ్యూయల్ దిగుమతి చేసుకుంది. 1975లో ఒకరోజుకు 6 మిలియన్ బ్యారెల్ ఉత్పత్తి జరిగింది. 2000 నాటికి సాంకేతిక లోపం, మౌలిక వసతుల కొరత కారణంగా 2005లో ఆయిల్ ఉత్పత్తి కనీస స్థాయికి దిగజారింది. 2005 లో ఎక్స్ప్లొరేటరీ ఆయిల్ వెల్స్ త్రవ్వబడ్డాయి.

2004లో ఇరాన్‌లో హైడ్రో ఎలెక్ట్రిక్ స్టేషన్లు, కోయల్, ఆయిల్ - ఫైర్డ్ స్టేషన్లు అధికం అయ్యాయి. అవి మొత్తంగా 33,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసాయి. విద్యుత్తు ఉత్పత్తి కొరకు 75% సహజవాయువును ఉపయోగిస్తుండగా, 18% ఆయిల్ ఉపయోగించబడుతుంది, 7% హైడ్రో ఎలెక్ట్రిక్ ఉత్పత్తి చేయబడుతుంది. 2004లో ఇరాన్ మొదటిసారిగా పవన విద్యుత్తు, జియోథర్మల్ ఉత్పత్తి, మొదటి సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేయడం ఆరంభించింది. గ్యాస్- టు- లిక్విడ్ టెక్నాలజీ ఉపయోగించిన దేశాలలో ఇరాన్ మూడవ స్థానంలో ఉంది.

అధికరిస్తున్న పరిశ్రమల కారణంగా 8% విద్యుత్తు అవసరం అధికం అయిందని గణాంకాలు సూచిస్తున్నాయి. న్యూక్లియర్, హైడ్రో ఎలెక్ట్రిక్ ప్లాంటులు స్థాపించడం ద్వారా 53,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరాలని ఇరాన్ ఆసించింది.

విద్య

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
An 18th century Persian astrolabe

ఇరాన్‌లో విద్య అధికంగా కేద్రీకృతం చేయబడ్డాయి. " కె-12 ఎజ్యుకేషన్" మిసిస్ట్రీ ఆఫ్ ఎజ్యుకేషన్ " పర్యవేక్షణలో పనిచేస్తుంది. ఉన్నత నిద్య " మినిస్ట్రీ ఆఫ్ సైన్సు రీసెర్చ్ అండ్ టెక్నాలజీ " పర్యవేక్షణలో పనిచేస్తుంది. 2008 గణాంకాలను అనుసరించి వయోజన అక్షర్యత 85%. 1976లో ఇది 36.5% ఉండేది. హైస్కూల్ డిప్లోమో అందిన తరువాత జాతీయ విశ్వవిద్యాలయం ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత అయిన తరువాత ఉన్నత విద్యకు అర్హత పొందవచ్చు. ఇరానియన్ యూనివర్శిటీ ఎంట్రెంస్ ఎగ్జాంస్ (కాంకర్), ఇది యు.ఎస్ ఎస్.ఎ.టి ఎగ్జాం లాంటిది. అధికంగా విద్యార్ధులు 1-2 సంవత్సరాల " యూనివర్శిటీ- ప్రిపరేషంస్- స్కూల్ప్రి- యూనివర్శిటీ " చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇది " జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ జ్యుకేషన్, బకలౌరేట్‌కు సమానం. ప్రి యూనివర్శిటీ కోర్స్ పూర్తిచేసిన తరువాత విద్యార్థులు ప్రీ యూనివర్శిటీ సర్టిఫికేట్ సంపాదిస్తారు.

ఉన్నత విద్య వైవిధ్యమైన స్థాయిలో డిప్లొమాలను అందిస్తుంది. రెండుసంవత్సరాల ఉన్నత విద్య తరువాత కర్దాని (ఫాక్వా ఇ డిప్లొమా) విడుదల చేయబడుతుంది. 4 సంవత్సరాల ఉన్నత విద్య తరువాత కర్సెనాసి (బ్యాచిలర్ డిగ్రీ) విడుదల చేయబడుతుంది. దీనిని లికాంస్ అని కూడా అంటారు. తరువాత 2 సంవత్సరాల అనంతరం కర్సెనాసి ఇ అర్సద్ (మాస్టర్ డిగ్రీ) విడుదల చేయబడితుంది. తరువాత మరొక ప్రవేశపరీక్ష తరువాత పి.హెహ్.డి (డాక్టర్ డిగ్రీ) విడుదల చేయబడుతుంది." వెబొమెట్రిక్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్శిటీ " నివేదిక అనుసరించి దేశంలోని విశ్వవిద్యాలయాలలో తెహ్రాన్ యూనివర్శిటీలు 468వ స్థానంలో ఉంది, తెహ్రాన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైంసెస్ 612వ స్థానంలో ఉంది, ఫెర్డోసీ యూనివర్శిటీ ఆఫ్ మస్సద్ 815వ స్థానంలో ఉంది. 1966- 2004 మద్య ఇరాన్ ప్రచురణా వ్యవస్థ 10 రెట్లు అభివృద్ధి చెంది ఔట్ పుట్ గ్రోత్‌లో ప్రథమ స్థానంలో ఉంది. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే ఎస్.సి.ఇమాగో అనుసరించి 2018 నాటికి పరిశోధనలలో ఇరాన్ ప్రంపంచంలో 4వ స్థానానికి చేరుకుంటుందని అంచనా.

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Safir (rocket). Iran is the 9th country to put a domestically built satellite into orbit and the sixth to send animals in space.

2009లో ఎస్.యు.ఎస్.ఇ. లినక్స్ - ఆధారిత హెచ్.పి.సి విధానం ఎయిరోస్పేస్ రీసెర్చి ఇంస్టిట్యూట్ ఆఫ్ ఇరాన్ ద్వారా రూపొందించబడింది. సురేనా 2 రొబోట్‌ను యూనివర్శిటీ ఆఫ్ తెహ్రాన్ ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించారు. ది ఇంస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలెక్ట్రానిక్స్ రూపొందించిన సురేనా ప్రపంచంలోని ఐదు ప్రముఖ రొబోట్లలో ఒకటిగా భావించబడుతుంది.

] ఇరాన్ బయోమెడికల్ సైంసెస్‌లో " ఇంస్టిట్యూట్ ఆఫ్ బయోకెమెస్ట్రీ అండ్ బయోఫిజిక్స్ " యునెస్కో గుర్తింపు పొందింది. 2006లో ఇరానియన్ పరిశోధకులు " సోమాలిక్ సెల్ న్యూక్లియర్ ట్రాంస్ఫర్ " విధానం ద్వారా తెహ్రాన్ లోని రాయన్ రీసెర్చ్ సెంటర్‌లో విజయవంతంగా క్లోనింగ్ విధానం ద్వారా ఒక గొర్రెను సృష్టించారు. డేవిడ్ మొర్రిసన్, అలి ఖాదెం హుస్సైనీ అధ్యయనం అనుసరించి ఇరాన్ స్టెం సెల్ రీసెర్చ్ ప్రంపంచంలో 10 అత్యుత్తమ పరిశోధనలలో ఒకటి అని తెలుస్తుంది. ఇరాన్ నానో టెక్నాలజీలో ఇరాన్ ప్రపంచంలో 15వ స్థానంలో ఉందని భావిస్తున్నారు. 2009 ఫిబ్రవరి 2న ఇరాన్‌లో తయారుచేయబడిన ఉపగ్రాహాన్ని 1979లో రివల్యూషన్ 30వ వార్షికోత్సవం సందర్భంలో కక్ష్యలో ప్రవేశపెట్టారు. దేశీయంగా తయారుచేసిన ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టిన దేశాలలో ఇరాన్ 7వ స్థానంలో ఉంది.1950 ఇరానియన్ న్యూక్లియర్ ప్రోగ్రాం ప్రారంభించబడింది. యూరైడ్ ఉతపత్తి, న్యూక్లియర్ ఫ్యూఉఅల్ సైకిల్ పూర్తిగా నియంత్రించడంలో ఇరాన్ ప్రపంచంలో 7వ స్థానంలో ఉంది. ఇరానియన్ పరిశోధకులు ఇరాన్ వెలుపల కూడా ప్రధాన పరిశోధనలో పాల్గొంటున్నారు. 1960లో అలి జవన్ గ్యాస్ లేజర్ సృష్టించిన పరిశోధకులలో ఒకడుగా గుర్తించబడ్డాడు. లోట్ఫి జడేహ్ " ఫ్యూజీ సెట్ తెరఫీ "ని కనిపెట్టాడు. ఇరానియన్ కార్డియాలజిస్ట్ టాఫీ ముస్సివంద్ కృత్రిమ కార్డియల్ పంప్‌ను కనిపెట్టి అభివృద్ధి చేసాడు. శామ్యుయేల్ రాహ్బర్ డయాబిటీస్ చికిత్సా విధానం రూపొందించాడు. స్ట్రిగ్ థియరీలో ఇరానియన్ ఫిజిక్స్ శక్తివంతంగా ఉంది. ఇరానియన్ పరిశోధకులు పలు పరిశోధనా పత్రాలను ప్రచురించారు. ఇరానియన్ - అమెరికన్ స్ట్రింగ్ థియరిస్ట్ కంరాన్ వఫా ఎడ్వర్డ్ విట్టెన్‌తో కలిసి " వఫా- విట్టెన్ థియోరెం " ప్రతిపాదించాడు. 2014 ఆగస్టులో మర్యం మీర్ఖాని మాథమెట్క్స్ ఉన్నత పురస్కారం అందుకున్న మొదటి ఇరానియన్, మొదటి మహిళగా గుర్తించబ డింది.

