కాంగో గణతంత్ర రిపబ్లిక్: ఆఫ్రికాలో ఒక దేశం

కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్కుని సాధారణంగా కాంగో అంటారు.

అనేది దక్షిణ ఆఫ్రికాలో దక్షిణాది దేశం. దీనిని కొన్నిసార్లు 1971 - 1997 మధ్య దాని అధికారిక నామం అయిన పూర్వపు పేరు జైరే అని కూడా అంటారు. డి.ఆర్.సి ఉత్తర సరిహద్దులో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఈశాన్య సరిహద్దులో దక్షిణ సుడాన్, తూర్పు సరిహద్దులో ఉగాండా, రువాండా, బురుండి, టాంజానియా, దక్షిణసరిహద్దులో జాంబియా, నైరుతి సరిహద్దులో అంగోలా, పశ్చిమ సరిహద్దులో రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, అట్లాంటికు మహాసముద్రం ఉన్నాయి. వైశాల్యపరంగా ఇది ఉప-సహారా ఆఫ్రికాలో ఇది అతిపెద్ద దేశంగా ఉంది. ఆఫ్రికా దేశాలలో (అల్జీరియా తర్వాత) రెండవ స్థానంలో, ప్రపంచంలోని 11 వ స్థానంలో ఉంది. 78 million, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో అత్యధిక జనాభా కలిగిన ఫ్రాన్కోఫోన్ దేశం. ఆఫ్రికాలో అధిక జనసాంధ్రత కలిగిన దేశాలలో 4 వ స్థానంలో, ప్రపంచంలో 16 వ స్థానంలో ఉంది.

Democratic Republic of the Congo

République démocratique du Congo  (French)
Repubilika ya Kôngo ya Dimokalasi  (Kongo)
Republíki ya Kongó Demokratíki  (Lingala)
Jamhuri ya Kidemokrasia ya Kongo  (Swahili)
Ditunga dia Kongu wa Mungalaata  (Luba-Katanga)
Flag of కాంగో గణతంత్ర రిపబ్లిక్
జండా
Coat of arms of కాంగో గణతంత్ర రిపబ్లిక్
Coat of arms
నినాదం: "Justice – Paix – Travail" (French)
"Justice – Peace – Work"
గీతం: Debout Congolais  (French)
"Arise, Congolese"
Location of  కాంగో గణతంత్ర రిపబ్లిక్  (dark green)
రాజధానిKinshasa
4°19′S 15°19′E / 4.317°S 15.317°E / -4.317; 15.317
అధికార భాషలుFrench
గుర్తించిన జాతీయ భాషలు
  • Lingala
  • Kikongo
  • Swahili
  • Tshiluba
జాతులు
See Ethnic groups section below
పిలుచువిధంCongolese
ప్రభుత్వంUnitary semi-presidential republic
• President
Félix Thisekedi
• President Elect
Jean-Michel Sama Lukonde
• Prime Minister
Bruno Tshibala
• ఎగువ సభ
Senate
• దిగువ సభ
National Assembly
Formation
• Colonised
17 November 1879
• Congo Free State
1 July 1885
• Belgian Congo
15 November 1908
• Independence from Belgium
30 June 1960
• Admitted to the United Nations
20 September 1960
• Renamed to Democratic Republic of Congo
1 August 1964
• Republic of Zaire
29 October 1971
• Fall of Mobutu
17 May 1997
• Current constitution
18 February 2006
విస్తీర్ణం
• మొత్తం
2,345,409 km2 (905,567 sq mi) (11th)
• నీరు (%)
3.32
జనాభా
• 2016 estimate
78,736,153 (16th)
• జనసాంద్రత
34.83/km2 (90.2/sq mi)
GDP (PPP)2017 estimate
• Total
$67.988 billion
• Per capita
$785
GDP (nominal)2017 estimate
• Total
$40.415 billion
• Per capita
$446
జినీ (2006)Negative increase 44.4
medium
హెచ్‌డిఐ (2018)Increase 0.470
low · 176th
ద్రవ్యంCongolese franc (CDF)
కాల విభాగంUTC+1 to +2 (WAT and CAT)
వాహనాలు నడుపు వైపుright
ఫోన్ కోడ్+243
ISO 3166 codeCD
Internet TLD.cd

కాంగో బేసిన్లో కేంద్రీకృతమై డి.ఆర్.సి భూభాగంలో 90,000 సంవత్సరాల క్రితం సుమారు సెంట్రల్ ఆఫ్రికన్ దోపిడీదారుల చేత మొట్టమొదటిదిగా నివాసితప్రాంతంగా మారింది. 3,000 సంవత్సరాల క్రితం బంటు విస్తరణలో భాగంగా ఈ ప్రాంతానికి బంటు ప్రజలు వచ్చి చేరారు. పశ్చిమప్రాంతంలో కాంగో రాజ్యం 14 - 19 వ శతాబ్దాల్లో కాంగో నదీ ముఖద్వారం చుట్టూ పాలించింది. 16 వ , 17 వ శతాబ్దాల నుండి 19 వ శతాబ్దం వరకు మధ్య, తూర్పు ప్రాంతాలలో లూబా, లుండా రాజ్యాలు పాలించాయి. 1870 వ దశాబ్ధంలో ఆఫ్రికా పెనుగులాట ప్రారంభించే ముందు కాంగో ముఖద్వారంలో యూరోపియన్ అన్వేషణ మొదలైంది. బెల్జియం రాజు రెండవ లియోపోల్డు నిధి సహాయంతో హెన్రీ మోర్టన్ స్టాన్లీ నేతృత్వంలో మొదటి అన్వేషణ జరిగింది. 1885 లో బెర్లిను కాన్ఫరెన్సులో కాంగో భూభాగంపై లియోపోల్డు అధికారికంగా హక్కులను సొంతం చేసుకుని తన వ్యక్తిగత ఆస్తిగా చేసుకుని ఈ ప్రాంతానికి కాంగో ఫ్రీ స్టేట్ అని పేరు పెట్టారు. ఫ్రీ స్టేట్ సమయంలో వలస సైనిక విభాగం " ఫోర్స్ పబ్లికు " స్థానిక ప్రజలతో రబ్బరును ఉత్పత్తి చేయించింది. 1885 నుండి 1908 వరకు కాంగో ప్రజలు మిలియన్లసంఖ్యలో వ్యాధులు, బలవంతపు శ్రమదోపిడీ ఫలితంగా మరణించారు. 1908 లో బెల్జియం ప్రారంభ విముఖత ఉన్నప్పటికీ అధికారికంగా ఫ్రీ స్టేటును స్వాధీనం చేసుకుని దీనిని బెల్జియన్ కాంగోగా మార్చింది.

1960 జూన్ 30 లో కాంగో రిపబ్లిక్ పేరుతో బెల్జియన్ కాంగో స్వాతంత్ర్యం పొందింది. కాంగో జాతీయవాద ప్యాట్రిస్ లుమెంబా మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు. జోసెఫ్ కసా-వుబు మొదటి అధ్యక్షుడు అయ్యారు. భూభాగ పరిపాలనపై సంఘర్షణ చెలరేగింది. ఇది కాంగో సంక్షోభం అని పిలువబడింది. మోయిస్సోషోబ్, సౌత్ కసాయి నేతృత్వంలోని కటాంగా ప్రాంతాలు విడిపోవడానికి ప్రయత్నించాయి. సంక్షోభంలో సహాయం కోసం లుమెంబా సోవియట్ యూనియనుకు మారిన తరువాత యు.ఎస్ బెల్జియస్ జాగరూకతతో సెప్టెంబరున 5 కాసా - వుబు ద్వారా తొలగించి 1961 జనవరి 17 న బెల్జియన్ నేతృత్వంలోని కటాన్గీస్ దళాల సాయంతో లుమెంబాకు మరణశిక్ష అమలైంది. 1965 నవంబరు 25 న ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జోసెఫ్-డెసిరె మోబుటు (తర్వాత అతను స్వయంగా మొబూటు సేస్ సేకో పేరు మార్చారు) తిరుగుబాటు ద్వారా అధికారికంగా పదవీబాధ్యతలు చేపట్టాడు. 1971 లో అతను దేశం పేరును జైరేగా మార్చాడు. ప్రజా ఉద్యమం విప్లవంతో చట్టబద్ధమైన ఏకైక పార్టీ దేశంలో నియంతృత్వ పాలన కొనసాగింది. కమ్యూనిస్ట్ వ్యతిరేక వైఖరి కారణంగా మోబుటు ప్రభుత్వం ప్రచ్చన్న యుద్ధంలో యునైటెడ్ స్టేట్స్ నుండి గణనీయమైన మద్దతు పొందింది. 1990 ల ప్రారంభంలో మొబూటు ప్రభుత్వం బలహీనపడటం ప్రారంభించింది. తూర్పు ప్రాంతంలో అస్థిరత కారణంగా 1964 లో రువాండన్ జాతి నిర్మూలన హత్యలు సంభవించాయి. 1996 రువాండా పాట్రియాటిక్ నేతృత్వంలో బాన్మములేగే (కాంగోలస్ టుట్సి) ప్రజలు ముట్టడి చేయడానికి ఈ పరిస్థితులు దారి తీసాయి. మొదటి కాంగో యుద్ధాన్ని ప్రారంభంగా భావించబడింది. 1997 మే 17 న మొబూటు మొరాకోకు పారిపోయాడు. దేశం పేరును " డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో" గా మార్చిన తరువాత దక్షిణ కివూ ప్రావిన్సుకు చెందిన టుట్సీ దళాల నాయకుడైన లారెంట్-డిసిర కాబిలా అధ్యక్షుడయ్యాడు. అధ్యక్షుడు కబిలా, రువాండా, దేశంలోని టుట్సీల మధ్య ఉద్రిక్తతల కారణంగా 1998 నుండి 2003 వరకు రెండో కాంగో యుద్ధం జరగడానికి దారితీశాయి. అంతిమంగా తొమ్మిది ఆఫ్రికన్ దేశాలు, ఇరవై సాయుధ సమూహాలు యుద్ధంలో పాల్గొన్నాయి. దీని ఫలితంగా 54 లక్షల మంది ప్రజలు మరణించారు. ఈ రెండు యుద్ధాలు దేశాన్ని నాశనం చేసాయి. 2001 జనవరి 16 న అధ్యక్షుడు లారెంట్-డిసిరబుల్ కాబిలాను అతని అంగరక్షకులలో ఒకరు హతమార్చాడు. ఎనిమిది రోజుల తరువాత అతని కుమారుడు జోసెఫ్ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.

కాంగో డెమొక్రాటిక్ రిపబ్లికులో సుసంపన్నమైన సహజ వనరులు ఉన్నప్పటికీ రాజకీయ అస్థిరత, మౌలికవసతులు లేకపోవటం, అవినీతి వంటి సమస్యలు ఉన్నాయి. శతాబ్ధాలుగా వాణిజ్యపరంగా, కాలనియల్ అత్యుపయోగం, దోపిడీ కారణంగా కొద్దిపాటి అభివృద్ధి మాత్రమే సాధ్యం అయింది. రాజధాని కిన్షాసాతో పాటు, రెండు అతిపెద్ద నగరాలు లుబంబషి, మొబిజి-మాయిలు రెండు మైనింగ్ కమ్యూనిటీలుగా ఉన్నాయి. 2012 లో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అతిపెద్ద ఎగుమతి అయిన ఖనిజాలలో 50% చైనా దిగుమతి చేసుకుంటున్నది. 2016 లో DR డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మానవాభివృద్ధి స్థాయి 187 దేశాలలో 176 వ స్థానాన్ని పొందింది. As of 2018 2018 నాటికి దాదాపు 6,00,000 కాంగోలు డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో పొరుగున మధ్య, తూర్పున ఉన్న దేశాలకు పారిపోయారు. ఫలితంగా రెండు మిలియన్ల మంది పిల్లలు ఆకలితో బాధపడ్డారు. యుద్ధంలో 4.5 మిలియన్ల మంది పౌరులు నివాసాల నుండి తరలించబడ్డారు. సార్వభౌమ రాజ్యంగా ఇది ఐక్యరాజ్యసమితి, నాన్-అలైన్మెంటు మూవ్మెంటు, ఆఫ్రికన్ యూనియన్ , కొమేసాలో సభ్యదేశంగా ఉంది.

పేరు వెనుక చరిత్ర

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోకు కాంగో రివర్ పేరు పెట్టబడింది. ఇది దేశంలో మొత్తంలో ప్రవహిస్తుంది. కాంగో నది ప్రపంచం లోతైన నది. జలసమృద్ధిలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద నది. 1876 లో బెల్జియం రాజు లియోపోల్డు కమిటే డి'ఎటుడ్స్ డు హూట్ కాంగో ( "కమిటీ అప్పర్ కాంగో స్టడీ"), కాంగో ఇంటర్నేషనల్ అసోసియేషన్ 1879 లో ఏర్పాటు చేసాడు. ఈ పేర్లు కూడా నది కారణంగా పెట్టడం జరిగింది.

16 వ శతాబ్దంలో ఇక్కడకు చేరుకున్న ఐరోపియను నావికులు కాంగో రాజ్యం, రాజ్యంలో నివసిస్తున్న బంటు నివాసితులు, కాంగో ప్రజలను ముఖాముఖిగా కలుసుకున్న తరువాత కాంగోరాజ్యంలో ప్రవహిస్తున్న కారణంగా ఈ నదిని కాంగో అని ప్రారంభ పేర్కొన్నారు. కోంగో అనే పదం కోంగో భాష నుండి వచ్చింది (దీనిని కికోంగో అని కూడా పిలుస్తారు). అమెరికన్ రచయిత శామ్యూల్ హెన్రీ నెల్సన్ అభిప్రాయంలో ఆధునిక నామం 'కోంగో ప్రజలు ", బకాంగో కూడా పరిచయం చేయబడ్డాయి.

కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ గతంలో కాంగో ఫ్రీ స్టేట్, బెల్జియన్ కాంగో, రిపబ్లిక్ ఆఫ్ లియోపొల్డివిల్లె, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రిపబ్లిక్ ఆఫ్ జైరే పిలువబడింది.

స్వాతంత్ర సమయములో దాని పొరుగు దేశం అయిన రిపబ్లిక్ ఆఫ్ కాంగో బ్రజ్జావిల్లే నుండి ప్రత్యేకించాలని దేశానికి కాంగో రిపబ్లిక్ ఆఫ్ కాంగో-లియోపొవిల్లె అని నామకరణం చేయబడింది. వేరుచేయటానికి కాంగో-లెయోపోల్విల్లె రిపబ్లిక్ పేరు పెట్టబడింది. 1964 ఆగస్టు 1 న రాజ్యాంగం శాసన ప్రకటనతో దేశం పేరు డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోగా మారింది. కానీ 1971 అక్టోబరు 27 న అధ్యక్షుడు మొబుటూ సెసె దేశం పేరును సెకొ జైర్ (కాంగో నది పూర్వపు పేరు) మార్చాడు.

జైర్ అనే పదానికి కికోంగో పదం న్జెరె ("నది")అనే పోర్చుగీసు పదం మూలంగా ఉంది. 16 - 17 వ శతాబ్దాలలో ఈ నదిని జైర్ అని పిలిచేవారు. 18 వ శతాబ్దంలో క్రమంగా ఆంగ్ల వాడకంలో జైర్ స్థానంలో కాంగో పేరు వచ్చింది. 19 వ శతాబ్దపు సాహిత్యంలో ప్రాధాన్యం స్థానికులు జైరే (అంటే పోర్చుగీసు పదం నుండి తీసుకోబడింది) ఉపయోగించబడింది.

1992 లో సావరిన్ నేషనల్ కాన్ఫరెన్సు దేశం పేరు "కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్" కు మార్చడానికి ఓటు వేసింది. కానీ మార్పు చేయలేదు. 1997 లో మోబుటు పతనమైన తరువాత దేశం పేరును ప్రెసిడెంట్ లారెంట్-డెసిర కాబిల పునరుద్ధరించబడింది.

చరిత్ర

ఆరంభకాల చరిత్ర

డి.ఆర్.సి అని పిలవబడే ప్రాంతంలో 90,000 సంవత్సరాల క్రితం మానవనివాసాలు ప్రారంభమయ్యాయి. 1988 నాటి కందాండాలోని సేమ్లికి హార్పూను పరిశోధనలో అతి పురాతన ఈటె ఒకటి కనుగొనబడింది.ఇది జెయింటు నదిలో కేట్ ఫిషును పట్టడానికి ఉపయోగించబడిందని భావించబడుతుంది.

క్రీ.పూ. మొదటి సహస్రాబ్ది కాలంలో బంటు ప్రజలు ఒక సమయంలో మద్య ఆఫ్రికాకు చేరుకున్నారు. తరువాత క్రమంగా దక్షిణంవైపు విస్తరణ ప్రారంభించారు. మతంవిధానాలు, ఇనుప యుగం పద్ధతులను స్వీకరించడం ద్వారా వారి వ్యాప్తి వేగవంతమైంది. దక్షిణ, నైరుతి ప్రాంతాలలో నివసించే సకాలీన బృందాలకు చెందిన ప్రజలు లోహాల సాంకేతికతను తక్కువగా వినియోగించారు. ఈ సమయంలో లోహపు ఉపకరణాల ఉపయోగం అభివృద్ధి వ్యవసాయం, జంతువుల పెంపకంలో విప్లవం సృష్టించింది. ఇది తూర్పు, ఆగ్నేయంలో వేట-సేకరణ సమూహాల స్థానభ్రంశ చెందడానికి దారితీసింది. బాంటూ విస్తరణ తుది అల 10 వ శతాబ్దం నాటికి పూర్తి అయింది. తరువాత బాంటూ రాజ్యాలు స్థాపించబడ్డాయి. దీని పెరుగుతున్న జనాభా త్వరలోనే క్లిష్టమైన ప్రాంతీయ, విదేశీ వాణిజ్య సంబంధాలను సాధించి బానిసలు, ఉప్పు, ఇనుము, రాగిలలో వర్తకం అభివృద్ధి చేయడానికి దారితీసింది.

