కృష్ణా డెల్టా

కృష్ణా డెల్టా అనునది కృష్ణా నది వలన కృష్ణా,, గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా లలో ఏర్పడిన సారవంతము అయిన నల్లరేగడి నేలలతో కూడిన ప్రాంతము.ఈప్రాంతము ఆంధ్రప్రదేశ్ లోని ఆర్థికముగా, రాజకీయముగా,, సామాజికముగా ఉన్నతిన గల ప్రదేశము.ఇందులో అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి.అందులో విజయవాడ, పెనుగంచిప్రోలు, శ్రీకాకుళం, తెనాలి, మంగళగిరి, చేబ్రోలు, భట్టిప్రోలు, కాకాని, కొండపల్లి, బాపట్ల వంటివి ముఖ్యమైనవి.ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము.

వరి, పసుపు, చెరకు, అరటి, కూరగాయకు ప్రధానమైన పంటలు.ఇందలి తెనాలి పట్టణం ఆంధ్రా ప్యారిస్ గా, కృష్ణా డెల్టా రాజధానిగా పిలువబడుతున్నది.ఇంకా గుంటూరు, విజయవాడ, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, గుడివాడ, మచిలీపట్నము వంటి ప్రధాన పట్టణాలు/నగరాలు ఉన్నాయి.ఇందలి కొండపల్లి బొమ్మలు ప్రపంచప్రఖ్యాతి గాంచాయి.మచిలీపట్నము, నిజాంపట్నములు ప్రధాన రేవులు.ఇక్కడ ప్రధాన మతము హిందూమతము.ప్రధాన భాష తెలుగు.తెలుగులో స్వచ్ఛమైన రూపం ఇక్కడ కనపడితుంది. అలాగే ఈ ప్రాంతములోని భట్టిప్రోలునందు లభించిన ఒక పురాతన లిపి తెలుగు ప్రస్తుత లిపికి మాతృకగా, దక్షిణభారత, ఆగ్నేయాసియాలోని భాషలకు మాతృకగా భావించబదుతోంది.

కృష్ణా తూర్పు డెల్టా

కృష్ణా జిల్లాలోని కృష్ణానది పరీవాహక ప్రదేశాన్ని కృష్ణా తూర్పు డెల్టా అంటారు.

కృష్ణా పశ్చిమ డెల్టా

గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా లలోని కృష్ణానది పరీవాహక ప్రదేశాన్ని కృష్ణా పశ్చిమ డెల్టా అంటారు. ప్రకాశం బేరేజినుండి ప్రధాన కాలువ, కొంచెం ఎగువన నది కుడి వొడ్డునుండి ప్రారంభమయ్యే గుంటూరు కాలువ, ద్వారా కృష్ణా నీరు వ్యవసాయానికి ఉపయోగపడుతుంది.

సర్ ఆర్ధర్ కాటన్ 150 ఏళ్ల క్రితం కృష్ణా నదిపై విజయవాడ దగ్గర నిర్మించిన బ్యారేజితో తెనాలి డివిజన్‌లోని కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాంత ప్రజల జీవన విధానం మారిపోయంది. ఎందరో బ్రిటిష్ సాంకేతిక నిపుణులతో డెల్టా కాల్వలు రూపుదిద్దుకున్నాయి. మొదట 5.8 లక్షల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం 13.2 లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ బ్యారేజి నుంచి ప్రధానంగా ఏడు కాల్వల ద్వారా 5.71 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. దీనిలో 4.99 లక్షల ఎకరాలు గుంటూరు జిల్లాలో ఉండగా మిగిలిన ప్రాంతం ప్రకాశం జిల్లాలో ఉంది.

సాగునీటి కాల్వలు

ప్రకాశం బ్యారేజి నుంచి మొదలయ్యే ప్రధాన కాల్వ దుగ్గిరాల వరకు () రాగా, అక్కడినుండి ఆరు కాల్వలు చీలి, పశ్చిమ డెల్టాలో సాగునీటిని అందిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా హైలెవల్ ఛానల్, తూర్పుకాల్వ, నిజాంపట్నం కాల్వ, పశ్చిమ కాల్వ, కృష్ణా పశ్చిమ బ్యాంకు కెనాల్, కొమ్మమూరు కాల్వలు సాగునీటిని అందిస్తున్నాయి.

