దక్షిణ భారతదేశం: భారతదేశ భౌగోళిక ప్రాంతం

దక్షిణ భారతదేశం భారత ద్వీపకల్పంలో వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న ప్రాంతం.

దీనికి సంస్కృత పదం దక్షిణాపథం నుండి డెక్కన్ అని పేరు కూడా వచ్చింది. దీనికి ఉత్తరాన నర్మదా నది, మహానది పడమటన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. ఈ ప్రాంతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలున్నాయి.

దక్షిణ భారతదేశం
భారతదేశం
దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పటం
దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పటం
దేశందక్షిణ భారతదేశం: చరిత్ర, భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు భారతదేశం
రాష్ట్రాలు, ప్రాంతాలు
అత్యధిక జనావాస ప్రాంతాలు (2011)
Area
 • Total6,35,780 km2 (2,45,480 sq mi)
Population
 • Total25,30,51,953
 • Density400/km2 (1,000/sq mi)
Demonym(s)దాక్షిణాత్యులు, ద్రావిడులు, ఆంధ్రులు, తెలగాణ్యులు, తెలుగువారు, తమిళులు, కన్నడిగులు, మలయాళీలు, మద్రాసీలు
Time zoneIST (UTC+05:30)
అధికారక భాషలు

తూర్పు కనుమలు, పడమటి కనుమలు మధ్య గల దక్కన్ పీఠభూమితో దక్షిణ భారతదేశం భౌగోళికంగా కూడా వైవిధ్యమైనది. తుంగభద్ర, కావేరి, కృష్ణ, గోదావరి ఇచ్చటి ముఖ్యనదులు. ఈ ప్రాంతాన్ని శాతవాహనులు, ఆంధ్ర ఇక్ష్వాకులు, చోళులు, పాండ్యులు, చేరులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, హోయసల, విజయనగర రాజులు మొదలైన రాజులు పరిపాలించారు. ఈ రాజవంశాలలో కొన్ని శ్రీలంక, శ్రీవిజయలను జయించడం వలన ఇప్పటికీ వారి జీవన విధానాలలో దక్షిణ భారత సాంస్కృతిక ప్రభావం కనిపిస్తుంది.

ఈ ప్రాంతం వ్యవసాయం, సాఫ్టువేరు, చలన చిత్ర రంగాలకు పేరుగాంచింది. ఇక్కడి ప్రజలు విద్యారంగంలో ముందుండడం వలన అత్యధిక తలసరి ఆదాయం ఉంది. ఇక్కడి రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల ప్రభావం అధికం. ద్రావిడ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలు ఈ ప్రాంతం లోని ప్రధాన భాషలు.

చరిత్ర

దక్షిణ భారతదేశం: చరిత్ర, భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు 
చోళ, చేర, పాండ్య రాజ్యాలు.
దక్షిణ భారతదేశం: చరిత్ర, భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు 
సా.శ.640లో రెండవ పులకేశి పాలనలో చాళుక్య రాజ్యం
దక్షిణ భారతదేశం: చరిత్ర, భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు 
సా.శ..1014లో చోళ సామ్రాజ్యము
దక్షిణ భారతదేశం: చరిత్ర, భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు 
1909లో మద్రాసు ప్రెసిడెన్సీ, మైసూరు రాజ్యము, ట్రావెన్కూర్ రాజ్యం

కార్బన్ డేటింగ్ పరీక్షల ద్వారా దక్షిణ భారతదేశం లోని కొత్తరాతియుగానికి సంబంధించిన శిలల ఉనికి సా.పూ. 8000 నాటిదని శాస్త్రవేత్తలు తేల్చారు. రాతి పనిముట్లు, కొన్ని రాగి పాత్రలు ఈ ప్రాంతంలోని ఒడిషాలో లభించాయి. సా.పూ. 1000 నాటికి ఇనుప సాంకేతికత ఈ ప్రాంతంలో విస్తరించింది. అయితే, ఈ ఇనుప యుగానికి ముందు, బాగా అభివృద్ధి చెందిన కంచుయుగం ఈ ప్రాంతంలో విస్తరించినట్లుగా ఆధారాలేమీ లేవు.

మధ్యధరా ప్రాంతాన్ని, తూర్పు ఆసియాను కలిపే వాణిజ్య మార్గం మధ్యలో ఈ ప్రాంతం ఉంది. కార్వార్ నుంచి కొడంగళూర్ వరకు గల దక్షిణ తీర ప్రాంతం ప్రాంతీయులకు, విదేశీ వ్యాపారస్థులకు ప్రధానమైన వాణిజ్య కూడలిగా ఉండేది. సంగమ కాలంలో తమిళులకు, మలబార్ ప్రాంతం వారికీ గ్రీకులు, రోమన్లు, అరబ్బులు, సిరియన్లు, చైనీయులు, యూదులు మొదలైన వారితో వ్యాపార సంబంధాలు ఉండేవి. వీరికి ఫోయనీషియన్లతో కూడా సంపర్కముండేది.

దక్షిణ భారతదేశాన్ని పేరెన్నికగన్న అనేక మంది రాజులు, వంశాలు పరిపాలించాయి. అమరావతిని రాజధానిగా పాలించిన శాతవాహనులు, బనవాసి కదంబులు, పశ్చిమ గంగ వంశం, బాదామి చాళుక్యులు, చేర వంశము, చోళులు, హోయసలులు, కాకతీయ వంశపు రాజులు, పల్లవులు, పాండ్యులు, మాన్యఖేటకు చెందిన రాష్ట్ర కూటులు మొదలైన చాలామంది రాజులు పరిపాలించారు. మధ్య యుగం నాటికి దక్షిణ భారతంలో మహమ్మదీయుల ఆధిపత్యం పెరిగింది. 1323లో ఢిల్లీ సుల్తాన్ ముహమ్మద్ బిన్ తుగ్లక్ సేనలు ఓరుగల్లును పరిపాలిస్తున్న కాకతీయులను ఓడించడంతో చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఆరంభమైంది. గుల్బర్గాకు చెందిన బహమనీ సామ్రాజ్యం (తరువాతి కాలంలో బీదరుకు మారింది), విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజులకూ జరిగిన ఆధిపత్య పోరాటాలు చరిత్రలో చెప్పుకోదగ్గవి. విజయనగర రాజుల పతనం, బహమనీ సుల్తానుల చీలిక వల్ల హైదరాబాదు, గోల్కొండకు చెందిన కుతుబ్ షాహి వంశస్థులు ప్రధాన పాలకులయ్యారు. ఔరంగజేబు నాయకత్వంలోని మొగలాయి సేనలు దక్షిణ భారత ప్రాంతాన్ని ముట్టడించేవరకు (17వ శతాబ్దం) వీరి ఆధిపత్యం కొనసాగింది. అయితే ఔరంగజేబు మరణం తర్వాత మొఘలాయిల ఆధిపత్యం సన్నగిల్లింది. దక్షిణ భారతదేశపు రాజులు ఢిల్లీ నుంచి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. మైసూరు సామ్రాజ్యానికి చెందిన ఒడయార్లు, హైదరాబాదుకు చెందిన ఆసఫ్ జాహీలు, మరాఠీలు అధికారాన్ని పొందారు.

పద్దెనిమిదవ శతాబ్దం మధ్య భాగంలో అటు ఆంగ్లేయులు, ఇటు ఫ్రెంచి వారు దక్షిణ భారతదేశంపై సైనికాధికారానికి దీర్ఘకాలిక పోరు సాగించారు. యూరోపియన్ సైన్యాలకు కొన్ని ప్రాంతీయ శక్తులకు ఏర్పడిన సంబంధాల వలన, అన్ని పక్షాలు ఏర్పాటు చేసుకున్న కిరాయి సైన్యాలు దక్షిణ భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించాయి. ఆంగ్లేయులతో నాలుగు సార్లు జరిగిన మైసూరు యుద్ధాలు, మూడు సార్లు జరిగిన మరాఠా యుద్ధాల వలన మైసూరు, పూణె, హైదరాబాద్ వంటి నగరాలు కొన్ని బ్రిటిషు వారితోనూ, కొన్ని ఫ్రెంచి వారితోనూ సంబంధం కుదుర్చుకొన్నాయి. బ్రిటిషు వారు దక్షిణ భారతదేశాన్ని మద్రాసు ప్రెసిడెన్సీ, హైదరాబాదు, మైసూరు, తిరువిత్తంకూర్ ('ట్రావెన్కూర్' అని కూడా వ్యవహరిస్తారు), 'కొచ్చి' (కొచ్చిన్ లేదా పెరంపదపు స్వరూపం), విజయనగరంలతో పాటు అనేక ఇతర చిన్న చిన్న రాజ్యాలుగా విభజించారు. రాజుల కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఆంగ్ల పరిపాలకులు కొన్ని ముఖ్యమైన రాష్ట్ర రాజధానులలో నివాసం ఉండేవారు. అలా ఉన్న బ్రిటిషు ప్రభుత్వ ప్రతినిధులను రెసిడెంట్లు అనేవారు.