కాంగో ఫ్రీ స్టేటు (1877–1908)

దస్త్రం:Dhanis Expedition.JPG
A contemporary depiction of a Belgian expedition during the Congo Arab war
కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
View of Leopoldville Station and Port in 1884

1870 నుండి 1920 వరకు బెల్జియన్ అన్వేషణ పరిపాలన జరిగింది. మొదటి సారిగా అన్వేషణ సర్ హెన్రీ మోర్టాన్ స్టాన్లీ నేతృత్వంలో జరిగింది. ఆయన బెల్జియంలో కింగ్ రెండవ లియోపోల్డు నిధిసహాయంతో తన అన్వేషణలను చేపట్టాడు. ఖండాంతర కాంగో తూర్పు ప్రాంతాలలో వలసపాలనకు ముందు నిరంతరంగా సాగిన బానిసల తరలింపుతో వారి జీవనసరళిలో ఆటంకాలను ఎదుర్కొన్నది. వారికి స్టాన్లీతో చక్కటి సంబంధబాంధవ్యాలు ఏర్పడ్డాయి.

లియోపోల్డు కాంగో ఒక కాలనీగా అవతరించడానికి అనుకూలంగా రూపకల్పన చేసాడు. చర్చల వరుసక్రమంలో లియోపోల్డ్, ఫ్రంట్ ఆర్గనైజేషను, అసోసియేషను ఇంటర్నేషనల్ ఆఫ్రికాన్ చైర్మన్గా మానవతావాద లక్ష్యాలను ప్రకటించాడు. వాస్తవానికి ఒక యూరోపియన్ ప్రత్యర్ధి మరొకరికి వ్యతిరేకంగా వ్యూహరచన చేసారు.[ఆధారం చూపాలి]

1885 లో బెర్లిన్ సదస్సులో లియోపోల్డు కాంగో భూభాగంపై అధికారికంగా హక్కులను సొంతం చేసుకుని దానిని తన వ్యక్తిగత ఆస్తిని మార్చి దీనిని కాంగో ఫ్రీ స్టేటుగా పేర్కొన్నాడు. లియోపోల్డు పాలన మొదలు పెట్టి లియోపోల్డ్విల్లే (ఇప్పుడు కిన్షాసా) రాజధాని నుండి సముద్రతీరం వరకు మటాడి కింషసా రైలు మార్గం నిర్మించడం వంటి అనేక మౌలిక సదుపాయాల నిర్మాణాల పనులను ప్రారంభించాడు. ఇది ఎనిమిది సంవత్సరాల కాలంలో పూర్తి అయింది. దాదాపు అన్ని ఇటువంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు లియోపోల్డు, అతని సహచరులు కాలనీ నుంచి సేకరించే ఆస్తులను సులభంగా అభివృద్ధి చేయడానికి దృష్టి కేంద్రీకరించారు.

ఫ్రీ స్టేటులో వలసవాదులు స్థానిక జనాభాను రబ్బరును ఉత్పత్తిలో బలవంతంగా ఉపయోగించారు. క్రమంగా ఆటోమొబైల్సు, రబ్బరు టైర్ల అభివృద్ధి విస్తరణ అంతర్జాతీయ మార్కట్టును సృష్టించింది. రబ్బరు అమ్మకాలు లియోపోల్డుకు సంపదను తెచ్చిపెట్టాయి. ఆయన బ్రస్సెల్సు, ఓస్టెండులో అనేక భవనాలను నిర్మించాడు. ఆయన తనను, దేశాన్ని గౌరవించాడు. రబ్బరు కోటాలను అమలు చేయడానికి సైన్యం, బలవంతపు శ్రామికశక్తి కొరకు పిలుపునిచ్చాడు. అవయవాలను కత్తిరించే విధానం ప్రారంభించాడు.

1885-1908 కాలంలో దోపిడీ, వ్యాధి పర్యవసానంగా మిలియన్ల కొలది కాంగోలియన్లు మరణించారు. కొన్ని ప్రాంతాలలో జనాభా నాటకీయంగా క్షీణించింది - నిద్ర వ్యాధి, మశూచి కారణంగా కొంగో నది దిగువ ప్రాంతాలలోని జనాభాలో దాదాపు సగం మంది మరణించారు.

దుర్వినియోగ ఆరోపణలు మొదలయ్యాయి. 1904 లో కాంగోలోని బోమాలో ఉన్న బ్రిటీషు కాన్సలు రోజరు కేసమెంటును దర్యాప్తు చేయాలని బ్రిటీషు ప్రభుత్వం సూచించింది. కేస్మేంటు రిపోర్టు అని పిలిచే అతని నివేదిక మానవతావాద దుర్వినియోగాల ఆరోపణలను నిర్ధారించింది. బెల్జియం పార్లమెంటు ఒక స్వతంత్ర కమిషను విచారణను ఏర్పాటు చేయాలని రెండవ లియోపోల్డును వత్తిడి చేసింది. విచారణ ఫలితాల ప్రకారం ఈ సమయంలో కంగాన్ జనాభా "సగం కన్నా తక్కువగా ఉంది" అని ముగించారు. ఖచ్చితమైన రికార్డులు లేనందున ఎంతమంది మరణించారో ఖచ్చితంగా నిర్ణయించడం అసాధ్యం.

బెల్జియన్ కాంగో (1908–60)

1908 లో బెల్జియం పార్లమెంటు ప్రారంభలో విముఖత చూపినప్పటికీ అంతర్జాతీయ ఒత్తిడికి (ముఖ్యంగా యునైటెడ్ కింగ్డం నుండి) తలవంచి కింగ్ రెండవ లియోపోల్డు నుండి ఫ్రీ స్టేట్ను స్వాధీనం చేసుకుంది.

1908 అక్టోబర్ 18 న బెల్జియన్ పార్లమెంటు కాంగోను ఒక బెల్జియన్ కాలనీగా అనుసంధానించటానికి అనుకూలంగా ఓటు వేసింది. బెల్జియన్ మంత్రివర్గ వ్యవహారాల శాఖకు కార్యనిర్వాహక అధికారం మారింది. ఇది కలోనియల్ కౌన్సిలు (కౌన్సిల్ కలోనియల్) (బ్రస్సెల్సులో ఉంది) సహాయంతో పనిచేసింది. బెల్జియన్ పార్లమెంట్ బెల్జియన్ కాంగోపై శాసన అధికారాన్ని అమలు చేసింది. 1926 లో కొలంబియా రాజధాని బోమా నుండి లెయోపోల్విల్లేకు మారిపోయింది. అంతర్గత భూభాగంలోకి దాదాపు 300 కిలోమీటర్ల (190 మైళ్ళు) విస్తరణ జరిగింది.

కాంగో ఫ్రీ స్టేట్ నుండి బెల్జియన్ కాంగోకు పరివర్తన తరువాత అది పెద్ద డిగ్రీని కొనసాగించింది. కాంగో ఫ్రీ స్టేటు చివరి గవర్నరు-జనరలు బారన్ థీయోఫైల్ వాహిస్, బెల్జియన్ కాంగోలో, రెండవ లియోపోల్డు పరిపాలన కొనసాగారు. కాంగో దాని సహజ వనరులు, ఖనిజ సంపదలను బెల్జియన్ ఆర్ధికవ్యవస్థ నిర్వహణలోనే ఉంది. ఇది వలసల విస్తరణకు ప్రధాన ఉద్దేశంగా మిగిలిపోయింది - అయితే, ఆరోగ్యరక్షణ, ప్రాథమిక విద్య వంటి ఇతర ప్రాధాన్యతలకు నెమ్మదిగా ప్రాముఖ్యత అధికరించింది.

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Force Publique soldiers in the Belgian Congo in 1918. At its peak, the Force Publique had around 19,000 African soldiers, led by 420 white officers.

1918 లో బెల్జియం కాంగోలో పబ్లికు సైనికులను బలవంతం చేసాడు. ఫోర్సు పబ్లికు సుమారు 4,000 మంది వైట్ ఆఫీసర్లు నేతృత్వంలో 19,000 ఆఫ్రికన్ సైనికులు ఉన్నారు]]

వలసపాలకుల పాలన భూభాగాన్ని కొనసాగింది. తరువాత ఒక ద్వంద్వ న్యాయ వ్యవస్థ ఉనికిలో ఉంది (ఐరోపా న్యాయస్థానాల వ్యవస్థ, దేశీయ కోర్టుల్లో మరొకటి, ట్రిబునాక్స్ ఇండిజీన్స్). స్వదేశీ న్యాయస్థానాలు పరిమిత అధికారాలు మాత్రమే కలిగి ఉన్నాయి. మిగిలిన అధికారం కాలనీల పరిపాలన సంస్థ నియంత్రణలో ఉన్నాయి. 1936 లో 728 బెల్జియన్ పాలనా యంత్రాంగం కాలనీ పాలన నిర్వహించిందని రికార్డులు తెలియజేస్తున్నాయి. బెల్జియన్ అధికారులు కాంగోలో ఎటువంటి రాజకీయ కార్యకలాపాలను అనుమతించలేదు. బెల్జియన్ ఆధ్వర్యంలోని స్థానిక సైన్యానంలో నియమించిన ఫోర్స్ పబ్లిక్ ఎటువంటి తిరుగుబాటు ప్రయత్నాలను కొనసాగనివ్వడం లేదు.

1910 లో కాలనీ బెల్జియన్ జనాభా 1,928 నుండి 1959 లో దాదాపు 89,000 కు పెరిగింది.[ఆధారం చూపాలి]

బెల్జియన్ కాంగో నేరుగా రెండు ప్రపంచ యుద్ధాల్లో పాల్గొంది. 1916 , 1917 లలో తూర్పు ఆఫ్రికను సంఘర్షణలో జర్మనీ తూర్పు ఆఫ్రికాలోని జర్మనీ కాలనీ సైన్యం (టాంకన్యిక), ఫోర్స్ పబ్లిక్యూ మద్య జర్మనీ వలసరాజ్యాల సైన్యం మధ్య మొదలైన యుద్ధం ఉమ్మడి ఆంగ్లో - బెల్జియను జరినీ కాలనియల్ భూభాగం మీద చేసిన దాడిగా మారింది. జనరల్ చార్లెస్ టాంబేరు ఆధ్వర్యంలో సెప్టెంబరు 1916 సెప్టెంబరులో టొబాసాలో ప్రవేశించడంతో ఫోర్స్ పబ్లికే ఒక ముఖ్యమైన విజయాన్ని సాధించింది.

1918 తరువాత తూర్పు ఆఫ్రికా పోరాటంలో పాల్గొన్నందుకు ఫోర్సు పబ్లిక్కుకు బెల్జియం ఇచ్చిన బహుమతిగా ఇంతకుముందు జర్మని కాలనీ రువాండా-ఉరుండి మీద లీగ్ ఆఫ్ నేషన్స్ ఆదేశాలతో ఈస్ట్ ఆఫ్రికా పోరాటం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బెల్జియం కాంగో లండనున్లోని బెల్జియన్ ప్రభుత్వ-బహిష్కరణకు కీలకమైన ఆదాయ వనరులను అందించింది. ఫోర్స్ పబ్లిక్ మళ్లీ ఆఫ్రికాలో మిత్రరాజ్యాల పోరాటంలో పాల్గొంది. బెల్జియన్ అధికారుల ఆధ్వర్యంలో బెల్జియన్ కాంగో దళాలు ప్రత్యేకంగా రెండో తూర్పు ఆఫ్రికన్ పోరాటసమయంలో మేజర్-జనరల్ అగస్టే-ఎడార్డ్ గిల్లియాట్, సాయో నేతృత్వంలోని అస్సోసాలో (ఇథియోపియాలోని) ఇటాలియన్ వలస సైన్యంపై పోరాడారు.

స్వతంత్రం , రాజకీయ సంక్షోభం (1960–65)

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
The leader of ABAKO, Joseph Kasa-Vubu, first democratically elected President of the Republic of the Congo (Léopoldville)
కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Patrice Lumumba, first democratically elected Prime Minister of the Republic of the Congo (Léopoldville), was murdered by Belgian-supported Katangan separatists in 1961

1960 మే నుండి జాతీయవాద ఉద్యమం అధికరించింది. పట్రిస్ లుమెంబా నాయకత్వంలో మౌవ్మెంట్ నేషనల్ కాంగోలాయిస్ (MNC), పార్లమెంటరీ ఎన్నికలలో విజయం సాధించింది. పాట్రిస్ లుముంబా కాంగో ప్రజాస్వామ్య రిపబ్లిక్కు మొదటి ప్రధాన మంత్రి అయ్యారు. అలయన్స్ డెస్ బొక్కోగా పార్టీ అధ్యక్షుడు జోసెఫ్ కసవుబుగా ఎన్నికయ్యాడు. ఆంటోనీ గిజ్గెం నాయకత్వంలోని పార్టి సాలిడాయిర్ ఆఫ్రికన్ ఆల్బర్టు డెలావాక్సు, లారెంటు మొర్బికో నేతృత్వంలో పార్టి నేషనల్ డ్యూ పీపుల్ సహా ఇతర పార్టీలు కూడా ఉన్నాయి.

1960 జూన్ 30 న బెల్జియన్ కాంగో స్వాతంత్రాన్ని "రిపబ్లిక్యూ డు కాంగో" ("కాంగో రిపబ్లిక్" లేదా "రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో" పేరుతో ఆంగ్లంలో) స్వాతంత్ర్యం పొందింది. మధ్యప్రాచ్య కాంగో (ప్రధాన కాంగో) పొరుగు ఫ్రెంచ్ కాలనీ నుండి స్వాతంత్ర్యం సాధించిన తరువాత "కాంగో రిపబ్లిక్" అనే పేరును ఎంచుకుంది. ఈ రెండు దేశాలు సాధారణంగా "కాంగో-లెయోపోల్విల్లే", "కాంగో-బ్రజ్జావిల్లే" వాటి రాజధాని నగరాల పేర్లతో పిలువబడ్డాయి.

స్వాతంత్ర్యం వచ్చిన కొద్దికాలానికే జూలై 11 ఫోర్స్ పబ్లికు తిరుగుబాటు చేసింది. కతంగా ప్రావిన్స్ (మోయిస్సోషోబ్ నేతృత్వంలో), సౌత్ కసాయి కొత్త నాయకత్వంపై వేరు వేరు పోరాటంలో పాల్గొన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మిగిలి ఉన్న 1,00,000 ఐరోపావాసులలో చాలా మంది దేశం నుండి పారిపోయారు. కాంగోరహిత యూరోపియన్ సైన్యం, పరిపాలనా అధికారులను భర్తీ చేయడానికి మార్గం తెరవబడింది. 1960 సెప్టెంబరు 5 న కసవుబు లెముంబను కార్యాలయం నుంచి తొలగించారు. కలువుబూ చర్య రాజ్యాంగ విరుద్ధమని లుముంబా ప్రకటించాడు. ఇద్దరు నాయకులకు మధ్య ఒక సంక్షోభాన్ని అధికరించింది.

14 సెప్టెంబరున యు.ఎస్, బెల్జియాల కదలికలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు జోసెఫ్ మోబుటుకు విశ్వసనీయమైన శక్తులు లూమెంబా కార్యాలయం నుండి తొలగించాయి. 1961 జనవరి 17 న ఆయన కట్టన్గన్ అధికారులకు అప్పగించబడ్డాడు. బెల్జియన్ నేతృత్వంలోని కటాన్గీస్ దళాలు ఆయనకు మరణశిక్ష అమలు చేసింది. 2001 లో బెల్జియం పార్లమెంటు విచారణలో లుమాంబా హత్యకు సంబంధించి బెల్జియం "నైతిక బాధ్యత" తీసుకుంది. ఆయన మరణం కొరకు దేశంలో అధికారికంగా క్షమాపణ చెప్పింది.

విస్తృతమైన గందరగోళం మధ్య సాంకేతిక నిపుణుల నాయకత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం నిర్వహించబడింది. ఈ గదరగోళం 1963 జనవరిలో ఐఖ్యరాజ్యసమితి దళాల సహాయంతో ముగిసింది. అనేక స్వల్ప-కాలిక ప్రభుత్వాలు, జోసెఫ్ ఇల్లో, సిరిల్లె అడోలా, మోయిస్ షోంబె స్వల్పకాల పాలన సాగించారు.

గతంలో లుముంబా కొత్త కాంగో సైన్యం ఆర్మీ నేషనల్ కాంగోలైస్ సభ్యుడు జోసెఫ్ మోబుటు చీఫ్గా నియమించాడు.[ఆధారం చూపాలి]కసవు, త్షొంబె, మధ్య నాయకత్వ సంక్షోభం నుండి ప్రయోజనాన్ని పొందడానికి మోబుటు తిరుగుబాటు చేయడానికి సైన్యంలో తగినంత మద్దతు లభించింది. సంయుక్త రాష్ట్రాలు, బెల్జియంల నుండి లభించిన ఆర్ధిక సహాయంతో మోబుటు తన సైనికులకు ప్రైవేటుగా వేతనాలు చెల్లించాడు.[ఆధారం చూపాలి] తిరుగుబాటులో కసవ్బును తొలగించి మొబుటు అధికారం చేజిక్కించుకున్నాడు. 1965 లో జరిగిన రాజ్యాంగ ప్రజాభిప్రాయం అనుసరిస్తూ దేశం అధికారిక పేరు "డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో" కు మార్చబడింది. 1971 లో మొబూటు ఈ పేరును మళ్లీ "రిపబ్లిక్ ఆఫ్ జైరే" గా మార్చారు.

మొబుటు , జైరే (1965–97)

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Mobutu Sese Seko and Richard Nixon in Washington, D.C., 1973.

నూతన రాష్ట్రపతికి యునైటెడ్ స్టేట్సు బలమైన మద్దతు ఉంది. ఆయన కమ్యూనిస్టు వ్యతిరేకుడుగా ఉండడమే అందుకు కారణం. ఆఫ్రికాలో కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆయన పరిపాలనలో సమర్థవంతంగా ఎదుర్కొంటాడని యు.ఎస్. విశ్వసించింది. ఏక-పార్టీ వ్యవస్థను స్థాపించబడింది. మోబుటు తనకుతాను రాష్ట్ర అధిపతిగా ప్రకటించుకుని క్రమానుగతంగా ఎన్నికలను నిర్వహించాడు. ఇందులో ఆయన మాత్రమే ఏకైక అభ్యర్థిగా ఉన్నాడు. అయినప్పటికీ శాంతి, స్థిరత్వం సాధించబడింది. మోబుటు ప్రభుత్వం తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన, రాజకీయ అణచివేత, దోషపూరిత వ్యక్తిత్వం, అవినీతి ఉందని అరోపించబడింది.

