భారత ప్రామాణిక కాలమానం

భారత ప్రామాణిక కాలమానం (English: Indian Standard Time - IST) భారతదేశంమంతటా పాటించే సమయం.

ఇది గ్రీన్‌విచ్ (Greenwich) సమయానికి ఐదున్నర గంటలు (UTC+5:30) ముందు ఉంటుంది. భారతదేశం, పొద్దు పొడుచు సమయాన్ని (డేలైట్ సేవింగ్ టైం) కానీ, మరే విధమైనా ఋతు అనుగుణ సర్దుబాట్లను కానీ పాటించదు. అయితే పొద్దు పొడుచు సమయాన్ని తాత్కాలికంగా 1962 భారత - చైనా యుద్ధం, 1965 భారత - పాకిస్తాన్ యుద్ధం, 1971 భారత - పాకిస్తాన్ యుద్ధ సమయాల్లో పాటించారు. సైనిక , విమానయాన సమయంలో భారత ప్రామాణిక కాలమానాన్ని E* ("ఎకో స్టార్") గా సూచిస్తారు.

భారత ప్రామాణిక కాలమానం
భారత ప్రామాణిక కాలమానానికి అధారమైన 82.5°తూ రేఖాంశం మిర్జాపూర్కు పశ్చిమంగా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ నగరం మీదుగా వెళుతుంది.

భారత ప్రామాణిక కాలమానాన్ని 82.5° తూర్పు రేఖాంశం ఆధారంగా లెక్కకడతారు. ఈ రేఖాంశం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదు నగరం దగ్గరున్న మిర్జాపూర్ పట్టాణానికి కొంచెం పశ్చిమంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ నగరం మీదుగా వెళుతుంది. మిర్జాపూర్ , యునైటెడ్ కింగ్‌డం, గ్రీన్‌విచ్ లోని రాయల్ అబ్జర్వేటరీల మధ్య రేఖాంశ అంతరం కచ్చితంగా 5 గంటల 30 నిమిషాలు. ఆధికారిక సమయపాలనా యంత్రాగం ఢిల్లీ లోని భారత జాతీయ భౌతిక ప్రయోగశాలకు సమయపాలనబాధ్యతను అప్పగించినా, స్థానిక సమయాన్ని అలహాబాద్ అబ్జర్వేటరీ (25°09′N 82°30′E / 25.15°N 82.5°E / 25.15; 82.5) వద్ద ఉన్న గడియార స్తంభం నుండి లెక్కకడతారు.

చరిత్ర

చరిత్రలో మొట్టమొదటగా ప్రామాణిక సమయం వివరణ భారతదేశంలో 4వ శతాబ్దపు భారతీయ ఖగోళశాస్త్ర రచన సూర్య సిద్ధాంతంలో ఇవ్వబడింది. ఈ పుస్తకంలో భూమి గుండ్రంగా ఉందని ప్రతిపాదిస్తూ, ప్రైమ్ మెరీడియన్ లేదా జీరో డిగ్రీల రేఖాంశం అవంతీ నగరం (చారిత్రక నగరమైన ఉజ్జయినికి (మూస:Coordms), పూర్వపు పేరు) , రోహితక (చారిత్రక కురుక్షేత్ర యుద్ధభూమి దగ్గరలోని నగరం రోహ్‌తక్) (మూస:Coordm) గుండా వెళుతుందని నిర్వచించబడింది.

రోహితక , అవంతి నగరాలు Situated upon the line which passes through the haunt of the demons (భూమధ్యరేఖ , 76° తూ) , దేవతల ఆవాసమైన కైలాస పర్వతం (ఉత్తర ధృవం) గుండా వెళుతున్న సరిగీతపై ఉన్నాయి.

పూర్వపు భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు ఉపయోగించే రోజు ఉజ్జయిని లోని ప్రైమ్ మెరీడియన్ వద్ద సూర్యుడు ఉదయించడముతో ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమయిన రోజు ఈ క్రింది విధంగా చిన్న చిన్న సమయఖండాలుగా విభజించబడినది:

సాధారణ ఉపయోగంలో ఉన్న సమయమే గణించగల సమయం. ప్రాణంతో (ఒక శ్వాసకు పట్టే సమయం) ప్రారంభమై, ఆరు ప్రాణాలు ఒక విఘటిక లేదా పలం, 60 విఘటికలు ఒక ఘటిక, 60 ఘటికలు ఒక నక్షత్ర అహోరాత్రి, లేదా ఒక ఖగోళ దినంగా గణిస్తారు. ఒక నక్షత్ర మాసం లేదా ఖగోళ మాసంలో 30 అహోరాత్రులు లేదా రోజులు ఉంటాయి.

