రంగు

ఒక స్థిరమైన తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతిని రంగు అంటారు.

వేర్వేరు తరంగ దైర్ఘ్యాలున్న కాంతి వేర్వేరు రంగులలో ఉంటుది.రంగులు లేదా వర్ణాలు (ఫ్రెంచ్: Couleur, ఇటాలియన్: Colore, జర్మన్: Farbe, స్వీడిష్: Färg, లాటిన్, స్పానిష్, ఆంగ్లం: Color) మన కంటికి కనిపించే వస్తువుల ఒకానొక లక్షణము. ప్రకృతిలో సాధారణంగా కనిపించే ఏడు రకాల రంగుల్ని సప్తవర్ణాలు అని పేర్కొంటారు . వివిధ రంగులు కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం, పరావర్తనం మొదలైన లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. మన కంటికి కనిపించే రంగులు ఇంచుమించుగా 400 nm to 700 nm మధ్యలో ఉంటాయి. ఈ కిరణాలను రెటినాలోని కోన్ కణాలు గుర్తించి, మెదడుకు సమాచారం అందిస్తాయి. ప్రతి సంవత్సరం మార్చి 21న అంతర్జాతీయ రంగుల దినోత్సవం నిర్వహించబడుతోంది.

రంగు
పట్టకం నుండి విశ్లేషించబడిన కాంతి రంగులు
రంగు
ఇంద్రధనుస్సులో రంగులు

కాంతి రంగులు

సాధారణంగా తెల్లని కాంతిలో 7 రంగులుంటాయి. తెల్లని కాంతిని పట్టకం గుండా వక్రీభవనం చెంది అందలి అంశ రంగులుగా విడిపోవటాన్ని కాంతి విశ్లేషణ అంటారు. సూర్య కాంతిని పట్టకం గుండా విశ్లేషించినపుడు ఏడు రంగులు గల వర్ణపటం కనిపిస్తుంది. దీనినే వర్ణపటం అంటారు. ఈ ఏడు రంగులు ఇంద్ర ధనుస్సు లోని వర్ణాలను పోలి ఉంటాయి. అవి ఊదా (Violet), ఇండిగో (Indigo), నీలం (Blue), ఆకుపచ్చ (Green), పసుపుపచ్చ (Yellow), నారింజ (Orange), ఎఱుపు (Red). ఈ రంగులను గుర్తు పెట్టుకోవడానికి VIBGYOR ఆనే సంకేత పదమును సూచిస్తారు. ఈ రంగులలో ఎరుపు రంగు ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలది. ఊదారందు తక్కువ తరంగ దైర్ఘ్యం గలది. ఎరుపు రంగు ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉండటం వల్ల చాలా దూరం నుండి స్పష్టంగా కనబడుతుంది. అందువల్ల రహదారుల ప్రక్కన సూచించే గుర్తులు గల బోర్డులు ఎరుపు రంగుతో వ్రాస్తారు.

రంగులు రకాలు

రంగులు రెండు రకాలు అవి 1. ప్రాథమిక రంగులు 2. గౌణ రంగులు. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను ప్రాథమిక రంగులు అంటారు. వీటిని సరియైన నిష్పత్తిలో కలిపినపుడు గౌణ రంగులు యేర్పడుతాయి. ఎరుపు, అకుపచ్చ కలిసినపుడు పసుపు పచ్చ, ఎరుపు, నీలం కలసినపుడు ముదురు ఎరుపు, నీలం, ఆకుపచ్చ కలిసినపుడు ముదురు నీలం అనే గౌన రంగులు యేర్పడుతాయి. ప్రాథమిక రంగులైన ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులను కలిపినట్లైతే దాదాపుగా తెలుపు రంగు యేర్పడుతుంది. (కాంతి రంగులు మాత్రమే, ఇతర రంగులు కాదు)