1967 చివరికి మోబుటు తన రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేసి, రాజకీయంగా అశక్తులను చేసి, తనకు విధేయులుగా మార్చుకుని తనకు అనుకూలంగా పనిచేసేలా చేసుకుని తనపట్ల ఉన్న వ్యతిరేకతను నియంత్రించాడు. 1960 చివరి నాటికి మోబుటు తన ప్రభుత్వాలు రక్షించుకోవడానికి అధికారులను నియంత్రణలో ఉంచడానికి కార్యాలయం నుండి బదిలీ చేస్తూ అధికారంలో కొనసాగాడు. 1969 ఏప్రెలులో కాసా-వుబు మరణం తరువాత ఎవరూ అతని పాలనను సవాలు చేయలేరని నిర్ధారించారు. 1970 ప్రారంభంలో మోబూటు జైరును ఒక ప్రముఖ ఆఫ్రికన్ దేశంగా పేర్కొనడానికి ప్రయత్నించాడు. ఆయన తరచుగా ఖండం అంతటా ప్రయాణించాడు. ఆయన ప్రభుత్వం ఆఫ్రికన్ సమస్యల గురించి ముఖ్యంగా దక్షిణ ప్రాంతాలకు సంబంధించి మరింత అభిప్రాయాలను వెలిబుచ్చింది. జైరు అనేక చిన్న ఆఫ్రికన్ దేశాలతో (ప్రత్యేకంగా బురుండి, చాద్, టోగోలతో) పాక్షిక రాజకీయ సంబంధాలను నెలకొల్పాడు.

అవినీతి "లే మాల్ జైరోస్" ("జైరన్ సిక్నెస్") చాలా సాధారణంగా మారింది. మోబుటు స్వయంగా అవినితి, అసమర్ధ నిర్వహణతో కూడిన పాలన కొనసాగించాడు. మొబోటుకు చాలామంది రుణాల రూపంలో ఇంటర్నేషనల్ సాయం అందించారు. 1960 లో మనుగడలో ఉన్నదానిలో నాలుగింట ఒక వంతున తరుగుదల ఉన్నప్పటికీ మొబోటు విదేశీ ఋణాలతో జాతీయ మౌలిక సదుపాయాలను అనుమతించాడు. జైరు మోబుటు పాలనలో దోపిడీ ప్రభుత్వంగా మారింది. అతని సహచరులు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసారు.

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Mobutu with the Dutch 1973 లో కిన్షాసాలో రాకుమారుడు బెర్ంహార్డు

1966 జనవరి 1 నుండి మొబూటుకు ఆఫ్రికన్ జాతీయవాదాన్ని గుర్తించే ఒక మార్చిన నగరాల పేర్లు: లెయోపాల్విల్లే (కిన్షాసా) మారింది దేశం కాంగో - (కిన్షాసా డెమొక్రాటిక్ రిపబ్లిక్), స్టాన్లీ విల్లె (కిసాన్గని), ఎలిసబెత్విల్లే (లుబుంబాషి), కోక్విల్హాట్విల్లే (మ్బండకా)? 1970 లో ఈ పేరు మార్చే చర్య పూర్తయింది.

1971 లో మోబుటు దేశంపేరును " రిపబ్లిక్ ఆఫ్ జైరె " అని మార్చాడు. 11 సంవత్సరాలలో నాల్గవసారి పేరు మార్పిడి జరిగింది. మొత్తం మార్పిడిలో ఇది 6 వ మారు. కాంగో నది పేరును జైర్ నదిగా మార్చారు.

1970, 1980 సమయంలో అనేక సందర్భాలలో ఆయన సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులను సందర్శించడానికి ఆహ్వానించబడ్డాడు. ఆయనను ఆహ్వానించిన యు.ఎస్. అధ్యక్షులలో రిచర్డ్ నిక్సన్, రోనాల్డ్ రీగను, జార్జి హెచ్.డబల్యూ బుష్ల ఉన్నారు. సోవియటు యూనియను రద్దు తరువాత మోబుటుతో సంయుక్త సంబంధాలు చల్లబడ్డాయి. ఆయన తరువాత ప్రచ్ఛన్న యుద్ధ మిత్రదేశనాయకుడిగా భావించబడలేదు. జైర్లోని ప్రత్యర్ధులు సంస్కరణల కొరకు నిర్బంధించడం మొదలు పెట్టారు. ఈ వాతావరణం ఫలితంగా మొబూటు 1990 లో థర్డు రిపబ్లిక్ను ప్రకటించింది. ఇది రాజ్యాంగం ప్రజాస్వామ్య సంస్కరణలకు దారి తీస్తుంది. సంస్కరణలు ఎక్కువగా కాస్మెటిక్గా మారాయి. సాయుధ దళాలు ఆయనను 1997 లో పారిపోవాలని బలవంతం చేసే వరకు మోబుటు అధికారంలో కొనసాగారు. "1990 నుండి 1993 వరకు రాజకీయ మార్పులను తీసుకురావడానికి మోబుటు చేపట్టిన ప్రయత్నాలను యు.ఎస్. ప్రోత్సహించింది". "మోబుటు పాలన పడగొట్టడానికి లారెంట్-డిజైర్ కబిల్ల తిరుగుబాటుకు కూడా సహాయపడింది" అని ఒక విద్యావేత్త వ్రాశాడు.

ఖండాంతర , పౌర యుద్ధాలు (1996–ప్రస్తుత కాలం)

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Belligerents of the Second Congo War

1996 నాటికి రువాండా పౌర యుద్ధం తరువాత రువాండాలో టుట్సీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారం వచ్చిన తరువాత రువాండా హుట్ మిలిషియా దళాలు (ఇంటర్హామ్వే) తూర్పు జైరు పారిపోయి. రువాండాపై దాడుల స్థావరంగా శరణార్ధుల శిబిరాలను ఉపయోగించారు. వారు తూర్పు జైర్లోని కాంగో జాతి టుట్సిస్పై పోరాటం చేయడానికి జైర్యన్ సైనిక దళాలతో కలిసి పనిచేశారు.

రువాండాన్, ఉగాండా సైన్యాలు సంకీర్ణము మోబూటు ప్రభుత్వాన్ని కూలదోయటానికి జైరె మీద దాడి చేసి చివరికి జైరే ఖనిజ వనరులను స్వాధీనం చేసుకుని[ఆధారం చూపాలి] మొదటి కాంగో యుద్దమును ప్రారంభించింది. సంకీర్ణానికి లారెంట్-డెసిరె కాబిలా నేతృత్వం " అలయంస్ ఆఫ్ డెమొక్రటిక్ ఫోర్సెస్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ కాంగో " రూపొందింది. 1997 లో మొబూటు పారిపోయిన తరువాత కబిలా కింషాషాలో ప్రవేశించి తనకు తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. దేశం పేరు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోగా తిరిగి మార్చాడు.

కాబిల తరువాత విదేశీ సైనిక దళాలు వారి స్వంత దేశాలకు తిరిగి వెళ్ళాలని కోరారు. రువాండా అధ్యక్షుడు పాల్ కగమేకు నేరుగా నివేదించిన ట్యుటీని అధ్యక్షుడిగా చేయడానికి రువాండా అధికారులు ప్రయత్నిస్తారని కబిలా ఆందోళన చెందడమే అందుకు కారణం.[ఆధారం చూపాలి] రువాండా దళాలు గోమాకు తిరిగి వెళ్లి టుట్సీ నేతృత్వంలో " రసెంబ్ల్మెంటు కాంగోలియాస్ పౌర్ లా డెమొక్రటిక్ " పేరుతో కబిలాతో యుద్ధం చేయడానికి సైనిక తిరుగుబాటు ఉద్యమాన్ని ప్రారంభించారు. మరొక వైపు ఉగాండా లో " మూవ్మెంటు ఫర్ లిబరేషన్ ఆఫ్ కాంగో " పేరుతో కాంగోలియన్ యుద్ధవీరుడు " జీన్ పియర్రె బెంబా " నాయకత్వంలో కొత్త తిరుగుబాటు ప్రారంభించబడింది.[ఆధారం చూపాలి] రెండు ఉద్యమదారులు రువాండాన్, ఉగాండా దళాలతో కలిసి 1998 లో డి.ఆర్.సి. సైన్యం మీద దాడి చేయడం ద్వారా రెండో కాంగో యుద్ధాన్ని ప్రారంభించింది. అంగోలాన్, జింబాబ్వే, నమీబియా సైనిక దళాలు ప్రభుత్వ పక్షాన పోరాడారు.

2001 లో కబిలా హత్యకు గురయ్యాడు. అతని కుమారుడు జోసెఫ్ కబిల వారసుడుగా అధికారం స్వీకరించి బహుపాక్షిక శాంతి చర్చలకు పిలుపునిచ్చారు. ఐఖ్యరాజ్యసమితి శాంతివేత్తలు మానుక్ (ప్రస్తుతం మాంస్కొ) 2001 ఏప్రిల్లో వచ్చారు. 2002 , 2003 లో బెమ్బా తన మాజీ ప్రెసిడెంట్ ఆంగె-ఫెలిక్స్ పాటాస్సే తరపున సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కులో ప్రాతినిధ్యం వహించాడు.

చర్చలు మాజీ తిరుగుబాటుదారులతో కలసి కాబిలా శక్తిని పంచుకునేలా శాంతి ఒప్పందానికి దారి తీసాయి. 2003 జూన్ నాటికి రువాండా మినహా మిగతా విదేశీ సైన్యాలు కాంగో నుండి వైదొలిగాయి. ఎన్నికల వరకు ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. ఒక రాజ్యాంగం ఓటర్లు ఒక రాజ్యాంగాన్ని ఆమోదించారు. 2006 జూలై 30 న డి.ఆర్.సి. తన మొట్టమొదటి బహుళ-పార్టీ ఎన్నికలను నిర్వహించింది. ఎన్నికల ఫలితాల కారణంగా కబిలా, జీన్-పీర్రే బెంబాల రెండు పక్షాల మద్దతుదారుల మధ్య మొదలైన వివాదం కిన్షాసా వీధుల్లో పూర్తిస్థాయిలో యుద్ధం అయ్యింది. నగరం నియంత్రణను మొనక్ తీసుకున్నది. 2006 అక్టోబరులో ఒక కొత్త ఎన్నిక జరిగింది. ఇందులో కబిల విజయం సాధించి 2006 డిసెంబరులో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబడింది.

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Refugees in the Congo

కివు సంఘర్షణ

అయినప్పటికీ ఆర్.సి.డి-గోమా (ఆర్మీకి అనుసంధానించబడిన ఒక ఆర్.సి.డి. శాఖ) సభ్యుడైన " లారెంటు న్కుండ " తన విశ్వసనీయ దళాలతో " నేషనల్ కాంగ్రెస్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ ది పీపుల్ " స్థాపించాడు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు ప్రారంభించడంతో కివూ సంఘర్షణ మొదలైంది. హుటు సమూహాన్ని అధిగమినడానికి రువాండా తిరిగి మద్దతిస్తుందని వారు విశ్వసించారు. మార్చి 2009 లో డి.ఆర్.సి., రువాండా మధ్య ఒప్పందం తరువాత రువాండా సైనికులు డి.ఆర్.సి.లోకి ప్రవేశించి, న్కుండను అరెస్టు చేశారు. ఎఫ్.డి.ఎ.ఆర్. తీవ్రవాదులను కొనసాగించేందుకు అనుమతించారు. సి.ఎన్.డి.పి. ప్రభుత్వంతో ఒక శాంతి ఒప్పందం మీద సంతకం చేసింది. అది ఒక రాజకీయ పార్టీగా మారడానికి, దాని సైనికులను, జైలుకు పంపిన సభ్యులను జాతీయ సైన్యంలో విలీనం చేయబడింది. 2012 లో సి.ఎన్.డి.పి. నాయకుడు " బోస్కో న్టాగాండా" ఆయన విశ్వసనీయ సైనికులు తిరుగుబాటు చేయడానికి " మార్చ్ 23" రూపొందించి ప్రభుత్వం ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపించారు.

" మార్చి 23 తిరుగుబాటు " ఫలితంగా 2012 నవంబరులో గోమా దేశరాజధానిని స్వాధీనం చేసుకుంది. పొరుగు దేశాలలో (ముఖ్యంగా రువాండాలో) సాయుధ తిరుగుబాటుదారుల సమూహాలను నిందితులుగా, వనరుల-సంపన్న దేశాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆరోపణను వారు నిరాకరించారు. 2013 మార్చిలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్యసమితి ఫోర్స్ ఇంటర్వెన్షన్ బ్రిగేడుకు యునైటెడ్ నేషన్స్ శాంతి పరిరక్షక విభాగానికి సాయుధ గ్రూపులను తటస్తం చేయడానికి, అధికారాన్ని ఇచ్చింది. 2013 నవంబరు 5 న " మార్చి 25 " తిరుగుబాటుకు ముగింపును ప్రకటించింది.

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
People fleeing their villages due to fighting between FARDC and rebel groups, North Kivu, 2012

ఎఫ్.ఎ.ఆర్.డి.సి. తిరుగుబాటు గ్రూపులు ఉత్తర కివ్ 2012 మధ్య పోరాటం కారణంగా వారి గ్రామాలనుండి పారిపోతున్న ప్రజలు]]

అదనంగా, ఉత్తర కటాంగాలో లారెంట్ కాబిలా రూపొందించిన మై-మాయి, కిడ్షాన్ క్యుంగ్యు ముతంగా మాయి మాయి కటా కటంగాతో కలిసి 2013 లో ప్రాంతీయ రాజధాని లుబుంబాషిని స్వాధీనం చేసుకున్న కారణంగా 4,00,000 మంది పౌరులు స్థానభ్రంశం చెందారు. జాతీయవాద ఇంటిగ్రేసిస్ట్ ఫ్రంటు, కాంగోల పేట్రియాట్సు యూనియన్ (యుపిసి) (లెండియు, హేమా జాతి సమూహాలకు ప్రాతినిధ్యం వహించారు) మధ్య ఇటురి పోరు ప్రారంభమైంది. ఈశాన్య భాగంలో జోసెఫ్ కోని " ఎల్.ఆర్.ఎ " ఉగాండా, దక్షిణ సుడానని వారి మకాములను వదిలి 2005 లో డి.ఆర్. కాంగోలో ప్రవేశించి " గరబా నేషనల్ పార్కు " లో శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు.

2009 లో ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం కాంగోలో ప్రజలు నెలకు 45,000 చొప్పున చనిపోతున్నారు. దీర్ఘకాల వివాదాల పరిధిలో 900,000 నుండి 54,00,000 వరకు మరణించారని అంచనా. వ్యాధులు, కరువు కారణంగా మరణాల సంఖ్య మరింత అధికరించింది. మరణించిన వ్యక్తులలో సగం మంది అయిదు సంవత్సరముల వయస్సు లోపు పిల్లలేనని నివేదికలు సూచిస్తున్నాయి. పౌరులు ఆస్తి నాశనం, విస్తృతమైన లైంగిక హింసను అనుభవించారు. వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోవడం, మానవ హక్కుల ఉల్లంఘనలకు కారణమైన ఆయుధ దాడుల గురించి తరచుగా నివేదించబడ్డాయి. ప్రతి సంవత్సరం మహిళలు కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్కులో 4,00,000 మంది అత్యాచారానికి గురైయ్యారని చేశారని ఒక అధ్యయనం పేర్కొన్నది.

రెండో ప్రపంచ యుద్ధం తరువాత కాంగోలో యుద్ధం అత్యంత రక్తపాత యుద్ధంగా వర్ణించబడింది. 2017 డిసెంబరు 8 న 14 న ఐక్య రాజ్యసమితి సైనికులు, 5 గురు కాంగోల సాధారణ సైనికులు బెనిన్ భూభాగంలో సెములికీలో తిరుగుబాటు దాడుల్లో మరణించారు. తిరుగుబాటుదారులు అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెసుగా భావించారు. డిసెంబరు దాడిని ఉగ్రవాద దాడులని ఐఖ్యరాజ్యసమితి పరిశోధనలు నిర్ధారించాయి.

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Government troops near Goma during the M23 rebellion in May 2013

కబిలా పాలన , పలు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు

2015 లో కాంగోలు దిగువ సభ ఒక చట్టం ఆమోదించబడిన తరువాత కాంగో ఎగువ సభ ఆమోదించినట్లయితే, అది జాతీయ జనాభా గణన నిర్వహించబడే వరకు కనీసం కాబిలాను అధికారంలో ఉంచుతుంది (ఈ ప్రక్రియ అనేక సంవత్సరాలు పడుతుంది కనుక 2016 ఎన్నికలలో అతను రాజ్యాంగపరంగా పోటీ చేయకుండా నిరోధించడానికి) కనుక దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యాపించాయి. జోసెఫ్ కాబిలా అధ్యక్షుడిగా పదవీవిరమణ చేయాలని నిరసనకారులు నిర్బంధించారు.

ఈ బిల్లు ఆమోదించబడింది. ఇది జనాభా గణనను చేపట్టేంత వరకు జోసెఫ్ కాలిలా అధికారంలో ఉంచుతుంది. ఒక జనాభా గణన జరుగుతుందని భావించబడింది. 2015 లో జరగవలసిన ఎన్నికలు 2016 చివరలో ఎన్నికలు కాంగోలో నిర్వహించాలని నిర్ణయించబడింది.

నవంబరు 27 న కాంగో విదేశాంగ మంత్రి రేమాండ్ టిబిబండా మీడియాతో మాట్లాడుతూ డిసెంబరు 20 న అధ్యక్షుడి కబీలా పదవీ కాలం ముగిసిన తరువాత 2016 లో ఎటువంటి ఎన్నికలు జరిగే అవకాశం లేదు. మడగాస్కరులో ఒక సమావేశంలో కాబిలా ప్రభుత్వం కాంగో, ఐక్యరాజ్యసమితి, ఇతర ప్రాంతాల నుండి ఎన్నికల నిపుణులను సంప్రదించిందని టిబిబండా పేర్కొన్నాడు. "2017 జూలై 31 న ఓటర్ రిజిస్ట్రేషన్ ఆపరేషన్ ముగుస్తుందని నిర్ణయించారు. 2018 డిసెంబరులో జరుగుతుందని భావించారు. డిసెంబరు 20 న కబీలా పదవీకాలం ముగిసిన తరువాత దేశంలో నిరసనలు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా డజన్ల కొద్దీ నిరసనకారులు మరణించారు. వందలాది మందిని అరెస్టు చేశారు.

