ఫిలిప్పీన్స్: ఆగ్నేయాసియా లోని దేశం

ఫిలిప్పీన్స్ (అధికారికంగా ఫిలిప్పీన్స్ గణతంత్ర రాజ్యం) ఆగ్నేయాసియాలోని ఒక దేశం.

దీని రాజధాని మనీలా. పశ్చిమ పసిఫిక్ సముద్రంలో అక్కడక్కడా ఉన్న 7107 దీవులు ఇందులో భాగం. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో ఇది 12వ స్థానంలో ఉంది. జనాభా సుమారు 9 కోట్లు. ప్రపంచ దేశాల్లో అతిపెద్దవైన ఆర్థిక వ్యవస్థల్లో 46వ స్థానంలో ఉంది.

స్వాతంత్ర్యానికి మునుపు స్పెయిన్,, అమెరికా వాసులకు వలస రాజ్యంగా ఉండేది. ఇస్లాం మతం, బౌద్ధ మతం, హిందూ మతం ప్రధానమైనవి.

Repúbliká ng̃ Pilipinas'
Republic of the Philippines
Flag of Philippines
నినాదం
Maka-Diyos, Makatao, Makakalikasan, at Makabayan
(English: "For God, People, Nature, and Country")
జాతీయగీతం
Lupang Hinirang
"Chosen Land"
Philippines యొక్క స్థానం
Philippines యొక్క స్థానం
రాజధానిManila
000) 14°35′N 121°0′E / 14.583°N 121.000°E / 14.583; 121.000
అతి పెద్ద నగరం Quezon City
అధికార భాషలు Filipino (Tagalog), English1
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు Bikol, Cebuano, Ilocano, Hiligaynon, Kapampangan, Pangasinan, Waray-Waray.
ప్రభుత్వం Unitary presidential constitutional republic
 -  President Rodrigo Duterte
 -  Vice President Leni Robredo
 -  Senate President Franklin Drilon
 -  House Speaker Feliciano Belmonte Jr.
 -  Chief Justice Maria Lourdes Sereno
Independence from Spain
from United States 
 -  Declared June 12 1898 
 -  Self-government March 24 1934 
 -  Recognized July 4 1946 
 -  Current constitution February 2 1987 
విస్తీర్ణం
 -  మొత్తం 300 000 కి.మీ² (72nd)
115,831 చ.మై 
 -  జలాలు (%) 0.61
జనాభా
 -  2007 అంచనా 88,706,3002 (12th)
 -  2000 జన గణన 76,504,077 
 -  జన సాంద్రత 276 /కి.మీ² (42nd)
715 /చ.మై
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $508 billion [2] (25th)
 -  తలసరి $5,714 [3] (103rd)
జీడీపీ (nominal) 2006 అంచనా
 -  మొత్తం $123.115 billion [4] (33rd)
 -  తలసరి $1,415 [5] (109th)
జినీ? (2000) 46.1 (high
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.780(2007) (medium) (74th)
కరెన్సీ Peso (International ఫిలిప్పీన్స్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం)
Piso (Filipino ఫిలిప్పీన్స్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం) (PHP)
కాలాంశం PST (UTC+8)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ph
కాలింగ్ కోడ్ +63
1 Spanish and Arabic promoted on an optional and voluntary basis.
2 Philippine Census 2007 Population Projection (medium assumption)

ఫిలిప్పైంస్ అధికారికంగా " రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పైంస్ " (స్పెయిన్:రిపబ్లిక డీ ఫిలిప్పైన్) అని పిలుస్తారు. ఫిలిప్పైంస్ ఆగ్నేయాసియాలో పశ్చిమ పసిఫిక్ సముద్రంలో ఉన్న స్వార్వభౌమత్వాధికారం కలిగిన ద్వీపదేశం. ఫిలిప్పైన్ 7,641 ద్వీపాలు కలిగిన దేశం. దేశం ఉత్తర దక్షిణాలుగా భౌగోళికంగా మూడు భాగాలుగా (లూజాన్, విసయాస్, మిండనావో) విభజించబడింది. ఫిలిప్పైంస్ రాజధాని మనీలా. అత్యంత జనసాంధ్రత కలిగిన నగరం క్యూజాన్. రెండూ మెట్రో మనీలా నగరంలో భాగంగా ఉంది. ఫిలిప్పైంస్ " పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ " ప్రాంతంలో భూమద్య రేఖకు సమీపంలో ఉంది. ఉపస్థితమై ఉంది. భూమద్యరేఖకు సమీపంగా ఉన్నందున ఫిలిప్పైంస్‌లో భూకంప ప్రమాదం, తుఫానుల ప్రమాదం అధికంగా ఉంటుంది. అయునప్పటికీ ఈ పరిస్థితులు ఫిలిప్పైన్‌కు విస్తారమైన సహజవనరులకు నిలయంగా ఉంది. అత్యధికంగా పర్యావరణ వైవిధ్యం కలిగిన దేశాలలో ఫిలిప్పైన్ ఒకటి. ఫిలిప్పైన్ వైశాల్యం 3 లక్షల చ.కి.మీ. జనసంఖ్య 100 మిలియన్లు. ఇతర తూర్పు ఆసియాదేశాలకంటే ఫిలిప్పైన్ జనసంఖ్య వేగవంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. జనసంఖ్యాపరంగా ఫిలిప్పైన్ ఆసియాదేశాలలో 7 వ స్థానంలో ఉంది. అలాగే ప్రపంచదేశాలలో 12వ స్థానంలో ఉంది. అదనంగా 12 మిలియన్ల ఫిలిప్పైన్లు విదేశాలలో పనిచేస్తున్నారు. విదేశాలలో పనిచేస్తున్న ఉద్యోగులను అత్యధికశాతం కలిగిఉన్న దేశాలలో ఫిలిప్పైన్ ప్రథమ స్థానంలో ఉంది. ఫిలిప్పైన్ ద్వీపాలలో పలు సంప్రదాయాలు, సంస్కృతులకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఆర్చిపిలాగోకు చెందిన నెగ్రిటోలు చరిత్రకాలానికి పూర్వం ఫిలిప్పైన్‌లో నివసించిన ఆరంభకాల ప్రజలని భావిస్తున్నారు. వారి తర్వాత వారిని అనుసరిస్తూ ఆస్ట్రోనేషియన్ ప్రజలు ఫిలిప్పైన్‌కు వలసప్రజలుగా వచ్చి స్థిరపడ్డారు. చైనా, మలయా, భారతదేశం, ఇస్లామిక్ దేశాల నుండి వచ్చిన ప్రజలు ఫిలిప్పైన్‌లో స్థిరపడ్డారు. పలువురు పాలకులు ఫిలిప్పైన్‌లో రాజ్యాలను స్థాపించి పాలించారు. దతూలు, రాజాలు, సుల్తానులు (లకన్లు) ఫిలిప్పైన్‌ను పాల్ంచారు.1521లో ఫెర్దినంద్ మెగల్లన్ (హొమంహన్, ఈస్టర్న్ సమర్) రాకతో హిస్పానిక్ కాలనైజేషన్ ప్రారంభం అయింది. స్పెయిన్ అణ్వేషకుడు లోపెజ్ డీ విల్లలోబస్ స్పెయిన్‌కి చెందిన రెండవ ఫిలిప్ గౌరవార్ధం ఈ ప్రాంతానికి ఆర్చిపిలాగో అని నామకరణం చేసాడు. 1565లో మెక్సికో నుండి మైఖేల్ లోపెజ్ డీ లెగజ్పీ ఆర్చిపిలాగో ప్రాంతంలో హిస్పానిక్ సెటిల్మెంట్ స్థాపించాడు. ఫిలిప్పైంస్ దాదాపు 300 సంవత్సరాలకాలం స్పానిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. ఫలితంగా కథలిక్ చర్చి మతపరమైన ఆధిక్యత కలిగి ఉంది. పశ్చిమప్రాంత రవాణాకు స్పానిష్ నిధి అణ్వేషకులకు మనీలా కేంద్రబిందువు అయింది. 20వ శతాబ్దం నాటికి ప్ఫిలిప్పైన్ విప్లవం తరువాత స్వల్పకాలం నిలిచిన ఫిలిప్పైన్ రిపబ్లిక్ " అమెరికన్ ఫిలిప్పైన్ " యుద్ధం తరువాత అమెరికా సైన్యం ఆధీనంలోకి మారింది. జపానీ ఆక్రమణ సమయంలో య్యునైటెడ్ స్టేట్స్ ఫిలిప్పైన్ ద్వీపాల మీద ఆధిక్యత నిలుపుకుంది. రెండవ ప్రపచయుద్ధం ముహిసే వరకు ఈ పరిస్థితి కొనసాగింది. తరువాత ఫిలిప్పైన్ స్వతంత్రదేశంగా అవతరించింది. దేశం జనసాంధ్రత, ఆర్థికబలం దేశాన్ని మిడిల్ పవర్‌గా వర్గీకరించింది. అఖ్యరాజ్యసమితి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అసోసియేషన్ ఆస్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషంస్, ది ఆసియా - పసిఫిక్ ఎకనమిక్ కోపరేషన్ ఫోరం, ఈస్ట్ ఆసియా సమ్మిట్ లలో ఫిలిప్పైన్ ఫండింగ్ సభ్యత్వం కలిగి ఉంది. ఆసియన్ డెవెలెప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఫిలిప్పైన్‌లో ఉంది. ఫిలిప్పైన్ కొత్తగా పారిశ్రామిక దేశంగా గుర్తించబడుతుంది. ఫిలిప్పైన్ ఆర్థికరంగం వ్యవసాయం, సేవారంగం, వస్తోత్పత్తి మీద దృష్టి కేంద్రీకరిస్తుంది.

పేరువెనుక చరిత్ర

ఫిలిప్పీన్స్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
King Philip II of Spain.

