జర్మనీ: ఐరోపా లోని ఒక దేశం

జర్మనీ అధికారికంగా జర్మనీ గణతంత్ర సమాఖ్యగా (జర్మన్: బుండెస్‌రెపుబ్లిక్ డాయిచ్‌లాండ్) మధ్య ఐరోపాలోని ఒక దేశం.

దీని సరిహద్దులలో ఉత్తరాన ఉత్తర సముద్రం, డెన్మార్క్, బాల్టిక్ సముద్రం; తూర్పున పోలాండ్ చెక్ గణతంత్రం; దక్షిణాన ఆస్ట్రియా, స్విట్జర్లాండ్; ఇంకా పశ్చిమాన ఫ్రాన్సు, లక్సెంబర్గ్, బెల్జియం, నెదర్లాండ్స్ ఉన్నాయి. జర్మనీ భూభాగం సమశీతోష్ణ వాతావరణంచే ప్రభావితం చేయబడుతుంది. 82 మిల్లియన్ల నివాసితులతో ఐరోపా సమాఖ్యలోని సభ్యదేశాలలో అధిక జనాభా గల దేశంగా లెక్కింపబడింది. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా వచ్చిన వలస ప్రజలకు మూడవ అతిపెద్ద నివాసదేశంగా ఉంది.

Bundesrepublik Deutschland (in German)
Federal Republic of Germany
జర్మనీ గణతంత్ర సమాఖ్యగా
Flag of Germany Germany యొక్క చిహ్నం
నినాదం
Einigkeit und Recht und Freiheit
“Unity and Justice and Freedom”
జాతీయగీతం

Germany యొక్క స్థానం
Germany యొక్క స్థానం
Location of  జర్మనీ  (dark green)

– on the European continent  (light green & dark grey)
– in the European Union  (light green)  —  [Legend]

రాజధాని
అతి పెద్ద నగరం
బెర్లిన్
52°31′N 13°23′E / 52.517°N 13.383°E / 52.517; 13.383
అధికార భాషలు German[1]
జాతులు  91.5% German, 2.4% Turkish, 6.1% other
ప్రజానామము German
ప్రభుత్వం Federal Parliamentary republic
 -  President Horst Köhler (CDU)
 -  Chancellor Angela Merkel (CDU)
Formation
 -  Holy Roman Empire 962 
 -  Unification 18 January 1871 
 -  Federal Republic 23 May 1949 
 -  Reunification 3 October 1990 
Accession to
the European Union
25 March 1957
 -  జలాలు (%) 2.416
జనాభా
 -  2022 అంచనా 83,695,430 (19th)
జీడీపీ (PPP) 2008 అంచనా
 -  మొత్తం $2.918 trillion (5th)
 -  తలసరి $35,539 (21st)
జీడీపీ (nominal) 2008 అంచనా
 -  మొత్తం $3.673 trillion (4th)
 -  తలసరి $44,728 (19th)
జినీ? (2020) 30.5 (low
మా.సూ (హెచ్.డి.ఐ) (2021) Increase 0.942 (very high) (9th)
కరెన్సీ Euro (€)[2] (EUR)
కాలాంశం CET (UTC+1)
 -  వేసవి (DST) CEST (UTC+2)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .de [3]
కాలింగ్ కోడ్ +49
1 ^ Danish, Low German, Sorbian, Romany and Frisian are officially recognised and protected by the ECRML.
2 ^ Before 2002: Deutsche Mark (DEM].
3 ^ Also.eu, shared with other European Union member states.

జర్మానీ ప్రజలు అనేకమంది నివాసం ఉన్న జర్మానియా అనే పేరున్న ఒక ప్రాంతం క్రీస్తుశకం 100 ముందే ఉన్నట్లు గ్రంథస్థం చేయబడింది. 10వ శతాబ్దం ఆరంభం నుండి 1806 వరకు జర్మనీ దేశ భాగాలు ఉనికిలో ఉండి పవిత్ర రోమన్ సామ్రాజ్యం కేంద్రభాగంగా ఏర్పడ్డాయి. 16వ శతాబ్దం సమయంలో ఉత్తర జర్మనీ ప్రొటస్టెంట్ సంస్కరణవాదం కేంద్రమైంది. ఆధునిక జాతీయ-దేశంగా ఈదేశం 1871లో ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధం మధ్యలో మొదటిసారి సంఘటితమైనది. 1949లో రెండవ ప్రపంచయుద్ధం తర్వాత మిత్రదేశాల సరిహద్దుల వెంట-జర్మనీని తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ అని రెండు దేశాలుగా విభజించారు. జర్మనీ 1990లో తిరిగి సంఘటితమైనది. 1957లో పశ్చిమ జర్మనీ ఐరోపా సంఘం (ఇసి) స్థాపక సభ్యత్వం కలిగి ఉంది. అది 1993లో ఐరోపా సమాఖ్యగా అయ్యింది. ఇది షెన్గన్ ప్రాంతంలో భాగం, ఐరోపా ద్రవ్యం, యూరోను, 1999లో అనుసరించింది.

జర్మనీ పదహారు రాష్ట్రాల యొక్క సమాఖ్య పార్లమెంటరీ గణతంత్రం. బెర్లిన్ దీని రాజధాని నగరంగానూ అతిపెద్ద నగరంగానూ ఉంది. జర్మనీ ఐక్యరాజ్య సమితి, ఎన్ ఎ టి ఒ, జి8, జి20, ఒ ఇ సి డి,, డబ్ల్యూ టి ఒలో సభ్యత్వం కలిగి ఉంది. నామమాత్ర జి డి పి ద్వారా ప్రపంచపు నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానూ కొనుగోలు శక్తి గల దేశంగానూ 5వ పెద్ద దేశంగా శక్తివంతంగా ఉంది. వస్తువుల అతిపెద్ద ఎగుమతిదారుగానూ, రెండవ అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. స్థూలంగా చెప్పాలంటే, జర్మనీ ప్రపంచంలో రెండవ అతిపెద్ద వార్షిక అభివృద్ధి నిధిని కేటాయించుకునే దేశంగా ఉంది, కాగా, దాని సైనిక ఖర్చు ఆరవస్థానంలో ఉంది. ఈదేశం ఉన్నత జీవన ప్రమాణాలను అభివృద్ధి పరచింది. సాంఘిక భద్రత కలిగిన విస్తృతమైన వ్యవస్థను నెలకొల్పింది. ఈదేశం ఐరోపా దేశాల వ్యవహారాలలో కీలకపాత్ర వహిస్తోంది. ప్రపంచస్థాయిలో సమీపదేశాలతో భాగస్వామ్యాలను నిర్వహిస్తోంది. జర్మనీ అనేక రంగాలలో శాస్త్ర, సాంకేతిక నాయకత్వ కలిగిన దేశంగా గుర్తించబడుతోంది.

పేరు వెనుక చరిత్ర

ఆంగ్ల పదం "జర్మనీ" లాటిన్ పేరు జర్మనీయ నుండి పొందబడింది. జూలియస్ సీజర్ "జెర్మనియా" పదాన్ని రైన్ తూర్పుప్రాంతంలోని ప్రజలకోసం గాల్లిక్ పదం నుండి తీసుకున్నారు, దీనర్ధం బహుశా "ఇరుగుపొరుగువారు" అయ్యుండవచ్చు.

జర్మనీ జాతులు

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
క్రీపు750 నుండి– క్రీశ 1 వరకు జర్మానిక్ తెగల విస్తరణ

నార్డిక్ కాంస్య యుగం లేదా మరింత దగ్గరి సమీపకాలం నుండి జర్మన్ జాతులు స్థానికంగా ఉనికిలో ఉన్నాయని భావిస్తున్నారు.సరిగా చెప్పాలంటే రోమన్లకు ముందున్న ఇనపయుగంలో జరిగినట్లుగా భావించబడుతుంది. క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం దక్షిణ స్కాండినేవియా, ఉత్తర జర్మనీ నుండి ఈ తెగలు దక్షిణ, తూర్పు, పశ్చిమాలకు లో విస్తరించడం ప్రారంభించింది. గాల్ సెల్ట్ యిక్ తెగలతో పాటు తూర్పు ఐరోపా లోని ఇరానియన్, బాల్టిక్,, స్లావిక తెగలతో సంబంధాలు నెలకొల్పుకున్నాయి. రోమన్ సామ్రాజ్యంతో వారి సంబంధాల గురించి లిఖిత సమాచారం, శబ్ద ఉత్పత్తి పరిశోధన, పురాతత్వ పరిశీలనలను మినహాయించి జర్మనీ చరిత్ర గురించి తెలిసింది చాలా తక్కువ.

ఆగస్టస్ పాలనలో, రోమన్ సైన్యాధ్యక్షుడు పబ్లియస్ క్వింకిటిలస్ వరుస్ జర్మనీయాపై (రైన్ నుండి ఉరల్ పర్వతాల వరకు ఉన్న భూభాగాన్ని నిర్వచించడానికి రోమన్లు వాడిన పదం) దండయాత్ర ప్రారంభించాడు. ఈ కాలంలోనే జర్మానిక్ తెగలు వారి తెగ గుర్తింపును కొనసాగిస్తూనే రోమన్ వ్యూహాలు, యుద్ధతంత్రాలతో పరిచయం పెంచుకున్నారు. క్రీస్తుశకం 9లో వరుస్ నాయకత్వం లోని మూడు రోమన్ దళాలు చెరుస్కాన్ నాయకుడైన అర్మినియాస్‌చే ట్యుతోబర్గ్ గొరిల్లా యుద్ధంలో ఓడించబడ్డాయి. రైన్ నుండి డాన్యూబ్ వరకు ఆధునిక జర్మనీ ఆవిధంగా రోమన్ సామ్రాజ్యానికి వెలుపల ఉండిపోయింది. క్రీస్తుశకం 100నాటికి, టసితుస్' జర్మనియా కాలంలో, జర్మానిక్ తెగలు ఆధునిక జర్మనీలోని అధిక భాగమైన రైన్, డాన్యూబ్ నదుల లిమ్స్ జర్మనీకాస్) వెంట స్థిరపడ్డాయి. 3వ శతాబ్దం అనేక పశ్చిమ జర్మనీ తెగలు ఉద్భవించడాన్ని చూసింది.వీరిలో అలమాన్ని, ఫ్రాంకులు, చత్తి, సాక్సన్స్, ఫ్రిసియన్స్, సికామ్బ్రి, టురిన్గీ తెగలకు చెందిన ప్రజలు ఉన్నారు. 260 ప్రాంతంలో జర్మానిక్ ప్రజలు లైమ్స్, డాన్యూబ్ సరిహద్దులను దాటి రోమన్-నియంత్రిత భాగాలలోకి చొరబడ్డారు.

పవిత్ర రోమన్ సామ్రాజ్యం(962–1806)

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
పవిత్ర రోమన్ సామ్రాజ్యం యొక్క రాజ్యాధికార కిరీటం (క్రీశ1000వ సంవత్సరం సమీపంలో సృష్టించబడింది).

25 డిసెంబరు 800 న, చార్లెమాగ్నే కారోలింగియన్ సామ్రాజ్యం స్థాపించారు. ఇది 843లో విడిపోయింది. ఈ విభజన తూర్పు భాగం నుండి మధ్యయుగ సామ్రాజ్యం ఉద్భవించి 962 నుండి 1806 వరకూ వివిధ రూపాలలో కొనసాగింది. దీని భూభాగం ఉత్తరాన ఇదర్ నది నుండి దక్షిణాన మధ్యధరాతీరం వరకూ వ్యాపించింది. ఇది తరచూ పవిత్ర రోమన్ సామ్రాజ్యం (లేదా పాతసామ్రాజ్యం) గా సూచింపబడేది. తగ్గిన దాని భూభాగానికి అనుగుణంగా పేరును సరిచేసుకోవడానికి, 1448 నుండి అధికారికంగా దానిని సాక్రుం రోమనుం ఇమ్పీరియుం నేషనిస్ జర్మనికా (హోలీ రోమన్ ఎంపైర్ అఫ్ ది జర్మన్ నేషన్)గా పిలిచారు.

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
మార్టిన్ లూథర్, (1483–1546) ప్రొటస్టెంట్ పునురుద్ధరణను ప్రారంభించారు.

ఓట్టోనియన్ చక్రవర్తుల పాలనలో (919–1024), లోర్రిన్, సాక్సోనీ, ఫ్రాన్కానియా, స్వాబియా, తురింగియా, బవేరియా ప్రభువులు బలోపేతమయ్యారు. జర్మన్ రాజు 962లో ఈప్రాంతాలకు పవిత్ర రోమన్ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. చక్రవర్తులు ప్రతిష్ఠాపన వివాదం వలన అధికారాన్ని కోల్పోయినప్పటికీ సాలియన్ చక్రవర్తుల పాలనలో (1024–1125) పవిత్ర రోమన్ సామ్రాజ్యం ఉత్తర ఇటలీ బుర్గుండి లను విలీనం చేసుకుంది. హోహెన్ స్టేఫెన్ చక్రవర్తుల పాలనలో (1138–1254), జర్మన్ రాజులు వారి ప్రభావాన్ని మరింత దక్షిణం, తూర్పులకు స్లావ్స్ నివాస భూభాగాలకు విస్తరించారు. జర్మన్ స్థావరాలను ఈ ప్రాంతాలలో మరింత తూర్పుకు (ఓస్త్సిఎద్లూంగ్ విస్తరించారు. హన్సేయటిక్ సంధిలో భాగంగా ఉత్తర జర్మన్ పట్టణాలు అభివృద్ధి చెందాయి. 1315 నాటి గొప్ప కరువుతో ప్రారంభించి ఆ తరువాత 1348-50 నాటి బ్లాక్ డెత్ లతో, జర్మనీ జనాభా త్వరగా తగ్గిపోయింది.

1356 నాటి గోల్డెన్ బుల్ రాజశాసనం సామ్రాజ్యం అంతమయ్యేవరకు అవసరమైన ఆధార రాజ్యాంగాన్ని అందచేసింది. ఇది శక్తివంతమైన ఏడు రాజ్యాలు, ఆర్చ్ బిషప్ పాలిత ప్రాంతాల ప్కు రాజు-ఎన్నిక, చక్రవర్తి ఎన్నికల గురించి క్రోడీకరించింది. 15వ శతాబ్దం ప్రారంభం నుండి ఆస్ట్రియా హాబ్సబర్గ్ వంశం నుండే ప్రత్యేకంగా దాదాపు అందరు చక్రవర్తులూ ఎన్నుకోబడ్డారు.

1517లో మార్టిన్ లూథర్ అనే సన్యాసి తన 95 వ్యాసాలను ప్రచురించారు. ఇవి రోమన్ కాధలిక్ చర్చి ఆచారాలను వ్యతిరేకించి, ప్రోటెస్టన్ట్ సంస్కరణలను ప్రారంభించాయి. 1530 తరువాత అనేక జర్మన్ రాష్ట్రాలకు ప్రత్యేక లూథరన్ చర్చి అధికార మతం అయ్యింది. మతవిభేదాలు జర్మనీ భూములను ను నాశనం చేసి ముప్ఫై సంవత్సరాల యుద్ధానికి (1618–1648) దారితీసాయి. యుద్ధంలో జర్మన్ రాష్ట్రాల జనాభా దాదాపు 30% వరకు తగ్గిపోయింది. వెస్ట్ఫాలియా శాంతి (1648) (ఒప్పందం) జర్మనీ రాష్ట్రాల మధ్య మత యుద్ధతంత్రాన్ని ముగించింది. కానీ సామ్రాజ్యం వాస్తవంగా అనేక స్వతంత్ర రాజ్య భాగాలుగా విడిపోయింది. 1740 నుండి ఆస్ట్రియన్ హాబ్స్బర్గ్ రాచరికం, ప్రష్యా రాజ్యాల మధ్య ద్వంద్వత్వం జర్మన్ చరిత్రను శాసించింది. 1806లో, సామ్రాజ్యం నేపోలియనిక్ యుద్ధాల ఫలితంగా అంతరించిపోయింది.

పునరుద్ధరణ , విప్లవం(1814–1871)

నెపోలియన్ బోనపర్టే ఓటమి తరువాత 1814లో వియన్నా సమావేశం 39 సార్వభౌమ రాజ్యాలతో కూడిన జర్మన్ సమాఖ్య (డచేర్ బండ్)ను స్థాపించింది. పునరుద్ధరణ రాజకీయాలలో అనంగీకారం చూపుతూ ఐక్యతా, స్వాతంత్ర్యాన్ని కోరుతూ, పాక్షికంగా స్వేచ్ఛా పోరాటాలకు దారితీసింది. అయితే ఇవి ఆస్ట్రియన్ రాజ్యాంగవేత్త మెటర్నిచ్ నూతన అణచివేత విధానాలతో అనుసరించబడ్డాయి. జోల్వేరేయిన్ పన్ను నిర్ణయసమాఖ్య జర్మన్ రాజ్యాల మధ్య ఆర్థిక ఐక్యతను మరింత పెంచింది. ఈకాలంలో జర్మన్లు ఫ్రెంచ్ విప్లవం ఆదర్శాలచే ప్రభావితమయ్యారు,.ప్రత్యేకించి యువ మేధావులలో జాతీయవాదం శక్తివంతంగా అవతరించింది. మొదటిసారి నలుపు, ఎరుపు, బంగారు రంగులు ఉద్యమానికి ప్రాతినిధ్య రంగులుగా ఎన్నుకోబడ్డాయి, తరువాత ఇవే జాతీయ రంగులు అయ్యాయి.

ఫ్రాన్స్లో విజయవంతంగా గణతంత్రాన్ని స్థాపించిన తరువాత ఐరోపాలో విప్లవ పోరాటాల శ్రేణి స్ఫూర్తితో మేధావులు, సామాన్య ప్రజలు 1848లో జర్మన్ రాష్ట్రాల విప్లవాలను ప్రారంభించారు. ప్రారంభంలో రాజులు విప్లవకారుల స్వేచ్ఛాయుత కోరికలకు తలొగ్గారు. ప్రష్యా ఫ్రెడరిక్ విలియం 4వ రాజుకు అధికారం లేని చక్రవర్తి బిరుదును ఇవ్వచూపారు. అయితే అతను సింహాసనాన్ని, ప్రతిపాదిత రాజ్యాంగాన్ని తిరస్కరించడం విప్లవాననికి తాత్కాలిక అవరోధం కలగడానికి దారితీసింది. ప్రష్యా రాజు మొదటి విలియం మరింత స్వేచ్ఛాయుత పార్లమెంట్కు మధ్య విభేదం వలన 1862 సైనిక సంస్కరణలు ఉద్భవించాయి. రాజు ఓట్టోవాన్ బిస్మార్కును నూతనంగా ప్రష్యా ప్రధాన మంత్రిగా నియమించారు. 1864లో బిస్మార్క్ విజయవంతంగా డెన్మార్కుపై యుద్ధం ప్రకటించాడు. 1886 ఆస్ట్రో-ప్రష్యన్ యుద్ధంలో ప్రష్యా విజయం మిగిలిన జర్మన్ రాజ్యాల వ్యవహారాల నుండి ఇంతకు పూర్వం ముఖ్య రాజ్యంగా ఉన్న ఆస్ట్రియాను మినహాయించి ఉత్తర జర్మన్ సమాఖ్య (నోర్డ్ డచేర్ బండ్) ఏర్పాటు చేయడానికి అతనికి వీలు కల్పించింది.