అణిచివేత

నార్వే రెఫ్యూజీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ జాన్ ఎగ్ల్యాండ్ అభిప్రాయంలో డి.ఆర్.సి.లో పరిస్థితి 2016 - 2017 లో చాలా ఘోరంగా మారింది. ఇది సిరియా, యెమెనులో యుద్ధాలకు పోల్చదగిన నైతిక, మానవతా సవాలుగా ఉంది. స్త్రీలు, పిల్లలు లైంగిక వేధింపులకు గురయ్యారు. " అన్ని మర్యాదలలో అవమానాలకు గురైయ్యారు ". ఉత్తర కివూలో జరిగిన వివాదంతో పాటు. కసాయి ప్రాంతంలో హింస పెరిగిపోయింది. ఈ ప్రాంతంలో బంగారు, వజ్రాలు, చమురు, కోబాల్టు ఆదాయవనరులతో సాయుధ గ్రూపులు ఈ ప్రాంతంలోనూ, అంతర్జాతీయంగానూ ఉన్న ధనవంతులైన వ్యక్తుల ఖజానాలు నింపారు. నాటకం, సాంస్కృతిక నాటకం, అలాగే మతపరమైన ఉత్సవాలు మరుగునబడ్డాయి. ఎన్నికల వాయిదాతో రాజకీయ సంక్షోభం అధికరించింది. ప్రజలు డి.ఆర్.సి.లో పరిస్థితి బాగలేదు అని నమ్ముతారు కానీ వాస్తవానికి చాలా చాలా దారుణంగా మారింది అన్నారు. "కాంగో యుద్ధాలు నిజంగా 15 ఏళ్ల క్రితం అజెండాలో అగ్రస్థానంలో ఉన్నాయి. సంఘర్షణ కారణంగా తోటల పెంపకంలో ఆటకం కారణంగా 2018 మార్చి ఐఖ్యరాజ్యసమితి అంచనా ప్రకారం రెండు మిలియన్ల మంది పిల్లలు ఆకలితో బాధపడుతున్నారని అంచనా.

2017 లో హ్యూమన్ రైట్స్ వాచ్ కబిలా " మార్చి 23 " తిరుగుబాటుతో పదవిని చేపట్టాడు. కార్యాలయం నుండి పదవీవిరమణ చేయటానికి తిరస్కరించినందుకు దేశవ్యాప్త నిరసనలను కూలదోయడానికి మాజీ " మార్చి 23 " యుద్ధవీరులను నియమించాడు. " మార్చి 23 యుద్ధ విమానాలు కాంగో ప్రధాన నగరాల్లో వీధులను నియంత్రించాయి. నిరసనకారులు లేదా ఇతరులను అరెస్టు చేయడం లేదా అధ్యక్షుడికి ముప్పుగా ఉన్నట్లు భావించే వారిని అరెస్టు చేయడం వంటి సంఘటనలు కొనసాగాయి " అని వారు చెప్పారు. ప్రభుత్వ బలగాలకు, శక్తివంతమైన స్థానిక యుద్ధ నాయకుడైన జనరల్ డెల్టాకు మధ్య మాసిసీలో తీవ్ర పోరాటం జరిగింది. డి.ఆర్.సి.లో ఐక్యరాజ్యసమితి మిషన్ అతిపెద్ద, అత్యంత ఖరీదైన శాంతి పరిరక్షక ప్రయత్నంగా ఉంది. ఖర్చులు తగ్గించటానికి యు.ఎస్. 2017 లో మసీసీ దగ్గర ఐదు ఐఖ్యరాజ్యసమితి స్థావరాలను మూసివేసింది.

భౌగోళికం

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
The map of the Democratic Republic of the Congo
కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Democratic Republic of the Congo map of Köppen climate classification

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (డి.ఆర్.సి.) మద్య ఉప-సహారా ఆఫ్రికాలో ఉంది. ఆగ్నేయ సరిహద్దులో అంగోలా, దక్షిణ సరిహద్దులో అట్లాంటిక్ మహాసముద్రం, అంగోలాకు చెందిన కాబిండా ప్రావీన్స్, కాంగో రిపబ్లిక్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ , దక్షిణ సూడాన్, ఉగాండా, రువాండా, బురుండి, టాంజానియా సరస్సు, జాంబియా ఉన్నాయి. దేశం 6 ° ఉత్తర, 14 ° దక్షిణ అక్షాంశాల మధ్య, 12 ° - 32 ° తూర్పు రేఖాంశంలో ఉంటుంది. ఇది భూమధ్యరేఖను దక్షిణంవైపు మూడింట ఒక వంతు, ఉత్తరాన మూడింట రెండు వంతుల మధ్య ఉంటుంది. కాంగో వైశాల్యం 23,45,408 చదరపు కిలోమీటర్లు (9,05,567 చదరపు మైళ్ళు) స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే మొత్తం ప్రాంతాల కంటే కొద్దిగా ఎక్కువ. ఇది ఆఫ్రికాలో రెండవ అతిపెద్ద దేశం. మొదటి స్థానంలో అల్జీరియా ఉంది.

భూమధ్యరేఖ సమీపప్రాంతంగా ఉన్నందున డి.ఆర్.సి. అధిక వర్షపాతం, ప్రపంచంలో అత్యధిక ఉరుములతో కూడిన తుఫానులు అనుభవిస్తుంది. వార్షిక వర్షపాతం కొన్ని ప్రాంతాలలో 2,000 మిల్లీమీటర్లు (80 అం) కంటే అధికంగా ఉంటాయి. కాంగో వర్షారణ్యం అమెజాన్ తర్వాత ప్రపంచంలోని రెండో అతి పెద్ద వర్షారణ్యాలు ఉన్నాయి. లష్ అడవి ఈ భారీ విస్తరణ పశ్చిమంలోని అట్లాంటిక్ మహాసముద్రం వైపు వాలుగా ఉంటుంది. నది విస్తారమైన లోతైన మద్యభాగానికి చాలా వరకు కప్పేస్తుంది. ఈ ప్రాంతం దక్షిణ నైరుతి ప్రాంతంలో ఉన్న సవన్నసు పశ్చిమాన ఉన్న పర్వత పంక్తులు, ఉత్తరాన కాంగో నది దాటి విస్తరించి ఉన్న దట్టమైన పచ్చిక ప్రాంతాలు ఉన్నాయి. అధిక, హిమానీ పర్వతాలు (రవెంజోరి పర్వతాలు) తూర్పు ప్రాంతంలో కనిపిస్తాయి.[ఆధారం చూపాలి]

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Ituri Rainforest

ఉష్ణమండల శీతోష్ణస్థితి ప్రాంతాల మీద ఆధిపత్యం కలిగిన కాంగో నది వ్యవస్థను ఏర్పరచింది. ఇది వర్షారణ్యాల మద్య ప్రవహిస్తుంది. కాంగో దేశానికి పేరు నది నుండి పుట్టింది. నది ముఖద్వారం (అంటే కాంగో నది, దాని అనేక ఉపనదులు) దాదాపు దేశం మొత్తం భూభాగంలో దాదాపు 10,00,000 చ.కిమీ (3,90,000 చ.మై) ప్రాంతం ఆక్రమించింది. నది, దాని ఉపనదులు కాంగో ఆర్ధికరంగానికి, రవాణాకు వెన్నెముకగా ఉంటుంది. దేశంలో కాసాయి, సంఘా, ఉబంగి, రుజిజి, అరువిమి, లులుంగో వంటి ప్రధాన ఉపనదులు ఉన్నాయి.

మూస:MapLibrary కాంగో మూలాలు అల్బెర్టిన్ రిఫ్ట్ పర్వతాలలో ఉన్నాయి. ఇవి తూర్పు ఆఫ్రికన్ రిఫ్టు పశ్చిమ శాఖను, అలాగే టాంగ్యానికా సరస్సు, మ్వెరు సరసు ఉన్నాయి. ఈ నది సాధారణంగా బోయోమా జలపాతం క్రింద కిసాన్గాని నుండి పడమరగా ప్రవహిస్తుంది. తరువాత క్రమంగా ఆగ్నేయంవైపు వంగిపోతుంది ముబందాకా మీదుగా ప్రయాణించి ఉబంగి నదితో సంగమించి పూల్ మల్బో (స్టాన్లీ పూల్) లో మీదుగా ప్రవహిస్తుంది. నదికి ఎదురుగా కిన్షాసా, బ్రజ్జావిల్లె పూల్ వద్ద ఉంటాయి. తరువాత ఆ నది లోతైన కెన్యాన్లలో పలు ఇరుకుగా ప్రవహిస్తూ లివింగ్స్టన్ జలపాతంగా మారి బోమాను దాటి అట్లాంటిక్ మహాసముద్రంలో సంగమిస్తుంది. ఈ నది ప్రపంచంలో రెండో-అతిపెద్ద ప్రవాహం, రెండో అతిపెద్ద నదీ పరీవాహక ప్రాంతంగా ఉంది (రెండు విధాలుగా అమెజాను తరువాత). నది దాని ఉత్తర తీరంలో 37 కిలోమీటర్ల (23 మి.మీ.) వైడ్ స్ట్రిప్ విస్తీర్ణం ఉంది.[ఆధారం చూపాలి]

కాంగో భూగోళిక స్థితిని రూపొందించడంలో ఆల్బర్టిన్ రిఫ్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. దేశం ఈశాన్య విభాగం మరింత పర్వతప్రాంతం కానప్పటికీ రిఫ్టు టెక్టోనిక్ విస్ఫోటనం కారణంగా ఈ ప్రాంతం అగ్నిపర్వత ప్రభావాన్ని కూడా అనుభవిస్తూ అప్పుడప్పుడు ప్రజల మరణాలకు కారణం ఔతుంది. ఈ ప్రాంతంలో భూగర్భ చర్యలు కూడా ఆఫ్రికన్ గ్రేట్ సరస్సులను సృష్టించాయి. వీటిలో మూడు కాంగో తూర్పు సరిహద్దులో ఉన్నాయి: లేక్ ఆల్బర్ట్ (మొబూటు యుగం లేక్ మొబుటు సెసే సెకో), లేక్ కివూ (1712 చివరి వరకు తెలియదు), లేక్ ఎడ్వర్డ్ అమీన్ కాలంలో సరస్సు ఇడి అమీన్ దాదాగా పిలువబడింది), టాంకన్యిక సరస్సు, లేక్ ఎడ్వర్డు, లేక్ ఆల్బర్టులను సెమాలికి నది అనుసంధానిస్తూ ఉంది.[ఆధారం చూపాలి]

కాంగో యొక్క దక్షిణాన , తూర్పు మొత్తంలో ఖరీదైన ఖనిజ సంపదను రిఫ్ట్ వ్యాలీ బహిర్గతం చేసింది, తద్వారా అది మైనింగ్కు అందుబాటులోకి వచ్చింది. బంగారం, వెండి, జింక్, మాంగనీస్, టిన్, జెర్మానియం, యురేనియం, రేడియం, బాక్సైట్, ఇనుప ఖనిజం , బొగ్గు వంటివి కోబాల్ట్, రాగి, కాడ్మియం, పారిశ్రామిక , రత్నం-నాణ్యత వజ్రాలు, ముఖ్యంగా కాంగో యొక్క ఆగ్నేయ ప్రాంతంలో కటంగా ప్రాంతంలో.

రిఫ్టువ్యాలీ కాంగో దక్షిణ, తూర్పు ప్రాంతం మొత్తంలో ఖరీదైన ఖనిజ సంపదను సంక్షిప్తం చేసింది. తద్వారా అది మైనింగుకు అందుబాటులోకి వచ్చింది. బొగ్గు, కోబాల్ట్, రాగి, కాడ్మియం, పారిశ్రామిక, రత్నం-నాణ్యత వజ్రాలు, బంగారం, వెండి, జింక్, మాంగనీస్, టిన్, జెర్మానియం, యురేనియం, రేడియం, బాక్సైట్, ఇనుప ఖనిజం ముఖ్యంగా కాంగో ఆగ్నేయ ప్రాంతంలో కటంగా ప్రాంతంలో విస్తారంగా లభిస్తుంది.

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
2002 లో నియిరాగొంగొ పర్వతాలలో విస్ఫోటనం
కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
సలోంగా నేషనల్ పార్క్
కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
మసీసీ భూభాగం
కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
ఉత్తర కివూ ప్రావిన్స్లో లేవ్ కివు

2002 జనవరి 17 న కాంగోలో మౌంట్ నైరాగోంగో సంభవించిన విస్పోటంలో 64 కి.మీ (40 మై) పొడవు 46 మీ (50 గజాలు) వెడల్పు లావా ప్రవహించింది. అత్యధిక మొత్తంలో లావా ద్రవం వెలువరించిన మూడు ప్రవాహాల్లో ఇది ఒకటి. ఇది సమీపంలోని గోమా గుండా ప్రవహించింది. ఇది 45 మంది మరణానికి, 1,20,000 మంది నిరాశ్రయులు కావడానికి కారణమైంది. విస్ఫోటనం సమయంలో నగరం నుండి నాలుగు లక్షల మంది ప్రజలు ఖాళీ చేయబడ్డారు. లావా ప్రవాహం కివూ సరస్సు జలాలను విషమయం చేసిన కారణంగా సరసులోని చేపలు చనిపోయాయి. నిల్వ చేయబడిన పెట్రోల్ పేలుడు కారణంగా మంటలు సృష్టిస్తుందని భావించి ప్రాంతీయ విమానాశ్రయం నుండి రెండు విమానాలు బయలుదేరాయి. లావా విమానాశ్రయాన్ని దాటుతూ రన్వేను నాశనం చేసింది. అనేక విమానాలు బంధించబడ్డాయి. 2002 లో విస్ఫోటనం జరిగిన ఆరు నెలల తరువాత సమీపంలోని మౌంట్ న్యామురాగిరా కూడా పేలిపోయింది. 2006 లో మౌంట్ న్యామురగిరా విస్పోటనం సంభవించిన తరువాత తిరిగి జనవరి 2010 లో విస్ఫోటనం జరిగింది.

కాంగోలో ఉన్న వరల్డ్ వైడ్ ఫండు ఫర్ నేచుర్ పర్యావరణ ప్రాంతాలు:

World Wide Fund for Nature ecoregions located in the Congo include:

  • Central Congolian lowland forests – home to the rare bonobo primate
  • The Eastern Congolian swamp forests along the Congo River
  • The Northeastern Congolian lowland forests, with one of the richest concentrations of primates in the world
  • Southern Congolian forest-savanna mosaic
  • A large section of the Central Zambezian Miombo woodlands
  • The Albertine Rift montane forests region of high forest runs along the eastern borders of the country.

World Heritage Sites located in Democratic Republic of Congo are: Virunga National Park (1979), Garamba National Park (1980), Kahuzi-Biega National Park (1980), Salonga National Park (1984) and Okapi Wildlife Reserve (1996).

ప్రాంతాలు

The country is currently divided into the city-province of Kinshasa and 25 other provinces. The provinces are subdivided into districts which are divided into territories. Before 2015, the country had 11 provinces.

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
1. Kinshasa 14. Ituri Province
2. Kongo Central 15. Haut-Uele
3. Kwango 16. Tshopo
4. Kwilu Province 17. Bas-Uele
5. Mai-Ndombe Province 18. Nord-Ubangi
6. Kasaï Province 19. Mongala
7. Kasaï-Central 20. Sud-Ubangi
8. Kasaï-Oriental 21. Équateur
9. Lomami Province 22. Tshuapa
10. Sankuru 23. Tanganyika Province
11. Maniema 24. Haut-Lomami
12. South Kivu 25. Lualaba Province
13. North Kivu 26. Haut-Katanga Province

వృక్షజాలం , జంతుజాలం

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Bas-Congo landscape
కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
An Okapi
కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
A male Western gorilla
కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Hippopotami

కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ వర్షారణ్యాలు గొప్ప జీవవైవిద్యం కలిగివుంటాయి. వీటిలో చాలా అరుదైన అంతరించి పోతున్న స్థానిక జంతువులు ఉన్నాయి. వీటిలో సాధారణ చింపాంజీ, బొనొబో, ఆఫ్రికన్ అటవీ ఏనుగు, పర్వత గొరిల్లా, ఓకపి, వైట్ రినో. దేశంలోని ఐదు జాతీయ పార్కులు ప్రపంచ వారసత్వ ప్రాంతాలుగా పేర్కొనబడ్డాయి: గరుంబ, కహోజి-బీయేగా, సలోంగా, విరుంగా నేషనల్ పార్కు ఓకపి వన్యప్రాణుల రిజర్వుగా ఉంది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో అత్యంత జీవవైవిధ్యం ఆఫ్రికన్ దేశంగా ఉంది.

పౌర యుద్ధం, పేద ఆర్ధిక పరిస్థితులు ఫలితంగా ఈ జీవవైవిధ్యం చాలా వరకు ప్రమాదంలో పడింది. అనేక పార్కు ఉద్యానవన సంరక్షకులు చనిపోవడం లేదా వారి పనిని కొనసాగించలేకపోవడం సాధారంగా మారింది. ఐదు సైట్లు యునెస్కొ జాబితాలో ప్రమాదస్థాయిలో ఉన్న ప్రపంచ వారసత్వ ప్రాంతాలుగా గుర్తించబడుతున్నాయి.