స్పెయిన్ రాజు రెండవ ఫిలిప్ ఙాపకార్ధం దేశానికి ఫిలిప్పైన్ అని నామకరణం చేయబడింది. స్పానిష్ అంవేషకుడు " రూ లోపెజ్ డీ విల్లాలోబొస్ " తన అంవేషణలో 1542లో లేటే, సామర్ దీవులకు " ఫెలిప్పైంస్ " అని నామకరణం చేసాడు. తరువాత అన్ని దీవులకు " లాస్ ఇస్లాస్ ఫిలిపైనాస్ " అనే పేరు స్థిరపడింది. అంతకు ముందు ఈ దీవులను స్పానియన్లు " ఇస్లాస్ డెల్ పోనియంటే ", శాన్ లజారో అని పేర్కొన్నారు. చరిత్రానుసారం ఫిలిప్పైంస్ పేరు పలు మార్లు మార్పుకు గురైంది. ఫిలిప్పైన్ తిరుగుబాటు సమయంలో మలోలోస్ కాంగ్రెస్ " రిపబ్లికా ఫిలిపైనా " (ఫస్ట్ ఫిలిపైన్ రిపబ్లిక్) ప్రకటించింది. స్పానిష్- అమెరికన్ యుద్ధం (1898), ఫిలిప్పైన్ - అమెరికన్ (1899- 1902) నుండి కామన్వెల్త్ కాలం (1935-46) వరకు అమెరికన్ కాలనియల్ అధికారులు ఈ దేశాన్ని " ఫిలిప్పైన్ దీవులు " అని పేర్కొన్నారు. 1898 పారిస్ ఒప్పందం నుండి " ఫిలిప్పైన్ " అనే పేరు స్థిరపడింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత దేశం అధికార నామం " రిపబ్లిక్ ఆఫ్ ది ఫిలిప్పైంస్ "గా స్థిరపరచబడింది.

చరిత్ర

చరిత్రకు పూర్వం

కలాయో మాన్ మెటాటార్సల్ యురేనియం- థొరియం కాలానికి చెందినవని భావిస్తున్నారు. ఆర్చిపిలాగోలో 67,000 సంవత్సరాలకు పూర్వంనాటి మానవ అవశేషాలు లభించాయి. పలావన్ ప్రాంతంలో లభించిన 26,500 సంవత్సరాలనాటి తబన్ మాన్ అవశేషాలు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. ఆర్చిపిలాగో ఆరంభకాల నివాసితులలో నెగ్రిటోలు కూడా ఉన్నారు. అయినప్పటికీ వారి మొదటి నివాదిత ప్రాంతం గురించిన విశ్వసనీయమైన ఆధారాలు ఫిలిప్పైన్‌లో లభించలేదు. ఫిలిప్పైన్ ఆరంభకాల నివాసితుల గురించిన ప్రతికూలమైన అభిప్రాయాలు పలువురు వెలిబుచ్చుతున్నారు. ఆర్చిపిలాగో ప్రాంతం మానవనివాసిత ప్రాంతంగా అభివృద్ధి చెందిన తరువాత సండలాండ్ ప్రాంతం క్రీ.పూ 48,000 - క్రీ.పూ 5,000 వరకు వాణిజ్యకేంద్రంగా అభివృద్ధి చెందింది. ఆస్ట్రోనేషన్ ప్రజల కారణంగా మలయో పాలినేషియన్ భాషలు వ్యాప్తిచెందాయి. వీరు తైవాన్ నుండి క్రీ.పూ 4000 ప్రాంతంలో వలసప్రజలుగా ఫిలిప్పైన్‌కు వచ్చి చేరారు. ఆస్ట్రోనేషియన్ ప్రజలు యంగ్త్జె నదీతీరరంలో విలదిల్లిన లైంగ్జూ సంస్కృతిక ప్రజల సంతతికి చెందినవారని భావిస్తున్నారు. వీరు క్రీ.పూ 4,000 నుండి ఫిలిప్పైన్‌కు వలసరావడం ప్రారంభించారు. During the neolithic period, a "jade culture" is said to have existed as evidenced by tens of thousands of exquisitely crafted jade artifacts found in the Philippines dated to 2000 BC. జేడ్ వాడకం తైవాన్లో మొదలైందని భావిస్తున్నారు. ఇవి ద్వీపంలోనే కాక, ఆగ్నేయాసియా ప్రధాన భూభాగంలో కూడా కనిపిస్తున్నాయి. ఈ కళాఖండాలు ఆగ్నేయాసియా సమూహాల మద్య ఉన్న పరస్పర సంబంధానికి సాక్ష్యంగా ఉన్నాయి. క్రీ.పూ 1,000 నాటికి ఆర్చిపిలాగో నివాసితులు నాలుగు విధాలైన సమూహాలుగా ఏర్పడ్డాయి: హంటర్ గేదరర్ ట్రైబ్స్, వారియర్ సొసైటీలు, హైలాండ్ ప్లూయోక్రసీ, హార్బర్ రాజాస్థానాలు.

కాలనీ పాలనకు ముందు

కొన్ని సమూహాలు ద్వీపాలలో ఏకాంతంగా నివసించాయి. అయినప్పటికీ అధికమైన ప్రజలు రాజ్యాలలో నివసిస్తూ గణనీయమైన వాణిజ్యాభివృద్దికి సహకరిస్తూ అలాగే (బ్రూనై, చైనా, భారతదేశం, ఇండోనేషియా, మలేసియా, జపాన్ మొదలైన తూర్పు, దక్షిణ, ఈశాన్య ఆసియా దేశాల ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. మొదట్ సహస్రాబ్ధిలో సముద్రతీర స్వతంత్రమైన రాజాస్థానాలు (బరంగేలు) అభివృద్ధిచేయబడ్డాయి. కొన్ని దేశాలు చైనా సామంతరాజ్యాలైన (దాతూల నాయకత్వంలో) మలాయ్, తలస్సొక్రసీ రాజ్యాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నాయి. వీటిని హుయాంగాలు (భారతీయ రాజులు) పాలించారు. శ్రీవిజయ పతనం తరువాత మద్జా- అస్ స్థాపించబడింది. వీరు విసయాస్ ద్వీపాలలో గొరిల్లా రాజ్యాలను స్థాపించారు. వీరు దాతు, పుతి రాజ్యాలను స్థాపించి రాజ్యపాలన కొరకు స్థానిక నాయకుల వద్ద నుండి భూభాగాలను కొనుగోలు చేసారు. మద్జా- అస్ పనయ్ ద్వీపంలో రాజ్యస్థాపన చేసారు. తరువాత మద్జా - అస్ ప్రజలు తరచుగా దక్షిణ చైనా సముద్రతీర నగరాల మీద దాడిచేసి చైనీయుల నావికాదళం., చెబూ రాజాస్థానంతో కలహించారు. చెబూ మద్జా-అస్ పొరుగున ఉంది. దీనిని రాజాముదా (తమిళ సంతతికి చెందిన వాడు) పాలించాడు. వీరు వారి ద్వీపం నుండి ఆర్చిపిలాగో భూభాగాలకు నౌకా మార్గాలు ఏర్పాటు చేసి సుసంపన్నత సాధించారు. మిందనావు ఈశాన్యం లోఉన్న భూటాన్ రాజాస్థానం రాజా శ్రీ బతాషాజా పాలనలో ప్రాబల్యత సంతరించుకుంది. స్థానిక ఆభరణ పరిశ్రమ కారణంగా ఈ రాజ్యం శక్తివంతంగా మారింది. ఈ రాజ్యం చంపా సంప్రదాయ ప్రజలతో వాణిజ్యపరంగా సత్సంబంధాలు, దౌత్యసంబంధిత శతృత్వం కలిగి ఉంది. మిండోరో కేంద్రంలో ఉన్న హంగ్డం పాలించే హంగ్ గాట్-సా-లిహాన్ వాణిజ్యరంగంలో విశ్వాసపాత్రత గుర్తింపుకలిగి ఉండేది. ఉత్తర ల్యూజాన్, పంగసినన్ హంగ్డం నుండి హంగ్ తెమే నాయకత్వంలో గుర్రాలు, వెండి చైనా, ర్యుక్యు రాజ్యం, జపాన్ లకు ఎగుమతి చేసారు. ల్యూజాన్, టోండోలను రాజ్యం లకండ్యులా రాజవంశం పాలించింది. వీరు చైనీయుల వస్తువులను ఆగ్నేయాసియాలో విక్రయిస్తూ సంపన్నత సాధించారు. ఈ వ్యాపార హక్కులను వీరికి మింగ్ రాజవంశం ఇచ్చింది. 1300 లలో ఆర్చిపిలాగోలో ఇస్లాం ప్రవేశించింది. 1380లో మక్డం కరీం, షరీఫుల్ హాషెం సయ్యద్ అబు బక్ర్ (జాహోర్‌లో జన్మించిన అరేబియన్ వ్యాపారి) మలక్కా నుండి సులూ ద్వీపం చేరుకున్నారు. తరువాత సులూ రాజా బగుయిండా అలిని ఇస్లాంకు మతమార్పిడి చేయడం ద్వారా సులూ ద్వీపంలో సుల్తానేట్ స్థాపనకు కారణం అయ్యాడు. తరువాత సుల్తాన్ కుమార్తెను వివాహం. 15వ శతాబ్దంలో మొహమ్మద్ కబుంగ్స్వన్ (జొహొర్) మిండనావో ద్వీపంలో ఇస్లాం ప్రవేశపెట్టాడు. అలాగే మగుయిండనావో సుల్తానేట్ స్థాపనకు కారణం అయ్యాడు. తరువాత సుల్తానేట్ లనావో ద్వీపం వరకు విస్తరించింది.

Left to right: [1] Images from the Boxer Codex illustrating an ancient kadatuan or tumao (noble class) Visayan couple of Panay, [2] the Pintados ("The Tattooed"), another name for Visayans of Cebu and its surrounding islands according to the early Spanish explorers, [3] possibly a tumao (noble class) or timawa (warrior class) couple of the Pintados, and [4] a royal couple of the Visayans of Panay.