జర్మనీ సామ్రాజ్యం (1871–1918)

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
1871లో ఫ్రాన్సు లోని వేర్సైల్స్ లో ఆధునిక జర్మనీకి పునాది వేయబడింది.మధ్యలో తెల్ల యూనిఫారంలో ఉన్నది బిస్మార్క్.

ప్రష్యా రాజ్యం అతి పెద్ద భాగంగా జర్మనీ సామ్రాజ్యం రూపొందినపుడు 1871లో జర్మనీగా పిలువబడే ఆధునిక జాతీయ-రాజ్యంగా ఏకీకృతమైంది.ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధంలో ఫ్రాన్స్ ఓడిన తరువాత 1871 జనవరి 18న వెర్సైల్సులో జర్మనీ సామ్రాజ్యం అధికారికంగా ప్రకటించబడింది. బెర్లిన్ రాజధానిగా ప్రష్యాకు చెందిన హోహెన్జోల్లెర్ను వంశం నూతన సామ్రాజ్యాన్ని పరిపాలించింది. ఆస్ట్రియా తప్ప జర్మనీ మిగిలిన చెల్లా చెదురైన భాగాలన్నిటినీ విలీనం చేసుకుని ఈ సామ్రాజ్యం ఏర్పడింది (క్లెండ్యూట్స్ఛ్‌లాండ్, లేదా "చిన్న జర్మనీ"). 1884 లో ప్రారంభించి జర్మనీ ఐరోపా వెలుపల అనేక వలసలను స్థాపించడం ప్రారంభించింది.

జర్మనీ ఏకీకరణ తరువాతి కాలంలో చక్రవర్తి మొదటి విలియం విధానం జర్మనీ స్థానాన్ని మిత్రదేశాల సహాయంతో ఒక గొప్ప జాతిగా పదిలపరచింది. రాజకీయమార్గాల ద్వారా యుద్ధాన్ని నివారించి ఫ్రాన్స్ను ఒంటరిని చేసింది. అయితే రెండవ విలియం పాలనలో జర్మనీ ఇతర ఐరోపా దేశాలవలె ఒక సామ్రాజ్యవాద విధానాన్ని అనుసరించడం పొరుగుదేశాలతో సంఘర్షణకు దారితీసింది. ఇంతకు పూర్వం ఉన్న కలయికలను జర్మనీ తిరిగి పునరిద్ధరించలేదు. కొత్త కలయికలు ఈ దేశాన్ని వదలివేసాయి. ప్రత్యేకించి ఫ్రాన్స్ ఎంటే, ఆస్ట్రియా-హంగరీతో ఒప్పందాలు మినహాయించి జర్మనీ మరింత ఒంటరిదయ్యింది.

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
సామ్రాజ్యవాద జర్మనీ (1871–1918), నీలం న్టే కర్డియాలే పై సంతకం చేయడం ద్వారా యునైటెడ్ కింగ్డంతో నూతన సంబంధాలను నెలకొల్పుకుంది, రష్యన్ సామ్రాజ్యంతో సంబంధాలను పదిలపరచుకుంది. రంగులో ఉన్నది శక్తివంతమైన ప్రష్యా రాజ్య

జర్మనీ సామ్రాజ్యవాదం దేశం వెలుపలికి వ్యాపించి ఆఫ్రికాలో వారి వాటాని కోరుతూ అనేక ఇతర ఐరోపా శక్తులతో కలిసింది. బెర్లిన్ సమావేశం తరువాత ఆఫ్రికా ఐరోపా దేశాల మధ్య విభజించబడింది. తూర్పు ఆఫ్రికా, నైరుతి ఆఫ్రికా, టోగో, కామెరూన్ వంటి అనేక భూభాగాలను జర్మనీ స్వంతం చేసుకుంది. ఆఫ్రికా కొరకు ప్రాకులాట గొప్ప సంరాజ్య శక్తుల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది అదే మొదటి ప్రపంచ యుద్ధానికి దోహదం చేసే పరిస్థితులను కల్పించి ఉండవచ్చు.

1914 జూన్ 28న ఆస్ట్రియా రాజకుమారుని హత్య మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రేరకమైంది. ఓటమిని ఎదుర్కున్న కేంద్ర శక్తులలో భాగమైన జర్మనీ, కూటమి శక్తుల చేతిలో అపజయం పాలవడం అన్ని కాలాలలో జరిగిన ఒక హేయమైన పోరాటంగా భావించబడింది. మొదటి ప్రపంచయుద్ధంలో రెండు మిలియన్ల మంది జర్మనీ సైనికులు మరణించి ఉంటారని అంచనా. నవంబరు 1918లో జర్మనీ విప్లవం మొదలై చక్రవర్తి రెండవ విలియం ఇతర జర్మనీ పాలకరాజులు పదవీచ్యుతి పొందారు. నవంబరు 11న యుద్ధం అంతం చేయడానికి ఆయుధ నిషేధంపై సంతకం చేయబడింది. జర్మనీ 1919లో వేర్సైల్లెస్ ఒప్పందం పై బలవంతంగా సంతకం చేసింది. సాంప్రదాయక యుద్ధానంతర రాయబారానికి వ్యతిరేకంగా మధ్యవర్తిత్వం, ఓడిపోయిన కేంద్ర శక్తులను వదలివేసింది. జర్మనీలో ఈ ఒప్పందం మరొక విధంగా యుద్ధం తరువాత అవమానకర కొనసాగింపుగా భావించబడింది. తరువాతి కాలంలో దాని క్రూరత్వం దేశంలో నాజీయిజం ఎదగడానికి దోహదం చేసినదిగా భావించబడుతుంది.

వీమర్ గణతంత్రం (1919–1933)

జర్మనీ విప్లవం ప్రారంభంలో జర్మనీలో రాచరికం అంతమై ఒక గణతంత్రంగా ప్రకటించబడింది. అయితే అధికారం కొరకు పోరాటం కొనసాగింది. తీవ్రవాద-వామపక్షాలు బవేరియాలో అధికారాన్ని లోబరచుకున్నాయి. కానీ జర్మనీ మొత్తాన్ని నియంత్రణలోకి తెచ్చుకోలేకపోయాయి. ఆగష్టు 1919లో వీమర్ గణతంత్రం ఆచారం ప్రకారం స్థాపించబడిన తరువాత విప్లవం ముగిసింది. 1919 ఆగష్టు 11న అధ్యక్షుడు ఫ్రెడరిక్ ఎబర్ట్ సంతకం చేసిన తరువాత వీమర్ రాజ్యాంగం అమలులోకి వచ్చింది.

గొప్ప మాంద్యత వలన ఇబ్బంది వేర్సైల్లెస్ ఒప్పందం చే విధించబడిన క్రూరమైన శాంతి నియమాలు, అస్థిర ప్రభుత్వాలు ఎక్కువకాలం కొనసాగడం వలన జర్మనీ ప్రజలు ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థ పార్లమెంటరీ "పార్టీల స్థాపన"లో గుర్తింపును కోల్పోయారు. ఇది బాగా విస్తరించియున్న సాంప్రదాయ-వాదు (రాచరిక, వోల్కిస్చ్,, నాజి) లచే మరింత ముమ్మరం చేయబడింది. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కొందరి ప్రయత్నాలకు మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమి ఒక కారణంగా ఉంది. వీమర్ ప్రభుత్వంలోని ఉన్నత సైనికాధికారులు వేర్సైల్లెస్ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా జర్మనీ జాతిని మోసగించిందని ఆరోపించారు. స్పర్టసిస్ట్ లీగ్ వంటి తీవ్రవాద వామ-పక్ష కమ్యూనిస్టులు "పెట్టుబడిదారు పాలన"ను అంతమొందించి మేలు చేకూర్చే ఒక విప్లవం కోరుకున్నారు.

ఏదేమైనా నూతన వీమర్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి జర్మనీ కమ్యూనిస్ట్ పార్టీ ఎదుగుదలకు ఇంధనంగా పనిచేసింది. అనేకమంది సాంప్రదాయ వాదులు విప్లవవాద హక్కు (ప్రత్యేకించి నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ—నాజి పార్టీ) వైపు ఆకర్షించ బడ్డారు. 1932 నాటికి ఈ రెండు పార్టీలు పార్లమెంటులో అధిక భాగాన్ని నియంత్రించగలిగాయి (జూలై 1932 నాటికి మొత్తం పార్లమెంటరీ స్థానాలు 296). అపజయం పొందిన అనేక వరుస మంత్రివర్గాల తరువాత అధ్యక్షుడు పాల్ వాన్ హిండెన్బర్గ్ ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు: 1933 జనవరి 30న ప్రత్యామ్నాయంగా సాంప్రదాయవాద-సలహాదారుల ప్రోత్సాహంతో వాన్ హిండెన్బర్గ్ హిట్లర్ విన్నపాన్ని మన్నించి అడాల్ఫ్ హిట్లర్ను జర్మనీ చాన్సలరుగా నియమించారు.

మూడవ రీచ్ (1933–1945)

1933 ఫిబ్రవరి 27న రీచ్‌స్టాగ్ తగలబడింది. దాని తరువాత ఒక అత్యవసర శాసనం తయారు చేయబడింది. కొన్ని ప్రాథమిక హక్కులు వెంటనే రద్దుచేయబడ్డాయి. ఎనేబ్లింగ్ చట్టం హిట్లర్-నాయకత్వంలోని ప్రభుత్వానికి పూర్తి శాసన అధికారాన్ని ఇచ్చింది. కేవలం సోషల్ డెమోక్రాటిక్ పార్టీ అఫ్ జర్మనీ మాత్రమే ఈ పరిణామానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. అయితే ఈ అగ్నికి కారణమైన వారుగా భావింపబడ్డ కమ్యూనిస్ట్ పార్టీ రీచ్ స్టాగ్ ఫైర్ డిక్రీకి వారి వ్యతిరేకతను చూపలేకపోయారు. అనేక ఎత్తులు శాసనాల ద్వారా ఒక కేంద్రీకృత సంపూర్ణరాజ్యం స్థాపించబడి జర్మనీని ఏక-పార్టీ రాజ్యంగా మార్చింది. సైనిక పునరాయుధీకరణపై దృష్టి కేంద్రీకరించి పరిశ్రమలు తిరిగి ప్రాణం పోసుకున్నాయి. 1936లో గ్రేటర్ జర్మనీని స్థాపించే అనేక విస్తరణలో మొదటి భాగంగా రైన్ ల్యాండ్‌పై నియంత్రణను తిరిగి సాధించింది.

1939లో జాతీయవాదం, సైనికవాదం, భూభాగ వివాదాల వలన పెరుగుతున్న వత్తిడులు సోవియట్ యూనియన్ నుండి సహాయం లభిస్తుందన్న ఒక ఒప్పందం జర్మన్లను పోలాండ్ పై బ్లిట్జ్ క్రీగ్ (మెరుపు దాడి) ప్రారంభించడానికి నడిపించాయి.పశ్చిమం నుండి జర్మనీ, తూర్పు నుండి సోవియెట్ యూనియన్ రెండూ ఆ దేశం మీద దాడిచేసి దానిని విభజించుకున్నాయి. ఈ సంఘటన తరువాత బ్రిటన్, ఫ్రాన్సు జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధ ప్రకటనలను ఇచ్చాయి ( కానీ సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా కాదు). ఇది ఐరోపాలో రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభ సూచనగా ఉంది. యుద్ధం సాగుతున్న కొద్దీ జర్మనీ దాని మిత్రదేశాలు ఐరోపాలో అత్యధిక భాగంపై ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ఆధిపత్యం సంపాదించాయి.

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత శిథిలాలలో బెర్లిన్, పోత్స్దమేర్ ప్లత్జ్ 1945.

1941 జూన్ 22న జర్మనీ సోవియట్‌తో గల ఒప్పందాన్ని తెగతెంపులు చేసుకొని సోవియట్ యూనియన్ పై దాడిచేసింది. అదే సంవత్సరం జపాన్, పెర్ల్ హార్బరులో గల అమెరికన్ స్థావరంపై దాడి చేసింది. జర్మనీకి జపాన్‌తో గల మిత్రత్వం మూలంగా అది యునైటెడ్ స్టేట్స్ పై యుద్ధాన్ని ప్రకటించింది. జర్మనీ సైన్యం సోవియట్ యూనియన్ లోకి వేగంగా చొచ్చుకు పోయినప్పటికీ స్టాలిన్ గ్రాడ్ పోరాటం ఈ యుద్ధంలో ఒక గొప్ప మలుపుగా ఉండిపోయింది. అటు పిమ్మట జర్మనీ సైన్యం తూర్పు భాగంలో తిరుగుముఖం పట్టింది. డి-డే యుద్ధం మరొక ముఖ్యమైన మలుపుగా నిలిచింది. ఫలితంగా పశ్చిమ భాగం తెరుచుకుంది; మిత్ర సైన్యాలు నార్మండీ తీరంలో నిలిచి జర్మనీ భూభాగం వైపు కదిలాయి. వెంటనే జర్మనీ ఓటమి పాలైంది. 1945 మే 8న ఎర్రసైన్యం బెర్లిన్ను ముట్టడించగానే జర్మనీ సైనిక దళాలు లొంగిపోయాయి. తూర్పు ఐరోపాకి చెందిన స్థానిక జర్మనులతో కలిపి-సుమారు ఏడు మిలియన్ల మంది జర్మన్ సైనికులు-రెండవ ప్రపంచయుద్ధంలో మరణించారు.

తరువాతి కాలంలో ది హొలోకాస్ట్ గా పిలువబడిన మూడవ రీచ్ పాలన అమలుపరచిన ప్రభుత్వ విధానాలవలన అనేక మంది అసమ్మతి వాదులు, అల్ప సంఖ్యాకవర్గాల వారు ప్రత్యక్షంగా లొంగిపోయారు. ఆరు మిలియన్లమంది యూదులు, చెప్పుకోదగిన సంఖ్యలో జిప్సీలు, పోలండీయులు, ఇతర స్లావులు, మానసిక రోగులు,స్వలింగ సంపర్కులు, రాజకీయ ప్రతిపక్ష సభ్యులతో కలిపి సుమారు పదకొండు మిలియన్లమంది ప్రజలు ఈ హొలోకాస్టులో హత్య చేయబడ్డారు. రెండవ ప్రపంచ యుద్ధం జర్మనీ నాజీ పాలన చర్యలు, సోవియట్ యూనియన్, ఇతర దేశాలలో జోసెఫ్ స్టాలిన్ పాలనల ఫలితంగా ఐరోపాలో 35 మిలియన్ల మంది ముందస్తు మరణాలకు లోనయ్యారు.

విభజన , పునరేకీకరణ (1945–1990)

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
1949 తరువాత రెండు జర్మన్ రాజ్యాలైన, సార్ రక్షణ ప్రాంతం, విభజించబడిన బెర్లిన్ మిత్రరాజ్యాల ఆక్రమిత ప్రదేశంలో మిత్రదేశాల నిర్వహణలో ఉద్భవించాయి.తూర్పు జర్మనీ సోవియట్ ప్రాంతంలో నెలకొల్పబడింది, పశ్చిమ జర్మనీ అమెరికన్, బ్రిటిష్, ఫ్రెంచ్ ప్రాంతాలలో 1949లో, సార్ 1957 లో నెలకొల్పబడ్డాయి.

ఈ యుద్ధఫలితంగా దాదాపు పది మిలియన్ల మంది జర్మనీ సైనికులు, పౌరులు మరణించారు. జర్మనీ అధిక మొత్తంలో భూభాగాన్ని నష్టపోయింది. సుమారు 15 మిలియన్ల మంది జర్మన్లు జర్మనీ తూర్పు ప్రాంతాల నుండి, ఇతర దేశాల నుండి బహిష్కరింపబడ్డారు. అనేక పెద్ద నగరాలు నాశనమయ్యాయి. మిగిలిన దేశీయ భూభాగం బెర్లిన్, మిత్రరాజ్యాల ద్వారా నాలుగు సైనిక ఆక్రమిత ప్రాంతాలుగా విభజించబడింది.

1949 మే 23న ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డం, యునైటెడ్ స్టేట్స్ ల నియంత్రణలో ఉన్న పశ్చిమ ప్రాంతాలు సమైక్యమై ఫెడరల్ రిపబ్లిక్ అఫ్ జర్మనీ (బుండెస్ రిపబ్లిక్ డచ్ల్యాండ్ )గా ఏర్పడింది. 1949 అక్టోబరు 7న సోవియట్ ప్రాంతం జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ (డచేడెమోక్రటిస్చే రిపబ్లిక్, లేదా డిడిఆర్)గా ఏర్పడింది. ఇవి ప్రధానంగా జర్మనీకి వెలుపల నుండి వ్యావహారికంగా "పశ్చిమ జర్మనీ", "తూర్పు జర్మనీ"లుగా పిలువబడతాయి(పశ్చిమ జర్మనీలో, తూర్పు జర్మనీ జి.డి.ఆర్ తూర్పు ప్రాంతంగా సూచించబడ్డాయి. జి.డి.ఆర్. GDRను తరచూ మధ్య జర్మనీగా సూచిస్తారు). బెర్లిన్ రెండు భాగాలను "పశ్చిమ బెర్లిన్", "తూర్పు బెర్లిన్" అని వ్యవహరిస్తారు. తూర్పు జర్మనీ తన రాజధానిగా తూర్పు బెర్లిన్‌ను ఎంపిక చేసుకోగా, పశ్చిమ జర్మనీ బాన్‌ను ఎంపిక చేసుకుంది. అయితే రెండు-రాజ్యాల పరిష్కారం ఏదో ఒక నాటికి అధిగమించవలసిన కేవలం ఒక కృత్రిమమైన యధాతధ స్థితి అనే తన వైఖరికి సమర్ధనగా పశ్చిమ జర్మనీ బాన్‌ను తాత్కాలికంగా తన రాజధానిగా ప్రకటించింది.

పశ్చిమ జర్మనీ " సామ్యవాద ఆర్థిక వ్యవస్థ "తో యునైటెడ్ స్టేట్స్, యు కె, ఫ్రాన్సు లను మిత్రదేశాలుగా కలిగిన సమాఖ్య పార్లమెంటరీ గణతంత్రాన్ని ఏర్పరచుకుంది. 1950ల ప్రారంభం నుండి ఈ దేశం సుదీర్ఘ ఆర్థికప్రగతిని పొందగలిగింది. పశ్చిమ జర్మనీ 1955లో నేటోలో చేరింది. 1957 లోని యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది.

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
1989లో ప్రారంభించబడిన వెంటనే బెర్లిన్ గోడ ముందరి బ్రడెన్బర్గ్ గేట్.

