కేంద్రపాలిత ప్రాంతం: భారతదేశ

కేంద్రపాలిత ప్రాంతం అనగా భారతదేశం లోని పరిపాలన ప్రాంతాలలో ఒక ప్రధాన విభాగం.

రాష్ట్రాలకు స్వంత ప్రభుత్వాలుండగా, కేంద్రపాలిత ప్రాంతాలు నిండుగా లేకుంటే, పాక్షికంగా భారత ప్రభుత్వంచే ఏలబడతాయి. వేవేఱు చరిత్ర, సాంస్కృతిక వారసత్వం గల కొన్ని ప్రాంతాలను, భౌగోళికంగా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న ప్రదేశాలను, అంతర్ రాష్ట్ర వివాదాల వలన కేంద్ర ప్రభుత్వంచే పాలించాల్సివచ్చిన ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పరిచారు.

కేంద్రపాలిత ప్రాంతాలు
రకంసమాఖ్య
స్థానంభారతదేశం
సంఖ్య8
జనాభా వ్యాప్తిలక్షదీవులు - 64,473 (అత్యల్పం); ఢిల్లీ - 31,181,376 (అత్యధికం)
విస్తీర్ణాల వ్యాప్తి32 km2 (12 sq mi) లక్షదీవులు – 59,146 km2 (22,836 sq mi) లడఖ్
ప్రభుత్వంభారత ప్రభుత్వం

కేంద్రప్రభుత్వం ప్రతి కేంద్రపాలిత ప్రాంతంలో ఒక లెఫ్టినెంట్ గవర్నర్ను నియమిస్తుంది. ఆ అధికారి ప్రాంతీయ ప్రభుత్వానికి అధినేత. కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలో శాసనసభలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాలలో ముఖ్య మంత్రి పదవి కూడా వుంటుంది.

జాబితా

As of 2021, భారతదేశంలో 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి.

  1. అండమాన్ నికోబార్ దీవులు - ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న దీవులు
  2. చండీగఢ్ - పంజాబ్, హర్యానాల మధ్య ఎవరికి చెందాలనే వివాదంతో కేంద్రపాలిత ప్రాంతమయ్యింది. పంజాబ్ ఒడంబడిక ప్రకారం దీనిని పంజాబ్ కు ఇవ్వడం జరిగింది కానీ, బదిలీ ఇంకా పూర్తవలేదు. అంతదాకా కేంద్రపాలిత ప్రాంతంగానే కొన్సాగుతుంది
  3. దాద్రా నగరు హవేలీ, డామన్ డయ్యూ - పోర్చుగీసు సాంస్కృతిక వారసత్వం, గోవా నుండి చాలా దూరంగా ఉండటం
  4. లక్షదీవులు - ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న దీవులు
  5. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం - జాతీయ రాజధాని ప్రాంతం
  6. పాండిచ్చేరి - ఫ్రెంచి సాంస్కృతిక వారసత్వం. ఈ కేంద్రపాలిత ప్రాంతం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ హద్దులుగా వున్నది.
  7. జమ్మూ కాశ్మీర్
  8. లడఖ్

రాజ్యాంగ ప్రకారం ఢిల్లీ 1991 నుంచి "జాతీయ రాజధాని ప్రాంతం" హోదా కలిగి ఉంది, కానీ వ్యవహారికంగా ఢిల్లీని కేంద్ర పాలిత ప్రాంతంగా పరిగణించవచ్చు.2019 ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అవి ఒకటి జమ్మూకాశ్మీర్ ఇది అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లఢఖ్ ఇది అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసింది. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు 2019 అక్టోబరు 31 నుంచి ఉనికిలోకి వచ్చాయి.

గణాంకాలు

సంఖ్య కేంద్రపాలిత ప్రాంతం రాజధాని విస్తీర్ణం
(చ.కి.మీ)
జనాభా
2001
జనసాంద్రత
2001
అక్షరాస్యత (%)
2001
ప్రధానభాషలు
1 అండమాన్ నికోబార్ దీవులు పోర్ట్ బ్లెయిర్ 8, 249 356, 152 43 81.18 హిందీ
2 చండీగఢ్ చండీగఢ్ 144 9, 00, 635 7, 900 81.76 హిందీ, పంజాబీ
3 దాద్రా, నగర్ హవేలీ సిల్వస్సా 491 220, 490 491 60.03 గుజరాతీ, హిందీ
4 డామన్ డయ్యు డామన్ 122 158, 204 1, 411 81.09 గుజరాతీ
5 ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ 1, 483 13, 850, 507 9, 294 81.82 హిందీ
6 లక్షద్వీప్ కవరట్టి 32 60, 650 1, 894 87.52 మలయాళం
7 పాండిచ్చేరి పాండిచ్చేరి 492 9, 74, 345 2, 029 81.49 తమిళం

మూలాలు

బయటి లింకులు

Tags:

కేంద్రపాలిత ప్రాంతం జాబితాకేంద్రపాలిత ప్రాంతం గణాంకాలుకేంద్రపాలిత ప్రాంతం మూలాలుకేంద్రపాలిత ప్రాంతం బయటి లింకులుకేంద్రపాలిత ప్రాంతంభారత ప్రభుత్వంభారతదేశం

🔥 Trending searches on Wiki తెలుగు:

గుంటూరు జిల్లాపవన్ కళ్యాణ్శ్రీశైల క్షేత్రంయాదవఫ్లిప్‌కార్ట్దినేష్ కార్తీక్2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఆవేశం (1994 సినిమా)దగ్గుబాటి వెంకటేష్భారత జాతీయపతాకంటంగుటూరి ప్రకాశంమఖ నక్షత్రముఎఱ్రాప్రగడవ్యవసాయంశ్రీ కృష్ణదేవ రాయలునరసింహావతారంనందమూరి బాలకృష్ణకొమర్రాజు వెంకట లక్ష్మణరావుకాజల్ అగర్వాల్రాశిటిల్లు స్క్వేర్మిథునరాశిఇస్లాం మత సెలవులుబైబిల్ఇంగువదేవుడుబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంహల్లులుకనకదుర్గ ఆలయంసరస్వతిప్రీతీ జింటాతోటపల్లి మధుపంచారామాలుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు2019 భారత సార్వత్రిక ఎన్నికలుకృతి శెట్టివందే భారత్ ఎక్స్‌ప్రెస్వందేమాతరంభారతదేశ జిల్లాల జాబితాట్విట్టర్జాంబవంతుడుశ్యామశాస్త్రిభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుక్రికెట్యేసుశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)పుష్యమి నక్షత్రముసిరికిం జెప్పడు (పద్యం)జీమెయిల్కమ్యూనిజంలక్ష్మి2024 భారత సార్వత్రిక ఎన్నికలుLసిద్ధార్థ్వంగవీటి రంగాసోమనాథ్చిరంజీవి నటించిన సినిమాల జాబితాశాతవాహనులువినాయకుడుఉడుమురత్నంమృగశిర నక్షత్రమురాజకీయాలువడదెబ్బసావిత్రి (నటి)కుమ్ర ఈశ్వరీబాయిశాసన మండలిసింహంవిశాఖ నక్షత్రముచరవాణి (సెల్ ఫోన్)శ్రీ గౌరి ప్రియహైదరాబాదుకింజరాపు రామ్మోహన నాయుడుగ్లోబల్ వార్మింగ్చిరుధాన్యం🡆 More