హంసలదీవి: భారతదేశంలోని గ్రామం

హంసలదీవి, కృష్ణా జిల్లా, కోడూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

హంసలదీవి
రెవెన్యూయేతర గ్రామం
దేశంహంసలదీవి: గ్రామం పేరు వెనుక చరిత్ర, గ్రామ భౌగోళికం, గ్రామానికి రవాణా సౌకర్యాలు భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా
భాషలు
 • అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్
521 328
ప్రాంతీయ ఫోన్‌కోడ్08566
దగ్గరి నగరంమచిలీపట్నం, అవనిగడ్డ

గ్రామం పేరు వెనుక చరిత్ర

హంసలదీవి: గ్రామం పేరు వెనుక చరిత్ర, గ్రామ భౌగోళికం, గ్రామానికి రవాణా సౌకర్యాలు 
హంసల దీవి వద్ద కృష్ణానది బంగాళాఖాతంలో కలుస్తుంది.
హంసలదీవి: గ్రామం పేరు వెనుక చరిత్ర, గ్రామ భౌగోళికం, గ్రామానికి రవాణా సౌకర్యాలు 
హంసలదీవిలోని వేణుగోపాల స్వామి మందిరం గాలి గోపురం. శ్రీ వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఈ ఆలయం ఒకటి కాకపోయినా, అద్భుతమైన మహిమాన్విత వైష్ణవ ఆలయం.

సాధారణంగా హంసలదీవి పేరు ఇక్కడ హంసలు ఎక్కువగా తిరిగేవేమో అనుకోవడానికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ ఈ పేరు సంబంధిత కథనం ఒకటి ప్రచారంలో ఉంది. ఈ క్షేత్రంలో కాకి హంసగా మారిన అద్భుత సంఘటన చోటు చేసుకుందిగనుకనే ఈ పేరు స్థిరపడింది. అందరి పాపాలను కడిగేస్తూ వెళ్లిన కారణంగా గంగానది మలినమైపోయింది. దాంతో ఆమె తన దుస్థితిని శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకుంది. అప్పుడు విష్ణుమూర్తి గంగాదేవిని కాకి రూపంలో సకల పుణ్యతీర్థాలలో స్నానమాచరించమనీ, ఏ క్షేత్రంలో ఆమె హంసగా మారుతుందో అది మహోన్నతమైన దివ్యక్షేత్రమై అలరారుతుందని చెప్పాడు. ఆ క్షేత్ర మహిమ కారణంగా హంసగా మారాక తిరిగి ఎప్పటిలానే పవిత్రతతో ప్రవహించమని అన్నాడు. సకల పుణ్య తీర్థాలలో స్నానం చేస్తూ వెళుతోన్న కాకి కృష్ణవేణి సాగర సంగమం చేసే ఈ ప్రదేశంలో మునిగిలేవగానే హంసగా మారిపోయింది. అందుకే ఇది హంసలదీవిగా పిలువబడుతుందని స్థలపురాణం వివరిస్తుంది.

గ్రామ భౌగోళికం

బంగాళాఖాతం ఇక్కడి నుండి 5 కి.మీ. దూరంలో ఉంది. అవనిగడ్డ దగ్గర పులిగడ్డ వద్ద కృష్ణానది రెండు పాయలుగా చీలుతున్నది. వాటిలో తూర్పు శాఖ పాలకకాయి తిప్ప దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది హంసల దీవికి 5 కిలోమీటర్లు దూరంలో ఉంది. పశ్చిమ శాఖ మళ్ళీ మూడు పాయలుగా చీలుతుంది - లంకవానిదిబ్బ కృష్ణ, నాసగుంట కృష్ణ, వేణీసాగరం కృష్ణ - ఈ మూడు పాయలూ సముద్రంలో కలుస్తాయి.