గణాంకాలు

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Provinces of Iran by population in 2014.
ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Provinces of Iran by population density in 2013.
1956-2011
సంవత్సరంజనాభా±% p.a.
19561,89,54,704—    
19662,57,85,210+3.13%
19763,37,08,744+2.72%
19864,94,45,010+3.91%
19966,00,55,488+1.96%
20067,04,95,782+1.62%
20117,51,49,669+1.29%
Source: United Nations Demographic Yearbook

పలు మతాలు, సంప్రదాయాలకు చెందిన ప్రజలు నివసిస్తున్న దేశం ఇరాన్. అందరినీ సమైక్యంగా పర్షియన్ సంస్ఖృతిలో భాగస్వామ్యం వహిస్తున్నారు. సమీపకాలంగా ఇరాన్ జననాలశాతం గణనీయంగా క్షీణిస్తూ ఉంది. ఇరాన్ శరణార్ధులకు అభయం ఇవ్వడంలో ప్రంపంచంలో ప్రథమస్థానంలో ఉంది. ఇరాన్‌లో 1 మిలియంకంటే అధికమైన శరణార్ధులు నివసిస్తున్నారు. వీరిలో అధికంగా ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ దేశాలకు చెందినవారు ఉన్నారు. 2006 నుండి ఇరానియన్ అధికారులు యు.ఎన్.హెచ్.సి.ఆర్ కొరకు పనిచేస్తున్నారు. ఆఫ్ఘన్ అధికారులు వారి స్వదేశానికి పనిచేస్తున్నారు. ఇరాన్ గణాంకాలను అనుసరించి 5మిలియన్ ఇరానీయులు విదేశాలలో పనిచేస్తున్నారని భావిస్తున్నారు. ఇరానియన్ రాజ్యాంగ నియమాలను అనుసరించి ఇరాన్ ప్రభుత్వం ప్రతి ఇరానియన్ పౌరుడు సోషల్ సెక్యూరిటీ,రిటైర్మెంట్, నిరోద్యోగం, వృద్ధాఒయం, అశక్తత, విపత్తులు, ఆపదలు, ఆరోగ్యం, వైద్య చికిత్స, సంరక్షణాసేవలు మొదలైన సౌకర్యాలను కలిగిస్తుంది.

భాషలు

ప్రజలలో అత్యధికులు పార్శీభాషను మాట్లాడుతుంటారు. పర్షియన్ భాష ఇరాన్ అధికారిక భాషగా ఉంది. ఇండో- యురేపియన్, ఇతర సంప్రదాయాలకు చెందిన భాషలు కూడా ఇరాన్‌లో వాడుకలో ఉన్నాయి. దక్షిణ ఇరాన్‌లో ల్యూరీ, లారీ భాషలు వాడుకలో ఉన్నాయి. ఉత్తర ఇరాన్‌లోని గిలాన్, మజందరన్ ప్రాంతాలలో గిలకి, మజందరానీ భాషలు వాడుకలో ఉన్నాయి. ఇవి పర్షియన్, ఇతర ఇరానియన్ భాషల యాసలతో చేర్చి మాట్లాడబడుతున్నాయి. ఇవి రెండు పొరుగున ఉన్న కౌకాససియన్ భాషలతో ప్రభావితమై ఉన్నాయి. కుర్ధిస్థాన్ ప్రాంతంలో దాని సమీపప్రాంతాలలో కుర్ధిష్ భాషలు అధికంగా వాడుకలో ఉన్నాయి. ఖుజెస్థాన్‌లో పర్షియన్ భాషలు వాడుకలో ఉన్నాయి. అదనంగా గిలాన్, తాలుష్ అధికంగా వాడుకలో ఉన్నాయి. ఇవి పొరుగున ఉన్న అజబైజాన్ ప్రాంతంలో కూడా విస్తరించి ఉన్నాయి. టర్కిక్ భాషలలో అజర్బైజనీ భాష అధికంగా వాడుకలో ఉంది. ఇది ఇరాన్ అధికారిక భాష పర్షియన్ భాషకు తరువాత స్థానంలో ఉంది. ఇరానీ అజర్బైజనీ, ఖుజస్థానీ అరబిక్ భాషలు ఖుజస్థానీ అరబ్బులకు వాడుకలో ఉన్నాయి.

ఆర్మేయిన్, జార్జియన్, నియో- అరామియాక్ భాషలు అల్పసఖ్యాక ప్రజలకు వాడుకలో ఉన్నాయి. సికాషియన్ భాష సికాషియన్ ప్రజలలో వాడుకలో ఉండేది. కానీ పలుసంవత్సరాల కాలం గడిచిన తరువాత ప్రజలు ఇతర భాషలకు అలవాటుపడిన కారణంగా ప్రస్తుతం సికాషియన్ భాష మాట్లాడే ప్రజలసంఖ్య చాలావరకు తగ్గింది. భాషాప్రాతిపదిక రాజకీయాల కారణంగా భాషాపరంగా జనసంఖ్యను నిర్ణయించడంలో వాదోపవాదాలు ఉన్నాయి. అధికంగా అత్యధిక వాడుకలో ఉన్న ప్రథమ, ద్వితీయ స్థానాలలో ఉన్న భాషలు (పర్షియన్, అజర్బైజన్) గౌరవించబడుతున్నాయి. సి.ఐ.ఎ వరల్డ్ ఫాక్ట్ బుక్ అనుసరించి పర్షియన్లు 53%,అజర్బైజన్లు 16%,ఖుర్దిష్ 10%, మజందరానీ, గిలకీ 7%, ల్యూరీ 7%, అరబిక్ 2%, టర్క్మెనీ 2%, బలోచీ 2%, అర్మేనియన్, జార్జియన్, నియో-అరమియాక్, చిర్కాషియన్ భాష% ఉంటుందని భావిస్తున్నారు.

సంప్రదాయ ప్రజలు

ఇరాన్ సంప్రదాయ ప్రజలశాతం గురించిన వాదోపవాదాలు ఉన్నాయి. అధికంగా ప్రథమ ద్వితీయ స్థానాలలో ఉన్న పర్షియన్, అజర్బైజనీ సంప్రదాయాలు గౌరవించబడుతున్నాయి. ఇరానియన్ గణాంకాలు బలహీనంగా ఉన్నందున ది వరక్డ్ ఫాక్ట్ బుక్ ఆధారంగా ఇరానియన్ భాషలు మాట్లాడుతున్న ప్రోటో-ఇండో-యురేపియన్, ఎత్నోలింగ్స్టిక్ ప్రజలు 79% ఉంటారని భావిస్తున్నారు. పర్షియన్ ప్రజలలో మజందరాని, గిలకి ప్రజలు, 61%, కుర్దిష్ ప్రజలు 10%, ల్యూరీ ప్రజలు 6%, బలోచీ ప్రజలు 2% ఉన్నారు. మిగిలిన 21%లో ఇతర సంప్రదాయ ప్రజలలో అజబైజనీ ప్రజలు 16%, అరబ్ ప్రజలు 2%, తుర్క్‌మెన్ ప్రజలు, టర్కిక్ ప్రజలు 2%, ఇతరులు 1% (అర్మేనియన్, తలిష్, జార్జియన్, సికాషియన్, అస్సిరియన్ ప్రజలు) ఉన్నారు. ది లిబరరీ ఆఫ్ కాంగ్రెస్ కొంత వ్యత్యాసమైన అంచనాలు: పర్షియన్ ప్రజలు (మజందరనీయ, గిల్కీ, తాల్ష్) 65%, అజబైననీయులు 16%, ఖుర్దీలు 7%, క్యూరీలు 6%, బ్లోచీలు 2%, టర్కిక్ గిరిజనులు క్వష్క్వై ప్రజలు 1%, తుర్క్మెనీలు 1% ఇరనీయేతర ప్రజలు (ఆర్మేనియన్లు, జార్జియన్లు, అస్సిరియన్లు, సికాషియన్లు, అరబ్బులు) 3% ఉన్నారని తెలియజేస్తున్నాయి. పర్షియన్ ప్రధాన భాషగా ఉన్న ప్రజలు 65% ఉన్నారు. ద్వితీయభాషగా ఉన్న ప్రజలు 35% ఉన్నారు. ఇతర ప్రభుత్వేతర అంచనాలు అనుసరించి పర్షియన్, అజర్బౌజియన్ ప్రజలు దాదాపు వరక్డ్ ఫాక్ట్ బుక్, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ సూచించిన సంఖ్యకు సమీపంలో ఉన్నాయి. పరిశోధకులు, ఆర్గనైజేషన్ అంచనాలు ఈ రెండు గ్రూపుల అంచనాలతో విభేదిస్తున్నాయి. వారి అంచనాలు అనుసరించి అజర్బైనీయులు 22-30% ఉండవచ్చని అంచనా. అధికమైన సంస్థల అంచనాలు 25% ఉంటుందని సూచిస్తున్నాయి. d 16% లేక 30% లాలో ఏది వాస్తవమైనా అజబైనీయులు అధికసంఖ్యలో నివసిస్తున్న దేశం ఇరాన్ మాత్రమే.

మతం

Iranian people by religion, 2011 General Census Results
Religion % of
population
No. of
people
Muslim| 99.4% | 74,682,938
0.4% | 205,317
Christian| 0.16% | 117,704
Zoroastrian | 0.03% | 25,271
Jewish | 0.01% | 8,756
0.07% | 49,101

చారిత్రాత్మకంగా ఇఆరాన్‌లో అచమెనింద్, పార్ధియన్, సస్సనిద్ సామ్రాజ్యాల పాలనలో జొరాష్ట్రియన్ మతం ఆధిక్యతలో ఉంది. సస్సనిద్ సామ్రాజ్యం పతనమై ముస్లిములు ఇరాన్‌ను ఆక్రమించిన తరువాత జొరాస్ట్రియన్ స్థానంలో ఇస్లాం చేరింది. ప్రస్తుతం ఇస్లాం శాఖలైన ట్వెల్వర్, షియా శాఖలు 90%-95% ఉన్నారని భావిస్తున్నారు. 4% నుండి 8% ఇరానీయులు సున్నీ మతానికి చెందిన (ప్రధానంగా ఖుర్దిష్, బలోచీ ప్రజలు) వారు, మిగిలిన 2% ప్రజలు ముస్లిమేతర ప్రజలు. వీరిలో క్రైస్తవులు, పర్షియన్ యూదులు, బహియాలు, మాండియన్లు, యజీదులు, యర్సన్లు, జోరాస్ట్రియన్లు ఉన్నారు.