ఈ సమయంలోనే ల్యూజాన్ ప్రజలను ల్యూకోలు అని పిలిచేవారు. వీరు తౌంగూ రాజవంశం , మలక్కా సులతానేట్‌లతో సైనికచర్యలలో భాగస్వామ్యం వహిస్తూ మరింత ప్రాబల్యత సంతరించుకున్నారు. అక్కడ వారు సైనికులుగా, సైనికాధికారులుగా పనిచేసారు. ఇస్లాం దక్షిణంలో మిండనావో, ఉత్తరంలో ల్యూజాన్ దాటి విస్తరించింది. బొల్కియా సుల్తాన్ (1485-1521) పాలనలో ల్యూజాన్ దక్షిణంలో ఉన్న మనీలాలో ఇస్లాం విస్తరించింది. బ్రూనై సామ్రాజ్యం పురాతన టోండో పాలకుడు దాతు గంబాగ్‌ను ఓడించిన కారణంగా ఇది సాధ్యం అయింది. తరువాత ఈప్రాంతంలో మనీలా రాజ్యం స్థాపించి రాజా సులైమాన్ అనే ముస్లిం పాలకుడు నియమితమయ్యాడు. సుల్తాన్ బొల్కియా సులూ సుల్తాన్ అమీర్ ఉల్- ఒంబ్రా కుమార్తె లైలా మక్కాను వివాహం చేసుకుని ల్యూజాన్, మిండనావో వరకు బ్రూనై ప్రభావన్ని విస్తరింపజేసాడు. తరువాత కూడా అనిమిస్ట్ ఇగొరాట్ రాజ్యాలు, మలాయ్, సినిఫియడ్ మా-యి, భారతీయ రాజ్యమైన భూటాన్వారి సంస్కృతులను ఆచరిస్తూనే ఉన్నారు. దాతూలు, రాజాలు, ఇహుంగాలు, సుల్తానులు, లకాన్లు మద్య శతృత్వం స్పానిష్ కాలనైజేషన్ తరువాత సమసి పోయింది. అదనంగా ద్వీపాలలో జంసాంధ్రత అధికం అయింది. నిరంతరమైన ప్రకృతివైపరీత్యాలను , రాజ్యాలమద్య అంతర్యుద్ధాలను అధిగమిస్తూ అధిగమిస్తూ జసంఖ్య అధికరించింది. కాలనైజేషన్ తరువాత ఆర్చిపిలాగోలోని చిన్నచిన్న రాజ్యాలు క్రమంగా స్పానిష్ సామ్రాజ్యంలో వీలీనం చేయబడ్డాయి. తరువాత ఈ ప్రాంతం హిస్పానైజేషన్, క్రిస్టియనైజేషన్ జేయబడ్డాయి.

కాలనీ పాలన

ఫిలిప్పీన్స్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
A mural painting depicting the Battle of Mactan.

1521 లో పోర్చుగీస్ అణ్వేషకుడు ఫెర్దినంద్ మగెల్లన్ ఫిలిప్పైన్ చేరాడు. ఆయన ఈ ద్వీపాలను స్పెయిన్ కొరకు స్వాభీనం చేసుకున్నాడు. తరువాత ఆయన మచ్తన్ యుద్ధంలో మరణించారు. 1565లో స్పానిష్ అణ్వేషకుడు " మిక్వుయెల్ లోపెజ్ డీ లెగజ్పి " మెక్సికో నుండి ఈ ప్రాంతానికి వచ్చి చేరి చెబూలో మొదటి హిస్పానిక్ సెటిల్మెంటు స్థాపించడంతో ఈ ప్రాంతంలో కాలనైజేషన్ ఆరంభం అయింది. తరువాత పనయ్ ద్వీపానికి చేరి స్థానిక విసయన్ పాలకులను, హిస్పానిక్ సైన్యాలను సమీకరించి ఇస్లామిక్ మనీలాను స్వాధీనం చేసుకున్నాడు. తరువాత టొండో కుట్రను భగ్నం చేసి గుయం, గుయెర్రెరో లను ఈ ప్రాంతం నుండి తరిమి వేసారు. స్పానిష్ పాలనలో స్పానిష్ ఈస్టిండీస్ (1571) మనీలా రాజధాని నగరంగా అభివృద్ధి చేయబడింది. వారు చైనా యుద్ధవీరుడు " లిమాహాంగ్ "ను బృహత్తర సైన్యంతో సహా ఓడించారు. టోండో రాజ్యం మీద ఇస్లాం దండయాత్ర జరిగిన తరువాత బ్రూనై సుల్తానేట్‌కు వ్యతిరేకంగా కాస్టిల్ యుద్ధం సంభవించింది. తరువాత యుద్ధం టెరేట్ , టిడోర్ వరకు విస్తరించింది. తైవాన్ , మలుకు ద్వీపాలలో కోటలు నిర్మించబడ్డాయి. తరువాత ఇవి వదిలివేయబడ్డాయి. సైనికులు తిరిగి ఫిలిప్పైన్‌కు చేరుకున్నారు.

ఫిలిప్పీన్స్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
The Spanish built Fort Santiago in Manila, built by Miguel López de Legazpi in 1590.

స్పానిష్ పాలన గణనీయంగా ఆర్చిపిలాగో రాజ్యాలను సమైక్యం చేసింది. 1565-1821 వరకు ఫిలిప్పైన్ " న్యూ స్పెయిన్ వైస్రాయి " పాలనలో ఉంది. మెక్సికన్ యుద్ధం తరువాత మాడ్రిడ్ నుండి నేరుగా పాలించబడింది. బైకోల్, కేవైట్ ప్రాంతాలలో మనీలా గాలంస్ పేరిట పెద్ద నౌకలు నిర్మించబడ్డాయి. మనీలా గాలన్లు పెద్ద సంఖ్యలో ఉన్న సంరక్షకులతో మనీలా, అకపుల్కో మద్య పయనించాయి. 16 - 19 సంవత్సరాల మద్య గాలంస్ సంవత్సరానికి ఒకటి - రెండు మార్లు పయనించాయి. వ్యాపారం మొక్కజొన్న, టొమాటో, ఉర్లగడ్డ, చాక్లెట్, మిరియాలు, అనాస మొదలైన ఆహారపదార్ధాలు మెక్సికో, పెరూ మద్య సరఫరా చేయబడ్డాయి. ఫిలిప్పైన్‌లో నెగ్రో పాలన సబెస్టిన్ ఎల్కానో, ఆయన పరివారం (సముద్రప్రయాణంలో విపత్తులో చిక్కుకుని ఇక్కడకు చేరుకున్న వారు) బహుమతిగా ఇవ్వబడింది. ప్రంపంచంలో వీరు మొదటి సర్వైవర్ (పునరుజ్జీవితులు) గా గుర్తించబడుతున్నారు. వీరి సతతివారు ఇక్కడ సరికొత్త నగరాలను రూపొందించారు. రోమన్ కాథలిక్కు మిషనరీలు దిగువన నివసిస్తున్న నివాసితులను చాలా వరకు క్రైస్తవులుగా మార్చాయి. వారు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, చర్చీలు స్థాపించారు. 1863లో స్పెయిన్ ఫ్రీ పబ్లిక్ స్కూల్స్‌కు అనుమతి ఇచ్చింది. ఈ విధానాల ఫలితంగా ఫిలిప్పైన్ జనసంఖ్య అనూహ్యంగా అభివృద్ధి చెందింది. స్పెయిన్ పాలనలో తలెత్తిన స్థానిక తిరుగుబాట్లను అణిచివేసారు. చైనీయులు, జపానీయుల సముద్రపు దొంగలు, డాచ్, ఆంగ్లేయుల, పోర్చుగీసుల నావికాదళం నుండి సైనికచర్యలు ఎదురైయ్యాయి. వీరు యుద్ధం చేయడానికి బదులుగా జపాన్ నుండి ఇండోనేషియా వరకు ఫిలిప్పైన్ ఆర్చిపిలాగోను దిగ్బంధం చేసాయి. 1762-1764 మద్య బ్రిటిష్ సైన్యం మనీలాను స్వాధీనం చేసుకున్నాయి. ఈ యుద్ధం 7 సంవత్సరాల కాలం కొనసాగింది. 1763 ట్రీటీ ఆఫ్ పారిస్ తరువాత స్పానిష్ పాలన తిరిగి పునరుద్ధరించబడింది. స్పానిష్- మొరాకో కలహాలు కొన్ని శతాబ్ధాలకాలం కొనసాగాయి. 19వ శతాబ్దం చివరిలో మొరొకో భూభాగాలను స్వాధీనం చేసుకుంది. మొరొకో ఆర్చిపిలాగోలోని సులూసుల్తానేట్‌లో భాగంగా ఉంది. ఇక్కడ ముస్లిముల ఆధిక్యత అధికంగా ఉంది. 19వ శతాబ్దంలో ఫిలిప్పైన్ నౌకాశ్రయాలు ప్రపంచ వాణిజ్యానికి ద్వారం తెరిచాయి. ఫిలిప్పైన్‌లో పలువురు స్పానియన్లు (క్రియోలాస్) జన్మించారు. సంక్రమణ పూర్వీకత కలిగిన మెస్టిజోస్ సంపన్నులయ్యారు. లాటిన్ అమెరికన్లు పెద్ద ఎత్తున ఫిలిప్పైన్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఇబరియన్ ద్వీపకల్పంలో జన్మించిన వారిని స్పెయిన్ ప్రభుత్వపదవులలో నియమించబడ్డారు. ద్వీపాలన్నింటిలో విప్లవజ్వాల వ్యాపించింది. క్రియోలో అసంతృప్తి 1872 తురుగుబాటుకు దారితీసింది. ఫిలిప్పైన్ తిరుగుబాటుకు ఇది మూలంగా మారింది. 1872లో స్పెయిన్ అధికారులు గోబుర్జా ప్రీస్టుల (మరియానో, జోస్ బుర్గోస్, జాసింటో జమొరా) మీద దేశద్రోహం నేరం ఆరోపించి మరణశిక్ష విధించిన తరువాత ప్రజలలో విప్లవభావాలు అధికరించాయి. ఫిలిప్పైన్‌లో రాజకీయ సంస్కరణలు కోరుతూ మార్సిలో హెచ్.డెల్ పిలార్, జోస్ రిజాల్, మారినో పొంస్ నాయకత్వంలో సాగించిన ఉద్యమం స్పెయిన్ ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించాయి. ఫలితంగా 1896 డిసెంబరు 30నలో రిజాల్‌కు తిరుగుబాటు నేరారోపణతో మరణశిక్ష విధించబడింది. 1892లో అండ్రెస్ బొనిఫాషియో సంస్కరణ ప్రయత్నాలను అడ్డగిస్తూ స్వాతంత్ర్యం కోరుతూ సాయుధపోరాటం చేయడానికి రహస్య సమూహాన్ని స్థాపించాడు.