పరిరక్షకులు ప్రత్యేకంగా ప్రైమేట్స్ గురించి కలత చెందుతున్నారు. కాంగోలో అనేక పెద్ద కోతి జాతులు ఉన్నాయి: సాధారణ చింపాంజీ (పాన్ టోగ్లోడిటెస్), బోనోబో (పాన్ పానిస్కస్), తూర్పు గొరిల్లా (గొరిల్లా బెరింగ్జీ), బహుశా పశ్చిమ గొరిల్లా (గొరిల్లా గొరిల్లా). ప్రపంచదేశాలలో కాంగోలో మాత్రమే అడవులలో నివసిస్తున్న బునోబోసును కనుగొనబడుతున్నాయి. గొప్ప కోతి అంతర్ధానం గురించి చాలా ఆందోళన వ్యక్తం చేయబడింది. వేట, నివాసాల కొరకు జరుగుతున్న వినాశనం కారణంగా ఒకప్పుడు విడివిడిగా మిలియన్ల సంఖ్యలో ఉన్న చింపాంజీ, బొనోబో, గొరిల్లా ఇప్పుడు మొత్తం కలిసి సుమారు 2,00,000 కుదించబడింది. గొరిల్లాలు 100,000 చింపాంజీలు సుమారు 10,000 మాత్రమే ఉన్నాయి. గొరిల్లాలు, చింపాంజీలు, బొనోబోలు, ఒకపి అన్నింటినీ వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ అంతరించి పోతున్న జాబితాలో ఉన్నట్లు వర్గీకరించబడ్డాయి.

ఆక్రమణలు

డి.ఆర్.సి.లో పౌరయుద్ధం కొనసాగడం కారణంగా నెలకొన్న పేదరికాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది జంతువుల, దంతపు వ్యాపారం మీద దృష్టికేంద్రీకరించిన కారణంగాజాతుల నష్టానికి నిరంతర సమస్యగా ఉంది.

తిరుగుబాటు గ్రూపుల కోసం పౌర యుద్ధం కొనసాగించడానికి ఒక మార్గంగా ఉంది. ప్రత్యేకంగా సుదూర తూర్పుప్రాంతాలలో దంతపు అధిక ధర కారణంగా అడవి ఏనుగు ప్రమాదం స్థితిలో ఉంది. 2002-2011 మద్య కాలంలో వీటి సంఖ్య 62.0% లో 118% తగ్గింది. దంతానికి ఉన్న అంతర్జాతీయ డిమాండ్ను అడ్డుకోవడం ద్వారా దంతాల తగ్గింపును తగ్గించవచ్చు. ఎందుకంటే ఇది వాణిజ్యాన్ని నడిపిస్తుంది.

పార్కు గార్డులు, పర్యావరణ పర్యాటక రంగం పర్యాటక-పర్యాటక రంగం విరుంగ నేషనల్ పార్కు గొప్ప కోతులకు ఒక ప్రాధమిక నివాసం, అంతరించిపోతున్న పర్వత గొరిల్లా సంఖ్య 1000 నుండి 2010 లో సంఖ్యాపరంగా 25% పెరుగుదలను అనుమతించింది. అయినప్పటికీ ఈ అధ్యయనము ఇంకా ఉన్న సమస్యగా ఉందని సూచించింది. పరిశోధకులు 380 సైనికులు, పార్కు గార్డులు నిరంతరంగా వేటగాళ్ళచే చుట్టుముట్టబడి చంపబడ్డారు.

ఆర్ధికం , మౌలికసౌకర్యాలు

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Evolution of GDP

కాంగో సెంట్రల్ బ్యాంక్ కాంగో ఫ్రాంకును అభివృద్ధి చేసి నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది. ఇది డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కరెన్సీ ప్రాథమిక రూపంగా ఉండేది. 2007 లో ది వరల్డ్ బ్యాంక్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు తరువాత మూడు సంవత్సరాల పాటు $ 1.3 బిలియన్ల సహాయనిధి మంజూరు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కిన్షాసా (ప్రస్తుతం ఆఫ్రికాలో (ఒహాడా)) " ఆర్గనైజేషన్ ఫర్ ది హార్మోనిజేషన్ ఆఫ్ బిజినెస్ లా ఇన్ ఆఫ్రికా " లో సభ్యత్వం కోసం చర్చలు నిర్వహిస్తోంది.

కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ సహజ వనరులలో ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. వెలికితీయబడని ముడి ఖనిజాల డిపాజిట్లు US $ 24 ట్రిలియన్ల అమెరికన్ డాలర్ల కంటే అధికంగా ఉంటుందని విశ్వసిస్తున్నారు. కాంగోలో ప్రపంచంలోని 70% కోల్టన్ ఉంది. కోబాల్టులో మూడోవంతు, వజ్రాల నిల్వల్లో 30% కంటే అధికం, రాగి పదవ వంతు ఉన్నాయి.

ఇటువంటి విస్తారమైన ఖనిజ సంపద ఉన్నప్పటికీ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో ఆర్ధిక వ్యవస్థ 1980 ల మధ్యకాలం నుండి బాగా క్షీణించింది. 1970 - 1980 లలో ఖనిజాల నుండి ఆఫ్రికన్ దేశం 70% వరకు ఎగుమతుల ఆదాయాన్ని ఉత్పత్తి చేసింది. తరువాత వనరుల ధరలు క్షీణించినప్పుడు ఆర్ధికవ్యవస్థ దెబ్బతిన్నది. 2005 నాటికి డి.ఆర్.సి. ఆదాయంలో 90% దాని ఖనిజాలు నుండి తీసుకోబడింది. దేశంలో సుసంపన్నమైన వనరులు ఉన్నప్పటికీ పౌరులు ప్రపంచంలో అతి పేద ప్రజలుగా ఉన్నారు. డి.ఆర్. కాంగో స్థిరంగా ప్రపంచంలో అతి తక్కువ, లేదా దాదాపు అతితక్కువ తలసరి నామమాత్ర జి.డి.పి. కలిగి ఉంది. డిఆర్సి " కరప్షన్ పర్ఫెక్షన్ ఇండెక్సు " 20 అతి తక్కువ ర్యాంకు గల దేశాలలో ఒకటిగా ఉంది.

గనులు

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Rough diamonds ~1 to 1.5 mm in size from DR Congo.

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (డి.ఆర్.సి) ప్రపంచంలోనే అతిపెద్ద కోబాల్టు ధాతువు నిలువలను కలిగి ఉంది. రాగి, వజ్రాల తయారీలో ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. డి.ఆర్.సి. లోని అతిపెద్ద గనులు దక్షిణ కటంగా ప్రావిన్సు (గతంలో షబా) లో ఉన్నాయి. రాగి, కోబాల్టు ధాతువు, లోహపు ఖనిజాలు మిలియన్ టన్నుల సామర్థ్యంతో అత్యధికంగా యాంత్రికీకరించబడ్డాయి. లోహపు ఖనిజాల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. కాంగో దెమొక్రటిక్ రిపబ్లికు ప్రపంచంలోని రెండవ అతిపెద్ద వజ్ర-ఉత్పాదక దేశంగా ఉంది. ఉత్పత్తిలో చాలా భాగం నైపుణ్యం కలిగిన చిన్నతరహా, పరిశ్రమలు భాగస్వామ్యం వహిస్తున్నాయి.

1960 లో స్వతంతంత్రం లభించిన తరువాత డి.ఆర్.సి. దక్షిణాఫ్రికా తరువాత ఆఫ్రికాలో రెండవ అత్యంత పారిశ్రామికీకరణ దేశంగా ఉంది. ఇది అభివృద్ధి చెందుతున్న మైనింగ్ రంగం, వ్యవసాయ రంగాన్ని కలిగి ఉంది.

1996 లో మొదటి, రెండవ కాంగో యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ఈ వైరుధ్యాలు జాతీయ ఉత్పత్తి, ప్రభుత్వ ఆదాయాలను నాటకీయంగా తగ్గించి బాహ్య రుణాలను పెంచాయి. యుద్ధం ఫలితంగా సంభవించిన కరువు, వ్యాధుల కారణంగా ఐదు మిలియన్లకు పైగా ప్రజలు మరణించారు. దేశ జనాభాలో సుమారు మూడింట రెండు వంతుల మందిని పోషకాహారలోపం ప్రభావితం చేస్తుంది.[ఆధారం చూపాలి]

యుద్ధాలఫలితంగా ఫలితంగా మౌలిక సదుపాయాలు క్షీణించడం, క్లిష్టమైన నిర్వహణ ఏర్పడిన అనిశ్చితి కారణంగా విదేశీ వ్యాపార కార్యకలాపాలు తగ్గించాయి. యుద్ధం అనిశ్చిత చట్టనిర్మాణం, అవినీతి, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ ఆర్థిక విధానం పారదర్శకత లేకపోవడం, వంటి వాటి ప్రాధమిక సమస్యల ప్రభావం తీవ్రమైంది.

2002 చివరిలో పరిస్థితులు అభివృద్ధి చెందాయి. దాడిలో పాల్గొన్న విదేశీ దళాలలో అధిక భాగం ఉపసంహరించబడింది. అనేక అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు కార్యకలాపాలు ప్రభుత్వ ఆర్థికప్రణాళికను అభివృద్ధి చేయడానికి సహాయపడింది. అధ్యక్షుడు జోసెఫ్ కబిల్ సంస్కరణలను అమలు చేయడం ప్రారంభించారు. ఇప్పటికీ పలు ఆర్ధిక కార్యకలాపాలు జి.డి.పి. డేటా వెలుపల ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్టు ఆధారంగా డీ.ఆర్.సీ మానవ అభివృద్ధి సూచిక దశాబ్దాలకాలం అత్యంత ఘోరంగా ఉందని స్పష్టం అయింది. 2011 నాటికి డి.ఆర్.సి. 187 దేశాలలో అత్యల్ప మానవ అభివృద్ధి సూచికను కలిగి ఉంది. 2010 నాటికి దేశం మెరుగైన అభివృద్ధిని సాధించినప్పటికీ నైగర్ కంటే తక్కువగా ఉంది.[ఆధారం చూపాలి]

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
DR Congo's Human Development Index scores, 1970–2010.
కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Collecting firewood in Basankusu.

డి.ఆర్.సి. ఆర్ధిక వ్యవస్థ ఎక్కువగా మైనింగ్ మీద ఆధారపడుతుంది. అయినప్పటికీ చిన్న-స్థాయి ఆర్ధిక కార్యకలాపాలు అనధికారిక రంగం లో జరుగుతాయి. ఇది జి.డి.పి. డేటాలో ప్రతిబింబిస్తుంది. డి.ఆర్.సి. వజ్రాలలో మూడవ వంతు అక్రమ రవాణా చేయబడుతుందని విశ్వసిస్తున్నారు. అందు వలన వజ్రాల ఉత్పత్తి స్థాయిలను గణించడం కష్టమవుతుంది. 2002 లో దేశం తూర్పు ప్రాంతంలో తగరం కనుగొనబడింది. కానీ అది ఇప్పటి వరకు మాత్రమే చిన్న స్థాయిలో తవ్వబడింది. కాల్టాన్, కాసిటరైట్, టంటాలం, టిన్ ఖనిజాలు వంటి ఖనిజాల అక్రమరవాణా తూర్పు కాంగోలో యుద్ధంనికి ఇంధనంగా దోహదపడింది.

2004 సెప్టెంబరులో ప్రభుత్వ యాజమాన్యం జెకామైంసు డాన్ గెర్లెర్ ఇంటర్నేషనల్, బెని స్టెయిన్మెట్జ్ గ్లోబల్తో విలీనమై కంగంగా, టిల్వెజ్బేమ్ రాగి గనుల నిర్వహణా, పునరావాసం బాధ్యతకు ఏర్పడిన " గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ కార్పోరేషను " తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం అధ్యక్ష శాసనం ద్వారా ఆమోదించబడింది. 2007 లో వరల్డ్ బ్యాంక్ నివేదిక గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ కంపెనీతో సహా డి.ఆర్. కాంగో మూడు అతిపెద్ద మైనింగ్ ఒప్పందాలను సమీక్షించింది. ఒప్పందాలలో పారదర్శకత పూర్తిగా లేదని భావించబడింది. గర్టలరు, స్టెయిన్మెట్జ్ కొమొటో ప్లివెయిరా 75% వాటాను స్వాధీనం చేసుకుంది. 2007 నాటికి మార్కెట్ క్యాపిటలైజేషన్ $ 1.5 బిలియన్లకు చేరుకుంది. 2007 ఫిబ్రవరిలో నికానోర్ మైనింగ్ కంపెనీలో 22% గెర్ట్నర్ ఫ్యామిలీ ట్రస్టు, డాన్ గర్టులరు 14% సొంతం చేసుకున్నాయి. 2008 జనవరిలో కటంగా మైనింగ్ నికనారును $ 452 మిలియన్లకు కొనుగోలు చేసింది.

ఏప్రిల్ 2006 ఏప్రెలులో గెర్టలరు డి.జి.ఐ, డి.ఇ.ఎం మైనింగ్ అత్యధిక భాగం స్వాధీనం చేసుకుంది.

కటాంగాలో ఒక కోబాల్ట్-కాపర్ మైనింగ్ , సేవల సంస్థలో ఒక పెద్ద వాటాను తీసుకుంది. 2006 జూన్‌లో గెర్టలర్ జింబాబ్వే వ్యాపారవేత్త జాన్ బ్రెడ్డాంప్టు నుండి $ 60 మిలియన్లకు ట్రెమల్టును కొన్నాడు. ట్రిమాల్టు ముకొండో మైన్లో సగం వాటా కలిగి ఉంది. 2007 లో ట్రెమల్ట్ ప్రైరీ ఇంటర్నేషనల్ లిమిటెడును స్వంతం చేసుకుంది. వీటిలో డాన్ గర్టలరు కుటుంబట్రస్టు ఒక ప్రధాన వాటాదారుగా ఉంది. ట్రిమాల్టు సవానా మైనింగ్లో 80% వాటాను కలిగి ఉంది. దీనికి కంగాంగా ప్రావింసులో C17, C18 రాయితీలు, ముకుండో ప్రాజెక్టులో 50% ఉన్నాయి. మరో 50% ముకోండో బాస్ మైనింగుకు ఉంది. దీనిలో 80% కేంద్ర సెంట్రల్ ఆఫ్రికన్ మైనింగ్ & ఎక్‌ప్లొరేషన్ కంపెనీకి చెందినది. బాస్ మైనింగ్ బ్రోడెంకాంప్ ముకోండో సగం అద్దెకు తీసుకుని నిర్వహించింది. ఈ ఏర్పాటుకు గర్టలరు ముగింపు పలికాడు.

స్విస్ యాజమాన్య సంస్థ కాటిగా మైనింగ్ లిమిటెడ్, లూయిల మెటలర్జికల్ ప్లాంటును కలిగి ఉంది. ఇది 1,75,000 టన్నుల రాగి, సంవత్సరానికి 8,000 టన్నుల కోబాల్ట్ సామర్థ్యం కలిగి ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద కోబాల్ట్ రిఫైనరీగా ఉంది. ఒక ప్రధాన పునరావాస కార్యక్రమం తర్వాత కంపెనీ డిసెంబరు 2007 డిసెంబరులో రాగి ఉత్పత్తి కార్యకలాపాలను పునరుద్ధరించింది. 2008 మే లో కోబాల్ట్ ఉత్పత్తిని ప్రారంభించింది.

ఏప్రిల్ 2013 లో " వృద్ధి చెందుతున్న ఉత్పత్తి, సానుకూల పారిశ్రామిక పనితీరు ఉన్నప్పటికీ, మైనింగ్ రంగం నుండి $ 88 మిలియన్ల పన్నులు వసూలు చేయడంలో పన్నుల అధికారులు విఫలమయ్యాయని అవినీతి వ్యతిరేక ఎన్జిఓలు వెల్లడించారు. 2010 నుండి అదృశ్యం అయిన నిధులను , పన్ను సంస్థలు వాటిని కేంద్ర బ్యాంకులోకి చెల్లించాలి. తరువాత 2013 లో " ఎక్‌స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్ ట్రాన్స్పరెన్సీ ఇంషియేటివ్ " తగినంత నివేదిక కొరత, నిర్వహణ మొదలైన కారణాలతో దేశసభ్యత్వం సస్పెండు చేయబడింది. 2013 జూలైలో దేశం పారదర్శకత పద్ధతులను మెరుగుపరచిన తరువాత పూర్తిస్థాయి సభ్యత్వం ఇవ్వబడింది.

2018 ఫిబ్రవరిలో ప్రపంచ ఆస్తుల నిర్వహణ సంస్థ అలయంసుబర్నుస్టెయిన్ కోబాల్ట్ వనరుల కారణంగా డి.ఆర్.సి. ఆర్ధికంగా " సౌదీ అరేబియా ఎలెక్ట్రిక్ వెహికల్ ఏజ్ " గా నిర్వచించారు. ఎలక్ట్రిక్ వాహనాలను నడిపించే లిథియం-అయాన్ బ్యాటరీలకు ఇది అవసరమైన ముడిసరకు.

రవాణాసౌకర్యాలు

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Train from Lubumbashi arriving in Kindu on a newly refurbished line.

కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్లో భూమి ప్రయాణం ఎప్పుడూ కష్టంగా ఉంటుంది. కాంగో నదీ ముఖద్వార భూభాగం, వాతావరణం రహదారి, రైలు మార్గ నిర్మాణాలకు తీవ్రమైన అడ్డంకులుగా ఉన్నాయి. ఈ విస్తారమైన దేశంలో దూరాలు అపారంగా ఉంటాయి. డి.ఆర్.సి.లో మరిన్ని నౌకాయాన నదులు ఉన్నాయి. ఆఫ్రికాలో ఏ ఇతర దేశం కంటే పడవ, ఫెర్రీ ద్వారా ప్రయాణికులను, వస్తువులను తరలిస్తుంది. అయినప్పటికీ దేశంలో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వస్తువులకు, ప్రజలకు ఏకైక ప్రభావవంతమైన రవాణాసౌకర్యం వాయుమార్గం మాత్రమే ఇస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక నిర్వహణలో, రాజకీయ అవినీతి, అంతర్గత విభేదాలు దీర్ఘకాలికంగా మౌలిక నిర్మాణాలలో తగినంత పెట్టుబడుల కొరతకు దారితీశాయి.

రైలు

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Map of rail network

రైలు రవాణాను కాంగో రైల్రోడ్ కంపెనీ (సోసిటే నేషనలే డెస్ చెమిన్స్ డి ఫెర్ డు కాంగో), ఆఫీస్ నేషనల్ డెస్ ట్రాంసుపోర్టు(కాంగో), యులే రైల్వేస్ కార్యాలయం (ఆఫీస్ డెస్ చెమిన్స్ డి ఫెర్ డెస్ యులేస్) అందిస్తున్నాయి. కాంగోలోని మౌలిక సదుపాయాల మాదిరిగానే రైల్వేలు రల్వేలు మురికిగా, రద్దీగా, ప్రమాదకరమైనవిగా పేలవంగా నిర్వహించబడుతున్నాయి.

