ప్రపంచ రంగస్థల దినోత్సవం

ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతి ఏట మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రంగస్థల కళాకారులచే జరుపబడుతున్న ఉత్సవం.

ఇది 1961లో ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇనిస్టిట్యూట్‌ వారిచే ప్రారంభించబడింది.

ప్రపంచ రంగస్థల దినోత్సవం
ప్రపంచ రంగస్థల దినోత్సవం
జరుపుకొనేవారుప్రపంచవ్యాప్తంగా
రకంఅంతర్జాతీయ
జరుపుకొనే రోజు27 మార్చి
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతి సంవత్సరం ఒకటే రోజు

చరిత్ర

నాటకం సర్వజననీయం, సర్వకాలీనం. ప్రాముఖ్యత కలిగిన ప్రాచీన కళల్లో నాటక కళ ఒకటి. ఒక దేశం ప్రేరణా, ప్రమేయం లేకుండా ఈ నాటక కళ వివిధ దేశాల్లో విడివిడిగా ఎదిగింది. దాదాపుగా ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ, భారతదేశంలోనూ నాటక ప్రక్రియ మొదలయ్యింది. కాలాన్ని బట్టీ, ప్రదేశాన్ని బట్టీ, సంస్కృతిని బట్టీ నాటకం రూపం మారుతుందేగానీ అంతర్లీనంగా దాని మూల సూత్రం మాత్రం అందరికీ ఒక్కటే ఉంటుంది. అందువల్లే నాటకం బహుళాదరణ పొందిన రంగస్థల ప్రక్రియగావిరసిల్లుతుంది. ప్రస్తుతమున్న నాటకం కాలక్రమేణా రూపం మార్చుకుంటా విశ్వజననీయమయ్యింది. దాని గుర్తుగానే ప్రపంచ రంగస్థల దినోత్సవం పుట్టింది.

1961లో వియన్నాలో ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇనిస్టిట్యూట్‌ వారు నిర్వహించిన 9వ ప్రపంచ కాంగ్రెస్‌లో ఆనాటి అధ్యక్షుడు 'ఆర్వికివియా' ప్రపంచ రంగస్థల దినోత్సవ ప్రతిపాదన చేశాడు. సభ్యులందరూ ప్రతిపాదనను అంగీకరించారు. ఆ తరువాత ఏడాది పారిస్‌లో జరిగిన రంగస్థల సమాఖ్యలో పూర్తి స్థాయిలో మొదలయ్యింది.

రంగస్థల దినోత్సవం ప్రపంచమంతా విస్తరించి ఐక్యరాజ్య సమితి, యునెస్కో లచే ప్రాధాన్యత పొందింది. ఈ వేడుకలలో భాగంగా అన్ని దేశాల్లో జరుగుతున్న నాటకాలు, ప్రదర్శనలు, ప్రక్రియల ప్రమాణాలపై పరిశీలకులు, నాటక ప్రియులు వచ్చి సమీక్షించుకుంటారు. ప్రతి సంవత్సరం నాటకరంగంలో నిష్ణాతులైన ఒకరిని సమన్వయకర్తగా ఎంచుకొని, ప్రముఖుల మాటగా వారి మనోగత సారాన్ని ఆ సంవత్సరపు సందేశంగా రంగస్థల ప్రపంచానికి అందిస్తారు. 1962లో మొదటి ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని జీన్ కాక్టే (ఫ్రాన్స్) అందించాడు.

లక్ష్యాలు

  1. ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలలో నాటకాన్ని ప్రోత్సహించడం
  2. ప్రజలకు నాటకం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కలిపించడం
  3. విస్తృత స్థాయిలో నాటక సంస్థలకు ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులకు అవగాహన కలిపించి వారి ద్వారా నాటకరంగాన్ని అభివృద్ధి చేయడం
  4. మానసిక ఉల్లాసంకోసం నాటకాన్ని ఆస్వాదింపజేయడం
  5. నాటకం ద్వారా పొందుతున్న మానసిక ఉల్లాసాన్ని ఇతరులతో పంచుకోవడం

మూలాలు

Tags:

మార్చి 27రంగస్థలం

🔥 Trending searches on Wiki తెలుగు:

మానవ శాస్త్రంనువ్వు నాకు నచ్చావ్పేర్ని వెంకటరామయ్యనువ్వులుపెళ్ళి (సినిమా)రెడ్డినారా బ్రహ్మణితెలంగాణ జిల్లాల జాబితాదగ్గుబాటి పురంధేశ్వరిధనూరాశికుమ్మరి (కులం)హస్త నక్షత్రముదత్తాత్రేయఅక్కినేని నాగ చైతన్యతెలంగాణ ఉద్యమందశదిశలురాయప్రోలు సుబ్బారావుపమేలా సత్పతిచాకలితాజ్ మహల్నీరువిజయ్ దేవరకొండఅహోబిలంఉత్తరాషాఢ నక్షత్రముసాక్షి (దినపత్రిక)భీష్ముడుతెలుగు వికీపీడియాఅక్షయ తృతీయఆంధ్రప్రదేశ్కామసూత్రభారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలుYశ్రీశైల క్షేత్రంవికీపీడియావర్షం (సినిమా)శోభన్ బాబునవగ్రహాలు జ్యోతిషంవీరేంద్ర సెహ్వాగ్Aసింహంఅనంత బాబుపోలవరం ప్రాజెక్టుఅశ్వని నక్షత్రమునండూరి రామమోహనరావువిశ్వనాథ సత్యనారాయణభారతీయ రైల్వేలుఉస్మానియా విశ్వవిద్యాలయంకమల్ హాసన్వెంట్రుకభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుకిలారి ఆనంద్ పాల్జూనియర్ ఎన్.టి.ఆర్ఉసిరిఆరుద్ర నక్షత్రముగ్లోబల్ వార్మింగ్ఆవర్తన పట్టికటైఫాయిడ్మెదడు వాపుపూర్వాషాఢ నక్షత్రముమానవ శరీరముమహాసముద్రందినేష్ కార్తీక్పంచకర్ల రమేష్ బాబుదాశరథి కృష్ణమాచార్యభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలురౌద్రం రణం రుధిరంగరుత్మంతుడుహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంసుందర కాండఇన్‌స్టాగ్రామ్విటమిన్ బీ12మండల ప్రజాపరిషత్ఊరు పేరు భైరవకోనఅక్కినేని నాగార్జునగర్భాశయముభారత రాజ్యాంగందశరథుడు🡆 More