ఫిలిప్పీన్స్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Aguinaldo Shrine where the first flag of the short-lived independent republic was raised in 1898.

1896 లో బొనిఫసియో, కటిపునాన్ ఫిలిప్పైన్ విప్లవానికి నాంది పలికాడు. 1898లో క్యూబాలో " స్పానిష్ - అమెరికన్ యుద్ధం " మొదలై అది ఫిలిప్పైన్ చేరింది. 1898 జూన్ 12న అగుయినాల్డో స్పెయిన్ నుండి ఫిలిప్పైన్ స్వతంత్రం గురించిన ప్రకటన చేసాడు. తరువాత " ఫస్ట్ ఫిలిప్పైన్ రిపబ్లిక్ " స్థాపించబడింది. స్పెయిన్ - అమెరికన్ యుద్ధం తరువాత స్పెయిన్ ద్వీపాలను యునైటెడ్ స్టేట్స్‌కు ఇచ్చింది. " 1898 ట్రీటీ ఆఫ్ పారిస్ " షరతుల ఆధారంగా యునైటెడ్ స్టేట్స్‌ స్పెయిన్‌కు నష్టపరిహారంగా 20 మిలియన్ల అమెరికన్ డాలర్లు చెల్లించింది. యునైటెడ్ స్టేట్స్ " ఫస్ట్ ఫిలిప్పైన్ రిపబ్లిక్ "ను గుర్తించలేదు. ఫిలిప్పైన్ - అమెరికన్ యుద్ధం సంభవించింది. యుద్ధంలో ఫస్ట్ ఫిలిప్పైన్ రిపబ్లిక్ ఓడిపోయింది. ఆర్చిపిలాగో పాలనాబాధ్యతను " ఇంసులర్ గవర్నమెంట్ చేపట్టింది ". యుద్ధంలో వేలాదిమంది యుద్ధవీరులు, లక్షలాది పౌరులు ప్రాణాలను కోల్పోయారు. అధికంగా కలరా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తరువాత అమెరికన్లు తిరుగుబాటు చేసిన కురురాజ్యాలను అణిచివేసారు: సులూ సుల్తానేట్, తగలాగ్ రిపబ్లిక్, రిపబ్లిక్ ఆఫ్ నెగ్రోస్ (విసాయస్), రిపబ్లిక్ ఆఫ్ జంబొయాంగ (మిండనావో. ఈ సమయంలో ఫిలిప్పైన్ సంస్కృతి పునరుద్ధరించబడింది.ఫిలిప్పైన్ సినిమా, సాహిత్యం అభివృద్ధి చెందాయి.

ఫిలిప్పీన్స్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
President Manuel L. Quezon (November 1942).

1935 లో ఫిలిప్పైంస్‌కు కామంవెల్త్ అంతస్తు ఇవ్వబడింది. అధ్యక్షుడు మాన్యుయల్ క్యూజాన్ జాతీయ భాషను రూపొందించి భూసంస్కరణలు చేపట్టి స్త్రీలకు ఓటు హక్కు ప్రవేశపెట్టాడు. తరువాత దశాబ్ధంలో రెండవ ప్రపంచయుద్ధం కారణంగా ఫిలిప్పైన్ స్వాతంత్ర్యానికి మార్గం సుగమం కాలేదు. జపాన్ సామ్రాజ్యం ఫిలిప్పైన్ మీద దాడి చేసింది. సెకండ్ ఫిలిప్పైన్ రిపబ్లిక్ స్థాపించబడింది. యుద్ధంలో పలు అరాజకాలు, జపాన్ యుద్ధనేరాలు సంభవించాయి. 1945 మనీలా యుద్ధంలో మనీలా మూకుమ్మడి హత్యలు సంభవించాయి. 1944 లో క్యుజాన్ దేశం వెలుపల మరణించాడు. సర్గియో ఒస్మెనా అధికారం చేపట్టాడు. జపాన్ ఆక్రమిత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వ్యూహం రూపొందించాయి.

ఫిలిప్పీన్స్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
President Osmeña, US General Douglas MacArthur and staff land at Palo, Leyte, October 1944.

కాలనీ పాలన తరువాత

1945 అక్టోబరు 24న ఫిలిప్పైంస్ అఖ్యరాజ్యసమితి సభ్యదేశాలలో ఒకటి అయింది. 1946 జూలై 4న యునైటెడ్ స్టేట్స్ ఫిలిప్పైన్‌ను స్వతంత్రదేశంగా గుర్తించింది.

ఫిలిప్పీన్స్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Ferdinand and Imelda Marcos, 1979.

1965 లో మకపాగల్ అధ్యక్ష ఎన్నికలలో ఓటమి పొందాడు. ఆయన పదవి కాలంలో అధ్యక్షుడు పలు మౌలిక నిర్మాణాల కార్యక్రమాలు ఆరంభించాడు. అయినా బిలియన్ల కొద్దీ ప్రజాధనం కొల్లగొట్టబడిందని, పెద్ద ఎత్తున లంచం ఇవ్వబడిందని ఆరోపణలు ఎదురైయ్యాయి. పదవీ కాలం ముగిసే ముందుగా మార్కోస్ 1972 సెప్టెంబరు 21 నుండి దేశంలో మార్షల్ లా అమలు చేసాడు. ఈ సమయంలో రాజకీయ ఆణిచివేత, మానవ హక్కుల ఉల్లంఘన చోటుచేసుకున్నాయి. ఒకవైపు ఫిలిప్పైన్ ప్రజలు పేదరికంలో మగ్గుతుండగా ఆయన భార్య ఇమేల్డా విలాసవంతమైన జీవితం గడిపింది. 1983 ఆగస్టు 21 న మార్కోస్ మార్కోస్ ప్రధాన ప్రత్యర్థి కాల్చివేయబడ్డాడు. చివరికి 1986లో మార్కో అధ్యక్ష ఎన్నికలకు పిలుపు ఇచ్చాడు. మార్కోస్ విజేతగా ప్రకటించబడినప్పటికీ ఫలితంలో మోసం చోటు చేసుకుందని ప్రజలలో భావం చోటు చేసుకుంది. ఫలితంగా ప్రజా ఉద్యమం తలెత్తింది. మార్కోస్ ఆయన సహచరులు హవాయి పారిపోయారు. గతించిన అగ్వినోస్ భార్య అధ్యక్షురాలిగా గుర్తించబడింది.

సమకాలీన చరిత్ర

ఫిలిప్పీన్స్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
President Fidel V. Ramos salutes at the Pentagon with U.S. Secretary of Defense William Cohen and an honor guard during a State visit in 1998.

1986లో ప్రజారాజ్యం, ప్రభుత్వసంస్కరణలు ప్రభుత్వ ఋణం, లంచగొండితనం కారణంగా 1986-1990 మధ్య కొనసాగిన తిరుగుబాటు , సైనిక చర్యల కారణంగా దెబ్బతిన్నాయి. కొరజాన్ అక్వినోస్ పాలనలో యు.ఎస్. సైన్యాలు ఫిలిప్పైన్ వదిలి వెళ్ళారు. 1991 నవంబరులో క్లర్క్ ఎయిర్ బేస్ అధికారికంగా స్థలమార్పిడి చేయబడింది. 1991జూన్‌లో కొడచరియలు విరిగిపడడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. రాజ్యాంగ నిర్మాణం జరిగిన తరువాత అధ్యక్ష పదవి ఒకసారికి మాత్రమే పరిమితం చేయబడింది. అక్వినో రెండవ సారి ఎన్నికలో పాల్గొనలేదు. అక్వినో తరువాత ఫైడెల్ వి.రోమాస్ అధ్యక్షపీఠం అధ్జిష్టించాడు. ఈ సమయంలో ఫిలిప్పైన్ ఆర్థికరగం " టైగర్ ఆఫ్ ఎకనమీ ఇన్ ఆసియా "గా (సరాసరి జి.డి.పి. అభివృద్ధి 6%) గుర్తించబడింది. 1996 నాటికి సాధించగలిగిన రాజకీయ స్థిరత్వం , ఆర్థికాభివృద్ధి మీద 1997 ఆసియన్ ఆర్థికసక్షోంభం ప్రభావం పడింది. రామోస్ తరువాత అధికారి జోసెఫ్ ఎస్ట్రాడా 1998 జూన్‌న అధికారబాధ్యత చేపట్టి ఆర్థికపరిస్థితిని పునరుద్ధరించాడు. 1999 నాటికి ఆర్థికాభివృద్ధి -0.6% నుండి 3.4% చేరుకుంది. 2000 నాటికి ఫిలిప్పైన్ ప్రభుత్వం " మొరొ ఇస్లామిక్ లిబరేషన్ " మీద యుద్ధం ప్రకటించింది. మరొకవైపు అబు సయ్యల్‌తో యుద్ధం సాగించింది. లంచం సంబంధిత నేరారోపణలు , అవిశ్వతీర్మానం ప్రయత్నాలతో 2001 న జోసెఫ్ ఎస్టాడా పరిపాలన పడగొట్టబడింది. తరువాత ఉపాధ్యక్షుడు గ్లోరియా మకప్పగల్ - అర్రోయో 2001 జనవరి 20న పదవీ బాధ్యత చేపట్టాడు. గ్లోరియా మకపగల్ - అర్రొయొ 9 సంవత్సరాల పాలనలో ఆర్థికరంగం 2002లో 4%గ ఉన్న జి.డి.పి 2007 నాటికి 7% అభివృద్ధి చెందింది. అలాగే ఇంఫ్రాస్ట్రక్చర్‌లో భాగంగా 2004లో మనీలా లైట్ రైట్ ట్రాంసిస్ట్ సిస్టం లైన్ 2 " నిర్మాణం పూర్తి అయింది. అలాగే " గ్రేట్ రిసెషన్ "ను విజయవంతంగా నివారించింది. అయినప్పటికీ ప్రభుత్వం " హెల్లో గార్సి కుంభకోణం " మొదలైన రాజకీయ కుంభకోణాలకు గురికావడం 2004 ఫిలిప్పైన్ ఎన్నికల మీద ప్రభావం చూపింది. 2009 నవంబర్ 23న " మగుయిండనావో " మూకుమ్మడి హత్యలవంటి సంఘటనలు 34 మంది మరణాలకు దారితీసింది. 2010లో మూడవ " బెంగో అక్వినో " ఫిలిప్పైన్ అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించి ఫిలిప్పైన్ 15 వ అధ్యక్షుడుగా అధికారపీఠం అధిష్టించాడు. ఆయన మొదటి అవివాహితుడుగా , మూడవ యువ అధ్యక్షుడుగా ప్రత్యేకంగా గుర్తించబడ్డాడు. 2013 లో ఆర్థికరంగం 7.2% జి.డి.పి అభివృద్ధి సాధించి ఆసియాలో వేగవంతమైన ఆర్థికవ్యవస్థకలిగిన దేశాలలో 2వ స్థానం సాధించింది. అక్వినో 2013 మే 15న కె- 12 " పేరుతో ఆరంభవిధ్యాభివృద్ధి పధకం మీద సంతకం చేసాడు. 2013 నవంబరు 8 స, భవించిన హైయాన్ తుఫాన్ ఫిలిప్పైన్‌ను ధ్వంసం చేసింది. విసయాస్ ద్వీపం మీద తుఫాన్ ప్రమాదం అధికంగా చూపింది. 2014 ఏప్రిల్ 28న యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు " బారక్ ఒబామా " ఫిలిప్పైన్‌ను సందర్శించి డిఫెంస్ అగ్రిమెంటు మీద సంతకం చేసాడు. 2015 లో జనవరి 15-19 లో పోప్ ఫ్రాంసిస్ ఫిలిప్పైన్ సందర్శించి తుఫాన్ బాధితులను (యొలాండా) పరామర్శించాడు. 2015 జనవరి 25న ఫిలిప్పైన్ నేషనల్ పోలీస్ - స్పెషల్ యాక్షన్ ఫోర్స్ సభ్యులు 44మంది " మమసపానో క్లాష్లా సంఘర్షణలో " మరణించారు. 2015 డిసెంబరు 20న " పియా అల్నో వుర్త్జ్‌బాచ్ " 2015 లో మిస్ యూనివర్స్‌గా ఎన్నికైంది.