రహదారులు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో జనసంఖ్యాపరంగా, వైశాల్యపరంగా (2,250 కిమీ (1,400 మైళ్ళు)) పోల్చి చూస్తే ఇతర దేశాలకంటే తక్కువ పరిమాణంలో పేవ్మెంటు నిర్మించిన రహదారులను కలిగి ఉంది. రహదారులలో 1,226 కి.మీ. (762 మైళ్ళు) పొడవైన రహదారులు మంచి స్థితిలో ఉన్నాయి. (క్రింద చూడండి ). దేశంలోని దూరం ఏ రెండు దిశల మద్య దూరం అయినా 2,500 కి.మీ (1,600 మై) కంటే అధికంగా ఉంటుంది (ఉదా. మటాడి నుండి లుబుంబాషి మద్య దూరం 2,700 కి.మీ (1,700 మై) రహదారి మార్గం). 1,000,000 జనాభాకు 2,250 కి.మీ (1,400 మై)పొడవైన రహదారి ఉండగా ఇందులో పేవ్మెంటు నిర్మించిన రహదారి 35 కి.మీ (22 మై) ఉంది. జాంబియా, బోత్సువానా వరుసగా 721 కిమీ (448 మైళ్ళు), 3,427 కిలోమీటర్లు (2,129 మైళ్ళు) ఉన్నాయి.

డెమొక్రటిక్ రిపబ్లుకు కాంగో ట్రాన్స్-ఆఫ్రికన్ హైవే నెట్వర్కు పాస్లో మూడు మార్గాలు ఉన్నాయి:

  • ట్రిపోలి-కేప్ టౌన్ హైవే: ఈ మార్గం జాతీయ రహదారి నం 1 న కిన్షాసా, మాటాడి మధ్య దేశంలోని పశ్చిమ అంచు వరకు వెళుతుంది. ఇది సరైన స్థితిలో ఉన్న ఒకే ఒక్క పేవ్మెంటు ఉన్న ఈ రహదారి పొడవు 285 కిమీ (177 మైళ్ళు) ఉంది.
  • లాగోస్-మొంబాసా హైవే: డి.ఆర్. కాంగో ఈ తూర్పు-పశ్చిమ రహదారిలో ఉంది. ఇది పనిచేయడానికి ముందు కొత్త రహదారిని నిర్మిస్తుంది.
  • బెయిరా-లాబిటో హైవే: ఈ తూర్పు-పశ్చిమ రహదారి కటాంగాను దాటుతుంది. ఈ రహదారి మొత్తం పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది. అంగోలాన్ సరిహద్దులో కోల్వజీ, లుబుంబాషిల మధ్య భూమార్గంగా సేవలందిస్తున్న ఈ రహదారి చాలా అధ్వాన్నపు పరిస్థితుల్లో ఉంది. జాంబియా సరిహద్దుకు కొద్ది దూరంలో తక్కువ పొడవైన రహదారి పేవ్మెంటు చేయబడి మంచి పరిస్థితిలో ఉంది.

నీరు

కాంగో డెమొక్రాటిక్ రిపబ్లికులో వేలాది కిలోమీటర్ల నౌకాయాన జలమార్గాలు ఉన్నాయి. దేశంలో నీటి రవాణా దాదాపు మూడింట రెండు వంతుల రవాణా సేవలు అందిస్తున్నాయి.

వాయుమార్గం

డి.ఆర్. కాంగోలో " కెన్యా ఎయిర్వేస్ కిన్షాసా " అంతర్జాతీయ విమానాశ్రయంలో కాంగో ఎయిర్వేసు బేసు ఉంది. యురేపియన్ కమీషన్ తగినంత సురక్షిత స్థాయి అర్హతలు లేనికారణంగా డి.ఆర్.సి. సర్టిఫికేటు పొందిన విమానాలన్నింటినీ యురేపియన్ యూనియన్ విమానాశ్రయాలలో నిషేధించింది.

కిన్షాసా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుండి అనేక అంతర్జాతీయ విమాన సర్వీసులు, లుబుంబాషి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో కూడా కొన్ని అంతర్జాతీయ విమానాలు విమాన సేవలు అందిస్తున్నాయి.

విద్యుత్తు

2008 లో దేశీయంగా బొగ్గు, ముడి చమురు వనరులు ప్రధానంగా ఉపయోగించబడ్డాయి. కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ కాంగో నది నుండి ఇంగ ఆనకట్ట వద్ద జల విద్యుత్తు ప్రాజెక్టు ఉంది. కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్రికా 50% అడవులను, ఒక నది వ్యవస్థను కలిగి ఉంది. అది మొత్తం ఖండానికి అవసరమైన జల విద్యుత్తును అందించగలదు. ఐఖ్యరాజ్యసమితి నివేదిక ఆధారంగా దేశం వ్యూహాత్మక ప్రాముఖ్యత కేంద్ర ఆఫ్రికాలో ఆర్థిక శక్తిగా సమర్ధవంతమైన పాత్రవహించగలదని భావించబడుతుంది.

విద్యుత్ ఉత్పాదన, పంపిణీలకు సోసైటే నేషనల్ డిఎల్ఎలెక్ట్రిసిటే చేత నియంత్రించబడుతుంది. అయితే ఇది దేశంలో 15% మాత్రమే విద్యుత్తు అందిస్తుంది.

పునరుత్పాతక విద్యుత్తు

డి.ఆర్.సి.లో సూర్యరశ్మి విస్తారంగా ఉంది. ఇది డి.ఆర్.సి.లో సౌరవిద్యుత్తు అభివృద్ధి కొరకు శక్తివంతంగా సహకరిస్తుంది. ప్రస్తుతం డి.ఆర్.సి.లో 836 సౌరశక్తి వ్యవస్థలు ఉన్నాయి. ఈక్వేటియర్ ప్రొవింసులో 83 కి.వా శక్తికలిగినవి (167), కటాంగా (159), నోర్డ్-కివువు (170), రెండు కసయ్ ప్రావిన్సెసులో (170), బస్- కాంగో (170) ఉన్నాయి. అలాగే కారిటాసు సిస్టానికి స్వతం అయిన 6.31 కి.వా శక్తికలిగినవి 148 ఉన్నాయి.

విద్య

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
A classroom in the Democratic Republic of the Congo.

2014 లో డి.హెచ్.ఎస్. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా 15 నుండి 49 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న ప్రజల అక్షరాశ్యత 75.9% (పురుషులు 88.1%, స్త్రీలు 63.8%) గా అంచనా వేయబడింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో విద్యావ్యవస్థను మూడు ప్రభుత్వ మంత్రిత్వశాఖలను నిర్వహిస్తుంది: మినిస్టర్ డి ఎల్ 'ఎన్సీగ్మెంటేషన్ ప్రైమిరే, సెకండరీ అండ్ ప్రొఫెషినలు, ది మినిస్టీర్ డి ఎల్' ఎన్సీగ్మెంమెంటు సుప్రీయూరు అండ్ యూనివర్సరీ, మినిస్టీర్ డెస్ అఫైర్స్ సోషెసు. కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ప్రాధమిక విద్య ఉచితం కానీ తప్పనిసరి కానీ కాదు.[ఆధారం చూపాలి] కానీ కాంగో ఇది ఉండాలి రాజ్యాంగం చేసినప్పటికీ (2005 కాంగో రాజ్యాంగంలోని ఆర్టికల్ 43) అమలు కాలేదు.

1990 చివరలో 6-సంవత్సరాల పౌర యుద్ధం ఫలితంగా దేశంలో 5.2 మిలియన్ల మంది పిల్లలు ఏ విద్యను పొందలేదు. పౌర యుద్ధం ముగిసినప్పటి నుండి పరిస్థితి ప్రాథమికంగా అభివృద్ధి చెందింది. ప్రాథమిక పాఠశాలల్లో 2002 లో 5.5 మిలియన్ల ఉన్న విద్యార్ధుల హాజరు 2014 నాటికి 13.5 మిలియన్లకు చేరుకుంది. 2007 లో 2.8 మిలియన్ల విద్యార్ధులు ఉన్న సెకండరీ పాఠశాలలలో నమోదు చేసుకున్న పిల్లల సంఖ్య యునెస్కో ఆధారంగా 2014 లో 4.4 మిలియన్లకు చేరింది.

ప్రాధమిక పాఠశాల హాజరు 2014 లో 82.4% ఉన్నట్లు అంచనా వేయబడింది (82.4% పిల్లలు వయస్సు 6-11 వయస్సు పిల్లలకు, బాలురు 83.4%, బాలికలు 80.6%).

ఆరోగ్యం

కాంగో డెమొక్రాటిక్ రిపబ్లికులో ఆసుపత్రులు కింషాసా జనరల్ హాస్పిటల్ ఉంది. డి.ఆర్.సి.లో శిశు మరణాల సంఖ్య ప్రపంచంలోని రెండవ అత్యధిక శాతణ్ (చాద్ తరువాత) ఉంది. 2011 ఏప్రెలు లో గ్లోబల్ అలయన్స్ ఫర్ టీకాన్స్ ద్వారా న్యుమోకాకల్ వ్యాధిని నివారించడానికి కొత్త టీకాను కిన్షాసా పరిసరాలలో ప్రవేశపెట్టారు.

2012 లో 15-49 మధ్యకాలంలో 1.1% మంది పెద్దవాళ్ళు ఎయిడ్సుతో జీవిస్తున్నారని అంచనా వేయబడింది. మలేరియా కూడా సమస్యగా ఉంది. డి.ఆర్.సి.ని పసుపు జ్వరం కూడా ప్రభావితం చేస్తుంది.

డి.ఆర్.సి.లో ప్రసవించిన తల్లి ఆరోగ్యం పేలవంగా ఉంది. 2010 అంచనాల ప్రకారం డి.ఆర్.సి. ప్రపంచంలో 17 వ అత్యున్నత ప్రసవించిన తల్లుల మరణ శాతం కలిగి ఉంది.

యునెస్కో ఆధారంగా 5 సంవత్సరాల లోపు పిల్లలలో 43.5% మంది పోషకాహార లోపం, తగినంత పెరుగుదల లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారని భావిస్తున్నారు.

నేరం , చట్టం

కాంగో డెమొక్రటిక్ రిపబ్లికులో " ది కాంగోలీసు నేషనల్ పోలీసు " ప్రధాన పోలీసు ఫోర్సుగా ఉంది.

గణాంకాలు

సంప్రదాయ సమూహాలు

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Kongo youth and adults in Kinshasa, Democratic Republic of Congo
Population
Year Million
1950 12.2
2000 47.1
2016 78.7
కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Amani festival in Goma
కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఉత్తర కివూలో, రుత్షురులో ఒక కుటుంబం

కాంగో డెమొక్రాటిక్ రిపబ్లికులో 200 పైగా జాతి సమూహాలు ఉన్నాయి. వీరిలో బంటు ప్రజలు సంఖ్యాపరంగా ఆధిఖ్యతలో ఉన్నారు. మొంగో, లూబా, కొంగో ప్రజలు (బంటు), మంగెబెట్-ఆజాండే ప్రజలు కలిసి 45% జనాభా ఉన్నారు. కాంగో డెమొక్రటిక్ రిపబ్లికులో కాంగో ప్రజలు సంఖ్యాపరంగా అతిపెద్ద జాతి సమూహంగా ఉంది. గోమాలోని అమాని పండుగ

2016 లో ఐక్యరాజ్యసమితి దేశ జనాభాను 79 మిలియన్ల ఉన్నట్లు అంచనా వేసింది. యుద్ధం కొనసాగుతున్నప్పటికీ 1992 లో 39.1 మిలియన్ల ఉన్న డి.ఆర్.సి. జనసంఖ్య 2016 నాటికి వేగంగా అధికరించింది. దాదాపు 250 జాతుల సమూహాలు గుర్తించబడి పేరు పెట్టబడ్డాయి. చాలా మంది ప్రజలు కోంగో, లూబా, మొంగో జాతికి చెందినవారై ఉన్నారు. 6,00,000 మంది పిగ్మీలు డి.ఆర్. కాంగో ఆదిమవాసులుగా గుర్తించబడుతూ ఉన్నారు. పలు వందల స్థానిక భాషలు, మాండలికాలు మాట్లాడబడుతున్నప్పటికీ ఫ్రెంచి, జాతీయ భాషలు కిటిబా, షిషబా, స్వాహిలి, లింగలా భాషలు విస్తృతంగా ఉపయోగించడం వీటిని ఫ్రెంచి భాషతో మిశ్రితం చేసి వక్రీకరిస్తారు.

కాంగో యువత , పెద్దలు, కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ జనాభా [3] ఇయర్ మిలియన్ 1950 12.2 2000 47.1 2016 78.7

వలసలు

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
2012 ఏప్రెలు 30 న ఎఫ్.ఎ.ఆర్.డి.సి, తిరుగుబాటు గ్రూపుల మధ్య పోరాటం కారణంగా వారి గ్రామాల ఉత్తర కివూకు పారిపోతున్న ప్రజలు

దేశంలో భౌగోళిక పరిస్థితి విశ్వసనీయ వలస గణాంకాలను పొందడం చాలా కష్టం. అయినప్పటికీ వారి సంఖ్యలో ఇటీవలి క్షీణత ఉన్నప్పటికీ డి.ఆర్.సి. వలసదారుల కొరకు గమ్యస్థాన దేశంగా కొనసాగుతుందని సాక్ష్యాలు సూచిస్తున్నాయి. ఇమ్మిగ్రేషన్ చాలా వైవిధ్యమైనది; గ్రేట్ లేక్సు ప్రాంతంలో హింసాత్మక ఘర్షణల కారణంగా దేశంలో ప్రవేశిస్తున్న శరణార్థులు, ఆశ్రయం కోరి వచ్చేవారు జనాభాలో ఒక ముఖ్యమైన వర్గంగా మారారు. అదనంగా దేశంలో ఉన్న బృహత్తర గని కార్యకలాపాలు ఆఫ్రికా నుండి, ఆఫ్రికా వెలుపలి ప్రాంతాల నుండి ఉపాధి వెతుక్కుంటూ వచ్చే ప్రజలను అధికంగా ఆకర్షించింది. ఇతర ఆఫ్రికన్ దేశాలు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి వాణిజ్య కార్యకలాపాల కొరకు వచ్చే గణనీయమైన వలసలు కూడా ఉన్నాయి. కానీ ఈ ఉద్యమాలు బాగా అధ్యయనం చేయబడలేదు. దక్షిణాఫ్రికా, ఐరోపా వైపుగా ట్రాన్సిట్ వలసలు కూడా తగిన పాత్ర పోషిస్తున్నాయి.

గత రెండు దశాబ్దాల్లో డిఆర్సికి వలసలు నిలకడగా తగ్గాయి. దేశంలో సంభవించిన సాయుధ హింసాకాండ ఫలితంగా ఇది సంభవించింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఆధారంగా డి.ఆర్.సి. వలసదారుల సంఖ్య 1960 లో 1 మిలియన్లు ఉన్న వలసలు 1990 లో 7,54,000 కు, 2005 లో 4,80,000 కు, 2010 లో 4,45,000 గా అంచనా వేయబడింది. డి.ఆర్.సి.లో అనధికారిక ఆర్థిక వ్యవస్థ కారణంగా అధికారిక గణాంకాలు అందుబాటులో లేవు. విదేశాల్లో కాంగో దేశస్థులకు చెందిన గణాంకాలు 3 - 6 మిలియన్ల వరకు ఉన్నారని అంచనా. అధికారిక, విశ్వసనీయమైన డేటా లేకపోవడం వలన ఈ వ్యత్యాసం ఏర్పడింది. 2000 గణాంకాల ఆధారంగా డి.ఆర్.సి.లో దీర్ఘకాలం నుండి సాగిన వలసల కంటే అధికరించినట్లు భావిస్తున్నారు. వలసదారుల చాలామంది ఆఫ్రికాలో (79.7%,) నివసిస్తున్నారు. ఐరోపాలో (15.3%) కొంత మంది ఉన్నారు. కొత్త గమ్యస్థాన దేశాలలో దక్షిణాఫ్రికా, ఐరోపాలలో వివిధ కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో డి.ఆర్.సి. గణనీయమైన సంఖ్యలో శరణార్థులు, ఆశ్రయం కోరి దేశం వదిలి పోయే ప్రజలను ఉత్పత్తి చేసింది. ఈ సంఖ్యలు 2004 లో UNHCR ఆధారంగా డి.ఆర్.సి. నుండి వెళ్ళిన శరణార్ధులు 4,60,000 కంటే అధికంగా ఉన్నారు. 2008 లో కాంగో శరణార్థులు మొత్తం 3,67,995 మందితో ఉన్నారు. వారిలో 68% ఇతర ఆఫ్రికన్ దేశాల్లో నివసిస్తున్నారు. 2003 నుండి 4,00,000 కంటే అధికంగా కాంగో వలసదారులు అంగోలా నుండి బహిష్కరించబడ్డారు.

మతం

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో క్రైస్తవమతం సంఖ్యాపరంగా ఆధిఖ్యతలో ఉంది. 2013-2014లో డెమోగ్రాఫిక్ అండ్ హెల్త్ సర్వేస్ ప్రోగ్రామ్ నిర్వహించిన సర్వేలో క్రైస్తవులు 93.7% (కాథలిక్లు 29.7%, ప్రొటెస్టంటులు 26.8%, ఇతర క్రైస్తవులు 37.2%) ఉన్నారు అని అంచనావేయబడింది. ఒక స్థానిక మతం కింబంగుయిజం మతానికి 2.8% అనుయాయులు ఉండగా, ముస్లింలు 1.2% మంది ఉన్నారు. ఇతర ఇటీవలి అంచనాల ఆధారంగా క్రైస్తవ మతం మెజారిటీ మతంగా తరువాత 2010 ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనాల ఆధారంగా కరిస్తవుల సంఖ్య 95.8% ఉందని అంచనా వేయబడింది. సి.ఐ.ఎ. వరల్డ్ ఫాక్ట్ బుక్ ఈ సంఖ్య 80% అని అంచనావేసింది. ప్యూ రీసెర్చ్ సెంటర్ 2013 డేటా. ఇస్లాం అనుచరుల నిష్పత్తి %నుండి 10% ఉండవచ్చని భావిస్తున్నారు. స్థానిక విశ్వాస అనుచరులు అనుచరులు 3-10% వరకు ఉన్నట్లు అంచనా వేస్తారు.

