తూర్పు కనుమలు

తూర్పు కనుమలు భారత ద్వీపకల్పపు తూర్పు సముద్ర తీరం వెంట విచ్ఛిన్నంగా విస్తరించిన కొండల వరుస.

ఉత్తర ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణాన తమిళనాడు వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. ఇవి కర్ణాటక, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల గుండా కూడా పోతాయి. ద్వీపకల్ప భారతదేశంలోని నాలుగు ప్రధాన నదులు - గోదావరి, మహానది, కృష్ణ, కావేరి - తూర్పు కనుమలను ఒరుసుకుంటూ, ఖండిస్తూ ప్రవహించి, బంగాళాఖాతంలో కలుస్తాయి. తెలంగాణాలో 965 మీ ఎత్తు కలిగిన దోలి గుట్ట ఈ శ్రేణిలో ఎత్తైన శిఖరం. తమిళనాడులో ఒడైక్కన్ బెట్ట ఎత్తైన శిఖరం. ఒడిషాలో 1672 మీ ఎత్తు కలిగిన దేవమాలి ఎత్తైన శిఖరం. ఆంధ్రప్రదేశ్ లో 1680 మీ ఎత్తున్న ఆర్మకొండ అత్యంత ఎత్తైన ప్రాంతం. కర్ణాటక లో తూర్పు కనుమల్లో భాగమైన బిఆర్ పర్వతశ్రేణులు అక్కడక్కడా 1800 మీ పైగా ఎత్తు కలిగి ఉన్నాయి. వీటిలో అన్నింటికన్నా ఎత్తైన కట్టాహి బెట్ట 1822 మీ ఎత్తున ఉంది. ఈ పర్వతశ్రేణిలో తమిళనాడు లోని తలమలై పర్వశ్రేణులు ఎత్తైనవి. ఆంధ్రప్రదేశ్ లోని అరకు కొండలు ఎత్తులో మూడవ స్థానంలో ఉన్నాయి.

తూర్పు కనుమలు
తూర్పు కనుమలు
విశాఖ జిల్లాలోని పాడేరు వద్ద తూర్పు కనుమలు
అత్యంత ఎత్తైన బిందువు
శిఖరంఅర్మ కొండ, అరకు
ఎత్తు1,690 m (5,540 ft)
టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్1,290 m (4,230 ft)
భౌగోళికం
దేశంభారతదేశం
రాష్ట్రాలుఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు and పశ్చిమ బెంగాల్
ప్రాంతాలుతూర్పు భారత దేశం and దక్షిణ భారత దేశం
Settlementsభువనేశ్వర్, చెన్నై, దిండిగల్, కర్నూలు, నమక్కల్, రాజమండ్రి, సేలం, శ్రీశైలం, తిరువణ్ణామలై, తిరుపతి, వెల్లూరు, విజయవాడ and విశాఖపట్నం
Biomeఅడవులు
Geology
Type of rockIgneous, ఇనుము and సున్నపురాయి

ఈ పర్వత శ్రేణులు బంగాళాఖాతపు తీరరేఖకు సమాంతరంగా నడుస్తాయి. తూర్పు కనుమలకు పశ్చిమాన, పశ్చిమ కనుమల వరకూ విస్తరించి ఉన్న ప్రాంతాన్ని దక్కను పీఠభూమి అంటారు. కోరమాండల్ తీర ప్రాంతంతో సహా తీర మైదానాలు తూర్పు కనుమలకు, బంగాళాఖాతానికీ మధ్య విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమలు పడమటి కనుమలంత ఎత్తు లేవు.

భౌగోళికం

తూర్పు కనుమలు పడమటి కనుమల కన్నా పురాతనమైనవి. పురాతన సూపర్ ఖండం రోడినియా కలవడం, విడిపోవడం లకు, గోండ్వానా సూపర్ ఖండం ఏకీకరణకూ సంబంధించిన సంక్లిష్టమైన భౌగోళిక చరిత్రను కలిగి ఉంది.