భౌగోళికం

ఫిలిప్పీన్స్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Topography of the Philippines
ఫిలిప్పీన్స్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Lake Pinatubo, the resulting crater lake of the 1991 eruption pictured here in 2008

7,500 ద్వీపాలు కలిగిన ఫిలిప్పైన్‌ను ఆర్చిపిలాగో అని కూడా అంటారు. మొత్తం భూవైశాల్యం దాదాపు 300,000 square kilometers (115,831 sq mi). 36,289 kilometers (22,549 mi) పొడవైన ఫిలిప్పైన్ సముద్రతీరం దేశాన్ని ప్రపంచంలో 5వ స్థానంలో ఉంచింది. ఫిలిప్పైన్ 116° - 126° డిగ్రీల ఉత్తర అక్షాంశం, 4° - 21° తూర్పు రేఖాంశంలో ఉంది. తూర్పున దక్షిణ చైనా సముద్రం ఉంది. పశ్చిమంలో సెలెబెస్ సముద్రం ఉంది. దక్షిణంలో బొర్నియో ద్వీపం ఉంది. ఉత్తరాన తైవాన్ ఉంది. నైరుతిలో మలుకు ద్వీపాలు, సులవెసి ద్వీపాలు ఉన్నాయి. తూర్పున పలౌ ఉంది. పర్వతమయమైన ద్వీపాలలో ఉష్ణ మండల వర్షారణ్యాలు అధికంగా ఉన్నాయి. వీటిలో జ్వాలాముఖ పర్వతాలు ఉన్నాయి. వీటిలో అత్యున్నత పర్వతం పేరు అపో పర్వతం. ఇది సముద్రమట్టానికి 2,954 meters (9,692 ft) ఎత్తున ఉంది. ఇది మిండనావో ద్వీపంలో ఉంది. ఫిలిప్పైన్ ట్రెంచ్ వద్ద ఉన్న గలాతియా డెప్త్ దేశంలో అత్యంత లోతైన ప్రాంతంగా భావిస్తున్నారు. అలాగే ఇది ప్రపంచ లోతైన ప్రాంతాలలో మూడవ స్థానంలో ఉందని భావిస్తున్నారు. ఈట్రెంచ్ ఫిలిప్పైన్ సముద్రంలో ఉంది. ఉత్తర ల్యూజాన్‌లో ఉన్న " కగయాన్ నది " దేశంలో అత్యంత పొడవైనదిగా గుర్తించబడుతుంది. మనిలా బే వద్ద రాజధాని నగరమైన మనీలా నగరం ఉంది. ఇది లగూనా డీ బేను అనుసంధానం చేస్తూ ఉంది. సూబిక్ బే ఫిలిప్పైన్ లోని అత్యంత పెద్ద సరసుగా గుర్తించబడుతుంది. ఇతర బేలలో డవాయో గల్ఫ్, మోరో గల్ఫ్ ప్రధానమైనవి. శాన్ జుయానికో స్ట్రైట్ సామర్, లేతే ద్వీపాలను విభజిస్తూ ఉంది. శాన్ జుయానికో వంతెన రెండు ద్వీపాలను అనుసంధానం చేస్తూ ఉంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పశ్చిమతీరంలో ఉన్న తరచుగా అగ్నిపర్వత విస్పోటనం ఎదుర్కొంటున్నది. ఫిలిప్పైన్ సముద్రంలో ఉన్న బెంహం ప్లాట్యూ భూకంపం సంభవించడానికి అవకాశం అధికంగా ఉన్న ప్రాంతంగా భావిస్తున్నారు. ఫిలిప్పైన్‌లో ఒకరోజుకు దాదాపు 20 భూకంపాలు నమోదు చేయబడుతుంటాయి. వీటిలో అనేకం గ్రహించడానికి వీలుకానంత బలహీనంగా ఉంటాయి. 1990 లో సంభవించిన ల్యూజాన్ భూకంపం అతిపెద్ద భూకంపంగా భావించబడుతుంది.

ఫిలిప్పైన్‌లో మేయన్ అగ్నిపర్వతం, పినతుబొ పర్వతం, తాల్ అగ్నిపర్వతం ఉన్నాయి. 1991లో పినతుబొ పర్వతంలో కొండచరియలు విరిగిపడిన సంఘటన 20వ శతాబ్దంలో జరిగిన రెండవ సంఘటనగా గుర్తించబడింది. ఫిలిప్పైన్‌లో భౌగోళిక సంఘటనలు అన్నీ అధికమైన విధ్వంసకరమైనవి కావు. ప్యూర్టో ప్రింసెసా నదీ పరీవాహకప్రాంతం ప్రకృతి వైవిధ్యానికి ప్రతీకగా ఉంది. ఈ ప్రాంతంలోని పర్వతప్రాంతం పర్యావరణ వైవిధ్యంతో ఆసియా అరణ్యలలో ప్రధానమైనవిగా గుర్తించబడుతుంటాయి. ద్వీపంలోని అగ్నిపర్వతాల కారణంగా ఫిలిప్పైన్ సుసంపన్నమైన ఖనిజ సంపదను కలిగి ఉంది. బంగారపు ఖనిజ నిల్వలలో ఫిలిప్పైన్ ప్రపంచంలో ద్వితీయ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో దక్షిణాఫ్రికా ఉంది. ఫిలిప్పైన్‌లో పెద్ద ఎత్తున రాగి నిల్వలు ఉన్నాయి. ఫిలిప్పైన్‌లో నికెల్, క్రోమైట్, జింక్ నిల్వలు అధికంగా ఉన్నాయి. అధిక జనసాంధ్రత బలహీనమైనన నిర్వహణ, పర్యావరణ జాగృతి ఈ ఖనిజాలు వెలికితీతీత పనులలో జాప్యం చోటుచేసుకుంది. అగ్నిపర్వాల ఉనికిని విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి ఉపయోగించడంలో ఫిలిప్పైన్ విజయం సాధించింది. జియోధర్మల్ విద్యుత్తు ఉత్పత్తిలో ఫిలిప్పైన్ ప్రపంచంలో ద్వితీయస్థానంలో ఉంది. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఉంది. ఫిలిప్పైన్ విద్యుత్తు అవసరాలలో 18% జియోధర్మల్ నుండి లభిస్తుంది.

వన్యమృగాలు

ఫిలిప్పీన్స్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Moalboal Reef in Cebu

ఫిలిప్పైన్ వర్షారణ్యాలు, దేశంలోని విస్తారమైన సముద్రతీరాలు ఈ ప్రాంతాలను వైవిధ్యమైన పక్షులకు, మొక్కలకు, జంతువులకు, సముద్రజీవులకు నిలయంగా మార్చింది. బృహత్తర జీవవైద్యం కలిగిన దేశాలలో ఫిలిప్పైన్ ఒకటి. ఫిలిప్పైన్‌లో 1,100 జీవజాలం కనుగొనబడ్డాయి. వీటిలో మరెక్కడా కనిపించని 100 క్షీరదాలు, 170 పక్షిజాతులు ఇక్కడ ఉన్నాయి. అత్యధికమైన జంతుజాలం కనుగొనబడిన దేశాలలో ఫిలిప్పైన్ ఒకటి. గత దశాబ్ధంలో నూతనంగా దాదాపు 16 జాతుల క్షీరదాలు కనుగొనబడ్డాయి. ఫిలిప్పైన్‌లో వేటప్రాణులు తక్కువగా ఉంటాయి. పాములు, చిరుతలు, త్రాచులు, ఉప్పునీటి మొసలి, ఫిలిప్పైన్ గ్రద్ద వంటి వేటాడే పక్షులు మొదలైనవి మాత్రమే ఉంటాయి. ప్రాంతీయంగా లోలాంగ్ అని పిలువబడే అతిపెద్ద మొసలి మిండనావో దీవిలో కనిపించింది. బొహోల్ దీవిలో పాం సివెట్ పిల్లి, డుగోంగ్, క్లౌడ్ ర్యాట్, ఫిలిప్పైన్ తార్సియర్ ఉన్నాయి. ఫిలిప్పైన్‌లోని 13,500 మొక్కలలో 3,200 మొక్కలు ఫిలిప్పైన్‌లో మాత్రమే కనిపిస్తుంటాయి. ఫిలిప్పైన్ వర్షారణ్యాలలో అరుదైన ఆర్చడ్స్, రాఫ్లాసియా మొదలైన మొక్కల వంటి పలు వృక్షజాతులు ఉన్న్నాయని సగర్వంగా చెప్పుకుంటుంటారు.

