ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్  (1879 మార్చి 14 -1955 ఏప్రిల్ 18 ) జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త.

ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన రెండు సిద్ధాంతాల్లో ఒకటైన జెనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని (సాధారణ సాపేక్షత) ప్రతిపాదించారు .

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
ఐన్‌స్టీన్ 1921లో
జననం(1879-03-14)1879 మార్చి 14
ఉల్మ్, వుర్టంబెర్గ్ రాజ్యం, జర్మన్ సామ్రాజ్యం
మరణం1955 ఏప్రిల్ 18(1955-04-18) (వయసు 77)
ప్రిన్స్టన్, న్యూజెర్సీ, యునైటెడ్ స్టేట్స్
పౌరసత్వం🐱
  • జర్మన్ సామ్రాజ్యం (1879–1896) వుర్టంబెర్గ్ రాజ్యం
  • స్టేట్‌లెస్ (1896-1901)
  • స్విట్జర్లాండ్ పౌరసత్వం (1901-1955)
  • ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం ఆస్ట్రియన్ (1911-1912)
  • జర్మన్ సామ్రాజ్యం (1914-1918) సమయంలో ప్రుస్సియా రాజ్యం
  • ఫ్రీ స్టేట్ ఆఫ్ ప్రుస్సియా యొక్క జర్మన్ పౌరుడు (వీమర్ రిపబ్లిక్, 1918-1933)
  • యునైటెడ్ స్టేట్స్ పౌరసత్వం (1940-1955)
రంగములుఫిజిక్స్, తత్వశాస్త్రం
వృత్తిసంస్థలు
  • స్విస్ పేటెంట్ ఆఫీస్ (బెర్న్) (1902-1909)
  • బెర్న్ విశ్వవిద్యాలయం (1908-1909)
  • జూరిచ్ విశ్వవిద్యాలయం (1909-1911)
  • ప్రేగ్‌లోని చార్లెస్ విశ్వవిద్యాలయం (1911-1912ెె-ఞ
  • ETH జూరిచ్ (1912-1914)
  • ప్రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (1914-1933)
  • హంబోల్ట్ యూనివర్శిటీ ఆఫ్ బెర్లిన్ (1914-1933)
  • కైజర్ విల్హెల్మ్ ఇన్స్టిట్యూట్ (దర్శకుడు, 1917-1933)
  • జర్మన్ ఫిజికల్ సొసైటీ (అధ్యక్షుడు, 1916-1918)
  • లైడెన్ విశ్వవిద్యాలయం (సందర్శనలు, 1920)
  • ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీ (1933-1955)
  • కాల్టెక్ (సందర్శనలు, 1931-1933)
  • ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం (సందర్శనలు, 1931-1933)
ప్రసిద్ధి
  • సాధారణ సాపేక్షత
  • ప్రత్యేక సాపేక్షత
  • ఫోటోఎలెక్ట్రిక్ ప్రభావం
  • E = mc 2 (మాస్-ఎనర్జీ ఈక్వాలెన్స్)
  • E = hf (ప్లాంక్-ఐన్‌స్టీన్ సంబంధం)
  • బ్రౌనియన్ మోషన్ సిద్ధాంతం
  • ఐన్‌స్టీన్ ఫీల్డ్ సమీకరణాలు
  • బోస్-ఐన్‌స్టీన్ గణాంకాలు
  • బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్
  • గురుత్వాకర్షణ తరంగం
  • కాస్మోలాజికల్ స్థిరాంకం
  • ఏకీకృత క్షేత్ర సిద్ధాంతం
  • EPR పారడాక్స్
  • సమిష్టి వివరణ
ముఖ్యమైన పురస్కారాలు
  • బర్నార్డ్ మెడల్ (1920)
  • భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి (1921)
  • మాట్టూచి మెడల్ (1921)
  • ForMemRS (1921)
  • కోప్లీ మెడల్ (1925)
  • రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ యొక్క బంగారు పతకం (1926)
  • మాక్స్ ప్లాంక్ మెడల్ (1929)
  • నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సభ్యుడు (1942)
  • సమయం శతాబ్దపు వ్యక్తి (1999)
సంతకం
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

అతను తత్త్వశాస్త్రంలో ప్రభావవంతమైన కృషి చేశాడు.  మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E = mc^2 ను కనిపెట్టాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఫార్ములా. 1921లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు . క్వాంటం థియరీ పరిణామ క్రమం పరిణామ క్రమానికి ముఖ్యమైన ఫొటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ లాను కనిపెట్టినందుకు ఈ బహుమతి అందుకున్నారు అతను.