తూర్పు కనుమలు చార్నోకైట్లు, గ్రానైట్ రాయి, ఖోండలైట్లు, మెటామార్ఫిక్ నీస్‌లు, క్వార్జ్ రాతితో కూడుకుని ఉంటాయి. తూర్పు కనుమల నిర్మాణంలో థ్రస్ట్‌లు, స్ట్రైక్-స్లిప్ లోపాలు ఉన్నాయి తూర్పు కనుమల్లో సున్నపురాయి, బాక్సైట్. ఇనుప ఖనిజం లభిస్తాయి.

స్థానిక కొండల వరుసలు

తూర్పు కనుమలు 
స్థలాకృతి-[permanent dead link] తూర్పు కనుమలు (దక్షిణ భాగం)

దక్షిణ భాగం

అక్కడక్కడా అంతరాయం కలుగుతూ ఉత్తరం నుండి దక్షిణంగా విస్తరించి ఉన్న ఈ పర్వత శ్రేణులకు స్థానికంగా వివిధమైన పేర్లు కూడా ఉన్నాయి. దక్షిణ కొసన తూర్పు కనుమలు, తక్కువ ఎత్తులో ఉండే అనేక చిన్న చిన్న శ్రేణులను ఏర్పరుస్తాయి. తూర్పు కనుమల దక్షిణాన చిట్టచివరన ఉండే కొండలను సిరుమలై, కారంతమలై కొండలు అంటారు. కొల్లి కొండలు తూర్పు కనుమల యొక్క దక్షిణ చివర, నమక్కల్ - తురైయూర్ రహదారి వరకు ఉన్నాయి.

కావేరీ నదికి ఉత్తరాన ఉన్న ఉత్తర తమిళనాడులో కొల్లిమలై, పచ్చాయ్‌మలై, షెవరాఅయ్ (సర్వారాయన్), కాలరాయన్, చిత్తేరి, జావాదు, పాలమలై, మెట్టూరు హిల్స్ అనే కొండల వరుసలు ఉన్నాయి. ఎత్తైన ఈ కొండలపై శీతోష్ణస్థితి చుట్టుపక్కల ఉన్న మైదానాల కంటే చల్లగాను, తేమగానూ ఉంటుంది. ఈ కొండలు కాఫీ తోటలకు, పొడి అడవులకూ నిలయంగా ఉన్నాయి.

యేర్కాడ్ హిల్ స్టేషన్ షెవరాయ్ హిల్స్లో ఉంది. పశ్చిమ కనుమల నుండి తూర్పుగా కావేరి నది వరకు విస్తరించిన బిలిగిరిరంగ కొండలు, తూర్పు, పశ్చిమ కనుమలను కలిపే అటవీ పర్యావరణ కారిడార్‌ను ఏర్పరుస్తాయి. భారతదేశంలో రెండవ అతిపెద్ద ఆసియా ఏనుగుల జనాభా ఆగ్నేయ కనుమలు, బిలిగిరిరంగ కొండలు, నీలగిరి కొండలు, నైరుతి కనుమల మధ్య ప్రాంతంలో ఉంటుంది.

మాలే మహాదేశ్వర ఆలయం తూర్పు కనుమలలో కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లాలో ఉంది.

కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో ఉన్న మరో ఒకే కొండ శ్రేణి కురుంబలకోట కొండ కూడా తూర్పు కనుమల్లోదే.

పొన్నైయార్, పాలార్ నదులు కోలార్ పీఠభూమిలోని హెడ్ వాటర్స్ నుండి తూర్పువైపు కనుమ మధ్య ఖాళీల్లోంచి ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. జావాదు కొండలు ఈ రెండు నదుల మధ్య ఉన్నాయి. కిలియూర్ జలపాతం వంటి జలపాతాలు ఉన్నాయి .