యు ఎస్ ఎస్ ఆర్ ఆక్రమిత సైన్యం, వార్సా ఒప్పందం ద్వారా యు ఎస్ ఎస్ ఆర్ రాజకీయ, సైనిక నియంత్రణలో ఉన్న తూర్పు జర్మనీ ఒక తూర్పు విభాగ రాజ్యంగా ప్రజాస్వామ్యంగా ప్రకటించుకున్నా, రాజకీయ అధికారం కేవలం కమ్యూనిస్ట్-నియంత్రిత ఎస్ ఇ డి (సోషలిస్ట్ యూనిటీ పార్టీ అఫ్ జర్మనీ ) నాయకుల (పోలిట్ బ్యూరో) చే నిర్వహించబడేది. వారి అధికారంలో అపార పరిమాణంతో రహస్య సంస్థ స్టాసిచే స్థిరపరచబడింది. అనేక ఎస్ ఇ డి ఉపసంస్థలు సమాజంలోని ప్రతి విషయాన్ని నియంత్రించేవి. దీనికి బదులుగా ప్రభుత్వం తక్కువ వ్యయంతో ప్రజల కనీస అవసరాలు అందించి ప్రజలను తృప్తిపరచారు. ఒక సోవియట్-తరహా స్వాధీన ఆర్ధికవ్యవస్థ ఏర్పాటు చేయబడింది. తరువాత జిడిఆర్ ఒక కమ్కాన్ రాజ్యంగా ఏర్పడింది. తూర్పు జర్మనీ జి డి ఆర్ సాంఘిక కార్యక్రమాల ప్రయోజనాలు ఏ సమయంలోనైనా పశ్చిమ జర్మనీ నుండి రాగల దాడి పై ఆధారపడి ఉండేవి. అనేక మంది పౌరులు రాజకీయ స్వేచ్చ, ఆర్ధిక శ్రేయస్సు కొరకు పశ్చిమం వైపు చూసేవారు. తూర్పు జర్మన్లను పశ్చిమ జర్మనీకి తప్పించుకోకుండా ఆపడానికి 1961లో నిర్మించిన బెర్లిన్ గోడ ప్రచ్చన్న యుద్ధ చిహ్నంగా మారింది.

1970ల ప్రారంభంలో తూర్పు, పశ్చిమ జర్మనీల మధ్య ఉద్రిక్తతలు చాన్సలర్ విల్లీ బ్రండ్టుచే తగ్గించబడ్డాయి. దీని ద్వారా రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ భూభాగ నష్టాలను వాస్తవంగా అంగీకరించడం కూడా జరిగింది.

1989 వేసవికాలంలో హంగరీ (మే 2) ఇనుప తెరను, సరిహద్దులను (ఆగష్టు 23) తీసివేయాలని నిశ్చయించుకుంది. ఇది వేలమంది తూర్పు జర్మన్లు (సెప్టెంబర్ 11)హంగరీ గుండా పశ్చిమ జర్మనీకి సమూహాలుగా వలసపోవడానికి కారణమైంది. సమూహ ప్రదర్శనలు, హంగేరియన్ సంఘటనలు జి డి ఆర్ పై వినాశకరమైన ప్రభావాన్ని చూపాయి. నవంబర్లో తూర్పు జర్మన్ అధికారులు ఊహించని విధంగా సరిహద్దు నియంత్రణలను సడలించి, తూర్పు జర్మనీ పౌరుల పశ్చిమ ప్రయాణానికి అనుమతించారు. నిజానికి ఇది తూర్పు జర్మనీని ఒక రాజ్యంగా ఉంచేలా వత్తిడికి గురిచేయడానికి ఉద్దేశించినది అయినప్పటికీ ఈ సరిహద్దుని తెరవడం తూర్పు జర్మనీలో వెండే సంస్కరణ ప్రక్రియ వేగవంతం అవడానికి దారితీసింది. దీని తుది ఫలితంగా ఒక సంవత్సరం తరువాత 12 సెప్టెంబర్ 1990 సెప్టెంబర్ 12 న టు ప్లస్ ఫోర్ ఒప్పందం తో సంస్కరణ ప్రక్రియ ముగిసింది. శక్తులు నాలుగు హక్కులను వదులుకోవడంతో జర్మనీ సంపూర్ణ సార్వభౌమాధికారం పొందింది. ఇది పూర్వ జి.డి.ఆర్. లోని ఐదు పున-స్థాపిత రాజ్యాలను చేర్చుకొని (నూతన రాష్ట్రాలు లేదా "నెయు లాండర్") 1990న అక్టోబర్ 3 న జర్మనీ పునరేకీకరణకు అనుమతించింది.

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
1999లో జర్మనీ ఏకీకృత యూరోపియన్ ద్రవ్యాన్ని అనుమతించింది, జర్మన్ యూరో నోట్లను కలిగి ఉన్న యూరోలు X అక్షరంతో మొదలవుతాయి.

బెర్లిన్ గణతంత్రం , యూరోపియన్ సమాఖ్య ఐక్యత (1990–)

1994 మార్చి 10 న బాన్-బెర్లిన్ చట్టం పార్లమెంటుచే ఆమోదించబడింది. పునరేకీకృత జర్మనీకి బెర్లిన్ మరొకసారి రాజధాని అయ్యింది. బాన్ బుండెస్తద్ట్ (సమాఖ్య నగరం)గా ప్రత్యేక హోదాను పొంది కొన్ని సమాఖ్య మంత్రిత్వశాఖలను నిలుపుకుంది. 1999 నాటికి ప్రభుత్వ స్థానాలను మార్చడం పూర్తయింది.

పునరేకీకరణ తరువాత యూరోపియన్ సమాఖ్యలోను, నేటో లోను జర్మనీ మరింత ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాల్కన్స్‌లో స్థిరత్వం సాధించేందుకు జర్మనీ ఒక శాంతి పరిరక్షక దళాన్ని పంపింది. నేటో ప్రయత్నాలలో భాగంగా తాలిబను లను ఏరివేసిన తరువాత ఆ దేశ భద్రత కొరకు ఆఫ్గనిస్తానుకు జర్మన్ దళాలను పంపింది. అయితే దేశీయ చట్టాల ప్రకారం జర్మనీ దళాలను కేవలం రక్షణ కొరకు పంపవలసి ఉండగా యుద్ధం తరువాత ఈ విధమైన నిలుపుదల వివాదాస్పదమైంది. విదేశీ భూభాగాల్లో సైన్యాన్ని నిలిపి ఉంచడం రక్షణ నిబంధనల లోనికి రాదు. అయితే ఈ విషయంలో శాంతి పరిరక్షణ సందర్భంలో పాల్గొన్నదిగా భావించి పార్లమెంటు సమర్ధవంతంగా చట్టబద్ధం చేసింది.

భూగోళ శాస్త్రము

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
టోపోగ్రాఫిక్ పటం

జర్మనీ భూభాగం 357,021 km2 (137,847 sq mi), దీనిలో 349,223 km2 (134,836 sq mi) భూభాగం 7,798 km2 (3,011 sq mi) నీరు. వైశాల్యం ప్రకారం ఐరోపాలో ఇది ఏడవ స్థానంలో ఉంది. ప్రపంచంలో 63వ పెద్దదేశం. దక్షిణాన ఆల్ప్స్ (ఎత్తైన ప్రదేశం:జుగ్స్ పిట్జే ) పర్వతాల నుండి వాయవ్యంలోని ఉత్తర సముద్ర తీరం వరకు (నోర్డ్ సీ) , ఈశాన్యంలో బాల్టిక్ సముద్రం(ఒస్ట్ సీ) వరకు ఉన్నత ప్రాంతం వ్యాపించిఉంది. వీటిమధ్య అడవులతో నిండిన మెట్టభూములైన మధ్య జర్మనీ , పల్లపు ప్రాంతాలైన ఉత్తర జర్మనీ (అత్యంత నిమ్నప్రాంతం: విల్స్‌టర్ మర్స్‌చ్ సముద్ర మట్టానికంటే తక్కువ లోతు), ఐరోపా యొక్క పెద్ద నదులైన రైన్, డాన్యూబ్ , ఎల్బే లచే ఖండించబడుచున్నాయి.

జర్మనీ ఖండంలోని మరే ఇతరదేశం కంటే అధికంగా అనేక యూరోపియన్ దేశాలతో సరిహద్దులు పంచుకుంటోంది. ఉత్తరసరిహద్దులో డెన్మార్క్, తూర్పుసరిహద్దులో పోలాండ్, చెక్ రిపబ్లిక్, దక్షిణాన ఆస్ట్రియా, స్విడ్జర్ లాండ్, నైరుతిలో ఫ్రాన్స్, లక్సెంబర్గ్, వాయవ్యంలో బెల్జియం, నెదర్లాండ్స్ దీనికి పొరుగుదేశాలుగా ఉన్నాయి.

రాష్ట్ర విభజన

జర్మనీ 16 రాష్ట్రాలను కలిగిఉంది (బండేస్లాన్డర్ ), అవి తిరిగి 439 జిల్లాలుగా (క్రీసే ), నగరాలుగా (క్రెయిస్ఫ్రే స్తాద్తే ) ఉపవిభజన చేయబడ్డాయి.

రాష్ట్రం రాజధాని వైశాల్యం (కిమీ²) జనాభా
బాడెన్-వుర్టెంబర్గ్ స్టుట్‌గార్ట్ 35,752 10,717,000
బవేరియా మ్యూనిచ్ 70,549 12,444,000
బెర్లిన్ బెర్లిన్ 892 3,400,000
బ్రన్దేన్బుర్గ్ పోట్స్‌డామ్ 29,477 2,568,000
బ్రెమెన్ బ్రెమెన్ 404 663,000
హామ్బర్గ్ హామ్బర్గ్ 755 1,735,000
హెస్సే వియస్బడెన్ 21,115 6,098,000
మెక్లెన్బర్గ్-వొర్పోంమెర్న్ షెవెరిన్ 23,174 1,720,000
లోవెర్ సాక్సోనీ హనోవెర్ 47,618 8,001,000
ఉత్తర రైన్-వెస్ట్ఫలియా దుస్సేల్దోర్ఫ్ 34,043 18,075,000
రైన్ల్యాండ్ -పలాటినేట్ మైంజ్ 19,847 4,061,000
సార్ల్యాండ్ సార్బృకెన్ 2,569 1,056,000
సాక్సోనీ డ్రెస్డెన్ 18,416 4,296,000
సాక్సోనీ-అన్హల్ట్ మగ్డేబర్గ్ 20,445 2,494,000
ష్లెస్విగ్-హోల్స్టీన్ కీల్ 15,763 2,829,000
తురిన్గియా ఏర్ఫుర్ట్ 16,172 2,355,000

వాతావరణం

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
బవేరియా లోని ఉన్నత ప్రాంత దృశ్యం.

జర్మనీలో ఎక్కువభాగం సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. అందువలన పడమటి తేమగాలులు ప్రబలంగా ఉంటాయి. ఉత్తర అట్లాంటిక్ గతి వల్ల వాతావరణం సమశీతోష్ణంగా చేయబడుతుంది. ఇది గల్ఫ్ ప్రవాహం ఉత్తరభాగ విస్తరణతో ఈ వేడినీరు ఉత్తర సముద్రం సరిహద్దుగాగల ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది. వీటిలో ఉత్తర సముద్రంలో ప్రవహించే రైన్ వెంబడి ప్రాంతాలు కూడా ఉన్నాయి. దానిఫలితంగా ఉత్తర-పడమర, ఉత్తర ప్రాంతాలలో మహాసముద్ర సంబంధ వాతావరణం ఉంటుంది; వర్షపాతం సంవత్సరం పొడవునా ఉండి ఎండాకాలంలో అధికంగా ఉంటుంది.

ఉష్ణోగ్రతలు చాలా కాలం పాటు 70 డిగ్రీల ఫారెన్ హీట్ కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ చలికాలం సాధారణంగా చల్లగా ఉంటాయి. తూర్పులో వాతావరణం ఎక్కువ ఖండాంతర్గతంగా ఉంటుంది. చలికాలాలు చాలా చల్లగా, ఎండాకాలాలు ఎక్కువ వేడిగా అధికంగా పొడివాతావరణాలు తరచుగా నమోదుకాబడతాయి. జర్మనీ మధ్య, దక్షిణ భాగాలు మధ్యతరహా సముద్రతీర ఉష్ణోగ్రత నుంచి ఖండాన్తర్గత ఉష్ణోగ్రతకు మారతాయి. ఇక్కడకూడా ఎండాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రత ఉంటుంది.

జీవవైవిధ్యం

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
అడవులలో విస్తారంగా వ్యాపించి ఉన్న జాతులలో జింక ఒకటి.

భూగోళికంగా బెల్జియం ఉత్తరప్రాంతం చుట్టూ అట్లాంటిక్ మహాసముద్రం యూరోపియన్, మధ్య యూరోపియన్ దేశభాగాలు ఉత్తర ఉన్నాయి.జర్మనీ దేశభాగాలను రెండు పర్యావరణం ప్రాంతాల ఉపభాగాలుగా చేయవచ్చును: ఐరోపా-మధ్యధరా పర్వత మిశ్రమ అడవులు, ఈశాన్య-అట్లాంటిక్ సముద్ర సంబంధ భూభాగం. జర్మనీలో అధికభాగం సాగుచేయతగిన భూములు (33%) ఉన్నాయి. వృక్ష సంపద , అటవీప్రాంతాల (31%)తో నిండి ఉంది. కేవలం 15% శాశ్వతమైన పచ్చిక బయళ్ళతో నిండి ఉంది.

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
దేశం యొక్క మొత్తం ప్రదేశంలో మూడవ వంతు అడవులచే కప్పబడి ఉంది.(తురింగియన్ అడవి)

మధ్య ఐరోపాలో ఉండే మొక్కలు, జంతువులు సాధారణంగా కనిపిస్తాయి. బీచ్, ఓక్ ఇతర ఆకులురాలే చెట్ల అడవులు మూడువంతులలో ఒకభాగాన్ని ఆక్రమిస్తాయి. మొక్కలు నాటే కార్యక్రమం ఫలితంగా అలంకార చెట్లు పెరుగుతున్నాయి. స్ప్రూస్, ఫిర్ చెట్లు కొండల మీద ఎక్కువగా ఉంటాయి.ఇసుక నేలలో పైన్, లార్చ్ కనిపిస్తాయి.ఇక్కడ మొక్కలు, పువ్వులు, శిలీంద్రములు, పాచి మొక్కల అనేక జాతులు ఉన్నాయి. నదులలో , నార్త్ సముద్రంలో చేపలు పుష్కలంగా లభిస్తాయి. వన్య మృగాలలో జింక, అడవి మగపంది, అడవి గొర్రె, నక్క, కుక్క, కుందేలు, స్వల్ప మొత్తంలో బొచ్చుగల ఉభయచర జంతువులు ఉన్నాయి. వసంత ఋతువు శరదృతువులలో అనేక వలస పక్షులు లలో జర్మనీని దాటి వెళతాయి.

జర్మనీలోని జాతీయ ఉద్యానవనాలలో వాడ్డెన్ సీ జాతీయ ఉద్యానవనాలు, జస్ముండ్ జాతీయ ఉద్యానవనం, వోర్పోంమెర్న్ లగూన్ ఏరియా జాతీయ ఉద్యానవనం, మురిట్జ్ జాతీయ ఉద్యానవనం, లోవెర్ ఒడెర్ వాలీ జాతీయ ఉద్యానవనం, హర్జ్ జాతీయ ఉద్యానవనం, సాక్సన్ స్విట్జర్లాండ్ జాతీయ ఉద్యానవనం, బవారియన్ ఫారెస్ట్ జాతీయ ఉద్యానవనం ఉన్నాయి.

అనేక జంతుశాస్త్ర సంబంధ తోటలు, వన్యప్రాణుల ఉద్యానవనాలు, మత్స్య కేంద్రాలు, పక్షుల వనాలకు జర్మనీ పేరుగాంచింది.400 పైగా నమోదుకాబడిన జంతుప్రదర్శనశాలలు, జంతువనాలు జర్మనీలో పనిచేస్తున్నాయి. ప్రపంచంలో ఇవి ఇంత ఎక్కువసంఖ్యలో ఉన్న దేశం ఇది ఒక్కటేనని విశ్వసించబడుతోంది. జూలోజిస్చెర్ గార్టెన్ బెర్లిన్ అనేది జర్మనీలోని అతిపురాతనమైన జంతుప్రదర్శనశాల, ప్రపంచంలోని అత్యంత విస్తారమైన జాతుల సేకరణను అందిస్తోంది.

పర్యావరణం

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
ప్రపంచపు అతిపెద్ద వాయు క్షేత్రం , సౌర విద్యుత్ కేంద్రం జర్మనీలో స్థాపించబడింది.

పర్యావరణ జాగారూకతకు జర్మనీ పేరుగాంచింది. మానవ జీవనశైలి కారణంగా ఉత్పత్తి అయ్యే కలుషితాలే భూ తాపంకు ముఖ్యకారణంగా చాలామంది జర్మన్లు భావిస్తారు.ఈ దేశం క్యోటో నియమావళికు, జీవవైవిధ్యాలలో తక్కువ ఉద్గారం ప్రమాణాలు, వ్యర్ధాలను తిరిగి వాడటం ద్వారాలభ్యమయ్యే శక్తిని వాడటం వంటివాటిని ప్రోత్సహించే ఇతర ఒప్పందాలకు కట్టుబడి ఉంది. ఇది ప్రపంచస్థాయిలో కొనసాగే అభివృద్దికి సహకారం అందిస్తోంది.

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
రాబందు వేట నుండి రక్షించబడిన పక్షి , జాతీయ వంశపారంపర్య జంతువు.

జర్మనీ ప్రభుత్వం విస్తృతశ్రేణి ఉద్గార నియంత్రణా కార్యక్రమాలను చేపట్టినందువలన దేశం మొత్తం ఉద్గారాలు తగ్గుతున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్ కంటే బాగా తక్కువగా ఉన్నప్పటికీ, జర్మనీ యొక్క తలసరి కార్బన్ డైయాక్సైడ్ ఉద్గారాలు యూరోపియన్ సమాఖ్యలో అత్యధికంగా ఉన్నాయి.

బొగ్గు-దహించే అవసరాలు, పరిశ్రమల ఉద్గారాల వాయుకాలుష్యానికి దోహదం చేస్తున్నాయి. సల్ఫర్ డై ఆక్సైడ్ ఉద్గారాల వలన సంభవించే ఆమ్లవర్షం, అడవులకు నష్టం కలిగిస్తోంది. పూర్వపు తూర్పు జర్మనీ నదులలో కలిసే మురుగు నీటినుండి, పారిశ్రామిక వ్యర్ధాల నుండి సంభవించే బాల్టిక్ సముద్ర కాలుష్యం తగ్గింది. ఛాన్సలర్ స్క్రోడర్ నేతృత్వంలోని ప్రభుత్వం అణుశక్తిని విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి వినియోగించడాన్ని ఆపివేయాలనే ఉద్దేశ్యాన్ని ప్రకటించింది. మొక్కలు,జీవజాలము, ఆవాసాలకు సంబంధించిన విషయాలలో ప్రకృతి పరిరక్షణను గుర్తించి యూరోపియన్ సమాఖ్య ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తోంది. ఎత్తైన ప్రాంతాలలో ఉన్న జర్మనీ హిమానీనదాలు ఘనీభవనాన్ని ఎదుర్కుంటున్నాయి. వసంతకాలంలో నదులకు సంభవించే వరదలు, సుడిగాలులు వంటి ప్రకృతి వైపరీత్యాలు అన్ని ప్రాంతాలలో సంభవిస్తున్నాయి.

