పద్యం సిరికిం జెప్పడు

సిరికిం జెప్పడు అనేది బమ్మెర పోతన రచించిన భాగవతంలోని ప్రసిద్ధిచెందిన తెలుగు పద్యం.

పద్యం

 
సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాద ప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై...భా.8-96-మ.

sirikiM jeppa@MDu; SaMkha chakra yugamuM jaedOyi saMdhiMpa@M; Dae
parivaaraMbunu@M jeera@M 'DabhragapatiM banniMpa@M' DaakarNikaaM
tara dhammillamu@M jakka notta@MDu; vivaada prOtthita Sree kuchO
parichaelaaMchalamaina veeDa@MDu gajapraaNaavanOtsaahiyai.

ప్రతిపదార్థము

  • సిరి = లక్ష్మీదేవి
  • కిన్ = కైనను
  • చెప్పడు = చెప్ప లేదు
  • శంఖ = శంఖము
  • చక్ర = సుదర్శన చక్రము
  • యుగమున్ = జంటను
  • చేదోయి = చేతులు రెంటి యందు
  • సంధింపడు = ధరించుట లేదు
  • ఏ = ఏ
  • పరివారంబునున్ = సేవకులను
  • చీరడు = పిలువ లేదు
  • అభ్రగపతిన్ = గరుత్మంతుని {అభ్రగపతి - అభ్రగముల (గగనచరు లైన పక్షులకు) పతి (ప్రభువు), గరుడుడు}
  • పన్నింపడు = సిద్ధపరుప నియమించడు
  • ఆకర్ణిక = చెవి దుద్దుల
  • అంతర = వరకు జారినట్టి
  • ధమిల్లమున్ = జుట్టు ముడిని
  • చక్కనొత్తడు = చక్కదిద్ధుకొనుట లేదు
  • వివాద = ప్రణయకలహము నందు
  • ప్రోత్థిత = పైకిలేపిన
  • శ్రీ = లక్ష్మీదేవి యొక్క
  • కుచ = వక్షము
  • ఉపరి = మీది
  • చేలాంచలము = చీర కొంగు
  • ఐనన్ = అయినను
  • వీడడు = వదలిపెట్టుట లేదు
  • గజ = గజేంద్రుని
  • ప్రాణ = ప్రాణాలను
  • ఆవన = కాపాడెడి
  • ఉత్సాహి = ఉత్సాహము కలవాడు
  • ఐ = అయ్యి.

తాత్పర్యం

గజేంద్రుని ప్రాణాలు కాపాడలనే ఉత్సాహంతో నిండిపోయిన విష్ణుమూర్తి లక్ష్మీదేవికీ చెప్పలేదు; శంఖచక్రాలను రెండు చేతుల్లోకీ తీసుకోలేదు; సేవకుల నెవరినీ పిలువలేదు; గరుడవాహనాన్నీ సిద్దపరచకోలేదు; చెవి దుద్దు వరకు జారిన జుట్టూ చక్కదిద్దుకోలేదు; ప్రణయ కలహంలో ఎత్తిపట్టిన లక్ష్మీదేవి కొం గైనా వదల్లేదు.

బయటి లింకులు

Tags:

పద్యం సిరికిం జెప్పడు పద్యంపద్యం సిరికిం జెప్పడు ప్రతిపదార్థముపద్యం సిరికిం జెప్పడు తాత్పర్యంపద్యం సిరికిం జెప్పడు బయటి లింకులుపద్యం సిరికిం జెప్పడుపద్యంబమ్మెర పోతనభాగవతం

🔥 Trending searches on Wiki తెలుగు:

విష్ణువుక్షయగ్రామ పంచాయతీఆరోగ్యంవిశ్వామిత్రుడుమదర్ థెరీసాతిథిదొమ్మరాజు గుకేష్అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుఅగ్నికులక్షత్రియులుగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంరుక్మిణీ కళ్యాణంఉపమాలంకారంశ్రీశైలం (శ్రీశైలం మండలం)ఘట్టమనేని కృష్ణభారతీయ సంస్కృతివిడదల రజినిగర్భాశయమురమణ మహర్షితెలుగు నాటకరంగంటిల్లు స్క్వేర్గ్రామంగోవిందుడు అందరివాడేలేసరస్వతిఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలురెండవ ప్రపంచ యుద్ధంమానవ శరీరమురాహుల్ గాంధీకొమురం భీమ్సింహరాశిఅష్టదిగ్గజములువై.ఎస్.వివేకానందరెడ్డివిజయ్ దేవరకొండచంద్రుడుఢిల్లీ డేర్ డెవిల్స్సచిన్ టెండుల్కర్భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుకాకతీయులుభారత రాజ్యాంగ సవరణల జాబితాశివాత్మికజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాతిక్కనతాటిప్రశాంతి నిలయంభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుభారతదేశంలో బ్రిటిషు పాలనరామావతారంశుక్రాచార్యుడునారా చంద్రబాబునాయుడుసుందర కాండఋతువులు (భారతీయ కాలం)స్నేహతొలిప్రేమనందమూరి బాలకృష్ణధర్మవరం శాసనసభ నియోజకవర్గంపేరుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డినిర్వహణకన్నుఫేస్‌బుక్ఉపనిషత్తుద్రౌపది ముర్ముభారత జాతీయ కాంగ్రెస్అనసూయ భరధ్వాజ్కర్ణుడుథామస్ జెఫర్సన్కురుక్షేత్ర సంగ్రామంమృగశిర నక్షత్రమునారా బ్రహ్మణిలగ్నంస్త్రీవై.యస్.భారతిపాఠశాలరుతురాజ్ గైక్వాడ్చతుర్యుగాలుగ్లోబల్ వార్మింగ్వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిమండల ప్రజాపరిషత్🡆 More