మధ్య భాగం

పాలార్ నదికి ఉత్తరాన, ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు కనుమల మధ్య భాగంలో సుమారుగా ఉత్తర-దక్షిణ దిశల్లో విస్తరించిన రెండు సమాంతర శ్రేణులు ఉన్నాయి. తూర్పున, తక్కువ ఎత్తుతో వెలికొండ శ్రేణి ఉంది. పశ్చిమాన ఎక్కువ ఎత్తైన పాలికొండ-లంకమల- నల్లమల శ్రేణులు ఉన్నాయి. ఇవి కోరమాండల్ తీరానికి సమాంతరంగా దాదాపు ఉత్తర-దక్షిణ అమరికలో, కృష్ణ, పెన్నా నదుల మధ్య 430 కి,మీ. పొడవున ఉన్నాయి. వీటికి ఉత్తర సరిహద్దున చదునైన పల్నాడు బేసిన్ ఉండగా, దక్షిణాన తిరుపతి కొండలతో విలీనం అవుతాయి. చాలా పురాతనమైన ఈ కొండలు కాలక్రమంలో శీతోష్ణస్థితుల ప్రభావానికి లోనై, క్షీణించాయి. నేడు వీటి సగటు ఎత్తు 520 మీ. అయితే భైరవకొండ వద్ద 1,100 మీ., గుండ్ల బ్రహ్మేశ్వర వద్ద 1,048 మీ. ఎత్తు ఉంటాయి.

తిరుమల కొండలు తూర్పు కనుమల్లో శేషాచలం - వెలికొండ శ్రేణిలో ఉన్నాయి. పాలార్ నది ఈ శ్రేణులను ఖండించుకుంటూ వెళుతుంది. వెలికొండ శ్రేణి చివరికి నెల్లూరు జిల్లా ఉత్తర ప్రాంతంలో తీర మైదానం వద్ద దిగుతుంది. కర్నూలులోని నల్లమల్ల శ్రేణి కృష్ణా నది వరకూ కొనసాగుతుంది.

కొండపల్లి కొండలు కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్న తక్కువ ఎత్తైన కొండల శ్రేణి. ఈ కొండలు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాల్లో ఉన్నాయి. కృష్ణ నది తూర్పు కనుమల యొక్క ఈ కొండలను విభజిస్తుంది. ప్రధాన కొండ శ్రేణి నందిగామ నుండి విజయవాడ వరకు విస్తరించి ఉంది. దీన్నే కొండపల్లి శ్రేణి అని పిలుస్తారు.

పాపి కొండలు తూర్పు కనుమలలో, ఆంధ్రప్రదేశ్ లోని ఖమ్మం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య విస్తరించి ఉన్నాయి. ఇవి రాజమహేంద్రవరం వద్ద ముగుస్తాయి.

తూర్పు కనుమలు 
తమిళనాడులో తూర్పుకనుమలు

మధురవాడ డోమ్ విశాఖపట్నానికి ఉత్తరాన ఉన్న తూర్పు కనుమల్లో ఖొండలైట్ సూట్, క్వార్ట్జ్ ఆర్కియన్ శిలలతో టెక్టోనిక్ అమరిక ద్వారా ఏర్పడింది.

ఉత్తర భాగం

మాలియా శ్రేణి తూర్పు కనుమల ఉత్తర భాగంలో ఉంది. మాలియా శ్రేణి సాధారణంగా 900–1200 మీ. ఎత్తున ఉంటుంది. దాని శిఖరాలు కొన్ని అంతకంటే ఎత్తే ఉంటాయి. ఈ శ్రేణిలో అత్యధిక ఎత్తున్న శిఖరం మహేంద్రగిరి (1,501 మీ.).

మాడుగుల కొండలు తూర్పు కనుమల ఉత్తర భాగంలో ఉన్నాయి. 1100–1400 మీ. ఎత్తుతో ఇవి, మాలియా కొండల కంటే ఎత్తుగా ఉంటాయి. ఈ కొండల లోని ప్రముఖ శిఖరాల్లో తూర్పు కనుమల్లో కెల్లా ఎత్తైన శిఖరమైన - అర్మ కొండ (1,680 మీ.) ఉంది. ఇతర శిఖరాలు - గాలి కొండ (1,643 మీ.), సింక్రం గుట్ట (1,620 మీ.).