దేశంలో సుమారు 35 మిలియన్ కాథలిక్కులు ఉన్నారు. ఆరు ఆర్కిడియోసెసు, 41 డియోసెస్లు ఉన్నాయి. కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్లో కాథలిక్ చర్చి ప్రభావం అంచనా వేయడం కష్టం. క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రాధమిక పాఠశాలలలో 60% కంటే అధికమైన విద్యార్ధులు ఉన్నారు. మాధ్యమిక విద్యార్థులలో 40% కంటే ఎక్కువగా విద్యార్ధులు ఉన్నారు. ఆసుపత్రులు, పాఠశాలలు, క్లినిక్లు, అలాగే పొలాలు, గడ్డిబీడులు, దుకాణాలు, ఆర్టిసన్ దుకాణాలు వంటి అనేక డియోసెసన్ ఆర్ధిక సంస్థలు ఉన్నాయి. ఈ చర్చికి విస్తృతమైన నెట్వర్కు నిర్వహిస్తుంది.[ఆధారం చూపాలి]

కాలనీ పాలనకు బెదిరింపుగా ఉన్న " కింబంగుయిజ " ను బెల్జియన్ నిషేధించింది. అధికారికంగా " ది చర్చి ఆఫ్ క్రైస్టు ఆన్ ఎర్తు బై ది ప్రొఫెట్ సైమన్ కింబంగు " లో ప్రస్తుతం మూడు మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు. ప్రధానంగా బస్-కాంగో , కిన్షాసాలో ఉంది.

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
బుకావులోని అవర్ లేడీ ఆఫ్ పీస్ కేథడ్రల్

కాంగోలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆధ్వర్యంలో అరవై రెండు ప్రొటెస్టెంటు తెగల సమాఖ్యలు ఉన్నాయి. ఇది తరచుగా ప్రొటెస్టంటు చర్చి అని పిలువబడుతుంది. ఎందుకంటే అది చాలామంది డిఆర్సి ప్రొటెస్టంట్లు కలుపుతుంది. 25 మిలియన్ల మంది సభ్యులతో ఇది ప్రపంచంలోని అతి పెద్ద ప్రొటెస్టంట్ సంస్థలలో ఒకటిగా ఉంది.

ప్యూ ఫోరం ఆధారంగా 12% జనాభా ఇస్లాం ధర్మం ఆచరిస్తున్నారని భావిస్తున్నారు. సి.ఐ.ఎ. వరల్డ్ ఫాక్ట్ బుక్ ప్రకారం, ముస్లింలు జనాభాలో 10% ఉన్నారు. ఇస్లాం మతాన్ని ప్రధానంగా వర్తకులు, బానిసల రైడర్లు ద్వారా వ్యాప్తి చెందారు. కాంగోలో ముస్లింలు సున్నీలు (50%), షియాస్ (10%), అహ్మదిస్ (6%), వర్తక ముస్లింలు (14%) విభజించబడ్డారు. 2013 లో అల్-ఖైదాతో ముడిపడిన మిత్రరాజ్యాల ప్రజాస్వామ్య బలగాలు, కాంగోలో దాడులకు పాల్పడటం ప్రారంభించి పౌరులలో ఎక్కువగా క్రైస్తవులను చంపింది.

ఉగాండా నుండి 1953 లో దేశంలోకి బహాయి విశ్వాసం మొదటి సభ్యులు వచ్చారు. నాలుగు సంవత్సరాల తరువాత మొదటి స్థానిక పరిపాలక కౌన్సిల్ ఎన్నికయ్యింది. 1970 లో జాతీయ ఆధ్యాత్మిక అసెంబ్లీ (జాతీయ పరిపాలనా మండలి) మొదటిసారి ఎన్నికయ్యారు. విదేశీ ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించినందు వలన 1970 - 1980 లలో మతం నిషేధించినప్పటికీ, 1980 ల చివరినాటికి నిషేధం ఎత్తివేయబడింది. దేశంలో ఒక జాతీయ బహాయిని ఆరాధనను నిర్మించడానికి 2012 లో ప్రణాళికలు ప్రకటించబడ్డాయి.

సాంప్రదాయిక మతాలు ఏకస్వామ్యవాదం, అనిమిజం, ప్రాణాధారం, ఆత్మ, పితరుల ఆరాధన, మంత్రవిద్య, వశీకరణం భావనలను కలిగి ఉంటాయి. సాంప్రదాయిక విభాగాలు తరచుగా క్రైస్తవ మతం సాంప్రదాయిక విశ్వాసాలు, ఆచారాలతో విలీనమవుతాయి. క్రిస్టియానిటీలో ప్రధాన స్రవంతిని చర్చిలు గుర్తించవు. అమెరికా ప్రేరేపిత పెంటెకోస్టల్ చర్చి నేతృత్వంలో పిల్లలు, వృద్ధులకు వ్యతిరేకంగా మంత్రవిద్య ఆరోపణలు ముందంజలో ఉన్నాయి.[విడమరచి రాయాలి] మంత్రవిద్యపై ఆరోపణలు ఎదుర్కొంటున్న పిల్లలు తరచుగా గృహాల నుండి కుటుంబం నుండి వీధిలో నివసించటం కారణంగా ఈ పిల్లల మీద శారీరక హింసాకాండ జరగడానికి దారితీస్తుంది.[విడమరచి రాయాలి] ఈ పిల్లలను మామూలు పదం మాస్కోర్స్ (బాల మాంత్రికులు) లేదా మాస్కోట్స్ (మంత్రవిద్యపై ఆరోపణలు ఎదుర్కొంటున్న పిల్లలు) అని పిలుస్తారు. భూతవైద్యం కోసం అన్యాయమైన రుసుము వసూలు చేయడం ద్వారా ఈ నమ్మకంపై పెట్టుబడి పెట్టేందుకు నాన్-హెన్మన్ చర్చి సంస్థలు ఏర్పడ్డాయి. ఇటీవలే నిషేధించినప్పటికీ ఈ భూతవైద్యంలో పిల్లలు స్వీయ-ప్రకటిత ప్రవక్తలు, మతాచార్యుల చేతుల్లో తరచూ హింసాత్మక దుర్వినియోగానికి గురయ్యారు.

Source Christianity
(total)
Catholicism Protestantism Islam Other Source
US State Department 90% 50% 35% 5% 5% [1]
Pew Research Center 96% 47% 48% 1.5% 2.5% [2] [3] Archived 2014-07-19 at the Wayback Machine
CIA World Factbook 80% 50% 20% 10% 10% [4] Archived 2018-12-24 at the Wayback Machine

భాషలు

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Major Bantu languages in the Congo

కాంగో డెమొక్రాటికు రిపబ్లికు అధికారిక భాష ఫ్రెంచి. సాంప్రదాయకంగా కాంగో అనేక జాతి సమూహాల మధ్య అనుసంధాన భాషగా " లింగుయా ఫ్రాంకా " వీలు కల్పించింది. 2014 ఒ.ఐ.ఎఫ్. నివేదిక ప్రకారం 33 మిలియన్ కాంగో ప్రజలు (జనాభాలో 47%) ఫ్రెంచులో చదవడం, వ్రాయగలగడం చేయగలరు. రాజధాని నగరంలో కెన్షాసాలో 67% మంది పౌరులు చదవడం, వ్రాయడం చేయగలరు. 68.5% మాట్లాడటం, అర్థంచేసుకోవడం చేయగలరు. దేశంలో సుమారు 242 భాషలు వాడుకలో ఉన్నాయి. అయితే నాలుగు భాషలు మాత్రమే జాతీయ భాషల హోదా ఉంది: కిటుబు ("కికొంగొ వై లేటా"), లింగాల, తిల్లుబా, స్వాహిలి. కొంతమందికి ఈ ప్రాంతీయ భాషలు, వాణిజ్య భాషలు మొదటి భాషలుగా వాడుకగా ఉన్నాయి. ఎక్కువ మంది ప్రజలకు వారి స్థానిక గిరిజన భాష తర్వాత రెండవ భాషగా వాడుకలో ఉంది. బెల్జియన్ వలసపాలనలో వలస సైన్యం " ఫోర్సు పబ్లిక్ " కు అధికారిక భాషగా ఉన్న లింగలా ఈ రోజు వరకు సాయుధ దళాలలో ప్రధాన భాష ఉంది. ఇటీవల తిరుగుబాటు తరువాత తూర్పున ఉన్న సైన్యంలో గణనీయమైన భాగంలో స్వాహిలీ భాషను ఉపయోగించబడుతూ ప్రాధాన్యత కలిగి ఉంది.

దేశం బెల్జియం కాలనీగా ఉన్నప్పుడు బెల్జియన్ వలసవాదులు ప్రాధమిక పాఠశాలల్లో నాలుగు జాతీయ భాషల బోధన, వాడుకను ప్రవేశపెట్టారు. ఫలితంగా యూరోపియన్ కాలనీల కాలంలో స్థానిక భాషలలో అక్షరాస్యతను కలిగి ఉన్న కొన్ని ఆఫ్రికన్ దేశాలలో ఇది ఒకటిగా మారింది. స్వాతంత్ర్యం తరువాత ఈ ధోరణిని మార్చారు. అన్ని స్థాయిలలో ఫ్రెంచి భాష ఏకైక భాషగా అవతరించింది. 1975 నుండి ప్రాధమిక విద్య మొదటి రెండు సంవత్సరాల్లో తిరిగి నాలుగు జాతీయ భాషలు ప్రవేశపెట్టబడ్డాయి. మూడో సంవత్సరం నుండి ఫ్రెంచి ఏకైక భాషగా మారింది. కానీ పట్టణ ప్రాంతాల్లోని అనేక ప్రాధమిక పాఠశాలలు మొదటి సంవత్సరం నుండి ఫ్రెంచి బోధనాభాషగా ఉన్న పాఠశాలలను ప్రారంభించారు.

సంస్కృతి

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
A Hemba male statue

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో సంస్కృతి దాని వందల జాతి సమూహాల వైవిధ్యం, దేశవ్యాప్తంగా వారి విభిన్న మార్గాల్లో వైవిధ్యతను ప్రతిబింబిస్తుంది - సముద్రతీరంలోని కాంగో ముఖద్వార ప్రాంతాలలో వర్షారణ్యాలు, తరువాత సవన్నా ఉన్నాయి. ఎగువ భాగంలో తూర్పున ఉ జన సాంద్రత కలిగిన పర్వతాలు ఉన్నాయి. 19 వ శతాబ్దం చివరి నుండి వలసపాలన కారణంగా సంప్రదాయ జీవనసరళిలో అనూహ్యమైన మార్పులు సంభవించాయి. స్వాతంత్ర్యం కోసం పోరాటం, మొబూటు యుగం స్తబ్ధత, మొదటి, రెండవ కాంగో యుద్ధాలు తీసుకువచ్చిన మార్పులు ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పటికీ, కాంగో ఆచారాలు, సంస్కృతులు వారి అస్థిత్వాన్ని అధికంగా నిలుపుకున్నాయి. దేశంలో గ్రామీణులు 81 మిలియన్ల మంది (2016 నాటికి) ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న 30% మంది పాశ్చాత్య ప్రభావాలకు అనుకూలంగా ఉన్నారు.

సంగీతం

కాంగో సంస్కృతిలో సంగీతం ప్రధాన భాగంగా ఉంది. డి.ఆర్.సి. క్యూబాసంగీత బాణీలైన రుంబా, మెరెంగ్యూలతో తమ స్వంత జానపద సంగీతబాణీలను మిళితం చేసి సౌకౌస్ సంగీతబాణిని రూపొందించింది. ఇతర ఆఫ్రికన్ దేశాలు కాంగోస్ సౌకాస్ నుంచి ఉత్పన్నమైన సంగీత రీతులను ఉత్పత్తి చేసాయి. ఆఫ్రికన్ బ్యాండ్లలో కొన్నింటిని డి.ఆర్.సి. లోని ప్రధాన భాషల్లో ఒకటైన లింగలాభాషలో పాడుతున్నారు. కాంగోస్ సౌకాస్, "లె సపెయరు " మార్గదర్శకత్వంలో, పాపా వెంబా, ఖరీదైన డిజైనర్ వస్త్రాలు ధరించి యువకుల కోసం సరికొత్త బాణీని సృష్టించారు. వారు కాంగోస్ సంగీతం నాల్గవ తరం అని పిలవబడ్డారు. వీరు ఎక్కువగా మాజీ ప్రసిద్ధ బ్యాండుకు చెందిన వారై ఉన్నారు.మూస:ILL.

క్రీడలు

కాంగో డెమొక్రాటిక్ రిపబ్లికకులో బాస్కెట్బాలు, బాస్కెట్బాలు, రగ్బీ వంటి అనేక క్రీడలు ప్రజాదరణ కలిగి ఉన్నాయి. ఈ క్రీడలను దేశవ్యాప్తంగా " స్టేడ్ ఫ్రెడెరిక్ కిబాసా మాలిబా " అనేక స్టేడియంలలో ఆడుతుంటారు. జైరే 1974 లో ప్రపంచ కప్ ఫుట్బాలు (ఫైనల్ దశ) లో పాల్గొన్నారు.

అంతర్జాతీయంగా దేశం వృత్తిపరమైన బాస్కెట్బాలు బృందం "ఎన్.బి.ఎ " ఫుట్బాలు క్రీడాకారులు ప్రఖ్యాతి వహిస్తున్నారు. డికెంబె ముట్టోమ ఉత్తమ ఆఫ్రికన్ బాస్కెట్ బాల్ ఆటగాళ్ళలో ఒకడుగా ప్రసిద్ధి చెందాడు. ముటొంబొ స్వదేశంలో మానవతా ప్రాజెక్టులకు ప్రసిద్ధి చెందాడు. బిస్సాక్ బ్యోమొం, క్రిస్టియన్ ఐయెంగ, ఇమ్మాన్యూల్ ముడియే, ఇతరులు బాస్కెట్బాలు క్రీడాకారులుగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. కొంగోల సంతతికి చెందిన క్రీడాకారులు స్ట్రైకర్సు రొమేలు లుకాకు, యినికో బోలాసీ, డ్యూమెర్కి మబోకానిలకు ప్రపంచ ఫుట్బాలు క్రీడాకారులుగా ప్రాముఖ్యత లభించింది. డి.ఆర్. కాంగో రెండుసార్లు " నేషన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఆఫ్ ఆఫ్రికన్ కప్ " గెలిచింది.

ఆహారం

కొబ్బరి వంటకం మొక్కజొన్నల మీద ఆధారపడి ఉంటుంది. మరిగే నీటిలో ఉశికించి, కొన్నిసార్లు పిండిచేసి వంటలలో ఉపయోగిస్తారు. ఈ మిశ్రమాన్ని లింగలాలో దీనిని "ఫుఫు", స్వాహిలిలో "బుకాలీ", షిలాబాలో "ట్షిబీలే" అని పిలుస్తారు. డి.ఆర్.సి.లో ఇది ముఖ్యమైన భోజనం. ప్రతి ఒక్కరూ దానిని చేపలు, కోడితో తింటారు. ఇది వారి ఎంపికపై ఆధారపడి ఉంటుంది.

మాధ్యమం

డి.ఆర్.సి. వార్తాపత్రికలు ఎల్.అవెనీరు, రాడియన్ టెలీవిజన్ మ్వంగజా, , ILL, లే ఫేర్, లే పోటెంటైల్, లే సాఫ్టు, లేకోంగ్లాలైస్.సిడి. ఒక వెబ్ ఆధారిత దినపత్రిక ఉంది. రేడియో టెలివిజన్ నేషనల్ కాంగోలైజును కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ జాతీయ ప్రసారం చేస్తుంది. ఆర్.టి.ఎన్.సి. ప్రస్తుతం లింగల నుండి ప్రసారం చేయబడుతుంది. ఇది ఫ్రెంచి, ఆంగ్ల భాషలలో వార్తలు ప్రసారం చేస్తుంది.

సాహిత్యం

కాంగో ప్రజలలో జాతీయ చైతన్యాన్ని అభివృద్ధి చేయడానికి మార్గంగా రచయితలు సాహిత్యాన్ని ఉపయోగించారు. వలసవాదం, యుధ్ధాలతో విషాదంగా జివిస్తున్న కాంగోల ప్రజలు బెల్జియం బలవంతంగా వారిమీద రుద్దిన సంస్కృతిని అంగీకరిస్తూ జీవించవలసిన అవసరం ఏర్పడింది.

బెల్జియన్ ఆఫ్రికన్ ప్రజలకు పోషకులుగా భావించారు. బెల్జియన్ పార్లమెంటు ప్రైవేటు స్వేచ్ఛా స్వేచ్ఛా రాజ్యాన్ని భర్తీ చేసింది. ఈ అంగీకారం భాష విస్తరణకు దారి తీసింది. చాలామంది కాంగోల ప్రజలు ఫ్రెంచిలో మాట్లాడడం, వ్రాయడం చేసారు.

ఆధునిక కాంగో సాహిత్యం 1950 ల చివర్లో మొదలైంది. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు కొన్ని అరుదైన సాహిత్యాలు ఉన్నాయి. 1954 లో ఫ్రెంచి భాషలో రాయబడిన సాహిత్యం 1960 లలో బెల్జియం నుండి స్వాతంత్రం లభించిన తరువాత అది మరుగున పడింది. బెల్జియం నుండి వారి స్వాతంత్ర్యం పొందిన తరువాత గై మెంగా, జీన్ పియరే మాకౌటే-మౌబోకా వంటి కొత్త రచయితలు, జీన్ మలోంగా వంటి పురాతన రచయితలు ప్రోత్సహించబడింది. కాంగోను ప్రభావితం చేసే నూతన అంశాలకు సాహిత్యంలో ప్రాధాన్యత ఇవ్వబడింది. 1970 లో మహిళా రచయితల పెరుగుదల కాంగో సాహిత్యానికి వైవిధ్యాన్ని పరిచయం చేసింది. లింగ సాధికారతకు మద్దతు ఇచ్చింది. కాంగోలే సాహిత్యం విజయవంతం కావడానికి దోహదం చేసిన పలువురు రచయితలు ఆర్థిక, రాజకీయ సమస్యల కారణంగా ప్రస్తుతం విదేశాల్లో నివసిస్తున్నారు.