ప్రభుత్వం

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
జర్మన్ పార్లమెంట్ ఉన్న స్థలం బెర్లిన్ లోని రీచ్ స్టాగ్.

జర్మనీ ఒక సమాఖ్య, పార్లమెంటరీ, ప్రాతినిధ్య ప్రజాస్వామ్య గణతంత్రం. జర్మన్ రాజకీయ వ్యవస్థ 1949 లోని రాజ్యాంగ పత్రం గ్రుండ్గేసేట్జ్ (మూల చట్టం)లో పొందుపరచిన చట్టానికి లోబడి పనిచేస్తుంది. ఈ పత్రాన్ని వేర్ఫస్సుంగ్ (రాజ్యాంగం)గా కాక గ్రుండ్గేసేట్జ్ పత్రంగా పిలవడంలో, జర్మనీ పునరేకీకరణ తరువాత దాని స్థానంలో సరైన రాజ్యాంగం ఏర్పడుతుందనే అభిమతాన్ని రాజ్యాంగ సవరణ రచయితలు వ్యక్తం చేసారు. గ్రుండ్గేసేట్జ్ సవరణలకు సాధారణంగా పార్లమెంటు ఉభయసభలలోను మూడింట-రెండు వంతుల ఆధిక్యత అవసరం; మానవ గౌరవపూచీ, అధికార విభజన, సమాఖ్య నిర్మాణం, చట్టపాలన,రాజ్యాంగాన్ని అధికారహీనం చేసే ప్రయత్నాలను నిరోధించే హక్కులకు సంబంధించిన నిబంధనలు శాశ్వతంగా అమలులోఉంటాయి.ఇవి సవరించబడవు. ప్రారంభ ఉద్దేశ్యం వేరైనప్పటికీ 1990లో జర్మనీ పునరేకీకరణ తరువాత కూడా గ్రుండ్గేసేట్జ్ స్వల్ప సవరణలతోనే అమలులోఉంది.

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
అధ్యక్షుడు హోర్స్ట్ కొహ్లెర్.

ప్రస్తుత చాన్సెలర్ " అన్గేల మెర్కెల్ "ప్రభుత్వాధినేత కార్యనిర్వాహక అధికారాలు కలిగి ఉంటారు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యాలలో ప్రధాన మంత్రి పాత్రను పోలిఉంటుంది. సమాఖ్య శాసనాధికారం బుండేస్టాగ్ (ఫెడరల్ డైట్) బుండే స్రాట్ (ఫెడరల్ కౌన్సిల్) లను కలిగిఉన్న పార్లమెంట్ లో కేంద్రీకృతమైయుంది. ఈ రెండూ కలిపి ఒక ప్రత్యేక తరహా శాసన విభాగంగా రూపొందాయి. బుండేస్టాగ్ నిష్పత్తి ప్రాతినిధ్యంతో (మిశ్రమ సభ్యులు), ప్రత్యక్షం ఎన్నుకోబడుతుంది. బుండేస్రాట్ సభ్యులుగా పదహారు సమాఖ్య రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతినిధులు, రాష్ట్ర మంత్రివర్గాల సభ్యులు ఉంటారు. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఏసమయంలోనైనా వారి రాయబారులను నియమించే లేదా తొలగించే హక్కు కలిగిఉన్నాయి.

ప్రస్తుత అధ్యక్షుడు " హోర్స్ట్ కోహ్లేర్ " రాజ్యాధినేతగా ప్రాథమికంగా ప్రాతినిధ్య బాధ్యతలను, అధికారాలను కలిగిఉంటారు. బుండేస్టాగ్ రాష్ట్రాల సభ్యులను సమాన సంఖ్యలో కలిగి ఉన్న సంస్థ అయిన బుండేస్వేర్సంమ్లుంగ్ (సమాఖ్య సమావేశం)చే ఈయన ఎన్నుకోబడతారు. జర్మన్ అధికార క్రమంలో బుండేస్టాగ్స్ ప్రసిడెంట్ (బుండేస్టాగ్ యొక్క అధ్యక్షుడు) రెండవ అత్యున్నత అధికారి. ఈయన బుండేస్టాగ్ చే ఎన్నుకోబడి సభ రోజువారీ కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యతను కలిగిఉంటాడు. మూడవ-అత్యున్నత అధికారి, ప్రభుత్వాధినేత ఛాన్సలర్, బుండేస్టాగ్ చే ఎన్నుకోబడిన తరువాత బుండెస్ప్రెసిడెంట్ చే ప్రతిపాదించబడతారు. ఛాన్సలర్ బుండేస్టాగ్ నిర్మాణాత్మక అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించబడి అదేసమయంలో తరువాత నేతను ఎన్నుకొంటుంది.

1949 నుండి పార్టీ వ్యవస్థ క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్, సోషల్ డెమోక్రాటిక్ పార్టీ అఫ్ జర్మనీల ఆధిపత్యంలో ఉండి అప్పటినుండి ఎన్నుకోబడిన అందరు చాన్సలర్లు ఈరెండిటిలో ఏదో ఒకదానికి చెందిన వారై ఉన్నారు. ఏదేమైనా, చిన్నవైన స్వతంత్ర ఫ్రీ డెమోక్రాటిక్ పార్టీ (1949 నుండి బుండేస్టాగ్ లో సభ్యులను కలిగిఉంది), అలయన్స్ '90/ది గ్రీన్స్ (1983 నుండి పార్లమెంట్లో స్థానం కలిగిఉన్నాయి), సమైక్య ప్రభుత్వంలో చిన్న భాగస్వాములుగా ఉండటంవలన ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి.

చట్టం

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
కార్ల్స్రుహ్ లో ఫెడరల్ కన్స్టిట్యుషనల్ కోర్ట్ ఆఫ్ జర్మనీ.

జర్మనీ న్యాయశాఖ కార్యనిర్వాహక, శాసన నిర్మాణ శాఖల నుండి స్వతంత్రంగా ఉంటుంది. జర్మనీ పౌర (శాసన) న్యాయ వ్యవస్థను కలిగి ఉంది. అది రోమన్ చట్టంపై ఆధారపడి జర్మానిక్ చట్టం నుండి కొన్ని సూచనలను స్వీకరించింది. కార్ల్స్రుహ్‌లో ఉన్న బున్దేస్వేర్ఫస్సున్గ్స్గేరిచ్ట్ (సమాఖ్య రాజ్యాంగ న్యాయస్థానం), జర్మనీ అత్యున్నత న్యాయస్థానంగా వ్యవహరిస్తూ న్యాయ సమీక్ష అధికారం కలిగి రాజ్యాంగ వ్యవహారాలకు బాధ్యత వహిస్తుంది. ఇది అత్యున్నత చట్టసంస్థగా వ్యవహరిస్తూ శాసన నిర్మాణ, న్యాయ పద్ధతులు జర్మనీ సమాఖ్య గణతంత్ర ఆధార చట్టానికి (బేసిక్ లా) అనుగుణంగా ఉండేటట్లు చూస్తుంది. అది ఇతర రాజ్య సంస్థల నుండి స్వతంత్రంగా వ్యవహరిస్తుంది కానీ తనంతట తాను పనిచేయదు.

దస్త్రం:Grundgesetz cover.jpg
ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ యొక్క ప్రాథమిక చట్టం, 1949.

ఒబెర్స్తేగేరిచ్ట్షోఫెడేస్బుండెస్ అని పిలువబడే జర్మనీ అత్యున్నత న్యాయ వ్యవస్థగా ప్రత్యేకత పొందింది. కార్ల్స్రుహ్, లీప్జిగ్ లలో ఉన్న ఫెడరల్ కోర్ట్ అఫ్ జస్టిస్ పౌరమ్ నేర విషయాలలో అప్పీలుకు చివరి గమ్యంగా ఉంది. న్యాయస్థాన శైలి శోధనా పద్ధతిలో ఉంటుంది. ఇతర సమాఖ్య న్యాయస్థానాలు ఏర్ఫుర్టు లోని ఫెడరల్ లేబర్ కోర్ట్, కస్సేల్ లోని ఫెడరల్ సోషల్ కోర్ట్, మ్యూనిచ్ లోని ఫెడరల్ ఫైనాన్స్ కోర్టు, లీప్జిగ్ లోని ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు .

నేర చట్టం, వ్యక్తిగత చట్టం జాతీయస్థాయిలో వరుసగా స్త్రాఫ్గెసేట్జ్బుచ్, బర్గేర్లిచేస్ గెసేట్జ్బుచ్ లలో క్రోడీకరించబడ్డాయి. జర్మన్ శిక్షా వ్యవస్థ నేరస్థుల పునరావాసం లక్ష్యంగా ఉంటుంది. సాధారణ ప్రజల భద్రత దాని రెండవ లక్ష్యంగా ఉంటుంది. నేరం రుజువైన నేరస్థుడు సాధారణ ప్రజానీకానికి ముప్పు అని భావించినపుడు మామూలు శిక్షకు ముందు రెండవ లక్ష్య సాధన జాగ్రత్తగా నిలిపి ఉంచుతారు సిచేర్ఉన్గ్స్వేర్వాహృంగ్ ). వూల్కేర్స్త్రాఫ్గేసేత్జ్బుచ్ మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే నేరాలు, సామూహిక జాతిహత్యలు, యుద్ధ నేరాల పరిణామాలను నియంత్రిస్తుంది. నేరం జరిగిన ప్రదేశంలోని విచారణ దేశంలోని లేదా అంతర్జాతీయ న్యాయస్థానాలకు సాధ్యం కానపుడు అది జర్మనీ న్యాయస్థానాలకు సార్వత్రిక పరిధిని ఇస్తుంది.

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
హాంబర్గ్ లో జర్మన్ రాజ్య పోలీసు అధికారి.

రాజ్య శాసనాధికారం

శాసనాధికారసమాఖ్య రాష్ట్ర మధ్య విభజింపబడింది. శాసనాధికారం సమాఖ్యస్థాయిలో ఉన్నపుడు సమాఖ్యచట్టం రాష్ట్రచట్టాన్ని అధిగమిస్తుంది.మరణ శిక్షకు వర్తించే హెస్సియన్ నియమం దీనికి ఒక ప్రఖ్యాత ఉదాహరణగా ఉంది. ఇది ఆధార చట్టంలోని మరణశిక్ష నిషేధానికి వ్యతిరేకంగా ఉంది. అందువలన హెస్సియన్ నియమం నిరుపయోగమైంది. బుందేస్రాట్ అనే సమాఖ్య ద్వారా రాష్ట్రాలు జాతీయ శాసననిర్మాణంలో పాల్గొంటాయి. చట్టం పరిధి ఉమ్మడి శాసనాధికారం లోనికి వచ్చినపుడు సమాఖ్య శాసననిర్మాణంలో రాష్ట్రాలు కూడా పాల్గొనడం తప్పనిసరి. రాష్ట్రాలు సమాఖ్య నిబంధనలను లేదా మూలచట్టంచే రూపకల్పన చేయబడిన వాటిని పాటించవలసి ఉంటుంది. ప్రతి రాష్ట్రానికీ దాని స్వంత న్యాయస్థానం ఉంటుంది. అమ్టస్గేరిచ్ట్, ల్యాండ్గేరిచ్తే, ఒబెర్లన్దేస్గేరిచ్తే అనేవి రాష్ట్రాల సాధారణ పరిమితి న్యాయస్థానాలు. రాష్ట్ర చట్టంపై ఆధారపడి ఉన్నప్పటికీ ఇవి తీర్పు ఇవ్వగలవు.

పరపాలన చట్టం అనేక మూలాధార విషయాలు రాష్ట్రాల పరిధిలోనే ఉన్నాయి, అయినప్పటికీ అత్యధిక రాష్ట్రాలు పరిపాలనా రంగంలో తమ స్వంత చట్టాలకు ఆధారంగా 1976 Verwaltungsverfahrensgesetz (పరిపాలనా ఉత్తర్వుల చట్టం)ను గ్రహించి దానిలోని ముఖ్యమైన భాగాలను పరిపాలనా చట్టంలోకి తీసుకున్నారు. అయితే చట్టం సమాఖ్యకు సంబంధించినదా లేదా సమాఖ్య చట్టాన్ని పోలిఉండే రాష్ట్రానికి సంబంధించినదా అనే ప్రశ్నతో సంబంధం లేకుండా Oberverwaltungsgerichte రాష్ట్రస్థాయి పరిపాలనలో ఉన్నత స్థాయి న్యాయ పరిధిని కలిగి ఉంటాయి ఇటువంటి పరిస్థితులలో, ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్ లో చివరి అప్పీలు సాధ్యమవుతుంది.

విదేశీ సంబంధాలు

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
హీలిజేన్డెంలో జరిగిన జి8 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన ఉన్న ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్.

ఐరోపా సమాఖ్య ప్రారంభం నుండి జర్మనీ నాయకత్వ పాత్రపోషించింది. రెండవ ప్రపంచయుద్ధానంతరం నుండి ఫ్రాన్సుతో బలమైన సంబంధాలు కొనసాగిస్తోంది. 1980ల చివరిలో, 1990ల ప్రారంభంలో క్రిస్టియన్ డెమోక్రాట్ " హెల్మెట్ కోల్ ", సోషలిస్ట్ " ఫ్రాన్కోయిస్ మిట్టరాండు "ల నాయకత్వంలో ఈసంబంధాలు మరింత దగ్గరయ్యాయి. రాజకీయ, రక్షణ, భద్రతారంగాలలో మరింత సమైఖ్య ఐరోపా స్థాపనను ప్రోత్సహించే ఐరోపాదేశాలలో జర్మనీ ముందువరుసలో ఉంది. రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన అనేక దశాబ్దాల తరువాత అంతర్జాతీయ సంబంధాలలో జర్మనీ గణతంత్ర సమాఖ్య గమనించదగిన పాత్ర పోషించలేదు. దీనికి కారణం దాని ఇటీవలి చరిత్ర విదేశీ శక్తుల అధీనంలో ఉంది.

ప్రచ్ఛన్న యుద్ధసమయంలో ఇనుప తెర ద్వారా జర్మనీ విభజన జారణంగా జర్మనీ తూర్పు-పశ్చిమాల ఉద్రిక్తతల చిహ్నంగానూ ఐరోపా రాజకీయ యుద్ధభూమిగానూ మార్చింది. ఏదేమైనా విల్లీ బ్రండ్ట్ ఒస్త్పోలితిక్ 1970ల డిటిన్టెలో కీలక పాత్ర పోషించింది. 1999లో యుగోస్లావియాకి విరుద్ధంగా నేటో యుద్ధానికి సంబంధించిన విషయాలలో పూర్తి పాత్ర పోషించడం, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మొదటిసారి జర్మనీ దళాలను దాడికి పంపడం ద్వారా చాన్సలర్ " గెర్హార్డ్ స్క్రోడర్ " ప్రభుత్వం జర్మనీ విదేశీ విధానానికి కొత్త నిర్వచనం ఇచ్చింది.

జర్మనీ యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వాలు సన్నిహిత రాజకీయ మిత్రదేశాలుగా ఉన్నాయి. 1948 నాటి మార్షల్ ప్రణాళిక రెండవ ప్రపంచ యుద్ధానంతరం పునర్నిర్మాణ ప్రక్రియా కాలంలో యు.ఎస్ సమర్ధ (జెసిఎస్ 1067) (జర్మనీ కొరకు పారిశ్రామిక ప్రణాళికలు), భ్రాతృత్వభావన యుద్ధ బాలలు), బలమైన సాంస్కృతిక సంబంధాలు ఈ రెండు దేశాల మధ్య బలమైన బంధాన్ని ఏర్పరిచాయి. అయితే ఇరాక్ యుద్ధానికి స్క్రోడర్ మౌఖిక వ్యతిరేకత అట్లాన్టిసిజం ముగింపును సూచించి జర్మనీ అమెరికన్ సంబంధాలను మరింత దగ్గర చేసింది. ఈరెండు దేశాలూ ఆర్థికంగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి: 8.8% జర్మన్ ఎగుమతులు యు.ఎస్.-కు ఉద్దేశించినవే. 6.6% జర్మన్ దిగుమతులు యు.ఎస్. నుండి ఉత్పత్తి అయినవి. మరోవిధంగా చెప్పాలంటే 8.8% యు.ఎస్. ఎగుమతులు జర్మనీకి ఉద్దేశించినవే. యు.ఎస్. దిగుమతులలో 9.8% జర్మనీ నుండి దిగుమతి చేసుకోబడుతున్నాయి. సమీప సంబంధాలకి మరికొన్ని గుర్తులుగా యు.ఎస్.లో అతిపెద్ద సమూహంగా జర్మన్-అమెరికన్ల స్థితి కొనసాగడాన్ని, యు.ఎస్. వెలుపల అతిపెద్ద యు.ఎస్. మిలిటరీ సమూహంగా రంస్టిన్ ఎయిర్ బేస్ (కైసేర్స్లుతెర్న్ సమీపంలో) ఉండడాన్ని పేర్కొనవచ్చు.

అభివృద్ధి సహాయం

జర్మనీ విదేశాంగ విధానం నుండి జర్మనీ గణతంత్ర సమాఖ్య అభివృద్ధి విధానం స్వతంత్రంగా ఉంటుంది. ఇది ఫెడరల్ మినిస్ట్రీ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (బిఎమ్‌జెడ్) చే సిద్ధాంతీకరించబడింది. అమలుపరచే సంస్థలచే నిర్వహించబడుతుంది. జర్మనీ ప్రభుత్వం అభివృద్ధి విధానాన్ని అంతర్జాతీయ సమూహం ఉమ్మడి బాధ్యతగా భావిస్తోంది.

2007వ సంవత్సరానికి జర్మనీ అధికారిక అభివృద్ధి సహాయం, మానవత్వ సహాయం కొరకు 8.96 బిలియన్ యూరోలు (12.26 బిలియన్ డాలర్లు) వ్యయం చేయబడింది. ఇది 2006 కంటే 5.9% ఎక్కువ. ఇది యునైటెడ్ స్టేట్స్ తరువాత ప్రపంచంలోని రెండవ పెద్ద దాతృత్వ దేశంగా మారింది. జర్మనీ స్థూల జాతీయ ఉత్పత్తి (GDP)లో 0.37 శాతం అభివృద్ధికి ఖర్చు చేసింది. ఇది 2010 నాటికి సహాయాన్ని స్థూల జాతీయ ఉత్పత్తిలో 0.51 శాతానికి పెంచాలనే ప్రభుత్వ లక్ష్యానికి తక్కువగా ఉంది. అంతర్జాతీయ లక్ష్యం జిడిపిలో 0.7% శాతం కూడా సాధించబడలేదు.