పాలకాయి తిప్ప వద్ద నది సాగరంలో కలిసే చోట (సాగర సంగమం) సుందరమైన ప్రదేశం. ఇక్కడికి రోడ్డు మార్గం ఉంది. చివరిలో బీచి వెంట ఉన్న కాలిమార్గం సముద్రం పోటు సమయంలో అంత క్షేమం కాదు. సందర్శకులు నీటిలో ఎక్కువ దూరం వెళ్ళవద్దని హెచ్చరించే బోర్డు ఉంది. సురక్షితమైన ప్రాంతాన్ని సూచించే సిమెంటు స్తంభాల హద్దులు కనిపిస్తాయి. దగ్గరలో ఉన్న ఒక భవంతి పైనుండి సుందరమైన సాగర సంగమం దృశ్యాన్ని చూడవచ్చును. పాలకాయతిప్ప వద్ద కృష్ణానదీ బంగాళాఖాతం సాగరసంగమ దృశ్యం చూడాలంటే రోడ్డు మార్గంలో 3 కిలోమీటర్లు ప్రయాణించి చేరుకోవచ్చు. అక్కడ విహంగ వీక్షణం చేయడానికి వీలూగా నిర్మించిన నిర్మాణం పైకి చేరుకుంటే కృష్ణాజలాలు సాగరంలో కలవడాన్ని చూడవచ్చు.1977 తుఫానులో ఇక్కడ వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

హంసల దీవికి విజయవాడ నుండి, గుడివాడ నుండి బస్సు ద్వారా చేరుకోవచ్చును. కొత్తమాజేరు, నాగాయలంక నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 88 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల. మండల పరిషత్తు ప్రాథమికో పాఠశాల, లింగారేడ్డిగూడెం. రవితేజ హైస్కూల్, కోడూరు.

గ్రామంలో మౌలిక వసతులు

ఈ గ్రామంలో వాటర్ ట్యాంకు నిర్మాణానికి ప్రభుత్వం రు. 15 లక్షల నిధులు మంజూరు చేసింది.

గ్రామ పంచాయతీ

ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో కొక్కిలిగడ్డ సముద్రాలు సర్పంచిగా ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

వేణుగోపాలస్వామి ఆలయం

ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఒక పవిత్ర పుణ్య స్థలం. పూర్వం దేవతలు ఈ గుడిని నిర్మించారు అని ఇక్కడి ప్రజల నమ్మకము.ఈ ఆలయానికి గాలిగోపురం ఉండదు. ఇక్కడ మాఘ పౌర్ణమి నాడు ప్రత్యేకమైన పూజలుమహోత్సవాలు, అన్నదానం జరుగుతాయి. ఈ ఆలయంలోని శ్రీ వేణుగోపాలస్వామి పిలిస్తే పలుకుతాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రాంతంలో బయటపడిన శ్రీ కృష్ణుడి విగ్రహం అనుకోని కారణంగా దెబ్బతినడంతో, దానిని ప్రతిష్ఠించే విషయమై ప్రజలు ఆలోచనలో పడ్డారు. అప్పుడు వారిలో ఒకరికి స్వామి కలలో కనిపించి చెప్పిన ప్రకారం కాకరపర్రు వెళ్ళి ఓ గృహస్థుని ఇంట్లో కాకరపాదు కింద భూమిలో వున్న స్వామివారి విగ్రహాన్ని వెలికితీశారు. ఈ కారణంగానే ఆ ఊరికి కూడా కాకరపర్తి అనే పేరు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడ బయటపడిన శ్రీ వేణుగోపాల స్వామిని హంసలదీవికి తెచ్చి ప్రతిష్ఠించారు. అయితే ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా ఈ విగ్రహం నీలమేఘ ఛాయలో ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.

ఈ దేవాలయం, విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివారి దేవాలయానికి దత్తత దేవాలయంగా ఉంది.

ప్రత్యేక పూజలు

ఈ ఆలయంలో వేణుగోపాలస్వామి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేతుడై పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇక్కడి దేవాలయ కుడ్యాలపై రామాయణ ఘట్టాలు అందంగా చెక్కబడి ఉన్నాయి. తూర్పు చాళుక్యుల శిల్పకళా వైభవానికి అద్దం పడుతుంటాయి. ప్రతి యేడు మాఘ శుద్ధ నవమి నుంచి బహుళ పాడ్యమి వరకూ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా వేలసంఖ్యలో వచ్చిన ప్రజలు స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తరువాత అక్కడికి దగ్గరలో ఉన్న సాగరంలో కృష్ణానది (తుంగ - భద్ర నదులను తనలో కలుపుకున్న కృష్ణవేణి ఇక్కడే సముద్రంలో కలుస్తుంది) క్షేత్రంలో స్నానం చేసి తరిస్తుంటారు.