అతను కెరీర్ మొదట్లో న్యూటన్ మెకానిక్స్ సంప్రదాయ మెకానిక్స్ ను  పునరుర్ధరించలేదని భావించేవారు. దీంతో స్పెషల్ రెలెటివిటి అభివృద్ధికి బాటలు పడ్డాయి. 1916 లో  సాధారణ  సాపేక్షతపై పేపర్ ప్రచురించారు.  స్టాటిస్టికల్ మెకానిక్స్, క్వాంటం థియరీల్లోని సమస్యలపై దృష్టిపెట్టారు ఐన్‌స్టీన్ . పార్టీకల్ థియరీ, అణువుల చలనాలపై వ్యాఖ్యానం చేశారు అతను. అతను ఉష్ణ లక్షణాల గురించి చేసిన  పరిశోధన కాంతి ఫోటాన్ సిద్ధాంతం కనుగొనడానికి ఉపయోగపడింది. 1917లో సాధారణ సాపేక్షత సిద్ధాంతాన్ని భారీ స్థాయిలో విశ్వానికి అనువర్తింపచేశారు ఐన్ స్టీన్.

1933లో హిట్లర్ జర్మనీలో అధికారంలోకి వచ్చాకా అతను అమెరికా  వెళ్ళారు.  అతను  జ్యుయిష్  జాతికి చెందినందున తిరిగి జర్మనీ వెళ్ళలేదు. అమెరికాలో బెర్లిన్ అకాడమీ  ఆఫ్  సైన్సెస్  లో ఆచార్యునిగా  పనిచేశాడు. 1940లో  అమెరికన్  పౌరసత్వం  లభించడంతో  అక్కడే స్థిరపడిపోయారు.   రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా  అత్యంత శక్తివంతమైన బాంబులపై పరిశోధన జరుగుతోందనీ, ఇది అణుబాంబు తయారీకి దారితీస్తుందని వివరిస్తూ అప్పటి అమెరికా  అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూసెవెల్ట్ కు ఉత్తరం రాశారు. తాను యుద్ధానికి  వ్యతిరేకం  కాదనీ, కొత్తగా కనుగొన్న అణుబాంబు  ప్రయోగానికి  తాను పూర్తి వ్యతిరేకమనీ  స్పష్టంచేశారు. అణు ఆయుధాలను ఉపయోగించకూడదంటూ బ్రిటన్ కు  చెందిన  తత్త్వవేత్త  బెర్ట్రాండ్ రుసెల్ తో  కలసి  రుసెల్- ఐన్‌స్టీన్ మానిఫెస్టోపై సంతకం చేశాడు. 1955లో చనిపోయేంతవరకూ న్యూజెర్సీలోని ప్రిన్స్ టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్సెడ్ స్టడీ సంస్థలో పనిచేశాడు .

ఐన్‌స్టీన్ 300కు పైగా శాస్త్రీయ పత్రికలు, 150 శాస్త్రీయేతర పత్రికలు ప్రచురించాడు. 5 డిసెంబరు 2014న విశ్వవిద్యాలయాల్లోని ఐన్‌స్టీన్ కు చెందిన 30,000 శాస్త్రీయ పత్రాలను విడుదల చేశాడు. చాలా రంగాల్లో అతను చేసిన కృషికి తెలివితేటలకు అతను పేరు మారుపేరుగా మారింది.