స్వాతంత్ర్యానంతరం దక్షిణ భారతదేశం చాలావరకు మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. మద్రాసు రాష్ట్రంలో మద్రాసు ప్రెసిడెన్సీలో బనగానపల్లె, పుదుక్కోట్టై, సందూరు మొదలైన సంస్థానాలు భాగంగా ఉండేవి. 1953 అక్టోబరు 1 న, మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రధానంగా మాట్లాడే ఉత్తర ప్రాంత జిల్లాల పోరాటం మూలంగా భారతదేశంలో మొట్టమొదటి సారిగా భాషా ప్రాతిపదికన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. నెల్లూరు జిల్లాకు చెందిన అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ కావించాడు. ఆ తరువాత 1956లో వచ్చిన రాష్ట్రాల పునర్విభజన చట్టం క్రింద భాషా ప్రాతిపదికన అనేక భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తరువాత, 1956 లో హైదరబాదు రాష్ట్రం లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసారు. మలయాళం మాట్లాడే వారి కోసం కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. 1956 తరువాత తమిళులు అధికంగా నివసించే ప్రాంతం కాబట్టి మద్రాసు రాష్ట్రం 1968లో తమిళనాడుగా రూపాంతరం చెందింది. 1972లో మైసూరు, కర్ణాటకగా మార్పు చెందింది. పోర్చుగీసు వారి స్థావరమైన గోవా 1961లో భారతదేశంలో విలీనమైంది. 1987లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఇంకా ఫ్రెంచి వారి పాలనలో ఉన్న ప్రాంతాలు 1950 నుంచి పాండిచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతంగా పిలవబడుతున్నాయి.

భౌగోళిక స్వరూపం

దక్షిణ భారతదేశం: చరిత్ర, భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు 
2003, జనవరి 31న నాసా ఉపగ్రహం తీసిన దక్షిణ భారతదేశ ఛాయాచిత్రం.

దక్షిణ భారతం త్రికోణాకృతిలో ఉన్న ద్వీపకల్పం. దీనికి ఎల్లలుగా తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, ఉత్తరాన వింధ్య, సాత్పురా పర్వతాలు ఉన్నాయి. సాంస్కృతిక పరంగా దక్షిణ భారతానికి, ఉత్తర భారతానికి నర్మదా, మహానదులు ఎల్లలుగా ఉన్నాయి. నర్మద నది వింధ్య, సాత్పుర పర్వత లోయల మధ్య పడమర దిశగా ప్రవహిస్తుంది. సాత్పురా పర్వతాలు డెక్కను పీఠభూమికి ఉత్తరం వైపున ఎల్లగా ఉన్నాయి. అలాగే పశ్చిమ కనుమలు పడమరన ఎల్లలుగా ఉన్నాయి. పశ్చిమ కనుమలు, అరేబియా సముద్రం మధ్య ప్రాంతాన్ని కొంకణ్ అని, నర్మదానదికి దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని గోవా అనీ అంటారు. పశ్చిమ కనుమలు దక్షిణం వైపు వ్యాపించి, కర్ణాటక తీరప్రాంతం వెంబడి మలనాడ్, కెనరా ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ, తూర్పు దిశగా విస్తరించిన నీలగిరి పర్వతాలతో కలుస్తాయి. నీలగిరినే ఊటి అని కూడా పిలుస్తారు. నీలగిరి అర్థచంద్రాకారంలో ఉండి తమిళ నాడు, కేరళ, కర్ణాటక సరిహద్దుగా ఉన్న పాలక్కాడ్, వేనాడ్ కొండలు, ఇంకా సత్య మంగళం అడవులు, వీటి కంటే తక్కువ ఎత్తులో తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో గల తూర్పు కనుమలలోకి కూడా వ్యాపించి ఉన్నాయి. తిరుపతి, అన్నామలై కొండలు కూడా ఈ పర్వత శ్రేణులకే చెందుతాయి.

మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో అత్యధిక భూభాగాన్ని కప్పి ఉండే దక్కన్ పీఠభూమి అన్నింటి కంటే ఎత్తైన భూతలం. దీనికి పైన పేర్కొన్న పర్వత శ్రేణులన్నీ కలిపి ఆంగ్లాక్షరం C ఆకారంలో సరిహద్దులు ఏర్పరుస్తున్నాయి. ఈ పీఠభూమికి పశ్చిమాన ఉన్న పశ్చిమ కనుమల నుంచి ఎత్తు నెమ్మదిగా తగ్గుతూ తూర్పు తీరంలో కలిసిపోతుంది. గోదావరి, కృష్ణానది నదులు ఇక్కడ ముఖ్య నీటి వనరులు. ఇంకా పెన్నా, కృష్ణా నదికి ముఖ్య ఉపనదియైన తుంగభద్ర ఇతర ప్రధాన నదులు.

కావేరి నది కర్ణాటకకు చెందిన కొడగు జిల్లాలోని పశ్చిమ లోయల యందు ఉద్భవించి దక్కన్ పీఠభూమి గుండా ప్రవహించి తమిళనాడు తూర్పు తీరాన మంచి సారవంతమైన, విశాలమైన డెల్టా భూములను ఏర్పరుస్తుంది. దక్షిణ భారతదేశంలో ప్రధానమైన నదులైన కావేరి, గోదావరి, కృష్ణ బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇవి సస్యశ్యామలం చేసే ప్రాంతాన్ని అన్నపూర్ణ అని వ్యవహరిస్తారు. పశ్చిమాన అరేబియన్ సముద్రం వైపు ప్రవహించే నదుల్లో పెరియార్, నేత్రావతి, మాండోవి, తపతి, నర్మద ముఖ్యమైనవి.

ప్రాంతాలు

దక్షిణ భారతంలోని 4 ముఖ్య రాష్టాలు భాషాపరమైన ప్రాంతీయ హద్దులు కలిగివున్నాయి. ప్రాంతీయ పరంగా హద్దులు ఉన్నప్పట్టికీ, సాంస్కృతికంగా లేక చారిత్రికంగా లిఖించబడని ప్రాంతాలు పలుచోట్ల కనిపిస్తాయి. ఉదాహరణకు:

తీర ప్రాంతం కంటే తక్కువ ఎత్తులో ఉండే లక్షదీవులుకు చెందిన పగడపు దీవులు, నైరుతీ తీరానికి దూరంగా ఉంటాయి. శ్రీలంక ఆగ్నేయ తీరం వైపుకు పాక్ జలసంధి, రామ సేతు వంతెనతో భారతదేశం నుంచి వేరు చేయబడి ఉంది. అండమాన్ నికోబార్ దీవులు భారత తూర్పు తీరానికి దూరంగా బర్మా తీరమైన టెనాసెరీంకి దగ్గరగా ఉంటాయి. హిందూ మహాసముద్రం ఒడ్డున గల కన్యాకుమారి భారతదేశానికి దక్షిణం వైపు కొన భాగం.

ప్రకృతి (వృక్ష సంపద , జంతు సంపద)

దక్షిణ భారతదేశం: చరిత్ర, భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు 
శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం, తిరుమల, తిరుపతి, ఆంధ్రప్రదేశ్‌

దక్షిణ భారతదేశంలో ఎక్కువ భాగం ఉష్ణ మండల ప్రాంతమే. సతత హరితారణ్యాలు, ఆకురాల్చు అడవులు పశ్చిమ లోయ ప్రాంతం పొడవునా కనిపిస్తాయి.

దక్షిణ భారతదేశం: చరిత్ర, భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు 
ఉష్ణమండలపు పొడి అడవులు, నల్గొండ జిల్లా, తెలంగాణ

దక్కన్ పీఠభూమిలో ఉష్ణమండలపు పొడి అడవులు, దక్షిణ దక్కన్ పీఠభూమి ఆకురాలు అడవులు, దక్కన్ చిట్టడవులు అధికంగా కనుపిస్తాయి. పశ్చిమ కనుమలలోని ఎత్తైన ప్రాంతాలలో నైఋతి పడమటికనుమల వర్షారణ్యాలు ఉన్నాయి. మలబారు తీరపు చిత్తడి అడవులు తీరమైదానాలలో కనిపిస్తాయి. పశ్చిమ కనుమలు జీవ వైవిధ్యానికి ప్రధాన కేంద్రాలు.

ప్రఖ్యాతి గాంచిన కొన్ని వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు కొన్ని దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. పెరియార్ జాతీయ వనం, సైలెంట్ వ్యాలీ జాతీయ ఉద్యానవనం, నాగార్జున సాగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మొదలైనవి పులుల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడ్దాయి. రంగనతిట్టు పక్షుల సంరక్షణా కేంద్రం, కుమరకోమ్ పక్షుల సంరక్షణా కేంద్రం, నేలపట్టు పక్షుల సంరక్షణా కేంద్రం, పులికాట్ పక్షుల సంరక్షణా కేంద్రం మొదలైనవి పక్షుల సంరక్షణకై ఉద్దేశించినవి. ఇక్కడ మనం అనేక రకాలైన ప్రాంతీయ పక్షులను, వలస పక్షులను సందర్శించవచ్చు.

