కల్లు

కల్లు ఒక ఆల్కహాలు కలిగిన పానీయము.

దీనిని తాటి చెట్టు, ఈత చెట్టు మొదలైన పామే కుటుంబానికి చెందిన అనేక చెట్ల నుండి తీస్తారు. ఇది చిక్కని, తెల్లని ద్రవం. కల్లును ఆఫ్రికా ఖండము, దక్షిణ భారతదేశము, ఫిలిప్పీన్స్ మొదలైన ప్రాంతాలలో వాడతారు. దీని లాంటి మరికొన్ని మత్తు పానీయాలు భంగు, సారాయి. దీనిని వారుణి అని కూడా పిలుస్తారు.

కల్లు
అప్పుడే చెట్టు నుండి దించిన ముంతలో నురుగుకట్టిన కల్లు

ఈత కల్లు

కల్లు 
ఫిలిప్పీన్స్ లో ఒక కల్లు గీత కార్మికుడు

ఈత చెట్లనుండి ఈ కల్లు లభిస్తుంది. ఈత చెట్లకు కల మట్టలలను నాలుగైదు సార్లు చెక్కడం ద్వారా ఆమట్టల నుండి వచ్చే కల్లును కుండలు కట్టి సేకరిస్తారు. మొదటగా లోపలి మట్టను చెక్కి వారం రోజుల పాటు దానిని అలాగే వదిలిపెడతారు. వారం రోజుల అనంతరం మళ్ళీ చెక్కుతారు. అప్పటి నుండి కల్లు కారడం మొదలవుతుంది. మట్టలకు కట్టిన కుండను మూడు రోజుల తరువాత తీస్తారు. అప్పటి ముందు కారిన కల్లు పులిసి తరువాత కారిన కల్లుతో కలసి మరింత నిషానిచ్చేదిగా మారుతుంది.

తాటి కల్లు

కల్లు 
తాటి కల్లు అమ్ముతున్న తాటి కల్లుగీత కార్మికుడు.
కల్లు 
తాటి కల్లు
కల్లు 
తాటి కల్లు పోస్తున్న గౌడ్

తాటి చెట్లనుండి లభించే ఈ కల్లు కూడా దాదాపు ఈతకల్లు మాదిరిగానే లోపలి మట్టలను చెక్కడం ద్వారానే తీస్తారు. కాకుంటే ఈ రోజు కట్టిన కుండ మరుసటి రోజు తీసివేస్తారు. నిలవ కల్లు తాగటం తక్కువ. తాటి చెట్టు నుండి తీయ బడిన వెంటనే వచ్చే కల్లు నిషాలేకుండా సాధారణ లిమ్కా రుచిని కలిగి ఉంటుంది. కొబ్బరి కల్లు కొబ్బరి చెట్లకున్న మువ్వలకు కొస భాగాన్ని కోసి అక్కడ కల్లు కుండను కడతారు: ఈత, తాటి మొదలైన చెట్లకు ఒక కుండనే కడ్తారు. కాని కొబ్బరి చెట్లకు ఎన్ని మువ్వలు వుంటే అన్ని కుండలను కడతారు. ఇది దీని ప్రత్యేకత: ఇది చాల రుచిగాను నిషా తక్కువగను వుంటుంది. తాజా కొబ్బరి కల్లు ఆరోగ్యానికి ఎంతో మేలు. తాజా కొబ్బరి కల్లును నీరా అంటారు. అత్తి కల్లు అత్తి చెట్ల నుండి దీనిని సేకరిస్తారు: విప్ప చెట్టు సమీపంలో ఒక గొయ్యి త్రవ్వి అక్కడ కనిపించిన విప్ప చెట్టు వేరును కొంత మేర కోసి దానికింద ఒక చిన్న కుండను కట్టి పైన మూత పెడతారు. ఆ వేరులో నుండి కారిన రసాన్ని సేకరిస్తారు. ఇది గిరిజనులు ఎక్కువగా తయారు చేస్తారు: ఇది ఆరోగ్యానికి చాల మంచిది.