జీవిత సంగ్రహం

తొలినాళ్ళ జీవితం, చదువు

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1879 మార్చి 14న జర్మనీ దేశంలోని వుర్టెంబర్గ్ రాజ్యంలోని ఉల్మ్ లో జన్మించారు. అతను తండ్రి హెర్మన్ ఐన్‌స్టీన్ సేల్స్ మేన్, ఇంజినీర్ గా పనిచేశారు. 1880లో మునిచ్ కు వారి కుటుంబం మారిపోయింది. అతను తండ్రి, బంధువు జాకబ్ కలసి విద్యుత్తు పరికరాలను తయారు చేసే కంపెనీ స్థాపించారు.

మరణం

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 
ఐన్ స్టీన్ 1933

1955 ఏప్రిల్ 17 న, ఐన్‌స్టీన్ ఉదర బృహద్ధమని సంబంధ అనూరిజం చీలిక వలన అంతర్గత రక్తస్రావం సంభవించింది. ఐన్‌స్టీన్ శస్త్రచికిత్సను తిరస్కరించాడు, "నేను కోరుకున్నప్పుడు నేను వెళ్లాలనుకుంటున్నాను. జీవితాన్ని కృత్రిమంగా పొడిగించడం నాకు ఇష్టం లేదు. నేను నా వాటాను చేసాను; వెళ్ళడానికి సమయం ఆసన్నమైంది." మరుసటి రోజు ఉదయం 76 సంవత్సరాల వయస్సులో ప్రిన్స్టన్ ఆసుపత్రిలో మరణించాడు , చివరి వరకు పని కొనసాగించాడు. శవపరీక్ష సమయంలో, ప్రిన్స్టన్ హాస్పిటల్ పాథాలజిస్ట్, థామస్ స్టోల్ట్జ్ హార్వే, ఐన్‌స్టీన్ మెదడును తన కుటుంబం అనుమతి లేకుండా సంరక్షణ కోసం తొలగించాడు, భవిష్యత్ న్యూరోసైన్స్ ఐన్‌స్టీన్ ఇంత తెలివితేటలు గలవాటిని కనుగొనగలదని ఆశతో. ఐన్‌స్టీన్ అవశేషాలు దహనం చేయబడ్డాయి, అతని బూడిదను తెలియని ప్రదేశంలో చెల్లాచెదురుగా ఉంచారు

ఐన్ స్టీన్ జీవిత కాలక్రమం

1879: జర్మనీ దేశంలోని వుర్టెంబర్గ్ రాజ్యంలోని ఉల్మ్ లో జన్మించాడు.

1884–1894: మునిచ్ లోని కాథలిక్ ప్రైమరీ పాఠశాల కు, లుయిట్పోల్డ్ గ్యమ్నసిం పాఠశాలలో చదువుకున్నాడు.

1894–1895: ఇటలీలోని పవియాకు వెళ్ళాడు.

1895–1896: సిట్జర్ ల్యాండ్ లోని ఆరయులో మిట్టెల్ స్కులే పాఠశాలలో మాధ్యమిక విద్య అభ్యసించాడు.

1896: వుర్టెంబర్గ్ పౌరసత్వం వదులుకున్నాడు.

1896–1900: జురిచ్ లో పాలిటెక్నిక్ చదువుకున్నాడు.

1901: స్విస్ పౌరసత్వం లభించింది.

1902–1909: స్విట్జర్ ల్యాండ్ లోని బెర్నెలో స్విస్ పేటెంట్ కార్యాలయంలో పనిచేశాడు.

1902: ఇటలీలోని మిలాన్ లో అతను తండ్రి హెర్మన్ ఐన్ స్టీన్ మరణం.

1903: మిలెవా మారిక్ ను పెళ్ళి చేసుకున్నాడు.

1905: నాలుగు శాస్త్రీయ పత్రాలను ప్రచురించాడు.

1905: స్విట్జర్ ల్యాండ్ లోని జురిచ్ విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి అందుకున్నాడు.

1907–1916: సాధారణ సాపేక్షిత సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు.

1908–1909: బెర్న్ విశ్వవిద్యాలయంలో లెక్చెరర్ గా పనిచేశాడు.

1909–1911: జురిచ్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేశాడు.

1911–1912: ప్రేగ్యులోని చార్లెస్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేశాడు.

1912–1914: ఎథ్ జురిచ్ లో ప్రొఫెసర్ గా పనిచేశాడు.