పశ్చిమ కనుమలకు చెందిన అన్నామలై కొండలు, నీలగిరి కొండలు, ఆంధ్రప్రదేశ్‌లో గల పులికాట్ సరస్సు, తమిళనాడుకు చెందిన పిఛావరం, కేరళకు చెందిన వెంబనాడు, అష్టముడి సరస్సు, కాయంకుళం సరస్సు ముఖ్యమైన పర్యావరణ పరిరక్షక కేంద్రాలు. కర్ణాటక, తమిళనాడు, కేరళ సరిహద్దులోగల మదుమలై జాతీయ వనం, బందిపూర్ జాతీయ ఉద్యానవనం, నాగర్‌హోల్ జాతీయ ఉద్యానవనం, వేనాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం మొదలైనవి నీలగిరి అభయారణ్యాలు కిందకి వస్తాయి.

జనాభా వివరాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు లతో కూడిన దక్షిణ భారతదేశం మొత్తం జనాభా 23.3 కోట్లు. ఇది వివిధ రకాలైన జాతుల, మతాల, భాషలకు పుట్టినిల్లు. వీరిలో ఆంధ్రులు, తమిళులు, కన్నడిగులు, మలయాళీలు, కొంకణీయులు అత్యధిక శాతం. మొత్తం జనాభాలో 83% మంది హిందువులు, 11% మంది ముస్లింలు, 5% మంది క్రైస్తవులు. భారతదేశంలో క్రైస్తవులు అత్యధికంగా ఉన్న ప్రాంతాలలో దక్షిణ భారతదేశం కూడా ఒకటి. రోమన్ కాథలిక్, ఇండియన్ ఆర్థోడాక్సు, సిరియన్ జాకోబైట్, ప్రొటెస్టంట్లు, సైరో-మలబార్, మర్తోమా మొదలైనవి కొన్ని క్రైస్తవ సంప్రదాయాలు. జైనులు, బౌద్ధులు, యూదులు, ఇతర మతాల వారు 1% కంటే తక్కువగా ఉంటారు.

దక్షిణ భారతదేశం: చరిత్ర, భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు 
సాంప్రదాయక 'నూనె-దీపం' కేరళ)

దక్షిణ భారతదేశం సగటు అక్షరాస్యత దాదాపు 73%. ఇది భారతదేశపు సగటుకన్నా ఎక్కువ (60%). కేరళ 91% అక్షరాస్యతతో దేశంలో అగ్రస్థానాన్ని అలంకరించింది. దక్షిణ భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి 997 (అనగా ప్రతి వెయ్యి మంది పురుషులకు 997 మంది స్త్రీలు ఉన్నారు). దేశంలోకల్లా ఒక్క కేరళలో మాత్రమే ఈ నిష్పత్తి వెయ్యి కంటే ఎక్కువగా ఉంది.. ఈ ప్రాంతంలో జనసాంద్రత సుమారుగా 463. జనాభాలో 18% షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన వారు. వ్యవసాయం ప్రధాన జీవనాధారం. 47.5% మంది వ్యవసాయ సంభందమైన పనుల్లో నిమగ్నమై ఉంటారు. 60% మంది ప్రజలు శాశ్వత గృహ వసతి కలిగి ఉన్నారు. 47.8% శాతం మంది రక్షిత మంచినీటిని పొందగలుగుతున్నారు. ఊట బావులు కూడా చాలామందికి నీటిని సరఫరా చేస్తాయి. 31% శాతం మందికి ముఖ్య ప్రయాణ సాధనం సైకిలే. 36.7% శాతం మంది టివి వీక్షించగలరు. కేంద్ర ప్రభుత్వం నడిపే దూర దర్శన్తో పాటు ఇతర ప్రాంతీయ ఛానళ్ళు చాలా ఉన్నాయి.

ప్రధాన భాషలు


 
 
 
 
ప్రోటో-ద్రవిడియన్
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ప్రోటో దక్షిణ-ద్రవిడియన్
 
ప్రోటో సెంట్రల్ ద్రవిడియన్
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ప్రోటో తమిళ-కన్నడం
 
 
 
ప్రోటో తెలుగు
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ప్రోటో తమిళ-తోడ
 
ప్రోటో కన్నడ
 
ప్రోటో తెలుగు
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ప్రోటో తమిళ-కోడగు
 
కన్నడ
 
తెలుగు
 
 
 
 
 
 
ప్రోటో తమిళ-మళయాలం
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ప్రోటో తమిళం
 
మలయాళం
 
 
 
 
 
తమిళం


పై వంశ వృక్ష చిత్రం ప్రాథమిక దక్షిణ భారత భాషల అభివృద్ధిని తెలుపుతుంది.

దక్షిణ భారతంలో ద్రవిడ భాషలు ప్రధానమైనవి. ద్రవిడ భాషలు సుమారుగా 73 ఉన్నాయి.. ద్రవిడ భాషల పుట్టుక, వివిధ భాషలతో సంబంధం గురించి వివిధ బాషా శాస్త్రజ్ఞులు వేరువేరు రకాలుగా చెపుతారు. 1816 లో బ్రిటిషు అధికారి అయిన ఫ్రాన్సిస్ ఎలిస్ (Francis W. Ellis) ద్రవిడ భాషలను ఏ ఇతర భాషా సమూహానికి చెందని భాషలుగా అభివర్ణించాడు. ద్రవిడ భాషల్లో ప్రధానమైనవి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం. తమిళం, మలయాళం, కన్నడ, తులు భాషలను దక్షిణ ద్రవిడ భాషలుగాను; తెలుగు, గోండి లను దక్షిణ మధ్య ద్రవిడ భాషలుగాను విభజించారు. 1956 లో ఏర్పడిన భాషాప్రయుక్త రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలుగా విభజించారు.

2001 జనాభా లెక్కల ప్రకారం తెలుగు 8 కోట్లతో హిందీ తరువాతి స్థానాన్ని ఆక్రమించింది. 6.4 కోట్లతో తమిళం, 5 కోట్లతో కన్నడ, 3.57 కోట్లతో మలయాళం తరువాతి స్థానాలు ఆక్రమించాయి. తెలుగు, తమిళం, కన్నడ, సంస్కృతం భాషలను భారతదేశ ప్రభుత్వం ప్రాచీన భాషలుగా (Classical Languages) గుర్తించింది. ఈ నాలుగు భాషలను జాతీయ భాషలుగా గుర్తించారు. ఇండో-ఆర్యన్ సమూహానికి చెందిన కొంకణి భాషను గోవా, కోస్తా కర్ణటక, కేరళ, మహారాష్ట్రలలో విరివిగా మాట్లాడుతారు. కొంకణి భాష మీద కన్నడ, మలయాళ భాషల ప్రభావం ఎక్కువగా వుండి ఈ రెండు భాషలనుండి చాలా పదాలను అరువు తెచ్చుకుంది. ఉత్తర దక్కను, కొంకణ్ ప్రాంతాలలో మరాఠి ఎక్కువగా మాట్లాడుతారు. బార్కూరు సమీపంలో తుళు భాషలో వున్న శాసనాలు (inscriptions) లభ్యమయ్యాయి. వీటిని జాగ్రత్త పరచడం ఎంతైనా అవసరం.

వివిధ భాషలు మాట్లాడే వారి వివరాలు కింది పట్టికలో చూడవచ్చు

ఎస్. భాష మాట్లాడేవారి సంఖ్య అధికారిక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
1 తెలుగు 7,40,02,856 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి
2 తమిళం 6,07,93,814 తమిళనాడు, పుదుచ్చేరి
3 కన్నడ 4,37,06,512 కర్ణాటక
4 మలయాళం 3,48,38,319 కేరళ, లక్షద్వీప్, మహే, పుదుచ్చేరి
5 ఉర్దూ 1.2 - 1.3 కోట్లు తెలంగాణ
6 తులు 18,46,427 దక్షిణా కన్నడ, ఉడిపి జిల్లా, కాసర్గోడ్ జిల్లా
7 కొంకణి 8,00,000+ ఉత్తరా కన్నడ (కర్ణాటక), దక్షిణ కన్నడ (కర్ణాటక), ఉడిపి (కర్ణాటక), గోవా .
8 కొడవ తక్ కొడగు జిల్లా (కర్ణాటక)

ఆదాయ వనరులు

ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య ఉన్న తేడాలు
ఉత్తర భారతం దక్షిణ భారతం
తలసరి ఆదాయం (రు.లలో) 8433 13629
అక్షరాస్యతా శాతం (%) 59 74
ప్రజారోగ్యంపై తలసరి వ్యయం (Rs.) 92 127
విద్యుత్ సౌకర్యం కల ఇళ్ళ శాతం (%) 49 74
Source: Business Today, January 2005

దక్షిణ భారతదేశంలో దాదాపు 50% ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. భారతదేశం లోని ఇతర ప్రాంతాల వ్యవసాయదారుల మాదిరిగా ఇక్కడి రైతులు కూడా ప్రధానంగా నీటి కొరకు వర్షపాతం ముఖ్యంగా ఋతుపవనాల మీదనే ఆధార పడతారు. వరి, వేరుశనగ, చెరకు, పత్తి, రాగి, మిరియాలు, పప్పుదినుసులైన మినుములు, కందులు, శనగలు మొదలగునవి ఇక్కడ పండే కొన్ని ముఖ్యమైన పంటలు. ఇంకా కాఫీ, తేయాకు, వెనీలా, రబ్బరు మొదలైన పంటలను కొండ ప్రాంతాలలో పెంచుతారు. కోస్తా ప్రాంతాలలో కొబ్బరి తోటలు విస్తారంగా పెరుగుతాయి. వరి పంట పండించడంలో ఆంధ్రప్రదేశ్ (2014 లో రాష్ట్ర విభజనకు ముందు) భారతదేశం లోనే మొదటి స్థానంలో ఉండేది. భారతదేశంలోని కాఫీ పంట సాగులో కర్ణాటక వాటా 70%. ఎడతెరిపిలేని కరువుల వలన ఉత్తర కర్ణాటక, రాయలసీమ, తెలంగాణా ప్రాంత రైతులు అప్పుల పాలై ఉన్న ఆస్తులు అమ్ముకుని, చివరికి కొద్ది మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇక్కడ వేసవి కాలంలో నీటి ఎద్దడి కూడా ఎక్కువే.

