గుంటూరు లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి.
ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2022 ఏప్రిల్ 4 న దీని పరిధికి గుంటూరు జిల్లాను పరిమితం చేశారు.
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు |
2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గం చాలా మార్పులకు గురైంది. ఇంతకు క్రితం గుంటూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు శాసనసభా నియోజకవర్గాలు నరసారావుపేట లోక్సభ నియోజకవర్గానికి బదిలీ అయ్యాయి. గతంలో తెనాలి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న తెనాలి, మంగళగిరి శాసనసభా నియోజకవర్గములు ఈ నియోజకవర్గంలో వచ్చిచేరాయి. గుంటూరు లోక్సభ నియోజకవర్గం 2022లో జరిగిన జిల్లాల పునర్విభజనలో గుంటూరు జిల్లాకు పరిమితమైంది. ఈ లోక్సభ స్థానంలో 18 మండలాలు ఉన్నాయి.
లోక్సభ | పదవీకాలం | సభ్యుని పేరు | ఎన్నికైన పార్టీ |
---|---|---|---|
మొదటి | 1952-57 | ఎస్.వి.ఎల్.నరసింహారావు | స్వతంత్ర అభ్యర్ధి |
రెండవ | 1957-62 | కొత్త రఘురామయ్య | భారత జాతీయ కాంగ్రెసు |
మూడవ | 1962-67 | కొత్త రఘురామయ్య | భారత జాతీయ కాంగ్రెసు |
నాలుగవ | 1967-71 | కొత్త రఘురామయ్య | భారత జాతీయ కాంగ్రెసు |
ఐదవ | 1971-77 | కొత్త రఘురామయ్య | భారత జాతీయ కాంగ్రెసు |
ఆరవ | 1977-80 | కొత్త రఘురామయ్య | భారత జాతీయ కాంగ్రెసు |
ఏడవ | 1980-84 | ఎన్.జి.రంగా | భారత జాతీయ కాంగ్రెసు |
ఎనిమిదవ | 1984-89 | ఎన్.జి.రంగా | భారత జాతీయ కాంగ్రెసు |
తొమ్మిదవ | 1989-91 | ఎన్.జి.రంగా | భారత జాతీయ కాంగ్రెసు |
పదవ | 1991-96 | ఎస్. ఎమ్. లాల్ జాన్ భాషా | తెలుగుదేశం పార్టీ |
పదకొండవ | 1996-98 | రాయపాటి సాంబశివరావు | భారత జాతీయ కాంగ్రెసు |
పన్నెండవ | 1998-99 | రాయపాటి సాంబశివరావు | భారత జాతీయ కాంగ్రెసు |
పదమూడవ | 1999-04 | యంపరాల వెంకటేశ్వరరావు | తెలుగుదేశం పార్టీ |
పద్నాలుగవ | 2004-2009 | రాయపాటి సాంబశివరావు | భారత జాతీయ కాంగ్రెసు |
పదిహేనవ | 2009- 2014 | రాయపాటి సాంబశివరావు | భారత జాతీయ కాంగ్రెసు |
పదహారవ | 2014-2019 | గల్లా జయదేవ్ | తెలుగుదేశం పార్టీ |
పదిహేడవ | 2019 - ప్రస్తుతం | గల్లా జయదేవ్ | తెలుగుదేశం పార్టీ |
Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | రాయపాటి సాంబశివరావు | 4,66,221 | 56.75 | +10.83 | |
తెలుగుదేశం పార్టీ | యంపరాల వెంకటేశ్వరరావు | 3,36,429 | 40.95 | -10.13 | |
బహుజన్ సమాజ్ పార్టీ | జూపల్లి హనుమంతరావు గౌడ్ | 9,375 | 1.14 | +1.14 | |
తెలంగాణా రాష్ట్ర సమితి | గుండి వెంకటేశ్వర్లు | 5,444 | 0.66 | +0.66 | |
స్వతంత్ర రాజకీయ నాయకుడు | మువ్వా వెంకటరావు | 4,009 | 0.49 | +0.46 | |
మెజారిటీ | 1,29,792 | 15.80 | +20.96 | ||
మొత్తం పోలైన ఓట్లు | 8,21,478 | 70.06 | +5.95 | ||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing | +10.83 |
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు. ప్రజారాజ్యం తరఫున తోట చంద్రశేఖర్ పోటీలో ఉన్నాడు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మేడల రాజేంద్రపై విజయం సాధించారు. రాయపాటి సాంబశివరావుకు 403937 ఓట్లు రాగా, రాజేంద్రకు 364582 ఓట్లు వచ్చాయి.
Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | గల్లా జయదేవ్ | 618,417 | 49.68 | ||
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | వల్లభనేని బాలశౌరి | 549,306 | 44.12 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | అబ్దుల్ వహిద్ షేక్ | 46,818 | 3.76 | ||
Jai Samaikyandhra Party | మల్లెల వెంకటరావు | 5,608 | 0.45 | ||
BSP | మల్లెల బాబూరావు | 4,223 | 0.34 | ||
AAP | కోట వెంకట భవానీ వీర వరప్రసాద్ | 2,344 | 0.19 | ||
Pyramid Party of India | అబ్బూరి కోటేశ్వరరావు | 1,636 | 0.13 | ||
NOTA | None of the Above | 7,596 | 0.61 | ||
మెజారిటీ | 69,111 | 5.56 | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,244,926 | 79.19 | +2.66 | ||
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ | Swing |
This article uses material from the Wikipedia తెలుగు article గుంటూరు లోక్సభ నియోజకవర్గం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.