ఆర్థ్రోపోడా

ఆర్థ్రోపోడా (లాటిన్ Arthropoda) జంతురాజ్యంలో అతిపెద్ద వర్గం.

దీనిలో 80 % జంతుజాతులు ఉంటాయి. ఇవి త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్ఠవం, సమఖండ విన్యాసం గల ప్రోటోస్టోమియా జీవులు. ఇవి విశ్వవ్యాప్తంగా నేల, మంచినీరు, సముద్రాలు గాలిలో విస్తరించాయి. ఆర్థ్రోపోడాలకు కీళ్ళు గల పాదాలు ఉంటాయి. బాహ్య అస్థిపంజరపు ఫలకాలు, స్క్లెరైట్ లు, ప్రోటీన్, కైటిన్ పొరలతో ఏర్పడ్డాయి. రొయ్యలు, కీటకాలు, శతపాదులు, సహస్రపాదులు, తేళ్ళు, సాలెపురుగులు మొదలైనవి ఈ వర్గంలో ఉంటాయి.

ఆర్థ్రోపోడా
కాల విస్తరణ: కాంబ్రియన్ or earlier - Recent
ఆర్థ్రోపోడా
Mexican redknee tarantula
Brachypelma smithi
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Superphylum:
Ecdysozoa
Phylum:
ఆర్థ్రోపోడా

Latreille, 1829
Subphyla and Classes

సాధారణ లక్షణాలు

  • శరీరం ఖండీభవనం కలిగి ఉండి, తల, వక్షం, ఉదరం లేదా తల, మొండెంగా విభేదనం ఉంటుంది. ఈ జీవులలో శిరఃప్రాధాన్యం కోసం తలలో ఎక్కువ ఖండితాలు కలవడం, నాడీ నియంత్రణ జ్ఞాన గోచరత్వం శిరస్సు భాగంలో కేంద్రీకృతమవడం జరిగింది.
  • కీళ్ళు గల ఉపాంగాలుంటాయి.
  • శరీరం పైన కైటిన్తో ఏర్పడిన బాహ్యాస్థిపంజరపు తొడుగు ఉంటుంది. నిర్ణీత కాలంలో బాహ్యాస్థిపంజరాన్ని రాల్చడం వల్ల జీవి పెరుగుదలకు అవకాశం కలుగుతుంది. ఈ విధానాన్ని కుబుస విసర్జన లేదా బాహ్యకవచ నిర్మోచనం అంటారు. బాహ్యాస్థిపంజరం రక్షణకు దేహం నుంచి నీరు నష్టపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.
  • రేఖీత కండరాలు (మొదటిసారిగా) ఉంటాయి.
  • వివృత రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది. రక్తం (హీమోలింఫ్) కోటరాల ద్వారా కణజాలాల మీదుగా తిరిగి హృదయాన్ని చేరుతుంది. హృదయం పృష్టభాగంలో ఉంటుంది; క్రస్టేషియా, ఎరాక్నిడాలలో హీమోలింఫ్ లో మీమోసయనిన్ అనే రాగి మిళితమైన శ్వాస వర్ణక పదార్థం ఉంటుంది.
  • వివిధ ఆర్థ్రోపోడా సమూహాలలో మొప్పలు, శ్వాస నాళాలు, పుస్తకార ఊపిరితిత్తులు, పుస్తకాకార మొప్పలు మొదలయిన వాటితో శ్వాసక్రియ జరుగుతుంది.
  • వివిధ సమూహాలలో హరిత గ్రంథులు, మాల్ఫీజియన్ నాళికలు కోక్సల్ గ్రంథులు మొదలయినవి విసర్జక అవయవాలు.
  • నాడీ వ్యవస్థలో నాడీవలయం, ద్వంద్వ ఉదర నాడీ దండం ఉంటాయి.
  • సంయుక్త నేత్రాలు, సరళ నేత్రాలు, స్పర్శకాలు సంతులన కోశం మొదలైన జ్ఞానాంగాలు ఉంటాయి.
  • ఇవి ఏకలింగ జీవులు; అంతఃఫలదీకరణ జరుగుతుంది; అభివృద్ధి సాధారణంగా పరోక్షంగా జరుగుతుంది. జీవితచరిత్రలో ఒకటి లేదా ఎక్కువ డింభక దశలు ఉంటాయి. రూపవిక్రియ జరుగుతుంది.