ఇక పరిశ్రమల విషయానికొస్తే చెన్నైలో వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి పరిశ్రమలు చాలా ఉన్నాయి. బెంగుళూరులో భారీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాలు చాలా ఉన్నాయి. ఇటీవలి కాలంలో సమాచార సాంకేతిక రంగం (ఐటి) బాగా అభివృద్ధి చెందడంతో ఆదాయం బాగా పెరిగింది. ముఖ్యంగా బెంగుళూరును భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పిలుస్తారు. ఐటికి ఇదే ప్రధాన కేంద్రం. ఇక్కడ 200 వరకు చెప్పుకోదగిన కంపెనీలు ఉన్నాయి. 1992, 2002 మధ్యలో కర్ణాటక రూ 2,156.6 కోట్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. ఇది దేశం మొత్తమ్మీద నాలుగో అత్యధిక మొత్తం. 2005-06 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ భారతదేశం నుంచి సుమారు 64,000 కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు జరిగాయి.

ఆర్థిక సూచికలు
పరామితి దక్షిణ భారతదేశం దేశం మొత్తం
స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) ₹ 67 లక్షల కోట్లు ₹ 2 కోట్ల 9 లక్షల కోట్లు
తలసరి దేశీయోత్పత్తి (ఎస్‌డిపి) ₹ 29,027 ₹ 23,222
దారిద్య్రరేఖకు దిగువన జనాభా 15.41% 26.1%
పట్టణ జనాభా 32.8% 27.8%
విద్యుత్సౌకర్యం కలిగిన గృహాలు 98.91% 88.2%
అక్షరాస్యత శాతం 81.09% 74%

తమిళనాడు నికర రాష్ట్ర ఉత్పత్తి చాలా రాష్ట్రాల నికర రాష్ట్ర ఉత్పత్తి కన్నా ఉన్నత స్థానంలో ఉంది. పారిశ్రామికీకరణ విషయానికొస్తే కేరళ కొద్దిగా వెనుకబడి ఉన్నా అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మాత్రం మెరుగ్గానే ఉన్నాయి. అక్కడి తలసరి ఆదాయంలో 20% విదేశీ మారకం ద్వారా వస్తున్నదే. దీనినే కేరళ అభివృద్ధి నమూనాగా తరచూ వ్యవహరించడం జరుగుతుంది.

రాజకీయాలు

దక్షిణ భారతదేశం: చరిత్ర, భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు 
కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ర్యాలీ.

దక్షిణ భారతదేశంలో, కొన్ని ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలైన భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు రాజకీయాలను శాసిస్తున్నాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాలలోనూ కనీసం రెండు రాజకీయ పార్టీలు ప్రబలంగా ఉన్నాయి.

దేశానికి స్వాతంత్ర్యం రాక మునుపు మద్రాసు ప్రెసిడెన్సీలో జస్టిస్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ లే కీలక పాత్ర పోషించేవి. ద్రవిడ ఉద్యమం ప్రారంభించిన పెరియార్ రామసామి 1938 లో జస్టిస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1944లో దీని పేరు ద్రవిడర్ కజగం అని మార్చారు. దీని ప్రారంభ లక్ష్యం స్వతంత్ర భారతదేశం నుంచి ప్రత్యేక ద్రవిడ నాడు ఏర్పరచడం. స్వాతంత్ర్యానంతరం తమ పార్టీ ఎన్నికల్లో పాల్గొనబోధని పెరియార్ తేల్చి చెప్పడంతో, అతని అంతరంగిక అనుచరులు కూడా ఆయనతో విభేదించారు. 1948 లో పెరియార్ అనుచరుడు, ద్రవిడర్ కజగం పార్టీ ప్రధాన కార్యదర్శియైన అన్నాదురై, ఆ పార్టీ నుంచి వేరుపడి ద్రవిడ మున్నేట్ర కజగం అనే పార్టీని నెలకొల్పాడు..

డిఎంకే పార్టీ మొట్ట మొదటి సారిగా 1968లోనూ మరలా 1978 లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తరువాతి సంవత్సరమే ఎం జి రామచంద్రన్ డిఎంకే నుంచి విడిపోయి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలే తమిళనాడులో 60% శాతం వోటుబ్యాంకును కలిగి ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కమ్మ, రెడ్డి, కాపు కులస్థులు, కర్నాటకలో వొక్కలిగ, లింగాయతులు, కేరళలో నాయర్ లేదా ఎలవ, మహారాష్ట్రలో కుంబిలు ఆధిపత్య కులాలు. సాధారణంగా ఈ కులస్థులే ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవిని అధిష్టిస్తూంటారు. తమిళనాడులో మెజారిటీ కులస్థులు వెన్నియార్లు, కొంగువెల్లలార్లు, తేవర్లు. పి.యం.కే. అధ్యక్షుడు డా.రామదాస్, తమిళనాడునూ, బీహార్-జార్ఖండ్, మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్-ఉత్తరాఖండ్ లా విభజించాలని, సోనియా గాంధీకి సూచించాడు.

దక్షిణ భారతదేశం: చరిత్ర, భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు 
బెంగలూరు లోని కర్నాటక శాసనసభ భవనం విధాన సౌధ.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడైన నందమూరి తారక రామారావు, 1982 లో తెలుగుదేశం పార్టీని నెలకొల్పటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాంగ్రెస్ ఏకచక్రాధిపత్యానికి అడ్డుకట్ట పడింది. కాంగ్రెస్ ఆధిక్యాన్ని సవాలు చేస్తూ మొత్తం నాలుగు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1995లో భారీ మెజారిటీతో గెలిచిన ఒక సంవత్సరం తర్వాత ఆయన రెండవ భార్య లక్ష్మీ పార్వతికి ఇతర కుటుంబ సభ్యులకూ మధ్య తలెత్తిన వివాధాల వలన తెలుగుదేశం పార్టీలో చీలిక వచ్చింది. చాలామంది పార్టీ సభ్యులు రామారావు అల్లుడైన నారా చంద్రబాబు నాయుడును సమర్థించడంతో తర్వాత అతను ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాలనే లక్ష్యంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కె.సి.ఆర్), తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీని ఏర్పాటు చేసాడు. 2004 శాసనసభ ఎన్నికల్లో వై.యస్.రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ, తెరాసతో వ్యూహాత్మక సంధి కుదుర్చుకుని భారీ మెజారిటీతో గెలుపొంది, తెలుగుదేశం పార్టీని గద్దె దించడంలో సఫలీకృతమైంది. చేసిన ఉద్యమాల ఫలితంగా, 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెరాస అధ్యక్షుడు కె.సి.ఆర్, కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యాడు.

జనతాదళ్ ఇప్పటిదాకా దేశ రాజకీయాలలో కన్నా, కర్ణాటకలోనే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు ఇతర దక్షిణ భారతదేశ రాష్ట్రాల కంటే కర్ణాటకలోనే ఎక్కువగా విజయాలను చవి చూస్తున్నాయి. కర్ణాటక రాజకీయాలను ఒక్కలిగ, లింగాయతులు అనే రెండు కులాలు శాసిస్తున్నాయి.. 1980లలో జనతాదళ్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించడంలో, రామకృష్ణ హెగ్డే ప్రముఖ పాత్ర పోషించాడు. అయితే, తరువాతి కాలంలో అతని రాజకీయ ప్రత్యర్థి ఐన హెచ్ డి దేవెగౌడ దేశ ప్రధాని అయ్యాడు.

కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, వామపక్షాల నాయకత్వం లోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌లు ప్రధానమైన రాజకీయ ప్రత్యర్థులు. ఈ రెండు కూటములు ఒకరి తరువాత ఒకరు అధికారంలోకి రావడం ఇక్కడ విశేషం.

పరిపాలన

దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతాలూ ఉన్నాయి. పుదుచ్చేరికి, ఐదు రాష్ట్రాలకూ ఎన్నికయ్యే రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. లక్షద్వీప్, అండమాన్ ద్వీపాలు కేంద్ర పాలనలో ఉంటాయి. ప్రతి రాష్ట్రానికి భారత రాష్ట్రపతి నియమించిన గవర్నర్ నాయకత్వం వహిస్తారు. గవర్నరు, రాష్ట్ర శాసనసభలో మెజారిటీ పార్టీ నాయకుడిని గాని, సంకీర్ణ నాయకుడిని గానీ ముఖ్యమంత్రిగా నియమిస్తారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతి.

