కన్ను (Eye) కాంతిని గుర్తించి నేత్ర నరాల ద్వారా మెదడుకు సమాచారాన్ని అందించే అవయవం.
ఇవి మానవులలో ముఖ్యమైన జ్ఞానేంద్రియం. మానవునికి ముఖంలో రెండువైపులా అమర్చబడి ఉంటాయి. ఇవి మనుషులలో కెమెరా వలె పనిచేసి, బాహ్య రూపాల్ని రంగులతో సహా ఉన్నది ఉన్నట్లుగా మెదడుకి పంపుతాయి.వివిధ జీవులలో నిర్మాణాత్మకంగా పది వేరువేరు డిజైన్లలో కళ్ళుంటాయి. వీనిలో 96% జంతు జాతులలో ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది. ప్రతిబింబాన్ని స్పస్టంగా చూపించే కళ్ళు నిడేరియా, మొలస్కా, కార్డేటా, అనెలిడా, ఆర్థ్రోపోడా జీవులలో కనిపిస్తాయి. కన్ను కి సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని
'ఆప్తమాలజీ' అంటారు. కన్ను గుర్తించగలిగే రంగుల సంఖ్య ' 16 '. ప్రతిబింబం ఏర్పడడానికి పట్టుకాలం - 0.1 సెకన్లు.
జీవులన్నింటిలోకెల్లా సరళమైన కళ్ళు సూక్ష్మజీవులలో ఉంటాయి. ఇవి పరిసరాలలో కాంతి ఉనికి గుర్తించి వెలుగు చీకటి ల మధ్య భేదాన్ని మాత్రమే తెలియజేస్తాయి. వీటి ఆధారంగా జీవ వలయాలు (Circadian rhythm) నిర్దేశించబడతాయి. క్లిష్టమైన జీవులలోని కళ్ళు రెటినాలోని కణాల ద్వారా సమాచారం మెదడుకు
కన్ను నిర్మాణంలో 3 పొరలు ఉంటాయి అవి 1.బయటి పొర (ధృడస్తరం) ఇది మొదటి పొర. 2.మధ్య పొర (రక్త పటలం) దీనిలో అనేక రక్త నాళాలుంటాయి. 3.లోపలి పొర (నేత్ర పటలం)దీనినే రెటీనా అంటారు. దీనినే కంటిలో జ్ఞానభాగం అంటారు.
కళ్ళు మెదడు కంటే ముందే ప్రమాదాన్ని పసిగడితాయని తేలింది. అంటే, మెదడు సాయం లేకుండానే కళ్లలోని కొన్ని కణాలు ప్రమాదాన్ని పసిగడతాయని వెల్లడైంది.ఈ కణాలు మెదడు సాయం లేకుండానే ప్రమాదం గురించి హెచ్చరిస్తాయని స్విట్జర్లాండ్‌లోని బయోమెడికల్ రిసెర్చి ఇన్స్టిట్యూట్ పరిశోధకులు చెబుతున్నారు. పరిణామక్రమంలో శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఈ తరహా వ్యవస్థ కళ్లలో అభివృద్ధి చెంది ఉండవచ్చని వారి అంచనా.
'ఆర్గస్ 2' గా పిలిచే బయోనిక్ కన్ను (Bionic eye) ని అమెరికాలోని 'సెకండ్ సైట్' రూపొందించింది. ఇది కళ్లద్దాలపై అమర్చిన కెమెరా, వీడియో ప్రాసెసర్ల సాయంతో పనిచేస్తుంది. వీటి నుంచి అందిన దృశ్యాలను కంటి బయట ఓ సూక్ష్మమైన రిసీవర్ గ్రహించి సన్నని తీగ ద్వారా రెటీనా మీది ఎలక్ట్రోడ్ల సముదాయానికి పంపుతుంది. అప్పుడు ఎలక్ట్రోడ్లు ప్రేరేపణ పొంది దృశ్యనాడి ద్వారా ఆ సమాచారాన్ని మెదడుకు అందిస్తాయి. దాంతో దృశ్యాలు కనబడతాయి.
Eye | |
---|---|
1:posterior chamber 2:ora serrata 3:ciliary muscle 4:ciliary zonules 5:canal of Schlemm 6:pupil 7:anterior chamber 8:cornea 9:iris 10:lens cortex 11:lens nucleus 12:ciliary process 13:conjunctiva 14:inferior oblique muscle 15:inferior rectus muscle 16:medial rectus muscle 17:retinal arteries and veins 18:optic disc 19:dura mater 20:central retinal artery 21:central retinal vein 22:optic nerve 23:vorticose vein 24:bulbar sheath 25:macula 26:fovea 27:sclera 28:choroid 29:superior rectus muscle 30:retina |
కళ్ళు మనిషికి చాల ప్రధానమైనవి. అంధకారమైన జీవితము ఊహించడానికి కూడా సాహసించరు. కళ్ళను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి.
చదివేటపుడు
టెలివిజన్ చూస్తున్నప్పుడు
కంప్యూటర్ తో పనిచేస్తున్నపుడు
బండి నడిపేటప్పుడు
కొన్ని కంటి వ్యాయామాలు
ప్రస్తుతం మనదేశంలో 12 లక్షల మందికి కార్నియాలు (నల్లగుడ్డ) అవసరం. వీరితోపాటు ప్రతి సంవత్సరం మరో 40 నుంచి 50 వేల మందికి అదనంగా అవసరం వస్తోంది. కంటిలో అన్ని భాగాలు బాగా ఉండి కేవలం నల్లగుడ్డు దెబ్బతిని అంధత్వం వచ్చిన వారికి నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియాలు అమర్చుతారు. తర్వాత వారు అందరిలా చూడగలుగుతారు. నేత్రదానం చేయడానికి ఆసక్తి ఉన్న వారు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు ఫోన్ చేస్తే వారే అక్కడకు వచ్చి నేత్రాలను సేకరిస్తారు. వాటిని అవసరమైన వారికి శస్త్రచికిత్స ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ విధానం అంతా పైసా ఖర్చులేకుండా ఉచితంగా చేస్తారు. సేకరించిన నేత్రాలు తమ దగ్గర ఉన్న జాబితాలోని వ్యక్తులకు సరిపడకపోతే ఇతర ఐ బ్యాంకులకు పంపిస్తారు. కార్నియా ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయవచ్చు. ఎలాంటి వయో పరిమితి లేదు. కంటి శుక్లాల ఆపరేషన్ చేయించుకొన్నవారు, రక్తపోటు ఉన్నవారు, మధుమేహ వ్యాధిగ్రస్థులు, కళ్ళజోడు పెట్టుకొనేవారు, ఉబ్బసం వ్యాధి ఉన్నవారు కూడా చేయవచ్చు. హెచ్.ఐ.వి., ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారు, పచ్చకామెర్లుకు గురైన వారు, రేబీస్ (కుక్కకాటు వలన) వ్యాధిగ్రస్తులు, బ్లడ్ క్యాన్సర్ ఉన్నవారు, మెదడువాపు జబ్బు ఉన్న వారు, కార్నియల్ మచ్చలు, రెటినోబ్లాస్టోమా ఉన్నవారు నేత్రదానం చేయకూడదు.
This article uses material from the Wikipedia తెలుగు article కన్ను, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.