ఫిలిప్పీన్స్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Philippine tarsier (Tarsius syrichta), one of the smallest primates

22,00,000 కి.మీ పొడవైన ఫిలిప్పైన్ సముద్రతీరం పలు సముద్రప్రాణులకు ఆలవాలమై ఉంది. ఇది కోరల్ ట్రైయాంగిల్‌లో భాగమై ఉంది. ఫిలిప్పైన్‌లో 500 జాతుల కోరల్, 2,400 సముద్ర చేపల జాతులు ఉన్నాయి. అయినప్పటికీ కొత్త రికార్డులు , జాతుల పరిశోధనలు ఈ సంఖ్యను అధికం చేస్తున్నాయి. సులు సముద్రంలో ఉన్న తుబ్బతహ రీఫ్ ప్రపంచ వారసత్వ సంపదగా 1993లో ప్రకటించబడింది. ఫిలిప్పైన్ జలాలు ముత్యాల ఉత్పత్తికి, ఎండ్రకాయల ఉత్పత్తికి, సముద్రపు కలుపు మొక్కలకు అనుకూలంగా ఉంది. చట్టవిరుద్ధమైన అరణ్యాల నిర్మూలన ఫిలిప్పైన్ పర్యావరణానికి సమస్యగా మారింది. 1900లో ఫిలిప్పైన్ మొత్తం భూభాగంలో 70% ఉన్న అరణ్యాలు 1999 నాటికి 18.3% అయింది. పలు జాతులు అంతరించిపోతున్న దశలో ఉన్నాయి. కంసర్వేషన్ ఇంటర్నేషనల్ ఫిలిప్పైన్‌ను హాట్ స్పాట్, మెగాడైవర్శిటీ కలిగిన దేశంగా గుర్తిస్తూ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రపంచ సంరక్షిత దేశంగా భావిస్తుంది.

వాతావరణం

ఫిలిప్పీన్స్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Typhoon Haiyan (locally known as Yolanda) at peak intensity.

ఫిలిప్పైన్ ఉష్ణమండల వాతావరణం కలిగి వేడి, తేమ మిశ్రిత వాతావరణం కలిగి ఉంది. వేడి పొడి వాతావరణం (టాగ్- ఇనిట్ లేక టాగ్ ఆరా) లేక వేసవి మార్చి నుండి మే వరకు కొనసాగుతుంది. వర్షాకాలం (టాగ్-ఉలన్ ) జూన్ - నవంబరు మధ్య ఉంటుంది, శీతాకాలం (టాగ్ - లేమింగ్) డిసెంబరు- ఫిబ్రవరి మధ్య ఉంటుంది. నైఋతీ ౠతుపవనాలు (హబాగాట్) మే- అక్టోబరు మధ్య వీస్తుంటాయి. నవంబరు- ఏప్రిల్ మధ్య ఈశాన్య ఋతుపవనాలు (అమిహన్) వీస్తుంటాయి. దేశంలో ఉష్ణోగ్రతలు సీజన్ అనుసరించి 21-32 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. జనవరి మాసం అత్యంత శీతల మాసంగా మే అత్యంత ఉష్ణ మాసంగా ఉంటుంది. వార్షిక సరాసరి ఉష్ణోగ్రత 26.6డిగ్రీలు ఉంటుంది. ఉష్ణోగ్రతలు అక్షాంశ, రేఖాంశాలు అనుసరించి కాక తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, సముద్రమట్టానికి అధికంగా ఉండే ఎత్తు అనుసరించి మారుపడుతూ ఉంటుంది. బగుయియో (500 మీ ఎత్తు) ప్రాంతం వేసవి కాల అభిమాన పర్యాటక ప్రాంతంగా గుర్తించబడుతుంది. తుఫాన్ బెల్ట్ మధ్యలో ఉన్న ప్రాంతంగా ఫిలిప్పైన్ జూలై- అక్టోబరు మధ్యలో అధికవర్షపాతం అందుకుంటుంది. వార్షికంగా 18-19 తుఫానులను ఎదుర్కొంటున్న ఫిలిప్పైన్‌లో 8-9 తుఫానులు భూపతనాలకు కారణం ఔతున్నాయి. ఫిలిప్పైన్ వార్షిక వర్షపాతం పర్వత ప్రాంతాలలో షెల్టర్డ్ లోయలలో 5,000 మి.మీ, 1,000 మి.మీ ఉంటుంది. 1911 జూలై తుఫాన్ సంఘటన ఆర్చిపిలాగో లోని అత్యంత తీవ్రమైన తుఫానుగా గుర్తించబడింది. అది 24 గంటల సమయంలో 1168 మి.మీ వర్షపాతం కురిపించింది. ఫిలిప్పైన్‌లో తుఫానును " బాగ్యో " అంటారు.

శీతోష్ణస్థితి డేటా - Philippines
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
రోజువారీ సగటు °C (°F) 25.3
(77.5)
25.3
(77.5)
26.1
(79.0)
27.0
(80.6)
27.3
(81.1)
26.8
(80.2)
26.5
(79.7)
26.3
(79.3)
26.3
(79.3)
27.3
(81.1)
26.0
(78.8)
25.5
(77.9)
26.3
(79.3)
సగటు అవపాతం mm (inches) 147.8
(5.82)
99.4
(3.91)
97.2
(3.83)
93.3
(3.67)
188.4
(7.42)
235.9
(9.29)
286.6
(11.28)
273.1
(10.75)
269.4
(10.61)
273.7
(10.78)
257.7
(10.15)
226.7
(8.93)
2,449.2
(96.44)
Source: World Bank Climate Change Knowledge Portal (1990–2009)

గణాంకాలు

ఫిలిప్పీన్స్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Population density per province as of 2009 per square kilometer.

1990 నుండి 2008 ఫిలిప్పైన్ జనసంఖ్య దాదాపు 28 మిలియన్లు అధికం (45% అధికం) అయింది. 1877 లో ఫిలిప్పైన్ లో నిర్వహించిన గణాంకాల ఆధారంగా జనసంఖ్య 5,567,685. వీరిలో సంగం మంది ల్యూజాన్ దీవిలో నివసించేవారు.1995, 2000 మధ్య జనసంఖ్య 3.21% అభివృద్ధి చెందింది. 2005-2010 మధ్య జనసంఖ్య 1.95% క్షీణించింది. వివాహ వయసు 22.7 సంవత్సరాలు. 15-64 సంవత్సరాల వయస్కులు 60.9% ఉన్నారు. ఆయుఃప్రమాణం 71.94 సంవత్సరాలు. వీరిలో స్త్రీల ఆయుఃప్రమాణం 75.03 సంవత్సరాలు పురుషుల ఆయుఃప్రమాణం 68.99 సంవత్సరాలు. 1965లో యునైటెడ్ స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ చట్టం అనుకూలత చేయడం కారణంగా యునైటెడ్ స్టేట్శ్‌లో ఉన్న ఫిలిప్పైన్ ప్రజల సంఖ్య అధికం అయింది. 2007లో విదేశాలలో నివసిస్తున్న ఫిలిప్పైన్‌ ప్రజల సంఖ్య 12 మిలియన్లకు చేరుకుంది. 2007 జూలై 14 నాటికి 100 మిలియన్లకు చేరుకుంది. ఈ సంఖ్యకు చేరుకున్న ప్రపంచ దేశాలలో ఫిలిప్పైన్ 12 వ దేశం.

నగరాలు

మనీలా మహానగరం ఫిలిప్పైన్‌లో అత్యంత జనసాంధ్రత కలిగిన నగరంగా ప్రాధాన్యత కలిగి ఉంది. మనీలా నగరం ప్రపంచంలో 11 వ జనసాంధ్రత కలిగిన నగరంగా గుర్తించబడుతుంది.as of 2007, మనీలా నగరంలో 1,15,53,427 ప్రజలు ఉన్నారు. ఇది దేశ జనసంఖ్యలో 13%. మనీలా నగరం పక్కన ఉన్న బులకాన్, కావైట్, లగూనా, రిజాల్ ప్రాంతాల ప్రజలతో కలిసి గ్రేటర్ మనీలా జనసంఖ్య 21 మిలియన్లు. 2009 లో మనీలా నగర జి.డి.పి 468.4 బిలియన్లు. దేశ జి.డి.పి.లో ఇది 33%. 2011 లో మనీలా నగరం అత్యంత సంపన్న నగరంగా దక్షిణాసియాలో 2వ సంపన్న నగరంగా గుర్తించబడుతుంది.

సంప్రదాయ సమూహాలు

Dominant ethnic groups by province.
An Ati woman. Along the Aetas, the Atis are among the earliest inhabitants of the islands.