సైన్యం

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
లెబనాన్ తీరం వెలుపల UNIFIL II కార్యక్రమంలో పాల్గొన్న మేక్లేన్బుర్గ్-వోర్పోమ్మేర్న్.

జర్మనీ సైన్యం బుందేస్వేహ్ర్, హీర్ (పదాతిదళం), మరిన్ (నావికాదళం), లుఫ్ట్వాఫ్ఫే (వాయు సైన్యం), జెంత్రలేర్ అనితాత్‌స్దిఎన్‌స్త (కేంద్రీయ వైద్య సేవలు), స్త్రెయిత్క్రఫ్తెబెసిస్ (ఉమ్మడి ఆధార సేవలు) విభాగాలను కలిగి ఉంది. 18 సంవత్సరాల వయసు వచ్చిన పురుషులకు సైనికసేవ తప్పనిసరి. ఇది తొమ్మిది నెలల ప్రయాణ విధిని కలిగి ఉంటుంది. దీనికి సమ్మతించని వారు ఇదే నిడివిగల జివిల్దిఎంస్ట్ను ఎంపిక చేసుకోవచ్చు (పౌర సేవగా పేర్కొనవచ్చు), లేదా అగ్నిమాపక విభాగం, రెడ్ క్రాస్ లేదా టిడబ్ల్యూ వంటి వాటిలో అత్యవసర సేవలకు ఆరుసంవత్సరాల పాటు (స్వచ్ఛందంగా) అంగీకరించడం. 2003లో సైనికవ్యయం దేశం జిడిపిలో 1.5% ఉంది. శాంతి సమయాలలో బున్దేస్వేహ్ర్ రక్షణ మంత్రి అధీనంలో ఉంటుంది. ప్రస్తుతం రక్షణమంత్రిగా కార్ల్-థియోడార్ జు గుట్టేన్బెర్గ్ ఉన్నాడు.జర్మనీ గనక యుద్ధంలో పాల్గొంటే రాజ్యాంగం ప్రకారం రక్షణ అవసరాల కొరకు మాత్రమే అనుమతించబడుతుంది. చాన్సలర్ బున్దేస్వేహ్ర్ సర్వ సైన్యాధ్యక్షుడు అవుతాడు.

బున్దేస్వేహ్ర్ 2,00,500 వృత్తిపరమైన సైనిక సిబ్బందిని కలిగిఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 55,000 అంది 18–25 సంవత్సరాల వయసు కలిగి కనీసం తొమ్మిది నెలల పాటు పనిచేసే నిర్బంధ సైనికులను ఏ సమయంలోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండే 2,500 మంది ఉత్సాహవంతులైన కార్యకర్తలను కలిగిఉంది. సైనిక దళాల రక్షణ కార్యక్రమాలలో పాల్గొనడానికి విదేశాలలో పనిచేయడానికి సుమారు 3,00,000 మంది అందుబాటులో ఉన్నారు. 2001 నుండి స్త్రీలు కూడా ఏ విధమైన సేవలోనైనా నియంత్రణ లేకుండా పాల్గొనవచ్చు. కానీ వారికి నిర్బంధం లేదు. ప్రస్తుతం సుమారు 14,500 మంది స్త్రీలు ఔత్సాహిక సేవలో ఉన్నారు. అనేక మంది స్త్రీలు శాంతి పరిరక్షక దళాలలో, ఇతర కార్యక్రమాలలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. వైద్యాధికారులైన ఇద్దరు స్త్రీలు జనరల్ పదవి వరకు పదోన్నతిని పొందగలిగారు.

As of నవంబరు 2009[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]], వివిధ అంతర్జాతీయ శాంతి పరిరక్షక దళాలలో భాగంగా సుమారు 8,300 జర్మనీ దళాలు వివిధ దేశాలలో ఉన్నాయి. వీరిలో 2,470 బున్దేస్వేహ్ర్ సైనికులు కొసొవో నేటో లోను, 4,520 జర్మన్ దళాలు నేటో-నేతృత్వంలోని ఐఎస్‌యఫ్ దళంలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్లోను 450 మంది యుఎన్‌ఐఎఫ్‌ఐఎల్‌లో లెబనాన్ లోను ఉన్నారు.

2009లో రక్షణ మంత్రి కార్ల్-థియోడార్ జు గుట్టేన్బెర్గ్ అఘనిస్తాన్‌లో పరిస్థితులు "యుద్ధం వలె" ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే ఇంతకు ముందు "యుద్ధం" అనే మాటను వాడకుండా "స్థిరత్వం, పౌరజీవన పునర్నిర్మాణం"గా పేర్కొనేవారు.

గణాంకాలు

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
1800-2000ల మధ్య జర్మనీ స్వాధీన ప్రాంతాల జనాభా, 1975-2000ల మధ్య వలస జనాభా.

82 మిల్లియన్ల మంది జనాభాతో యూరోపియన్ సమితిలో అత్యంత జనసాంద్రత కలిగిన దేశంగా జర్మనీ ఉంది. ఐరోపాలో ఫలదీకరణ శాతం అతితక్కువగా ఉన్న దేశాలలో జర్మనీ ఒకటిగా ఉంది. ఒక స్త్రీకి 1.41 నిష్పత్తిలో పిల్లలు ఉన్నట్టు లెక్కించారు. జర్మనీలో అనేక పెద్దనగరాలు ఉన్నాయి. ఎక్కువ జన సాంద్రత బెర్లిన్, హాంబర్గ్, మ్యూనిచ్, కొలోన్, ఫ్రాంక్ఫర్టు స్టుట్గార్టు నగరాలలో ఉంది. రైన్-రుహ్ర్ ప్రాంతం (12 మిల్లియన్లు) అతిపెద్ద పట్టణ ప్రాంతంగా విస్తరించింది. దీనిలో డుస్సెల్ డోర్ఫ్ (ఎన్‌ఆర్‌డబ్ల్యూ యొక్క రాజధాని), కొలోన్ నగరాలు, ఎస్సెన్, డోర్ట్ముండ్, డుయిస్బుర్గ్, బోచుం ఉన్నాయి.

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
3.4 మిలియన్ ప్రజలతో బెర్లిన్ అతిపెద్ద నగరం.

2004 డిసెంబరు నాటికి దాదాపు ఏడుమిల్లియన్ల విదేశీ పౌరులు జర్మనీలో నమోదు చేయబడ్డారు. దేశాలో నివసిస్తున్న ప్రజలలో 19% మంది విదేశీ లేదా పాక్షికంగా విదేశీ సంతతికి చెందినవారు. విదేశీ సంతతికి చెందిన వారిలో ముసలి వారికన్నా యువకులు అధికంగా ఉన్నారు. జర్మన్ల యొక్క 30% మంది 15 సంవత్సరాల వయసుకలిగి ఉన్నారు, తల్లితండ్రులలో కనీసం ఒకరు విదేశంలో పుట్టారు. పెద్దనగరాలలో పిల్లలలో 60% మంది 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన వారు ఉన్నారు. వీరి తల్లితండ్రులలో కనీసం ఒకరు విదేశంలో పుట్టిన వారు ఉన్నారు.

As of 2007 వలసవచ్చిన చరిత్రతో ఉన్న ప్రజల అతిపెద్ద జాతీయ సమూహం టర్కీ నుండి వచ్చింది (2.5 మిల్లియన్లు), ఇటలీ (761,000), పోలాండ్ (638,000) దీనిని అనుసరించాయి.

ఐక్యరాజ్యసమితి జనాభా నిధి జర్మనీను ప్రపంచవ్యాప్త అంతర్జాతీయ వలసలు అధికసంఖ్యలో జరిగిన దేశాల జాబితాలో జర్మనీ మూడవ స్థానంలో ఉంది. దాదాపు 5% (మొత్తం 191 మిల్లియన్లు) వలసలలో 10 మిల్లియన్లు (జర్మనీ జనాభాలో 12%) ఉంది. ఆశ్రయం, వలసల కారణంగా జర్మనీలో ముందుగా ఉన్న పరిమితంలేని చట్టాలకు వలసవచ్చినవారు ఆశ్రయంకోరే జర్మన్ సాంస్కృతిక సంప్రదాయాన్ని అడిగే వారి సంఖ్య (ఎక్కువగా పూర్వ సోవియెట్ సమాఖ్య నుండి వచ్చారు) 2001 నాటినుంచీ క్రమంగా తగ్గిపోతోంది.

పూర్తిగా లేదా గుర్తించదగేంత జర్మన్ వంశస్థులను అతిపెద్ద సంఖ్యలో సంయుక్త రాష్ట్రాలు (50 మిల్లియన్లు), బ్రెజిల్ (5 మిల్లియన్లు), కెనడా (3 మిల్లియన్లు) ప్రజలు ఉన్నారు. దాదాపు 3 మిల్లియన్ల "అసిడ్లెర్"— సాంప్రదాయ జర్మన్లు, ముఖ్యంగా తూర్పు ఐరోపా, పూర్వ సోవియట్ యూనియన్ నుండి వచ్చిన ప్రజలు 1987 నుండి తిరిగి జర్మనీలో స్థిరపడినారు.

మతం

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
రైన్ నదివద్ద ఉన్న కొలోన్ కేతేడ్రాల్ UNESCO ప్రపంచ వారసత్వ కేంద్రం.

క్రైస్తవమతం అనేది జర్మనీలో అతిపెద్ద మతసాంప్రదాయంగా ఉంది. దీనిని 52 మిల్లియన్ల మంది అనుసరిస్తున్నారు (64%). వీరిలో 26.5 మిల్లియన్ల మంది ప్రొటెస్టంట్స్ (32.3%), 25.5 మిల్లియన్ల మంది కేథలిక్స్ (31.0%) ఉన్నారు. రెండవ అతిపెద్ద మతంగా ఇస్లాం ఉంది. దీనిని 4.3 మిల్లియన్ల మంది అనుసరిస్తున్నారు (5%) తరువాత స్థానంలో ఉన్న బౌద్దమతము, జుడాయిజంను రెంటినీ 2,00,000 మంది అనుసరిస్తున్నారు (0.25%). హిందూమతంను 90,000 మంది (0.1%), సిక్కుమతాన్ని 75,000 (0.09%)మంది అనుసరిస్తున్నారు. జర్మనీలో మిగిలిన మతసంఘాలను అనుసరించేవారు 50,000 కన్నా తక్కువ (లేదా 0.05% కన్నా తక్కువ) మంది ఉన్నారు. ఇంచుమించు 24.4 మిల్లియన్ల జర్మన్లు (29.6%) ఏమతాన్ని అనుసరించని వారు (నాస్థికులు) ఉన్నారు.

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
డ్రెస్డెన్ లో ఫ్రాన్కిర్చీ లోపల.

ఉత్తరం, తూర్పు ప్రాంతాలలో ప్రొటెస్టన్టిజం అనుసరిస్తున్న ప్రజలు కేంద్రీకృతమై ఉన్నారు. దక్షిణం, పడమర ప్రాంతాలలో రోమన్ కేథోలిజం కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఉన్న పోప్ బెనెడిక్ట్ XVI బవేరియాలో పుట్టారు. మతసంబంధం లేని ప్రజలు నాస్తికులు ఇంకా భౌతికవాదులుతో కలిపి, జనాభాలో 29.6% ఉంటారు. ప్రధానంగా వీరు మాజీ తూర్పు జర్మనీ అతిపెద్ద నగరప్రాంతాలలో అధికంగా ఉంటారు.

4.3 మిల్లియన్ల ముస్లింలలో చాలామంది టర్కీ నుంచి వచ్చిన సున్నీస్, అలేవిటేస్ ఉన్నారు. కానీ చిన్న మొత్తంలో షి'ఇట్స్ కూడా ఉన్నారు. దేశం మొత్తం జనాభాలో 1.7% మంది తమకితామే సాంప్రదాయ క్రైస్తవులుగా ప్రకటించుకున్నారు. సెర్బులు, గ్రీకులు అసంఖ్యాకంగా ఉన్నారు. ఐరోపాలో యూదుల జనాభా ఎక్కువ ఉన్న దేశంగా జర్మనీ మూడవ స్థానంలో ఉంది (ఫ్రాన్సు, బ్రిటన్ తర్వాత). 2004లో ఇజ్రాయిల్ వలే జర్మనీలో కూడా పూర్వ సోవియెట్ గణతంత్రాల నుండి రెండు రెట్ల యూదులు స్థిరపడ్డారు. దీనివలన మొత్తం యూదుల జనాభా 2,00,000పైన చేరింది. ఇది జర్మనీ పునరేకీకరణ అయ్యేముందు పోలిస్తే 30,000 ఉంది. యూదుల జనాభా ఉన్న పెద్ద నగరాలలోబెర్లిన్, ఫ్రాంక్ఫర్ట్, మ్యూనిచ్ ఉన్నాయి. దాదాపు 2,50,000 మంది ఉత్సాహవంతులైన భౌద్దమతస్తులు జర్మనీలో నివసిస్తున్నారు. దానిలో 50% మంది ఆసియానుండి వలసవచ్చిన వారు ఉన్నారు. ఇక్కడ కొన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి.

యూరో బారోమీటర్ ఎన్నిక 2005 ప్రకారం, జర్మన్ పౌరులలో 47% మంది "దేవుడున్నాడని నేను నమ్ముతున్నాను" అనే ప్రవచనాన్ని అంగీకరించారు. అయితే 25% మంది "ఏదో ఒకవిధమైన శక్తి లేదా జీవిత బలం ఉందని నేను నమ్ముతున్నాను" అని నమ్మారు. 25% మంది "ఏవిధమైన శక్తి, దేవుడు, లేదా జీవిత బలం ఉందని నేను నమ్మడం లేదు " అని చెప్పారు.

భాషలు

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
EU దేశాలలో జర్మన్ గురించి జ్ఞానం.

జర్మనీలో జర్మనీ భాష అధికార భాషగా ఉంది. ఇది అధిక సంఖ్యాకులు మాట్లాడే భాషగా ఉంది. ఇది ఐరోపా సమాఖ్యలోని 23 అధికారిక భాషలలో ఒకటిగానూ ఆంగ్లం, ఫ్రెంచులతో పాటు యూరోపియన్ కమిషన్ వ్యావహారిక భాషలలో ఒకటిగానూ ఉంది. జర్మనీలో గుర్తింపు పొందిన స్థానిక అల్పసంఖ్యాకుల భాషలుగా డానిష్, సోర్బియన్, రొమానీ, ఫ్రిజియన్ ఉన్నాయి. ఇవి అధికారికంగా ఇ సి ఆర్ ఎమ్ ఎల్ చే రక్షింపబడతాయి. టర్కిష్, పోలిష్,బాల్కన్ భాషలు, రష్యన్ అధికంగా వాడబడే వలసభాషలుగా ఉన్నాయి.

పశ్చిమ జర్మనీ భాష ప్రామాణికమైనది. ఇది ఇంగ్లీష్, డచ్, ఫ్రిజియన్ భాషలతో దగ్గరి సంబంధం కలిగిన భాషగా వర్గీకరించబడింది. ఇది కొంతవరకు తూర్పు (ప్రస్తుతం లేనిది) ఉత్తర జర్మనీ భాషలతో సంబంధం కలిగిఉంది. చాలా వరకు జర్మన్ శబ్దాలు భారతీయ-ఐరోపా భాష కుటుంబం నుండి ఉద్భవించాయి. స్వల్ప సంఖ్యలో కొన్ని పదాలు లాటిన్, గ్రీకు నుండి ఉద్భవించాయి. చాల కొద్ది పదాలు ఫ్రెంచ్ నుండి, ఇటీవలి కాలంలోని పదాలు ఇంగ్లీష్ ( డెన్గ్లిష్ గా పిలువబడుతోంది) నుండి ఉద్భవించాయి. జర్మన్ లాటిన్ అక్షరమాల ఉపయోగించి వ్రాయబడుతుంది. 26 ప్రామాణిక అక్షరాలతో పాటు, జర్మన్ మూడు అచ్చులను ఉమ్లుత్స్ తో కలిగి ఉంది. అవి ä, ö,, ü, వాటితో పాటు ఎస్జేట్ లేదా స్చార్ఫెస్ S (షార్ప్ s ) ఇది "ß"గా వ్రాయబడుతుంది.

ప్రామాణిక జర్మనీ విధాల నుండి జర్మనీ మాండలికాలు విభిన్నంగా ఉంటాయి. ఈ జర్మన్ మాండలికాలు సాంప్రదాయ స్థానిక విధానాల ఉనికి విభిన్న జర్మనీ తెగలకు చెందినది. ఇవి ప్రామాణిక జర్మన్ నుండి పదజాలం, స్వర శాస్త్రము, వాక్య నిర్మాణం తరచూ భిన్నంగా ఉండటం వలన, కేవలం ప్రామాణిక జర్మనీ మాత్రమే తెలిసిన వారికి అంత సులభంగా అర్ధం కావు.

ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్ల మంది స్వదేశీయులు జర్మనీ మాట్లాడుతుండగా 80 మిలియన్ల మంది స్వదేశస్థులు-కానివారు. ఐరోపా సమాఖ్యలో సుమారు 90 మిలియన్ల (18%) మంది ప్రజలకు జర్మనీ ప్రధాన భాషగా ఉంది. 67% జర్మన్ ప్రజలు ఏదో ఒక విదేశీ భాషను, 27% మంది ప్రజలు వారి స్వభాష కాక రెండు ఇతర భాషలలో సమాచార ప్రసారం చేయగలరు.

ఆర్థిక వ్యవస్థ

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
2007లో వస్తువుల ఎగుమతిలో ప్రపంచంలో ప్రధానమైన దేశం జర్మనీ.

జర్మనీ ఐరోపాలో అతి పెద్ద దేశీయ ఆర్థికవ్యవస్థగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా నామమాత్ర జిడిపి ద్వారా నాల్గవ స్థానంలో ఉంది. 2008లో జిడిపి (పిపిపి) 5 వ స్థానంలో ఉంది. పారిశ్రామికీకరణ యుగం నుండి ఈ దేశం ఒక చోదకశక్తిగా, నవయుగ రూపకర్తగా ఉంది. ఆర్థికవ్యవస్థ ప్రపంచీకరణతో మరింత ప్రయోజనకరంగా మారింది. 2006లో $1.133 ట్రిలియన్ల ఎగుమతులతో (యూరోజోన్ దేశాలతో కలిపి) జర్మనీ ప్రపంచపు అత్యుత్తమ ఎగుమతిదారు దేశంగా €165 బిలియన్ల వర్తకపు మిగులు కలిగి ఉంది. మొత్తం జిడిపిలో సేవల రంగం 70%, పారిశ్రామిక రంగం 29.1%, వ్యవసాయ రంగం 0.9% వాటాను కలిగి ఉన్నాయి. ఇంజనీరింగ్ రంగంలో ఉత్పత్తి అధికంగా చేస్తూ ఉంది. ప్రత్యేకించి ఆటోమొబైల్, యంత్రాలు, లోహాలు, రసాయన వస్తువులు ఉత్పత్తులు అధికంగా ఉన్నాయి. గాలి మరలు సౌరశక్తి సాంకేతికతల ఉత్పత్తిలో జర్మనీ ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉంది. హనోవర్, ఫ్రాంక్ఫర్ట్ బెర్లిన్ వంటి అనేక జర్మనీ నగరాలలో అతిపెద్ద సాంవత్సరిక అంతర్జాతీయ వర్తక ప్రదర్శనలు, సమావేశాలు నిర్వహించబడతాయి.

