చీకటి

చీకటి(ఆంగ్లం:Darkness) అనునది వెలుగు లేదా వెలుతురు కు వ్యతిరేకార్థాన్నిచ్చే పదం.

అనగా ఒక ప్రదేశంలో దృగ్గోచర కాంతి లేమిని సూచిస్తుంది. ఇది అంతరిక్షం లో నలుపు రంగులో కనిపిస్తుంది. మానవులు కాంతి గాని, చీకటి గాని ప్రబలమైనపుడు దాని రంగును స్పష్టంగా గుర్తించ లేరు. కాంతి లేనప్పుడు ఆ ప్రదేశం వర్ణవిహీనంగా, పూర్తి నలుపుగా గోచరిస్తుంది. వివిధ సంస్కృతులలొ "చీకటి" అనుదానికి వివిధ రకముల సామ్యములు ఉన్నాయి.

చీకటి
The Creation of Light, by Gustave Doré

భాషా విషయాలు

చీకటి అనే పదం నిఘంటువు ప్రకారం చీకు, కట్టు అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. చీకటికి సంస్కృతంలో అంధకారము, అంధము, అగువు, ఆసక్తము, తమస్సు, తిమిరము, నభోరజస్సు, నిశాచర్మము, నీలపంకము, భూచ్ఛాయ, మబ్బు, మేచకము, రజోబలము, రజోరసము మొదలైన పేర్లు ఉన్నాయి.

వెలుతురు ప్రసరించని ప్రదేశాన్ని చీకటి ప్రదేశం అంటారు. చీకటి తక్కువగా ఉంటే మసకచీకటి అని, అదే ఎక్కువగా ఉంటే మబ్బుచీకటి లేదా కారుచీకటి అని అంటారు. చీకటి ఎక్కువయ్యే కొలది కనిపించుట తక్కువ అవుతుంది.

ప్రతిరోజు రాత్రి చీకటిగా ఉంటుంది. చంద్రుడు పెద్దగా కనిపిస్తున్నపుడు తక్కువ చీకటి గాను, చంద్రుడు చిన్నగా కనిపిస్తున్నప్పుడు ఎక్కువ చీకటి గాను ఉంటుంది. అందువలనే అమావాస్యను చీకటిరాత్రి అంటారు.

ఎక్కువగా నేరాలు రాత్రి సమయంలో జరుగుతాయి. ముఖ్యంగా వ్యభిచారం అందువల్లనేమో దీనిని చీకటితప్పు అని అంటారు.

శాస్త్రీయత

గోచరత్వము

చీకటి 
Stare at the image for a minute, then look away. The eye supplies the light and dark complements to the image.

చీకటి అను దృగ్విషయము కాంతి లేమిని అనగా కాంతిని కొన్ని సెకన్ల పాటు చూచి వెంటనే వేరొక వైపు చూసినపుడు కూడా మనకి "చీకటి" అనే దృగ్విషయం గోచరిస్తుంది. ఆ ప్రదేశంలో కాంతి ఉన్నా సరే కొన్ని సెకన్లపాటు చీకటి అనె దృగ్విషయం కలుగుతుంది.(ఈ దృగ్విషయాన్ని after images అంటారు) అలా చూసినపుడు మన కన్ను చురుకుగా ఉన్నప్పటికి, రెటీనా ఉద్దీపన చెందక పోవటంవల్ల మనకు చీకటి గోచరిస్తుంది.

భౌతిక శాస్త్రము

భౌతిక శాస్త్ర పదముల ప్రకారం ఒక వస్తువు ఫోటాన్లు(కాంతి కణములు) శోషణం చేసుకున్నపుడు చీకటి అంటారు. అనగా ఇతర వస్తువుల కంటే ఇది మసకగా కనిపిస్తుంది. ఉదాహరణకు జటిలమైన నలుపు రంగు దృగ్గోచర కాంతి ని పరావర్తనం చెందించలేదు. కాంతిని శోషించు కుంటుంది. అందువల్ల అది చీకటిగా కనిపిస్తుంది. అదే విధంగా తెలుపు రంగు హెచ్చు దృగ్గోచర కాంతి ని పరావర్తనం చెందిస్తుంది. అందువల్ల అది కాంతి వంతంగా కనబడుతుంది. అధిక సమాచారం కొరకు రంగు అనే వ్యాసం చూడండి.

కాంతి అనునది పరిమితి లేకుండా శోషించబడదు. శక్తి నిత్యత్వ నియమం ప్రకారం శక్తి ని సృష్టించలెము. నాశనం లేయలేము ఇది ఒకరూపం నుండి వేరొక రూపం లోనికి మారుతుంది. చాలా వస్తువులు దృగ్గోచర కాంతిని శోషించుకుంటాయి.అది ఉష్ణం గా మార్చబడుతుంది. అందువల్ల ఒక వస్తువు చీకటిగా కనిపించవచ్చు, అది ఒకానొక పౌనఃపున్యము వద్ద వెలుగే కాని మనం గుర్తించలెము. మరింత సమాచారం కొరకు ఉష్ణగతిక శాస్త్రం చూడండి.