1914: బెర్లిన్ కు తన కుటుంబంతో సహా వెళ్ళిపోయారు ఐన్ స్టీన్. కొన్ని నెలల తరువాత వారి ఇద్దరు కుమారులను తీసుకుని అతను భార్య మిలెవా మరిక్ అతను వదిలి తిరిగి జురిచ్ కు వెళ్ళిపోయారు (అప్పటికి వారి ఇద్దరు కుమారులు 4, 10 ఏళ్ళ వారు).

1914: స్విస్ పౌరసత్వంతో పాటు, జర్మన్ పౌరసత్వం కూడా అతనుకు లభించింది.

1914–1933: ప్రషియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో సభ్యుడయ్యాడు.

1914–1932: బెర్లిన్ లోని కైసెర్ విల్హెల్మ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజిక్స్ కు అధ్యక్షునిగా అయ్యారు.

1914–1917: హంబొల్డ్ యూనివర్శిటీ ఆఫ్ బెర్లిన్ లో ప్రొఫెసర్ గా పనిచేశాడు.

1916–1918: జర్మన్ ఫిజికల్ సొసైటీకి అధ్యక్షునిగా వ్యవహిరించాడు.

1919: మిలెవా మారిక్ కు విడాకులు ఇచ్చిన ఐన్ స్టీన్, తన కజిన్ ఎల్సా లోవెంథాల్ ను వివాహం చేసుకున్నాడు.

1920: బెర్లిన్ లోని ఐన్ స్టీన్ గృహంలో అతను తల్లి పౌలిన్ మరణించింది.

1921: భౌతికశాస్త్రంలో అతను చేసిన కృషికి నోబెల్ బహుమతి అందుకున్నాడు.

1933: జర్మన్ పౌరసత్వం వదులుకుని అమెరికా వలస వెళ్ళిపోయాడు.

1933–1955: అమెరికాలోని న్యూజెర్సీ, ప్రిన్స్ టౌన్ లో ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్వాన్సెడ్ స్టడీలో ప్రొఫెసర్ గా పనిచేశాడు.

1936: అతను రెండో భార్య ఎల్సా మరణించింది.

1940: స్విస్ పౌరసత్వంతో పాటు అమెరికా పౌరసత్వం కూడా లభించింది.

1951: ప్రిన్స్ టౌన్ లోని అతను సోదరి మజా ఇంటిలో ఐన్ స్టీన్ మరణించాడు

1951: ప్రిన్స్ టౌన్ లో ఐన్ స్టీన్ మరణించాడు.

జీవిత విశేషాలు

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జర్మనీలోని విట్టెన్‌బర్గ్‌లో ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తండ్రి ఇంజనీర్. తల్లి పౌలిన్ ఐన్‌స్టీన్. ఐన్‌స్టీన్‌కు మొదట్లో మాట్లాడటం కష్టంగా ఉండేది. అతను చదువులో అంతగా రాణించలేకపోయేవాడు. ఐన్స్టీన్ మాతృభాష జర్మన్ తరువాత అతను ఇటాలియన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు.

1880లో, అతని కుటుంబం మ్యూనిచ్‌కు తరలివెళ్లింది, అక్కడ అతని తండ్రి మామ కలిసి "ఎలెక్ట్రోటెక్నిస్చే ఫ్యాబ్రిక్ J. ఐన్‌స్టీన్ & సీ" అనే కంపెనీని ప్రారంభించారు, ఈ కంపెనీ విద్యుత్ పరికరాలను తయారు చేస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కుటుంబం యూదు మత సంప్రదాయాలను పాటించలేదు. తల్లి ఒత్తిడితో పియానో వాయించడం నేర్చుకున్నాడు. ఆల్బర్ట్ ఐన్స్టీ

1894లో, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తండ్రి కంపెనీ మ్యూనిచ్ నగరానికి విద్యుత్ దీపాలను సరఫరా చేయలేకపోయింది. ఫలితంగా నష్టాల కారణంగా తన కంపెనీని అమ్ముకోవాల్సి వచ్చింది. వ్యాపారం కోసం, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కుటుంబం ఇటలీకి తరలివెళ్లారు, అక్కడ వారు మొదట మిలన్‌లో స్థిరపడ్డారు కొన్ని నెలల తర్వాత పావియా నగరంలో స్థిరపడ్డారు. కుటుంబం పావియాకు మారిన మారినా ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తల్లితండ్రుల వెంట వెళ్లలేదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇటలీలో ఉన్న సమయంలో "యాన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది మాగ్నెటిక్ ఫీల్డ్" అనే శీర్షికతో ఒక చిన్న వ్యాసం రాశాడు.