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
The remains of Adur Gushnasp, a Zoroastrian fire temple built during the Sassanid period.

జొరాస్ట్రియన్లు ఇరాన్ దేశ పురాతన మతానికి సంబంధించిన వారు. ఇరాన్‌లో జొరాస్ట్రియన్ దీర్ఘకాలచరిత్ర ప్రస్తుత కాలంవరకు కొనసాగుతుంది. జుడియిజానికి ఇరాన్‌లో దీర్ఘకాల చరిత్ర ఉంది. వీరు పర్షియన్ ఆక్రమిత బాబిలోనియాకు చెందినవారు. ఇజ్రేల్ రూపొందిచిన తరువాత, 1979 ఇజ్రేల్ విప్లవం తరువాత వీరిలో అనేకులు ఇజ్రేలుకు తరలివెళ్ళారు. సమీపకాల గణాంకాలను అనుసరించి ప్రస్తుతంలో ఇరాన్‌లో 8,756 యూదులు నివసిస్తున్నారని అంచనా. ఇరాన్ ఇజ్రేల్‌కు వెలుపల మిడిల్ ఈస్ట్ దేశాలలో యూదులు అధికంగా నివసిస్తున్న దేశం ఇరాన్ మాత్రమే. ఇరాన్‌లో 250,000 - 370,000 క్రైస్తవులు నివసిస్తున్నారని అంచనా. ఇది అల్పసంఖ్యాకులలో అధికమని భావిస్తున్నారు. ఇరానియన్ ఆర్మేనియన్లలో అధికంగా అస్సిరుయన్లు ఉన్నారు. క్రైస్తవులు, జ్యూడిజం, జొరాష్ట్రియన్లు, సున్ని ముస్లిములను అధికారికంగా ప్రభుత్వం గుర్తించింది. వీరికి ఇరాన్ ప్రభుత్వంలో తగినాన్ని స్థానాలు రిజర్వ్ చేయబడి ఉన్నాయి. బహా విశ్వాసానికి చెందిన ప్రజలు ఇరాన్‌లో అత్యధిక ముస్లిమేతర ప్రజలుగా ఉన్నారు. వీరు అధికారికంగా గుర్తించబడలేదు. 2010 లో హిందువులు 39,200 మంది ఉన్నారు. 19వ శతాబ్దం నుండి వీరు వివక్షకు గురిచేయబడుతున్నారు. 1979 విప్లవం తరువాత బహాయీలపై హింస అధికమైంది. హింసలో పౌరహక్కుల నిరాకరణ, స్వతంత్రం, ఉన్నత విద్యకు అనుమతి నిరాకరణ ఉద్యోగనియామకాల నిరాకరణ భాగంగా ఉన్నాయి. ఇరాన్ ప్రభుత్వం మతేతర గణాంకాల విడుదలకు వ్యతిరేకంగా ఉంది. నాస్తికులలో అధికంగా ఇరానియన్ అమెరికన్లు ఉన్నారు.

సంస్కృతి

ఇరానీ సంస్కృతి ప్రపంచం లోని ప్రాచీన సంస్కృతుల్లో ఒకటి.అసలు 'ఇరాన్' అనే పదం 'ఆయిర్యాన' అను పదం నుండి ఉధ్భవంచింది.ఇరానీయుల సంప్రాదాయల కు,భారతీయ సంప్రదాయలకు దగ్గరి పోలిక ఉంది.వారు అగ్ని ఉపాసకులు.వారు కూడా ఉపనయనాన్ని పోలిన ఒక ఆచారాన్ని పాటిస్తారు.దీనిని బట్టి వారి పూర్వికులు కూడా ఆర్యులే నని పలువురు చరిత్రకారుల అభిప్రాయం.

అన్నీ ప్రాచీన నాగరికతల వలెనే, పర్షియన్ నాగరికతకు కూడా సంస్కృతే కేంద్ర బిందువు. ఈ నేల యొక్క కళ, సంగీతం, శిల్పం, కవిత్వం, తత్వం, సాంప్రదాయం, ఆదర్శాలే ప్రపంచ విఫణీలో ఇరానియన్లకు గర్వకారణము. ఇరానీ ప్రజలు తమ నాగరికత ఆటుపోట్లను తట్టుకొని వేల సంవత్సరాల పాటు మనుగడ సాగించడానికి దాని యొక్క సంస్కృతే ఏకైక ప్రధాన కారణమని భావిస్తారు.

ఆరంభకాల సస్కృతిక ఆధారాలు

నమోదు చేయబడిన ఆరంభకాల ఇరాన్ చరిత్ర దిగువ పాలియోలిథిక్ శకం (లోవర్ పాలియో లిథిక్) నుండి లభిస్తుంది. ప్రపంచంలో ఇరాన్ భౌగోళిక, సాంస్కృతిక ఆధిక్యత కలిగి ఉంది. ఇరాన్ పశ్చిమప్రాంతం ప్రత్యక్షంగా గ్రీస్, మెసెడోనియా, ఇటలీ, ఉత్తర ఇరాన్‌లో రష్యా, దక్షిణ ఇరాన్‌లో ఆర్మేనియా ద్వీపకల్పం, దక్షిణాసియా, తూర్పు ఆసియా సంస్కృతులతో ప్రభావితమై ఉంది.

కళ

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Ceiling of the Lotfollah Mosque

వివిధ ప్రాంతాలు, కాలాలలో ఇరానియన్ కళలు పలు వైవిధ్యమైన శైలికలిగి ఉంటాయి. వివిధ రీతి కళల మూలాంశాలు ఒకదానితో ఒకటి సంబధితమై ఉంటాయి. ఇరాన్ కళలలో కాంబినేషన్ మరొక ప్రధానమైన అంశంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఇరానియన్ మిథాలజీ సంబంధిత మానవ, జంతువు రూపాల మిశ్రితమైన అంశాలతో కళరీతులు రూపొందించబడుతుంటాయి.

ఇరానియన్ కళాలలో పలు విభాగాలు ఉంటాయి. ఇందులో నిర్మాణకళ, నేత, మృణ్మయపాత్రలు, అందమైన దస్తూరి, లోహపు పని, రాతిశిల్పాలు భాగస్వామ్యంవహిస్తూ ఉంటాయి. మెడియన్, అచమెనింద్ సామ్రాజ్యాలు విడిచివెళ్ళిన కళాసంస్కృతి తరువాత కాలాలో జనించిన కళలకు ఆధారభూతమై ఉన్నాయి. పార్ధియన్ కళ ఇరానియన్, హెల్లెంస్టిక్ మిశ్రిత కళారూపమై ఉంటుంది. ఈ కళకు రాజరిక వేట యాత్రలు, పట్టాభిషేకాలు ఆధారమై ఉంటుంది. సస్సనిద్ కళ యురేపియన్, ఆసియన్ మిశ్రిత మెడీవల్ కళలో ప్రధానపాత్ర వహిస్తుంది. ఇది తతువాత మెడీవల్ కళను ఇస్లాం ప్రపంచంలోకి తీసుకువచ్చింది. ఇస్లామిక్ ప్రాచీన భాష, సాహిత్యం, న్యాయమీమాంశ, ఆరంభకాల ఇస్లాం తాత్వికత, ఇస్లామిక్ వైద్యం, ఇస్లామిక్ నిర్మాణకళ, సైన్సు కలిసిన సస్సనిద్ కళారూపంగా మారింది. ఉత్సాహపూరితమైన సమకాలీన ఆధునిక ఇరానియన్ కళ1940 నుండి ప్రభావం చూపుతుంది. 1949లో తెహ్రాన్‌లో మొహమ్మద్ జావేద్ పౌర్, సహచరులు చేత " అపదాన గ్యాలరీ " నిర్వహించబడుతుంది. 1950లో మార్కోస్ గ్రిగోరియన్ ఇరాన్ మోడరన్ ఆర్ట్ ను ప్రబలం చేసాడు. ఇరానియని తివాసి నేత " కాంశ్య యుగం " కాలం నుండి కొనసాగుతుంది. ఇరాన్ కళలలో ఇది ప్రాముఖ్యత కలిగి ఉంది. ప్రంపంచ కార్పెట్ తయారీలో, చేతితో నేసిన తివాసీలను ఎగుమతి చేయడంలో ఇరాన్ ప్రథమస్థానంలో ఉంది. ప్రపంచ తివాసీ ఎగుమతులలో ఇరాన్ 30% భాగస్వామ్యం వహిస్తుంది. ఇరానియన్ క్రౌన్ జువల్స్ తయారీ అంతర్జాతీయ ప్రాముఖ్యత సంతరించుకుంది.

నిర్మాణశైలి

ఇరనీ నిర్మాణకళాచరిత్ర క్రీ.పూ 7వ శతాబ్దంలో ఆరంభం అయింది. ఇరానియన్లు మొదటిసారిగా గణితం, జామెంట్రీ, జ్యోతిషం నిర్మాణకళలో ప్రవేశపెట్టారు. ఇరానియన్ నిర్మాణాలు ఉన్నతప్రమాణాలు కలిగిన నిర్మాణం, సౌందర్యం మిశ్రితమై ఉంటుంది. క్రమంగా పురాతన సంప్రదాయాలు, అవుభవాల నుండి వెలుపలకు వచ్చింది. . ఇరానియన్ నిర్మాణకళ సమైక్యంగా అంతరిక్షం చిహ్నాలు మూలాంశాలుగా కలిగి ఉంటుంది. ఇరాన్ పురాతన నిర్మాణ అవశేషాలు అధికంగా కలిగిన దేశాలలో అంతర్జాతీయంగా 7వ స్థానంలో ఉంది. యినెస్కో గుర్తించిన ఇరాన్ పురాతన నిర్మాణ అవశేషాలు అంతర్జాతీయ పర్యాటకులను అధికంగా ఆకర్షిస్తున్నాయి.

సాహిత్యం

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Mausoleum of Ferdowsi in Tus

ఇరాన్ సాహిత్యం ప్రంపంచపు పురాతన సాహిత్యాలలో ఒకటిగా గుర్తించబడుతుంది. ఇరాన్ సాహిత్యం అవెస్టా, జొరాష్ట్రియన్ సాహిత్య కవిత్వం కాలానికి చెందినదిగా భావిస్తున్నారు.