2000 గణాంకాలను అనుసరించి ఫిలిప్పైంన్లలో 28.1% తగలాగులు, 13.1% సెబుయానోలు, 9% ఇలోకానోలు, 7.6% బిసయాలు (విసయానులు, 7.5% హిలిగయ్‌నానులు, 6% బికోల్, 3.4% వారేలు, 25.3% ఇతరులు ఉన్నారు. అదనంగా ఫిలిప్పైన్‌లో గిరిజనేతరులైన మోరో ప్రజలు, కపంపంగన్ ప్రజలు, పంగాసియన్ ప్రజలు, ఇబనాగ్ ప్రజలు, వాటన్ ప్రజలు ఉన్నారు. ఫిలిప్పైన్‌ స్థానిక ప్రజలలో ఇగొరాట్, ల్యూమాడ్, మంగ్యన్, బజు, పలవన్ జాతి ప్రజలు ప్రధాన్యత కలిగి ఉన్నారు. ఫిలిప్పైన్‌లో ఆస్ట్రోనేషియన్ (మలయో - పాలీనేషియన్ ప్రజలు ఉన్నారు. వేలాది సంవత్సరాలకు ముందు ఆస్ట్రోనేషియన్ మాట్లాడే తైవాన్‌కు చెందిన స్థానిక ప్రజలు తైవాన్ నుండి ఫిలిప్పైన్‌కు వలస వచ్చారు. వారు వారితో వ్యవసాయ విఙానం, సముద్రయానం తీసుకువచ్చారు. ఆస్ట్రోనేషియన్లు దీవులలో నివసిస్తున్న స్థానికులైన నెగ్రిటో సమూహాంకి చెందిన ప్రజలను ఇక్కడ నుండి తరిమివేసారు. నెగ్రిటోస్‌లో భాగమైన అయేటా, అటి మొదలైన ప్రజలు ఈ ద్వీపాలలో ఆరంభకాల నివాసితులని భావిస్తున్నారు. తూర్పు, పడమర మధ్యమార్గంలో ఉన్న ఫిలిప్పైన్ చైనా, స్పెయిన్, మెక్సికో, అమెరికా, భారతదేశం, దక్షిణ కొరియా, జపాన్ మొదలైన దేశాల నుండి వచ్చే వలసప్రజలకు నివాసప్రాంతంగా ఉంది. ప్రధాన స్థానికేతర అల్పసంఖ్యాక ప్రజలకు ఫిలిప్పినో చైనీస్, ఫిలిప్పినో స్పానిష్ భాషలు వాడుకభాషగా ఉంది. 1898 నుండి 2 మిలియన్ల ఫిలిప్పినో చైనీస్ ఫ్యూజియన్, చైనా వలస ప్రజలకు వాడుక భాషగా ఉంది. అయినప్పటికీ 18 మిలియన్ల ఫిలిప్పైన్ ప్రజలు సగభాగం చైనా స్థానికత కలిగిన వారని భావిస్తున్నారు. వీరు కాలనీ పాలనకు ముందుగా ఇక్కడకు చేరుకున్నారని భావిస్తున్నారు. ప్రధాన నగరాలలో, నగరప్రాంతాలలో కులాంతర, జాత్యంతర వివాహాలు సాధారణంగా ఉన్నాయి. ల్యూజాన్ ప్రజలలో మూడవ వంతు అలాగే విసయాస్, జంబొయంగ నగరం (మిండనవో) ప్రాంతాలలోని పాత సెటిల్మెంట్లలో పాక్షికంగా హిస్పానిక్ (స్పెయిన్, లాటిన్ అమెరికాకు చెందిన) సంతతికి చెందిన ప్రజలున్నారు. సమీపకాల జన్యుశాస్త్ర అధ్యయనాలు పాక్షిక యురేపియన్, లాటిన్ వారసత్వాన్ని నిర్ధారిస్తున్నాయి. ఇతర స్థానికేతర అల్పసంఖ్యాకులలో ఇండియన్లు, ఆంగ్లో అమెరికన్లు, బ్రిటన్లు, జపానీ ప్రజలు ఉన్నారు. మిశ్రితజాతి వారి సంతతి వారిని ఫిలిపినో మెస్టిజోలు అంటారు.

భాషలు

Top 5 languages in the Philippines
Language Speakers(millions)
Tagalog
  
25
Cebuano
  
16
Ilokano
  
10
Hiligaynon
  
9
Bikol
  
5
References:

మానవజాతి శాస్త్రవేత్తలు ఫిలిప్పైన్‌లో186 ప్రత్యేక భాషలను కనుగొన్నారు. వీటిలో 182 సజీవంగా ఉన్నాయి. 4 భాషలకు వాడుకరులు లేరు. స్థానిక భాషకలో అనేకం ఫిలిప్పైన్ భాషలలోని మలయో- పాలినేషియన్ భాషలలో (ఆస్ట్రోనేషియన్ భాషలలో) భాగంగా ఉన్నాయి. ఆస్ట్రోనేషియన్ భాషలలో భాగంలేని ఒకేఒక భాష " చవాకనో " మాత్రమే. ఇది మెక్సికన్ స్పానిష్‌కు చెందిన ఒక క్రియోల్ భాష. ఇది రోమన్ల భాషగా వర్గీకరించబడింది. ఫిలిపినో భాష, ఆగ్లం ఫిలిప్పైన్ అధికారభాషలుగా ఉన్నాయి. ఫిలిపినొ సంస్కరించబడిన తగలాగ్ భాష. ఇది అధికంగా మనీలా మహానగరం, ఇతర నగరప్రాంతాలలో వాడుకలో ఉంది. ఫిలిపినొ, ఆంగ్లం విద్యావిధానం, ప్రింట్, మాధ్యమ ప్రసారం, వాణిజ్యరంగంలో వాడుకలో ఉంది. అయినప్పటికీ నగరప్రాంతాలకు వెలుపల ఉన్న ప్రజలు ఆంగ్లభాషను అధికంగా మాట్లాడలేరు. పలు పట్టణాలలో స్థానిక భాషలు వాడుకలో ఉన్నాయి. ఫిలిప్పైన్ రాజ్యాంగం స్పానిష్, అరబిక్ భాషలకు ఆదరణ ఇస్తుంది.అయినప్పటికీ ఇవి అధికంగా ఉపయోయించబడడం లేదు. 19వ శతాబ్దంలో మాట్లాడటానికి మాత్రమే వాడుకలో ఉన్న స్పానిష్ భాష ప్రస్తుతం వాడుకలో లేదు. మిండనావో లోని కొన్ని ఇస్లామిక్ పాఠశాలలలో అరబిక్ భాష అధ్యయన భాషగా ఉంది. ఫిలిప్పైన్ స్థానిక భాషలలో ఇప్పటికీ స్పానిష్ పదాలు వాడుకలో ఉన్నాయి. 19 స్థానిక భాషలు సహాయక అధికార భాషలుగా ఉన్నాయి: అక్లాన్, బికోల్, సెబుయానో, చవకానో, హిలిగయనాన్, బనాగ్, ఇలొకానో, ఇవటన్, కపంపంగన్, కినారే-అ, మగుయిండనో, మరనావో, పంగాసియన్, సంబల్, సురిగయానన్, తగలాగ్, తౌసుగ్, వారే, యాకన్. ఇతర స్థానిక భాషలలో కుయోనాన్, ఇఫుగవో, ఇత్బయాత్, కలింగ, కమయో, కకనాయ్, మస్బటెనో, రొంబ్లొమనాన్, ఫిలిప్పైన్ మలాయ్, పలు విసయన్ భాషలు ప్రధానమైనవి. స్థానిక భాషలకు ప్రాధాన్యత లేని దీవులలో స్టాండర్డ్ చైనీస్ (మాండరిన్) వాడుకలో ఉంది. చైనీస్ పాఠశాలలలో ఫిలిపినో చైనీస్ వాడుకలో ఉంది. మిండనావో దీవిలోని ఇస్లామిక్ పాఠశాలలలో ఆధునిక అరబిక్ భాష వాడుకలో ఉంది. విదేశీ విద్యాసంస్థలు ఫ్రెంచ్, జర్మన్, కొరియన్, స్పానిష్ భాషలు బోధిస్తున్నాయి. 2013 నుండి విద్యాశాఖ ఇండోనేషియన్ భాష అయిన మలాయ్, మలేషియన్ భాషలను బోధిస్తుంది.

మతం

దస్త్రం:Carlos V Francisco First Mass in the Philippines.png
A detail of Carlos V. Francisco's First Mass in the Philippines painting

అధికారికంగా ఫిలిప్పైన్ ఒక లౌకిక వాద దేశం. అయినప్పటికీ ఫిలిప్పైన్‌లో క్రైస్తవమతం ఆధిక్యత కలిగి ఉంది. కాథలిక్ చర్చి 2015 లో 82.9% ప్రజలు రోమన్ కాథలిక్ మతానికి చెందిన వారని తెలియజేసింది. 37% ప్రజలు కాథలిక్ అనుయాయులు ఉన్నారు. 29% తీవ్రమైన మతానుయాయులుగా ఉన్నారు. ప్రొటెస్టెంట్లు 10% ఉన్నారని అంచనా. ఫిలిప్పైన్‌లో ప్రారంభంలో ఎవాంజలిజం వాడుకలో ఉంది. ఫిలిప్పైన్ చర్చి ఇండిపెండెంట్ కాథలిక్కులకు చిహ్నంగా ఉంది.

ఇస్లాం

ఫిలిప్పైన్‌లో ఇస్లాం ద్వితీయ స్థానంలో ఉంది. 2000 - 2011 గణాంకాలను అనుసరించి ఫిలిప్పైన్‌లో ముస్లిములు 5% మంది ఉన్నారు. 2012 గణాంకాలను అనుసరించి 11% మంది ఉన్నారు. ముస్లిములు అధికంగా బంగ్సమొరొ ప్రాంతంలో ఉన్నారు. వీరిలో అధికంగా షియా (షఫి స్కూల్) ఉన్నారు. ఏ మతానికి చెందని వారి సంఖ్య స్పష్టంగా ఉన్నప్పటికీ దాదాపు 10% ఉందని అంచనా. 9% నాస్థికులు చర్చిని వదిలివేసిన కారణంగా కాథలిక్కిజం బలహీనపడుతుంది. ఫిలిప్పైన్ జనసంఖ్యలో 2% కాథలిక్కిజం నుండి ఇస్లాంకు మార్పిడి చెందుతున్నారు. ఫిలిప్పైన్‌లో బుద్ధిజం 1% ఉంది. ఇది అధికంగా చైనీయులలో ఆచరణలో ఉంది. మిగిలిన వారు హిందూ, యూదు, బహై మతాలకు చెంది ఉన్నారు.

ఆర్ధికం

ఫిలిప్పీన్స్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Philippine Export Treemap in 2012.