ప్రతి రాష్ట్రాన్ని జిల్లాలుగా విభజించారు. జిల్లాలు తాలూకాలు లేదా మండలాలుగా విభజించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల స్థానిక స్వపరిపాలనా సంస్థలకు మేయర్, మునిసిపల్ చైర్మన్, పంచాయతీ సర్పంచ్ లను ఎన్నుకుంటారు .

రాష్ట్రాల జనాభా వివరాలను కింది పట్టిక చూపిస్తుంది.

క్ర. సం. పేరు ISO 3166-2 కోడ్ ! ఏర్పడిన తేదీ! జనాభా ప్రాంతం (కిమీ 2 )! అధికారిక

భాష (లు)! రాజధాని

జనసాంద్రత

(కిమీ 2 కి )

లింగ నిష్పత్తి అక్షరాస్యత రేటు (%)! పట్టణ జనాభా %
1 ఆంధ్రప్రదేశ్ AP 1956 నవంబరు 1 4,95,06,799 162,968 తెలుగు అమరావతి, కర్నూలు, విసకపట్నం 308 996 67.41 29.4
2 కర్ణాటక KA 1956 నవంబరు 1 6,10,95,297 191,791 కన్నడం బెంగళూరు 319 973 75.60 38.67
3 కేరళ KL 1956 నవంబరు 1 3,34,06,061 38,863 మలయాళం తిరువనంతపురం 860 1084 94.00 47.72
4 తమిళనాడు TN 1950 జనవరి 26 7,21,47,030 130,058 తమిళం చెన్నై 555 996 80.33 48.40
5 తెలంగాణ TS 2014 జూన్ 2 3,51,93,978 112,077 తెలుగు, ఉర్దూ హైదరాబాద్ 307 988 66.50 38.7

కేంద్రపాలిత ప్రాంతాల జనాభా వివరాలను కింది పట్టిక చూపిస్తుంది.

క్ర. సం. పేరు ISO 3166-2 కోడ్ ! జనాభా ప్రాంతం

(కిమీ 2 )! అధికార భాష! రాజధాని

జన సాంద్రత (కిమీ 2 కి ) లింగ నిష్పత్తి అక్షరాస్యత రేటు (%)! పట్టణ జనాభాలో%
1 అండమాన్ నికోబార్ AN 380,581 8,249 హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, మలయాళం పోర్ట్ బ్లెయిర్ 46 876 86.27 37.70
2 లక్షద్వీప్ LD 64,473 30 మలయాళం కవరట్టి 2,013 946 92.28 78.07
3 పుదుచ్చేరి PY 1,247,953 490 తమిళం పుదుచ్చేరి 2,598 1037 86.55 68.33

దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నియోజకవర్గాల సంఖ్య, ఆయా రాష్ట్రాల నేతల వివరాలను కింది పట్టికలో చూడవచ్చు

రాష్ట్రం / కేం.పా.ప్రాం లోక్‌సభ! రాజ్యసభ విధానసభ గవర్నర్ / లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్యమంత్రి
అండమాన్ నికోబార్ 1 లేదు లేదు ఎకె సింగ్ లేరు
ఆంధ్రప్రదేశ్ 25 11 175 బిశ్వభూసణ్ హరిచందన్ వైయస్ జగన్మోహన్ రెడ్డి
కర్ణాటక 28 12 224 వజుభాయ్ వాలా బి.ఎస్ యడ్యూరప్ప
కేరళ 20 9 140 ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పినరయి విజయన్
లక్షద్వీప్ 1 లేదు లేదు హెచ్.రాజేష్ ప్రసాద్ లేరు
పుదుచ్చేరి 1 1 30 తమిళై సౌందరాజన్ తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన
తమిళనాడు 39 18 234 బన్వారిలాల్ పురోహిత్ ఎడప్పాడి కె. పళనిస్వామి
తెలంగాణ 17 7 119 తమిళై సౌందరాజన్ కె. చంద్రశేఖర్ రావు
మొత్తం 132 58 922

రవాణా

దక్షిణ భారతదేశం: చరిత్ర, భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు 
జనాభా సాంద్రతను, రహదారుల విస్తృతినీ చూపించే మ్యాప్

రోడ్లు

దక్షిణ భారతదేశంలో 20,573 km (12,783 mi) పొడవైన జాతీయ రహదారులు, 46,813 km (29,088 mi) పొడవున్న రాష్ట్ర రహదారులతో విస్తృతమైన రోడ్ నెట్‌వర్క్ ఉంది. స్వర్ణ చతుర్భుజి చెన్నైని బెంగళూరు ద్వారా ముంబైతోటి, విశాఖపట్నం ద్వారా కోల్‌కతాతోటీ కలుపుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పుదుచ్చేరి రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లు బస్సు సేవలను అందిస్తున్నాయి.

రాష్ట్రం జాతీయ రహదారి! రాష్ట్ర రహదారి 1000 మంది జనాభాకు ఉన్న

మోటారు వాహనాలు.

ఆంధ్రప్రదేశ్ 7,356 km (4,571 mi) 10,650 km (6,620 mi) 145
కర్ణాటక 6,432 km (3,997 mi) 20,774 km (12,908 mi) 182
తమిళనాడు 5,006 km (3,111 mi) 10,764 km (6,688 mi) 257
తెలంగాణ 2,635 km (1,637 mi) 3,152 km (1,959 mi) అందుబాటులో లేదు
కేరళ 1,811 km (1,125 mi) 4,341 km (2,697 mi) 198
అండమాన్ నికోబార్ 330 km (210 mi) 38 km (24 mi) 152
పుదుచ్చేరి 64 km (40 mi) 246 km (153 mi) 521
మొత్తం 22,635 km (14,065 mi) 49,965 km (31,047 mi)

రైలు మార్గాలు

1853 లో ఇంగ్లాండ్‌లో గ్రేట్ సదరన్ ఆఫ్ ఇండియా రైల్వే కంపెనీ స్థాపించి, 1859 లో నమోదు చేసారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో ట్రాక్ నిర్మాణం 1859 లో ప్రారంభమైంది. 80 miles (130 km) తిరుచినాపల్లి నుండి నాగపట్నం వరకు మార్గాన్ని 1861 లో ప్రారంభించారు. 1864 లో కర్ణాటక రైల్వే కంపెనీని స్థాపించారు. మద్రాసు- అరక్కోణం - కంజీవరం - కాట్పాడి జంక్షన్ మార్గాన్ని 1865 లో ప్రారంభించారు. ఈ రెండు సంస్థలూ 1874 లో విలీనం అయ్యి దక్షిణ భారత రైల్వే కంపెనీగా ఏర్పడ్డాయి. 1880 లో, బ్రిటిష్ వారు స్థాపించిన గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే , మద్రాస్ నుండి బయలుదేరే రైల్వే నెట్‌వర్క్‌ను నిర్మించింది. 1879 లో, మద్రాస్ రైల్వే రాయపురం నుండి బెంగళూరు వరకు ఒక మార్గాన్ని నిర్మించింది; మైసూర్ మహారాజా, ఈ మార్గాన్ని బెంగళూరు నుండి మైసూర్ వరకు పొడిగించేందుకు మైసూర్ స్టేట్ రైల్వేను స్థాపించాడు. పోర్ట్ ఆఫ్ క్విలాన్ ద్వారా పశ్చిమ తీరం, మలబార్ ప్రాంతానికి ప్రవేశం పొందడానికి, ట్రావెన్కోర్ మహారాజా ఉత్రం తిరునాల్, దక్షిణ భారత రైల్వే కంపెనీ, మద్రాస్ ప్రెసిడెన్సీతో సంయుక్తంగా క్విలాన్-మద్రాస్ రైలు మార్గాన్ని నిర్మించాడు. 1908 జనవరి 1 న మద్రాస్ రైల్వే, దక్షిణ మహారాట్ట రైల్వేలను విలీనం చేసి, మద్రాస్, దక్షిణ మహారాట్ట రైల్వేను స్థాపించారు.

1951 ఏప్రిల్ 14 న, మద్రాస్, దక్షిణ మహారాత్త రైల్వే, దక్షిణ భారత రైల్వే, మైసూర్ స్టేట్ రైల్వే లను విలీనం చేసి దక్షిణ రైల్వేను ఏర్పాటు చేసారు. ఇదే భారత రైల్వేల మొట్టమొదటి జోన్. సౌత్ సెంట్రల్ జోన్ 1966 అక్టోబరు 2 న భారత రైల్వేల తొమ్మిదవ జోన్ గాను, 2003 ఏప్రిల్ 1 న సౌత్ వెస్ట్రన్ జోన్నూ ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతం చాలావరకు ఈ మూడు జోన్‌ల పరిధి లోనే ఉంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే, కొంకణ్ రైల్వేల పరిధుల్లో కొంత భాగం ఉంది. 2019 లో దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటును ప్రకటించింది. దీని ప్రధాన కార్యాలయం, విశాఖపట్నం. 