కాంగోలో పెరిగిన ఫ్రాండ్రిక్ కంబెంబా యమసాన్గీ వలసరాజ్యపాలన, స్వాతంత్ర్యం కోసం పోరాటం, తరువాత కాలంలో రచనలు సాగించాడు.

కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కంటంగా ప్రావిన్స్ నుండి రచయిత రీస్ నెజా బోనెజా నవలలు, కళాత్మక భావాలతో వివాదాల పరిష్కారానికి దారితీసే పద్యాల వంటి రచనలు చేసాడు.

1907 లో జన్మించిన ఒక నవలా రచయిత జీన్ మోలోంగ కథకుడు 1946 నుండి 1951 వరకు పార్లమెంటులో కూర్చున్నాడు. ఆయన తన రచించిన కోయూర్ డి'ఆర్ఎన్నే, హృదయ ఆర్యెన్ వంటి రచనలలో చోటు చేసుకున్న సాంస్కృతిక గుర్తింపు, జాతీయ ఐక్యత అణచివేతకు సంబంధించిన సంస్కరణల వంటి అంశాలు వివాదాంశం అయ్యాయి.

ఈ రచయితలు ఇతరులతో పాటు కాంగోలో జరిగిన సంక్షోభాలు, వివాదాల గురించి అవగాహన కల్పించడానికి సాహిత్యాన్ని తమ వేదికగా ఉపయోగించారు.

పర్యావరణ వివాదాలు

A dense tropical rainforest in the DRC's central river basin and eastern highlands is bordered on the east by the Albertine Rift (the western branch of Africa's Great Rift System). It includes several of Africa's Great Lakes.

Major environmental issues

DR Congo's major environmental issues include:

  • deforestation
  • poaching, which threatens wildlife populations
  • water pollution
  • mining

Displaced refugees cause or are otherwise responsible for significant deforestation, soil erosion and wildlife poaching. Another significant issue is environmental damage from mining of minerals, especially diamonds, gold, and coltan – a mineral used to manufacture capacitors.

పర్యావరణ నష్టం

కాంగో గణతంత్ర రిపబ్లిక్: పేరు వెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
The endangered Mountain Gorilla, half of its population live in the DRC's Virunga National Park, making the park critical habitat for these animals.

కాంగో డెమొక్రాటిక్ రిపబ్లికుతో సంబంధం ఉన్న పర్యావరణ సమస్యల వలన అనేక వృక్ష, జంతు జాతులు ప్రభావితమవుతుంది. డి.ఆర్.సి.లో సవన్నా, చిత్తడినేలలు, వరదలకు గురౌతున్న మైదానాలు వంటి ఇతర పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయి. అలాగే డి.ఆర్.సి.లోని వర్షారణ్యాలు వైశాల్యపరంగా ప్రపంచంలో ద్వీతీయ స్థానంలో(మొదటి స్థానంలో అమెజాన్ వర్షారణ్యాలు ఉన్నాయి) ఉన్నాయి. ప్రపంచ వైల్డ్ లైఫ్ ఫండు నివేదిక ఆధారంగా ప్రపంచంలోని అత్యంత విలువైన వన్యసంపదలో ఒకటిగా భావించబడుతున్న డి.ఆర్.సి.లోని పర్యావరణం, వన్యజీవులు, వర్షారణ్యాల ఉనికి ప్రమాదంలో ఉన్నాయని భావిస్తున్నారు.

జంతువుల నష్టం డి.ఆర్.సి.లో సమస్యగా పేర్కొనబడింది. తద్వారా మైనింగ్, కలప ఇంధనం, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం వంటి వనరులు యుద్ధం, అక్రమ ఆక్రమణ, అధిక జనాభా ఆహారం, ఆహార భద్రత లేకపోవటం వలన వన్యమాంసం అధిక వినియోగం కోసం అటవీ నిర్మూలన కూడా ఒక కారణంగా ఉంది. డి.ఆర్.సి వంటి దేశాల్లో వృక్షజాతుల నష్టాన్ని ఎదుర్కోవడానికి కొన్ని ప్రయత్నాలు ఐఖ్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంటు గోల్సు (ప్రత్యేకంగా భూమి మీద SDG 15 లైఫ్ ఆన్ లైఫ్) కృషి చేస్తుంది. అడవులను తిరిగి పెంచడం, జీవవైవిధ్యం పెంచడం, వృక్షజాతుల నష్టం తగ్గించడం, ఎడారీకరణ, అక్రమ ఆక్రమణలను క్రమబద్ధీకరించడం వీటి ప్రాధమిక లక్ష్యాలుగా ఉన్నాయి. డి.ఆర్.సి. లో వృక్షజాతులు, జంతువుల ఆవాసాల ప్రాధమిక రక్షణలకు జాతీయ ఉద్యానవనాలు, రిజర్వ్ అరణ్యాలు ప్రధానకారణాలుగా ఉన్నాయి. డి.ఆర్.సి.లోని సుమారు 12% వర్షారణ్యాలు సురక్షిత అటవీప్రాంతంగా ఉంది. ఈ పార్కులు, రిజర్వులలో ఐదు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతాల జాబితాలో ఉన్నాయి. వీటిలో ఆఫ్రికా మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం " విరుంగా జాతీయ ఉద్యానవనం " కూడా ఒకటి. ఈ పార్కులు అన్నీ " వరల్డ్ హెరిటేజ్లో " ప్రమాదకర జాబితాలో ఉంచబడ్డాయి. పేలవమైన పాలన, ఆర్ధిక పరిస్థితుల లోపం, ఈ రక్షణల ప్రభావాన్ని (ముఖ్యంగా యుద్ధ సమయాల్లో) తగ్గించాయి. ఈ పార్కులను రక్షించే సిబ్భంధికి చేస్తున్న వ్యయం అధికరించింది. గత 20 సంవత్సరాల్లో 200 పార్కు రేంజర్లు మరణించారు. విరుంగా జాతీయ ఉద్యానవనం, సలోన్గా నేషనల్ పార్క్ రెండూ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతాలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈప్రాంతాలలో మైనింగు, చమురు అన్వేషణ కోసం చూస్తున్నారు. ఇది విరాంగ పార్కులో 21.5% దురుపయోగం చేయబడుతుందని భావిస్తున్నారు. ఇది జంతువుల హక్కుల కార్యకర్తలచే విమర్శించబడింది. ఇది పర్వత గొరిల్లాలు, ఇతర అంతరించిపోతున్న జాతుల నివాసాలను హానికరంగా మారుతుందని ఆందోళనపడుతున్నారు.

ఆటవీ నిర్మూలన

2000 , 2014 మధ్య కాలంలో డి.ఆర్.సి. వార్షికంగా ఆటవీనిర్మూలనలో భాగంగా దాదాపు 5,70,000 హెక్టార్ల (0.2%) వర్షారణ్యాన్ని కోల్పోయింది. 2011 - 2014 మధ్యకాలంలో అత్యధిక అటవీ నిర్మూలన జరిగింది. జీవవైవిధ్యం తగ్గడానికి, ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్యం క్షీణించడం, వన్యజంతువుల ఆవాసాల నష్టానష్టం, వృక్ష జాతుల నష్టానికి ప్రధాన కారణం అటవీ నిర్మూలనగా భావించబడుతుంది. 2020 నాటికి అటవీ నిర్మూలనను తగ్గించడం, తిరిగి అడవులను అభివృద్ధిచేయడం వంటివి ఎస్.డి.జి. 15 లక్ష్యాలలో ఒకటి.

డి.ఆర్.సి. వర్షారణ్యం ఆఫ్రికా అతిపెద్ద వర్షారణ్యంగా గుర్తించబడుతూ ఉంది. ఇది మైనింగ్ కార్యకలాపాలు, వ్యవసాయం, మౌలిక సదుపాయాల నిర్మాణం, ఇంధనంగా కలపను వాడడం అటవీ నిర్మూలనకు దారితీస్తుంది. పేదరికం, విద్యుత్తు ఉత్పాదన కొరత, ప్రజల వికేంద్రీకరణ కారణంగా డి.ఆర్.సి.లో వర్షారణ్యం సంగ్రహించిన కలపను 94% ఇంధనం కోసం ఉపయోగిస్తారు. వర్షారణ్యాలను అత్యుపయోగాన్ని నివారించడానికి ఈ సహాయక సంస్థలు వ్యవసాయ వృక్షాల అటవీ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వేగంగా పెరిగే చెట్లను పెంచి వర్షారణ్యాలలోని వృక్షాలను సంరక్షించడానికి ప్రయత్నించారు. అటవీ నిర్మూలన ఇతర కారణాలలో మైనింగు, సంఘర్షణలు ఉన్నాయి. కాంగో సంఘర్షణలో మిలిషియా గ్రూపులు ఇంధనం కొరకు కలపను ఉపయోగించడం, చిన్న మైనింగ్ కార్యకలాపాలు, వారి కార్యకలాపాలకు నిధుల కోసం అక్రమ కలప విక్రయాలు సాగించడం అటవీ నిర్మూలనకు దారితీసింది. భద్రతా అస్థిరత వలన పెద్ద ఎత్తున మైనింగ్ కోసం అటవీ నిర్మూలన కొంతవరకు తగ్గింది.

డి.ఆర్.సి.లో అటవీ నిర్మూలన, జీవవైవిధ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఒక విధానాన్ని ప్రయత్నిస్తుంది. ఉద్గారాల వాణిజ్య వ్యవస్థను ఉపయోగించుకుంటుంది. తద్వారా అభివృద్ది చెందుతున్న దేశాలు తమ కార్బన్ ఉద్గారాలను ఎగుమతి చేయడం ద్వార లభించే ఆదాయాన్ని తమ అటవీ నిర్వహణ, రక్షణకు, వర్షారణ్యంతో అభివృద్ధి చేయడానికి వినియోగించాలని భావిస్తుంది.

వేటమాంసం

అడవి నుండి సేకరించిన మాంసం వేటమాంసం (బుష్ మీట్) అంటారు. ఎందుకంటే డి.ఆర్.సి.లోని అధిక సంఖ్యలో కొనసాగిన నిరంతర ఘర్షణలు ఆహార కొరతకు దారితీశాయి కాబట్టి ఇది వేటమాంసం వినియోగం అధికరించడానికి దారితీసింది. అయినప్పటికీ వేటమాసం వినియోగంపై సమాచారం అధికంగా లభించ లేదు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 6 మిలియన్ టన్నుల వేటమాంసం వినియోగించబడుతుంది. పర్యావరణ వ్యవస్థ నిర్మాతలు, కీస్టోన్ జాతులుగా ఉండే కొన్ని జాతుల ప్రాముఖ్యత గురించి ఆలోచించకుండా ఏ జంతువులనైనా విచక్షణా రహితంగా చంపేస్తారు.

డి.సి.సి.లో లక్షలాది మందికి వేటమాంసం మాంసకృత్తులకు ముఖ్య వనరుగా ఉంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఇది 50-70% భోజనంగా ఉంటుంది. సాగుచేసిన ఉత్పత్తిని కొనుగోలు చేయలేని కొందరికి అది ఉచిత భోజనం. డి.ఆర్.సి.లోని ఇటీవల అధ్యయనం ప్రతి సంవత్సరం కాంగోలో నుండి దాదాపు అన్ని జంతువులను తీసివేస్తున్నట్లు వెల్లడైంది. అన్ని సజీవ జంతువులలో 93% అటవీప్రాంతంలో వేటమాంసం కోసం సేకరించబడ్డాయి. అమెజాన్తో పోలిస్తే ఇది అతిపెద్ద మొత్తంలో ఉంది. అక్కడ 3% మాత్రమే వేటాడబడుతుంది. ఈ అధ్యయనం కాంగో నదీ ముఖద్వారంలో ఉన్న ప్రజలకు అందించడానికి ఇతర ఆహార వనరులను అందించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయం వెలిబుచ్చింది. మరొక అధ్యయనంలో మాంసం మార్కెట్లో వేటమాంసం అధికంగా విక్రయించబడుతున్న మూడవ అతిపెద్ద నగరం కిసాన్గని (ప్రధానంగా ఆర్టియోడక్టిలలో) 40.06% అమ్ముడయ్యాయి, ప్రైమెట్సులో 37.79% విక్రయించబడ్డాయి.

ఎబోలా వైరసు భీతితో (ప్రత్యేకంగా కోతి, గబ్బిలం మాంసం ) ఇటీవలే వేటమాంసం కోసం వేటప్రాబల్యం తగ్గింది. మాంసం వండిన లేదా ఎండబెట్టినప్పుడు అది వైరస్ను చంపేసినప్పటికీ, వ్యాపారవేత్తలు, కొంతమంది వేటగాళ్లు 80% క్రయవిక్రయాలు తగ్గించడంతో వేటాడడం గణనీయంగా తగ్గింది.

సంఘర్షణలు

1994 నుండి దేశానికి జైరు అని పిలువబడినప్పటి నుండి డి.ఆర్.సి.లో వివిధ స్థాయిలలో తీవ్రస్థాయిలో యుద్ధం జరిగింది. ఆఫ్రికన్ ప్రపంచ యుద్ధం 2003 లో ముగిసినప్పటికీ దేశం తూర్పు భాగంలో ఇప్పటికీ తిరుగుబాటు గ్రూపులు, ప్రభుత్వ దళాల మధ్య పోరాటాలు కొనసాగుతున్నాయి. 1997 లో గారాబా జాతీయ పార్కులో 3 నెలలు మకాం వేసిన సమయంలో వివాదాస్పదంగా నాటకీయంగా వృక్షజాతులు క్షీణించాయి. పార్కులలో ఏనుగులలో సగం, రెండు వంతుల బర్రెలు, మూడింట రెండు వంతుల నీటిగుర్రాలు అదృశ్యమయ్యాయి. యుద్ధం కారణంగా సైనికులకు ఆహారం అందించడానికి వేటమాసం కొరకు జంతువులు అధికంగా వేటాడబడ్డాయి. ఆయుధాల ప్రాబల్యం జంతువుల, దంతపు విక్రయాల లాభదాయక పరిశ్రమగా మారింది. అలాగే చట్టం అమలు క్రమంలో వైఫల్యం వేటమాసం అధిక వినియోగాన్ని అరికట్టలేక పోయింది. మరొక అధ్యయనం ఆధారంగా ఓకపి ఫనన్ రిజర్వులో పౌర యుద్ధం సమయంలో ఏనుగుల సంఖ్యలో 50% తగ్గించాయని పార్కు మరింత ఏకాంత ప్రాంతాలకు అవి తరలించబడ్డాయని భావిస్తున్నారు..

వెలిపలి లింకులు

మూలాలు

Tags:

కాంగో గణతంత్ర రిపబ్లిక్ పేరు వెనుక చరిత్రకాంగో గణతంత్ర రిపబ్లిక్ చరిత్రకాంగో గణతంత్ర రిపబ్లిక్ భౌగోళికంకాంగో గణతంత్ర రిపబ్లిక్ ఆర్ధికం , మౌలికసౌకర్యాలుకాంగో గణతంత్ర రిపబ్లిక్ గణాంకాలుకాంగో గణతంత్ర రిపబ్లిక్ సంస్కృతికాంగో గణతంత్ర రిపబ్లిక్ పర్యావరణ వివాదాలుకాంగో గణతంత్ర రిపబ్లిక్ వెలిపలి లింకులుకాంగో గణతంత్ర రిపబ్లిక్ మూలాలుకాంగో గణతంత్ర రిపబ్లిక్అంగోలాఅల్జీరియాఉగాండాజాంబియాటాంజానియాబురుండిరువాండాసెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఎర్ర రక్త కణంఅధిక ఉమ్మనీరుభారత పౌరసత్వ సవరణ చట్టంవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)ఈస్టర్చాకలిజీలకర్రఇక్ష్వాకులుక్వినోవాతీన్మార్ మల్లన్నకుతుబ్ మీనార్జమదగ్నిశ్రీదేవి (నటి)భారతదేశ ప్రధానమంత్రిభారత జాతీయ ఎస్సీ కమిషన్ఉత్తరాషాఢ నక్షత్రముతెలంగాణా సాయుధ పోరాటంతెలుగుభారత రాజ్యాంగ ఆధికరణలుకాశీగురువాయూరు శ్రీకృష్ణ మందిరంఆయాసంగ్యాస్ ట్రబుల్కన్యాశుల్కం (నాటకం)సామెతల జాబితారాజకుమారుడుశాసనసభ సభ్యుడు2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుపూర్వాభాద్ర నక్షత్రమురాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్పేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితారుక్మిణీ కళ్యాణంరక్షకుడుఉస్మానియా విశ్వవిద్యాలయంతెలుగు నాటకరంగంభగత్ సింగ్షణ్ముఖుడుతెలంగాణరజినీకాంత్అల్లూరి సీతారామరాజుతెలుగుదేశం పార్టీఅల వైకుంఠపురములోశ్రీహరి (నటుడు)లింక్డ్‌ఇన్రవితేజఆరుద్ర నక్షత్రమునరేంద్ర మోదీగాయత్రీ మంత్రంహనుమంతుడుశాతవాహనులుకటకము (వస్తువు)సైంధవుడుతెలుగు కులాలుమామిడిరేవతి నక్షత్రంతెలుగు సినిమాపూసపాటి ఆనంద గజపతి రాజుమనోజ్ కె. జయన్చంద్రయాన్-3ఆంధ్ర విశ్వవిద్యాలయంహిమాలయాలుఇండియన్ ప్రీమియర్ లీగ్ప్రజాస్వామ్యంమియా ఖలీఫాఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంశ్రీఆంజనేయంఅనన్య నాగళ్లరాహువు జ్యోతిషంభారతదేశ చరిత్రతిక్కనఓపెన్‌హైమర్ఉపనయనముపౌష్టిక ఆహారంఆంధ్రజ్యోతిజాతిరత్నాలు (2021 సినిమా)వాట్స్‌యాప్దినేష్ కార్తీక్🡆 More