ఫిలిప్పైంస్ ఆర్థికరంగం (ఫిలిప్పైన్ జి.డి.పి) ప్రపంచంలో 39వ స్థానంలో ఉంది. 2014 దేశీయ ఉత్పత్తి 289.686 అమెరికన్ డాలర్లు. ఫిలిప్పైన్ నుండి ప్రధానంగా ఎలెక్ట్రానిక్ ఉత్పత్తులు, రవాణా పరికరాలు, దుస్తులు, రాగి ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు, కొబ్బరినూనె, పండ్లు ఎగుమతి చేయబడుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్, జపాన్, చైనా, సింగపూర్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, జర్మనీ, తైవాన్, తాయ్ లాండ్ ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. ఫిలిప్పైన్ కరెంసీని " ఫిలిప్పైన్ పెసో " అంటారు.

ఫిలిప్పీన్స్: పేరువెనుక చరిత్ర, చరిత్ర, భౌగోళికం 
Farmers harvesting pineapples in the province of South Cotabato, Mindanao.

పరిశ్రమలు , ఉపాధి అవకాశాలు

కొత్తగా పారిశ్రామిక దేశంగా మారుతున్న ఫిలిప్పైన్ ఆర్థికరంగం క్రమంగా వ్యవసాయరంగం నుండి సేవలు, వస్తూత్పత్తి రంగం వైపు మార్పుచెందుతుంది. ఫిలిప్పైన్ మొత్తం శ్రామికుల సంఖ్య 40.813 మిలియన్లు. వ్యవసాయ రంగం 32% ఉపాధి కల్పిస్తూ 14% జి.డి.పి.కి భాగస్వామ్యం వహిస్తుంది. పారిశ్రామిక రంగం 14% ఉపాధి కల్పిస్తూ 30% జి.డి.పి అభివృద్ధికి భాగస్వామ్యం వహిస్తుంది. సేవారంగం 47% ఉపాధి కల్పిస్తూ 56% జి.డి.పి అభివృద్ధికి భాగస్వామ్యం వహిస్తుంది. ఫిలిప్పైన్‌లో నిరుద్యోగ సమస్య 6% ఉంది. అత్యవసరాల వ్యయం స్వల్పంగా ఉన్నందున 3.7% ద్రవ్యోల్భణం సాధ్యం అయింది. 2013 నాటికి ఫిలిప్పైన్ విదేశీమారకద్రవ్యం 83.201 మిలియన్ అమెరికన్ డాలర్లు ఉంది. ఋణం 2004లో 78%గా ఉన్న 2014 మార్చి నాటికి 38.1% నుండి తగ్గింది.

ఆర్ధిక సంక్షోభం

ఫిలిప్పైన్ అధికంగా దిగుమతుల మీద ఆధారపడుతుంది. అయినప్పటికీ ఇది సంపన్న దేశం. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఫిలిప్పైన్ ప్రపంచంలో రెండవ సంపన్నదేశంగా ఉంది. మొదటిస్థానంలో జపాన్ ఉంది. 1960 లో ఫిలిప్పైన్ ఆర్థికరగం అధిగమించబడింది. అధ్యక్షుడు " ఫెర్డినాడ్ మార్కోస్ " నియతృత్వ పాలనలో నిర్వహణా లోపం, రాజకీయ అస్థిరత చోటు చేసుకున్న కారణంగా ఆర్థికరంగం దెబ్బతిన్నది. తరువాత ఫిలిప్పైన్ మదమైన ఆర్థికాభివృద్ధితో బాధపడింది. 1990 లో ఆర్ధిరంగ స్వేచ్ఛ కారణంగా ఆర్థికరంగం క్రమంగా కోలుకున్నది. 1997 ఆసియన్ ఆర్థిక సంక్షోభం దేశాన్ని బాధించింది. ఫిలిప్పైన్ పెసో విలువ క్రమంగా దిగజారింది. స్టాక్ మార్కెట్ పతనం అయింది.

ఆర్ధికరంగం పునరుద్ధరణ

2004 నుండి క్రమంగా ఆర్థికాభివృద్ధి సాధ్యం అయింది. ఆర్థికరంగం 6.4% జి.డి.పి అభివృద్ధిని సాధించి 2007 నాటికి అది 7.1%గా అభివృద్ధి చెందింది. మూడు దశాబ్ధాలలో ఇది వేగవంతమైన అభివృద్ధి. 1966-2007 మధ్య సరాసరి జి.డి.పి అభివృద్ధి 1.45%. తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతం అభివృద్ధి 5.96%. ఫిలిప్పైన్ ప్రజలలలో 45% మంది దినసరి ఆదాయం 2 అమెరికన్ డాలర్లు.

విదేశాలలో పెట్టుబడులు

ఫిలిప్పైన్ ఆర్థికరంగం అధికంగా విదేశాలలో నివసిస్తున్న ఫిలిప్పైంస్ నుండి లభిస్తుంది. అలాగే విదేశాల పెట్టుబడుల కారణంగా ఫిలిప్పైన్‌కు విదేశీ ద్రవ్యం లభిస్తుంది. 2010 లో విదేశీద్రవ్యరూపంలో లభించిన ఆదాయం 10% జి.డి.పి ఆదాయానికి భాగస్వామ్యం వహించింది. 2012, 2014లో 8.6% జి.డి.పి అభివృద్ధికి సహకరించింది. ఫిలిప్పైన్ మొత్తం విదేశీ చెల్లింపులు 28 బిలియన్ల అమెరికన్ డాలర్లు. ప్రాంపాలవారీగా అభివృద్ధిలో అసమానతలు ఉన్నాయి. మనీలా మహానగరం, ల్యూజాన్ నగరాలలో ఆర్థికాభివృద్ధి ఇతర ప్రాంతాలకంటే అధికంగా ఉంది.

అభివృద్ధి ప్రయత్నాలు

అయినప్పటికీ ప్రభుత్వం ఆర్థికాభివృద్ధి కొరకు ప్రయత్నం చేసింది. దేశంలోని ఇతర ప్రాంతాలలో పెట్టుబడులు అధికం చేసింది. పర్యాటకం, వాణిజ్యరంగాలలో అభివృద్ధి పనులు ప్రారంభించింది. ఫిలిప్పైన్‌లో గోల్డ్మన్ శాచే సంస్థలు స్థాపించడానికి ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ చైనా, భారతదేశం ప్రధాన పోటీదారులుగా నిలిచాయి. గోల్డ్మన్ శాచేస్ 2050 నాటికి ప్రపంచంలో బృహత్తర ఎకనమీగా మారుతుందని అంచనా. హెచ్.ఎస్.బి.సి. ఫిలిప్పైన్‌లో ప్రాజెక్టులు ప్రారంభించింది. 2050 నాటికి ఫిలిప్పైన్ ఎకనమీ ప్రపంచపు ఆర్థికరగంలో 16వ స్థానంలో ఉంది. అలాగే ఆసియా దేశాలలో 5వ స్థానంలోనూ, దక్షిణాదేశాలలో ప్రథమ స్థానంలోనూ ఉంటుందని అంచనా. ఫిలిప్పైన్ ప్రపంచబ్యాంక్ సభ్యత్వం కలిగిఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సభ్యత్వం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సభ్యత్వం, ఆసియన్ డెవెలెప్మెంట్ బ్యాంక్ ప్రధానకార్యాలయాలు మండలుయాగ్‌లో ఉంది. కొలంబో ప్లాన్, జి-77 సంస్థలు, జి-24 సంస్థలు మొదలైన సంస్థలు కూడా ఫిలిప్పైన్‌లో ఉన్నాయి.

ఇవి కూడా చుడండి

మూలాలు

Tags:

ఫిలిప్పీన్స్ పేరువెనుక చరిత్రఫిలిప్పీన్స్ చరిత్రఫిలిప్పీన్స్ భౌగోళికంఫిలిప్పీన్స్ గణాంకాలుఫిలిప్పీన్స్ ఆర్ధికంఫిలిప్పీన్స్ ఇవి కూడా చుడండిఫిలిప్పీన్స్ మూలాలుఫిలిప్పీన్స్మనీలా

🔥 Trending searches on Wiki తెలుగు:

పల్లెల్లో కులవృత్తులునజ్రియా నజీమ్విజయనగర సామ్రాజ్యంప్రియురాలు పిలిచిందిగుంటూరుఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుకొమురం భీమ్విద్యుత్తుగోత్రాలురుద్రమ దేవివై. ఎస్. విజయమ్మఛత్రపతి శివాజీపుష్కరంభగవద్గీతయోనిశింగనమల శాసనసభ నియోజకవర్గంఆంధ్రజ్యోతిభాషా భాగాలుతెలుగు సినిమాలు డ, ఢరుక్మిణీ కళ్యాణంభారతదేశంలో కోడి పందాలుజగ్జీవన్ రాంతెలుగు పదాలుధర్మవరం శాసనసభ నియోజకవర్గంజీలకర్రపులివెందులమధుమేహంశ్రీనాథుడుచిరంజీవి నటించిన సినిమాల జాబితాడేటింగ్ఉపద్రష్ట సునీతరైతునర్మదా నదిహనుమాన్ చాలీసాఅమిత్ షాశ్రీ కృష్ణుడుదినేష్ కార్తీక్మెదడుద్విగు సమాసముఆవేశం (1994 సినిమా)సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్తిరువణ్ణామలై2024 భారత సార్వత్రిక ఎన్నికలులోక్‌సభ నియోజకవర్గాల జాబితాభారతదేశ జిల్లాల జాబితాభారతదేశ రాజకీయ పార్టీల జాబితాసచిన్ టెండుల్కర్భారతీయ తపాలా వ్యవస్థవడ్డీజిల్లేడుగ్రామ పంచాయతీశ్రీరామనవమిఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాసింగిరెడ్డి నారాయణరెడ్డిభారత రాజ్యాంగ పీఠికకె. అన్నామలైఎల్లమ్మఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాశివ కార్తీకేయన్యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీభారతదేశంశ్రీకాళహస్తిరమ్య పసుపులేటిఋతువులు (భారతీయ కాలం)శివపురాణంసింహంమదర్ థెరీసారాజ్యసభతెలంగాణ విమోచనోద్యమంఅక్కినేని నాగ చైతన్యఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకోవూరు శాసనసభ నియోజకవర్గంపిఠాపురంశ్రేయా ధన్వంతరిథామస్ జెఫర్సన్భారత రాష్ట్రపతిదగ్గుబాటి వెంకటేష్ఇంగువరేణూ దేశాయ్🡆 More