పౌడర్ కల్లు

ఇది సర్వసాధారణంగా ఈత, తాటి చెట్లు లేని పట్టణ ప్రాంతాలలో తయారు చేస్తారు. ఒకరకమైన పౌడర్ నీటిలో కలిపి తయారు చేసే ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకారి. ఇటువంటి కల్లు పట్టణాల మధ్య ప్రధాన రహదారులలో బాటిళ్ళలో నింపి, బల్లలపై ఉంచి అమ్మడం చూడవచ్చు. File:కల్లు గీత కార్మికుడు/Toddy drawer at Mangal palle village.jpg

జలిగ కల్లు ఇది అడవి ప్రాంతంలో దొరుకుతుంది

వివిధ దేశాలలో కల్లు

ఫిలిప్పీన్స్ లో దీనిని 'టూబా' అని వ్యవహరిస్తారు.

కల్లు 
ఈతచెట్టుకు కట్టిన కల్లు కుండ/నిజామాబాద్ వద్ద తీసిన చిత్రము

పేర్లు

దేశం / ప్రాంతం వాడుక పేరు
కల్లు  Cameroon మింబో
కల్లు  Democratic Republic of the Congo malafu, panam culloo
కల్లు  Gabon toutou
కల్లు  Ghana doka, nsafufuo, palm wine, yabra, akpeteshi
కల్లు  భారతదేశం కల్లు (கள்ளு) (കള്ള്) a, Tamil tadib, toddy
కల్లు  Malaysia కల్లు (கள்ளு), నీర, tuak, toddy
కల్లు  Burma htan yay
కల్లు  Nigeria emu, ogogoro, palm wine, tombo liquor, Nnmaya ngwo
కల్లు  Papua New Guinea segero, tuak
కల్లు  Philippines టూబా, lambanog
కల్లు  దక్షిణ ఆఫ్రికా ubusulu
కల్లు  Sierra Leone poyo
కల్లు  Sri Lanka కల్లు (கள்ளு), రా (රා)

మూలాలు

Tags:

కల్లు ఈత కల్లు తాటి కల్లు పౌడర్ కల్లు వివిధ దేశాలలో కల్లు పేర్లుకల్లు మూలాలుకల్లుఆఫ్రికాఆల్కహాలుఈత చెట్టుతాటి చెట్టుపామేఫిలిప్పీన్స్భారత దేశంవారుణిసారాయి

🔥 Trending searches on Wiki తెలుగు:

సంక్రాంతిసజ్జలువిభక్తిగుడివాడ శాసనసభ నియోజకవర్గంఉండి శాసనసభ నియోజకవర్గంశ్రవణ నక్షత్రముప్రభాస్వడ్డీమహర్షి రాఘవఝాన్సీ లక్ష్మీబాయిశాసనసభవేయి స్తంభాల గుడిపంచారామాలుఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుఎస్. జానకిమాచెర్ల శాసనసభ నియోజకవర్గంఅమ్మల గన్నయమ్మ (పద్యం)గరుత్మంతుడుఅన్నప్రాశనలోక్‌సభశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)రతన్ టాటాశ్యామశాస్త్రినిఖిల్ సిద్ధార్థనరసింహావతారంపాలకొండ శాసనసభ నియోజకవర్గంవాస్తు శాస్త్రంనవగ్రహాలుయేసు శిష్యులుకొల్లేరు సరస్సుఅంగారకుడు20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిగోల్కొండజాతిరత్నాలు (2021 సినిమా)కనకదుర్గ ఆలయంమంజుమ్మెల్ బాయ్స్మహేంద్రసింగ్ ధోనిభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుప్రజా రాజ్యం పార్టీఅంగుళంకన్యారాశిరాప్తాడు శాసనసభ నియోజకవర్గంసిద్ధు జొన్నలగడ్డఉప్పు సత్యాగ్రహంపార్వతిరైతురక్తపోటునువ్వులుతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంవృత్తులుపవన్ కళ్యాణ్టమాటోఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలురైతుబంధు పథకంజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థదేవికహనుమజ్జయంతివిజయశాంతిజిల్లేడుజగ్జీవన్ రాంలలితా సహస్ర నామములు- 1-100కులంచాట్‌జిపిటిబైండ్లరక్త పింజరిఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుతెలుగు సాహిత్యంLవేమన శతకమురామాయణంతిథితాటి ముంజలునానాజాతి సమితిపూజా హెగ్డే🡆 More