ఒడిశా రాష్ట్రంలో కెల్లా ఎత్తైన పర్వత శిఖరం దేవమాలి (1,672 మీ.) తూర్పు కనుమల్లో, దక్షిణ ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో ఉంది. ఇది చంద్రగిరి-పొత్తంగి పర్వత వ్యవస్థలో భాగం. ఈ ప్రాంతం ఒడిశా రాష్ట్ర మొత్తం విస్తీర్ణంలో నాలుగింట మూడు వంతులుంటుంది. భౌగోళికంగా ఇది భారత ద్వీపకల్పంలో ఒక భాగం, ఇది పురాతన గోండ్వానా లాండ్ భూభాగంలో భాగం. ఒడిశాలోని ప్రధాన నదులు వాటి ఉపనదులతో లోతైన సన్నటి లోయలను ఏర్పరచాయి.

గర్జత్ శ్రేణి వాయవ్య దిక్కున తూర్పు కనుమల పొడిగింపు. ఇది తూర్పువైపున అమాంతం నిట్టనిలువుగా లేచి పడమర వైపున, మయూర్‌భంజ్ మల్కానగిరి ల మధ్య ఉండే పీఠభూమి వరకు నిదానంగా దిగుతాయి. ఒడిశా లోని ఎత్తైన ప్రాంతాలను గర్జత్ కొండలు అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతపు సగటు ఎత్తు సముద్ర మట్టానికి సుమారు 900 మీ. ఉంటుంది.

సిమిలిపాల్ మాసిఫ్‌ను తూర్పు కనుమలకు ఈశాన్య కొసన పొడిగింపుగా భావిస్తారు.

నదులు

దక్షిణ భారతదేశంలోని తూర్పు తీర మైదానాలలో ప్రవహించే చాలా చిన్న, మధ్యతరహా నదులకు తూర్పు కనుమలు జన్మస్థానం.

తూర్పు కనుమలు 
తూర్పు కనుమల్లోని పాపికొండల వద్ద గోదావరి -సూర్యోదయ వేళ

తూర్పు కనుమల గుండా ప్రవహించే నదులు:

తూర్పు కనుమలలో ఉద్భవించే నదులు:

జంతుజాలం

తూర్పు కనుమలు 
తూర్పు కనుమలలో ఉన్న అరకులోయ

తూర్పు కనుమలకే ప్రత్యేకమైన స్థానిక జంతుజాలం కలివికోడి (రినోప్టిలస్ బిటోర్క్వాటస్), బూడిద సన్నని లోరిస్ (లోరిస్ లిడెకెరియానస్) లు. ఇక్కడ కనిపించే అరుదైన తొండలు భారతీయ బంగారు తొండ ( కాలోడాక్టిలోడ్స్ ఆరియస్ ), గ్రానైట్ రాక్ తొండ ( హెమిడాక్టిలస్ గ్రానిటికోలస్ ), యేర్కాడ్ సన్నని తొండ ( హెమిఫిలోడాక్టిలస్ ఆరాంటియాకస్ ), శర్మ స్కింక్ (యూట్రోపిస్ నాగార్జుని), గోవర్స్ షీల్డ్‌టైల్ పాము ( రినోఫిస్ గోవేరి ), షార్ట్ షీల్డ్‌టైల్ పాము ( యురోపెల్టిస్ షార్టి ), నాగార్జున సాగర్ రేసర్ ( కొలబెర్ భోలనాతి ) .