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
ఫ్రాంక్ఫర్ట్ ఒక పెద్ద ఆర్థికకేంద్రం, ఐరోపా సెంట్రల్ బ్యాంక్ ప్రధానకేంద్రం,, ప్రపంచ వైమానిక కేంద్రం.

ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని స్టాక్ మార్కెట్ జాబితాలో చేర్చబడిన ప్రపంచములోని 500 అతిపెద్ద సంస్థలలో 37 సంస్థలు జర్మనీలో కేంద్ర కార్యాలయాన్ని కలిగి ఉన్నాయి. 2007లో పది అతిపెద్ద కంపెనీలలో డైమ్లేర్, వోక్స్ వాగెన్, అల్లియంజ్ (అత్యంత లాభదాయకమైన సంస్థ), సీమెన్స్, డ్యూయిష్ బాంక్ (2వ పెద్ద లాభదాయక సంస్థ), ఇ.ఆన్, డ్యూయిష్ పోస్ట్, డ్యూయిష్ టెలికొమ్, మెట్రో, బిఎ.ఎస్‌ఎఫ్ ఉన్నాయి. అతి పెద్ద యజమానులలో డ్యూయిష్ పోస్ట్, రాబర్ట్ బాష్ జిఎమ్‌బిహెచ్,, ఎడేక ఉన్నాయి. ప్రసిద్ధిచెందిన ప్రపంచ బ్రాండు సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, ఎస్‌ఎపి, బిఎమ్‌డబ్ల్యూ, అడిడాస్, ఆడి, పోర్షే, వోక్స్ వాగెన్, నివియ ఉన్నాయి.

జర్మనీ మరింత సన్నిహిత ఐరోపా ఆర్థిక, రాజకీయ సమైక్యతకు చిహ్నంగా ఉంది. ఐరోపా సమాఖ్య (ఇయు) సభ్యదేశాల మధ్య ఒప్పందాలు ఐరోపా సమాఖ్య సమైక్య విపణి శాసనంపై ఆధారపడి దాని వాణిజ్య విధానాలు అధికరిస్తోది. జర్మనీ సాధారణ ఐరోపా ద్రవ్యమైన యూరోని ఉపయోగిస్తుంది. దీని ద్రవ్య విధానం ఫ్రాంక్ఫర్ట్ లోని యూరోపియన్ కేంద్ర బాంకుచే తయారుచేయబడుతుంది. 1999కి ముందు అధికారిక ద్రవ్యం డ్యుయిష్ మార్కు ఉండేది. 1999 జనవరి 1 నుండి ఇది యూరోతో ఒక యూరో 1.95583 జర్మన్ మార్కులుగా గణించబడి మార్పు చేయబడింది. నిజమైన యూరో నాణెములు, బాంకు నోట్లు 2002 జనవరి 1 నుండి అమలులోకి వచ్చాయి. 1990లో జర్మనీ పునరేకీకరణ తరువాత కూడా జీవన ప్రమాణం, సాంవత్సరిక ఆదాయం ప్రముఖంగా పూర్వపు పశ్చిమ జర్మనీ రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నాయి. తూర్పు జర్మనీ ఆధునికీకరణ ఒక దీర్ఘకాల ప్రక్రియగా 2019 వరకూ కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం పశ్చిమం నుండి తూర్పుకు $80 బిలియన్ల మార్పిడులు ఉంటాయి. 2005 నుండి నిరుద్యోగిత రేటు స్థిరంగా తగ్గి జూన్ 2008 నాటికి 15-సంవత్సరాల అత్యల్పస్థాయి 7.5%కి చేరుకుంది. ఈ శాతం పూర్వపు పశ్చిమ జర్మనీలో 6.2% నుండి పూర్వపు తూర్పు జర్మనీలో 12.7% వరకూ ఉంది. ప్రపంచ, ఐరోపా తరుగుదల చక్రాన్ని అనుసరించి 2008 రెండవ, మూడవ త్రైమాసికాలలో జర్మనీ నామమాత్ర జి.డి.పి దేశాన్ని సాంకేతికంగా తిరోగమన దశలో పెట్టింది. జనవరి 2009లో జర్మనీ ప్రభుత్వం కృంగిపోతున్న అనేక రంగాల రక్షణకు, తద్వారా నిరుద్యోగితా రేటు తరుగుదలకు ఏంజెలా మెర్కెల్ నేతృత్వంలో €50 బిలియన్ల ($70 బిలియన్ల) ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళికను ఆమోదించింది.

వ్యవస్థాపన

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
హాంబర్గ్ నౌకాశ్రయం ఐరోపాలోని రెండవ అతిపెద్ద ఓడరేవు.

భౌగోళికంగా ఐరోపా కేంద్రబిందువుగా ఉన్న కారణంగా జర్మనీ ఒక రవాణా కేంద్ర స్థానంగా ఉంది . ఇది దాని ఆధునిక ప్రయాణ సాధనాలలో ప్రతిబింబిస్తుంది. విస్తృతమైన వాహనమార్గం (ఆటోబహన్) వ్యవస్థ ప్రపంచంలో మూడవ అతి పెద్ద నిడివిగలదిగా ఉంది. ఇది అన్ని ముఖ్య మార్గాలలో ఒకే విధమైన పరిమితిని కలిగిలేదు.

జర్మనీ బహుళ కేంద్ర వ్యవస్థ కలిగిన అధిక-వేగ రైళ్ళను నెలకొల్పింది. ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ లేదా ఐసి్‌ఇ డచే బాన్ అత్యంత ఆధునిక సేవా విభాగంగా ఉంది. ఇది అనేక జర్మనీ నగరాలకు, పరిసర దేశాలలోని గమ్యాలకు కూడా సేవలను అందిస్తుంది. ఈ రైలు అత్యధిక వేగం గంటకు 160;కిమీ నుండి 300 కిమీ మధ్య మారుతూ ఉంటుంది. 30-నిమిషాలు, గంట, లేదా రెండు-గంటల వ్యవధిలో రైళ్ళు ఉంటాయి.

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
ICE 3 రైలు.

జర్మనీ ప్రపంచంలో 5 వ పెద్ద శక్తి వినియోగదారు దేశంగా ఉంది. 2002లో దాని ప్రాథమిక శక్తిలో మూడింట-రెండువంతులు దిగుమతి చేసుకొనబడింది. అదే సంవత్సరంలో జర్మనీ ఐరోపాలో అతి పెద్ద విద్యుచ్ఛక్తి వినియోగాదారుగా ఉంది. దీని మొత్తం వినియోగం 512.9 టెరావాట్-గంటలు. శక్తి పరిరక్షణను పెంపొందించడం, సౌర శక్తి,వాయు శక్తి, బయోమాస్,జలవిద్యుత్, భూఉష్ణ శక్తి వంటి తరగని శక్తి వనరుల అభివృద్ధికి ప్రభుత్వ విధానం దోహదపడుతుంది. శక్తిని ఆదాచేసే పద్ధతుల అమలు మూలంగా 1970ల ప్రారంభం నుండి శక్తి నైపుణ్యత మెరుగుపడుతూ వస్తోంది. 2050 నాటికల్లా దేశపు శక్తి అవసరాలలో సగభాగం తరగని శక్తివనరుల నుండే పొందాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది.

2000లో ప్రభుత్వం జర్మనీ అణుశక్తి పరిశ్రమ కలిసి 2021 నాటికి అన్ని అణుశక్తి కర్మాగారాలు పూర్తిచేయాలని అంగీకారానికి వచ్చాయి. తరగనివనరుల శక్తి ఇప్పటికీ శక్తి వినియోగంలో స్వల్ప పాత్రనే పోషిస్తోంది. 2006లో శక్తి వినియోగం ఈక్రింది వనరులనుండి ఈవిధంగా లభ్యమైంది: ఇంధన నూనెలు (35.7%); బొగ్గు,లిగ్నైటుతో కలిపి (23.9%); సహజవాయువు (22.8%); అణుశక్తి (12.6%); జల, వాయు విద్యుత్తు (1.3%); ఇతరములు (3.7%). ఏమైనప్పటికీ విద్యుత్తు పంపిణీలో తరగని శక్తి వనరుల భాగం వేగంగా పెరుగుతూ 2007 నాటికి 14%కి చేరింది. జర్మనీ ప్రభుత్వం ఈభాగం 2020 నాటికి 27%కి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించు కుంది.

విజ్ఞానశాస్త్రం

జర్మనీ అనేక శాస్త్రీయ రంగాలలో అత్యంతకీర్తి గడించిన పరిశోధకులకు నిలయంగా ఉంది.103 మంది జర్మన్ ప్రసిద్దులకు నోబెల్ బహుమతి బహుకరించబడింది. ఆధునిక భౌతికశాస్త్రం స్థాపనకు ఆల్బర్ట్ ఐన్స్టీన్, మాక్స్ ప్లాంక్ చేసిన కృషి చాలా ముఖ్యమైనది. దీనిని తర్వాత వెర్నెర్ హెసెన్బెర్గ్, మాక్స్ బోర్న్ అభివృద్ధి చేశారు. వీరు హెర్మన్ వోన్ హేల్మ్హొల్ట్జ్, జోసెఫ్ వోన్ ఫ్రున్హోఫెర్, గాబ్రిఎల్ డానియెల్ ఫారెన్హీట్ వంటి భౌతికవేత్తల ముందరివారు. విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ ఎక్స్-రేలను కనుగొన్నారు.ఇవి పలు జర్మన్ భాషలలో రాంట్జెన్స్ట్రాహ్లెన్ (రాంట్జెన్-రేస్) అని పిలవబడతాయి. ఈ సాఫల్యం అతనిని 1901లో మొదటిసారి భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి విజేతగా చేశాయి.

అంతరిక్ష ఇంజనీర్ వెర్న్హెర్ వోన్ బ్రున్ మొదటి అంతరిక్ష నౌకను అభివృద్ధి. ఆయన నాసాలో ప్రముఖమైన సభ్యుడిగా ఉన్నాడు. ఇంకా సాటర్న్ వి అనే చంద్ర నౌక అభివృద్ధి చేయడం యు.ఎస్ అపోలో ప్రోగ్రాం సఫలంకావడానికి మార్గం సుగమం అయింది. విద్యుదయస్కాంత వికిరణ సమితిలో ఆధునిక టెలికమ్యూనికేషన్ అభివృద్ధికి హెయిన్రిచ్ రుడోల్ఫ్ హెర్ట్జ్ కృషి చాలా ముఖ్యమైనది. 1879లో లీప్జిగ్ విశ్వవిద్యాలయంలో మొదటి పరిశోధనాశాల నిర్మాణం ద్వారా మనస్తత్వశాస్త్రాన్ని స్వతంత్రమైన అనుభవ ఆధార శాస్త్రంగా స్థాపించటంతో విల్హేల్మ్ వున్ద్ట్ ఖ్యాతి గడించారు. ప్రకృతి శాస్త్రవేత్త, పరిశోధకుడు అయిన అలెగ్జాండర్ వోన్ హుమ్బోల్ద్ట్ కృషి జీవ భూగోళశాస్త్రానికి పునాది వంటిది.

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
స్టట్గార్ట్ లో సూక్ష్మ ఎలక్ట్రానిక్ తయారీకి విశాలమైన శుభ్రమైన గదుల సముదాయం

అనేకమంది ప్రఖ్యాతిగాంచిన గణితశాస్త్రవేత్తలు జర్మనీలో జన్మించారు, వీరిలో కార్ల్ ఫ్రెడరిక్ గస్స్, డేవిడ్ హిల్బెర్ట్, బెర్నహార్డ్ రీమాన్, గాట్ఫ్రైడ్ లేబ్నిజ్, కార్ల్ వేర్స్ట్రాస్, హెర్మన్ వెల్ ఉన్నారు. జర్మనీ, ఐరోపాలో కదిలే మాదిరి ముద్రణను కనుగొన్న జోహాన్స్ గూటెన్బర్గ్; జీగర్ లెక్కింపు సృష్టికర్త హన్స్ జీగర్, మొట్ట మొదటి స్వయం చలిత డిజిటల్ కంప్యూటర్ను నిర్మించిన కొనార్డ్ జూస్ వంటి అనేకమంది ప్రసిద్ధిగాంచిన ఆవిష్కర్తలు, ఇంజనీర్ లకు నిలయంగా ఉంది. కౌంట్ ఫెర్డినాండ్ వాన్ జెప్పెలిన్, ఓట్టో లిలిఎన్తాల్, గొట్లిఎబ్ దైమ్లేర్, రుడోల్ఫ్ డీజిల్, హుగో జూన్కేర్స్, కార్ల్ బెంజ్ వంటి జర్మన్ ఆవిష్కర్తలు, ఇంజనీర్లు, పారిశ్రామిక వేత్తలు ఆధునిక స్వయంచాలిత వాయువు రవాణా సాంకేతికత రూపొందడంలో సహాయపడ్డారు.

జర్మనీలోని ముఖ్యమైన పరిశోధనా సంస్థలలో మాక్స్ ప్లాంక్ సొసైటీ, హేల్మ్ హొల్ట్జ్-గేమేఇన్స్చఫ్ట్, ఫ్రున్హోఫెర్ సొసైటీ ఉన్నాయి. అవి విశ్వవిద్యాలయం వ్యవస్థకు స్వతంత్రంగా లేదా బాహ్యంగా అనుసంధానింపబడి శాస్త్ర ప్రక్రియకు చెప్పుకోదగినంతగా తోడ్పడుతున్నాయి. ప్రతి సంవత్సరం పదిమంది శాస్త్రవేత్తలకు, విద్యావేత్తలకు గౌరవ ప్రథమైన గాట్ఫ్రైడ్ విల్హేల్మ్ లేబ్నిజ్ బహుమతి (ప్రైజ్) ప్రదానం చేయబడుతుంది. ప్రతి బహుమానానికీ €2.5 మిలియన్ల గరిష్ఠ మొత్తంతో ఇది ప్రపంచంలో అత్యధిక నిధి కలిగిన పరిశోధనా బహుమానాలలో ఒకటిగా ఉంది.

విద్య

జర్మనీలో విద్యావిధానం ప్రాథమికంగా సమాఖ్య రాష్ట్రాలలో ఒక్కొక రాష్ట్రానికి ఒక్కొక విధానం ఉంటుంది. అయితే సమాఖ్య ప్రభుత్వం స్వల్ప పాత్రను పోషిస్తుంది. ఇష్టాంసారంగా ఎన్నుకునే శిశుకేంద్ర విద్య మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరికీ అందించబడుతుంది. తర్వాత కనీసం తొమ్మిసంవత్సారాల వరకూ నిర్బంధ పాఠశాలా విధానం ఉంటుంది. ప్రాథమిక విద్య సాధారణంగా నాలుగు సంవత్సరాలు ఉంటుంది. ప్రజా పాఠశాలలు ఈ స్థాయిలో ఉండవు. దీనికి విరుద్దంగా మాధ్యమిక విద్యలో అధ్యాపకుని సిఫారుసులచే నిర్ణయించబడిన విద్యార్థిసామర్ధ్యం మీద ఆధారపడి మూడు రకాల సాంప్రదాయ పాఠశాలలు ఉన్నాయి: జిమ్నాజియంలో అత్యంత అసాధారణమైన పిల్లలు నమోదుకాబడతారు. వీరిని విశ్వవిద్యాలయ చదువుల కోసం తయారుచేస్తారు. ఆ రాష్ట్రం మీద ఆధారపడి ఈ అభ్యాసం ఎనిమిది లేదా తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది. రియల్స్‌ఛ్లె మధ్యస్తంగా ఉన్న విద్యార్థుల సామర్ధ్యం అధికరించడానికి సహకరిస్తుంది. ఇది ఆరు సంవత్సరాలు కొనాసగుతుంది. హుప్ట్ స్చులె విద్యార్థులను వృత్తివిద్య కోసం తయారుచేస్తుంది.

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
హీడెల్బెర్గ్ విశ్వవిద్యాలయం 1386లో స్థాపించబడింది.

1960ల నాటినుంచీ గేసంట్స్చులెలో (విశాలమైన పాఠశాల) మాధ్యమిక విద్యను సంఘటితం చేయటానికి ఒక సంస్కరణ ఉద్యమ ప్రయత్నం జరిగింది. అయినప్పటికీ వర్గీకరణ స్థాయి దాటిరాకపోక గేసంట్స్చులే కేవలం నాల్గవ రకం మాధ్యమిక పాఠశాల అయ్యింది. దాదాపు 2000 నుంచి వెస్ట్ జర్మన్ లాన్డెర్ వారి పాఠశాల విధానాన్ని రెండు లేదా మూడు స్థాయిలలో సులభతరం చేశారు. ఉద్దేశాలు: 1990లలో తూర్పు జర్మనీ ఉదాహరణలో పునఃవిలీనం తరువాత రెండు-స్థాయిల పాఠశాల విధానం స్థాపింపబడింది. 2001లో " ప్రోగ్రాం ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ (పీఇఎస్‌ఎ)" మొదటిసారిగా ప్రచురించారు. ఇది గతంలో ఉన్న పాఠశాల విధానం వర్గీకరణ, సాంఘిక ఎంపికల గురించి ఒక దేశవ్యాప్త చర్చ జరగడానికి ప్రేరణ కలిగించింది. ఇది ప్రధానంగా వలసవచ్చిన కుటుంబాల విద్యార్థుల కొరకు ఏర్పరచబడింది. నగర లోపల ఉన్న హుప్‌ట్సుచ్‌లెన్ చాలా నిరుపయోగకరంగా ఉన్నాయని భావించబడ్డాయి. ముఖ్యనగరాల వెలుపల జనాభా తగ్గిపోతోంది. అందు వలన మూడు-లేదా నాలుగు స్థాయిల పాఠశాల విధానం కొనసాగించటం అసాధ్యంగా ఉంది.

శిక్షణ దులే ఆస్బిల్డుంగ్ ("డ్యువల్ ఎడ్యుకేషన్") అని పిలవబడే ఒక ప్రత్యేకమైన విధానంలోని వృత్తివిద్యా శిక్షణ విద్యార్థులు ఒక సంస్థలో అలానే రాష్ట్రంచే నడపడుతున్న వృత్తివిద్యా పాఠశాలలో నేర్చుకొనటానికి అనుమతిస్తుంది.