బెంగళూరులో నమ్మ మెట్రో, చెన్నైలో చెన్నై మెట్రో, కొచ్చిలో కొచ్చి మెట్రో, హైదరాబాదులో హైదరాబాద్ మెట్రోలు మెట్రో రైలును నడుపుతున్నాయి. చెన్నై MRTS సబర్బన్ రైలు సేవలు అందిస్తోంది. చెన్నైలో భారతదేశపు మొదటి వంతెనపై నడిచే రైల్వే మార్గం ఉంది. హైదరాబాద్ MMTS, హైదరాబాద్ నగరంలో సబర్బన్ రైలు సేవలను అందిస్తోంది.

నీలగిరి మౌంటైన్ రైల్వే, యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశం.

క్ర.సం. లేదు రైల్వే జోన్ పేరు అబ్రా. మార్గం పొడవు (కి.మీ.లో) ప్రధాన కార్యాలయం స్థాపించబడింది! విభాగాలు ప్రధాన స్టేషన్లు
1. దక్షిణ ఎస్.ఆర్ 5,098 చెన్నై 1951 ఏప్రిల్ 14 చెన్నై, తిరుచిరప్పల్లి, మదురై, పాలక్కాడ్, సేలం, తిరువనంతపురం చెన్నై సెంట్రల్, కోయంబత్తూర్ మెయిన్, ఎర్నాకుళం, ఈరోడ్, కట్పాడి, కొల్లం, కోజికోడ్, మదురై, మంగుళూరు సెంట్రల్, పాలక్కాడ్, సేలం, తిరువనంతపురం సెంట్రల్, త్రిస్సూర్, తిరుచిరాపల్లి, తిరునెల్వేలి
2. దక్షిణ తీరం SCoR 3,496 విశాఖపట్నం 2019 (ప్రకటించబడింది) వాల్టెయిర్, విజయవాడ, గుంటకల్, గుంటూరు విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి మెయిన్, విజయవాడ, అడోని, గుంతకల్లు, రాజమండ్రి, కాకినాడ టౌన్, కదప, కొండపల్లి
3. సౌత్ సెంట్రల్ SCR 3,127 సికింద్రాబాద్ 1966 అక్టోబరు 2 సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ సికింద్రాబాద్, హైదరాబాద్, వరంగల్
4. సౌత్ వెస్ట్రన్ SWR 3,177 హుబ్లి 2003 ఏప్రిల్ 1 హుబ్లి, బెంగళూరు, మైసూర్, గుల్బర్గా బెంగళూరు సిటీ, హుబ్లి, మైసూర్
5. తూర్పు తీరం ECoR 2,572 భువనేశ్వర్ 2003 ఏప్రిల్ 1 ఖుర్దా రోడ్, సంబల్పూర్ విశాఖపట్నం, రాయగడ, పలాస, విజయనగరం
6. కొంకణ్ కె.ఆర్ 741 నవీ ముంబై 1988 జనవరి 26 కార్వార్, రత్నగిరి మద్గావ్

వైమానిక రవాణా

దక్షిణ భారతదేశంలో 9 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 2 కస్టమ్స్ విమానాశ్రయాలు, 15 దేశీయ విమానాశ్రయాలు, 11 వైమానిక స్థావరాలు ఉన్నాయి. దేశంలో కెల్లా అత్యంత రద్దీగా ఉండే 10 విమానాశ్రయాల్లో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ వారి దక్షిణ ప్రాంతీయ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది.

భారత వైమానిక దళ దక్షిణ వైమానిక కమాండ్ ప్రధాన కార్యాలయం తిరువనంతపురం లోను, శిక్షణా కమాండ్ ప్రధాన కార్యాలయం బెంగళూరులోనూ ఉంది. అండమాన్, నికోబార్ దీవులలో ఉన్న రెండిటితో సహా దక్షిణ భారతదేశంలో పదకొండు వైమానిక స్థావరాలను వైమానిక దళం నిర్వహిస్తోంది. ఈ ప్రాంతంలో, భారత నావికదళానికి కొచ్చీ, అరక్కోణం, ఉచ్చిపులి, విశాఖపట్నం, కాంప్బెల్ బే, డిగ్లీపూర్ లలో వైమానిక స్థావరాలు ఉన్నాయి.

ర్యాంక్ పేరు నగరం రాష్ట్రం IATA కోడ్ మొత్తం

ప్రయాణీకులు (2018–19)

1 కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు కర్ణాటక BLR 3,33,07,702
2 చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం చెన్నై తమిళనాడు MAA 2,25,43,822
3 రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ తెలంగాణ HYD 2,14,03,972
4 కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం కొచ్చి కేరళ COK 1,01,19,825
5 త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం తిరువనంతపురం కేరళ TRV 44,34,459
6 కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం కోజికోడ్ కేరళ CCJ 33,60,847
7 కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం కోయంబత్తూర్ తమిళనాడు CJB 30,00,882
8 విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ VTZ 28,53,390
9 మంగుళూరు విమానాశ్రయం మంగళూరు కర్ణాటక IXE 22,40,664
10 తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం తిరుచిరాపల్లి తమిళనాడు TRZ 15,78,831
11 మదురై అంతర్జాతీయ విమానాశ్రయం మదురై తమిళనాడు IXM
12 దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయం దబోలిమ్ గోవా GOI

జలమార్గాలు

దక్షిణ సముద్ర తీరం వెంబడి మొత్తం 89 ఓడరేవులు ఉన్నాయి: తమిళనాడు (15), కేరళ (17), ఆంధ్రప్రదేశ్ (12), కర్ణాటక (10), లక్షద్వీప్ (10), పాండిచేరి (2), అండమాన్ నికోబార్ (23). ప్రధాన ఓడరేవులలో విశాఖపట్నం, చెన్నై, మంగళూరు, టుటికోరిన్, ఎన్నోర్, కాకినాడ, కొచ్చి ఉన్నాయి .

పేరు నగరం రాష్ట్రం కార్గో హ్యాండిల్ చేయబడింది ( FY 2017–18)
కోట్ల టన్నులు % మార్పు

(మునుపటి FY కన్నా ఎక్కువ)

విశాఖపట్నం ఓడరేవు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ 6.354 4.12%
చెన్నై ఓడరేవు చెన్నై తమిళనాడు 5.188 3.32%
కొత్త మంగళూరు ఓడరేవు మంగుళూరు కర్ణాటక 4.205 5.28%
VO చిదంబరనార్ పోర్ట్ తూత్తుకుడి తమిళనాడు 3.657 -4.91%
కామరాజర్ పోర్ట్ చెన్నై తమిళనాడు 3.045 1.42%
కొచ్చిన్ పోర్ట్ కొచ్చి కేరళ 2.914 16.52%
గంగవరం పోర్ట్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ 2.054 5.12%
కాకినాడ పోర్ట్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ 1.512 1.1

ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన కాలువలు, నదులు, సరస్సులు, ఇన్లెట్ల నెట్వర్కుతో ఏర్పడినదే కేరళ లోని బ్యాక్ వాటర్స్. ఇది 900 కి.మీ.కు పైగా ఉన్న వ్యవస్థ. ఈ ప్రకృతి దృశ్యం మధ్యలో, అనేక పట్టణాలు నగరాలు ఉన్నాయి, ఇవి బ్యాక్ వాటర్ విహారయాత్రలకు ప్రారంభ, ముగింపు బిందువులుగా ఉన్నాయి. విజింజిమ్ అంతర్జాతీయ నౌకాశ్రయం (త్రివేండ్రం ) భారతదేశంలోని త్రివేండ్రం లోని విజింజం వద్ద అరేబియా సముద్రంలో నిర్మాణంలో ఉన్న ఒక ఓడరేవు. పూర్తయిన తర్వాత, ఈ నౌకాశ్రయం భారతదేశపు ట్రాన్స్‌షిప్మెంట్లలో 40% పైగా నిర్వహించగలదని అంచనా వేసారు, తద్వారా దుబాయ్, కొలంబో, సింగపూర్‌లోని ఓడరేవులపై దేశం ఆధారపడటం తగ్గుతుంది.

భారత నావికాదళానికి చెందిన తూర్పు నావికాదళం, సదరన్ నావల్ కమాండ్ ప్రధాన కార్యాలయాలు విశాఖపట్నం, కొచ్చిలలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో, భారత నావికాదళానికి విశాఖపట్నం, చెన్నై, కొచ్చి, కార్వార్, కావరత్తి వద్ద ప్రధాన కార్యాచరణ స్థావరాలున్నాయి.

సంస్కృతి, వారసత్వ సంపద

దక్షిణ భారతదేశం: చరిత్ర, భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు 
కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన త్యాగరాజు.

