వసంత వెంకట కృష్ణ ప్రసాద్

వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.

ఆయన 2019లో మైలవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

వసంత వెంకట కృష్ణ ప్రసాద్
వసంత వెంకట కృష్ణ ప్రసాద్


ఎమ్మెల్యే
పదవీ కాలం
2019 – ప్రస్తుతం
నియోజకవర్గం మైలవరం నియోజకవర్గం
ముందు దేవినేని ఉమామహేశ్వరరావు

వ్యక్తిగత వివరాలు

జననం (1970-04-09)1970 ఏప్రిల్ 9
ఐతవరం గ్రామం , నందిగామ మండలం , కృష్ణా జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , భారతదేశం
రాజకీయ పార్టీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ , వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు వసంత నాగేశ్వర రావు, హైమావతి
జీవిత భాగస్వామి శిరీష
సంతానం ధీమంత్ సాయి & హిమ సాహితి

జననం, విద్యాభాస్యం

వసంత వెంకట కృష్ణ ప్రసాద్ 9 ఏప్రిల్ 1970న వసంత నాగేశ్వరరావు, హైమావతి దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కృష్ణా జిల్లా , నందిగామ మండలం , ఐతవరం గ్రామం లో జన్మించాడు. ఆయన గుంటూరులోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ లో పదవ తరగతి పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నందిగామ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2004లో రెండవసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2005లో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీ బ్యాంకు) చైర్మన్‌గా, ఆప్‌కాబ్‌ చైర్మన్‌గా, జాతీయ స్థాయిలో నాప్కాబ్‌ వైస్‌ చైర్మన్‌గా పని చేశాడు. తెలంగాణ ఉద్యమం సమయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆప్‌కాబ్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశాడు.

వసంత వెంకట కృష్ణ ప్రసాద్ 2014 లో తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు గెలుపులో కీలకంగా పని చేశాడు. ఆయన 2018లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పని చేశాడు. వసంత వెంకట కృష్ణ ప్రసాద్ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమా పై 12653 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

వసంత వెంకట కృష్ణ ప్రసాద్ 2024 మార్చి 02న టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు.

మూలాలు

Tags:

మైలవరం శాసనసభ నియోజకవర్గం

🔥 Trending searches on Wiki తెలుగు:

పెద్దమనుషుల ఒప్పందంగ్రామ పంచాయతీఇండియన్ ప్రీమియర్ లీగ్రాజనీతి శాస్త్రముపి.వి.మిధున్ రెడ్డి2024 భారత సార్వత్రిక ఎన్నికలురాష్ట్రపతి పాలనవిజయశాంతిశక్తిపీఠాలువిరాట పర్వము ప్రథమాశ్వాసముపూర్వాభాద్ర నక్షత్రముతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంసూర్య (నటుడు)ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాసంధ్యావందనంఋతువులు (భారతీయ కాలం)దక్షిణామూర్తిఉదగమండలంఅండాశయములలితా సహస్రనామ స్తోత్రంధర్మవరం శాసనసభ నియోజకవర్గంకాళోజీ నారాయణరావుఅవకాడోవిడదల రజినిసింధు లోయ నాగరికతజాషువాభూకంపంచిత్త నక్షత్రముజవాహర్ లాల్ నెహ్రూజీలకర్రవేంకటేశ్వరుడుతాజ్ మహల్డీజే టిల్లువిశ్వబ్రాహ్మణరాజ్యసభఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థఅరుణాచలంఆంధ్రప్రదేశ్ చరిత్రతెలుగు భాష చరిత్రమహాసముద్రంసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుగాయత్రీ మంత్రంబోడె రామచంద్ర యాదవ్కల్వకుంట్ల చంద్రశేఖరరావుతెలుగు నాటకరంగంకాలేయంరష్మి గౌతమ్విరాట్ కోహ్లిసంభోగంఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాదశావతారములుజిల్లేడుసన్నాఫ్ సత్యమూర్తితిరువణ్ణామలైస్త్రీతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థసచిన్ టెండుల్కర్నితీశ్ కుమార్ రెడ్డిదశరథుడుకాలుష్యంవై.యస్.అవినాష్‌రెడ్డిదేవికపర్యావరణంకీర్తి సురేష్కూచిపూడి నృత్యంసమంతసమాసంబైండ్లశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంతెలుగు వికీపీడియాటంగుటూరి సూర్యకుమారిభారతీయ సంస్కృతిమధుమేహంతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుయూట్యూబ్గౌతమ బుద్ధుడు🡆 More