జర్మనీ లోని విశ్వవిద్యాలయంలో ప్రవేశించటానికి ఉన్నత పాఠశాల విద్యార్థులు సాధారణంగా అబిటుర్ పరీక్ష రాయవలసి ఉంటుంది. ఇది యుకె లోని ఎ-స్థాయిల వంటిది. ఇది 18 లేదా 19 సంవత్సరాల వయసులో విలక్షణంగా జిమ్నాసియంలో అభ్యసించబడుతుంది. అయినప్పటికీ విద్యార్థులు వృత్తివిద్యా పాఠశాల నుంచి డిప్లొమా పొందినవారు కొన్ని కచ్చితమైన విషయాలలో మెట్రిక్యులేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. జర్మనీ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయంగా గుర్తింపుపొందాయి. ఉన్నతవిద్యా ప్రమాణాలను దేశంలో సూచిస్తున్నాయి. 2008 కొరకు ఎఆర్డబ్ల్యూ ఇచ్చిన శ్రేణులలో ప్రపంచంలో ప్రథమస్థానంలో ఉన్న 100 విశ్వవిద్యాలయాలలో ఆరు జర్మనీలోనే ఉన్నాయి. 200లలో 18 ఉన్నాయి. దాదాపు అన్ని జర్మన్ విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ సంస్థలుగా ఉన్నాయి. (ప్రైవేటుపరం కానివి, ప్రతిఒక్క విద్యార్థినుంచి ఒక్క వీటిలో శిక్షణా కాలానికి రుసుము €50–500 వరకూ సేకరిస్తారు.

సంస్కృతి

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
లుడ్విగ్ వాన్ బీతొవెన్ (1770–1827), సంగీత కారుడు.కుడి

జర్మనీని చారిత్రాత్మకంగా దాస్ ల్యాండ్ దేర్ డిచ్టెర్ ఉండ్ డెన్కెర్ (కవుల, ఆలోచనావాదుల భూమి)గా పిలవబడుతుంది. జర్మనీ జాతీయ-దేశంగా రూపుదిద్దుకోవడానికి ముందే జర్మనీ సంస్కృతి ఆరంభంయ్యింది.ప్రపంచమంతటా జర్మనీ మాట్లాడే ప్రజలలో ఇది విస్తరించింది.జర్మనీలోని సంస్కృతికి ధీమంతులు, ప్రముఖులు మతవాదానికి అలాగే లౌకికవాదానికి రెండిటికీ రూపాన్ని ఇచ్చారు. దానిఫలితంగా అత్యున్నతమైన ఐరోపా సంస్కృతి నుండి స్పష్టమైన జర్మనీ సంప్రదాయాన్ని విడిగా గుర్తించటం చాలా కష్టం. వోల్ఫ్‌గ్యాంగ్ అమడ్యుస్ మొజార్ట్, ఫ్రాంజ్ కాఫ్కా, పాల్ సెలన్ వంటి కొంతమంది చరిత్రకారులు జర్మనీ పౌరులు ఆధునిక భావనలో లేక పోయినప్పటికీ వారి చారిత్రాత్మక పరిస్థితి, కార్యకలాపాలు, సాంఘిక సంబంధాలను అర్ధం చేసుకోవటానికి జర్మనీ సంస్కృతి పరిధిలోనే వీరిని స్వీకరించాలని భావిస్తున్నారు.

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
బ్లూస్ ఫెర్డ్ I, 1911 ఫ్రాంజ్ మార్క్ (1880–1916)

జర్మనీలో సాంస్కృతిక సంస్థలకు సమాఖ్య రాష్ట్రాలు బాధ్యతను తీసుకుంటాయి. 16 రాష్ట్రాలలో రాయితీ ఇవ్వబడిన ప్రదర్శనాశాలలు 240, వందలకొద్దీ సంగీతము వాద్యగోష్టులు, వేలకొద్దీ వస్తు ప్రదర్శనశాలలు, 25,000 కంటే అధికంగా గ్రంథాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం మిలియన్ల మంది ఈ సాంస్కృతిక సౌలభ్యాలను ఆస్వాదిస్తున్నారు: సంవత్సరానికి 91 మిలియన్ల కన్నా ఎక్కువమంది జర్మనీ వస్తుప్రదర్శనశాలను సందర్శిస్తున్నారు. సంవత్సరంలో 20 మిలియన్ల మంది ప్రదర్శనశాలలకు సంగీత నాటకాలకు వెళతారు. అయితే 3.6 మిలియన్ల మంది గొప్ప సంగీత వాద్యగోష్ఠిని ఆలకిస్తారు.

జర్మనీ వారిలో ప్రపంచంలోని ప్రఖ్యాతి చెందిన శాస్త్రీయ సంగీత రూపకర్తలు ఉన్నారు. వీరిలో లుడ్విగ్ వాన్ బీథోవెన్, జోహన్ సెబాస్టియన్ బాచ్, జోహనెస్ బ్రహ్మస్, రిచర్డ్ వాగ్నేర్ ఉన్నారు. 2006 నాటికి ప్రపంచంలో జర్మనీ అతిపెద్ద ఐదవ సంగీత మార్కెటుగా ఉంది. పాప్, రాక్ సంగీతం క్రాఫ్ట్వెర్క్, స్కార్పియన్స్ ఇంకా రామ్సీటన్ వంటి కళాకారులు సంగీతమార్కెట్టును ప్రభావితం చేస్తున్నారు.

అనేకమంది జర్మనీ చిత్రలేఖకులు వారి వైవిధ్య కళా శైలులతో అంతర్జాతీయ గౌరవాన్ని సంపాదించారు. హన్స్ హోల్బ్‌యిన్ ది యంగర్, మత్తియాస్ గ్రునేవాల్డ్, అల్బ్రెచ్ట్ డురెర్ అనేవారు పునరుజ్జీవనం ముఖ్య కళాకారులుగా ఉన్నారు. కళా ఉద్యమంలో కాస్పర్ డేవిడ్ ఫ్రైడ్రిచ్, అధివాస్తవవాదం మాక్స్ ఎర్నస్ట్ ముఖ్యంగా ఉన్నారు. జర్మనీ నుంచి వచ్చిన శిల్పశాస్త్ర సంబంధ సహకారాలలో కారోలిన్గియన్, ఓట్టోనియన్ శైలులు ఉన్నాయి. ఇవి రోమనెస్‌క్యూకు ముందుగా సూచించిన వాటిలో ముఖ్యమైనవి. ఈ ప్రాంతం తర్వాత అసాధారణమైన శైలుల స్థానంగా మారింది. వీటిలో గోతిక్, రినైజాన్స్, బరోక్ ఉన్నాయి. జర్మనీకి చెందిన లుడ్విగ్ మీస్ వాన్ డేర్ రోహే, 20వ శతాబ్దం రెండవ భాగంలో ప్రపంచప్రఖ్యాత శిల్పులలో ఒకరుగా పేరుగాంచారు. అద్దపు ముఖతలంతో అనేక అంతస్తులుకల ఎత్తైన భవంతుల ఆలోచన ఇతనిదే.

జర్మన్ సాహిత్యం మధ్య యుగంనాటి కన్నా ముందుగానే గుర్తించబడింది. వాల్తెర్ వోన్ డేర్ వోగెల్ వేడ్, వోల్ఫ్రం వోన్ ఎస్చెన్బచ్ వంటి రచయితుల రచనలు కూనసాగాయి. వివిధ జర్మనీ రచయితలు, కవులు గొప్ప ప్రఖ్యాతినిగాంచారు. వీరిలో జోహన్ వోల్ఫాగ్యాంగ్గ్ వోన్ గోఎతే, ఫ్రైడ్రిచ్ షిల్లెర్ ఉన్నారు. బ్రదర్స్ గ్రిమ్మ్ చే ముద్రించబడిన జానపద కథల సేకరణలు జర్మన్ జానపద విజ్ఞానంగా అంతర్జాతీయ స్థాయిలో జనాదరణ పొందాయి. 20వ శతాబ్దంలోని ప్రభావవంతమైన రచయితులలో థామస్ మన్, బెర్తోల్ద్ బ్రెచ్ట్, హెర్మన్ హెస్సే, హేఇన్రిచ్ బోల్, గుంటర్ గ్రాస్స్ ఉన్నారు.

తత్వశాస్త్రం

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
ఇమ్మాన్యుయేల్ కాంట్ (1724–1804), తత్వవేత్త.

జర్మనీ తత్వశాస్త్రం మీద ప్రభావం చారిత్రాత్మకంగా విలక్షణమైనది. మధ్య యుగంనుంచీ ఘనత చెందిన తత్వవేత్తలు పాశ్చాత్య తత్వశాస్త్రానికి ఆకృతిని ఇవ్వడానికి సహకరించారు. గోట్‌ఫ్రైడ్ డ్ లీబ్నిజ్ హేతువాదంకు సహకారం అందించాడు. శాస్త్రీయ జర్మన్ ఆదర్శవాదాన్ని ఇమ్మాన్యుయెల్ కంట్, జార్జ్ విల్హెల్మ్ ఫ్రైడ్రిచ్ హెగెల్, ఫ్రైడ్రిచ్ విల్హెల్మ్ జోసెఫ్ షెల్లింగ్, జోహాన్న్ గోట్లీబ్ ఫిచ్టే స్థాపించారు. కార్ల్ మార్క్స్ ఫ్రైడ్రిచ్ ఏంజిల్స్ కమ్యునిస్ట్ సిద్దాంత నియామావళి చేయబడింది. ఆర్థూర్ స్కోపెన్హయేర్ తత్వవాద నిరాశావాదం రూపకల్పన చేశాడు. ఫ్రైడ్రిచ్ నిట్జ్‌స్కే ద్రుగ్గోచారవాదం అభివృద్ధి చేశాడు. మానవ ఉనికి కొరకు మార్టిన్ హీడ్ ఎగ్గెర్ కృషి చేసాడు. జుర్గెన్ హబెర్మాస్ సాంఘిక సిద్దాంతాలు అసాధారణమైన ప్రభావాన్ని చూపాయి. హెర్బెర్ట్ మార్కూస్ అనే తత్వవేత్త కూడా ఉన్నాడు.

ప్రసారసాధనాలు

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రచురితమయ్యే అన్ని పుస్తకాలలో 18% జర్మనీ పుస్తక విపణి నుండే ఉత్పత్తి అవుతాయి. (ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్, 2008లో).

జర్మనీ టెలివిజన్ మార్కెట్ ఐరోపాలోనే అతిపెద్దదిగా ఉంది. దాదాపు 34 మిల్లియన్ల గృహాలలో టీవీలు ఉన్నాయి. అనేక ప్రాంతీయ జాతీయ ప్రజా ప్రసారసాధకులు సమాఖ్య రాజకీయ నిర్మాణంలో నిర్వహించబడతాయి. ఇంచుమించు 90% జర్మనీ ఇళ్ళలో కేబుల్ టీవీ ( ఉపగ్రహం టీవి) ఉంది. ప్రేక్షకులు ఉచిత కార్యక్రమాల నుండి వ్యాపార ప్రసారమార్గాలను ఎంపిక చేసుకుంటారు. రుసుము చెల్లింపు-టీవి సేవలు జనాదరణ పొందలేదు. ప్రభుత్వటీవి ప్రసారసాధకులు " జెడ్‌డిఎఫ్ ", ఎడిఎఫ్ కేవలం డిజిటల్ ప్రసారమార్గాలను అందించాయి.

జర్మనీ ప్రపంచములోని అతిపెద్ద ప్రసారసాధనాల నివాసంగా ఉంది. దీనిలో బెర్టేల్‌స్మాన్, ఆక్సెల్ స్ప్రిన్గెర్‌ఎజి కూడా ఉన్నాయి. జర్మనీలో ప్రోసిఎబెన్సాట్ 1 వంటి అత్యున్నతమైన ఉచిత ప్రసార వ్యాపార టీవి నెట్ వర్కులు ఉన్నాయి.

జర్మనీ పుస్తక మార్కెట్ ప్రతిసంవత్సరం 60,000 కొత్త ప్రచురణలను ఉత్పత్తి చేస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రచురణ చేసే పుస్తకాలలో 18% ప్రాతినిధ్యం వహిస్తూ ప్రపంచ పుస్తక ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉంది. ఫ్రాంక్ఫర్ట్ పుస్తక ప్రదర్శన అంతర్జాతీయ లావాదేవీలకు, వర్తకానికీ సహకరించే అతి ముఖ్య పుస్తక ప్రదర్శనగా భావించబడుతుంది. ఈ సంప్రదాయం 500 సంవత్సరాల పూర్వం నుండి ఉంది.

ఆంగ్ల భాషలో మాట్లాడే వారికోసం దేశంలోని వార్తలను దేర్ స్పిఎగెల్, దేశ ప్రసారసాధనం ద్యుట్స్చే వెల్లే వార్తా ప్రసారాలను అందిస్తుంది.

డిసెంబరు 2008లో జర్మన్ ఇంటర్నెట్ వాడుకదారులు అత్యధికంగా సందర్శించిన వెబ్ సైట్లలో గూగుల్, డే, గోగుల్.కామ్, యుట్యూబ్, ఇబే, వికీపీడియా, యాహూ, అమజాన్.డే, జిఎమ్‌ఎక్స్.నెట్ ఉన్నాయి.

చలనచిత్రం

జర్మనీ చలచిత్రం ఈ మాధ్యమం తొలి సంవత్సరాలలో మాక్స్ స్కాల్దనోవ్‌స్కితో ప్రారంభమైంది. ప్రత్యేకించి వీమర్ గణతంత్రం నాటి రాబర్ట్ వీన్, ఫ్రెడ్రిక్ విల్హేల్మ్ ముర్ను వంటి జర్మనీ భావవాదుల వలన ప్రభావితమైనది. ఆస్ట్రియన్-దర్శకుడు ఫ్రిట్జ్ లాంగ్, 1926లో జర్మనీ పౌరసత్వం స్వీకరించాడు. యుద్ధానికి ముందు ఆయన చిత్ర పరిశ్రమలో వృత్తిపరంగా బాగా వృద్ధి చెందాడు. ఈయన హాలీవుడ్ చిత్ర పరిశ్రమపై అధిక ప్రభావాన్ని చూపాడు. ఆయన నిశ్శబ్ద చిత్రం మెట్రోపోలిస్ (1927) ఆధునిక శాస్త్ర ఊహాజనిత చిత్రాలకు జన్మ ఇచ్చింది.

1930లో ఆస్ట్రియన్-అమెరికన్ జోసెఫ్ వాన్ స్టెర్న్బెర్గ్ ది బ్లూ ఏంజెల్కు దర్శకత్వం వహించాడు. ఇది మొట్టమొదటి పూర్తినిడివి జర్మనీ శబ్ద చిత్రం, ఇది నటి మరలెన్ డైట్రిచ్‌కు ప్రపంచఖ్యాతిని తెచ్చిపెట్టింది. వాల్టర్ రుట్మన్ దర్శకత్వం వహించిన భావవాద డాక్యుమెంటరీ బెర్లిన్, సింఫోనీ ఆఫ్ ఎ గ్రేట్ సిటీ, పట్టణ స్వరసమ్మేళనానికి ముఖ్య ఉదాహరణగా ఉంది. నాజి యుగం ఎక్కువగా ప్రచార చిత్రాలను నిర్మించింది. అయితే రీఫెన్‌స్తఃల్ మరిన్ని కొత్త విలువలను చిత్రాలలో ప్రవేశపెట్టారు.

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
ఫిబ్రవరిలో జరిగిన బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో బెర్లినేల్ పాలస్ట్.

1970లు, 80లలో వోల్కేర్ స్చ్లోన్దోర్ఫ్ఫ్, వేర్నేర్ హీర్జోగ్, విం వేన్డేర్స్, రైనర్ వెర్నర్ ఫాస్‌బైండర్ వంటి నూతన జర్మన్ చలన చిత్ర దర్శకులు తరచూ వారి రెచ్చగొట్టే చిత్రాలతో పశ్చిమ జర్మనీ చిత్రారంగాన్ని తిరిగి అంతర్జాతీయ గద్దెపై నిలిపారు. ఇటీవలి కాలంలో, గుడ్ బై లెనిన్! (2003), గెగెన్ డై వాండ్ (హెడ్-ఆన్) (2004), డెర్ అన్టర్గ్యాంగ్ (డౌన్ఫాల్) (2004), డెర్ బాడెర్ మేయిన్హోఫ్ కాంప్లెక్స్ (2008) వంటి చిత్రాలు అంతర్జాతీయ విజయాన్ని సాధించాయి.

1979లో ఉత్తమ విదేశీ భాషా చిత్రానికి అకాడెమి అవార్డు జర్మన్ చిత్రాలైన డై బ్లేక్ ట్రోమ్మేల్ (ది టిన్ డ్రం) కు, 2002లో నోవేర్ ఇన్ ఆఫ్రికా కు, దాస్ లేబెన్ దర్ అన్దేరెన్ (ది లైవ్స్ ఆఫ్ అదర్స్)కు 2007 లోను లభించాయి. బాగా ప్రసిద్ధి చెందిన నటులలో మరలెన్ దిఎత్రిచ్, కలుస్ కిన్‌స్కి, హన్నా స్చ్య్గుల్ల, ఆర్మిన్ ముల్లర్-స్తహ్ల్, జూర్గెన్ ప్రోచ్నౌ, థామస్ క్రేత్స్చ్మాన్ ఉన్నారు.

1951 నుండి ప్రతి సంవత్సరం నడుపబడుచున్న బెర్లిన్ చిత్రోత్సవం, ప్రపంచంలోని మొట్టమొదటి చిత్రోత్సవాలలో ఒకటి. అంతర్జాతీయ న్యాయబృందం ప్రపంచవ్యాప్తంగా ప్రాతినిధ్యం వహించే చిత్రాలపై దృష్టి పెట్టి గెలుపొందిన చిత్రాలకు బంగారు, వెండి ఎలుగుబంట్లను అందిస్తుంది. యూరోపియన్ ఫిల్మ్ అకాడెమి ఇఎఫ్ఏ కేంద్ర స్థానమైన బెర్లిన్ లో ప్రతి రెండవ సంవత్సరంలో యూరోపియన్ ఫిల్మ్ అవార్డుల ఉత్సవం జరుపబడుతుంది. పోస్టడంలో ఉన్న బబెల్స్బెర్గ్ స్టూడియోస్ ప్రపంచంలోని పురాతనమైన అతి-పెద్ద స్టూడియోస్, అంతర్జాతీయంగా చిత్రనిర్మాణానికి కేంద్రంగా ఉన్నాయి.

సినిమాలు

  1. మెట్రోపోలీస్‌ (1927)
  2. రన్ లోలా రన్ (1998)
  3. నాకిన్ ఆన్ హెవెన్స్ డోర్
  4. సంసార (2001)
  5. ది వేవ్ (2008)
  6. అగిర్రె వ్రాత్ ఆఫ్ గాడ్ (1972)
  7. ఫటా మార్గానా (1971)
  8. టామ్‌ సాయర్‌ (2011)
  9. కాన్నీ అండ్‌ కో (2016)
  10. చిల్డ్రన్‌ ఆఫ్ ది మూన్‌ (2006)

క్రీడలు

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
మైఖేల్ షూమేకర్ ఫార్ములా వన్ చాంపియన్షిప్ ను ఏడుసార్లు గెలుచుకున్నాడు.