ఇరానియన్ సంప్రదాయ సాహిత్యం, సైన్సు, మెటాఫిజిక్సులలో కవిత్వం ఉపయోగించబడింది. పర్షియన్ భాష కవిత్వం రూపొందించి బధ్రపరచడానికి అనుకూలమైనదిగా ఉంది. ఇది ప్రంపంచంలోని నాలుగు ప్రముఖ సాహిత్యాలలో ఒకటిగా భావించబడుతుంది. పర్షియన్ భాషలు ఇరానియన్ పీఠభూమి ద్వారా చైనా నుండి సిరియా, రష్యా వరకు వాడుకలో ఉన్నాయి. ఇరాన్‌లో రూమీ, ఫెర్డోస్, హాఫెజ్, సాదీ షిరాజ్, ఖయ్యాం, నెజామీగంజమి మొదలైన ప్రముఖ కవులు ఉన్నారు. ఇరానియన్ సాహిత్యం జియోతె, థొరెయు, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ మొదలైన రచయితలను ఆకర్షించింది.

తాత్వికత

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Depiction of a Fravarti in Persepolis

ఇరానియన్ తాత్వికతకు " ఇండో- ఇరానియన్ " మూలంగా ఉంది. దీనిని జొరాస్ట్రియన్ బోధనలు ఇరాన్ తత్వశాత్రం మీద అత్యంత ప్రభావం చూపాయి. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ ఫిలాసఫీ అనుసరించి విషయచరిత్ర, త్వత్వశాస్త్రం ఇండో- ఇరానీయులతో ప్రారంభం అయిందని భావిస్తున్నారు. ఇది క్రీ.పూ 1500 లలో సంభవించిందని భావిస్తున్నారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ " జొరాష్ట్రా తత్వశాస్త్రం యూదులు , ప్లాటోనిజం ద్వారా పశ్చిమదేశాలలో ప్రవేశించిందని భావిస్తున్నారు. భారతీయ వేదాలు , ఇరానియన్ అవెస్టాలకు పురాతనకాలం నుండి సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు. వేదాలు , అవెస్టా రెండు ప్రధాన తాత్వికశాత్రాలుగా గౌరవించబడుతున్నాయి. ఇవి ఆధారభూతమైన వ్యత్యాసంతో రూపొందించబడ్డాయి. విశ్వంలోని మానవుల స్థితి , సంఘం సంబంధిత సమస్యలపరిష్కారంలో మానవులపాత్రను తెలియజేస్తున్నాయి. సైరస్ సిలిండర్ " మనవ హక్కుల ప్రారంభ రూపం " అని భావిస్తున్నారు. ఇవి మానవులలో ఉదయించే ప్రశ్నలకు , ఆలోచనలకు సమాధానమే తత్వశాస్త్రం అని భావించబడుతుంది. తత్వశాస్త్రం అచమెనింద్ సాంరాజ్యంలోని జొరాష్ట్రియన్ పాఠశాలలలో " జరాథుస్త్రా" పేరుతో తత్వశాస్త్రం బోధించబడింది. జొరాష్ట్రియన్ పాఠశాలలో ఆరంభకాల విద్యార్థులు జొరాష్ట్రియన్ మతసిద్ధాంతాలను అవెస్టన్ భాషలో అధ్యయనం చేసారు. వీటిలో షికంద్- గుమానిక్ - విచార్, డేంకర్ద్, జాత్స్ప్రం మొదలైన గ్రంథాలు అవెస్టా, గథాస్ లకు ఆధారగ్రంధాలుగా ఉన్నాయి.

పురాణాలు

ఇరానియన్ పురాణాలలో ఇరానియన్ జాపదసాహిత్యం, గాథలు మిశ్రితమై ఉంటాయి. అవి దేవతల గురించి మంచి, చెడు కార్యాల ఫలితాలను వివరిస్తుంటాయి. అలాగే గొప్ప కావ్యనాయకులు, అద్భుతాలను వివరిస్తుంటాయి.

పురాణాలు ఇరాన్ సంస్కృతిలో ప్రముఖపాత్ర వహిస్తుంటాయి. కౌకసస్, అనటోలియా, మద్య ఆసియా, ప్రస్తుత ఇరాన్ కలిసిన గ్రేటర్ ఇరాన్ అందులోని ఎత్తైన పర్వతశ్రేణి ఇరాన్ పురాణాలలో ప్రముఖపాత్ర వహిస్తున్నాయి.

ఫెర్డోస్ విరచిత షహ్నమెహ్ గ్రంథం ఇరాన్ పురాణసాహిత్య గ్రంథాలలో ప్రధానమైనదిగా భావించబడుతుంది. అందులో జొరాష్ట్రియనిజం సంబంధిత విస్తారమైన పాత్రలు, కథనాలు చోటుచేసుకున్నాయి. దీనికి అవెస్టా, డెంకద్, బుందహిష్న్ ఆధారంగా ఉన్నాయి.

పండుగలు , జాతీయ దినాలు

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Haft-Seen (or Haft-Čin), a customary of the Iranian New Year

ఇరాన్‌లో మూడు అధికారిక క్యాలెండర్‌లు వాడుకలో ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది సోలార్ హిజ్రి క్యాలెండర్. అంతర్జాతీయ క్యాలెండర్‌గా " గ్రిగేరియన్ క్యాలండర్ " వాడుకలో ఉంది. ఇది క్రైస్తవ పండుగలకు ఆధారంగా ఉంది. అలాగే ఇస్లామిక్ క్యాలెండర్ ఇస్లామిక్ పండుగలకు ఆధారంగా ఉంటాయి.

ఇరాన్ జాతీయ వార్షిక పర్వదినాలలో " నౌరజ్ " ప్రధానమైనది. పురాతన సంప్రదాయానికి గుర్తుగా ఇది మార్చి 21న జరుపుకుంటారు. ఇది కొత్తసంవత్సర ఆరంభదినంగా భావించబడుతుంది. దీనిని వివిధ మతాలకు చెందిన ప్రజలు ఆనందంగా జరుపుకుంటారు. అయినప్పటికీ ఇది జిరాష్ట్రియన్ల పండుగ. ఇది మానవత్వానికి "మాస్టర్ పీస్ ఆఫ్ ఓరల్ అండ్ ఇంటాణ్జిబుల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమనిటీ " (అగోచరమైన ఊహాత్మక మానవ వారసత్వం) భావించబడుతుంది. ఇది పర్షియన్ కొత్తసంవత్సరంగా పరిగణించబడుతుంది. 2009లో యునెస్కో అనుసరించి:

ఇరాన్ ఇతర జాతీయ దినాలు

  • షహర్షంబీ సూరీ : నౌరుజ్ కు ముందుగా జరుపుకునే పవిత్ర అగ్ని (అతర్) ఉత్సవం. దీనిని నౌరుజ్ కు ముందు జరుపుకుంటారు. ఇందులో టపాసులు కాల్చడం, ఫైర్ జంపింగ్ వంటి కార్యక్రమాలు ఉంటాయి.
  • సిజ్దాహ్ బెదర్: ఇల్లు వదిలి ప్రకృతితో ఐక్యం కావడం. దీనిని కొత్తదంవత్సరం 30 వ రోజున ఏప్రిల్ 2న జరుపుకుంటారు.
  • యల్ద: సంవత్సరంలో అతి దీర్ఘమైన రాత్రి. దీనిని " ఈవ్ ఆఫ్ వింటర్ సొలిస్టైస్ " అంటారు. కవిత్వ పఠనం, పుచ్చకాయ, దానిమ్మ, మిక్సెడ్ నట్స్ మొదలైన దేశీయ పండ్లను తినడం వంటివి జరుపుకుంటారు.
  • తిర్గన్ : ఇది వేసవి మద్య దినం. తిష్త్ర్యను గౌరవిస్తూ జర్పుకుంటారు. దీనిని తిర్ మాసం (జూలై 4న) జరుపుకుంటారు. నీటిని చల్లుకుంటూ కవిత్వం పఠిస్తూ సోల్- జర్ద్, స్పినాచ్ సూప్ వంటి సంప్రదాయ ఆహారాలు తింటూ జరుపుకుంటారు.
  • మెహ్ర్గన్ ఇది వార్షిక ఆకురాలు కాల ఉత్సవం. మిథ్రాను గౌరవిస్తూ దీనిని జరుపుకుంటారు. దీనిని మెహర్ మాసం 16 (అక్టోబరు 8) న కుటుంబం అంతా చేరి టేబుల్ మీద తీపి పదార్ధాలు, పూలు, అద్దం పెట్టి జరుపుకుంటారు.
  • సెపందర్మజ్గన్ : అమెషా స్పెంటా (పవిత్ర భక్తి) గౌరవార్ధం జరుపుకుంటారు. పండుగ సందర్భంగా భాగస్వాములకు బహుమతులు అందజేసుకుంటారు. దీనిని ఈస్ఫంద్ 15న (ఫిబ్రవరి 24) న జరుపుకుంటారు.

పండుగలు

జాతీయ పర్వదినాలతో వార్షికంగా రంజాన్, ఈద్-అల్-ఫిత్ర్, డే ఆఫ్ అసురా (రుజ్ ఇ అసురా) ముస్లిముల పండుగలుగా జరుపుకుంటారు. క్రిస్మస్, లెంట్ (సెల్లే ఇ రుజె),, ఇష్టర్ పండుగలను క్రైస్తవుల పండుగలుగా జరుపుకుంటారు. పూరిం, పాసోవర్ (ఈద్ ఇ ఫతిర్), తూ బీష్వత్ పండుగలను యూదులు జరుపుకుంటారు.