క్షీరదాలు

భారతీయ ఏనుగు (ఎలిఫాస్ మాక్సిమస్ ఇండికస్), కృష్ణ జింక (యాంటెలోప్ సెర్వికాప్రా), ఆసియా తాటి పునుగు (పారాడాక్సురస్ హెర్మాఫ్రాడిటస్), చిన్న భారత పునుగు (వైవెర్రిక్యులా ఇండికా), మద్రాస్ ట్రీష్రూ (అనంతన ఎల్లియోటి), సాధారణ బూడిద రంగు ముంగిస ( హెర్పెస్టస్ ఎడ్వర్డ్సీ ), సాంబార్ జింక (రూసా యూనికలర్ ), ఇండియన్ క్రెస్టెడ్ పోర్కుపైన్ (హిస్ట్రిక్స్ ఇండికా), ఇండియన్ బైసన్ (బోస్ గౌరస్), అడవి పంది (సుస్ స్క్రోఫా), కామన్ ముంట్జాక్ (ముంటియాకస్ ముంట్జాక్), ఇండియన్ చిరుతపులి (పాంథెరా పార్డస్ ఫస్కా), బెంగాల్ టైగర్ (పాంథెరా టైగ్రిస్ టైగ్రిస్), రేచుకుక్కలు (క్యూన్) ఆల్పినస్), గోల్డెన్ జాకల్ (కానిస్ ఆరియస్), ఇండియన్ జెయింట్ స్క్విరెల్ (రాటుఫా ఇండికా), ఇండియన్ హరే (లెపస్ నైగ్రికోల్లిస్), ఏషియన్ హౌస్ ష్రూ (సన్‌కస్ మురినస్), టఫ్టెడ్ గ్రే లాంగూర్ (సెమ్నోపిథెకస్ ప్రియామ్), ఇండియన్ ఫ్లయింగ్ ఫాక్స్ (స్టెరోపస్ గిగాంటెయస్), బోనెట్ మకాక్ (మకాకా రేడియేటా), రీసస్ మకాక్ (మకాకా ములాట్టా), బెంగాల్ ఫాక్స్ (వల్ప్స్ బెంగాలెన్సిస్), నునుపైన పూతతో కూడిన ఓటర్ (లుట్రోగల్ పెర్సిపిల్లాటా), జంగిల్ క్యాట్ (ఫెలిస్ చౌస్), చీటల్ (యాక్సిస్ యాక్సిస్), నీలగై, ఇండియన్ పంది, చారల హైనా (హయానా హైనా), ఇండియన్ తోడేలు, ఇండియన్ మోల్-ఎలుక (బాండికోటా బెంగాలెన్సిస్)

పక్షులు

ఉత్తర తూర్పు కనుమల కొండ ప్రాంతంలో ATREE నిర్వహించిన ఒక సర్వేలో బ్రూక్ యొక్క ఫ్లైకాచర్ ( సైర్నిస్ పోలియోజెనిస్ ), జెర్డాన్ బాజా వంటి సాపేక్షంగా అరుదైన పక్షులతో సహా 205 కి పైగా జాతుల పక్షులను గుర్తించారు. మలబార్ పైడ్ హార్న్బిల్స్ వంటి బెదిరింపు పక్షి జాతులు కూడా కొన్ని ఆవాసాలలో కనిపించాయి. తూర్పు కనుమలలో కనిపించే ఇతర పక్షి జాతులలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (ఆర్డియోటిస్ నైగ్రిసెప్స్), రెడ్-వాటెడ్ ల్యాప్‌వింగ్ (వనేల్లస్ ఇండికస్), స్పాట్-బిల్ పెలికాన్ (పెలేకనస్ ఫిలిప్పెన్సిస్), బ్లూ పీఫౌల్ (పావో క్రిస్టాటస్), ఇండియన్ చెరువు హెరాన్ (ఆర్డియోలా గ్రేయి), హోపోయ్ (ఉపూపా ఎపోప్స్), పిల్ల గుడ్లగూబ మచ్చల (ఎథీనే బ్రామా), గ్రేటర్ కౌకాల్ (సెంట్రోపస్ సినేన్సిస్), పైడ్ పింఛం కోకిల (క్లెమాటర్ జాకోబినస్), ఓరియంటల్ వైట్ ఐబిస్ (త్రెస్కియోనిస్మె లనోసిఫలస్), భారతీయ పిట్టా (పిట్టా బ్రాక్యురా), భారత స్వర్గం ఫ్లేక్యాచర్ (టెర్ప్సిఫోన్ పారాడసి), ఎరుపు వర్ణంలో బుల్బుల్ (పైకోనోటస్ కాఫర్), ఎరుపు-గెడ్డం గల బుల్బుల్ (పైకోనోటస్ జాకోసస్), అడవి రహస్యములు (టర్డోయిడ్స్ స్ట్రియాటా), పెయింటెడ్ గూడకొంగ (మిక్టీరియా ల్యూకోసెఫాలా), నల్లని-మడతల గల ఫ్లేమ్బ్యాక్ (డినోపియుమ్ బెంఘాలెన్స్), బ్రాహ్మినే గాలిపటం (హాలియాస్టర్ ఇండస్), జంగిల్ మైనా (అక్రిడోథెరెస్ ఫస్కస్), ఇండియన్ మచ్చల ఈగిల్ (అక్విలా హస్టాటా), ఇండియన్ రాబందు (జిప్స్ ఇండికస్) , మలబార్ ఈలలు త్రష్ (మయోఫోనస్ హార్స్‌ఫీల్డ్)