జర్మనీయుల జీవితంలో క్రీడలు విడదీయరానివిగా ఉన్నాయి. ఇరవై-ఏడు మిల్లియన్ల జర్మనీయులు క్రీడల క్లబ్ లలో సభ్యులు వ్యక్తిగతంగా అటువంటి కార్యక్రమాలలో ఉండగా అదనంగా పన్నెండు మిల్లియన్ల మంది పాల్గొంటున్నారు. అనుబంధ ఫుట్ బాల్ అనేది బహుళ ప్రజాదరణ పొందిన క్రీడ. 6.3 మిల్లియన్లకు పైగా అధికారిక సభ్యులు ఉన్న జర్మన్ ఫుట్ బాల్ అసోసియేషన్ (డచేర్ ఫుట్బాల్-బండ్ ) ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈవిధమైన క్రీడాసంస్థలలో అతిపెద్దది. ప్రపంచంలోని ఏవృత్తిపరమైన క్రీడల సమితికైనా ఉండే సగటు హాజరు శాతంలో బున్దేస్లిగా ద్వితీయ స్థానంలో ఉంది. జర్మనీ జాతీయ ఫుట్ బాల్ జట్టు ఎఫ్‌ఐఎఫ్‌ఎ ప్రపంచ కప్ ను 1954, 1974, 1990 లలో ఇంకా యురోపియన్ ఫుట్ బాల్ చాంపియన్షిప్‌ను 1972, 1980, 1996లలో గెలుచుకుంది. జర్మనీ ఎఫ్‌‌ఎఫ్ఏ ప్రపంచ కప్‌ను 1974, 2006లలో, అదనంగా యఇఎఫ్‌ఎ యురోపియన్ ఫుట్ బాల్ చాంపియన్షిప్ ను 1988లో నిర్వహించింది. విజయవంతమైన, ప్రసిద్ధిచెందిన ఫుట్ బాల్ ఆటగాళ్ళలో ఫ్రాంజ్ బెకెన్బుఎర్, గెర్డ్ ముల్లెర్, జుర్గెన్ క్లిన్స్మన్, లోథార్ మాథ్యూస్, ఆలివెర్ కహ్న్ ఉన్నారు. ప్రేక్షకులు అభిమానంగా వీక్షించే ఇతరక్రీడలలో, హ్యాండ్ బాల్, వాలీ బాల్, బాస్కెట్ బాల్, ఐస్ హాకీ, టెన్నిసు ఉన్నాయి.

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
బెఎర్న్ మ్యూనిచ్ ఫుట్ బాల్ క్లబ్ కు ఎలిఎంజ్ ఎరీనా అతిధేయిగాను, 2006 FIFA ప్రపంచ కప్ కు వేదికగాను ఉంది.

ప్రపంచంలో వాహన క్రీడల దేశాలలో జర్మనీ ముందుంది. పందెంలో గెలిచే కార్లు, జట్లు, డ్రైవర్లు జర్మనీ నుంచి వచ్చారు. చరిత్రలో అత్యధిక విజయాన్ని చవిచూసిన ఫార్ములా వన్ డ్రైవర్, మైఖేల్ షుమేకర్ అసాధారణమైన వాహన క్రీడల గణాంకాలను అతని వృత్తిజీవితంలో నమోదు చేశారు. 1946లో తొలిసారిగా ఆరంభమయిన ఫార్ములా వన్ నాటి నుంచీ ఏఇతర డ్రైవరూ గెలవనన్ని ఫార్ములా వన్ చాంపియన్ షిప్ లను, పందేలనూ ఇతను గెలుచుకున్నారు. చరిత్రలో ఎక్కువ మూల్యం చెల్లించబడ్డ, బిలియనీర్ అయిన క్రీడాకారుడు ఇతనే. బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్-బెంజ్ వంటి తయారీదారులు వాహనక్రీడలలో గెలుపొందే జట్లలో ఉన్నాయి. పోర్ష్ ఫ్రాన్స్ లో జరిగిన 24 అవర్స్ ఆఫ్ లే మన్స్ అనే ఒక ప్రతిష్ఠాత్మకమైన వార్షిక పోటీలో 16సార్లు గెలిచింది. ద్యూస్కే టౌరెన్ వాగెన్ మాస్టర్స్ అనే శ్రేణి జర్మనీలో జనాదరణ పొందింది.

చారిత్రాత్మకంగా, ఒలింపిక్ ఆటలలో జర్మన్ ఆటగాళ్ళు అత్యంత విజయవంతమైన పోటీదారులుగా ఉన్నారు. అన్ని-కాలాల ఒలింపిక్ ఆటల పతకాల లెక్కింపులో తూర్పు, పశ్చిమ జర్మనీ కలిపి మూడవ స్థానంలో ఉన్నాయి. 2008 ఎండాకాలం ఒలింపిక్స్ లో జర్మనీ పతకాల లెక్కింపులో ఐదవ స్థానంలో ఉంది, అయితే వారు 2006 శీతాకాలం ఒలింపిక్స్ ను మొదటిస్థానంలో ఉన్నారు. జర్మనీ ఎండాకాలం ఒలింపిక్ ఆటలను రెండుసార్లు నిర్వహించింది. మొదటిసారి 1936లో, బెర్లిన్లో రెండవసారి 1972లో మ్యూనిచ్ లో జరిగాయి. శీతాకాలం ఒలింపిక్ ఆటలు జర్మనీలో ఒకసారి 1936లో జరిగాయి, వాటికి వేదికగా బవేరియాన్ జంటనగరాలైన గార్మిష్, పార్టెన్కిర్చెన్ ఉన్నాయి.

వంటకాలు

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
A Schwarzwälder Kirschtorte (Black Forest gateau).

జర్మన్ వంటకాలు ప్రాంతానికి ప్రాంతానికీ మధ్య మారుతుంటాయి. ఉదాహరణకి దక్షిణ ప్రాంతాలైన బవేరియా, స్వబియా వంటల సంప్రదాయం స్విట్జర్లాండ్, ఆస్ట్రియాల వలె ఉంటుంది. జర్మనీలో వినియోగించే మాంసంలో ముఖ్యంగా పంది, ఆవు లేక ఎద్దు మాంసాలు, పెంపుడుపక్షుల మాంసాల రకాలు ఉన్నాయి. వీటిలో పంది మాంసాన్ని ప్రజలు బాగా ఇష్టపడతారు. మొత్తం అన్ని ప్రాంతాలలో మాంసం తరచుగా కూర రూపంలో తింటారు. జర్మనీలో 1500 రకాల వేర్వేరు కూరగాయలను పండిస్తారు. ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కూరలలో బంగాళదుంపలు, కాబేజీ, క్యారట్లు, అజుమోడా, పాల కూర, బీన్సు ఉన్నాయి.సేంద్రీయ ఆహారం మార్కెట్లో దాదాపు 3.0% భాగాన్ని సాధించింది. ఇది ఇంకనూ పెరుగుతుందని అంచనా వేయబడింది.

బహుళ జనాదరణ పొందిన ఒక జర్మనీ సూక్తి అర్ధం ఇలా ఉంది: "ఫలహారం చక్రవర్తిలాగా చెయ్యాలి, మధ్యాహ్న భోజనం రాజులాగా, రాత్రి భోజనం బిచ్చగాడిలాగా తినాలి". ఉదయపు ఆహారం సాధారణంగా జామ్, తేనెతో బ్రెడ్లు, రోల్స్ లేదా చల్లని మాంసాలు, చీజ్ ఉంటుంది. కొన్నిసార్లు ఉడకబెట్టిన కోడిగుడ్డును కూడా వీటితో పాటు తింటారు. ధాన్యాలు లేదా పాలతో లేదా పెరుగుతో మ్యుస్లీ అంత ప్రముఖమైనది కాకపోయినా ఇది కూడా విస్తారంగా వినియోగించబడుతోంది. దేశవ్యాప్తంగా 300 బ్రెడ్ రకాలు బేకరీ దుకాణాలలో అమ్మబడతాయి.

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
వ్యక్తిగత వేడుకలలో ప్రత్యేకంగా వెన్న, చల్లని మాంసంలతో విందు వడ్డించబడింది.

వలసప్రజలు అధికంగా ఉన్న దేశంగా జర్మనీ అనేక అంతర్జాతీయ వంటలను తన వంటకాలలో, ప్రతిదినం భుజించే అలవాట్లలో పొందుపరచుకుంది. ఇటాలియన్ వంటలు పిజ్జా, పాస్టా వంటివి. టర్కిష్, అరబ్ వంటలు డోనేర్ కబాబ్, ఫలాఫెల్ వంటివి ముఖ్యంగా పెద్ద నగరాలలో బాగా గుర్తింపుపొందాయి. అంతర్జాతీయ బర్గర్ సమాహారాలు, అలానే చైనీయుల, గ్రీకు భోజనశాలలు విస్తారంగా ఉన్నాయి. భారతీయ, థాయ్, జపనీస్, ఇతర ఆసియా వంటకాలు ఇటీవలి దశాబ్దాలలో బహుళ జనాదరణ పొందాయి. జర్మనీలోని ఉన్నత ప్రమాణాలుగల తొమ్మిది హోటళ్ళలో ఒకటైన మిచెలిన్ గైడ్ కు మూడు నక్షత్రాలను బహుకరించారు. ఇది అత్యుత్తమమైన ఆదరణతో ఇంకా 15 రెండు నక్షత్రాలను స్వీకరించాయి. ప్రపంచంలో అధికంగా అలంకరించబడిన ఆహారశాలలుగా జర్మనీ హోటళ్ళు రెండవ స్థానంలో ఉన్నాయి.ప్రథమ స్థానంలో ఫ్రాన్స్ ఉంది.

జర్మనీలోని చాలా ప్రాంతాలలో సారాయి ప్రజాదరణ పొందినప్పటికీ, జాతీయ మద్యపానీయంగా బీర్ ఉంది. ఒక వ్యక్తి వాడే బీర్ వాడకం తగ్గుతున్నప్పటికీ ఇది సంవత్సరానికి 116 లీటర్లుగా ఉండి-ప్రపంచంలో అత్యధిక స్థానంలో ఉంది. బీర్ రకాలలో ఆల్ట్, బోక్, డన్కెల్, కోల్ష్, లాగెర్, మాల్జ్ బీర్, పిల్స్,, విజెన్బీర్ ఉన్నాయి. సర్వేచేయబడిన 18 పశ్చిమ దేశాలలో సాధారణంగా తలసరి శీతల పానీయాల వినియోగంలో జర్మనీ 14వ స్థానంలో ఉంది, అయితే పళ్ళరసాల వినియోగంలో మూడవ స్థానంలో ఉంది. కర్బనయుత లోహజలం (కార్బోనేటేడ్ మినరల్ వాటర్), స్కోర్లె (పళ్ళ రసంతో దీని మిశ్రమం) జర్మనీలో అధిక జనాదరణ పొందాయి.

సమాజం

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
ప్రపంచంలో ఒక సకారాత్మక గౌరవ స్థానాన్ని జర్మనీ పొందగలిగింది. (క్లాడియ షిఫెర్, మోడల్)

2006 ప్రపంచ కప్ వేడుకల నాటినుంచి జర్మనీ, జాతీయ హోదా భావన దేశంలోనూ బాహ్యంగాను మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా వార్షికంగా నేషన్ బ్రాండ్స్ ఇండెక్స్ అని పిలవబడే సర్వేలో, జర్మనీ ప్రాముఖ్యంగా పలుమార్లు ఈ ఆటలపోటీల తర్వాత ఉన్నత శ్రేణిని పొందింది. 20 విభిన్న దేశాల ప్రజలను దేశం ప్రతిష్ఠను సంస్కృతీ, రాజకీయాలు, ఎగుమతులు, ఆ దేశ ప్రజలు, పర్యాటకులను ఆకర్షించే శక్తి, వలసదారులు, పెట్టుబడులను పరిగణలోకి తీసుకొని మదింపు చేయామని కోరారు. 2008లో 50దేశాలలో జర్మనీని ప్రపంచం లోని అతివిలువైన దేశంగా పేర్కొన్నారు. బిబిసి కొరకు 21 దేశాలలో 13,575 మంది జవాబు మీద ఆధారపడి జరిగిన ప్రపంచవ్యాప్త ఎన్నికలో పరిశోధన చేసిన 16 దేశాలలో ముందంజ వేసి, 2009లో ప్రపంచంలో అత్యంత అనుకూల ప్రభావం చూపినదేశంగా జర్మనీ గుర్తించబడింది. అధికసంఖ్యాకంగా 61% దేశం మీద అనుకూల దృష్టితో ఉంటే, 15% ప్రతికూల దృష్టితో ఉన్నారు.

జర్మనీ: పేరు వెనుక చరిత్ర, భూగోళ శాస్త్రము, ప్రభుత్వం 
జర్మన్లు అంతర్జాతీయ పర్యటనలలో, జాతీయంగా సెలవు ప్రయాణాలలో ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. (రుగెన్ ద్వీపంపై ఉన్న సెల్లిన్ సముద్రతీర విహార కేంద్రం).

జర్మనీ చట్టపరంగా సాంఘికంగా స్వలింగ సంపర్కం చేసే వారి విషయంలో ఓర్పుగా ఉంది. 2001 నాటి నుంచి మానవహక్కుల సంఘాలు అనుమతించబడ్డాయి. స్వలింగ సంపర్కులు మగవారు, ఆడవారు చట్టపరంగా వారి భాగస్వామి జీవ సంబంధ పిల్లలను దత్తత తీసుకోవచ్చు (సవతిపిల్లల దత్తతు ). జర్మనీలోని అతిపెద్ద నగరాలైన బెర్లిన్, హాంబర్గ్ మేయర్లు బహిరంగ స్వలింగ సంపర్కులు.

20వ శతాబ్దపు ఆఖరి దశాబ్దకాలంలో వలసదారుల మీద జర్మనీ తన వైఖరిని చాలా వరకూ మార్చుకుంది. 10% జనాభా జర్మనీలో పుట్టిన వారు కానప్పటికీ, పంతొమ్మిదవ శతాబ్దం మధ్యవరకూ విదేశీయులకు జర్మనీ వలసకు అనువైన దేశంకాదని విస్తారమైన అభిప్రాయం ఉండేది. గస్టార్ బీటర్ (నీలి-కాలర్ అతిథి-పనివారు)గా పిలువబడే వారి ప్రవేశం ఆగిపోయిన తరువాత, శరణార్ధులకు ఈఅభిప్రాయంలో మినహాయింపు ఇవ్వబడింది. ప్రస్తుతం ప్రభుత్వం, జర్మనీ సమాజం వలసవచ్చేవారి అర్హత ఆధారంగా వలసలను నియంత్రించాలనే అభిప్రాయాన్ని అంగీకరించాయి.

అంతర్జాతీయ ప్రయాణాలకు 2008లో €67 బిల్లియన్లు వ్యయం చేసారు. ప్రయాణాల కోసం ధనం అధికంగా వ్యయం చేసిన ప్రంపంచ దేశాలలో జర్మనీ ప్రథమ స్థానంలో ఉంది. అత్యధికంగా ప్రయాణంచేసిన విదేశీ స్థలాలలో స్పెయిన్, ఇటలీ, ఆస్ట్రియా ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపటి వలయము

సాధారణం

నిజాలు, సంఖ్యలు

ప్రయాణం

  • జర్మనీ యాత్రా సమాచారం—అధికారిక జర్మనీ పర్యాటక ద్వారం (లాభాపేక్ష లేని)

Tags:

జర్మనీ పేరు వెనుక చరిత్రజర్మనీ భూగోళ శాస్త్రముజర్మనీ ప్రభుత్వంజర్మనీ చట్టంజర్మనీ విదేశీ సంబంధాలుజర్మనీ సైన్యంజర్మనీ గణాంకాలుజర్మనీ ఆర్థిక వ్యవస్థజర్మనీ విజ్ఞానశాస్త్రంజర్మనీ విద్యజర్మనీ సంస్కృతిజర్మనీ ఇవి కూడా చూడండిజర్మనీ మూలాలుజర్మనీ వెలుపటి వలయముజర్మనీఆస్ట్రియాఐరోపాఐరోపా సమాఖ్యజర్మన్డెన్మార్క్దేశంనెదర్లాండ్స్పోలాండ్ఫ్రాన్సుబెల్జియంలక్సెంబర్గ్వాతావరణంస్విట్జర్లాండ్

🔥 Trending searches on Wiki తెలుగు:

వై. ఎస్. విజయమ్మతెలుగు సినిమాలు 2023శ్రవణ కుమారుడుబీబి నాంచారమ్మసురేఖా వాణిబ్రాహ్మణ గోత్రాల జాబితాసినిమాపూర్వ ఫల్గుణి నక్షత్రముభారత రాజ్యాంగ ఆధికరణలుప్లీహముకల్వకుంట్ల తారక రామారావువర్షం (సినిమా)భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంరాజ్యసభజీలకర్రనితిన్తెలుగు సినిమాలు డ, ఢగరుత్మంతుడుసామజవరగమనతెలంగాణ ఉద్యమండి వి మోహన కృష్ణజాంబవంతుడుకరీనా కపూర్రామాయణంలో స్త్రీ పాత్రలుఅంజలి (నటి)ఆవేశం (1994 సినిమా)తెలుగు వికీపీడియాగోల్కొండద్వాదశ జ్యోతిర్లింగాలుబొల్లిసీతాదేవిరామ్ చ​రణ్ తేజదివ్యాంకా త్రిపాఠిహైదరాబాదుభారత సైనిక దళంఆర్టికల్ 370తెలంగాణశ్రీ రామస్వామి వారి దేవస్థానం, రామతీర్థంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుపది ఆజ్ఞలునరేంద్ర మోదీ స్టేడియంసమాసంఆది పర్వముతిథిశ్రీ కృష్ణ జన్మభూమిపుష్పపమేలా సత్పతిమురుడేశ్వర ఆలయంరోణంకి గోపాలకృష్ణశని (జ్యోతిషం)హృదయం (2022 సినిమా)హెప్టేన్మంగళవారం (2023 సినిమా)ప్రధాన సంఖ్యపునర్వసు నక్షత్రముచంద్రుడు జ్యోతిషంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాప్రియా వడ్లమానియూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ఉష్ణోగ్రతవసంత వెంకట కృష్ణ ప్రసాద్ఇందిరా గాంధీసోనియా గాంధీబ్రెజిల్జైన మతంమృణాల్ ఠాకూర్చాకలిదిల్ రాజుజవాహర్ లాల్ నెహ్రూశత్రుఘ్నుడుకామాక్షి భాస్కర్లయానిమల్ (2023 సినిమా)తెలుగు సంవత్సరాలుమాల (కులం)భారతదేశంలో కోడి పందాలుశాతవాహనులుశుక్రుడు జ్యోతిషంసునయన🡆 More