    కొమ్మమూరు కాలువ

గుంటూరు జిల్లా దుగ్గిరాల వద్ద ఉన్న లాకుల నుండి ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పెదగంజాం వరకు కొమ్మమూరు కాలువ ఉంది. () గతంలో ప్రకాశం జిల్లాకు దీని ద్వారా జల రవాణా వుండేది. దీని పొడవు సుమారు 63 కిలోమీటర్లు. కారంచేడు, చీరాల, వేటపాలెం, పర్చూరు, చినగంజాం, నాగులుప్పలపాడు మండలాల పరిధిలోని సుమారు లక్ష ఎకరాల భూములకు ఈ కాలువే సాగునీటి వనరు. ప్రధానంగా వరి, కొంతవరకు ప్రశుగ్రాసం కింద పిల్లిపిసర, జనుము సాగు చేస్తారు. కారంచేడు వద్ద దాదాపు 1000 క్యూసెక్కుల స్థాయి నీటి ప్రవాహం కాలువలో ఉంటే మొత్త ఆయకట్టుకు నీరందుతుంది.

గుంటూరు ఛానల్

గుంటూరు ఛానల్ భారీ నీటిపారుదలప్రాజెక్టు. ప్రకాశం బేరేజికి ఎగువన, కృష్ణా కుడివడ్డున ఇది మొదలై వట్టి చెరుకూరు మండలం గారపాడు వరకు ప్రవహిస్తుంది.దీనిపొడవు 47 కిమీ. () దీనిద్వారా 27000 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. తాడేపల్లి, మంగళగిరి, పెదకాకాణి, గుంటూరు చేబ్రోలు, వట్టిచెరుకూరు, ప్రత్తిపాడు మండలాల ప్రజలకు ఉపయోగంగా ఉంది. 4 టిఎంసిల నీటిలో 3.2 టిఎంసిల నీరు సాగుకొరకు, 1.4టిఎంసీల నీరు తాగునీటికి వినియోగపడుతుంది. దీని ఆధునీకరణకు,, పర్చూరు వరకు పొడిగింపుకు పని మొదలైంది.

మూలాలు

Tags:

కృష్ణా డెల్టా కృష్ణా తూర్పు డెల్టాకృష్ణా డెల్టా కృష్ణా పశ్చిమ డెల్టాకృష్ణా డెల్టా మూలాలుకృష్ణా డెల్టాఅరటిఆంధ్ర ప్రదేశ్కాకానికూరగాయలుకృష్ణా జిల్లాకృష్ణా నదికొండపల్లికొండపల్లి బొమ్మలుగుంటూరు జిల్లాచెరకుచేబ్రోలుతెనాలితెలుగుతెలుగు లిపిపంటలుపసుపుపెనుగంచిప్రోలుప్రకాశం జిల్లాబాపట్లభట్టిప్రోలుమంగళగిరివరివిజయవాడవ్యవసాయంశ్రీకాకుళంహిందూమతము

🔥 Trending searches on Wiki తెలుగు:

సోరియాసిస్చాట్‌జిపిటిజ్యోతీరావ్ ఫులేభారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుల జాబితాతెలుగు నాటకంఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంఅష్టదిగ్గజములులగ్నండిస్నీ+ హాట్‌స్టార్సర్వ శిక్షా అభియాన్కాపు, తెలగ, బలిజపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుకాంచనరామావతారమువిజయశాంతివ్యాసుడుపర్యావరణంవాయు కాలుష్యంఅగ్నికులక్షత్రియులురాహువు జ్యోతిషంభారతదేశ ప్రధానమంత్రిఆనందరాజ్గర్భాశయముఆనం చెంచుసుబ్బారెడ్డిహరిత విప్లవంఅల్లూరి సీతారామరాజువేడి నీటి బుగ్గమొలలుగరుడ పురాణంనిజాంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుఆఫ్రికాPHదూదేకులబైబిల్మహామృత్యుంజయ మంత్రంభగత్ సింగ్విశ్వబ్రాహ్మణజీమెయిల్గిలక (హెర్నియా)ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలునల్ల జీడికులంకన్నెమనసులుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాతెనాలి శ్రావణ్ కుమార్పెరిక క్షత్రియులున్యుమోనియాఇతిహాసములుసిరివెన్నెల సీతారామశాస్త్రిఇన్‌స్టాగ్రామ్ఆల్బర్ట్ ఐన్‌స్టీన్విడదల రజినిఛందస్సుభారతదేశంలో మహిళలులోక్‌సభమీనరాశితిప్పతీగదక్షిణ భారతదేశందీపావళిశ్రీలీల (నటి)ఆంధ్ర మహాసభ (తెలంగాణ)క్వినోవానరసరావుపేటభారత స్వాతంత్ర్యోద్యమంరాజనీతి శాస్త్రమునివేదా పేతురాజ్మరణానంతర కర్మలుఇస్లామీయ ఐదు కలిమాలువిశ్వక్ సేన్చంద్రబోస్ (రచయిత)పుష్యమి నక్షత్రముఎస్.వి. రంగారావుజాకిర్ హుసేన్విశ్వనాథ సత్యనారాయణఆంధ్రప్రదేశ్ జిల్లాలుదశావతారములు🡆 More