సంగీతం

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Karna, an ancient Iranian musical instrument from the 6th century BC

ఇరాన్ పురాతన సంగీతపరికరాలకు పుట్టిల్లు. క్రీ.పూ 3 వ మైలేనియానికి చెందిన సంగీత పరికరాలు ఇరాన్‌లో పురాతత్వ పరిశోధనశాఖ నిర్వహించిన త్రవ్వకాలలో లభించాయి. . ఇరానియన్లు నిలువు, అడ్డం, కోణాలతో ఉన్న సంగీతపరికరాలను మదక్తు, కుల్-ఇ- ఫరాహ్ సమీపంలో కనుగొనబడ్డాయి. ఇక్కడ పెద్ద ఎత్తున ఎలమైట్ పరికరాలు నమోదు చేయబడ్డాయి. అస్సిరియన్ ప్రాంతలలో పలు హార్ప్స్ నమోదు చేయబడ్డాయి.అస్సిరియన్ ప్రాంతాలలో పలు నిలువు హార్ప్స్ చిత్రాలు ఉన్నాయి. ఇవి క్రీ.పూ. 865-650 నాటికి చెందినవని భావిస్తున్నారు.

" క్సెనొఫోన్ సైరొపడియా " విధానం అనేక మంది స్త్రీలు కలిసి పాడే సంగీతప్రక్రియగా భావించబడుతుంది. వీరు అచమెనింద్ సభలో కీర్తించబడింది. అచమెనింద్ చివరి రాజు అథెనియస్ ఆఫ్ నౌక్రాటిస్ రాజ్యాలలో, అర్తశత (క్రీ.పూ 336-330) సభలలో ఈ ప్రక్రియ వాడుకలో ఉంది. గయనీమణులను మెసెడోనియా సైనికాధికారి పరమెనియన్ పట్టి తెచ్చాడని భావిస్తున్నారు. పార్ధియన్ సామ్రాజ్యంలో ఒకవిధమైన కావ్యసంగీతంలో యువతకు శిక్షణ ఇవ్వబడింది. జాతీయ కావ్య చిత్రాలు, పురాణాలు " షహ్నమెహ్ , ఫెర్డోస్ ప్రక్రియలలో ప్రతిబింబీంచాయి.

సస్సనిద్ సంగీతం

సస్సనిద్ సంగీతం చరిత్ర జిరాష్ట్రియన్ రచనలలో కనిపిస్తున్నాయి. ఇది ఆరంభకాల సస్సనిద్ చరిత్రలో నమోదు చేయబడింది. సాస్సనిద్ రాజసభలలో ఖొస్రొ సంగీతప్రక్రియ పోషించబడింది. ఇందులో రంతిన్, బంషద్, నకిస, అజాద్, సర్కాష్ , బర్బాద్ విధానాలు ఉంటాయి.

దస్త్రం:Mehmoonifinal2.jpg
A Safavid painting at Hasht Behesht, depicting a 7th-century Iranian banquet

కొన్ని ఇరానియన్ సంప్రదాయ సంగీత పరికరాలలో సాజ్, తార్, డోతర్, సెతార్, కామంచె, హార్ప్, బర్బాత్, సంతూర్, తంబూర్, క్వనన్, డాప్, తాంబాక్ , నే ప్రధానంగా ఉన్నాయి.

దస్త్రం:Iran national orchestra.jpg
The National Orchestra of Iran, conducted by Khaleghi in the 1940s

ఆధునిక సంగీతం

1940 లో మొదటి నేషనల్ మ్యూజిక్ సిసైటీ " రౌహొల్లాహ్ ఖలేఘీ " స్థాపించబడింది. ఇది 1949 లో " స్కూల్ ఆఫ్ నేషనల్ మ్యూజిక్ " పేరుతో సంగీత పాఠశాలను స్థాపించింది. ఇరాన్ ప్రధాన ఆర్కెస్ట్రాలో " ఇరాన్ నేషనల్ ఆర్కెస్ట్రా " ది మెలాల్ ఆర్కెస్ట్రా , తెహ్రాన్ సింఫోనీ ఆర్కెస్ట్రా భాగంగా ఉన్నాయి. క్వాజర్ శకంలో ఇరానియన్ పాప్ మ్యూజిక్ వెలుగులోకి వచ్చింది. 1950 లో విగుయన్(కింగ్ ఆఫ్ పాప్ అండ్ జాజ్" ప్రదర్శకుడు) పాప్ గాయకుడుగా కీర్తిగడించాడు. 1970లో ఇరానియన్ సంగీతప్రపంచంలో సంభవించిన విప్లవాత్మక మార్పు సంభవించిన సమయంలో ఇరానియన్ పాప్ మ్యూజిక్ స్వర్ణయుగం ఆరంభం అయింది. స్థానిక సంగీతపరికరాలకు ఆధునిక ఎలెక్ట్రానిక్ గితార్ వాడుకలోకి వచ్చింది. ఈ సమయంలో హయేదేహ్, ఫరమార్జ్ అస్లాని, ఫర్హాద్ మెహ్రద్, గూగూష్, ఎబి మొదలైన సంగీతకారులు ప్రముఖకళాకారులుగా ఉన్నారు ఇరానియన్ రాక్, ఇరానియన్ హిప్ హాప్ ప్రవేశించిన తరువాత యువత పాత సంగీతప్రక్రియను విడిచి కొత్తపంథాను అనుసరించడం మొదలైంది. తరువాత ఇరాన్ సంగీతప్రక్రియలలో కొత్త సంగీత విధానాల ప్రభావం చూపాయి.

థియేటర్

ఇరాన్ థియేటర్ సంస్కృతి పురాతనత్వంకగి పురాతన చరిత్రతో ముడివడి ఉంది. తెపే సియాక్, తెపే మౌసియన్ మొదలైన చరిత్రకు పూర్వంనాటి ప్రాంతాలలో నృత్యసంబంధిత ఆరంభకాల ఆధారాలు లభించాయి. కావ్యలలో వర్ణించబడిన ఉత్సవ కాల వేదికలలో (సౌగ్ ఇ సివాష్, మొగ్ఖొషి) నృత్యాలు, నటన సంబంధిత విషయాలు థియేటర్ సస్కృతికి ఆరంభం అని భావిస్తున్నారు. ఇరానియన్ పురాణరచనలైన హెరొడోటోస్, క్సెనొఫోన్ లలో ఇరానియన్ నృత్యం, థియేటర్ గురించిన వర్ణనలు చోటుచేసుకున్నాయి.

ఇరాన్ చలనచిత్రాలు ప్ర్రంరంభానికి ముందు పలు కళాప్రక్రియలు రూపొందించబడ్డాయి. వీటిలో క్సెమే షాంబ్ బాజి (పప్పెటరిఉ), సాయే బాజీ (తోలుబొమ్మలు), రూ- హౌజీ (హాస నాటకాల్య్), తాజియే (సారో నాటకాలు) మొదలైనవి ప్రధానమైనవి. రోష్టంఅండ్ సొహార్బ్ కావ్యం ఆధాంగా రూపొందించబడిన రోష్టం అండ్ సొహాబ్ (షహనమె) ప్రస్తుత ఇరాన్ ఆధునిక నాటకరంగ ప్రదర్శనకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.

సినిమా , అనిమేషన్

ఇరాన్ చరిత్రలో విషయుయల్ ప్రాతినిథ్యానికి ఉదాహరణలు " పర్సెపోలీస్ బాస్ రిలీఫ్ కాలానికి చెందినవి (క్రీ.పూ. 500). పురాతన అచమెనింద్ సాంరాజ్యానికి పర్సెపోలీస్ ఉత్సవ కేంద్రంగా ఉంది. సస్సనింద్ శకంలో ఇరానియన్ విష్యుయల్ ఆర్ట్స్ శిఖరాగ్రం చేరుకున్నాయి. ఈ సమయంలో తాక్వ్ బొస్టన్‌లో అబాస్ - రిలీఫ్ నుండి చిత్రీకరించిన వేటదృశ్యాలు ఉన్నాయి. ఈ కాలానికి చెందిన ఇటువంటి కళారూపాలు అధునాతన విధానాలలో అత్యున్నత ప్రమాణాలతో రూపొందించడ్డాయి. ఇవి చలనచిత్రాల క్లోజప్ దృశ్యాలకు మూలంగా ఉండవచ్చని భావిస్తున్నారు. వీటిలో గాయపడిన అడవిపంది వేట ప్రాంతం నుండి తప్పించుకుని పోవడం చిత్రీకరించబడింది. 20వ శతాబ్దం ఆరంభంలో 5 సంవత్సరాల చరిత్ర కలిగిన చలనచిత్ర పరిశ్రమ ఇరాన్‌లో ప్రవేశించింది. మొదటి ఇరానియన్ చలన చిత్ర నిర్మాత " మిర్జా ఎబ్రహాం ఖాన్ అక్కాస్ బాష్ ", అధికారిక చాయాచిత్రకారుడు క్వాజర్‌చెందిన " మొజాఫర్ అద్ దిన్ షాహ్ క్వాజర్ " . " మిర్జా ఇబ్రహీం ఖాన్ " 1940లో తెహ్రాన్‌లో మొదటి సినిమాథియేటరును ప్రారంభించాడు. తరువాత రుస్సీ ఖాన్, అర్దాషిర్ ఖాన్ , అలి వకిల్ " తెహ్రాన్‌లో సరికొత్త థియేటర్లను ప్రారంభించారు. 1930 ప్రారంభం వరకు తెహ్రాన్‌లో 15 సినిమా థియేటర్లు ఇతర ప్రాంతాలలో 11 థియేటర్లు ప్రారంభించబడ్డాయి.1930లో మొదటి ఇరానియన్ మూకీ చిత్రం " ప్రొఫెసర్ ఓవంస్ ఒహనియన్ " చేత నిర్మించబడింది. మొదటి 1932లో శబ్ధసహిత చలన చిత్రం " లోరీ గిర్ల్" అబ్దొల్ హుస్సేన్ సెపంత చేత నిర్మించబడింది.