కొన్ని విశేషాలు

  • ఒక రంగుని నిర్దేశించి చెప్పడానికి శాస్త్రవేత్తలు తరంగదైర్ఘ్యం (wavelength) ని వాడినా ఫలానా రంగు తరంగదైర్ఘ్యం ఫలానా అని కచ్చితంగా చెప్పలేము. ఉదాహరణకి "నీలి రంగు ఏది?" అంటే శాస్త్రం 450 నేనోమీటర్ల విద్యుదయస్కాంత తరంగం అని చెబుతుంది కానీ, సగటు వ్యక్తి కంటికి 425 నేనోమీటర్ల నుండి 490 నేనోమీటర్ల వరకు ఉన్న తరంగాలు అన్నీ "నీలం" గానే కనిపిస్తాయి.
  • రంగుకి చూసే కంటికి ఉన్న అవినాభావ సంబంధం లాంటిదే రంగుకి దానిని వర్ణించే మాటకీ కూడా విడదీయరాని సంబంధం ఉంది. ఉదాహరణకి కొన్ని ఆఫ్రికా భాషలలో "నీలం"కీ "ఆకుపచ్చ"కీ వాడే మాటలలో పెద్ద తేడా లేదు; వాటిని ఒకే రంగుకి ఉన్న రెండు వన్నెలు లా భావిస్తారు. రష్యా భాషలో "లేత నీలం", "ముదురు నీలం" వేర్వేరు రంగులు! వాటికి వేర్వేరు మాటలు ఉన్నాయి.
  • భాషతో నిమిత్తం లేకుండా, మానవ జాతి కళ్లు మూడు రంగులని మాత్రమే గుర్తిస్తాయి: ఎరుపు, ఆకుపచ్చ; నీలం. మన మెదడు ఈ రంగులని కలిపి కొత్త రంగులని సృష్తిస్తుంది. మనం చూసే దృశ్యంలో ఎక్కువ ఎరుపు, ఆకుపచ్చ ఉండి, తక్కువ నీలం ఉంటే దానిని మన మెదడు "పసుపు పచ్చ" అని చెబుతుంది. (వర్ణాంధత్వం లేని వారి విషయంలో!)
  • జన్యు దోషం ఉన్న కొందరి కళ్లు నాలుగు రంగులని గుర్తించకలవట!

ఇవి కూడా చూడండి

మూలాలు

  • Silvia Morrow, "Color," Discover Magazine, page74, November 2017.
  • V. Vemuri, Science Reporter, A CSIR Publication, Sep. 1995, New Delhi, India.

Tags:

రంగు కాంతి లురంగు లు రకాలురంగు కొన్ని విశేషాలురంగు ఇవి కూడా చూడండిరంగు మూలాలురంగుఅంతర్జాతీయ రంగుల దినోత్సవంఆంగ్లంకన్నుకాంతిజర్మన్తరంగ దైర్ఘ్యంపరావర్తనంఫ్రెంచి భాషమెదడులాటిన్స్పానిష్ భాష

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత పార్లమెంట్వందేమాతరంవావిలిఛార్మీ కౌర్సంధినామనక్షత్రముకేతిక శర్మద్వాదశ జ్యోతిర్లింగాలుశ్రీశైల క్షేత్రంఇల్లాలు (1981 సినిమా)ఓటుపంచభూతలింగ క్షేత్రాలుత్రిష కృష్ణన్విజయశాంతిఅనూరాధ నక్షత్రంభారత జాతీయ ఎస్సీ కమిషన్కాజల్ అగర్వాల్పంచముఖ ఆంజనేయుడువెంట్రుకనాయట్టుపూజా హెగ్డేవిజయ్ (నటుడు)రేణూ దేశాయ్చిరుధాన్యంపంచారామాలుభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుఉత్పలమాలవిశాల్ కృష్ణమహేశ్వరి (నటి)భారతరత్నఅమెరికా రాజ్యాంగంనువ్వొస్తానంటే నేనొద్దంటానాశివ కార్తీకేయన్ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాపసుపు గణపతి పూజపరశురాముడురవీంద్రనాథ్ ఠాగూర్రాజీవ్ గాంధీనానార్థాలుబంగారంవినాయకుడురైతుమూర్ఛలు (ఫిట్స్)బుధుడు (జ్యోతిషం)భారత రాష్ట్రపతిఉలవలుబెల్లంశక్తిపీఠాలుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిగజము (పొడవు)కూన రవికుమార్కిలారి ఆనంద్ పాల్వేమనమొఘల్ సామ్రాజ్యంతిక్కన2019 భారత సార్వత్రిక ఎన్నికలురంజాన్భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుమతీషా పతిరనాభీమసేనుడుపూర్వాషాఢ నక్షత్రముకేశినేని శ్రీనివాస్ (నాని)ఋతువులు (భారతీయ కాలం)వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)ఆల్ఫోన్సో మామిడిదత్తాత్రేయపొట్టి శ్రీరాములుఆటలమ్మమకరరాశిషడ్రుచులుకర్ణాటకసింగిరెడ్డి నారాయణరెడ్డిఫరియా అబ్దుల్లారాజమండ్రిఆవర్తన పట్టికటిల్లు స్క్వేర్భీష్ముడు🡆 More