ఒక రోజుకు 24 గంటలుగా పరిగణిస్తే, ఈ కాలమానంలోని అత్యంత చిన్న కొలత, ప్రాణం, లేదా ఒక ఉచ్ఛ్వాసనిశ్వాసం నాలుగు సెకన్లకు సమానమవుతుంది. ఇది ఆధునిక వైద్యశాస్త్ర పరిశోధనలు సాధారణ ఉచ్ఛ్వాసనిశ్వాస పౌనపున్యంగా భావించే నిమిషానికి 15 శ్వాసలకు సరిపోతుంది. సూర్య సిద్ధాంతం, స్థానిక సమయం నుండి ఉజ్జయినీ ప్రామాణిక సమయాన్ని గణించే పద్ధతిని కూడా వివరించింది. భారతీయ కాలమానం చాలా ముందే ఈ ప్రగతిని సాధించినప్పటికీ, ప్రామాణిక సమయం, ఖగోళ శాస్త్రంలో తప్ప వేరెక్కడా విరివిగా ఉపయోగించబడలేదు. చరిత్రలో భారతదేశాన్ని పరిపాలించిన రాజులు, తమసామ్రాజ్యాలలో, చాలామటుకు భారతీయ పంచాంగం సహాయంతో గణించిన స్థానిక సమయాన్నే పాటించారు.సాధారణంగా హిందూ కాలగణని నిజసమయం (లూనార్) , సౌరసమయం (సోలార్) యూనిట్లలో ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, 1733లో మహారాజా సవాయి జైసింగ్ జైపూర్‌లో నిర్మించిన జంతర్ మంతర్ వేధశాలలో స్థానిక సమయాన్ని కచ్చితంగా తెలుసుకోవటానికి 90 అడుగులు (27 మీటర్లు) వరకు ఎత్తున్న సూర్య సూచిక (సన్ డయల్) ‌లు ఉన్నాయి.

భారత ప్రామాణిక కాలమానం 
భారతదేశంలో అమలులో ఉన్న భిన్నాంశ కాలమానాన్ని (UTC+05:30) ఖగోళకారుడు జాన్ గోల్డింగ్‌హామ్ స్థాపించాడని భావిస్తారు.

బ్రిటీషు నావికుడు-ఖగోళకారుడు మైఖెల్ టాపింగ్ కృషి ఫలితంగా 1792లో, బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ అప్పటి మద్రాసులో మద్రాసు అబ్జర్వేటరీని ప్రారంభించింది. 1802లో భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ అధికారిక ఖగోళకారునిగా నియమితుడైన జాన్ గోల్డింగ్‌హామ్, గ్రీన్‌విచ్ ప్రామాణిక సమయానికి ఐదున్నర గంటలు ముందున్న మద్రాసు రేఖాంశం (మూస:Coordms) ను స్థానిక ప్రామాణిక సమయంగా స్థిరపరిచాడు. దీనితో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్రమాణిక సమయానికి నాందివేశాడు. అప్పటి వరకు ప్రామాణికంగా ఉపయోగిస్తున్న సమయంలో రోజు సూర్యోదయంతో ప్రారంభమయ్యేది. అయితే కొత్త పద్ధతిలో రోజు అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. అబ్జర్వేటరీలోని గడియారం ఒక తుపాకికి అనుసంధానించబడి ప్రతిరోజు రాత్రి 8 గంటలకు భాప్రాకా సవ్యంగా ఉందని సూచించటానికి తుపాకీ పేలుతుండేది. బొంబాయి నౌకాశ్రయంలో నౌకా కార్యకలపాలకు సమయ పాలనా మద్దతును 1862లో స్థాపించబడిన కొలాబా అబ్జర్వేటరీ అందించేది.