1960లో ఇరానియన్ చిత్రరంగం గణనీయమైన అభివృద్ధి చెందింది. వార్షికంగా 25 చిత్రాలు నిర్మించబడ్డాయి. దశాబ్ధం చివరకు వార్షికంగా 65 చిత్రాలు నిర్మించబడ్డాయి. అత్యధిక చిత్రాలు మెలో డ్రామా, త్రిల్లర్ కథాంశలు కలిగి ఉన్నాయి. క్వేసర్, ది కౌ, చిత్రాలకు మాసౌద్ కిమియై, దరిష్ మెహ్రుజ్ 1969లో దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాలు చిత్రరంగంలో వారి ప్రతిభను ఎత్తి చూపాయి. 1954లో చిత్రోత్సవం గోల్రిజాన్ ఫెస్టివల్ నిర్వహించబడింది. ఇది 1969లో నిర్వహించిన సెపాస్ ఫెస్టివల్‌కు మార్గదర్శకంగా ఉంది. ఈ ప్రయత్నాలు 1973 తెహ్రాన్ వరల్డ్ ఫెస్టివల్ విజయానికి కారణం అయ్యాయి.

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Abbas Kiarostami

1979 తరువాత కొత్త ప్రభుత్వం చిత్రనిర్మాణానికి కొత్త చట్టాలు, ప్రమాణాలు నిర్ణయించింది. ఇరానియన్ చలనచిత్రాలలో కొత్త శకం ప్రారంభం అయింది. ఖొస్రో సినై తరువాత అబ్బాస్ కైరోస్తమీ (క్లోజప్ సినిమా), జాఫర్ పనాహీ వంటి దర్శకులు పరిచయమై ప్రజలకు ఆరాధనీయులు అయ్యారు. 1977లో ఆయన " టేస్ట్ ఆఫ్ చెర్రీ " చిత్రం కొరకు పాల్మే డ్'ఓర్" అవార్డ్ అందుకున్న తరువాత ప్రపంచచిత్రరంగానికి ఇరాన్ చిత్రాలగురిచి అవగాహనకలిగింది.

కేంస్ ఫిలిం ఫెస్టివల్, వెనిస్ ఫిలిం ఫెస్టివల్, బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ మొదలైన అంతర్జాతీయ వేదికలలో ఇరానియన్ చిత్రాలు నిరంతరాయంగా ప్రదర్శించబడిన తరువాత ఇరాంచిత్రరాజాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.2006లో 6 వైవిధ్యమైన శైలి కలిగిన ఇరానియన్ చిత్రాలు బెర్లిన్ ఫిల్ం ఫెస్టివల్‌లో ప్రదర్ శించబడ్డాయి. ఇరాన్ చిత్రరంగంలో ఇది చరిత్ర సృష్టించిందని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఇరానియన్ దర్శకుడు అస్ఘర్ ఫర్హంద్ " బెస్ట్ ఫారిన్ లాంగ్యుయేజ్ " కొరకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు, అకాడమీ అవార్డును అందుకున్నాడు. 2012లో టైం మాగజిన్ ప్రంపంచంలోని 100 ప్రతిభావంతులైన వారిలో ఒకడుగా అస్ఘర్ ఫర్హంద్‌ను పేర్కొన్నది.

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Reproduction of the world's oldest example of animation, dating back to the late half of the 3rd millennium BC, found in Burnt City, Iran

పురాతన అనిమేషన్ రికార్డులు క్రీ.పూ 3 మైలేయానికి చెందినవి.ఆగ్నేయ ఇరాన్‌లోని " బర్ంట్ సిటీలో "5,200 వందల పురాతనమైన " ఎర్తెన్ గ్లోబ్లెట్ " ఒకటి కనుగొనబడింది. అనిమేషన్‌కు ప్రపంచంలోని పురాతన చిహ్నాలలో ఇది ఒకటి అనిభావిస్తున్నారు.1950 లో ఆధునిక ఇరాన్‌లో అనిమేషన్ కళ అభ్యసించబడుతుంది. 4 దశాబ్ధాల ఇరాన్ అనిమేషన్ తయారీ , మూడు దశాబ్ధాల అనుభవం ఉన్న " కానూన్న్ఇంస్టిట్యూట్ ", తెహ్రాన్ ఇంటర్నేషనల్ అనిమేషన్ ఫెస్టివల్ 1999 లో నిర్వహించబడింది. ప్రతి రెండు సంవత్సరాలకు 70 దేశాలకంటే అధికమైన దేశాల నుండి ప్రతినిధులు ఈ ఉత్సవానికి హాజరౌతుంటారు. ఇది ఇరాన్‌ను అతిపెద్ద అనిమేషన్ మార్కెట్టుగా మార్చింది.

సినిమాలు

  1. బరాన్
  2. చిల్డ్రన్ ఆఫ్ హెవెన్
  3. ది సేల్స్‌మన్
  4. ది సైక్లిస్ట్
  5. ది ఆపిల్

ప్రభుత్వం , రాజకీయాలు

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Ali Khamenei, Supreme leader of Iran, talking with former Brazilian president Luiz Inácio Lula da Silva
ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Iran's syncretic political system combines elements of a modern Islamic theocracy with democracy.

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాజకీయవిధానం 1979 ఇరాజ్ రాజ్యాంగ విధానం, ప్రభుత్వ అధికకారకార్యవర్గం అనుసరించి ఉంటుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఇస్లామిక్ న్యాయవిధానాల సంరక్షణ, పర్యవేక్షణ బాధ్యతవహిస్తాడు. సుప్రీం లీడర్ ఆర్ం ఫోర్స్ల కమాండర్ ఉండి సైన్యం, ఇంటెలిజంస్, రక్షణ బాధ్యతల నిర్వహణ, యుద్ధం, శాంతి లేక సంధిప్రయత్నాలు నిర్ణాయీధికారం కలిగి ఉంటాడు. న్యాయాధికారం, రేడియో, టేలివిషన్ నెట్వర్క్స్, పోలీస్, మిలటరీ కమాండింగ్ బాధ్యతవహించడానికి గార్డియన్ కౌంసిల్ 12 సభ్యులలో 6 గురు సుప్రీం లీడర్‌చే నియమించబడతారు. అసెంబ్లీ ఎక్సోర్ట్స్ సుప్రీం లీడర్ ఎన్నిక, తొలగింపు అధికారం కలిగి ఉంటారు. సుప్రీం లీడర్ తరువాత రాజ్యాంబద్ధమైన అధికారిగా ఇరాన్ అధ్యక్షుడు ఉంటాడు.

అధ్యక్షుడు

అధ్యక్షుని ఎన్నిక 4సంవత్సరాలకు ఒకమారు ఉంటుంది. అధ్యక్షుడు తిరిగి మరొకమారు మాత్రమే ఎనూకొనబడడానికి అర్హత కలిగి ఉంటాడు. అధ్యక్ష పదవికి పోటీచేవారు గార్డియంకౌంసిల్ అనుమతి పొందవలసిన అవసరం ఉంది. అధ్యక్షుడు రాజ్యాంగం అమలు, నిర్వహణాధికారాలు (సుర్పీం లీడర్ అధికారాలకు అతీతం) కలిగి ఉంటాడు. 8 మంది ఉపాధ్యక్షులు అధ్యక్షునికి సహాయంగా పనిచేస్తారు. ఇరాన్ లెజిస్లేచర్ యునికెమరల్ బాడి అని పిలువబడుతుంది. ఇరాన్ పార్లమెంటులో 290 మంది సభ్యులు ఉంటారు. ఇరాన్ పార్లమెంటు అంతర్జాతీయ ఒప్పందాలు, దేశీయ బడ్జెట్ అనుమతి మొదలైన బాధ్యతలు వహిస్తుంది. పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులను అందరూ గార్డియన్ కౌంసిల్ అనుమతి పొందవలసిన అవసరం ఉంది. గార్డియన్ కౌంసిల్‌లో 12 మంది న్యాయాధికారులలో 6 సుప్రీం లీడర్ చేత నియమించబడతారు. ఇతరులను ఇరానియన్ పార్లమెంటు చేత నియమించబడతారు. జ్యూడీషియల్ సిస్టం హెడ్ జ్యూరిస్టుల నియామకం చేస్తాడు. కౌంసిల్ వీటో అధికారం కలిగి ఉంటుంది. చట్టం షరియా (ఇస్లామిక్ చట్టం), రాజ్యాంగానికి అనుకూలంగా లేకుంటే అది పరిశీలన కొరకు తిరిగి పార్లమెంటులో ప్రవేశపెట్టబడుతుంది. ఎక్స్పెడియంసీ కౌంసిల్ పార్లమెంటు, గార్డియన్ కౌంసిల్ వివాదాల ఆదేశాధికారం ఉంటుంది. అలాగే సుప్రీం లీడర్ సలహామండలిగా సేవలు అందిస్తుంది. ప్రాంతీయ నగర కౌంసిల్ (లోకల్ సిటీ కౌంసిల్) ను ప్రజాఓటింగ్ విధానంలో ఎన్నుకుంటారు. వీరిని ఇరాన్‌లోని నగరాలు, గ్రామాలకు చెందిన ప్రజలందరూ కలిసి ఎన్నుకుంటారు.