1895లో, 16 సంవత్సరాల వయస్సులో, ఐన్‌స్టీన్ జ్యూరిచ్‌లోని స్విస్ ఫెడరల్ పాలిటెక్నిక్ స్కూల్లో జరిగిన ప్రవేశ పరీక్షకు హాజరయ్యాడు. అతను పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. కానీ అతను భౌతిక శాస్త్రం గణితంలో మంచి మార్కులు సాధించాడు. ఉపాధ్యాయుల సలహా మేరకు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన మాధ్యమిక పాఠశాల విద్యను పూర్తి చేయడానికి 1895 1896లో స్విట్జర్లాండ్‌లోని ఆరౌలో ఉన్న అర్గోవియన్ కాంటోనల్ స్కూల్ (వ్యాయామశాల)లో చదివాడు.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జీవిత సంగ్రహంఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మరణంఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఐన్ స్టీన్ జీవిత కాలక్రమంఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జీవిత విశేషాలుఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మూలాలుఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వెలుపలి లంకెలుఆల్బర్ట్ ఐన్‌స్టీన్1879ఏప్రిల్ 18జర్మనీమార్చి 14

🔥 Trending searches on Wiki తెలుగు:

బిరుదురాజు రామరాజుకాటసాని రామిరెడ్డిసివిల్ సర్వీస్సూరిగాడుమాధవీ లతప్రియురాలు పిలిచిందియన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాసెక్స్ (అయోమయ నివృత్తి)తెలంగాణ జిల్లాల జాబితాకులంసికింద్రాబాద్రోజా సెల్వమణిఅంటరాని వసంతంఆటవెలదిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంనవధాన్యాలుఉపాధ్యాయుడుఆవునానార్థాలుబుజ్జిగాడుగైనకాలజీవ్యాసం (సాహిత్య ప్రక్రియ)చోళ సామ్రాజ్యంఏడు చేపల కథఘట్టమనేని మహేశ్ ‌బాబుచార్లీ చాప్లిన్నీతి ఆయోగ్ఎక్కిరాల వేదవ్యాసఅంజలి (నటి)పార్లమెంటు సభ్యుడుకల్వకుంట్ల చంద్రశేఖరరావులోక్‌సభ నియోజకవర్గాల జాబితాయుద్ధకాండజ్యోతిషంశని (జ్యోతిషం)2019 భారత సార్వత్రిక ఎన్నికలుజే.సీ. ప్రభాకర రెడ్డికరణంశివపురాణంగ్రీస్యానిమల్ (2023 సినిమా)నారా చంద్రబాబునాయుడుప్రకృతి - వికృతి2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుఏలకులుజాతిరత్నాలు (2021 సినిమా)ఊరు పేరు భైరవకోనజలియన్ వాలాబాగ్ దురంతంశోభన్ బాబుబుర్రకథలోక్‌సభభారతదేశ అత్యున్నత న్యాయస్థానంవిశ్వనాథ సత్యనారాయణఅధిక ఉమ్మనీరుఇంటి పేర్లుఇత్తడిభారతదేశ జిల్లాల జాబితాపటిక బెల్లంవిశాల్ కృష్ణపవన్ కళ్యాణ్ సినిమాలుకృష్ణా నదిభూమివృశ్చిక రాశిషడ్రుచులుపరకాల ప్రభాకర్సౌర కుటుంబంఆంధ్రజ్యోతిబౌద్ధ మతంభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాశుభమస్తు (సినిమా)కరోనా వైరస్ 2019కంచుఇక్ష్వాకు వంశంకలియుగంలలితా సహస్రనామ స్తోత్రంఉపనయనముA🡆 More