మా తెలుగు తల్లికి మల్లె పూదండ

మా తెలుగు తల్లికి మల్లె పూదండ (మా తెనుగు తల్లికి మల్లె పూదండ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం.

దీని రచయిత శంకరంబాడి సుందరాచారి. ఈ పాటలో తెలుగునాట ప్రముఖమైన నదులను, సంస్కృతి, సాహిత్యాలను, చరిత్రలో ప్రసిద్ధ వ్యక్తులను రచయిత సంస్మరించాడు.

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
గుంటూరు జిల్లా కలెక్టరు కార్యాలయమునందుగల లుంబినీ వనములోని తెలుగు తల్లి విగ్రహము

చరిత్ర

సుందరాచారి 'మా తెనుగు తల్లికి' గీతాన్ని 1942లో దీనబంధు సినిమా కోసం రచించారు. కానీ ఆ చిత్ర నిర్మాతకు యుగళగీతంగా వాడాలన్న కోరికకు ఈ పాట సరిపోలేదు కాబట్టి ఆ సినిమాలో చేర్చలేదు. టంగుటూరి సూర్యకుమారి ఆభేరి రాగంలో మధురంగా పాడిన ఈ పాటను, తను ప్రైవేటుగా గ్రామఫోన్ రికార్డులో హెచ్‌.యం.వి. సంస్థ ద్వారా విడుదల చేసిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది. ఈ పాటపై హక్కులను సూర్యకుమారి సుందరాచారికి 116 రూపాయలిచ్చి కొనుక్కున్నది. ఆ తరువాతి కాలంలో సుప్రసిద్ధదర్శకుడు బాపు, బుల్లెట్ చిత్రం కోసం ఈ పాటను బాలసుబ్రమణ్యంతో పాడించారు. లీడర్ సినిమాలో టంగుటూరి సూర్యకుమారి గారి పాటను కొత్త పాటతో కలిపి కథానాయకుడిపై చిత్రీకరణ చేశారు

గేయం

మా తెలుగు తల్లికి మల్లె పూదండా
మా కన్న తల్లికి మంగళారతులూ ॥మా తెలుగు॥
కడుపులో బంగారు కను చూపులో కరుణా
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి ॥మా తెలుగు॥
గల గలా గోదారి కదలి పోతుంటేను ॥గల గలా॥
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి ॥మా తెలుగు॥
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయని కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ పాటలే పాడుతాం
నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!!

అమరావతి గుహల - అమరావతి నగర

పురాణాలలో అమరావతిని ఇంద్రనగరంగా, సర్వసుఖ, సర్వభోగ, సర్వాంగ సుందర నగరంగా తెగ వర్ణిస్తూ ఉంటారు. కాళిదాసు మేఘసందేశంలో అలకాపురిని వర్ణించి మనసులని ఊరించాడు. మనకి గొప్ప చరిత్ర ఉన్న ముఖ్యపట్టణం అమరావతి. ‘అమరావతి గుహల అపురూప శిల్పాలు’ అన్నారు మా తెలుగుతల్లి కవి. తరువాత అక్కడ గుహలు లేవని, ‘అమరావతి నగర’ అని సవరించి పాడడం మొదలు పెట్టారు.

బుల్లెట్‌ సినిమాలో కూడా ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాటలో ‘అమరావతినగర అపురూప శిల్పాలు’ అని ఉంది. అయితే టంగుటూరి సూర్యకుమారి పాడిన రికార్డులో ‘అమరావతి గుహల అపురూప శిల్పాలు’ అనే ఉంది.

మూలాలు

బయటి లింకులు


Tags:

మా తెలుగు తల్లికి మల్లె పూదండ చరిత్రమా తెలుగు తల్లికి మల్లె పూదండ గేయంమా తెలుగు తల్లికి మల్లె పూదండ అమరావతి గుహల - అమరావతి నగరమా తెలుగు తల్లికి మల్లె పూదండ మూలాలుమా తెలుగు తల్లికి మల్లె పూదండ బయటి లింకులుమా తెలుగు తల్లికి మల్లె పూదండఆంధ్రప్రదేశ్శంకరంబాడి సుందరాచారి

🔥 Trending searches on Wiki తెలుగు:

నందిగం సురేష్ బాబుఛత్రపతి శివాజీఆల్ఫోన్సో మామిడినవరసాలుఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాఉపమాలంకారంసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతెలుగు వికీపీడియారోహిత్ శర్మవాయు కాలుష్యంసురవరం ప్రతాపరెడ్డివాతావరణంలలితా సహస్ర నామములు- 1-100అమర్ సింగ్ చంకీలాసాక్షి (దినపత్రిక)కల్వకుంట్ల కవితఅష్ట దిక్కులుసెక్యులరిజంవెలిచాల జగపతి రావుశార్దూల విక్రీడితమురాజంపేటఅమెరికా రాజ్యాంగంప్రభాస్శాసనసభపురాణాలుజాతీయ ప్రజాస్వామ్య కూటమిపొంగూరు నారాయణనామవాచకం (తెలుగు వ్యాకరణం)కాలేయంఅరుణాచలంఊరు పేరు భైరవకోనజీమెయిల్హనుమంతుడుస్టాక్ మార్కెట్భారతీయ స్టేట్ బ్యాంకుఉదగమండలంజాతిరత్నాలు (2021 సినిమా)ఆత్రం సక్కుజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంరాశియోనిఏప్రిల్విద్యసలేశ్వరంసుందర కాండచాణక్యుడుభారత రాజ్యాంగ సవరణల జాబితాతెలంగాణఅల్లూరి సీతారామరాజుఋతువులు (భారతీయ కాలం)ఉప రాష్ట్రపతిగ్లోబల్ వార్మింగ్బొత్స సత్యనారాయణఆర్టికల్ 370 రద్దుపంచభూతలింగ క్షేత్రాలుఅ ఆపెళ్ళి చూపులు (2016 సినిమా)చరవాణి (సెల్ ఫోన్)పాండవులుఉస్మానియా విశ్వవిద్యాలయం2024 భారతదేశ ఎన్నికలునిర్మలా సీతారామన్భారత రాజ్యాంగ ఆధికరణలుకింజరాపు అచ్చెన్నాయుడుకృష్ణా నదిఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిగర్భాశయముఉదయకిరణ్ (నటుడు)కమల్ హాసన్తెలుగు సినిమాలు 2022రష్మికా మందన్నకొణతాల రామకృష్ణషణ్ముఖుడుపర్యాయపదంఓం భీమ్ బుష్భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం🡆 More