భారతదేశంలో అనేక పట్టణాలు 1850లలో రైల్వేలు వచ్చిన తర్వాత కొద్ది సంవత్సరాలకు కూడా తమ సొంత స్థానిక సమయాన్నే ఉపయోగించేవి. రైల్వేల రాకతో ఒక సమైక్య ప్రామాణిక సమయం ఆవశ్యకత తెలియవచ్చింది. అప్పటి బ్రిటీషు ఇండియాలోని రెండు పెద్ద ప్రాంతాలకు ముఖ్యపట్టణాలైన బొంబాయి , కలకత్తాల స్థానిక సమయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. క్రమేణ వాటి చుట్టుపక్కల ప్రాంతాలు , సంస్థానాలు ఈ ప్రామాణిక సమయాన్ని అవలంబించాయి. 19వ శతాబ్దంలో గడియారాలను టెలిగ్రాఫు ద్వారా ఒకే సమయము ఉండేట్టు చేసేవారు (సింక్రొనైజ్) ఉదాహరణకు రైల్వేలు తమ గడియారాలని ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయంలో ముఖ్య కార్యాలయం లేదా ప్రాంతీయ కార్యాలయం నుండి పంపే సమయ సంకేతం ద్వారా సింక్రొనైజ్ చేసేవారు.

1884లో, వాషింగ్టన్, డి.సిలో జరిగిన అంతర్జాతీయ మెరిడియన్ సమావేశం ప్రపంచమంతటా ప్రామాణిక కాలమండలాలను వ్యవస్థీకరించింది. ఆ సమావేశంలో భారతదేశంలో రెండు కాలమండలాలు ఉండాలని నిర్ణయించింది. కలకత్తా తూర్పు 90 డిగ్రీల రేఖాంశంను, బొంబాయి తూర్పు 75 డిగ్రీల రేఖాంశం ఉపయోగించేది. కలకత్తా సమయం గ్రీన్విచ్ కంటే 5 గంటల 30 నిమిషాల 21 సెకన్లు, బొంబాయి సమయం గ్రీన్విచ్ కంటే 4 గంటల 51 నిమిషాలు ముందు ఉండేట్టు నిర్ణయమైంది. 1880ల చివరికల్లా, చాలామటుకు రైల్వే కంపెనీలు రెండు కాలమండలాలకు మధ్యేమార్గంగా రైల్వే సమయంగా పేరొందిన మద్రాసు సమయాన్ని ఉపయోగించడం ప్రారంభించాయి. అండమాన్ నికోబార్ దీవులు రాజధాని పోర్ట్ బ్లెయిర్ లో పోర్ట్ బ్లెయిర్ మీన్ టైం అనే మరొక ప్రత్యేక కాలమండలం స్థాపించబడింది. పోర్ట్ బ్లెయిర్ సమయం, మద్రాసు సమయం కంటే 49 నిమిషాల 51 సెకన్లు ముందు ఉండేది.

అయితే బ్రిటీషు ఇండియా 1905 వరకు అధికారికంగా ప్రామాణిక కాలమండలాలను నిర్ణయించలేదు. 1905లో ఏకైక ప్రామాణిక సమయాన్ని స్థాపిస్తూ అలహాబాదుకు తూర్పుగా వెళ్ళే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశ కేంద్ర మెరిడియన్ గా ఎంచుకుంది. ఇది 1906, జనవరి 1 నుండి భారతదేశంతో పాటు శ్రీలంకలో కూడా అమలులోకి వచ్చింది. కానీ, కలకత్తా సమయాన్ని మాత్రం 1948 వరకు అధికారికంగా, ప్రత్యేక కాలమండలంగానే నిర్వహించారు.

భారత ప్రామాణిక కాలమానం 
ఇతర సరిహద్దు దేశాలతో సంబంధంలో భారత ప్రామాణిక కాలమానం

1925లో, టైం సింక్రొనైజేషన్ సంకేతాన్ని ఆమ్నిబస్ టెలిఫోన్ వ్యవస్థ ద్వారా, నియంత్రిత సర్క్యూట్ల ద్వారా కచ్చితమైన సమయం కావలసిన సంస్థలకు ప్రసారం చేసేవారు. ఈ పద్ధతి 1940ల వరకు కొనసాగింది. 1940లలో ప్రభుత్వ సమయ సంకేతాలను రేడియో ద్వారా ప్రసారం చెయ్యటం ప్రారంభించింది.