చట్టం

దస్త్రం:Parliament of Iran 2.jpg
The Iranian Parliament

సుప్రీం లీడర్ ఇరాన్ జ్యుడీషియరీ అధ్యక్షుని నియమిస్తాడు. జ్యుడీషియరీ అధ్యక్షుడు సుప్రీం కోర్ట్ అధ్యక్షుడు, ప్రాసిక్యూటర్లను నియమిస్తాడు. . పబ్లిక్ కోర్టులు సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరిస్తుంది. ఇస్లామిక్ రివల్యూషనరీ కోర్టులు జాతీయ రక్షణ మొదలైన కేసులను పరిష్కరిస్తాయి. ఇస్లామిక్ రివల్యూషనరీ కోర్టుల నిర్ణయాలు అంతిమమైనవి ఇక్కడ ఇచ్చిన తీర్పు తరువాత మరెక్కడా అప్పీల్ చేసుకోవడానికి వీలు ఉండదు. ది స్పెషల్ క్లరికల్ కోర్టులు క్లరిక్ కేసుల పరిష్కారం, ప్రజల వ్యక్తిగత కేసులను పరిష్కరిస్తుంది. స్పెషల్ క్లరికల్ కోర్టులు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. సుప్రీం లీడర్ మాత్రమే వీటిమీద ఆధిక్యత కలుగి ఉంటాడు. స్పెషల్ క్లరికల్ కోర్టుల తీర్పు అంతిమమైనది ఇక్కడ తీర్పు ఇచ్చిన తరువాత మరెక్కడా అప్పీల్ చేయడానికి వీలు ఉండదు. అసెంబ్లీ ఎక్స్పర్టులు 86 మంది సభ్యులను 8 సంవత్సరాలకు ఒకసారి ఓటుహక్కుతో అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికలలో ఎన్నుకుంటారు. సభ్యుల అర్హతను గార్డియన్ కౌంసిల్ నిర్ణయిస్తుంది. సుప్రీం లీడర్‌ను అసెంబ్లీ ఎన్నుకుంటుంది. అసెంబ్లీ ఎప్పుడైనా సుప్రీం లీడర్ నియామకం రద్దుచేసే అధికారం కలిగి ఉంటుంది. సుప్రీం లీడర్ నిర్ణయాలను సవాలు చేసే అధికారం అసెంబ్లీకి ఉండదు. " టెలీ కమ్యూనికేషన్ ఆఫ్ ఇరాన్ " టెలీకమ్యూనికేషన్ నిర్వహణ చేస్తుంది. ది మీడియా ఆఫ్ ఇరాన్ ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యంలో పనిచేస్తుంది. పుస్తకాలు, చలనచిత్రాలు విడుదలకు ముందు " ది మినిస్ట్రీ ఆఫ్ ఎర్షాద్ " అనుమతి పొందవలసిన అవసరం ఉంది. ఇరాన్ అంతర్జాల సేవలు 1993 నుండి మొదలైయ్యాయి. ఇరానియన్ యువతలో ఇది అత్యంత ఆదరణ సంతరించుకుంది.

విదేశీ సంబంధాలు

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Iranian President Hassan Rouhani meeting with Russian President Vladimir Putin – Iran and Russia are strategic allies.
ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Iranian FM Zarif shakes hands with John Kerry during the Iranian nuclear talks – There is no formal diplomatic relationship between Iran and the USA.

ఇరానియన్ ప్రభుత్వం అధికారికంగా న్యూ వరల్డ్ ఆర్డర్ స్థాపించింది. ఇందులో ప్రపంచ శాంతి, గ్లోబల్ కలెక్టివ్ సెక్యూరిటీ (అంతర్జాతీయ సమైక్యరక్షణ), న్యాయనిర్ణయం భాగంగా ఉన్నాయి. రివల్యూషన్ తరువాత ఇరాన్ విదేశీ సంబంధాలు అన్నీ రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఇరాన్‌లో విదేశీయుల జోక్యాన్నిబహిష్కరించడం, అభివృద్ధి చెందుతున్న, అలీన దేశాలతో సత్సంబంధాలు అభివృద్ధి చేసుకోవడం ప్రధానాంశాలుగా ఉన్నాయి.2005 నుండి " న్యూక్లియర్ ప్రోగ్రాం ఆఫ్ ఇరాన్ " అంతర్జాతీయంగా వివాదాంశం అయింది. ఇరాన్ తన ప్రత్యర్థులతో యుద్ధసమయంలో (ప్రత్యేకంగా ఇజ్రేల్ మీద) అణ్వాయుధ ప్రయోగం చేయగలదన్నది వివాదాంశంగా ఉంది. " ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం " అణ్వాయుధ తయారీకి దారితీస్తుందని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఐక్యరాజ్యసమితి ఆర్థిక మంజూరీలను నిషేధించడానికి దారితీసింది. 2009 నుండి ఇది ఇరాన్‌ను మిగిలిన ప్రపంచదేశాలలో ఆర్థికంగా ఒంటరిని చేసింది. " ది యు.ఎస్.డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజంస్) ఇరాన్‌ను అణయుధ తయారీ చేయలేదని 2013 లో వెల్లడించింది.

దౌత్య సంబంధాలు

2009 నాటికి ఇరాన్ అఖ్యరాజ్యసమితి సభ్యదేశాలలో 99 దేశాలతో దౌత్యసంబంధాలు కలిగి ఉంది. అయినప్పటికీ యునైటెడ్ స్టేట్స్ , ఇజ్రేల్‌తో దౌత్యసంబంధాలు లేవు. 1979 రివల్యూషన్ నుండి యునైటెడ్ స్టేట్స్ , ఇజ్రేల్‌ ఇరాన్‌ను గుర్తించలేదు.1945 జూలై 14న తెహ్రాన్ " పి5+1" న్యూక్లియర్ రీసెర్చ్ ప్రోగ్రాంను ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజంసీ నియమాలను అనుసరించి క్రమబద్ధీకరణ చేసిన తరువాత ఇరాన్‌ మీద విధించబడిన ఆర్థిక అంక్షలు తొలగించబడ్డాయి. ఇరాన్ జి -77, జి -24, జి-15, ఐ.ఎ.ఇ.ఎ., ఐ.ఎ.బి.ఆర్.డి., ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ (ఐ.డి.ఎ), ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఐ.డి.బి), ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐ.ఎఫ్.సి), ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐ.ఎల్.ఓ), ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐ.ఎం.ఎఫ్), ఇంటర్నేషనల్ మారిటైం ఆర్గనైజేషన్, ఇంటర్పోల్ (సంస్థ), ఇస్లామిక్ సహకార సంస్థ (ఓ.ఐ.సి, ఓ.పి.ఎ.సి., మొదలైన అంతర్జాతీయ సంస్థలలో సభ్యత్వం కలిగి ఉంది. ఐక్యరాజ్యసమితి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రస్తుతం వరల్డ్ ట్రేడ్ ఆగనైజేషన్ వద్ద పర్యవేక్షణ అర్హత కలిగి ఉన్నాయి.

మిలటరీ

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రెండు విధానైన సైనిక శక్తిని కలిగి ఉంది. రెగ్యులర్ ఫోర్స్‌లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఆర్మీ, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఎయిర్ ఫోర్స్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్నేవీ, ఆర్మీ ఆఫ్ ది గార్డియంస్ ఆఫ్ ది ఇస్లామిక్ రివల్యూషన్‌లలో 5,45,000 క్రీయాశీలక బృందాలు ఉన్నాయి. ఇరాన్‌లో 3,50,000 రిజర్వ్ దళాలు ఉన్నాయి. ఇరాన్‌లో పారామిలటరీ వాలంటీర్ మిలిటియా ఫోర్స్ (ఐ.ఆర్.గి.సి) ఉంది దీనిని బసీజ్ అని కూడా అంటారు. ఇందులో 90,000 ఫుల్ టైం యాక్టివ్ యూనిఫాం సభ్యులు ఉంటారు. 11 మిలియన్ల స్త్రీ పురుష బసీజ్ సభ్యులు పిలుపు అందుకున్న తరువాత సైనికసేవలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంటారు. గ్లోబల్ స్ర్క్యూరిటీ ఆర్గనైజేషన్ అంచనా అనుసరించి ఇరాన్ ఒక మిలియన్ పురుషులను తరలించిందని భావిస్తున్నారు. వరల్డ్ ట్రూప్ మొబలైజేషన్‌లో ఇది అత్యధికం అని భావిస్తున్నారు. 2007లో ఇరాన్ మిలటరీ కొరకు జి.డి.పిలో 2.6% (తసరి 102 అమెరికన్ డాలర్లు ) వ్యయం చేస్తుంది. పర్షియన్ గల్ఫ్ దేశాలలో ఇది అత్యల్పం. ఇరాన్ మిలటరీ డాక్టరిన్ " డిఫరెంస్ థియరీ " అధారితమై ఉంది. 2014లో మిలటరీ వ్యయం కొరకు ఇరాన్ 15 బిలియన్లు వ్యయం చేస్తుంది. ఇరాన్ సిరియా, ఇరాక్, లెబనాన్ (హెజ్బొల్లాహ్) సైనిక చర్యలకు వేలకొలది మిస్సైల్స్, రాకెట్లు అందిస్తూ మద్దతు ఇస్తుంది. 1979 నుండి రివల్యూషన్ విదేశీ అంక్షలను అధిగమించడానికి ఇరాన్ తన స్వంత మిలటరీ పరిశ్రమని అభివృద్ధి చేసింది. ఇరాన్ స్వయంగా ట్యాంకులు, అర్మోర్డ్ పర్సనల్ కారియర్స్, గైడెడ్ మిస్సైల్స్, సబ్మెరీన్, మిలటరీ వెసెల్స్, ఇరానియన్ డిస్ట్రాయర్ జమరాన్ (గైడెడ్ మిస్సైల్ డిసాస్టర్), రాడార్ సిస్టంస్, హెలీకాఫ్టర్లు, ఫైటర్ ప్లేన్స్ తయారు చేసుకుంది. సమీపకాలంలో హూట్ (మిస్సైల్స్), కౌసర్, జెల్జా, ఫతేష్ -110, షాహబ్-3, షెజ్జిల్ మిసైల్స్, ఇతర స్వయం చోదిత బాహనాలు (అన్ మాండ్ ఏరియల్ వెహికస్) తయారీ గురించి ఇరాన్ అధికారిక ప్రకటనలు చేసింది. అత్యాధునిక బాసలిక్ మిసైల్స్‌లో ఫాజర్-3 (ఎం.ఆర్..వి)ఒకటి. ఇది లిక్విడ్ ఫ్యూయల్‌తో పనిచేసే మిసైల్. ఇది దేశంలో తయారు చేయబడి అందించబడింది.

క్రీడలు

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Azadi Stadium, Tehran

ఇరాన్ జనసంఖ్యలో మూడింట రెండువంతులు 25 సవత్సరాల లోపువారు. ఇరాన్‌లో సంప్రదాయ, ఆధునిక క్రీడలు ఆడబడుతున్నాయి.

పోటో

పోటో క్రీడ జన్మస్థానం ఇరాన్. ఇది ఇరాన్‌లో పర్షియన్ భాషలో " కౌగాన్", పహలవని కొస్టి (హిరోయిక్ మల్లయుద్ధం) అని పిలువబడుతుంది. " ఫ్రీ స్ట్రైల్ రెస్ట్లింగ్ " సంప్రదాయంగా ఇరాన్ జాతీయక్రీడగా గౌరవించబడుతుంది. " ఇరాన్ నేషనల్ ఫ్రీ స్ట్రైల్ రెస్ట్లింగ్ అథెట్లు " బృదం ఒలింపిక్ క్రీడలలో పాల్గొంటారు.