దక్షిణ భారతీయులు భాషాపరంగా, సాంస్కృతిక పరంగా మిగతా భారతదేశము కంటే భిన్నముగా ఉంటారు. కాని భారతీయుల మధ్య ఉన్న సంబంధాలు, యావత్తు భారతదేశంపై బడ్డ విదేశీయుల ప్రభావం వలన సంస్కృతిపై కూడా ప్రభావం కనపడుతుంది. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం దక్షిణ భారతీయుల "ప్రపంచ దృష్టి" శరీర సౌందర్యాన్ని, మాతృత్వాన్ని ఆస్వాదించడం ద్వారా అనంతమైన విశ్వాన్ని అస్వాదించడం. ఇది వారి నృత్యము, వస్త్రధారణ, శిల్పకళల ద్వారా వ్యక్తమవుతుంది.

దక్షిణ భారతీయ వనితలు చీరను, పురుషులు పంచె, లుంగీ, జరీ (బేటిక్) ఉన్న ఒక పెద్ద వస్త్రమును (సరాంగ్) ను ధరిస్తారు. చీర ఎక్కడా కుట్లు లేకుండా నడుము భాగము కనపడుతూ ఉంటుంది. భారతీయ తత్వ శాస్త్రం ప్రకారం బ్రహ్మ నాభి (బొడ్డు) సకల జీవ సృష్టికి ఆధార భూతమైనది. దీని వెనుక ఉన్న కారణం చాలామందికి తెలియనప్పటికీ నాభి భాగాన్ని, పొట్టనూ మూసి వేయకుండా అలాగే వదిలి వేస్తారు. ప్రాచీన నాట్యశాస్త్రం వెలిబుచ్చిన అభిప్రాయం ప్రకారం ఈ విధంగా నాభి భాగాన్ని కప్పుకోకుండా వదలి వేయడం వలన ఆంగికం భువనం యస్య (భగవంతుని శరీరమే ప్రపంచమనే భావన) ఈ సంప్రదాయంలో ప్రతిఫలిస్తుంది.

దక్షిణ భారతదేశ సంగీతాన్ని కర్ణాటక సంగీతం అని వ్యవహరిస్తారు. ఇది పురందర దాసు, కనకదాసు, త్యాగరాజు, అన్నమయ్య, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామ శాస్త్రి, సుబ్బరాయ శాస్త్రి, మైసూరు వాసుదేవాచార్యులు, స్వాతి తిరునాళ్ వంటి వాగ్గేయకారులు ఏర్పరచిన తాళ, లయగతులతో కూడిన సంగీతం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కె.జె. ఏసుదాసు (జేసుదాసు), ఎం.ఎస్.సుబ్బులక్ష్మి డి.కె.పట్టమ్మాళ్, మహారాజపురం సంతానాలు ప్రముఖ కర్ణాటక సంగీతకారులలో కొందరు.

తరతరాలుగా వస్తున్న దక్షిణ భారతదేశ ఆచారాలనూ, సంప్రదాయాలనూ, మార్పులనూ, నాగరికతనూ, ప్రజల ఆశయాలనూ ప్రతిబింబిస్తూ ఇక్కడ చలనచిత్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. 1986లో పద్మరాజన్ తీసిన నమ్ముక్కుపార్కాన్, 1984లో జి.వి.అయ్యర్ తీసిన ఆది శంకర, 1990లో పెరుంతాచన్ తీసిన అజయన్, 1984 లో విశ్వనాథ్ తీసిన శంకరాభరణం ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. ఈ సినిమాలు ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేశాయి.

దక్షిణ భారతదేశం: చరిత్ర, భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు 
కూచిపూడి కళాకారిణి.
దక్షిణ భారతదేశం: చరిత్ర, భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు 
భరతనాట్యం కళాకారిణి.

దక్షిణ భారతదేశం వివిధ నాట్యరీతులకు ఆలవాలమైంది. భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, యక్షగానం, తెయ్యం, ఒట్టంతుళ్ళ, ఒప్పన, కేరళ నటనం, మొహినీ అట్టం ఇందులో ప్రధానమైనవి. భరతనాట్య కళాకారులు, కళాకారిణులలో చక్కటి శరీరాకృతి, సౌష్టవమైన శరీరం, సన్నని నడుము, పొడవైన కేశాలు, ఎత్తైన జఘనాలకు (వంపు సొంపులకు) ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. వీరు నాట్య శాస్త్ర తత్వానికి జీవం పోస్తారు. సగం కూర్చున్నట్లు కనిపించే అరైమండి అనే భంగిమలో మోకాళ్ళు పక్కకి వంగి ఉంటాయి. ఈ ప్రాథమిక భరతనాట్య భంగిమలో తల నుంచి నాభి వరకు ఉన్న దూరం, నాభి నుంచి భూమికి ఉన్న దూరానికి సమానంగా ఉంటుంది. అదేవిధంగా చాచిన రెండు చేతుల మధ్య దూరం, తలనుంచి నాభి వరకు ఉన్న దూరానికి సమానం. ఇది జీవము, పుట్టుక కలయికయైన్ నాట్యపురుషుని వ్యక్తీకరిస్తుంది.

దక్షిణ భారతదేశం: చరిత్ర, భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు 
అరటి ఆకులపై భోజనం వడ్డించే సంప్రదాయం (ముఖ్యంగా పండుగ దినాలలో)

ఇక్కడి ప్రజల ప్రధానమైన ఆహారం వరి అన్నము. కోస్తా ప్రాంతాలలో నివసించేవారి ఆహారంలో చేపలు అంతర్భాగం. కేరళ వంటకాలలో కొబ్బరి, ఆంధ్ర వంటకాలలో పచ్చళ్ళు, కారంతో కూడిన కూరలు సర్వ సాధారణం. దోశ, ఇడ్లీ, ఊతప్పం మొదలైనవి కొన్ని ప్రసిద్ధి చెందిన వంటకాలు. దక్షిణ కర్ణాటక, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో విస్తారమైన కాఫీ తోటలు ఉన్నాయి.

దక్షిణ భారతదేశంలో రెండు ప్రధానమైన వాస్తు శిల్పకళా రీతులు ఉన్నాయి. ఒకటి తమిళనాడుకు చెందిన సంపూర్ణ ద్రవిడ విధానం కాగా మరొకటి కర్ణాటకకు చెందిన వేసర శిల్పకళ. హంపి, బాదామి, భట్టిప్రోలు, పట్టాడక, అహోబిలం,బేలూరు, హళిబేడు, లక్కుండి, శ్రావణబెళగొళ, మహాబలిపురం, తంజావూరు, మధురై మొదలైన దేవాలయాల లోని శిల్పకళ ఇక్కడి శిల్పుల నైపుణ్యానికి, కళాభిరుచికీ చక్కటి నిదర్శనాలు. రాజా రవివర్మ గీసిన చిత్రాలు దక్షిణ భారతదేశ సంప్రదాయాన్ని, పురాణాల్నీ చక్కగా ప్రతిబింబిస్తాయి. ఎట్టమునూర్ లో గల శైవ క్షేత్రం, మాతంచేరి దేవాలయంలో గల చిత్రాలు ద్రవిడ దేశపు కుడ్యచిత్రాలకు కొన్ని ఉదాహరణలు. దక్షిణ భారతదేశంలో 5 నుంచి 26 దాకా చరిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన స్థలాలు ఉన్నాయి.

దక్షిణ భారతదేశం: చరిత్ర, భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు 
కర్నాటక లోని గోమఠేశ్వర వద్ద, జైనుల తీర్థంకరుడు 'బాహుబలి' ఏకశిలా శిల్పం. (978-993 నాటిది).
దక్షిణ భారతదేశం: చరిత్ర, భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు 
తంజావూరు లోని బృహదీశ్వరాలయం ప్రధాన విమానం.

నృత్యం తరువాత శిల్పకళ ఇక్కడ కళలలో ప్రసిద్ధి గాంచింది. ఈ మాధ్యమంలో నిజస్వరూపాలను మూర్తులుగా మలచడం తక్కువ సమయంలోనే సాధ్యమౌతుంది. సాంప్రదాయిక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కడం బొడ్డు నుంచి ప్రారంభిస్తాడు. శిల్పాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఆత్మ, పరమాత్మ యొక్క సంగమాన్ని ప్రతిబింబిస్తూ బొడ్డు శిల్పానికి సరిగ్గా కేంద్ర స్థానంలో ఉన్న విషయం తెలుస్తుంది. దేవాలయాలకు నలు వైపులా ఉన్న భవనాలు వివిధ రకాల శిల్పాలు, వివిధ రకాల భంగిమలలో అలంకరించబడి ఉన్నాయి. ఈ రకమైన నాట్య భంగిమల చిత్రణ వివిధ రకాలైన నాట్య రీతులను తరువాతి తరాల వాళ్ళకు అందజేస్తాయి.