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, భారత ప్రభుత్వం భారత ప్రామాణిక సమయాన్ని దేశం మొత్తానికి అధికారిక సమయంగా ప్రకటించింది.ఆ తరువాత మరి కొన్ని సంవత్సరాల పాటు కలకత్తా , బొంబాయి తమ సొంత స్థానిక సమయాన్ని పాటించాయి. UTC +5:30కి వీలైనంతగా దగ్గరలో ఉండటానికి చెన్నైలోని కేంద్రీయ అబ్జర్వేటరీని మిర్జాపూర్ దగ్గరకు తరలించారు.

1962 చైనా - ఇండియా యుద్ధం , పాకిస్తాన్ తో జరిగిన 1965 , 1971 యుద్ధ సమయాల్లో పౌర విద్యుచ్ఛక్తి వినియోగాన్ని తగ్గించడానికి తాత్కాలికంగా కొంతకాలం పాటూ పొద్దు పొదుపు (డేలైట్ సేవింగ్)ను అమలుపరిచారు.

సమస్యలు

1980వ దశకపు చివరిలో, ఒక పరిశోధకుల బృందం విద్యుచ్ఛక్తిని ఆదాచేయటానికి దేశాన్ని రెండు లేదా మూడు కాలాంశాలుగా విభజించాలని ప్రతిపాదించారు. వీరి ప్రతిపాదనలో బ్రిటీషుపాలన కాలంలో ఉన్న రెండు కాలాంశాల పద్ధతిని తిరిగి ప్రవేశపెట్టడం కూడా ఒకటి.అయితే ఈ బృందం ప్రతిపాదనలు అమలుపరబడలేదు

2001లో, కేంద్ర ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో అనేక కాలాంశాలు , పొద్దు పొదుపు సమయం ఆవశ్యకతలను పరిశీలించటానికి నలుగురు సభ్యుల సంఘాన్ని నియమించింది. ఈ సంఘం నిర్ధారణలను 2004లో శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి, కపిల్ సిబాల్ భారత పార్లమెంటులో ప్రవేశపెట్టాడు.ఈ సంఘం భారతదేశం యొక్క విస్తృతి అనేక కాలాంశాలు అవసరమయ్యేంతగా లేదని, పైమ్ మెరీడియను కేంద్రస్థానంగానే ఎంపిక చేయబడింది కాబట్టి ఇప్పుడున్న సమైక్య వ్యవస్థకు మార్పులు చేయనవసరం లేదని నిర్ధారించింది.

ప్రభుత్వం, భారత దేశాన్ని అనేక కాలాంశాలుగా విభజించడానికి పలుమార్లు తిరస్కరించినప్పటికీ, ప్లాంటేషన్స్ శ్రామిక చట్టం, 1951 వంటి కార్మిక చట్టాలు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయా పారిశ్రామిక ప్రాంతాలలో స్థానిక సమయాన్ని నిర్వచించటానికి , స్థాపించటానికి అవకాశం కల్పిస్తున్నవి.

సమయ సంకేతాలు

వాణిజ్య , అధికారిక ఉపయోగాల కోసం అధికారిక సమయ సంకేతాలు కొత్త ఢిల్లీలోని జాతీయ భౌతిక పరిశోధనశాల వద్ద ఉన్న సమయ , పౌనపున్య ప్రామాణిక పరిశోధనశాల వెలువడతాయి. ఈ సంకేతాలు విశ్వవ్యాప్త సమన్వయ సమయానికి మద్దతునిచ్చే ప్రపంచవ్యాప్త గడియార వ్యవస్థతో అనుసంధానించబడిన అటామిక్ క్లాక్ ఆధారంగా వెలువడుతాయి.