ఉభయచరాలు

గున్థెర్స్ టోడ్ ( బుఫో హోలోలియస్ ), చెరువు కప్పలు ( యూఫ్లిక్టిస్ ), క్రికెట్ కప్ప ( ఫెజెర్వర్యా ), ఎద్దు కప్పలు ( హోప్లోబాట్రాచస్ ), బురోయింగ్ కప్పలు ( స్పేరోథెకా ), బెలూన్ కప్పలు ( ఉప్పరోడాన్ ), చిన్న- మౌత్డ్ సహా 30 రకాల ఉభయచరాలు. మైక్రోహైలా ), చెట్ల కప్ప ( పాలీపెడేట్స్ ) ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడా మాత్రమే కనిపించే ఎండెమిక్‌ జాతులను బంగారు వీపు కప్పలు అంటారు.

సరీసృపాలు

తూర్పు కనుమలలో దాదాపు 100 జాతుల సరీసృపాలు కనిపిస్తాయి. చాలా అంతరించిపోతున్న జాతులు కూడా ఉన్నాయి. మగ్గర్ మొసలి (క్రోకోడైలాస్ పలుస్ట్రిస్), భారతీయ బ్లాక్ తాబేలు (మెలనోకెలిస్ ట్రిజూగా), భారత ఫ్లాప్‌షెల్ తాబేలు ( లిస్సెమిస్ పంక్టాట ), భారత డేరా తాబేలు ( అంగ్‌షూరా టెంటోరియా), భారత స్టార్ టార్టాయిస్ ( జియోకెలోన్ ఎలిగాన్స్ ), లీథ్ యొక్క సాఫ్ట్‌షెల్ తాబేలు ( నిల్సోనియా లీతి ), వీటిలో చాలా వరకు ఉత్తర నదులు, నదీ లోయ ప్రాంతాలలో కనిపిస్తాయి.

బల్లుల్లో రౌక్స్ అటవీ కాలోట్స్ మోనిలేసారస్ రూక్సీ, (సామోఫిలస్), ( సిటానా ), భారత ఊసరవెల్లి ( చమేలియో జేలానికస్ ), రెటిక్యులేటెడ్ తొండ ( హెమిడాక్టిలస్ రెటిక్యులేటస్), రాతి తొండలు హెమిడాక్టిలస్ గైగాంటియస్, హెమిడాక్టిలస్ గ్రానైటికోలస్, బంగారు తొండ మొదలైనవి ఉన్నాయి. ఎన్నదగిన బల్లులలో సెప్సోఫిస్ పంక్టాటస్, బార్కుడియా మెలనోస్టిక్టా, బార్కుడియా ఇన్సులారిస్ వంటి కాళ్ళు లేని స్కింక్‌లు ఉన్నాయి. ఇవి ఉత్తర శ్రేణులలో, ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా ల్లోని తూర్పు తీర మైదానాలలో ఉన్నాయి.

రక్షిత ప్రాంతాలు

తూర్పు కనుమలు 
ఆంధ్రప్రదేశ్ లోని తలకోన సమీపంలోని శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ దృశ్యం

తూర్పు కనుమల లోని అభయారణ్యాలు జాతీయ ఉద్యానవనాలు:

  • కోరింగ అభయారణ్యం, ఆంధ్రప్రదేశ్
  • హద్‌గఢ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఒడిశా
  • కంబాలకొండ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఆంధ్రప్రదేశ్
  • కృష్ణా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఆంధ్రప్రదేశ్
  • కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఆంధ్రప్రదేశ్
  • లఖరీ లోయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఒడిశా
  • నాగార్జున సాగర్ పులుల అభయారణ్యం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
  • పాపికొండలు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఆంధ్రప్రదేశ్
  • రోళ్ళపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఆంధ్రప్రదేశ్
  • సత్కోసియా పులుల సంరక్షణా కేంద్రం, ఒడిశా
  • సిమిలిపాల్ జాతీయ ఉద్యానవనం, ఒడిశా
  • శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఆంధ్రప్రదేశ్
  • శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఆంధ్రప్రదేశ్
  • సునాబెడ పులుల సంరక్షణా కేంద్రం, ఒడిశా
  • వేదాంతంగళ్ పక్షి సంరక్షణ కేంద్రం, తమిళనాడు
  • కావేరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, Karnataka
  • సత్యమంగళం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, తమిళనాడు
  • నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్, తమిళనాడు
  • ఉత్తర కావేరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, తమిళనాడు

2018 లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, తూర్పు కనుమల లోని అటవీ ప్రాంతం 1920 నుండి బాగా తగ్గిపోయింది. ఈ ప్రాంతానికి చెందిన అనేక మొక్కల జాతులు విలుప్త ముప్పును ఎదుర్కొంటున్నాయి.

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

తూర్పు కనుమలు భౌగోళికంతూర్పు కనుమలు స్థానిక కొండల వరుసలుతూర్పు కనుమలు నదులుతూర్పు కనుమలు జంతుజాలంతూర్పు కనుమలు రక్షిత ప్రాంతాలుతూర్పు కనుమలు ఇవి కూడా చూడండితూర్పు కనుమలు మూలాలుతూర్పు కనుమలుఆంధ్రప్రదేశ్ఒడిషాకర్ణాటకకావేరి నదికృష్ణా నదికొండగోదావరితమిళనాడుమహానది

🔥 Trending searches on Wiki తెలుగు:

వసంత వెంకట కృష్ణ ప్రసాద్రవితేజబంగారంకుక్కసౌరవ్ గంగూలీరాకేష్ మాస్టర్ఉపనిషత్తురక్త పింజరిఋతువులు (భారతీయ కాలం)రామ్ చ​రణ్ తేజరమ్య పసుపులేటిపాఠశాలజ్యోతిషంచిత్త నక్షత్రముగైనకాలజీశుక్రుడు జ్యోతిషంజవాహర్ లాల్ నెహ్రూవినాయకుడువందేమాతరంగర్భాశయమునితిన్హర్భజన్ సింగ్రాహుల్ గాంధీపిఠాపురం శాసనసభ నియోజకవర్గంహనుమంతుడుశ్రీముఖిప్రపంచ మలేరియా దినోత్సవంఎఱ్రాప్రగడవై.యస్.రాజారెడ్డిక్రికెట్చే గువేరాతహశీల్దార్పంచకర్ల రమేష్ బాబుఅష్ట దిక్కులుజగ్జీవన్ రాంరఘురామ కృష్ణంరాజునానార్థాలుపి.వెంక‌ట్రామి రెడ్డిఅరకులోయఆవుఅంగారకుడు (జ్యోతిషం)దశదిశలునాయుడువై. ఎస్. విజయమ్మసవర్ణదీర్ఘ సంధిరజాకార్చేతబడివాయు కాలుష్యంప్రధాన సంఖ్యఅయలాన్భారతదేశ రాజకీయ పార్టీల జాబితాకొడాలి శ్రీ వెంకటేశ్వరరావుఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.వెంట్రుకఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాఇంగువదేవినేని అవినాష్అల్లూరి సీతారామరాజుబంగారు బుల్లోడుద్రౌపది ముర్మురోహిణి నక్షత్రంస్వాతి నక్షత్రమునువ్వుల నూనెఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంసురేఖా వాణిపెళ్ళి చూపులు (2016 సినిమా)సుధ (నటి)భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంముదిరాజ్ (కులం)గొట్టిపాటి రవి కుమార్ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్కార్తెమంజుమ్మెల్ బాయ్స్ఆవర్తన పట్టికమొలలువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిభారత ఎన్నికల కమిషనుపోలవరం ప్రాజెక్టు🡆 More