ఫుట్ బాల్

" ఇరాన్ ఫుట్ బాల్ " ఇరాన్‌లో ప్రాముఖ్యత కలిగి క్రీడలలో ఒకటిగా భావించబడుతుంది. " ఇరాన్ నేషనల్ ఫుట్ బాల్ టీం " మూడుమార్లు ఆసియన్ కప్ గెలుచుకుంది.

వాలీ బాల్

ఇరాన్ క్రీడలలో ప్రాబల్యత సంతరించుకున్న క్రీడలలో రెండవ స్థానంలో ఉన్న క్రీడ " వాలీబాల్ ". " ఇరాన్ మెంస్ వాలీబాల్ టీం " 2014 ఎఫ్.ఐ.వి.బి. వాలీబాల్ వరల్డ్ లీగ్ " లో 4వ స్థానంలోనూ, " 2014 ఎఫ్.ఐ.వి.బి. వాలీబాల్ మెన్స్ వరల్డ్ చాంపియంషిప్ " లో 6వ స్థానంలోనూ ఉంది. అలాగే ఆసియన్ నేషనల్ టీంలలో ఉన్నత ఫలితాలు సాధించింది.

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Skiers at the Dizin Ski Resort

పర్వతారోహణ

పర్వతాలు అధికంగా ఉన్న ఇరాన్ పర్వతారోహకులకు వేదిగగా ఉంది. ఇరాన్ హైకింగ్ , రాక్ క్లైంబింగ్ పర్వతారోహణ లకు అనుకూలమైనది.

స్కీయింగ్ రిసార్ట్

ఇరాన్ స్కీయింగ్ రిసార్టులకు నిలయం. 13 ski resorts operate in Iran, ఇరాన్ లోని తోచల్, డిజిన్ , షెంషెక్ రిసార్టులు ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఇవి తెహ్రాన్‌కు మూడు గంటల ప్రయాణదూరంలో ఉన్నాయి. తోచల్ రిసార్ట్ ప్రపంచ ఎత్తైన రిసార్టులలో 5వ స్థానంలో ఉంది. (3,730 m or 12,238 ft ఎత్తున ఉంది).

బాస్కెట్ బాల్

బాస్కెట్ బాల్ ఇరాన్‌లో ప్రాముఖ్యత సంతరించుకుంది. 2007 నుండి " ఇరాన్ బాస్కెట్ బాల్ టీం " మూడుమార్లు ఎఫ్.ఐ.బి.ఎ. ఆసియా చాంపియన్ షిప్‌ను గెలుచుకుంది. 1974 లో ఆసియన్ గేంస్ లో ఇరాన్ ఆసియన్ గేంస్‌కు ఆతిథ్యం ఇచ్చింది. పశ్చిమాసియాదేశాలలో ఆసియన్ గేంస్‌కు ఆతిథ్యం ఇచ్చిన మొదటి దేశంగా ఇరాన్ గుర్తింపును పొందింది.

ఆహారసంస్కృతి

ఇరాన్: చరిత్ర, భౌగోళికం, వాతావరణం 
Kuku Sabzi with herbs, topped with barberries and walnuts

ఇరాన్ ఆహారాలు వైవిధ్యతను కలిగి ఉంటాయి. వీటి మీద పొరుగుప్రాంతాల ఆహారవిధానాలు విపరీతంగా ప్రభావితం చూపుతున్నాయి. ఊక్కొక ప్రాంతం ఆహారాలు, వండేవిధానం సంప్రదాయాలు , శైలి వైవిధ్యం కలిగి ఉంటాయి.

ఇరానియన్ ఆహారం బియ్యం, మంసం, కోడి మాసం, చేపలు , కూరగాయలు, వేళ్ళు , మూలికలను అధికంగా వాడుతుంటారు, మూలికలను అధికంగా ప్లం, దానిమ్మ, క్వింస్, ప్రూనెస్, అప్రికాట్స్ మొదలైన పండ్లతో మొలకలను చేర్చి తీసుకుంటుంటారు.

ఇరానీయులు సాధారణంగా సాదా యోగర్ట్ (ఒక విధమైన పెరుగు) ను మధ్యాహ్న భోజం , రాత్రి భోజనాలతో తింటూంటారు. ఇరాన్‌లో యోగర్ట్ ప్రధాన ఆహారాలలో ఒకటిగా ఉంది. అహారంలో సమతుల్యత కొరకు సుచాసన చేర్చడానికి కుంకుమ పువ్వు, ఎండిన నిమ్మకాయలు, దాల్చిన చెక్క , పార్స్లీ కలిపి కొన్ని ప్రత్యేకమైన వంటకాలను వండుతుంటారు. ఎర్రగడ్డలు , తెల్లగడ్డలు వంటలతో చేర్చి వండుతూ వటిని విడిగా కూడా భోజనసమయాలలో వడ్డిస్తుంటారు. వీటిని సహజసిద్ధంగా తరిగిన ముక్కలు , ఊరగాయరూపంలో భోజనం , ఉపాహారాలతో అందిస్తారు. ఇరాన్‌లో " కవీర్" ప్రాముఖ్యత సంతరించుకుంది.

ఇరాన్ కేబినెట్‌లో మహిళలు

  • దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఇరాన్ కేబినెట్‌లో మహిళలకు చోటు లభించింది. దేశాధ్యక్షుడిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అహ్మదీ నెజాద్ కేబినెట్‌లో గైనకాలజిస్టు మర్‌జిహే వహిద్ దస్త్‌జెర్ది (50), శాసనకర్త ఫాతిమే అజోర్లు (40) మహిళలు.1970ల తర్వాత ఇరాన్ కేబినెట్‌లో స్త్రీలకు చోటు దక్కడం ఇదే ప్రథమం. 1968-77 మధ్య ఫరోఖ్రో పార్సే చివరి మహిళా మంత్రిగా పనిచేశారు. 1979లో ఇస్లామిక్ విప్లవం అనంతరం అవినీతి ఆరోపణలపై ఆమెను పాలకులు ఉరితీశారు.ఈనాడు 17.8.2009

అధికారిక ప్రభుత్వ లింకులు

సూచికలు

బయటి లింకులు

Tags:

ఇరాన్ చరిత్రఇరాన్ భౌగోళికంఇరాన్ వాతావరణంఇరాన్ వృక్షజాలం , జంతుజాలంఇరాన్ ప్రాంతాలు,భూభాగాలు , నగరాలుఇరాన్ ఆర్ధికంఇరాన్ పర్యాటకంఇరాన్ విద్యుత్తుఇరాన్ విద్యఇరాన్ గణాంకాలుఇరాన్ సంస్కృతిఇరాన్ నిర్మాణశైలిఇరాన్ సాహిత్యంఇరాన్ తాత్వికతఇరాన్ పురాణాలుఇరాన్ పండుగలు , జాతీయ దినాలుఇరాన్ సంగీతంఇరాన్ థియేటర్ఇరాన్ సినిమా , అనిమేషన్ఇరాన్ ప్రభుత్వం , రాజకీయాలుఇరాన్ క్రీడలుఇరాన్ ఆహారసంస్కృతిఇరాన్ కేబినెట్‌లో మహిళలుఇరాన్ అధికారిక ప్రభుత్వ లింకులుఇరాన్ సూచికలుఇరాన్ బయటి లింకులుఇరాన్19351959en:Aryanen:Mohammad Reza Sha Pehlavien:cognateఆసియాపర్షియన్ భాష

🔥 Trending searches on Wiki తెలుగు:

మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిశతక సాహిత్యముభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాదగ్గుబాటి పురంధేశ్వరిభీమసేనుడుమశూచిజనసేన పార్టీకార్తీక్ ఘట్టమనేనివసంత వెంకట కృష్ణ ప్రసాద్కీర్తి సురేష్ఆదిత్య హృదయంశ్రీ కృష్ణదేవ రాయలుజవహర్ నవోదయ విద్యాలయంనాగ్ అశ్విన్మదర్ థెరీసాభారత రాజ్యాంగ పీఠికజాతీయములుసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ఏలూరు లోక్‌సభ నియోజకవర్గంPHరోజా సెల్వమణిసీమ చింతభారతదేశ అత్యున్నత న్యాయస్థానంఇన్‌స్టాగ్రామ్తమన్నా భాటియారాశి (నటి)పంచభూతలింగ క్షేత్రాలుప్రతాప్ సి. రెడ్డిసంభోగంసుడిగాలి సుధీర్లెనిన్జోల పాటలుకాప్చాఓం భీమ్ బుష్కుంభరాశిఘట్టమనేని మహేశ్ ‌బాబుమధుమేహంసింహరాశిఆత్రం సక్కునన్నయ్యవర్షంగౌడచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంకొండా విశ్వేశ్వర్ రెడ్డిఎయిడ్స్కామాక్షి భాస్కర్లకృష్ణా నదిచాకలిఆర్టికల్ 370 రద్దురజినీకాంత్సౌర కుటుంబండెక్కన్ చార్జర్స్పెరిక క్షత్రియులుగజము (పొడవు)ప్రజా రాజ్యం పార్టీభారత రాష్ట్రపతుల జాబితారాధికా పండిట్బి.ఆర్. అంబేద్కర్మాణిక్ సర్కార్నరసింహావతారంఇక్ష్వాకులుతెలుగు వికీపీడియాముహమ్మద్ ప్రవక్తరాజ్యసభషష్టిపూర్తిపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంశుభ్‌మ‌న్ గిల్శ్రీలీల (నటి)అండాశయముతొట్టెంపూడి గోపీచంద్మజిలీ (సినిమా)బ్రహ్మంగారి కాలజ్ఞానంనాగార్జునసాగర్శుక్రుడు జ్యోతిషంYహల్లులుమిథునరాశిఉష్ణోగ్రతభారతీయ శిక్షాస్మృతి🡆 More