దక్షిణ భారతదేశానికి 2000 సంవత్సరాల స్వతంత్రమైన సాహిత్య చరిత్ర ఉంది. వీటిలో మొట్టమొదట పేర్కొనదగ్గవి 2000-1500 ఏళ్ళ క్రితం తమిళంలో రాయబడ్డ సంగం కవితలు. 850 CE కి చెందిన ఒకటవ అమోఘవర్షుడు రచించిన కవిరాజమార్గ అనే రచనలో ఐదవ శతాబ్దానికి చెందిన దుర్వినీతుడు అనే రాజు చేసిన రచనల గురించి ప్రస్తావించాడు. పదవ శతాబ్దానికి చెందిన తమిళ బౌద్ధుడు నెమ్రినాథం నాలుగవ శతాబ్దానికి చెందిన కన్నడ రచనలను ప్రస్తావించాడు. తరువాత శతాబ్దాలలో మలయాళం, తెలుగు సాహిత్య సంప్రదాయాలు అభివృద్ధి చేయబడ్డాయి. ఇలంగో ఆదిగళ్ రచించిన శిలప్పాధికారం లాంటి రచనలను గమనిస్తే దక్షిణ భారతదేశ వాసులు ప్రకృతిని ఎంతగా ఆరాధిస్తారో అవగతమౌతుంది. తొల్కప్పియార్ రచించిన తొల్కప్పియం, తిరువళ్ళువర్ రచించిన తిరుక్కురల్ కూడా చెప్పుకోదగిన రచనలు. ఇక్కడి సాహిత్యంలో, తత్వ శాస్త్రంలో స్త్రీని శక్తి స్వరూపిణిగా భావిస్తారు. వివాహితయైన మహిళ శుభసూచకంగా, ఆదిశక్తి స్వరూపంగా, భర్తనూ, పిల్లలనూ కంటికి రెప్పలా కాపాడుకొనే తల్లిలా భావించి గౌరవిస్తారు.

భిన్నత్వం

దక్షిణ భారతదేశం: చరిత్ర, భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు 
హైదరాబాదు లోని చార్మినారు.

కొన్ని శతాబ్దాల క్రిందట జైనమతం ప్రభావం ఉన్నప్పటికీ, ప్రస్తుతం మాత్రం దక్షిణ భారతదేశంలో హిందూ మత శాఖలైనటువంటి శైవ భక్తులు, వైష్ణవులు ప్రధానమైన ఆధ్యాత్మిక సంప్రదాయాలు. కర్ణాటకలో గల శ్రావణబెళగొళ జైనులకు ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం. అదే విదంగా కర్ణాటకలోనే కల కొడగు అతి పెద్ద బౌద్ధారామాల్లో ఒకటి. చైనాలో కమ్యూనిస్టులు చెలరేగినపుడు వారి ఆగడాలను భరించలేక టిబెట్ నుంచి పారిపోయి వచ్చిన చాలామంది బౌద్ధులు ఈ మఠంలోనే తలదాచుకున్నారు. ముస్లిం జనాభా కూడా ఇక్కడ కొంచెం ఎక్కువే. ప్రాచీన కాలంలో, కేరళ తీర ప్రాంతమైనటువంటి మలబారు తీరం ప్రజల్లో, ఒమన్, ఇతర అరబ్బు దేశాలు వ్యాపార సంబంధాలు కలిగి ఉండటం వలన ఇక్కడ ముస్లిం జనాభా చెప్పుకోదగిన సంఖ్యలో ఉంటుంది. ఇంకా తమిళనాడులో నాగపట్టణం (నాగూరు అని కూడా అంటారు) కూడా మహమ్మదీయుల సంఖ్య బాగానే ఉంది. ఈ పట్టణంలో పురాతన కాలానికి చెందిన నాగూర్ దర్గా కూడా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర రాజధానియైన హైదరాబాదు దక్షిణ భారతదేశ మహమ్మదీయ సంస్కృతికి చారిత్రక కేంద్రం. చార్మినార్, పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో చాలావరకు ముస్లింలే నివసిస్తుంటారు. సెయింట్ థామస్ కేరళకు వచ్చి సిరియన్ క్రైస్తవ సంప్రదాయాన్ని ఏర్పాటు చేయడం వలన దక్షిణ భారతదేశంలోని తీరప్రాంతాలలో క్రైస్తవ మతస్తులు అధికంగానే ఉంటారు. వీరినే సిరియన్ క్రైస్తవులు లేదా సిరియన్ మలబార్ నజ్రానీలు అని కూడా అంటారు.. సిరియన్ రైట్ క్రైస్తవులు, సైరో-మలబార్ చర్చి, సైరో-మలంకరా క్యాథలిక్ చర్చి,మలంకరా జాకోబైట్ సిరియన్ ఆర్థోడాక్స్ చర్చి, మార్థోమా చర్చి మొదలైనవి ఈ సాంప్రదాయం కిందకే వస్తాయి. క్యానయా అనే క్రైస్తవ-యూదు జాతి సైరో-మలబార్ చర్చి, మలంకరా జాకోబైట్ సిరియన్ ఆర్థోడాక్స్ చర్చి సంప్రదాయాల నుంచి ఉద్బవించింది.

దక్షిణ భారతదేశం: చరిత్ర, భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు 
క్నానయ, సిరియన్ మలబార్ నస్రానీ (క్రిస్టియన్) దేవాలయం, కొట్టాయం, ఇందులో పురాతన మార్ థోమా క్రాస్, సస్సానిదుల పహ్లవీ లిపులు.

అంతేకాకుండా కేరళలో లాటిన్ సంప్రదాయానికి చెందిన రోమన్ క్యాథలిక్కులు చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. వివిధ ప్రొటెస్టంట్ విభాగాలన్నింటినీ కలిపి 1947లో దక్షిణ భారతదేశంలో ఒక స్వతంత్ర ప్రొటెస్టంటు చర్చిని ఏర్పాటు చేసారు. ఇంతే కాకుండా ఇక్కడ యూదు జాతికి చెందిన ప్రజలు కూడా కొద్ది మంది నివసిస్తున్నారు. వీరు సాల్మన్ చక్రవర్తి కాలంలో మలబార్ తీరానికి వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు. కేరళ లోని కొచ్చిన్లో గల యూదుల సినగాగ్, భారత్ లోని సినగాగ్‌లలోకెల్లా అత్యంత ప్రాచీనమైనది.

నోట్స్

ఇతర వనరులు

Tags:

దక్షిణ భారతదేశం చరిత్రదక్షిణ భారతదేశం భౌగోళిక స్వరూపందక్షిణ భారతదేశం జనాభా వివరాలుదక్షిణ భారతదేశం ఆదాయ వనరులుదక్షిణ భారతదేశం రాజకీయాలుదక్షిణ భారతదేశం పరిపాలనదక్షిణ భారతదేశం రవాణాదక్షిణ భారతదేశం సంస్కృతి, వారసత్వ సంపదదక్షిణ భారతదేశం భిన్నత్వందక్షిణ భారతదేశం నోట్స్దక్షిణ భారతదేశం ఇతర వనరులుదక్షిణ భారతదేశంఅరేబియా సముద్రముఆంధ్రప్రదేశ్కర్నాటకకేరళతమిళనాడుతెలంగాణద్వీపకల్పమునర్మదా నదిబంగాళాఖాతముమహానదివింధ్య పర్వతాలుహిందూ మహాసముద్రము

🔥 Trending searches on Wiki తెలుగు:

పార్లమెంటు సభ్యుడుపాట్ కమ్మిన్స్గుడివాడ శాసనసభ నియోజకవర్గంస్టాక్ మార్కెట్సునీత మహేందర్ రెడ్డిభారత జాతీయ మానవ హక్కుల కమిషన్ఉత్తర ఫల్గుణి నక్షత్రముమహాత్మా గాంధీరెడ్డిమహాభాగవతం2019 భారత సార్వత్రిక ఎన్నికలుతెలంగాణ రాష్ట్ర సమితికూరయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఅక్బర్విశ్వామిత్రుడుఆంధ్రప్రదేశ్ చరిత్రయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్భద్రాచలంపూర్వాభాద్ర నక్షత్రమురాజంపేట శాసనసభ నియోజకవర్గంయూట్యూబ్ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంద్వాదశ జ్యోతిర్లింగాలుమొదటి పేజీతెలంగాణ విమోచనోద్యమంమహమ్మద్ సిరాజ్రఘురామ కృష్ణంరాజుమెరుపుద్రౌపది ముర్మునవధాన్యాలుశక్తిపీఠాలుఅన్నప్రాశనసుస్థిర అభివృద్ధి లక్ష్యాలురక్తంకాలుష్యంచేతబడిఆంధ్ర విశ్వవిద్యాలయంఆవుభూమన కరుణాకర్ రెడ్డిమాళవిక శర్మతాటి ముంజలుఅనసూయ భరధ్వాజ్తెలుగుదేశం పార్టీమాచెర్ల శాసనసభ నియోజకవర్గంఅయోధ్య రామమందిరంకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంఉపద్రష్ట సునీతనవగ్రహాలుసౌందర్యచే గువేరాఛత్రపతి శివాజీఋగ్వేదంశ్రీ గౌరి ప్రియశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుమృణాల్ ఠాకూర్జాతీయములుపెళ్ళి (సినిమా)సిరికిం జెప్పడు (పద్యం)భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులువిద్యఊరు పేరు భైరవకోనతెలుగు కులాలుఆహారంపాముకొణతాల రామకృష్ణగరుత్మంతుడుజగ్జీవన్ రాంశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్డి. కె. అరుణప్రియురాలు పిలిచిందినితిన్భారత రాష్ట్రపతిపూర్వాషాఢ నక్షత్రమువందే భారత్ ఎక్స్‌ప్రెస్భారత జాతీయగీతం🡆 More