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, మాఘ పౌర్ణమికి వైభవంగా నిర్వహించెదరు. మాఘ శుద్ధ త్రయోదశినాడు ఉదయం స్వామివారిని శాస్త్రోక్తంగా పెళ్ళికుమారునిచేసి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. చతుర్దశినాడు ఉదయం శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారికి కుంకుమపూజను రాత్రికి స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. పౌర్ణమినాడు రథోత్సవం మరుసటిరోజున చక్రస్నానం (వసంతోత్సవం) మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు.

మూలాలు

వెలుపలి లింకులు

Tags:

హంసలదీవి గ్రామం పేరు వెనుక చరిత్రహంసలదీవి గ్రామ భౌగోళికంహంసలదీవి గ్రామానికి రవాణా సౌకర్యాలుహంసలదీవి గ్రామంలో విద్యా సౌకర్యాలుహంసలదీవి గ్రామంలో మౌలిక వసతులుహంసలదీవి గ్రామ పంచాయతీహంసలదీవి దర్శనీయ ప్రదేశాలుదేవాలయాలుహంసలదీవి మూలాలుహంసలదీవి వెలుపలి లింకులుహంసలదీవికృష్ణా జిల్లాకోడూరు (కృష్ణా) మండలంగ్రామం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆనం చెంచుసుబ్బారెడ్డిభారతదేశంలో విద్యఉస్మానియా విశ్వవిద్యాలయంకామసూత్రపల్నాటి యుద్ధంశ్రీశైల క్షేత్రంతెనాలి రామకృష్ణుడుకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంపెళ్ళి చూపులు (2016 సినిమా)సర్వ శిక్షా అభియాన్తెలంగాణా సాయుధ పోరాటంనవరత్నాలువీర్యంబంగారంస్వాతి నక్షత్రముత్రివిక్రమ్ శ్రీనివాస్పూర్వాషాఢ నక్షత్రముఅటార్నీ జనరల్తెలుగు నాటకరంగ దినోత్సవంటైఫాయిడ్రాహుల్ గాంధీతంగేడుఅమ్మభారతీయ సంస్కృతిజాతీయ రహదారి 44 (భారతదేశం)వ్యాసుడుజంద్యమువృశ్చిక రాశిమార్చిపర్యాయపదంరావణుడుశ్రీలీల (నటి)తెలుగుపార్శ్వపు తలనొప్పితెలుగు వ్యాకరణంమహేంద్రసింగ్ ధోనిమార్కాపురంభగవద్గీతఆరుగురు పతివ్రతలుభారతీయ శిక్షాస్మృతికర్కాటకరాశిపంచారామాలుభారత రాజ్యాంగ పరిషత్ధర్మంఘంటసాల వెంకటేశ్వరరావుఏ.పి.జె. అబ్దుల్ కలామ్ఋగ్వేదంసంధితెలుగు పదాలుభారత జాతీయ ఎస్టీ కమిషన్రమణ మహర్షిఆవర్తన పట్టికక్షయవ్యాధి చికిత్సకావ్య ప్రయోజనాలుఊపిరితిత్తులుమున్నూరు కాపుగోత్రాలు జాబితాచేపమక్కారాష్ట్రపతి పాలనమహాభారతంభానుప్రియవిద్యుత్తునానార్థాలుగుడ్ ఫ్రైడేఇంటి పేర్లుఅల్లూరి సీతారామరాజుఆర్యవైశ్య కుల జాబితాబ్రహ్మంగారి కాలజ్ఞానంపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుయాదవబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితోలుబొమ్మలాటపోలవరం ప్రాజెక్టుబైబిల్రక్తంG20 2023 ఇండియా సమిట్🡆 More