ఒక చీకటి ప్రదేశం కాంతి జనకాలను పరిమితంగా కలిగి ఉండి ఆ ప్రదేశం చూచుటకు కష్టంగా ఉంటుంది. రాత్రి, పగలు అనునవి కాంతి యొక్క వెలుగు, చీకటి యొక్క ప్రతిరూపాలు. మానవుల వంటి ఏదైనా సరీసృపం ఒక చీకటి ప్రదేశానికి పోయినపుడు దాని కంటి పాప విస్తరిస్తుంది. ఎందువలనంటే రాత్రి కాలంలో హెచ్చు కాంతిని తన కంటి గుండా పంపేందుకు చేసే ప్రయత్నంవల్ల. మానవుని కంటిలో కాంతిని గ్రహించే కణాలు మరికొన్ని కణాలను ఉత్పత్తి చేయుటకు చీకటిలో ప్రయత్నిస్తాయి.

సాంకేతికంగా

ఒక బిందువు వద్ద రంగు అనునది, (సాధారణ 24-బిట్ల కంప్యూటర్ నందు ప్రదర్శన) మూడు ప్రాథమిక రంగు (red, green, blue) ల విలువలు 0 నుండి 255 వరకు వ్యాపించెది. ఎప్పుడైతే ఎరుపు, ఆకుపచ్చ, నీలం యొక్క పిక్సెల్స్ పూర్తిగా ప్రకాశించబడతాయో (255,255,255), అపుడు ఆ వస్తువు పూర్తిగా తెలుపు రంగులో కనబడుతుంది. పై మూడు రంగులు యొక్క పిక్సెల్స్ అప్రకాశములవుతాయో (0,0,0) అపుడు ఆ వస్తువు నలుపుగా(చీకటి) గా కనబడుతుంది.

యివి కూడా చూడండి

సూచికలు

Tags:

చీకటి భాషా విషయాలుచీకటి శాస్త్రీయతచీకటి యివి కూడా చూడండిచీకటి సూచికలుచీకటిఅంతరిక్షంఆంగ్లంకాంతి

🔥 Trending searches on Wiki తెలుగు:

పొట్టి శ్రీరాములునాయకత్వంతెలంగాణ రాష్ట్ర సమితిగోత్రాలుతెలంగాణ రాష్ట్ర శాసన సభకృత్తిక నక్షత్రమురమ్యకృష్ణకమ్మజాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్దానంభారతీయ స్టేట్ బ్యాంకుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుఅనాసఏ.పి.జె. అబ్దుల్ కలామ్భారత స్వాతంత్ర్య దినోత్సవంబ్రాహ్మణ గోత్రాలు, ప్రవరలుతెలంగాణ నదులు, ఉపనదులురాహువు జ్యోతిషంఘటోత్కచుడు (సినిమా)ఎస్.వి. రంగారావుఖండంపరిటాల రవినన్నయ్యసన్ రైజర్స్ హైదరాబాద్కుటుంబంPHవిష్ణుకుండినులుమూత్రపిండముఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాతెలంగాణ దళితబంధు పథకంమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంకోణార్క సూర్య దేవాలయంవిద్యుత్తునాగుపాముతెలుగు ప్రజలుజాతీయ రహదారి 44 (భారతదేశం)మంద కృష్ణ మాదిగహోళీదక్ష నగార్కర్రావి చెట్టుఛందస్సుకలబందభారత కేంద్ర మంత్రిమండలిరాజమండ్రిగోకర్ణజాతీయ మహిళ కమిషన్లలితా సహస్రనామ స్తోత్రంసాలార్ ‌జంగ్ మ్యూజియంగౌతమ బుద్ధుడుమూలా నక్షత్రంప్రధాన సంఖ్యశ్రీశైల క్షేత్రంపూర్వ ఫల్గుణి నక్షత్రముకర్ణుడువిజయ్ (నటుడు)సముద్రఖనిగర్భాశయముతిథిఉమ్మెత్తతెలుగుదేశం పార్టీస్వర్ణ దేవాలయం, శ్రీపురంచీకటి గదిలో చితక్కొట్టుడుస్త్రీదక్షిణామూర్తి2015 గోదావరి పుష్కరాలుబంగారు బుల్లోడు (2021 సినిమా)చక్రిసూర్యుడువిరూపాక్షగురువు (జ్యోతిషం)కందుకూరి వీరేశలింగం పంతులుపక్షవాతంవృషణంయోగి ఆదిత్యనాథ్ధర్మరాజుచిత్త నక్షత్రముశ్రవణ నక్షత్రముకులం🡆 More