సమయ , పౌనపున్య ప్రామాణిక పరిశోధనశాల విశేషాలు:

  • నాలుగు సీషియం , రుబీడియం అటామిక్ గడియారాలు;
  • 10 మెగా హెర్ట్‌జుల వద్ద ATA అనేక సంతేకనామంతో ప్రసారమయ్యే ఉఛ్ఛస్థాయి పౌనపున్యం కలిగిన ప్రసార సర్వీసు వినియోగదారుల గడియారాన్ని మిల్లీసెకండ్లలలో సింక్రొనైజ్ చెయ్యటానికి ఉపయోగిస్తారు.
  • భారత జాతీయ ఉపగ్రహ వ్యవస్థ ఉపగ్రహాలపై ఆధారపడిన ప్రామాణిక సమయం , ఫ్రీక్వెన్సీ ప్రసార సర్వీసు

నిర్దిష్టమైన సమయాన్ని దేశమంతటా ప్రభుత్వాధీనంలో ఉన్న ఆలిండియా రేడియో , దూరదర్శన్ టెలివిజన్ నెట్‌వర్కుల ద్వారా ప్రసారం చేస్తారు. టెలిఫోన్ కంపెనీలు వినియోగదారులకు కచ్చితమైన సమయాన్ని తెలియజేసేందుకు ప్రత్యేకంగా నియమించిన టెలిఫోన్ నంబర్లు టైం సర్వర్ మిర్రర్లకు అనుసంధానించబడి ఉంటాయి. కచ్చితమైన సమయం తెలుసుకోవటానికి గణనీయంగా పెరుగుతున్న మరో ప్రాచుర్యమైన పద్ధతి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జి.పి.ఎస్) రిసీవర్లు.

ఇవికూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

భారత ప్రామాణిక కాలమానం చరిత్రభారత ప్రామాణిక కాలమానం సమస్యలుభారత ప్రామాణిక కాలమానం సమయ సంకేతాలుభారత ప్రామాణిక కాలమానం ఇవికూడా చూడండిభారత ప్రామాణిక కాలమానం మూలాలుభారత ప్రామాణిక కాలమానం బయటి లింకులుభారత ప్రామాణిక కాలమానంEnglish languageకాలమానంగ్రీన్‌విచ్భారతదేశంయుటిసి+05:30

🔥 Trending searches on Wiki తెలుగు:

భగవద్గీతవసంత వెంకట కృష్ణ ప్రసాద్గుణింతంఅల్లూరి సీతారామరాజుకాళోజీ నారాయణరావుఆషికా రంగనాథ్హస్త నక్షత్రముపోకిరిమహేంద్రగిరిగర్భాశయముజవహర్ నవోదయ విద్యాలయంభారతీయ తపాలా వ్యవస్థశ్రీకాళహస్తిఆప్రికాట్తీన్మార్ మల్లన్నజీమెయిల్ప్రకృతి - వికృతికుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంసీ.ఎం.రమేష్గౌతమ బుద్ధుడుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితామాయదారి మోసగాడుగున్న మామిడి కొమ్మమీదనవధాన్యాలుదీపావళిగైనకాలజీపరకాల ప్రభాకర్పార్లమెంటు సభ్యుడుషణ్ముఖుడుభారతదేశ జిల్లాల జాబితాభలే అబ్బాయిలు (1969 సినిమా)భారత జాతీయ క్రికెట్ జట్టుపెరిక క్షత్రియులుగ్లెన్ ఫిలిప్స్అరుణాచలంనిర్వహణదక్షిణామూర్తివిజయసాయి రెడ్డిహల్లులునాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంశాసనసభ సభ్యుడుపురాణాలుమహమ్మద్ సిరాజ్అగ్నికులక్షత్రియులులోక్‌సభ నియోజకవర్గాల జాబితామరణానంతర కర్మలుసురేఖా వాణిఅన్నమాచార్య కీర్తనలునితిన్డేటింగ్మహేంద్రసింగ్ ధోనినారా లోకేశ్సాలార్ ‌జంగ్ మ్యూజియంబమ్మెర పోతనవిద్యుత్తు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువై.ఎస్.వివేకానందరెడ్డిఉదయకిరణ్ (నటుడు)కొడాలి శ్రీ వెంకటేశ్వరరావుపన్ను (ఆర్థిక వ్యవస్థ)శక్తిపీఠాలుభారత రాజ్యాంగ పీఠికనానాజాతి సమితిశ్రీ కృష్ణుడుపూర్వాభాద్ర నక్షత్రముపోలవరం ప్రాజెక్టుసచిన్ టెండుల్కర్పాండవులుశతభిష నక్షత్రమురెడ్డిజోల పాటలుతామర వ్యాధితెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంఅంగుళంఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంకులంశివుడువ్యతిరేక పదాల జాబితా🡆 More