వర్గీకరణ

  • ఉపవర్గం I: ట్రైలోబైటా

1. ఇవి ఒకప్పుడు జీవించిన ఆర్ర్ధోపోడ్ లు. 2.పూర్వీక ఆర్ర్ధోపాదడ్ లన్ని సముద్రజీవులు. 3. శరీరచుట్టూ దృఢమైన కైటిన్ కవచముంటుంది. 4. శరీరంలో మూడు భాగాలు తల, ఉదరం, పైజీడియం స్ఫుటంగా కనిపిస్తాయి. 5.తలకు స్పరశృంగం, ఒక జత నేత్రాలు, నాలుగు జతల ఉపాంగాలు ఉండేవి.

ఉదాహరణ : ట్రైలోబైట్. 
  • ఉపవర్గం II: కెలీసిరేటా
    • విభాగం 1: యూరిప్టెరిడా: ఉ. సముద్రపు తేళ్ళు
    • విభాగం 2: జీఫోస్యూరా ఉ. రాచపీత
    • విభాగం 3: అరాక్నిడా: ఉ. తేలు, సాలెపురుగు, మైట్
  • ఉపవర్గం III: మాండిబ్యులేటా
    • విభాగం 1: క్రస్టేషియా: ఉ. రొయ్యలు, పీతలు
    • విభాగం 2: కీలోపోడా: ఉ. శతపాదులు
    • విభాగం 3: డిప్లోపోడా: ఉ. సహస్రపాదులు
    • విభాగం 4: ఇన్ సెక్టా: ఉ. ఈగ, పేను, నల్లి, బొద్దింక

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

భగవద్గీతసౌందర్యభారత స్వాతంత్ర్యోద్యమంవాతావరణంనిమ్మగడ్డకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంపందెం కోడి - 2రామ్ చ​రణ్ తేజరైతుబంధు పథకంభారత రాజ్యాంగ పరిషత్కాటసాని రాంభూపాల్ రెడ్డిశుక్రుడుజూనియర్ ఎన్.టి.ఆర్రుక్మిణీ కళ్యాణంభారత రాష్ట్రపతిముంగిసవరిపూనమ్ కౌర్మలబద్దకంచిరంజీవియాదవకామసూత్ర (సినిమా)2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుశాతవాహనులుకాజల్ అగర్వాల్భారత జాతీయ కాంగ్రెస్సనషడ్రుచులుపోసాని కృష్ణ మురళిభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులురాజంపేట లోక్‌సభ నియోజకవర్గంగుంటకలగరశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)శ్రీదేవి (నటి)నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిఘట్టమనేని మహేశ్ ‌బాబుగోత్రాలు జాబితాఅధిక ఉమ్మనీరుతెలంగాణవై.యస్. రాజశేఖరరెడ్డివజ్రాయుధంకామాక్షి భాస్కర్లచాందిని చౌదరిరంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)తెలుగు సినిమాYప్రేమలుసవర్ణదీర్ఘ సంధిజగ్జీవన్ రాంఉస్మానియా విశ్వవిద్యాలయంలక్ష్మీనారాయణ వి విఓటుకీర్తి సురేష్బ్రాహ్మణ గోత్రాల జాబితాహిందూధర్మంపంచభూతలింగ క్షేత్రాలుప్రకృతి - వికృతిఆరుద్ర నక్షత్రముత్రిష కృష్ణన్దుప్పిట్రూ లవర్మెదక్ లోక్‌సభ నియోజకవర్గంఅక్కినేని నాగేశ్వరరావుపిత్తాశయముఉద్దమ్ సింగ్రామోజీరావుసీ.ఎం.రమేష్దశావతారములుసంతోష్ యాదవ్అనన్యా పాండేగ్రామంఅంతస్తులువిజయ్ (నటుడు)భారతదేశంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థనామనక్షత్రముపులివెందుల శాసనసభ నియోజకవర్గంశుక్రుడు జ్యోతిషంసంజు శాంసన్🡆 More